వాళ్ళు ఇచ్చిన గానీ…సాధువులు తీసుకుంటారా?

గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రకటించిన ‘భారత రత్న’ అవార్డుల పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన వారి జాబితాలో యోగా గురువు రాందేవ్‌ బాబా కూడా చేరారు. దేశంలో అత్యున్నత పురస్కారమైన భారతరత్నకు ఎంపిక చేయడంలో సెలక్షన్‌ కమిటీ పక్షపాతం చూపిందని ఆరోపించారు. సాధువులను కమిటీ సభ్యులు పట్టించుకోలేదన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. ‘ స్వామి వివేకానంద, దయానంద సరస్వతిలు దేశానికి చేసిన సేవకంటే రాజకీయ నాయకులు, కళాకారులు చేసిన సేవలు ఎక్కువా? ఈ రోజుకీ వివేకానంద ప్రసంగాలు, సూక్తులు వల్లె వేస్తున్నారు కదా! మరి అలాంటి గొప్ప వ్యక్తి ‘భారత రత్న’కు అర్హుడు కాకుండా పోయారా? రాజకీయ, క్రీడా, సినీ రంగాలు చేసే గొప్ప సేవలు సాధువులు చేయడం లేదా? 70 ఏళ్లలో ఎవరైనా సరే ఏ ఒక్క సాధువుకైనా ‘భారత రత్న’ ఇచ్చారా? మదర్‌ థెరీసాకి దేశ అత్యున్నత పురస్కారం ఇచ్చినప్పుడు సాధువులకు ఇవ్వడంలో ఎందుకు పక్షపాతం చూపుతున్నారు. హిందుత్వం కోసం పాటుపడే సన్యాసులను కొందరు చులకనగా చూస్తున్నారు. ఈ దేశంలో హిందూ సాధువులుగా పుట్టడం అంత పాపమా?’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, సామాజిక కార్యకర్త, ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంత కర్త నానాజీ దేశ్‌ముఖ్‌(మరణానంతరం), అసోమ్‌ గాయకుడు డా. భూపేన్‌ హజారికాకు కేంద్ర ప్రభుత్వం ‘భారత రత్న’ అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే.

12 రకాల ఆసనాల కలయిక సూర్యనమస్కారం

సూర్య నమస్కారం అనే పేరు ఒక్కటే అయినా… అందులో 12 రకాల ఆసనాలు ఉంటాయి.

ఆసనానికో ప్రయోజనం :-

సూర్య నమస్కారం అనే పేరు ఒక్కటే అయినా… అందులో 12 రకాల ఆసనాలు ఉంటాయి. ఈ పన్నెండు చేస్తే ఒక వృత్తం పూర్తయినట్లు! వీటిలో ఒకటి నుంచి ఐదు… ఎనిమిది నుంచి పన్నెండు ఆసనాలు ఒకేలా ఉంటాయి. కుడి, ఎడమల తేడా మాత్రమే ఉంటుంది. ఏ ఆసనంతో ఎలాంటి లబ్ధి చేకూరుతుందో చూద్దాం…

ఒకటి, పన్నెండు :- శరీర సమతుల్యత సాధించవచ్చు. శ్వాసకోశ వ్యవస్థ మెరుగుపడుతుంది. వెన్నెముక, మెడ, భుజాల దగ్గర ఉన్న కండరాలు బలోపేతం అవుతాయి.

రెండు, పదకొండు :- జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. వెన్నెముక, పిరుదులు బలోపేతమవుతాయి.

మూడు, పది :- రక్త ప్రసరణ పెంచుతాయి. కాలి కండరాలను బలోపేతం చేస్తాయి. గ్రంధులపై కూడా ప్రభావం చూపుతాయి.

నాలుగు, తొమ్మిది :- వెన్నెముక, చేతి మణికట్టు కండరాలను బలోపేతం చేస్తాయి.
ఐదు, ఎనిమిది: గుండెను బలోపేతం చేస్తాయి. మెడ, భుజాల దగ్గర ఉండే ఒత్తిడిని తగ్గిస్తాయి.

ఆరో ఆసనం :- మెడ, భుజాలలో ఒత్తిడిని తగ్గిస్తుంది.

ఏడో ఆసనం :- జీర్ణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. వెన్నెముక బలంగా మారడానికి ఉపకరిస్తుంది.

మరెన్నో లాభాలు :-

సూర్య నమస్కారాలతో ఎముకలు, కండరాలు బలోపేతమై ఆరోగ్యంగా ఉండటమే కాదు… మధుమేహం, బీపీ, గుండె జబ్బుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుందని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. “సూర్య నమస్కారాలలో 12 రకాల భంగిమలు ఉంటాయి. వీటిలో కొన్నింటిని నెమ్మదిగా చేయాలి. మరి కొన్నింటిని వేగంగా చేయాలి. వేగంగా చేసే భంగిమల్లో కండరాలకు మేలు జరుగుతుంది. ఏరోబిక్స్‌తో సమానమైన ఫలితాలు సాధించవచ్చు. నెమ్మదిగా చేసే సూర్య నమస్కారాలు శ్వాస నియంత్రణకు ఉపయోగపడతాయి.
ఎక్కువ గాలిని పీల్చి, వదలడం ద్వారా ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది” అని ఆనంద బాలయోగి వివరించారు. అధిక బరువు తగ్గడం, జీర్ణ ప్రక్రియ మెరుగవడంతోపాటు… సూర్య నమస్కారాలతో మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. సూర్య నమస్కారాలు శరీర భాగాలపైనే కాకుండా గ్రంధులపైనా పని చేస్తాయి. థైరాయిడ్, పార్థరాయిడ్, పిట్యూటరీ వంటి గ్రంధులు సాధారణ స్థాయిలో పని చేయడానికి ఇవి ఎంతో ఉపకరిస్తాయి.

1.నమస్కారాసనం ( ఓం మిత్రాయ నమ ):-
సూర్యునికి ఎదురుగా నమస్కారం చేస్తున్నట్లు నిలబడి సూర్యుని నామాన్ని ఉచ్ఛరించాలి.

2.హస్త ఉత్తానాసనం ( ఓం రవయే నమః) :-
కొద్దిగా శ్వాస పీల్చి రెండు చేతులను పైకెత్తి, తలను, నడుమును వెనుకకు వంచాలి. కాళ్ళు వంచకూడదు.

3.పాదహస్తాసనం ( ఓం సూర్యాయ నమః) :-
శ్వాస వదలి రెండు చేతులను కాళ్ళకు దగ్గరగా భూమిమీద ఆనించి, తలను మోకాలుకు ఆనించాలి.

4.ఆంజనేయాసనం ( ఓం భానవే నమ ) :-
ఎడమ మోకాలును వంచి పాదాన్ని నేలపై ఉంచి, కుడి పాదాన్ని వెనుకగా వేళ్ళపై ఆనించి, రెండు చేతులను పైకి చాపి, నడుము పైభాగాన్నంతా వెనుకకు వంచాలి. ఈ స్థితిలో శ్వాసను పీల్చి లోపలే ఆపాలి.

5.పర్వతాసనం ( ఓం ఖగాయ నమః) :-
కాళ్ళు, చేతులు నేలమీద ఆనించి నడుము పైకి ఎత్తి శ్వాస వదలి తిరిగి పీల్చాలి.

6.సాష్టాంగ నమస్కారం ( ఓం పూష్ణే నమః) :-
ఎనిమిది అంగాలు నేలకు ఆనటం వలన దీనికి ‘అష్టాంగ నమస్కారం’ అని కూడా అంటారు. రెండు కాళ్ళు, రెండు మోకాళ్ళు, రెండు చేతులు, రొమ్ము మరియు గడ్డం – ఈ ఎనిమిది అంగాలు నేలమీద ఉంచి నడుమును కొద్దిగా పైకి లేపాలి. శ్వాసను పూర్తిగా బయటకు వదలి ఆపాలి.

7.సర్పాసనం ( ఓం హిరణ్యగర్భాయ నమః ) :-
శ్వాసను పీల్చి తలను వెనుకకు వంచాలి.

8.పర్వతాసనం ( ఓం మరీచయే నమః) :-
ఐదవ స్థితివలెనే కాళ్ళు చేతులు నేలమీద ఆనించి నడుమును పైకి ఎత్తి శ్వాస వదలి తిరిగి పీల్చాలి.

9.ఆంజనేయాసనం ( ఓం ఆదిత్యాయ నమః) :-
నాలుగవ స్థితివలెనే కుడి పదాన్ని నేలపై ఉంచి, మోకాలును మడచి, ఎడమ పాదాన్ని వెనుకగా వేళ్ళపై ఆనించి, రెండు చేతులను, తలను, నడుమును వెనుకకు వంచాలి

10.పాదహస్తాసనం ( ఓం సవిత్రే నమః) :-
మూడవ స్థితివలెనే రెండు చేతులను కాళ్ళ దగ్గరగా నేలపై ఆనించి తలను మోకాలుకు ఆనించాలి. శ్వాసను బయటకు వదలి ఆపాలి.

11.హస్త ఉత్తానాసనం ( ఓం అర్కాయ నమః) :-
రెండవ స్థితివలెనే రెండు చేతులను పైకెత్తి, తలతోపాటు రెండు చేతులను వెనుకకు వంచాలి.

12.నమస్కారాసనం ( ఓం భాస్కరాయ నమః) :-
నిటారుగా నిలబడి నమస్కారం చేయాలి.

కేదస అధికారులకు యోగా శిక్షణ

కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) అధికారులు మానసిక దృఢత్వం కోసం శిక్షణ తీసుకోబోతున్నారు. సీబీఐ పెద్దల మధ్య వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో మానసిక ఆరోగ్యం, ఒత్తిడిని జయించడం వంటివాటిపై అధికారులు దృష్టి సారించారు. సీబీఐ శుక్రవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం…శ్రీ శ్రీ రవిశంకర్ ఏర్పాటు చేసిన ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ నెల 10 నుంచి 12 వరకు ఈ శిక్షణ కార్యక్రమాలు జరుగుతాయి. ఇన్స్పెక్టర్ స్థాయి నుంచి ఇన్ఛార్జ్ డైరెక్టర్ స్థాయి వరకు దాదాపు 150 మందికి పైగా సీబీఐ అధికారులు పాల్గొంటారు. సమష్టి తత్త్వాన్ని అలవరచుకోవడం, సమర్థతను పెంచుకోవడం, సకారాత్మక దృక్పథాన్ని పెంపొందించుకోవడమే ఈ కార్యక్రమాల లక్ష్యం.సీబీఐ స్పెషల్ డైరెక్టర్ ఆస్థానా ఆ సంస్థ డైరెక్టర్ అలోక్ వర్మపై చేసిన ఆరోపణలపై విచారణను రెండు వారాల్లోగా పూర్తి చేయాలని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ను సుప్రీంకోర్టు గత నెల 26న ఆదేశించిన సంగతి తెలిసిందే.

“ఇన్నర్ స్పేస్” ప్రారంభించిన జానకీ దాదీ

50 ఏండ్ల ధ్యాన యోగ కేంద్రం శాంతి సరోవర్‌లో గోల్డ్డెన్ జూబ్లీ ఉత్సవాలు సందేశమిచ్చిన మహా తపస్విని దాదీ జానకీ నేడు ఆధ్యాత్మిక ఇన్నర్ స్పేస్ ప్రారంభం కాబోతున్నది. హైదరాబాద్‌కు ఇన్నర్ స్పేస్ ఇదే తొలిసారి.
**ప్రస్తుత జీవన విధానంలో బాహ్య సంతృప్తి మాత్రమే ఉందని, ఆత్మ సంతృప్తి లేదన్నారు. ధ్యానం జీవన విధానంలో భాగం కావాలని పిలుపునిచ్చారు బ్రహ్మకుమారీల ముఖ్య అధినేత్రి దాదీ జానకీ. ఆదివారం గచ్చిబౌలిలోని శాంతి సరోవర్‌లో ఇన్నర్ స్పేస్ ఆధ్యాత్మిక కేంద్రం ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో 103 ఏండ్ల దాదీ జానకీ పాల్గొన్నారు. వివిధ దేశాల్లో ఆమెకు లక్షలాది మంది శిష్యులున్నారు.
**తెలంగాణకు మరో అరుదైన గౌరవం. ఐటీ కారిడార్‌కు వేదికైన గచ్చిబౌలి ప్రాంతం ఆధ్యాత్మిక వైభవాన్ని సంతరించుకుంది.130 దేశాల్లో బ్రహ్మ కుమారీల కేంద్రాలను విస్తరించి, ధ్యానం, వైద్యం, ఆధ్యాత్మిక రంగాల్లో కీపర్స్ ఆఫ్ విస్‌డమ్‌గా కీర్తికెక్కిన వారి చేతుల మీదగా ఇన్నర్ స్పేస్ ఆధ్యాత్మిక కేంద్రం ప్రారంభం కానుంది.
***50 ఏండ్ల ధ్యాన కేంద్రం
హైదరాబాద్ శాంతి సరోవర్ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలకు ముస్తాబైంది. ఈ ఆదివారంతో ఈ ధ్యాన కేంద్రం 50 వసంతాలను పూర్తి చేసుకుంటున్నది. కేవలం వందల మంది బ్రహ్మకుమారీలతో మొదలైన శాంతి సరోవరం.. నేడు లక్షల మంది శిష్యులకు వేదికగా మారింది. 50 ఏండ్ల కిందట బ్రహ్మ కుమారీ మహేంద్ర బాయి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ ధ్యాన కేంద్రం ఏర్పాటైంది. దీని పునాదితో కొన్ని వందల ధ్యాన కేంద్రాలు రాష్ట్రంలో మొదలయ్యాయి. రాజస్థాన్‌లో ధ్యాన కేంద్రాలను ప్రారంభం చేసిన దాదీ, మహా తపస్విని దాదీ జానకీ స్ఫూర్తితో హైదరాబాద్‌లో ఈ కేంద్రాన్ని ప్రారంభం చేశారు. శాంతి సరోవర్ సంచాలకులు కుల్దీప్ బెన్ ఈ వేడుకలకు శ్రీకారం చుట్టారు. 50 ఏండ్లుగా బ్రహ్మ కుమారీల ఆధ్యాత్మిక సేవలకు హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలో శాంతి సరోవరం కేంద్రంగా విస్తరించారు. దక్షిణ భారత దేశానికి రిట్రీట్ సెంటర్ అయిన శాంతి సరోవర్‌తో వేలాది మందికి ఒత్తిడి లేని జీవితాన్ని అందిస్తున్నారు. దీనిలో భాగంగా శాంతి సరోవరంలో ఇన్నర్ స్పేస్ ఆధునిక భవనాన్ని నిర్మాణం చేశారు. ఆధునిక సమాజానికి మరియు యువత, ఐటీ రంగాల్లో చిన్న వయస్సుల్లోనే పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఉద్యోగులకు ప్రత్యేకమైన రీతిలో తర్కబద్దంగా, శాస్త్రీయంగా అంతరంగిక వివేకాన్ని బయటకు తీసుకువచ్చి, ఒత్తిడి లేని ప్రశాంతమైన జీవితాన్ని అందించే విధంగా ఈ ఇన్నర్ స్పేస్‌ను నిర్మించారు. ధ్యాన మందిరం, భారతదేశ ప్రాచీన రాజయోగం విశిష్టతను తెలిపే విధంగా ప్రదర్శనా క్షేత్రం, ఆధ్యాత్మిక గ్రంథాలయాలు ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.
***దేశంలో తొలిసారి
ఇన్నర్ స్పేస్ ఆధ్యాత్మిక ధ్యాన కేంద్రం దేశంలో మొదటిసారి హైదరాబాద్‌లో నిర్మితమైంది. యాంత్రీకమైన జీవన విధానంలో ఒత్తిడిని జయించి, ప్రశాంతమైన జీవితాన్ని గడిపేందుకు మొదటగా లండన్‌లో ప్రారంభమైన ఇన్నర్‌స్పేస్.. యూరప్, యూఎస్‌ఏ, జపాన్ వంటి పెద్ద దేశాల్లో ఉంది. ప్రస్తుతం దీనికి హైదరాబాద్ వేదికగా మారింది. సాఫ్ట్‌వేర్ రంగానికి ప్రధానంగా మారిన హైదరాబాద్ ప్రాంతంలో దీని ఏర్పాటుకు దాదీ జానకీ పునాది వేశారు. ఇన్నర్‌స్పేస్‌తో సాఫ్ట్‌వేర్ రంగంతో పాటు నిత్యం మానసిక టెన్షన్‌తో చిద్రమవుతున్న వారికి ఇది మంచి వేదికగా మారుతుందని బ్రహ్మకుమారీల విశ్వాసం. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా… ఆత్మ బలంగా ఉంటే అసాధ్యమైన వాటన్నింటినీ సుసాధ్యం చేయడం, ఉల్లాసవంతమైన జీవన విధానాన్ని అందించే విధంగా ఈ ఇన్నర్ స్పేస్ తీర్చి దిద్దుతుందని బ్రహ్మ కుమారీలు చెబుతున్నారు.
**అద్భుతంగా ఆరంభ వేడుకలు
హైదరాబాద్ శాంతి సరోవర్‌లో ఆరంభ వేడుకలు కన్నుల పండువగా మొదలయ్యాయి. శనివారం సాయంత్రం వేలాది మంది బ్రహ్మ కుమారీలు ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. దాదీ జానకీతో పాటు పలువురిని ప్రత్యేక వాహనాలపై ఊరేగించారు. తామర పూల మధ్య శిష్యులకు దాదీ జానకీ దర్శనమిచ్చారు. ప్రత్యేకమైన ఏర్పాట్లు, నృత్యాలు, కోలాటాలతో బ్రహ్మ కుమారీల క్షేత్రం శాంతి సరోవరం పులకరించింది.
***శాంతి సందేశం
శాంతి సరోవర్ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల సందర్భంగా దాదీ జానకీ శాంతి సందేశమిచ్చారు. హైదరాబాద్‌తో తనకు విడదీయలేని అనుబంధముందన్నారు. ఇక్కడ ధ్యాన కేంద్రాన్ని ప్రారంభించాలని తానే రూపకల్పన చేశానన్నారు. ప్రస్తుతం జీవన విధానంలో బాహ్య సంతృప్తి మాత్రమే ఉందని, ఆత్మ సంతృప్తి లేదన్నారు. ధ్యానం జీవన విధానంలో భాగం కావాలని పిలుపునిచ్చారు. మానసికంగా ధృడంగా ఉన్నప్పుడే జీవితం నూరేళ్లు సాగుతుందని, ప్రపంచ వ్యాప్తంగా ధ్యానంతో సంతృప్తికరమైన జీవితాన్ని వెల్లదీస్తున్నామని లక్షల మంది శిష్యులు చెప్పారని, జీవితంలో ఇది చాలా సంతోషమకరమై విషయమని 103 ఏండ్ల ఆధ్యాత్మిక వేత్త దాదీ జానకీ పేర్కొన్నారు.

ఫ్లోరిడాలో నాట్స్ యోగా శిబిరం

శారీరక, మానసిక ఆరోగ్యం కోసం యోగా ఉత్తమమైన మార్గమని యావత్ ప్రపంచానికి భారత్ చాటింది. అంతర్జాతయ యోగా దినోత్సవంతో ఇప్పుడు యోగా ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతుంది. అమెరికాలో తెలుగు వారు కూడా యోగాపై ఇప్పుడు మరింత మక్కువ చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్), ఇషా పౌండేషన్‌తో కలిసి టెంపాలో యోగా శిబిరాన్ని ఏర్పాటుచేసింది. యోగా చేయడం వల్ల కలిగే ఉపయోగాను వివరించి, యోగాసనాలు, ధ్యానం నేర్పించారు. స్థానిక తెలుగువారు ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఎంతో సులభమైన ఆసనాల ద్వారా మనస్సును ఎంత ప్రశాంతంగా ఉంచుకోవచ్చనేది ఈ శిబిరంలో నేర్పించారు. నాట్స్ టెంపా చాప్టర్ నిర్వహించిన ఈ కార్యక్రమానికి స్థానికుల నుంచి మంచి స్పందన లభించింది. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలని స్థానిక తెలుగువారు అభిలాషించారు.

ఉరి తీయండి

తమను తాము దేవుళ్లుగా చెప్పుకునే వాళ్లు, బాబాలు అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే ఉరి తీయాలని ప్రముఖ యోగా గురువు రాందేవ్‌ బాబా అన్నారు. శ్రుతిమించి ప్రవర్తిస్తే వారిని జైళ్లకు పంపడం మాత్రమే కాదు, ఉరి తీసి చంపేయాలి అంటూ బాబా రాందేవ్‌ మీడియాకు వెల్లడించారు. కాషాయ దుస్తులు ధరించినంత మాత్రాన అందరూ ఆధ్యాత్మిక గురువులు అయిపోరని వ్యాఖ్యానించారు. ‘ప్రతి వృత్తికి దానికి సంబంధించిన పరిమితులు ఉంటాయి. ప్రతి ఉద్యోగానికి ప్రొటోకాల్‌ ఉంటుంది. బాబాల విషయంలోనే అలాగే ఉంటుంది. కేవలం కాషాయ దుస్తులు ధరిస్తే బాబాలు అయిపోరు. అది వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది’ అని రాందేవ్‌ వెల్లడించారు. బాబా ధాటి మహారాజ్‌పై అత్యాచారం కేసు నమోదు అయిన నేపథ్యంలో రాందేవ్‌ బాబా ఈ విధంగా స్పందించారు. ధాటి మహారాజ్‌ రెండేళ్ల క్రితం శాని ధామ్‌ ఆశ్రమంలో తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారని ఓ మహిళ చేసిన ఫిర్యాదు మేరకు అతడిపై కేసు నమోదైంది. ప్రస్తుతం కేసు దిల్లీ క్రైం బ్రాంచికి తరలించారు. గతంలో ఆశారాం బాపు సహా పలువురు బాబాలపై అత్యాచార కేసులు నమోదైన సంగతి తెలిసిందే.

గాంధీ స్మారకస్థలి వద్ద యోగా దినోత్సవం


మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ (ఎం.జి.ఎం.ఎన్. టి) ఆధ్వర్యంలో డాలస్ (ఇర్వింగ్) లో ఆదివారం జూన్ 17న జరిగిన “నాల్గవ అంతర్జాతీయ యోగా దినోత్సవ” వేడుకల్లో 300 మందికి పైగా యువతీ, యువకులు, పెద్దలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కాన్సుల్ అశోక్ కుమార్, ఇర్వింగ్ సిటీ మేయర్ ప్రోటెం ఆలన్ మీఘర్ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఎం.జి.ఎం.ఎ.న్.టి కార్యదర్శి రావు కల్వల మాట్లాడుతూ గాంధీ మెమోరియల్ వద్ద యోగ దినోత్సవం జరుపుకోవడం ఇది నాల్గవ పర్యాయమని, ఈ కార్యక్రమానికి సహకరించిన భారత కాన్సులేట్ అధికారులకు, ఇర్వింగ్ సిటీ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఎం.జి.ఎం.ఎన్. టి బోర్డు ఆఫ్ డైరెక్టర్ షబ్నమ్ మోద్గిల్ కార్యవర్గ సభ్యులను అందరికీ పరిచయం చేశారు. ఎం.జి.ఎం.ఎన్. టి ఛైర్మన్ డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ 5,000 సంవత్సరాల క్రితం రిషికేష్ యోగాకు జన్మస్థలం అయ్యిందని, 2014 లో ఐక్యరాజసమితి జూన్ 21 ని యోగా దినోత్సవంగా ప్రకటించడంతో ఆ రోజున ప్రపంచవ్యాప్తంగా 175 దేశాలు యోగా దినోత్సవాన్ని పాటిస్తున్నాయని తెలిపారు. గాంధీ మహాత్ముడు కూడా యోగాకు, ధ్యానానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారని, ఈ రోజు అదే గాంధీ స్మారక స్థలంలో యోగా దినోత్సవం జరుపుకోవడం సముచితంగా ఉందని అభిప్రాయపడ్డారు. కాన్సుల్ అశోక్ కుమార్ మాట్లాడుతూ కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా హ్యూస్టన్, మహాత్మా గాంధీ మెమోరియల్ డాలస్ తో కలిపి యోగా దినోత్సవం జరుపుకోవడం ఆనందంగా ఉందని, భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపును అనుసరించి ఐక్యరాజ్య సమితి జూన్ 21 యోగా దినోత్సవాన్ని పాటించడం చారిత్రాత్మక విషయమని, నిత్యం అందరూ యోగా అభ్యసించాలని పేర్కొన్నారు. ఇర్వింగ్ సిటీ మేయర్ ప్రోటెం ఆలన్ మీఘర్ మాట్లాడుతూ ఈ విశాలమైన థామస్ జెఫెర్సన్ పార్కులో సుందరమైన మహాత్మా గాంధీ మెమోరియల్ ను ఏర్పాటు చేసిన సభ్యులందరకూ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎక్కువ సంఖ్యలో పిల్లలు, పెద్దలు ఉత్సాహంగా యోగాలో పాల్గొనడం చూసి సంతోషిస్తున్నాని, సిటీ తరపున ఏ సహాయం చేయడానికైనా ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఎం.జి.ఎం.ఎన్.టి కో-చైర్మన్ కమల్ కౌషల్ యోగా ప్రాముఖ్యాన్ని వివరించి, యోగా శిక్షకుడు విజయ్ మరియు వారి బృందంతో యోగా శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించ వలసినదిగా ఆహ్వానించారు. దాదాపు గంటకు పైగా జరిగిన ఈ యోగా శిక్షణలో అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇదే వేదిక పై ప్రతిష్ఠాత్మకమైన ‘స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ పోటీలలో’ ప్రథమ స్థానం సాధించిన కార్తీక్ నెమ్మాని ను, ద్వితీయ స్థానం పొందిన నైన మోడీ, తృతీయ స్థానంలో వచ్చిన అభిజయ్ కొడాలిలను, వారి తల్లిదండ్రులను, ఈ పిల్లలకు శిక్షణ ఇచ్చిన ‘జియోస్పెల్ అకాడమీ’ నిర్వాహకులు విజయ్ రెడ్డి, గీత మంకులను ఎం.జి.ఎం.ఎన్. టి ఛైర్మన్ డా. ప్రసాద్ తోటకూర, ఇతర బోర్డు సభ్యులతో కలసి ఘనంగా సన్మానించారు. ఎం.జి.ఎం.ఎన్.టి కోశాధికారి బి. ఎన్. రావు ఈ కార్యక్రమ విజయానికి సహకరించిన వారికి ధన్యవాదాలు తెలిపారు.









తలకిందులుగా ఆసనాలు

యోగాసనాలు వేసి మనస్సును శరీరాన్ని ఫిట్ నెస్ తో ఉంచుకునే ప్రయత్నాల్లో పడింది అమలాపాల్. అన్నిటికంటే క్లిష్టమైన తలకిందులుగా చేసే శీర్షాసనం కోసం నేను కొన్ని రోజులుగా కష్టపడుతున్నాను. నా అప్పర్ బాడీ కొంచెం వీక్. అందువలన గోడ అసరాగానో టీచర్ సాయంతోనో ఈ ఆసనం వేయగలుగుతున్నాను. మొదట్లో కష్టంగా స్త్రేస్ట్ గా ఉండేది. ప్రయత్నించి, చివరకు నా తలమీద నేను నిలుచోగాలిగాను మొత్తానికి శీర్షానం వేశాను. ఆనందంతో కంట్లో నీళ్ళు తిరిగాయి. పార్క్ అంతా సంతోషంగా తిరిగాను అంటూ ఉత్సాహపడింది అమలాపాల్.

దాని పేరే యోగా

కాస్త ఖాళీ సమయం దొరికితే బాగుణ్ను అని ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో అనుకొనేవాళ్లే. కథానాయికలైతే ఖాళీ కోసం కూడా ప్రణాళికలు వేసుకుంటుంటారు. బోలెడన్ని సినిమాలు చేస్తుంటారు కాబట్టి వాళ్లు ఎప్పుడూ బిజీ బిజీ అన్నమాట. అయితే తారలు చాలామంది ‘మాకు ఖాళీ దొరికితే ఫలానా వ్యాపకాలతో గడుపుతుంటామని చెబుతుంటారు. అనుష్క మాత్రం ఖాళీ సమయంలో నేను ఖాళీగానే గడుపుతాను తప్ప, ఇతరత్రా పనులేవీ పెట్టుకోనంటూ నవ్వేస్తోంది. ‘‘ఒక పనిలో పడిపోయామంటే ఎప్పుడూ దానిపైనే దృష్టి ఉంటుంది. ఇక మన గురించి మనం ఆలోచించుకొనే అవకాశమే ఉండదు. అందుకే ఖాళీ దొరికితే నేను నాపైనే దృష్టిపెడతా. వేరే పనులేవీ పెట్టుకోకుండా ఏకాంతంగా గడుపుతా. నన్ను నేను వెతుక్కొనేందుకు, నాతో నేను మాట్లాడేందుకు తగిన సమయం అదే అని నా భావన. అందుకే తరచుగా నాకోసం నేను సమయం కేటాయించుకొంటా’’ అని చెబుతోంది అనుష్క. ‘భాగమతి’తో ఆకట్టుకున్న ఆమె ప్రస్తుతం ద్విభాషా చిత్రం కోసం సన్నద్ధమవుతోంది.

గంజాయికు పతంజలి మద్దతు

ఆయుర్వేద ఉత్పత్తులతో దేశంలోని బడా కార్పొరేట్ సంస్థల ఆదాయానికి భారీగా గండికొట్టిన పతంజలి.. తాజాగా గంజాయి చట్టబద్ధత కోసం పోరాడుతున్న వారికి మద్దతుగా నిలిచింది. భారత దేశంలో నిషేధంలో ఉన్న గంజాయికి ఆయుర్వేదంలో మంచి ప్రాధాన్యత ఉందనీ.. వెంటనే దాన్ని చట్టబద్ధం చేయాలంటూ ఆ కంపెనీ సీఈవో ఆచార్య బాలకృష్ణ డిమాండ్ చేశారు. గంజాయిని సాగును చట్టబద్ధం చేయాలంటూ పలువురు రాజకీయ నేతలు ఒత్తిడి పెంచుతున్న నేపథ్యంలోనే… రామ్‌దేవ్ బాబా నేతృత్వంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ కూడా ఈ వాదనకు మద్దతివ్వడం గమనార్హం. ఇటీవల ఆచార్య బాలకృష్ణ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘పురాతన కాలం నుంచి గంజాయి మొక్కలోని కొన్ని భాగాలకు ఆయుర్వేదంలో ఔషధ పరంగా మంచి ప్రాధాన్యత ఉంది. అందుకే మేము దీనిపై పరిశోధనలు జరుపుతున్నాం. గంజాయి మొక్కల వల్ల ప్రయోజనాలు, సక్రమ వినియోగంపై దృష్టి పెట్టాలని ఆశిస్తున్నాం..’’ అని పేర్కొన్నారు. హరిద్వార్‌లోని పతంజలి పరిశోధన, అభివృద్ధి కేంద్రంలో 200 మంది శాస్త్రవేత్తలు దేశంలోని దాదాపు 200 మొక్కలు, వాటి ప్రయోజనాలు, వైద్యావసరాలపై పరిశోధనలు జరుపుతున్నారన్నారు. ప్రత్యేకించి గంజాయి గింజల వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయనీ… గంజాయి నూనెలోని విషపూరిత పదార్థాలుగా భావించే టీహెచ్‌సీ వంటి పదార్థాలను వేరుచేసి వినియోగంలోకి తేవచ్చునన్నారు. కెనడా, అమెరికాలోని కొన్ని రాష్ట్రాలతో పాటు విదేశాల్లో గంజాయి వినియోగం, ఆదాయం విస్తృతంగా ఉందన్నారు. అయినప్పటికీ మన దేశంలో మాత్రం చట్ట వ్యతిరేకంగా పరిగణిస్తున్నారన్నారు. ‘‘గంజాయిని నేరపూరితంగా చూడడం వల్ల ప్రజలకు పూర్తి స్థాయిలో వ్యాపార అవకాశాలను నిరాకరిస్తున్నారు…మన దేశంలో ఎందుకు దీనిని చట్టబద్ధం చేయకూడదు…’’ అని ఆయన ప్రశ్నించారు. కాగా భారత దేశంలో నార్కోటిక్ డ్రగ్స్, సైకోట్రోపిక్ పదార్థాల చట్టం కింద గంజాయి సాగు, అమ్మకం, వినియోగంపై 1985 నుంచి పూర్తి నిషేధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

దావోస్ ఆర్ధిక వేదికపై యోగా

ప్రపంచ ఆర్థిక వేదిక(డబ్ల్యూఈఎఫ్‌)పై తొలిసారిగా యోగాను ప్రదర్శించనున్నారు. సోమవారం నుంచి స్విట్జర్లాండ్‌లోని దావోస్‌ వేదికగా డబ్ల్యూఈఎఫ్‌ వార్షిక సదస్సు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ సమావేశాల్లో ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్‌ తరఫు నుంచి ఇద్దరు ఆచార్యులు హాజరుకానున్నారు. రెండు సెషన్సులో ప్రత్యేకంగా యోగాను ప్రదర్శించనున్నారు. ఈ యోగా సెషన్‌లో ప్రధాని మోదీ కూడా పాల్గొనే అవకాశం ఉన్నట్లు సమాచారం. డబ్ల్యూఈఎఫ్‌ సదస్సులో దాదాపు మూడు వేల మంది వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, కళాకారులు, విద్యావేత్తలు, సామాజిక వేత్తలు పాల్గొననున్నారు. భారత్‌ నుంచి దాదాపు 130 మంది పాల్గొంటారు. మోదీ వెంట కేంద్రమంత్రులు అరుణ్‌జైట్లీ, సురేశ్‌ ప్రభు, పీయూష్‌ గోయల్‌, ధర్మేంద్ర ప్రధాన్‌, ఎంజే అక్బర్‌, జితేంద్ర సింగ్‌ పాల్గొంటున్నారు. ‘ముక్కలైన ప్రపంచంలోనే భాగస్వామ్య భవిష్యత్తు సృష్టించాలి’ అనేది ఈసారి సదస్సు ముఖ్యాంశంగా నిర్ణయించారు. మహిళా నేతల భాగస్వామ్యమూ అధిక స్థాయిలో ఉండనుందని డబ్ల్యూఈఎఫ్‌ తెలిపింది. మంగళవారం నుంచి సదస్సు అధికారిక కార్యక్రమాలు ప్రారంభంకానున్నాయి. ఈ సదస్సు ప్రారంభ ప్రసంగం ప్రధాని నరేంద్రమోదీ చేయగా.. చివరి రోజు ముఖ్య ప్రసంగాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేయనున్నారు. ఈనెల 22 నుంచి 26 వరకు ఐదు రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. మోదీ 24 గంటల పాటు మాత్రమే దావోస్‌ పర్యటనలో ఉంటారు. వివిధ దేశాల కంపెనీల సీఈవోలతో నిర్వహించే విందు కార్యక్రమంలో మోదీ పాల్గొంటారు. స్విస్‌ అధ్యక్షుడు అలైన్‌ బెర్సట్‌తో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. బాలీవుడ్‌ నటుడు షారుఖ్‌ ఖాన్‌, ప్రముఖ వ్యాపారవేత్తలు ముఖేశ్‌ అంబానీ, గౌతమ్‌ అదానీ, అజీమ్‌ ప్రేమ్‌జీతో పాటు పలువురు ఈ సదస్సుకు హాజరవనున్నారు.

కండోమ్ కా సవాల్

‘రాందేవ్‌జీ మీకు దమ్ముంటే పతంజలి బ్రాండ్‌ కండోమ్‌ తయారుచేసి చూపండి. జనమంతా పతంజలి కండోమ్స్‌ను చూడాలనుకుంటున్నారు’’ అంటూ వివాదాల బాలీవుడ్‌ నటి రాఖీసావంత్‌ రాందేవ్‌బాబాకు సవాల్‌ విసిరింది. ‘బీబోయ్‌’ అనే కండోమ్‌ బ్రాండ్‌కు ఇటీవలే ఆమె అంబాసిడర్‌ అయిన సంగతి తెలిసిందే! ఆ బ్రాండ్‌ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న రాఖీ ఈ సవాలు చేసింది. అంతేకాదు ‘బీబోయ్‌’ కండోమ్స్‌ తొలి వినియోగదారులుగా ఎవరైతే బాగుంటుందని విలేకరులు అడగ్గా.. కోహ్లీ, అనుష్క ఆ కండోమ్స్‌ను వాడి ఎలా ఉన్నాయో చెప్తే బాగుందని చెప్పిందామె.

ఏపీలో రవిశంకర్ పర్యటన

ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్‌ ఈ నెల 9, 10 తేదీల్లో ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. ఈ నెల 9న ఉదయం భీమవరంలోని సాగి రామకృష్ణరాజు ఇంజినీరింగ్‌ కళాశాలలో నిర్మించిన సాంకేతిక కేంద్రాన్ని ఆయన ప్రారంభిస్తారు. అనంతరం ‘సాంకేతికత-ఆధ్యాత్మికత’ అనే అంశంపై ప్రసంగిస్తారు. అదేరోజు సాయంత్రం కళాశాల ప్రాంగణంలో జరిగే సత్సంగం కార్యక్రమంలో పాల్గొంటారు. 10న శ్రీశైలం మల్లికార్జుని సన్నిధిలో శక్తిసంగమం పేరిట గాన, జ్ఞాన, ధ్యానాలతో పాటుగా పుష్కరిణి హారతి, లక్ష పుష్పార్చన, సహస్ర దీపాలంకరణ కార్యక్రమాల్లో పాల్గొంటారు.

యోగాతో దృఢత్వం

ప్రతిరోజు కొంత సమయం రాజయోగా సాధనతో చేయడంతో మానసిక ప్రశాంతత, దృఢత్వం కలుగుతాయని సినీనటి గ్రేసీసింగ్‌ అన్నారు. బ్రహ్మకుమారీస్‌లో నేర్చుకున్న రాజయోగా, అధ్యాత్మిక చింతన సాధనతో నాలుగేళ్లుగా ప్రశాంతమైన జీవనం సాగిస్తున్నట్లు ఆమె చెప్పారు. శనివారం గచ్చిబౌలిలోని బ్రహ్మకుమారీస్‌ శాంతిసరోవర్‌కు వచ్చిన గ్రేసీసింగ్‌ మీడియాతో మాట్లాడారు. సినిమా రంగంలో పనిచేసేవారికి మానసికంగా చాలా ఒత్తిళ్లు ఉంటాయని, వాటినుంచి బయటపడేందుకు ధ్యానం చాలా ముఖ్యమని అన్నారు. రాజయోగం సాధన ఎంతో సులభమన్నారు. దైనందన జీవితంలో రోజుకు కనీసం ఒక్కసారి కొంత సమయం కేటాయిస్తే చాలన్నారు. నాలుగేళ్లకిందట తనతల్లి సూచన మేరకు బ్రహ్మకుమారీస్‌ కేంద్రానికి వెళ్లి రాజయోగా నేర్చుకున్నట్లు చెప్పారు. అప్పటి నుంచి క్రమం తప్పకుండా బ్రహ్మకుమారీలు చేపట్టే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నట్లు చెప్పారు. విలువైన జీవిత విశేషాలను చెప్పి సమాజంలో శాంతి స్థాపనకు బ్రహ్మకుమారీలు ప్రయత్నం చేస్తున్నారన్నారు. కళల ద్వారా శాంతిసందేశం ఇచ్చేందుకు తన వంతు కృషిచేస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఆదివారం శాంతిసరోవర్‌లో జరగనున్న స్పిరిట్‌ ఆఫ్‌ లైఫ్‌ కార్యక్రమంలో భరతనాట్య ప్రదర్శన ఇవ్వనున్నట్లు ఆమె చెప్పారు.

నిషేధం ఎత్తివేశారు

సౌదీ ప్రభుత్వం మంగళవారం యోగాపై అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. యోగాభ్యాసం అనేది ఒక క్రీడ.. దానిని అందరూ నేర్చుకోవచ్చు అంటూ సౌదీ ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. యోగా శిక్షణలో లైసెన్స్‌ ఉన్న టీచర్ల వద్ద ఎవరైనా యోగా నేర్చుకోవచ్చని సౌదీ ప్రభుత్వం తెలిపింది. సౌదీ అరేబియాలో యోగా గుర్తింపు కోసం నూఫ్‌ మార్వాయి అనే మహిళ అనితర సాధ్యమైన పోరాటాన్ని నిర్వహించి విజయం సాధించింది. సౌదీలో మొదటి యోగా ట్రైనర్‌గా గుర్తింపు తెచ్చుకున్న నూఫ్‌ మార్వాయి.. యోగాకు మతానికి సంబంధం లేదని మొదటి నుంచి వాదిస్తున్నారు. సౌదీ, గల్ఫ్‌ ప్రాంతాల్లో యోగా, ఆయుర్వేదాన్ని నూఫ్‌ చాలాకాలంగా ప్రోత్సహిస్తున్నారు. ప్రస్తుతం యూఫ్‌ను యోగాచారిణిగా గుర్తింపు తెచ్చుకుంది. మధ్యప్రాచ్య దేశాలైన సౌదీ అరేబియా యోగాను ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో భారత్‌లోని ముస్లిం మత పెద్దలు తమ అభిప్రాయాన్ని మార్చుకోవాలని పలుపురు పలుపునిస్తున్నారు. ముస్లిం రాజ్యమైన సౌదీలో ఒక ముస్లిం యువతి యోగా నేర్పుతున్న నేపథ్యంలో.. రాంచీలోని రఫియా నాజ్‌పై ముస్లింలు దాడి చేయడాన్ని పలువురు ఖండిస్తున్నారు.

ధ్యానం ఎలా చేయాలి?

మూసిన కన్ను తెరవకపోయినా
తెరిచిన కన్ను మూయకపోయినా
శ్వాస తీసుకుని వదలకపోయినా
వదిలిన శ్వాస తీయకపోయినా
ఈ లోకంలో ఈ జన్మకు అదే చివరి చూపు
మనం ఎవ్వరం అయినా సరే మనల్ని ఈ ప్రపంచం నిర్థాక్ష్యిణ్యంగా మరచిపోయేలా చేస్తుంది కాలం

విరోధులు స్నేహితులైనా, పశ్చాతాపపడినా, మనసు మార్చుకున్నా మరల కనిపించం
ఫెయిర్‌ అండ్‌ లవ్‌లీలు, సున్నిపిండితో నున్నగా తీర్చిదిద్దిన ఈ దేహాన్ని నిప్పుల కొలిమిలో కాల్చక తప్పదు

ఈ క్షణం మాత్రమే నీది
మరుక్షణం ఏవరిదో?
ఏమవుతుందో ఎవరికి తెలుసు?

ఈ ప్రపంచాన్ని భస్మీ పటలం చేసే అణ్వాయుథాలు నీవద్ద ఉన్నా నీ ఊపిరి ఎప్పుడు ఆగుతుందో పరమాత్మకి తప్ప ఎవరికీ తెలియదు.

ఈ ప్రపంచాన్ని శాసించేంత గొప్పవారైనా సంపన్నులైనా బలవంతులైనా
అవయవక్షీణం ఆయుఃక్షీణంను తప్పించుకోజాలరు

ఈ సృష్టిలో మనము మొదలు కాదు. చివర కాదు

ఈ దేహంలో మనం అద్దెకు ఉండటానికి వచ్చాము. అద్దె ఇంటిని విడిచివెళ్లేటప్పుడు మన సామాన్లు మనం తీసుకువెళ్లినట్టు మనం చేసిన కర్మలను మనతో మోసుకువెళ్లక తప్పదు.

చెట్టుకి, పుట్టకి, రాయికి, రప్పకి ఉన్న ఆయుర్థాయం మనకి లేదు
ఈ భూమ్మీద కాలమనే వాహనంలో ఒక చోట ఎక్కి మరో చోట దిగిపోతాం మనం సహప్రయాణికులం మాత్రమే.

కుటుంబం, స్నేహాలు, శత్రుత్వాలు అన్నీ భ్రమ, మాయ.అశాశ్వతమైన వాటిని ధ్యానంతో ఛేధిద్దాం.అజ్ఞానం అనే చీకటిని చీల్చే ఖడ్గం ధ్యానం .

అందుకే మనుషుల్లా జీవిద్దాం. మనిషి ఎలా జీవించాలో చెప్పిన రామాయణ, భారత, భాగవతాదులను ఈ జీవితం ముగిసేలోపు తెలుసుకుందాం. అందులోని సంశయాలను తీర్చుకుందాం

దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకోవడం అంటే పదవిలో ఉండగానే సంపాదించుకోమని కాదు.

భగవంతుడు ఈ శరీరాన్ని ఇచ్చినందుకు నాలుగు పుణ్యకర్మలు ఆచరించి ఈ జీవకోటిలో మనిషి మాత్రమే చేయగలిగే ఉత్తమ కర్మలను ఆచరించాలని పరమార్థం

ఓపిక ఉండగానే నిత్యం గురువుని ఆశ్రయించి ఉపదేశంపొంది ధర్మాచరణ, కర్మాచరణ చేయాలి

నిరంతరం భగవత్ ధ్యానంతోఉంటూ ,సత్యమైన మార్గం ద్వార ధనాన్ని ఆర్జించి తోటి వారికి పంచుతూ ,నిన్ను నీవు ఉన్నతాత్మగా పెంచుకుంటూ ఉండటమే జీవనం

జ్ఞానదేవతు కైవల్యం
జ్ఞానమే ముక్తికి మార్గము

యోగా చెప్పే ఆరోగ్య రహస్యాలు

ఆరోగ్యానికి యోగశాస్త్ర నియమాలు:
???
1. ఉదయం 4.30 కి నిద్ర లేవాలి
2. లేచిన వెంటనే గ్లాస్ గోరు వెచ్చని నీరు కూర్చుని నెమ్మదిగా త్రాగాలి.
3. ఐస్ క్రీం ఎప్పుడూ తినకూడదు.
4. ఫ్రిజ్ లో తీసినవి గంట తర్వాత తినాలి
5. కూల్ డ్రింక్స్ త్రాగకూడదు.
6. వండిన ఆహారం వేడిగా 40ని.లో తినాలి
7. భోజనం తర్వాత వజ్రాసనం 5 – 10 నిమిషాలు వేయాలి
8. ఉదయంటిఫిన్ 8.30 గం లోపు తినాలి
9. ఉదయం టిఫిన్ తో పండ్లరసం త్రాగాలి
10. టిఫిన్ తిన్నాక తప్పకుండా పని చేయాలి.
11. మధ్యాహ్నం లోగా మంచినీరు 2,3 గ్లాసులు త్రాగాలి
12. మంచినీళ్ళు భోజనానికి 48 ని.ముందు త్రాగాలి
13. భోజనం క్రింద కూర్చుని తినాలి
14. ఆహారం బాగా నమిలి మ్రింగాలి
15. మధ్యాన్నం కూరల్లో వాముపొడి వాడాలి
16. మధ్యాహ్న భోజనం నిండుగా తినాలి
17. మధ్యాన భోజనం తర్వాత మజ్జిగ త్రాగాలి
18. మధ్యాహ్న భోజనం తర్వాత విశ్రాంతి
19. రాత్రి భోజనం సూర్యాస్తమయం లోపు చేయాలి
20. రాత్రి పూట చాలా తక్కువగా, తినాలి
21. రాత్రి భోజనంతర్వాత 1కి.మీ నడవాలి
22. రాత్రి భోజనంతర్వాత గంటకు పాలు త్రాగాలి.
23. రాత్రిపూట లస్సీ, మజ్జిగ త్రాగకూడదు
24. రాత్రి పుల్లటి పండ్లు తినకూడదు.
25. రాత్రి 9 – 10 గం.పడుకోవాలి
26. పంచదార, మైదా,గుండఉప్పు తక్కువ వాడాలి.
27. రాత్రి పూట సలాడ్ తినకూడదు.
28. విదేశీ ఆహారంను ఎప్పుడూ కొనరాదు
29. టీ,కాఫీ ఎప్పుడు త్రాగకూడదు.
30. పాలలో పసుపు వేసి మరిగించి త్రాగితే
క్యాన్సర్ రాదు
31.ఆయుర్వేద వైద్యం ఆరోగ్యంకు మంచిది
32. అక్టోబరు నుంచి మార్చ్ ( చలికాలంలో) వెండి, బంగారు పాత్రలోని నీరు త్రాగాలి
33. జూన్ నుంచి సెప్ట్ంబర్ (వర్షాకాలంలో) లో రాగి పాత్రలో నీరు త్రాగాలి
34. మార్చ్ నుంచి జూన్ (ఎండాకాలంలో) మట్టి పాత్రలో నీరు ఎప్పుడు త్రాగాలి.
??????

డల్లాస్‌లో పరమహంస యోగానంద జయంతి వేడుకలు


గురు పరమహంస యోగానంద 125 జయంతి కార్యక్రమాన్ని డల్లాస్ క్రియా యోగ ఆధ్వర్యంలో బుధవారం నాడు లూయిస్‌విల్‌లోని ఎంసిఎల్ గ్రాండ్ థియేటర్ లో ఘనంగా నిర్వహించారు. 1920లో అమెరికా వచ్చిన యోగానంద క్రియా యోగా గురించి పాశ్చాత్యులకు వివరించారు. మానవజీవితంలో యోగా వల్ల కలిగే మంచి మార్పులను అందించి మతాలకు అతీతంగా అందరి మన్ననలు పొందారు. లూయిస్‌విల్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రస్తుత గురువు పరమహంస ప్రజ్ఞానంద ప్రసంగిస్తూ ఇతరుల పట్ల ప్రేమ భావాన్ని కలిగిఉండాలని బోధించారు. స్థానిక నృత్య, సంగీత కళాకారులు తమ ప్రదర్శనలతో అందరినీ అలరించారు. ఈ కార్యక్రమ నిర్వహణలో ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) డల్లాస్ విభాగం తమ చేయూతనందించింది. ఈ కార్యక్రమంలో నాట్స్ సంస్థ తరపున కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ కోనేరు, ఉమ్మడి కోశాధికారి శేఖర్ అన్నే, ప్రచార విభాగ సమన్వయకర్త శ్రీనివాస్ కొమ్మినేని, డల్లాస్ విభాగ సమన్వయకర్త రామకృష్ణ మర్నేని, అమర్ అన్నే తదితర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.



రాందేవ్ బాబాకు డెటాల్ దెబ్బ

యోగా గురు బాబా రాందేవ్‌కు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పతంజలి ఆయుర్వేద్‌ బ్రాండుకు చెందిన సబ్బుల ప్రకటనలను టీవీల్లో ప్రసారం చేయడం ఆపివేయాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. పతంజలి తన వాణిజ్య ప్రకటనలలో సబ్బు బ్రాండ్ డెటాల్‌ను తక్కువ చేస్తుందని రెక్కిట్ బెంకైసెర్ నమోదుచేసిన ఫిర్యాదు మేరకు ఢిల్లీ హైకోర్టు ఈ ఆదేశాలు జారీచేసింది. పతంజలి సబ్బు బ్రాండు ప్రకటనపై కోర్టు ఆగ్రహం వ్యక్తంచేయడం ఇది రెండోసారి. అంతకముందు బొంబై హైకోర్టు కూడా పతంజలి ఈ ప్రకటనను ఆపివేయాలంటూ ఆదేశించింది. ఎఫ్‌సీజీ దిగ్గజం హిందూస్తాన్‌ యూనీలివరీ లిమిటెడ్‌ నమోదుచేసిన ఫిర్యాదు మేరకు అప్పుడు బొంబై హైకోర్టు ఈ తీర్పునిచ్చింది. పతంజలి తన వ్యాపార ప్రకటనలో డెటాల్‌ సోప్‌, హెచ్‌యూఎల్‌ పియర్స్‌, లైఫ్‌బాయ్‌ వాటిని దిగజారుస్తుండటంతో ఈ మొత్తం వివాదం చెలరేగింది. పతంజలి ప్రకటనకు వ్యతిరేకంగా ఉత్తర్వులు, కోటికిపైగా నష్టపరిహారాల కోసం తాము పోరాడినట్టు రెక్కిట్‌ బెంకైసర్‌ న్యాయవాది నాన్సీ రాయ్‌ పేర్కొన్నారు. పతంజలి తన కొత్త సబ్సు ప్రకటనలో డెటాల్‌ను ‘ధిటాల్‌’గా, పియర్స్‌ను ‘టియర్స్‌’గా, లైఫ్‌బాయ్‌ను ‘లైఫ్‌జాయ్‌’గా విమర్శిస్తోంది. పతంజలి కంపెనీ రూపొందిస్తున్న వివాదస్పదమైన ప్రకటనలపై ఓ వైపు కోర్టులో కంపెనీలు పోరాడుతుండగా.. మరోవైపు మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం బాబా రాందేవ్‌కు చెందిన ఈ కంపెనీకి 40 కోట్ల ఎకరాల భూమిని కేటాయించింది. ఈ ప్రాంతంలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ను నెలకొల్పుతున్నారు. పతంజలి ఆయుర్వేదకు కేటాయించిన ఒక్కో ఎకరం రూ.25 లక్షలు. ఈ భూమి కోసం ప్రభుత్వ ఖాతాల్లో రూ.10 కోట్లను డిపాజిట్‌ చేయాలని ఆదేశించినట్టు మధ్యప్రదేశ్‌ ఔద్యోగిక్‌ కేంద్ర వికాస్‌ నిగమ్‌ ఎండీ కుమార్‌ పురుషోత్తం తెలిపారు.

చైనా వస్తువులు ఆపితే చైనా ఆగుతుంది

చైనా వస్తువుల కొనుగోలును భారతీయులు నిలిపివేయాలని, దీని ద్వారా వారి మార్కెట్‌ను దెబ్బతీయాలని ప్రముఖ యోగా గురు బాబా రామ్‌దేవ్‌ అన్నారు. సరిహద్దులో భారత్‌-చైనా మధ్య ప్రతిష్టంభన నేపథ్యంలో డెహ్రాడూన్‌లో మీడియాతో ఆయన మాట్లాడుతూ చైనా వస్తువులను పూర్తిగా కొనుగోలు చేయడం మానేయాలని భారతీయులకు పిలుపునిచ్చారు. ఎలక్ట్రానిక్‌ వస్తువులు, ఆటోమొబైల్స్‌, బొమ్మలు, ఇతర వస్తువుల రూపంలో ఇప్పటికే దేశ మార్కెట్‌ను చైనా ఆక్రమించిందని చెప్పారు. ఆ వస్తువులన్నింటినీ భారతీయులు కొనడం మానేస్తే చైనా కంపెనీలు ఆర్థికంగా నష్టపోతాయన్నారు. అప్పుడు వారికివారే వెనక్కి తగ్గుతారని పేర్కొన్నారు. మరోవైపు చైనా వస్తువుల కొనుగోలును నిషేధించాలంటూ ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రచారం జరుగుతోంది. సామాజిక మాధ్యమాల్లో సైతం ఇలాంటి సందేశాలు విస్తృతంగా చక్కర్లు కొడుతున్నాయి.

భద్రతా అధికారిగా బాబా

బాబా రాందేవ్‌ వినూత్నంగా ఆలోచిస్తున్నారు. ఒకప్పుడు ఆయన పేరు చెబితే యోగా గుర్తుకొచ్చేది. కొంత కాలం నుంచి పతంజలి ఆయుర్వేద సంస్థ వ్యవస్థాపకుడిగా కూడా ఆయన పేరు మారుమోగుతోంది. ఇప్పుడు తాజాగా ఆయన మరింత ఆసక్తికరమైన రంగంలోకి ప్రవేశించారు. ఈ నెల 10న బాబా రాందేవ్ ‘పరాక్రమ్ సురక్ష ప్రైవేట్ లిమిటెడ్’ను స్థాపించారు. ఈ విషయాన్ని ఆయన ఓ ట్వీట్ ద్వారా తెలిపారు. ఈ సంస్థ ద్వారా దేశవ్యాప్తంగా 25 వేల నుంచి 50 వేల మందికి ఉద్యోగావకాశాలను కల్పిస్తామని తెలిపారు. త్వరలోనే దేశంలోని టాప్ సెక్యూరిటీ కంపెనీల్లో ఒకటిగా నిలబడతామని పేర్కొన్నారు.స్వీయ రక్షణతో పాటు దేశ భద్రతకు ఉపయోగపడేవిధంగా వ్యక్తులను సన్నద్ధం చేయడం తమ లక్ష్యమని, అందుకే పరాక్రమ్ సెక్యూరిటీని స్థాపించామని బాబా రాందేవ్ ఓ ప్రకటనలో తెలిపారు.యువతకు శిక్షణ ఇచ్చేందుకు పదవీ విరమణ చేసిన సైన్యం, పోలీసు అధికారులను రాందేవ్ నియమించారు. ఈ ఏడాది చివరికల్లా ఈ సంస్థను సమున్నతంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. హరిద్వార్‌లోని పతంజలి కాంప్లెక్స్‌లో కొందరు యువకులకు సెక్యూరిటీ గార్డులుగా శిక్షణ ఇస్తున్నారు.ఉన్నత విద్య, పాడి పరిశ్రమ రంగాల్లో కూడా ప్రవేశించబోతున్నట్లు బాబా రాందేవ్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

యోగా ప్రతినిధి

సౌందర్య సాధనాలు, శీతల పానీయాలు, పాదరక్షలు.. ఇలా ప్రియాంక చోప్రా బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న ఉత్పత్తులు చాలానే ఉన్నాయి. ఇప్పుడామె యోగాకి బ్రాండ్‌ అంబాసిడర్‌. ‘బమ్‌ చిక్‌ బమ్‌ బమ్‌ చేయి బాగా… ఒంటికి యోగా మంచిదేగా’ అంటూ రమ్యకృష్ణ యోగాసనాలతో ఆకట్టుకున్నట్లుగానే ప్రియాంక యోగా విలువ చెప్పి, అందరితో చేయించాలను కుంటున్నారేమో అనుకుంటున్నారా? అదేం కాదు.ఈజ్‌ నాట్‌ ఇట్‌ రొమాంటిక్‌’ అనే హాలీవుడ్‌ సినిమాలో ఆమె యోగా బ్రాండ్‌ అంబాసిడర్‌గా చేయనున్నారు. అమెరికన్‌ సిరీస్‌ ‘క్వాంటికో’తో చిన్ని తెరకు పరిచయమై, ‘బేవాచ్‌’ సినిమాతో హాలీవుడ్‌ బిగ్‌ స్క్రీన్‌పై ప్రత్యక్షమయ్యారామె. ఆ తర్వాత ఆమె నటించిన రెండో హాలీవుడ్‌ మూవీ ‘ఎ కిడ్‌ లైక్‌ జాక్‌’ వచ్చే ఏడాదిలో రిలీజ్‌ కానుంది. ఇప్పుడు ముచ్చటగా ఒప్పుకున్న మూడో సినిమా ‘ఈజ్‌ నాట్‌ ఇట్‌ రొమాంటిక్‌’ షూటింగ్‌ త్వరలో ఆరంభం కానుంది. అమెరికన్‌ దర్శకుడు టాడ్‌ స్ట్రౌస్‌ షెల్సన్‌ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాను 2019 ప్రేమికుల రోజున విడుదల చేయాలని ప్లాన్‌ చేస్తున్నారట.

న్యూజెర్సీ యోగా దినోత్సవంలో భాజపా నాయకులు

అమెరికాలోని న్యూజెర్సీలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకొన్నారు. భారతీయ జనతా పార్టీ ముంబయి యువజన మోర్చా ప్రెసిడెంట్‌ మోహిత కాంబోజ్‌, ఉడు బ్రిడ్జి మేయర్‌తో పాటు దాదాపు 750మంది ఈ కార్యక్రమంలో పాల్గొని యోగా చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ… అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. భారతీయ వారసత్వ సంపద అయిన యోగాను ప్రపంచవ్యాప్తంగా నిర్వహించడం ఎంతో గర్వకారణం అని అభిప్రాయపడ్డారు. మనస్సు, శరీరాన్ని ఏకం చేసే శక్తి ఒక్క యోగాకే ఉందని… యోగాతో శారీరక ఆరోగ్యంతోపాటు మానసిక వికాసం కూడా సాధ్యమనే విషయం నేడు ప్రపంచం గుర్తించిందని పేర్కొన్నారు. యోగా అనేది ఒక ప్రాంతానికో, ఒక మతానికో సంబంధించింది కాదనే విషయాన్ని ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలవారూ తెలుసుకోవాలని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో హిందూ స్వయం సేవక్‌ అమెరికా, ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌, ఇండియన్‌ బిజినెస్‌ కమ్యూనిటీ, విశ్వ హిందూ పరిషత్‌ ఆఫ్‌ అమెరికా, ఓవర్సీస్‌ ఫ్రెండ్స్‌ ఆఫ్‌ భారతీయ జనతా పార్టీ మిత్ర బృందం, నార్త్‌ అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌, తెలంగాణ అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌, అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ తదితర సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

డల్లాస్ గాంధీ స్మారకస్థలి వద్ద యోగా దినోత్సవం


Mahatma Gandhi Memorial of North Texas (MGMNT) in partnership with the Consulate General of India, Houston organized the “3rd International Day of Yoga” on Sunday June 25, 2017 at Mahatma Gandhi Memorial Plaza in Irving, Texas. Shabnam Modgil, Board of Director of MGMNT, welcomed the gathering of about 300 enthusiastic Yoga participants. Rao Kalvala, Secretary, MMNT, introduced the Chief Guests Hon. Texas State Rep Matt Rinaldi and Hon. Irving City Mayor Rick Stopfer, Consul Amrit Pal representing Hon. Consul General of India, Houston Dr. Anupam Ray at the event. Rao Kalvala also explained the idea of IDY by India Prime Minister Modi and his proposal to United National General Assembly. Hon. TX State Rep. Matt Rinaldi in his address congratulated Dr. Prasad Thotakura for his vision and leadership in building the largest Gandhi Memorial in the USA in the City of Irving. Now, it became a prominent landmark and appreciated MGMNT team for organizing the International Day of Yoga at this Gandhi memorial. Rinaldi also mentioned the importance of Yoga and its rapid growing popularity globally. Hon. Irving City Mayor Rick Stopfer appreciated MGMNT team and City of Irving for working together in creating Mahatma Gandhi Memorial in the heart of DFW Metroplex and expressed his delight to participate in Yoga Day Celebrations and support all activities in the future. Consul Amrit Pal appreciated MGMNT leadership for working with CGI-Houston in organizing annual International Yoga Day. Pal also shared to the media that it is the goal of the Houston Consulate to expand the partnership to all Cities in Texas and encourage more people to participate in Yoga Day. MGMNT Board of Directors Lal Daswani and Shabnam Modgil felicitated the guests. Dr. Prasad Thotakura, Chairman of MGMNT in his statement mentioned that “Yoga was originated in Rishikesh more than 5,000 years ago. It is very symbolic to celebrate the “3rd International Day of Yoga” at Mahatma Gandhi Memorial Plaza because Gandhiji used to practice meditation and yoga regularly. Gandhiji firmly believed that daily practice of yoga and meditation can strengthen self-discipline, patience, courage and forgiveness”. Dr. Thotakura emphasized the importance of yoga by stating that Yogic exercises recharge the body with cosmic energy and facilitates attainment of perfect equilibrium and harmony, promotes self- healing and removes negative blocks from the mind and toxins from the body. Over 300 enthusiasts of all age groups followed instructors led Yoga practice for an hour followed by Pranayama, Yogasanas and Meditation. MGMNT awarded Certificate of Appreciation to all attendees, also gave MGMNT gift bags and served breakfast.