రాయపాటి విజయానికి భరోసా ఇచ్చిన కోమటి జయరాం

ఉత్తర అమెరికాలో తెలుగువారి అతి పెద్ద సంఘమైన తానా తమ పూర్తి మద్దతు తెలుగుదేశం పార్టీకే నని తానా మాజీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర అమెరికా ప్రత్యేక ప్రతినిధి అయినా కోమటి జయరాం పేర్కొన్నారు. శనివారం నాడు ఆయన నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు తో గుంటూరు లోని ఆయన నివాసంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు ఎన్నికల ప్రచార విశేషాలపై కొంతసేపు చర్చించుకున్నారు. ఉత్తర అమెరికాలో 35 సంవత్సరాలకు పైగా విద్య , సాంస్కృతిక , సాంఘిక రంగాల్లో విశిష్ట సేవలు తానా అందించడం జరుగుతుందని, భవిష్యత్ ప్రయోజనాల కోసం చంద్రబాబు నేతృత్వంలో తెలుగు దేశ ప్రభుత్వ ఏర్పాటుకు తానా సభ్యులు పూర్తిగా తమ మద్దతును ప్రకటించి ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం జరుగుతుందని ఈ సందర్భంగా కోమటి జయరాం ఎంపీ రాయపాటి వివరించారు. ఉత్తర అమెరికాలో IT ఇతర రంగాల్లో ఉన్న ఉద్యోగస్తులు రేపు జరగబోవు ఎన్నికల్లో ఓటు వేసి తెలుగు దేశ ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించేందుకు ప్రణాళిక రూపొందించుకోవాలని, అదే విధంగా ఇక్కడ ఉన్న తానా సభ్యులు గ్రామస్థాయిలో కి వెళ్లి తెలుగుదేశం ప్రభుత్వం అమలుపరిచిన వివిధ రకాల సంక్షేమ పధకాల కార్యక్రమాలను, మరియు భవిష్యత్ అభివృద్ధి కోసం చంద్రబాబు సారధ్యం యొక్క ఆవశ్యకతను ప్రతి ఒక్కరికి తెలిపి వారికి చైతన్యపరిచి తెలుగుదేశం ప్రభుత్వ ఏర్పాటుకు కృషి చేయాలని ఈ సందర్భంగా రాయపాటి సూచించారు.

అమెరికాలో…పెనమలూరు అమ్మాయిని మోసం చేసిన గోదావరి అబ్బాయి

మాక్కాబోయే అల్లుడు అమెరికాలో సాప్ట్‌వేర్ ఇంజనీరు.. లక్షల్లో జీతం.. బోల్డంత ఆస్తి కూడా ఉందండి.. పైగా పైసా కట్నం అక్కర లేదంటున్నారు.. నిజంగా మా అమ్మాయి ఎంత అదృష్టవంతురాలో కదండి.. అంటూ పక్కింటి కామాక్షమ్మ గారికి అడక్కుండానే అన్నీ చెప్పేస్తుంది ఓ మధ్యతరగతి ఇల్లాలు. కానీ ఆ సంబరం ఎంతో కాలం నిలవనీయట్లేదు ప్రస్తుత సంబంధాలు. అడిగినంత కట్నం ఇవ్వలేదనో.. కట్టుకున్న భార్య పట్ల మోజు తీరిపోయిందనో అమ్మాయిని వేధింపులకు గురి చేస్తున్నారు భర్తతో పాటు అత్తమామలు.కృష్ణా జిల్లా పెనమలూరుకు చెందిన సంధ్యారాణికి, అమెరికాలో సాప్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న భీమవరానికి చెందిన ధన్‌రాజ్‌తో 2017లో వివాహం జరిగింది. అమ్మాయి తల్లిదండ్రులు కట్నం కింద రూ.22 లక్షల నగదు, ప్లాటు, 30 తులాల బంగారం సమర్పించుకున్నారు అల్లుడుగారికి. పెళ్లయిన కొద్దిరోజులకే భార్యను ఇక్కడే ఉంచి అమెరికా వెళ్లిపోయాడు భర్త.వీసా పనులు పూర్తవ్వగానే వచ్చి తీసుకువెళతానని చెప్పాడు. అత్తారింట్లోనే ఉంటూ భర్త పిలుపుకై ఎదురుచూస్తోంది సంధ్యారాణి.అత్తగారి చేతిలో పోసిన రూ.22 లక్షల క్యాష్ సరిపోయినట్లు లేదు.. మీ నాన్న నీకిచ్చిన స్థలాన్ని అమ్మి డబ్బు తీసుకురమ్మంటూ అత్తామామ వేధించడం మొదలు పెట్టారు కోడలిని. వారి వేధింపులు తట్టుకోలేక ఆమె పుట్టింటికి వచ్చేసింది. తల్లిదండ్రుల వద్దకు వెళ్లిన దగ్గరనుంచి సంధ్యకు భర్తనుంచి ఫోన్ రాలేదు. వీసా గురించిన విషయాలేమీ తెలియట్లేదు.దీంతో అనుమానం వచ్చిన సంధ్య అమెరికాలో ఉంటున్న తనకు తెలిసిన వారికి ఫోన్ చేసి భర్త గురించి ఎంక్వైరీ చేయమంది. ధనరాజ్ అమెరికాలో కృష్ణావతారం ఎత్తినట్లు తెలుసుకుంది. తన భర్త అక్కడ ఇద్దరు మహిళలతో సహజీవనం చేస్తున్నట్లు తెలిసింది సంధ్యకి. విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకువెళ్లి భర్త, అత్తమామలపై పెనమలూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు.

మహాకూటమిపై వ్యాఖ్యానించడం తొందరపాటు

దేశానికి తిరిగి వచ్చి.. తన అవసరం ఉన్న చోట పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని ఆర్బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ తెలిపారు. ప్రస్తుతం ఉన్న స్థానంలో సంతోషంగా ఉన్నప్పటికీ తన అవసరం ఉన్నచోట పనిచేయడం గొప్ప అవకాశంగా భావిస్తానని వ్యాఖ్యానించారు. ఓ పుస్తకావిష్కరణ సభలో ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ముఖాముఖిలో ఆయన ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రానున్న ఎన్నికల్లో ప్రతిపక్షాలు టీఎంసీ, సమాజ్‌వాదీ పార్టీ, బీఎస్పీ, తెలుగుదేశం లాంటి పార్టీలు ఏర్పాటు చేసిన మహాకూటమి అధికారంలోకి వస్తే రాజన్‌ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో రాజన్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. దీనిపై రాజన్‌ను ప్రశ్నించగా ‘ఈ విషయంపై ఇప్పుడే స్పందించడం తొందరపాటు అవుతుంద’ని అభిప్రాయపడ్డారు. ఈసారి ఎన్నికలు భారత్‌కు ఎంతో కీలకమని.. దేశంలో నూతన సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో తనకు సలహాలు అందించే అవకాశం వస్తే సంతోషిస్తానన్నారు. కొంత మంది ఆర్థికవేత్తలతో కలిసి కొన్ని విధానాలను రూపొందించామన్నారు. వాటినే పుస్తక రూపంలో తీసుకువచ్చామన్నారు. ఆర్థికమంత్రిగా పనిచేసే అవకాశం వస్తే.. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టగలిగే స్వల్పకాల లక్ష్యాలపై దృష్టి సారిస్తానన్నారు. అలాంటి లక్ష్యాలనే పుస్తకంలో పొందుపరిచామన్నారు. అలాగే బ్యాంకింగ్‌ రంగంలోనూ పలు మార్పులు తీసుకువస్తాన్నారు. రైతాంగ సంక్షోభాన్ని తగ్గించేలా పటిష్ఠ వ్యవసాయ విధానాలను అమలు చేయాల్సి ఉందన్నారు. భూసేకరణ పద్ధతిలోనూ రాష్ట్రాలు అవలంబిస్తున్న మెరుగైన విధానాన్ని ఎంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయంలో రాష్ట్రాలకు అవసరమైన మేర స్వతంత్రం ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. ఇవే తన ప్రధాన్య అంశాలని రాజన్‌ వివరించారు. ఇదే ముఖాముఖిలో భారత ఆర్థిక వ్యవస్థ ఏడు శాతం వృద్ధితో పరుగులు తీస్తోందని ప్రభుత్వం ప్రకటించడంపై రాజన్‌ అనుమానాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఉద్యోగాల సృష్టి మందగించిన నేపథ్యంలో ఇంతటి వృద్ధి ఎలా సాధ్యమవుతుందని ఆయన ప్రశ్నించారు. ప్రస్తుత జీడీపీ గణాంకాలపై ఉన్న అనుమానాలను తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. అందుకోసం ఒక నిష్పాక్షిక వ్యవస్థ ఏర్పాటు చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. కనీస ఆదాయ పథకం రూపకల్పనలో భాగంగా రఘురామ్‌ రాజన్‌ లాంటి ఆర్థికవేత్తలను సంప్రదించామని రాహుల్‌ గాంధీ ప్రకటించారు. 2013 సెప్టెంబరు నుంచి సెప్టెంబరు 2016 మధ్య ఆర్బీఐ గవర్నర్‌గా రాజన్‌ విధులు నిర్వహించిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) ముఖ్య ఆర్థికవేత్తగా కూడా రాజన్‌ వ్యవహరించారు.

ఉగాండాలో హొలీ

ఉగాండా రాజధాని కంపాలాలో ఇండియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో..రాజస్థాన్ అసోసియేషన్ నిర్వహించిన హోలీ సంబరాలు ఘనంగా జరిగాయి. బాలీవుడ్ ప్లేబ్యాక్ సింగర్ శివంగి భయన హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. శివంగి తన పాటలతో హోరెత్తించారు. కంపాలలోని భారతీయులంతా ఒక్కచోట చేరి..హోలీ వేడుకలు జరుపుకున్నారు. చిన్నా పెద్దా అంతా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ..సంప్రదాయ పాటలకు నృత్యాలు చేస్తూ.. ఖండాంతరాల్లో మన దేశ సంస్కృతి, సంప్రదాయాలను చాటి చెప్పారు.

కాంగ్రెస్ పార్టీని గెలిపించండి-లండన్ ఎన్నారై కాంగ్రెస్

తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి అండగా నిలవాలని టీపీసీసీ ఎన్నారై సెల్ కోరింది. తెలంగాణ ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని టీపీసీసీ ఎన్నారై సెల్ లండన్‌లో నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా టీపీసీసీ ఎన్నారై సెల్ కన్వీనర్ తిరుపతి రెడ్డి, ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్(ఐఓసీ) కార్యదర్శి వీరేంద్ర, ఐఓసీ నేతలు గురమిందర్, రష్పాల్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తిరుపతి రెడ్డి మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌కి ఓట్లు వేయడం వల్ల తెలంగాణకి ఒరిగేది ఏమీలేదని, ప్రస్తుతం టీఆర్‌ఎస్‌లో చేరిన వారందరిని కలిపితే 15 ఎంపీలున్నా ఏం సాధించారని ప్రశ్నించారు. ఒక్క విభజన హామీని టీఆర్‌ఎస్‌ నెరవేర్చలేదని మండిపడ్డారు. 17 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులనే గెలిపించి తెలంగాణ ఇచ్చిన, తెచ్చిన కాంగ్రెస్‌కి అండగా నిలవాలని కోరారు. ఐఓసీ అధికార ప్రతినిధి, టీపీసీసీ కో కన్వీనర్ సుధాకర్ గౌడ్ మాట్లాడుతూ సచివాలయం రాకుండా ఇంట్లోనే ఉంటూ, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. 17 సీట్లలో కాంగ్రెస్‌ని గెలిపించి కేసీఆర్‌ సచివాయం ఎలా రారో చూద్దామన్నారు.

వర్జీనియాలో నాటా మహిళా దినోత్సవం

ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాటా) ఆధ్వర్యంలో ఆష్బర్న్‌, వర్జీనియా నగరాల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు అంగరంగ వైభంగా జరిగాయి. నాటా బోర్డ్ అఫ్ డైరెక్టర్ సుధారాణి కొండపు ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో 500 మంది మహిళలకు పైగా పాల్గొన్నారు. ఈ వేడుకల్లో మహిళలకు ఉపయోగకరమైన విషయాలపై వక్తలు మాట్లాడి చర్చించారు. ప్రియ ప్రార్థనా గీతంతో ఈ వేడుకలు మొదలయ్యాయి. అనంతరం కూచిపూడి డాన్స్ అకాడమీ ట్రినిటీ పంత్ గణేష పంచరత్నాన్ని ప్రదర్శించారు. మాధవీ మైలవరపు బృందం అష్టలక్ష్మి స్తోత్రం ఆలపించారు. సుధ, శ్రీలత, లలిత మహిళా సంబంధిత పాటలు పాడి అలరించారు.శ్రావ్యమైన పాటలు వినడం ద్వారా మానసికోల్లాసము పెంపొందించుకోవడంపై లలితా రాంపల్లి వివరంగా తెలియజేసారు. ఇంద్రాణి దావలూరి ప్రదర్శించిన మహిషాసురమర్థని ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. డి సి మెట్రో విభాగంలోని వివిధ రంగాలకు చెందిన ర్తిదాయకమయిన మహిళలను గుర్తించి వారికి “నాటామహిళ “ పురస్కారాలను అందచేయటం జరిగింది. కూచిపూడి కళారంగంలో సేవలందిస్తున్న లక్ష్మిబాబుకి , ఆరోగ్యరంగం నుంచి శ్రీలేఖ పల్లెకి, తెలుగుమహిళల్లో అరుదుగా ఎంచుకునే రంగం నుంచి న్యాయవాది జనెత కంచర్లకి, ఐటీ రంగంలోనే కాక అనేక రంగాలలో ప్రత్యేక గుర్తింపు పొందిన పద్మిని నిడుమోలును ఈ సందర్భంగా సన్మానించారు . చైతన్యవంతుల సంబంధించిన ప్రశ్నలు, జయ తెలికుంట్ల, రాధిక జయంతిల వ్యాఖ్యానం, సరదా సరదా ఆటలతో ఈ కార్యక్రమం సాగింది. వసుధారారెడ్డి మహిళా సాధికారత, మహిళల గొప్పతనం గురించి ఈ సమావేశం లో కొనియాడారు. చివరగా సంధ్య బైరెడ్డి అక్కడికక్కడే ఉత్సాహవంతులయిన 30 మంది మహిళలతో చేసిన ఫ్యాషన్‌ వాక్ ప్రత్యేకత సంతరించుకుంది. నాటా కల్చరల్ కమిటీ ఛైర్ విజయ దొండేటి, సంధ్య బైరెడ్డిలు, చిత్ర దాసరి, ప్రత్యేక అతిథులను ఆహ్వానించగా చైతన్య, స్వరూప గిండి, అనిత ,లావణ్య, గౌరి, ఇతర సభ్యులు ఈ వేడుకలని విజయవంతం చేసారు. ఈ కార్యక్రమంలో సెనేటర్ జెన్నిఫర్ బయోస్కొ, కౌంటిఛైర్ ఫిలిస్ రేండల్, జాన్ బెల్ పాల్గొన్నారు. తానా, అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌, అమెరికన్‌ తెలంగాణ అసోసియేషన్‌, టీడీఎప్‌, జీడబ్యూటీసీఎస్‌(GWTCS), ఇతర నాయకులు పాల్గొని తమ అభినందనలు తెలియజేసారు. నాటా ప్రెసిడెంట్ రాఘవరెడ్డి గారు మాట్లాడుతూ నాటాలో మహిళలకు ప్రత్యేక స్థానం ఉంటుందనీ, ఇంటాబయటా అన్ని రంగాలలోనూ ముందంజ వేస్తున్న మహిళలు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తెలుగు ఆడపడుచులు వివిధ బ్యూటీ కాంటెస్ట్ లలో గెలుపొందిన ఇంద్రాణి, సురేఖ, హిమాన్విలను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో నాటా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు సతీష్ నరాల, మోహన్ కలాడి, బాబూరావు సామల, కిరణ్ గున్నం, నాటా వాషింగ్టన్ డిసి ప్రాంతీయ సభ్యులు మధు మోటాటి, ఆంజనేయరెడ్డి దొండేటి, నినాద్ అన్నవరం, ఉదయ ఇంటూరు, వెంకట్ కొండపోలు, సుజిత్ మారం, రమేష్ వల్లూరి తదితరులు పాల్గొన్నారు.

తానా సభలకు వెంకయ్య-ట్రంప్-చంద్రబాబు

అమెరికాలోని వాషింగ్టన్‌ డీసీలో జులై 4 నుంచి 3 రోజుల పాటు తానా మహాసభలు నిర్వహించనున్నట్లు ఆ సంఘం అధ్యక్షుడు సతీష్‌ వేమన తెలిపారు. సోమవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన ఆలయం ఎదుట విలేకరులతో మాట్లాడారు. తానా వేడుకలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో పాటు ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఆహ్వానించినట్లు చెప్పారు. తెదేపా ఘన విజయం సాధించి చంద్రబాబు తిరిగి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారనే నమ్మకంతో ఆహ్వాన ఏర్పాట్లు చేసినట్లు వివరించారు.

రమ్యశ్రీ కుటుంబ రాజకీయం భలే రసకందాయం

అ నగనగా… గవిరెడ్డి వారి కుటుంబం. యజమాని గవిరెడ్డి దేముడుబాబు ఓ సాధారణ రైతు. అతని భార్య సన్యాసమ్మ. స్వగ్రామం విశాఖపట్నం జిల్లా చీడికాడ మండలం అప్పలరాజపురం. వీరికి ఆరుగురు సంతానం. ముగ్గురు కుమార్తెలు, ముగ్గురు కుమారులు. ఈ ఆరుగురిలో తొలి ముగ్గురు రాజకీయాల్లో ఉన్నారు. సుజాత అలియాస్‌ రమ్యశ్రీ వైకాపాలో చేరగా, సన్యాసినాయుడు జనసేన, రామానాయుడు తెదేపా తరఫున పోటీ చేస్తున్నారు. సినిమా రంగంలో రమ్యశ్రీగా గుర్తింపు పొందారు. పలు చిత్రాల్లో నటించారు. తన పేరిట స్వచ్ఛంద సంస్థను స్థాపించి, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రాజకీయాల్లోకి రావాలనే కుతూహలం ఎప్పటి నుంచో ఉంది. విశాఖ జిల్లా సబ్బవరం మండలంలో చాలా గ్రామాల్లో పర్యటించారు. ఇటీవల జగన్‌ సమక్షంలో వైకాపాలో చేరారు. ప్రస్తుతం జిల్లాలో ఆ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. ‘జీఎస్‌ఎన్‌ ట్రస్టు’ను స్థాపించి కొన్నేళ్లుగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. గతంలో అన్న తెలుగుదేశం తరఫున మాడుగుల నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిపోయారు. వైకాపా ఆవిర్భావం తర్వాత ఆ పార్టీలో చేరారు. ఈసారి ఎన్నికల్లో అసెంబ్లీ టికెట్‌ ఆశించారు. వైకాపా నుంచి హామీ లభించక పోవడంతో జనసేనలో చేరారు. ప్రస్తుతం మాడుగుల బరిలో నిలిచారు. తొలుత విశాఖలో బంగారు నగల విక్రయ దుకాణం నిర్వహించేవారు. రాజకీయాల్లో ప్రవేశించాక 2009లో తెదేపా తరఫున పోటీ చేసి మాడుగుల శాసనసభ్యుడిగా గెలుపొందారు. 2014లో మరోసారి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈసారీ తెదేపా తరఫున పోటీ చేస్తున్నారు.

ATA Celebrates Womens Day On A Grand Scale In Chicago


American Telugu Association (ATA) celebrated International Women’s Day in Chicago on a grandeur scale at Play’N’Thrive Schaumburg with much fervor and gusto. This year Women’s day theme, #BetterforBalance, focused primarily on a call to action for gender balance. The event started with Ganesh Stotram followed by the Chief Guest, Indian Consular Officer Mrs. Rajeshwari Chadrasekharan, lighting the ceremonial lamp along with ATA Women’s Day organizers. A welcome address was given by ATA Board of Trustee Dr. Meher Medavaram focusing on gender equality and equal opportunities for women in leadership at all levels of decision making in political, business and economic arenas. Mrs. Chandrasekharan eloquently spoke to attendees about how Indian women have excelled in the US, their challenges in modern day society, women’s issues and women empowerment. Immigration Attorney Adaikala Mary Kennedy also gave insight about her services and how to strike a balance between work and life. Raffle Ticket Prize winners were awarded Gold Coins sponsored by Sri Krishna Jewelers. The fashion show was the highlight of the event with ladies from various age groups actively participating. Scores of women dressed in ethnic attire thoroughly enjoyed the festivities and had a great time visiting several vendor booths. A sumptuous lunch was served to attendees. Singers Madhuri, Sailaja and Shirley enthralled everyone with Bollywood and Tollywood songs. Gift cards were awarded to various game prize winners, and the program ended with plenty of dancing to the DJ’s music. ATA Board of Trustees Dr. Meher Medavaram and Sainath Reddy Boyapalli oversaw the day’s proceedings. Decoration and arrangements were taken care of by Ramana Abbaraju, Amar Nettem, Suchitra Reddy, Laxmi Boyapalli, Chalma Bandaru, Venkat Thudi, Mahipal Vancha, Hari Raini, Jagan Bukkaraju, Narsimha Chittaluri, Bheemi Reddy, Satish Yellamilli and Bhanu Swargam. ATA founder member & Past President Hanumanth Reddy garu motivated everyone with his presence and applauded the Sponsors, Volunteers and Local organizations for their continued, unwavering support.

ట్రంప్ హ్యాపీ

అమెరికా అధ్యక్షుడికి అతిపెద్ద ఉపశమనం లభించింది. ఆయన ఎన్నికకు సంబంధించి చెలరేగిన అతిపెద్ద వివాదం సద్దుమణిగింది. ఈ వ్యవహారానికి సంబంధించి దర్యాప్తు చేసిన రాబర్ట్‌ ముల్లర్‌ నివేదికను క్రోడీకరించి అటార్ని జనరల్‌ విలియమ్‌ బార్‌ అమెరికన్‌ కాంగ్రెస్‌కు అందజేశారు. రష్యా జోక్యానికి సంబంధించినంత వరకు అధ్యక్షుడు ట్రంప్‌ పాత్రను కచ్చితంగా తేల్చలేదు. ఆయన చట్టానికి వ్యతిరేకంగా ఏ చర్యకు పాల్పడినట్లు పేర్కొనలేదు. అసలు అమెరికాకు చెందిన ఏ వ్యక్తి ఈ కుట్రలో పాల్గొన్నట్లు గానీ, ట్రంప్‌ ప్రచార కర్తల కుట్ర గానీ, ఉద్దేశపూరక చర్యలుగానీ దీనిలో కనిపించలేదని వెల్లడించారు. కుట్రను నిరూపించడానికి ప్రస్తుతం ఉన్న ఆధారాలు ఏమాత్రం సరిపోవని నాలుగు పేజీల రిపోర్టులో వెల్లడించారు. ఈ రిపోర్టు తయారు చేయడానికి ముల్లర్‌కు దాదాపు రెండేళ్లకు పైగా సమయం పట్టింది. ఇది జరిగిన వెంటనే ట్రంప్‌ తన ట్విటర్‌ ద్వార మరోసారి ‘‘ఎటువంటి కుమ్మక్కు లేదు.. ఎటువంటి ఉల్లంఘనలు లేవు. నన్ను తొలగించేందుకు చేపట్టిన అక్రమ చర్య విఫలమైంది.’’ అని పేర్కొన్నారు. గుడ్డుకు ఈకలు పీకుతున్నారని ఎప్పటి నుంచో ట్రంప్‌ ఈ దర్యాప్తును ఎద్దేవా చేస్తున్నారు. దీనిపై డెమోక్రాట్‌ పార్టీకి చెందిన సెనెటర్‌ రిచర్డ్‌ బ్లూమెంటాల్‌ మాట్లాడుతూ‘‘ అక్కడ సరైన ఆధారలు లభించక నిరూపించలేకపోయారు. కానీ ప్రశ్నలు మాత్రం మిగిలిపోయాయి.’’ అని పేర్కన్నారు. మరోపక్క హౌస్‌స్పీకర్‌ నాన్సీ పెలోసీ, డెమోక్రాటిక్‌ లీడర్‌ చాక్‌ స్కీమర్‌లు కూడా దీనిపై మండిపడ్డారు. ‘‘ప్రశ్నలను సమాధానాలుగా చూపుతున్నారు’’ అని పేర్కొన్నారు. శ్వేతసౌధ ప్రతినిధి సారా సాండర్స్‌ మాట్లాడుతూ ‘‘ఈ నివేదిక అధ్యక్షుడిని నిర్దోషిగా పేర్కొంది’’ అని అన్నారు. మరోపక్క డెమోక్రాటిక్‌ పార్టీ నేతలు పూర్తి నివేదికను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. దీంతోపాటు స్పెషల్‌ కౌన్సిల్‌ దర్యాప్తు ఫైళ్లను కూడా అందజేయాలన్నారు. ముల్లర్‌ ఈ కేసు దర్యాప్తు చేయడానికి బాగా కష్టపడ్డారు. దాదాపు 2,800 కోర్టు నోటీసులు, కొన్ని వందల సెర్చి వారెంట్లను జారీ చేయించారు. ఆరోపణలు వచ్చిన వ్యక్తులను సుదీర్ఘంగా విచారించారు. దాదాపు 8 మంది అమెరికన్లపై, రెండు డజన్ల మంది రష్యన్లపై అభియోగాలను నమోదు చేశారు. వీరిలో ఆరుగురు ట్రంప్‌నకు అత్యంత సన్నిహితులు. అమెరికన్లను అయితే విచారించారు కానీ రష్యన్లను విచారించడం సాధ్యంకాలేదు. ఎందుకంటే రష్యాతో అమెరికాకు ఎటువంటి నేరస్థుల అప్పగింత ఒప్పందంలేదు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జోక్యానికి రష్యా ప్రజెక్టు లుక్తాను చేపట్టింది. దీని కింద రష్యా అనుబంధ సంస్థలు అమెరికాలోకి చొచ్చుకువచ్చాయి. ట్రంప్‌ తరఫున ప్రచారాన్ని మార్చేశాయి. భారీ సంఖ్యలో సోషల్‌ మీడియా ఖాతాలు పుట్టుకొచ్చాయి. తప్పుడు ప్రచారం మొదలుపెట్టాయి. మరోపక్క డెమోక్రాటిక్‌ పార్టీకి చెందిన కీలక కంప్యూటర్లు హ్యాక్‌ అయ్యాయి. ఆ సమాచారం ఒక పథకం ప్రకారం వికీలీక్స్‌కు చేరాయి. దీంతో ఆ సమాచారం వెలుగులోకి రావడంతో హిల్లరీ క్లింటన్‌ పోటీలో వెనుకబడిపోయారు. * అమెరికా పౌరులుగా నమోదుచేసుకొని కొందరు వ్యాపార ఖాతాలను తెరిచి నగదును ప్రవహింపజేశారు. దీనికోసం ఏకంగా అమెరికాలో సర్వర్‌ స్పేస్‌ను కొనుగోలు చేశారు. దాదాపు 12.5 కోట్ల డాలర్లను దీనికి వెచ్చించారు. అమెరికాలో రాజకీయ ర్యాలీలు నిర్వహించారు. నిజమైన అమెరికన్లకు అన్యాయం జరగకూడదని ప్రజలను రెచ్చగొట్టారు. ఈ వ్యవహారంలో రష్యా ఆంతరంగికుడు ప్రిగోజైన్‌ కూడా ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి.

థెరిస్సాకు పదవి గండం

అధికార కన్జర్వేటివ్ పార్టీ ఎంపీలు డిమాండ్ చేస్తున్నట్లు మీడియాలో వార్తలొచ్చాయి. కానీ ఈ వార్తలను ఖండించిన అధికార పార్టీ వర్గాలు.. క్యాబినెట్ ఆమెకు అండగా ఉన్నదని పేర్కొన్నాయి. యునైటెడ్ కింగ్‌డమ్ చాన్స్‌లర్ ఫిలిప్ హమ్మండ్ స్పందిస్తూ ప్రధానుల మార్పుతో సమస్య పరిష్కారం కాదన్నారు. ఈయూలో బ్రిటన్ సభ్యత్వం కొనసాగింపుపై పీపుల్స్ ఓట్ పేరిట మరో రెఫరెండం నిర్వహించే ప్రతిపాదనను పరిశీలించొచ్చునన్నారు. బ్రెగ్జిట్‌పై మరో రిఫరెండం నిర్వహించాలని డిమాండ్ చేస్తూ శనివారం లండన్‌లో లక్షలాది మంది ప్రదర్శనలు జరిపారు. ,ఈయూ నుంచి బ్రిటన్ వైదొలిగేందుకు ఉద్దేశించిన బ్రెగ్జిట్ ప్రక్రియను సజావుగా ముందుకు తీసుకెళ్లలేకపోతే ప్రధాని పదవికి రాజీనామా చేయాలని థెరెసా మేపై క్యాబినెట్ సహచరుల నుంచి ఒత్తిడి వస్తున్నట్లు సమాచారం. వచ్చేవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే మూడో బ్రెగ్జిట్ బిల్లును ఉపసంహరించుకుంటే ప్రధానిగా వైదొలుగాలని ఆమె సహచర మంత్రులు

ఓటింగ్ పట్ల ఎన్నారైలకు అనాసక్తి

ప్రవాస భారతీయులు మాతృదేశ ఎన్నికల్లో పాల్గొనడంపై అంతగా ఆసక్తి చూపడం లేదు. ఎన్ఆర్ఐలు ఓటరుగా నమోదు చేసుకోవాలని ఎన్నికల సంఘం విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నా.. ఫలితం శూన్యమే. 2014 ఎన్నికల్లో కేవలం 8 మంది ఎన్ఆర్ఐలు మాత్రమే ఓటేసినట్లు అధికారిక గణాంకాలు స్పష్టంచేస్తున్నాయి. ఆన్‌లైన్‌లో లేదా ప్రతినిధి ద్వారా ఓటు వేసే అవకాశం కల్పిస్తేనే.. ఈ పరిస్థితిలో మార్పు వస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
**చట్టానికి సవరణ..
ఎన్ఆర్ఐలు ఓటరుగా నమోదు చేసుకునేందుకు వీలుగా 2010లో కేంద్ర ప్రభుత్వం ప్రజాప్రాతినిధ్య చట్టం, సెక్షన్‌ 20ని సవరించింది. ఓటు పొందాలనుకునే ప్రవాస భారతీయులు దేశంలో అంతకు ముందు ఎక్కడా ఓటరుగా నమోదై ఉండొద్దు. వారు నివాసం ఉంటున్న దేశ పౌరసత్వాన్ని కలిగి ఉండకూడదు. ఈ అర్హతలున్న వారు ఆన్‌లైన్‌ ద్వారా పాస్‌పోర్టు, వీసా, తదితర వివరాలతో దరఖాస్తును సమర్పించి ఓటుహక్కు పొందొచ్చు.
*ప్రతినిధి ద్వారా ఓటేసేలా..
సుదూర దేశాల్లో ఉంటోన్న ఎన్ఆర్ఐలు పోలింగ్‌ తేదీన భారత్‌కు రావడం కష్టసాధ్యమైన పని. పైగా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఇందుకు పరిష్కారంగా ఎన్ఆర్ఐ స్థానంలో వారి ప్రతినిధి ఓటేసే వెసులుబాటు కల్పించేందుకు 2017, డిసెంబరులో ప్రజాప్రాతి నిధ్య చట్టానికి సవరణ బిల్లును కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెట్టింది. ఈ బిల్లు 2018లో లోక్‌సభలో ఆమోదం పొందింది. రాజ్యసభ ఆమోదించాల్సి ఉంది. లోక్‌సభలో చర్చ జరిగినప్పుడు కొన్ని పార్టీలు ఈ బిల్లును వ్యతిరేకించాయి. మరోవైపు ఆన్‌లైన్‌ ద్వారా ఓటేసే అవకాశాన్నీ ఈసీఐ కొంతకాలంగా పరిశీలిస్తోంది.

ఫ్రిస్కోలో ఎన్నారై తెదేపా సమావేశం

నూతన రాష్ట్రం ఏపీని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందని, రాష్ట్రం ఇదే పంథాలో అభివృద్ధి పథంలో మరింత ముందుకు పోవాలంటే 2019 ఎన్నికల్లో తెదేపాకే పట్టం కట్టాలని డాలస్ ఎన్నారై తెదేపా కోరింది. ఫ్రిస్కోలోని పీఎనెస్ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో స్థానిక తెదేపా శ్రేణులు పాల్గొని రానున్న ఎన్నికపై సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ కొమ్మినేని, కిషోర్ చలసాని, కిరణ్ తుమ్మల, నవీన్ ఎర్రమనేని, శ్రీనివాస్ శాఖమూరి, సాంబ దొడ్డ, వెంకట్ జిల్లెళ్లమూడి, సురేష్ గూడూరు, బాలాజీ బొడ్లూరి, వేణు పావులూరి, నరేంద్ర ఎండ్లూరి, జనార్దన్ యెనికపాటి, పవన్ గనిపినేని, వెంకట్ ముప్పరాజు తదితరులు పాల్గొని ఎన్నికల్లో తెదేపా గెలుపునకు చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు.

టపాసులను బాంబులనుకున్న గ్రీస్

గ్రీస్‌ జైలులో 14 నెలలు గడిపిన ఐదుగురు భారతీయులు ఎట్టకేలకు ఆదివారం ఉదయం స్వదేశానికి చేరుకున్నారు. సింగ్‌, గగన్‌ దీప్‌, రోతాస్‌ కుమార్‌, జైదీప్‌ థాకూర్‌, సతీశ్‌ పాటిల్‌..ఈ ఐదుగురూ ఒక కార్గో నౌకలో పనిచేసేందుకు స్వదేశం విడిచి వెళ్లారు. అనంతరం టర్కీ నుంచి జిబౌటీ సరకు రవాణా నౌకలో టపాసులు తయారు చేసేందుకు అవసరమైన ముడిసరుకును తరలిస్తున్నారు. ఈ క్రమంలో నౌకలో సాంకేతిక లోపం తలెత్తింది. దానిని సరిచేయించేందుకు నౌకను గ్రీసు తీరం వైపు మళ్లించారు. అప్పుడే వారిని గ్రీస్‌ కోస్టుగార్డులు అదుపులోకి తీసుకుని, నౌకను స్వాధీనం చేసుకున్నారు. నౌకలో పేలుడు పదార్థాలతో దేశానికి అతి సమీపంలోకి వచ్చేందుకు ప్రయత్నించారని వారిపై అభియోగం మోపారు. విషయం తెలుసుకున్న భారత దౌత్య కార్యాలయ అధికారులు, స్థానిక అధికారులతో సంప్రదింపులు జరిపారు. కోర్టులో జరిగిన ప్రతి విచారణకు ఐదుగురికి మద్ధతుగా వాదనలు వినిపించారు. నౌకకు అన్ని అనుమతులు ఉన్నా, అవి పేలుడు పదార్ధాలు కాకున్నా నౌకతో సహా సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారని అక్కడి న్యాయస్థానంలో వాదనలు వినిపించారు. నౌకకు ఉన్న అన్ని అనుమతులు పరిశీలించి, ఆ సామాగ్రిని న్యాయబద్ధంగానే తరలిస్తున్నట్లు నిర్ధారణకు వచ్చిన న్యాయస్థానం వారిని విడుదల చేసింది. అయితే అప్పటికే వారిని జైలులో ఉంచి 14 నెలలు గడచిపోయాయి. విడుదల అనంతరం వారు ఆదివారం ఉదయం స్వదేశానికి చేరుకున్నారు. వారి విడుదలకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. వీరిని జైలులో పెట్టినప్పుడు పాకిస్థాన్‌ దేశస్థులతో పాటు ఉంచినట్లు వారు తెలిపారు. ‘భారత్‌, పాక్‌లకు చెందిన మేము వేరొక దేశంలో జైలులో కలిసి ఉన్నాం. మేము స్వదేశానికి తిరిగి వెళ్లగలమా అని ఆత్మస్థైర్యాన్ని కోల్పోయిన తరుణంలో వారే మాకు మనోధైర్యాన్ని ఇచ్చార’ని వారిలో ఒకరు తెలిపారు.

మా దేశపు బంగారం ట్రంప్ ఎత్తుకుపోతున్నాడు

వెనెజువెలా, అమెరికాల మధ్య వివాదం మరింత ముదిరిపోయింది. ‘‘వివిధ బ్యాంకుల్లో భద్రపర్చుకొన్న మా దేశ సొమ్మును ట్రంప్‌ కోరిక మేరకు దొంగతనం చేశారు. ఈ అపహరించిన సొమ్ము మొత్తం దాదాపు 30 బిలియన్‌ డాలర్లు ఉంటుంది. కొన్ని నెలల నుంచి ఈ దొంగతనం జరుగుతోంది.’’ అని వెనుజువెలా కమ్యూనికేషన్ల శాఖా మంత్రి జార్జి రోడ్రిగో ఆరోపించారు. ఆ దేశ అధ్యక్షుడు నికోలస్‌ మదురో కూడా గతంలో ఇలాంటి ఆరోపణలే చేశారు. తమ దేశంలో ఆసుపత్రుల్లో ఔషధాల కోసం కేటాయించిన 5 బిలియన్‌ డాలర్లను అమెరికా తస్కరించిందని పేర్కొన్నారు. దీనికి ట్రంపే పూర్తి బాధ్యత వహించాలన్నారు. తమ దేశంలో సహజ సంపదను దోచుకొనేందుకు ట్రంప్‌ సర్కారు ఆత్రుతతో ఉందని పేర్కొన్నారు. వెనెజువెలా దేశంలో తానే దేశ అధ్యక్షుడునని ప్రతిపక్ష నేత జువాన్‌ గుయాడో (35) రాజధాని కారకస్‌లో ప్రజల సమక్షంలో కొన్నాళ్ల కిందట ప్రకటించుకున్నారు. అధ్యక్షునిగా ఆయనను గుర్తిస్తున్నట్టు అమెరికాతో పాటు, పొరుగుదేశాలైన బ్రెజిల్‌, కొలంబియా, పెరు, అర్జెంటినాలు ప్రకటించాయి. అయితే ఈ చర్యను రష్యా, క్యూబా, టర్కీ వంటి దేశాలు ఖండించాయి. అధ్యక్షుడు నికోలస్‌ మదురోకే మద్దతు తెలిపాయి. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య చర్చలు జరగాలని ఐక్యరాజ్య సమితి సూచించగా, తాజాగా ఎన్నికలు జరపడమే మేలని యూరోపియన్‌ యూనియన్‌ అభిప్రాయపడింది. చమురు నిల్వలు అధికంగా ఉన్న దేశం అయినప్పటికీ మదురో పాలనలో వెనెజువెలా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ఆయన సైన్యం, రష్యా సహకారంతో పాలన కొనసాగిస్తున్నారు. పరిస్థితులను గమనించిన విపక్ష నేత గుయాడో తనను తాను అధ్యక్షునిగా ప్రకటించుకున్నారు. అది జరిగిన కొన్ని నిమిషాల్లోనే ఆయనను దేశ తాత్కాలిక నేతగా గుర్తిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటన విడుదల చేశారు. దీనికి బదులుగా అమెరికాతో దౌత్య సంబంధాలను రద్దు చేస్తున్నట్టు అధ్యక్షుడు మదురో తెలిపారు. అయితే మాజీ అధ్యక్షునిగా మారినందున ఆయనకు ఆ అధికారం లేదని అమెరికా తిప్పికొట్టింది. వెనెజువెలా అంతర్గత వ్యవహారాల్లో అమెరికా జోక్యం చేసుకుంటోందని రష్యా ఆరోపించింది. జనవరి 26 తేదీన వెనుజువెలా ప్రభుత్వం నిల్వ చేసిన బంగారాన్ని తిరిగి ఇచ్చేందుకు ది బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ నిరాకరించింది. ఈ విషయాన్ని అప్పట్లో బ్లూమ్‌బెర్గ్‌ వెల్లడించింది. వెనుజువెలా వద్ద కేవలం 8 బిలియన్‌ డాలర్లు మాత్రమే రిజర్వులు ఉన్నాయి. వీటిల్లో 1.2బిలియన్‌ డాలర్ల బంగారం కూడా కీలక భాగమే. అమెరికా అధికారుల కోరిక మేరకే బ్రిటన్‌ అధికారులు ఈ నిర్ణయం తీసుకొన్నారు. ఇక్కడ నికోలస్‌ మదురో తన అధికారాన్ని నిరూపించుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. తాజాగా సిటీ గ్రూప్‌ తాకట్టులో ఉన్న వెనుజువెలా బంగారం వేలానికి వచ్చే అవకాశం ఏర్పడింది. ఇక్కడ కొన్ని టన్నుల బంగారాన్ని కుదువ పెట్టి వెనుజువెలా ప్రభుత్వం 1.6 బిలియన్‌ డాలర్లను రుణంగా తీసుకొంది. ఇటీవల చెల్లింపు గడువు దాటడంతో ఈ నిర్ణయం తీసుకొన్నట్లు సమాచారం. ఫలితంగా వెనుజువెలా రిజర్వులపై తీవ్రమైన ఒత్తిడి పెరిగింది.

బంగారం కోసం భారతీయుల ఇళ్లల్లో దొంగతనాలు

బ్రిటన్‌లో బంగారం దొంగలు అత్యధికంగా భారత సంతతి ప్రజల ఇళ్లనే లక్ష్యంగా చేసుకుంటున్నట్లు శనివారం ఓ నివేదిక ద్వారా వెల్లడైంది. గత ఐదేళ్లలో రూ. 1,280 కోట్ల విలువైన బంగారం బ్రిటన్‌లో చోరికి గురైందనీ, అందులో అత్యధికం భారత సంతతి ప్రజలదేనని బీబీసీ పరిశోధనలో తేలింది. 2013 నుంచి చూస్తే 28 వేల బంగారం దొంగతనాలు జరిగాయి. గత ఐదేళ్లలో గ్రేటర్‌ లండన్‌లో రూ. 1,050 కోట్ల విలువైన బంగారం దొంగతనానికి గురయ్యింది.ఎక్కువ, తక్కువ అనే తేడా లేకుండా బంగారం ఎంతున్నా దొంగలు కొట్టేస్తున్నారనీ, బంగారాన్ని చాలా తక్కువ సమయంలో, చాలా సులువుగా నగదుగా మార్చుకునే అవకాశం ఉండటం ఇందుకు ఓ కారణమని పోలీసులు భావిస్తున్నారు. చెషైర్‌ పోలీస్‌ దళంలో నేరాల విభాగానికి నేతృత్వం వహిస్తున్న ఆరోన్‌ దుగ్గన్‌ అనే అధికారి మాట్లాడుతూ ‘సెకండ్‌ హ్యాండ్‌ నగలు కొనే వ్యాపారులు అమ్ముతున్న వ్యక్తి ఎవరు? ఆ నగలు అతనికి ఎక్కడి నుంచి వచ్చాయి? అని తెలుసుకోవాలి. కానీ అలా జరగడం లేదు. ఈ దేశంలో బంగారం తునక ముక్కలు అమ్మడం కన్నా సెకండ్‌ హ్యాండ్‌ నగలు అమ్మడమే సులభం’ అని తెలిపారు. దీపావళి, దసరా తదితర భారత ప్రధాన పండుగల సమయంలో ప్రజలు బంగారం ఎక్కువగా ధరించి ఆలయాలు, బంధుమిత్రుల ఇళ్లకు వెళ్తారనీ, ఆ పండుగల సమయంలోనే దొంగతనాలు ఎక్కువగా జరుగుతాయని లండన్‌ పోలీసులు అంటున్నారు. ప్రతీ ఏడాది ఈ పండుగల సమయంలో తాము హెచ్చరికలు కూడా చేస్తామన్నారు. 2017–18లో లండన్‌లోనే 3,300 దొంగతనాలు జరిగాయి. రూ. 193 కోట్ల విలువైన బంగారం చోరీకి గురయ్యింది.పశ్చిమ లండన్‌లోని సౌథాల్‌లో ఆసియా స్టైల్‌ బంగారం నగలు అమ్మే సంజయ్‌ కుమార్‌ మాట్లాడుతూ బంగారం ఆభరణాలకు సంప్రదాయాల పరంగా ఎంతో ప్రాధాన్యం ఉందన్నారు. బంగారాన్ని జాగ్రత్తగా దాచుకోవాలనీ, బీమా కూడా చేయించుకోవాలని తానెప్పుడూ తన దగ్గర బంగారం కొనేవారికి చెబుతుంటానని ఆయన తెలిపారు. ‘బంగారం కొనడమంటే పెట్టుబడి పెట్టడమనీ, అది అదృష్టాన్ని కూడా తెస్తుందని పిల్లలకు వారి తల్లిదండ్రులు చెబుతారు. ఆసియా ప్రజలు ఇదే చేస్తారు.వాళ్లు ఇక్కడకొచ్చినా ఆ సంప్రదాయాన్ని పాటిస్తారు’ అని సంజయ్‌ కుమార్‌ వివరించారు. బంగారు ఆభరణాలు కేవలం విలువైనవేగాక, వాటి యజమానులకు వాటితో ప్రత్యేక అనుబంధం ఉంటుందనీ, అవి పోయినప్పుడు యజమానుల మానసిక స్థితిపై కూడా తీవ్ర ప్రభావం పడుతుందని లండన్‌ పోలీసు విభాగంలో డిటెక్టివ్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న లీసా కీలే చెప్పారు. తమ చర్యల కారణంగా ఈ దొంగతనాలు కొంచెం తగ్గాయనీ, అయినా చేయాల్సింది ఇంకెంతో ఉందని ఆమె తెలిపారు. బంగారం దొంగలను పట్టుకోడానికి, దొంగతనాల సంఖ్యను తగ్గించడానికి లండన్‌ పోలీసులు ప్రత్యేకంగా ‘ఆపరేషన్‌ నగ్గెట్‌’ పేరిట ఓ∙కార్యక్రమాన్ని సైతం ఆచరణలోకి తెచ్చారు.

ప్రముఖ గాయనీ వింజమూరి అనసూయాదేవి మృతి

ప్రముఖ జానపద, శాస్త్రీయ లలిత సంగీత గాయని వింజమూరి అనసూయాదేవి (99) అమెరికాలోని హ్యూస్టన్‌లో కన్ను మూశారు. ఆలిండియా రేడియో ద్వారా తెలుగు జానపద గీతాలకు అనసూయా దేవి ఎనలేని ప్రాచుర్యం కల్పించారు. జానపద గేయాలు రాయడంలో, బాణీలు కట్టడంలో, పాడడంలో అనసూయా దేవిది అందెవేసిన చేయి. ఈమెకు హార్మోనియం వాయించడంలోనూ అద్భుతమైన ప్రావీణ్యం ఉంది. అనసూయా దేవి ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి కళాప్రపూర్ణ, డాక్టరేట్‌ కూడా అందుకున్నారు. 1920 మే 12న కాకినాడలో జన్మించారు. అనసూయా దేవికి ఐదుగురు సంతానం. ఈమె ప్రముఖ కవి దేవులపల్లి కృష్ణశాస్త్రి మేనకోడలు. ఆమె మృతి పట్ల సిలికానాంధ్ర సంతాపం వ్యక్తపరిచింది.

నాకు లేని రోగం లేదు. నేను రాను. రాలేను.

అనారోగ్యంగా ఉన్న కారణంగా తాను భారత్‌కు తిరిగి రాలేనని, ప్రయాణం చేసే పరిస్థితుల్లో కూడా లేనని ఆర్థిక నేరగాడు మెహుల్‌ చోక్సీ ముంబయి కోర్టుకు విన్నవించాడు. తన తరఫున వాదిస్తున్న న్యాయవాది ద్వారా ఈ విషయాన్ని కోర్టుకు తెలియజేశాడు. తనకు చాలా రోగాలున్నాయని, ప్రస్తుతం ఎక్కడికీ వెళ్లలేనని, ప్రయాణం అస్సలు చేయలేనని చెప్పాడు. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకును రూ.13,000 కోట్ల మేర మోసం చేసిన నీరవ్‌ మోదీ, అతని మామ మెహుల్‌ చోక్సీ విదేశాలకు పారిపోయి అక్కడ పౌరసత్వాలు పొంది వ్యాపారాలు చేసుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా నీరవ్‌మోదీ లండన్‌లో పట్టుబడ్డాడు. దీంతో ఇప్పుడు మెహుల్‌ చోక్సీ ఈ విధంగా స్పందించడం కోర్టు నుంచి తప్పించుకొనే ప్రయత్నంగానే కనిపిస్తుంది. మళ్లీ ఈ కేసు ఏప్రిల్‌ 9న విచారణకు రానుంది. తాను ప్రయాణం చేసే పరిస్థితుల్లో లేడని నమ్మించేందుకు 38 పత్రాలను న్యాయస్థానం ముందుంచాడు. వాటిలో మెడికల్‌ రిపోర్టులు, ఇతనికి ఉన్న వ్యాధులకు చికిత్సల కోసం వైద్యులు వేరొక ఆసుపత్రికి సిఫారసు చేస్తూ రాసిన లేఖలు ఉన్నాయి. రక్త కణాలు సరిగా లేవని చూపించేందుకు ఆంజియోగ్రామ్స్, అల్డ్రా సౌండ్‌ నివేదికలు, ఎంఆర్‌ఐ స్కానింగ్‌ రిపోర్టు, మోకాళ్ల జాయింట్లు, వెన్నెముక సరిగా లేవని తెలిపే రిపోర్టులు, రక్త పరీక్షల రిపోర్టులు, వెన్నెముకకు సంబంధించిన రేడియోగ్రాఫ్‌లు, ఎక్స్‌రేలు, వైద్యులను సంప్రదించినట్లు తెలిపే పత్రాలను అతని తరఫు న్యాయవాది కోర్టు ముందుంచారు. ఇన్ని వ్యాధులు చుట్టుముట్టినందున చోక్సీ భారత్‌కు తిరిగి రాలేరని అతని న్యాయవాది కోర్టుకు విన్నవించారు. మెహుల్‌ చోక్సీపై న్యాయస్థానం తీసుకున్న చర్యలు చట్ట విరుద్ధమని అతని న్యాయవాది అన్నారు. అతను చేసింది ఆర్థిక నేరమే కాబట్టి దానికి నాన్‌ బెయిలబుల్‌ అరెస్టు వారెంట్‌ జారీ చేయడం తగదంటూ వాదించారు.

ఇథియోపియాలో హైదరాబాద్‌ వ్యాపారి మృతి-నేరవార్తలు–03/22

పశ్చిమ ఆఫ్రికాలోని ఘనా దేశంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కిన్టాంపోలో ప్రమాదవశాత్తూ రెండు బస్సులు పరస్పరం ఢీ కొనడంతో దాదాపు 60 మంది ప్రయాణికులు మృతి చెందారు. మరికొంత మందికి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాద స్థలికి చేరుకున్న సహాయక బృందాలు.. గాయపడ్డ ప్రయాణికులను బయటకు తీసి, ఆస్పత్రులకు తరలించాయి. రెండు బస్సుల్లో కలిపి సుమారు 100 మంది ప్రయాణికులు ఉన్నారని, ఈ ప్రమాదం జరిగిన వెంటనే ఓ బస్సులో మంటలు కూడా చెలరేగాయని అక్కడి అధికారులు వివరించారు.
*పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్‌ కార్యకలాపాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న తీవ్రవాది సజ్జన్ ఖాన్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. క్రైం బ్రాంచి పోలీసులు ఎర్రకోట సమీపంలో ఇవాళ ఉదయం వలపన్ని అతడిని పట్టుకున్నట్టు అధికారులు వెల్లడించారు.
*హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ క్యాంపస్‌లోని రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థకు చెందిన రైఫిల్‌ షూటింగ్‌ రేంజి మైదానంలో గురువారం అనుమానాస్పద స్థితిలో ఓ జింక మృతి చెందింది. శరీరంపై బుల్లెట్‌ దూసుకెళ్లినట్లుగా రంధ్రం ఉంది.
*హోలీవేడుకల్లో పాల్గొన్న ఇద్దరు విద్యార్థులు.. శరీరానికి అంటిన రంగులను కడుక్కొనేందుకు బాహుదానదిలో దిగి మృతిచెందారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
*విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గం నుంచి వైకాపా అభ్యర్థిగా పోటీ చేస్తున్న మల్లాది విష్ణుపై రెండు కేసులు ఉన్నాయి. గురువారం ఆయన నామినేషన్‌ దాఖలు చేసిన సందర్భంగా సమర్పించిన అఫిడవిట్‌లో తనపై ఉన్న రెండు కేసుల వివరాలను పేర్కొన్నారు.
*కడప జిల్లా పులివెందుల అర్బన్‌ సీఐ శంకరయ్యను సస్పెండ్‌ చేస్తూ డీఐజీ నాగేంద్రకుమార్‌ గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 15న మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకు సంబంధించిన ఆధారాలు కాపాడడంలో ఆయన నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సీఐని సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు వచ్చాయి.
*బాసర సరస్వతీ ఆలయంలో ఆత్మహత్య చేసుకునేందుకు పదేపదే విఫలయత్నం చేస్తున్న ప్రసాద్‌గౌడ్‌ గురువారం మళ్లీ అదేపని చేశాడు. ఆత్మహత్య చేసుకునే ఉద్దేశంతో పదునైన కత్తితో గురువారం ఆలయానికి వచ్చాడు.
* తమిళనాడులో దినకరన్ పత్రికా కార్యాలయాన్ని దహనం చేసిన కేసులో అటాక్ పాండి సహా తొమ్మిది మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనం తీర్పునిచ్చింది. కరుణానిధి తరువాత రాజకీయ వారసుడు ఎవరంటూ 2007లో దినకరన్ పత్రిక ఓ వార్తను ప్రచురించింది.
*మద్యం మత్తులో అభం శుభం తెలియని బాలికపై అత్యాచారానికి పాల్పడి, ఆ చిన్నారిని హత్య చేసిన కేసులో ఐదుగురు నిందితులకు ఒకొక్కరికీ 47 సంవత్సరాల చొప్పున జైలు శిక్షతోపాటు రూ. 5 వేలు జరిమానా విధిస్తూ సేలం జిల్లా మహిళా కోర్టు న్యాయమూర్తి విజయకుమారి గురువారం సంచలన తీర్పునిచ్చారు.
*కేరళలోని చెరుప్లాసెరీలో ఉన్న సీపీఎం స్థానిక కమిటీ కార్యాలయంలో తనపై ఆ పార్టీ యువ కార్యకర్త ఒకరు అత్యాచారానికి పాల్పడ్డారన్న యువతి ఆరోపణపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
*తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటివరకు రూ.14,67,22,448 విలువైన మద్యం, మాదకద్రవ్యాలు, నగదు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కార్యాలయం తెలిపింది.
* హోటల్‌ గదులకు విచ్చేసే అతిథుల సన్నిహిత దృశ్యాలను రహస్య కెమేరాలతో చిత్రించి వాటిని ఇంటర్నెట్‌లో పోస్టు చేస్తున్న నలుగురు నిందితులను దక్షిణ కొరియా పోలీసులు అరెస్టు చేశారు.
*మాజీ మంత్రి వివేకా హత్య కేసును మరో వారంలో పూర్తిస్థాయిలో ఛేదించే అవకాశం ఉన్నట్లు సమాచారం. దర్యాప్తును సిట్ అధికారులు, పోలీస్‌ వ్యవస్థ ముమ్మరంగా కొనసాగిస్తోంది. హత్యకు సంబంధించిన మూలాలను కదిలించడంతో కొన్ని ఆధారాలు సైతం లభించినట్లు తెలుస్తోంది.
*విద్యుత్తు తీగలకు తగిలి 13 పశువులు మృత్యువాత పడ్డాయి. ఈ సంఘటన నిర్మల్‌ జిల్లా ముథోల్‌ మండలంలోని కారేగాంలో చోటుచేసుకుంది. బుధవారం చిన్నపాటి గాలి వాన రావటంతో పొలాల్లోని విద్యుత్తు స్తంభం నేలకొరిగి తీగలు కిందపడిపోయాయి.
*ఇరాక్‌లోని మోసుల్‌ సమీపంలో టైగ్రిస్‌ నదిలో ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుంది. కుర్దిష్‌ నూతన సంవత్సర వేడుకల సందర్భంగా పరిమితికి మించి ఎక్కువ మంది ఆ పడవలో ప్రయాణించారని అక్కడి అధికారులు తెలిపారు.
*హోలీ వేడుకలో చెలరేగిన స్వల్ప వివాదం కాల్పులకు దారితీసింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని లక్ష్మిపూర్‌ నియోజకవర్గం ఎమ్మెల్యే యోగేశ్‌ వర్మ భాజపాకి చెందిన వారు. ఇప్పుడు జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో లక్ష్మిపూర్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బరిలో దిగనున్నారు.
*తూర్పు చైనాలోని యాన్‌చెంగ్‌లో ఉన్న ఓ రసాయన పరిశ్రమలో భారీ పేలుడు సంభవించి, ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పేలుడు ధాటికి ఆ పరిశ్రమ దగ్గరలోని భవనాల అద్దాలు ధ్వంసమయ్యాయి.
*ఇథియోపియా దేశంలో దుండగుల దురాగతానికి ఓ హైదరాబాదీ వ్యాపారి బలైపోయారు. రాగి గనుల వ్యాపారం నిమిత్తం ఆ దేశానికి వెళ్లిన హైదరాబాద్‌వాసి పీవీ శశిధర్‌.. ఆగంతకులు నిప్పుపెట్టడంతో కారులోనే సజీవ దహనమయ్యారు. బుధవారం అశోక్‌నగర్‌లోని ఆయన నివాసం వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి.
*ఈదురు గాలుల కారణంగా గోదావరిలో తెప్ప బోల్తా పడటంతో వలలో చిక్కుకుని ఓ జాలరి మరణించాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం రాయపట్నం వద్ద బుధవారం చోటుచేసుకుంది.
*అమ్మాయినంటూ ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ను ఫోన్‌ సంభాషణతో నమ్మించి వంచించిన ఐటీ ఉద్యోగిని.. పోలీసులు అరెస్ట్‌ చేశారు. శివమాధవ్‌ అనే ఆ నిందితుడిని బుధవారం కోర్టులో హాజరుపరిచి, ఆ తర్వాత జైలుకు తరలించామని అదనపు డీసీపీ(సైబర్‌ క్రైమ్స్‌) కె.సి.ఎస్‌.రఘువీర్‌ వెల్లడించారు.
*ముఖ్యమంత్రి కేసీఆర్‌ను అవమానించేలా సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసిన వ్యక్తిపై కరీంనగర్‌ మూడో ఠాణాలో కేసు నమోదైంది. సీఐ విజయకుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం..కరీంనగర్‌లో ఆదివారం జరిగిన సభలో సీఎం కేసీఆర్‌ ప్రసంగిస్తూ ‘మేమూ హిందువులమే’ అన్న మాటలకు వక్రార్థాలు తీసి అవమానం కలిగించేలా విలాసాగర్‌ సాయికుమార్‌ అనే వ్యక్తి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడు. విషయం గుర్తించిన పోలీసులు సాయికుమార్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
*లారీ కింద పడి రిమాండ్‌ ఖైదీ ఆత్మహత్య చేసుకున్నాడు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండల పరిధిలోని కిష్టారం వై.జంక్షన్‌ సమీపంలో బుధవారం ఈ ఘటన జరిగింది.
*బిహార్‌లోని ముజఫర్‌పుర్‌ జిల్లా శోఖ్‌పుర్‌లోని జాప్‌సీ టోలాలో బుధవారం తెల్లవారు జామున మంటలు చెలరేగడంతో దాదాపు 300 ఇళ్లు కాలి బూడిదయ్యాయి.
*కన్నతండ్రి రోడ్డు ప్రమాదంలో కళ్ల ముందే కన్నుమూసినా.. ఆ దుఃఖాన్ని దిగమింగుకుని ఓ విద్యార్థి పదో తరగతి పరీక్షలకు హాజరయ్యాడు.
*నకిలీ పాస్‌పోర్టులు, వీసాల ద్వారా పలువురిని గల్ఫ్‌ దేశాలకు పంపిస్తున్న రెండు వేర్వేరు ముఠాలకు చెందిన 18 మంది సభ్యులను సైబరాబాద్, శంషాబాద్ విమానాశ్రయం పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 250 నకిలీ పాస్‌పోర్టులు, వీసాలు, 38 చరవాణులు, 6 కంప్యూటర్లు, రెండు ప్రింటర్లు, రూ.5 లక్షల నగదుతో పాటు క్రెడిట్‌, డెబిట్, పాన్‌కార్డులు, బ్యాంకు పాసుపుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు.
కడప జిల్లాకు చెందిన మణికంఠ, పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన పుష్ప వేర్వేరు ముఠాలుగా ఏర్పడి అమాయకులను లక్ష్యంగా చేసుకుని ఉపాధి కోసం కువైట్‌ పంపిస్తామని నమ్మబలికి తమ ఉచ్చులో ఇరికిస్తున్నారు. నకిలీ పాస్‌పోర్టులు, వీసాల ద్వారా విదేశాలకు పంపుతూ ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.లక్షకు పైగా వసూలు చేసి మోసాలకు పాల్పడుతున్నారు. ఈ ముఠాలపై ఫిర్యాదు రావడంతో నిఘా పెట్టిన పోలీసులు వారిని పట్టుకున్నారు. విదేశాలకు పంపిస్తామని చెబుతున్న ఏజెంట్ల మాటలు నమ్మవద్దని పోలీసులు సూచిస్తున్నారు.
*ఇథియోపియాలో విషాదం చోటుచేసుకుంది. కారులో మంటలు చెలరేగడంతో జరిగిన ఈ ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త శశిధర్‌ ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌కు చెందిన శశిధర్‌ ఇథియోపియాలో ఖనిజాల వ్యాపారంలోకి దిగారు. ఇందులో భాగంగా నిన్న స్థల పరిశీలనకు మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి వెళ్తుండగా ఆయన ప్రయాణిస్తున్న కారులో మంటలు చెలరేగాయి. దీంతో కారులో ఉన్నవారు మృతిచెందారు.

కంప్యుటర్లో వైరస్ ఉందని 9కోట్లు నొక్కేశాడు

పోంజీ స్కామ్‌ ద్వారా సుమారు రూ.8.9 కోట్ల మోసానికి పాల్పడిన భారత సంతతి వ్యాపారవేత్తకు అమెరికా కోర్టు రెండున్నరేళ్ల జైలు శిక్ష విధించింది. అమ్రిత్‌ జస్వంత్‌ సింగ్‌ చహల్‌(31) న్యూయార్క్‌లో ప్రైవేటుగా మూలధన పెట్టుబడుల కంపెనీ నిర్వహిస్తున్నాడు. కంపెనీ తీవ్ర నష్టాల్లో ఉన్నప్పటికీ, తమ కంపెనీ ఏటా కనీసం 28-34 శాతం లాభాలు ఆర్జిస్తోందంటూ సుమారు 40 మందిని చహల్‌ మోసగించినట్టు కోర్టులో నిరూపణ అయ్యింది. నష్టాల విషయం బయటపడకుండా తప్పుడు బ్రోకరేజ్‌ రికార్డులు కూడా సృష్టించాడు. దీంతోపాటు ఓ పెట్టుబడిదారు పేరిట నకిలీ బ్యాంకు ఖాతాను తెరిచి, సొమ్మును ఆ ఖాతాల్లోకి మళ్లించడం ద్వారా తన వ్యక్తిగత అవసరాలకు నగదు వినియోగించుకున్నట్టు నిరూపణ అవడంతో కోర్టు జైలుశిక్ష విధించింది. అలాగే, ఉత్తర కరోలినాలోని షార్లెట్‌లో ఇతరుల కంప్యూటర్లను హ్యాక్‌ చేయడం ద్వారా రూ.20 కోట్ల మోసానికి పాల్పడిన కేసులో భారతీయ అమెరికన్‌ బిషప్‌ మిట్టల్‌(24)ను మేజిస్ర్టేట్‌ కోర్టు దోషిగా తేల్చింది. వందలాదిమంది కంప్యూటర్లలోకి తప్పుడు పాప్‌పలు పంపించడం ద్వారా కంప్యూటర్లు పనిచేయకుండా చేశారు. దీంతోపాటు వైరస్‌, తదితర సమస్యలు ఉంటే తమ కంపెనీని సంప్రదించాలంటూ కంపెనీ పేరు, ఫోన్‌ నంబరు స్ర్కీన్‌పై కనిపించేలా చేశారు. బాధితులు ఆ ఫోన్‌ నంబరుకు సంప్రదిస్తే, వైరస్‌, ఇతర సమస్యలు తొలగించడానికి అంటూ ఒక్కొక్కరి నుంచి రూ.13 వేల నుంచి రూ.1.64 లక్షల వరకూ వసూలు చేశారు. కోర్టులో నేరం అంగీకరించిన మిట్టల్‌ను పూచీకత్తుపై విడుదల చేశారు. శిక్ష వెల్లడించే తేదీని న్యాయమూర్తి ప్రకటించలేదు.

అతి తెలివికి ఏమి తక్కువ లేదు

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ను వేలకోట్లకు మోసగించి లండన్‌ పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీని ఎట్టకేలకు బ్రిటన్‌ పోలీసులు అరెస్టు చేశారు. లండన్‌లోని ఓ బ్యాంకుకు వెళ్లిన నీరవ్‌ మోదీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కుంభకోణం వెలుగులోకి వచ్చిన సంవత్సరానికి నీరవ్‌.. పోలీసులకు చిక్కాడు. అయితే ఈ సంవత్సర కాలంలో కేసు నుంచి తప్పించుకునేందుకు ఆయన ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఒకానొక దశలో ప్లాస్టిక్‌ సర్జరీ కూడా చేయించుకోవాలని అనుకున్నాడట. ఈ మేరకు కొన్ని మీడియా కథనాలు పేర్కొన్నాయి. గతేడాది ఫిబ్రవరిలో పీఎన్‌బీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. అయితే అప్పటికి చాలా రోజుల ముందు 2018 జనవరిలోనే నీరవ్‌, మరో ప్రధాన నిందితుడు మెహుల్‌ ఛోక్సీ విదేశాలకు పారిపోయారు. వీరి ఆచూకీ కోసం భారత దర్యాప్తు సంస్థలు అనేక ప్రయత్నాలు చేశాయి. ఇంటర్‌పోల్‌ను కూడా ఆశ్రయించడంతో నీరవ్‌, ఛోక్సీలపై అరెస్టు వారెంట్‌ కూడా జారీ అయ్యింది. అయితే నీరవ్‌ లండన్‌లోని వెస్ట్‌ఎండ్‌లో గల ఓ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నట్లు ఇటీవల టెలిగ్రాఫ్‌ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. దీంతో నీరవ్‌ ఆచూకీపై స్పష్టత వచ్చింది. మరోవైపు గతేడాది జనవరి నుంచి నీరవ్‌ లండన్‌లోనే ఉన్నాడు. కేసు దర్యాప్తు నుంచి తప్పించుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశాడు. అతి చిన్న పసిఫిక్‌ ద్వీపమైన వనౌటు దేశంలో పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవడం, యూకేలో ఆశ్రయం పొందేందుకు పెద్ద పెద్ద న్యాయ సంస్థలను కలవడం, సింగపూర్‌లో శాశ్వత నివాసం కోరడం లాంటివి చేశాడు. ఒక దశలో తన రూపాన్ని మార్చుకునేందుకు ప్లాస్టిక్‌ సర్జరీ కూడా చేయించుకోవాలనుకున్నట్లు సదరు మీడియా కథనాలు వెల్లడించాయి. అయితే ఆయన ప్రయత్నాలేవీ ఫలించలేదు. నీరవ్‌ ఆచూకీ బయటకు రావడంతో పోలీసులు నిఘా పెట్టారు. ఈ క్రమంలోనే లండన్‌లోని మెట్రో బ్యాంక్‌ శాఖలో ఖాతా తెరవడానికి వచ్చిన నీరవ్‌ను అక్కడి సిబ్బంది ఒకరు గుర్తుపట్టి పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని అరెస్టు చేశారు. త్వరలోనే ఆయనను భారత్‌కు అప్పగించే అవకాశాలు కన్పిస్తున్నాయి.

భారత జైలు కంటే దారుణంగా…

భారత్‌లో జైళ్లు నరకప్రాయంగా ఉంటాయి.. ఇది పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడైన విజయ్‌మాల్యా లండన్‌ కోర్టులో చేసిన ఆరోపణలు.. ఇలానే భారత్‌ జైళ్లలో ఉన్న ఇబ్బందులను సాకుగా చూపి నేరస్థులు చక్కగా విదేశాల్లోనే గడిపేస్తుంటారు. ఒకానొక దశలో విజయ్‌ మాల్యా కోసం ముంబయి ఆర్థర్‌ రోడ్‌ జైల్లో ఒక గదిని ప్రత్యేకంగా తయారు చేశారు. పాఠశాలల గదులే సరిగా లేకుండా అవస్థలుపడుతున్న దేశంలో ఒక ఆర్థిక నేరగాడికి ఇంతగా సౌకర్యాలు ఏర్పాటు చేయడం అవసరమా అన్న విమర్శలు కూడా ఎదురయ్యాయి. ఇప్పుడు తాజాగా లండన్‌లో అరెస్టైన నీరవ్‌ మోదీని అక్కడే కస్టడీలో ఉండాలని విస్ట్‌మినిస్టర్‌ న్యాయస్థానం ఆదేశించింది. నీరవ్‌ను తరలించే జైలుకు ఒక ప్రత్యేకత ఉంది. బ్రిటన్‌లోనే అత్యంత రద్దీగా ఉండే హెచ్‌ఎంపీ వాండ్స్‌వర్త్‌ జైలు ఇది. ఇక్కడి ఖైదీల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది బి కేటగిరిలోకి వచ్చే జైలు. ఇక్కడ కరుడుగట్టిన నేరగాళ్లను ఎక్కవగా ఉంచుతారు. దావూద్‌ ఇబ్రహీం సన్నిహితుడు జబీర్‌ మోతీని కూడా ఇక్కడే ఉంచారు. ఇక్కడ మత్తుపదర్థాల కేసుల్లో అరెస్టైనవారు, మానసిక వైకల్యంతో నేరాలు చేసినవారు ఉంటారు. 1851లో నిర్మించిన ఈ జైల్లో దాదాపు 1,428 మంది ఖైదీలు ఉంటున్నారు. బ్రిటన్‌లో ఒక జైల్లో ఈ సంఖ్యలో ఖైదీలను ఉంచడం చాలా అరుదు. ఇది జైలు సామర్థ్యం కంటే చాలా ఎక్కువ. ఇక్కడ మరుగుదొడ్ల పరిస్థితులు ఘోరంగా ఉంటాయనే విమర్శలు ఉన్నాయి. ఇక్కడ ఖైదీలను కూడా అతితక్కువ సమయం మాత్రమే బయటకు అనుమతిస్తారు. అంతేకాదు ఇక్కడ ఎవరికీ ప్రత్యేకంగా ఒక గది కేటాయించరు. దీంతో నీరవ్‌కూడా మరో నేరగాడితో తన గదిని పంచుకోవాల్సి వచ్చే అవకాశం ఉంది. మార్చి 29 తర్వాత నీరవ్‌ భవిత ఏమిటనేది తేలుతుంది.

ఇంకోసారి ఇండియా జోలికి వెళ్తే…

ఉగ్రవాదంపై స్థిరమైన, అర్థవంతమైన చర్యలు తీసుకోవాలని పాకిస్థాన్‌కు అమెరికా మరోసారి సూచించింది. భారత్‌పై మరో ఉగ్రదాడి జరిగిన పక్షంలో పరిస్థితులు తీవ్ర పరిణామాలకు దారితీసే అవకాశం ఉందని హెచ్చరించింది. ‘‘ఉగ్రవాదంపై పాకిస్థాన్‌ నిర్మాణాత్మక, స్థిరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా జేషే మహ్మద్‌, లష్కరే తోయిబా సంస్థల కార్యకలాపాలపై పటిష్ఠ చర్యలు తీసుకోవాలి. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తగ్గే అవకాశం ఉంది’’ అని శ్వేతసౌధానికి చెందిన ఓ ఉన్నతాధికారి అన్నారు. ఉగ్ర సంస్థలపై సరైన చర్యలు తీసుకోకుండా ఉండి, భారత్‌పై మరో ఉగ్రదాడి జరిగితే అది పాకిస్థాన్‌కు చాలా ప్రమాదం అని మరో అధికారి హెచ్చరించారు. దీంతో ఇరు దేశాల మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందన్నారు. పుల్వామా ఉగ్రదాడి అనంతరం ప్రపంచ దేశాల నుంచి పాకిస్థాన్‌పై ఒత్తిడి పెరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌ ఎటువంటి చర్యలు చేపట్టిందన్న అంశంపై అమెరికా అధికారులు స్పందించారు. ఇటీవల పాక్‌ ఉగ్రవాదంపై చర్యలు ప్రారంభించినట్లు అర్థమవుతోందని వారు అభిప్రాయపడ్డారు. అందులో భాగంగా జేఈఎం లాంటి సంస్థల కార్యకలాపాలపై నియంత్రణ విధించారన్నారు. ఉగ్రనేతల ఆస్తులను సైతం జప్తు చేసినట్లు పేర్కొన్నారు. అయితే వారు ఎలాంటి చర్యలు చేపడుతున్నారో ఇప్పుడే ఒక అంచనాకు రాలేమని స్పష్టం చేశారు. గతంలోనూ కొంతమందిని అరెస్టు చేసినప్పటికీ అనంతర కాలంలో వారిని విడుదల చేశారని గుర్తుచేశారు. ఇప్పటికీ కొంత మంది ఉగ్రనేతలు పాకిస్థాన్‌లో ర్యాలీలు, సమావేశాలు నిర్వహిస్తున్నారన్నారు. ఆర్థిక చర్యల కార్య దళం(ఎఫ్‌ఏటీఎఫ్‌) నుంచి పొంచి ఉన్న ముప్పు కారణంగానే పాకిస్థాన్‌ చర్యలకు పూనుకున్నట్లు అర్థమవుతోందిని అమెరికా అధికారులు అభిప్రాయపడ్డారు. లేని పక్షంలో భవిష్యత్తులో పాక్‌ తీవ్ర ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవాల్సిన ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇరు దేశాల మధ్య ప్రస్తుత పరిస్థితులు కాస్త చల్లబడ్డప్పటికీ.. సైనిక దళాలు మాత్రం సరిహద్దుల్లో అప్రమత్తంగా ఉన్నాయన్నారు. మరో దాడి జరిగిన పక్షంలో ఇరు దేశాల మధ్య పరిస్థితులు చేజారిపోయే అవకాశం ఉందన్నారు. పుల్వామా దాడి, అనంతరం ఉగ్రస్థావరాలపై భారత వైమానిక దళం జరిపిన దాడుల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. దీంతో రంగంలోకి దిగిన అమెరికా ఇరు దేశాల ప్రతినిధులతో నిరంతర చర్చలు జరిపింది. పరిస్థితులు చేజారిపోకుండా చూడాలని పదే పదే సూచించింది. ఉగ్రవాదంపై పాకిస్థాన్‌ పటిష్ఠ చర్యలు తీసుకోవాలని హెచ్చరించింది. అలాగే ప్రపంచ దేశాలు భారత్‌కు మద్దతుగా నిలిచాయి. పాక్‌పై తీవ్ర స్థాయిలో ఒత్తిడి పెంచాయి.

హెచ్‌ 1బీ దరఖాస్తుల సందడి

అమెరికాలో ఉద్యోగం చేయాలని లక్షల మంది కలలు కంటూ ఉంటారు. ఈ కలను నెరవేర్చుకునేందుకు రాత్రింబవళ్లు ఎంతో శ్రమిస్తుంటారు. అలాంటి ఆశావహులకు అమెరికా తాజాగా స్వాగతద్వారాలు తెరవబోతోంది. 2020 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏప్రిల్‌ 1 నుంచి హెచ్‌ 1బీ దరఖాస్తులు స్వీకరించబోతోంది. అక్టోబరు 1 నుంచి వర్తించేలా 65వేల మందికి అమెరికా పౌరసత్వం, వలసవాదుల సేవవిభాగం(యూఎస్‌సీఐఎస్‌) ఈ వీసాలు మంజూరు చేయనుందని ‘‘ద అమెరికన్‌ బజార్‌ డెయిలీ’’ కథనం రాసింది. వీటికి అదనంగా మరో 20వేల వీసాలు కేవలం అమెరికా విశ్వవిద్యాలయాల్లో మాస్టర్స్‌ లేదా ఉన్నత డిగ్రీ అభ్యసించినవారికి మంజూరు చేయనున్నారు. ఇటీవల వలస చట్టాలను కఠినం చేయడం, హెచ్‌ 1బీ వీసాదారుల వివరాలు ఒకటికి పదిసార్లు పరిశీలిస్తుండటం ఈసారి కొంతవరకు ప్రభావం చూపవచ్చని కొంతమంది న్యాయవాదులు చెబుతున్నారు. నిరంతరం కొనసాగుతున్న వీసాల పరిశీలన, ప్రభుత్వ నిబంధనల్లో మార్పుల వల్ల ఈ ఏడాది అసాధారణంగా ఉండబోతోందని కొంతమంది న్యాయవాదులు అభిప్రాయపడుతున్నారు. ప్రతి సంస్థకి జారీ చేసిన వీసాలను లెక్కించాలని జనవరిలో ‘యూఎస్‌సీఐఎస్‌’ ఆదేశాలు జారీ చేసింది. ఇంతకుముందు వరకు 20 వేల దరఖాస్తులు అత్యున్నత నైపుణ్యం గలవారికి, 65వేల దరఖాస్తులు ఇతరులకు కేటాయించేవారు. ప్రస్తుతం ఈ నిబంధన మార్చారు. అమెరికాలో అడ్వాన్స్డ్‌ డిగ్రీ చేసినవారిని కూడా ఇతరుల దరఖాస్తులతో కలిపి 85వేల దరఖాస్తుల్లో భాగంగా వడబోయడానికి యూఎస్‌సీఐఎస్‌ నిర్ణయించింది. దీనివల్ల యూఎస్‌ మాస్టర్స్‌ డిగ్రీ చేసినవారు అధికంగా ప్రయోజనం పొందనున్నారు.