కడుపు దాచుకోలేము

బాలీవుడ్ నటి అనుష్క శర్మ తల్లికాబోతున్నారని కొంతకాలంగా వార్తలు వెలువడుతున్నాయి. ‘జీరో’ సినిమా తర్వాత అనుష్క తన తదుపరి చిత్రాన్ని ప్రకటించకపోవడంతో ఆమె గర్భందాల్చారని అందుకే ఏ సినిమాకీ ఒప్పుకోవడంలేదని వార్తలు పుట్టుకొస్తున్నాయి. దీనిపై తాజాగా అనుష్క మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చారు. ఇలాంటి అర్థంలేని వార్తలు ఎక్కడినుంచి పుట్టుకొస్తాయి? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘ఇలాంటి గుసగుసలు వస్తూనే ఉంటాయి. అయినా ఇవి అర్థంలేని వార్తలు. పెళ్లి విషయాన్నైనా దాచగలం కానీ గర్భాన్ని ఎవ్వరూ దాచలేరు. నాకు తెలిసినంత వరకు చిత్ర పరిశ్రమలో ఉన్న ప్రతీ కథానాయిక ఈ వదంతులను ఎదుర్కొంటూనే ఉంటుంది. ఇలాంటి వదంతులు నటీమణులను పెళ్లి కాకుండానే వివాహితను చేసేస్తాయి, గర్భం దాల్చకుండానే తల్లిని చేసేస్తుంటాయి. ఇలాంటి వాటిని నేను అస్సలు పట్టించుకోను. విని నవ్వుకుని వదిలేస్తాను. ఇప్పుడు నేను 24 గంటలూ నా పనులతోనే బిజీగా ఉన్నాను’ అని వెల్లడించారు అనుష్క. టెస్ట్‌ సిరీస్‌ నిమిత్తం అనుష్క భర్త, టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఆస్ట్రేలియాలో ఉన్నారు. త్వరలో అనుష్క కూడా ఆస్ట్రేలియాకు వెళ్లనున్నారు. డిసెంబర్‌ 11న తమ తొలి పెళ్లిరోజు వేడుకను అక్కడే సెలబ్రేట్‌ చేసుకోనున్నారట. డిసెంబర్‌ 21న అనుష్క నటించిన ‘జీరో’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఆయన అడిగితే…

‘ఒక లైలా కోసం’ అంటూ కుర్రకారు మనసుల్ని దోచి, ‘గోపికమ్మా’ అంటూ వారికి నిద్రలేకుండా చేసిన పూజాహెగ్డే ‘దువ్వాడ జగన్నాధం’తో టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ల లిస్టులోకి చేరిపోయింది. తాజాగా ‘అరవింద’గా ఎక్కడలేని క్రేజ్ సంపాదించుకుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో నిరంతరం పూజా జపమే కనపడుతోంది…వినపడుతోంది. ఒకప్పుడు ఫ్లాప్ హీరోయిన్ అన్నవారితోనే స్టార్ హీరోయిన్ అనిపించుకున్న పూజా.. ‘అరవింద సమేత’లో తన పాత్రకి తనే స్వయంగా డబ్బింగ్ కూడా చెప్పుకుంది. అదెలా సాధ్యమైంది అనే ప్రశ్న ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమెకు ఎదురైంది.దీనికి పూజా.. ‘‘నేను తెలుగు సినిమాలు చేయడం మొదలుపెట్టి దాదాపు నాలుగు సంవత్సరాలవుతోంది. ఇప్పటి వరకూ నా సినిమాలకు నేను డబ్బింగ్ చెప్పలేదు. ‘అరవింద సమేత’కు మాత్రం డైరెక్టర్గారు నన్నే డబ్బింగ్ చెప్పమన్నారు. అందుకే కాస్త ధైర్యం చేశాను. నటించడం వేరు. డబ్బింగ్ చెప్పడం వేరు. నా దృష్టిలో నటించడం కంటే కూడా డబ్బింగ్ చెప్పడమే కష్టం. నాతో డబ్బింగ్ చెప్పించాలన్నది మాత్రం పూర్తిగా త్రివిక్రమ్సార్ నిర్ణయమే. ఈ పాత్రకు నా వాయిస్ అయితేనే బాగుంటుందని ఆయన పట్టుపట్టారు. ఆయన అంత గట్టిగా చెప్పకపోతే ఈ సినిమాకి డబ్బింగ్ చెప్పేదాన్ని కాదేమో!..’’ అని తెలిపింది.

పోలీసుల సాయం అర్ధించిన అక్షర

అగ్ర నటుడు కమల్‌హాసన్‌ గారాలపట్టి అక్షరహాసన్‌కు సంబంధించిన కొన్ని వ్యక్తిగత చిత్రాలు ప్రస్తుతం ఆన్‌లైన్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి. సోషల్‌మీడియా వేదికగా పలువురు వీటిని పంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అక్షరహాసన్‌ స్పందించారు. ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ‘‘ఇటీవల నా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని ఫొటోలు ఇంటర్నెట్‌లో దర్శనమిస్తున్నాయి. ఎవరు చేశారు ఈ పని? ఇప్పటివరకూ ఈ విషయం నాకు తెలియదు. కానీ, నాకు తెలిసిందేంటంటే ఒక యువతి పట్ల ఇలా ప్రవర్తించడం నిజంగా దురదృష్టకరం. ఇతరులను ఆకర్షించడానికి షేర్‌ చేస్తున్న ప్రతి వాళ్లూ తమదైన శైలిలో వ్యాఖ్యలు జోడిస్తూ వాటిని పంచుకుంటున్నారు. నా మానసిక క్షోభకు, నిస్సహాయతకు ప్రతి ఒక్కరూ కారణమవుతున్నారు. మీటూలాంటి ఉద్యమంతో దేశం మేల్కొంటున్న ఈ దశలో ఇలా జరగడం బాధాకరం.’’ ‘‘ఈ విషయమై ఇప్పటికే నేను ముంబయి పోలీసులను, సైబర్‌ క్రైమ్‌సెల్‌ను ఆశ్రయించాను. నా ఫొటోలను ఆన్‌లైన్‌లో లీక్‌ చేసిన వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా మీకు విన్నవించుకునేది ఒక్కటే. మనందరం హుందాగా జీవించాలి. దీనిని ఇంటర్నెట్‌లో ఇక్కడితో ఆపేస్తారని అనుకుంటున్నా’’అని పేర్కొన్నారు. ‘షమితాబ్‌’ చిత్రంతో వెండితెరకు పరిచయమైన అక్షరహాసన్‌ ఆ తర్వాత అజిత్‌ ‘వివేగం’లో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం తన తండ్రి కమల్‌హాసన్‌ నటిస్తున్న ‘శభాష్‌ నాయుడు’ చిత్రానికి సహాయ దర్శకురాలిగా పనిచేస్తున్నారు.

సుస్మితా పెళ్లి

మాజీ విశ్వసుందరి, బాలీవుడ్‌ నటి సుస్మితా సేన్‌ పెళ్లి పీటలెక్కబోతున్నారా? అవుననే అంటున్నాయి బాలీవుడ్‌ వర్గాలు. కొంతకాలంగా సుస్మిత రోహ్‌మన్‌ షాల్‌ అనే మోడల్‌తో డేటింగ్‌లో ఉన్నారు. తనతో ప్రేమలో ఉన్నట్లు సుస్మిత ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ప్రకటించారు. కొన్నివారాల క్రితమే పెళ్లి చేసుకుందామని రోహ్‌మన్‌.. సుస్మితను అడిగారట. ఇందుకు సుస్మిత కూడా ఒప్పుకోవడంతో ఇద్దరూ వివాహ బంధంతో ఒకటి కానున్నట్లు తెలుస్తోంది.ఓ ఫ్యాషన్‌ కార్యక్రమంలో సుస్మిత, రోహ్‌మన్‌ కలిసి ర్యాంప్‌ వాక్‌ చేశారు. ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య స్నేహం చిగురించి అది ప్రేమగా మారింది. ఆ తర్వాత సుస్మిత, రోహ్‌మన్‌ కలిసి పలు పార్టీలకు కలిసే హాజరయ్యేవారు. దీపావళి పండుగ నాడు సుస్మిత.. రోహ్‌మన్‌, తన ఇద్దరు పిల్లలతో కలిసి దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. దాంతో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని వస్తున్న వార్తలకు మరింత ఊతమిచ్చినట్లైంది. 2019లో వీరి వివాహం జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సుస్మిత ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు. కానీ ఇద్దరు ఆడపిల్లలను దత్తత తీసుకుని పెంచుతున్నారు.

తల్లిదండ్రులకు అవేం పట్టవు

ద్విపాత్రాభినయం అనే మాట సినిమాల్లో వింటుంటాం. తెలుగు సినిమాకి సంబంధించినంత వరకూ అదో హిట్ ఫార్ములా. దాదాపు కథానాయకులంతా ఒకరు ఇద్దరుగా కనిపించినవాళ్లే. ‘నేనైతే నిజ జీవితంలోనూ ద్విపాత్రాభినయమే చేస్తున్నా’ అంటోంది కాజల్. ఆ ద్విపాత్రాభినయం సంగతేంటో ఆమె మాటల్లోనే తెలుసుకుందాం. ‘‘నటిగా నేనో రకం. ఇంట్లో నా రెండో అవతారం చూస్తారు. ఇంట్లో ఉండే కాజల్కీ, కెమెరా ముందుండే కాజల్కీ చాలా తేడా ఉంది. ఇంట్లో చాలా సాధారణమైన అమ్మాయిని. అమ్మానాన్న, నా స్నేహితులు ఉంటే చాలు. మరో ప్రపంచం అవసరం లేదు. చిన్న చిన్న విషయాలకే సంతోషపడిపోతుంటా. నాకంటూ పెద్ద కోర్కెలు ఉండవు. గడప లోపల నేనో సినిమా స్టార్ అనే సంగతి గుర్తుకు రాదు. అణుబాంబు నుంచి ఓజోన్ పొర వరకూ అన్ని విషయాలూ మాట్లాడుకుంటాం. విచిత్రం ఏమిటంటే మామధ్య అస్సలు సినిమాల ప్రస్తావనే రాదు. ‘కొత్త సినిమాలేం ఒప్పుకున్నావు, పారితోషికం ఎంత’ అని మా అమ్మానాన్న ఇప్పటివరకూ అడగలేదు’’ అని చెప్పింది కాజల్.

అంతటా స్నేహమే

రాశీఖన్నా మల్టీటాలెంటెడ్ అనడానికి చాలా కారణాలున్నాయి. ఆమె మంచి నటే కాదు. కవితలతో మెప్పించగలదు, మధురమైన గొంతుతో పాడి అలరించగలదు. అలాగే ఆమెలో చక్కని హాస్యనటి కూడా ఉంది. అయితే ఇప్పటి వరకూ తనలో ఉన్న కమెడియన్ బయటకు రాలేదని అప్పుడప్పుడూ చెబుతుంటుంది. ఛాన్స్ వస్తే మాత్రం తనలో ఆ యాంగిల్ని ప్రదర్శిస్తానంటోంది. ఇటీవల ‘తొలిప్రేమ’, ర‘శీనివాస కల్యాణం’ సినిమాలతో ఆకట్టుకున్న ఆమెను పరిశ్రమలో పోటీ గురించి అడిగితే ‘‘ఏ ఇండస్ట్రీలోనైనా పోటీ అనేది సహజం. ఒక మనిషి ఎదిగినా, పడిపోయినా అది పోటీ వల్లే జరుగుతుంది. అదే లేకపోతే ఎక్కడున్నామో అక్కడే ఉంటాం. నేర్చుకోవడానికీ, ఎదగడానికి ఛాన్స్ ఉండదు. అందుకే పోటీని నేనెప్పుడూ స్వీకరిస్తా. కానీ అది ఆరోగ్యకరంగా ఉండాలి. నా ఫ్రెండ్స్ రకుల్, రెజీనా, లావణ్య అందరం పోటీపడి పని చేస్తాం. అది వృత్తి వరకే. సెట్లో పేకప్ చెప్పాక మేమంతా స్నేహితులమే’’ అని తెలిపింది రాశీఖన్నా.

న్యాయనిర్ణేతగా

బాలీవుడ్ కథానాయికల్లో చిత్రాంగదా సింగ్ రూటే సెపరేటు. ఉన్నది ఉన్నట్లు నికచ్చిగా మాట్లాడతారు. ఆ కారణంగా ఆమె కొన్ని సినిమాల్లో ఆఫర్లు కూడా పోగొట్టుకున్నారు. కొన్నాళ్ల క్రితం బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ఖిఖితో గొడవ పడి ఓ సినిమా నుంచి తప్పుకొన్నారు కూడా. ఆమె నటించిన ‘బీవీ ఔర్ గ్యాంగ్స్టర్స్-3’ చిత్రం ఇటీవల విడుదలైంది. గత ఏడాది బుల్లితెరపై ఓ డ్యాన్స్ రియాలిటీ షో న్యాయనిర్ణేతగా కనిపించిన చిత్రాంగద తాజాగా ఓ ఇంగ్లిష్ ఛానల్లో కనిపించబోతున్నారు.దీని గురించి ఆమె మాట్లాడుతూ- ‘‘నేను ఎక్కడికి వెళ్లినా అన్నిరకాల ఆహార రుచులను ఆస్వాదిస్తాను. అలాంటిది ఓ ఫుడ్ షోలో ప్రముఖ చెఫ్స్తో మాట్లాడే అవకాశం రావడం నా అదృష్టం’’ అని అన్నారు. ఎఎక్స్ఎన్, జీఈసీ ఛానెళ్లు కలిసి నిర్మిస్తున్న ఓ ఫుడ్ షోలో ఆమె కనిపిస్తారు. ఫుడ్, న్యూట్రిషన్లో ఆమెకు డిగ్రీ కూడా ఉంది. అందుకే ఆమెను ఎంపిక చేసినట్లు షో నిర్వాహకులు తెలిపారు. వచ్చే నెల నుంచి ఈ షో ‘ఎఎక్స్ఎన్’ ఛానెల్లో ప్రసారం కానుంది.

కెరీర్ ముద్దు. కళ్యాణం వద్దు.

కథానాయిక రష్మిక, నటుడు రక్షిత్‌ శెట్టిల నిశ్చితార్థం 2017లో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ నిశ్చితార్థం రద్దు అయ్యిందని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. భిన్నాభిప్రాయాలు రావడంతో తమ ప్రేమ బంధానికి రష్మిక, రక్షిత్‌ స్వస్తి పలికినట్లు చెప్పుకొచ్చారు. నటిగా మంచి అవకాశాలు వస్తున్న నేపథ్యంలో కెరీర్‌లో సక్సెస్‌ పొందాలని రష్మిక ఈ నిర్ణయం తీసుకున్నారని మరోపక్క వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయం గురించి తాజాగా రష్మిక తల్లి సుమన్‌ ఓ ఛానెల్‌తో మాట్లాడారు. తన కుమార్తె నిశ్చితార్థం రద్దయిందని స్పష్టం చేశారు. ఇరు కుటుంబాల మధ్య ఇప్పుడు ఎటువంటి బంధం లేదని తెలిపారు. ‘మేం డిస్టర్బ్‌ అయ్యాం.. ప్రస్తుతం కోలుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి జీవితం చాలా ముఖ్యమైంది. ఎదుటి వ్యక్తి బాధపెడితే ఎవరికీ ఇష్టం ఉండదు. ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలి..’ అని ఆమె అన్నారు. 2016లో హిట్‌ అందుకున్న కన్నడ సినిమా ‘కిర్రిక్‌ పార్టీ’. ఈ సినిమాతో రష్మిక కథానాయికగా పరిచయం అయ్యారు. ఇందులో రక్షిత్‌ కథానాయకుడు. ఈ సినిమా సమయంలో ఇద్దరు స్నేహితులయ్యారు. ఆ తర్వాత అది ప్రేమగా మారింది. పెద్దల అంగీకారంతో 2017 జులై 3న నిశ్చితార్థం జరిగింది. అంతేకాదు నిశ్చితార్థం జరిగి ఏడాది పూర్తైన సందర్భంగా కొన్ని నెలల క్రితం వీరిద్దరు వేడుక కూడా చేసుకున్నారు. రక్షిత్‌ గురించి ఓ ఇంటర్వ్యూలో రష్మిక మాట్లాడారు. ‘మేమిద్దరం ప్రపోజ్‌ చేసుకోలేదు. అసలు మా మధ్య ప్రేమ ఎప్పుడు, ఎలా మొదలైందో కూడా తెలియదు. మేం పక్కపక్కన ఉన్నప్పుడు చాలా సౌకర్యంగా, సంతోషంగా ఉంటాం.‌ ఇప్పటికీ మా ప్రేమ గురించి ఎవరైనా అడిగితే నిజంగా నాకు చాలా తికమకగా అనిపిస్తుంటుంది’ అని ఆమె అన్నారు. రష్మిక తెలుగులో ‘ఛలో’, ‘గీత గోవిందం’తో మంచి హిట్స్‌ అందుకున్న సంగతి తెలిసిందే.

నెటిజన్లకు ఆగట్లేదు

ఓ హిట్‌ పెయిర్‌ ఏ సందర్భంలోనైనా జంటగా కనిపిేస్త చాలు వారిద్దరి మధ్య ఏదో ఉందనే గాసిప్స్‌ ఈజీగా పుట్టుకొచ్చేస్తాయి. ప్రేమ, డేటింగ్‌లతో బిజీగా ఉన్నారంటూ ప్రచారం జరుగుతుంటుంది. కొద్దిరోజులకు పెళ్లి ఎప్పుడనే ప్రశ్నలు అభిమానుల నుంచి వస్తుంటాయి. ప్రస్తుతం ఇలాంటి ప్రచారమే అర్జున్‌ కపూర్‌, పరిణీతి చోప్రా విషయంలో జోరుగా సాగుతోంది. అంతటితో ఆగక ‘మీరెప్పుడు పెళ్లి చేసుకుంటారు’ అని నెటిజన్లు అడుగుతూనే ఉన్నారు. ‘అబ్బే… ఖాళీగా లేను!’ అంటూ పరిణీతి చోప్రా సమాధానమిస్తే.. ‘నేనింకా చిన్న పిల్లవాడినే, ఇంకా పెళ్లీడు రాలేదు’ అని అర్జున్‌ కపూర్‌ స్పందించారు. ఇంతకీ విషయం ఏంటంటే.. అర్జున్‌ కపూర్‌, పరిణీతి జంటగా ‘సందీప్‌ ఔర్‌ పింకీ ఫరార్‌’ చిత్రంలో నటిస్తున్నారు. ప్రమోషన్‌లో భాగంగా ఓ మ్యాగజైన్‌ కోసం నూతన దంపతులుగా ఫొటోలకు పోజులిచ్చారు. ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో ‘ఈ జంట పెళ్లి చేసుకుంటే బాగుంటుంది’ అని సోషల్‌ మీడియా కామెంట్లు వచ్చాయి.

పీకే లవ్ ఫెయిల్

తప్పు చేయకపోయినా అనవసరంగా తనను నెటిజన్లు విమర్శిస్తున్నారని నటి పూనమ్‌ కౌర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణాష్టమి (సెప్టెంబరు 3) సందర్భంగా ప్రత్యేక వీడియోను విడుదల చేయబోతున్నానని ఆమె ఆదివారం (సెప్టెంబరు 2) ట్విటర్‌లో పేర్కొన్నారు. చాలా సంతోషంతో, మనస్ఫూర్తిగా రూపొందించిన వీడియో ఇదని అన్నారు. ‘పీకే లవ్‌’ అనే హ్యాష్‌ట్యాగ్‌ను కూడా జత చేశారు. అయితే నెటిజన్ల నుంచి ఆమెకు వ్యతిరేకంగా కామెంట్లు వచ్చాయి. దీంతో బాధపడ్డ ఆమె.. తాజాగా స్పందించారు. ‘నేను ఎంత కష్టపడ్డాను, ఎంత చక్కగా, నిజాయతీగా పనిచేశాను అనేది ఇక్కడ ముఖ్యం కాదు. నా తప్పులేకపోయినా అనవసరంగా నన్ను నిందిస్తూ, విమర్శిస్తున్నారు. నా హృదయానికి చేరువైన ఈ వీడియోను విడుదల చేయదలచుకోవడం లేదు’ అని పూనమ్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు. పూనమ్‌ ‘మాయాజాలం’ సినిమాతో నటిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత ‘శౌర్యం’, ‘వినాయకుడు’, ‘నాగవల్లి’, ‘గగనం’ తదితర చిత్రాల్లో సందడి చేశారు. ఇటీవల విడుదలైన ‘శ్రీనివాస కల్యాణం’లో కనిపించారు. ఆమె ప్రస్తుతం ‘స్వర్ణఖడ్గం’ సీరియల్‌లో నటిస్తున్నారు.

సోను ఔట్

ప్రముఖ దర్శకుడు క్రిష్‌ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న ‘మణికర్ణిక: ది క్వీన్‌ ఆఫ్‌ ఝాన్సీ’ చిత్రం నుంచి సోనూసూద్‌ తప్పుకొన్నారు. వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి జీవితాధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో ఝాన్సీ పాత్రలో కంగనా రనౌత్‌ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై ఎన్నో ప్రచారాలు జరుగుతున్నాయి. కంగన, క్రిష్‌ మధ్య గొడవలు వచ్చాయని, అందుకే కంగన దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారని వార్తలు వెలువడ్డాయి. ఆ తర్వాత వీటి గురించి స్పందిస్తూ.. క్రిష్‌ వేరే చిత్రంతో బిజీగా ఉండడంతో కొన్ని సన్నివేశాలు తాను తెరకెక్కించాల్సి వచ్చిందని స్పష్టంచేశారు. అయితే ఇప్పుడు సినిమా నుంచి సోనూసూద్‌ తప్పుకొన్నారు. ఇందులో ఆయన సదాశివ్‌ అనే మరాఠా రాజు పాత్రలో నటించాల్సి ఉంది. ఆయనపై తెరకెక్కించాల్సిన సన్నివేశాలు దాదాపు పూర్తయ్యాయి. ఇంకొన్ని రోజుల్లో చిత్రీకరణ పూర్తవుతుందనగా సోనూ సినిమా నుంచి వైదొలగారు. ఈ విషయాన్ని కంగన మీడియా ద్వారా వెల్లడించారు. తనతో నటించడం ఇష్టంలేకే సోనూ తప్పుకొన్నారని ఆరోపిస్తున్నారు. ‘నాలాంటి మహిళా దర్శకురాలితో కలిసి పనిచేయడం సోనూకు ఇష్టంలేదు. అందుకే ఆయన సినిమా నుంచి వైదొలగారు. నేను సోనూను తక్కువచేసి చూశానని వార్తలు వెలువడుతున్నాయి. సోనూను ఇప్పటివరకు ఒక్కసారి కూడా కలిసిందిలేదు. ఆయన్ను డైరెక్ట్‌ చేసింది లేదు. అలాంటప్పుడు నేను ఆయన్ని తక్కువ చేసి చూశానని ఎలా అంటారు? సినిమాలో ఆయన సన్నివేశాలను ఆయనే రాసుకున్నారు. కానీ, స్క్రిప్ట్‌లో ఆయన రాసుకున్న సన్నివేశాలు లేవు. క్రిష్‌తో కలిసి సోనూ స్క్రిప్ట్‌లో లేని సన్నివేశాలను చాలానే తెరకెక్కించారు. అది రచయితలకు నచ్చలేదు. అది నా తప్పా? సినిమా కథను నేను రాశానా? పాత్ర కోసం సోనూ నాలుగు నెలల పాటు కసరత్తులు చేశారు. తాను తెరకెక్కించుకున్న సన్నివేశాలను తొలగించవద్దు అని రచయితలను కోరారు. నా వెనక ఇంత జరుగుతోందని నాకేం తెలుసు? ఈ సన్నివేశాలు చూసి రచయితలు తమకు నచ్చలేదని చెప్పారు. నేను ‘మణికర్ణిక’ చేతిలో కేవలం బానిసను. లక్ష్మీబాయి కోసమే ఇంత కష్టపడుతున్నాను. ఈ విషయం ఇంతకుముందు కూడా చాలా సార్లు చెప్పాను.’ అని వెల్లడించారు కంగన.

పరిచయం చేశారు

‘‘తెలుగు పరిశ్రమలో క్యాస్టింగ్‌ కౌచ్‌ లేదని నేను చెప్పను. దాని గురించి అడిగేవాళ్లున్నారు. నేనూ అలాంటి సమస్యలను ఎదుర్కొన్నాను. కాకపోతే మనం చనువు ఇవ్వనప్పుడు ఎవరూ బలవంతం చేయరు’’ అని యామినీ భాస్కర్‌ అన్నారు. నాగశౌర్య సరసన ఆమె నటించిన @నర్తనశాల’ ఈ నెల 30న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ ‘‘పెద్దయ్యాక నన్ను హీరోయిన్‌ని చేస్తానని మా అమ్మతో నాన్నగారు అంటుండేవారట. కానీ నేను హీరోయిన్‌గా నటించిన చిత్రాలను చూడకుండానే ఆయన కన్నుమూశారు. కేవలం నా కోసమే నా కుటుంబం విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వచ్చింది. నా తొలి చిత్రం ‘కీచక’ను చూసిన వాళ్లందరూ బాగా నటించానని మెచ్చుకున్నారు. మధ్యలో మారుతి కాంపౌండ్‌లో ఇంకో సినిమా చేశా. @నర్తనశాల’లో యారొగెంట్‌ అమ్మాయిగా నటించా. ఇందులో నా పాత్ర పేరు సత్యభామ’’ అని అన్నారు. తెలుగమ్మాయిలకు టాలీవుడ్‌లో అవకాశాల గురించి ప్రస్తావిస్తూ ‘‘పొరుగు భాషల నాయికలు మనల్ని డామినేట్‌ చేస్తున్నారని ఎప్పుడూ అనుకోకూడదు. వాళ్లను పోటీదారులుగానే చూడాలి. తెలుగమ్మాయిలకు అవకాశాలు ఇవ్వడం లేదని నేను చెప్పను. పాత్రలకు సరిపోతారనిపిస్తే తప్పకుండా అవకాశాలుంటాయి’’ అని చెప్పారు.

టాలీవుడ్..ఆనందం

కన్నడ పరిశ్రమలో అభిమాన తార అయిన రన్యారావు ఇప్పుడు టాలీవుడ్ కు చేరింది, ఆయుష్మాన్ భావ సినిమాలో ఆమె కూడా ఓ హీరోయిన్. టాలీవుడ్ వంటి గొప్ప పరిశ్రమలో అవకాశం వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. నాలోని నటనా ప్రతిభను ప్రదర్శించడానికి ఇదో గొప్ప అవకాశం. స్క్రిప్టు నా పాత్ర చాలా నచ్చాయి. పైగా కొత్త పరిశ్రమలోకి ప్రవేశించడం ఎప్పుడూ ఎక్జయిట్ గానే ఉంటుంది. నా కన్నడ తమిళ తోలి సినిమాలు నాకెంతో స్పూర్తినిచ్చాయి. అక్కడి వారు నన్ను బాగా స్వాగతించారు. తెలుగులోనూ అటువంటి స్పందనే రాగలదని భావిస్తున్నాను అని తెలిపింది అందాల తార రన్యారావు.

నేను దూరం

‘‘నేను బెంగాలీలో ఆరు సినిమాలు, ఓ వెబ్‌ సిరీస్‌ చేశా. అంతకు ముందు పలు కమర్షియల్‌ యాడ్స్‌లో నటించా. మోడల్‌గా చేశా. తెలుగులో ఇదే తొలి సినిమా’’ అన్నారు కథానాయిక దర్శనా బానిక్‌. పరుచూరి మురళి దర్శకత్వంలో వాసిరెడ్డి రవీంద్రనాథ్‌, వాసిరెడ్డి శివాజీ ప్రసాద్‌, రాము మక్కెన, వడ్లపూడి జితేంద్ర నిర్మించిన సినిమా ‘ఆటగాళ్లు’. ఇందులో నారా రోహిత్‌ జోడీగా నటించారీమె. జగపతిబాబు ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఈ నెల 24న విడుదలవుతోంది. ఈ సందర్భంగా దర్శనా బానిక్‌ మాట్లాడుతూ ‘‘ఇందులో అంజలిగా కనిపిస్తా. సిద్ధార్థ్‌గా నారా రోహిత్‌ నటించారు. సిద్ధార్థ్‌ని పెళ్లి చేసుకోవడమే అంజలి ఏకైక లక్ష్యం. అందుకోసం ఏం చేసిందనేది ఆసక్తికరం. సినిమాలో ప్రేమకథే కాకుండా ఉత్కంఠ కలిగించే అంశాలెన్నో ఉన్నాయి. అవన్నీ చెప్పడం కన్నా థియేటర్‌లో చూస్తే థ్రిల్లింగ్‌గా ఉంటుంది. నాకు తెలుగు రాకున్నా… రోహిత్‌, దర్శకుడు చాలా సహకరించారు. బెంగాలీలో ఒక్కో సినిమాను 20 నుంచి 30 రోజుల్లో పూర్తి చేస్తారు. అక్కడ బడ్జెట్‌ తక్కువ. తెలుగులో భారీ బడ్జెట్‌ సినిమాలు తీస్తారు. ఇక్కడ నటించడం సంతోషంగా ఉంది. హిందీలో డబ్‌ అయిన తెలుగు సినిమాల్ని చూసేదాన్ని’’ అన్నారు. ‘‘బెంగాలీలో ఒక టీవీ షో కోసం బికినీ వేసుకున్నానంతే! వెండితెరపై బికినీ పాత్రలకు నేను దూరమే’’ అని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

పారిపోయే పిరికిది కాదు

పారితోషికాలు తీసుకోవడానికి, నిర్మాతలకు షరతులు విధించడానికి ముందుండే కథానాయికలు ‘ప్రచారం’ విషయానికొచ్చేసరికి పారిపోతుంటారు. అదేదో తమది కాని వ్యవహారం అన్నట్టు ప్రవర్తిస్తుంటారు. అయితే అనుష్క మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధం. ‘‘నేనెప్పుడూ బాధ్యతల నుంచి పారిపోను. ప్రచారం కూడా నా బాధ్యతే. షూటింగ్‌ ముగిస్తే నా పని అయినట్టు కాదు. సినిమా పూర్తయి జనంలోకి వెళ్లే వరకూ దర్శకనిర్మాతలకు అందుబాటులో ఉంటాను. ఓ సినిమా కోసం దర్శక నిర్మాతలు ఎంతగా తాపత్రయపడతారో నాకు తెలుసు. మనల్ని నమ్మి, కోరినంత పారితోషికం ఇచ్చినప్పుడు దానికి తగిన న్యాయం చేయాలి. ఎంతగానో నమ్మి చేసిన సినిమా విజయవంతమైతే నిర్మాతల కళ్లలో ఓ ఆనందం కనిపిస్తుంది. దానికి నేనూ ఓ కారణం కావాలనుకుంటాను. కథానాయికగా ఓ సినిమాపై నాకంటూ కొన్ని అంచనాలు ఉంటాయి. నా కష్టాన్ని నలుగురితో పంచుకోవాలనిపిస్తుంది. దానికీ ప్రచారం ఉపకరిస్తుంది’’ అంటోంది అనుష్క.

వాడు మీద చేయి వేస్తే చెంప పగలగొట్టి ఇంటికి పోకుండా పంచాయతీలెందుకు?

ప్రస్తుతం సౌత్ లో హాట్ టాపిక్ గా మారిన కాస్టింగ్ కౌచ్ పై ఇప్పటికే ఎంతోమంది సీనియర్లు మాట్లాడారు. తమ గతానుభవాల్ని ఓపెన్ గా బయటపెట్టారు.

ఇప్పుడీ లిస్ట్ లోకి డిస్కోశాంతి కూడా చేరారు. 90ల్లో ఐటెంసాంగ్స్ తో పాపులర్ అయిన ఈమె కాస్టింగ్ కౌచ్ పై తన అభిప్రాయాన్ని కుండబద్దలుకొట్టినట్టు బయటపెట్టారు.

“తప్పు చేయడం అనేది అన్నిచోట్ల ఉంటుంది. కానీ కాస్టింగ్ కౌచ్ విషయంలో పురుషులతో పాటు మహిళది కూడా అంతే తప్పు ఉంటుంది.

మీద మీద పడితే మగాడు ఊరుకుంటాడా. తీసుకెళ్లి రేప్ చేయలేదు కదా. చాలామంది హీరోయిన్లు ఇష్టపడే వెళ్తున్నారు. అది కాస్టింగ్ కౌచ్ ఎలా అవుతుంది.”

ఇలా కాస్టింగ్ కౌచ్ పై తన అభిప్రాయాన్ని ఉన్నది ఉన్నట్టుగా బయటపెట్టారు డిస్కోశాంతి. వాడుకున్నప్పుడు ఊరుకొని, అంతా అయిపోయాక ఏడవడం వల్ల ప్రయోజనం ఉండదంటున్నారామె.

“మగాడొచ్చి మీదపడితే అది రేప్ కింద లెక్క. అప్పుడు శిక్ష పడుతుంది.

కానీ ఇక్కడ విషయం అదికాదు. మగాడు ఎప్రోచ్ అవుతున్నాడు. నీ ఇష్టంతోనే అంతా జరుగుతోంది. ఇష్టం లేకపోతే వద్దని చెప్పి వెళ్లిపో. వదిలేస్తాడు కదా.

ఆమాత్రం దానికి నన్ను వాడుకున్నాడంటూ మగాడిపై పడి ఏడవడం దేనికి.

అప్పటివరకు ఏం చేస్తున్నావు నువ్వు. పువ్వులు కోస్తున్నావా? అప్పుడే లాగి ఒకటి కొడితే విషయం ఇంతవరకు వచ్చేది కాదు కదా.” 

తప్పుచేసిన తర్వాత బయటకొచ్చి కాస్టింగ్ కౌచ్ పేరుతో వివాదాలు సృష్టించడం పద్ధతి కాదంటున్నారు డిస్కోశాంతి.

మీడియాలో వస్తే పాపులర్ అవుతామనే ఉద్దేశంతోనే ఇలాంటి విషయాల్ని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారని ఆమె అన్నారు. 

ఇండస్ట్రీలో మగాళ్లంతా తప్పుడు మనుషులు అనుకోవడం భ్రమ.

ఎవరైనా కొందరు అలాంటి మోసగాళ్లు ఉండొచ్చు.

అలాంటివారి విషయంలో ఎంత నిక్కచ్చిగా ఉంటే అంత మంచిదని అన్నారు డిస్కోశాంతి. 

తన కెరీర్ లో తనకెప్పుడు కాస్టింగ్ కౌచ్ అనుభవాలు ఎదురుకాలేదంటున్నారు డిస్కోశాంతి.

తన దగ్గర ఎవరూ మాట్లాడ్డానికి సాహసం చేయరని, ఇక ఇలాంటి విషయాలు మాట్లాడితే అక్కడికక్కడే చంపేస్తానని, ఇలాంటి టాపిక్స్ ఎత్తితే ఫస్ట్ తన నోటి నుంచి వచ్చేది బూతులే అని అన్నారు డిస్కోశాంతి. 

అది నా దారి కాదు

ప్రముఖ సినీ నటి, కాంగ్రెస్ నేత కుష్బూ సుందర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. తన జీవితంలో జరిగిన విషయాలను ఆమె సోషల్‌మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. అయితే ఇటీవల పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘అజ్ఞాతవాసి’ చిత్రంలో కుష్బూ నటించారు. అయితే ఈ చిత్రం డిజాస్టర్ కావడంతో కుష్బూ సినిమాలపై అంత ఆసక్తి చూపిస్తున్నట్లు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఓ వార్త కుష్బూని షాక్‌కి గురి చేసింది..పవన్‌కల్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘అత్తారింటికి దారేది’ని తమిళ్‌లో రీమేక్ చేస్తున్నారని.. ఈ చిత్రంలో శింబూ ప్రధాన పాత్రలో నటిస్తున్నారని ఈ మధ్య సోషల్‌మీడియాలో వార్తలు పుట్టుకొచ్చాయి. అయితే తెలుగులో నదియా పోషించిన ‘సునంద’(అత్త) పాత్రని తమిళంలో కుష్బూ పోషిస్తున్నారని సోషల్‌మీడియాలో ఓ నెటిజన్ చేసిన ట్వీట్ చూసి కుష్బూ షాక్‌ అయ్యారు. ‘‘అసలు నాకు ఈ విషయం తెలియదు.. ఎక్కడి నుంచి వస్తాయి ఇలాంటి వార్తలు’’ అని ఆమె ట్వీట్ చేశారు.

హీరో గారు వస్తున్నారు

అందమైన ప్రేమ కావ్యాలను స్టైలిష్‌గా తెరకెక్కించడం గౌతంమేనన్‌ ప్రత్యేక శైలి. ఎంతో మందిని స్టైలిష్‌ హీరోలుగా మార్చిన గౌతంమేనన్‌ త్వరలోనే తెరపై కథానాయకుడిగా కనిపించనున్నారు. తన సినిమాల్లోనూ దర్శకుడిగా ఒకట్రెండు సన్నివేశాల్లో మాత్రమే కనిపించారు. ఇటీవల ‘గోలీసోడా 2’లో పోలీసు అధికారిగా తొలిసారి కనిపించి మెప్పించారు. ఆయన పాత్ర సినిమాను మలుపు తిప్పింది. ప్రస్తుతం ‘జై’ అనే కొత్త దర్శకుడి చిత్రంలో గౌతం హీరోగా నటించనున్నారు. ఇటీవలే ఈ సినిమా కథను గౌతంకు జై వినిపించారట. చాలాసేపు ఆలోచించిన తర్వాత నటించడానికి ఒప్పుకున్నట్లు సమాచారం. ఆగస్టు 15న చిత్రీకరణ ప్రారంభంకానుంది. ఇందులో ‘నాచ్చియార్‌’ ఫేమ్‌ నాయిక ఇవానా ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. గౌతంమేనన్‌కు జోడీగా ఎవరు నటిస్తున్నారనే విషయాన్ని ఇంకా స్పష్టం చేయలేదు. ఒకట్రెండు రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడుతుందని సమాచారం.

అది వయస్సు తప్పు

ఇప్పుడిప్పుడే కథానాయికగా ఎదుగుతోంది అనుపమ పరమేశ్వరన్‌. సినిమా సినిమాకీ ఆమె నటనలో పరిపక్వత కనిపిస్తోంది. తనకు తగిన కథలనే ఎంచుకుంటోంది. విజయాలూ దక్కించుకొంటోంది. మీ కథల ఎంపిక వెనుక ఉన్న రహస్యం ఏమిటి? అని అడిగితే ‘‘పెద్దగా రహస్యాలేం లేవు. నిజం చెప్పాలంటే, ఏ కథలు ఎంచుకోవాలో, వేటిని వదులుకోవాలో నాకే అర్థం అవ్వడం లేదు. అన్ని కథలూ నచ్చేస్తున్నాయి. బహుశా సినిమానీ, నటననీ అంతగా ప్రేమిస్తున్నానేమో. అదృష్టవశాత్తూ మంచి ఫలితాలు వస్తున్నాయి. ఈ వయసులో ప్రతీ అమ్మాయికీ చిన్న పాటి గందరగోళాలు ఎదురవుతుంటాయి. నాకూ అంతేనేమో. పరిశ్రమలోకి వచ్చి ఇంత కాలమైనా, ఇన్ని సినిమాలు చేసినా ఇంకా ఆ కన్‌ఫ్యూజన్‌ వదలడం లేదు. అయితే ఓ కథ వినగానే ఇంట్లోవాళ్లతోనూ, అత్యంత సన్నిహితులతోనూ చర్చిస్తుంటా. ఓ విధంగా అది నాకు బాగా సహాయపడుతోంది’’ అంటోంది అనుపమ.

24 కిస్సెస్

తన 24 కిస్సేస్ సినిమా గుర్తించి హేబ్బా పటెల్ వివరణలు సమర్ధలతో సాగిపోతున్నది. ఈ సినిమా టైటిల్స్ పట్ల కృతగ్ణతలు చెప్పుకుంటున్నది. సినిమా టైటిల్ విన్న వారిని గబుక్కున ఆకర్శించేస్తున్నది. టైటిల్ ను బట్టి సినిమాలో బోల్డెన్ని ముద్దులుంటాయన్న కబుర్లూ వినిపిస్తున్నాయి. మీడియా విద్యార్ధినిగా నటిస్తూ ప్రొఫెసర్ ప్రేమలో పడే పాత్ర నాది. ఇప్పటి దాకా గ్లామరస్ పాత్రలూ పక్కింటి అమ్మాయి పాత్రలు చేస్తూ వచ్చాను. ఇది వాటికి భిన్నంగా నా స్వంత పరిధిలో నేనుండే పాత్ర. నేను చెయ్యగలనా. లేదా అని మొదట్లో భయపడ్డాను. పూర్తిగా కధ వివరించాకా కన్విన్స్ అయ్యా. ప్రతి ముద్దు సన్నివేశాన్ని చాలా కళాత్మకంగా జస్టి ఫై చేస్తూ చిత్రించారు. అంటూ ముద్దుల్ని సమర్ధించుకున్నది హెబ్బా పటేల్.

తీరు మారింది

బరేలీకి బర్పీ విజయం తాను సినిమాలు ఎంపిక చేసుకునే తీరూ, ధోరణిలో ఏమాత్రం మార్చలేదంటున్నది పొడగరి కృతిససన్. అయితే తనకు ఆఫర్లు ఇచ్చే సినిమాల తీరు మారింది. సినిమాల ఎంపికలో ఎక్కువ ఆప్షన్లు ఉంటున్నాయని చెప్తున్నది. కానీ సినిమాల ఎంపిక సమయంలో నా ప్రాధాన్యత కార్యక్రమాలు నా ఆలోచనలు కూడా అలాగే ఉన్నాయి. స్క్రిప్ట్ తో నేను కనెక్ట్ అయినా, పాత్ర గొప్పగా ఉన్నా నేను ఎంచుకుంటాను. ఈ రెండింటి విషయంలో నేను మొదటి నుంచి ఒకే మాదిరి ఉన్నాను. అని తెలిపింది పొడుగుకాళ్ల సుందరి కృతి సనన్ .

దుబాయి పారిపోతా

నటి నివేదా పేతురాజ్‌ బిజీ కథానాయకిగా మారిపోయింది. మదురైలో పుట్టి, దుబాయ్‌లో పెరిగిన ఈ బ్యూటీ కోలీవుడ్‌లో హీరోయిన్‌ అయ్యింది. తొలి చిత్రం ఒరునాళ్‌ కూత్తుతోనే నటిగా మంచి పేరు తెచ్చుకున్న నివేదాకు ఆ తరువాత అవకాశం రావడానికి కాస్త ఆలస్యమైందనే చెప్పాలి. అవకాశాలు లేకపోతే దుబాయ్‌ వెళ్లిపోతాను గానీ, వాటి కోసం ఎవరినీ అడగనని తెగేసి చెప్పిన నివేదా పేతురాజ్‌కు ఆ అవసరం రాలేదు. అంతే ఆ తరువాత ఉదయనిధికి జంటగా నటించిన పొదువాగ ఎన్‌ మనసు తంగం ఆమె కెరీర్‌కు ఏ మాత్రం ఉపయోగపడలేదు. అయినా సక్సెస్‌ఫుల్‌ నటుడు జయంరవికి జంటగా నటించే భారీ అవకాశాన్ని దక్కించుకుంది. ఆయనతో నటించిన టిక్‌ టిక్‌ టిక్‌ చిత్రం మంచి విజయాన్ని అందించింది. అంతే లక్కీ హీరోయిన్‌గా ముద్ర వేసుకుంది. మధ్యలో మెంటల్‌ మదిలో చిత్రంతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. తాజాగా విజయ్‌ఆంటోని సరసన తిమిరు పుడిచ్చవన్, ప్రభుదేవాతో పొన్‌ మాణిక్యవేల్‌ చిత్రాలతో పాటు తెలుగులో బ్రోచేవారెవరురా చిత్రంలోనూ నటించేస్తోంది. తాజాగా మరో లక్కీచాన్స్‌ను కొట్టేసింది. వైవిధ్యభరిత కథా చిత్రాల దర్శకుడు ప్రభుసాల్మన్‌ దర్శకత్వంలో నటించడానికి రెడీ అవుతోందన్నది తాజా సమాచారం. మైనా, కుంకీ, తొడరి వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన ప్రభుసాల్మన్‌ తాజాగా కుంకీ–2 చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కుంకీ చిత్రంలో విక్కమ్‌ప్రభుతో పాటు నటి లక్ష్మీమీనన్‌కు సినీ లైఫ్‌ను ఇచ్చిన ప్రభుసాల్మన్‌ ఇప్పుడు కుంకీ–2లో నవ నటుడు మదిని హీరోగా పరిచయం చేస్తున్నారు. ఆయనకు జంటగా నటి అతిథిమీనన్‌ నటించనుందనే ప్రచారం జరిగింది. తాజాగా నటి నివేదాపేతురాజ్‌ పేరు వెలుగులోకి వచ్చింది. అయితే ఈ అమ్మడు రెండో నాయకిగా నటిస్తోందా లేక అతిథిమీనన్‌ను తొలగించి నివేదా పేతురాజ్‌ను ఎంపిక చేశారా? అన్నది తెలియాల్సి ఉంది. కుంకీ–2 చిత్ర షూటింగ్‌ తొలి షెడ్యూల్‌ ఇప్పటికే థాయిల్యాండ్‌లోని ఏనుగులు నివసించే దట్టమైన అడవుల్లో జరుపుకుంటోంది. ఈ చిత్రం కోసం నివేదా పేతురాజ్‌ ఏకంగా 70 రోజులు కాల్‌షీట్స్‌ కేటాయించినట్లు సమాచారం. ఈ చిత్రాన్ని బెన్‌ ఇండియా అనే బాలీవుడ్‌ చిత్ర నిర్మాణ సంస్థ భారీ బడ్జెట్‌లో నిర్మిస్తోంది.

త్వరలో చెప్తా

తెలుగుతో పాటు పలు ఇతర భాషా చిత్రాల్లో కూడా వెండితెర మెరుపులు మెరిపించింది ప్రియమణి. స్టార్ హీరోయిన్లతో పోల్చితే తక్కువ కాలమే ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ.. తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకొని ప్రేక్షకుల మనసు దోచుకుంది. అయితే కెరీర్ కొద్దిగా నెమ్మదిస్తున్న వేళ ప్రియమణి పెళ్లి పీటలెక్కింది.గతేడాదే ప్రియమణి- ముస్తాఫారాజ్ ఒక్కటయ్యారు. పెళ్లి చేసుకొని సినిమాలకు దూరమైన ప్రియమణి బుల్లితెర ప్రవేశం చేసి అక్కడా రాణించింది. తెర ఏదైనా, క్యారెక్టర్ ఎలాంటిదైనా అందులో పరకాయ ప్రవేశం చేసి నటించడం ఈమె స్టైల్. కాగా తాజాగా.. తన భర్తతో కలిసి సాన్నిహిత్యంగా ఉన్న కొన్ని ఫొటోలు ప్రియమణి సోషల్ మీడియా వేదికగా పంచుకోవడం ఇప్పుడు హాట్‌టాపిక్ అయింది. స్వయంగా ఈ ఫొటోలు పోస్ట్ చేసిన ప్రియమణి.. త్వరలో ఓ ఇంట్రెస్టింగ్ విషయం కూడా చెబుతానని తెలపడం అందరిలో ఆసక్తి రేపుతోంది.అయితే ఆమె పెట్టిన ఫొటోలు, ట్యాగ్ చేసిన కామెంట్ చూసి.. ప్రియమణి ఎందుకిలా అంటోది? దాని అర్థం ఖచ్చితంగా ఆమె తల్లి కావడమే.. అని చెప్పుకుంటున్నారు నెటిజన్లు. చూడాలి మరి చివరకు ప్రియమణి చెప్పే ఆ ఇంట్రెస్టింగ్ విషయమేంటో..!

అదృష్టమే సంతృప్తి

బాక్సాఫీసు వద్ద బాజాలు మోగించిన సినిమాల ఖాతాలు అనేకం జమ చస్తున్న కత్రీనా కైఫ్ ఈ ఏడాది తనకు బాగా కలిసి వచ్చిందంటూ సంబరాలు పోతున్నది. తన సినిమాల విజయం కొత్త ఊపిరి ఉత్సాహాలను ఇస్తున్నయంటూన్నది నా కెరీర్ విజయాల వెనుక బోల్డెంత కష్టం ఉంది. మారే పరిస్థితులకు తగినట్లుగా మారుతూ ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటూ ముందుకు వెళ్తేనే నిలదోక్కుకోగలం. ఇది రంగుల ప్రపంచం పూర్తిగా స్థిరపడమని అనుకునే లోపే పరిస్థితులు మారిపోతుంటాయి. నాకు మాత్రం ఇప్పటి దాకా అంతా సంతృప్తిగా సాగిపోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను అని చెప్పింది.

సమయం మొదలైంది

ప్రతి సినిమాలోనూ నా పాత్ర భిన్నంగా వుండాలని కోరుకుంటాను. అలాంటి కథలకే అధిక ప్రాధాన్యతనిస్తుంటాను. అన్నారు ఈషా రెబ్బ. ఆమె కథానాయికగా నటిస్తున్న తాజా చిత్రం బ్రాండ్‌బాబు. ఆగస్టు 3న విడుదల కానుంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో కథానాయిక ఈషా రెబ్బ పాత్రికేయులతో మాట్లాడుతూ దర్శకుడు మారుతి మార్కు సినిమాలకు దగ్గరగా వుండే చిత్రమిది. ప్రతి వస్తువు కొనే విషయంలో టాప్‌బ్రాండ్‌కు ప్రాధాన్యతనిచ్చే యువకుడు, అతని కుటుంబం నేపథ్యంలో సాగే కథ ఇది. చివరకు ప్రేమించే అమ్మాయి కూడా బెంజ్‌కారు మాదిరిగా టాప్‌క్లాస్‌కు చెందినదై వుండాలని కోరుకుంటాడు. బ్రాండ్ మాయలో పడిన అతని జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందన్నది ఆసక్తికరంగా ఉంటుంది. పనిమనిషికి, ధనవంతుడైన ఓ యువకుడికి మధ్య సాగే విభిన్నమైన ప్రేమకథగా దర్శకుడు ఈ చిత్రాన్ని వినోదాత్మకంగా తెరకెక్కించాడు. కుటుంబ భావోద్వేగాల సమాహారంగా ఆసక్తికరంగా సాగుతుంది. ఇటీవల నేను నటించిన చిత్రాలు విజయం సాధించినా నాకు ఆ స్థాయి అవకాశాలు రావడం లేదని చెబుతున్నారు. నా వద్దకు వచ్చిన సినిమాల్లో నాకు నచ్చిన వాటినే ఎంచుకుంటున్నాను.ప్రస్తుతం హీరో సుమంత్‌తో కలిసి సుబ్రహ్మణ్యపురం, ఎన్టీఆర్, త్రివిక్రమ్ తొలికలయికలో రానున్న అరవింద సమేతలో కీలక పాత్రలో రెండవ నాయికగా చేస్తున్నాను. చాలా రోజులుగా ఇలాంటి సమయం కోసం ఎదురు చూస్తున్నాను. ఇప్పటికి నా టైమ్ మొదలైంది. ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోతో కలిసి పనిచేయడం ఇదే తొలిసారి. ఇందులో నా పాత్ర రెబల్‌గా టామ్ బాయ్ తరహాలో వుంటుంది. ఇప్పటి వరకు నేను ఈ తరహా పాత్రను చేయలేదు. నటిగా నా స్థాయిని పెంచే సినిమా అవుతుంది. ఇక్కడ తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రావడం లేదని నేను ఎప్పుడూ చెప్పలేదు. మనకు ఎలాంటి పాత్ర సూటవుతుందో దాన్ని ఎంచుకుని వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటేనే ముందుకు వెళతాం. మనలో టాలెంట్ వుంటే అవకాశాలు అవే వెతుక్కుంటూ వస్తాయి. ప్రస్తుతం నా దృష్టంతా తెలుగు చిత్రాలపైనే. అవకాశం వస్తే తమిళంలోనూ నటిస్తా అని తెలిపింది.

అమలకు ఉత్తరం

సౌత్‌లో సక్సెస్‌ సాధించిన కథానాయిక అమలాపాల్‌.. ఇప్పుడు నార్త్‌లోనూ సత్తా చాటేందుకు సిద్ధం అవుతున్నారు. ఆమెకు బీ టౌన్‌ నుంచి పిలుపు వచ్చింది. అర్జున్‌ రామ్‌పాల్‌ హీరోగా రూపొంద్నున్న ఓ హిందీ థ్రిల్లర్‌ మూవీలో అమలాపాల్‌ నటించనున్నారు. నరేశ్‌ మల్హోత్రా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ అక్టోబర్‌లో స్టార్ట్‌ కానుందట. ‘‘బాలీవుడ్‌లో తొలి సినిమా చేయబోతున్నందుకు హ్యాపీగా ఉంది. నరేశ్‌ చెప్పిన స్టోరీ నచ్చింది. ఈ సినిమా షూటింగ్‌ హిమాలయాల్లో కూడా జరగనుంది.నేను ఎగై్జట్‌ అయ్యే విషయాల్లో ఇదొకటి. ఈ సినిమా డిస్కషన్స్‌లో భాగంగా అర్జున్‌తో మాట్లాడుతున్నప్పుడు హిందీ భాషపై నాకు ఎంత గ్రిప్‌ ఉందన్న విషయం ప్రస్తావనకు వచ్చింది. ఒక టైమ్‌లో నేను ఢిల్లీలో స్టే చేయడం వల్ల హిందీ భాషపై మంచి అవగాహన ఉంది. కానీ, ఇదేం పెద్ద ప్రాబ్లమ్‌ కాదు. ఈ సినిమాకు సంబంధించిన వర్క్‌షాప్స్‌ నాకు ప్లస్‌ అవుతాయనుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు అమల. ట్రావెలింగ్‌ను అమల లైక్‌ చేస్తారు. అందుకేనేమో.. హిమాలయాల్లో షూటింగ్‌ అనగానే ఎగై్జట్‌ అయ్యుం టారని ఊహించవచ్చు.