ప్రముఖ జానపద, శాస్త్రీయ లలిత సంగీత గాయని వింజమూరి అనసూయాదేవి (99) అమెరికాలోని హ్యూస్టన్‌లో కన్ను మూశారు. ఆలిండియా రేడియో ద్వారా తెలుగు జానపద గీతాలకు అనసూయా దేవి ఎనలేని ప్రాచుర్యం కల్పించారు. జానపద గేయాలు రాయడంలో, బాణీలు కట్టడంలో, పాడడంలో అనసూయా దేవిది అందెవేసిన చేయి. ఈమెకు హార్మోనియం వాయించడంలోనూ అద్భుతమైన ప్రావీణ్యం ఉంది. అనసూయా దేవి ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి కళాప్రపూర్ణ, డాక్టరేట్ కూడా అందుకున్నారు. 1920 మే 12న కాకినాడలో జన్మించారు. అనసూయా దేవికి ఐదుగురు సంతానం. ఈమె ప్రముఖ కవి దేవులపల్లి కృష్ణశాస్త్రి మేనకోడలు. ఆమె మృతి పట్ల సిలికానాంధ్ర సంతాపం వ్యక్తపరిచింది.
Category: అమెరికాలో ప్రముఖులు
డా.ముక్కామల జీవితకథ “ఉత్సాహమే ఊపిరిగా” ఆవిష్కరణ
ప్రకాశం ప్రవాసులు బాగా సహకరిస్తున్నారు–కోమటి జయరాం
ఆంధ్రరాష్ట్రంలో ఇప్పటి వరకు 3500 డిజిటల్ తరగతి గదులను ఉన్నత పాటశాలలో ఏర్పాటు చేశామని ఏపీ జన్మభూమి కోఅర్డినేటర్ అమెరికాలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి కోమటి జయరాం తెలిపారు. బుధవారం నాడు ప్రకాశం జిల్లా పొదిలి మండలం ఉప్పలపాడు పాటశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన డిజిటల్ తరగతి గదిని జయరాం ప్రారంభించారు. రాష్ట్రంలో ఎక్కువగా డిజిటల్ తరగతి గదులను ప్రకాశం జిల్లాలోనే ఏర్పాటు చేశారని దీనికోసం ప్రకాశం జిల్లాకు చెందిన ప్రవాసాంధ్రులు విరాళాలు అందించడంలో ముందంజలో ఉన్నారని తెలిపారు. ఈ సందర్భంగా జయరాం తన చిన్ననాటి జ్ఞాపకాలును నెమరువేసుకున్నారు. (వీడియో చూడండి) పలు ఆసక్తికరమైన విషయాలను విద్యార్ధులకు వివరించారు. ఈ కార్యక్రమంలో డిజిటల్ తరగతి గదికి విరాళం ఇచ్చిన అట్లాంటాకు చెందిన ప్రవాసాంధ్రుడు మొవ్వ రవికిరణ్, జిల్లా విద్యాశాఖాదికారి సుబ్బారావు, పాటశాల ఉపాద్యాయులు, గ్రామ ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఘనంగా సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ ప్రథమ స్నాతకోత్సవం
ఆమెరికాలోని కాలిఫొర్నియా రాష్ట్రంలో రెండు సంవత్సరాల క్రితం స్వతంత్ర ప్రతిపత్తితో ఏర్పాటయి భారతీయ కళలు మరియు భాషలలో మాస్టర్స్, డిప్లొమ మరియు సర్టిఫికెట్ స్థాయి కోర్సులను అందిస్తున్న సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ ప్రథమ స్నాతకోత్సవం ఆదివారం నాడు ఘనంగా నిర్వహించబడింది. తొలి బ్యాచ్ లో చేరి కోర్సు పూర్తి చేసిన ౩1 మంది విద్యార్ధులకు సిలికానాంధ్ర విశ్వ విద్యాలయ అధ్యక్షులు ఆనంద్ కూచిభొట్ల మరియు విశ్వ విద్యాలయ పాలకవర్గ చైర్మన్ శ్రీ లకిరెడ్డి హనిమిరెడ్డి చేతుల మీదుగా ఈ స్నాతకోత్సవంలో పట్టాలు అందించడం జరిగింది. కాంప్ బెల్ హెరిటేజ్ థియేటర్్లో జరిగిన ఈ కార్యక్రమం ప్రారంభంలో నిర్వహంచిన శోభాయాత్ర చూపరులను ఎంతో ఆకట్టుకొన్నది. విశ్వవిద్యాలయం ప్రొవొస్ట్ రాజు చమర్తి ముందు నడవగా పాలక వర్గ సభ్యులు అద్యక్షులు ఆనంద్ కూచిభొట్ల, చైర్మన్ డా. హనిమిరెడ్డి లక్కిరెడ్డి, డా. పప్పు వేణుగోపాల రావు, నీరజ్ భాటియా, చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ దీనబాబు కొండుభట్ల, చీఫ్ కాంప్లయన్స్ ఆఫీసర్ దిలీప్ కొండిపర్తి, ప్రముఖ వ్యక్తిత్వవికాస నిపుణులు ప్రసాద్ కైపా మరియు పట్టభద్రులు కాబోతున్న విద్యార్ధులు స్నాతకోత్సవ దుస్తులతో కవాతుగా వేదిక వద్దకు వచ్చారు. 2001వ సంవత్సరంలో సిలికానాంధ్ర ప్రారంభించిన నాటి నుంచి ఈ రోజు వరకు సాధించిన విజయాలను గుర్తు చేస్తూ రాబోయే రోజులలో విశ్వవిద్యాలయం లక్ష్యం, ప్రణాళిక, కార్యకలాపాలను వివరిస్తూ స్పూర్తిదాయకమయిన స్వాగతోపన్యాసం చేసారు అధ్యక్షులు శ్రీ ఆనంద్ కూచిభొట్ల. సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ త్రైమాసిక పత్రిక ‘శాస్త్ర’ ను పాలక మండలి సభ్యులు మరియు అకాడమిక్ అడ్వైజరి కమిటి చైర్మన్ డా. పప్పు వేణుగోపాలరావ్ ఆవిష్కరించారు. శనివారం జరిగిన స్నాతకోత్సవ సంబరాల్లో విశ్వవిద్యాలయ విద్యార్ధులు ప్రదర్శనలిచ్చారు , ప్రఖ్యాత సంగీత విద్వాంసులు, సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం కర్ణాటక సంగీత ఆచార్యులు డా. శ్రీరాం పరశురాం నిర్వహించిన హిందుస్తాని-కర్ణాటక సంగీత జుగల్‌బంది కచేరీకి ప్రేక్షకులు తన్మయత్వం చెందారు. ఈ కార్యక్రమంలో పాల్గొనటానికి భారతదేశం నుంచి ప్రత్యేకంగా విచ్చేసిన అధ్యాపక బృందం డా. శ్రీరాం పరశురాం, డా.మాలా స్వామి, డా.రమాదేవి, డా. సుమిత్ర వేలూరి, డా.యశోద ఠాకూర్, డా.అనుపమ కైలాష్ తదితరులను విశ్వవిద్యాలయ పాలకవర్గం ప్రత్యేకంగా సన్మానించింది.
తానా వ్యవస్థాపకులు డా.కాకర్ల సుబ్బారావుపై ప్రత్యేక కథనం
డా|| కాకర్ల సుబ్బారావు (జ.జనవరి 25 1925) ఎమ్.బి.బి.యస్., యమ్.ఎస్., ఎఫ్.ఆర్.సి.ఆర్., ఎఫ్.ఆర్.సి.ఆర్., ఎఫ్.ఐ.సి.పి. ( FRCR, FACR, FICP, FSASMA, FCCP, FICR, FCGP) రేడియాలజిస్ట్ మరియు హైదరాబాదులో నున్న ప్రసిద్ధ ఆసుపత్రి నిమ్స్ పూర్వ డైరెక్టర్.
న సంపాదించాడు. 1951 సంవత్సరంలో హౌస్ సర్జన్సీ చేసిన తరువాత వైద్యంలో ఉన్నత విద్య కోసం ప్రత్యేక పారితోషికంతో అమెరికా వెళ్ళాడు.
అమెరికాలో సుబ్బారావు జీవితం
అమెరికాలో వైద్య పరీక్షలైన అమెరికా రేడియాలజి బోర్డు పరీక్షలలో 1955 సంవత్సరంలో ఉత్తీర్ణులై న్యూయార్క్ మరియు బాల్టిమోర్ నగరాలలోని ఆసుపత్రులలో 1954-1956 సంవత్సరం వరకు పనిచేశాడు. సుబ్బారావు 1956 సంవత్సరంలో ఇండియా తిరిగి వచ్చి హైదరాబాదు నగరంలో ఉన్న ఉస్మానియా వైద్య కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేరాడు. ఆ తరువాత ఉస్మానియా కళాశాలలోనే ప్రధాన రేడియాలజిస్టుగా కుడా పదోన్నతి పొందాడు. 1970 సంవత్సరంలో సుబ్బారావు మళ్ళీ అమెరికా ప్రయాణం కట్టాడు. యునైటెడ్ కింగ్‌డమ్ వారి ఫెల్లో ఆఫ్ రాయల్ కాలేజి ఆఫ్ రేడియాలజిస్టు (‘Fellow of Royal College of Radiologists (UK) అనే పట్టా సంపాదించుకొన్నాడు.అమెరికా లోని అనేక ఆసుపత్రులలో పనిచేశాడు.
సుబ్బారావు తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా మెట్టమెదటి అధ్యక్షుడు మరియు వ్యవస్థాపకుడు.
భారతదేశానికి తిరిగి రాక
1986 సంవత్సరంలో నందమూరి తారక రామారావు ప్రవాస ఆంధ్రులకు చేసిన విజ్ఞప్తి మేరపు సుబ్బారావు భారతదేశానికి తిరిగి వచ్చి హైదరాబాదులోని నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) లో చేరాడు. నిమ్స్ ఆసుపత్రి సుబ్బారావు చేరక మునుపు వరకు ఎముకల ఆసుపత్రిగా ప్రసిద్ధి చెందింది. సుబ్బారావు అక్కడ చేరాక అన్ని విభాగాలనూ అభివృద్ధి చేసి రాష్ట్రంలో ఉన్న ప్రైవేటు కార్పోరేటు ఆసుపత్రులకు దీటైన స్థాయికి తీసుకొని వచ్చాడు. ఇప్పుడు నిమ్స్ సంస్థ రాష్ట్ర మరియు దేశ వ్యాప్తంగా రోగుల చికిత్సా పరంగా, వైద్య వృత్తి శిక్షణా పరంగా, వైద్య పరిశోధన పరంగా, పేరెన్నిక కలిగిన వైద్య సంస్థ.
సుబ్బారావు రేడియాలజిలో అనేక పుస్తకాలు మరియు జర్నల్స్ లో పరిశోధనా వ్యాసాలు వ్రాశాడు. దేశ విదేశాలలో వైద్య ఉపన్యాసాలు ఇచ్చాడు. యాభై ఏళ్ల అనుభవంలో అనేక బహుమతులు, సన్మానాలు పొందాడు.
అవార్డులు
సుబ్బారావు వైద్యశాఖకు, మానవాళికి చేసిన సేవకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 2000 సంవత్సరంలో పద్మశ్రీ అవార్డు ప్రదానం చేసి సత్కరించింది. ఇండియా రేడియాలాజికల్ అండ్ ఇమేజింగ్ అసోసియేషన్ వారి అనుబంధ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర చార్టరు సుబ్బారావుకు మార్చి 17, 2001న జీవితకాలపు కృషి అవార్డు ప్రదానం చేశారు. ఆయన ఆంగ్లంలో పలికిన పలుకులు “I pass through this life only once, let me do the maximum good to the largest number of people.”
ఎదురుమొండి హైస్కూల్లో డిజిటల్ తరగతి గది ప్రారంభం
కృష్ణాజిల్లా నాగాయలంక మండలం ఎదురుమొండి హైస్కూల్లో ప్రవాసాంధ్రుడు న్యూజెర్సీలోని ‘దక్కన్ స్పైస్’ హోటల్ యజమాని బొబ్బా గోవర్ధన్ విరాళంతో డిజిటల్ క్లాసు రూంను ఏర్పాటు చేశారు. దీనిని తానా కోశాధికారి పొట్లూరి రవి బుధవారం నాడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దాత బొబ్బా గోవర్ధన్ తో పాటు తానా సమన్వయకర్త ముప్పా రాజశేఖర్, ఎదురుమొండి గ్రామప్రముఖులు పాటశాల విద్యార్ధులు, ఉపాద్యాయులు పాల్గొన్నారు. అనంతరం పొట్లూరి రవి బృందం, స్థానిక శాసన సభ్యుడు, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ద ప్రసాద్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం బుద్దప్రసాద్ వారిని శాలువాతో సత్కరించారు.
డిజిటల్ తరగతులపై ఏపీ జన్మభూమి డాక్యుమెంటరి
ప్రవాసాంధ్రుల విరాళాలతో ఏపీ జన్మభూమి పధకం కింద రాష్ట్రంలో నిర్మిస్తున్న డిజిటల్ తరగతి గదుల ఏర్పాటు పై ఒక డాక్యుమెంటరీని రూపొందిస్తున్నారు. ఒక సైకిల్ యాత్ర ద్వారా జిల్లాలో పర్యటిస్తూ డాక్యుమెంటరీని రూపొందిస్తున్నారు. దీనిని కర్నూలులో జిల్లా కలెక్టర్ సత్యనారాయణ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ప్రవాసాంధ్రుల విరాళాలతో నిర్మిస్తున్న డిజిటల్ తరగతి గదులు ప్రభుత్వ పాటశాలల విద్యార్ధులకు బాగా ఉపయోగపడుతున్నాయని అన్నారు. కర్నూలు జిల్లాలో డిజిటల్ తరగతి గదుల ఏర్పాటుకు సహకరిస్తున్న జన్మభూమి సమన్వయకర్త కోమటి జయరాం, తానా కోశాధికారి పొట్లూరి రవిలను కలెక్టర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాదికారి సుల్తాన్, జన్మభూమి ప్రతినిధులు ప్రదీప్, అమర్ అక్బర్ తదితరులు పాల్గొన్నారు.
కృష్ణా జిల్లాకు డా.హనిమిరెడ్డి భారీ విరాళం
అమెరికాకు చెందిన ప్రముఖ ప్రవాసాంధ్రుడు, గుండె వైద్య నిపుణుడు డా.లకిరెడ్డి హనిమిరెడ్డి మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. ఇప్పటివరకు వివిధ సామాజిక సేవా కార్యక్రమాలకు ₹60కోట్లకు పైగా విరాళాలిచ్చిన హనిమిరెడ్డి కృష్ణాజిల్లాలో కలెక్టర్ లక్ష్మీకాంతం విజ్ఞప్తి మేరకు డిజిటల్ తరగతి గదుల నిర్మాణానికి $50వేలడాలర్లను(₹35లక్షలు) అందించారు. ఏపీ జన్మభూమి పథకం క్రింద కృష్ణా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో నిర్మిస్తున్న డిజిటల్ తరగతి గదులకు ఈ నిధులను వినియోగిస్తారు. గతంలో డిజిటల్ తరగతి గదులకు $7500 విరాళాన్ని ప్రకటించిన హనిమిరెడ్డి మరో 50వేల డాలర్లను అందించారు. భారీగా విరాళమందించిన హనిమిరెడ్డిని అమెరికాలో ఆంధ్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, ఏపీ జన్మభూమి సమన్వయకర్త కోమటి జయరాం కృతజ్ఞతలు తెలిపారు.
డల్లాస్‌లో గణతంత్ర వేడుకలు
దుర్గి మండలంలో విజయవంతంగా తానా రైతుకోసం
గుంటూరు జిల్లా దుర్గి మండలం ఒబులేసునిపల్లెలో తానా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతుకోసం కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. 1500మందికి పైగా రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తానా రైతుకోసం సమన్వయకర్త కోట జానయ్య సోదరుడు కోట హనుమంతరావు విరాళంగా అందించిన డిజిటల్ క్లాస్‌రూం తరగతిని ప్రారంభించారు. డా.గోరంట్ల వాసుబాబు ఒబులేసునిపల్లె, ముటుకూరు జడ్పీ ఉన్నత పాఠశాలలకు సైన్స్ పరికరాలను అందించారు.
కూచిపూడి ‘సంజీవని’ ఆసుపత్రి నిర్మాణం అద్భుతం.
యాభై కోట్ల రూపాయల అంచనా వ్యయంతో కేవలం పద్దెనిమిది నెలల వ్యవధిలో కూచిపూడిలో సిలికానాంద్ర ఆద్వర్యంలో నిర్మించిన సంజీవని ఆసుపత్రి ఒక అద్భుతమని అమెరికాకు చెందిన ప్రముఖ వైద్యుడు, దాత డా.లక్కిరెడ్డి హనిమిరెడ్డి ప్రశంసించారు. సిలికానాంద్ర వ్యవస్థాపకుడు కూచిభొట్ల ఆనంద్ ఆహ్వానం మేరకు డా.హనిమిరెడ్డి గురువారం నాడు ఈ ఆసుపత్రిని సందర్శించారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ప్రజలకు ఉపయోగపడే విధంగా ఇటువంటి భారీ ఆసుపత్రి కూచిపూడి వంటి చిన్న గ్రామంలో ఏర్పాటు చేయడం అభినందించదగ్గ విషయమని డా. హనిమిరెడ్డి కొనియాడారు. సిలికానాంద్ర ఆద్వర్యంలో చేపడుతున్న అన్ని కార్యక్రమాలకు తన వంతు సహాయ సహకారాలు ఎల్లపుడూ ఉంటాయని ఆయన తెలిపారు. అనంతరం డా. హనిమిరెడ్డిని ఆనంద్ ఆద్వర్యంలో ఆసుపత్రి సిబ్బంది సత్కరించారు. ఈ కార్యక్రమంలో TNI డైరెక్టర్ కిలారు ముద్దుకృష్ణ, విజయవాడకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త తోండేపు రామారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
రేపు రాజంపేటలో వేమన సతీష్ ధూం…ధాం…..
తానా అధ్యక్షుడిగా పని చేసేవారికి వారి పదవీ కాలంలో రెండు సవాళ్లు ఎదురవుతాయి. ఒకటి తానా మహాసభలను మూడురోజుల పాటు దిగ్విజయంగా నిర్వహించడం. రెండవది దానికి ఆరునెలల ముందు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించే తానా చైతన్య స్రవంతిని సమర్థవంతంగా పూర్తి చేయడం. ప్రస్తుతం తానా ఆధ్వర్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గతనెల 23వ తేదీ నుండి తానా చైతన్య స్రవంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుత తానా అధ్యక్షుడు వేమన సతీష్ తన జన్మభూమి కడప జిల్లా రాజంపేటలో 5వ తేదీ శనివారం తానా బ్యానర్ తో ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఒక రకంగా ఇది సతీష్ తన సత్తాను ప్రదర్శించే కార్యక్రమం ఇది. రాజంపేట చైతన్య స్రవంతికి వేమన సతీష్ తానా కార్యవర్గం మొత్తాన్ని ఆహ్వానించారు. పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా సతీష్ ఏర్పాట్లు చేశారు. రాజంపేట పట్టణంలో సతీష్ ఆధ్వర్యంలో మధ్యాహ్నం మూడు గంటల నుండి నిర్వహించే భారీ ప్రదర్శన ఆ పట్టణం చరిత్రలో నిలిచిపోయే విధంగా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. 500 మంది వివిధ రకాల కళాకారులు ఈ ప్రదర్శనలో పాల్గొని తమ కళలను ప్రదర్శిస్తున్నారు. సినీ నటులు నారారోహిత్, సునీల్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. వాషింగ్టన్ డీసీలో జరిగే తానా మహాసభల కన్వీనర్ ప్రొఫెసర్.మూల్పురి వెంకట్రావు, రాష్ట్ర నాటక అకాడమీ అధ్యక్షుడు గుమ్మడి గోపాలకృష్ణ తదితరులు ప్రముఖులు, పలువురు రాజకీయ నాయకులు రాజంపేట చైతన్య స్రవంతికి హాజరవుతున్నారు.
డా.హనిమిరెడ్డి ఔదార్యం అందరికి ఆదర్శం-మంత్రి ఉమా
విద్యార్ధుల్లో సైన్స్ పట్ల అవగాహన పొందడం కోసం ఏర్పాటు చేసిన అగస్త్య ఫౌండేషన్ విభాగాన్ని మైలవరంలో గురువారం నాడు మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. దీని ఏర్పాటు కోసం అమెరికాకు చెందిన ప్రముఖ కార్డియాలజిస్ట్ డా. లక్కిరెడ్డి హనిమిరెడ్డి రూ.75 లక్షలు విరాళంగా అందించారు. ఈ సందర్భంగా మంత్రి ఉమా మాట్లాడుతూ ఇప్పటి వరకు వివిధ సామాజిక సేవా కార్యక్రమాలుకు 60కోట్ల రూపాయలకు పైగా విరాళం అందించిన డా. హనిమిరెడ్డి ఔదార్యం గొప్పదని ప్రశంసించారు. ఆయన జీవితాన్ని ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకుని సమాజ సేవకు ముందుకు రావాలని మంత్రి ఉమా కోరారు. మైలవరం ప్రాంతంలో పెద్ద ఎత్తున కోట్లాది రూపాయల ఖర్చుతో వివిధ సంస్థలను ఏర్పాటు చేస్తున్న డా.హనిమిరెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. భారతదేశంలో సైన్స్ అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున కృషి చేస్తున్న అగస్త్య ఫౌండేషన్ మైలవరం ప్రాంతంలో విద్యార్ధుల కోసం శాఖను ఏర్పాటు చేయడం పట్ల ఆయన అభినందనలు తెలిపారు. ఫౌండేషన్ చైర్మన్ రాంజీ రాఘవ మాట్లాడుతూ భారతదేశంలో పందొమ్మిది రాష్ట్రాల్లో 200 మొబైల్ వాహనాల ద్వారా అగస్త్య ఫౌండేషన్ విద్యార్ధులకు శాస్త్రీయ పరిశోధనల పైన శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. చిత్తూరు జిల్లా కుప్పంలో 175 ఎకరాల స్థలంలో అగస్త్య ఫౌండేషన్ ఆద్వర్యంలో ఆధునిక పరిశోధనశాలలను ఏర్పాటు చేసిన ఉపాద్యాయులు, విద్యార్ధులకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. డా.హనిమిరెడ్డి మాట్లాడుతూ తాము సంపాదించిన దానిలో పేద విద్యార్ధులకు సహాయం చేయడం కోసం వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దడం కోసం ఎక్కువగా విరాళాలు ఇస్తున్నట్లు తెలిపారు. స్థానికంగా ఏర్పాటు చేసిన అగస్త్య ఫౌండేషన్ ఆద్వర్యంలో తిరువూరు, మైలవరం నియోజకవర్గాల్లోని హైస్కూల్ స్థాయి నుండి విద్యార్ధులకు, ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వటం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎన్నార్టీ చీఫ్ ఎక్జిక్యూటివ్ ఆఫీసర్ జానకిరాం, డా.హనిమిరెడ్డి సతీమణి విజయలక్ష్మి, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రమీల స్థానిక ప్రముఖుడు గోగులమూడి సత్యనారాయణరెడ్డి, ఎమ్మార్వో పుల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.
కృష్ణా జిల్లా తిరువూరులో డిజిటల్ తరగతి గది ప్రారంభించిన తాళ్లూరి జయశేఖర్
అమెరికాలోని కొలంబస్‌కు చెందిన ప్రవాసుడు, “టాకో” మాజీ అధ్యక్షుడు సామినేని రవి విరాళంతో సమకూర్చిన డిజిటల్ తరగతి గదిని కృష్ణా జిల్లా తిరువూరు జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో సోమవారం నాడు ప్రారంభించారు. తానా కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్ ఈ తరగతి గదిని ప్రారంభించారు. ఏపీ జన్మభూమి పథకం కింద అమెరికాలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరాం నాయకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేస్తొన్న డిజిటల్ తరగతి గదుల ఏర్పాటుకు స్పందించి తిరువూరులో దీన్ని ఏర్పాటుకు విరాళమందించినట్లు రవి సామినేని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక జడ్పీటీసీ కిలారు విజయబిందు, ఎంపీపీ గద్దె వెంకన్న, మాజీ తహశీల్దార్ పొట్లూరి తిరుమలరావు, రవి కుటుంబ సభ్యులు, హైస్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
కరీంనగర్‌లో వేడుకగా అమెరికా అక్కినేని అవార్డుల ప్రదానం
అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ఆధ్వర్యంలో కరీంనగర్‌లో శనివారం నాడు నిర్వహించిన 5వ అవార్డుల ప్రదానోత్సవం వైభవంగా జరిగింది. వివిధ రంగాల్లో ప్రముఖులయిన సుద్దాల అశోక్‌తేజ, ప్రొ.ఎస్.నాగేశ్వర్, వనజీవి రామయ్య దంపతులు, సజ్జా కిషోర్‌బాబు, సదాశివశాస్త్రి తదితరులకు పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు డా.తోటకూర ప్రసాద్, రావు కల్వల, ఆకునూరి శారద, వెన్నం మురళీ, డా.వంశీ రామరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ పురస్కారాల ప్రాధాన్యత గురించి AFA వ్యవస్థాపక అధ్యక్షుడు తోటకూర ప్రసాద్ వివరించారు. ఎమ్మెల్సీ లక్ష్మణరావు, ఎమ్మెల్యే గంగుల కమలాకరరావు, కరీంనగర్ మేయర్ రవీంద్రసింగ్, జడ్పీ చైర్‌పర్సన్ తులా ఉమ తదితరులు ఈ కార్యక్రమంలో
రేపు కరీంనగర్ లో అమెరికా అక్కినేని అవార్డుల ప్రధానం
టాంటెక్స్ ఆధ్వర్యంలో అష్టావధానం
ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం(టాంటెక్స్) సాహిత్య వేదిక ఆధ్వర్యంలో “నెల నెలా తెలుగు వెన్నెల” 137వ సాహిత్య సదస్సును ఆదివారం నాడు డల్లాస్‌లో వీర్నపు చినసత్యం ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. స్వాతి కృష్ణమూర్తి శిష్య బృందం లాస్య కండేపి , సహస్ర కాసం , సాన్విక కాసం, మనోజ్ఞ బొమ్మదేవర, ప్రితిక పలనిసేల్వం, దీప్తి గాలి, దర్శిత రాకం, శ్రీఆద్య ఊర, శ్రీనిధి తటవర్తి ప్రార్థనా గీతం ఆలపించారు. కార్యక్రమంలో భాగంగా ఈ సంవత్సరం జరిగిన కార్యక్రమాల సింహావలోకనం జరిగింది. అవధాన ప్రారంభసూచకంగా మంజు తెలిదేవర శిష్య బృందం అనిక మల్లెల, అరుణ గోపాలన్, ద్రువ్ చిట్టిప్రోలు, సుమిత్ చిట్టిమల్ల, భవాని, ఈషాని గీతాన్ని ఆలపించారు. సాహితి వేముల, సింధూర వేముల మరియు సమన్విత మాడ గరుడ గమన గీతాన్ని ఆలపించారు. అమెరికాలో స్థిరపడిన ప్రవాసులు డా.పుదూర్ జగదీశ్వరన్ అవధానిగా, జువ్వాడి రమణ సంధాతగా, డా. తోటకూర ప్రసాద్ వ్యస్తాక్షరి, కాజ సురేష్ నిషిధ్ధాక్షరి, భాస్కర్ రాయవరం సమస్య, డా. సుధ కలవగుంట న్యస్తాక్షరి, డా. ఊరిమిండి నరసింహారెడ్డి దత్తపది, వేముల లెనిన్ వర్ణన, వీర్నపు చినసత్యం ఘంటాగణనం, దయాకర్ మాడ అప్రస్తుత ప్రసంగం తదితర అంశాలకు పృచ్ఛకులుగా వ్యవహరించారు. లేఖకులుగా బాసబత్తిన, రమణ దొడ్ల, కృష్ణ కోడూరి బాధ్యతలు నిర్వహించారు. ‘వాజియు నెక్కెను పఠాని ప్రాకట ఫణితిన్’ అన్న సమస్యని శివాజీకి వర్తింపచేస్తూ అద్భుతంగా పూరించారు, పెరుగు, అరుగు, మరుగు, తరుగు పదాలను ఉపయోగిస్తూ మానవ సమతుల్య జీవనానికి సూత్రాలను దత్తపదిలో పూరించారు. వరూధినీ సౌందర్యాన్ని నిషిద్దాక్షరిలో లాఘవంగా పూరించారు. 20 అక్షరాల ఉత్పలమాల పాదాన్ని వ్యస్తాక్షరిలో చేధించారు. ఆద్యంతమూ అప్రస్తుత ప్రసంగం సభికులను నవ్వుల్లో ముంచెత్తింది. అవధాని కూడా చిలిపి ప్రశ్నలకు గడుసు సమాధానాలు ఇచ్చారు. ఉత్తర టెక్సస్ తెలుగుసంఘం (టాంటెక్స్) అధ్యక్షురాలు కృష్ణవేణి శీలం, ఉత్తరాధ్యక్షులు చినసత్యం వీర్నపు, ఉపాధ్యక్షుడు కోడూరు కృష్ణారెడ్డి, సతీష్ బండారు, కోశాధికారి పాలేటి లక్ష్మి, ఇతర కార్యవర్గ సభ్యులు, సాహిత్య వేదిక కమిటి సభ్యులు డా.పుదూర్ జగదీశ్వరన్‌ను జ్ఞాపిక, దుశ్శాలువాతో సన్మానించి “అవధాన విరించి” బిరుదుతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సుబ్బు జొన్నలగడ్డ, ఆనంద్ మూర్తి కూచిభోట్ల, జగదీశ్వర్ రావు, పులిగండ్ల విశ్వనాధ్, డా. ప్రసాద్ తోటకూర, సీ.ఆర్.రావు, రామకృష్ణ రోడ్ద తదితరులు పాల్గొన్నారు.
పాతూరి వారింట పెళ్లిసందడి-హాజరయిన చంద్రబాబు
గుంటూరు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, తెదేపా సీనియర్ నాయకుడు పాతూరి నాగభూషణం కుమార్తె డా.బిందుప్రియ వివాహం మంగళగిరిలోని సీకె కన్వెన్షన్ సెంటరులో శనివారం రాత్రి వైభవంగా జరిగింది. సీఎం చంద్రబాబు, స్పీకర్ కోడెల, అమెరికాలో ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరాం, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు వివిధ పార్టీల నాయకులు ఈ పెళ్లిసందడికి హాజరయ్యారు.
కళాసేవలో అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా- కరీంనగర్‌లో 5వ అవార్డుల ప్రదానోత్సవం
అమెరికాలో డా.తోటకూర ప్రసాద్ సారద్యంలో అక్కినేని అభిమానులు 2014లో ఏర్పాటు చేసిన అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా (ఏ.ఎఫ్.ఏ) కళా సేవా రంగంలో విశేషమైన కృషి చేస్తోంది.పలువురు ప్రముఖులకు అవార్డులను ఇచ్చి సత్కరిస్తుంది. ఇప్ప్పటి వరకు ఏ.ఎఫ్.ఏ ఆద్వర్యంలో నాలుగు అవార్డుల ప్రదానోత్సవాలను తెలుగు రాష్ట్రాలలో నిర్వహించారు. ఐదవ అవార్డుల ప్రదానోత్సవాన్ని వచ్చే 22వ తేదేన కరీంనగర్ లో నిర్వహిస్తున్నారు. ఈ సభకు సంబందించిన పూర్తీ వివరాలను ఈ దిగువ చదవండి.
వచ్చే 22న కరీంనగర్‌లో అక్కినేని ఫౌండేషన్ పురస్కారాల ప్రదానోత్సవం
ఫీనిక్స్ ప్రవాసులతో తానా కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్ భేటీ
ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్ ఫీనిక్స్ నగరంలో పర్యటించారు. అక్కడి స్థానిక ప్రవాసులతో ఆయన భేటీ అయ్యారు. వాషింగ్టన్ డీసీలో జరిగే తానా 22వ మహాసభల్లో పెద్దసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన వారిని కోరారు. ఈ కార్యక్రమంలో కొమ్మినేని విజయ్ తదితరులు పాల్గొన్నారు.
బెజవాడలో నాట్స్ క్యాన్సర్ నిర్ధారణ శిబిరం
అన్న క్యాంటీన్‌లకు తానా విరాళం
ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) సంయుక్త కోశాధికారి కొల్లా అశోక్‌బాబు ఆ సంస్థ తరఫున ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో అక్షయపాత్ర సారథ్యంలో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్‌లకు ₹7లక్షలను విరాళంగా అందించారు. ఈ మొత్తం చెక్కును అక్షయపాత్ర ప్రతినిధులకు అశోక్ తండ్రి చంద్రబాబు అందజేశారు.
సిలికానాంద్ర ‘సంజీవని’కి వరద కడుతున్న విరాళాలు
కృష్ణాజిల్లా కూచిపూడిలో సిలికానాంద్ర ఆద్వర్యంలో యాభై కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న సంజీవని సూపర్ స్పెషాలిటి ఆస్పత్రికి అమెరికాతో పాటు వివిధ దేశాల నుండి పెద్ద ఎత్తున విరాళాలు అందుతున్నాయి. మంగళవారం విరాళాలు దినోత్సవంగా పాటించి విరాళాలు ఇవ్వాలని సిలికానాంద్ర వ్యవస్థాపకుడు కూచిభొట్ల ఆనంద్ ఇచ్చిన పిలుపుకు 69వేల డాలర్లు విరాళంగా అందాయి. 549 మంది దాతల నుండి ఈ అందినట్లు ఆనంద్ ప్రకటించారు. విరాళాలు అందించిన వారికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
అమెరికాలో మన ఆడవారు
అమెరికాలో భారత సంతతికి చెందిన మహిళలు కూడా టెక్నాలజీ రంగంలో విజయపతాకం ఎగురవేస్తున్నారు. ఫోర్బ్స్ సంస్థ 2018 సంవత్సరానికి సంబంధించి రూపొందించిన ‘అమెరికాలో అగ్ర స్థాయి 50 మంది టెక్నాలజీ ప్రముఖుల’ జాబితాలో భారత సంతతికి చెందిన నలుగురు మహిళలు చోటు దక్కించుకోవటమే దీనికి నిదర్శనం. సిస్కో మాజీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ పద్మశ్రీ వారియర్, ఉబెర్ సీనియర్ డైరెక్టర్ కోమల్ మంగ్తాని, కన్‌ఫ్లూయంట్ సహ వ్యవస్థాపకురాలు నేహ నార్ఖడే, ఐడెంటిటీ మేనేజ్‌మెంట్ కంపెనీ అయిన ‘డ్రాబ్రిడ్జ్’ వ్యవస్థాపకురాలు, సీఈవో కామాక్షి శివరామకృష్ణన్ ఈ జాబితాలో నిలిచారు. ‘‘మహిళ భవిష్యత్తు కోసం వేచి చూడదు. 2018 టాప్ 50 టెక్నాలజీ మహిళల జాబితా… ముందుచూపుతో ఆలోచించే మూడు తరాల టెక్నాలజీ నిపుణులను గుర్తించడం జరిగింది’’ అని ఫోర్బ్స్ పేర్కొంది. ఐబీఎం సీఈవో గిన్ని రోమెట్టి, నెట్‌ఫ్లిక్స్ ఎగ్జిక్యూటివ్ అన్నే ఆరన్ వంటి టెక్నాలజీ దిగ్గజాలూ ఈ జాబితాలో ఉన్నారు. పద్మశ్రీ వారియర్ (58) మోటొరోలా, సిస్కో కంపెనీల్లో ఉన్నతస్థాయిల్లో పనిచేశారు. ప్రస్తుతం చైనీస్ ఎలక్ట్రిక్ స్టార్టప్ ఎన్‌ఐవోకు అమెరికా సీఈవోగా ఉన్నారు. 138 బిలియన్ డాలర్ల సిస్కో సిస్టమ్స్ కంపెనీ కొనుగోళ్ల ద్వారా మరింత ఎదగటంలో వారియర్ ముఖ్య పాత్ర పోషించారు. మైక్రోసాఫ్ట్, స్పాటిఫై బోర్డుల్లోనూ భాగస్వామిగా ఉన్నారు. ‘‘టెక్నాలజీ రంగంలో ఇతర మహిళలకు మార్గదర్శిగా వ్యవహరించేందుకు వారియర్ ఇప్పటికీ వీలు చేసుకుంటున్నారు. ట్విట్టర్ ద్వారా 16 లక్షల మంది ఫాలోవర్లకు అందుబాటులో ఉంటున్నారు’’అని ఫోర్బ్స్ ప్రస్తుతించింది. గుజరాత్‌లోని ధర్మసిన్హ్ దేశాయ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పూర్వ విద్యార్థి అయిన మంగ్తాని ప్రస్తుతం క్యాబ్ అగ్రిగేటర్ ఉబెర్‌లో బిజినెస్ ఇంటెలిజెన్స్ హెడ్. పలు స్వచ్ఛంద సంస్థలకూ సేవలందిస్తున్నారు. పుణే యూనివర్సిటీ పూర్వ విద్యార్థి నార్ఖెడె లింక్డెన్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేసే సమయంలో అపాచేకఫ్‌కా అనే అప్లికేషన్‌ను అభివృద్ధి చేశారు. ఇది రియల్‌టైమ్‌లో భారీ గా వచ్చే డేటాను ప్రాసెస్ చేస్తుంది. కన్‌ఫ్లూయెంట్‌ను కూడా ఆమె స్థాపించారు. ఈ సంస్థ గోల్డ్‌మన్ శాక్స్, నెట్‌ఫ్లిక్స్, ఉబెర్‌కు సేవలందిస్తోంది. ‘‘ప్రజలు రోజువారీగా కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్లను విస్తృతంగా వినియోగిస్తున్నారు. అన్ని రకాల పరికరాల్లో ప్రకటనలను చూపించే మార్గం ప్రకటనదారులకు కావాలి. ఫేస్‌బుక్, గూగుల్ ప్రకటనదారులకు ఇప్పటికే ఈ సేవలందిస్తున్నాయి. డ్రాబ్రిడ్జ్ వ్యవస్థాపకురాలు కామాక్షి శివరామకృష్ణన్(43) రూపంలో వా టికిపుడు పోటీ ఎదురైంది’’ అని ఫోర్బ్స్ తెలిపింది.
పశ్చిమ గోదావరి అమ్మాయికి ఫోర్బ్స్ పత్రికలో చోటు
అమెరికన్ ‘ఫోర్బ్స్’ మ్యాగజైన్‌లో తెలుగు తేజం మెరిసింది. పశ్చిమగోదావరి జిల్లా అత్తిలి మండలం ఉనికిలి గ్రామానికి చెందిన బొల్లింపల్లి మేఘన ఈ నెలలో ప్రచురించిన మ్యాగజైన్‌లో అండర్-30 శాస్త్రవేత్తల విభాగంలో చోటు దక్కించుకుంది. అమెరికన్ ‘ఫోర్బ్స్’ మ్యాగజైన్‌లో తెలుగు తేజం మెరిసింది. పశ్చిమగోదావరి జిల్లా అత్తిలి మండలం ఉనికిలి గ్రామానికి చెందిన బొల్లింపల్లి మేఘన ఈ నెలలో ప్రచురించిన మ్యాగజైన్‌లో అండర్-30 శాస్త్రవేత్త విభాగంలో చోటు దక్కించుకుంది. ఐసెఫ్ (ఇంటెల్ ఫౌండేషన్ యంగ్ సైంటిస్టు) 2018 మేలో నిర్వహించిన సైన్స్ ఫేర్ పోటీల్లో ఇంటర్నేషనల్ అవార్డు సాధించినందుకు మేఘనను అత్యంత ప్రతిభాశాలిగా గుర్తించారు. ఈ మేరకు ఆమె తల్లిదండ్రులు వెంకటేశ్వరరావు, మాధవి అమెరికా నుంచి చరవాణి ద్వారా తెలిపారు. తల్లిదండ్రులతో కలిసి మేఘన అమెరికాలోని ఆర్క్‌నెస్ స్టేట్ లిటిల్ రాక్‌లో ఉంటోంది. సెంట్రల్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న ఈమెకు సైన్సు అంటే ఆసక్తి ఎక్కువ. స్థానికంగా నిర్వహించే సెమినార్లలో ప్రతిభ చూపేది. ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలకు పదును పెడుతూ ప్రయోగాలు చేస్తూ వచ్చింది. 2018 మేలో ప్రపంచస్థాయిలో ఐసెఫ్ సంస్థ నిర్వహించిన సైన్స్‌ఫేర్ పోటీల్లో 75 దేశాలతో పోటీపడి ‘ఎలక్ట్రోడ్ మేడ్ విత్ ప్లాటినమ్’ అనే సైన్స్ సూపర్ కెపాసిటర్ ప్రయోగం ప్రదర్శన ద్వారా ఐసెఫ్ అవార్డు సాధించింది. ఆ సందర్భంగా మేఘన అవార్డుతో పాటు 50వేల డాలర్ల బహుమతి పొందినట్లు తల్లిదండ్రులు చెప్పారు.