అమరావతిని బంగారు బాతుగా మారుస్తా–చంద్రబాబు–రాజకీయ-03/30

ఈశాన్యంలో ఉన్న ఇచ్ఛాపురం నియోజకవర్గం రాష్ట్రానికి సరైన వాస్తు అని చంద్రబాబు అన్నారు. భౌగోళికంగా రాష్ట్రానికి మొదటి నియోజకవర్గం ఇచ్ఛాపురం.. చివరన ఉన్నది కుప్పం అని చెప్పారు. ఈ ఎన్నికల్లో ఇచ్ఛాపురం నుంచి కుప్పం వరకు తెదేపానే గెలవాల్సిన అవసరముందన్నారు. ఆ చివర్లో తన నియోజకవర్గం కుప్పం నుంచి ఈ చివరన ఇచ్ఛాపురం వరకు మొత్తం తమదేనని, ఏమాత్రం అనుమానంలేదని వ్యాఖ్యానించారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబు మాట్లాడారు. శ్రీకాకుళం అంటే వలసల జిల్లా కాదని.. వేరే జిల్లాల ప్రజలు సైతం ఉపాధి కోసం ఇక్కడికి వచ్చేలా అభివృద్ధి చేస్తామని చెప్పారు.
*నరసరావుపేటలో విజ్ఞాన్ రత్తయ్య కుమారుడు ప్రచారం
గుంటూరు జిల్లా నరసరావుపేట YSR కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ అభ్యర్థి లావు శ్రీకృష్ణ దేవరాయలు సతీమణి డాక్టర్ లావు మేఘన శనివారం మాచర్ల నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు. కారంపూడి మండలం ఒప్పిచర్ల గ్రామ0లోని వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జయసుధ మరియు పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.
*చంద్రబాబు పై మోహన్ బాబు ఫైర్
వైసీపీ నేత మంచు మోహన్ బాబు కామెంట్స్.. ఏముంది చెప్పటానికి?నా మిత్రుడు ఉదయం నుండి సాయంత్రం వరకు జగన్మోహన్ రెడ్డి దొంగ అనటం తప్ప చంద్రబాబు నాయుడు మరేమీ చెప్పడు.అహంకారాన్ని వదలిపెట్టు చంద్రబాబు.నీకంటే నేనే ముందు తెలుగుదేశం పార్టీలో చేరాను.జగన్మోహన్ రెడ్డి పై 36 కేసులు ఉన్నాయంటున్నావు.కానీ 15 లేక 16 మాత్రమేనీ మీద ఎన్ని కేసులు ఉన్నాయి చంద్రబాబు.ఎదుటివారు బాగుంటే ఓర్వలేని చంద్రబాబు.నీకు కారెక్టర్ ఉందా చంద్రబాబు?తెలుగుదేశాన్ని లాక్కున్నావుమేము నీ వెంట రావటం మా తప్పు మళ్ళీ ఒప్పుకుంటాను.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మునిగిపోతుంది చంద్రబాబు నాయుడు నీ వల్లనే.లాక్కున్నావు చంద్రబాబు తెలుగుదేశాన్ని.నీ కేసులలో ఇప్పటిదాకా స్టే లు ఎందుకు తీసివేయలేదు? ఎన్టీఆర్ మీద ప్రేమతో ఇంతవరకు ఏ కార్యకర్తగా ఉన్నారు.కాంగ్రెస్ పార్టీ ని ఎదిరించిన అన్న గారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే రీతిలో కాంగ్రెస్ పార్టీని ఆశ్రయించావు.చంద్రబాబుది కుటుంబ పరిపాలన.హరికృష్ణ కు నీవు ఏం చేశావో ఇప్పటికైనా ప్రజలకు చెప్పు.యూటర్న్ చంద్రబాబు.మోడీ ఆంధ్రాకు వస్తే బేడీలు వేస్తానన్న నువ్వు మోడీ తో జతకట్టడం ఎంతవరకు సమంజసం?కేంద్రప్రభుత్వం నిధులకు లెక్కలు చెప్పవద్ద? నువ్వు ప్పవా?జగన్మోహన్ రెడ్డికి ఒక అవకాశం ఇవ్వండి ఇది ప్రజలకు నేనిచ్చే సందేశంప్రజలకు జగన్మోహన్ రెడ్డి మంచి చేస్తాడు.చదువు ఆరోగ్యం కోసం రాజశేఖర్ రెడ్డి గారు తాపత్రయ నిజంఆపధర్మ ముఖ్యమంత్రి పోస్ట్ డేటెడ్ చెక్కులు ఎలా ఇస్తారు.అమరావతి రాజధాని నిర్మాణం కోసం పచ్చని పొలాలని ఎంచుకోవడం న్యాయమేనా?ఆంధ్ర దేశాన్ని దోచేశావు చంద్రబాబు.కేసీఆర్ తెలంగాణకు మంచి చేస్తున్నాడు.నీ రాష్ట్రాన్ని నువ్వు బాగు చెయ్యి.ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్ గా దొరికి భయపడి పారిిపోయావు చంద్రబాబు నాయుడువైస్రాయ్ హోటల్ దగ్గర ఎన్టీఆర్ మీద చెప్పులు వేయించడం నాకు తెలుసు.చంద్రబాబు ఎన్ని మోసాలు అయిన చేస్తాడు.మీ డబ్బులు మీరు తీసుకోండి జగన్మోహన్ రెడ్డికి ఓట్ వేయండిపసుపుకుంకుమా మీడబ్బే మీకు ఇస్తున్న చంద్రబాబు నాయుడు ను నమ్మవద్దు
* ఎన్నికల ముందు చంద్రబాబుకు ఎదురు దెబ్బ
ముందు రాష్ట్రంలో గెలిచి చూపించు అంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ సవాల్ విసిరారు. నెల్లూరులో శుక్రవారం నిర్వహించిన జిల్లా కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో రాంమాధవ్ పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ చంద్రబాబుపై విమర్శలు చేశారు. ఏపీలో అసమర్థ, అవినీతి, కుటుంబ పాలన నడుస్తోందని రాంమాధవ్ అన్నారు. దేశాన్ని రక్షిస్తానంటూ తిరుగుతున్న చంద్రబాబు ముందు ఈ ఎన్నికల్లో గెలిచి చూపించాలని సవాల్ విసిరారు.మళ్లీ అధికారంలోకి వచ్చేది మోదీయేనని, దేశ ప్రజలంతా ఆయన వెంటే ఉన్నారని రాంమాధవ్ పేర్కొన్నారు. మోదీని తమ ప్రాంతం నుంచి పోటీ చేయాల్సిందిగా అన్ని ప్రాంతాల ప్రజలు కోరుతున్నారని ఆయన అన్నారు. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పైనా రాంమాధవ్ విమర్శలు చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో పట్టుమని పది సీట్లు కూడా దక్కించుకోలేని కేసీఆర్ ప్రధానిని అవుతానని చెప్పడం హాస్యాస్పదమని అన్నారు.
* కాంగ్రెస్ పై విరుచుకు పడిన మోడీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, యూపీయే చైర్‌పర్సన్ సోనియా గాంధీలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని వెస్ట్ సియాంగ్ జిల్లా, ఆలోలో జరిగిన బీజేపీ ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అగ్ర నేతలపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు.రాహుల్, సోనియాలతోపాటు ఇతర కాంగ్రెస్ నేతలపై నమోదైన కేసులను మోదీ పరోక్షంగా ప్రస్తావించారు. బెయిలుపై ఉన్నప్పటికీ, కాపలాదారును నిందిస్తున్నారని మండిపడ్డారు. ఢిల్లీలో కూర్చుని, పన్నులు ఎగ్గొట్టే, రైతుల భూములను లాక్కొనే, పత్రికా కార్యాలయం కోసం ఇచ్చిన ప్రభుత్వ భూమిని అద్దెకు ఇచ్చుకుని, డబ్బు సంపాదించే, రక్షణ ఒప్పందాల్లో కమిషన్లు తీసుకునే నాయకులు ఉన్నారన్నారు. ఆ నాయకులకు కోర్టు బెయిలు మంజూరు చేయడంతో బయట తిరుగుతున్నారన్నారు. వెంట్రుక వాసిలో (జైలు) జీవితాన్ని తప్పించుకున్నారన్నారు. తామే స్వయంగా బెయిలుపై ఉన్నవాళ్ళు కాపలాదారును నిందిస్తున్నారని దుయ్యబట్టారు.అరుణాచల్ ప్రదేశ్‌ను, ఈశాన్య భారత దేశాన్ని కాంగ్రెస్ నిర్లక్ష్యం చేస్తోందని మోదీ ఆరోపించారు. అరుణాచల్ ప్రదేశ్‌కు ఆధునిక మౌలిక సదుపాయాలు అవసరమని నిపుణులు చాలా దశాబ్దాల నుంచి చెప్తున్నారని గుర్తు చేశారు. నిపుణులు ఎంతగా చెప్తున్నప్పటికీ ఉన్నత వంశ కుటుంబం, ఆ కుటుంబానికి సన్నిహితులు తమ సొంత ఇలాకాను సృష్టించుకోవడానికే సమయాన్ని ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. వారు అరుణాచల్ ప్రజలను పట్టించుకోలేదన్నారు. ప్రజా సంక్షేమం కన్నా తమ సొంత లాభం కోసమే వారు పాటుపడుతున్నారన్నారు.ఇటీవల విజయవంతమైన యాంటీ శాటిలైట్ మిసైల్ పరీక్ష గురించి తాను ప్రకటించినందుకు ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయని మోదీ అన్నారు. పాకిస్థాన్‌లోని బాలాకోట్‌లో ఉగ్రవాద స్థావరాలపై భారత్ సైన్యం నిర్వహించిన దాడుల విషయంలో కూడా ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాయన్నారు. శాస్త్రవేత్తలు విజయం సాధిస్తే, వారిని ప్రతిపక్ష నేతలు ఎగతాళి చేస్తున్నారన్నారు. ఈ పరీక్ష విజయవంతం కావడం మన దేశానికి గర్వకారణమని చెప్పారు. అది మింగుడుపడని ప్రతిపక్ష నేతలు ఉగ్రవాదుల భాష మాట్లాడుతున్నారన్నారు. ఆ నేతలను మన దేశంలో ఎవరూ పట్టించుకోవడం లేదని, వారిని పాకిస్థాన్‌లో ప్రశంసిస్తున్నారని చెప్పారు. పాకిస్థాన్ వార్తా పత్రికల్లో మన దేశ ప్రతిపక్ష నేతల ఫొటోలను ప్రచురించారన్నారు.మన దేశ ప్రతిపక్ష నేతలకు పొరుగు దేశంపై చాలా ప్రేమాభిమానాలు ఉన్నాయని, మన దేశాన్ని ప్రశంసించలేనంత స్థాయిలో పొరుగు దేశాన్ని ప్రేమిస్తున్నారని మండిపడ్డారు.
*వారికి సీరియస్ వార్నింగ్ ఇచ్చిన చంద్రబాబు
ప్రధాని మోడీ తీరు పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు. సన్ సెట్ ఏపీ అంటూ మోడీ చేసిన వ్యాఖ్యల పై మండిపడ్డారు. కస్టపడి శ్రమతో అభివృద్ధి చేసుకుంటున్న రాష్ట్రం పై ఇంత అక్కసా అంటూ నిలదీశారు. కర్నూలులో మోడీ సభకు వైకాపా తన కార్యకర్తలను తరలించిందన్నారు. రాష్ట్రానికి ఏమీ ఇవ్వకుండా ఇంకా కక్ష సాదిస్తున్నారని ధైర్యముంటే చెప్పినదానికి చేసిన దానికి శ్వేతపత్రం ఇవ్వలని భాజపాని డిమాండ్ చేసారు. లేదంటే తామే శ్వేత పత్రం విడుదల చేస్తామన్నారు,. మోడీని జగన్ ను ప్రజలు విశ్వసించడం లేదన్నారు. అవినీతిపరులకు ప్రధాని రెడ్ కార్పెట్ వేయడం ఏమిటని అసహనం వ్యక్తం చేశారు.
*ఎస్పీ- బీఎస్పీ కూటమికి బీటలు
ఎస్పీ-బీఎస్పీ సారధ్యంలో ఏర్పడిన గట్ బంధన్ నుంచి నిశాద్ పార్టీ వైదొలగింది. మహారాజ్ గంజ్ స్థానం నుంచి తన పార్టీ చిహ్నం పై పోటీ చేయడానికి కూటమి నుంచి ఒక ఏకాభిప్రాయం రాకపోవడంతో పాటు కూటమితో తమను పక్కకు పెడుతున్నట్లుగా నిశాద్ పార్టీ అద్యక్షులు సంజయ్ నిషాద్ భావించినట్లుగా తెలిసింది. ఈ పరిణామాలతో మహారాజ్ గంజ్ స్థానం నుంచి పార్టీ సొంత గుర్తు పావు పోటీ చేయాలనీ సంజయ్ నిషాద్ భావిస్తున్నట్లు పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు తెలిపారు. నిషాద్ పార్టీ అద్యక్షులు సంజయ్ నిషాద్, ఆయన కుమారుడు ప్రవెన్ నిశాద్ శుక్రవారం సాయంత్రం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాద్ ను కలిశారు. ఈ పరినామలాతో నిశాద్ పార్టీ భాజపా కూటమిలో చేరుతున్నట్లు తెలుస్తోంది.
*కరీంనగర్ లో కారెం అల్లుళ్ళు
కరీంనగర్ లోక్ సభ స్థానానికి టీఆర్ఎస్ అభ్యర్ధిగా బోయినపల్లి వినోద్ కుమార్ మరోసారి బరిలో దిగారు. రాజన్న సిరిసిల్ల బోయినపల్లి మండలం కోరెం గ్రామ అల్లుడీయన. కోరెం గ్రామానికి చెందిన చేన్నాడి హన్మంతరావు , చేన్నాడి సత్యరాయణరావు స్వయానా సోదరులు. సత్యనారాయణరావు లచ్చంమల కుమార్తె వినోద ను విద్యాసాగరరావు వివాహం చేసుకున్నారు. చేన్నాడి హన్మంతరావు-శాంతమ్మల కుమారుడైన చేన్నాడి మార్తాండరావు కుమార్తె డాక్టర్ మాధవిని వినోద్ కుమార్ పెళ్లి చేసుకున్నారు. ఇలా ఒకే కుటుంబం నుంచి వచ్చిన ఈ ఇద్దరు అల్లుళ్ళు, కరీంనగర్ ఏమ్పీలుగా ఎన్నిక కావడం యాదృచ్చికం చెన్నమనేని విద్యాసాగర్ రావు 1998-99,1999-2004… ఈ రెండు పర్యాయాలు భాజపా నుంచి కరీంనగర్ ఎంపీగా గెలిచినా వినోద్ కుమార్ ఇప్పుడు మరోసారి బరిలో ఉంటున్నారు. వినోద్ కుమార్ కు విద్యాసాగర్ రావు వరుసకు బాబాయి అవుతారు .
* మోదీ మాటలు చెప్పి ఆకట్టుకుంటున్నారు – కేటీఆర్‌
మహబూబాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని నర్సంపేటలో టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఇవాళ రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. ఈ ఐదేళ్లలో రాష్ర్టానికి కేంద్రం చేసిందేమీ లేదన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ మాటలు చెప్పి ఆకట్టుకుంటున్నారు. కానీ పనులు చేయడం లేదన్నారు. పేదోళ్ల ఖాతాల్లో డబ్బులు వేస్తామని కేంద్రం చెప్పింది, కానీ డబ్బులు జమ చేయలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీకి 150 మించి సీట్లు వచ్చే పరిస్థితి లేదు. బయ్యారం ఉక్కు పరిశ్రమ నేటికి ఇంకా పెండింగ్‌లో ఉన్నది. టీఆర్‌ఎస్‌ ఎంపీలు గెలుస్తే ఏం అభివృద్ధి జరుగుతుందని కొందరు అంటున్నారు. 16 ఎంపీ సీట్లలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపిస్తే.. మన మాట చెల్లుతుంది. ఢిల్లీ పీఠం మీద ఎవరు ఉండాలో నిర్ణయించేది మనమే అవుతాం. మనకు రావాల్సిన నిధులను సాధించుకుంటాం అని కేటీఆర్‌ స్పష్టం చేశారు.
* విజయలక్ష్మీ, షర్మిలపై అనురాధ విమర్శలు
విజయలక్ష్మీ, షర్మిలపై టీడీపీ మహిళా నేత పంచుమర్తి అనురాధ విమర్శలు చేశారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ నుంచి షర్మిలకు ఎంత ప్యాకేజీ ముట్టిందని ప్రశ్నించారు. లోకేష్‌ గురించి దుర్భాషలాడటం తగదని హితవు పలికారు. విజయలక్ష్మీ, షర్మిల పోటీ చేయడానికి పనికిరారన్నారు. ఎదుటివారిపై బురదజల్లేందుకు మాత్రమే పనికొస్తారని దుయ్యబట్టారు. వైఎస్‌ హయాంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ లేక.. దళిత బాలికలు ఆత్మహత్యలు చేసుకున్నారని గుర్తుచేశారు.
* అమిత్‌షా నామినేషన్ దాఖలు
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా గుజరాత్‌లోని గాంధీనగర్ నియోజకవర్గం నుంచి శనివారంనాడు నామినేషన్ దాఖలు చేశారు. దీనికి ముందుకు నాలుగు కిలోమీటర్ల మేర ఆయన రోడ్ షో నిర్వహించారు. అమిత్‌షా నామినేషన్ దాఖలు చేసిన సమయంలో ఆయన వెంట కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, గుజరాత్ సీఎం విజయ్ రూపానీ, శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే ఉన్నారు.
* 6నెలల్లో 3లక్షల ఉద్యోగాలు భర్తీ: పవన్‌
రాయలసీమ నుంచి వలసలు నివారించి యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడమే తమ ధ్యేయమని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ అన్నారు. కర్నూలు జిల్లా నంద్యాలలో పవన్‌ రోడ్‌షో నిర్వహించారు. బొమ్మల సత్రం ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి అభిమానులు, జనసేన కార్యకర్తలతో సంజీవనగర్‌ మీదుగా శ్రీనివాస్‌ సెంటర్‌కు చేరుకొని ప్రసంగించారు. రాయలసీమ అంటే ఫ్యాక్షన్‌ ముద్ర కాకుండా రతనాల సీమగా మార్చేందుకు అందరూ నాంది పలకాలన్నారు. జనసేన అధికారంలోకి వస్తే 18 నెలల్లో సాగునీటి కష్టాలు తీరుస్తామని.. 6 నెలల్లో తాగునీటి కష్టాలు లేకుండా చేస్తామని పవన్‌ హామీ ఇచ్చారు.
* మూడు నెలల్లో రాష్ట్రంలో విపరీతమైన మార్పులు
అధికారం, అహంకారంతో విర్రవీగే వాళ్లకు ప్రజలే గుణపాఠం చెబుతారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ప్రజలు సాగునీరు, తాగునీరు కోరుకుంటుంటే అవి ఇవ్వకుండా ఆదాయం కోసం మద్యం దుకాణాలు ఎక్కడికక్కడ నెలకొల్పుతున్నారని విమర్శించారు. ‘‘తెరాస చెబుతున్నట్లు ఇది సారు.. కారు.. సర్కారు కాదు. బారు.. బీరు.. సర్కారు’’ అని ఎద్దేవాచేశారు. ఈ మేరకు ఆయన భాజపా రాష్ట్ర కార్యాలయంలో శనివారం మీడియాతో మాట్లాడారు.
* మోదీకి వ్యతిరేక పవనాలు: కనకమేడల
దేశ వ్యాప్తంగా మోదీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని, యూపీలో సైతం ప్రజలు చాలా అసంతృప్తితో ఉన్నారని తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్‌ అన్నారు. యూపీలో గత ఎన్నికల్లో ముస్లింలను మభ్యపెట్టి ఎక్కువ సీట్లు సాధించారని చెప్పారు. అమరావతిలో కనకమేడల మీడియాతో మాట్లాడారు. ‘‘ఇప్పటికే యూపీలో ఎస్పీ, బీఎస్పీ జట్టుకట్టాయి. బిహార్‌లో నితీశ్‌ కుమార్‌తో భాజపా కూటమి కట్టినా ఆ పొత్తుపై అంత నమ్మకం లేదు.
* టీడీపీకి కేంద్ర మాజీ మంత్రి రాజీనామా
ఎన్నికల ముంగిట ఆంధ్రప్రదేశ్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. అధికార తెలుగుదేశం పార్టీకి కేంద్ర మాజీ మంత్రి సాయి ప్రతాప్ రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన రాజీనామా లేఖను పార్టీ కార్యాలయానికి పంపారు. ఇందులో.. టీడీపీలో తనకు సుముచిత స్థానం కల్పించి గౌరవించినందుకు సాయి ప్రతాప్ చంద్రబాబుకు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. గతంలో రాజంపేట లోక్‌సభ స్థానం నుంచి పలుమార్లు గెలుపొందిన ఆయన కాంగ్రెస్ హయాంలో కేంద్ర మంత్రిగా పని చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరొందిన సాయి ప్రతాప్.. ఆ మధ్య తెలుగుదేశం పార్టీలో చేరారు.
* నిరుద్యోగ భృతికి జగన్‌ మోకాలడ్డు: యనమల
నిరుద్యోగ యువతకు ఇచ్చే భృతికి కూడా జగన్ మోకాలడ్డుతున్నారని మంత్రి యనమల విమర్శించారు. పెంచిన రూ.2 వేలు యువతకు అందకుండా వైకాపా కుట్రలు చేస్తోందన్నారు. పాత స్కీముకు కూడా ప్రతిపక్షం అడ్డంకుల పెడుతోందని చెప్పారు. అలాంటి పార్టీకి యువతరం బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. పసుపు-కుంకుమ చెల్లింపునకు కూడా జగన్ అడ్డంకులు గురిచేస్తు్న్నారని మండిపడ్డారు.
* మోదీపై బీఎస్‌ఎఫ్‌ జవాన్‌ పోటీ
ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తర ప్రదేశ్‌లోని వారణాసి లోక్‌సభ స్థానం నుంచి మరోసారి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈసారి మోదీపై ఓ మాజీ బీఎస్‌ఎఫ్‌ జవాన్‌ పోటీకి దిగారు. పాకిస్తాన్‌-భారత్‌ సరిహద్దుల్లో పహరా కాస్తున్న బీఎస్ఎఫ్ జవాన్లకు నాణ్యత లేని ఆహారం సరఫర చేస్తున్నారంటూ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసి సంచలనం రేపిన బీఎస్‌ఎఫ్‌ జవాన్ తేజ్ బహదూర్ యాదవ్ వారణాసి నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. చాలా రాజకీయ పార్టీలు తనను వారణాసి నుంచి పోటీ చేయాలని కోరాయని, కాని తాను స్వతంత్ర అభ్యర్థిగానే ఎన్నికల్లో ప్రధానిపై పోటీ చేస్తాని తేజ్ బహదూర్ తెలిపారు.
* నల్లగొండలో కాంగ్రెస్‌ పార్టీకి భారీ షాక్‌
నల్లగొండ శాసనసభ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీకి భారీ షాక్‌. ఈ నియోజకవర్గంలోని కాంగ్రెస్‌ నేతలందరూ టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. విద్యాశాఖ మంత్రి జగదీష్‌ రెడ్డి సమక్షంలో డీసీసీబీ డైరెక్టర్‌, తిప్పర్తి మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు సంపత్‌ రెడ్డి, మాజీ సర్పంచ్‌ చింతకుంట్ల రవీందర్‌ రెడ్డి, అంతయ్యగూడెం సర్పంచ్‌ సిరిగిరి వెంకట్‌రెడ్డితో పాటు పలువురు టీఆర్‌ఎస్‌లో చేరారు. వీరందరికి మంత్రి జగదీష్‌ రెడ్డి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌ రెడ్డి, నల్లగొండ పార్లమెంట్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వేమిరెడ్డి నర్సింహారెడ్డితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.
* డీఎంకే నేత ఇంట్లో ఐటీ సోదాలు
ద్ర‌విడ మున్నేత్ర క‌జ‌గం(డీఎంకే) కోశాధికారి దురై మురుగ‌న్ నివాసాల్లో ఇవాళ ఆదాయ‌ప‌న్నుశాఖ అధికారులు సోదాలు నిర్వ‌హిస్తున్నారు. వెల్లోర్ జిల్లాలోని కాట్పాడిలో ఈ త‌నిఖీలు జ‌రుగుతున్నాయి. శుక్ర‌వారం రాత్రి 10.30 డీఎంకే నేత ఇంటికి వ‌చ్చిన అధికారులు శ‌నివారం కూడా సోదాలు చేస్తూనే ఉన్నారు. మురుగ‌న్ కుమారుడు కాతిర్ ఆనంద్ ఈసారి వెల్లోర్ నుంచి లోక్‌స‌భ‌కు పోటీ చేస్తున్నారు. ఐటీ శాఖ ఉద్యోగులు అయిదు బృందాలుగా మారి సోదాలు చేస్తున్నారు. గురువారం ఐటీ శాఖ అధికారులు క‌ర్నాట‌క మంత్రి పుట్ట‌రాజు ఇంట్లో కూడా త‌నిఖీలు చేశారు.
*ప్రచార బాద్యతల నుంచి వైదొలిగినా ప్రశాంత్ కిషోర్
మరో రెండు వారాలలోపే లోక్ సభ తొలిదశ ఎన్నికలు జరగనున్న తరుణంలో బీహార్ అధికార జనతా దళ్ – యునైటెడ్ లో ముసలం ఏర్పడింది. ఆ పార్టీ ఉపాధ్యక్షుడు, రాజకీయ వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్ నిర్వహణ ప్రచార బాద్యతల నుంచి వైదొలిగారు శుక్రవారం ఈ మేరకు ఆయన ట్విట్ చేశారు. జేడీయు నేత, రాజ్యసభ సభ్యుడు రాం చంద్ర ప్రసాద్ సింగ్ ఈ బాద్యతలు చూస్తారని పేర్కొన్నారు. ఇది పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అయింది. పార్టీలో ఎటువంటి కీలక బాద్యతలు అప్పజేప్పక పోవడం పై కిషోర్ కినుకు వహించినట్లు చెబుతున్నారు. రాజకీయంగా తోలి అడుగులు వేస్తున్నందున పార్టీలో తన పాత్ర కేవలం నేర్చుకోవడానికి సహకారం అందించడానికి మాత్రమే పరిమితమవుతుందని ఆయన చెప్పారు. మహాకూటమి నుంచి తప్పుకున్న నితీష్ కుమార్ ఎన్డీఏ లోకి వెళ్ళే కన్నా తాజాగా ప్రజాతీర్పు కోరి ఉండాల్సిందని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో తీవ్ర దుమారాన్ని రేపాయి.
*అన్న విన్నారు… ఆదుకున్నారు!-లక్కిరెడ్డిపల్లెలో పింఛన్ల పథకం ప్రకటన
పండుటాకులు, వితంతువుల జీవితాల్లో వెలుగుపూలు పూయిస్తోన్న పింఛను పథకానికి నాంది ప్రస్తావన ఎక్కడ జరిగిందో తెలుసా… కడప జిల్లాలోని లక్కిరెడ్డిపల్లెలో. మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావును కదిలించిన అలనాటి పరిస్థితులు ఇందుకు ప్రాతిపదికలయ్యాయి. ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీని స్థాపించిన రోజులవి. 1983 ఎన్నికల ప్రచారంలో భాగంగా లక్కిరెడ్డిపల్లెకు వెళ్తున్నారు. చైతన్యరథంలో ఆయనతో పాటు లక్కిరెడ్డిపల్లె నియోజకవర్గ (తర్వాతికాలంలో ఈ స్థానం రద్దయింది) తెదేపా అభ్యర్థి ఆర్‌.రాజగోపాల్‌రెడ్డి ఉన్నారు. వృద్ధులు, వితంతువుల బాగోగులను పిల్లలు పట్టించుకోవడం లేదని, కరవు ప్రాంతంలో వారి బతుకులు దయనీయంగా ఉన్నాయని, ఐదు వేళ్లు వారి నోటిలోకి వెళ్లాలంటేనే కష్టంగా ఉందని, ప్రతినెలా ఎంతో కొంత పింఛనుగా ఇచ్చి ఆదుకుంటే బాగుంటుందని… ఎన్టీఆర్‌కు రాజగోపాల్‌రెడ్డి వివరించారు. ఈ మాటలు విన్న ఎన్టీఆర్‌ కదిలిపోయారు… ఆలోచనలో పడ్డారు. ఆ తర్వాత అక్కడ నిర్వహించిన సభలో ఎన్టీఆర్‌ మాట్లాడుతూ… తాను అధికారంలోకి వస్తే వృద్ధులు, వితంతువులకు పింఛను ఇస్తామని, వారి జీవితాలను బాగు చేస్తామని ప్రకటించారు. ఆయన అధికారంలో వచ్చారు. ఆయన మంత్రివర్గంలో రవాణా, వ్యవసాయ, పాడి, మత్స్యశాఖల బాధ్యతలను ఆర్‌.రాజగోపాల్‌రెడ్డి చూశారు. ప్రచారంలో హామీ ఇచ్చిన మేరకు ఎన్టీఆర్‌ నెలకు రూ.30 పింఛన్‌ ప్రకటించారు. రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాక దాన్ని రూ.50 చేశారు. 1995లో చంద్రబాబు సీఎం అయిన తర్వాత పింఛను మొత్తం రూ.75కు పెరిగింది. ఆ తర్వాత కాంగ్రెస్‌ హయాంలో రూ.200 ఉన్న పింఛన్‌ను… చంద్రబాబు 2014లో రూ.1,000కి, 2019లో రూ.2,000కు పెంచారు. ప్రస్తుతం ఎన్నో కుటుంబాలకు ఆ సొమ్ము భరోసా ఇస్తోంది.
*అమ్మమ్మ ఊర్లో ఉత్తమ్‌ సందడి
టీపీసీసీ అధ్యక్షుడు, కాంగ్రెస్‌ పార్టీ నల్గొండ ఎంపీ అభ్యర్థి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం దేవరకొండ నియోజకర్గంలో పర్యటించారు. దేవరకొండ మండలం కమలాపూర్‌ గ్రామంలోని తన అమ్మమ్మ ఇంట్లో సందడి చేశారు. తన తల్లిదండ్రులు పురుషోత్తంరెడ్డి, సువర్ణమ్మలతో కలిసి.. తాత తుమ్మలపల్లి చల్మారెడ్డి, అమ్మమ్మ హాల్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.
*రాజకీయం’ కోసమే హిందూత్వ ఉగ్రవాద ముద్ర
కాంగ్రెస్‌ పార్టీ తన రాజకీయ ప్రయోజనాల కోసం తప్పుడు సాక్ష్యాధారాల ఆధారంగా మొత్తం హిందువులందరిపైనా హిందూత్వ ఉగ్రవాదమనే ముద్రను వేసినట్లు భాజపా ఆరోపించింది. హిందూ ఉగ్రవాదమనే రాజకీయ కుట్రను సుస్థిరం చేసే దిశగానే సంఝౌతా పేలుడు ఘటనలో దర్యాప్తు సాగినట్లు ఆ కేసులో వెలువడిన తీర్పు స్పష్టం చేసిందని పేర్కొంది. భాజపా సీనియర్‌ నేత, కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ శుక్రవారం రక్షణమంత్రి నిర్మలాసీతారామన్‌, మరోనేత అనిల్‌ బలూనితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
*జగన్‌కు ఒక్కసారి అవకాశమివ్వండి
ఎన్నికల్లో విలువలకు, విశ్వసనీయతకు పట్టం కట్టాలని వైకాపా గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారానికి వెళ్లే ముందు… శుక్రవారం ఆమె కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్‌ఆర్‌ ఘాట్‌ను సందర్శించి నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ… ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తారో చెప్పే స్థితిలో లేరన్నారు. ఇన్నాళ్లూ జగన్‌ నామజపం చేస్తున్నారే తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. వైఎస్‌ఆర్‌ పాలన రావాలంటే అది జగన్‌తోనే సాధ్యమని తెలిపారు. తెదేపా అరాచకాలకు దీటైన జవాబు చెప్పాలన్నా, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. ‘‘ప్రజలందరికీ చేతులెత్తి నమస్కరించి చెబుతున్నా… ఒక్కసారి జగన్మోహన్‌రెడ్డికి అవకాశం ఇవ్వండి’’ అని విజయమ్మ కోరారు.
*వారణాసికి మోదీ చేసిందేమిటి!
లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని మోదీపై పోటీకి సైతం వెనుకాడేదిలేదని పరోక్షంగా తెలిపిన కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా వాద్రా వారణాసి బరిలో దిగేందుకు సుముఖంగానే ఉన్నట్లు బలమైన సంకేతాలను ఇచ్చారు. శుక్రవారం అయోధ్యలో పర్యటించిన ఆమె… మోదీ ప్రాతినిధ్యం వస్తున్న వారణాసిలో అభివృద్ధిలేమికి సంబంధించి విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రపంచమంతా చుట్టి వస్తున్న మోదీ తన సొంత నియోజకవర్గ ప్రజల సమస్యలను పట్టించుకోలేదని ధ్వజమెత్తారు.
*ఓటమి భయంతో ప్రధానికి వణుకు
‘సూర్యోదయాన్ని ఇస్తారని నమ్మి మోసపోయాం. అందుకే మీ పార్టీని అస్తమించేలా చేసేందుకు దేశ వ్యాప్తంగా ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడిన పార్టీలన్నీ ఏకమయ్యాయి. ఈ సఖ్యత చూసి మీకు ఓటమి భయంతో వణుకుపుడుతోంది’ అని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు, మంత్రి కళా వెంకటరావు ప్రధాని మోదీకి శుక్రవారం రాసిన బహిరంగ లేఖలో మండిపడ్డారు. కర్నూలు జిల్లా చరిత్రలో ప్రధాని హోదాలో వచ్చిన మొదటి వ్యక్తి నేను అని గొప్పలు చెప్పుకొంటున్నారు. కర్నూలు జిల్లా నంద్యాల నుంచి ప్రాతినిధ్యం వహించిన వ్యక్తిని ప్రోత్సహించి ప్రధానిని చేసిన చరిత్ర తెదేపాదని పేర్కొన్నారు. ‘
*కేసీఆర్‌, భాజపాతో పొత్తు లేదు
మంచికి చెడుకు మధ్య జరిగే పోరాటంలో మంచి వైపు నిలిచి జగన్మోహనరెడ్డికి ఒక్క అవకాశం ఇవ్వాలని వైకాపా రాష్ట్ర నాయకురాలు షర్మిల కోరారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో శుక్రవారం ఆమె బస్సుయాత్ర ప్రారంభించారు. మంగళగిరి జామియా మసీదు కూడలిలోనూ రాత్రి మాట్లాడారు. గత ఎన్నికల్లో చంద్రబాబు 600 హామీలనిచ్చి ఒక్కటీ నెరవేర్చలేదని.. రైతులు, చేనేత, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేయకుండా ఒక్కొక్కరికి రూ.1.20 లక్షలు బాకీ పడ్డారని వివరించారు. కేసీఆర్‌, భాజపాతో తమకు ఎలాంటి పొత్తు లేదని, సింహం ఒంటరిగానే పోటీ చేసి గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక చంద్రబాబు పాలన అక్రమాలను పరిశీలించి న్యాయం చేస్తారని తెలిపారు.
*పోటీలో ఉన్నది మా అభ్యర్థులు కాదు
ప్రజాశాంతి తరఫున నామపత్రాలు దాఖలు చేసి పోటీలో ఉన్న అభ్యర్థుల్లో చాలా మంది తమ అభ్యర్థులు కారని పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ తెలిపారు. శుక్రవారమిక్కడ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెదేపా, వైకాపాకు చెందిన వారు సిబ్బందిపై దాడిచేసి ప్రజాశాంతి బీఫారాలు ఎత్తుకెళ్లి అభ్యర్థులను నిలిపారన్నారు. తెదేపా 38 మందిని వైకాపా 11 మందిని అభ్యర్థులను నిలిపిందని ఆయన ఆరోపించారు. పలుచోట్ల ప్రజాశాంతి అభ్యర్థుల బీఫారాలు తిరస్కరించిన అధికారులు వైకాపా, తెదేపా వారు నిలిపిన వారిని అనుమతించారన్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా పార్టీకి నష్టం జరిగిందని, ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు వాయిదా వేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరానన్నారు. రూ.లక్షల కోట్ల అవినీతి చేశారని పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్న చంద్రబాబు, జగన్‌లు ఇద్దరూ తోడుదొంగలని ఆయన అభివర్ణించారు.
*మోదీ, కేసీఆర్‌ల పాలనకు చరమగీతం
కేంద్రంలో మోదీ పాలనకు, రాష్ట్రంలో కేసీఆర్‌ పాలనకు చరమగీతం పాడేందుకే వ్యూహాత్మకంగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయకుండా వ్యవహరించామని తెదేపా రాష్ట్రాధ్యక్షుడు ఎల్‌.రమణ పేర్కొన్నారు. కాంగ్రెస్‌ కోరిన మేరకు ఆ పార్టీకి మద్దతు ఇస్తున్నామని చెప్పారు. తెదేపా ఆవిర్భావ వేడుకలను హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ భవన్‌లో పార్టీ రాష్ట్ర శాఖ శుక్రవారం ఘనంగా నిర్వహించింది.
*11నే నిజామాబాద్‌లో పోలింగ్‌: ఎంపీ కవిత
లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్‌ 11నే జరుగుతాయని నిజామాబాద్‌ లోక్‌సభ తెరాస అభ్యర్థి, ఎంపీ కవిత ఓటర్లకు చెబుతున్నారు. శుక్రవారం నిజామాబాద్‌ జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆమె పలు సమావేశాల్లో మాట్లాడారు. ఎన్నికల బరిలో 185 మంది ఉండడంతో ఎన్నిక జరుగుతుందా? వాయిదా పడుతుందా? అనేది ప్రస్తుతం జిల్లాఅంతటా చర్చ జరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకొని కవిత తన ఎన్నికల ప్రచారంలో మొదట నిర్ణయించిన దాని ప్రకారం ఏప్రిల్‌ 11న పోలింగ్‌ ఉంటుందని ఓటర్లకు గుర్తు చేస్తున్నారు. అది కూడా బ్యాలెట్‌ రూపంలో ఉంటుందని చెబుతున్నారు.
*రేపు ఏపీకి రానున్న రాహుల్‌ గాంధీ
ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆదివారం విజయవాడ రానున్నారని కేంద్ర మాజీ మంత్రి పళ్లంరాజు తెలిపారు. స్థానిక అజిత్‌సింగ్‌ నగర్‌లోని మాకినేని బసవపున్నయ్య మైదానంలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచారసభలో ఆయన పాల్గొంటారని వివరించారు. ఏపీకి ప్రత్యేకహోదాపై రాష్ట్ర ప్రజలకు మరోసారి భరోసా ఇచ్చేందుకే రాహుల్‌ రాష్ట్రానికి వస్తున్నారన్నారు. శుక్రవారం ఆంధ్రరత్న భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పళ్లంరాజు మాట్లాడారు. కేంద్ర ఎన్నికల సంఘం, సీబీఐ వంటి స్వతంత్ర వ్యవస్థల ప్రతిష్ఠను ప్రధాని నరేంద్ర మోదీ దిగజార్చారని, ఇటీవల జరిగిన పరిణామాలే ఇందుకు నిదర్శనమని ఆయన విమర్శించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మోదీపై వ్యతిరేకత పెరిగిపోయిందని, వచ్చే ఎన్నికల్లో ఆయన ఓటమి ఖాయమని పళ్లంరాజు అభిప్రాయపడ్డారు.
*నాలోనూ సీమ పౌరుషం
‘జనసేన, తెదేపాకు పొత్తు ఉందంటున్నారు. మరి అమిత్‌షా, తెరాసతో జగన్‌ భాగస్వామ్యాన్ని ఏమనాలి? రాయలసీమ ప్రాంతానికి చెందిన వాడిని కానప్పటికీ నాకూ సీమ పౌరుషం ఉంది. ఆ పౌరుషాన్ని రెచ్చగొట్టవద్దు. మాట్లాడే ముందు ఆచితూచి మాట్లాడు’ అని జగన్‌కు జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ హితవు పలికారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఆయన కర్నూలు జిల్లా నంద్యాల, ఆదోని, నందికొట్కూరు పట్టణాల్లో పర్యటించారు.
*కేసీఆర్‌ ప్రధాని కావాలని దేశం కోరుకుంటోంది
ఈ ఎన్నికల తర్వాత దేశ రాజకీయాలు మారబోతున్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ జోస్యం చెప్పారు. దిల్లీపై గులాబీజెండా ఎగురబోతోందన్నారు. కేసీఆర్‌ లాంటి నాయకుడు ప్రధాని కావాలని యావత్తు దేశం కోరుకుంటుందన్నారు. మల్కాజిగిరి, సికింద్రాబాద్‌, చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గాలకు సంబంధించిన ప్రచార సభను శుక్రవారం సాయంత్రం ఇక్కడ ఎల్బీ స్టేడియంలో నిర్వహించారు.
*మాజీ మంత్రి హరీశ్‌కు తప్పిన ప్రమాదం
మెదక్‌ జిల్లా తూప్రాన్‌లో శుకవ్రారం రాత్రి నిర్వహించిన తెరాస ఎన్నికల ప్రచారంలో ప్రముఖ నాయకులకు ప్రమాదం తప్పింది. 8 గంటల సమయంలో తూప్రాన్‌ పురపాలక కార్యాలయం వద్ద ప్రచారరథం నుంచి మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రసంగిస్తున్న సమయంలో అదే ప్రచార రథం జనరేటర్‌లో పొగలు వ్యాపించి డీజిల్‌ లీకేజీతో మంటలు చెలరేగాయి. ప్రమాదానికి రెండు నిమిషాల ముందు ప్రచార రథానికి సంబంధించిన విద్యుత్తు లైట్లు నిలిచిపోయాయి. డీజిల్‌ అయిపోవడంతో అలా జరిగిందని అంతా భావించారు.
*ఎన్నికల విధుల్లో ఉండగా అపవాదులా!
తన భూమిని వేరొకరి పేరుపై పట్టా చేశారంటూ శరత్‌ అనే యువకుడు ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్టు.. ఈ సందర్భంగా సీఎం వ్యాఖ్యలు ఇప్పుడు ప్రభుత్వానికి, రెవెన్యూ ఉద్యోగులకు మధ్య వివాదాన్ని రాజేశాయి. రెవెన్యూ ఉద్యోగులపై అపవాదు మోపారంటూ రెవెన్యూ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. శుక్రవారం కరీంనగర్‌, పెద్దపల్లి, మంచిర్యాలతోపాటు పలు జిల్లాల్లో రెవెన్యూ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమ సంఘం(ట్రెసా) అధ్యక్ష, కార్యదర్శులు రవీందర్‌రెడ్డి, నారాయణరెడ్డిల ఆధ్వర్యంలో వివిధ సంఘాలు సమావేశమై పలు నిర్ణయాలు తీసుకున్నాయి.
*16వ లోక్‌సభలో.. 146 మంది వ్యవసాయదారులే
ప్రస్తుతం గడువు తీరనున్న 16వ లోక్‌సభకు ఎన్నికైన వారిలో 146 మంది సభ్యులు తమ వృత్తిని వ్యవసాయం, వ్యవసాయ సంబంధితంగా చూపారు. ఆ తర్వాత స్థానంలో సామాజిక కార్యకర్తలు 89 మంది ఉన్నారు. వ్యాపారులు 72 మంది, న్యాయవాదులు 54 మంది, రాజకీయ సామాజిక కార్యకర్తలు 38, వైద్యులు 27, పారిశ్రామికవేత్తలు 5 మంది, రైతులు ఏడుగురు ఉన్నారు. అతి తక్కువగా చార్టర్డ్‌ అకౌంటెంట్‌, వ్యూహకర్త, క్రీడాకారులు ఒక్కొక్కరే ఉన్నారు. మిగతా సభ్యులు వివిధ వృత్తుల వారు ఉన్నారు.
*ప్రచార సామగ్రి @ కేరళ ఫ్యాన్సీ
భారత్‌లో ఎన్నికలకు పర్యాయపదంగా ‘ఓట్ల పండగ’ అని చెబుతుంటాం. కేరళలోని ఓ దుకాణానికి వెళితే.. ఎన్నికలను ఓట్ల పండగ అనడం సబబే అనిపిస్తుంది. వేర్వేరు రాజకీయపార్టీల జెండాలు, గుర్తులు, ఇతర ప్రచార సామగ్రితో అక్కడంతా రంగులమయంగా ఉండడమే ఇందుకు కారణం. కేరళలోని త్రిశూర్‌ జిల్లా పుత్తేన్‌పల్లిలోని ఓ దుకాణం ఎప్పుడు ఎన్నికలు వచ్చినా.. కిటకిటలాడుతూ కనిపిస్తుంది. జమాల్‌ అనే వ్యక్తి 30 ఏళ్లుగా ‘కేరళ ఫ్యాన్సీ’ పేరుతో ఈ దుకాణంలో.. వివిధ పార్టీల ప్రచార సామగ్రిని విక్రయిస్తున్నారు.
*నిజామాబాద్‌లో భారీ ఈవీఎంలు
నిజామాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గానికి 185 మంది పోటీ పడుతుండడంతో ఇక్కడ ఎన్నిక ఏ పద్ధతిలో నిర్వహించాలన్న విషయమై శుక్రవారానికి కూడా స్పష్టత రాలేదు. బ్యాలెట్‌ పత్రం ద్వారా నిర్వహించాలా? దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ఆధునిక యంత్రాలను తెచ్చి ఎన్నిక నిర్వహించాలా? అన్న అంశంపై అధికారులు మల్లగుల్లాలు పడుతూనే ఉన్నారు. ఇక్కడ పోటీ చేస్తున్నవారిలో ఎక్కువ మంది పసుపు, ఎర్రజోన్నల రైతులన్న విషయం తెలిసిందే.
*పాలనను కేసీఆర్‌ గాలికొదిలేశారు
శాసనసభ ఎన్నికలు ముందుగా జరగాలని ఎవరో జ్యోతిషుడు చెప్పారట. లోక్‌సభతో పాటు తెలంగాణ ఎన్నికలు జరిగితే మోదీ కŸరిష్మాతో ఆ పార్టీ లోక్‌సభతో పాటు శాసనసభ ఎన్నికల్లో కూడా మునిగిపోతుందని సలహా ఇచ్చారట. ఏప్రిల్‌, మే సమయంలో మోదీ అంటే భయంతో శాసనసభ ఎన్నికలను ముందుకు జరిపారు. ఈ రాష్ట్ర భవిష్యత్తును తెలంగాణ ప్రజలు నిర్ణయిస్తారా? జ్యోతిషుడు నిర్ణయిస్తారా? దేశరక్షణ, సమృద్ధి, గౌరవం ఇవి అభివృద్ధికి పునాదులుగా గౌరవించే కాపలాదారు ఓవైపు. మరోవైపు నాయకుడు ఎవరో తెలియదు.. నీతి అసలే లేదు. ఇక వారి సంకల్పం, నిబద్ధత గురించి ఈ దేశంలో ప్రజలందరికీ తెలిసిందే. వారు కుటుంబం కోసమే ఆలోచిస్తుంటారు. పేదలు, దళితులు, పీడితుల అభివృద్ధి గురించి ఎన్నడూ మాట్లాడరు
*ఎన్నికల తరువాత భాజపా దుకాణం బంద్‌
తాజా సమాచారం ప్రకారం ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో జాతీయ పార్టీలైన భాజపాకు 150కి మించి సీట్లు రావు. కాంగ్రెస్‌ సీట్లు 100కు మించవు. ఎన్నికల తర్వాత కేంద్రంలో అధికారంలోకి వచ్చేది ప్రాంతీయ పార్టీల కూటమైన ఫెడరల్‌ ఫ్రంట్‌ మాత్రమే .ఓట్లు, అధికారం కోసం దేశ ప్రధాని మోదీ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. భాజపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ అయిదేళ్లలో దేశంలోని రైతులు, దళిత, గిరిజన, మైనార్టీ, బలహీన వర్గాల(బీసీ)కు చేసిందేమీ లేదు. ఎన్నికల తర్వాత ఆ పార్టీని శంకరగిరి మాన్యాలు పట్టిస్తాను.
*పాలనను కేసీఆర్‌ గాలికొదిలేశారు
శాసనసభ ఎన్నికలు ముందుగా జరగాలని ఎవరో జ్యోతిషుడు చెప్పారట. లోక్‌సభతో పాటు తెలంగాణ ఎన్నికలు జరిగితే మోదీ కŸరిష్మాతో ఆ పార్టీ లోక్‌సభతో పాటు శాసనసభ ఎన్నికల్లో కూడా మునిగిపోతుందని సలహా ఇచ్చారట. ఏప్రిల్‌, మే సమయంలో మోదీ అంటే భయంతో శాసనసభ ఎన్నికలను ముందుకు జరిపారు. ఈ రాష్ట్ర భవిష్యత్తును తెలంగాణ ప్రజలు నిర్ణయిస్తారా? జ్యోతిషుడు నిర్ణయిస్తారా? దేశరక్షణ, సమృద్ధి, గౌరవం ఇవి అభివృద్ధికి పునాదులుగా గౌరవించే కాపలాదారు ఓవైపు. మరోవైపు నాయకుడు ఎవరో తెలియదు.. నీతి అసలే లేదు. ఇక వారి సంకల్పం, నిబద్ధత గురించి ఈ దేశంలో ప్రజలందరికీ తెలిసిందే.
*సభ్యత్వాల రద్దుకు పోరాటం
తెరాసలో చేరుతున్నట్లు ప్రకటించిన పది మంది ఎమ్మెల్యేల సభ్యత్వాలు రద్దయ్యేలా పోరాటం చేయాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది. పూర్తి ఆధారాలతో శాసనసభ సభాపతిని కలసి అనర్హతవేటు వేయాలని పిటిషన్‌ అందజేస్తారు. సీఎల్పీ నేత భట్టివిక్రమార్క ఆధ్వర్యంలో శుక్రవారం ఇందుకోసం ప్రయత్నించగా సభాపతి అసెంబ్లీలో లేరు. శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యులను కలిశారు. నిబంధనల మేరకు అనర్హత పిటిషన్‌ను సభాపతికే ఇవ్వాలి. త్వరలో ఆయన అపాయింట్‌మెంట్‌ తీసుకుని అనర్హత పిటిషన్‌ అందచేస్తారు.
*బాబు ఎవరికి భద్రత ఇచ్చారు?
‘ఐదేళ్ల పాలనలో చంద్రబాబు ఎవరికి భద్రత ఇచ్చారు? ఇసుక మాఫియాను అడ్డుకున్న మహిళా అధికారిని జుట్టు పట్టి ఈడ్చుకెళితే అధికారికి మద్దతిచ్చారా? లేదా ఆ ఎమ్మెల్యేపై కేసులు లేకుండా మద్దతిచ్చారా? విజయవాడలో కాల్‌మనీ వ్యవహారంలో బాధితురాళ్లకు మద్దతిచ్చారా? తెదేపా వారికా? ప్రతివారు భద్రంగా దాచుకునే ఆధార్‌, బ్యాంకు ఖాతాలను సేవామిత్ర యాప్‌ పేరుతో ప్రైవేటు కంపెనీలు, జన్మభూమి కమిటీల చేతుల్లో పెట్టారు.. చివరకు రాష్ట్ర ప్రజలకు భద్రత ఇచ్చారా? లేదా కొడుకు లోకేశ్‌కా?’ అని వైకాపా అధినేత జగన్మోహన్‌రెడ్డి ప్రశ్నించారు.
*‘గుర్తు’కొస్తున్నాయి..!-వైకాపాను కలవరపెడుతున్న హెలీకాప్టర్‌
జిల్లాలో పెనమలూరు నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇద్దరు అభ్యర్థుల పేర్లు ఒకటే కావడం, వారికి కేటాయించిన గుర్తులు సారూప్యాన్ని కలిగి ఉండటం చర్చనీయాంశంగా మారింది. 1999 ఎన్నికల్లోనూ ఇలాంటి పరిస్థితే ఎదురైందని పలువురు నెమరు వేసుకుంటున్నారు. పెనమలూరు వైకాపా అభ్యర్థిగా కొలుసు పార్థసారథి పోటీ చేస్తున్న విషయం విదితమే. అలాగే ప్రజాశాంతి పార్టీ అభ్యర్థిగా వేమూరి పార్థసారథి రంగంలో ఉన్నారు. ఈ రెండు పార్టీల అభ్యర్థుల ఇంటి పేరు వేరైనా ప్రధాన నామధేయం మాత్రం ఒక్కటే కావడం గమనార్హం.
*మా బీ ఫారాలు తెదేపా, వైకాపా వారు ఎత్తుకెళ్ళారు
ప్రజాశాంతి తరఫున నమపత్రాలు దాఖలు చేసి పోటీలో ఉన్న అభ్యర్ధుల్లో చాలా మంది తమ అభ్యర్ధులుకరణి పార్టీ అద్యక్షుడు కేఏ పాల్ తెలిపారు. శుక్రవరమిక్కడ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెదేపా, వైకాపకు చెందిన వారు సిబ్బంది పై దాడి చేసి ప్రశాంతి బీ ఫారాలు ఎత్తుకెళ్ళి అభ్యర్ధులను నిలిపారని అన్నారు. తెదేపా 38 మందిని, వైకాపా పదకొండు మందిని అభ్యర్ధులను నిలిపిందని ఆయన ఆరోపించారు. పలుచోట్ల ప్రజాశాంతి అభ్యర్ధులు బీ ఫారాలు తిరస్కరించిన అధికారులు వైకాపా, తెదేపా వారు నిపిన వారిని అనుమతించారని అన్నారు. అధికారులు వైకాపా తెదేపా వారు నిలిపిన వారిని అనుమతించారన్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా పార్టీకి నష్టం జరిగిందని, ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వాయిదా వేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరానన్నారు. రూ. లక్షల కోట్ల అవినీతి చేశారని పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్న చంద్రబాబు జగన్ లు ఇద్దరూ తోడూ దొంగలని ఆయన అభివర్ణించారు.

ఆదర్శప్రాయుడైన ముఖ్యమంత్రి జలగం వెంగళరావు

సామాన్య వ్యక్తిగా రాజకీయ అరంగేట్రం చేసి.. దశాబ్దాల పాటు రాష్ట్రాన్ని శాసించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావుది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ 6వ ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రిగా పనిచేశారాయన. ఖమ్మం జిల్లా పరిషత్‌ చైర్మన్‌గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఆయన హయాంలోనే జిల్లాలో విద్య, వైద్యం, విద్యుత్, రహదారి రంగాల్లో అభివృద్ధికి బాటలు పడ్డాయి.
*1957 అసెంబ్లీ ఎన్నికల్లో వెంగళరావుకు కాంగ్రెస్‌ పార్టీ సీటు లభించలేదు. ఆయన తమ్ముడు జలగం కొండల్‌రావు వేంసూరు నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలుపొందారు. ఆ తర్వాత వెంగళరావు 1962, 1967, 1972, 1978 ఎన్నికల్లో వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1984, 1989లో ఖమ్మం నియోజకవర్గం నుంచి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికైన వెంగళరావు.. ఇటు ఖమ్మం జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా పని చేయడంతోపాటు కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేస్తున్న సమయంలోనే ఉమ్మడి రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా కీలక బాధ్యతలను ఆయన భుజాల మీద పెట్టింది కాంగ్రెస్‌ పార్టీ. అప్పటి ముఖ్యమంత్రి ఎన్‌టీఆర్‌ పాలన విధానాలపై ధ్వజమెత్తిన నేత వెంగళరావు. తాను ఏ పదవిలో ఉన్నా. ఆ పదవికి వన్నె తెచ్చారు. ముఖ్యంగా జిల్లా అభివృద్ధి కోసం ఎవరినైనా ఎదిరిస్తారనే పేరు వచ్చిందాయనకు. అలాంటి జలగం రాజకీయ ప్రస్థానంలో ఒక్కటి మినహా అన్నీ విజయాలే.
**జడ్పీ చైర్మన్‌గా..
తొలుత ఆయన ఖమ్మం జిల్లా పరిషత్‌ చైర్మన్‌గా 1959లో బాధ్యతలు చేపట్టగా.. ఆ తర్వాత కొద్ది కాలానికి పంచాయతీరాజ్‌ పరిషత్‌ అధ్యక్ష పదవి ఆయనను వరించింది. పంచాయతీరాజ్‌ సంస్థలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆకళింపు చేసుకోవడం ద్వారా గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్ల నిర్మాణం, తాగునీటి సమస్య వంటి ప్రజోపయోగ పనులను నిర్వహించడం ద్వారా ప్రజలకు చేరువయ్యారు. రాష్ట్ర హోం మంత్రిగా శాంతిభద్రతల పర్యవేక్షణతోపాటు అప్పుడున్న నక్సల్‌ సమస్యను సమర్థంగా ఎదుర్కొన్నారనే పేరుంది.
ఒకేసారి 120 పాఠశాలలు
జలగం జడ్పీ చైర్మన్‌ కావడానికి ముందు జిల్లాలో ఖమ్మం, మధిరలో మాత్రమే ఉన్నత పాఠశాలలుండేవి. ఆయన కృషితో ఒకేసారి 120 పాఠశాలలు ఏర్పడ్డాయి. వెంగళరావుకు అద్భుతమైన జ్ఞాపకశక్తి ఉండేది. ఒకసారి చూసిన వ్యక్తిని కానీ, విన్న, చదివిన విషయాన్ని కానీ మర్చిపోయే వారు కాదు. ఆయా విషయాలకు సంబంధించిన అంకెలను తడుముకోకుండా చెప్పేవారు.
**నిజాంపై పోరు..
నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఆయన తిరువూరు కేంద్రంగా పోరు సలిపారు. అనేకసార్లు ఆయనపై రజాకార్ల దాడులు జరిగాయి. వెంగళరావు తిరువూరులో ఉన్న ఆయన మామ ఇంటికి తరచూ వెళ్తారనే సమాచారంతో ఒకసారి రజాకార్లు అక్కడ కూడా మాటేశారు. వెంగళరావు ఆ రోజు అక్కడికి వెళ్లకపోవడంతో రజాకార్లు ఆయన మామ మాధవరావుపై దాడి చేసి, ఆయనను హత్య చేశారు.
**గుమాస్తా పాఠాలు
రాజకీయాల్లోకి రాకముందు కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులో పంచాయతీరాజ్‌ శాఖలో గుమాస్తా ఉద్యోగం చేశారు. అప్పటి అనుభవం నేర్పిన పాఠాలతో ఆయన.. పంచాయతీరాజ్‌ సంస్థల అభివృద్ధికి, వాటి ప్రక్షాళనకు నివేదిక తయారు చేశారు. ఇది ‘వెంగళరావు నివేదిక’గా పేరుపడింది. పంచాయతీరాజ్‌ పరిషత్‌ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని ఒప్పించి తన నివేదికలోని అంశాల అమలుకు పూనుకున్నారు. అనేక పదవులు అలంకరించిన వెంగళరావు తనను వ్యతిరేకించే వారిపై కఠినంగా ఉండేవారని చెబుతారు.జలగం వెంగళరావు 1922, మే 4న శ్రీకాకుళం జిల్లా రాజాంలో జన్మించారు. 20వ ఏట ఖమ్మం జిల్లా, పెనుబల్లి మండలం బయ్యన్నగూడెం వచ్చి స్థిరపడ్డారు. నైజాం వ్యతిరేక పోరాటాన్ని ఆ ప్రాంతం నుంచే ప్రారంభించిన వెంగళరావు.. జెడ్పీ చైర్మన్‌గా, రాష్ట్ర హోం మంత్రిగా, ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా విధులు నిర్వర్తించారు. ఆ కాలంలో అభివృద్ధిలో జిల్లాను పరుగులు తీయించారు. ప్రభుత్వ ఉద్యోగులతో సన్నిహితంగా మెలిగేవారాయన. పోలీసుల సంక్షేమానికి కృషి చేసిన వ్యక్తి.

రాయపాటి విజయానికి భరోసా ఇచ్చిన కోమటి జయరాం

ఉత్తర అమెరికాలో తెలుగువారి అతి పెద్ద సంఘమైన తానా తమ పూర్తి మద్దతు తెలుగుదేశం పార్టీకే నని తానా మాజీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర అమెరికా ప్రత్యేక ప్రతినిధి అయినా కోమటి జయరాం పేర్కొన్నారు. శనివారం నాడు ఆయన నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు తో గుంటూరు లోని ఆయన నివాసంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు ఎన్నికల ప్రచార విశేషాలపై కొంతసేపు చర్చించుకున్నారు. ఉత్తర అమెరికాలో 35 సంవత్సరాలకు పైగా విద్య , సాంస్కృతిక , సాంఘిక రంగాల్లో విశిష్ట సేవలు తానా అందించడం జరుగుతుందని, భవిష్యత్ ప్రయోజనాల కోసం చంద్రబాబు నేతృత్వంలో తెలుగు దేశ ప్రభుత్వ ఏర్పాటుకు తానా సభ్యులు పూర్తిగా తమ మద్దతును ప్రకటించి ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం జరుగుతుందని ఈ సందర్భంగా కోమటి జయరాం ఎంపీ రాయపాటి వివరించారు. ఉత్తర అమెరికాలో IT ఇతర రంగాల్లో ఉన్న ఉద్యోగస్తులు రేపు జరగబోవు ఎన్నికల్లో ఓటు వేసి తెలుగు దేశ ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించేందుకు ప్రణాళిక రూపొందించుకోవాలని, అదే విధంగా ఇక్కడ ఉన్న తానా సభ్యులు గ్రామస్థాయిలో కి వెళ్లి తెలుగుదేశం ప్రభుత్వం అమలుపరిచిన వివిధ రకాల సంక్షేమ పధకాల కార్యక్రమాలను, మరియు భవిష్యత్ అభివృద్ధి కోసం చంద్రబాబు సారధ్యం యొక్క ఆవశ్యకతను ప్రతి ఒక్కరికి తెలిపి వారికి చైతన్యపరిచి తెలుగుదేశం ప్రభుత్వ ఏర్పాటుకు కృషి చేయాలని ఈ సందర్భంగా రాయపాటి సూచించారు.

తిరువూరులో వేడెక్కుతున్న ఎన్నికల ప్రచారం-TNI ప్రత్యేకం

కృష్ణాజిల్లా తిరువూరు ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం వేడెక్కుతుంది. ఈ నియోజకవర్గంలో 12 మంది అభ్యర్ధులు రంగంలో ఉన్నప్పటికీ పోటీ ప్రధానంగా తెదేపా, వైకాపా మధ్యనే నెలకొని ఉంది. ఇప్పటి వరకు వైకాపా అభ్యర్ధి ప్రస్తుత శాసనసభ్యుడు కొక్కిలిగడ్డ రక్షణనిధి ప్రచారంలో ముందంజలో ఉన్నారు. గత ఆదివారం నాడు వై.ఎస్.జగన్ తిరువూరు పర్యటన అనంతరం వైకాపా జోరు మరింతగా పెరిగింది. చివరి నిముషంలో కొవ్వూరు నుండి తిరువూరుకు ఆకస్మికంగా తరలి వచ్చిన తెదేపా అభ్యర్ధి, ఎక్సైజ్ మంత్రి కే.ఎస్.జవహర్ ప్రచారాన్ని కొంత ఆలస్యంగా ప్రారంభించారు. ప్రస్తుతం మంత్రి జవహర్ ముమ్మర ప్రచారంలో నిమగ్నమయ్యారు. తిరువూరు తెదేపా టికెట్ పై గంపెడంత ఆశ పెట్టుకున్న మాజీ శాసనసభ్యుడు నల్లగట్ల స్వామిదాస్ తొలుత జవహర్ కు సహకరించడానికి ముందుకు రాలేదు. చంద్రబాబు జోక్యంతో స్వామిదాస్ ఎన్నికల రంగంలోకి దిగారు. జవహర్ ను వెంటపెట్టుకుని స్వామిదాస్ నియోజకవర్గంలో తెదేపా ప్రచారానికి ఊపును తీసుకువచ్చారు. స్వామిదాస్ కు టికెట్ రాలేదని తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన అనుచరులు ఇతర దేశం నాయకులూ ఇప్పుడిప్పుడే జవహర్ కు అనుకూలంగా ప్రచార రంగంలోకి దిగారు. ఆర్ధికంగా పెద్దగా లేని వైకాపా అభ్యర్ధి రక్షణనిధి పార్లమెంటు అభ్యర్ధి పొట్లూరి వరప్రసాద్ సహకారంతో తెదేపా అభ్యర్ధితో పోటీగా ఖర్చు పెడుతున్నారు. ఇరుపార్టీల అభ్యర్ధులు మందీమర్భాలంతో పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అద్దె జనాన్ని పోగుచేసి వారిని రోజుకు మూడు వందల లెక్కన కూలీ ఇస్తూ చికెన్ భోజనాలు పెడుతూ అభ్యర్ధులు తమ వెంట ప్రచారంలో ఎక్కువ సంఖ్యలో ఉండే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. ఈసారి కార్యకర్తలకు కూడా అభ్యర్ధులు భారీగా సొమ్ములు అందజేస్తున్నారు. బూత్ ల వారీగా ఇరు పార్టీల అభ్యర్ధులు ఒక్కొక్క బూత్ కు ఇప్పటి వరకు ఇరవై వేలు ఇచ్చి బూత్ లెవల్లో విడిగా ప్రచారం చేయటానికి కార్యకర్తలను ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే వైకాపా అభ్యర్ధి రక్షణనిధి గడపగడపకు వైకాపా పేరుతొ ఇప్పటికే రెండు సార్లు నియోజకవర్గం అంతా పర్యటించి ఓటర్లను కలుసుకున్నారు. ఇప్పటికే మూడు సార్లు ఓటమి పాలైన తెదేపాను మళ్ళీ ఓడించాలని వైకాపా నాయకులు పకడ్బందీగా ప్రణాళికలు వేస్తున్నారు. రక్షణనిధికి మంచి వ్యక్తిగా అవినీతి మారక లేని నేతగా స్థానిక ప్రజల్లో గుర్తింపు ఉంది. **తెదేపా విషయానికొస్తే ఆ పార్టీ నాయకుల మధ్య ఉన్న వర్గ విభేదాలను పరిష్కరించే ప్రయత్నం జవహర్ చేయవలసి ఉంది. కొంతమంది నేతలకు జవహర్ పెత్తనం అప్పగించడంతో మరి కొందరు నేతలు అసంతృప్తితో ఉన్నారు. తిరువూరు నియోజకవర్గంలో తెలుగుదేశానికి పెద్ద సమస్య ఒకటి ఉంది. ఆపార్టీకి మంచి కార్యకర్తలు బలం ఈ నియోజకవర్గంలో ఉంది. అయితే తెదేపా నాయకులకు కార్యకర్తలకు మధ్య అగాదం ఉంది. గత ఐదేళ్ళ నుండి తెలుగుదేశం నేతలు తమకు రూపాయి దక్కకుండా అన్ని కాంట్రాక్టులను వారే దక్కించుకుని లక్షలాది రూపాయలు సంపాదించారని, ఒక్క రూపాయి కూడా కార్యకర్తలకు దక్కనీయ లేదని ఆపార్టీ కార్యకర్తలు బాహాటంగానే వాపోతున్నారు. తిరువూరు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ఉంటుందని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. చంద్రబాబు పర్యటన అనంతరం తెలుగుదేశం పార్టీ పరిస్థితి మెరుగవుతుందని తిరువూరులో తాము ఈసారి తప్పనిసరిగా విజయం సాధిస్తామని తెదేపా వర్గాలు భావిస్తున్నాయి. దీనికి తోడూ ఆర్ధికంగా బాగా ఉన్న ఎక్సైజ్ శాఖా మంత్రి కే.ఎస్.జవహర్ కూడా భారీగా ఖర్చు చేయడానికి సిద్దపడుతున్నట్లు వాతావరణం కనిపిస్తోంది. దీనితో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు ఈసారి విజయం తెదేపాదేనని ధీమాతో ఉన్నారు. – కిలారు ముద్దుకృష్ణ సీనియర్ జర్నలిస్టు.

పవార్ పవరే వేరప్పా!

రాజకీయాలు.. వివాదాలు.. ఆస్తులు.. ఆటలు.. అన్నీ కలిస్తే శరద్‌ పవార్‌. దేశ రాజకీయాల్లో పవార్‌ది ప్రత్యేక పాత్ర. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఆయన సొంతం. 37 ఏళ్లకే మహారాష్ట్ర సీఎం పీఠమెక్కారు. కాంగ్రెస్‌లో ఉండి ఏకంగా సోనియా గాంధీ జాతీయతపై ప్రశ్నలు లేవనెత్తారు. వివాదాలు-విమర్శలు ఎన్ని ఎదురైనా దీటుగా ఎదుర్కొన్నారు.
పూర్తి పేరు: శరద్‌ చంద్ర గోవింద్‌రావ్‌ పవార్‌
జననం: 1940 డిసెంబరు 12న బారామతిలోని ఓ సాధారణ వ్యవసాయ కుటుంబంలో
తొలి విజయం: 1967లో బారామతి నుంచి ఎమ్మెల్యేగా (కాంగ్రెస్‌)
**తొలిసారి సీఎం పీఠంపై..
పవార్‌ 1978లో కాంగ్రెస్‌ నుంచి విడిపోయి, జనతా పార్టీతో కలిసి మహారాష్ట్రలో ప్రోగ్రెసివ్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌(పీడీఎఫ్‌) ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు. తొలిసారిగా సీఎం పదవిని అలంకరించారు. కేంద్రంలో ఇందిరాగాంధీ అధికారంలోకి వచ్చాక 1980 ఫిబ్రవరిలో పీడీఎఫ్‌ ప్రభుత్వం రద్దయింది. 1983లో కాంగ్రెస్‌(సోషలిస్ట్‌) పార్టీ అధ్యక్ష బాధ్యతలను పవార్‌ స్వీకరించారు. 1984లో బారామతి నుంచి ఎంపీగా గెలిచారు. మరుసటి ఏడాది అక్కడి నుంచే ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఎంపీ పదవికి రాజీనామా చేసి రాష్ట్ర రాజకీయాల్లో కొనసాగారు. రాష్ట్రంలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకుగాను కాంగ్రెస్‌(సోషలిస్ట్‌) 54 సీట్లు దక్కించుకోవడంతో ప్రతిపక్షనేతగా బాధ్యతలు చేపట్టారు.
**శివసేనకు కళ్లెం వేసే బాధ్యత
1987లో పవార్‌ కాంగ్రెస్‌(ఐ) గూటికి చేరుకున్నారు. మహారాష్ట్రలో శివసేన పట్టు పెరగకుండా చూసే బాధ్యతను అధిష్ఠానం ఆయనకు అప్పగించింది. దాన్ని నిర్వర్తించడంలో చాలావరకు సఫలమయ్యారు! 1988లో అప్పటి మహారాష్ట్ర సీఎం శంకర్‌రావు చవాన్‌ను కేంద్ర ఆర్థికమంత్రిగా రాజీవ్‌ గాంధీ తన మంత్రిమండలిలోకి తీసుకోవడంతో పవార్‌ తిరిగి సీఎం అయ్యారు. 1990 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు భాజపా-శివసేనల నుంచి గట్టి పోటీ ఎదురైంది. కాంగ్రెస్‌కు 141 సీట్లు వచ్చాయి. దీంతో 12 మంది స్వతంత్రుల మద్దతుతో పవార్‌ మళ్లీ సీఎం పీఠమెక్కారు.
ప్రధాని పదవి రేసులో..
రాజీవ్‌ గాంధీ హత్య తర్వాత ప్రధాని పదవి రేసులో పవార్‌ నిలిచారు. ఆయనతోపాటు పీవీ నరసింహారావు, ఎన్డీ తివారీ పేర్లను కాంగ్రెస్‌ పరిశీలించింది! చివరకు పీవీ ప్రధాని పీఠాన్ని అధిష్ఠించగా.. పవార్‌ రక్షణమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆపై మహారాష్ట్ర సీఎం పదవి నుంచి సుధాకర్‌రావు నాయక్‌ దిగిపోవడంతో దేశ రాజకీయాల్లో రాష్ట్రానికి ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని తిరిగి పవార్‌ను ముఖ్యమంత్రిగా చేశారు పీవీ.
**ఎన్సీపీ స్థాపన
12వ లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా పవార్‌ పనిచేశారు. 1999లో ఆ సభ రద్దయ్యాక.. సోనియా గాంధీని కాకుండా భారత్‌లో పుట్టిన ఇతర నేతనెవరినైనా ప్రధాని అభ్యర్థిగా కాంగ్రెస్‌ ప్రకటించాలని పవార్‌, పి.ఎ.సంగ్మా, తారిక్‌ అన్వర్‌ డిమాండ్‌ చేశారు. సోనియా జాతీయతపై ప్రశ్నలు లేవనెత్తారు. అదే ఏడాది జూన్‌లో పవార్‌, సంగ్మా కలిసి నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ(ఎన్సీపీ)ని స్థాపించారు. 2004లో తిరిగి యూపీయేలో చేరిన పవార్‌.. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
**ఆటలతో అనుబంధం
పవార్‌కు క్రీడలతో ప్రత్యేక అనుబంధం ఉంది. ముంబయి క్రికెట్‌ అసోసియేషన్‌, మహారాష్ట్ర రెజ్లింగ్‌, కబడ్డీ, ఖోఖో అసోసియేషన్‌లకు అధ్యక్షుడిగా ఆయన పనిచేశారు. భారత క్రికెట్‌ నియంత్రణ మండలి(బీసీసీఐ)తోపాటు అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ)కి నేతృత్వం వహించారు.
**లెక్కలేనన్ని వివాదాలు
పవార్‌ తన రాజకీయ జీవితంలో అనేక వివాదాల్లో చిక్కుకున్నారు. సీఎంగా ఉండి నేరగాళ్లను రక్షించారని, అవినీతికి పాల్పడ్డారని ఆయనపై ఆరోపణలున్నాయి. అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీంతో పవార్‌కు సన్నిహిత సంబంధాలున్నట్లు వార్తలొచ్చాయి. నకిలీ స్టాంపుల కుంభకోణం, ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)కు పన్ను మినహాయింపు వంటి వ్యవహారాల్లో కూడా ఆయనపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఆస్తుల ప్రకటనలో పవార్‌ పారదర్శకత పాటించలేదనే ఆరోపణలున్నాయి.
**వారసత్వం
పవార్‌ కుమార్తె సుప్రియా సూల 16వ లోక్‌సభ సభ్యురాలు. 2009, 2014 ఎన్నికల్లో బారామతి నుంచి ఎంపీగా ఆమె గెలుపొందారు. ఈ ఎన్నికల్లో మరోసారి అక్కడి నుంచే తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
**పద్మ విభూషణ్‌
మనదేశంలో రెండో అత్యున్నత పౌర పురస్కారమైన ‘పద్మ విభూషణ్‌’ 2017లో పవార్‌ను వరించింది.
ఎన్డీయేకు వ్యతిరేకంగా విపక్షాలను ఏకతాటిపై నడిపించడంలో పవార్‌ కీలక పాత్ర పోషించే అవకాశముంది. మహారాష్ట్రలో ఎన్సీపీతో కాంగ్రెస్‌ పొత్తుకు ఇది కూడా ఒక కారణం.

మోడీ మీదకు సై

కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా వాద్రా గురువారం ఆ పార్టీ కార్యకర్తలకు ఇచ్చిన సమాధానం దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. అనేక ఊహాగానాలకు కేంద్ర బిందువైంది. పార్టీ ఆదేశిస్తే లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి సిద్ధమేనని బుధవారం తెలిపిన ప్రియాంక ఆ మరుసటి రోజే తాను పోటీచేసే స్థానం వారణాసి ఎందుకు కాకూడదని ప్రశ్నించి కాంగ్రెస్‌ కార్యకర్తలను సంభ్రమాశ్చర్యంలో ముంచెత్తారు. గురువారం రాయ్‌బరేలిలో నిర్వహించిన స్థానిక కార్యకర్తలు, నాయకుల సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలు ఆమెను రాయ్‌బరేలీ నుంచి పోటీ చేయాలని కోరారు. వెంటనే ప్రియాంక…వారణాసి నుంచి ఎందుకు పోటీ చేయకూడదు? అని ఎదురు ప్రశ్నించారు. అంతేకాకుండా రాయ్‌బరేలీలో పనులకు ఆటంకం కలగకుండా చూసుకుంటానని తన తల్లి సోనియాకు మాట ఇచ్చాననీ తెలిపారు. వారణాసి నుంచి ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి పోటీచేయనున్న నేపథ్యంలో అదే స్థానం నుంచి తాను ఎందుకు బరిలోకి దిగకూడదని ప్రియాంక ప్రశ్నించటం గమనార్హం. నిజంగానే ఆమె వారణాసి నుంచి పోటీ చేస్తే ప్రస్తుత ఎన్నికల్లో దేశంలోనే అతిపెద్ద పోటీ అక్కడ జరుగుతుంది. దేశం యావత్తు దృష్టి ఆ లోక్‌సభ స్థానంపై కేంద్రీకృతం అవుతుందనటంలో సందేహం లేదు. ప్రియాంక సమాధానం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చలకు దారితీసింది.

మిర్యాలగూడలో కేసీఆర్ సభ

ముఖ్యమంత్రి కేసీఆర్‌ తుది విడత ప్రచార భేరిని మోగించనున్నారు. లోక్‌సభ అభ్యర్థులను ప్రకటించిన తర్వాత ఆయన తొలి ప్రచార సభ శుక్రవారం సాయంత్రం 4 గంటలకు నల్గొండ నియోజకవర్గ పరిధిలోని మిర్యాలగూడలో ప్రారంభం కానుంది. 5.30 గంటలకు హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో చేవెళ్ల, సికింద్రాబాద్‌, మల్కాజిగిరి నియోజకవర్గాల ఉమ్మడి సభలో పాల్గొంటారు. సభలను భారీఎత్తున నిర్వహించేందుకు తెరాస సన్నాహాలు చేసింది. సీఎం చివరి సారిగా ఈ నెల 19న నిజామాబాద్‌ సభలో పాల్గొన్నారు. అప్పటికి అభ్యర్థులు ఖరారు కాలేదు. గత పది రోజులుగా చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో సీఎం సభలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. శుక్రవారం సభల్లో పూర్తిగా కొత్త అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించనున్నారు. నల్గొండలో వేమిరెడ్డి నర్సింహారెడ్డి, సికింద్రాబాద్‌లో తలసాని సాయికిరణ్‌, చేవెళ్లలో రంజిత్‌రెడ్డి, మల్కాజిగిరిలో మర్రి రాజశేఖర్‌రెడ్డిలు పోటీ చేస్తున్నారు. ప్రతి శాసనసభ స్థానం నుంచి 25 వేల మంది చొప్పున జనసమీకరణ చేయాలని పార్టీ భావిస్తోంది. మిర్యాలగూడ సభకు మంత్రి జగదీశ్‌రెడ్డి, పార్టీ అభ్యర్థి వేమిరెడ్డి నర్సింహారెడ్డిల ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరిగాయి. ఎల్బీ స్టేడియం సభకు మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, మహమూద్‌అలీ, మల్లారెడ్డిల ఆధ్వర్యంలో సన్నాహాలు చేశారు. శుక్రవారం మరోవైపు తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ సిరిసిల్ల సెగ్మెంటు పరిధిలోని ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండలాలతో పాటు కరీంనగర్‌ పట్టణంలోనూ సభల్లో పాల్గొననున్నారు. కేటీఆర్‌ సభలు, రోడ్‌షోలు వచ్చే నెల 9 వరకు వరుసగా ఉంటాయి.

వైకాపాపై ఈసీకి కేఏ పాల్ ఫిర్యాదు–రాజకీయ-03/28

*వైసీపీపై ఎన్నికల కమిషన్‌కు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఫిర్యాదు చేశారు. ఈ ఉదయం ఏపీ సీఈవో ద్వివేదిని కలిసిన పాల్ తన పార్టీ కండువాను వైసీపీ కాపీ కొట్టిందని, దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. 2008లో తమ పార్టీని రిజిస్టర్ చేయించామని, కానీ 2011లో తమ జెండాను జగన్ మోహన్ రెడ్డి కాపీ కొట్టారని ఆయన ఆరోపించారు. అలాగే ఓటు బ్యాంకును చీల్చాలని తమ అభ్యర్థుల పేర్లతో సరిపోలిన అభ్యర్థులను వైసీపీ పోటికి నిలబెట్టిందని పాల్ అన్నారు. ఈ నెల 24న తమ పార్టీ బి-ఫామ్‌లు, స్టాంపులను వైసీపీ దొంగలించిందని ఆయన ఆరోపించారు. తనను అడుగడునా వైసీపీ అడ్డుకుంటోందని.. నర్సాపురంలో తాను నామినేషన్ వేసే సమయంలో జగన్ అనుచరులు తనను ఇబ్బంది పెట్టారని ఆయన ఆరోపణలు చేశారు.
* రసవత్తరంగా మరీనా నిజామాబాద్ పార్లమెంటు ఎన్నిక
నిజామాబాద్ ఎంపీ పోరు రసవత్తరంగా మారింది. ఈ స్థానానికి భారీగా నామినేషన్లు దాఖలు కావడంతో ఇప్పుడు ఈ ఎన్నిక తెలంగాణలోనే కాదు.. దేశ వ్యాప్తంగా చర్చనీయాంశ మైంది. రైతు సమస్యలు ఎలివేట్ చేయాలనే ఉద్దేశ్యంతో దాదాపు 189 మంది రైతులు నామినేషన్లు వేశారు. వీరి నామినేషన్లు ఒకే కావడంతో ఇప్పుడు బ్యాలెట్ పోరు తప్పనిసరి అయ్యేలా కనిపిస్తోంది. భారీగా నామినేషన్లు దాఖాలు కావడంతో ఆన్ని పార్టీల్లో టెన్షన్ నెలకొంది. ఎవరి మీద కోపంతో ఈ నామినేషన్లు వేశారనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. లోకల్ గవర్నమెంటు మీద కోపంతో ఈ నామినేషన్లు వేశారా? లేక కేంద్ర పై కోపంతో ఈ నామినేషన్లు వేశారా? అనే విశాయం పై చర్చాప చర్చలు జరుగుతున్నాయి. రైతులు నమినేశాన్లతో ఎవరి ఓటు బ్యాంకు దెబ్బతింటుందనే విశ్లేషణలు మొదలయ్యాయి. తెలంగాణలోని పదహారు సీట్లు గెలుపు లక్ష్యంగా టీఆర్ఎస్ పని చేస్తోంది. వందకు వంద శాతం గెలిచే సీట్లలో నిజామాబాద్ ఒకటి. సీటు గ్యారెంటీ అనే ధీమాతో ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తోంది. భాజపా పై కోపంతోనే రైతులు నామినేషన్లు వేశారని ప్రజల్లోకి బలంగా తీసుకేల్తోంది టీఆర్ఎస్. మరోవైపు కవితకు పోటీగా ఉన్న ప్రత్యర్ధులు మధూయష్కి అరవింద్ కూడా పోటీల్లో ఉన్నట్లు కనిపించడం లేదు. ఈ ఇద్దరు ప్రత్యర్ధులు కూడా పోటీపై ఆసక్తి లేదు. పార్టీ బలవంతం మీద పోటీ చేస్తుండటంతో టీఆర్ఎస్ కు వచ్చే నష్టమేమీ లేదనేది గులాబీ నేతల వాదన.
* జర్నలిస్టులకు ఫేస్ బుక్ ద్వారా క్షమాపణ చెప్పిన బాలయ్య.
హిందూపురం నియోజకవర్గంలో బుధ‌వారం ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న బాలకృష్ణ జ‌ర్న‌లిస్టుల‌పై మండిప‌డ్డారు. ఆయ‌న ప్ర‌చారానికి చిన్న పిల్ల‌లు అడ్డుగా వ‌స్తుండ‌డంతో ఆయ‌న వ్య‌క్తిగ‌త సిబ్బంది ఆ పిల్లలను పక్కకు లాగి ప‌డేశారు. ఈ దృశ్యాల‌ను వీడియో తీసిన రిపోర్ట‌ర్ పై తిట్ల దండ‌కం మొద‌లుపెట్టి, ఆ వీడియోను డిలీట్ చేయాల్సిందిగా బాల‌య్య‌ హెచ్చ‌రించారు.అంతే కాదు “మా బతుకులు మీ చేతుల్లో ఉన్నాయా” అంటూ.. కొన్ని భారీ డైలాగులను కూడా వ‌దిలారు.ఆ తర్వాత ఈ ఘటనపై ఫేస్‌బుక్‌లో స్పందించిన ఆయ‌న… అక్కడ ఉన్న చిన్నపిల్ల మీద పడి వీడియో తీస్తున్నవారు అల్లరి మూకల పని అని భావించి వారిని వారించడం జరిగిందని , అక్కడ ఉన్నది మీడియా వారని ఆ తర్వాతే తెలిసిందన్నారు. అంతేకానీ ఉద్దేశపూర్వకంగా చేసింది కాదని అన్నారు. ఈ విషయంలో మీడియా మిత్రులకి బాధ కలిగించి ఉంటే క్షమాపణలు కోరుతున్నట్లు బాలకృష్ణ సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పారు. ప్ర‌స్తుత రాజ‌కీయ నాయ‌కుడిగా పోటీ చేయ‌బోతున్న బాల‌య్య న‌టించిన రాజ‌కీయ నేప‌థ్య సినిమా “లెజెండ్” నేటితో 5 సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకుంది.
* సీట్ల సర్దుబాటులో కాంగ్రెస్‌, ఆర్జేడీ మధ్య వివాదం
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బిహార్‌లో కాంగ్రెస్‌, రాష్ట్రీయ జనతా దళ్‌(ఆర్జేడీ) మధ్య పొత్తు కుదిరిన విషయం తెలిసిందే. సుదీర్ఘ చర్చల అనంతరం ఇరు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కూడా పూర్తయింది. 20 స్థానాల్లో ఆర్జేడీ.. 9 సీట్లలో కాంగ్రెస్ పోటీ చేయనుందని ప్రకటించారు. కానీ తాజాగా రెండు పార్టీల మధ్య సీట్ల కేటాయింపు విషయంలో వివాదం నెలకొంది. ఆర్జేడీకి అన్యాయం జరిగిందని ఆ పార్టీ సీనియర్‌ నేత రామ్‌దేవ్‌ రాయ్‌ పార్టీ అధినాయకత్వానికి తెలియజేశారు. దీంతో ఇరు పార్టీల మధ్య వివాదం మొదలైంది. రాష్ట్రంలో ఆర్జేడీని బలహీనపరిచే విధంగా సీట్ల సర్దుబాటు ఉందని ఆయన ఆరోపిస్తున్నారు.
* పదవి పోతుందని మోదీకి భయం- రాహుల్‌
పదవి నుంచి దిగిపోయే సమయం ఆసన్నమైందని ప్రధాని నరేంద్ర మోదీ భయపడుతున్నారని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ బుధవారం అన్నారు. ‘మిషన్‌ శక్తి’పై మోదీ ప్రసంగిస్తున్న సమయంలో ఆ విషయం స్పష్టంగా తెలిసిందని రాహుల్‌ పేర్కొన్నారు. ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్‌ స్టేడియంలో కాంగ్రెస్‌ పార్టీ ఓబీసీ విభాగంతో రాహుల్‌ సమావేశమయ్యారు.
*డిల్లి ఎన్నికల్లో హాట్ టాపిక్
ఢిల్లీ పరిధిలోని ఏడు లోక్‌సభ సీట్లకు జరుగుతున్న ఎన్నికలను ప్రభావితం చేసే ఓ అంశం నేడు ప్రచారాస్త్రమైంది. అక్రమ వాణిజ్య సంస్థలు, దుకాణాలను మూసువేయడం కోసం కొనసాగుతున్న ‘స్పెషల్‌ డ్రైవ్‌’ అది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు మొదటి డ్రైవ్‌ 2006లోనే ప్రారంభంకాగా, తాజా డ్రైవ్‌ 2017, డిసెంబర్‌ నెలలో ప్రారంభమైంది. దీని క్రింద 2019, జనవరి 31వ తేదీ నాటికి ఢిల్లీ నగరంలో 10,533 షాపులను మూసివేశారు.
*వైఎస్సార్‌సీపీలో చేరిన రచయిత చిన్ని కృష్ణ
ఎన్నికల తేదీ దగ్గర పడుతున్నా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి వలసలు ఆగడం లేదు. ఓ వైపు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతుంటే.. పార్టీలో చేరడానికి పలువురు నేతలు క్యూ కడుతున్నారు. రాజకీయ నాయకులే కాకుండా సినీ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖలు కూడా వైఎస్సార్‌సీపీలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. తాజాగా పాలకొల్లులో ఎన్నికల బహిరంగ సభలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పలువురు నాయకులు పార్టీలో చేరారు. ప్రముఖ సినీ రచయిత చిన్ని కృష్ణతోపాటు, కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే కేటీ రామారావు, అడబాల వెంకట రమణ, బీసీ ఉద్యమ నాయకుడు చింతపల్లి గురు ప్రసాద్‌లకు వైఎస్‌ జగన్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
*చిన్నపిల్లాడు ఏదో అన్నాడు.. దానిపై నేను కామెంట్ చేయను- మమతా బెనర్జీ
తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని చిన్నపిల్లాడితో పోల్చడం ప్రస్తుతం ఆసక్తిగా మారింది. బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. మీ ప్రభుత్వంపై రాహుల్ గాంధీ చేసిన ఆరోపణల గురించి మీరేమంటారు? అంటూ మమతా బెనర్జీని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. చిన్నపిల్లాడు ఏదో అన్నాడు, దానిపై నేను కామెంట్ చేయను అన్నారు.
*భీమ‌వ‌రం నుండి ప‌వ‌న్‌పై పోటీ చేస్తాన‌న్న వ‌ర్మ‌
రామ్ గోపాల్ వ‌ర్మ వ్య‌వ‌హారం చూస్తుంటే ఆయ‌న డేలో స‌గం క‌న్నా ఎక్కువ స‌మ‌యం సోష‌ల్ మీడియాలోనే గడుపుతారేమోన‌ని అనిపిస్తుంది. ట్విట్ట‌ర్‌లో ఏదో ర‌క‌మైన పోస్ట్‌లు పెడుతూ జ‌నాల అటెన్ష‌న్ త‌న వైపుకి తిప్పుకుంటారు వ‌ర్మ‌. తాను తెరకెక్కించిన ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం రేపు ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుండ‌గా, ఈ మూవీకి కావల‌సినంత ప్ర‌మోష‌న్‌ని ట్విట్ట‌ర్ ద్వారానే చేసుకున్నాడు. అయితే కొద్ది సేప‌టి క్రితం త‌న ట్విట్ట‌ర్‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ పోటీ చేస్తున్న‌ భీమ‌వ‌రం నుండి తాను పోటీ చేస్తున్నానని షాకింగ్ విష‌యం చెప్పాడు. నామినేష‌న్ గ‌డువు ముగియ‌డంతో తనకు పై స్థాయి నుంచి పోటి చేసేందుకు పర్మిషన్‌ వచ్చిందని, పూర్తి వివరాల కోసం వేచి ఉం‍డాలంటూ ట్వీట్ చేశాడు వర్మ. దీంతో ఒక్క‌సారిగా అంద‌రు ఏం జ‌రుగుతుందోనని ఆరాలు తీయ‌డం మొద‌లు పెట్టారు. ఆ త‌ర్వాత కొద్ది సేప‌టికి ఇది కేవలం ఒక అడ్వాన్స్‌ ఏప్రిల్ ఏప్రిల్ ఫూల్ జోక్. నాకు తెలిసి దీనిని ఎవ్వ‌రు న‌మ్మి ఉండ‌రు అని ట్వీట్ చేసాడు రామ్ గోపాల్ వ‌ర్మ‌.
*భాజపా 273 హెలికాప్టర్లు వాడుతోంది :కుటుంబరావు
హెలికాఫ్టర్‌ ద్వారా సీఎం డబ్బు తరలిస్తున్నారని భాజపా నాయకులు ఆరోపణలు చేయడంలో నిజం లేదని ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు మండిపడ్డారు. భాజపా ఇలాంటి పనులు చేస్తోంది కాబట్టే వారికి ఈ తరహా ఆలోచనలు వస్తున్నాయని ఎద్దేవా చేశారు. దేశ వ్యాప్తంగా భాజపా 273 హెలికాఫ్టర్లు వాడుతున్నట్లు ఓ వార్తా సంస్థ వెల్లడించిన విషయాన్ని గుర్తు చేశారు. అమరావతిలో గురువారం కుటుంబరావు విలేకరులతో మాట్లాడారు.
*కేసీఆర్ స్పందించడం ఓ డ్రామా – రేవూరి
శరత్ అనే రైతు సమస్యకు సీఎం కేసీఆర్ సోషల్ మీడియాలో స్పందించడం ఓ డ్రామా అని టీడీపీ నేత రేవూరి ప్రకాశ్ రెడ్డి విమర్శించారు. ఓట్లు దండుకోవడం కోసమే కేసీఆర్ ఆ డ్రామా ఆడారాని తెలిపారు. రాష్ట్రంలో ఏడు లక్షల మంది రైతులు భూ సమస్యను ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. అలాంటి రైతుల సమస్యలను కూడా ఇంతే వేగంగా కేసీఆర్ పరిష్కరిస్తారా అని రేవూరి ప్రశ్నించారు.
*ఇరుకు సందుల్లో సభలు పెట్టి గ్రాఫిక్స్ చూపిస్తున్నారు – బుద్దా వెంకన్న
ఇరుకు సందుల్లో సభలు పెట్టి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు గ్రాఫిక్స్ చూపిస్తున్నారని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఎద్దేవా చేశారు. ఆయన సభలో చనిపోయిన వారి కుటుంబాలను కూడా పరిమర్శించలేదని విమర్శించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని వివరించారు. అయితే సంక్షేమ పథకాలపై చర్చకు సిద్ధమా అని జగన్‌కి సవాల్ విసిరారు. తప్పులన్నీ చేసి తప్పేంటి అని జగన్ అంటున్నారని బుద్దా వెంకన్న మండిపడ్డారు.
*యువత రాజకీయాల్లోకి రావాలి -లోకేశ్‌
అంకుర సంస్థల స్థాపనపై యువత దృష్టి సారించాలని మంత్రి నారా లోకేశ్‌ పిలుపునిచ్చారు. యువత రాజకీయాల్లోకి వచ్చినప్పుడే వ్యవస్థలో మార్పు వస్తుందని చెప్పారు. 2019 ఎన్నికలు రాష్ట్రానికి చాలా కీలకం కానున్నాయని అన్నారు. విశాఖపట్నంలో విద్యార్థులతో మంత్రి లోకేశ్‌, తెదేపా ఎంపీ అభ్యర్థి శ్రీభరత్‌తో కలిసి ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉన్నత విద్యా రంగంలో ఉన్న సమస్యలు, ఉద్యోగ అవకాశాలు, విద్యా వ్యవస్థలో రావాల్సిన మార్పులు వంటి కీలక అంశాలపై విద్యార్థులతో చర్చించారు. ప్రతి సమస్యకు ప్రభుత్వ పరంగా తీసుకున్న, తీసుకోనున్న చర్యలను వివరించారు.
*తెలంగాణ నిధులతో ఎమ్మెల్యేల కొనుగోలు -భట్టి
రాహుల్‌ సభకు కార్యకర్తలు, ప్రజలంతా భారీగా తరలిరావాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. బహిరంగ సభకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయని తెలిపారు. 16 లోక్‌సభ సీట్లతో కేసీఆర్‌ దేశాన్ని ఎలా ఏలుతారని ప్రశ్నించారు. ఇవి మోదీకి మద్దతు ఇచ్చేందుకేనని, ఫలితంగా రాష్ట్రంలో అవినీతి కార్యకలాపాలను కేసీఆర్‌ కప్పిపుచ్చుకుంటారని విమర్శించారు. తెలంగాణ నిధులు సరిగ్గా ఉపయోగించకుండా వాటితో శాసన సభ్యులను కొనేందుకు కేసీఆర్‌ దుర్వినియోగపరుస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ను గెలిపించాలని కోరారు. తెలంగాణ కోసం తెచ్చుకుంటోన్న నిధుల్ని అభివృద్ధికే వినియోగించుకుందామని పేర్కొన్నారు
*ముద్దాయి ఫిర్యాదు చేస్తే ఈసీ స్పందించడమేంటి?- వర్ల
కడప ఎస్పీని ఎందుకు బదిలీ చేశారు? అని టీడీపీ నేత వర్ల రామయ్య ప్రశ్నించారు. అనేక కేసుల్లో ముద్దాయిగా ఉన్న వ్యక్తి ఫిర్యాదుపై ఈసీ ఎందుకు స్పందించింది? అని అడిగారు. విజయసాయి, జీవీఎల్‌ ఫిర్యాదులు ఈసీకి శిరోధార్యమా?, ఇంటెలిజెన్స్‌ డీజీని ఎలా బదిలీ చేస్తారు? అని నిలదీశారు. విజయసాయి వ్యాఖ్యలపై ఈసీ సమాధానం చెప్పాలన్నారు. ఈసీ మోదీ చేతుల్లో కీలుబొమ్మగా మారిందని ఆరోపించారు. అందరూ కలిసి టీడీపీపై కక్ష సాధిస్తున్నారని ధ్వజమెత్తారు. బీజేపీకి రాష్ట్రంలో ఒక్క సీటు కూడా రాదని జోస్యం చెప్పారు.
*1న తెలంగాణకు రాహుల్‌ రాక
ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఏప్రిల్‌ ఒకటో తేదీన రాష్ట్రానికి రానున్నారు. ఇక్కడి కాంగ్రెస్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. మూడు లోక్‌సభ సెగ్మెంట్ల పరిధిలో నిర్వహించే బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించనున్నారు. ఒకటిన జహీరాబాద్‌, నాగర్‌కర్నూలు, నల్గొండ లోక్‌సభ స్థానాల్లో ఎన్నికల సభల్లో పాల్గొననున్నట్లు పీసీసీ ప్రకటించింది. మధ్యాహ్నం 12 గంటలకు జహీరాబాద్‌ బహిరంగసభ, 2 గంటలకు నాగర్‌కర్నూలు సెగ్మెంట్‌ వనపర్తిలో, సాయంత్రం 4 గంటలకు నల్గొండ లోక్‌సభ స్థానం పరిధి హుజూర్‌నగర్‌ ఎన్నికల సభలలో రాహుల్‌ పాల్గొననున్నారు.
*కాంగ్రెస్‌కు మరో దెబ్బ
ఎమ్మెల్సీగా జీవన్‌రెడ్డి ఎన్నికైన ఆనందం కాంగ్రెస్‌కు ఎంతో సేవు నిలవలేదు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల సురేందర్‌ ఆ పార్టీకి రాజీనామా చేశారు. బుధవారం ఆయన తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ను ఆయన నివాసంలో కలిసి, తన నిర్ణయాన్ని వెల్లడించారు. దీంతో నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ ప్రాతినిధ్యం కోల్పోనుంది. ఎల్లారెడ్డి నియోజకవర్గం అధివృద్ధి కోసం తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు జాజుల వెల్లడించారు. కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వం ఒంటెత్తు పోకడలతో ప్రజలకు దూరమయిందని, అందుకే కాంగ్రెస్‌కు రాజీనామా చేశానని చెప్పారు. అవసరమయితే కాంగ్రెస్‌ ద్వారా వచ్చిన ఎమ్మెల్యే పదవికీ రాజీనామా చేసి, తిరిగి తెరాస తరపున పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు.
*హోదాకు మద్దతిస్తానని కేసీఆర్‌ చెవిలో చెప్పారా?
‘ప్రత్యేక హోదాకు మద్దతిస్తానని కేసీఆర్‌ అంటే మీకెందుకు అభ్యంతరమని జగన్‌ అంటున్నారు. హోదాకు మద్దతిస్తానని కేసీఆర్‌ మీ చెవిలో చెప్పారా? ఏపీకి ఇవ్వడానికి వీల్లేదని అన్నారు. ఆంధ్రాకు ఇస్తే మాకూ ఇవ్వాలని అన్నారు. జగన్‌ ఎవరి చెవిలో పూలు పెడతారు. సోనియా హైదరాబాద్‌లో సభకు వచ్చినప్పుడు ఏపీకి హోదా ఇస్తామని ప్రకటించారు’ అని తెదేపా అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. బుధవారం రాత్రి అనంతపురంలో రోడ్‌షోలో ఆయన మాట్లాడారు. ‘మోదీ, కేసీఆర్‌ రాష్ట్రానికి విరోధులుగా మారారు. వీరికి జగన్‌ మద్దతిస్తున్నారు. రాష్ట్రంలో వెనకబడిన ఏడు జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద ఏడాదికి రూ.350 కోట్లు ఇవ్వాలి. తెలంగాణలో తొమ్మిది జిల్లాలకు ఇస్తున్నారు.
*అప్పుడు మాతో పొత్తుకెందుకు తహతహలాడారు?
తమ పార్టీపై విమర్శలు చేస్తున్న తెదేపా అధినేత చంద్రబాబు తెలంగాణలో డిసెంబరులో జరిగిన శాసనసభ ఎన్నికల్లో తమతో పొత్తుకు తహతహలాడడం తనకు విస్మయం కలిగించిందని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. వైకాపా అధ్యక్షుడు జగన్‌ను ఉద్దేశించి చంద్రబాబు ట్విటర్‌లో చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్‌ స్పందించారు. కేసీఆర్‌తో కలవడం తప్పా? అని జగన్‌ చేసిన వ్యాఖ్యలను బాబు తన ట్విటర్‌లో తప్పుబట్టారు. తెరాసపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. దీనిపై కేటీఆర్‌ ట్విటర్‌లో బదులిచ్చారు. ఇప్పుడు ఇంతగా విమర్శిస్తున్న బాబు అప్పట్లో తమతో పొత్తుకు తీవ్రంగా యత్నించిన విషయాన్ని గుర్తుచేశారు.
*దేశ దిశానిర్దేశ బాధ్యత కేసీఆర్‌కు
తెరాస ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని తెరాస రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. కరీంనగర్‌ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్‌తో కలిసి బుధవారం రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌ మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన బహిరంగసభలో మాట్లాడారు. ‘‘పార్లమెంటు ఎన్నికలు కేసీఆర్‌కు సంబంధంలేనివని కాంగ్రెస్‌, భాజపా పక్షాలు ప్రచారం చేస్తున్నాయి. రాష్ట్రంలో 16మంది తెరాస ఎంపీలు గెలిస్తే.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ వారికి మరో 150మందిని జోడించి కేంద్రంలో బలమైన కూటమిని నెలకొల్పుతారు. దేశంలో భాజపా, కాంగ్రెస్‌ అంటే ఇష్టంలేని ప్రాంతీయ పార్టీలు 10-15 ఉన్నాయి. ప్రాంతీయపార్టీలన్నీ కలిసి అవసరమైతే దేశానికి దిశానిర్దేశం చేసే ముఖ్య బాధ్యతను కేసీఆర్‌కు అప్పగించాల్సిన అవసరముంది.
*భాజపాలో చేరిన జితేందర్‌రెడ్డి
తెరాస ఎంపీ జితేందర్‌రెడ్డి భాజపాలో చేరారు. భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా బుధవారం దిల్లీలో జితేందర్‌రెడ్డికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన పార్టీలో చేరడంలో భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ కీలకపాత్ర పోషించారు.భాజపాలో చేరడం మాతృసంస్థలోకి వచ్చినట్లుందని జితేందర్‌రెడ్డి మీడియాకు చెప్పారు. లోక్‌సభకు పోటీచేసే అవకాశం ఎందుకు ఇవ్వలేదో తెరాస నాయకత్వమే చెప్పాలన్నారు. పదవులు ఆశించో, హామీలు తీసుకునో భాజపాలో చేరడం లేదన్నారు.
*బాబు మళ్లీ వస్తే సంక్షేమానికి కోత
పొరపాటున చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలన్నింటిలోనూ కోత విధిస్తారు. పింఛన్లు తీసేస్తారు. రేషన్‌ కార్డులు కోసేస్తారు. అయిదేళ్ల పాలన చూశాం. విద్యుత్తు, ఆర్టీసీ ఛార్జీలు పెంచారు. పెట్రో ధరల భారం మోపారు. అన్నింటా బాదుడేబాదుడు. మళ్లీ చంద్రబాబుకు ఓటేస్తే బాదుడు కాదు.. వీరబాదుడే ఉంటుంది..’ అని వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి ఆరోపించారు. బుధవారం విశాఖ జిల్లా పాయకరావుపేట, విజయనగరం జిల్లా పార్వతీపురం, తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం, మండపేటలలో ప్రచార సభలలో ఆయన మాట్లాడారు.
*నేను యాక్టరైతే ఆయనేమిటి?
‘ప్రతిపక్ష నాయకుడు జగన్‌ నా పేరు పెట్టి పిలవడానికి కూడా ఇష్టపడడం లేదు. చంద్రబాబు భాగస్వామి అని, యాక్టర్‌ అని పిలుస్తున్నారు. సినిమాల ఆదాయం వదులుకుని రాజకీయాల్లోకి వచ్చిన నన్ను యాక్టర్‌ అని పిలిస్తే, రెండేళ్లు జైల్లో ఉండి వచ్చిన జగన్‌ను ఏమని పిలవాలి?’ అని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ప్రశ్నించారు. ‘మీరేమైనా మహాత్మాగాంధీలా పోరాడి జైలుకు వెళ్లారా? ప్రజాధనం అడ్డంగా దోచుకుని వెళ్లారు. నేను చంద్రబాబు భాగస్వామినైతే.. మీరు భాజపా, అమిత్‌షాలకు భాగస్వామా?’ అని నిలదీశారు. ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు, మార్కాపురం, దర్శి, ఒంగోలులో బుధవారం ఆయన ఎన్నికల ప్రచార సభల్లో మాట్లాడారు. ‘నేను ఈసారి తెదేపాతో పొత్తు పెట్టుకుంటే ధైర్యంగా పెట్టుకుంటాను. ఎవరు అడ్డుకుంటారు? మీలా దొడ్డిదారిన వెళ్లను. ఈ ఎన్నికల కోసం వామపక్షాలు, బీఎస్పీతో పొత్తు పెట్టుకున్నా. ఈ విషయం స్పష్టంగా చెప్పా. నాలాగా జగన్‌ బహిరంగంగా చెప్పగలరా? తెరాస, భాజపాతో పొత్తు పెట్టుకున్నానని. డొంకతిరుగుడు ఎందుకు?’ అంటూ ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతగా విఫలమైన జగన్‌ ముఖ్యమంత్రి అయి ఏం చేస్తారని ప్రశ్నించారు.
*ఎన్నికలకు ముందే విలీనం!
పార్లమెంటు ఎన్నికలలోపే కాంగ్రెస్‌ శాసనసభాపక్షాన్ని తమ పార్టీలో విలీనం చేసుకునేందుకు తెరాస అధిష్ఠానం సన్నాహాలు చేస్తోంది. తద్వారా పార్లమెంట్‌ ఎన్నికల్లో ఆ పార్టీని దెబ్బతీయవచ్చని, సునాయాస విజయం సాధించవచ్చని భావిస్తున్నట్లు తెలిసింది. కాంగ్రెస్‌ పార్టీ విపక్ష హోదాను కోల్పోయేలా చేయడం కూడా ఆ పార్టీ ప్రణాళికగా ఉంది. ఇప్పటికే పది మంది గులాబీ గూటికి చేరేందుకు ముందుకొచ్చారు. మరో నలుగురిని సమీకరించి, లక్ష్యాన్ని సాధించాలని అధికార పార్టీ భావిస్తోంది.
*కాంగ్రెస్‌ చెల్లని రూపాయి
‘రాష్ట్రంలో కాంగ్రెస్‌ పరిస్థితి చెల్లని రూపాయిగా మారింది.. భాజపాకు ఓటర్లే లేరు.. కేసీఆర్‌ నాయకత్వంలో లోక్‌సభ ఎన్నికల్లో తెరాస తిరుగులేని విజయం సాధించటం ఖాయం’ అని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌, నంగునూరులో నిర్వహించిన లోక్‌సభ ఎన్నికల ప్రచార సభల్లో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారన్నారు. ఇక్కడ చేపట్టిన పథకాలపై ప్రజల్లో సానుకూలతను చూసి పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా వీటినే అనుసరిస్తున్నారన్నారు.
*తెలంగాణలో తెదేపా శకం ముగిసింది
తెలంగాణలో తెలుగుదేశం పార్టీ శకం ముగిసిందని, ప్రజలంతా తెరాసకే సంపూర్ణ మద్దతు ఇస్తున్నారని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ చెప్పారు. హైదరాబాద్‌ నగరానికి చెందిన తెదేపా సీనియర్‌ నేత, శాసనసభ ఎన్నికల్లో సనత్‌నగర్‌ నుంచి పోటీ చేసి ఓడిపోయిన కూన వెంకటేశ్‌గౌడ్‌ బుధవారం కేటీఆర్‌ సమక్షంలో తన అనుచరులు, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి తెదేపా నేతలతో కలిసి తెరాసలో చేరారు. కేటీఆర్‌ వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
*రాజకీయ లబ్ధికే ప్రధాని ప్రకటన
శాస్త్రవేత్తలు సాధించిన విజయంపై ప్రధాని మోదీ రాజకీయాలు చేస్తున్నారని విపక్షాలు ఆరోపించాయి. ‘మిషన్‌ శక్తి’ని విజయవంతం చేసిన డీఆర్‌డీఓను, శాస్త్రవేత్తలకు పార్టీలకతీతంగా అందరు నాయకులు అభినందనలు తెలపడంతో పాటు మోదీని విమర్శించారు. ఎన్నికల్లో లబ్ధి పొందడానికి, రాజకీయ ప్రయోజనాలు ఆశించి ప్రత్యేకంగా ప్రజలనుద్దేశించి ప్రసంగించారని విమర్శించారు. ప్రధాని ప్రకటన ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించడమేనని అభిప్రాయపడ్డారు. ఎన్నికల సంఘాని(ఈసీ)కి ఫిర్యాదు చేస్తామని తృణమూల్‌ కాంగ్రెస్‌ తెలిపింది. మోదీ ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారని పేర్కొంటూ ఈసీకి సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి లేఖ రాశారు. ఎశాట్‌’ క్షిపణిని యూపీఏ ప్రభుత్వ సమయంలోనే సిద్ధం చేశామని, ఆ ప్రయోగంతో ఇతర దేశాల ఉపగ్రహాలకు హాని కలుగుతుందనే పరీక్షించలేదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మల్లికార్జున ఖర్గే చెప్పారు.
*పార్టీ ఆదేశిస్తే పోటీ చేస్తా
పార్టీ ఆదేశిస్తే తాను ఎన్నికల్లో పోటీ చేస్తానని కాంగ్రెస్‌ పార్టీ ప్రధానకార్యదర్శి ప్రియాంకా గాంధీ వెల్లడించారు. వ్యక్తిగతంగా మాత్రం పార్టీకి సేవలు అందించాలన్నదే తన అభిలాషని, సంస్థాపరంగా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని పేర్కొన్నారు. ప్రచారంలో భాగంగా బుధవారం ఆమె అమేఠి, రాయబరేలీలో పర్యటించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధిస్తే రాహుల్‌ గాంధీయే ప్రధాని అవుతారని ప్రియాంకా గాంధీ వెల్లడించారు.
*55% తెలంగాణ ప్రజల మద్దతు మోదీకే: కిషన్‌రెడ్డి
తెలంగాణలో సీఎం కేసీఆర్‌ ఆదరణ తగ్గుతోందని.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస బలపరిచిన ముగ్గురు అభ్యర్థులు ఓటమి చెందడమే దానికి నిదర్శనమని భాజపా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో 55% ప్రజలు మోదీ మళ్లీ ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నారని.. అందుకే తెరాస అధ్యక్షుడు కేసీఆర్‌కు, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌కు భయం పట్టుకుని భాజపాపై నోరు పారేసుకుంటున్నారని ఆయన ఆక్షేపించారు. మోదీ నాయకత్వాన్ని కోరుకుంటున్నవారంతా భాజపా అభ్యర్థులకు ఓటేసి గెలిపించాలని.. ప్రాంతీయ పార్టీలకు వేస్తే అది బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలు చేయడానికే ఉపయోగపడుతుందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
*గోవాలో అర్ధరాత్రి అనూహ్య రాజకీయం
గోవాలో అర్ధరాత్రి అనూహ్యమైన రాజకీయాలు చోటుచేసుకున్నాయి. 2012 నుంచి మిత్రపక్షంగా ఉన్న మహారాష్ట్రవాదీ గోమంతక్‌ పార్టీ (ఎంజీపీ)కి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు భాజపాలో విలీనం కావడం, దరిమిలా ఆ పార్టీకి చెందిన ఉపముఖ్యమంత్రి పదవిని కోల్పోవడం చకాచకా జరిగిపోయాయి. ఈ చర్యతో మొత్తం 40 మంది సభ్యులు ఉన్న గోవా అసెంబ్లీలో భాజపా బలం 12 నుంచి 14కు చేరింది. ప్రతిపక్ష కాంగ్రెస్‌కు 14 మంది ఎమ్మెల్యేలు ఉండడం గమనార్హం. ఎంజీపీకి ముగ్గురు ఎమ్మెల్యేలు ఉండగా, అందులో సుదిన్‌ ధావలీకర్‌ ఉపముఖ్యమంత్రిగా ఉన్నారు.
*గెలుపు దిశగా లక్ష్మణరావు
కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడీఎఫ్‌ అభ్యర్థి కె.ఎస్‌.లక్ష్మణరావు గెలుపు బాటలో దూసుకెళుతున్నారు. గుంటూరు నగరంలోని ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో జరుగుతున్న ఓట్ల లెక్కింపులో 7 రౌండ్లు పూర్తయ్యేసరికి లక్ష్మణరావు 46,746 ఓట్లతో ప్రత్యర్థులకు అందనంత ముందంజలో ఉన్నారు. సమీప ప్రత్యర్థి నూతలపాటి అంజయ్య 6,331 ఓట్లతో ద్వితీయ స్థానంలో నిలిచారు. లక్ష్మణరావు భారీ ఆధిక్యతతో ఉండటంతో ఆయన గెలుపు లాంఛనప్రాయం కానుంది. మరో 3 రౌండ్లను లెక్కిస్తే కౌంటింగ్‌ పూర్తవుతుంది. కృష్ణా, గుంటూరు జిల్లాల ఓటర్లు పీడీఎఫ్‌ అభ్యర్థికి ఓట్లు వేసి మద్దతు పలికారు. జిల్లా కలెక్టరు కోన శశిధర్‌, పరిశీలకులు నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ ఓట్ల లెక్కింపును పర్యవేక్షిస్తున్నారు.
*నోట్ల రద్దు నిర్ణయంపై దర్యాప్తు చేస్తాం
లోక్‌సభ ఎన్నికల అనంతరం కేంద్రంలో ప్రతిపక్ష కూటమి అధికారంలోకి వస్తే నోట్ల రద్దుపై దర్యాప్తు చేస్తామని, జీఎస్టీని సమీక్షిస్తామని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెల్లడించారు. తమ పార్టీ 67 పేజీల ఎన్నికల ప్రణాళికను ఆమె బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నోట్లరద్దు నిర్ణయంపై పదవీ విరమణ చేసిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి పర్యవేక్షణలో జుడీషియల్‌ విచారణకు ఆదేశిస్తామని చెప్పారు. ప్రస్తుతం ఉన్న నీతి ఆయోగ్‌ వల్ల ఎటువంటి ప్రయోజనం లేదని… ప్రణాళికా సంఘాన్ని పునరుద్ధరిస్తామని పేర్కొన్నారు. పశ్చిమబెంగాల్‌ రాష్ట్రం ఏమాత్రం అభివృద్ధి చెందలేదని, ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా ఉందంటూ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ చేసిన విమర్శలకు మమతా బెనర్జీ స్పందించటానికి నిరాకరించారు. రాహుల్‌ చిన్న పిల్లాడని వ్యాఖ్యానించారు.
*జగన్‌లా మోదీకి మోకరిల్లను
‘ప్రతిపక్ష నాయకుడు జగన్‌ నా పేరు పెట్టి పిలవడానికి కూడా ఇష్టపడడం లేదు. చంద్రబాబు భాగస్వామి అని, యాక్టర్‌ అని పిలుస్తున్నారు. సినిమాల ఆదాయం వదులుకుని రాజకీయాల్లోకి వచ్చిన నన్ను యాక్టర్‌ అని పిలిస్తే, రెండేళ్లు జైల్లో ఉండి వచ్చిన జగన్‌ను ఏమని పిలవాలి?’ అని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ప్రశ్నించారు. ‘మీరేమైనా మహాత్మాగాంధీలా పోరాడి జైలుకు వెళ్లారా? ప్రజాధనం అడ్డంగా దోచుకుని వెళ్లారు. నేను చంద్రబాబు భాగస్వామినైతే.. మీరు భాజపా, అమిత్‌షాలకు భాగస్వామా?’ అని నిలదీశారు. ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు, మార్కాపురం, దర్శి, ఒంగోలులో బుధవారం ఆయన ఎన్నికల ప్రచార సభల్లో మాట్లాడారు. ‘
*ప్యాకేజీ ఇస్తామని ప్రకటించాకే లేఖ
రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ, ప్రత్యేక హోదాలపై కేంద్రం, ఏపీ ప్రభుత్వాల మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు సవాల్‌ చేశారు. ప్రత్యేక హోదాతో ఇచ్చే రాయితీలకు ఏ మాత్రం తక్కువ కాకుండా ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని 2016 సెప్టెంబరులో కేంద్రం ప్రకటించిందన్నారు.
*ఈసీ పరిధి దాటింది- తెదేపా
కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) పరిధి దాటి వ్యవహరించిందని తెదేపా నేతలు కనకమేడల రవీంద్రకుమార్‌, సీఎంరమేశ్‌, జూపూడి ప్రభాకర్‌రావులు ఆరోపించారు. అది ఏకపక్షంగా వ్యవహరిస్తే ప్రజలకు వ్యవస్థపై నమ్మకం తగ్గుతుందని వారు తెలిపారు. బుధవారమిక్కడ కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ సునీల్‌ అరోడా, కమిషనర్లు అశోక్‌ లావాసా, సుశీల్‌ చంద్రలను వారు కలిసి సీఎం చంద్రబాబు రాసిన లేఖను అందజేశారు.
*చంద్రబాబుపై దాడికి జగన్‌ కుట్ర: రాజేంద్రప్రసాద్‌
ముఖ్యమంత్రి చంద్రబాబుపై భౌతికంగా దాడి చేయించేందుకు ప్రతిపక్ష నేత జగన్‌ కుట్ర పన్నారని ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్‌ ఆరోపించారు. రాష్ట్రంలో హత్యలు, మారణకాండలు జరుగుతాయని పులివెందుల సభలో జగన్‌ చెప్పారని గుర్తు చేశారు. సీఎం చంద్రబాబు భద్రత విషయంలో ఎలాంటి ఇబ్బంది కలిగినా అందుకు మోదీ, కేసీఆర్‌, జగన్‌ బాధ్యత వహించాలని చెప్పారు. ‘సీఎం చంద్రబాబు భద్రతకు ముప్పు తలపెట్టే ఉద్దేశంతో ఇంటెలిజెన్స్‌ డీజీని బదిలీ చేయాలని వైకాపా నేతలు ఫిర్యాదు చేస్తే కనీస విచారణ చేయకుండా కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవడం దారుణం. విజయసాయిరెడ్డి ఓ కాగితం ఇవ్వగానే స్పందిస్తుంది.
*ఎన్నికల సంఘం నిర్ణయాలు ఆశ్చర్యకరం: కోడెల
ఎన్నికల సంఘం తీసుకుంటున్న నిర్ణయాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయని శాసనసభ సభాపతి, సత్తెనపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కోడెల శివప్రసాదరావు అన్నారు. ఆయనిక్కడ విలేకర్లతో మాట్లాడారు. మొన్న శ్రీకాకుళం కలెక్టర్‌ బదిలీ.. ఇప్పుడు ఏపీ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌, శ్రీకాకుళం, కడప జిల్లాల ఎస్పీల బదిలీల నిర్ణయాలు చట్ట వ్యతిరేకంగా జరిగినట్లు ప్రజల్లో చర్చ జరుగుతోందన్నారు. వైకాపా నాయకుడు విజయసాయిరెడ్డి ఏం చెబితే అది చేస్తారా?.. అని ఈసీని ప్రశ్నించారు. నిఘా విభాగాధిపతి చీఫ్‌ ఎన్నికల సంఘం పరిధిలోకి రానప్పటికీ ఆయనను ఎలా బదిలీ చేస్తారో చెప్పాలన్నారు. వివేకా హత్యలో నిజాలు బయటపడతాయనే కడప ఎస్పీని బదిలీ చేశారని ఆరోపించారు. చిన్నాన్న హత్యను జగన్‌ చేయించాడని చెప్పను..కానీ, అతడికితెలిసే అంతాజరిగిందని ప్రజలంతా అనుకుంటున్నారని కోడెల అన్నారు.
*రైల్వే, ఎయిర్‌ ఇండియాలకు ఈసీ నోటీసులు
రైలు టికెట్లు, ఎయిర్‌ ఇండియా బోర్డింగ్‌ పాస్‌లపై ప్రధాని నరేంద్ర మోది చిత్రాలను ముద్రించటానికి సంబంధించి రైల్వే, విమానయాన మంత్రిత్వశాఖలకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) సంజాయిషీ నోటీసులు ఇచ్చింది. ప్రజాధనంతో ఒక రాజకీయపార్టీకి లబ్ధి చేకూర్చేలా ప్రచారం చేయటం ఎన్నికల నిబంధనావళిని ఉల్లంఘించటమే అవుతుందని ఆ నోటీసుల్లో గుర్తుచేసింది.
*గోవాలో అర్ధరాత్రి అనూహ్య రాజకీయం
గోవాలో అర్ధరాత్రి అనూహ్యమైన రాజకీయాలు చోటుచేసుకున్నాయి. 2012 నుంచి మిత్రపక్షంగా ఉన్న మహారాష్ట్రవాదీ గోమంతక్‌ పార్టీ (ఎంజీపీ)కి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు భాజపాలో విలీనం కావడం, దరిమిలా ఆ పార్టీకి చెందిన ఉపముఖ్యమంత్రి పదవిని కోల్పోవడం చకాచకా జరిగిపోయాయి. ఈ చర్యతో మొత్తం 40 మంది సభ్యులు ఉన్న గోవా అసెంబ్లీలో భాజపా బలం 12 నుంచి 14కు చేరింది. ప్రతిపక్ష కాంగ్రెస్‌కు 14 మంది ఎమ్మెల్యేలు ఉండడం గమనార్హం. ఎంజీపీకి ముగ్గురు ఎమ్మెల్యేలు ఉండగా, అందులో సుదిన్‌ ధావలీకర్‌ ఉపముఖ్యమంత్రిగా ఉన్నారు. మరో ఎమ్మెల్యే మనోహర్‌ అజ్‌గావ్‌కర్‌ పర్యాటక శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. అజ్‌గావ్‌కర్‌తో పాటు మరో ఎమ్మెల్యే దీపక్‌ పవాస్‌కర్‌లు మంగళవారం సాయంత్రం అయిదు గంటల ప్రాంతంలో తమది ఒక ప్రత్యేక వర్గమని ప్రకటించుకున్నారు.
*అంబేడ్కర్‌కు అచ్చిరాని లోక్‌సభ
లోక్‌సభలో అడుగుపెట్టాలన్న భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేడ్కర్‌ కలలు కలలుగానే మిగిలిపోయాయి. 1952లో జరిగిన తొలి లోక్‌సభ ఎన్నికల్లో షెడ్యూల్డ్‌ కేస్ట్స్‌ ఫెడరేషన్‌ తరఫున అప్పటి ఉత్తర బొంబయి(రిజర్వ్డు) స్థానం నుంచి అంబేడ్కర్‌ పోటీకి దిగారు. గతంలో అంబేడ్కర్‌ సహాయకుడైన నారాయణ్‌ సడోబా కజ్రోల్కర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా నిలబడ్డారు. నారాయణ్‌ చేతిలో అంబేడ్కర్‌ 4,561 ఓట్ల స్వల్పతేడాతో పరాజయం పాలయ్యారు. ఆ తరువాత 3 ఏప్రిల్‌ 1952లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికై 2 ఏప్రిల్‌ 1956 వరకూ కొనసాగారు. ఈ మధ్యలో 1954లో బాంద్రా లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లోనూ అంబేడ్కర్‌ పోటీచేసి ఓడిపోయారు. ఇక్కడ కాంగ్రెస్‌ అభ్యర్థి బోర్కర్‌ విజయం సాధించారు. 3 ఏప్రిల్‌ 1956లో రెండో దఫా
*నేటి నుంచి విజయమ్మ ఎన్నికల ప్రచారం
వైకాపా గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ గురువారం నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. ఇడుపులపాయలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి సమాధికి నివాళులర్పించి స్థానిక నియోజకరవర్గంలో ప్రచారం చేస్తారు. శుక్రవారం నుంచి ఆదివారం వరకు ప్రకాశం, గుంటూరు, శ్రీకాకుళం జిల్లాల్లో ఆమె ప్రచారం నిర్వహిస్తారని వైకాపా కేంద్ర కార్యాలయం బుధవారం ప్రకటించింది. వైఎస్‌ షర్మిల శుక్రవారం గుంటూరు జిల్లా మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రచారం మొదలుపెడతారు.
*జగన్‌, విజయసాయిరెడ్డిల బెయిల్‌ రద్దు చేయాలి
అనేక ఆర్థిక నేరాల కేసుల్లో నిందితులుగా ఉన్న వైకాపా అధ్యక్షుడు జగన్‌, ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డిల బెయిల్‌ను రద్దుచేసి, మళ్లీ కస్టడీలోకి తీసుకునేలా సీబీఐకి ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ శాసనమండలిలో తెదేపా విప్‌ బుద్ధా వెంకన్న బుధవారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి వినతిపత్రం అందజేశారు. ఈ వైకాపా నాయకులిద్దరూ…. ప్రతిరోజూ బెయిల్‌ నిబంధనల్ని ఉల్లంఘిస్తున్నారని, పోలీసు అధికారుల్ని, రాజకీయ ప్రత్యర్థుల్ని బెదిరిస్తున్నారని వెంకన్న ఫిర్యాదు చేశారు.
*అప్పట్లో లాటరీ ఎన్నికలు
మనదేశంలో చోళుల పాలనలో లాటరీ వంటి ఓ వినూత్న ఎన్నికల వ్యవస్థ ఉండేది. దాని పేరు ‘కుడవొలై వ్యవస్థ’. తమిళంలో కుడం అంటే కుండ, వొలై అంటే ఆకు అని అర్థం. ఈ విధానంలో అభ్యర్థుల పేర్లను తాటాకులపై రాసి కుండలో వేసేవారు. వాటన్నింటినీ బాగా కలిపి.. ఎవరైనా చిన్నారితో ఒక్కో ఆకును బయటకు తీయించేవారు. వాటిపై ఎవరి పేరుంటే వారు ఎన్నికైనట్లు అర్థం. ‘కుడవొలై వ్యవస్థ’లో పోటీ చేసే అభ్యర్థులకు కొన్ని అర్హతలు తప్పనిసరి. అవేంటంటే.. వారి వయసు 35-70 ఏళ్ల మధ్య ఉండాలి. సొంత భూమిలోనే ఇల్లు కట్టుకొని ఉండాలి. దానికి పన్ను చెల్లింపు సక్రమంగా జరిగి ఉండాలి. అభ్యర్థులు వేదాలు, మంత్రాలపై అవగాహన కలిగి ఉండాలి. దొంగతనాలు, హత్యల వంటి నేరాలకు పాల్పడిన వ్యక్తులు పోటీకి అనర్హులు.
*తప్పులు కప్పి పుచ్చేందుకే జగన్ ఫిర్యాదులు
ఎన్నికలు నిస్పక్షపాతంగా నిర్వహించాల్సిన ఎన్నికల సంఘం నేరస్తుల ఫిర్యాదుల పై చర్యలు తీసుకుంటూ ప్రజాస్వామ్య స్పూర్తికి విఘాతం కలిగేలా వ్యవహరిస్తోందని తెదేపా రాష్ట్ర అద్యక్షుడు కళా వెంకట్రావు ఆరోపించారు. ఇంటలిజెన్స్ డీజీ, కడప, శ్రీకాకుళం ఎస్పీలను కనీస విచారణ లేకుండా బదిలీ చేయడమే ఇందుకు నిదర్శనమని అన్నారు. జగన్ కు ఇరవై ప్రశ్నలతో బుధవారం కళా వెంకట్రావు హబిరంగా లేఖ రాశారు.
*భీమవరం బుల్లోడేవారు.?
ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు అత్యధికంగా కాంగ్రెస్ 7 తెదేపా 5 పర్యాయాలు గెలుపొందాయి. 2004లో కాంగ్రెస్ అభ్యర్ధి గ్రంధి శ్రీనివాస్ గెలిచారు. 2009లో కాంగ్రెస్ నుంచి 2014లో తెదేపా తరపున పులవర్తి రామాంజనేయులు విజయం సాధించారు. ఇప్పుడు మూడోసారి తలపడుతున్నారు. గ్రంధి శ్రీనివాస్ వైకపా తరపున పోటీ చేస్తున్నారు.
*గాజువాకలో ముగ్గురే ముగ్గురు
విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గంలో జనసేన తరపున పవన్ కళ్యాణ్ తెదేపా సిట్టింగ్ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు వైకాపా అభ్యర్ధిగా తిప్పల నాగిరెడ్డి బరిలో ఉన్నారు. 2014 ఎన్నికల్లో సమీప ప్రత్యర్ధి తిప్పల నగిరేది పై పల్లా విజయం సాధించారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్ధి చింతలపూడి వెంకటరామయ్య గెలిచారు. ప్రస్తుతం శ్రీనివాసరావు నాగిరెడ్డి కూడా బలమైన స్థితిలో ఉండడంతో పోటీ ఉత్కంటంగా మారింది.
*నారీ నారీ నడుమ భేరి
అక్కడ ప్రధాన పార్టీలైన తెదేపా వైకాపా మహిళలనే బరిలోకి దించాయి. నలుగు స్థానాల్లో వారి మధ్యే పోటీ నెలకొంది. విశాఖ జిల్లా పాడేరు తూర్పుగోదారి జిల్లా రంపచోడవరం పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు అనంతపురం జిల్లా సింగనమల అసెంబ్లీ నియోజకవర్గాల్లో తెదేపా, వైకాప మహిళా అభ్యర్ధులను బరిలో నిలిపాయి. గత ఎన్నికల్లో వైకాపా తరపున పాడేరు నుంచి పోటీ చేసిన ఈశ్వరి. రంపచోడవరం అభ్యర్ధిని రాజేశ్వరి ఈసారి తమ స్థానల్లో తెదేపా తరపున బరిలో నిలిచారు. పాయకరావుపేట నుంచి కొవ్వూరుకు మారి పోటీ చేస్తున్న ఎమ్మెల్యే వంగలపూడి అనిత పై తానేటి వైకాపా బరిలోకి దించింది. అనంతపురం జిల్లా సింగనమల స్థానంలో వైకాపా అభ్యర్ధిని పద్మావతి పై తెదేపా నుంచి కొత్త అభ్యర్ధిని శ్రావణి తలపడుతున్నారు. మరోవైపు ఈ నాలుగు నియోజకవర్గాల్లో జనసేన, దాని మిత్రపక్షాలు పురుష అభ్యర్ధులను రంగంలోకి దించడం విశేషం.
*మండ్య లో నలుగురు సుమలతలు
దక్షిణ కర్నాటకలోని మండ్యా పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్న నటి సుమలతకు చికాకులు తప్పట్లేదు. సుమలత పేరున్న మరో ముగ్గురితో ప్రత్యర్ధులు నామినేషన్ వేయించారు. కాంగ్రెస్ లో పొత్తు మీరలు జేడీ ఎస్ నుంచి ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు నిఖిల్ ఇక్కడ పోటీ చేస్తున్నారు. ఇదే స్థానాన్ని కాంగ్రెస్ నుంచి ఆశించి భంగపడిన సుమలత స్వతంత్ర అభ్యర్ధిగా బరిలో నిలిచారు. దివంగత నటుడు అంబరీష్ కు సంఘీభావంగా, ఆయన భార్య అయిన సుమలతకు భాజపా మద్దతు ప్రకటించింది. నిఖిల్, నటి సుమలత మధ్య గట్టిపోటీ నెలకొంది.

పూసపాటి వారి అమ్మాయి గెలుస్తుందా?

ఈ ఎన్నికల్లో పూసపాటి గజపతుల వంశం నుంచి మూడో తరం రాజకీయ రంగ ప్రవేశం చేస్తోంది. విజయనగరం ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి అశోక్‌ గజపతిరాజు కుమార్తె అదితి.. అసెంబ్లీ స్థానానికి బరిలో దిగారు. ప్రత్యర్థిగా వైకాపా తరఫున ఎప్పట్లాగే పట్టు వదలని విక్రమార్కుడిలా కోలగట్ల వీరభద్రస్వామే పోటీకి దిగారు. ఆయన విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గంలో తెదేపాకు ప్రత్యర్థిగా పోటీ చేయడం వరసగా ఇది ఏడోసారి! 2004లో ఒక్కసారి మాత్రమే ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి అశోక్‌పై విజయం సాధించారు. కాంగ్రెస్‌ అభ్యర్థిగా నాలుగు సార్లు, వైకాపా అభ్యర్థిగా ఒకసారి ఓడిపోయారు. 300 ఏళ్లకు పైబడిన చరిత్ర విజయనగరం సామ్రాజ్యం సొంతం. కళలకు కాణాచి. వందేళ్లకు పూర్వమే దక్షిణ భారతంలో విద్యల నగరంగా భాసిల్లింది. స్వాతంత్య్రానంతరం పూసపాటి వంశీయులకు పెట్టని కోటగా ఉన్న ఈ స్థానం ఆది నుంచీ తెదేపాకు కంచుకోటగా నిలుస్తోంది. విజయనగరం అసెంబ్లీకి 1952 నుంచి ఇప్పటివరకూ 16 సార్లు ఎన్నికలు జరగగా.. పూసపాటి వంశీయులు 11 ఎన్నికల్లో పాలు పంచుకుని పదిసార్లు విజయం సాధించారు. కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతిరాజు 1978లో జనతా పార్టీ తరఫున, అనంతరం 1983, 85, 89, 94, 1999, 2009 ఎన్నికల్లో తెదేపా ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ ఎన్నికల్లో అదే స్థానం నుంచి ప్రస్తుతం అశోక్‌గజపతి కుమార్తె అదితి బరిలోకి దిగారు. 2014లో అశోక్‌గజపతిరాజు విజయనగరం పార్లమెంటు స్థానం నుంచి పోటీచేసి 1,06,991 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ లోక్‌సభ పరిధిలోనే ఉన్న విజయనగరం అసెంబ్లీలో తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి మీసాల గీతకు వచ్చిన మెజారిటీ 15,404 ఓట్లు. అదే అసెంబ్లీ పరిధిలో అశోక్‌కి 42,624 ఓట్ల ఆధిక్యత రావటం చూస్తే ఈ ప్రాంతంపై గజపతులకు ఉన్న పట్టు ఎంతో తేలికగానే అర్థమవుతుంది. అశోక్‌ ఇప్పుడు మరోసారి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అదితి గజపతిరాజు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎంఏ సైకాలజీ పూర్తిచేశారు. విద్యారంగంపై ఉన్న ఆసక్తితో కొంతకాలం చెన్నై, దుబాయిలలోని మాంటిస్సోరీ విద్యా సంస్థల్లో ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. రెండేళ్లుగా కుటుంబ వారసత్వంగా వచ్చిన మహారాజా అలక్‌ నారాయణ సొసైటీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ (మాన్సాస్‌) ట్రస్టు బోర్డు సభ్యురాలిగా పనిచేస్తున్నారు. మాన్సాస్‌ విద్యాసంస్థల అభివృద్ధికి కృషి చేస్తున్నారు. గత ఎన్నికల్లో తండ్రి అశోక్‌ తరఫున ప్రచారం చెయ్యటంతో పాటు ఏడాదిన్నరగా పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా ఉన్నారు.

*****అదితి బలబలాలు
* పూసపాటి వంశీయుల ఆడబిడ్డ అరంగేట్రం
* అశోక్‌గజపతిపై ఉన్న ప్రజాభిమానం, ఆయన చేసిన అభివృద్ధి
* నియోజకవర్గంలో మహిళా ఓట్లు ఎక్కువగా ఉండటం
* తెదేపా సిట్టింగ్‌ ఎమ్మెల్యే మీసాల గీతకు టికెట్‌ ఇవ్వకపోవడంతో ఆమె సహకారంపై అనుమానాలు

*****కోలగట్ల బలాబలాలు
* మాస్‌ లీడర్‌గా పేరుండటం
* నెలల క్రితమే టికెట్‌ ప్రకటించడంతో అప్పట్నుంచి ప్రచారం
* కుల సంఘాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేయడం
* బొత్స సత్యనారాయణ, ఇతర సీనియర్‌ నేతల సహకారంపై అనుమానాలు
* ఇదే స్థానంలో గతంలో ఐదుసార్లు ఓటమి పాలవటం
* అనుచరుల దుందుడుకు వైఖరిపై వెల్లువెత్తుతున్న విమర్శలు

ఎంపీలకు ఎన్ని సౌకర్యాలో!

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మన భారతదేశం. దేశ ప్రజల ఆకాంక్షలకు ప్రతి రూపం పార్లమెంటు. స్వాతంత్ర్య వచ్చిన తరువాత 1952లో ఏర్పాటైన తోలిసభ నాటి నుండి నేటి వరకు ఎన్నో సవాళ్ళను ఎదుర్కొని సగౌరవంగా నిలబడింది. పార్లమెంటులోని ఉభయ సభలకు ఎన్నికైన ప్రజాప్రతినిధులు ప్రజా జీవనానిక్ ఎన్నో సౌకర్యాలు కల్పించారు. అలాంటి ప్రజాప్రతినిధిలకు కేంద్ర ప్రభుత్వం ఎన్నో వసతులు కల్పించింది. ప్రతి పార్లమెంటు సభ్యుడి పరిధి పలు జిల్లాలో విస్తరించి ఉంటుంది. కావున స్థానికంగా సౌకర్యాల కోసం ఓ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. నియోజకవర్గంలో కార్యాలయం ఏర్పాటు చేస్తే నెలకు రూ.45వేలు చెల్లిస్తారు. దీంతో పాటు సమావేశాల నిర్వహణకు మరో రూ. 45వేలు ఇస్తారు. దీంతో పాటు స్టేషనరీ ఖర్చుల కోసం రూ. పదిహేను వేలు అందుతాయి. పీఏను నియమించుకుంటే రూ. ముప్పై వేల వేతనం చెల్లిస్తారు. ఎంపీలకు రూ. యాభై వేలు ఉన్న వేతానని గతేడాది నుంచి రూ. లక్షకు పెంచారు. సభ్యుడికి నెలకు రూ.పాతిక వేల పెన్షన్ అందజేస్తారు. పార్లమెంటు సమావేశాల సందర్భంగా సభకు హాజరైన సభ్యుడికి రోజుకు రూ. రెండు వేలు చెల్లిస్తారు. పార్లమెంటు సభ్యుడు ఇష్టమైన చోట నివాసం ఉండొచ్చు. ఈఅద్దె అలవెన్సులు కూడా ప్రభుత్వం చెల్లిస్తోంది. పదవీకాలం ముగిసిన ఒక నెల ఉండొచ్చు. ఇంటి సామగ్రి కొనుగోలుకు వడ్డీ లేకుండా రూ.4 లక్షల రుణం ఇస్తారు. ఇల్లు, కార్యాలయం నిర్వహణకు ప్రతి మూడు నెలలకోసారి రూ.75 వేలు చెల్లిస్తారు. ఏడాదికి 50 వేల లీటర్ల నీళ్లు, 50 వేల యూనిట్ల విద్యుత్‌ను ఉచితంగా వాడుకునే వెసులుబాటు ప్రభుత్వం కల్పిస్తుంది. ఎంపీని కలిసేందుకు వచ్చే అతిథుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు కూడా ఉంటాయి. ఢిల్లీలోని వెస్ట్‌కోర్టు వసతి గృహం, జన్‌పథ్‌లో వసతి పొందవచ్చు. ప్రతి ఎంపీ మూడు టెలిఫోన్‌ కనెక్షన్లను వినియోగించుకోవచ్చు. ప్రతి ఫోన్‌ నుంచి 50 వేల కాల్స్‌ ఉచితంగా పొందవచ్చు. ఇందులో రెండు 3జీ కనెక్షన్‌లు ఉంటాయి. ప్రతి ఎంపీ వైద్య సేవల కోసం కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకంలో క్లాస్‌–1 చికిత్స పొందవచ్చు. ఎంపీలకు అందించే అన్ని రకాల వసతులు, నిర్వహణ ఖర్చులు ఆదాయపన్ను పరిధిలోకి తీసుకోరు. పార్లమెంట్‌ సభ్యుడు తన విధి నిర్వహణలో ఏ ప్రాంతానికి వెళ్లాల్సి వచ్చినా ఉచిత రవాణా సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తుంది. రోడ్డు మార్గంలో అయితే ప్రతి కిలోమీటరుకు రూ.16 చొప్పున చెల్లిస్తారు. రైలు ప్రయాణంలో ఎంపీతోపాటు అతని భార్య, లేదా భర్తతో పాటు దేశవ్యాప్తంగా ఎక్కడికి వెళ్లినా ఏసీతో పాటు రెండో తరగతి చార్జీలు చెల్లిస్తారు. విమానంలో అయితే ఏడాదిలో 34 సార్లు ప్రయాణించే సదుపాయం పార్లమెంట్‌ సభ్యులకు ప్రభుత్వం కల్పిస్తుంది.

చేవెళ్ల మహిళలు శక్తిమంతులు

చేవెళ్ల లోక్ సభ స్థానాన్ని మహిళా ఓటర్లు తీవ్రంగా ప్రభావితం చేయనున్నారు . ఒకరకంగా చెప్పాలంటే అభ్యర్థి గెలుపు వీరి ఓట్లపైనే ఆధారపడి ఉంది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్‍ సరళి దీన్నే రూఢీ చేస్తోందని విశ్లేషకుల అభిప్రాయం. ఈ క్రమంలో ప్రధాన పార్టీలు టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ అభ్యర్థులు మహిళా ఓట్లను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. రాష్ట్రంలోని 41 నియోజకవర్గాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువ మంది ఉన్నట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. అందులో చేవెళ్ల పార్లమెంట్‌ పరిధిలోని తాండూర్‌ నియోజకవర్గంలో మహిళా ఓటర్లే అధికం. చేవెళ్ల, వికారాబాద్‌ , పరిగి అసెంబ్లీ పరిధిలో పురుషులు, మహిళా ఓటర్ల సంఖ్య దాదాపు సమానంగా ఉంది. మహిళా ఓట్లే లక్ష్యంగా ప్రధాన పార్టీల అభ్యర్థుల ప్రచార సరళి సాగుతోంది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 23,02,163 మంది ఓటర్లు ఉన్నారు . ప్రస్తుత జాబితాలో ఈ సంఖ్య 24,15,598కు చేరింది. అంటే 1,13,435 మంది అదనంగా ఓటర్‍ లిస్టులో చేరారన్నమాట. ఇందులోనూ మహిళలు 57,697 మంది, పురుషులు 55,710 మంది, ఇతరులు 28 మంది ఉన్నట్లు అధికారులు వివరించారు. నియోజకవర్గాల్లో ఓట్ల వివరాలు పార్లమెంట్‌ పరిధిలోని మహేశ్వరం, రాజేంద్రనగర్‌, శేరిలింగంపల్లి, చేవెళ్ల, పరిగి, వికారాబాద్‌, తాండూరు నియోజకవర్గాలు ఉన్నాయి. తాండూర్‌ నియోజకవర్గంలో పురుషుల కంటే 4307 మహిళ ఓటర్లే అధికంగా ఉన్నాయి. మిగిలిన నియోజకవర్గాల్లోనూ పెద్దగా వ్యత్యాసం కన్పిం చడం లేదు. గత లోక్ సభ ఎన్నికల్లో 63.99 శాతం పోలింగ్‌ నమోదైంది. పోలైన ఓట్లలో పురుషులు 61 శాతంగా, మహిళలు 66శాతంగా నమోదయ్యాయి. తాజాగా వచ్చిన దరఖాస్తులలోనూ మహిళలదే పై చేయిగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో మహిళా ఓటర్లే కీలకం కావడంతో వారే నిర్ణయాత్మక పాత్రను పోషించనున్నారు. అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో మహిళా ఓటర్లు ఉండడంతో అన్ని పార్టీల నాయకులు మహిళలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.

అంబేద్కర్‌నే రెండుసార్లు ఓడించిన దేశం మనది

లోక్‌సభలో అడుగుపెట్టాలన్న భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేడ్కర్‌ కలలు కలలుగానే మిగిలిపోయాయి. 1952లో జరిగిన తొలి లోక్‌సభ ఎన్నికల్లో షెడ్యూల్డ్‌ కేస్ట్స్‌ ఫెడరేషన్‌ తరఫున అప్పటి ఉత్తర బొంబయి(రిజర్వ్డు) స్థానం నుంచి అంబేడ్కర్‌ పోటీకి దిగారు. గతంలో అంబేడ్కర్‌ సహాయకుడైన నారాయణ్‌ సడోబా కజ్రోల్కర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా నిలబడ్డారు. నారాయణ్‌ చేతిలో అంబేడ్కర్‌ 4,561 ఓట్ల స్వల్పతేడాతో పరాజయం పాలయ్యారు. ఆ తరువాత 3 ఏప్రిల్‌ 1952లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికై 2 ఏప్రిల్‌ 1956 వరకూ కొనసాగారు. ఈ మధ్యలో 1954లో బాంద్రా లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లోనూ అంబేడ్కర్‌ పోటీచేసి ఓడిపోయారు. ఇక్కడ కాంగ్రెస్‌ అభ్యర్థి బోర్కర్‌ విజయం సాధించారు.

మహాకూటమిపై వ్యాఖ్యానించడం తొందరపాటు

దేశానికి తిరిగి వచ్చి.. తన అవసరం ఉన్న చోట పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని ఆర్బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ తెలిపారు. ప్రస్తుతం ఉన్న స్థానంలో సంతోషంగా ఉన్నప్పటికీ తన అవసరం ఉన్నచోట పనిచేయడం గొప్ప అవకాశంగా భావిస్తానని వ్యాఖ్యానించారు. ఓ పుస్తకావిష్కరణ సభలో ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ముఖాముఖిలో ఆయన ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రానున్న ఎన్నికల్లో ప్రతిపక్షాలు టీఎంసీ, సమాజ్‌వాదీ పార్టీ, బీఎస్పీ, తెలుగుదేశం లాంటి పార్టీలు ఏర్పాటు చేసిన మహాకూటమి అధికారంలోకి వస్తే రాజన్‌ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో రాజన్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. దీనిపై రాజన్‌ను ప్రశ్నించగా ‘ఈ విషయంపై ఇప్పుడే స్పందించడం తొందరపాటు అవుతుంద’ని అభిప్రాయపడ్డారు. ఈసారి ఎన్నికలు భారత్‌కు ఎంతో కీలకమని.. దేశంలో నూతన సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో తనకు సలహాలు అందించే అవకాశం వస్తే సంతోషిస్తానన్నారు. కొంత మంది ఆర్థికవేత్తలతో కలిసి కొన్ని విధానాలను రూపొందించామన్నారు. వాటినే పుస్తక రూపంలో తీసుకువచ్చామన్నారు. ఆర్థికమంత్రిగా పనిచేసే అవకాశం వస్తే.. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టగలిగే స్వల్పకాల లక్ష్యాలపై దృష్టి సారిస్తానన్నారు. అలాంటి లక్ష్యాలనే పుస్తకంలో పొందుపరిచామన్నారు. అలాగే బ్యాంకింగ్‌ రంగంలోనూ పలు మార్పులు తీసుకువస్తాన్నారు. రైతాంగ సంక్షోభాన్ని తగ్గించేలా పటిష్ఠ వ్యవసాయ విధానాలను అమలు చేయాల్సి ఉందన్నారు. భూసేకరణ పద్ధతిలోనూ రాష్ట్రాలు అవలంబిస్తున్న మెరుగైన విధానాన్ని ఎంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయంలో రాష్ట్రాలకు అవసరమైన మేర స్వతంత్రం ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. ఇవే తన ప్రధాన్య అంశాలని రాజన్‌ వివరించారు. ఇదే ముఖాముఖిలో భారత ఆర్థిక వ్యవస్థ ఏడు శాతం వృద్ధితో పరుగులు తీస్తోందని ప్రభుత్వం ప్రకటించడంపై రాజన్‌ అనుమానాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఉద్యోగాల సృష్టి మందగించిన నేపథ్యంలో ఇంతటి వృద్ధి ఎలా సాధ్యమవుతుందని ఆయన ప్రశ్నించారు. ప్రస్తుత జీడీపీ గణాంకాలపై ఉన్న అనుమానాలను తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. అందుకోసం ఒక నిష్పాక్షిక వ్యవస్థ ఏర్పాటు చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. కనీస ఆదాయ పథకం రూపకల్పనలో భాగంగా రఘురామ్‌ రాజన్‌ లాంటి ఆర్థికవేత్తలను సంప్రదించామని రాహుల్‌ గాంధీ ప్రకటించారు. 2013 సెప్టెంబరు నుంచి సెప్టెంబరు 2016 మధ్య ఆర్బీఐ గవర్నర్‌గా రాజన్‌ విధులు నిర్వహించిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) ముఖ్య ఆర్థికవేత్తగా కూడా రాజన్‌ వ్యవహరించారు.

తెగేసి చెప్పేసిన నిజామాబాద్ రైతులు

నిజామాబాద్‌ పార్లమెంటు బరిలో తామంతా ఉండాలని నామినేషన్లు వేసిన రైతులు నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు ఆయా రైతు సంఘాలు తీర్మానం చేశాయి. దీంతో బ్యాలెట్‌ పద్ధతిలో ఎన్నికల నిర్వహణకు అధికారులు సిద్ధమయ్యారు. నామినేషన్ల ఉపసంహరణకు బుధ, గురువారాలు గడువు నిర్ణయించగా తొలిరోజు ఒక్కరూ ఉపసంహరణకు ముందుకు రాలేదు. నిజామాబాద్‌ లోక్‌సభ స్థానంలో నామినేషన్ల పరిశీలన అనంతరం 189 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు తేల్చారు. వీరిలో భాజపా, కాంగ్రెస్‌, తెరాస, పిరమిడ్‌, బహుజన ముక్తి, సమాజ్‌వాదీ ఫార్వర్డ్‌ బ్లాక్‌తో పాటు మరో ఇద్దరు స్వతంత్రులు ఉండగా.. మిగతా వారంతా రైతులే. మంగళవారం రిటర్నింగ్‌ అధికారి చేపట్టిన నామినేషన్ల పరిశీలన ప్రక్రియ రాత్రి 11 గంటల వరకు సాగింది. మొత్తం 14 మందికి చెందిన నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. అఫిడవిట్‌, వివరాలు సరిగా నింపని కారణంగా వీటిని తిరస్కరించినట్లు వెల్లడించారు.

మూర్ఖుల దినోత్సవం నాడు హైదరాబాద్ నడిబొడ్డున మోడీ సభ

ప్రధాని మోదీ ఈనెల 29న మహబూబ్‌నగర్‌లో జరిగే బహిరంగ సభతోపాటు ఏప్రిల్‌ 1న హైదరాబాద్‌లో ఎల్బీ స్టేడియంలో జరిగే బహిరంగ సభలోనూ పాల్గొంటారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ తెలిపారు. భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా తెలంగాణ ప్రచార షెడ్యూల్‌ సైతం ఖరారైందని చెప్పారు. హైదరాబాద్‌లో బుధవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ..‘‘అమిత్‌షా ఏప్రిల్‌ 4న.. కరీంనగర్‌, వరంగల్‌ నగరాల్లో జరిగే బహిరంగ సభల్లో పాల్గొంటారు. 6న నల్గొండతోపాటు హైదరాబాద్‌లో రోడ్‌షోల్లో పాల్గొని పార్టీ అభ్యర్థులకు ప్రచారం చేస్తారు’’ అని వివరించారు. మోదీని విమర్శిస్తే గొప్ప నాయకుడు అవుతానని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ భ్రమ పడుతున్నారని లక్ష్మణ్‌ విమర్శించారు. ‘‘మే 23న ఫలితాల తర్వాత కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం రావడం, మోదీ మళ్లీ ప్రధాని అవడం ఖాయం. రాజకీయ సన్యాసం చేయడానికి సిద్ధమా’’ అని కేటీఆర్‌కు లక్ష్మణ్‌ సవాలు విసిరారు. ‘‘కేంద్రంలో భాజపా అధికారంలోకి రాగానే.. తెలంగాణ రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకుంటాయి. మీ భరతం పడతాం. మీ అవినీతికి, కుటుంబ పాలనకు స్వస్తిపలుకుతాం’’ అని తెరాసను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘మేం అభివృద్ధి అజెండాతో వెళ్తుంటే కేసీఆర్‌ ప్రజల దృష్టి మారుస్తూ తానే అసలైన హిందువుగా చెబుతున్నారు. కొండగట్టు బస్సు ప్రమాదంలో 65 మంది భక్తులు మరణిస్తే పరామర్శించని మీరు హిందువు ఎలా అవుతారు? అసదుద్దీన్‌తో పోలిస్తే గడ్డం లేదుకానీ, అతడిని మించిన ముస్లిం మీరు. ప్రశ్నించిన ఎంపీలను పక్కన పెట్టారు. భజనపరులకు, డబ్బు సంచులు ఇచ్చినవారికి వేలంపాటను బట్టి లోక్‌సభ టికెట్లు ఇచ్చారు’’ అని సీఎం కేసీఆర్‌పై లక్ష్మణ్‌ నిప్పులుచెరిగారు. ‘‘ఉపాధ్యాయులు, పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లు తెరాసకు గుణపాఠం చెప్పారు. ‘కారు’ గాలిపోయింది. లోక్‌సభ ఎన్నికల్లో పంక్చర్‌ కావడం ఖాయం’’ అని జోస్యం చెప్పారు. మేనిఫెస్టోలో చేర్చాల్సిన అంశాల కోసం భాజపా దేశవ్యాప్తంగా ‘భారత్‌కీ మన్‌కీ బాత్‌, మోదీ కీ సాత్‌’ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్ర కమిటీ సభ్యులు ఐటీ ఉద్యోగులు, మహిళలు, వివిధవర్గాల ప్రజల నుంచి అభిప్రాయాలు స్వీకరించారు. ‘తెలంగాణ మన్‌కీ బాత్‌’ పేరుతో రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌కు కమిటీ సభ్యులు అందించారు. వీటిని పార్టీ జాతీయ మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్‌ రాజ్‌నాథ్‌సింగ్‌కు గురువారం అందించనున్నట్లు లక్ష్మణ్‌ తెలిపారు. కార్యక్రమంలో భాజపా రాష్ట్ర ముఖ్యఅధికార ప్రతినిధి కృష్ణసాగర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

ముంబయి ఉత్తర ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థిగా ఊర్మిళ

ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మకు నటి ఊర్మిళ అంటే ప్రత్యేకమైన అభిమానం ఉన్న సంగతి తెలిసిందే. ఆమె గురించి అప్పుడప్పుడూ ఆయన సోషల్‌మీడియాలో మాట్లాడుతుంటారు. మహిళా దినోత్సవం సందర్భంగా ‘రంగీలా’ సినిమాలో ఊర్మిళ స్టిల్‌ను షేర్‌ చేసి.. అందరికీ శుభాకాంక్షలు చెప్పారు. అయితే బుధవారం ఆమె కాంగ్రెస్‌ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఊర్మిళ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ నివాసానికి వెళ్లి పార్టీ సభ్యత్వాన్ని స్వీకరించారు. ముంబయి ఉత్తర లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. కాగా ఈ వార్త తనను ఎంతో థ్రిల్‌ చేసిందని వర్మ అన్నారు. ఈ మేరకు ఊర్మిళ, రాహుల్‌ కలిసి ఉన్న ఫొటోను షేర్‌ చేస్తూ.. ‘హే ఊర్మిళ.. నీ కొత్త ప్రయాణం గురించి తెలుసుకుని ఎంతో థ్రిల్‌ అయ్యా. ఎంతో అందమైన మహిళవైన నువ్వు అందమైన రాజకీయ నాయకురాలివి కాబోతున్నావు’ అంటూ ‘రంగీలా’లోని ‘యాయిరే యాయిరే…’ పాట లిరిక్స్‌ను జత చేశారు. వర్మ తెరకెక్కించిన ‘రంగీలా’ సినిమాలో ఊర్మిళ, ఆమిర్‌ ఖాన్‌ నటించారు. 1995లో ఈ సినిమా విడుదలై, హిట్‌ అందుకుంది.

రైతాంగ సమస్యల పట్ల కేసీఆర్ చిత్తశుద్ధికి ఇది ప్రభల తార్కాణం

ఓ యువరైతు ఆవేదనపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పందించారు. తన ఏడెకరాల భూమిని వీఆర్వో కరుణాకర్‌ ఇతరులకు పట్టా చేశారంటూ మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం నందులపల్లికి చెందిన రైతు శరత్‌ ఫేస్‌బుక్‌లో ఆవేదన వ్యక్తం చేశాడు. 11 నెలలుగా సమస్య అలాగే ఉందని, రైతుల వేదన సీఎంకు చేరే వరకూ షేర్‌ చేయాలని రైతు విజ్ఞప్తి చేశాడు. ఆ ఫేస్‌బుక్‌ పేజీని చూసిన సీఎం.. నేరుగా రైతుకు ఫోన్‌ చేసి సమస్య గురించి అడిగి తెలుసుకున్నారు. అన్ని విధాలా న్యాయం చేస్తానని సీఎం భరోసా ఇచ్చారు. కేసీఆర్‌ ఆదేశాలతో మంచిర్యాల జిల్లా కలెక్టర్‌ భారతి హోళికేరి ఈ వ్యవహారంపై హుటాహుటిన విచారణ చేపట్టారు. బెల్లంపల్లి సబ్‌కలెక్టర్‌ కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం నందులపల్లిలో శరత్‌ ఇంటికి వెళ్లి వివరాలు సేకరించారు. భూమిని శరత్‌కు అప్పగించేందుకు చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ఏడెకరాల భూమిని ఇతరుల పేరుపై మార్పిడి చేసినట్టు ఫిర్యాదు వచ్చిందని, రైతులకు సంబంధించిన సమస్యలన్నీ పరిష్కరించాలని కేసీఆర్‌ ఆదేశించారని తెలిపారు. రైతు బంధు పథకం కూడా బాధిత రైతుకు వర్తింపజేయాలని సీఎం ఆదేశించారన్నారు.

భాజపాకు బంపర్ ఆఫర్ ప్రకటించిన కుటుంబరావు

రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధులపై కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ విసిరిన సవాల్‌కు చర్చకు సిద్ధమని ఏపీ ప్రణాళికా మండలి ఉపాధ్యక్షుడు కుటుంబరావు స్పష్టంచేశారు. చర్చకు భాజపా సిద్ధమా అని ప్రతి సవాల్‌ విసిరారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో పోటీచేసిన భాజపా అభ్యర్థులెవరైనా ఎంపీగా డిపాజిట్‌ తెచ్చుకుంటే రూ.5లక్షలు ఇస్తానని ప్రకటించారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నాకు డిపాజిట్‌ వస్తే రూ.10లక్షలు ఇస్తానన్నారు. ఇక భాజపా నుంచి ఒక్కరు ఎమ్మెల్యేగా గెలిచినా రూ.15లక్షలు ఇస్తానని వెల్లడించారు. ఈ నగదు బహుమతిని తన సొంత డబ్బునే ఇస్తానని స్పష్టంచేశారు. కన్నా లక్ష్మీనారాయణ ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. వైకాపా అధ్యక్షుడు జగన్‌పై జమ్మూకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్‌ అబ్దుల్లా మంగళవారం చేసిన వ్యాఖ్యలు నిజమేనని భావిస్తున్నానన్నారు. 2009 జూన్‌లోనే కాంగ్రెస్‌కు రూ.1500 కోట్లు ఆఫర్‌ చేశారని ఫరూక్‌ చెప్పారని, అప్పుడు రూ.1500 కోట్లు అంటే ఇప్పుడు రూ.15వేల కోట్లు అవుతుందని వివరించారు. ఎన్నికల సంఘాన్ని భాజపా నేతలు నియంత్రిస్తున్నారా? అని ప్రశ్నించారు. భాజపా కంటే ప్రజాశాంతి పార్టీకే ఎక్కువ ఓట్లు వస్తాయని వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష పార్టీలన్నీ ముప్పేట దాడి చేసినా తెదేపాదే విజయమని విశ్వాసం వ్యక్తంచేశారు. తెదేపాకు 135 అసెంబ్లీ సీట్లు తగ్గవన్నారు. ఏపీలో భాజపా మరణించిన పార్టీ అన్నారు. ధైర్యం ఉంటే భాజపా వాళ్లను తనకు ఆఫర్‌ చేయమనండి అని సవాల్‌ విసిరారు. భాజపా నేతలు ఇప్పటికే చరిత్ర హీనులయ్యారని కుటుంబరావు మండిపడ్డారు.

25 లక్షల మంది ఓటర్లు పెరిగారు–రాజకీయ-03/27

* పెరిగిన ఓటర్లు 25,17,952
ఆంధ్రప్రదేశ్‌లో 2014తో పోలిస్తే 2019 సార్వత్రి క ఎన్నికల నాటికి 25,17,952 మంది ఓటర్లు పెరిగారు. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా, కడప జిల్లాలో అత్యల్పంగా ఓటర్ల వృద్ధి నమోదైంది. మొత్తంగా చూస్తే ప్రస్తుత రాష్ట్ర జనాభాలో 74.23 శాతం మంది ఓటర్లుగా ఉన్నారు. 18-19 ఏళ్ల వయోవర్గానికి చెందిన నవయువ ఓటర్లు బాగా పెరిగారు. మొత్తం ఓటర్లలో వీరు 2.58 శాతం మంది ఉన్నారు. వీరి సంఖ్య గుంటూరు జిల్లాలో అత్యధికంగా, విజయనగరం జిల్లాలో అత్యల్పంగా ఉంది. శ్రీకాకుళం జిల్లాలో అత్యధిక సంఖ్యలో సర్వీసు ఓటర్లు ఉండగా… కృష్ణా జిల్లాలో అతి తక్కువ మంది ఉన్నారు. ప్రవాస ఓటర్లు కడప, గుంటూరు, కృష్ణా జిల్లాల పరిధిలో అత్యధికంగా… శ్రీకాకుళం, అనంతపురం జిల్లాలో అతి తక్కువగా నమోదయ్యారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాల కృష్ణ ద్వివేది ఈ గణాంకాలను మంగళవారం మీడియాకు విడుదల చేశారు.
* జగన్‌ సభలో అపశ్రుతి
వైకాపా అధ్యక్షుడు జగన్‌ ఎన్నికల ప్రచారసభలో అపశ్రుతి చోటుచేసుకుంది. తూర్పుగోదావరి జిల్లా మండపేటలో జగన్‌ పాల్గొన్న సభలో ఓ భవనం పిట్టగోడ కూలింది. ఈ ఘటనలో సుమారు 20 మందికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన వారిలో ఈటీవీ ప్రతినిధి వెంకటరమణ సహా మరికొందరు మీడియా ప్రతినిధులు ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.
*రూ.100 కోట్లు దాటినా హేమమాలిని ఆస్తులు
బీజేపీ ఎంపీ, అలనాటి బాలీవుడ్‌ హీరోయిన్‌ హేమమాలిని బిలయనీర్‌గా అవతరించారు. మథుర పార్లమెంటరీ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు సమయంలో తన ఆస్తుల వివరాలను ప్రకటించారు. తనతోపాటు, ఆమె భర్త బాలీవుడ్‌ సీనియర్‌ హీరో ధర్మేంద్ర ఆస్తులను కూడా ఆమె ఎన్నికల కమిషన్‌కు సమర్పించారు. విలువైన బంగాళాలు, ఆభరణాలు, నగదు, షేర్లు, టర్మ్ డిపాజిట్లు అన్నీ కలిపి తన ఆస్తుల విలువ ప్రస్తుతం రూ. 101 కోట్లుగా ఎన్నికల అఫిడవిట్‌లో వెల్లడించారు. గత ఐదేళ్లలో ఆమె సంపద రూ. 34.46 కోట్ల మేర పెరిగింది.హేమమాలిని ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్‌ ఆధారంగా ఆమె 2014 జనరల్ ఎన్నికలకు ముందు రూ. 66 కోట్ల విలువైన ఆస్తులను కలిగి ఉన్నారు. భర్త ధరేంద్ర ఆస్తులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 12.30 కోట్ల రూపాయలు పెరిగాయి. ఇక ఆమె విద్యార్హతల విషయానికి వస్తే.. డాన్స్‌కోసం తొమ్మిదేళ్ల వయసులోనే చదువుకు స్వస్తి పలికినా.. ఆ తరువాత మెట్రిక్‌ పాసవ్వడంతోపాటు ఉదయపూర్‌ యూనివర్శిటీ నుంచి పీహెచ్‌డీ చేశారు. అలాగే కేంద్ర ప్రభుత్వం అందించే పద్మశ్రీ అవార్డును దక్కించుకున్నారు. 2014 ఎన్నికల కంటే ముందు ఆమె 2003-2009, 2012-12 మధ్య కాలంలో రెండు సార్లు రాజ్యసభ సభ్యురాలిగా పనిచేశారు. మరోవైపు మథుర నియోజవర్గం కోసం తాను చాలా చేశానని హేమమాలిని చెప్పుకొచ్చారు. దాదాపు వెయ్యి గ్రామాలున్న మథుర నియోజకవర్గ ప్రజల కోసం చాలా అభివృద్ధి పనులు చేశానన్నారు అయితే ఏమేమి పనులు చేసిందీ తనకు స్పష్టంగా గుర్తు లేదన్నారు. ఈ నేపథ్యంలో తాను ఈసారి ఎన్నికల్లో కూడా విజయం సాధిస్తానన్న ధీమాను వ్యక్తం చేశారు. అంతేకాదు తనకివే చివరి ఎన్నికలని, భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో తాను పోటీచేయనని కూడా హేమమాలిని ప్రకటించిన సంగతి తెలిసిందే.
*సంచలనం రేపుతున్న మోడీ ట్విట్
అధికార, ప్రతిపక్షాలు వ్యూహ ప్రతివ్యూహాలతో దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల వేడి రాజుకుంది. ఎన్నికల వాగ్దానాల ప్రజలను ఆకర్షించేందుకు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. ముఖ్యంగా 2019 లోక్ సభ ఎన్నికలు ప్రతిస్తాత్మకంగా భావిస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఎలాగైనా అధికార పీటాన్ని తిరిగి దక్కించుకోవాలన్న పట్టుదలతో ముందుకు సాగుతున్నారు. ఈ నేపద్యంలో ఆయన చేసిన ట్విట్ వైరల్ గా మారింది.
*32 నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లే ఎక్కువ
ఆంధ్రా రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటర్ల సంఖ్యా పరిశీలిస్తే 32 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లే కీలకం కానున్నారు. ఈ నియోజకవర్గాల్లో పురుష ఓటర్ల కన్నా మహిళా ఓటర్లే ఎక్కువ మంది ఉన్నారు. ఈ నియోజకవర్గంలో 2000 నుంచి 10,000 వరకు మహిళా ఓటర్లు పురుష ఓటర్ల కంటే అధికంగా ఉన్నారు. ఎదీంతో ఆయా ప్రాంతాలలో మహిళా ఓటర్లు ఎ అభ్యర్ధి పక్షాన, ఎ పార్టీ పక్షాన నిలిస్తే వారినే విజయం వరించనుంది.
*వైద్యుడి పై బొండా ఉమా వీరంగం
నేనెంటో.. నా సామర్ధ్యం ఏమిటో తెలియక మాట్లాడుతున్నావ్.. మీ సామాజిక వర్గానికి ఓట్లు వేసి ఏమి సాధిస్తారు.. నీకు సిగ్గు, సంస్కారం లేదా? అంటూ ఒక వైద్యుడి పై విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ తెదేపా అభ్యర్ధి బొండా ఉమా వీరంగం వేశారు. మార్నింగ్ వాక్ కు వచ్చిన ఆ వైద్యుడు నిష్కారణంగా బొండా వేసిన వీరంగంతో కన్నీటి పర్యంతంమయ్యాడు. విజయవాడ ఎస్ ఆర్ ఆర్ కళాశాలలో మాచవరం వాకర్స్ క్లబ్ ఉంది. ఇక్కడ సీతారాంపురం నుంచి రింగు రోడ్డు వరకు ప్రతి నిత్యం వందల మంది వచ్చి వాకింగ్ చేస్తూ ఉంటారు. మంగళవారం ఉదయం బొండా ఉమా మహేశ్వరరావు అక్కడ ప్రచారానికి వెళ్లారు. అక్కడ ఉన్న అతని అనుచరులు ఒకరినోకరిని పరిచయం చేస్తున్నారు. ఈలోగా బ్రాహ్మణ సమాజికవర్గాన్నికి చెందిన ఆ వైద్యుడి వంతు వచ్చింది. అంతే బొండా ఉమాలోని కోపం ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది. ఆ వైద్యుడు వైకపా అభ్యర్ధి మల్లాది విష్ణుకు మద్దతుగా పని చేస్తున్నారని అప్పటికే బొండా ఉమాకు సమాచారం అందింది. దీంతో ఆయన ఊగిపోతూ మీ సామాజికవర్గామంతా కలిసి విష్ణుకు ఓటేస్తే వాడు గెలుస్తాడా? అంటూ ఊగిపోయాడు మీరెంత? మీ బలమెంత? మీ సామాజిక వర్గాన్నంతా మీ వెంటే తిప్పుకోవడానికి ప్రయత్నిస్తే అంగీకరించనంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి ఆయన సమాధానం చెబుతూ విష్ణు తనకు బంధువని తమ వర్గాన్ని పలుమార్లు ఆడుకున్నారని చెప్పోబోగా మరింత రేచ్చిపోతూ పెద్దపెద్దగా అరవసాగాడు. దీంతో ఆ వైద్యుడు కన్నీటి పర్యంతం కాగా మిగాతావాడు బొండాను సర్ది చెప్పి అక్కడి నుంచి పంపేశారు.
*ఆదిలాబాద్‌లో నాలుగు నామినేషన్లు తిరస్కరణ
లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆయా అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లను మంగళవారం అధికారులు పరిశీలించారు. జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలోని లోక్‌సభ ఎన్నికల నామినేషన్‌ కేంద్రంలో రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో పరిశీలన ప్రక్రియ కొనసాగింది. షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 18 నుంచి 25 వరకు నామినేషన్లను స్వీకరించిన విషయం తెలిసిందే. అయితే ఆదిలాబాద్‌ లోక్‌సభకు మొత్తం 21 నామినేషన్లు దాఖలు కాగా, 17 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు.
*అక్కడే ఉండి కేసీఆర్‌కు ఊడిగం చేయండి- చంద్రబాబు
అధికారులపై ఎన్నికల సంఘానికి అవినీతి పార్టీ ఫిర్యాదు చేస్తే విచారణ కూడా లేకుండా వారిని బదిలీ చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆక్షేపించారు. చివరికి ఎన్నికల పరిధిలో లేని అధికారులను సైతం బదిలీ చేశారని అన్నారు. ఇది అత్యంత దుర్మార్గమని అభివర్ణించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో చంద్రబాబు రోడ్‌ షో నిర్వహించారు. ‘‘వివేకానంద రెడ్డిని సొంత ఇంట్లోనే దారుణంగా చంపిన విషయం తెలిసిందే. ఆ కేసును విచారణ జరుపుతున్న కడప ఎస్పీని సైతం బదిలీ చేశారు. మన ఇంట్లో ఇలాంటి ఘటన జరిగితే న్యాయం జరగాలని అందరం కోరుకుంటాం. చివరికి వివేకానందరెడ్డి భార్యను, కూతుర్ని కూడా బెదిరించి జగన్‌ తన అదుపులో పెట్టుకుంటున్నారు. జగన్‌కు మన పోలీసులపై నమ్మకం లేదు.
*సీఈసీకి చంద్రబాబు లేఖ
పోలీసు ఉన్నతాధికారుల బదిలీల వి‍షయంలో కేంద్ర ఎన్నికల సంఘం తీరును తప్పుబడుతూ తెదేపా అధినేత, సీఎం చంద్రబాబు ఈసీకి ఏడు పేజీల లేఖ రాశారు. ఈసీ ఆదేశాలతో తాను షాక్‌కు గురయ్యానని లేఖలో ఆయన పేర్కొన్నారు. సహజ న్యాయానికి విరుద్దంగా ఈసీ వ్యవహరిస్తోందని చంద్రబాబు ఆరోపించారు. వైకాపా ఫిర్యాదుపై కనీస ప్రాథమిక విచారణ చేయకుండానే 24 గంటల్లో చర్యలు ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. బదిలీలకు కారణాలు కూడా వెల్లడించకపోవడం సరికాదన్నారు. అప్రజాస్వామికంగా ఎన్నికలు జరిగేలా ఈసీ వ్యవహరిస్తోందని సీఎం ఆరోపించారు. ఇంటెలిజెన్స్ డీజీ ఎన్నికల విధుల పరిధిలోకి రారని.. అలాంటప్పుడు ఆ పోస్టులో ఉన్న వ్యక్తిని ఎలా బదిలీ చేస్తారని ప్రశ్నించారు. తొలి దశలో ఏపీ ఎన్నికలు రావడం వల్ల సమస్యాత్మక ప్రాంతాల్లో తెదేపా ప్రచారం చేయాల్సి వస్తోందని తెలిపారు. ఈ సమయంలో పోలీసు ఉన్నతాధికారుల బదిలీ దుర్మార్గ చర్య అని మండిపడ్డారు. మోదీ-జగన్-కేసీఆర్ ఈ కుట్రలకు కారణమని లేఖలో చంద్రబాబు ఆరోపించారు
*నెహ్రూ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ కనుమరుగు!
ఫూల్‌పూర్‌.. ఈ నియోజకవర్గం గురించి ఈ తరం వారికి పెద్దగా తెలియకపోవచ్చు. స్వాతంత్య్రానంతరం రెండు దశాబ్దాల పాటు దేశ రాజకీయ చరిత్రలో ఇది కీలక నియోజకవర్గం. ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలహాబాద్‌ జిల్లాలో ఈ లోక్‌సభ స్థానం విస్తరించి ఉంది. ఇద్దరు ప్రధానులు ఇక్కడి నుంచి పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. ఒక ప్రధాని సోదరి విజయం సాధించారు. ప్రస్తుతం ఇక్కడ కాంగ్రెస్‌ కనుమరుగైంది. 1980 తరువాత జరిగిన ఎన్నికల్లోనూ హస్తం పార్టీకి చేదు అనుభవాలే ఎదురయ్యాయి. తొలి ప్రధాని పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ 1952, 1957, 1962ల్లో ఫూల్‌పూర్‌ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1962లో నెహ్రూపై సోషలిస్ట్‌ పార్టీ నాయకుడు రామ్‌మనోహర్‌ లోహియా పోటీ చేశారు. 1964 మే 27న నెహ్రూ మరణానంతరం జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన సోదరి విజయలక్ష్మీ పండిట్‌ విజయం సాధించారు. 1967లోనూ ఆమె గెలుపొందారు. 1969లో జరిగిన ఉప ఎన్నికల్లో సంయుక్త సోషలిస్ట్‌ పార్టీ అభ్యర్థి జనేశ్వర్‌ మిశ్రా విజయ పతాకాన్ని ఎగురవేశారు. 1971లో విశ్వనాథ్‌ ప్రతాప్‌ సింగ్‌ కాంగ్రెస్‌ తరఫున ఎన్నికయ్యారు. సింగ్‌ యూపీ ముఖ్యమంత్రిగా, 1989లో ప్రధానిగా పని చేశారు. 1984లో ఇందిరాగాంధీ హత్యానంతరం జరిగిన ఎన్నికల్లో ఫూల్‌పూర్‌లో హస్తం గెలిచింది. ఆ తర్వాత ఆ పార్టీ ఉనికే కరవైంది.
*ఏపీ నుంచి ఒకేఒక్క జనతా ఎంపీ ‘నీలం’
1977 లోక్‌సభ ఎన్నికల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ విజయదుందుభి మోగించింది. మొత్తం 42 స్థానాలకుగానూ 41చోట్ల గెలిచింది. జనతా పార్టీ ఒకే ఒక స్థానాన్ని కైవశం చేసుకుంది. కర్నూలు జిల్లా నంద్యాల నుంచి నీలం సంజీవరెడ్డి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. తర్వాత ఆయన లోక్‌సభ స్పీకరుగా ఎన్నికయ్యారు. కొద్దిరోజుల అనంతరం ఏకగ్రీవంగా రాష్ట్రపతి అయ్యారు.
*క్రేజీ.. కేజ్రీ
‘క్షణక్షణముల్‌ నాయకుల చిత్తముల్‌’ అనుకోవాల్సిన తరుణమిది. ఎప్పుడు.. ఎందుకు.. ఏం చేస్తారో తెలియని నేతల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్‌ క్రేజీ… అదే కేజ్రీవాల్‌ ఒకరు. ఒకవైపు దిల్లీలో కాంగ్రెస్‌ పార్టీతో కలిసి పోటీ చేసేందుకు పొత్తుల చర్చలు సాగిస్తున్నారు. మరోవైపు ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ‘కనీస ఆదాయ పథకం’పై విమర్శలు గుప్పిస్తున్నారు. విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని తెచ్చి, ప్రతి పేదవాడి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామని భాజపా 2014లో ఇచ్చిన హామీని గుర్తుచేస్తూ.. దాన్ని ఏడాదికి రూ.72 వేలు ఇస్తామన్న రాహుల్‌ హామీతో పోల్చారు. ఈ రెండింటినీ రెండు ఏటీఎంలలా పెట్టి.. మొదటిదాంట్లో ఓటరును కాలితో తన్నినట్లు, రెండో ఏటీఎం అతడిని పిలుస్తున్నట్లు కార్టూన్‌ను సోషల్‌మీడియాలో ఉంచారు. దిల్లీ లోక్‌సభ ఎన్నికల్లో రెండు పార్టీల మధ్య పొత్తు ఉంటుందో లేదో అన్న విషయంలో కొద్ది రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని దిల్లీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు షీలా దీక్షిత్‌ చెబుతున్నారు.
*ఎన్నికల్లో ఓడిన ఏకైక ప్రధాని ఇందిర
ప్రధానిగా ఉంటూ ఎన్నికల్లో పరాజయం పాలైన ఏకైక నేత ఇందిరాగాంధీ మాత్రమే. 1977 లోక్‌సభ ఎన్నికల్లో యూపీలోని సిట్టింగ్‌ నియోజకవర్గమైన రాయ్‌బరేలీ నుంచి బరిలో దిగిన ఇందిరాగాంధీని ప్రజలు తిరస్కరించారు. అత్యవసర విధింపు తదితర కారణాలతో ఓడించారు. జనతాపార్టీ అభ్యర్థిగా ఆమెపై పోటీ చేసిన రాజ్‌నారాయణ్‌ విజయం సాధించారు. ఆ తర్వాత 1978లో ఇందిరాగాంధీ కర్ణాటకలోని చిక్‌మంగళూరు ఉప ఎన్నికల్లో గెలుపొంది పార్లమెంట్‌లోకి ప్రవేశించారు. ఆమె ప్రత్యర్థిగా జార్జిఫెర్నాండెజ్‌ పోటీ చేశారు.
*అన్నిచోట్ల కొత్త ప్రత్యర్థులే
ఆంధ్రప్రదేశ్‌లోని 25 లోక్‌సభ స్థానాల్లో ఒక్క చోట కూడా ప్రధాన పార్టీల తరఫున గత ఎన్నికల్లో పోటీ పడిన పాత ప్రత్యర్థులు మళ్లీ తలపడటం లేదు. కడప, రాజంపేట లోక్‌సభ నియోజకవర్గాల్లో మినహా మిగతా అన్ని చోట్ల గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులనే ఈ సారి వైకాపా మార్చేసింది. శ్రీకాకుళం, విజయనగరం, ఏలూరు, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, బాపట్ల (ఎస్సీ), హిందూపురం, చిత్తూరు (ఎస్సీ) లోక్‌సభ నియోజకవర్గాల్లోనే తెదేపా గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులను బరిలో దింపింది. మిగతా అన్ని చోట్ల అభ్యర్థులను మార్చేసింది. రాజమహేంద్రవరం నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన మాగంటి మురళీమోహన్‌ స్థానంలో ఆయన కోడలు మాగంటి రూపాదేవికి, అనంతపురం నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన జేసీ దివాకర్‌రెడ్డి స్థానంలో ఆయన కుమారుడు పవన్‌కుమార్‌రెడ్డిని బరిలో నిలిపింది.
*జగన్‌ వ్యాఖ్యలపై న బ్యాడ్జీలతో నిరసన
రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మరోసారి చంద్రబాబే అధికారంలోకి రావాలని పింఛనుదార్లు, తటస్థులు, మేధావులు, ప్రైవేటు ఉపాధ్యాయ, పారిశ్రామిక సంఘాల నాయకులు ఆకాంక్షించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కలిస్తే తప్పేంటని ప్రతిపక్షనేత జగన్‌ వ్యాఖ్యానించడాన్ని నిరసిస్తూ వీరంతా నల్లబ్యాడ్జీలు ధరించి మంగళవారం ఉండవల్లిలోని ప్రజావేదికలో సీఎంను కలిశారు. రాష్ట్రాభివృద్ధి కోసం మరోసారి తెదేపా అధికారంలోకి రావాలని, ఇందుకు తమ మద్దతు ఉంటుందని వారు సీఎంకు హామీ ఇచ్చారు.
*నాకు సొంత సైకిల్‌ కూడా లేదు- కేఏ పాల్‌
తనకు ఎలాంటి ఆస్తులు లేవని నామినేషన్‌కు జతచేసిన అఫిడవిట్‌లో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కిలారి ఆనంద్‌(కేఏ పాల్‌) పేర్కొన్నారు. రెండు క్రిమినల్‌ కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు చూపారు. క్రెడిట్‌కార్డు బకాయిలు 2వేల అమెరికన్‌ డాలర్లు చెల్లించాల్సి ఉందన్నారు. భార్య పేరిట మరో వెయ్యి డాలర్లు బకాయిలు ఉన్నట్లు చూపారు. ఉన్నవన్నీ ఛారిటబుల్‌ ట్రస్టుకు ఇచ్చేశానని, హెలికాప్టర్‌ కాదు కదా తనకు కనీసం సొంత సైకిల్‌ కూడా లేదని చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో నామినేషన్ల పరిశీలన ప్రక్రియ సందర్భంగా ఇక్కడకు వచ్చిన పాల్‌ విలేకర్లతో మాట్లాడారు. రూ.లక్షల కోట్లు దోచుకున్నవారికి ఓటేస్తారో.. రూ.లక్షల కోట్లు సంపాదించి పేదలకు దానం చేసిన తనకు ఓటేస్తారో నిర్ణయించాలని ప్రజలను కోరారు.
*రావొద్దు.. మా ఊరికి
తమ గ్రామంలో నీళ్లుల్లేవు, సరైన రోడ్డు మార్గం లేదు, కల్వర్టు నిర్మాణంలేదని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలం గుర్రప్పనాయుడుకండ్రిగ గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 11న నిర్వహించే సార్వత్రిక ఎన్నికల్లో తాము పాల్గొనడం లేదని, ఎన్నికలకు సంబంధించి ఏ పార్టీ నేతలూ గ్రామంలోకి రావద్దంటూ సోమవారం గ్రామ వీధుల్లో గోడపత్రికలు అంటించారు. ‘ఏ పార్టీ మాకు న్యాయం చేయలేదు. ఈ ఎన్నికల్లో మేము ఎవరికీ ఓట్లు వేయబోం’ అని స్పష్టం చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసు అధికారులు అక్కడికి చేరుకుని గ్రామస్థులతో చర్చించారు. వాళ్ల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
*అడ్డంగా దొరికిపోయిన వైకాపా నేతలు
కృష్ణా జిల్లాలో వైకాపా నేతలు అడ్డంగా దొరికిపోయారు. గుడివాడ నియోజకవర్గం నందివాడ మండలంలో వైకాపా ద్విచక్ర వాహనాల ర్యాలీకి వచ్చిన వారికి విచ్చల విడిగా డబ్బు పంచుతూ మీడియా కంటికి చిక్కారు. వివిధ ప్రాంతాల్లో స్థానిక నాయకులు జరిపిన ర్యాలీ సందర్భంగా వైకాపా నేతలు యథేచ్చగా డబ్బును పంచిపెట్టారు. ప్రజలను ప్రలోభపెట్టడంపై తెదేపా సహా ఇతర రాజకీయ పక్షాలు మండిపడుతున్నాయి. డబ్బు పంపిణీపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని ప్రత్యర్థి పార్టీలు డిమాండ్‌ చేస్తున్నాయి. ద్విచక్ర వాహనాలకు వైకాపా జెండాలు కట్టుకొని వచ్చిన వారికి వరుసగా డబ్బు పంచుతున్న దృశ్యాలు బహిర్గతమయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి.
*నెలకు రూ.6వేలు
రాహుల్‌ గాంధీ ప్రకటించిన కనీస ఆదాయ పథకం ‘టాపప్‌ స్కీం’ కాదని, 5 కోట్ల నిరుపేద కుటుంబాలకు ఏటా కచ్చితంగా రూ.72వేలు ఇచ్చే పథకం అని కాంగ్రెస్‌ స్పష్టం చేసింది. కుటుంబ ఆదాయం రూ.12వేల కంటే ఎంత తగ్గితే అంత మొత్తాన్ని మాత్రమే ఇస్తారన్న అస్పష్టత వచ్చిందని తెలిపింది. అలాంటిదేమీ లేకుండా ప్రతి కుటుంబానికి నెలకు కచ్చితంగా రూ.6వేల చొప్పున సంవత్సరానికి రూ.72వేలు ఇస్తామని ఆ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సూర్జేవాలా మంగళవారం ఇక్కడ విలేకర్లతో చెప్పారు.
*మీ పేర్లు జనం నోళ్లలో నానాలి
పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేస్తున్న కొత్త అభ్యర్థులు నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించాలని, ప్రతి గ్రామాన్నీ సందర్శించి ప్రజలను కలవాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచించారు. అభ్యర్థుల గురించి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పెద్దఎత్తున ప్రచారం చేయాలని, వారి పేర్లు ప్రజల నోళ్లలో నానాలని చెప్పారు. మంగళవారం సీఎం కేసీఆర్‌.. జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ ప్రధాన కార్యదర్శులు, ఇతర ముఖ్యనేతలతో, అభ్యర్థులతో ఫోన్‌లో మాట్లాడినట్లు తెలిసింది.
*తెరాసలోకి మాజీమంత్రి సునీతా లక్ష్మారెడ్డి
మాజీమంత్రి, మెదక్‌ జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సునీతా లక్ష్మారెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరాలని నిర్ణయించారు. ఆమె మంగళవారం తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ను ఆయన నివాసంలో కలుసుకొని, పార్టీ మారే అంశంపై చర్చించారు. తాను కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తున్నానని, తెరాస అభ్యున్నతికి కృషిచేస్తానని చెప్పారు. ఏప్రిల్‌ మొదటి వారం నర్సాపూర్‌లో జరిగే సీఎం సభలో.. తెరాసలోకి చేరాలని ఆమెకు కేటీఆర్‌ సూచించారు.
*భాజపాలోకి జితేందర్‌రెడ్డి!
లోక్‌సభలో తెరాస పక్ష నేత, మహబూబ్‌నగర్‌ ఎంపీ జితేందర్‌రెడ్డితో భాజపా నేతలు మంతనాలు జరుపుతున్నారు. మహబూబ్‌నగర్‌ లోక్‌సభ స్థానంలో తెరాస టికెట్‌ దక్కకపోవడంతో ఆయన అసంతృప్తితో ఉన్నారు. ఆయనతో భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ ఫోన్‌లో చర్చలు జరిపారు. పార్టీలో చేరికపై సంప్రదించారు. 29న మహబూబ్‌నగర్‌లో జరిగే ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభ ఉన్న నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. మంతనాల సందర్భంగా జితేందర్‌రెడ్డి కొన్ని డిమాండ్లు పెట్టినట్లు తెలిసింది. వీటిపై భాజపా అగ్రనాయకత్వంతో మాట్లాడి చెబుతానని రాంమాధవ్‌ అన్నట్లు సమాచారం.
*మంగళగిరిలో క్షణక్షణం ఉత్కంఠ
మంగళగిరి అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్న తెదేపా, వైకాపా అభ్యర్థుల నామినేషన్‌లపై మంగళవారం ఉత్కంఠ కొనసాగింది. తెదేపా అభ్యర్థి నారా లోకేశ్‌, వైకాపా అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి నామపత్రాలపై ఇరు పార్టీల నేతలు పరస్పరం పలు అనుమానాలు వ్యక్తం చేశారు. వైకాపా అభ్యర్థి దాఖలు చేసిన అఫిడవిట్‌పై సంతకం చేసిన నోటరీ కాలపరిమితి ముగిసిందని ప్రత్యర్థి వర్గం అభ్యంతరం లేవనెత్తింది. తెదేపా అభ్యర్థి నారా లోకేశ్‌ నామపత్రంతో ఇచ్చిన అఫిడవిట్‌పై కృష్ణా జిల్లాకు చెందిన నోటరీ సంతకం చేశారని, అఫిడవిట్‌ చెల్లదంటూ వైకాపా అభ్యంతరం చెప్పింది.
*ఏపీకి ద్రోహం చేస్తున్న జగన్‌
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కలిస్తే తప్పేంటని జగన్‌ వ్యాఖ్యానించడం ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాల్ని తాకట్టుపెట్టడమేనని తెదేపా ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు ధ్వజమెత్తారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని, రాష్ట్రానికి ప్రత్యేకహోదా రాకుండా అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్న వ్యక్తితో ఎలా కలుస్తారని ప్రశ్నించారు. రాష్ట్రాభివృద్ధికి అడ్డుపడుతున్న కేసీఆర్‌తో కుమ్మక్కైన జగన్‌ ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు తీరని ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు. మంగళవారం ఉండవల్లిలోని ప్రజావేదికలో వేర్వేరుగా విలేకరుల సమావేశాల్లో మాట్లాడారు.
*వైకాపాలో చేరాలంటూ ఫోన్‌ వచ్చింది: మాగంటి బాబు
వైకాపాలో చేరాలంటూ ఆ పార్టీ నుంచి ఫోన్‌ వచ్చిందని ఏలూరు పార్లమెంట్‌ తెదేపా అభ్యర్థి, సిట్టింగ్‌ ఎంపీ మాగంటి బాబు తెలిపారు. ఏలూరులో మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ.. కొద్ది రోజుల కిందట తనకు ఫోన్‌ వచ్చిందని, ఇష్టం లేదని చెప్పి సున్నితంగా తిరస్కరించానని వివరించారు. తెదేపాకి 150 అసెంబ్లీ స్థానాలు వస్తాయన్నారు. అన్ని పార్లమెంట్‌ స్థానాల్లో విజయం సాధిస్తుందన్నారు. వైకాపాకు స్క్రీన్‌ప్లే, దర్శకత్వం మోదీ, కేసీఆర్‌లేనని మాగంటి బాబు ఆరోపించారు.
*రాయలసీమ వేడికి జమ్మూకశ్మీర్‌ మాజీ సీఎం ఉక్కిరిబిక్కిరి
మంచుగడ్డ కాసేపు ఎండలో పెడితే ఏమవుతుంది.. కరిగి నీరవుతుంది.. అలాగే జమ్ము, కశ్మీర్‌ లాంటి శీతల ప్రాంతంలో నివసించే వ్యక్తి నిప్పులకుంపటి లాంటి రాయలసీమ ప్రాంతానికి వస్తే ఏమవుతుంది.. చెమటలు కక్కుకుని ముప్పుతిప్పలు పడాల్సిందే… సరిగ్గా ఈ పరిస్థితి ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఫరూక్‌ అబ్దుల్లాకు ఎదురైంది. తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి ఆయన మంగళవారం కడప, కర్నూలు జిల్లాల్లో పర్యటించారు.
*వైకాపాకు లబ్ధికే ఐటీ దాడులు: శేషసాయిబాబు
భాజపా ప్రోత్సాహంతో ఎన్నికల ముందు వైకాపాకు లబ్ధి చేకూరేలా తెదేపా అభ్యర్థులపై సీబీఐ, ఈడీ, ఆదాయపు పన్ను అధికారుల దాడులు పెరిగాయని 20 సూత్రాల అమలు కమిటీ ఛైర్మన్‌ శేష సాయిబాబు మండిపడ్డారు. కనిగిరి తెదేపా అభ్యర్థి ఉగ్రనరసింహారెడ్డి నిర్వహిస్తున్న అమరావతి ఆసుపత్రిపై ఐటీ దాడులు ఇందులో భాగమేనని ధ్వజమెత్తారు.
*రిటర్న్‌ గిఫ్టు కోసం రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు: మంత్రి ఉమా
కేసీఆర్‌ ఇచ్చిన రూ.వెయ్యి కోట్ల రిటర్న్‌గిఫ్టు కోసం ఐదు కోట్ల రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను ప్రతిపక్ష నేత జగన్‌ తాకట్టు పెట్టారని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. విజయవాడలోని మంగళవారం ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్‌ మద్దతుతో ప్రత్యేక హోదా తెస్తానంటూ జగన్‌ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. జగన్‌ తీసుకున్న వాటా కారణంగానే కేసీఆర్‌ పట్టిసీమ నీటిలో వాటా అడుగుతున్నారని పేర్కొన్నారు. రాయలసీమకు కృష్ణా జలాల తరలింపును అడ్డుకుంటున్న రాయలసీమ ద్రోహి కేసీఆర్‌కు జగన్‌ తలొగ్గారని, ఈ విషయంలో సీమ ప్రజలకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.
*కేసీఆర్‌ కబళించాలని చూస్తున్నారు
‘కేసీఆర్‌ తెలంగాణలో అన్ని పార్టీలను కబళించి ఇక్కడకు వస్తున్నారు. అవకాశం ఇస్తే మనం నీళ్లు తాగాలన్నా ఆయన దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సి వస్తుంది. ఆ పరిస్థితి అవసరమా?’ అని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు ప్రశ్నించారు. మంగళవారం తెదేపా కార్యకర్తలతో నిర్వహించిన ఎన్నికల మిషన్‌ 2019 టెలికాన్ఫరెన్స్‌లోమాట్లాడారు. ‘విభజన సమయంలో నష్టపోయాం. మనల్ని మోసం చేశారు. జగన్‌లా మనమూ లొంగిపోతే ఇప్పుడు మళ్లీ అన్యాయం చేస్తారు. ఇక్కడ పోర్టులు కడతారు. ఆస్తులు కొట్టేస్తారు. మనకు నీళ్లు రానీయరు. భద్రాచలం మునిగిపోతుంది.. పోలవరం నిలిపేయమని ఫిబ్రవరి 23 సుప్రీంకోర్టులో కేసు వేయించారు. రాయలసీమకు నీళ్లివ్వకూడదని బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌లో వాదనలు విన్పిస్తున్నారు’ అని విమర్శించారు.
*రాజకీయాల్లో మార్పునకే జనసేన
‘ఒక తరం నాయకులు సమాజహితాన్ని కోరారు. అందుకే నెల్లూరు జిల్లాకు చెందిన పుచ్చలపల్లి సుందరయ్య తెలంగాణ సాయుధ పోరాటానికి నేతృత్వం వహించారు. ఇప్పుడు నేతలు అలా కాదు. స్వార్థం కోసం రాజకీయాలు చేస్తున్నారు. దీనివల్ల మనం ఎంతో కోల్పోయాం. రాజకీయాలంటే డబ్బున్న వారికేనా? సామాన్యులకు అందుబాటులో ఉండవా? ఇందులో సమూల మార్పు తీసుకురావాలన్న ఏకైక లక్ష్యంతో జనసేనను ఏర్పాటుచేశాం’ అని పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నెల్లూరు జిల్లా కోవూరు, కావలి నియోజకవర్గాల్లో బహిరంగ సభల్లో ఆయన మాట్లాడారు.
*ఏపీలో 25 జిల్లాలు!
రాష్ట్రంలోని ప్రతి లోక్‌సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా (మొత్తం 25 జిల్లాలు) ఏర్పాటు చేస్తామని భాజపా ప్రకటించింది. రాష్ట్ర హైకోర్టును శాశ్వతంగా రాయలసీమలోనే నెలకొల్పుతామని హామీ ఇచ్చింది. ఆ పార్టీ రాష్ట్ర ‘ఎన్నికల ప్రణాళిక’ను మంగళవారం విజయవాడలో రైల్వే శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ విడుదల చేశారు. భాజపా అధికారంలోకి రాగానే… అమరావతి ప్రాంత రైతులు ఎవరైనా అభ్యర్థిస్తే వారి భూములను తిరిగి ఇచ్చేస్తామని ఎన్నికల ప్రణాళికలో వెల్లడించింది. రాజధాని అమరావతి నిర్మాణం రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం మాదిరిగా సాగుతోందని వ్యాఖ్యానించింది. అవినీతి ఆరోపణలపై కూరుకుపోయిన తెలుగుదేశం ప్రభుత్వంపై విచారణకు ప్రత్యేకంగా సిట్‌ ఏర్పాటు చేసి… బాధ్యులకు శిక్ష పడేలా చేస్తామని పేర్కొంది. 60 ఏళ్లు నిండిన వృద్ధులకు రూ.3వేల పెన్షన్‌ ఇస్తామని తెలిపింది. మ్యానిఫెస్టో రూపకల్పన కమిటీ ఛైర్మన్‌ ఐవైఆర్‌ కృష్ణారావు మాట్లాడుతూ… ప్రస్తుతం ప్రత్యక్ష, పరోక్ష ఎన్నికల్లో అన్ని కులాల వారికి తగిన ప్రాతినిథ్యం లభించడంలేదని, తమ పార్టీ అధికారంలోకి వస్తే అన్ని వర్గాలకు సముచిత ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు.
*సీఎంను చేస్తే రూ.1500 కోట్లు ఇస్తామన్నారు
జమ్ము కశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్‌ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం కడపలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ముఖ్యమంత్రితో కలసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..‘‘నాకు బాగా గుర్తు.. జగన్‌ ఓసారి మా ఇంటికి వచ్చారు. ఆయన ఏం మాట్లాడారో ఈ సందర్భంగా గుర్తు చేయాలనుకుంటున్నా. జగన్‌ తన తండ్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి చనిపోయినప్పుడు సీˆఎం కావాలని భావించారు. తనను సీˆఎం చేస్తే కాంగ్రెస్‌కు రూ.1500 కోట్లు ఇచ్చేందుకు సిద్ధమన్నారు. అంత డబ్బు జగన్‌కు ఎక్కడి నుంచి వచ్చింది. భూమిలో ఆయనకు ఖజానా ఏమైనా ఉందా? ఆ డబ్బు కూడా దోచుకుని తెచ్చి ఉంటారు. డబ్బుతో ఏదైనా జరుగుతుందని అనుకుంటారు. జగన్‌లాంటి వ్యక్తితో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఆ వ్యక్తికి అవకాశం ఇస్తే తన భవిష్యత్తును చక్కదిద్దుకుని మీ భవిష్యత్తును నాశనం చేస్తారు.’’ అని పేర్కొన్నారు.
*కాంగ్రెస్‌ గూటికి శత్రుఘ్న సిన్హా -రేపు పార్టీలో చేరిక
సినీనటుడు, భాజపా ఎంపీ శత్రుఘ్న సిన్హా ఈ నెల 28న దిల్లీలో కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నారు. ఆయనను తమ పార్టీ అభ్యర్థిగా పట్నా సాహిబ్‌ లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దింపనున్నట్లు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అఖిలేశ్‌ ప్రసాద్‌ సింగ్‌ వెల్లడించారు. శత్రుఘ్న సిన్హా గత రెండు దఫాలుగా భాజపా తరఫున పట్నా సాహిబ్‌ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తాజా ఎన్నికల్లో ఆయనకు టికెట్‌ నిరాకరించిన భాజపా.. ఆ సీటును కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌కు కేటాయించింది.
*మోదీతో కేసీఆర్‌ రహస్య ఒప్పందం
ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ రహస్య ఒప్పందం కుదుర్చుకున్నారని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. దాని ప్రకారం- ప్రస్తుత పార్లమెంటు ఎన్నికల సందర్భంగా వీటిల్లో ఏ పార్టీకి ఓటు వేసినా అది భాజపాకు వేసినట్లే అవుతుందన్నారు. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలోని నిడమనూరు, త్రిపురారం ప్రాంతాల్లో మంగళవారం కాంగ్రెస్‌ కార్యకర్తల సమావేశాలు నిర్వహించారు. సీఎల్పీ మాజీ నేత జానారెడ్డితో కలిసి ఉత్తమ్‌ హాజరయ్యారు.
*కాంగ్రెస్‌, భాజపాలను లేకుండా చేస్తేనే దేశాభివృద్ధి
గత 70 ఏళ్లలో కాంగ్రెస్‌, భాజపాలు చేసిన అభివృద్ధి ఏమీ లేదని, ఆ పార్టీలను లేకుండా చేస్తేనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని ఎంపీ, నిజామాబాద్‌ తెరాస లోక్‌సభ అభ్యర్థి కవిత స్పష్టం చేశారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్‌ జిల్లా ఎడపల్లిలో మంగళవారం బహిరంగసభలో ఆమె మాట్లాడుతూ.. జరగనున్న లోక్‌సభ ఎన్నికలు దేశ భవిష్యత్తును మార్చేవన్నారు. బోధన్‌ నియోజకవర్గ కోడలుగా తనను గెలిపించి, ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని ఇవ్వాలని కోరారు. సభలో బోధన్‌ ఎమ్మెల్యే షకీల్‌ తదితరులు పాల్గొన్నారు.
*పేదరికంపై మెరుపు దాడి
కాంగ్రెస్‌ ప్రకటించిన కనీస ఆదాయ హామీ పథకం ‘‘పేదరికంపై చేసిన మెరుపుదాడి’’ అని ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అభివర్ణించారు. ‘‘బాంబు వేశాం.. మోత మోగింది’’ అని ప్రకటించారు. 21వ శతాబ్దంలో ఎవరూ పేదవారుగా ఉండడానికి వీల్లేదని, అందుకే దేశంలో నిరుపేదలైన 20 శాతం కుటుంబాలకు కనీస ఆదాయం కల్పించనున్నట్టు చెప్పారు. రాజస్థాన్‌లోని గంగానగర్‌ జిల్లా సూరత్‌ఘర్‌లో మంగళవారం జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ ప్రధాని మోదీ పారిశ్రామికవేత్తలకు డబ్బులు ఇస్తుంటే తాము పేదలకు ఇస్తామని చెప్పారు. ఈ పథకానికి ‘న్యూన్‌తమ్‌ ఆయ్‌ యోజన- న్యాయ్‌’ అని పేరు పెట్టినట్టు వెల్లడించారు. ఇది పేదలకు ఇచ్చే ఉచిత బహుమతి కాదని, వారికి చేసే న్యాయం అని వివరించారు.
*ఇందూరు బరిలో 191 మంది
నిజామాబాద్‌ లోక్‌సభ స్థానంలో నామినేషన్ల పరిశీలన అనంతరం 191 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు తేల్చారు. వీరిలో భాజపా, కాంగ్రెస్‌, తెరాస, పిరమిడ్‌, బహుజన ముక్తి, సమాజ్‌వాదీ ఫార్వర్డ్‌ బ్లాక్‌ అభ్యర్థులతోపాటు మరో ఇద్దరు స్వతంత్రులు. మిగతా వారంతా రైతులే. నామినేషన్ల గడువులోపు 203 మంది 245 సెట్ల నామపత్రాలు దాఖలు చేశారు. అదనపు సెట్లు పోను 203 మందికి సంబంధించిన నామినేషన్లను అధికారులు అభ్యర్థుల సమక్షంలో మంగళవారం పరిశీలించారు.వివిధ కారణాల వల్ల 12 మంది నామినేషన్లు తిరస్కరణకు గురైనట్లు వివరించారు. బరిలో 191 మంది మిగిలినట్లు వెల్లడించారు. నామినేషన్ల ఉపసంహరణకు గురువారం వరకు గడువు ఉంది.
*29న సీఎం దిశానిర్దేశం: తలసాని
పార్లమెంట్‌ ఎన్నికల సందర్భంలో ఎల్బీ స్టేడియం వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిశానిర్దేశం చేస్తారని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. ఈనెల 29 సాయంత్రం 5 గంటలకు అక్కడ సికింద్రాబాద్‌, మల్కాజిగిరి, చేవెళ్ల స్థానాలకు సంబంధించి భారీ బహిరంగసభ జరగనుంది. ఏర్పాట్లను జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌తో కలిసి మంత్రి పర్యవేక్షించారు. అనంతరం మాట్లాడుతూ, సొంత అజెండాలతో రాజకీయపార్టీలు ముందుకొస్తున్న ఈ తరుణంలో సీఎం చేయనున్న ప్రసంగానికి అత్యంత ప్రాముఖ్యం ఉందన్నారు.
*తెరాసకు మున్నూరు కాపుల మహాసభ మద్దతు
పార్లమెంటు ఎన్నికల్లో మున్నూరు కాపులు తెలంగాణ రాష్ట్రసమితికి మద్దతు ఇవ్వాలని తెలంగాణ మున్నూరు కాపు మహాసభ పిలుపు నిచ్చింది. మంగళవారం సికింద్రాబాద్‌లో రాష్ట్రకార్యవర్గ సమావేశం జరిగింది. మహాసభ గౌరవాధ్యక్షుడు వి.ప్రకాశ్‌, సలహాదారు రమేశ్‌ హజారి, అధ్యక్షుడు పుటం పురుషోత్తం, ప్రధాన కార్యదర్శి మంగళారపు లక్ష్మణ్‌, కోశాధికారి ఇసంపెల్లి వెంకన్న పాల్గొన్నారు. పురుషోత్తం మాట్లాడుతూ సబ్బండ కులాల అభ్యున్నతే లక్ష్యంగా సాగుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలనకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించామన్నారు.ప్రకాశ్‌ మాట్లాడుతూ, రైతు సంక్షేమ పథకాలు, భారీ సాగునీటి పథకాలు వంటి కార్యక్రమాలు చేపట్టిన కేసీఆర్‌కు అండగా నిలుస్తామని తెలిపారు.
*11 లోక్‌సభ నియోజకవర్గాల్లో కేటీఆర్‌ ప్రచారం
తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ 11 లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. బుధవారం నుంచి వచ్చేనెల 9వ తేదీ వరకు నిర్వహించనున్న సభల షెడ్యూలును తెరాస రాష్ట్ర కార్యదర్శి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి విడుదల చేశారు. కేటీఆర్‌ 33 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలోని 36 సభల్లో ఆయన ప్రసంగిస్తారు. సభలు, రోడ్‌షోలలో పాల్గొంటారు. రోడ్డు మార్గంతో పాటు హెలికాప్టర్‌లోనూ ఆయన సభలకు హాజరవుతారు. సభలకు సమన్వయకర్తలుగా పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, హైదరాబాద్‌ మేయరు బొంతు రామ్మోహన్‌లు వ్యవహరిస్తారు.
*కురుపాం తెదేపా అభ్యర్థి జనార్దన్‌ థాట్రాజ్‌ నామినేషన్‌ తిరస్కరణ
విజయనగరం జిల్లా కురుపాం అసెంబ్లీ స్థానం నుంచి తెదేపా తరపున పోటీలో ఉన్న వి.టి.జనార్దన్‌ థాట్రాజ్‌ నామినేషన్‌ తిరస్కరణకు గురైంది. మంగళవారం కురుపాం తహసీల్దారు కార్యాలయంలో నామినేషన్ల పరిశీలన సందర్భంగా థాట్రాజ్‌ కుల ధ్రువీకరణ పత్రం చెల్లదంటూ భాజపా అభ్యర్థి నిమ్మక జయరాజు అభ్యంతరం లేవనెత్తారు.
*సీపీఐ, సీపీఎం ఉమ్మడి ప్రచారం – 1, 2 న బహిరంగ సభలు
లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తున్న సీపీఐ, సీపీఎం.. అభ్యర్థుల తరఫున ఆ పార్టీల నాయకులు ప్రచారం చేయనున్నారు. రెండు పార్టీలు పరస్పర మద్దతుతో చెరో రెండు స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. సీపీఐ నుంచి భువనగిరి స్థానంలో గోదా శ్రీరాములు, మహబూబాబాద్‌ స్థానంలో కల్లూరి వెంకటేశ్వర్లు బరిలో ఉండగా.. సీపీఎం నుంచి ఖమ్మంలో బి.వెంకట్‌, నల్గొండ స్థానంలో మల్లు లక్ష్మి పోటీ చేస్తున్నారు. సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు చాడ వెంకçరెడ్డి, తమ్మినేని వీరభద్రం ప్రచారంలో పాల్గొంటారు. 27న ఖమ్మంలో, 28న మహబూబాబాద్‌లో, 30న నల్గొండలో పార్లమెంటు నియోజకవర్గ స్థాయి సమావేశాలు నిర్వహిస్తారు. 1న భువనగిరిలో, 2న మహబూబాబాద్‌లో బహిరంగ సభలు జరుగుతాయి. సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి, ఇతర జాతీయ నేతలు హాజరవుతారు.
*31న రాష్ట్రానికి రాహూల్ ?
ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అద్యక్షుడు రాహూల్ గాంధీ ఈనెల 31న రాష్ట్రానికి రానున్నారు. విజయవాడలో అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో నిర్వహించే ప్రచార సభల్లో ఆయన పాల్గొననున్నట్లు సమాచారం. విజయవాడలో ఉదయం కల్యనడుర్గంలో మద్యాహ్నం ఈ సభలు నిర్వహించే అవకాశం ఉంది.
*ఏప్రిల్ 15న పోలవరం ప్రగతి చూస్తాం.
పోలవరం ప్రగతిని ఏప్రిల్ 15న స్వయంగా ప్రాజెక్టుకు వచ్చి సమీక్షించాలని డ్యాం డిజైన్ రివ్యూ కమిటీ నిర్ణయించింది. కఫర్ డ్యాం పనులు వేగం పెంచవలసి ఉందని స్పష్టం చేసింది. డిల్లీలో మంగళవారం డీడీఆర్పీ సమావేశం జరిగింది. చైర్మన్ పాండ్యా అద్యక్షతన జరిగిన ఈ సమావేశానికి పోలవరం ఇంజనీర్ ఇన్ చీఫ్ ఎం.వెంకటేశ్వరరావు సిఈ శ్రీధర్ సలహాదారు వీ.రమేష్ బాబు హాజరయ్యారు. పోలవరంలో స్పిల్ వె కఫర్ డ్యాం ఇతర పనులకు సంబందించి గతంలో పేర్కొన్నట్లు పనులు జరుగుతున్నాయా? అని కమిటీ ప్రస్నిమ్చింది. ప్రస్తుతం రబీ అవసరాలకు గోదావరి నీరు ఇస్తున్నందున పనులు పూర్తీ స్థాయిలో చేసేందుకు వీలు కావడం లేదని అధికారులు నవయుగ ప్రతినిధులు తెలిపారు.
*వారిది చెక్కు చెదరని కూటమి- భాజపా కార్యదర్శి మురళీధరరావు
దేశంలో పదిహేను మంది నాయకులూ ప్రధాని పదవి కోసం నిరీక్షిస్తున్నారని కనీ కుర్చీ కాళీ లేదని వీళ్ళంతా చంద్రబాబునాయుడి చెక్క గుర్రం కూతమని భాజపా జాతీయ కార్యదర్శి మురళీ ధరరావు అన్నారు. మంగళవారం రాత్రి నరసరావుపేటలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్కాంల దేశాన్ని స్కీంల దేశంగా మార్చిన ఘనత తనదేనని పేర్కొన్నారు. 2020నాటికి దేశంలో ఇల్లు లేని కుటుంబం ఉండకూడదన్నది ప్రధాని మోడీ లక్ష్యమని చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వం పై ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. ఐదేళ్ళలో రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన ప్రాజెక్టులు, విశ్వవిద్యాలయలు, రైల్వే జోన్ తదితరాలను వివరించారు.
*జగన్మోహన్ రెడ్డి ప్రత్యెక హోదా ఎట్టా తెస్తావు?
ఇరవై ఐదు సీట్లు గెలిపించండి. ప్రత్యెక హోదా తెస్తానని జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. ఎట్టా తెస్తావు జగన్మోహన్ రెడ్డి హోదా? అని అగుతున్నా? అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. కేంద్రంలో భాజపా ఇవ్వలేదు. కాంగ్రెస్ ఇస్తానంటోంది మమతాబెనర్జీ ఫరూక్ అబ్దుల్లా ఇలా అందరం కలిసి ఉన్నాం. ప్రత్యెక హోదా ఒక్క తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం తప్ప ఎవరి వల్లా కాదని పేర్కొన్నారు. జగన్ కు కేసులు భయంతో జైలుకు పోతానన్న పిరికితనంతో బానిసత్వానికి ఊడిగం చేయడానికి సిద్దపడ్డారు. మీ భవిష్యత్తు నా బాద్యత అంటున్నారు. వైకాపాకు ఓట్లు వేస్తె మన మరణ వాంగ్మూలం మనకు రాసుకున్నట్లే. పోతిరెడ్డిపాడు ముచ్చుమర్రి దగగ్రకు పాలెం. జాగ్న్ శ్రీశైలం, నాగార్జున సాగర్ అప్పనంగా కేసీఆర్ చేతుల్లో పెడతాడు. నాలో చివరి రక్తపు బొట్టుననంత వరకు కేసీఆర్ ఆటలు సాగనివ్వను ఒక హైదరాబాద్ కాదు ఇరవై హైదరాబాద్ లను తాయారు చేసే సత్తా నాకుంది అని చెప్పారు.
*జగన్‌ తన గొయ్యి తానే తవ్వుకుంటున్నారు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కలిస్తే తప్పేంటన్న వ్యాఖ్యలతో వైకాపా అధ్యక్షుడు జగన్‌ రాజకీయ సమాధి కావడం ఖాయమని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలతో జగన్‌ ముసుగు తొలగిపోయిందని, తెరాస, వైకాపా బంధం బహిర్గతమయిందని పేర్కొన్నారు. ప్రధాని మోదీ, కేసీఆర్‌తో బంధాన్ని ఇన్నాళ్లూ దాచిపెట్టిన జగన్‌ విధిలేకే దాన్ని బయటపెట్టారని, ప్రజలకు అడ్డంగా దొరికిపోయారని విమర్శించారు. ప్రతిపక్షనేత తన గొయ్యి తానే తవ్వుకుంటున్నాడని మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ‘‘ప్రతిపక్షనేత జగన్‌ ప్రజాప్రతినిధిగా ఘోరంగా విఫలమయ్యారు.
*ఏపీకి ద్రోహం చేస్తున్న జగన్‌
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కలిస్తే తప్పేంటని జగన్‌ వ్యాఖ్యానించడం ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాల్ని తాకట్టుపెట్టడమేనని తెదేపా ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు ధ్వజమెత్తారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని, రాష్ట్రానికి ప్రత్యేకహోదా రాకుండా అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్న వ్యక్తితో ఎలా కలుస్తారని ప్రశ్నించారు. రాష్ట్రాభివృద్ధికి అడ్డుపడుతున్న కేసీఆర్‌తో కుమ్మక్కైన జగన్‌ ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు తీరని ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు. మంగళవారం ఉండవల్లిలోని ప్రజావేదికలో వేర్వేరుగా విలేకరుల సమావేశాల్లో మాట్లాడారు.
*నామినేషన్‌ వెనక్కి తీసుకోవాలని బెదిరింపులు
చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గానికి నామినేషన్‌ వేసిన స్వతంత్ర అభ్యర్థిపై వైకాపా అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అనుచరులు బెదిరింపులకు పాల్పడ్డారు. ఇటీవల చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గానికి తిరుపతి గ్రామీణ మండలం చిగురువాడ వైఎస్‌ఆర్‌ కాలనీకి చెందిన కె.భాస్కర్‌రెడ్డి నామినేషన్‌ వేశారు. వైకాపా అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అనుచరులు వి.చంద్రశేఖర్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, సోమశేఖర్‌ చిగురువాడకు చేరుకుని తమ నాయకుడి పేరుతో ఉన్న నామినేషన్‌ ఉపసంహరించుకోవాలని కె.భాస్కర్‌రెడ్డిని బెదిరించారు. ఘటనపై బాధితుని భార్య గీత తిరుపతి ఎం.ఆర్‌.పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.
*తెలంగాణలో పారిశ్రామికవేత్తలకు వేధింపులు-ఎంపీ మాగంటి మురళీమోహన్‌
తెలంగాణలో తెరాస ప్రభుత్వ వేధింపుల నేపథ్యంలో పారిశ్రామికవేత్తలు భయభ్రాంతులకు గురవుతున్నారని రాజమహేంద్రవరం ఎంపీ మాగంటి మురళీమోహన్‌ అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లి మండలం సంగాయగూడెంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. అక్కడి ప్రభుత్వ వేధింపుల కారణంగానే తెలంగాణలోని ఫార్మా కంపెనీలు ఆంధ్రాకు తరలివస్తున్నాయన్నారు. ట్రస్టు కార్యకలాపాలు చూసుకోవడం కోసమే పోటీనుంచి తప్పుకున్నానని.. తనను కేసీఆర్‌ బెదిరించారనడం అవాస్తవమని చెప్పారు.
*వైఎస్‌ హయాంలోనే బాక్సైట్‌ అనుమతులు-అరకు పార్లమెంట్‌ అభ్యర్థి కిశోర్‌చంద్రదేవ్‌
వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే బాక్సైట్‌ తవ్వకాలకు అనుమతులు ఇస్తూ జీవోలు జారీ అయ్యాయని అరకు పార్లమెంట్‌ తెదేపా అభ్యర్థి, కేంద్ర మాజీ మంత్రి వైరిచర్ల కిశోర్‌చంద్రదేవ్‌ చెప్పారు. అప్పట్లో కాంగ్రెస్‌ నాయకుల్లో బాక్సైట్‌ తవ్వకాలను వ్యతిరేకించింది తానొక్కడినేనని పేర్కొన్నారు. నామపత్రాల పరిశీలనకు మంగళవారం అరకులోయ వచ్చిన ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. బాక్సైట్‌కు సంబంధించి 2009లో జీవో ఇచ్చింది వైఎస్‌ రాజశేఖరరెడ్డి అయితే… 2014లో జీవోను రద్దు చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందన్నారు. 2010లో బాక్సైట్‌ అనుమతులను వ్యతిరేకించడంతో పలువురు పెద్దలు తనను సంప్రదించి రూ.వందల కోట్లు ఇస్తామని ఆశ చూపారని చెప్పారు. గిరిజనుల శ్రేయస్సే ముఖ్యమని వారికి స్పష్టం చేసినట్లు పేర్కొన్నారు. బాక్సైట్‌ తవ్వకాలకు వ్యతిరేకమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టమైన హామీ ఇవ్వడంతో తెదేపాలో చేరినట్లు వివరించారు.
*వైకాపాకు లబ్ధికే ఐటీ దాడులు: శేషసాయిబాబు
భాజపా ప్రోత్సాహంతో ఎన్నికల ముందు వైకాపాకు లబ్ధి చేకూరేలా తెదేపా అభ్యర్థులపై సీబీఐ, ఈడీ, ఆదాయపు పన్ను అధికారుల దాడులు పెరిగాయని 20 సూత్రాల అమలు కమిటీ ఛైర్మన్‌ శేష సాయిబాబు మండిపడ్డారు. కనిగిరి తెదేపా అభ్యర్థి ఉగ్రనరసింహారెడ్డి నిర్వహిస్తున్న అమరావతి ఆసుపత్రిపై ఐటీ దాడులు ఇందులో భాగమేనని ధ్వజమెత్తారు.
*వైకాపాలో చేరాలంటూ ఫోన్‌ వచ్చింది: మాగంటి బాబు
వైకాపాలో చేరాలంటూ ఆ పార్టీ నుంచి ఫోన్‌ వచ్చిందని ఏలూరు పార్లమెంట్‌ తెదేపా అభ్యర్థి, సిట్టింగ్‌ ఎంపీ మాగంటి బాబు తెలిపారు. ఏలూరులో మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ.. కొద్ది రోజుల కిందట తనకు ఫోన్‌ వచ్చిందని, ఇష్టం లేదని చెప్పి సున్నితంగా తిరస్కరించానని వివరించారు. తెదేపాకి 150 అసెంబ్లీ స్థానాలు వస్తాయన్నారు. అన్ని పార్లమెంట్‌ స్థానాల్లో విజయం సాధిస్తుందన్నారు. వైకాపాకు స్క్రీన్‌ప్లే, దర్శకత్వం మోదీ, కేసీఆర్‌లేనని మాగంటి బాబు ఆరోపించారు.
*రిటర్న్‌ గిఫ్టు కోసం రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు: మంత్రి ఉమా
కేసీఆర్‌ ఇచ్చిన రూ.వెయ్యి కోట్ల రిటర్న్‌గిఫ్టు కోసం ఐదు కోట్ల రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను ప్రతిపక్ష నేత జగన్‌ తాకట్టు పెట్టారని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. విజయవాడలోని మంగళవారం ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్‌ మద్దతుతో ప్రత్యేక హోదా తెస్తానంటూ జగన్‌ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. జగన్‌ తీసుకున్న వాటా కారణంగానే కేసీఆర్‌ పట్టిసీమ నీటిలో వాటా అడుగుతున్నారని పేర్కొన్నారు. రాయలసీమకు కృష్ణా జలాల తరలింపును అడ్డుకుంటున్న రాయలసీమ ద్రోహి కేసీఆర్‌కు జగన్‌ తలొగ్గారని, ఈ విషయంలో సీమ ప్రజలకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.
*నన్ను పోటీ చేయోద్దన్నారు –మురళీమోహన్ జోషీ
ప్రస్తుత లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయకూదంటూ భాజపా వ్యవస్థాపక సభ్యుడు డాక్టర్ మురళి మనోహర్ జోషీకి ఆ పార్టీ నాయకత్వం సూచించినది. 85ఏళ్ల జోషీ భాజపాకు అద్యక్షుడిగా పనిచేశారు. ప్రసుతం కాన్పూర్ ఎంపీగా ఉన్నారు. పార్టీ నిర్ణయాన్ని జోషీ ఒక సమ్క్షిప్త ప్రకటనలో వెల్లడించారు. ప్రియమైన కాన్పూర్ ఓటర్లకు ఎక్కడా పోటీ చేయవద్దంటూ భాజపా ప్రధాన కార్యదర్శి రాంలాల్ మంగళవారం నాకు చెప్పారు. అని పేర్కొన్నారు. జోషీ 2009లో వారణాసి నుంచి విజయం సాధించారు. 2014లో ప్రధాని నరేంద్ర మోడీ కోసం వారణాసిని విడిచిపెట్టి కాన్పూర్ నుంచి రంగంలోకి దిగి 57 శతం ఓట్లు సాధించారు. దేవరియా నుంచి తానూ పోటీ చేయడం లేదని మరో నేత కల్రాజ్ మిశ్ర తెలిపారు.

ఈసీకి ఎదురు తిరిగిన ఏపీ–తాజావార్తలు–03/27

*ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు సహ ముగ్గురు పోలీసు ఉన్నతాధికారులు పై కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేయడంతో ఆత్మరక్షణలో పడిన చంద్రబాబు సర్కారు బుధవారం వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. ఈసీ ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఏపీ ప్రభుత్వం వివాదాస్పద జీవో జారీ చేసింది.
* ముఖ బాలీవుడ్‌ నటి ఊర్మిళ మతోంద్కర్‌ కాంగ్రెస్‌లో చేరారు. బుధవారం దిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె పార్టీ కండువా కప్పుకున్నారు. అంతకుముందు కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నివాసానికి వెళ్లిన ఊర్మిళ.. ఆయనతో కాసేపు భేటీ అయ్యారు.
*ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో జరిగే లోక్‌సభ ఎన్నికల వ్యయ పరిశీలకుడిగా మాజీ ఐఆర్‌ఎస్‌ అధికారి గోపాల్‌ ముఖర్జీ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులిచ్చింది. ఆయన ఇదివరకు సీబీడీటీ సభ్యుడిగా పనిచేశారు. అభ్యర్థులు చేసే వ్యయంపై నిఘావర్గాలు, సీవిజిల్‌ యాప్‌, 1950 హెల్ప్‌లైన్‌ ద్వారా ప్రజలనుంచి వచ్చే సమాచారం ఆధారంగా వీరు నిఘా పెడతారు. ఓటర్లకు డబ్బులు, మద్యం, ఇతర వస్తువుల పంపిణీపై నిఘాపెట్టి నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా చర్యలు తీసుకుంటారు.
*ఈ ఏడాది నుంచి ప్రవేశపెట్టనున్న ఆన్‌లైన్‌ ప్రవేశ పరీక్షల విధానాన్ని వ్యతిరేకిస్తూ జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ)లో విద్యార్థులు చేపట్టిన నిరాహార దీక్ష మంగళవారం 8వ రోజుకు చేరింది. కాగా ఉపకులపతి (వీసీ) ఎం.జగదీశ్‌ కుమార్‌ ఇంటికి సోమవారం కొందరు విద్యార్థులు వెళ్లడంతో వివాదం నెలకొంది.
*విదేశాలకు ఎగుమతి చేయడం కోసం తమ దేశంలో ముద్రించిన 30వేల ప్రపంచ మ్యాప్‌లను చైనా ధ్వంసం చేసింది. అరుణాచల్‌ప్రదేశ్‌, తైవాన్‌లను చైనాలో అంతర్భాగంగా చూపకపోవడం వల్లే ఈ చర్యను చేపట్టినట్లు అధికారిక ‘గ్లోబల్‌ టైమ్స్‌’ పత్రిక పేర్కొంది.
* అగ్రిగోల్డ్‌ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. అగ్రిగోల్డ్ డైరెక్టర్ ప్రసాద్‌కు రూ.700 కోట్ల బినామీ ఆస్తులు ఉన్నాయని.. మీడియాలో వచ్చిన కథనాలపై తెలంగాణ హైకోర్టులో బాధితులు అఫిడవిట్ దాఖలు చేశారు. 65 మంది అగ్రిగోల్డ్‌ డైరెక్టర్లు బినామీ ఆస్తులు కలిగి ఉన్నారని.. అగ్రిగోల్డ్‌ బాధితులు పిటిషన్‌లో పేర్కొన్నారు. బినామీ ఆస్తులపై దర్యాప్తు జరపాలని ఏపీ సీఐడీకి కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ ఏప్రిల్ 8కి వాయిదా వేసింది.
* తప్పుడు దారిలో వచ్చిన ఓ ఆటోను ఆపబోయాడు ట్రాఫిక్ పోలీస్.. అంతే ఆ పోలీసును ఢీకొట్టి వెళ్లిపోయాడు ఆటోవాలా. బిహార్ రాష్ట్రంలోని ముజఫర్‌పూర్ జిల్లా ఖాజీ మొహమ్మద్‌పూర్ పోలీస్ స్టేషన్ ఏరియాలో మంగళవారం జరిగిందీ సంఘటన.
* ట్రాక్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన టీఆర్ఎస్ కార్యకర్త దానం వెంకటయ్య కుటుంబానికి టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ బీమా చెక్కు పంపిణీ చేశారు. టిఆర్ఎస్ సభ్యత్వం ఉండటంతో..రూ.2,00,000 లక్షల బీమా చెక్కును మంత్రి శ్రీనివాస్ గౌడ్ దానం వెంకటయ్య కుటుంబ సభ్యులకు అందజేశారు. హన్వాడ మండలానికి చెందిన దానం వెంకటయ్య ఇటీవల ట్రాక్టర్ ప్రమాదంలో మృతి చెందారు.
*శారదా కుంభకోణానికి సంబంధించి సుప్రీం కోర్టు మంగళవారం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో కోల్‌కతా పోలీసు కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ను విచారించాక దాఖలు చేసిన స్థాయీ నివేదికలో సీబీఐ పేర్కొన్న అంశాలు ‘చాలా చాలా తీవ్రమైన’వని తెలిపింది.
*ముంబయి నుంచి సింగపూర్‌కు ప్రయాణిస్తున్న సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ విమానానికి ఆగంతకుడి నుంచి బాంబు బెదిరింపు ఫోన్‌కాల్‌ వచ్చింది. దీంతో సింగపూర్‌ వైమానిక దళం రెండు ఎఫ్‌-16 యుద్ధ విమానాలను సదరు ప్రయాణికుల విమానానికి తోడుగా పంపించింది.
*మెక్సికో వెంబడి సరిహద్దు గోడ నిర్మాణం ప్రారంభించేందుకు బిలియన్‌ డాలర్ల నిధుల్ని బదిలీ చేసే ప్రక్రియకు అమెరికా రక్షణ విభాగం పెంటగాన్‌ ఆమోదం తెలిపింది. దీనిపై పలువురు సీనియర్‌ డెమోక్రటిక్‌ నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. నిధులకు సంబంధించిన బదిలీ కమిటీని నోటిఫై చేసేముందు పెంటగాన్‌ రక్షణ కమిటీల అనుమతి కోరలేదని పేర్కొన్నారు.
*పుల్వామా ఉగ్రదాడి తదనంతరం భారత్‌-పాక్‌ల మధ్య తలెత్తిన ఉద్రిక్తతలు ఇప్పుడిప్పుడే సడలిపోయేలా లేవని, భారత్‌లో సార్వత్రిక ఎన్నికలు ముగిసే వరకూ ఇదే పరిస్థితి కొనసాగవచ్చని పాకిస్థాన్‌ ప్రధాన మంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ సందేహం వ్యక్తం చేశారు. భారత్‌లో ఎన్నికలు పూర్తయ్యేలోపు ఆ దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోది మరోసారి దుస్సాహసానికి పాల్పడే అవకాశాన్నీ తోసిపుచ్చలేమని పేర్కొన్నారు.
*భారత్‌-ఆగ్నేయాసియా దేశాల సమాఖ్య(ఆసియాన్‌)మధ్య పరస్పర సహకారం పెరుగుతోందని జర్మనీ, ఇండోనేషియా, ఆసియాన్‌ దేశాల్లో భారత మాజీ రాయబారి గుర్జిత్‌ సింగ్‌ పేర్కొన్నారు. ఈ దేశాలు పెట్టుబడులు, వాణిజ్య సహకారంలో కలిసికట్టుగా ముందుకు వెళ్తున్నాయన్నారు. ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో మూడు రోజులపాటు జరిగిన ఆసియాన్‌ దేశాల ఉన్నతస్థాయి అధికారుల శిక్షణ ముగింపు కార్యక్రమంలో మంగళవారం ఆయన మాట్లాడారు. భారత్‌ ఐటీ రంగంలో సాధించిన విజయాలను ఆసియాన్‌ దేశాలకు విస్తరించాలని పేర్కొన్నారు.
* ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం సుకుమా జిల్లాలోని చింతల్‌నార్‌-జేగురుగుడా పోలీస్‌స్టేషన్‌ల పరిధిలోని అటవీ ప్రాంతాల్లో మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు.
*చంద్రన్న పెళ్లి కానుక కింద భవిష్యత్తులో అందరికీ రూ.లక్ష ఇస్తానని ఆళ్లగడ్డ నుంచి హామీ ఇస్తున్నాని చంద్రబాబు పేర్కొన్నారు. కర్నూలు జిల్లాలోని ఆళ్లగడ్డ, నంద్యాల, కర్నూలులో ఆయన మాట్లాడుతూ డ్వాక్రా మహిళలకు త్వరలో చరవాణులను అందిస్తామని చెప్పారు. 4వ, 5వ విడతల రుణమాఫీ సొమ్మును ఏప్రిల్లో వారి ఖాతాల్లో జమ చేస్తామన్నారు.నంద్యాల వ్యవసాయ కళాశాలను విశ్వవిద్యాలయంగా మారుస్తానన్నారు.
*రహదారి ప్రమాదాల్లో బాధితులకు సత్వర పరిహారం అందించడంలో జరుగుతున్న జాప్యంపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది. పరిహారం చెల్లింపులకు సంబంధించి ఏళ్ల క్రితం సుప్రీంకోర్టు మార్గదర్శకాలు జారీచేసినా తెలంగాణతో సహా ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని పేర్కొంది. బాధితులకు పరిహారం చెల్లింపు వ్యవహారంలో మోటారు వాహన చట్టం-1988 సెక్షన్‌ 158(6) సక్రమంగా అమలుకాకపోవడంతో హైకోర్టు సుమోటో ప్రజాప్రయోజన వ్యాజ్యంగా పరిగణనలోకి తీసుకుంది.
*లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్థులు వేసిన నామినేషన్లలో నిబంధనల ప్రకారం లేని 141 తిరస్కరణకు గురయ్యాయి. 17 స్థానాలకు 505 మంది నామినేషన్లు సరైనవిగా ఎన్నికల అధికారులు గుర్తించారు. నిజామాబాద్‌ నుంచి 203 మంది 245 సెట్ల నామినేషన్లు వేయగా 12 తిరస్కరించారు. ఈ స్థానం నుంచి 191 మంది అభ్యర్థుల నామినేషన్లు మాత్రమే సరైనవిగా తేలాయి.
*పెట్టుబడి మొత్తాలను సమీకరించడంలో తెలంగాణ ముందడుగు వేసిందని రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ తెలిపారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ సంస్థలు పలు పరిశ్రమల స్థాపనకు మరింత ముందుకొస్తున్నాయని చెప్పారు. పెట్టుబడుల సాధన, వాణిజ్య నిర్వహణ, ఉద్యోగ సృష్టి, ఆర్థిక వృద్ధికి పరస్పర సహకారంపై మంగళవారం బ్రిటన్‌-భారత వాణిజ్య మండలి(యూకేఐబీసీ)తో ప్రభుత్వం హైదరాబాద్‌లో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.
*తెలంగాణలో వ్యవసాయ రంగంలో తీసుకొచ్చిన విధానాలు, రైతుల కోసం ప్రవేశపెట్టిన పథకాలు ఆకట్టుకున్నాయని జర్మనీ ఆహార, వ్యవసాయ శాఖ పార్లమెంట్‌ స్టేట్‌ సెక్రటరీ (సహాయమంత్రి) మైఖెల్‌స్టబ్జెన్‌ పేర్కొన్నారు.
*ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏపీటీఎఫ్‌ 257 సంఘం తరఫున పోటీ చేసిన పాకలపాటి రఘువర్మ విజయం సాధించారు. ద్వితీయ ప్రాధాన్యత ఓటుతో తన సమీప ప్రత్యర్థి, పీఆర్‌టీయూ తరఫున పోటీచేసిన సిట్టింగ్‌ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడిపై రఘువర్మ గెలుపొందారు. ఈ నెల 22న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోలైన ఓట్లను మంగళవారం విశాఖలోని స్వర్ణభారతి ఇండోర్‌ స్టేడియంలో లెక్కించారు.
*ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రకటించిన కనీస ఆదాయ పథకం ప్రపంచంలోనే అతిపెద్ద దారిద్య్ర నిర్మూలన పథకం అవుతుందని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ పేర్కొన్నారు. దీనిద్వారా దేశంలో దాదాపు 5 కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు. కాంగ్రెస్‌ ఈ పథకం ప్రకటించడంతో భాజపాలో వణుకు పుడుతోందని.. అందుకే ఆ పార్టీ నేతలు చౌకబారు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. కిసాన్‌సెల్‌ జాతీయ ఉపాధ్యక్షుడు ఎం.కోదండరెడ్డి, సికింద్రాబాద్‌ లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థి అంజన్‌కుమార్‌ యాదవ్‌లతో కలిసి శ్రవణ్‌ మంగళవారం గాంధీభవన్‌లో మాట్లాడారు.
*తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ)కు నాలుగు జాతీయ పురస్కారాలు వచ్చాయి. పలు విభాగాల్లో అసోసియేషన్‌ ఆఫ్‌ స్టేట్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అండర్‌ టేకింగ్స్‌ (ఏఎస్‌ఆర్‌టీయూ) ఏటా అందజేసే ప్రతిష్ఠాత్మక పురస్కారాల్లో టీఎస్‌ఆర్టీసీ సత్తాచాటింది.
*ఈ కారును చూశారా.. ముందు భాగంలో ‘గవర్నమెంట్‌ ఆఫ్‌ ఇండియా’ అని రాసి ఉండడంతో ఇదేదో కేంద్ర ప్రభుత్వ అధికార ప్రముఖులకు చెందినదేమో అనిపిస్తుంది.. అద్దంపై ‘సాక్షి’ టీవీ ఛానల్‌ పేరుతో ఉన్న స్టిక్కర్‌ చూస్తే వారికి సంబంధించినదేమో అనే సందేహమూ వస్తుంది. ఇలాంటి అనుమానాలతో చుట్టుతిరిగి చూడబోతూ వెనక్కు వెళితే ఇదే కారు వెనుక భాగంలో అద్దంపై ‘పోలీస్‌’ అని రాసి ఉంది. హైదరాబాద్‌లోని లోటస్‌ పాండ్‌ వద్ద మంగళవారం కనిపించిన ఈ విచిత్రమైన కారు వ్యవహారమేంటో చూద్దామని రవాణాశాఖ వెబ్‌సైట్‌లో పరిశీలిస్తే దీనిపై హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో 10 ట్రాఫిక్‌ ఉల్లంఘన కేసులు నమోదైనట్లు కనిపించింది. మొత్తం రూ. 4,550 వరకు అపరాధరుసుం చెల్లించాల్సి ఉంది. దీని యజమాని నలబోలు నీరజారెడ్డి అని ఆర్టీఏ వెబ్‌సైట్‌ ద్వారా తెలుస్తోంది.
*రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడూళ్ల బయ్యారం, నిజామాబాద్‌ జిల్లా మక్లూరు మండలం లక్మాపూర్‌లలో గరిష్ఠంగా 40.8 డిగ్రీల సెల్సియస్‌ చొప్పున అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం సర్వాపూర్‌, మద్నూరు మండలం సొంపూర్‌, ఆదిలాబాద్‌ జిల్లా బేల, జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నేరెళ్ల, నిర్మల్‌ జిల్లా బైంసా మండలంలో 40.7 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సొసైటీ(టీఎస్‌డీపీఎస్‌) ఒక ప్రకటనలో తెలిపింది.
*అంతరిక్ష పరిజ్ఞానంపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఉద్దేశించిన యువ శాస్త్రవేత్తల కార్యక్రమానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇస్రో ఈ ఏడాది నుంచి వైజ్ఞానిక కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వ విజన్‌ అయిన జై విజ్ఞాన్‌, జై అనుసంధాన్‌ పేరుతో అమల్లోకి తెచ్చింది
*వివాదాస్పదమైన రంగారెడ్డి జిల్లా మియాపూర్‌ భూముల వ్యవహారంలో జీపీఏ రిజిస్ట్రేషన్లను రద్దుచేస్తూ శేరిలింగంపల్లి ఎమ్మార్వో ఇచ్చిన ఉత్తర్వులను సోమవారం హైకోర్టు సమర్థించింది. కోట్ల రూపాయల విలువ చేసే భూములు అక్రమ పద్ధతుల ద్వారా అన్యాక్రాంతం కావడానికి వీల్లేదని, ఈ వ్యవహారంపై కోర్టులు కళ్లు మూసుకుని ఉండలేవని పేర్కొంది.
*కింది కోర్టు వెలువరించిన తీర్పులపై అప్పీలు దాఖలు చేసుకోవడానికి గడువు నిర్దేశించే ఎన్‌ఐఏ చట్టంలోని సెక్షన్‌ 21(5)ను సవాలు చేస్తూ మక్కా మసీదు పేలుళ్ల బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. పేలుళ్లలో చనిపోయిన వ్యక్తి తండ్రి ఉస్మాన్‌ షరీఫ్‌, భార్య సయ్యదా షాఫియాలు దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ టీబీఎన్‌ రాధాకృష్ణన్‌, జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.
*రాష్ట్రంలో జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల నియామకాలకు మార్గం సుగమమైంది. ప్రభుత్వ స్క్రీనింగ్‌ కమిటీ పరిశీలన తర్వాత కార్యదర్శుల ఎంపికలు, నియామకాలను చేపట్టుకోవచ్చని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
*విరసం నేత వరవరరావు విడుదల కోరుతూ ఆయన సతీమణి హేమలత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి బహిరంగ లేఖ రాశారు. లేఖ ప్రతిని మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విద్యావేత్త చుక్కా రామయ్య, సీనియర్‌ పాత్రికేయులు పొత్తూరి వెంకటేశ్వరరావు తదితరులు విడుదల చేశారు.
*రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మరోసారి చంద్రబాబే అధికారంలోకి రావాలని పింఛనుదార్లు, తటస్థులు, మేధావులు, ప్రైవేటు ఉపాధ్యాయ, పారిశ్రామిక సంఘాల నాయకులు ఆకాంక్షించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కలిస్తే తప్పేంటని ప్రతిపక్షనేత జగన్‌ వ్యాఖ్యానించడాన్ని నిరసిస్తూ వీరంతా నల్లబ్యాడ్జీలు ధరించి మంగళవారం ఉండవల్లిలోని ప్రజావేదికలో సీఎంను కలిశారు. రాష్ట్రాభివృద్ధి కోసం మరోసారి తెదేపా అధికారంలోకి రావాలని, ఇందుకు తమ మద్దతు ఉంటుందని వారు సీఎంకు హామీ ఇచ్చారు.
*అంతరిక్ష పరిజ్ఞానంపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఉద్దేశించిన యువ శాస్త్రవేత్తల కార్యక్రమానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) నోటిఫికేషన్‌ విడుదల చేసింది.
* పోలవరం నిర్మాణ ప్రగతిని ఏప్రిల్‌ 15న స్వయంగా ప్రాజెక్టుకు వచ్చి సమీక్షించాలని డ్యాం డిజైన్‌ రివ్యూ కమిటీ నిర్ణయించింది. కాఫర్‌డ్యాం పనుల వేగం పెంచవలసి ఉందని స్పష్టం చేసింది. దిల్లీలో మంగళవారం డీడీఆర్‌పీ సమావేశం జరిగింది.
*జాతీయస్థాయిలో ప్రదానం చేసే అసోసియేషన్‌ ఆఫ్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అండర్‌టేకింగ్స్‌ (ఏఎస్‌ఆర్‌టీయు) ఉత్పాదక విన్నర్‌ అవార్డులు రెంటిని ఏపీఎస్‌ఆర్టీసీ సాధించింది. దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ రవాణా సంస్థల్లో అత్యుత్తమ సామర్థ్యం చూపినందుకు 2017-18 ఏడాదికి ఈ అవార్డులు దక్కాయి.
*పదవీ విరమణ రోజునే ఉద్యోగికి అందాల్సిన ప్రయోజనాలు దక్కేలా చర్యలు తీసుకున్నట్లు ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబు తెలిపారు. గతంలో ఏడాదికి రెండు సార్లు(జనవరి, జులై) మంజూరయ్యే డీఏను ఎప్పటికప్పుడు అందిస్తున్నామని మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
*సుప్రీంకోర్టు దివంగత న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.బి.సిన్హాకు హైకోర్టు ఘన నివాళి అర్పించింది. ఇటీవల తుదిశ్వాస విడిచిన జస్టిస్‌ ఎస్‌.బి.సిన్హాకు నివాళులర్పించేందుకు మంగళవారం హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌ నేతృత్వంలో హైకోర్టు న్యాయమూర్తులందరూ మొదటి కోర్టు హాలులో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
*మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గానికి సంబంధించి 40మంది అభ్యర్థులు 62 నామినేషన్లు దాఖలు చేశారు. మంగళవారం ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులు నామినేషన్ల పరిశీలన(స్ర్కూట్నీ) నిర్వహించారు. వాటిలో ఎన్నికల నిబంధనల మేరకు నామినేషన్లు వేయని 27 మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. 13 నామినేషన్లను సక్రమంగా ఉండటంతో ఎన్నికల అధికారులు ఆమోదించారు.
* సుప్రీం కోర్టు దివంగత న్యాయమూర్తి జస్తేస్ట్ ఎస్.బీ.సిన్హాకు నివాళ్ళు అర్పించేందుకు మంగళవారం హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి సి. ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో హైకోర్టు న్యాయమూర్తులందరూ మొదటి కోర్టు హాలులో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
*బెంగళూరు దక్షిణ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేయబోనని కేంద్ర మాజీ మంత్రి దివంగత అనంత కుమార్ సతీమణి తేజస్విని అనతకుమార్ స్పష్టం చేశారు. ఈ స్థానం నుంచి తేజస్విని సూర్యకు పార్టీ టికెట్ ఇవ్వటంతో అనంత కుమార్ అభిమానులందరూ తేజస్విని ఇంటి వద్దకు చేరి స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేయాలనీ పట్టుబట్టారు. వీరిని సముదాయించిన తేజస్విని అసంతృప్తి పక్కన పెట్టి భాజపాకు మద్దతుగా పని చేయాలనీ నూచించారు అదే సమయానికి పార్టీ అభ్యర్ధి తేజస్విని సూర్య ఆమె ఇంటికి చేరుకొని ఆశీర్వచనాలు తీసుకుని వెళ్లారు.
*పదవీ విఅరమణ రోజునే ఉద్యోగికి అనడల్సిన ప్రయోజనాలు దక్కేలా చర్యలు తీసుకున్నట్లు ఆర్టీసీ ఎండీ సురేంద్ర బాబు తెలిపారు. గతంలో ఏడాదికి రెండు సార్లు మంజూరయ్యే డీఏను ఎప్పటికప్పుడు అందిస్తున్నామని మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
*ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కోన ఆంధ్రప్రదేశ్ కు రూ 313.88కోట్లు మంజూరు చేస్తూ కేంద్ర పట్టనాభివృద్ది శాఖ ఉత్తర్వ్యులు జరీ చేసింది. 2018-19 ఆర్ధిక సంవత్సరం సంబంధించి రెండో విడత కేంద్ర సాయంగా ఈ మొత్తాన్ని మంజూరు చేస్తున్నట్లు పేర్కొంది.
*ముఖ్యమంతి స్థానిక శాసనసభ్యుడు కుప్పం ససనసభాస్ స్థానం తెదేపా అభ్యర్ధి చంద్రబాబు నాయుడు తరపున నామినేషన్ దాఖలుకు చంద్రన్న హుండీల ద్వారా ప్రజల నుంచి సేకరించిన విరాళాలను లెక్కించగా రూ.21,54,960 వచ్చిందని సిఎం వ్యక్తిగత సహాయకులు మనోహర్ వెల్లడించారు. స్థానిక తెదేపా కార్యాలయంలో మంగళవారం హుండీలను లెక్కించారు. నియోజకవర్గంలో నాలుగు మండలాల పరిధి ప్రజలు చంద్రబాబు నామినేషన్ లో భాగస్వాములు కావాలని భావించి చంద్రన్న హుండీలలో విరాళాలు వేశారన్నారు. కుప్పంలో ఆనవాయితీగా ప్రకారం నామినేషన్ వేయడం నుంచి ఎన్నికల ప్రచారం వరకు విరాళాలుగా సేకరించిన సొమ్మునే వెచ్చిస్తున్నట్లు ఆయన వివరించారు. గత ఎన్నికల్లో చంద్రన్న హుండీ ద్వారా రూ. 18,17,260రాగా ఈసారి ఆ మొత్తం పెరిగిందన్నారు.
*విజయవాడ పార్లమెంటు వైకాపా అభ్యర్ధి పొట్లూరి వీర ప్రసాద్ చిత్రంతో ఉన్న బిల్లులు లేని టీ షరతులను మంగళవారం ఉదయం కృష్ణాజిల్లా మైలావ్రంలో అధికారులు పట్టుకున్నారు. విజయవాడ నుంచి ట్రాన్స్ పోర్టు లారీ ద్వారా వచ్చిన ఏడు కట్టలను ప్రభుత్వ పశువుల ఆసుపత్రి ఎదుట గల ఒక దుకాణం ముందు రహదారి పక్కనే దింపారు. విషయం తెలుసుకున్న ఎంపీ డీవో నాగేశ్వరరావు వెళ్లి వాటిని స్వాదీనం చేసుకున్నారు. వాటికి బిల్లులు చూపించక పోవడంతో ఎన్నికల ప్రత్యెక బృందానికి అందజేశారు. ఒక్కో కట్టలో 500టీ షర్టులున్నాయి. ఒక్కో టీ షర్టు విలువ రూ. వంద ఉంటుందని అంచనా వేశారు. వాటిని పోలీసులకు స్వాదీనపరిచినట్లు ఎన్నికల ప్రత్యెక బృందం అధికారి రవిశంకర్ తెలిపారు.

డాలర్ కన్నా తెరాస కండువకే విలువ ఎక్కువ

అమెరికన్‌ డాలర్‌ కన్నా ప్రస్తుతం గులాబీ కండువాకే విలువెక్కువుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. సోమవారం మిర్యాలగూడలోని నల్లగొండ పార్లమెంట్‌ నియోజకవర్గ ఎన్నికల సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలోనే కాదు, దేశంలో ఎక్కడైనా గులాబీ కండువాకే విలువెక్కువుందన్నారు. అందుకే కాం గ్రెస్‌ కండువాలు బండకేసి కొట్టి గులాబీ కండువా కప్పుకుంటున్నారని అన్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థులు గెలుస్తామని ధీమా వ్యక్తం చేయడం కాదని, డిపాజిట్లు దక్కించుతాయో లేదో చూసుకోవాలన్నారు. టీఆర్‌ఎస్‌ పై చంద్రబాబునాయు డు మాట్లాడిన మాటలకు ఎన్‌టీఆర్‌ ట్రస్టు భవన్‌కు తాళం వేసుకోవల్సి వచ్చిందన్నారు. అదేవిధంగా ఈ ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌ పార్టీ ఖతం అవుతుందని, గాంధీభవన్‌కు తాళం వేసి వాచ్‌మెన్‌కు తాళం చెవి ఇచ్చి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా వెళ్తారని చమత్కరించారు.నల్లగొండ కాంగ్రెస్‌ పార్టీ కంచుకోట కాదని, అది మంచుకొండగా కరిగిపోతుందన్నారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్ధి వేమిరెడ్డి నర్సింహారెడ్డిని చెల్లని రూపాయి అని చెప్పిన ఉత్తమ్‌ రాష్ట్రంలో చెల్లని రూపాయలైన రేవంత్‌రెడ్డి, వంశీచందర్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, చంద్రశేఖర్, మల్లు రవికి ఎలా టికెట్లు ఇచ్చారన్నారు. బోఫోర్స్, రాఫెల్‌ కుంభకోణాలు తప్ప కాంగ్రెస్, బీజేపీలు ప్రజలకు మేలు చేయలేదన్నారు. రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణాలో 16 ఎంపీ సీట్లు టీఆర్‌ఎస్‌ గెలుస్తుందని ధీమా వ్య క్తం చేశారు. రెండు పర్యాయాలు తనను గెలిపిం చినట్లుగానే టీఆర్‌ఎస్‌ అభ్యర్ధి వేమిరెడ్డి నర్సింహారెడ్డిని గెలిపించాలని కోరారు. సభాద్యక్షత వహించిన స్థానిక ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు మాట్లాడుతూ ఈ నెల 29వ తేదీన నిర్వహించే కేసీఆర్‌ బహిరంగసభతో నర్సింహారెడ్డి గెలుపుఖాయం కావాలన్నారు. ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి నర్సింహారెడ్డి మాట్లాడుతూ తనను గెలిపిస్తే ప్రజలందరికీ అందుబాటులో ఉంటానన్నారు. సమావేశంలో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పార్లమెంట్‌ నియోజకవర్గ కన్వీనర్‌ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి, మిర్యాలగూడ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ తిరునగరు నాగలక్ష్మీభార్గవ్, టీఆర్‌ఎస్‌ పట్టణ, మండల అధ్యక్షులు తిరునగరు భార్గవ్, చింతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, ఎన్‌బీఆర్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపక అద్యక్షుడు నల్లమో తు సిద్ధార్థ, మిర్యాలగూడ ఎంపీపీ నూకల సరళా హనుమంతరెడ్డి, జెడ్పీటీసీ నాగలక్ష్మి, దామరచర్ల ఎంపీపీ మంగమ్మ, నారాయణరెడ్డి, చిర్రమల్లయ్య, మోసిన్‌అలీ, చిట్టిబాబు, నాగార్జునచారి, ఎడవెల్లి శ్రీనివాస్‌రెడ్డి, జొన్నలగడ్డ రంగారెడ్డి, డి.కళావతి, పి.పద్మావతి పాల్గొన్నారు.

వేలాది మందికి ఇళ్లు ఇప్పించారు. ఆయన అనాథాశ్రమంలో ఉంటున్నారు.

పోరాటాల ద్వారా వందల ఎకరాల భూములు పేదలకు అందేలా చేశారు. ఆయనకు మాత్రం ఎకరా భూమి లేదు! వేలాది మందికి స్థలాల పట్టాలు ఇప్పించినా సొంత ఇల్లు కట్టుకోలేదు. నలుగు సార్లు శాసనసభకు ఎన్నికైనా చిల్లిగవ్వ వెనకేసుకోలేదు. తన పోరాటాలకు అడ్డని భావించి చివరికి సంతానాన్నీ వద్దనుకున్నారు. ఏడాది క్రితం వరకు గుడిసెలోనే జీవించిన ఆయన..ప్రస్తుతం వృద్ధాశ్రమంలో ఆశ్రయం పొందుతున్నారు. ఇది పాటూరి రామయ్య ప్రస్థానం. కృష్ణా జిల్లా నిడుమోలు నియోజకవర్గానికి(ప్రస్తుతం పామర్రు) నాలుగు సార్లు ప్రాతినిధ్యం వహించిన ఆయన స్వగ్రామం నెల్లూరు జిల్లా జలదంకి మండలంలోని జమ్ములపాలెం. ఎక్కడ నెల్లూరు..ఎక్కడ కృష్ణా. అక్కడ పుట్టి..ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేయడమేమిటి? ఇది ఎలా సాధ్యమైంది? అనే సందేహాలు రాక మానవు. ఇవే ప్రశ్నలు ఆయన్నడిగితే ‘‘పుచ్చలపల్లి సుందరయ్య స్ఫూర్తి..నా పోరాటం’’ తనను ఇక్కడికి రప్పించాయని సమాధానమిచ్చారు. తన జీవితంలో ఎత్తుపల్లాలను ఇలా వివరించారు.
**పుట్టినప్పట్నుంచి పోరాటమే
‘‘తల్లిదండ్రులకు నేనొక్కడినే సంతానం. నేను పుట్టిన తర్వాత అమ్మ కన్నుమూసింది. అక్కడే వీధి బడిలో అయిదో తరగతి వరకు చదివా. కావలి ఏబీఎం పాఠశాలలో మూడో ఫారం, జిల్లా బోర్డు హైస్కూల్‌లో అయిదో ఫారం చదివా. అప్పుడే నాన్న చనిపోయారు. హైస్కూల్‌లో ఉన్నప్పుడే విద్యార్థి ఉద్యమాల పట్ల ఆకర్షితుడినయ్యా. తర్వాత కావలిలో పీయూసీ వరకు చదివా. 1967లో జనశక్తి పత్రికలో ప్రూఫ్‌రీడర్‌ ఉద్యోగంలో చేరా. తర్వాత ఎడిటోరియల్‌ బోర్డులోకి వచ్చా. అక్కడ పనిచేస్తూనే వ్యవసాయ కార్మిక సంఘం తాలూకా వ్యవస్థాపక అధ్యక్షుడిగానూ బాధ్యతలు తీసుకున్నా. ‘పార్టీలో పూర్తి కాలం పనిచేద్దువుగాని రమ్మంటూ’ పుచ్చలపల్లి సుందరయ్య విజయవాడ తీసుకొచ్చారు. వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో పర్యటించా. ఆ సంఘానికి రాష్ట్ర, జాతీయ అధ్యక్షునిగా పని చేశా. భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడి రైతులకు పట్టాలు అందేలా కృషి చేశా.
**ఎమ్మెల్యే అవుతాననుకోలేదు..!
అసలు ఎమ్మెల్యే అవుతాననుకోలేదు. 1985లో సుందరయ్య పిలిచి నిడుమోలు నుంచి పోటీ చేయాలని సూచించారు. నా దగ్గర డబ్బు లేదు. దేవాలయ భూములు, చల్లపల్లి జమిందారీ భూములు, చేనేత కార్మికుల సమస్యలపై పోరాటం చేసిన అనుభవమే ఉంది. అదే బలంతో ఇల్లుల్లూ తిరిగి నన్ను నేను ఓటర్లకు పరిచయం చేసుకున్నా. అదే నన్ను గెలిపించింది. 1985 నుంచి 2004 వరకు వరుసగా పోటీ చేశా. 1999 మినహా నాలుగు సార్లు గెలిచా. 1965లో మహాలక్ష్మిని వివాహం చేసుకున్నా. పిల్లలు వద్దనుకుని కు.ని. శస్త్రచికిత్స చేయించుకున్నా. కొన్నేళ్ల క్రితం భార్య చనిపోయింది. ఏడాది క్రితం వరకు గుడిసెలో ఉండేవాణ్ని. ఆరోగ్యం సహకరించకపోవడంతో ప్రస్తుతం ఉయ్యూరులోని రోటరీ వృద్ధాశ్రమంలో ఆశ్రయం పొందుతున్నా.
**నిజాయతీపరులైన నేతలు అవసరం
నేటి రాజకీయాల్లో సేవను ఆశించలేం. అధికారం కోసమే అందరూ ఆశ్రిత పెట్టుబడి విధానం అవలంబిస్తున్నారు. కష్టపడకుండా డబ్బు రావాలనేదే దీని ముఖ్య ఉద్దేశం. డొల్ల కంపెనీలు, నీకిది-నాకది (క్విడ్‌ప్రోకో) ఇవన్నీ దీని కిందకే వస్తాయి. వామ పక్షాలు ఆదరణ కోల్పోవడానికి చారిత్రక కారణాలు ఉన్నాయి. కమ్యూనిజం భావజాలం మాత్రం ఉనికి కోల్పోలేదు. ఉద్యమమే నాయకుడిని సృష్టిస్తుంది. ప్రపంచంలో ఆకలిదప్పులు, పేదరికం, నిరుద్యోగ సమస్యను పూర్తిగా పరిష్కరించే వ్యవస్థ రావాలి. నిజాయతీపరులైన నేతల్ని ప్రజలు ఎన్నుకోవాలి.

గోదారి రాజకీయం…కుటుంబాల సమ్మేళనం

పాడిపంటలు, ఆక్వా సిరులతో అలరారే నరసాపురం పార్లమెంటు స్థానం ప్రత్యేకతలకు పెట్టింది పేరు. ఈసారి ఎన్నికల్లో ఈ లోక్‌సభ, దీని పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో పలువురు బంధువులు ఒకే పార్టీ తరఫునా, ప్రత్యర్ధులుగానూ పోటీ చేస్తుండడం ఆసక్తి కరంగా మారింది. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ నరసాపురం లోక్‌సభ స్థానం పరిధిలోని భీమవరం నుంచి అసెంబ్లీకి.. ఆయన అన్నయ్య సినీ నటుడు నాగబాబు లోక్‌సభ స్థానానికి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.భాజపాలో వియ్యంకులు: మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు లోక్‌సభ అభ్యర్థిగా.. ఆయన వియ్యంకుడు గట్టిం మాణిక్యాలరావు తాడేపల్లిగూడెం అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్నారు.కాంగ్రెస్‌ నుంచి బాబాయ్‌.. వైకాపా తరఫున అబ్బాయ్‌: మాజీ మంత్రి కనుమూరి బాపిరాజు కాంగ్రెస్‌ తరఫున.. ఆయన అన్న కుమారుడు కనుమూరి రఘురామకృష్ణంరాజు వైకాపా తరఫున ఎంపీ స్థానానికి తలపడుతున్నారు. ఇక్కడ తెదేపా లోక్‌సభ అభ్యర్థి వేటుకూరి శివరామరాజుది ఉండి నియోజకవర్గం కలవపూడి. అదే గ్రామానికి చెందిన ఆయన స్నేహితుడు మంతెన రామరాజు (రాంబాబు) ఉండి అసెంబ్లీ అభ్యర్థిగా తెలుగుదేశం తరఫున పోటీ చేస్తున్నారు.

అబద్ధం ఆడారని కేసీఆర్‌పై కేసు

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఎన్నికను సవాలు చేస్తూ దాఖలైన ఎన్నికల పిటిషన్‌ను మంగళవారం హైకోర్టు విచారణకు స్వీకరించింది. ప్రతివాదులైన కేసీఆర్‌తోపాటు పోటీ చేసిన వంటేరు ప్రతాప్‌రెడ్డి, బరిలో ఉన్న అందరు అభ్యర్థులకు, గజ్వేల్‌ నియోజకవర్గం రిటర్నింగ్‌ అధికారికి నోటీసులు జారీ చేసింది. నిబంధనల ప్రకారం నామినేషన్‌ దాఖలు చేయలేదని, నామినేషన్‌తోపాటు దాఖలు చేసిన అఫిడవిట్‌లో వాస్తవాలు తొక్కిపెట్టిన కేసీఆర్‌ ఎన్నికను రద్దు చేయాలంటూ సిద్దిపేట జిల్లా ములుగు మండలం మామిడ్యాల గ్రామానికి చెందిన టి.శ్రీనివాస్‌ పిటిషన్‌ను దాఖలు చేశారు. దానిపై మంగళవారం జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌ విచారణ చేపట్టారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ప్రజాప్రాతినిధ్య చట్టంలోని నిబంధనల ప్రకారం నామినేషన్‌ దాఖలు చేయలేదన్నారు. అయినా నామినేషన్‌ను రిటర్నింగ్‌ అధికారి స్వీకరించారని ఆరోపించారు. ఫారం-26 అఫిడవిట్‌లో 64 కేసులకు బదులు 2 కేసులు మాత్రమే ఉన్నాయని పేర్కొన్నారన్నారు. తరువాత కేసుల సంఖ్యను సవరించి ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో ఉంచారని వివరించారు. కేసుల వివరాలను కూడా పేర్కొనలేదని, అభియోగాల నమోదు ప్రక్రియ జరిగిందా లేదా అన్నదానికి కూడా సమాధానం చెప్పకుండా తెలియదనడం ఓటర్లను తప్పుదోవ పట్టించడమేనన్నారు. ఆదాయపు పన్ను రిటర్నులలో పేర్కొన్న వ్యవసాయ ఆదాయం రూ. 91,52,657 గురించి చెప్పలేదన్నారు. వాదనలను విన్న న్యాయమూర్తి పిటిషన్‌ను విచారణకు స్వీకరించి ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ విచారణను 4 వారాలకు వాయిదా వేశారు.

ఏపీలో ఐపీఎస్ బదిలీలు

ఇంటెలిజెన్స్ ఏడీజీ వెంకటేశ్వర రావును ఎన్నికల విధుల నుంచి తప్పించిన కేంద్ర ఎన్నికల సంఘం.

శ్రీకాకుళం ఎస్పీ వెంకటరత్నం, కడప ఎస్పీ రాహుల్ దేవ్ శర్మలను ఎన్నికల విధుల నుంచి తప్పించిన ఈసీ.

హెడ్ క్వార్టర్ కు అటాచ్ చేస్తూ నిర్ణయం.

వీరికి ఎటువంటి ఎన్నికల పనులు అప్పగించొద్దని ఈసీ ఆదేశం.

వీరి స్థానాల్లో తదుపరి సీనియర్ అధికారులకు బాధ్యతల అప్పగింత.

వైకాపాలో జేరిన మోహన్ బాబు

ఏ పదవీ ఆశించి తాను వైకాపాలో చేరడం లేదని నటుడు మంచు మోహన్‌ బాబు స్పష్టం చేశారు. జగన్‌ ముఖ్యమంత్రి అయితే ఏపీ ప్రజలకి మంచి జరుగుతుంది అని మాత్రమే పార్టీలో చేరాను అని చెప్పారు. వైకాపాలో చేరిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నిజంగా పదవులపై మోహం ఉండుంటే 15 ఏళ్ల క్రితం రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడే ఏదో ఒక పదవిలో ఉండేవాడినని అన్నారు. ‘‘ఫీజు రీయిబర్స్‌మెంట్‌ విషయంలో చంద్రబాబుతో ఎన్నో సార్లు మాట్లాడాను. ఇప్పటివరకూ మా విద్యాసంస్థకు రూ.19 కోట్ల బకాయిలు రావాలి. ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ అనుకున్న సమయానికి ఇవ్వాలి. ముఖ్యమంత్రి అయ్యాక చంద్రబాబు మూడు నెలలకోసారి ఇస్తానన్నారు. కానీ సక్రమంగా ఇవ్వలేకపోయారు. దీని ప్రభావం వల్ల కొన్ని కాలేజీల్లో జీతాలివ్వలేకపోవచ్చు. కానీ నేను మాత్రం సొంత ఆస్తులు తాకట్టు పెట్టి మరీ జీతాలిచ్చాను. నా ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను కూడా కదిలించాను. ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వనప్పుడు మీరు సహకరించాలని తల్లిదండ్రులను పిలిచి చెప్పాను. మాకు తెలంగాణ ప్రభుత్వం నుంచి ఏ బాకీ లేదు. సక్రమంగానే ఉప్పల్‌లో విద్యా సంస్థ నడుపుతున్నాం. పంచభూతాల సాక్షిగా చెప్తున్నాను. ఇవి నేను భయపడి చేస్తున్న వ్యాఖ్యలు కాదు. తెలంగాణ ప్రభుత్వం ఎవరి మీదా దాడులు చేయలేదు’’ అని మోహన్‌ బాబు అన్నారు. జగన్‌ ఏపీలో స్వీప్‌ చేస్తారని, ఆయనే ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పారు. చంద్రబాబు వందేళ్లు సంతోషంగా బతకాలని కోరుకుంటున్నానని, కానీ ఎన్నికల్లో ఓడిపోవాలని ఆశిస్తున్నానని వ్యాఖ్యానించారు.