కొత్త దారి

కెరీర్‌లో తమన్నా కొత్తదారికి షిఫ్ట్‌ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు గ్లామరస్‌ పాత్రలవైపే మొగ్గు చూపిన తమన్నా వీలైనప్పుడు స్పెషల్‌ సాంగ్స్‌లోనూ కాలు కదిపారు. కానీ ఇప్పుడు ట్రాక్‌ మార్చి లేడీ ఓరియంటెడ్‌ చిత్రాలపై దృష్టి పెట్టారామె. ఆల్రెడీ తమన్నా నటించిన రెండు కథానాయిక ప్రాధాన్యం ఉన్న చిత్రాలు హిందీ హిట్‌ ‘క్వీన్‌’ తెలుగు రీమేక్‌ ‘దటీజ్‌ మహాలక్ష్మీ’, తమిళ ‘దేవి 2’ రిలీజ్‌కు రెడీ అయ్యాయి. ఇప్పుడు ఈ మిల్కీబ్యూటీ మరో లేడీ ఓరియంటెడ్‌ ఫిల్మ్‌ ‘రాజుగారి గది 3’కి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. ‘దేవి 2, రాజుగారి గది 3’ చిత్రాలు హారర్‌ బేస్డ్‌ కావడం విశేషం.తాజాగా తమన్నా మరో హారర్‌ సినిమాకు సై అన్నారు. ఈ చిత్రానికి రోహిన్‌ వెంకటేశన్‌ దర్శకత్వం వహించనున్నారు. ‘‘ఈ ఏడాది నేను తీసుకున్న నిర్ణయాల్లో కొత్తగా ఉండే లేడీ ఓరియంటెడ్‌ చిత్రాల్లో నటించాలనే నిర్ణయం ఒకటి. ‘రాజుగారి గది 3’ చిత్రంలో నా పాత్ర రెండు కోణాల్లో ఉండటమే కాకుండా స్క్రీన్‌ ప్లే రెండు కాలసమయాల్లో నడుస్తుంది. ఆసక్తిగా అనిపించి సైన్‌ చేశాను. స్క్రిప్ట్‌ నచ్చితే మరిన్ని లేడీ ఓరియంటెడ్‌ సినిమాల్లో నటించడానికి సిద్ధంగా ఉన్నాను’’ అని చెప్పుకొచ్చారు తమన్నా. ‘రాజుగారి గది 3’ చిత్రానికి ఓంకార్‌ దర్శకత్వం వహిస్తారు. ఇవి కాకుండా చిరంజీవి ‘సైరా’ సినిమాలో నర్తకి లక్ష్మీ అనే ఓ కీలక పాత్రను తమన్నా చేస్తున్న సంగతి తెలిసిందే.

కంగనా దాస్

కన్నడ చిత్రం ‘కోటిగొబ్బ 3’లో శ్రద్ధాదాస్‌ చేస్తున్న పాత్ర పేరు కంగన అని తెలిసింది. ‘కోటిగొబ్బ’ ఫ్రాంచైజీలో వస్తోన్న మూడో చిత్రం ఇది. సుదీప్‌ హీరోగా నటిస్తున్నారు. ఇందులో ఇంటర్‌పోల్‌ ఆఫీసర్‌ కంగన పాత్రలో నటిస్తున్నారు శ్రద్ధాదాస్‌. బెంగళూరులో షూటింగ్‌ జరుగుతోంది. ‘‘కోటిగొబ్బ 3 షూటింగ్‌ గురువారం మళ్లీ ప్రారంభం అయ్యింది. నాకు ఇష్టమైన పాత్ర చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది’’ అని పేర్కొన్నారు శ్రద్ధా. శివకార్తీక్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సుదీప్‌నే కథ అందించారట. ఈ సినిమాను ఈ ఏడాదే విడుదల చేయాలనకుంటున్నారు. ‘కోటికొక్కడు’ అనే టైటిల్‌తో ‘కోటిగొప్ప 2’ తెలుగులో విడుదలైన విషయం తెలిసిందే. ఇందులో నిత్యామీనన్‌ హీరోయిన్‌గా నటించిన విషయం గుర్తుండే ఉంటుంది.

కీలక నిర్ణయం-వాణిజ్య-03/30

అతిపెద్ద సోషల్ మీడియా నెట్ వర్క్ పేస్ బుక్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవసీ పాలసీలో విశ్రుత మార్పులకు సిద్దమవుతోంది. గోప్యతా ఉల్లంఘనులు న్యూజిలాండ్ నరమేధం సంఘతనాలు తరువాత పలు సంస్కరణల దిశగా అడుగులు వేస్తుంది. వివక్ష పూరిత అంశాలైన శ్వేతా జాతీయవాద వేర్పాటు వాదాలను నిషేదించిన ఆ సంస్థ ఇప్పుడు మరో దిద్దుబాటు చర్యలకు పూనుకుంటోంది. ఇక పై పేస్ బుక్ లైవ్ లను మానిటర్ చేయనుంది. లైవ్ ల పై ఆంక్షలు విధించాలని భావిస్తోంది. ఇకపై యుసర్స్ పేస్ బుక్ లో ఇచ్చే లైవ్ ల పై పలు నిబంధనలు అమలు చేయనుంది.
* వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో (ఏప్రిల్‌- సెప్టెంబరు) ప్రభుత్వం స్థూలంగా రూ.4.42 లక్షల కోట్ల రుణం తీసుకోనుంది.
*ఆదిత్యా బిర్లా గ్రూపునకు చెందిన రిటైల్‌ చెయిన్‌ ‘మోర్‌’, కార్యకలాపాల విస్తరణ కోసం వచ్చే అయిదేళ్లలో రూ.1,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంది.
*పీఎన్‌బీ హౌసింగ్‌లో కొంత మేర వాటాను పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) విక్రయించనుంది. జనరల్‌ అట్లాంటిక్‌ గ్రూపు, వర్డే పార్ట్‌నర్స్‌లు ఈ వాటా కొనుగోలు చేయనున్నాయి.
*రాజస్థాన్‌కు చెందిన మిరాజ్‌ గ్రూపు సంస్థ అయిన మిరాజ్‌ సినిమాస్‌ తెలంగాణాలో విస్తరణ యత్నాల్లో నిమగ్నమైంది.
*కేవలం దక్షిణాది రాష్ట్రాల కంపెనీలపై పెట్టుబడులు పెట్టడానికి ఉద్దేశించిన వినూత్న పోర్ట్‌ఫోలియో పథకాన్ని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఆవిష్కరించింది.
*జీఎంఆర్‌ గ్రూపునకు చెందిన కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలి (ఎస్‌ఈజడ్‌)ని కొనుగోలు చేసేందుకు అదానీ గ్రూపు ఆసక్తిగా ఉన్నట్లు ప్రచారం అవుతోంది.
*కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ (సీఐఐ) దక్షిణ ప్రాంత ఛైర్మన్‌గా 2019-20 సంవత్సరానికి సంజయ్‌ జయవర్ధనవేలు ఎన్నికయ్యారు.
*దేశీయ ఎఫ్‌ఎమ్‌సీజీ రంగం 2019లో 11-12% వృద్ధి నమోదు చేసే అవకాశం ఉందని నీల్సన్‌ ఇండియా అంచనా వేసింది. 2018లో నమోదు చేసిన 13.8 శాతంతో పోలిస్తే ఇది తక్కువని ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సమీర్‌ శుక్లా పేర్కొన్నారు.
*నమోదు ఉపసంహరణకు గురైన 3 లక్షలకు పైగా కంపెనీలపై దర్యాప్తు చేపట్టాలని దేశవ్యాప్తంగా ఉన్న ఆదాయపు పన్ను కార్యాలయాలకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (సీబీడీటీ) ఆదేశాలు జారీ చేసింది.

తోడు దొంగలకు ఒకటే గది-నేరవార్తలు–03/30

* పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ను వేల కోట్లకు మోసగించిన వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీ బెయిల్ పిటిషన్‌ను లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్‌ న్యాయస్థానం కొట్టివేసింది. కాగా.. శుక్రవారం జరిగిన విచారణ సందర్భంగా వెస్ట్‌మినిస్టర్‌ మేజిస్ట్రేట్స్‌ కోర్టు చీఫ్‌ మేజిస్ట్రేట్‌ ఎమ్మా ఆర్బుత్‌నాట్‌ సరదా వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ నీరవ్‌ మోదీని, విజయ్‌ మాల్యాను భారత్‌కు అప్పగిస్తే వీరిద్దరినీ జైల్లో ఒకే గదిలో ఉంచుతారా.. ఎలాగూ గది పెద్దగానే ఉంది కదా అని న్యాయమూర్తి అన్నారు.నీరవ్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ సందర్భంగా..‘నీరవ్‌ను అప్పగిస్తే భారత్‌లో ఏ జైల్లో ఉంచుతారు..?’ అని న్యాయమూర్తి ఎమ్మా అడిగారు. దీనికి భారత ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన క్రౌన్‌ ప్రాసిక్యూషన్‌ సర్వీస్‌ న్యాయవాది స్పందిస్తూ.. ‘బహుశా విజయ్‌ మాల్యా కోసం సిద్ధం చేసిన ముంబయిలోని ఆర్థర్‌ రోడ్‌ జైల్లోనే నీరవ్‌ను కూడా ఉంచే అవకాశం ఉంది’ అని చెప్పారు. దీంతో వెంటనే న్యాయమూర్తి స్పందిస్తూ.. ‘ఒకే గదిలో కూడా ఉంచొచ్చేమో. మీరు ఇచ్చిన వీడియోలో చూస్తే గదిలో స్థలం కూడా చాలానే ఉందనిపించింది’ అని నవ్వుతూ అన్నారు.
* పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఖమ్మం నగరపాలక కార్యాలయం వద్ద రామయ్య ప్రయాణిస్తున్న వాహనాన్ని గుర్తుతెలియని వాహనం ఢీకొన్నట్లుగా సమాచారం. బైక్ బోల్తాపడటంతో వనజీవి చేతికి గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం 108 వాహనంలో ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
* భార్య ప్రవర్తన పై అనుమానంతో భర్త హత్య చేసిన సంఘటన ఏ కొండూరు మండలం చీమలపాడు పెద్ద తండా వద్ద శుక్రవారం రాత్రి జరిగింది. ఖమ్మం జిల్లా గార్ల కు చెందిన పీర్ల సంజీవ జీవనోపాధి నిమిత్తం గంపలగూడెం మండలం తోటమూల లో కొద్దీ కాలంగా నివసిస్తున్నాడు. మందులు తెచ్చుకోడానికి బైక్ పై హనుమాన్ జంక్షన్ వెళ్లి తిరిగి వస్తూ భార్య లక్ష్మిని పెద్ద తండా వద్ద గొంతు నులిమి చంపివేసాడు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు.
* విస్సన్నపేట మండలం కలగర క్రాస్ రోడ్డులో సత్తుపల్లి విస్సన్నపేట రహదారిలో శనివారం లారీ బైక్ ఢీకొని వ్యక్తి మృతి. పశ్చిమ గోదావరి జిల్లా కామవరపు కోట మండలం కె ఎస్ రామవరం గ్రామానికి చెందిన మలిశెట్టి సత్యనారాయణ బైక్ పై వెళుతుండగా లారీ ఢీ కొట్టింది.
*మసాజ్‌ సెంటర్‌ పేరుతో వ్యభిచారం నడుపుతున్న దంపతులను పోలీసులు గురువారం రాత్రి అరెస్టు చేశారు. వారి నుంచి ఇద్దరు యువతులను విడపించారు. చెన్నై తేనాంపేట వాసన్‌వీధిలో ఉన్న ఓ ప్రైవేటు అపార్టుమెంటులో మసాజ్‌ సెంటర్‌ నిర్వహిస్తున్నారు. మసాజ్‌ సెంటర్‌కు రాత్రి సమయంలో ఎక్కువ సంఖ్యలో యువకులు వచ్చి వెళుతున్నట్టు స్థానికులు పాండీబజార్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
*శ్రీకాకుళం జిల్లా పొందూరు ‘బి’ పరీక్ష కేంద్రంలోని 33వ గదిలో ఏర్పాటుచేసిన రెండు సీసీ కెమెరాలను గురువారం రాత్రి దొంగలు అపహరించారు. ఇది ఇంటి దొంగల పనేనని ఆరోపణలున్నాయి. ప్రతి రోజు ఇక్కడ ఎ, బి కేంద్రాల్లో కొందరు ఉపాధ్యాయులు విద్యార్థులకు బిట్‌ పేపరు జవాబులు చెబుతున్నారన్న విమర్శలున్నాయి.
* అనంతపురం జిల్లా రాయదుర్గంలో గురువారం అర్ధరాత్రి 21 మంది అనుమానిత యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
*శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గంలోని కంచరాం గ్రామంలో శుక్రవారం చేపట్టిన తనిఖీల్లో భాగంగా రూ.8,44,250 నగదు పట్టుబడినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. పలాస మండలంలోని రెంటికోట సమీపంలో తనిఖీల సందర్భంగా 3 కిలోల వెండిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
*చిత్తూరు జిల్లా వి.కోట మండల పరిధి కుంభార్లపల్లె వద్ద మామిడితోటలో శుక్రవారం రాత్రి పోలీసులు 170 మద్యం కేసులను పట్టుకున్నారు. ఈ తోట యజమాని శ్రీరాములురెడ్డికి వైకాపా నాయకుడిగా గుర్తింపు ఉంది. మామిడితోటలో మద్యం నిల్వలు ఉన్నట్లు పోలీసులకు శుక్రవారం రాత్రి సమాచారం అందింది. దీంతో అక్కడికి వచ్చి గాలించగా 170 మద్యం కేసుల్లో దాదాపు 8,160 మద్యం సీసాలు లభ్యమయ్యాయి. ఎన్నికల ప్రచారంలో పంపిణీకి వీటిని ఇక్కడ నిల్వ చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. వీటి విలువ రూ.6 లక్షలు ఉంటుందని సీఐ పేర్కొన్నారు. మద్యం సీసాలు స్వాధీనం చేసుకొని తోట యజమాని శ్రీరాములురెడ్డిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
*తగిన పత్రాలు లేకుండా తరలిస్తున్న 108 కిలోల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడులోని తూత్తుకుడిలో శుక్రవారం ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ వాహనాల తనిఖీ చేపట్టింది. తగిన పత్రాలు లేకుండా తీసుకొచ్చిన 108 కిలోల బంగారు నగలను స్వాధీనం చేసుకుని డ్రైవర్‌ హరిహరన్‌ను విచారిస్తున్నారు. నగల దుకాణాల కోసం వీటిని కర్ణాటక నుంచి తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు. పత్రాలు చూపించి వాటిని తీసుకెళ్లాల్సిందిగా సూచించారు. అనంతం బంగారాన్ని స్థానిక కలెక్టరు కార్యాలయానికి తరలించారు.
*పులి దాడిలో మహారాష్ట్ర చంద్రపూర్‌ జిల్లాలో ఓ మహిళ మృతి చెందింది. బద్రావతి తాలూకా రాన్‌తడోది గ్రామంలో శుక్రవారం ఈ ఘటన జరిగింది.
*లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఓటర్లను ప్రలోభపెట్టేందుకు తీసుకెళ్తోన్న నగదు, మద్యం భారీగా పట్టుబడుతోంది. ఎన్నికల నియమావళి (కోడ్‌) అమల్లో ఉండటంతో ఆయా శాఖలు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు రూ. 24.17 కోట్ల విలువైన నగదు, బంగారం, వెండి, ఇతరాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
* ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లా బాసగూడ అటవీ ప్రాంతంలో శుక్రవారం సీఆర్పీఎఫ్‌ బలగాలు-మావోయిస్టుల మధ్య కొద్దిసేపు ఎదురుకాల్పులు జరిగినట్లు సమాచారం. పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో సీఆర్పీఎఫ్‌ బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి.
* కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలో శుక్రవారం జరిగిన పవన్‌ కల్యాణ్‌ బహిరంగ సభలో ఏర్పాటు చేసిన స్పీకర్లపై నుంచి కిందపడి తన భర్త షీరాజు (30) మృతి చెందినట్లు ఆయన భార్య కరిష్మా ఆరోపించారు.
* ప్రధాని మోదీని సమర్థిస్తున్న ఇస్రో మాజీ ఛైర్మన్‌ జి.మాధవన్‌ నాయర్‌ను చంపేస్తామంటూ ఉగ్రవాద ముఠా జైష్‌ ఎ మహ్మద్‌ హెచ్చరిచింది.
*కర్నూలు జిల్లా మంత్రాలయం తెదేపా అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్ధి తిక్కరెడ్డి ప్రత్యెక వాహనంలో చక్రాల కుర్చీలో ఉండే శుక్రవారం ప్రచారం నిర్వహించారు. ఖగ్గల్లులో జరిగిన ఘర్షణలో తుపాకీ గుండు తగిలి గాయాలపాలైన ఆయన గాయం తగ్గకుండానే వీల్ చైర్లో కూర్చుని ఆయన గాయం తగ్గకుండానే వీల్ చైర్ లో కూర్చొని రామచంద్రనగర్ ఎస్సీ కాలనీలో పర్యటించారు. ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. బులెట్ గాయంతో తానూ ఆస్పత్రిలో ఉంటె ప్రత్యర్ధులు తెదేపా కార్యకర్తలను బెదిరిస్తూ దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు.
*హైదరాబాద్‌ పాతబస్తీకి చెందిన ఓ మహిళ.. ఆర్థిక ఇబ్బందులను తొలగించుకునేందుకు ఒమన్‌ దేశానికి వెళ్లాలనుకుంది.. ఆమె అమాయకత్వాన్ని గల్ఫ్‌ ఏజెంట్లు సొమ్ము చేసుకున్నారు.
*ఉపాధి కోసం గంపెడాశతో ఇరాక్‌ వెళ్లిన వలస కార్మికులను ఆయుధాలతో బెదిరించి, వేతనాలివ్వకుండా వెట్టిచాకిరీ చేయించారు అక్కడి యజమానులు.. తాము పడుతున్న ఇబ్బందులను కార్మికులు ఫేస్‌బుక్‌ ద్వారా గల్ఫ్‌ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బసంత్‌రెడ్డికి వివరించారు.
*షాచల అటవీ ప్రాంతంలో కొంత కాలంగా తరచూ అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం ధర్మగిరి వేదపాఠశాలకు సమీపంలోని అటవీ ప్రాంతంలో మంటలు చెలరేగాయి. ఎండ తీవ్రతకు తోడు గాలులు వీస్తుండడంతో అగ్నికీలలు త్వరగా వ్యాపించాయి. తితిదే అటవీ, భద్రతా సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు కృషిచేశారు. అప్పటికే తితిదే పరిధిలోని ఐదు హెక్టార్ల అటవీ ప్రాంతం అగ్నికి ఆహుతైంది. తిరుమల వైపునకు మంటలు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
*ముంబయిలో పెద్ద ఎత్తున బంగారం పట్టుబడింది. రెండు ద్విచక్రవాహనాల్లో 70కిలోల బంగారం తరలిస్తుండగా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్కూటర్‌లో రెండు డిస్క్‌ల రూపంలో 30 కిలోలో, మరో ద్విచక్రవాహనంలో మూడు డిస్క్‌ల రూపంలో తరలిస్తున్న 45కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పుత్తడి తరలింపునకు సంబంధించి ఏడుగురిని డీఆర్‌ఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
*ఉత్తర్‌ప్రదేశ్‌లో భూవివాదం కాల్పులకు దారితీసింది. ఘజియాబాద్‌లో నడిరోడ్డుపైనే రెండు వర్గాలకు చెందిన వారు తుపాకులతో కాల్పులకు దిగారు.
*ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్‌ నోయిడాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 8 మంది అక్కడికక్కడే మృతిచెందగా.. మరో 31 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో 12 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. యమునా ఎక్స్‌ప్రెస్‌ వేపై రబూపుర వద్ద శుక్రవారం ఉదయం ఈ ఘటన జరిగింది. ఎదురెదురుగా వస్తున్న ఓ బస్సు, లారీ ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది. క్షతగాత్రుల్ని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
*అనంతపురం జిల్లా రాయదుర్గంలో గురువారం అర్ధరాత్రి 21 మంది అనుమానిత యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సిఐ అజయ్ కుమార్ వివరాల మేరకు గురువారం అర్ధరాత్రి రాయదుర్గం నుంచి బళ్ళారి వైపు రెండు కార్లలో 21మంది యువకులు వెళ్తున్నట్లు తనిఖీలో బయటపడింది. వారిని విచారించగా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పరిసర ప్రాంత వాసులుగా తేలింది. రాయదుర్గం వైకాపా అభ్యర్ధి కాపు రామచంద్రారెడ్డి వియ్యంకుడు శ్రీరామిరేడ్డి తమను రాయడుర్గానికి పిలిపించారని చెప్పారు.
*వైకాపా అభ్యర్ధి కాపు.. భీమవరం నుంచి 300 మంది గూండాలు, రౌడీలను రప్పించి రాయదుర్గం బల్లారీ సోమలాపురం ఉద్దేహాల్ లో ఉంచి తెదేపా నాయకులూ కార్యకర్తలను ఆరోపించారు. రాయదుర్గంలో ఎన్నికలు ప్రసంటంగా స్వేచ్చగా జరిగేలా ఎన్నికల కమీశం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సహాయ రిటర్నింగ్ అధికారి వెంకట రమేష్ బాబును కోరుతూ వినతిపత్రం అందజేశారు. తనను లక్ష్యంగా చేసుకుని రెక్కీకి ఆరుగురుని నియమించారని తన పత్రి కదలికను రికార్డు చేస్తున్నారని అందులో పేర్కొన్నారు.
*నిఘా విభాగాధిపతి ఏబీ వెంకటేశ్వరావును ప్రభుత్వం శుక్రవారం బదిలీ చేసింది. నిఘా విభాగంలో తన తర్వాత సీనియర్ గా ఉన్న అధికారికి బాద్యతలు అప్పగించి రిలీవ్ కావాలని ఆదేశించింది. అనంతరం డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని పేర్కొంది. ఈ ఎన్నికలు పూర్తయ్యేంత వరకు ఆయనకు ఎలాంటి ఎన్నికల విధులు, బాద్యతలు అప్పగించరాదని డీజీపీని ఆదేశించింది.
* జమ్మూకశ్మీర్‌లోని రాంబన్‌ జిల్లాలోని బనీహల్‌లో ఇవాళ మధ్యాహ్నం పేలుళ్లు సంభవించాయి. శ్రీనగర్‌ – జమ్మూ ప్రధాన రహదారిపై కారులో పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఈ పేలుళ్ల ధాటికి కారు తూనతునకలైంది. పేలుళ్లు జరిగే కంటే ముందే.. ఈ రహదారిపై భద్రతా బలగాల కాన్వాయ్‌ వెళ్లింది. కారులో పేలుళ్లు జరగడంతో సైన్యం అప్రమత్తమైంది. కారులోని సిలిండర్‌ పేలడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మొత్తానికి ఆ ప్రాంతంలో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. పుల్వామాలో ఫిబ్రవరి 14వ తేదీన సీఆర్పీఎఫ్‌ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు కారు బాంబుతో ఆత్మాహుతి దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లు వీరమరణం పొందారు.
* జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో పోలీసులు హైఅలర్ట్‌ ప్రకటించారు. ఇవాళ ఉదయం భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. అనంత్‌నాగ్‌లోని కోకర్‌నాగ్‌ ఏరియాలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారని బలగాలకు సమాచారం అందింది. దీంతో అక్కడికి చేరుకున్న బలగాలపైకి ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఉగ్రవాదుల కోసం బలగాలు కూంబింగ్‌ కొనసాగిస్తున్నాయి.
* అదనపు కట్నం కోసం వేధించి మహిళపై కిరోసిన్ పోసి హత్య చేసిన ముగ్గురికి జీవిత ఖైదును విధిస్తూ ప్రిన్సిపల్ డిస్ట్రిక్టు సెషన్స్ జడ్జి శశిధర్‌రెడ్డి తీర్పునిచ్చారు. వివరాలను పరిశీలిస్తే నకిరేకల్ మండలంలోని ఓగోడు గ్రామానికి చెందిన శాతరాజు రేణుక అదే గ్రామానికి చెందిన జానకిరాములుతో ఫిబ్రవరి 16, 2009న వివాహం జరిగింది.

కడపలో తేదేపాకు మరో షాక్–తాజావార్తలు–03/30

* సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్‌లో అధికార టీడీపీకి కడప జిల్లాలో మరో షాక్ తగిలింది. టీడీపీకి కేంద్ర మాజీ మంత్రి సాయి ప్రతాప్ రాజీనామా చేశారు. రాజంపేట లోక్‌సభ టికెట్ ఆశించి ఆయన భంగపడ్డారు. టీడీపీలో సరైన గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సాయి ప్రతాప్ మాట్లాడుతూ.. కడప సమస్యల పరిష్కారానికే టీడీపీలో చేరడం జరిగింది. టీడీపీలో పరిస్థితి నాకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. అమరావతి రమ్మని పిలిచి ఘోరంగా అవమానించారు. చంద్రబాబు తీరువల్ల మనోవేదనకు గురయ్యాను. రెండు రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారు.
* ద్ర‌విడ మున్నేత్ర క‌జ‌గం(డీఎంకే) కోశాధికారి దురై మురుగ‌న్ నివాసాల్లో ఇవాళ ఆదాయ‌ప‌న్నుశాఖ అధికారులు సోదాలు నిర్వ‌హిస్తున్నారు. వెల్లోర్ జిల్లాలోని కాట్పాడిలో ఈ త‌నిఖీలు జ‌రుగుతున్నాయి. శుక్ర‌వారం రాత్రి 10.30 డీఎంకే నేత ఇంటికి వ‌చ్చిన అధికారులు శ‌నివారం కూడా సోదాలు చేస్తూనే ఉన్నారు. మురుగ‌న్ కుమారుడు కాతిర్ ఆనంద్ ఈసారి వెల్లోర్ నుంచి లోక్‌స‌భ‌కు పోటీ చేస్తున్నారు. ఐటీ శాఖ ఉద్యోగులు అయిదు బృందాలుగా మారి సోదాలు చేస్తున్నారు.
* విశాఖలో బార్ అసోసియేషన్ 125 వసంతాల వేడుకకు ఉప రాష్ట్రపతి వెంకయ్య హాజరయ్యారు. తన ఎదుగుదల అక్కడి నుంచే మొదలైందని గుర్తు చేసుకున్నారు.న్యాయవ్యవస్థపై ప్రజలంతా గౌరవం కలిగి ఉండాలని ఉప రాష్ట్రపతి వెంకయ్య చెప్పారు. విశాఖలో బార్ అసోసియేషన్ 125 వసంతాల వేడుకకు ఆయన హాజరయ్యారు. తన ఎదుగుదల అక్కడి నుంచే మొదలైందని గుర్తు చేసుకున్నారు. తెన్నేటి విశ్వనాథం వంటి మహానుభావులు తమ వృత్తి జీవితాన్ని విశాఖ నుంచే ప్రారంభించారన్నారు. ప్రపంచంలోనే భారతీయ న్యాయ వ్యవస్థకు ప్రత్యేకత ఉందని… 130 కోట్ల భారతీయుల విశ్వాసాన్ని కోర్టులు పరిరక్షిస్తూనే ఉన్నాయని చెప్పారు. ఈ సాయంత్రం విశాఖపట్నం ఐఐఎం మూడో స్నాతకోత్సవానికి వెంకయ్య హజరుకానున్నారు.
* అమరావతిరాష్ట్రంపై భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. క్రమంగా ఎండ తీవ్రత పెరుగుతోంది.కర్నూలులో 42డిగ్రీలు, నంద్యాల, కడప, అనంతపురంలో 41డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సముద్ర గాలుల ప్రభావంతో కోస్తాలో ఉక్కపోత పెరిగింది.వచ్చే 3రోజుల్లో మరింత తీవ్రం మధ్యాహ్నం బయటకు రావొద్దు-RTGS, ISROనిపుణుల హెచ్చరిక
* మంచిర్యాల జిల్లాలో గల పత్తి విత్తన కేంద్రాలపై అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. పోలీసులు, వ్యవసాయశాఖ అధికారులు సంయుక్తంగా ఈ తనిఖీలు చేపట్టారు. మంచిర్యాల, మందమర్రి, రామకృష్ణాపూర్, కన్నెపల్లి, నెన్నెల్, తాళ్ల గురజాలలో రామగుండం టాస్క్‌ఫోర్స్ పోలీసులు, అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న 13 మంది సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. రూ. 66 లక్షల విలువచేసే 33 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
* చీమలపాడు పెదతండాలో మహిళ హత్యఅలుగులో పడి ఉన్న మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చిన స్ధానికులు.
* రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్ 11న పోలింగ్ జరుగనున్నందున రాష్ట్ర ప్రభుత్వం ఆరోజు సెలవు ప్రకటించింది. పోలింగ్‌కు ముందు రోజైన ఏప్రిల్ 10న, కౌంటింగ్ జరిగే మే 23వ తేదీన అవసరమైనచోట సెలవులు ఇవ్వడానికి జిల్లా కలెక్టర్లకు అధికారం ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ శైలేంద్రకుమార్ జోషి ఉత్తర్వులు జారీచేశారు.
ఏప్రిల్ 11న జరిగే పోలింగ్‌లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం, ఏప్రిల్ 10న ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో పోలింగ్ ఏర్పాట్ల కోసం, మే 23న ఓట్ల లెక్కింపు ప్రక్రియకు ఇబ్బందులు లేకుండా జిల్లా కలెక్టర్లకు స్థానికంగా సెలవులు మంజూరుచేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది
*ఎన్నికల్లో పాల్గొనే ముందు అభ్యర్థులంతా నేర చరిత్రను ప్రకటించాలన్న సుప్రీంకోర్టు తీర్పు ఉల్లంఘనకు గురైందనే ఆరోపణలపై సర్వోన్నత న్యాయస్థానం స్పందించింది. సదరు ఉల్లంఘనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ న్యాయవాది అశ్వినికుమార్‌ ఉపాధ్యాయ వేసిన పిటిషన్‌పై శుక్రవారం విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి(ఈసీ) నోటీసులు జారీ చేసింది.
* భారత్‌ యాంటీ శాటిలైట్‌ ప్రయోగం నిర్వహించినప్పుడు అమెరికాకు ఎటువంటి గూఢచర్యం నిర్వహించలేదని పెంటగాన్‌ పేర్కొంది. ఈ ప్రయోగం తర్వాత డిగోగార్సియా స్థావరం నుంచి అమెరికా విమానం ఒకటి బంగాళఖాతంలోకి ప్రవేశించింది. దీనిపై పెంటగాన్‌ వివరణ ఇస్తూ భారత్‌ ప్రయోగం విషయం ముందే తెలుసని పేర్కొంది.
*రాష్ట్ర శాసనమండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌ శుక్రవారం పదవీ విరమణ పొందారు. ఆయనతో పాటు ఆరుగురు సభ్యుల పదవీ కాలం కూడా ముగిసింది. పదవీకాలం ముగింపు సందర్భంగా స్వామిగౌడ్‌ రాజ్‌భవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌ను కలిశారు.
*వీవీప్యాట్లు 50% లెక్కించడం సాధ్యం కాదని కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) స్పష్టం చేసింది. ‘‘ఒక్కో అసెంబ్లీ స్థానంలో ఆ విధంగా లెక్కించాలంటే కనీసం ఆరు రోజుల సమయం పడుతుంది. చాలా అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 400కి మించి పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి.
* దేశంలో అరకు లోయ సహా వివిధ ప్రాంతాల్లో సాగవుతున్న 5 ప్రత్యేక రకాల కాఫీలకు తాజాగా భౌగోళిక సూచి (జాగ్రఫికల్‌ ఇండికేషన్‌ – జీఐ) గుర్తింపు లభించింది. అరకుతో పాటు కూర్గ్‌, చిక్‌మగళూర్‌, బాబాబూదన్‌ గిరులకు చెందిన అరేబికా రకాలకు, వాయనాడ్‌ రోబస్టా రకం కాఫీకి కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ పరిధిలోని పరిశ్రమ, అంతర్గత వ్యాపారాల అభివృద్ధి విభాగం జీఐ ట్యాగ్‌ ఇచ్చింది. తాజాగా గుర్తింపు పొందిన కాఫీల్లో కూర్గ్‌ (కొడగు జిల్లా), చిక్‌మగళూర్‌ (మల్నాడ్‌ ప్రాంతంలోని దక్కన్‌ పీఠభూమి), బాబాబూదన్‌ గిరులకు చెందిన రకాలు కర్ణాటకలోనే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లా అరకు లోయలో గిరిజనులు సేంద్రియ విధానంలో కాఫీ సాగు చేస్తున్నారు. వాయనాడ్‌ రోబస్టా కేరళ తూర్పు ప్రాంతంలోని వాయనాడ్‌ జిల్లాలో ప్రత్యేకంగా పెరుగుతుంది. బాబాబూదన్‌ గిరులు భారత్‌లో కాఫీకి పుట్టినిల్లుగా ప్రసిద్ధి చెందాయి. జీఐ పొందిన కాఫీ ప్రాంతాల్లో ఉత్పత్తిదారులు నిర్ణీత ప్రమాణాలను పాటిస్తారు. ఈ గుర్తింపు ప్రపంచంలో భారతీయ కాఫీ పరిధిని విస్తరించేందుకు దోహదపడుతుంది. ఒకసారి జీఐ ట్యాగ్‌ లభిస్తే ఇతర ఉత్పత్తిదారులెవరూ మార్కెట్‌లో ఆ పేరును దుర్వినియోగం చేయడానికి వీలుపడదు. ఉత్పత్తిదారులకు గరిష్ఠ ధర కూడా లభిస్తుంది.
*ఆంధ్ర విశ్వవిద్యాలయంలో 1955-60 మధ్య చదువుకున్న పూర్వవిద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆద్యంతం ఆకట్టుకుంది. ఎనిమిది పదుల వయసు దాటినా..అరవై ఏళ్ల స్నేహబంధాన్ని తలచుకుంటూ తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు వంద మంది ఒక్కచోట కలుసుకున్నారు. నాటి అనుభూతుల్ని నెమరువేసుకున్నారు.
*తక్కువ వడ్డీకే వ్యక్తిగత రుణాలిప్పిస్తామంటూ వేలమందిని మోసం చేసిన ఎలైట్‌ సంస్థ లీలలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. చెన్నై, హైదరాబాద్‌లో కలిపి ఈ సంస్థ రూ.150కోట్లు స్వాహా చేసినట్లు పోలీసు లు అంచనా వేస్తున్నారు.
*కడప జిల్లా కలసపాడు మండలం ముద్దిరెడ్డిపల్లెకు చెందిన వృద్ధుడు, వైకాపా కార్యకర్త నడిపి వెంకటరెడ్డి(70) వడదెబ్బతో మృతి చెందారు.
*ముఖ్యమంత్రి యువనేస్తం పథకం కింద ఒక్కో లబ్ధిదారునికి చెల్లిస్తున్న మొత్తాన్ని రూ.వెయ్యి నుంచి రూ.2 వేలకు పెంచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి నిరాకరించింది. ఎన్నికల పూర్తయ్యేంత వరకూ భృతి కింద చెల్లిస్తున్న మొత్తాన్ని పెంచరాదని స్పష్టం చేసింది.
*రాష్ట్రంలో ఒకటి నుంచి ఐదో తరగతులకు సమ్మెటివ్‌-2 పరీక్షలను ఏప్రిల్‌ 17 నుంచి 22వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు రాష్ట్ర విద్యాపరిశోధన, శిక్షణ మండలి సంచాలకుడు మధుసూధన్‌ తెలిపారు. 6-9 తరగతులకు ఏప్రిల్‌ 13 నుంచి 22వ తేదీ వరకు సంబంధిత పరీక్షలు జరగనున్నాయని వెల్లడించారు. రాష్ట్రంలో ఎన్నికల నేపథ్యంలో.. గతంలో ప్రకటించిన సమ్మెటివ్‌ పరీక్షల తేదీలను పూర్తిగా మార్చివేసి ఈ మేరకు నూతన షెడ్యూల్‌ విడుదల చేసినట్టు ఆయన తెలిపారు.
*విజయవాడ డివిజన్‌ పరిధిలో ఇంజినీరింగ్‌ పనులు జరుగుతున్నందున ఏప్రిల్‌ ఒకటో తేదీన గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌ సికింద్రాబాద్‌లో రెండు గంటలు ఆలస్యంగా బయలుదేరనుంది. ఈ మేరకు సీనియర్‌ మండల వాణిజ్య అధికారి వాసుదేవరెడ్డి శుక్రవారమిక్కడ తెలిపారు.
*ఏపీ మౌలిక సదుపాయాల కల్పన సంస్థ(ఏపీఐఐసీ) డొల్ల కంపెనీలకు రాష్ట్రంలోని వేల ఎకరాల భూముల్ని కట్టబెట్టిందంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టేసింది. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌, జస్టిస్‌ సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈమేరకు తీర్పు ఇచ్చింది. భూకేటాయింపులపై అభ్యంతరం ఉంటే సంబంధిత అధారిటీని ఆశ్రయించొచ్చని పిటిషనర్‌కు సూచించింది.
*ప్రభుత్వ ఉద్యోగులకు 63 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని ఏపీ గెజిటెడ్‌ అధికారుల ఐకాస ఛైర్మన్‌ కేవీ కృష్ణయ్య కోరారు. 2018 జులై నుంచే 11వ పీఆర్‌సీని అమలుచేయాలని డిమాండ్‌ చేశారు. సీఆర్‌డీఏ పరిధిలోని ఉద్యోగులకు 35 శాతం, జిల్లా కేంద్రాల్లో పనిచేసే ఉద్యోగులకు 25 శాతం ఇంటి అద్దె భత్యం చెల్లించాలని 11వ వేతన సవరణ సంఘం కమిషనర్‌ అశుతోష్‌ మిశ్రాను శుక్రవారం సచివాలయంలో కోరినట్లు ఓ ప్రకటనలో తెలిపారు.
*రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల నుంచి మొత్తం 22 మంది మహిళలు పోటీ చేస్తున్నారు. మహబూబాబాద్‌లో అత్యధికంగా ముగ్గురు బరిలో నిలవగా; మెదక్‌, హైదరాబాద్‌, భువనగిరి నుంచి ఒక్కరు కూడా పోటీలో లేరు. ప్రధాన పార్టీలైన తెరాస తరఫున నిజామాబాద్‌, మహబూబాబాద్‌లలో; కాంగ్రెస్‌ తరఫున ఖమ్మంలో; భాజపా నుంచి మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌లలో పోటీ చేస్తున్నారు. సీపీఎం నుంచి ఒకరు, స్వతంత్ర అభ్యర్థులుగా 8 మంది, వివిధ పార్టీల నుంచి 8 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
*ఎండ మండిపోతోంది. రాష్ట్రంలో చాలా జిల్లాల్లో శుక్రవారం 41.6 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గరిష్ఠంగా భద్రాద్రి కొత్తగూడెంలో 42.2 డిగ్రీల ఉష్ణోగత నమోదైంది. కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట, పెద్దపల్లి జిల్లా రామగుండంలలో 42 డిగ్రీలు, కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా కెరమెరి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా ఘన్‌పూర్‌, ములుగు మండలం చెలపూర్‌లలో 41.9 డిగ్రీలు నమోదైంది.
*లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో పోలింగ్‌ జరిగే ఏప్రిల్‌ 11వ తేదీ, ఎన్నికల ఓట్ల లెక్కింపు జరిగే మే 23ని సాధారణ సెలవు దినాలుగా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు ఈ సెలవు వర్తిస్తుందని పేర్కొంది.
*భారతీయులు చదువు, ఉద్యోగాలకు వివిధ దేశాలకు వెళ్తున్నవారు గతంతో పోల్చుకుంటే అధికంగానే ఉన్నారు. అలాంటివారు అక్కడి నుంచి వచ్చి ఓటు వేయాలంటే ఇబ్బందులు పడుతుంటారు. కానీ ఓటు హక్కు వినియోగించుకోవాలని వారంతా తాపత్రయపడుతుంటారు. ఇటీవల ఓటు నమోదుకు అనేక మంది దరఖాస్తు చేసుకున్నారు. కొత్తగా 2,100 మంది ప్రవాసభారతీయులు ఓటుకోసం దరఖాస్తు చేసుకున్నారు. అలాంటి వారంతా ఓటు వేయాలంటే లక్షలు ఖర్చుచేసి రావాల్సి వస్తుంది. అటువంటి వారు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. ఆన్‌లైన్‌ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేసింది. దీనికి సంబంధించిన విధి విధానాలను ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. ఏప్రిల్‌ 11న జరిగే ఎన్నికల్లో వారంతా అక్కడి నుంచే ఓటు వినియోగించుకునే అవకాశం వచ్చింది
*తెలంగాణలోని అన్ని కేంద్ర జీఎస్టీ కార్యాలయాలు శని, ఆదివారం కూడా పనిచేస్తాయని హైదరాబాద్‌ జోన్‌ జీఎస్టీ ప్రిన్సిపల్‌ చీఫ్‌ కమిషనర్‌ బంకి బేహార్‌ ఆగ్రావాల్‌ ఒక ప్రకటనలో తెలిపారు. జీఎస్టీ, కేంద్ర ఎక్సైజ్‌, సేవా పన్ను చెల్లింపుదారులకు తోడ్పాటును అందించేందుకు ఆయా రోజుల్లో జీఎస్టీ కార్యాలయాలు పని చేస్తాయని పేర్కొన్నారు.
*పదోతరగతి పరీక్షల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఒక ఇన్విజిలేటర్‌, ముగ్గురు చీఫ్‌ సూపరింటెండెంట్లు, ఒక శాఖాధికారిని విధుల నుంచి తప్పించామని, ముగ్గురు ఇన్విజిలేటర్లను సస్పెండ్‌ చేశామని ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం సోషల్‌స్టడీస్‌ పేపర్‌-2 పరీక్షకు 99.59% హాజరు నమోదైందని పేర్కొన్నారు. కాపీయింగ్‌కు పాల్పడుతూ హైదరాబాద్‌లో ఇద్దరు, నాగర్‌కర్నూలులో ఒకరు పట్టుబడ్డారని వివరించారు.
*తెలంగాణలోని అన్ని కేంద్ర జీఎస్టీ కార్యాలయాలు శని, ఆదివారం కూడా పనిచేస్తాయని హైదరాబాద్‌ జోన్‌ జీఎస్టీ ప్రిన్సిపల్‌ చీఫ్‌ కమిషనర్‌ బంకి బేహార్‌ ఆగ్రావాల్‌ ఒక ప్రకటనలో తెలిపారు. జీఎస్టీ, కేంద్ర ఎక్సైజ్‌, సేవా పన్ను చెల్లింపుదారులకు తోడ్పాటును అందించేందుకు ఆయా రోజుల్లో జీఎస్టీ కార్యాలయాలు పని చేస్తాయని పేర్కొన్నారు.
*ఏప్రిల్‌ 11న ఎన్నికలు జరగనున్న దృష్ట్యా, ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ఉన్న ప్రగతి భవన్‌లో ఈ ఏడాది ఉగాది వేడుకలను జరపడానికి కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి నిరాకరించింది. ముఖ్యమంత్రి నివాస కార్యాలయం మినహా మరెక్కడైనా రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి అనుమతితో రాష్ట్ర ప్రభుత్వం ఈ వేడుకలను జరుపుకోవచ్చని సూచించింది. ఉగాది వేడుకలు జరిగే ప్రదేశాల్లో ఎన్నికల ప్రవర్తన నియమావళిని సంపూర్ణంగా అమలు జరిగేటట్లు చూడాలని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయానికి స్పష్టం చేసింది.
*ఏప్రిల్‌ 1, 2వ తేదీల్లో కాజీపేట-కొండపల్లి రైల్వేస్టేషన్ల మధ్య గూడ్స్‌ రవాణా కోసం (ట్రాఫిక్‌ బ్లాక్‌) పలు ప్యాసింజరు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే కాజీపేట రైల్వేస్టేషన్‌కు సమాచారం పంపింది.
*అమీర్‌పేట-హైటెక్‌సిటీ మార్గంలోని పెద్దమ్మగుడి మెట్రో స్టేషన్‌ నేటి(శనివారం) నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వస్తోంది. ఈ నెల 20న మెట్రో ప్రారంభించినా సాంకేతిక కారణాలతో జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు, పెద్దమ్మగుడి, మాదాపూర్‌ స్టేషన్‌ ప్రారంభాలను వాయిదా వేశారు. దీంతో ఇక్కడ మెట్రో ఆగడం లేదు. శనివారం నుంచి పెద్దమ్మగుడి స్టేషన్‌ అందుబాటులోకి వస్తుందని మెట్రో వర్గాలు తెలిపాయి. దశలవారీగా మిగతాస్టేషన్లను ప్రారంభిస్తామని వెల్లడించాయి.
* ‘అందరికీ అందుబాటులో ఎన్నికలు’ అనే నినాదంతో 31వ తేదీన దివ్యాంగ ఓటర్ల అవగాహన ప్రదర్శన నిర్వహిస్తారు. హైదరాబాద్‌ పీపుల్స్‌ ప్లాజా ప్రాంగణంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో ప్రముఖులతో పాటు పలువురు దివ్యాంగులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొంటారని వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ కమిషనర్‌ శైలజ తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో ప్రతి ఒక్కరినీ భాగస్వాములను చేయడమే ర్యాలీ లక్ష్యమని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
* రాష్ట్ర నిఘా విభాగాధిపతి ఏబీ వెంకటేశ్వరరావును ప్రభుత్వం శుక్రవారం బదిలీ చేసింది. నిఘా విభాగంలో తన తర్వాత సీనియర్‌గా ఉన్న అధికారికి బాధ్యతలు అప్పగించి రిలీవ్‌ కావాలని ఆదేశించింది. అనంతరం డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని పేర్కొంది. ఈ ఎన్నికలు పూర్తయ్యేంతవరకూ ఆయనకు ఎలాంటి ఎన్నికల విధులు, బాధ్యతలు అప్పగించరాదని డీజీపీని ఆదేశించింది.
*మా లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదల పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వ్యులను ఒక పౌరుడిగా గౌరవిస్తూనే, న్యాయం కోసం సుప్రీం కోర్టుని ఆశ్రయించాలని నిర్ణయించాం. అన్నారు. ప్రముఖ దర్శకుడు రాం గోపాల్ వర్మ ఆయన అగస్త్య మంజుతో కలిసి నిర్మించిన చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్ రాకేశ్ రెడ్డి, దీప్తి బాలగిరి నిర్మించారు. ఆంధ్రప్రదేశ్ మినహా మిగిలిన ప్రాంతాల్లో ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది ఈ సందర్భంగా హైదరాబాద్ లో రాంగోపాల్ వర్మ విలేకరులతో మాట్లాడారు. సెన్సార్ బోర్డు ద్రువేకరణ పత్రం ఇచ్చాక ఓ సినిమా ఒక రాష్ట్రంలో విడుదలై మరో రాష్ట్రంలో నిలిచిపోవడం ఇదే తొలిసారి త్వరలో ఆంధ్రప్రదేశ్లో నూ చోత్రం విడుదలకు మావంతు ప్రయత్నాలు చేస్తున్నాం అన్నారు వర్మ.
*మిలమిల మెరుస్తున్న ఈ బుజ్జి కప్పు పేరు పంప్కిన్ తోడ్లేట్ బ్రెజిల్ లోని అట్లాంటిక్ అడవి దీని పుట్టినిల్లు అతినీల కాంతి సమక్షంలో ఈ కప్పలు వెలుగులీనుతున్నట్లు యూఏఈలోని న్యూయార్క్ వర్సిటీ అబుదాబీ పరంగాన పరిశోధకులు గుర్తించారు.
*పీవీ సింధు , కిదాంబీ శ్రీకాంత్ పారుపల్లి కశ్యప్ ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ సెమీ ఫైనల్ కు దూసుకెళ్ళారు. 2017 చాంపియన్ సింధు మహిళల సింగిల్స్ లో క్వార్టర్ ఫైనల్ లో 21-9, 22-20తో మియా బ్లీచ్ పెల్ట్ పై విజయం సాధించింది. ఇంకా త్వరగా మ్యాచ్ ను ముగించాల్సింది. ఫైనల్లో చోటు కోసం ఆమె హీ బింగ్ జీయావో తలపడనుంది.
*ఆసియా ఎయిర్ గన్ షూటింగ్ చాంపియన్ షిప్ లో భారత యువ షూటర్లు మనబాకర్ సౌరబ్ చౌదరీ జోరు కొనసాగుతోంది. మహిళల పది మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో పదిహేడేళ్ళ మను స్వర్ణం సొంతం చేసుకుంది. అర్హత రౌండ్లలో 575 పాయింట్లతో రెండో స్థానం,లో నిలిచినా ఆమె పతక పోరులో 239పాయింటుతో పసిడి దక్కించుకుంది.
*ఓటు వేయడం పౌరుల బాద్యత అంటూ అధికారులు ప్రచారాలు చేస్తున్నారు. ఆ బాద్యతను నెరవేర్చే క్రమంలో పజలకు అందించాల్సిన సౌకర్యాలను మాత్రం పట్టించుకోవడం లేదు. కర్నూలు జిల్లా పాణ్యం మండలం గోరుకల్లు తంగా గోరుకల్లు గ్రామ పంచాయతీకి అనుబంధ గ్రామం. గతంలో పంచాయతీ నుంచి తండా మూడు కిమీ దూరంలో ఉండేది. ప్రభుత్వం పంచాయతీ కేంద్రానికి, తండాకు మధ్య గోరుకల్లు జలాశయం నిర్మించి తండా వాసులకు కర్నూలు జాతీయ రహదారికి పక్కన పునరావాసం కల్పించింది. ఎన్నికలో ఓటు వేసేందుకు వారంతా పాణ్యం మీదుగా గోరుకల్లు గ్రామానికి వస్తున్నారు. సుమారు 350 మంది తమ ఓటు హక్కు వినియోగించేందుకు పద్నాలుగు కిమీలు ప్రయాణించాల్సి వస్తోంది. తమకు అందుబాటులో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయాలనీ కోరినా అధికారుల నుంచి స్పందన లేదు.
* శేషాచలం అడవుల్లో మంటలు భారీగా వ్యాపించాయి. గత రెండు రోజులుగా శేషాచలం అడవుల్లో మంటలు చెలరేగుతున్నాయి. చామలకోన, గాడికోన ప్రాంతాల్లో ఈ మంటలు వ్యాపించాయి. శుక్రవారం ఉదయం నుంచి మంటలార్పేందుకు తితిదే అటవీ సిబ్బంది యత్నిస్తున్నారు. శ్రీవారి పాదాల వైపు అటవీప్రాంతంలో, రిజర్వ్‌ ఫారెస్ట్‌ పరిధిలో మంటలు వ్యాపిస్తున్నాయి.

అమరావతిని బంగారు బాతుగా మారుస్తా–చంద్రబాబు–రాజకీయ-03/30

ఈశాన్యంలో ఉన్న ఇచ్ఛాపురం నియోజకవర్గం రాష్ట్రానికి సరైన వాస్తు అని చంద్రబాబు అన్నారు. భౌగోళికంగా రాష్ట్రానికి మొదటి నియోజకవర్గం ఇచ్ఛాపురం.. చివరన ఉన్నది కుప్పం అని చెప్పారు. ఈ ఎన్నికల్లో ఇచ్ఛాపురం నుంచి కుప్పం వరకు తెదేపానే గెలవాల్సిన అవసరముందన్నారు. ఆ చివర్లో తన నియోజకవర్గం కుప్పం నుంచి ఈ చివరన ఇచ్ఛాపురం వరకు మొత్తం తమదేనని, ఏమాత్రం అనుమానంలేదని వ్యాఖ్యానించారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబు మాట్లాడారు. శ్రీకాకుళం అంటే వలసల జిల్లా కాదని.. వేరే జిల్లాల ప్రజలు సైతం ఉపాధి కోసం ఇక్కడికి వచ్చేలా అభివృద్ధి చేస్తామని చెప్పారు.
*నరసరావుపేటలో విజ్ఞాన్ రత్తయ్య కుమారుడు ప్రచారం
గుంటూరు జిల్లా నరసరావుపేట YSR కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ అభ్యర్థి లావు శ్రీకృష్ణ దేవరాయలు సతీమణి డాక్టర్ లావు మేఘన శనివారం మాచర్ల నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు. కారంపూడి మండలం ఒప్పిచర్ల గ్రామ0లోని వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జయసుధ మరియు పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.
*చంద్రబాబు పై మోహన్ బాబు ఫైర్
వైసీపీ నేత మంచు మోహన్ బాబు కామెంట్స్.. ఏముంది చెప్పటానికి?నా మిత్రుడు ఉదయం నుండి సాయంత్రం వరకు జగన్మోహన్ రెడ్డి దొంగ అనటం తప్ప చంద్రబాబు నాయుడు మరేమీ చెప్పడు.అహంకారాన్ని వదలిపెట్టు చంద్రబాబు.నీకంటే నేనే ముందు తెలుగుదేశం పార్టీలో చేరాను.జగన్మోహన్ రెడ్డి పై 36 కేసులు ఉన్నాయంటున్నావు.కానీ 15 లేక 16 మాత్రమేనీ మీద ఎన్ని కేసులు ఉన్నాయి చంద్రబాబు.ఎదుటివారు బాగుంటే ఓర్వలేని చంద్రబాబు.నీకు కారెక్టర్ ఉందా చంద్రబాబు?తెలుగుదేశాన్ని లాక్కున్నావుమేము నీ వెంట రావటం మా తప్పు మళ్ళీ ఒప్పుకుంటాను.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మునిగిపోతుంది చంద్రబాబు నాయుడు నీ వల్లనే.లాక్కున్నావు చంద్రబాబు తెలుగుదేశాన్ని.నీ కేసులలో ఇప్పటిదాకా స్టే లు ఎందుకు తీసివేయలేదు? ఎన్టీఆర్ మీద ప్రేమతో ఇంతవరకు ఏ కార్యకర్తగా ఉన్నారు.కాంగ్రెస్ పార్టీ ని ఎదిరించిన అన్న గారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే రీతిలో కాంగ్రెస్ పార్టీని ఆశ్రయించావు.చంద్రబాబుది కుటుంబ పరిపాలన.హరికృష్ణ కు నీవు ఏం చేశావో ఇప్పటికైనా ప్రజలకు చెప్పు.యూటర్న్ చంద్రబాబు.మోడీ ఆంధ్రాకు వస్తే బేడీలు వేస్తానన్న నువ్వు మోడీ తో జతకట్టడం ఎంతవరకు సమంజసం?కేంద్రప్రభుత్వం నిధులకు లెక్కలు చెప్పవద్ద? నువ్వు ప్పవా?జగన్మోహన్ రెడ్డికి ఒక అవకాశం ఇవ్వండి ఇది ప్రజలకు నేనిచ్చే సందేశంప్రజలకు జగన్మోహన్ రెడ్డి మంచి చేస్తాడు.చదువు ఆరోగ్యం కోసం రాజశేఖర్ రెడ్డి గారు తాపత్రయ నిజంఆపధర్మ ముఖ్యమంత్రి పోస్ట్ డేటెడ్ చెక్కులు ఎలా ఇస్తారు.అమరావతి రాజధాని నిర్మాణం కోసం పచ్చని పొలాలని ఎంచుకోవడం న్యాయమేనా?ఆంధ్ర దేశాన్ని దోచేశావు చంద్రబాబు.కేసీఆర్ తెలంగాణకు మంచి చేస్తున్నాడు.నీ రాష్ట్రాన్ని నువ్వు బాగు చెయ్యి.ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్ గా దొరికి భయపడి పారిిపోయావు చంద్రబాబు నాయుడువైస్రాయ్ హోటల్ దగ్గర ఎన్టీఆర్ మీద చెప్పులు వేయించడం నాకు తెలుసు.చంద్రబాబు ఎన్ని మోసాలు అయిన చేస్తాడు.మీ డబ్బులు మీరు తీసుకోండి జగన్మోహన్ రెడ్డికి ఓట్ వేయండిపసుపుకుంకుమా మీడబ్బే మీకు ఇస్తున్న చంద్రబాబు నాయుడు ను నమ్మవద్దు
* ఎన్నికల ముందు చంద్రబాబుకు ఎదురు దెబ్బ
ముందు రాష్ట్రంలో గెలిచి చూపించు అంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ సవాల్ విసిరారు. నెల్లూరులో శుక్రవారం నిర్వహించిన జిల్లా కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో రాంమాధవ్ పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ చంద్రబాబుపై విమర్శలు చేశారు. ఏపీలో అసమర్థ, అవినీతి, కుటుంబ పాలన నడుస్తోందని రాంమాధవ్ అన్నారు. దేశాన్ని రక్షిస్తానంటూ తిరుగుతున్న చంద్రబాబు ముందు ఈ ఎన్నికల్లో గెలిచి చూపించాలని సవాల్ విసిరారు.మళ్లీ అధికారంలోకి వచ్చేది మోదీయేనని, దేశ ప్రజలంతా ఆయన వెంటే ఉన్నారని రాంమాధవ్ పేర్కొన్నారు. మోదీని తమ ప్రాంతం నుంచి పోటీ చేయాల్సిందిగా అన్ని ప్రాంతాల ప్రజలు కోరుతున్నారని ఆయన అన్నారు. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పైనా రాంమాధవ్ విమర్శలు చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో పట్టుమని పది సీట్లు కూడా దక్కించుకోలేని కేసీఆర్ ప్రధానిని అవుతానని చెప్పడం హాస్యాస్పదమని అన్నారు.
* కాంగ్రెస్ పై విరుచుకు పడిన మోడీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, యూపీయే చైర్‌పర్సన్ సోనియా గాంధీలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని వెస్ట్ సియాంగ్ జిల్లా, ఆలోలో జరిగిన బీజేపీ ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అగ్ర నేతలపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు.రాహుల్, సోనియాలతోపాటు ఇతర కాంగ్రెస్ నేతలపై నమోదైన కేసులను మోదీ పరోక్షంగా ప్రస్తావించారు. బెయిలుపై ఉన్నప్పటికీ, కాపలాదారును నిందిస్తున్నారని మండిపడ్డారు. ఢిల్లీలో కూర్చుని, పన్నులు ఎగ్గొట్టే, రైతుల భూములను లాక్కొనే, పత్రికా కార్యాలయం కోసం ఇచ్చిన ప్రభుత్వ భూమిని అద్దెకు ఇచ్చుకుని, డబ్బు సంపాదించే, రక్షణ ఒప్పందాల్లో కమిషన్లు తీసుకునే నాయకులు ఉన్నారన్నారు. ఆ నాయకులకు కోర్టు బెయిలు మంజూరు చేయడంతో బయట తిరుగుతున్నారన్నారు. వెంట్రుక వాసిలో (జైలు) జీవితాన్ని తప్పించుకున్నారన్నారు. తామే స్వయంగా బెయిలుపై ఉన్నవాళ్ళు కాపలాదారును నిందిస్తున్నారని దుయ్యబట్టారు.అరుణాచల్ ప్రదేశ్‌ను, ఈశాన్య భారత దేశాన్ని కాంగ్రెస్ నిర్లక్ష్యం చేస్తోందని మోదీ ఆరోపించారు. అరుణాచల్ ప్రదేశ్‌కు ఆధునిక మౌలిక సదుపాయాలు అవసరమని నిపుణులు చాలా దశాబ్దాల నుంచి చెప్తున్నారని గుర్తు చేశారు. నిపుణులు ఎంతగా చెప్తున్నప్పటికీ ఉన్నత వంశ కుటుంబం, ఆ కుటుంబానికి సన్నిహితులు తమ సొంత ఇలాకాను సృష్టించుకోవడానికే సమయాన్ని ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. వారు అరుణాచల్ ప్రజలను పట్టించుకోలేదన్నారు. ప్రజా సంక్షేమం కన్నా తమ సొంత లాభం కోసమే వారు పాటుపడుతున్నారన్నారు.ఇటీవల విజయవంతమైన యాంటీ శాటిలైట్ మిసైల్ పరీక్ష గురించి తాను ప్రకటించినందుకు ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయని మోదీ అన్నారు. పాకిస్థాన్‌లోని బాలాకోట్‌లో ఉగ్రవాద స్థావరాలపై భారత్ సైన్యం నిర్వహించిన దాడుల విషయంలో కూడా ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాయన్నారు. శాస్త్రవేత్తలు విజయం సాధిస్తే, వారిని ప్రతిపక్ష నేతలు ఎగతాళి చేస్తున్నారన్నారు. ఈ పరీక్ష విజయవంతం కావడం మన దేశానికి గర్వకారణమని చెప్పారు. అది మింగుడుపడని ప్రతిపక్ష నేతలు ఉగ్రవాదుల భాష మాట్లాడుతున్నారన్నారు. ఆ నేతలను మన దేశంలో ఎవరూ పట్టించుకోవడం లేదని, వారిని పాకిస్థాన్‌లో ప్రశంసిస్తున్నారని చెప్పారు. పాకిస్థాన్ వార్తా పత్రికల్లో మన దేశ ప్రతిపక్ష నేతల ఫొటోలను ప్రచురించారన్నారు.మన దేశ ప్రతిపక్ష నేతలకు పొరుగు దేశంపై చాలా ప్రేమాభిమానాలు ఉన్నాయని, మన దేశాన్ని ప్రశంసించలేనంత స్థాయిలో పొరుగు దేశాన్ని ప్రేమిస్తున్నారని మండిపడ్డారు.
*వారికి సీరియస్ వార్నింగ్ ఇచ్చిన చంద్రబాబు
ప్రధాని మోడీ తీరు పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు. సన్ సెట్ ఏపీ అంటూ మోడీ చేసిన వ్యాఖ్యల పై మండిపడ్డారు. కస్టపడి శ్రమతో అభివృద్ధి చేసుకుంటున్న రాష్ట్రం పై ఇంత అక్కసా అంటూ నిలదీశారు. కర్నూలులో మోడీ సభకు వైకాపా తన కార్యకర్తలను తరలించిందన్నారు. రాష్ట్రానికి ఏమీ ఇవ్వకుండా ఇంకా కక్ష సాదిస్తున్నారని ధైర్యముంటే చెప్పినదానికి చేసిన దానికి శ్వేతపత్రం ఇవ్వలని భాజపాని డిమాండ్ చేసారు. లేదంటే తామే శ్వేత పత్రం విడుదల చేస్తామన్నారు,. మోడీని జగన్ ను ప్రజలు విశ్వసించడం లేదన్నారు. అవినీతిపరులకు ప్రధాని రెడ్ కార్పెట్ వేయడం ఏమిటని అసహనం వ్యక్తం చేశారు.
*ఎస్పీ- బీఎస్పీ కూటమికి బీటలు
ఎస్పీ-బీఎస్పీ సారధ్యంలో ఏర్పడిన గట్ బంధన్ నుంచి నిశాద్ పార్టీ వైదొలగింది. మహారాజ్ గంజ్ స్థానం నుంచి తన పార్టీ చిహ్నం పై పోటీ చేయడానికి కూటమి నుంచి ఒక ఏకాభిప్రాయం రాకపోవడంతో పాటు కూటమితో తమను పక్కకు పెడుతున్నట్లుగా నిశాద్ పార్టీ అద్యక్షులు సంజయ్ నిషాద్ భావించినట్లుగా తెలిసింది. ఈ పరిణామాలతో మహారాజ్ గంజ్ స్థానం నుంచి పార్టీ సొంత గుర్తు పావు పోటీ చేయాలనీ సంజయ్ నిషాద్ భావిస్తున్నట్లు పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు తెలిపారు. నిషాద్ పార్టీ అద్యక్షులు సంజయ్ నిషాద్, ఆయన కుమారుడు ప్రవెన్ నిశాద్ శుక్రవారం సాయంత్రం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాద్ ను కలిశారు. ఈ పరినామలాతో నిశాద్ పార్టీ భాజపా కూటమిలో చేరుతున్నట్లు తెలుస్తోంది.
*కరీంనగర్ లో కారెం అల్లుళ్ళు
కరీంనగర్ లోక్ సభ స్థానానికి టీఆర్ఎస్ అభ్యర్ధిగా బోయినపల్లి వినోద్ కుమార్ మరోసారి బరిలో దిగారు. రాజన్న సిరిసిల్ల బోయినపల్లి మండలం కోరెం గ్రామ అల్లుడీయన. కోరెం గ్రామానికి చెందిన చేన్నాడి హన్మంతరావు , చేన్నాడి సత్యరాయణరావు స్వయానా సోదరులు. సత్యనారాయణరావు లచ్చంమల కుమార్తె వినోద ను విద్యాసాగరరావు వివాహం చేసుకున్నారు. చేన్నాడి హన్మంతరావు-శాంతమ్మల కుమారుడైన చేన్నాడి మార్తాండరావు కుమార్తె డాక్టర్ మాధవిని వినోద్ కుమార్ పెళ్లి చేసుకున్నారు. ఇలా ఒకే కుటుంబం నుంచి వచ్చిన ఈ ఇద్దరు అల్లుళ్ళు, కరీంనగర్ ఏమ్పీలుగా ఎన్నిక కావడం యాదృచ్చికం చెన్నమనేని విద్యాసాగర్ రావు 1998-99,1999-2004… ఈ రెండు పర్యాయాలు భాజపా నుంచి కరీంనగర్ ఎంపీగా గెలిచినా వినోద్ కుమార్ ఇప్పుడు మరోసారి బరిలో ఉంటున్నారు. వినోద్ కుమార్ కు విద్యాసాగర్ రావు వరుసకు బాబాయి అవుతారు .
* మోదీ మాటలు చెప్పి ఆకట్టుకుంటున్నారు – కేటీఆర్‌
మహబూబాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని నర్సంపేటలో టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఇవాళ రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. ఈ ఐదేళ్లలో రాష్ర్టానికి కేంద్రం చేసిందేమీ లేదన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ మాటలు చెప్పి ఆకట్టుకుంటున్నారు. కానీ పనులు చేయడం లేదన్నారు. పేదోళ్ల ఖాతాల్లో డబ్బులు వేస్తామని కేంద్రం చెప్పింది, కానీ డబ్బులు జమ చేయలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీకి 150 మించి సీట్లు వచ్చే పరిస్థితి లేదు. బయ్యారం ఉక్కు పరిశ్రమ నేటికి ఇంకా పెండింగ్‌లో ఉన్నది. టీఆర్‌ఎస్‌ ఎంపీలు గెలుస్తే ఏం అభివృద్ధి జరుగుతుందని కొందరు అంటున్నారు. 16 ఎంపీ సీట్లలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపిస్తే.. మన మాట చెల్లుతుంది. ఢిల్లీ పీఠం మీద ఎవరు ఉండాలో నిర్ణయించేది మనమే అవుతాం. మనకు రావాల్సిన నిధులను సాధించుకుంటాం అని కేటీఆర్‌ స్పష్టం చేశారు.
* విజయలక్ష్మీ, షర్మిలపై అనురాధ విమర్శలు
విజయలక్ష్మీ, షర్మిలపై టీడీపీ మహిళా నేత పంచుమర్తి అనురాధ విమర్శలు చేశారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ నుంచి షర్మిలకు ఎంత ప్యాకేజీ ముట్టిందని ప్రశ్నించారు. లోకేష్‌ గురించి దుర్భాషలాడటం తగదని హితవు పలికారు. విజయలక్ష్మీ, షర్మిల పోటీ చేయడానికి పనికిరారన్నారు. ఎదుటివారిపై బురదజల్లేందుకు మాత్రమే పనికొస్తారని దుయ్యబట్టారు. వైఎస్‌ హయాంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ లేక.. దళిత బాలికలు ఆత్మహత్యలు చేసుకున్నారని గుర్తుచేశారు.
* అమిత్‌షా నామినేషన్ దాఖలు
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా గుజరాత్‌లోని గాంధీనగర్ నియోజకవర్గం నుంచి శనివారంనాడు నామినేషన్ దాఖలు చేశారు. దీనికి ముందుకు నాలుగు కిలోమీటర్ల మేర ఆయన రోడ్ షో నిర్వహించారు. అమిత్‌షా నామినేషన్ దాఖలు చేసిన సమయంలో ఆయన వెంట కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, గుజరాత్ సీఎం విజయ్ రూపానీ, శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే ఉన్నారు.
* 6నెలల్లో 3లక్షల ఉద్యోగాలు భర్తీ: పవన్‌
రాయలసీమ నుంచి వలసలు నివారించి యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడమే తమ ధ్యేయమని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ అన్నారు. కర్నూలు జిల్లా నంద్యాలలో పవన్‌ రోడ్‌షో నిర్వహించారు. బొమ్మల సత్రం ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి అభిమానులు, జనసేన కార్యకర్తలతో సంజీవనగర్‌ మీదుగా శ్రీనివాస్‌ సెంటర్‌కు చేరుకొని ప్రసంగించారు. రాయలసీమ అంటే ఫ్యాక్షన్‌ ముద్ర కాకుండా రతనాల సీమగా మార్చేందుకు అందరూ నాంది పలకాలన్నారు. జనసేన అధికారంలోకి వస్తే 18 నెలల్లో సాగునీటి కష్టాలు తీరుస్తామని.. 6 నెలల్లో తాగునీటి కష్టాలు లేకుండా చేస్తామని పవన్‌ హామీ ఇచ్చారు.
* మూడు నెలల్లో రాష్ట్రంలో విపరీతమైన మార్పులు
అధికారం, అహంకారంతో విర్రవీగే వాళ్లకు ప్రజలే గుణపాఠం చెబుతారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ప్రజలు సాగునీరు, తాగునీరు కోరుకుంటుంటే అవి ఇవ్వకుండా ఆదాయం కోసం మద్యం దుకాణాలు ఎక్కడికక్కడ నెలకొల్పుతున్నారని విమర్శించారు. ‘‘తెరాస చెబుతున్నట్లు ఇది సారు.. కారు.. సర్కారు కాదు. బారు.. బీరు.. సర్కారు’’ అని ఎద్దేవాచేశారు. ఈ మేరకు ఆయన భాజపా రాష్ట్ర కార్యాలయంలో శనివారం మీడియాతో మాట్లాడారు.
* మోదీకి వ్యతిరేక పవనాలు: కనకమేడల
దేశ వ్యాప్తంగా మోదీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని, యూపీలో సైతం ప్రజలు చాలా అసంతృప్తితో ఉన్నారని తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్‌ అన్నారు. యూపీలో గత ఎన్నికల్లో ముస్లింలను మభ్యపెట్టి ఎక్కువ సీట్లు సాధించారని చెప్పారు. అమరావతిలో కనకమేడల మీడియాతో మాట్లాడారు. ‘‘ఇప్పటికే యూపీలో ఎస్పీ, బీఎస్పీ జట్టుకట్టాయి. బిహార్‌లో నితీశ్‌ కుమార్‌తో భాజపా కూటమి కట్టినా ఆ పొత్తుపై అంత నమ్మకం లేదు.
* టీడీపీకి కేంద్ర మాజీ మంత్రి రాజీనామా
ఎన్నికల ముంగిట ఆంధ్రప్రదేశ్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. అధికార తెలుగుదేశం పార్టీకి కేంద్ర మాజీ మంత్రి సాయి ప్రతాప్ రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన రాజీనామా లేఖను పార్టీ కార్యాలయానికి పంపారు. ఇందులో.. టీడీపీలో తనకు సుముచిత స్థానం కల్పించి గౌరవించినందుకు సాయి ప్రతాప్ చంద్రబాబుకు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. గతంలో రాజంపేట లోక్‌సభ స్థానం నుంచి పలుమార్లు గెలుపొందిన ఆయన కాంగ్రెస్ హయాంలో కేంద్ర మంత్రిగా పని చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరొందిన సాయి ప్రతాప్.. ఆ మధ్య తెలుగుదేశం పార్టీలో చేరారు.
* నిరుద్యోగ భృతికి జగన్‌ మోకాలడ్డు: యనమల
నిరుద్యోగ యువతకు ఇచ్చే భృతికి కూడా జగన్ మోకాలడ్డుతున్నారని మంత్రి యనమల విమర్శించారు. పెంచిన రూ.2 వేలు యువతకు అందకుండా వైకాపా కుట్రలు చేస్తోందన్నారు. పాత స్కీముకు కూడా ప్రతిపక్షం అడ్డంకుల పెడుతోందని చెప్పారు. అలాంటి పార్టీకి యువతరం బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. పసుపు-కుంకుమ చెల్లింపునకు కూడా జగన్ అడ్డంకులు గురిచేస్తు్న్నారని మండిపడ్డారు.
* మోదీపై బీఎస్‌ఎఫ్‌ జవాన్‌ పోటీ
ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తర ప్రదేశ్‌లోని వారణాసి లోక్‌సభ స్థానం నుంచి మరోసారి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈసారి మోదీపై ఓ మాజీ బీఎస్‌ఎఫ్‌ జవాన్‌ పోటీకి దిగారు. పాకిస్తాన్‌-భారత్‌ సరిహద్దుల్లో పహరా కాస్తున్న బీఎస్ఎఫ్ జవాన్లకు నాణ్యత లేని ఆహారం సరఫర చేస్తున్నారంటూ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసి సంచలనం రేపిన బీఎస్‌ఎఫ్‌ జవాన్ తేజ్ బహదూర్ యాదవ్ వారణాసి నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. చాలా రాజకీయ పార్టీలు తనను వారణాసి నుంచి పోటీ చేయాలని కోరాయని, కాని తాను స్వతంత్ర అభ్యర్థిగానే ఎన్నికల్లో ప్రధానిపై పోటీ చేస్తాని తేజ్ బహదూర్ తెలిపారు.
* నల్లగొండలో కాంగ్రెస్‌ పార్టీకి భారీ షాక్‌
నల్లగొండ శాసనసభ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీకి భారీ షాక్‌. ఈ నియోజకవర్గంలోని కాంగ్రెస్‌ నేతలందరూ టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. విద్యాశాఖ మంత్రి జగదీష్‌ రెడ్డి సమక్షంలో డీసీసీబీ డైరెక్టర్‌, తిప్పర్తి మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు సంపత్‌ రెడ్డి, మాజీ సర్పంచ్‌ చింతకుంట్ల రవీందర్‌ రెడ్డి, అంతయ్యగూడెం సర్పంచ్‌ సిరిగిరి వెంకట్‌రెడ్డితో పాటు పలువురు టీఆర్‌ఎస్‌లో చేరారు. వీరందరికి మంత్రి జగదీష్‌ రెడ్డి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌ రెడ్డి, నల్లగొండ పార్లమెంట్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వేమిరెడ్డి నర్సింహారెడ్డితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.
* డీఎంకే నేత ఇంట్లో ఐటీ సోదాలు
ద్ర‌విడ మున్నేత్ర క‌జ‌గం(డీఎంకే) కోశాధికారి దురై మురుగ‌న్ నివాసాల్లో ఇవాళ ఆదాయ‌ప‌న్నుశాఖ అధికారులు సోదాలు నిర్వ‌హిస్తున్నారు. వెల్లోర్ జిల్లాలోని కాట్పాడిలో ఈ త‌నిఖీలు జ‌రుగుతున్నాయి. శుక్ర‌వారం రాత్రి 10.30 డీఎంకే నేత ఇంటికి వ‌చ్చిన అధికారులు శ‌నివారం కూడా సోదాలు చేస్తూనే ఉన్నారు. మురుగ‌న్ కుమారుడు కాతిర్ ఆనంద్ ఈసారి వెల్లోర్ నుంచి లోక్‌స‌భ‌కు పోటీ చేస్తున్నారు. ఐటీ శాఖ ఉద్యోగులు అయిదు బృందాలుగా మారి సోదాలు చేస్తున్నారు. గురువారం ఐటీ శాఖ అధికారులు క‌ర్నాట‌క మంత్రి పుట్ట‌రాజు ఇంట్లో కూడా త‌నిఖీలు చేశారు.
*ప్రచార బాద్యతల నుంచి వైదొలిగినా ప్రశాంత్ కిషోర్
మరో రెండు వారాలలోపే లోక్ సభ తొలిదశ ఎన్నికలు జరగనున్న తరుణంలో బీహార్ అధికార జనతా దళ్ – యునైటెడ్ లో ముసలం ఏర్పడింది. ఆ పార్టీ ఉపాధ్యక్షుడు, రాజకీయ వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్ నిర్వహణ ప్రచార బాద్యతల నుంచి వైదొలిగారు శుక్రవారం ఈ మేరకు ఆయన ట్విట్ చేశారు. జేడీయు నేత, రాజ్యసభ సభ్యుడు రాం చంద్ర ప్రసాద్ సింగ్ ఈ బాద్యతలు చూస్తారని పేర్కొన్నారు. ఇది పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అయింది. పార్టీలో ఎటువంటి కీలక బాద్యతలు అప్పజేప్పక పోవడం పై కిషోర్ కినుకు వహించినట్లు చెబుతున్నారు. రాజకీయంగా తోలి అడుగులు వేస్తున్నందున పార్టీలో తన పాత్ర కేవలం నేర్చుకోవడానికి సహకారం అందించడానికి మాత్రమే పరిమితమవుతుందని ఆయన చెప్పారు. మహాకూటమి నుంచి తప్పుకున్న నితీష్ కుమార్ ఎన్డీఏ లోకి వెళ్ళే కన్నా తాజాగా ప్రజాతీర్పు కోరి ఉండాల్సిందని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో తీవ్ర దుమారాన్ని రేపాయి.
*అన్న విన్నారు… ఆదుకున్నారు!-లక్కిరెడ్డిపల్లెలో పింఛన్ల పథకం ప్రకటన
పండుటాకులు, వితంతువుల జీవితాల్లో వెలుగుపూలు పూయిస్తోన్న పింఛను పథకానికి నాంది ప్రస్తావన ఎక్కడ జరిగిందో తెలుసా… కడప జిల్లాలోని లక్కిరెడ్డిపల్లెలో. మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావును కదిలించిన అలనాటి పరిస్థితులు ఇందుకు ప్రాతిపదికలయ్యాయి. ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీని స్థాపించిన రోజులవి. 1983 ఎన్నికల ప్రచారంలో భాగంగా లక్కిరెడ్డిపల్లెకు వెళ్తున్నారు. చైతన్యరథంలో ఆయనతో పాటు లక్కిరెడ్డిపల్లె నియోజకవర్గ (తర్వాతికాలంలో ఈ స్థానం రద్దయింది) తెదేపా అభ్యర్థి ఆర్‌.రాజగోపాల్‌రెడ్డి ఉన్నారు. వృద్ధులు, వితంతువుల బాగోగులను పిల్లలు పట్టించుకోవడం లేదని, కరవు ప్రాంతంలో వారి బతుకులు దయనీయంగా ఉన్నాయని, ఐదు వేళ్లు వారి నోటిలోకి వెళ్లాలంటేనే కష్టంగా ఉందని, ప్రతినెలా ఎంతో కొంత పింఛనుగా ఇచ్చి ఆదుకుంటే బాగుంటుందని… ఎన్టీఆర్‌కు రాజగోపాల్‌రెడ్డి వివరించారు. ఈ మాటలు విన్న ఎన్టీఆర్‌ కదిలిపోయారు… ఆలోచనలో పడ్డారు. ఆ తర్వాత అక్కడ నిర్వహించిన సభలో ఎన్టీఆర్‌ మాట్లాడుతూ… తాను అధికారంలోకి వస్తే వృద్ధులు, వితంతువులకు పింఛను ఇస్తామని, వారి జీవితాలను బాగు చేస్తామని ప్రకటించారు. ఆయన అధికారంలో వచ్చారు. ఆయన మంత్రివర్గంలో రవాణా, వ్యవసాయ, పాడి, మత్స్యశాఖల బాధ్యతలను ఆర్‌.రాజగోపాల్‌రెడ్డి చూశారు. ప్రచారంలో హామీ ఇచ్చిన మేరకు ఎన్టీఆర్‌ నెలకు రూ.30 పింఛన్‌ ప్రకటించారు. రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాక దాన్ని రూ.50 చేశారు. 1995లో చంద్రబాబు సీఎం అయిన తర్వాత పింఛను మొత్తం రూ.75కు పెరిగింది. ఆ తర్వాత కాంగ్రెస్‌ హయాంలో రూ.200 ఉన్న పింఛన్‌ను… చంద్రబాబు 2014లో రూ.1,000కి, 2019లో రూ.2,000కు పెంచారు. ప్రస్తుతం ఎన్నో కుటుంబాలకు ఆ సొమ్ము భరోసా ఇస్తోంది.
*అమ్మమ్మ ఊర్లో ఉత్తమ్‌ సందడి
టీపీసీసీ అధ్యక్షుడు, కాంగ్రెస్‌ పార్టీ నల్గొండ ఎంపీ అభ్యర్థి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం దేవరకొండ నియోజకర్గంలో పర్యటించారు. దేవరకొండ మండలం కమలాపూర్‌ గ్రామంలోని తన అమ్మమ్మ ఇంట్లో సందడి చేశారు. తన తల్లిదండ్రులు పురుషోత్తంరెడ్డి, సువర్ణమ్మలతో కలిసి.. తాత తుమ్మలపల్లి చల్మారెడ్డి, అమ్మమ్మ హాల్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.
*రాజకీయం’ కోసమే హిందూత్వ ఉగ్రవాద ముద్ర
కాంగ్రెస్‌ పార్టీ తన రాజకీయ ప్రయోజనాల కోసం తప్పుడు సాక్ష్యాధారాల ఆధారంగా మొత్తం హిందువులందరిపైనా హిందూత్వ ఉగ్రవాదమనే ముద్రను వేసినట్లు భాజపా ఆరోపించింది. హిందూ ఉగ్రవాదమనే రాజకీయ కుట్రను సుస్థిరం చేసే దిశగానే సంఝౌతా పేలుడు ఘటనలో దర్యాప్తు సాగినట్లు ఆ కేసులో వెలువడిన తీర్పు స్పష్టం చేసిందని పేర్కొంది. భాజపా సీనియర్‌ నేత, కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ శుక్రవారం రక్షణమంత్రి నిర్మలాసీతారామన్‌, మరోనేత అనిల్‌ బలూనితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
*జగన్‌కు ఒక్కసారి అవకాశమివ్వండి
ఎన్నికల్లో విలువలకు, విశ్వసనీయతకు పట్టం కట్టాలని వైకాపా గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారానికి వెళ్లే ముందు… శుక్రవారం ఆమె కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్‌ఆర్‌ ఘాట్‌ను సందర్శించి నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ… ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తారో చెప్పే స్థితిలో లేరన్నారు. ఇన్నాళ్లూ జగన్‌ నామజపం చేస్తున్నారే తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. వైఎస్‌ఆర్‌ పాలన రావాలంటే అది జగన్‌తోనే సాధ్యమని తెలిపారు. తెదేపా అరాచకాలకు దీటైన జవాబు చెప్పాలన్నా, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. ‘‘ప్రజలందరికీ చేతులెత్తి నమస్కరించి చెబుతున్నా… ఒక్కసారి జగన్మోహన్‌రెడ్డికి అవకాశం ఇవ్వండి’’ అని విజయమ్మ కోరారు.
*వారణాసికి మోదీ చేసిందేమిటి!
లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని మోదీపై పోటీకి సైతం వెనుకాడేదిలేదని పరోక్షంగా తెలిపిన కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా వాద్రా వారణాసి బరిలో దిగేందుకు సుముఖంగానే ఉన్నట్లు బలమైన సంకేతాలను ఇచ్చారు. శుక్రవారం అయోధ్యలో పర్యటించిన ఆమె… మోదీ ప్రాతినిధ్యం వస్తున్న వారణాసిలో అభివృద్ధిలేమికి సంబంధించి విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రపంచమంతా చుట్టి వస్తున్న మోదీ తన సొంత నియోజకవర్గ ప్రజల సమస్యలను పట్టించుకోలేదని ధ్వజమెత్తారు.
*ఓటమి భయంతో ప్రధానికి వణుకు
‘సూర్యోదయాన్ని ఇస్తారని నమ్మి మోసపోయాం. అందుకే మీ పార్టీని అస్తమించేలా చేసేందుకు దేశ వ్యాప్తంగా ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడిన పార్టీలన్నీ ఏకమయ్యాయి. ఈ సఖ్యత చూసి మీకు ఓటమి భయంతో వణుకుపుడుతోంది’ అని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు, మంత్రి కళా వెంకటరావు ప్రధాని మోదీకి శుక్రవారం రాసిన బహిరంగ లేఖలో మండిపడ్డారు. కర్నూలు జిల్లా చరిత్రలో ప్రధాని హోదాలో వచ్చిన మొదటి వ్యక్తి నేను అని గొప్పలు చెప్పుకొంటున్నారు. కర్నూలు జిల్లా నంద్యాల నుంచి ప్రాతినిధ్యం వహించిన వ్యక్తిని ప్రోత్సహించి ప్రధానిని చేసిన చరిత్ర తెదేపాదని పేర్కొన్నారు. ‘
*కేసీఆర్‌, భాజపాతో పొత్తు లేదు
మంచికి చెడుకు మధ్య జరిగే పోరాటంలో మంచి వైపు నిలిచి జగన్మోహనరెడ్డికి ఒక్క అవకాశం ఇవ్వాలని వైకాపా రాష్ట్ర నాయకురాలు షర్మిల కోరారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో శుక్రవారం ఆమె బస్సుయాత్ర ప్రారంభించారు. మంగళగిరి జామియా మసీదు కూడలిలోనూ రాత్రి మాట్లాడారు. గత ఎన్నికల్లో చంద్రబాబు 600 హామీలనిచ్చి ఒక్కటీ నెరవేర్చలేదని.. రైతులు, చేనేత, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేయకుండా ఒక్కొక్కరికి రూ.1.20 లక్షలు బాకీ పడ్డారని వివరించారు. కేసీఆర్‌, భాజపాతో తమకు ఎలాంటి పొత్తు లేదని, సింహం ఒంటరిగానే పోటీ చేసి గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక చంద్రబాబు పాలన అక్రమాలను పరిశీలించి న్యాయం చేస్తారని తెలిపారు.
*పోటీలో ఉన్నది మా అభ్యర్థులు కాదు
ప్రజాశాంతి తరఫున నామపత్రాలు దాఖలు చేసి పోటీలో ఉన్న అభ్యర్థుల్లో చాలా మంది తమ అభ్యర్థులు కారని పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ తెలిపారు. శుక్రవారమిక్కడ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెదేపా, వైకాపాకు చెందిన వారు సిబ్బందిపై దాడిచేసి ప్రజాశాంతి బీఫారాలు ఎత్తుకెళ్లి అభ్యర్థులను నిలిపారన్నారు. తెదేపా 38 మందిని వైకాపా 11 మందిని అభ్యర్థులను నిలిపిందని ఆయన ఆరోపించారు. పలుచోట్ల ప్రజాశాంతి అభ్యర్థుల బీఫారాలు తిరస్కరించిన అధికారులు వైకాపా, తెదేపా వారు నిలిపిన వారిని అనుమతించారన్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా పార్టీకి నష్టం జరిగిందని, ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు వాయిదా వేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరానన్నారు. రూ.లక్షల కోట్ల అవినీతి చేశారని పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్న చంద్రబాబు, జగన్‌లు ఇద్దరూ తోడుదొంగలని ఆయన అభివర్ణించారు.
*మోదీ, కేసీఆర్‌ల పాలనకు చరమగీతం
కేంద్రంలో మోదీ పాలనకు, రాష్ట్రంలో కేసీఆర్‌ పాలనకు చరమగీతం పాడేందుకే వ్యూహాత్మకంగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయకుండా వ్యవహరించామని తెదేపా రాష్ట్రాధ్యక్షుడు ఎల్‌.రమణ పేర్కొన్నారు. కాంగ్రెస్‌ కోరిన మేరకు ఆ పార్టీకి మద్దతు ఇస్తున్నామని చెప్పారు. తెదేపా ఆవిర్భావ వేడుకలను హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ భవన్‌లో పార్టీ రాష్ట్ర శాఖ శుక్రవారం ఘనంగా నిర్వహించింది.
*11నే నిజామాబాద్‌లో పోలింగ్‌: ఎంపీ కవిత
లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్‌ 11నే జరుగుతాయని నిజామాబాద్‌ లోక్‌సభ తెరాస అభ్యర్థి, ఎంపీ కవిత ఓటర్లకు చెబుతున్నారు. శుక్రవారం నిజామాబాద్‌ జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆమె పలు సమావేశాల్లో మాట్లాడారు. ఎన్నికల బరిలో 185 మంది ఉండడంతో ఎన్నిక జరుగుతుందా? వాయిదా పడుతుందా? అనేది ప్రస్తుతం జిల్లాఅంతటా చర్చ జరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకొని కవిత తన ఎన్నికల ప్రచారంలో మొదట నిర్ణయించిన దాని ప్రకారం ఏప్రిల్‌ 11న పోలింగ్‌ ఉంటుందని ఓటర్లకు గుర్తు చేస్తున్నారు. అది కూడా బ్యాలెట్‌ రూపంలో ఉంటుందని చెబుతున్నారు.
*రేపు ఏపీకి రానున్న రాహుల్‌ గాంధీ
ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆదివారం విజయవాడ రానున్నారని కేంద్ర మాజీ మంత్రి పళ్లంరాజు తెలిపారు. స్థానిక అజిత్‌సింగ్‌ నగర్‌లోని మాకినేని బసవపున్నయ్య మైదానంలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచారసభలో ఆయన పాల్గొంటారని వివరించారు. ఏపీకి ప్రత్యేకహోదాపై రాష్ట్ర ప్రజలకు మరోసారి భరోసా ఇచ్చేందుకే రాహుల్‌ రాష్ట్రానికి వస్తున్నారన్నారు. శుక్రవారం ఆంధ్రరత్న భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పళ్లంరాజు మాట్లాడారు. కేంద్ర ఎన్నికల సంఘం, సీబీఐ వంటి స్వతంత్ర వ్యవస్థల ప్రతిష్ఠను ప్రధాని నరేంద్ర మోదీ దిగజార్చారని, ఇటీవల జరిగిన పరిణామాలే ఇందుకు నిదర్శనమని ఆయన విమర్శించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మోదీపై వ్యతిరేకత పెరిగిపోయిందని, వచ్చే ఎన్నికల్లో ఆయన ఓటమి ఖాయమని పళ్లంరాజు అభిప్రాయపడ్డారు.
*నాలోనూ సీమ పౌరుషం
‘జనసేన, తెదేపాకు పొత్తు ఉందంటున్నారు. మరి అమిత్‌షా, తెరాసతో జగన్‌ భాగస్వామ్యాన్ని ఏమనాలి? రాయలసీమ ప్రాంతానికి చెందిన వాడిని కానప్పటికీ నాకూ సీమ పౌరుషం ఉంది. ఆ పౌరుషాన్ని రెచ్చగొట్టవద్దు. మాట్లాడే ముందు ఆచితూచి మాట్లాడు’ అని జగన్‌కు జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ హితవు పలికారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఆయన కర్నూలు జిల్లా నంద్యాల, ఆదోని, నందికొట్కూరు పట్టణాల్లో పర్యటించారు.
*కేసీఆర్‌ ప్రధాని కావాలని దేశం కోరుకుంటోంది
ఈ ఎన్నికల తర్వాత దేశ రాజకీయాలు మారబోతున్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ జోస్యం చెప్పారు. దిల్లీపై గులాబీజెండా ఎగురబోతోందన్నారు. కేసీఆర్‌ లాంటి నాయకుడు ప్రధాని కావాలని యావత్తు దేశం కోరుకుంటుందన్నారు. మల్కాజిగిరి, సికింద్రాబాద్‌, చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గాలకు సంబంధించిన ప్రచార సభను శుక్రవారం సాయంత్రం ఇక్కడ ఎల్బీ స్టేడియంలో నిర్వహించారు.
*మాజీ మంత్రి హరీశ్‌కు తప్పిన ప్రమాదం
మెదక్‌ జిల్లా తూప్రాన్‌లో శుకవ్రారం రాత్రి నిర్వహించిన తెరాస ఎన్నికల ప్రచారంలో ప్రముఖ నాయకులకు ప్రమాదం తప్పింది. 8 గంటల సమయంలో తూప్రాన్‌ పురపాలక కార్యాలయం వద్ద ప్రచారరథం నుంచి మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రసంగిస్తున్న సమయంలో అదే ప్రచార రథం జనరేటర్‌లో పొగలు వ్యాపించి డీజిల్‌ లీకేజీతో మంటలు చెలరేగాయి. ప్రమాదానికి రెండు నిమిషాల ముందు ప్రచార రథానికి సంబంధించిన విద్యుత్తు లైట్లు నిలిచిపోయాయి. డీజిల్‌ అయిపోవడంతో అలా జరిగిందని అంతా భావించారు.
*ఎన్నికల విధుల్లో ఉండగా అపవాదులా!
తన భూమిని వేరొకరి పేరుపై పట్టా చేశారంటూ శరత్‌ అనే యువకుడు ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్టు.. ఈ సందర్భంగా సీఎం వ్యాఖ్యలు ఇప్పుడు ప్రభుత్వానికి, రెవెన్యూ ఉద్యోగులకు మధ్య వివాదాన్ని రాజేశాయి. రెవెన్యూ ఉద్యోగులపై అపవాదు మోపారంటూ రెవెన్యూ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. శుక్రవారం కరీంనగర్‌, పెద్దపల్లి, మంచిర్యాలతోపాటు పలు జిల్లాల్లో రెవెన్యూ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమ సంఘం(ట్రెసా) అధ్యక్ష, కార్యదర్శులు రవీందర్‌రెడ్డి, నారాయణరెడ్డిల ఆధ్వర్యంలో వివిధ సంఘాలు సమావేశమై పలు నిర్ణయాలు తీసుకున్నాయి.
*16వ లోక్‌సభలో.. 146 మంది వ్యవసాయదారులే
ప్రస్తుతం గడువు తీరనున్న 16వ లోక్‌సభకు ఎన్నికైన వారిలో 146 మంది సభ్యులు తమ వృత్తిని వ్యవసాయం, వ్యవసాయ సంబంధితంగా చూపారు. ఆ తర్వాత స్థానంలో సామాజిక కార్యకర్తలు 89 మంది ఉన్నారు. వ్యాపారులు 72 మంది, న్యాయవాదులు 54 మంది, రాజకీయ సామాజిక కార్యకర్తలు 38, వైద్యులు 27, పారిశ్రామికవేత్తలు 5 మంది, రైతులు ఏడుగురు ఉన్నారు. అతి తక్కువగా చార్టర్డ్‌ అకౌంటెంట్‌, వ్యూహకర్త, క్రీడాకారులు ఒక్కొక్కరే ఉన్నారు. మిగతా సభ్యులు వివిధ వృత్తుల వారు ఉన్నారు.
*ప్రచార సామగ్రి @ కేరళ ఫ్యాన్సీ
భారత్‌లో ఎన్నికలకు పర్యాయపదంగా ‘ఓట్ల పండగ’ అని చెబుతుంటాం. కేరళలోని ఓ దుకాణానికి వెళితే.. ఎన్నికలను ఓట్ల పండగ అనడం సబబే అనిపిస్తుంది. వేర్వేరు రాజకీయపార్టీల జెండాలు, గుర్తులు, ఇతర ప్రచార సామగ్రితో అక్కడంతా రంగులమయంగా ఉండడమే ఇందుకు కారణం. కేరళలోని త్రిశూర్‌ జిల్లా పుత్తేన్‌పల్లిలోని ఓ దుకాణం ఎప్పుడు ఎన్నికలు వచ్చినా.. కిటకిటలాడుతూ కనిపిస్తుంది. జమాల్‌ అనే వ్యక్తి 30 ఏళ్లుగా ‘కేరళ ఫ్యాన్సీ’ పేరుతో ఈ దుకాణంలో.. వివిధ పార్టీల ప్రచార సామగ్రిని విక్రయిస్తున్నారు.
*నిజామాబాద్‌లో భారీ ఈవీఎంలు
నిజామాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గానికి 185 మంది పోటీ పడుతుండడంతో ఇక్కడ ఎన్నిక ఏ పద్ధతిలో నిర్వహించాలన్న విషయమై శుక్రవారానికి కూడా స్పష్టత రాలేదు. బ్యాలెట్‌ పత్రం ద్వారా నిర్వహించాలా? దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ఆధునిక యంత్రాలను తెచ్చి ఎన్నిక నిర్వహించాలా? అన్న అంశంపై అధికారులు మల్లగుల్లాలు పడుతూనే ఉన్నారు. ఇక్కడ పోటీ చేస్తున్నవారిలో ఎక్కువ మంది పసుపు, ఎర్రజోన్నల రైతులన్న విషయం తెలిసిందే.
*పాలనను కేసీఆర్‌ గాలికొదిలేశారు
శాసనసభ ఎన్నికలు ముందుగా జరగాలని ఎవరో జ్యోతిషుడు చెప్పారట. లోక్‌సభతో పాటు తెలంగాణ ఎన్నికలు జరిగితే మోదీ కŸరిష్మాతో ఆ పార్టీ లోక్‌సభతో పాటు శాసనసభ ఎన్నికల్లో కూడా మునిగిపోతుందని సలహా ఇచ్చారట. ఏప్రిల్‌, మే సమయంలో మోదీ అంటే భయంతో శాసనసభ ఎన్నికలను ముందుకు జరిపారు. ఈ రాష్ట్ర భవిష్యత్తును తెలంగాణ ప్రజలు నిర్ణయిస్తారా? జ్యోతిషుడు నిర్ణయిస్తారా? దేశరక్షణ, సమృద్ధి, గౌరవం ఇవి అభివృద్ధికి పునాదులుగా గౌరవించే కాపలాదారు ఓవైపు. మరోవైపు నాయకుడు ఎవరో తెలియదు.. నీతి అసలే లేదు. ఇక వారి సంకల్పం, నిబద్ధత గురించి ఈ దేశంలో ప్రజలందరికీ తెలిసిందే. వారు కుటుంబం కోసమే ఆలోచిస్తుంటారు. పేదలు, దళితులు, పీడితుల అభివృద్ధి గురించి ఎన్నడూ మాట్లాడరు
*ఎన్నికల తరువాత భాజపా దుకాణం బంద్‌
తాజా సమాచారం ప్రకారం ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో జాతీయ పార్టీలైన భాజపాకు 150కి మించి సీట్లు రావు. కాంగ్రెస్‌ సీట్లు 100కు మించవు. ఎన్నికల తర్వాత కేంద్రంలో అధికారంలోకి వచ్చేది ప్రాంతీయ పార్టీల కూటమైన ఫెడరల్‌ ఫ్రంట్‌ మాత్రమే .ఓట్లు, అధికారం కోసం దేశ ప్రధాని మోదీ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. భాజపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ అయిదేళ్లలో దేశంలోని రైతులు, దళిత, గిరిజన, మైనార్టీ, బలహీన వర్గాల(బీసీ)కు చేసిందేమీ లేదు. ఎన్నికల తర్వాత ఆ పార్టీని శంకరగిరి మాన్యాలు పట్టిస్తాను.
*పాలనను కేసీఆర్‌ గాలికొదిలేశారు
శాసనసభ ఎన్నికలు ముందుగా జరగాలని ఎవరో జ్యోతిషుడు చెప్పారట. లోక్‌సభతో పాటు తెలంగాణ ఎన్నికలు జరిగితే మోదీ కŸరిష్మాతో ఆ పార్టీ లోక్‌సభతో పాటు శాసనసభ ఎన్నికల్లో కూడా మునిగిపోతుందని సలహా ఇచ్చారట. ఏప్రిల్‌, మే సమయంలో మోదీ అంటే భయంతో శాసనసభ ఎన్నికలను ముందుకు జరిపారు. ఈ రాష్ట్ర భవిష్యత్తును తెలంగాణ ప్రజలు నిర్ణయిస్తారా? జ్యోతిషుడు నిర్ణయిస్తారా? దేశరక్షణ, సమృద్ధి, గౌరవం ఇవి అభివృద్ధికి పునాదులుగా గౌరవించే కాపలాదారు ఓవైపు. మరోవైపు నాయకుడు ఎవరో తెలియదు.. నీతి అసలే లేదు. ఇక వారి సంకల్పం, నిబద్ధత గురించి ఈ దేశంలో ప్రజలందరికీ తెలిసిందే.
*సభ్యత్వాల రద్దుకు పోరాటం
తెరాసలో చేరుతున్నట్లు ప్రకటించిన పది మంది ఎమ్మెల్యేల సభ్యత్వాలు రద్దయ్యేలా పోరాటం చేయాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది. పూర్తి ఆధారాలతో శాసనసభ సభాపతిని కలసి అనర్హతవేటు వేయాలని పిటిషన్‌ అందజేస్తారు. సీఎల్పీ నేత భట్టివిక్రమార్క ఆధ్వర్యంలో శుక్రవారం ఇందుకోసం ప్రయత్నించగా సభాపతి అసెంబ్లీలో లేరు. శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యులను కలిశారు. నిబంధనల మేరకు అనర్హత పిటిషన్‌ను సభాపతికే ఇవ్వాలి. త్వరలో ఆయన అపాయింట్‌మెంట్‌ తీసుకుని అనర్హత పిటిషన్‌ అందచేస్తారు.
*బాబు ఎవరికి భద్రత ఇచ్చారు?
‘ఐదేళ్ల పాలనలో చంద్రబాబు ఎవరికి భద్రత ఇచ్చారు? ఇసుక మాఫియాను అడ్డుకున్న మహిళా అధికారిని జుట్టు పట్టి ఈడ్చుకెళితే అధికారికి మద్దతిచ్చారా? లేదా ఆ ఎమ్మెల్యేపై కేసులు లేకుండా మద్దతిచ్చారా? విజయవాడలో కాల్‌మనీ వ్యవహారంలో బాధితురాళ్లకు మద్దతిచ్చారా? తెదేపా వారికా? ప్రతివారు భద్రంగా దాచుకునే ఆధార్‌, బ్యాంకు ఖాతాలను సేవామిత్ర యాప్‌ పేరుతో ప్రైవేటు కంపెనీలు, జన్మభూమి కమిటీల చేతుల్లో పెట్టారు.. చివరకు రాష్ట్ర ప్రజలకు భద్రత ఇచ్చారా? లేదా కొడుకు లోకేశ్‌కా?’ అని వైకాపా అధినేత జగన్మోహన్‌రెడ్డి ప్రశ్నించారు.
*‘గుర్తు’కొస్తున్నాయి..!-వైకాపాను కలవరపెడుతున్న హెలీకాప్టర్‌
జిల్లాలో పెనమలూరు నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇద్దరు అభ్యర్థుల పేర్లు ఒకటే కావడం, వారికి కేటాయించిన గుర్తులు సారూప్యాన్ని కలిగి ఉండటం చర్చనీయాంశంగా మారింది. 1999 ఎన్నికల్లోనూ ఇలాంటి పరిస్థితే ఎదురైందని పలువురు నెమరు వేసుకుంటున్నారు. పెనమలూరు వైకాపా అభ్యర్థిగా కొలుసు పార్థసారథి పోటీ చేస్తున్న విషయం విదితమే. అలాగే ప్రజాశాంతి పార్టీ అభ్యర్థిగా వేమూరి పార్థసారథి రంగంలో ఉన్నారు. ఈ రెండు పార్టీల అభ్యర్థుల ఇంటి పేరు వేరైనా ప్రధాన నామధేయం మాత్రం ఒక్కటే కావడం గమనార్హం.
*మా బీ ఫారాలు తెదేపా, వైకాపా వారు ఎత్తుకెళ్ళారు
ప్రజాశాంతి తరఫున నమపత్రాలు దాఖలు చేసి పోటీలో ఉన్న అభ్యర్ధుల్లో చాలా మంది తమ అభ్యర్ధులుకరణి పార్టీ అద్యక్షుడు కేఏ పాల్ తెలిపారు. శుక్రవరమిక్కడ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెదేపా, వైకాపకు చెందిన వారు సిబ్బంది పై దాడి చేసి ప్రశాంతి బీ ఫారాలు ఎత్తుకెళ్ళి అభ్యర్ధులను నిలిపారని అన్నారు. తెదేపా 38 మందిని, వైకాపా పదకొండు మందిని అభ్యర్ధులను నిలిపిందని ఆయన ఆరోపించారు. పలుచోట్ల ప్రజాశాంతి అభ్యర్ధులు బీ ఫారాలు తిరస్కరించిన అధికారులు వైకాపా, తెదేపా వారు నిపిన వారిని అనుమతించారని అన్నారు. అధికారులు వైకాపా తెదేపా వారు నిలిపిన వారిని అనుమతించారన్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా పార్టీకి నష్టం జరిగిందని, ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వాయిదా వేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరానన్నారు. రూ. లక్షల కోట్ల అవినీతి చేశారని పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్న చంద్రబాబు జగన్ లు ఇద్దరూ తోడూ దొంగలని ఆయన అభివర్ణించారు.

నవగ్రహాల విశిష్టత ఇది-తదితర ఆద్యాత్మిక వార్తలు

1.సూర్యుడు :
శ్రీ కశ్యప మహర్షికి దక్షుని పుత్రికయగు అదితికిని “వివస్వంతుడు (సూర్యుడు)” జన్మెంచెను
(ప్రభవ నామ సంవత్సర మాఘ మాస శుద్ద సప్తమి)
కశ్యపుని కొడుకు కనుక “కాశ్యపుడు” అని
అదితి కొడుకు కనుక “ఆదిత్యుడు” అని
అండమున మృతము లేనివాడు కనుక “మార్తాండుడు” అని నామములు వచ్చెను
సూర్యునకు సంజ్ఞాదేవికిని “వైవస్వతుడు” “యముడు” “యమున” లు జన్మించెను
సూర్యుని తీక్షతను భరించలేక సంజ్ఞాదేవి తన నీడను (ఛాయను) తనకు బదులుగా వెల్లి పుట్టింటికి వెల్లిపోయెను
తరువాత ఛాయకు “శని” భగవానుడు జన్మించెను
యముడు ధర్మరాజు అను నామముతో పితృలోకపాలకుడయ్యెను శని గ్రహ పదవిని పొందెను
వైవస్వతుడు రాబోవు మన్వంతరాలలో మనువు కాగలడు
2. చంద్రుడు :
అత్రి మహర్షి అనసూయల సంతానం
అత్రి మహర్షి తపస్సు చేయుచుండగా అతని వీర్యము భూమిపై పడెను సోమరూపైన వీర్యమును బ్రహ్మ లోక హితార్థమై తన రథమెక్కించుకొని భూమి చుట్టు ఇరవైఒక్క మారలు ప్రదక్షిణలు గావించెను ఆయన తేజస్సుచే జగదాధారభూతములైన సర్వౌషదులు మొలకెత్తెను
(నందన నామ సంవత్సర కార్తీక శుద్ద చతుర్థశి)
సోముని బ్రహ్మ భూమికి రాజును చేసెను
చంద్రుని పుత్రుడు బుధుడు
౩) కుజుడు :
శివుని నిండి వెలువడిన తేజము పార్వతీ దేవి గ్రహించి గర్భవతి అవగా ఆమే అఆ తేజమును భరింపలేక భూదేవికి ఇచ్చెను ఆమే ఆ తేజమును ధరింపగా “కుజుడు”(అంగారకుడు) జన్మించెను
(అక్షయ నామ సంవత్సరం వైశాఖ బహుళ విదియ)
రుద్రుని తేజము విష్ణువు సంరక్షణ భూదేవి ఓర్పు లభించినవాడు కనుక గ్రహమండలమున స్థానమునొందెను
4. బుధుడు :
సోమునకును రోహిని తారకు బుదుడు జన్మించెను
(సౌమ్య నామ సంవత్సరం భాద్రపద శుద్ద ఏకాదశి)
బుదునికి వైరజకిని పురూరవుడు జన్మించెను
5. బృహస్పతి :
సురూప ఆంగీరసులకు “బృహస్పతి” జన్మించెను
(సౌమ్య నామ సంవత్సరం ఆశ్వీయుజ శుద్ద ద్వాదశి)
ఇతని భార్య “తారాదేవి”
ఇతడిని దేవతలకు గురువుని చేసెను కనుక ఇతడిని
“గురుడు” అనెదరు
6. శుక్రుడు :
భృగు ప్రజాపతికిని ఉషనలకు సంతానం
“ఉశనుడు” జన్మించెను
(మన్మథ నామ సంవత్సరం శ్రావణ శుద్ద దశమి)
కుచేలుని ధనమును హరించుటచే పరమేశ్వరుడు కోపించి అతడిని చంపుటకు రాగా ఉశనుడు తన యోగ శక్తితో శివుని ఉదరమున ప్రవేశించెనుపరమేశ్వరుడు అతడినొ శిశ్నము ద్వార బయటకు విడిచెను అతడు శుక్రము రూపమున విసర్జింపబడెను కనుక అతడిని “శుక్రుడు” అనెదరుఅత్యంత మహా మంత్ర శక్తిని పోందినవాడు కనుక రాక్షసులు శుక్రుడిని వారి గురువుగా పొందిరి
నాటి నుండి “శుక్రచార్యునిగా” పెరుపొందెను
గ్రహమండలమున స్థానంపొందెను
7. శని :
సూర్యునికి ఛాయ దేవికిని కలిగిన సంతానమే “శని” ఇతని వృత్తాంతంము సూర్యుని వృత్తాంతమునందు చెప్పబడెను
(వికారి నామ సంవత్సరం మార్గశిర కృష్ణ నవమి)
ఇతడు మానవ జీవితాలలో అత్యంత ప్రభావము చూపువాడు
త్రిమూర్తుల సైతం ముప్పుతిప్పలు పెట్టినటువంటివాడు
గ్రహమండలమున స్థానం పొందెను
8. రాహువు :
కశ్యప మహర్షికి సింహికకును “రాహువు” జన్మించెను
ఇతడు రాక్షల లక్షణములు కలవాడు కనుక రాక్షసునిగా పరిగణిస్తారు(రాక్షస నామ సంవత్సరం కృష్ణ చతుర్థశి)
క్షీర సాగర మథనంలొ లబించిన అమృతాన్ని మహావిష్ణువు “మోహిని”అను రూపముతో పంచుతున్నపుడు రాహువు దేవతల రూపం దాల్చి అమృతమును గ్రహించెను సూర్యచంద్రులు చూసి విష్ణువుకి చెప్పగా తన చక్రముతో రాహువు తల ఖండించెను అమృత ప్రభావంతో తల మొండెము జీవముతో ఉండుటచేత పాము శరీరం అతకబడింది
9.కేతువు :
విష్ణువుచే ఖండింపబడిన రాహువు శరీరముకు పాము తల తగిలించి కేతువు అని నామం పెట్టిరిఇతని భార్య పేరు చిత్రలేఖరాహు కేతువులు ఇరువురు గ్రహమండలమున ఛాయగ్రహములుగా గుర్తింపునొందిరి…నవ గ్రహ దేవతల జన్మ వృత్తాంతములు చదివిన ఆపదలు తొలిగి మహా యశస్సు పొందెదరుఆయుష్యు ఆరోగ్యం సంకల్ప సాఫల్యము కలుగును
నవ గ్రహముల అనుగ్రహము కలిగి సర్వత్రా శుభమగును (అని బ్రహ్మ పురాణమందు చెప్పబడెను)
2. పుష్పశోభితం.. సుగంధభరితం
సంపెంగల సువాసన, మల్లెల గుబాళింపు, గులాబీల సోయగం, కనకాంబరాల కాంతులు, బంతిపూల రమణీయత, మందారాల మకరందం, కాకడాల వన్నె, సన్నజాజుల లాలిత్యం, చామంతుల చమక్కులు లక్ష్మీనారసింహునికి వినూత్న శోభ తెచ్చాయి.దాదాపు పద్దెనిమిది పైగా రకాల పూల పరిమళాలతో దేవేరుల సహిత శ్రీవారిని అర్చించారు. శ్రీఖాద్రీలక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో చివరి ఉత్సవంగా శుక్రవారం పుష్పయాగోత్సవం భక్తులకు నేత్రపర్వంగా సాగింది.. ఉత్సవంలో శ్రీదేవి, భూదేవి సమేత వసంత వల్లభులను వివిధ సుగంధ పుష్పాలతో అలంకరించారు.
3. సత్యదేవుని హుండీ ఆదాయం రూ.1.57 కోట్లు
అన్నవరం సత్యదేవుని దేవస్థానంలో గత 40 రోజులకు హుండీ ఆదాయం రూ.1.57 కోట్లు సమకూరింది. ఛైర్మన్‌ ఐ.వి.రోహిత్, ఈవో వి.త్రినాధరావుల సమక్షంలో హుండీ సొమ్మును శుక్రవారం లెక్కించారు. 263 గ్రాముల బంగారం, 1.055 కేజీల వెండి సమకూరిందన్నారు. అంతేకాకుండా యుఎస్‌ఏ, యుఏఈ, ఖతార్, ఆస్ట్రేలియా, మలేషియా, హాంకాంగ్, సింగపూర్‌ తదితర అనేక దేశాల కరెన్సీ నోట్లు కూడా వచ్చాయన్నారు. రద్దయిన పాత రూ.500 నోట్లు 46, రూ.వెయ్యి నోట్లు 6 వచ్చాయని అధికారులు వెల్లడించారు. ధర్మకర్తల మండలి సభ్యుడు కొత్త వెంకటేశ్వరరావు, ఆలయ సహాయ కమిషనర్‌ ఈరంకి జగన్నాథరావు తదితరులు పాల్గొన్నారు.
4. చురుగ్గా సీతారాముల కల్యాణ పనులు
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయంలో వచ్చే నెల 6 నుంచి కల్యాణ బ్రహ్మోత్సవాలు ఆరంభం కానుండటంతో ఇంజినీరింగ్‌ పనులు కొనసాగుతున్నాయి. ఏప్రిల్‌ 14న కల్యాణం ఉండగా దీనికి వారం రోజుల ముందే అన్ని పనులు పూర్తి చేయాలని భావిస్తున్నారు. కరకట్టపై ఉన్న రామాయణ విగ్రహాలకు రంగులను తీర్చిదిద్దడంతో పాటు వాటి మరమ్మతులను దాదాపు పూర్తి చేశారు. సౌమిత్రి సదనం వద్ద పార్కును పది రోజుల్లోగానే సుందరంగా ముస్తాబు చేయడానికి అన్ని చర్యలు చేపట్టారు. స్వాగత ద్వారాలకు అవసరమైన సామగ్రిని సిద్ధం చేసి తుది మెరుగులు దిద్దుతున్నారు. ఆలయం పడమర మెట్ల వైపున వెదురు తడికల పందిరి నిర్మాణ పనులు చేపట్టగా మాడ వీధుల్లో పూర్తిస్థాయిలో ఈ తరహా నీడను అందించే చర్యలు తీసుకోనున్నారు. గోదావరి తీరంలో చలువ పందిరిని నిర్మించనున్నారు. స్టేడియంతో పాటు మండపం వద్ద బారీకేడ్లను పరిశీలించి భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాల్సి ఉంది.
5. తిరుమల శ్రీవారి ఆలయంలో మార్చి 15వ తేదీన శ్రీరామ పట్టాభిషేకం అత్యంత వైభవంగా టిటిడి నిర్వహించనుంది. ముందురోజు ఏప్రిల్ 14వ తేది శ్రీరామనవమి పండుగ నేపథ్యంలో రాత్రి 7.00 నుండి 9.00 గంటల నడుమ శ్రీమలయప్ప స్వామివారు హనుమద్వాహనంపై మాడవీధులలో ఊరేగుతూ భక్తులను కటాక్షించనున్నారు.శ్రీరామ పట్టాభిషేక ప్రత్యేక కార్యక్రమాలుఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, తోమాలసేవ మరియు అర్చనను ఏకాంతంగా నిర్వహిస్తారు.రంగనాయకుల మండపంలో ఉదయం 9.00 నుండి 11.00 గంటల వరకు శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారికి, శ్రీ సీతారామ లక్ష్మణ సమేత హనుమంతులవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహిస్తారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంలతో అభిషేకం చేస్తారు.
6. చరిత్రలో ఈ రోజు/మార్చి 30
182 : ఈథర్ ను మత్తుమందుగా అమెరికన్ శస్త్రవైద్యుడు డా. క్రాఫోర్డ్ లాంగ్ మొదటిసారిగా ఉపయోగించాడు.
1867 : అలాస్కా ను రష్యా నుండి అమెరికా కొనుగోలు చేసింది.
1908 : సుప్రసిద్ధ భారతీయ నటి మరియు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత దేవికారాణి జననం (మ.1994).
1935 : ప్రముఖ తెలుగు సాహితీకారుడు తంగిరాల వెంకట సుబ్బారావు జననం.
1953 : ప్రముఖ స్వాతంత్ర్య పోరాట యోధుడు జమలాపురం కేశవరావు మరణం (జ.1908).
1983 : ప్రముఖ భారతీయ నటుడు నితిన్ జననం.
2002 : ప్రముఖ హిందీ సినీ గీత రచయిత ఆనంద్ బక్షీ మరణం (జ. 1930)
2005 : భారత దేశ రచయిత, కార్టూనిస్ట్ ఓ.వి.విజయన్ మరణం (జననం.1930).
2011 : ప్రఖ్యాత తెలుగు సినిమా హాస్యనటుడు మరియు ప్రతినాయకుడు నూతన్ ప్రసాద్ మరణం (జ.1945)
7. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
02 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులుసర్వదర్శనం భక్తులకు 02 గంటల సమయం పడుతుంది300 రూ ప్రత్యేక ప్రవేశం కలిగినవారికి 2 నుండి 3 గంటల సమయం పడుతుంది.నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 59,216నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య నిన్న స్వామివారి హుండీ ఆదాయం 3.76 కోట్లు
8. శుభమస్తు – నేటి పంచాంగం”
తేది : 30, మార్చి 2019
సంవత్సరం : విళంబినామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : ఫాల్గుణమాసం
ఋతువు : శిశిర ఋతువు
కాలము : శీతాకాలం
వారము : శనివారం{స్తిరవాసరే}
పక్షం : కృష్ణ (బహుళ) పక్షం
తిథి : దశమి
(ఈరోజు తెల్లవారుజాము 0 గం॥ 50 ని॥ నుంచి
మర్నాడు తెల్లవారుజాము 3 గం॥ 23 ని॥ వరకు)
నక్షత్రం : ఉత్తరాషాఢ
(నిన్న ఉదయం 12 గం॥ 44 ని॥ నుంచి
ఈరోజు సాయంత్రం 3 గం॥ 39 ని॥ వరకు)
యోగము : శివము
కరణం : వణిజ
వర్జ్యం : (ఈరోజు రాత్రి 8 గం॥ 11 ని॥ నుంచి ఈరోజు రాత్రి 9 గం॥ 59 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఈరోజు ఉదయం 8 గం॥ 28 ని॥ నుంచి ఈరోజు ఉదయం 10 గం॥ 15 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 7 గం॥ 50 ని॥ నుంచి ఈరోజు ఉదయం 8 గం॥ 39 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు ఉదయం 9 గం॥ 16 ని॥ నుంచి ఈరోజు ఉదయం 10 గం॥ 48 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు ఉదయం 6 గం॥ 12 ని॥ నుంచి ఈరోజు ఉదయం 7 గం॥ 44 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 52 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 3 గం॥ 24 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 6 గం॥ 12 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 28 ని॥ లకు
సూర్యరాశి : మీనము

నల్లద్రాక్ష సలపరాన్ని దూరం చేస్తుంది

ఉన్నట్టుండి నీరసంగా, కళ్లు తిరుగుతున్నట్లు అనిపించడం… ఈ వేసవిలో చాలామందికి ఎదురయ్యే సమస్యే. శరీరం బలహీనంగా ఉండటం, రక్తలేమి, విటమిన్ల లోపం, ఎండలో ఎక్కువగా తిరగడం వంటివన్నీ ఇందుకు కారణాలు. ఈ సమస్యల నుంచి బయటపడాలంటే ఏం చేయాలో చూద్దామా…సమయానికి ఆహారం తీసుకోవాలి. అలాగే రోజులో కనీసం 10 గ్లాసుల నీళ్లు తాగాలి. శరీరంలో ఆహారంతోపాటు నీటి శాతం తగ్గకూడదు. అలా తగ్గితే, కళ్లు తిరిగినట్లు అనిపిస్తుంది. గంటకోసారి గ్లాసు నీటిని తాగుతూ ఉంటే ఈ సమస్యకు దూరంగా ఉండొచ్చు. అప్పుడప్పుడు శరీరానికి విశ్రాంతి ఇస్తూ ఉండాలి. లేదంటే శరీరం త్వరగా అలసిపోతుంది. కొన్నిసార్లు నిద్రలేమితోనూ అలసటగా, ఒత్తిడిగా అనిపిస్తుంది. అప్పుడు కూడా విపరీతమైన నీరసం, కళ్లు తిరిగుతున్నట్లు ఉండటం వంటి సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి వేళకు, సరిపడా గంటలు నిద్రపోయేలా చూసుకోవాలి. ఒత్తిడిని అదుపులో ఉంచుకోవడం కూడా ముఖ్యమే.ఉసిరి రసం, అల్లం రసం, చక్కెర కప్పు చొప్పున తీసుకుని కలిపి మరిగించి పానీయంలా చేసి భద్రపరుచుకోవాలి.ప్రతిరోజూ రెండు పూటలా 30 మి.లీ పరిమాణంలో ఈ పానీయాన్ని తాగితే, నీరసం దరిచేరదు. అలాగే అరకప్పు పానీయంలో అరకప్పు మంచి నీటిని కలిపి తాగొచ్చు. ఇది తక్షణ శక్తినిస్తుంది.గ్లాసు పల్చని మజ్జిగలో చెంచా గులాబీరేకల ముద్ద, చెంచా చక్కెర కలిపి తాగితే నీరసం నుంచి ఉపశమనం కలుగుతుంది.గ్లాసు గోరువెచ్చని నీటిలో పెద్ద చెంచా నిమ్మరసం, చెంచా అల్లం రసం, రెండు చెంచాల తేనె కలిపి తాగితే నీరసం నుంచి తేరుకోవచ్చు.గ్లాసు పల్చని మజ్జిగలో పుదీనా రసం, నిమ్మరసం చెంచా చొప్పున కలిపి అందులో చిటికెడు ఉప్పు వేసి తాగాలి. దీంతో కళ్లు తిరగడం తగ్గి, శక్తి వస్తుంది.గ్లాసు నల్లద్రాక్ష రసం తాగినా నీరసం నుంచి తేరుకోవచ్చు.మంచి కర్పూరం వాసన చూస్తే మెదడు ఉత్తేజమై, నీరసం తగ్గుతుంది.మంచి గంధం, కర్పూరం, కొంచెం కొబ్బరి నూనె కలిపి నుదిటిపై లేపనంలా వేస్తే, నిస్త్రాణం నుంచి బయటపడొచ్చు.

అమెరికాకు జల్లకాయ కొట్టిన చైనా

ప్రతి విషయంలో ఎప్పుడూ ముందుండే అమెరికాను తాజాగా డ్రాగన్‌ చైనా వెనక్కి నెట్టేసింది. ప్రపంచంలోనే 5జీ సేవలను వినియోగిస్తున్న తొలి జిల్లాగా షాంఘై రికార్డు సృష్టించింది. దీంతో ప్రస్తుతం 5జీ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు విస్తృతంగా ఏర్పాట్లు చేసుకుంటున్న ప్రపంచ దేశాలను వెనక్కి నెట్టి చైనా ముందడుగు వేసినట్లైంది. ఈ మేరకు ప్రభుత్వ అధికారిక పత్రిక చైనా డైలీలో తన కథనంలో పేర్కొంది.‘ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ చైనా మొబైల్‌ 5జీ నెట్‌ వర్క్‌ ట్రయల్‌ రన్‌ను అధికారికంగా షాంఘై జిల్లాలో శనివారం నుంచి ప్రారంభించింది. గత మూడు నెలల కాలంలో షాంఘైలోని వివిధ చోట్ల 5జీ బేస్‌ స్టేషన్లను ఏర్పాటు చేసింది. దీంతో జిల్లా మొత్తం 5జీ నెట్‌వర్క్‌ అందుబాటులోకి వచ్చినట్లైంది’ అని చైనా డైలీ తెలిపింది. ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్భంగా షాంఘై వైస్‌ మేయర్‌ వూ క్వింగ్‌.. ప్రపంచంలోనే తొలి 5జీ ఫోల్డబుల్‌ ఫోన్‌ అయిన హువాయ్‌ మేట్‌ ఎక్స్‌ నుంచి తొలి 5జీ వీడియోకాల్‌ను చేశారు. వినియోగదారులు తమ సిమ్‌ కార్డులను అప్‌గ్రేడ్‌ చేసుకోకుండానే ఈ సేవలను పొందవచ్చని తెలిపారు

ఆదర్శప్రాయుడైన ముఖ్యమంత్రి జలగం వెంగళరావు

సామాన్య వ్యక్తిగా రాజకీయ అరంగేట్రం చేసి.. దశాబ్దాల పాటు రాష్ట్రాన్ని శాసించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావుది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ 6వ ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రిగా పనిచేశారాయన. ఖమ్మం జిల్లా పరిషత్‌ చైర్మన్‌గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఆయన హయాంలోనే జిల్లాలో విద్య, వైద్యం, విద్యుత్, రహదారి రంగాల్లో అభివృద్ధికి బాటలు పడ్డాయి.
*1957 అసెంబ్లీ ఎన్నికల్లో వెంగళరావుకు కాంగ్రెస్‌ పార్టీ సీటు లభించలేదు. ఆయన తమ్ముడు జలగం కొండల్‌రావు వేంసూరు నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలుపొందారు. ఆ తర్వాత వెంగళరావు 1962, 1967, 1972, 1978 ఎన్నికల్లో వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1984, 1989లో ఖమ్మం నియోజకవర్గం నుంచి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికైన వెంగళరావు.. ఇటు ఖమ్మం జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా పని చేయడంతోపాటు కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేస్తున్న సమయంలోనే ఉమ్మడి రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా కీలక బాధ్యతలను ఆయన భుజాల మీద పెట్టింది కాంగ్రెస్‌ పార్టీ. అప్పటి ముఖ్యమంత్రి ఎన్‌టీఆర్‌ పాలన విధానాలపై ధ్వజమెత్తిన నేత వెంగళరావు. తాను ఏ పదవిలో ఉన్నా. ఆ పదవికి వన్నె తెచ్చారు. ముఖ్యంగా జిల్లా అభివృద్ధి కోసం ఎవరినైనా ఎదిరిస్తారనే పేరు వచ్చిందాయనకు. అలాంటి జలగం రాజకీయ ప్రస్థానంలో ఒక్కటి మినహా అన్నీ విజయాలే.
**జడ్పీ చైర్మన్‌గా..
తొలుత ఆయన ఖమ్మం జిల్లా పరిషత్‌ చైర్మన్‌గా 1959లో బాధ్యతలు చేపట్టగా.. ఆ తర్వాత కొద్ది కాలానికి పంచాయతీరాజ్‌ పరిషత్‌ అధ్యక్ష పదవి ఆయనను వరించింది. పంచాయతీరాజ్‌ సంస్థలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆకళింపు చేసుకోవడం ద్వారా గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్ల నిర్మాణం, తాగునీటి సమస్య వంటి ప్రజోపయోగ పనులను నిర్వహించడం ద్వారా ప్రజలకు చేరువయ్యారు. రాష్ట్ర హోం మంత్రిగా శాంతిభద్రతల పర్యవేక్షణతోపాటు అప్పుడున్న నక్సల్‌ సమస్యను సమర్థంగా ఎదుర్కొన్నారనే పేరుంది.
ఒకేసారి 120 పాఠశాలలు
జలగం జడ్పీ చైర్మన్‌ కావడానికి ముందు జిల్లాలో ఖమ్మం, మధిరలో మాత్రమే ఉన్నత పాఠశాలలుండేవి. ఆయన కృషితో ఒకేసారి 120 పాఠశాలలు ఏర్పడ్డాయి. వెంగళరావుకు అద్భుతమైన జ్ఞాపకశక్తి ఉండేది. ఒకసారి చూసిన వ్యక్తిని కానీ, విన్న, చదివిన విషయాన్ని కానీ మర్చిపోయే వారు కాదు. ఆయా విషయాలకు సంబంధించిన అంకెలను తడుముకోకుండా చెప్పేవారు.
**నిజాంపై పోరు..
నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఆయన తిరువూరు కేంద్రంగా పోరు సలిపారు. అనేకసార్లు ఆయనపై రజాకార్ల దాడులు జరిగాయి. వెంగళరావు తిరువూరులో ఉన్న ఆయన మామ ఇంటికి తరచూ వెళ్తారనే సమాచారంతో ఒకసారి రజాకార్లు అక్కడ కూడా మాటేశారు. వెంగళరావు ఆ రోజు అక్కడికి వెళ్లకపోవడంతో రజాకార్లు ఆయన మామ మాధవరావుపై దాడి చేసి, ఆయనను హత్య చేశారు.
**గుమాస్తా పాఠాలు
రాజకీయాల్లోకి రాకముందు కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులో పంచాయతీరాజ్‌ శాఖలో గుమాస్తా ఉద్యోగం చేశారు. అప్పటి అనుభవం నేర్పిన పాఠాలతో ఆయన.. పంచాయతీరాజ్‌ సంస్థల అభివృద్ధికి, వాటి ప్రక్షాళనకు నివేదిక తయారు చేశారు. ఇది ‘వెంగళరావు నివేదిక’గా పేరుపడింది. పంచాయతీరాజ్‌ పరిషత్‌ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని ఒప్పించి తన నివేదికలోని అంశాల అమలుకు పూనుకున్నారు. అనేక పదవులు అలంకరించిన వెంగళరావు తనను వ్యతిరేకించే వారిపై కఠినంగా ఉండేవారని చెబుతారు.జలగం వెంగళరావు 1922, మే 4న శ్రీకాకుళం జిల్లా రాజాంలో జన్మించారు. 20వ ఏట ఖమ్మం జిల్లా, పెనుబల్లి మండలం బయ్యన్నగూడెం వచ్చి స్థిరపడ్డారు. నైజాం వ్యతిరేక పోరాటాన్ని ఆ ప్రాంతం నుంచే ప్రారంభించిన వెంగళరావు.. జెడ్పీ చైర్మన్‌గా, రాష్ట్ర హోం మంత్రిగా, ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా విధులు నిర్వర్తించారు. ఆ కాలంలో అభివృద్ధిలో జిల్లాను పరుగులు తీయించారు. ప్రభుత్వ ఉద్యోగులతో సన్నిహితంగా మెలిగేవారాయన. పోలీసుల సంక్షేమానికి కృషి చేసిన వ్యక్తి.

నేడు ఇడ్లీ దినోత్సవం

రోజూ ఉదయమే లొట్టలేసుకుంటూ తినే ఇడ్లీలకూ ఓ రోజు ఉంది. ఇడ్లీలనగానే మనకు గుర్తొచ్చేది తమిళనాడు. ఇడ్లీ సాంబార్ తమిళనాడులో ఎంత ఫేమస్సో అందరికీ తెలుసు. ఎక్కువగా ఇడ్లీలు తినే తమిళులకు కూడా ఇడ్లీ డే ఒకటుందని తెలియకపోవచ్చు. పొద్దున్నే ఇడ్లీలు తిననిదే పొద్దుపోని వాళ్లకు కూడా ఇడ్లీ డే ఒకటుంటుందని తెలియకపోవచ్చు. మార్చి 30నే ప్రపంచ ఇడ్లీ దినోత్సవంగా జరుపుకుంటారు. గత మూడు సంవత్సరాల నుంచి మార్చి 30ని ప్రపంచ ఇడ్లీ దినోత్సవంగా జరుపుతున్నారు. ఇడ్లీ దినోత్సవానికి రూపకర్త ఎమ్ ఎనియావన్. మల్లిపూ ఇడ్లీ రెస్టారెండ్ ఫౌండర్. త‌మిళ‌నాడులో ఈ రెస్టారెంట్ ఫుల్లు ఫేమ‌స్‌. ఇడ్లీలు తినాలంటే అక్క‌డే తినాలి అంటారు.. అంత టేస్టీగా ఉంటాయ‌ట అక్క‌డి ఇడ్లీలు. ఈయనే మార్చి 30ని ప్రపంచ ఇడ్లీ దినోత్సవంగా ప్రారంభించాడ‌ట. మనకు ఫాథర్స్ డే, మధర్స్ డేలా అన్ని డేలు ఉన్నాయి. రోజూ పొద్దున్నే తినే ఇడ్లీలకు ఒక రోజు ఎందుకు ఉండకూడదు అని ఆలోచించాడు. చిన్న పిల్లల దగ్గర్నుంచి పండు ముసలి వరకు అందరూ ఇష్టపడే ఇడ్లీలకు ఒక రోజు ఉండాల్సిందే.. అని మార్చి 30 ని ప్రపంచ ఇడ్లీ దినోత్సవంగా నామకరణం చేశాడ‌ట.

రాయపాటి విజయానికి భరోసా ఇచ్చిన కోమటి జయరాం

ఉత్తర అమెరికాలో తెలుగువారి అతి పెద్ద సంఘమైన తానా తమ పూర్తి మద్దతు తెలుగుదేశం పార్టీకే నని తానా మాజీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర అమెరికా ప్రత్యేక ప్రతినిధి అయినా కోమటి జయరాం పేర్కొన్నారు. శనివారం నాడు ఆయన నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు తో గుంటూరు లోని ఆయన నివాసంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు ఎన్నికల ప్రచార విశేషాలపై కొంతసేపు చర్చించుకున్నారు. ఉత్తర అమెరికాలో 35 సంవత్సరాలకు పైగా విద్య , సాంస్కృతిక , సాంఘిక రంగాల్లో విశిష్ట సేవలు తానా అందించడం జరుగుతుందని, భవిష్యత్ ప్రయోజనాల కోసం చంద్రబాబు నేతృత్వంలో తెలుగు దేశ ప్రభుత్వ ఏర్పాటుకు తానా సభ్యులు పూర్తిగా తమ మద్దతును ప్రకటించి ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం జరుగుతుందని ఈ సందర్భంగా కోమటి జయరాం ఎంపీ రాయపాటి వివరించారు. ఉత్తర అమెరికాలో IT ఇతర రంగాల్లో ఉన్న ఉద్యోగస్తులు రేపు జరగబోవు ఎన్నికల్లో ఓటు వేసి తెలుగు దేశ ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించేందుకు ప్రణాళిక రూపొందించుకోవాలని, అదే విధంగా ఇక్కడ ఉన్న తానా సభ్యులు గ్రామస్థాయిలో కి వెళ్లి తెలుగుదేశం ప్రభుత్వం అమలుపరిచిన వివిధ రకాల సంక్షేమ పధకాల కార్యక్రమాలను, మరియు భవిష్యత్ అభివృద్ధి కోసం చంద్రబాబు సారధ్యం యొక్క ఆవశ్యకతను ప్రతి ఒక్కరికి తెలిపి వారికి చైతన్యపరిచి తెలుగుదేశం ప్రభుత్వ ఏర్పాటుకు కృషి చేయాలని ఈ సందర్భంగా రాయపాటి సూచించారు.

తిరువూరులో వేడెక్కుతున్న ఎన్నికల ప్రచారం-TNI ప్రత్యేకం

కృష్ణాజిల్లా తిరువూరు ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం వేడెక్కుతుంది. ఈ నియోజకవర్గంలో 12 మంది అభ్యర్ధులు రంగంలో ఉన్నప్పటికీ పోటీ ప్రధానంగా తెదేపా, వైకాపా మధ్యనే నెలకొని ఉంది. ఇప్పటి వరకు వైకాపా అభ్యర్ధి ప్రస్తుత శాసనసభ్యుడు కొక్కిలిగడ్డ రక్షణనిధి ప్రచారంలో ముందంజలో ఉన్నారు. గత ఆదివారం నాడు వై.ఎస్.జగన్ తిరువూరు పర్యటన అనంతరం వైకాపా జోరు మరింతగా పెరిగింది. చివరి నిముషంలో కొవ్వూరు నుండి తిరువూరుకు ఆకస్మికంగా తరలి వచ్చిన తెదేపా అభ్యర్ధి, ఎక్సైజ్ మంత్రి కే.ఎస్.జవహర్ ప్రచారాన్ని కొంత ఆలస్యంగా ప్రారంభించారు. ప్రస్తుతం మంత్రి జవహర్ ముమ్మర ప్రచారంలో నిమగ్నమయ్యారు. తిరువూరు తెదేపా టికెట్ పై గంపెడంత ఆశ పెట్టుకున్న మాజీ శాసనసభ్యుడు నల్లగట్ల స్వామిదాస్ తొలుత జవహర్ కు సహకరించడానికి ముందుకు రాలేదు. చంద్రబాబు జోక్యంతో స్వామిదాస్ ఎన్నికల రంగంలోకి దిగారు. జవహర్ ను వెంటపెట్టుకుని స్వామిదాస్ నియోజకవర్గంలో తెదేపా ప్రచారానికి ఊపును తీసుకువచ్చారు. స్వామిదాస్ కు టికెట్ రాలేదని తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన అనుచరులు ఇతర దేశం నాయకులూ ఇప్పుడిప్పుడే జవహర్ కు అనుకూలంగా ప్రచార రంగంలోకి దిగారు. ఆర్ధికంగా పెద్దగా లేని వైకాపా అభ్యర్ధి రక్షణనిధి పార్లమెంటు అభ్యర్ధి పొట్లూరి వరప్రసాద్ సహకారంతో తెదేపా అభ్యర్ధితో పోటీగా ఖర్చు పెడుతున్నారు. ఇరుపార్టీల అభ్యర్ధులు మందీమర్భాలంతో పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అద్దె జనాన్ని పోగుచేసి వారిని రోజుకు మూడు వందల లెక్కన కూలీ ఇస్తూ చికెన్ భోజనాలు పెడుతూ అభ్యర్ధులు తమ వెంట ప్రచారంలో ఎక్కువ సంఖ్యలో ఉండే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. ఈసారి కార్యకర్తలకు కూడా అభ్యర్ధులు భారీగా సొమ్ములు అందజేస్తున్నారు. బూత్ ల వారీగా ఇరు పార్టీల అభ్యర్ధులు ఒక్కొక్క బూత్ కు ఇప్పటి వరకు ఇరవై వేలు ఇచ్చి బూత్ లెవల్లో విడిగా ప్రచారం చేయటానికి కార్యకర్తలను ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే వైకాపా అభ్యర్ధి రక్షణనిధి గడపగడపకు వైకాపా పేరుతొ ఇప్పటికే రెండు సార్లు నియోజకవర్గం అంతా పర్యటించి ఓటర్లను కలుసుకున్నారు. ఇప్పటికే మూడు సార్లు ఓటమి పాలైన తెదేపాను మళ్ళీ ఓడించాలని వైకాపా నాయకులు పకడ్బందీగా ప్రణాళికలు వేస్తున్నారు. రక్షణనిధికి మంచి వ్యక్తిగా అవినీతి మారక లేని నేతగా స్థానిక ప్రజల్లో గుర్తింపు ఉంది. **తెదేపా విషయానికొస్తే ఆ పార్టీ నాయకుల మధ్య ఉన్న వర్గ విభేదాలను పరిష్కరించే ప్రయత్నం జవహర్ చేయవలసి ఉంది. కొంతమంది నేతలకు జవహర్ పెత్తనం అప్పగించడంతో మరి కొందరు నేతలు అసంతృప్తితో ఉన్నారు. తిరువూరు నియోజకవర్గంలో తెలుగుదేశానికి పెద్ద సమస్య ఒకటి ఉంది. ఆపార్టీకి మంచి కార్యకర్తలు బలం ఈ నియోజకవర్గంలో ఉంది. అయితే తెదేపా నాయకులకు కార్యకర్తలకు మధ్య అగాదం ఉంది. గత ఐదేళ్ళ నుండి తెలుగుదేశం నేతలు తమకు రూపాయి దక్కకుండా అన్ని కాంట్రాక్టులను వారే దక్కించుకుని లక్షలాది రూపాయలు సంపాదించారని, ఒక్క రూపాయి కూడా కార్యకర్తలకు దక్కనీయ లేదని ఆపార్టీ కార్యకర్తలు బాహాటంగానే వాపోతున్నారు. తిరువూరు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ఉంటుందని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. చంద్రబాబు పర్యటన అనంతరం తెలుగుదేశం పార్టీ పరిస్థితి మెరుగవుతుందని తిరువూరులో తాము ఈసారి తప్పనిసరిగా విజయం సాధిస్తామని తెదేపా వర్గాలు భావిస్తున్నాయి. దీనికి తోడూ ఆర్ధికంగా బాగా ఉన్న ఎక్సైజ్ శాఖా మంత్రి కే.ఎస్.జవహర్ కూడా భారీగా ఖర్చు చేయడానికి సిద్దపడుతున్నట్లు వాతావరణం కనిపిస్తోంది. దీనితో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు ఈసారి విజయం తెదేపాదేనని ధీమాతో ఉన్నారు. – కిలారు ముద్దుకృష్ణ సీనియర్ జర్నలిస్టు.

అజిలాన్ షా హాకీ తుదిపోరుకి చేరుకున్న భారత సేన

మలేసియాలో జరుగుతున్న సుల్తాన్‌ అజ్లాన్‌ షా హాకీ టోర్నమెంట్‌లో భారత్‌ విజయయాత్ర కొనసాగిస్తోంది. శుక్రవారం పోలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 10-0 గోల్స్‌ తేడాతో విజయం సాధించి దిగ్విజయంగా ఫైనల్‌లోకి అడుగుపెట్టింది. ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థి ఆటగాళ్లకు అవకాశం ఇవ్వకుండా భారత ఆటగాళ్లు గోల్‌లు సాధించారు. మొదటి 30 నిమిషాల్లో ఆరు గోల్‌లు సాధించిన భారత్‌, చివరి అర్థ భాగంలో నాలుగు గోల్స్‌ చేసి విజయం సాధించింది. ప్రత్యర్థి జట్టుకు ఒక గోల్‌ చేసేందుకు అవకాశం ఇవ్వలేదు. సుల్తాన్‌ అజ్లాన్‌ షా టోర్నమెంటులో భారత్‌ ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచింది. ఈ సిరీస్‌లో భారత్‌ ఆడిన ఐదు లీగ్‌ మ్యాచ్‌లలో నాలుగు విజయాలు, ఒక డ్రాతో 13 పాయింట్లు సాధించింది. భారత స్ట్ర్రెకర్‌ మణ్‌దీప్‌ సింగ్‌ అద్భుతమైన ఫామ్‌తో జట్టుకు విజయాలు అందిస్తున్నాడు. బుధవారం కెనడాతో జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో హ్యాట్రిక్‌ గోల్స్‌ సాధించి 7-3 గోల్స్‌తో జట్టును విజయ తీరాలకు చేర్చాడు. పోలాండ్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో భారత ఆటగాడు మన్‌ప్రీత్‌సింగ్‌కు బదులు సురేంద్రకుమార్‌ను జట్టులోకి తీసుకున్నారు. ఈ విజయంతో టోర్నమెంటులో భారత్‌ మొత్తం ఐదు లీగ్‌ మ్యాచుల్లో 18 గోల్లు సాధించింది. 13 పాయింట్లతో తమ గ్రూపు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. శనివారం దక్షిణ కొరియాతో భారత్‌ ఫైనల్‌ మ్యాచ్‌ ఆడనుంది.

ఇంటలిజెన్స్ చీఫ్ కోసం మూడు పేర్లు–తాజావార్తలు–03/29

*బ్యాంకు పనులేమైనా ఉంటె ఆరోజు చేసేసుకోండి ఆర్ధిక సంవత్సరం చివరి రోజుకావడంతో ఆదివారం కూడా బ్యాంకులు తెరిచే ఉంటాయట. రిజర్వ్యు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాల ప్రకారం బ్యాంకులు ఈ ఆదివారం పని చేస్తున్నాయి. 2018-19 ఆర్ధిక సంవత్సరానికి చెందిన అన్ని ప్రభుత్వ లావాదేవీలను అదే ఆర్ధిక సంవత్సరంలో లేక్కించాలని ఆర్బీఐ బ్యాంకులకు ఆదేశాలు జరీ చేసింది. ఆర్దిక్ సంవత్సరం చివర కాబట్టి ప్రభుత్వ లావాదేవీల కోసం బ్యాంకులు మర్చి 30 రాత్రి ఎనిమిది గంటల వరకు మార్చి 31 సాయంత్రం ఆరు గంటల వరకు పని చేస్తాయి. లావాదేవీల విశాయంలో కస్టమర్లకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యెక కౌంటర్లు ఏర్పాటు చేయాలనీ అన్ని బ్యాంకులకు రిజర్వు బాంక్ ఆఫ్ ఇండియా ఆదేశించింది. ఆర్టీజీఎస్, నెఫ్ట్ ఇతర ఎలక్ట్రానిక్ లావాదేవీల సమయాన్ని కూడా పొడిగించాలని సూచించింది.
*ఏపీ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ రేసులో ముగ్గురు ఐపీఎస్‌ అధికారులుజాబితాను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి..నళినీ ప్రభాత్‌(1992బ్యాచ్), కుమార్‌విశ్వజిత్‌(1994బ్యాచ్)మహేష్‌ చంద్ర లడ్డా(1998బ్యాచ్)ఈ రాత్రికి ఒక అధికారిని నిఘా విభాగం అధిపతిగా నియమించే అవకాశం..
* ఎల‌క్ట్రానిక్స్ తయారీదారు శాంసంగ్ త‌న నూత‌న ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ గెలాక్సీ ట్యాబ్ ఎ 8.0 2019ను త్వ‌ర‌లో విడుద‌ల చేయ‌నుంది. దీని ధర వివ‌రాల‌ను ఇంకా వెల్ల‌డించ‌లేదు. ఇందులో ప‌లు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు.
* ఉత్తర్‌ప్రదేశ్‌లో భూవివాదం కాల్పులకు దారితీసింది. ఘజియాబాద్‌లో నడిరోడ్డుపైనే రెండు వర్గాలకు చెందిన వారు తుపాకులతో కాల్పులకు దిగారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాల్పుల ఘటనలో పలువురు గాయపడగా పోలీసులు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే వాహబ్‌చౌదరి అనుచరులు మరో వర్గంపై దాడి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వాహబ్‌ సోదరుడిని నుంచి పిస్తోల్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. త్వరలోనే మరో నిందితుడ్ని పట్టుకుంటామని తెలిపారు.
*రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 55శాతానికి తగ్గకుండా ఫిట్ మెంట్ ఇవ్వాలని ఏపీ ఉద్యోగ, ఉపాద్యాయ, కార్మిక, పెన్షనర్ల ఇకాస డిమాండ్ చేసింది. అర్హత , పరీక్ష విధానం ఒకటే అయినప్పటికీ సచివాలయం సాఖాదిపతుల కర్యాలయల్లోని ఉద్యోగుల వేతనాల్లో వ్యత్యాసం ఉందని దీన్ని తగ్గించాలని కోరారు. పాత ఫించను విధానాన్ని పునరుద్దరించాలని పదకొండవ వేతన సవరణ సంఘం కమీషనర్ అశుతోష్ మిశ్రాకు గురువారం తమ ప్రతిపదల్ని సమర్పించినట్లు ఇకాస చైర్మన్ ఓ ప్రకటనలో తెలిపారు.
* జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. నిన్న షోపియాన్‌, కుప్వారా జిల్లాలో భద్రతాసిబ్బంది ఎన్‌కౌంటర్ జరిపి నలుగురు ఉగ్రవాదులను హతమార్చగా.. తాజాగా మరో ఇద్దరు ముష్కరులను మట్టుబెట్టారు.
* ప్రముఖ సినీనటి జయప్రదను ఉద్దేశించి అసభ్యకరంగా మాట్లాడినట్లు ఆరోపణలు వచ్చిన సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) నాయకుడు ఫిరోజ్‌ఖాన్‌కు జాతీయ మహిళా కమిషన్‌(ఎన్‌సీడబ్ల్యూ) నోటీసులు జారీ చేసింది. మీడియాలో వస్తున్న వార్తలపై సంతృప్తికరమైన జవాబు ఇవ్వాలని ఆదేశించింది. ఎస్పీ మాజీ ఎంపీ అయిన జయప్రద మంగళవారం భాజపాలో చేరిన సంగతి తెలిసిందే. ఆయన వ్యాఖ్యలు ‘అసభ్యకరం, అసహ్యకరం, అనైతికం’ అని ఎన్‌సీడబ్ల్యూ కార్యదర్శి బర్నాలిషోమి అభ్యంతరం వ్యక్తం చేశారు.
*కేంద్ర ఎన్నికల కమిషన్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కోర్టు ధిక్కరణ కింద సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. అభ్యర్థుల పెండింగ్‌ క్రిమినల్‌ కేసుల ప్రకటనలపై సీఈసీని కోర్టు ప్రశ్నించింది. ఇంకా అభ్యర్థుల కేసుల గురించి ప్రకటించకపోవడాన్ని తప్పుబట్టింది. టీవీలుపత్రికల్లో ప్రచురించాలని గతంలో ఈసీకి సూచించింది. వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని ఈసీకి సుప్రీంకోర్టు ఆదేశించింది.
*ఇంటెలిజెన్స్‌ డీజీ ఏబీ వెంకటేశ్వరరావును రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయనను పోలీసు ప్రధాన కార్యాలయానికి రిపోర్టు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు సీఎస్‌ అనిల్‌ చంద్ర పునేఠా శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఐపీఎస్‌ బదిలీల విషయంలో ఎన్నికల సంఘం జారీచేసిన ఉత్తర్వుల్లో తాము జోక్యం చేసుకోలేమని ఏపీ హైకోర్టు స్పష్టంచేసిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
*రాష్ట్రంలో శుక్రవారం ఎండ తీవ్రత మరింత పెరుగుతుందని, శనివారం రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. గురువారం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ 38నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదుకావడం గమనార్హం.
*దేశంలో కొత్త జనాభా లెక్కల సేకరణ కార్యక్రమం 2021 మార్చి 1వ తేదీ అర్ధరాత్రి నుంచి ప్రారంభం అవుతుందని కేంద్ర హోంశాఖ వెల్లడించింది. మార్చి 1ని ప్రతిపాదిత తేదీగా ప్రకటిస్తూ గురువారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ‘జమ్మూ కశ్మీర్‌, హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌లోని కొండ ప్రాంతాల్లో మాత్రం 2020 అక్టోబర్‌ 1వ తేదీని ప్రతిపాదిత తేదీగా నిర్ణయించింది. ఆయా రాష్ట్రాల భౌగోళిక, వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ముందుగానే అక్కడ జనగణన మొదలుపెట్టనున్నట్లు…’ కేంద్ర హోంశాఖ వివరించింది. గతంలో 2011లో జరిగిన జనగణనలో మన దేశ జనాభా 121 కోట్లుగా లెక్కతేలింది.
* రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న 119 బీసీ గురుకులాల్లో తొలిఏడాదికి 5, 6 తరగతులు నిర్వహించాలని బీసీ గురుకుల సొసైటీ నిర్ణయించింది. ప్రతి తరగతిలో రెండు సెక్షన్ల కింద 40 మంది విద్యార్థుల చొప్పున ప్రవేశం కల్పించనుంది.
*మహిళలు పారిశ్రామిక రంగంలో ప్రగతి సాధించినప్పుడే దేశ ఆర్థిక రంగంలో వృద్ధి సాధ్యమవుతుందని బయోకాన్‌ ఛైర్‌పర్సన్‌, ఎండీ కిరణ్‌ మజుందార్‌ షా అన్నారు. హైదరాబాద్‌లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన డబ్ల్యుఈ (వియ్‌ – ఉమెన్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌) హబ్‌ను గురువారం హైదరాబాద్‌లోని అమెరికన్‌ కాన్సుల్‌ జనరల్‌ కేథరిన్‌ హడ్డా, ఐటీ ముఖ్య కార్యదర్శి జయేష్‌రంజన్‌, విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య కె.సీతారామారావు, వియ్‌ హబ్‌ సీఈఓ దీప్తి రావుతో కలిసి ఆమె ప్రారంభించారు.
* ప్రతిభా సామర్థ్యాలున్నవారికి పేదరికం ఏ దశలోనూ అడ్డుకాదని పర్వతారోహకురాలు మలావత్‌ పూర్ణ అన్నారు. పిల్లలకు ఏ రంగంలో ఆసక్తి ఉందో గుర్తించి, తల్లిదండ్రులు అన్నివిధాలా ప్రోత్సహించాలని కోరారు. దామోదరం సంజీవయ్య సంక్షేమ భవన్‌లో ఆమె గురువారం గురుకులాల కార్యదర్శి ప్రవీణ్‌ కుమార్‌తో పాటు విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు.
*ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా సామాన్యుడు సైతం ముందస్తు అనుమతి లేకుండా తన వద్ద ఉన్న గుర్తింపు కార్డుతో రాకెట్‌ ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) కల్పించనుంది.
*వరంగల్‌ జాతీయ సాంకేతిక సంస్థ(ఎన్‌ఐటీ) క్యాంపస్‌లో బీటెక్‌ చదువుతున్న ఐదుగురు విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడుతున్నట్లు జూనియర్‌ విద్యార్థులు చేసిన ఫిర్యాదు మేరకు విచారించి అందుకు బాధ్యులుగా భావిస్తున్న వారిపై సస్పెన్షన్‌ వేటు వేశారు.
*రాష్ట్రంలో డాక్టర్‌ బాబూ జగ్జీవన్‌రామ్‌ (ఏప్రిల్‌ 5), డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ (ఏప్రిల్‌ 14) జయంతి ఉత్సవాల నిర్వహణకు సంబంధిత శాఖలు గడువులోగా పనులు పూర్తిచేయాలని ఎస్సీ సంక్షేమశాఖ డైరెక్టర్‌ కరుణాకర్‌ తెలిపారు. హైదరాబాద్‌లో గురువారం సంక్షేమభవన్‌లో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఉత్సవాల నిర్వహణ కార్యాచరణ అందిస్తామని, ఆ మేరకు పనులు వేగం చేయాలని కోరారు.
*జెట్‌ ఎయిర్‌వేస్‌లో సంక్షోభం విశాఖ ప్రయాణికులపై ప్రభావం చూపిస్తోంది. గతంలో విశాఖ నుంచి ముంబయి వరకు జెట్‌ ఎయిర్‌వేస్‌, ఎయిరిండియా విమానాలు నడిచేవి. ఫిబ్రవరి 9 నుంచి జెట్‌ సర్వీసు నిలిచిపోయింది. దీంతో ఎయిరిండియాపై భారం పెరిగింది.
*తెలంగాణను ఇకముందు ప్రపంచస్థాయి క్రీడా కేంద్రంగా మార్చేలా ఓ ప్రత్యేక విధానం రూపొందాల్సి ఉందని రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి అన్నారు. క్రీడల అభివృద్ధిపై ఆయన గురువారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు.
*ఉపాధ్యాయ నియామకాల కోసం నిర్వహించిన తొలి టీఆర్టీ ద్వారా ఎంపికైన 8,792 మందిని వెంటనే నియమించాలని టీఎస్‌యూటీఎఫ్‌ డిమాండ్‌ చేసింది. 2018 ఫిబ్రవరిలో పరీక్షలు జరిగి, ఎంపిక ప్రక్రియ పూర్తయినా, నియామకాలు జరపకపోవడంతో అభ్యర్థులు ఎదురుచూస్తున్నారని తెలిపింది. ఈ మేరకు టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీహెచ్‌.రాములు, చావ రవి ఒక ప్రకటన విడుదల చేశారు. 15 వేలకు పైగా ఉపాధ్యాయ ఖాళీలున్నాయని, వాటిని నూతన విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే భర్తీ చేయాలని కోరారు.
*రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు వైద్యకళాశాలల్లో కన్వీనర్‌ కోటాలో భర్తీ చేయనున్న పీజీ వైద్య విద్య సీట్ల ప్రవేశాలకు ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియను ఈ నెల 30 నుంచి ఏప్రిల్‌ 2 వరకూ నిర్వహించనున్నట్లు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్‌ కరుణాకరరెడ్డి తెలిపారు.
*అంతరిక్ష రక్షణ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఏశాట్‌ క్షిపణి ప్రయోగం దోహదపడుతుందని రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ అన్నారు. ‘మిషన్‌ శక్తి’ ప్రాజెక్టులో భాగంగా జరిపిన ప్రయోగం విజయవంతం కావడంపై డీఆర్‌డీవో అధిపతి జి.సతీశ్‌రెడ్డిని ఆయన అభినందించారు.
*ఎన్నికల సంఘం అధికారులు అభ్యంతరకర సందేశాలను (ఎస్‌ఎంఎస్‌లను) ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనల జాబితాలో చేర్చారు. ఈ మేరకు డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ కార్యాలయం గురువారం ప్రకటన విడుదల చేసింది
*గుంటూరులోని తెదేపా కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ 38వ ఆవిర్భావ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి మంత్రి నక్కా ఆనంద్ బాబు, ఎంపీ గల్లా జయదేవ్, పలువురు నేతలు నివాళులర్పించారు. తెలుగు ప్రజల ఖ్యాతిని ప్రపంచ నలుమూలల చాటి చెప్పిన మహానాయకుడు నందమూరి తారకరామారావు అని మంత్రి నక్కా ఆనంద్ బాబు కొనియాడారు. తెలుగుదేశం పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చిన ఏకైక పార్టీ ఇదేనని అన్నారు. ఎన్టీఆర్ అడుగుజాడల్లో నడుస్తూ ఆయన ఆశయ సాధనకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎనలేని కృషి చేస్తున్నారని తెలిపారు. తెలుగు వారి ఆత్మగౌరవం కాపాడడానికి ఏర్పాటు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని గల్లా జయదేవ్ అన్నారు. రాష్ట్ర అభివృద్ధి జరగాలన్నా, తెలుగు ప్రజలు సుభిక్షంగా ఉండాలన్నా మరోసారి చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వాల్సిన ఆవశ్యకత ఉందని అభిప్రాయపడ్డారు.
* వైకాపా రాజ్యసభ్య సభ్యుడు విజయసాయిరెడ్డిపై… ఇటీవల బదిలీ అయిన శ్రీకాకుళం ఎస్పీ అడ్డాల వెంకటరత్నం ఇచ్చిన ఫిర్యాదును న్యాయసలహా నిమిత్తం శ్రీకాకుళం జిల్లా కోర్టుకు పంపినట్టు శ్రీకాకుళం రెండో పట్టణ సీఐ మహేష్‌ గురువారం తెలిపారు.
* ఏపీఈసెట్‌-2019కు అపరాధ రుసుం లేకుండా దరఖాస్తు చేసుకోవడానికి గడువు ముగిసింది. ఈ సంవత్సరం ఇప్పటివరకు 39,231 దరఖాస్తులు అందాయి.అనంతపురం జేఎన్‌టీయూ ఆధ్వర్యంలో ఐదోసారి ఈసెట్‌ నిర్వహిస్తున్నారు. మొత్తం 13 కోర్సులకు ఏప్రిల్‌ 19న ప్రవేశ పరీక్ష జరగనుంది. రూ.1000 అపరాధ రుసుంతో దరఖాస్తు చేసుకోవడానికి ఏప్రిల్‌ 2 వరకు అవకాశం కల్పించామని ఈసెట్‌ కన్వీనరు భానుమూర్తి తెలిపారు.
* ఒక్కొక్క పోస్టుకు 200 చొప్పున దరఖాస్తులు వచ్చినా స్క్రీనింగ్‌ టెస్ట్‌ నిర్వహిస్తామని ఏపీపీఎస్సీ ప్రకటించింది. ఏయే ఉద్యోగాలకు ఈ కొత్త నిర్ణయాన్ని వర్తింపచేసేది త్వరలో తెలియచేస్తామని వెల్లడించింది. జారీచేసిన ఉద్యోగ ప్రకటనను అనుసరించి అభ్యర్థుల నుంచి వచ్చిన దరఖాస్తులు 25వేలు దాటితే ప్రస్తుతం స్క్రీనింగ్‌ టెస్ట్‌ నిర్వహిస్తున్నారు. దీనికి అదనంగా ప్రకటించిన పోస్టుల్లో ఒక్కొక్క దానికి 200 వంతున దరఖాస్తులు వచ్చినా స్క్రీనింగ్‌ టెస్ట్‌ నిర్వహించేందుకు ప్రభుత్వం తాజాగా అనుమతి ఇచ్చింది.
* విజయవాడ సిద్ధార్థ ఇంజినీరింగ్‌ కళాశాల మైదానంలో ఈ నెల 30న అమరావతి ఉత్సవం(ఫెస్ట్‌) జరగనుంది. ఐటీ విద్యార్థులకు రాష్ట్రంలో ఉన్న అవకాశాలు తెలియజెప్పడంతో పాటు ఐటీ సంస్థలను ప్రోత్సహించడంలో భాగంగా ఈ వేడుకను ఆంధ్రప్రదేశ్‌ ప్రవాసాంధ్ర సంస్థ(ఏపీఎన్‌ఆర్‌టీ) అట్టహాసంగా నిర్వహించనుంది.
* విశాఖపట్నంలో రూ.463 కోట్లతో తలపెట్టిన ఐఐఎం శాశ్వత క్యాంపస్‌ నిర్మాణ టెండర్‌ను నవరత్న సంస్థ ఎన్‌బీసీసీ (నేషనల్‌ బిల్డింగ్స్‌ కన్‌స్ట్రక్షన్‌ కార్పొరేషన్‌) దక్కించుకొంది. ప్రాజెక్టు తొలి దశలో భాగంగా ఇక్కడ తరగతి గదులు, నివాస సముదాయం, పరిపాలన భవనం, గ్రంథాలయం, ప్రయోగశాలలు, క్రీడలు, ఇతర ఉమ్మడి సౌకర్యాలను ఎన్‌బీసీసీ నిర్మిస్తుంది. టెండర్‌ దక్కించుకున్న సందర్భంగా ఎన్‌బీసీసీ సీఎండీ అనూప్‌కుమార్‌ మిత్తల్‌ మాట్లాడుతూ.. ఐఐఎం క్యాంపస్‌ నిర్మాణాన్ని పూర్తి నాణ్యతతో గడువులోగా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.
* జెట్‌ ఎయిర్‌వేస్‌లో సంక్షోభం విశాఖ ప్రయాణికులపై ప్రభావం చూపిస్తోంది. గతంలో విశాఖ నుంచి ముంబయి వరకు జెట్‌ ఎయిర్‌వేస్‌, ఎయిరిండియా విమానాలు నడిచేవి. ఫిబ్రవరి 9 నుంచి జెట్‌ సర్వీసు నిలిచిపోయింది. ఎయిరిండియాపై భారం పెరిగింది. ఇక్కడి ప్రయాణికుల అవసరాలకు ఇది సరిపోవడం లేదు. చాలామంది హైదరాబాద్‌ మీదుగా ముంబయికి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఎయిరిండియా నుంచి మరో సర్వీసును ముంబయికి నడపాలని విశాఖ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ నుంచి వినతులు వెళ్లాయి. మరో 2 నెలల్లో దీనిపై నిర్ణయం తీసుకుంటామని ఆ సంస్థ సమాధానం ఇచ్చింది.
* పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వ శాఖల నుంచి 21 రోజుల్లో అనుమతులిచ్చే ‘ఆన్‌లైన్‌ సింగిల్‌విండో పోర్టల్‌’లో మరో 16 సేవలను చేర్చుతూ ఉత్తర్వులు వెలువడ్డాయి. పారిశ్రామికవేత్తల సూచనలమేరకు మరికొన్నిసేవలను చేర్చారు.
* ఎన్నికల షెడ్యూల్‌ వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా రూ.19 కోట్ల విలువైన ఐదు లక్షల లీటర్ల మద్యం నిల్వలను స్వాధీనం చేసుకున్నట్లు ఆబ్కారీ కమిషనర్‌ ముఖేష్‌కుమార్‌ మీనా చెప్పారు. విశాఖ మన్యంలో గురువారం పర్యటించిన ఆయన చింతపల్లిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చెక్‌పోస్టును తనిఖీ చేశారు.
* శ్రీకాకుళం, కడప జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌ చంద్ర పునేఠ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీకాకుళం జిల్లాకు నవదీప్‌సింగ్‌ గ్రేవల్‌, కడప జిల్లాకు అభిషేక్‌ మహంతిలను నియమించాలని సూచిస్తూ బుధవారం రాత్రి ఎన్నికల సంఘం ఆదేశించిన సంగతి తెలిసిందే. సంబంధిత ఆదేశాల మేరకు వారిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

వివేకా హత్య కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు–నేరవార్తలు–03/29

* మాజీమంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో ఏపీ హైకోర్టు శుక్రవారం కీలక ఉత్తర్వులు ఇచ్చింది. ఈ హత్య ఘటనపై ఎవరు వ్యాఖ్యానించరాదని ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తరఫున అండర్‌ టేకింగ్‌ ఇవ్వాలని ప్రభుత్వం తరపున అడ్వకేట్‌ జనరల్‌ (ఏజీ)ను హైకోర్టు ఆదేశించింది. మరోవైపు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తరపున.. న్యాయవాదులు అండర్‌ టేకింగ్‌ ఇచ్చారు. అలాగే ఈ కేసుకు సంబంధించి పోలీసులు, సిట్‌ సైతం మీడియాకు వివరాలు అందించడానికి వీలు లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. కేసు తదుపరి విచారణను ఏప్రిల్‌ 15వ తేదీకి వాయిదా వేసింది. కాగా ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ దర్యాప్తుపై నమ్మకం లేదని వివేకా హత్యకేసును సీబీఐకి అప్పగించాలని కోరుతూ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్‌ సౌభాగ్యమ్మ ఏపీ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. సిట్‌ పేరుతో వైఎస్‌ కుటుంబ సభ్యులపై బురద జల్లేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని న్యాయవాదులు కోర్టుకు వివ్నవించారు. ఏపీ ప్రభుత్వం, పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై అనుమానాలున్నాయని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఏపీ ప్రభుత్వ అజమాయిషీలో లేని దర్యాప్తు సంస్థకు కేసు విచారణ అప్పగించాలని కోరిన విషయం తెలిసిందే.
* తాగి వాహనం నడిపితే మరణ శిక్షే
తప్పతాగి రోడ్డు మీద రయ్ రయ్ అని దూసుకెళ్ళే వారి గుండె గుభేలుమనే వార్త. ఎందుకంటే ఇక నుంచి డ్రంకెన్ డ్రైవ్ కు మరణ శిక్షే. అయితే ఇండియాలో కాదు.. తైవాన్లో ఈమేరకు ఆ దేశ ప్రభుత్వం గురువారం నిర్ణయం తీసుకుంది. తాగి వాహనం నడిపి మనుషుల ప్రాణాలు తీసే వారికి మరణ దండన విధిస్తూ క్రిమినల్ కోడ్ సవరణ ముసాయిదాకు అక్కడి కేబినేట్ ఆమోదం తెలిపింది. తాగి వాహనం నడిపి జైలుకేల్లోచ్చిన వారి ఐదేళ్ళలో మళ్ళీ అదే నేరం చేస్తే శిక్ష కాలం పెరుగుతోంది. యాక్సిడెంటులో వ్యక్తులు తీవ్రంగా గాయపడితే పన్నెండేళ్ళ శిక్ష విధించనున్నారు. ఈ ప్రతిపాదనను పార్లమెంటు ఆమోదించాల్సి ఉంది. తైవాన్లో తాగి నడిపిన ప్రాణాలు తీస్తే ప్రస్తుతం పదేళ్ళ వరకు శిక్ష విధిస్తున్నారు. తాగి నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతూ ప్రాణాలు తీస్తున్న సంఘటనలలు తైవాన్లో పెరిగిపోతున్నాయని, అనేక కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తైవాన్ సర్కారు చెప్పింది. ఈ ఏడాది జనవరిలో ఓ వ్యక్తీ తప్ప తాగి వాహనం నడిపి ముగ్గురి మృతికి కారణమయ్యాడు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
*సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో లక్ష్మి ఎన్టీఆర్ సినిమాను నిలిపి వేయాలని టీడీపీ కార్యకర్తలు నల్ల జెండాలతో ధియేటర్ ముందు నిరసన చేపట్టారు. సినిమా ఒక వర్గానికి ప్రోత్సహించే విధంగా ఉందని వారు అభ్యంతరం వ్యక్తం చేశారు.
*ఉత్తరప్రదేశ్ లోని గ్రేటర్ నోయిడాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వెళ్తున్న బస్సు, లారీ డీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 31 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో 12 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు యమునా ఎక్స్ ప్రెస్ హైవే ఈ ఘటన జరిగింది. క్షతగాత్రుల్ని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
*హైదరాబాద్ నగరంలో రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ఇంటి అద్దె అడిగిన యంజమనిని ఓ యువకుడు దారుణంగా కత్తితో పొడిచాడు. గురువారం అర్ధరాత్రి స్థానిక హసన్ నగర్ లో ఈ ఘటన జరిగింది. ఇంటి అద్దె అడిగిన క్రమంలో వారిద్దరి మద్య స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో కోపోద్రిక్తుడైన యువకుడు యజమాని కడుపులో రెండు పోతూ పొడిచాడు.
*ఆంధ్రప్రదేశ్ డీజీపీ వాహనంలో తెదేపా సొమ్ములు తరలిస్తోందని వైకాపా నేతలు ఆరోపించారు. ఈమేరకు గురువారం వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి మాజీ ఎంపీలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వైవీ సుబ్బారెడ్డి బొత్స సత్యనారాయణలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమీశానర్ సునీల్ ఆరోడా, కమిషనర్లు సుషీల్ చంద్ర సశోక్ లవసాలతో భేటీ అనంతరం విజయసాయి రెడ్డి మీడియాతో మాట్లాడారు. డీజీపీ ఆర్పీ టాకూర్, ప్రక్సాహం గుంటూరు రూరల్, చిత్తూరు ఎస్పీలు, అధికారులు దామోదర్ నాయుడు, యోగానంద్, ఘట్టమనేని శ్రీనివాస్ లను బదిలీ చేయాలనీ కోరినా ఈసీ వాహనాన్ని తనిఖీ చేసే అధికారం ఎన్నికల సంఘానికే ఉందని అందుకే అధరాలు చూపలేక పోతున్నమన్నారు.
*హైదరాబాద్‌ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న ఓ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో కారు యజమాని ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డాడు. హయత్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన జరిగింది. విప్రోలో సాఫ్ట్‌ వేర్‌ ఇంజినీర్‌గా పనిచేసే విజయ్‌ రాహుల్‌ తన కారులో (టీఎస్‌09ఈజడ్‌7989) శుక్రవారం ఉదయం ఔటర్‌ రింగురోడ్డు వైపు వెళ్తున్నాడు. ఉదయం 10:10గంటల సమయంలో కారు హయత్‌నగర్‌ ఆర్టీసీ కాలనీ సమీపంలోకి చేరుకోగానే ఇంజిన్‌ నుంచి అకస్మాత్తుగా మంటలు వచ్చాయి. వెంటనే కారును రోడ్డు పక్కగా నిలిపిన అతడు కారు లోంచి దిగి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ఈ ప్రమాదంతో ఆ మార్గంలో ట్రాఫిక్‌ స్తంభించింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.
*తూర్పుగోదావరి జిల్లా రాజోలు బీసీ వసతి గృహంలో ఉంటున్న పదోతరగతి విద్యార్థి ఉరికి వేలాడుతూ విగతజీవిగా కనిపించాడు. అతడి మృతికి ప్రేమ వ్యవహారమే కారణమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
*బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలోని విలాసవంతమైన బనానీ ప్రాంతంలో గల 22 అంతస్తుల భవంతిలో గురువారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.
* సీనియర్లు తీవ్రంగా కొట్టడంతో మృతి చెందిన ఏడో తరగతి బాలుడి మృతదేహాన్ని యాజమాన్యం, సిబ్బంది గుట్టుచప్పుడు కాకుండా స్కూలు ఆవరణలోనే పాతిపెట్టిన దిగ్భ్రాంతికర సంఘటన రిషికేశ్‌ సమీపంలోని ఓ రెసిడెన్షియల్‌ పాఠశాలలో జరిగింది.
*లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఇప్పటివరకు రూ.23.38 కోట్ల విలువైన మద్యం, మాదకద్రవ్యాలు, నగదు, ఇతర వస్తువులు సీజ్‌ చేసినట్లు రాష్ట్రఎన్నికల అధికారి కార్యాలయం నివేదికలో పేర్కొంది.
*జమ్ము-కశ్మీర్‌లోని షోపియాన్‌, కుప్వారా జిల్లాల్లో గురువారం జరిగిన రెండు వేరు వేరు ఎదురుకాల్పుల సంఘటనల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.
*నకిలీ వీసాలను సృష్టించి అమాయకులను మోసం చేస్తున్న ముఠాలోని ఇద్దరిని గురువారం పోలీసులు అరెస్ట్‌ చేశారు.
*పదోతరగతి విద్యార్థినిపై అత్యాచారానికి ప్రయత్నించిన ఇన్విజిలేటర్‌ కటకం నర్సింహమూర్తిని డీఈవో మదన్‌మోహన్‌ గురువారం సస్పెండ్‌ చేశారు.
*గయలోని దుమారియాలో భాజపా నేత, మాజీ ఎమ్మెల్సీ అనుజ్‌కుమార్‌ సింగ్‌ ఇంటిని మావోయిస్టులు బాంబులతో పేల్చివేశారు. దాదాపు 20-30 మంది సాయుధులైన మావోయిస్టులు ఈ దాడిలో పాల్గొన్నట్లు పోలీసులు తెలిపారు. అప్పటికి ఇంటిలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పినట్లు గయ సీనియర్‌ ఎస్పీ చెప్పారు. ఎన్నికలను బహిష్కరించాలంటూ మావోయిస్టులు గోడపత్రికలను కూడా అతికించినట్లు పోలీసులు తెలిపారు
*కర్ణాటకలోని రాయచూరు జిల్లా సిందనూరు తాలుకా గాంధీనగర్‌కు చెందిన తెలుగు వైద్యుడు నందిగం మణిదీప్‌ ‌(28) అమెరికాలోని న్యూజెర్సీ సమీపంలోని ఎడిషన్‌లో అనుమానాస్పదంగా మృతిచెందాడు. ఈ సమాచారం గురువారం సిందనూరులో ఉన్న అతని తల్లిదండ్రులు నందిగం శ్రీనివాస్‌, పద్మలకు అమెరికాలో ఉన్న వారి బంధువుల ద్వారా తెలిసింది. మృతికి గల కారణాలు తెలియరాలేదు. మణిదీప్‌‌ కర్ణాటకలోని మణిపాల్‌ లో ఎంబీబీఎస్‌ పూర్తిచేశాడు. ఆతర్వాత అమెరికా వెళ్లి అక్కడి ఎడిషన్‌లోని సెంట్‌పీటర్స్ టీచింగ్‌ హాస్పట ల్‌లో పీజీ‌ తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. మణిదీప్‌ మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
*అనంతపురంజిల్లాలోని తాడిపత్రి ఫ్లై ఓవర్‌ దగ్గర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. అదుపుతప్పి బైక్‌ను బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రామాంజనేయులు (35) దుర్మరణం చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలను సేకరించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
*కామారెడ్డి పలు గ్రామాల్లో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.వేల నగదు తులాల వెండి గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు రిమాండ్‌కు తరలించారు.
*భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సరిహద్దు చత్తీస్ గఢ్ బీజాపూర్ జిల్లా బాసగుడా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆయుటపల్లి-కొరసాగుడా గ్రామాల అటవీ ప్రాంతంలో పోలీసులుమావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. కాల్పుల అనంతరం సీఆర్పీఎఫ్ బెటాలియన్ పోలీసులు సంఘటన స్థలంలో భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.

బ్రా కింద కేజీన్నర బంగారంతో

ఓ మహిళ బ్రా మాటున బంగారం బిస్కెట్లు పెట్టుకొని విమానంలో రావడంతో చెన్నై విమానాశ్రయ అధికారులు థాయ్ మహిళను అరెస్టు చేశారు. థాయ్‌లాండ్‌కు చెందిన క్రైసోర్న్ థాంప్రకోప్ (38) అనే మహిళ 47 లక్షల రూపాయల విలువైన 1.4 కిలోల బంగారం బిస్కెట్లను బ్రాల కింద పెట్టుకొని టీజీ 337 విమానంలో చెన్నై విమానాశ్రయంలో దిగింది. విమానాశ్రయ అధికారులు ఆమెను అరెస్టు చేసి బంగారం బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. పద్మావతి అనే మరో ప్రయాణికురాలు రూ.12 లక్షల విలువచేసే 365 గ్రాముల బంగారాన్ని కువైట్ నుంచి డ్రాయరు లోపల దాచుకొని తరలిస్తుండగా విమానాశ్రయ అధికారులు పట్టుకున్నారు

వృక్షాలు…..దేవతా స్వరూపాలు

హిందువులు అన్ని జీవుల్లోను దేవుణ్ని చూశారు. అందువల్లనే ఆవులు వంటివి పూజనీయ జంతవులయ్యాయి. అలాగే కొన్ని పర్వతాలు పుణ్య స్థలాలయ్యాయి. కొన్ని నదులు పుణ్య నదులయ్యాయి. వాటికి ఆ పవిత్రత ఏ విధంగా వచ్చిందో వివరించే కథలు కూడా ఉన్నాయి. అలాగే చెట్లలో కూడా దేవుణ్ని చూశారు. కొన్ని చెట్లను దేవతా వృక్షాలన్నారు.నిజానికి చెట్లు భూమి మీద సౌరశక్తిని గ్రహించుకునే కేంద్రాల్లో ఒకటి. అవి మనకు కాయలు, పండ్లు, పువ్వులు, ఔషధాలు ఇవ్వడంతో బాటు వంట చెరుకు వంటివి ఇచ్చి మానవాళి మనుగడకు ఎంతగానో తోడ్పడుతున్నాయి. కాగా చెట్లకు మనుషుల మాదిరి ఆనందం, బాధ వంటివి ఉంటాయని మనువు పేర్కొన్నారు. అది ఆధునిక విజ్ఞాన శాస్త్రరీత్యా కూడా నిరూపితమయింది. భారతీయ రుషులు సైతం కొన్ని వృక్షాలను పవిత్రమైనవిగా పేర్కొన్నారు. ఇక ఆర్యులు చెట్లతో సహా ప్రకృతి శక్తులను పూజించేవారు. హిందువులు పవిత్ర మైన వృక్ష జాతులుగా పేర్కొనే వాటిలో తులసి, రావి (అశ్వత్థం), వేప, మారేడు, మర్రి, అశోక, ఉసిరి మరి కొన్ని ఉన్నాయి. దేవతా వృక్షాలుగా పేర్కొనే వాటిలో కొన్నిటికి అద్భుతమైన ఔషధ శక్తులు ఉండడం విశేషం. కొన్ని దేవతా వృక్షాల విశేషాలు తెలుసుకుందాం.
**తులసి
తులసి పవిత్రమైనదని అందరికీ తెలుసు. ప్రతి ఇంటిలో తులసి ఉండాల్సిన అవసరముంది. తులసి కథ అందరికీ తెలిసిందే. విష్ణుమూర్తికి తులసి ప్రీతికరమని,దానితోఆయనకు పూజ పుణ్యప్రదమనేది అందరికీ తెలిసిందే. తులసిని పవి త్రంగా ఉన్నప్పుడే ముట్టుకోవచ్చని, అనవసరంగా తుంచరాదనే నియమాలు కూడా ఉన్నాయి. తులసి పవిత్రతని చెప్పే ఒక శ్లోకం ఉంది. అది
యన్మూలే సర్వ తీర్థాని, యన్మధ్యే సర్వ దేవతా:
యదగ్రే సర్వ వేదాశ్చ, తులసీం త్వాం నమామ్యహం
మూలంలో సర్వ తీర్థాలు, మధ్య భాగంలో సర్వ దేవతలు, అగ్రభాగంలో సర్వ వేదాలు గల తులసి కి నమస్కరిస్తున్నాను అని దీని అర్థం. తులసికి ఎన్నో ఔషధ గుణాలున్నాయన్నవిషయం తెలిసిందే. తులసికి మనస్సును ఉద్వేగాలను, శరీరాన్ని పరిశుద్ధం చేసే శక్తి ఉందని చెబుతారు. అందువల్లనే యోగులు, సాధువులు వంటి వారు తులసి మాలను మెడలో ధరిస్తుంటారు. ఇతరుల చెడు భావాలను ఎదుర్కొని దూరం చేసే శక్తి తులసికి ఉంది. అంత ఎందుకు తులసిని స్పృశించడమే మనలను శుద్ధి చేస్తుందని చెబుతారు.
*రావి
దేవతా వృక్షాల్లో రావి(అశ్వత్థం)ఒకటి. అశ్వత్థం సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపం. రావి చెట్టులో త్రిమూర్తులు ఉన్నారని చెప్పే శ్లోకం కూడా ఉంది. అది
మూలతో బ్రహ్మ రూపాయ, మధ్యతో విష్ణు రూపిణి
అగ్రత: శివ రూపాయ, వృక్ష రాజాయతే నమ:
ఈ వృక్షం మూలం వద్ద్ద బ్రహ్మ, మధ్యలో విష్ణువు, అగ్రంలో శివుడు ఉన్నారని దీని అర్థం. ఇక రావి చెట్టు విష్ణువు రూపమని చెబుతారు. అందువల్లనే అశ్వత్థ నారాయణుడు అనే పేరు కూడా ఆయనకు ఉంది. మొహంజొదారో లో దొరికిన ఒక ముద్రలో సింధులోయ నాగరికతకు చెందిన ప్రజలు అశ్వత్థ వృక్షాన్ని పూజిస్తున్న దృశ్యం బయటపడింది. దేవదానవ యుద్ధంలో దేవతలు ఓడిపోయిన ఒక సందర్భంలో విష్ణువు అశ్వత్థ వృక్షంగా మారాడని పురాణాలు చెబుతున్నాయి. ఆయన ఆ చెట్టు రూపం దాల్చినందున దానికి పవిత్రత వచ్చిందని చెబుతారు. కృష్ణ నిర్యాణం కూడా ఈ చెట్టు కిందే జరిగిందని కొందరు చెబుతారు. స్త్రీలు సంతానం కోసం ఈ చెట్టు మొదలుకు గాని దాని కొమ్మలకు గాని ఎర్ర వస్త్రం గాని, ఎర్ర దారం గాని కట్టే ఆచారం ఉంది. ఏ చెట్టును నరకడమైనా పాపమే కాగా అశ్వత్థ వృక్షాన్ని నరకడం మహాపాపమని ఒక పురాణ వచనం. బుద్ధునికి ఈ చెట్టు కిందే జ్ఞానోదయం అయిందని చెబుతారు. అందువల్ల వారు దానిని బోధి వృక్షమని, జ్ఞాన వృక్షమని వ్యవహరిస్తారు.
*వేప
వేపచెట్టు లక్ష్మీ దేవి స్వరూపమని చెబుతారు. అందువల్లనే విష్ణు రూపమైన రావి చెట్టుకు, లక్ష్మీ రూపమైన వేప చెట్టును ఒకే చోట పాతి వాటికి వివాహం చేసే ఆచారం కూడా ఉంది. ఉత్తర హిందూస్థానంలో వేప చెట్టును నీమారి దేవిగా వ్యవహరిస్తారు. కొన్ని శుద్ధి కార్యక్రమాల్లో వేప రెమ్మలను ఉపయోగిస్తారు. వేపలో ఉన్న ఔషధ గుణాలు తెలిసినవే. వేప‌ చెట్టు గాలే శరీరానికి మంచిదని అంటారు. దాని ఆకులు క్రిమి సంహారిణిగా ఉపయోగిస్తాయి. దాని బెరడు కొన్ని రకా ల చర్మ వ్యాధుల చికిత్సలో ఉపయోగపడుతుంది.
*మారేడు
మారేడు పత్రాలనే సంస్కృతంలో బిల్వ పత్రాలంటారు. మారేడు శివునికి ప్రీతికరం. అందుకే ఆయనకు లక్ష పత్రి పూజలో కూడా బిల్వాలనే వాడతారు. అది దేవతా వృక్షమై నందునే దానిని కొన్ని రోజులలో, తిథులలో కోయరాదనే నిబంధన కూడా ఉంది. కోసేటప్పుడు కూడా ఒక శ్లోకం చదివి నమస్కరించి కోయాలంటారు.
ఆ శ్లోకం
అమృతోద్భవ శీవృక్ష మహాదేవ ప్రియ: సదా
గృహ్ణామి తవ పత్రాణి శివపూజార్థమాదరాత్‌
మారేడుకు అమృతం నుంచి ఉద్భవించిందని, శ్రీ వృక్షమని పేర్లు. అలాగే ఎప్పుడూ శివునికి ఇష్టమైనది. అటువంటి నీ పత్రాలను శివ పూజ నిమిత్తం కోస్తున్నాను అని దీని అర్థం. మారేడు లక్ష్మీ దేవికి ప్రీతికరం. మూడుగా కలసి ఉన్న బిల్వ దళాలను శివుని పూజకు వాడుతారు. ఈ మూడు పత్రాల దళం శివుని మూడు కనులకు ప్రతీక అని భావిస్తారు. జైనులకు కూడా ఇది పవిత్ర వృక్ష
1. చార్‌ధామ్‌ యాత్రకు వేళాయె
మంచుకొండల్లోని మహాధామాల యాత్రకు సమయం ఆసన్నమైంది. మినీ చార్‌ధామ్‌ యాత్రగా పేరున్న గంగోత్రి, యమునోత్రి, బదరీనాథ్‌, కేదార్‌నాథ్‌ ధామాలు తెరుచుకునే వేళలు ప్రకటించారు. ఏడాదిలో సుమారు ఆరునెలలు మాత్రమే తెరిచి ఉంచే ఈ పుణ్యక్షేత్రాలకు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు వేలాదిగా తరలివెళ్తారు. ఏటా అక్షయ తృతీయ నుంచి దీపావళి తర్వాత వచ్చే యమద్వితీయ వరకు భక్తులను అనుమతిస్తారు. మే నెల రెండో వారంలో తెరుచుకోనున్న వీటిని అక్టోబరు చివరి వారం వరకు దర్శించుకోవచ్చు. హిమగిరుల మధ్య సాహసోపేతంగా సాగే చార్‌ధామ్‌ యాత్ర ఆధ్యాత్మిక ఆనందంతో పాటు పర్యాటక ప్రియులకు అద్భుతమైన జ్ఞాపకాలను పంచుతుంది. మే, జూన్‌ నెలల్లో ఎక్కువ మంది యాత్రకు వెళ్లడానికి ఆసక్తి కనబరుస్తారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో.. జులై, ఆగస్టు నెలల్లో ప్రయాణం అంత అనుకూలంగా ఉండదు.
యాత్రకు వెళ్లదలచిన వాళ్లు www.onlinechardhamyatra.com/ వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. హరిద్వార్‌ రైల్వేస్టేషన్‌, బస్‌స్టేషన్‌, గురుద్వారా తదితర ప్రాంతాలు, రుషీకేశ్‌, జానకిఛట్టీ, గంగోత్రి, యమునోత్రి వంటి ముఖ్య ప్రదేశాల్లోనూ పేర్లు నమోదు చేసుకోవచ్చు. ఆధార్‌కార్డు, ఓటర్‌ కార్డు వంటి వ్యక్తిగత ధ్రువీకరణ పత్రాలు చూపించాలి. రెండు ఫొటోలు కూడా వెంట ఉంచుకోవాలి. తెలుగు రాష్ట్రాల్లోని పలు పర్యాటక సంస్థలు చార్‌ధామ్‌ యాత్ర ప్యాకేజీలు అందిస్తున్నాయి. వీటి ధర రూ.20,000 నుంచి రూ.35,000 (ఒక్కొక్కరికి) వరకు పేర్కొంటున్నాయి.
**హెలికాప్టర్‌లో..
డెహ్రాడూన్‌ నుంచి యమునోత్రికి, మర్నాడు యమునోత్రి నుంచి గంగోత్రికి, ఆ మరుసటిరోజున కేదార్‌నాథ్‌కు, అక్కడి నుంచి బదరీనాథ్‌కు చేరవేయడానికి హెలికాప్టర్‌ సర్వీసును బుక్‌చేసుకోవచ్చు. నాలుగురోజుల యాత్ర, రెండ్రోజుల యాత్ర.. ఇలా రకరకాల ప్యాకేజీలు అందుబాటులో ఉంటాయి. ఉత్తరాఖండ్‌ టూరిజంశాఖ వెబ్‌సైట్‌ (suttarakhandtourism.gov.inz)లో వివరాలు లభిస్తాయి.
2. శ్రీవారికి రూ.1.25 కోట్ల విరాళం
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారికి గురువారం రూ.1.25 కోట్ల విరాళం వచ్చింది. హైదరాబాదుకు చెందిన చింతలపాటి హోల్డింగ్స్‌ కంపెనీ రూ.1.03 కోట్ల విరాళాన్ని బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని ట్రస్టు కింద డిపాజిట్‌ చేసింది. అలాగే అన్నప్రసాదం ట్రస్టు కింద రూ.22 లక్షల విరాళాన్ని పలువురు భక్తులు సమర్పించారు.
3. మహిమాన్విత అవధూత!
కేవలం 32 సంవత్సరాలు జీవించి, ఎక్కువ కాలం తపస్సులోనే గడిపి, కపాలమోక్షం ద్వారా దేహాన్ని చాలించిన అవధూత మొగిలిచర్ల శ్రీదత్తాత్రేయ స్వామి. సమాధి నుంచే భక్తుల మనోరథాలను నెరవేరుస్తాననీ, జ్ఞానబోధ చేస్తానని ఆయన ప్రకటించారు. ఏటా ఆయన భక్తులు మాలధారణతో మండల దీక్ష చేసి, స్వామి పట్ల తమ ప్రపత్తిని చాటుకుంటారు.
**అది ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా మొగిలిచర్ల గ్రామ శివారు ఫకీరుమాన్యం… 1976 సంవత్సరం మే 6వతేదీ రాత్రి. ఆ రోజు వైశాఖ మాసం శుద్ధ సప్తమి. సమయం రాత్రి 11 గంటలు అవుతోంది. శీదత్తాత్రేయ స్వామి ఆశ్రమం భక్తులతో కిక్కిరిసి ఉంది. ఇంతలో ఎవరూ ఊహించని సంఘటన జరిగింది. స్వామివారి శరీరంలోంచి ఒక పెద్ద శబ్దం వినబడసాగింది. ఆ ధ్వని దూరం నుంచి ఒక మోటార్‌ సైకిల్‌ వస్తున్న శబ్దంలా ఉంది. రెండు నిమిషాల కాలం గడిచేసరికి ఆ శబ్దనాదం ఉద్ధృతంగా మారింది. అందరూ స్వామివారి వైపు చూశారు. ఆయన నాభి ప్రాంతం నుంచి మొదలైన ఆ శబ్దం క్రమంగా ఊర్ధ్వంగా శిరస్సుపై భాగానికి పాకిపోయింది. ఇలా దాదాపు ఐదు నిమిషాల పాటు జరిగింది. అందరూ ఆశ్చర్యంగా స్థాణువుల్లా నిలబడిపోయారు.
*ఆ శబ్దం ఒక్కసారిగా ఆగిపోయింది. ఆ మరునిమిషంలోనే స్వామివారి శిరస్సుపై మధ్యభాగం నుంచి రక్తం ధారగా కారింది. అదే సమయానికి ఆశ్రమం బయట ఉన్న వ్యక్తులకు ఆశ్రమం పై భాగం నుంచి ఒక నీలి రంగు జ్యోతి పైకెగసి ఆకాశంలో కలిసిపోవడం కనిపించింది. ఆ జ్యోతిని మొగిలిచర్ల గ్రామంలో ఉన్న వ్యక్తులూ చూశారు. స్వామివారు కపాలమోక్షం పొందారని ఆశ్రమం లోపల ఉన్న భక్తులకు అర్థమైంది. అప్పటి దాకా స్వామివారు తమ ప్రాణాన్ని శరీరంలోని నిలిపి ఉంచారని వారు గ్రహించారు. 1950 ఏప్రిల్‌ 14న అరుణాచలంలో శ్రీరమణమహర్షి శివైక్యం చెందినప్పుడు సరిగ్గా ఇదే జరిగింది. వారి దేహం నుంచి ఒక మహాజ్యోతి అరుణాచల పర్వతంలోకి ప్రవేశించడాన్ని ఎందరెందరో తిలకించారు. ఆ తర్వాత మొగిలిచర్ల దత్తాత్రేయ స్వామి జీవితంలో అలాంటి మహత్తర ఘటన ఆవిష్కృతమైంది.
**ఆధ్యాత్మిక కేంద్రంగా మారిన పల్లె
మొగిలిచర్ల ఒక పల్లెటూరు. సుమారు 46 సంవత్సరాల కిందట ఒక యోగి ఇక్కడ ఆశ్రమ నిర్మాణం మొదలుపెట్టేదాకా ఈ ఊరి గురించి బాహ్య ప్రపంచానికి తెలిసింది బహు తక్కువ. ఆరు అడుగులకు పైగా పొడుగు, తెల్లని మేని ఛాయ, నెత్తిన ముడివేసుకున్న జటాఝూటం లాంటి జుట్టు, చిరునవ్వు మోముతో ఉన్న 26, 27 ఏళ్ల వయసున్న దిగంబర యువకుడు ఆ ఊరిలో అడుగుపెట్టారు. 32 ఏళ్ల వయసులోనే కపాలమోక్షం ద్వారా సిద్ధి పొందిన ఆయన మొగిలిచర్ల దత్తాత్రేయస్వామిగా ప్రసిద్ధి పొందారు.
**ఇంటి మీద చిలుకలు… ఇంటి చుట్టూ సర్పం
మొగిలిచర్ల గ్రామానికి చేరువలో ఉన్న వలేటివారిపాలెం మండలంలో శ్రీలక్ష్మీ నారసింహుడు స్వయంభువుగా వెలసిన మాలకొండ (మాల్యాద్రి) ఉంది. అక్కడి పార్వతీదేవి ఆలయం స్వామివారి తపోసాధనకు కేంద్రం. ఫకీరుమాన్యం వద్ద ఆశ్రమ నిర్మాణానికి ముందు కొద్దిరోజుల పాటు ఆయన తన భక్తులైన పవని శ్రీధరరావు, నిర్మల ప్రభావతి దంపతుల ఇంటిలో ఉన్నారు. ఆయన తపస్సు ఎంత తీవ్రమైనదంటే, దాని శక్తికి పశుపక్ష్యాదులు కూడా ప్రభావితమయ్యేవి. దత్తాత్రేయస్వామి ఆ ఇంటిలో ఉన్నప్పుడు రోజుల తరబడి సమాధి స్థితిలోకి వెళ్లిపోయేవారు. ఆయనకు కేటాయించిన గది తలుపులు మూసివేసుకొని ధ్యానంలో మునిగిపోయేవారు. చిత్రంగా ఆ రోజులలో ఆ ఇంటి మీద వందలాది రామచిలుకలు వచ్చి వాలుతుండేవి. అదే సమయంలో ఇంటి చుట్టూ ఒక పెద్ద సర్పం తిరుగుతుండేది. అత్యంత దివ్య సుగంధ పరిమళం ఆ పరిసరాల్లో వ్యాపించేది. రాత్రిపూట ఒకరకమైన నీలి రంగు కాంతి వలయం ఏర్పడేది. ఈ సంఘటనలన్నిటికీ మొగిలిచర్ల గ్రామస్తులు ప్రత్యక్ష సాక్షులు.
**సమాధి నుంచే భక్తులకు అభయం
శ్రీదత్తాత్రేయస్వామి దేహధారులై ఉన్న రోజుల్లో తనను దర్శించుకోవడానికి ఎందరెందరో భక్తులు సుదూరప్రాంతాల నుంచి వస్తుండేవారు. సత్ప్రవర్తన, నైతిక జీవన ప్రాధాన్యం, క్రమశిక్షణతో కూడిన ఆధ్యాత్మిక విలువల ఆచరణ, మానవత్వ విలువల గురించే బోధిస్తూ వారిలో పరివర్తన తెచ్చేవారు. ప్రజల్లో గూడుకట్టుకున్న మూఢవిశ్వాసాలను తొలగించేవారు. ఆయనకు ఇతోధికంగా సేవలందించినవారిలో శ్రీధరరావు దంపతులు, మీరాశెట్టి దంపతులు, చెక్కా కేశవులు ముఖ్యులు. తన తపస్సు ఫలించిందనీ, దేహాన్ని త్యజించాలని నిర్ణయించుకున్నాననీ శ్రీదత్తాత్రేయస్వామి వారికి వెల్లడించినప్పుడు… లోకానికి మంచిని బోధించేందుకు మరి కొంతకాలం తమ మధ్య ఉండాలని వారు కోరారు. అయితే, తనను ఆశ్రయించిన భక్తుల మనోరథాలను నెరవేర్చేందుకు, వారికి తగిన బోధ చేసేందుకు, వారిలో పరివర్తన తెచ్చేందుకు శరీరంతో ఉండాల్సిన పనిలేదని, తన సమాధి నుంచే ఆ పని జరుగుతుందని స్వామి చెప్పారు. ఆ ప్రకారమే ఎందరినో అనుగ్రహించినట్లు మొగిలిచర్లకు వచ్చే భక్తులు తమ అనుభవాలను చెబుతూ ఉంటారు.
**ఎలా వెళ్ళాలి?
మొగిలిచర్లకు సమీపంలో ఉన్న రైల్వే స్టేషన్‌ సింగరాయకొండ. అక్కడి నుంచి కందుకూరు మీదుగా రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు. దూరం 60 కి.మీ. బస్సులో నేరుగా కందుకూరు వెళ్ళి అక్కడి నుంచి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న మొగిలిచర్లకు వెళ్ళవచ్చు. ఒంగోలు నుంచి 90 కిలోమీటర్ల దూరంలో (కందుకూరు మీదుగా) ఈ క్షేత్రం ఉంది. వసతి సదుపాయం, పల్లకీసేవ తదితర పూజా కార్యక్రమాల వివరాల కోసం 94402 66380, 9441916557 నెంబర్లలో సంప్రతించవచ్చు. ప్రతి శనివారం సమాధి మందిరం తలుపులు మూసి ఉంటాయి.
** నేటి నుంచి మండల దీక్ష
ప్రతి ఏటా వైశాఖ మాసంలో మొగిలిచర్ల దత్తాత్రేయ స్వామివారు సిద్ధి పొందిన శుద్ధ సప్తమి మండల దీక్ష సమాప్తమయ్యేలా భక్తులు మాలధారణ చేస్తుంటారు. ఈ ఏడాది మార్చి 29, 30, 31 తేదీల్లో మండల దీక్ష ఇవ్వనున్నారు.
4. శుభమస్తు
తేది : 29, మార్చి 2019
సంవత్సరం : విళంబినామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : ఫాల్గుణమాసం
ఋతువు : శిశిర ఋతువు
కాలము : శీతాకాలం
వారము : శుక్రవారం
పక్షం : కృష్ణ (బహుళ) పక్షం
తిథి : నవమి
(నిన్న రాత్రి 10 గం॥ 38 ని॥ నుంచి
మర్నాడు తెల్లవారుజాము 0 గం॥ 49 ని॥ వరకు)
నక్షత్రం : పూర్వాషాడ
(నిన్న ఉదయం 10 గం॥ 14 ని॥ నుంచి
ఈరోఉదయం 12 గం॥ 43 ని॥ వరకు)
యోగము : పరిఘము
కరణం : తైతిల
వర్జ్యం : (ఈరోజు రాత్రి 9 గం॥ 42 ని॥ నుంచి ఈరోజు రాత్రి 11 గం॥ 29 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఈరోజు ఉదయం 7 గం॥ 25 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 10 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 8 గం॥ 39 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 28 ని॥ వరకు)(ఈరోజు ఉదయం 12 గం॥ 45 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 34 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు ఉదయం 10 గం॥ 48 ని॥ నుంచి ఈరోజు ఉదయం 12 గం॥ 19 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు ఉదయం 7 గం॥ 44 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 15 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు సాయంత్రం 3 గం॥ 24 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 4 గం॥ 55 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 6 గం॥ 13 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 28 ని॥ లకు
సూర్యరాశి : మీనము
చంద్రరాశి : ధనుస్సు
5. చరిత్రలో ఈ రోజు/మార్చి 29
1790: అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ టేలర్ జననం.
1857: మొదటి భారత స్వాతంత్ర్య పోరాటం -సిపాయిల తిరుగుబాటు.
1952 : ప్రముఖ రచయిత కె.ఎన్‌.వై.పతంజలి జననం.
1953 : హైదరాబాదు రాష్ట్రానికి చెందిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు జమలాపురం కేశవరావు జననం.
1982: తెలుగు సినిమా నటుడు నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారు.
1997 : భారతదేశ ప్రముఖ కళాకారిణి మరియు రచయిత్రి పుపుల్ జయకర్

నల్లమచ్చల అరటిపండు తినవచ్చు

ఎంత మాత్రం అలా చేయకండీ ఎందుకంటే వాటిల్లో ఎక్కువ పోషకాలు ఉంటాయని, అవి శరీరానికి అత్యంత లబాదయకమని కార్నెల్ యూనివర్సిటీ కాలేజ్ ఆడ హ్యూమన్ ఎకాలజీ వారు చెబుతున్నారు. మార్కెట్ కి వెళ్లి పసుపు పచ్చగా ఉండి ఒక్క మచ్చ కూడా లేని అరటి పండులు కొనుక్కోను వస్తాము. ఒక రోజు బాగానే ఉంటాయి అవిమాత్రం తింటారు. మచ్చలేమైనా ఉన్నాయేమోనని చెక్ చేసి మరీ తింటారు. కనీ మచ్చలు వచ్చి బాగా పండిన అరటి పండులో బోల్డెన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు. ఇందులో పోటాషీయం , మాంగనీసు, ఫిబార్, రాగి, విటమిన్ –సి, విటమిన్ బీ6 మరియు బయోటిన్ సంవృద్దిగా ఉన్నాయి. అస్తమా, క్యాన్సర్, అధిక రక్తపోటు, మధుమేహం, అజీర్తి, అలాగే జీర్ణ సమస్యలను నిరోధించడానికి సహాయపడుతోంది. బాగా పండిన అరటి పండులోని పోషకాలు .. పండిన అరటి పండులోని పోషకాలు మామూలు పండులో ఉన్నంత పరిమాణంలో ఉండవు. అరటి పండులో ఉన్న పిండి పదార్ధాలు పక్వానికి వచ్చే కొలదీ ఎక్కువగా ఉంటాయి. బాగా పండిన అరటి పండు శరీరానికి సరైన జీవక్రీయలను నిర్వహించడానికి ఎంతగానో సహాయపడుతుంది. యాంటీ ఆక్సిడెంటు అధికంగా ఉన్న కారణాన కణనష్టాన్ని నిరోధిస్తుంది. అంతర్గత ద్యమేజీలు మరియు ప్రీ రాడికల్స్ వలన కలిగే కణాల నష్టాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. రక్తపోటును తగ్గించడంలో సహాయపడే పోటాషీయం నిల్వలు అధికంగా ఉంటాయి. ఇందులో సోడియం తక్కువగా ఉంటుంది. ధమనుల్లోని అడ్డంకులను సహాయపడుతుంది. రక్త ప్రసరణ వ్యవస్థ సమర్దవంతంగా పని చేయడానికి తోడ్పడుతుంది. స్తోక్ మరియు హార్ట్ అటాక్ వంటి సమస్యలు రాకుండా చూస్తుంది. గుండెలలో మంటగా అనిపించినప్పుడు పండిన అరటి పండు తీసుకుంటే ఉపశమనంగా అనిపిస్తుంది. పండిన అరటి పండులో ఐరన్ ఎక్కువగా ఉన్న కారణంగా అనీమీయ సమస్యను తగ్గిస్తుంది. కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉన్న కారణంగా నీరసంగా అనిపించినప్పుడు పండిన అరటిపండు తీసుకుంటే త్వరగా శక్తి వస్తుంది. రెండు పండిన అరటి పండ్లు తీసుకుంటే తొంభై నిమిషాల పాటు వ్యాయామం చేయడనికి తగిన శక్తిని ఇస్తుంది అని పోషకాహార నిపుణులు చెబుతారు. క్యాన్సర్ తో పోరాడే శక్తి పండిన అరటి పండులో ఉంటుంది. అరటిపండు పై భాగంలో కనిపించే మచ్చలు ట్యూమర నెక్రోసిస్ ఫాక్టర్ ఏర్పాటు చేస్తాయి. ఇవి క్యాన్సర్ కణాలను చంపే సంశ్ర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. బాగా పండిన అరటి పండ్లు అల్సర్ సమస్యతో బాధపడేవారికి ఉపశమనాన్ని ఇస్తుంది. అల్సర్ నుంచి యాసీడ్లు ఉత్పత్తి కాకుండా నిరోధిస్తుంది. మలబద్దకం నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. జీర్నక్రీయ సక్రమంగా జరిగేలా పండిన అరటి పండు తోడ్పడుతుంది. అయితే అరటిపండుని మధుమేహంతో బాధపడే వారు తీసుకోకూడదు. చక్కర స్థాయిలు అధిక మోతాదులో ఉండడం వలన వారికి అంట ఉపయుక్తం కాదు, మిగిలిన వారందరూ నిరభ్యంతరంగా తీసుకోవచ్చు.

బార్లీ నీరు చాలా మంచిది

పోషకాలు అందించే బార్లీ వేసవికి సహజసిద్ధమైన ఔషధం లాంటిది. శరీరంలోని వేడిని తగ్గించి, తక్షణ శక్తిని అందించే గుణాలు ఇందులో అధికం. అసలు ఇది ఎలా మేలు చేస్తుందంటే…
బార్లీలోని పీచు పదార్థం జీర్ణాశయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
కాల్షియం, ఇనుము, మాంగనీసు, మెగ్నీషియం, జింక్‌, రాగి వంటి ఖనిజ లవణాలు… విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లను అందిస్తుంది బార్లీ.
ఈ గింజలు హృద్రోగాలను దరి చేరనివ్వవు. అధిక బరువును తగ్గిస్తాయి. కొలెస్ట్రాల్‌ తగ్గడమే కాదు… వ్యాధి నిరోధకశక్తి కూడా పెరుగుతుంది.
బార్లీ శరీరంలో అధిక నీటిని కూడా తొలగిస్తుంది. మూత్ర సంబంధ సమస్యలను కూడా అదుపులో ఉంచుతుంది.
బార్లీ నీటికి మజ్జిగ, నిమ్మరసం, తేనె, నారింజ రసాన్ని కలిపి తాగితే… రుచిగా ఉండటమే కాదు, వేసవిలో శరీర ఉష్ణోగ్రతను సమతూకం చేస్తుంది. ఎవరైనా బార్లీ నీటిని తాగొచ్చు.
**మజ్జిగతో కలిపి… బార్లీని లేత గోధుమ వర్ణం వచ్చేవరకు వేయించుకుని, పొడి చేసుకోవాలి. మూడు కప్పుల నీటిని పొయ్యిపై పెట్టి మరిగించాలి. అలాగే రెండు చెంచాల బార్లీ పొడిని పావుకప్పు నీటిలో ముందుగా కలిపి ఉంచుకోవాలి. మరిగిన నీటిలో ఈ మిశ్రమాన్ని కలపాలి. పది నిమిషాలు ఉడికించి చల్లార్చి వడకట్టుకోవాలి. ఈ నీటికి పావు గ్లాసు పల్చని మజ్జిగ, చిటికెడు ఉప్పు వేసి ఈ వేసవిలో తరచూ తాగితే మంచిది.

గోల్డ్ లోనా? పర్సనల్ లోనా? ఏది తీసుకుందాం?

ఆ లోన్ తీసుకోండి.. ఈ లోన్ తీసుకోండి అంటూ పొద్దున్న లేస్తే ఫోన్లో వాయించేస్తుంటారు. దీంట్లో మనకి పనికి వచ్చేవి కొన్నే ఉంటాయి. మిగతా వాటి పట్ల పొరపాటున అట్రాక్ట్ అయినా రేపొద్దున వడ్డీ కట్టాలంటే ఇబ్బంది పడేది కూడా మనమే. దానికంటే ముందే అది నిజంగా మనకి అవసరమా కాదా అని ఆలోచించి తీసుకుంటే మంచిది. హోమ్‌లోన్, ఎడ్యుకేషన్ లోన్, వెహికల్ లోన్ అంటే చాలా అవసరం కాబట్టి తప్పదు.అర్జంటుగా నగదు అవసరమైనప్పుడు పనికి వచ్చేది మాత్రం గోల్డ్ లోన్ చాలా ఉపయోగపడుతుంది. అలాగే ఈ గోల్డ్ లోన్‌కి క్రెడిట్ స్కోర్ బాధలు కూడా ఉండవు.గోల్డ్ లోన్ ప్రాసెస్‌ కూడా సులభంగా ఉంటుంది. బంగారం తనఖా పెట్టిన వెంటనే నగదు ఇస్తుంటారు. కొన్ని నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ చెప్పే మాటలు విని మోసపోకండి.రీపేమెంట్ కూడా ఈజీగానే వుంటుంది. వడ్డీ చెల్లింపు విషయంలో ఇబ్బంది ఉండదు. అసలు కడుతూ వడ్డీ నెమ్మదిగా కట్టుకోవచ్చు.ఇతర లోన్ల వడ్డీ రేట్లతో పోల్చితే గోల్డ్ లోన్స్ మీద వడ్డీ రేట్లు తక్కువగా ఉంటాయి.ఇక గోల్డ్ లోన్ తీసుకుంటున్నవారు గుర్తుంచుకోవలసిన ముఖ్య విషయాలు కూడా కొన్ని ఉన్నాయి. అవి..బ్యాంకులు సాధారణంగా బంగారం మొత్తం వాల్యూ మీద 75 శాతం మాత్రమే నగదును రుణంగా ఇస్తాయి.మీరు రుణం చెల్లించలేని పరిస్థితుల్లో తనఖా పెట్టిన బంగారం మొత్తం శాశ్వతంగా బ్యాంకు లేదా ఎన్‌బీఎఫ్‌సీ ఆధీనంలోకి వెళ్లిపోతుంది.సాధారణంగా బంగారు నగల తనఖా గరిష్టంగా 3 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది.ఇక పర్సనల్ లోన్స్ విషయానికి వస్తే..డాక్యుమెంటేషన్ సులభంగా పూర్తవుతుంది.పర్సనల్ లోన్ పొందేందుకు ఎలాంటి సెక్యూరిటీ అవసరం లేదు. గోల్డ్ లోన్‌తో పోల్చితే ఇది చాలా సులభం అని చెప్పవచ్చు.అవసరానికి పర్సనల్ లోన్ పొందొచ్చు.పర్సనల్ లోన్స్ తీసుకునే ముందు వాటిలో ఉన్న ఇబ్బందులను ఓ సారి పరిశీలించాలి.పర్సనల్ లోన్స్ సాధారణంగా అధిక వడ్డీ రేట్లను కలిగి ఉంటాయి. ఇదే పర్సనల్ లోన్స్ పొందేందుకు ప్రధాన అడ్డంకిగా మారతాయి.ముఖ్యంగా పర్సనల్ లోన్ పొందాలంటే కచ్చితంగా క్రెడిట్ కార్డ్ స్కోర్‌ని పరిగణనలోకి తీసుకుంటారు. క్రెడిట్ స్కోర్ అంటే ట్రాన్సాక్షన్లు, వడ్డీ సమయానికి కడుతున్నారా లేదా ఇంకా మరికొన్ని విషయలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఇస్తారు.లోన్ ముందు చెల్లిస్తే కూడా పెనాల్టీ కట్టాల్సి ఉంటుంది. అందుకు బ్యాంకులు ఎలాంటి మొహమాటం లేకుండా లోన్ క్యాన్సిలేషన్ ఛార్జీలను మీ దగ్గర నుంచి వసూలు చేస్తారు. పర్సనల్ లోన్స్ విషయంలో ఇది కూడా ఒక ప్రధాన అడ్డంకిగా మారుతుంటుంది.దీన్ని బట్టి లోన్ ఇస్తాం తీసుకోండి బాబు అని మీ వెంట పడే బ్యాంకులు.. అందులోని సాధక బాధలన్నీ తెలుసుకున్నాకే తీసుకోండి. కాస్త ఆలస్యమైనా అన్ని వివరాలు అడిగి తెలుసుకున్నాకే ముందడుగేయండి.

పవార్ పవరే వేరప్పా!

రాజకీయాలు.. వివాదాలు.. ఆస్తులు.. ఆటలు.. అన్నీ కలిస్తే శరద్‌ పవార్‌. దేశ రాజకీయాల్లో పవార్‌ది ప్రత్యేక పాత్ర. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఆయన సొంతం. 37 ఏళ్లకే మహారాష్ట్ర సీఎం పీఠమెక్కారు. కాంగ్రెస్‌లో ఉండి ఏకంగా సోనియా గాంధీ జాతీయతపై ప్రశ్నలు లేవనెత్తారు. వివాదాలు-విమర్శలు ఎన్ని ఎదురైనా దీటుగా ఎదుర్కొన్నారు.
పూర్తి పేరు: శరద్‌ చంద్ర గోవింద్‌రావ్‌ పవార్‌
జననం: 1940 డిసెంబరు 12న బారామతిలోని ఓ సాధారణ వ్యవసాయ కుటుంబంలో
తొలి విజయం: 1967లో బారామతి నుంచి ఎమ్మెల్యేగా (కాంగ్రెస్‌)
**తొలిసారి సీఎం పీఠంపై..
పవార్‌ 1978లో కాంగ్రెస్‌ నుంచి విడిపోయి, జనతా పార్టీతో కలిసి మహారాష్ట్రలో ప్రోగ్రెసివ్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌(పీడీఎఫ్‌) ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు. తొలిసారిగా సీఎం పదవిని అలంకరించారు. కేంద్రంలో ఇందిరాగాంధీ అధికారంలోకి వచ్చాక 1980 ఫిబ్రవరిలో పీడీఎఫ్‌ ప్రభుత్వం రద్దయింది. 1983లో కాంగ్రెస్‌(సోషలిస్ట్‌) పార్టీ అధ్యక్ష బాధ్యతలను పవార్‌ స్వీకరించారు. 1984లో బారామతి నుంచి ఎంపీగా గెలిచారు. మరుసటి ఏడాది అక్కడి నుంచే ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఎంపీ పదవికి రాజీనామా చేసి రాష్ట్ర రాజకీయాల్లో కొనసాగారు. రాష్ట్రంలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకుగాను కాంగ్రెస్‌(సోషలిస్ట్‌) 54 సీట్లు దక్కించుకోవడంతో ప్రతిపక్షనేతగా బాధ్యతలు చేపట్టారు.
**శివసేనకు కళ్లెం వేసే బాధ్యత
1987లో పవార్‌ కాంగ్రెస్‌(ఐ) గూటికి చేరుకున్నారు. మహారాష్ట్రలో శివసేన పట్టు పెరగకుండా చూసే బాధ్యతను అధిష్ఠానం ఆయనకు అప్పగించింది. దాన్ని నిర్వర్తించడంలో చాలావరకు సఫలమయ్యారు! 1988లో అప్పటి మహారాష్ట్ర సీఎం శంకర్‌రావు చవాన్‌ను కేంద్ర ఆర్థికమంత్రిగా రాజీవ్‌ గాంధీ తన మంత్రిమండలిలోకి తీసుకోవడంతో పవార్‌ తిరిగి సీఎం అయ్యారు. 1990 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు భాజపా-శివసేనల నుంచి గట్టి పోటీ ఎదురైంది. కాంగ్రెస్‌కు 141 సీట్లు వచ్చాయి. దీంతో 12 మంది స్వతంత్రుల మద్దతుతో పవార్‌ మళ్లీ సీఎం పీఠమెక్కారు.
ప్రధాని పదవి రేసులో..
రాజీవ్‌ గాంధీ హత్య తర్వాత ప్రధాని పదవి రేసులో పవార్‌ నిలిచారు. ఆయనతోపాటు పీవీ నరసింహారావు, ఎన్డీ తివారీ పేర్లను కాంగ్రెస్‌ పరిశీలించింది! చివరకు పీవీ ప్రధాని పీఠాన్ని అధిష్ఠించగా.. పవార్‌ రక్షణమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆపై మహారాష్ట్ర సీఎం పదవి నుంచి సుధాకర్‌రావు నాయక్‌ దిగిపోవడంతో దేశ రాజకీయాల్లో రాష్ట్రానికి ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని తిరిగి పవార్‌ను ముఖ్యమంత్రిగా చేశారు పీవీ.
**ఎన్సీపీ స్థాపన
12వ లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా పవార్‌ పనిచేశారు. 1999లో ఆ సభ రద్దయ్యాక.. సోనియా గాంధీని కాకుండా భారత్‌లో పుట్టిన ఇతర నేతనెవరినైనా ప్రధాని అభ్యర్థిగా కాంగ్రెస్‌ ప్రకటించాలని పవార్‌, పి.ఎ.సంగ్మా, తారిక్‌ అన్వర్‌ డిమాండ్‌ చేశారు. సోనియా జాతీయతపై ప్రశ్నలు లేవనెత్తారు. అదే ఏడాది జూన్‌లో పవార్‌, సంగ్మా కలిసి నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ(ఎన్సీపీ)ని స్థాపించారు. 2004లో తిరిగి యూపీయేలో చేరిన పవార్‌.. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
**ఆటలతో అనుబంధం
పవార్‌కు క్రీడలతో ప్రత్యేక అనుబంధం ఉంది. ముంబయి క్రికెట్‌ అసోసియేషన్‌, మహారాష్ట్ర రెజ్లింగ్‌, కబడ్డీ, ఖోఖో అసోసియేషన్‌లకు అధ్యక్షుడిగా ఆయన పనిచేశారు. భారత క్రికెట్‌ నియంత్రణ మండలి(బీసీసీఐ)తోపాటు అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ)కి నేతృత్వం వహించారు.
**లెక్కలేనన్ని వివాదాలు
పవార్‌ తన రాజకీయ జీవితంలో అనేక వివాదాల్లో చిక్కుకున్నారు. సీఎంగా ఉండి నేరగాళ్లను రక్షించారని, అవినీతికి పాల్పడ్డారని ఆయనపై ఆరోపణలున్నాయి. అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీంతో పవార్‌కు సన్నిహిత సంబంధాలున్నట్లు వార్తలొచ్చాయి. నకిలీ స్టాంపుల కుంభకోణం, ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)కు పన్ను మినహాయింపు వంటి వ్యవహారాల్లో కూడా ఆయనపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఆస్తుల ప్రకటనలో పవార్‌ పారదర్శకత పాటించలేదనే ఆరోపణలున్నాయి.
**వారసత్వం
పవార్‌ కుమార్తె సుప్రియా సూల 16వ లోక్‌సభ సభ్యురాలు. 2009, 2014 ఎన్నికల్లో బారామతి నుంచి ఎంపీగా ఆమె గెలుపొందారు. ఈ ఎన్నికల్లో మరోసారి అక్కడి నుంచే తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
**పద్మ విభూషణ్‌
మనదేశంలో రెండో అత్యున్నత పౌర పురస్కారమైన ‘పద్మ విభూషణ్‌’ 2017లో పవార్‌ను వరించింది.
ఎన్డీయేకు వ్యతిరేకంగా విపక్షాలను ఏకతాటిపై నడిపించడంలో పవార్‌ కీలక పాత్ర పోషించే అవకాశముంది. మహారాష్ట్రలో ఎన్సీపీతో కాంగ్రెస్‌ పొత్తుకు ఇది కూడా ఒక కారణం.

మరో 40 మల్టిప్లెక్స్‌లు-వాణిజ్య-03/29

* మిరాజ్ సినిమాస్ రాబోయే15 నెలల్లో తెలంగాణలో మరింత విస్తరించనుంది. హైదరాబాద్‌‌లో ప్రస్తుతం 4 స్క్రీన్లుండగా, విస్తరణలో భాగంగా మరో 36 స్క్రీన్లను ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. తెలంగాణలోని కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మంలలో కూడా మల్టీప్లెక్సులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. తెలంగాణలో స్క్రీన్ల పెంపుకు దాదాపు రూ.80 కోట్ల దాకా ఖర్చుచేయనున్నట్లు మిరాజ్ సినిమాస్ ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ భువనేష్ మెండిరట్ట చెప్పారు.
*ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడంతో పాటు, సత్వరం తుది ఆమోదం కూడా డిజిటల్‌ పద్ధతిలోనే పొందే రెండు రకాల గృహ రుణ ఉత్పతుల్ని ఐసీఐసీఐ బ్యాంక్‌ ప్రకటించింది
* వాబ్‌కో ఇండియా షేర్లు దాదాపు 8శాతం పెరిగాయి. దీని మాతృసంస్థ వెబ్‌కో హోల్డింగ్స్‌ జెడ్‌ఎఫ్‌ ఫ్రైరిచెష్ఫన్‌ ఏజీతో ఒప్పందానికి రావడంతో షేర్లు ర్యాలీ చేశాయి. జెడ్‌ఎఫ్‌ సంస్థ దాదాపు 136 మిలియన్‌ డాలర్లు విలువైన షేర్లను నగదు చెల్లించి కొనుగోలు చేయనుంది. ఈ సంస్థ విలువను దాదాపు 7బిలియన్‌ డాలర్లుగా అంచనా వేశారు. దీంతో వాబ్‌కో ఉదయం 10.45 సమయంలో 7.69శాతం పెరిగి రూ.6,852 వద్దకు చేరాయి.
*మహీంద్రా అండ్‌ మహీంద్రా (ఎంఅండ్‌ఎం) వచ్చే నెల 1 నుంచి వాహన ధరల్ని పెంచబోతున్నట్లు ప్రకటించింది.
*కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రా బ్యాంకు ప్రిఫరెన్షియల్‌ అలాట్‌మెంట్‌ పద్ధతిలో 114,56,72,061 ఈక్విటీ షేర్లు కేటాయించింది. ఒక్కొక్కటీ రూ.10 ముఖ విలువ కల షేర్‌ను రూ.18.42 ప్రీమియంతో కలిపి రూ.28.42 ధరకు ఈ షేర్లు జారీ చేసింది.
*ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో ఉన్న నవయుగ కంటెయినర్‌ టెర్మినల్‌ (ఎన్‌సీటీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 5 లక్షల టీఈయూ (ట్వంటీ-ఫుట్‌ ఈక్వలెంట్‌ యూనిట్‌) సరకు నిర్వహణతో ముఖ్యమైన మైలురాయిని అధిగమించింది.
*వైద్య సేవల రంగంలో సేవలనందిస్తోన్న కాల్‌హెల్త్‌ తన వినియోగదారుల వ్యక్తిగత సమాచారానికి మరింత భద్రత కల్పించేందుకు బ్లాక్‌చైన్‌ సాంకేతికతను వాడుతున్నట్లు తెలిపింది.
*ఏబీఎన్‌ ఆమ్రో బ్యాంకుకు చెందిన పూర్తి స్థాయి అనుబంధ సంస్థ స్టేటర్‌లో 75 శాతం వాటాను ఇన్ఫోసిస్‌ కొనుగోలు చేయనుంది.
*పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ), బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, యూనియన్‌ బ్యాంక్‌, ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంక్‌ (ఐఓబీ), సెంట్రల్‌ బ్యాంకులకు ప్రభుత్వం రూ.21,428 కోట్ల మూలధనం అందించబోతోంది.
*ప్రైవేటు ఈక్విటీ(పీఈ), వెంచర్‌ క్యాపిటల్‌(వీసీ) పెట్టుబడుల రూపంలో 2018లో భారత్‌లోకి 20.5 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.1,43,000 కోట్లు) వచ్చాయని ఓ నివేదిక చెబుతోంది.
*రూరల్‌ ఎలక్ట్రిక్‌ కార్పొరేషన్‌ (ఆర్‌ఈసీ)లో మెజార్టీ వాటాను పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (పీఎఫ్‌సీ) సొంతం చేసుకుంది. దీనికి సంబంధించి కొనుగోలు ప్రక్రియను గురువారం పూర్తి చేసింది.
* మారుతీ సుజుకీ తమ మధ్య స్థాయి సెడాన్‌ కారు సియాజ్‌ను సరికొత్త ఇంజిన్‌తో విపణిలోకి విడుదల చేసింది. న్యూ అల్యూమినియం 1.5 లీటర్‌ డీడీఐఎస్‌ 225 డీజిల్‌ ఇంజిన్‌, సిక్స్‌ స్పీడ్‌ ట్రాన్స్‌మిషన్‌, మెరుగుపరిచిన సామర్థ్యంతో దీన్ని తీర్చిదిద్దినట్లు వెల్లడించింది.
*జర్మనీ విలాసవంత కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ 530ఐ ఎం స్పోర్ట్‌ కారును దేశీయ విపణిలోకి విడుదల చేసింది. దీని ధరను రూ.59.2 లక్షలుగా (ఎక్స్‌-షోరూమ్‌) నిర్ణయించింది.
*పెన్నా గ్రూపు, రస్‌ ఆల్‌ ఖైమాల భాగస్వామ్యంతో విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన ఆన్‌రాక్‌ అల్యూమినియం కంపెనీకి గురువారం తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది.
*అపాచీ ఆర్‌టీఆర్‌ శ్రేణి అన్ని బైక్‌లను యాంటీ-లాక్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌ (ఏబీఎస్‌)తో ఆధునికీకరించినట్లు టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ వెల్లడించింది.
*అయిదు నెలల వ్యవధిలోనే రెండు ఘోర దుర్ఘటనలకు కారణమైన 737 మ్యాక్స్‌ విమానాల్లో సాఫ్ట్‌వేర్‌ను నవీకరిస్తుస్తామని, ఫలితంగా విమాన నియంత్రణ వ్యవస్థలో లోపాలు ఉండబోవని తయారీ సంస్థ బోయింగ్‌ ప్రకటించింది.
*శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి (ఆర్‌జీఐఏ) తాజాగా రెండు అంతర్జాతీయ పురస్కారాలు లభించాయి.

నిప్పు-నిజాయితీ

‘‘తప్పు చేసినవాళ్లు మాత్రమే భయపడతారు. నేనెప్పుడూ నిజాయతీగా ఉండడానికి ప్రయత్నిస్తా. అందుకే నాకు భయపడడం చేతకాదు’’ అంటోంది కాజల్‌. ప్రసుత్తం తేజ దర్శకత్వం వహిస్తున్న ‘సీత’లో నటిస్తోందామె. త్వరలో ఈ చిత్రం విడుదల కానుంది. కాజల్‌ మాట్లాడుతూ ‘‘ఎదుటివాళ్లని గౌరవిస్తాను. వాళ్ల మాటల్ని వింటాను. కానీ నా మనసులో ఏముందో అదే మాట్లాడతాను. పరిశ్రమలో ఎక్కువకాలం అణిగిమణిగి ఉండలేం. అప్పుడప్పుడూ కాస్త దురుసుగా ఉండాలి. లేదంటే మనల్ని తమ చేతుల్లోకి తీసుకోవాలని కొంతమంది ప్రయత్నిస్తుంటారు. నేనెప్పుడూ చెప్పుడు మాటల్ని వినను. అలాంటివి ప్రోత్సహించను. నాకెప్పుడూ అమ్మా, నాన్న, చెల్లాయి రూపంలో నాకో రక్షణ కవచం ఉంది. దాన్ని దాటుకుని ఎవరూ రాలేరు. వాళ్లుంటే నాకుండే ధీమానే వేరు’’ అని చెబుతోంది.

ఖాళీ లేని ఖన్నా

అటు ప్రమోషన్స్‌ ఇటు షూటింగ్స్‌తో బిజీ బిజీగా ఉంటున్నారు రాశీఖన్నా. విజయ్‌సేతుపతి, రాశీ జంటగా ‘స్కెచ్‌’ ఫేమ్‌ విజయ్‌చందర్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తొలి షెడ్యూల్‌ హైదరాబాద్‌లో ముగిసింది. దీంతో విశాల్‌ ‘అయోగ్య’ (తెలుగు ‘టెంపర్‌’ తమిళ రీమేక్‌) సినిమా ప్రమోషన్స్‌ కోసం చెన్నై వెళ్లారు రాశీ. విజయ్‌ సేతుపతి సినిమా నెక్ట్స్‌ షెడ్యూల్‌ కూడా చెన్నైలో స్టార్ట్‌ కానుంది.అంటే.. కొన్ని రోజులు రాశీ అక్కడే ఉంటారా? అంటే కాదనే చెప్పాలి. ఎందుకంటే వెంకటేశ్, నాగచైతన్య హీరోలుగా కేఎస్‌. రవీంద్ర దర్శకత్వంలో ‘వెంకీమామ’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌ కోసం చెన్నై నుంచి రాశీ సూట్‌ కేస్‌ సర్దుకుని వేరే లొకేషన్‌లోకి వాలిపోవాల్సిందే. ఈ చిత్రంలో నాగచైతన్యకు జోడీగా నటిస్తున్నారు రాశీ. ఇలా గ్యాప్‌ లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నారీ బ్యూటీ.

ప్రమాణం

బాలీవుడ్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్‌ సీయంగా ప్రమాణస్వీకారం చేయడానికి రంగం సిద్ధం అయ్యింది. ఆల్రెడీ దేశంలో మస్త్‌ ఎలక్షన్‌ మజా నడుస్తోంది. కంగన ఏమైనా పాలిటిక్స్‌ వైపు కన్నేశారా? ఏ పార్టీలో జాయిన్‌ అవ్వబోతున్నారు? అని ఆలోచనలో పడకండి. ఎందుకంటే అలాంటిది ఏమీ లేదు. కంగనా ప్రమాణస్వీకారం చేయబోతున్నది వెండితెరపై. తమిళనాడు మాజీ సీయం జయలలిత జీవితం ఆధారంగా ఏఎల్‌. విజయ్‌ దర్శకత్వంలో ‘తలైవి’ (నాయకురాలు) అనే బయోపిక్‌ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. హిందీలో ‘జయ’ అనే టైటిల్‌ పెట్టారు. శైలేష్‌ ఆర్‌ సింగ్, విష్ణువర్థన్‌ ఇందూరి నిర్మించనున్నారు. విజయేంద్రప్రసాద్‌ కథ అందిస్తారు.ఈ బయోపిక్‌లో జయలలిత పాత్రలో కంగనా రనౌత్‌ నటించబోతున్నట్లు శనివారం అధికారిక ప్రకటన వెల్లడైంది. ‘‘మన దేశంలో అత్యంత విజయవంతమైన మహిళా నాయకురాలు జయలలితగారు. వెండితెరపై సూపర్‌స్టార్‌గా ఎదిగి తర్వాత రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. ఈ మెగా ప్రాజెక్ట్‌లో నా భాగస్వామ్యం ఉండబోతున్నందుకు ఆనందంగా ఉంది’’ అని పేర్కొన్నారు కంగన. ‘‘జయలలితగారి బయోపిక్‌ను తెరకెక్కించడాన్ని ఓ బాధ్యతగా భావిస్తున్నాను. చాలా జాగ్రత్తగా నిజాయతీగా తెరకెక్కిస్తాం. డైనమిక్‌ లీడర్‌ పాత్రలో ప్రతిభావంతురాలైన కంగనా రనౌత్‌ నటించనున్నారు. చాలా ఆనందంగా ఉంది’’ అని ఏఎల్‌. విజయ్‌ అన్నారు. అలాగే శనివారం కంగనా రనౌత్‌ పుట్టినరోజు. 32వ వసంతంలోకి అడుగుపెట్టారామె.