ఘనంగా సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ ప్రథమ స్నాతకోత్సవం


ఆమెరికాలోని కాలిఫొర్నియా రాష్ట్రంలో రెండు సంవత్సరాల క్రితం స్వతంత్ర ప్రతిపత్తితో ఏర్పాటయి భారతీయ కళలు మరియు భాషలలో మాస్టర్స్, డిప్లొమ మరియు సర్టిఫికెట్ స్థాయి కోర్సులను అందిస్తున్న సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ ప్రథమ స్నాతకోత్సవం ఆదివారం నాడు ఘనంగా నిర్వహించబడింది. తొలి బ్యాచ్ లో చేరి కోర్సు పూర్తి చేసిన ౩1 మంది విద్యార్ధులకు సిలికానాంధ్ర విశ్వ విద్యాలయ అధ్యక్షులు ఆనంద్ కూచిభొట్ల మరియు విశ్వ విద్యాలయ పాలకవర్గ చైర్మన్ శ్రీ లకిరెడ్డి హనిమిరెడ్డి చేతుల మీదుగా ఈ స్నాతకోత్సవంలో పట్టాలు అందించడం జరిగింది. కాంప్ బెల్ హెరిటేజ్ థియేటర్్లో జరిగిన ఈ కార్యక్రమం ప్రారంభంలో నిర్వహంచిన శోభాయాత్ర చూపరులను ఎంతో ఆకట్టుకొన్నది. విశ్వవిద్యాలయం ప్రొవొస్ట్ రాజు చమర్తి ముందు నడవగా పాలక వర్గ సభ్యులు అద్యక్షులు ఆనంద్ కూచిభొట్ల, చైర్మన్ డా. హనిమిరెడ్డి లక్కిరెడ్డి, డా. పప్పు వేణుగోపాల రావు, నీరజ్ భాటియా, చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ దీనబాబు కొండుభట్ల, చీఫ్ కాంప్లయన్స్ ఆఫీసర్ దిలీప్ కొండిపర్తి, ప్రముఖ వ్యక్తిత్వవికాస నిపుణులు ప్రసాద్ కైపా మరియు పట్టభద్రులు కాబోతున్న విద్యార్ధులు స్నాతకోత్సవ దుస్తులతో కవాతుగా వేదిక వద్దకు వచ్చారు. 2001వ సంవత్సరంలో సిలికానాంధ్ర ప్రారంభించిన నాటి నుంచి ఈ రోజు వరకు సాధించిన విజయాలను గుర్తు చేస్తూ రాబోయే రోజులలో విశ్వవిద్యాలయం లక్ష్యం, ప్రణాళిక, కార్యకలాపాలను వివరిస్తూ స్పూర్తిదాయకమయిన స్వాగతోపన్యాసం చేసారు అధ్యక్షులు శ్రీ ఆనంద్ కూచిభొట్ల. సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ త్రైమాసిక పత్రిక ‘శాస్త్ర’ ను పాలక మండలి సభ్యులు మరియు అకాడమిక్ అడ్వైజరి కమిటి చైర్మన్ డా. పప్పు వేణుగోపాలరావ్ ఆవిష్కరించారు. శనివారం జరిగిన స్నాతకోత్సవ సంబరాల్లో విశ్వవిద్యాలయ విద్యార్ధులు ప్రదర్శనలిచ్చారు , ప్రఖ్యాత సంగీత విద్వాంసులు, సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం కర్ణాటక సంగీత ఆచార్యులు డా. శ్రీరాం పరశురాం నిర్వహించిన హిందుస్తాని-కర్ణాటక సంగీత జుగల్‌బంది కచేరీకి ప్రేక్షకులు తన్మయత్వం చెందారు. ఈ కార్యక్రమంలో పాల్గొనటానికి భారతదేశం నుంచి ప్రత్యేకంగా విచ్చేసిన అధ్యాపక బృందం డా. శ్రీరాం పరశురాం, డా.మాలా స్వామి, డా.రమాదేవి, డా. సుమిత్ర వేలూరి, డా.యశోద ఠాకూర్, డా.అనుపమ కైలాష్ తదితరులను విశ్వవిద్యాలయ పాలకవర్గం ప్రత్యేకంగా సన్మానించింది.






















కృష్ణా జిల్లాకు డా.హనిమిరెడ్డి భారీ విరాళం


అమెరికాకు చెందిన ప్రముఖ ప్రవాసాంధ్రుడు, గుండె వైద్య నిపుణుడు డా.లకిరెడ్డి హనిమిరెడ్డి మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. ఇప్పటివరకు వివిధ సామాజిక సేవా కార్యక్రమాలకు ₹60కోట్లకు పైగా విరాళాలిచ్చిన హనిమిరెడ్డి కృష్ణాజిల్లాలో కలెక్టర్ లక్ష్మీకాంతం విజ్ఞప్తి మేరకు డిజిటల్ తరగతి గదుల నిర్మాణానికి $50వేలడాలర్లను(₹35లక్షలు) అందించారు. ఏపీ జన్మభూమి పథకం క్రింద కృష్ణా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో నిర్మిస్తున్న డిజిటల్ తరగతి గదులకు ఈ నిధులను వినియోగిస్తారు. గతంలో డిజిటల్ తరగతి గదులకు $7500 విరాళాన్ని ప్రకటించిన హనిమిరెడ్డి మరో 50వేల డాలర్లను అందించారు. భారీగా విరాళమందించిన హనిమిరెడ్డిని అమెరికాలో ఆంధ్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, ఏపీ జన్మభూమి సమన్వయకర్త కోమటి జయరాం కృతజ్ఞతలు తెలిపారు.

డా.హనిమిరెడ్డి ఔదార్యం అందరికి ఆదర్శం-మంత్రి ఉమా


విద్యార్ధుల్లో సైన్స్ పట్ల అవగాహన పొందడం కోసం ఏర్పాటు చేసిన అగస్త్య ఫౌండేషన్ విభాగాన్ని మైలవరంలో గురువారం నాడు మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. దీని ఏర్పాటు కోసం అమెరికాకు చెందిన ప్రముఖ కార్డియాలజిస్ట్ డా. లక్కిరెడ్డి హనిమిరెడ్డి రూ.75 లక్షలు విరాళంగా అందించారు. ఈ సందర్భంగా మంత్రి ఉమా మాట్లాడుతూ ఇప్పటి వరకు వివిధ సామాజిక సేవా కార్యక్రమాలుకు 60కోట్ల రూపాయలకు పైగా విరాళం అందించిన డా. హనిమిరెడ్డి ఔదార్యం గొప్పదని ప్రశంసించారు. ఆయన జీవితాన్ని ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకుని సమాజ సేవకు ముందుకు రావాలని మంత్రి ఉమా కోరారు. మైలవరం ప్రాంతంలో పెద్ద ఎత్తున కోట్లాది రూపాయల ఖర్చుతో వివిధ సంస్థలను ఏర్పాటు చేస్తున్న డా.హనిమిరెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. భారతదేశంలో సైన్స్ అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున కృషి చేస్తున్న అగస్త్య ఫౌండేషన్ మైలవరం ప్రాంతంలో విద్యార్ధుల కోసం శాఖను ఏర్పాటు చేయడం పట్ల ఆయన అభినందనలు తెలిపారు. ఫౌండేషన్ చైర్మన్ రాంజీ రాఘవ మాట్లాడుతూ భారతదేశంలో పందొమ్మిది రాష్ట్రాల్లో 200 మొబైల్ వాహనాల ద్వారా అగస్త్య ఫౌండేషన్ విద్యార్ధులకు శాస్త్రీయ పరిశోధనల పైన శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. చిత్తూరు జిల్లా కుప్పంలో 175 ఎకరాల స్థలంలో అగస్త్య ఫౌండేషన్ ఆద్వర్యంలో ఆధునిక పరిశోధనశాలలను ఏర్పాటు చేసిన ఉపాద్యాయులు, విద్యార్ధులకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. డా.హనిమిరెడ్డి మాట్లాడుతూ తాము సంపాదించిన దానిలో పేద విద్యార్ధులకు సహాయం చేయడం కోసం వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దడం కోసం ఎక్కువగా విరాళాలు ఇస్తున్నట్లు తెలిపారు. స్థానికంగా ఏర్పాటు చేసిన అగస్త్య ఫౌండేషన్ ఆద్వర్యంలో తిరువూరు, మైలవరం నియోజకవర్గాల్లోని హైస్కూల్ స్థాయి నుండి విద్యార్ధులకు, ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వటం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎన్నార్టీ చీఫ్ ఎక్జిక్యూటివ్ ఆఫీసర్ జానకిరాం, డా.హనిమిరెడ్డి సతీమణి విజయలక్ష్మి, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రమీల స్థానిక ప్రముఖుడు గోగులమూడి సత్యనారాయణరెడ్డి, ఎమ్మార్వో పుల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.















ప్రముఖ విద్యావేత్త, దానశీలి ప్రొ.మూల్పూరి వెంకట్రావు జీవితం అందరికి ఆదర్శం.


విద్యావేత్తగా, దానశీలిగా, నిరుపేదలకు సహాయ సహకారాలు అందించే వ్యక్తిగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కీర్తి ప్రతిష్ఠలు సంతరించుకున్న ఆదర్శ వ్యక్తి డాక్టర్.మూల్పూరి వెంకట్రావు. సామాన్య కుటుంబం నుంచి అగ్రరాజ్యం అమెరికాలో అత్యున్నతమైన ఫ్రొఫెసర్ స్థాయికి ఎదిగిన వెంకట్రావు నిరాడంబర, నిస్వార్థ జీవనం అందరికీ ఆదర్శప్రాయం. తాను సంపాదించిన దాంట్లో గణనీయమైన శాతం డాక్టర్ వెంకట్రావు సేవా కార్యక్రమాలకే వినియోగిస్తూ ఉండటం విశేషం. ఆర్భాటాలకు, ప్రచారనికి దూరంగా ఉండే ప్రొఫెసర్ వెంకట్రావు జీవనశైలి అందరికీ, ముఖ్యంగా నేటి యువతరానికి ఆదర్శప్రాయంగా ఉంటుందనటంలో సందేహం లేదు.

*** తానా కన్వీనర్‌గా కీలక బాధ్యతలు
వాషింగ్టన్ డీసీలో జులై మొదటి వారంలో తానా మహాసభలను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. తానా అధ్యక్షుడు వేమన సతీష్ సారథ్యంలోని యువ కార్యవర్గం ఈ మహాసభలను ఘనంగా నిర్వహించడానికి పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు. ఈ మహాసభలకు ఒక ప్రముఖ వ్యక్తి, అనుభవం ఉన్న కార్యశీలిని కన్వీనర్‌గా ఉండాలని తానా యువ కార్యవర్గం భావించింది. అన్ని విధాలుగా అనుభవం గడించిన, వివాదాలకు దూరంగా ఉండే ప్రొఫెసర్ మూల్పూరి వెంకట్రావును తానా మహాసభల సమన్వయకర్తగా, యువ కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నుకుంది. మూల్పూరి వెంకట్రావు ఆధ్వర్యంలో ఈసారి జరిగే తానా మహాసభలు చరిత్రలో మరచిపోలేని విధంగా ఉంటాయని అందరూ భావిస్తున్నారు.

*** జీవన ప్రస్థానం ఇది
అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో ప్రఖ్యాతి చెందిన జార్జి మేసన్ విశ్వవిద్యాలయంలో గత 32 ఏళ్ళు నుండి ప్రొఫెసరుగా పనిచేస్తున్న డాక్టర్.మూల్పూరి వెంకట్రావు ప్రతి ఏడాది తన సంపాదనలో పెద్ద మొత్తం (రూ.30లక్షల రూపాయలకుపైగా) సేవా కార్యక్రమాలకు విరాళాలుగా అందజేస్తూ మిగిలిన వారికి ఆదర్శంగా నిలుస్తున్నారు. యూనివర్సిటీలో ఇంజినీరింగ్ విభాగంలో బ్యాచిలర్స్, మాస్టర్స్, పీ.హెచ్.డీ విద్యార్ధులకు బోధనతో పాటు డాక్టర్.వెంకట్రావు వర్జీనియా పరిసర ప్రాంతల్లో ఉన్న ప్రవాసాంధ్ర కుటుంబాలకు చెందిన మిడిల్ స్కూలు (6,7,8 తరగతులు), హైస్కూలు (9,10,11,12 తరగతులు) విద్యార్థులకు తన తీరిక సమయంలో పాఠాలు బోధిస్తుంటారు. అమెరికాలో ప్రసిద్ధి చెందిన థామస్ జఫర్సన్ హైస్కూల్లో సీటు రావాలంటే ప్రత్యేకమైన తర్ఫీదు అవసరం. ఈ స్కూలులో ప్రవేశం కోసం పొందే శిక్షణలకు సైతం అత్యధికంగా ఖర్చు చేయవలసి ఉంటుంది. ఇది గమనించిన వెంకట్రావు గత 10 సంవత్సరాల నుండి విద్యార్ధులకు శిక్షణ ఇవ్వటం ప్రారంభించారు. ఆయన తర్ఫీదు ఇచ్చిన వారిలో 300 మంది థామస్ జఫర్సన్ హైస్కూల్లో సీటు సంపాదించారు. వెంకట్రావు స్ధాపించిన క్యూరీ లెర్నింగ్ సంస్ధ అమెరికాలోని ఇతర నగరాలకు కూడా విస్తరిస్తున్నామని ఆయన వెల్లడించారు. ఇప్పటి వరకు పన్నెండు నగరాల్లో క్యూరీ లెర్నింగ్ శాఖలు ఏర్పాటు చేసినట్లు ప్రొఫెసర్ మూల్పురి TNIకు తెలిపారు.

*** బాల్యం-విద్యాభ్యాసం
కృష్ణా జిల్లా ఘంటసాలలో మూల్పూరి చెన్నారావు, లక్ష్మితులసమ్మ దంపతులకు వెంకట్రావు జన్మించారు. తండ్రి చెన్నారావు స్థానిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా ఉండేవారు, వెంకట్రావు 10వ తరగతి వరకు స్థానికంగా, ఇంటర్మీడియట్ విజయవాడ లయోలా కళాశాల (1970-72)లో పూర్తి చేసారు. అనంతరం కాకినాడ జె.ఎన్.టీ.యూలో బీటెక్ (ఈసీఈ) విద్యనభ్యసించారు. తదుపరి ప్రతిష్టాత్మక ముంబై ఐఐటిలో ఎంటెక్ పూర్తి చేశారు. అనంతరం 1979-81 మధ్య కాలంలో విజయవాడ సిద్దార్థ ఇంజినీరింగ్ కళాశాలలో అధ్యాపకులుగా పనిచేశారు. 1981వ సంవత్సరంలో అమెరికా వెళ్ళి ఆరెగాన్/మిషిగన్ విశ్వవిద్యాలయాల్లో ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ విభాగంలో పీ.హెచ్.డీ చేశారు. 2005లో తానా వారు అత్యుత్తమ ఇంజనీర్ అవార్డును ఇచ్చి సత్కరించారు. జార్జి మేసన్ యూనివర్సిటీ నుండి 2002లో ‘ఔట్ స్టాండింగ్ రీసర్చ్’ అవార్డుతో పాటు పలు జాతీయ, ప్రాంతీయ స్ధాయిల్లో 10కు పైగా కమ్యూనిటీ సర్వీసు అవార్డులు, అక్కినేని 89వ జన్మదిన పురస్కారాలు వెంకట్రావును వరించాయి.

*** ఆదాయంలో గణనీయ శాతం విరాళాలకు
ధామస్ జఫర్సన్ పాఠశాలలో ప్రవేశం కోసం ప్రవాసాంధ్ర విద్యార్ధులకు చెప్పే పాఠాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని మొదటి అయిదేళ్ల పాటు పూర్తిగా అందించిన వెంకట్రావు, ఆ తర్వాత పెరిగిన విద్యార్ధులు, అధ్యాపకుల సంఖ్య, ఇతరత్రా నిర్వహణా ఖర్చుల దృష్ట్యా వచ్చిన ఆదాయంలో గణనీయమైన శాతాన్ని విరాళాలుగా అందిస్తున్నారు. వాషింగ్టన్ లో విద్యార్ధులకు ప్రైవేట్ పాఠాలు చెపుతున్న డాక్టర్.వెంకట్రావుకు సంవత్సరానికి రూ.30లక్షలకు పైగా ఆదాయం వస్తోంది. ఈ ఆదాయాన్ని ఆయన సమాజ సేవా కార్యక్రమాలకు వెచ్చిస్తున్నారు. గిరిజన విద్యార్ధులకు ఏకల్ విద్యాలయ సంస్ధ ద్వారా నూతన పాఠశాలలను ప్రారంభించటానికి తోడ్పడ్డారు. హైదరాబాద్ లో అనాధ బాలలకోసం వేమూరి విజయలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంస్థకు ఇప్పటి వరకు రూ.15లక్షల విరాళాన్ని అందజేశారు. శ్రీకాకుళం, చల్లపల్లి ప్రాంతాల్లో పురాతన ఆలయాల పున:నిర్మాణానికి ఇప్పటివరకు రూ.10లక్షల వరకు అందజేశారు. ప్రస్తుతం నల్గొండ జిల్లా భక్తాళాపురంలో షిర్డీ సాయిబాబా మందిరాన్ని, కమ్యూనిటీ హాలును నిర్మిస్తున్నారు. దీనిలో పాటు ఘంటశాలలో ఏర్పాటు చేసిన గొర్రెపాటి ఫౌండేషన్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పేద విద్యార్ధులకు ఆర్ధిక సాయాన్ని అందజేస్తున్నారు. వాషింగ్టన్ సమీపంలో నిర్మిస్తున్న శ్రీవేంకటేశ్వర లోటస్ టెంపుల్ కు ఇప్పటి వరకు రూ.కోటి 25లక్షలకు పైగా విరాళాన్ని అందించారు. కనకదుర్గ ఆలయానికి ఇప్పటి వరకు రూ.25లక్షలు అందించారు.

* **అంతా మేధావులే
వెంకట్రవు తమ గ్రామానికి సమీపంలో ఉన్న రావివారిపాలేనికి చెందిన సావిత్రిని వివాహం చేసుకున్నారు. ఆమె వాషింగ్టన్ లో ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన అమెరికన్ పేటెంట్ అండ్ ట్రేడ్ మార్క్ సంస్థలో ప్రైమరీ ఎగ్జామినర్ గా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వారికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు కార్తిక్ భవాని శంకర్ ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైన కార్నెల్ మరియు స్టాన్‌ఫోర్డ్ యునివర్శటిల్లో చదివి ప్రస్తుతం న్యూయార్కులోని మీడియా మాత్ అనే కంపెనీలో ఆపరేషన్స్ అండ్ స్ట్రేటజీ విభాగానికి డైరక్టరుగా పనిచేస్తున్నారు. రెండో కుమారుడు కేధార్ నాథ్ ప్రముఖ యునివర్సటీ డార్ట్ మత్ కాలేజీలో బ్యాచిలర్స్ విద్యనభ్యసించి ప్రస్తుతం బోస్టన్ యూనివర్సిటీల్ మాస్టర్స్ డిగ్రీని చేస్తున్నారు.

*** ఎన్.టి.ఆర్ వీరాభిమాని మరియు నిర్మాత
ప్రొఫెసర్ వెంకట్రావు చదువుతో పాటు రంగస్థల నటుడిగానూ గుర్తింపు పొందారు. ఎన్.టి.రామరావుకు వీరాభిమాని అయిన వెంకట్రావు ఆయనతో సినిమాలు తీయాలనే బలమైన కోరికతో ఉండేవారు. అది సాధ్యం కాకపోవటంతో 1994, 97 సంవత్సరాల్లో ఎన్.టి.ఆర్ కుమారుడు బాలకృష్ణ కధానాయకుడిగా ‘టాప్ హీరో’, ‘దేవుడు ‘ చిత్ర్రాలు నిర్మించారు. కృష్ణా, గుంటూరు జిల్లాల సరిహద్దుల్లో కృష్ణా నది ఒడ్డున ఎన్.టి.ఆర్ పేరుమీదుగా మ్యూజియంను ఏర్పాటు చేయాలనేది ఆయన ఆకాంక్ష.

*** పరిశోధన రంగంలో వెంకట్రావు ప్రతిభ
* ఇప్పటి వరకు 17 మంది పీ.హెచ్.డీ విద్యార్ధులకు విజయవంతమైన పరిశోధన మార్గనిర్దేశకుడిగా వ్యవహరించారు. ఈయన దిశానిర్దేశంలో ప్రస్తుతం ముగ్గురు పీ.హెచ్.డీ విద్యార్ధులు పరిశోధనలు నిర్వహిస్తున్నారు.
* 140 జర్నల్ ఆర్టికల్స్ ప్రచురించారు. 100 కాన్ఫరెన్స్ ప్రొసీడింగ్స్ ప్రచురించారు.
* అమెరికా జాతీయ సైన్స ఫౌండేషన్ నుండి అప్రతిహితంగా 28 ఏళ్లు (1987-2015)పాటు నిధులు అందుకున్నారు.
ఇన్ని చేసినప్పటికీ తనకి సంతృప్తినిచ్చేది కేవలం ఒకే ఒక విషయం అంటారు డాక్టర్.మూల్పూరి వెంకట్రావు. ఒక వైపు తన సంస్ధ క్యూరీ లెర్నింగ్ లో కిండెర్ గార్టెన్ (ఎల్.కే.జీ) నుండి ఉన్నత పాఠశాల వరకు పలువురు విద్యార్ధులు. మరో వైపు జార్జి మేసన్ విశ్వవిద్యాలయంలో బ్యాచిలర్స్, మాస్టర్స్, పీ.హెచ్.డీ విద్యార్ధులు. వీరందరికీ (ఎల్.కె.జీ నుండి పీ.హెచ్.డీ వరకు) ప్రతిరోజు వివిధ సమయాల్లో విద్యను అందించటం తనకు చాలా ఉత్తేజాన్ని, ఆనాందాన్నిస్తుందని, తద్వారా వచ్చే ఆదాయం ద్వారా సమాజాభివృద్ధికి తోడ్పడం సంతృప్తినిస్తుందని ప్రొఫెసర్ మూల్పూరి పేర్కొనడం నేటితరం ఎందరో యువతీయువకులకు ఓ జీవితపాఠం. –కిలారు ముద్దుకృష్ణ , సీనియర్ జర్నలిస్ట్

అగస్త్య ఫౌండేషన్‌కు రూ.75లక్షలు విరాళమిచ్చిన డా.హనిమిరెడ్డి–TNI ప్రత్యేకం


తాను సంపాదించిన దాంట్లో ఇప్పటి వరకు వివిధ సామాజిక సేవా కార్యక్రమాలకు రూ.60కోట్లకు పైగా విరాళం అందించిన కాలిఫోర్నియాకు చెందిన ప్రముఖ ప్రవాసాంధ్రుడు డా. లకిరెడ్డి హనిమిరెడ్డి మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. భారీగా విరాళాన్ని ప్రకటించారు. విద్యార్ధులను సైన్స్ పట్ల అవగాహనా కల్పిస్తున్న అగస్త్య ఫౌండేషన్ కు డా. హనిమిరెడ్డి 75లక్షల రూపాయలు విరాళాన్ని ప్రకటించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నియోజకవర్గం కుప్పంలో 175 ఎకరాల్లో నెలకొల్పిన అగస్త్య ఫౌండేషన్ తన శాఖను డా.హనిమిరెడ్డి జన్మస్థలమైన మైలవరంలో ఏర్పాటు చేయటానికి ఈ విరాళాన్ని అందజేశారు. డిసెంబరు 26వ తేదీన మైలవరంలో అగస్త్య ఫౌండేషన్ శాఖను ముఖ్యమంత్రి చంద్రబాబు చేతులు మీదుగా ప్రారంభించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. లేనిపక్షంలో అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి దేవినేని ఉమా దీనిని ప్రారంభిస్తారు. ఈశాఖ ద్వారా మైలవరం, తిరువూరు నియోజకవర్గంలో ఉన్న అన్ని తరగతులకు చెందిన విద్యార్ధులకు అగస్త్య ఫౌండేషన్ ద్వారా ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తారు. దేశ వ్యాప్తంగా సేవలందిస్తోన్న అగస్త్య ఫౌండేషన్ కు సంబందించిన పూర్తీ సమాచారాన్ని దిగువ చదవండి.
**ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక సరిహదుల్లో చిత్తూరు జిల్లా గుండుపల్లె మండలంలో ఉంది. అగస్త్య ఫౌండేషన్. తెలుగు విద్యార్ధులతో పాటు తమిళ, కన్నడ విద్యార్ధులకు విజ్ఞానం పంచుతోంది. సైన్స్ ఆఫ్ హాండ్స్ పేరుతొ గ్రామాల్లో ఉన్న విద్యార్ధులకు ఉచితంగా సైన్స్ పాటాలు భోదిస్తోంది. వారి ఆలోచనా శక్తిని పెంచుతూ ఆవిష్కరణలకు ప్రేరణనిస్తోంది. విద్యా వ్యవస్థకు కొత్త దశదిశలను చూపుతోంది. దీనంతటికి కారణం ఓ వ్యక్తీ సంకల్పం.. పేద విద్యార్ధులు వీధుల్లో తిరుగుతూ కనిపించడంతో చలించిన రాంజీ రాఘవన్ 1994లో ఈ పౌండేషన్ కు పునాది వేశారు. విదేశాల్లో బ్యాంకు ఉద్యోగంలో స్థిరపడిన రాంజీ రాఘవన్ స్వగ్రామం తమిళనాడులోని తంజావూరు. ఏదైనా సేవ చేయాలనే తపనతో రాఘవన్ తండ్రి సలహా తీసుకున్నారు. మారుమూల గ్రామాల్లో ఉన్న పిల్లల సృజనాత్మకను పెంపొందించేందుకు ఏదైనా చేయాలనే ఆలోచన నుంచి పుట్టిందే ఈ అగస్త్య పౌండేషన్. దీనికోసం రాంజీ రాఘవన్ ఆయన స్నేహితుడు మహావీర్ లు వాళ్ళ ఉద్యోగాలను వదిలేసి విదేశాల నుంచి స్వదేశానికి వచ్చారు. ఝున్ ఝున్ వాలా పౌండేషన్ సహకారంతో బెంగళూరులో మొదట ఒక శాఖను ప్రారంభించారు. ఈ సంస్థ సేవలను గుర్తించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుప్పం నియోజకవర్గంలో గుడుపల్లె మండలం సాలచింతపల్లె వద్ద అగస్త్య విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటుకు అవసరమైన కార్యకలాపాల్ని ఇక్కడి నుంచే జరుగుతున్నాయి. యావత్ భారతదేశం లో జరుగుతున్నా కార్యకలాపాల్ని ఇకాడి నుంచే పర్యవేక్షిస్తారు.
**అంతా సైన్సె ..
అగస్త్య పౌండేషన్ కార్యాలయం లోపలి ప్రవేశిస్తుండగానే పై ఆకారంలో ఉన్న తోరణం స్వాగతం పలుకుతుంది. అక్కడి నుంచి అడుగడుగునా సైన్సు మనకు కళ్ళకు కడుతుంది. పచ్చని చెట్లు, పరిశుబ్రమైన వాతావరణం కనిపిస్తుంది. పౌండేషన్ లో ఒక్క ప్లాస్టిక్ కవర్ కూడా మనకు కనిపించదంటే వాళ్ళు పర్యావరణం పై ఎంత జాగ్రత్త తీసుకుంటున్నారో అర్ధం చేసుకోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతిదీ సైన్సు అని వీళ్ళు నమ్ముతారు. ప్రస్తుతం భారతదేశంలోని పద్దెనిమిది రాష్ట్రాల్లో అగస్త్య సేవలను అందిస్తున్నారు.
**ఉపాద్యాయులకు శిక్షణ
ప్రతి ఉపాద్యాయుడు నిత్య విద్యర్దే అందుకే విద్యార్ధుల్లో ఆసక్తిని పెంచే బోధనా పద్దతులను, విద్యార్ధులకు సులభంగా అర్ధమయ్యే రీతిలో పటాలు చెప్పడం ఎలా అనేది వివిధ కార్యక్రమాల్లో వివరిస్తారు. సంవత్సరానికి ఇప్పటికే దాదాపు రెండు లక్షల మంది ఉపద్యాయులకు విద్యా బోధనలో మెళకువలు నేర్పించారు. ఉపద్యయుల్లో శాస్త్రీయత దృక్పదాన్ని పెంపొందించేందుకు ఈ తరగతులు నిర్వహిస్తున్నారు.
**ల్యాబ్ ఇన్ ఎ బాక్స్
ఒకే పాటశాలలకు మళ్ళీమళ్ళీ వెళ్ళడం కష్టంతో కూడుకున్న పని. అందుకే అన్నిరకాల సైన్సు పరికరాలు ఉన్న ఒక బాక్సును ఒక పాటశాలకు ఇచ్చి దాంతో రోజువారి తరగతుల్లో భాగంగా పాటాలు భోదిమ్చాలని నిర్ణయించుకున్నారు. ఆ పాటశాలలో ఉన్న సైన్స్ ఉపాధ్యాయులకు ఆ బాక్స్ గురించి వివరిస్తారు. ఆ తరువాత ఉపాద్యాయులు స్వయంగా విద్యార్ధులకు బోధిస్తారు.
**ల్యాబ్ ఆన్ ఎ బైక్
ఈ కార్యక్రమం 2013లో ప్రారంభించారు. బైకుల మీద ల్యాబ్ బాక్సును అమరుస్తారు. వీటిపై అగస్త్య సిబ్బంది గ్రామాల్లో తిరిగి అక్కడున్న పాటశాల విద్యార్ధులకు సైన్స్ పై అవగాహన కలిగిస్తారు. మొబైల్ వ్యాన్ వెళ్ళలేని ప్రాంతాలకు ల్యాబ్ ఆన్ ఏ బైక్ వెళుతుంది. గుంతల రోడ్ల పైన వాహనంతో పాటు వందల కిమీ ప్రయాణించి అక్కడ పాటశాలల్లోని విద్యార్ధులకు ఆసక్తిని సైన్స్ పై అవగాహన కల్పిస్తారు. ఇలాంటి బైక్ లాబ్స్ మొత్తం 144 ఉన్నాయి.
**ఐ మొబైల్
పేద విద్యార్థులకు డిజిటల్‌ విద్యను చేరువ చేసేందుకు ఈ ప్రోగ్రాం ప్రారంభించారు. మాటిమాటికీ విద్యుత్తు సరఫరా పోయే ప్రాంతాలు, ఇంగ్లిష్‌ అంతగా రాని విద్యార్థులు లక్ష్యంగా ఈ కార్యక్రమం నడుస్తుంది. పాఠశాలల్లో డిజిటల్‌ విధానంలో పాఠాలు బోధిస్తారు.
**ఇన్నోవేషన్‌ ఫెయిర్స్‌..
విద్యార్థుల్లో ఆసక్తిని రేకెత్తించేందుకు, వారి నాలెడ్జ్‌ను వ్యక్తపరిచేందుకు ఒక వేదిక. ఇందులో ఎక్కువగా సైన్స్‌ ఫెయిర్‌లు ఉంటాయి. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రోత్సాహకాలు ఇస్తుంటారు. ఆడిటోరియంలో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా క్రీడామైదానాల వసతి కల్పిస్తోంది. ఆసక్తి ఉన్నవారికి బస్సు సౌకర్యం కల్పించి మరీ ప్రోత్సహిస్తోంది.
**సైన్స్‌ సెంటర్స్‌
అన్ని సైన్స్‌ సెంటర్లు పట్టణ ప్రాంతల్లోనే ఉంటాయి. ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చేందుకు వీలుగా పట్టణాల్లో ఏర్పాటు చేశారు. మొత్తం 55 సైన్సు సెంటర్లు ఉన్నాయి. పాఠశాల విధులకు ఎలాంటి ఆటంకాలు కలిగించకుండా శిక్షణ తరగతులు నిర్వహిస్తారు. సెంటర్లలో ఉపాధ్యాయులు ప్రయోగాలు చేసి సందర్శకులకు చూపిస్తారు.

తెలుగుజాతికే గర్వకారణం! రూ.60కోట్లకు పైగా దానధర్మాలు చేసిన మొనగాడు-TNI ప్రత్యేకం


సంపద కలిగిన వాళ్ళలో మిగిలిపోయిన దానిని దానం చేసే వాళ్ళని చూశాం, చందాలు వసూలు చేసి కార్యక్రమాలు చేపట్టే వాళ్ళని చూశాం. కానీ -తనకున్న దానిలో సింహభాగం దానధర్మాలకు వినియోగించే వాళ్ళను, దానం చేయడం కోసమే సంపాదించేవాళ్ళను చాలా అరుదుగా చూస్తుంటాం. అలాంటి అరుదైన వ్యక్తి డా.లకిరెడ్డి హనిమిరెడ్డి. పుట్టిపెరిగిన సొంత ఊరును, సొంత రాష్ట్రాన్ని, సొంత దేశాన్ని మరిచిపోలేదు. అలాగని తనను అక్కున చేర్చుకొని ఆదరించిన అమెరికా దేశాన్ని నిర్లక్ష్యం చేయలేదు. తనకు జన్మనిచ్చిన ప్రాంతానికి తాను సంపాదించుకోవడానికి అవకాశం కల్పించిన అమెరికాకు సమాన స్థాయిలో విరాళాలను అందజేస్తున్నారు. డా.లకిరెడ్డి చేస్తున్న దానధర్మాలు తెలుగుజాతికే గర్వకారణంగా ఉన్నాయి. బహుశా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇంత భారీ ఎత్తున విరాళాలు అందించిన ఏకైక వ్యక్తీ డా.హనిమిరెడ్డి అనడంలో ఏమాత్రం సందేహం లేదు. దాదాపు 20 సంవత్సరాల నుండి ఆయన వైద్యుడిగా సంపాదించిన దాంట్లో అధికంగా దానధర్మాలకే ఖర్చు చేస్తున్నారు. ఇప్పటి వరకు 8 మిలియన్ లకు పైగా (దాదాపు 60 కోట్ల రూపాయిలు) వివిధ సంస్థలకు విరాళాలుగా అందజేశారు. తన స్వగ్రామం కృష్ణా జిల్లా వెల్వడంలో రూ.50 లక్షలతో తాను చదువుకున్న స్కూలుకు భవనాలు నిర్మించారు. పొరుగునే ఉన్న మైలవరంలో కోటి రూపాయిలతో హైస్కూలు భవనాలు నిర్మించారు. మైలవరంలో జాతీయ రహదారి పక్కనే ఆరు ఎకరాల స్థలాన్ని కొని సొంతంగా ఆధునిక సౌకర్యాలతో భవనాలను కట్టించి ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేశారు. దీని కోసం 10 కోట్ల రూపాయిలు వెచ్చించారు. తాను మెడిసన్ చదువుకున్న వరంగల్ మెడికల్ కాలేజీలో విద్యార్ధినుల కోసం 4 కోట్లతో లేడీస్ హాస్టలు, ఆడిటోరియంను నిర్మించారు. ఇది కాకుండా కాకతీయ యూనివర్సిటీ అభివృద్ది కోసం కోటి రూపాయిలు విరాళాన్ని ఇచ్చారు. తాను పుట్టి పెరిగిన వెల్వడం గ్రామానికి ప్రతి ఏడాది సంక్రాంతి పండుగకు వచ్చి అక్కడున్న పేదలకు అన్నదానంతో పాటు వందలాది మందికి నూతన వస్త్రాలు, కళ్ళజోళ్ళు బహుకరిస్తున్నారు. దీనితో పాటు చాలా మంది వృద్ధులకు, పేద విద్యార్ధులకు ఉపకారవేతనాలు అందజేస్తున్నారు. అమెరికాలో తనకు జీవనాధారం కల్పించిన వివిధ సంస్థలకు భూరి విరాళాలను అందజేశారు. తాను నివాసం ఉంటున్న కాలిఫోర్నియా రాష్ట్రంలోని మర్సడ్ నగరంలో యూనివర్సిటీ, ఆడిటోరియం నిర్మాణానికి రూ.5 కోట్లు విరాళంగా ఇచ్చారు. అక్కడ సైన్స్ సెంటర్ అభివృద్దికి మరో 4 కోట్లు విరాళాన్ని ఇచ్చారు. స్థానికంగా ఉన్న హైస్కూల్ నిర్మాణానికి దఫాల వారీగా విరాళాలను అందజేశారు. అమెరికాలో ఉన్న దాదాపు అన్ని తెలుగు సంస్థలకు, సాహితీ కార్యక్రమలకు సాంస్కృతిక ప్రదర్శనలకు ప్రతి ఏడాది మొత్తంగా మిలియన్ డాలర్లు విరాళంగా ఇస్తున్నారు. అమెరికాలో అతిపెద్ద హిందూ దేవాలయంగా బాసిల్లుతున్న ‘లివర్ మోర్’ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అడితోరియంతో పాటు పరిపాలనా భవన నిర్మాణానికి ఇటీవలే డా. హనిమిరెడ్డి రూ. ఏడు కోట్లు విరాళంగా అందజేశారు.


*** చిన్నతనంలో గేదెలు కాశారు
డా.హనిమిరెడ్డి జీవితంలో పలు ఆసక్తి కరమైన సంఘటనలు ఉన్నాయి,. 1942లో వెల్వడంలో ఓ మధ్య తరగతి కుటుంబంలో ఆరుగురు సంతానంలో ఒకరిగా హనిమిరెడ్డి పుట్టారు. మైలవరంలో 8వ తరగతి వరకు చదువుకున్నారు. 8వ తరగతి చదువుతున్న సమయంలో హనిమిరెడ్డి తల్లి చనిపోయారు. తర్వాత హనిమిరెడ్డి తండ్రి ఆయనకు పొలం పనులతో పాటు గేదెలను మేపే బాధ్యతలను అప్పగించారు. హనిమిరెడ్డికి చదువుపై ఆసక్తి పెరగడంతో హైస్కూల్ విద్యకు విజయవాడ తరలివెళ్ళారు. హైదరాబాద్ న్యూ సైన్స్ కాలేజీలో పీ.యూ.సీ చదివారు. అప్పట్లో మంచి మార్కులు రావడంతో కాకతీయ మెడికల్ కళాశాలలో చేరి మెడికల్ సైన్స్ పూర్తిచేశారు. 1968 నుంచి 10 సంవత్సరాల పాటు మైలవరంలో ప్రైవేట్ ప్రాక్టీస్ పెట్టారు. అనంతరం అమెరికా వెళ్ళి కార్డియాలజిస్ట్ గా స్థిరపడి బాగా సంపాదించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలోనూ ఆయనకు కలిసి వచ్చింది. డా.హనిమిరెడ్డి మంచి రైతు కూడా. అమెరికాలో దాదాపు 1500 ఎకరాల్లో జీడిపప్పు, బాదం, పిస్తా, ద్రాక్ష తదితర పంటలను పండిస్తూ మిలియన్ల డాలర్లను పంటల రూపంలో ఆర్జిస్తున్నారు. 76 ఏళ్ళ వయసులో ఇప్పటికీ చలాకీగానే ఉంటారు. పొట్టిలాగు వేసుకొని క్రమం తప్పకుండా రోజుకు 7కిలోమీటర్లు పరుగులు పెడతారు. అయన కుమారులు ఇరువురూ తండ్రి బాటలోనే నడుస్తున్నారు. పెద్ద కుమారుడు డా. విక్రమ్ కార్డియాలజిస్ట్ గా డా.హనిమిరెడ్డి వద్దనే పని చేస్తున్నారు. చిన్న కుమారుడు సిద్దార్ధ రియల్ ఎస్టేట్, వ్యవసాయ పనులు చూస్తున్నారు. హనిమిరెడ్డి భార్య విజయలక్ష్మి భర్త అడుగుజాడల్లోనే నడుస్తున్నారు. హనిమిరెడ్డి జీవితం నేటి యువతరానికి ఆదర్శం.


*** సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం ఏర్పాటుకు మిలియన్ డాలర్లు
ప్రవాసాంధ్ర ప్రముఖుడు, తెలుగు భాష ప్రేమికుడు, కాలిఫోర్నియాలో స్థిరపడిన కృష్ణా జిల్లా వెల్వడంకు చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి దాతృత్వంతో నిండిన తన మనోఅక్షయపాత్ర వైభవాన్ని మరోసారి చాటుకున్నారు. సిలికానాంధ్ర సంస్థ ప్రతిష్ఠాత్మకంగా అమెరికాలో ఏర్పాటు చేస్తున్న సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ ఏర్పాటుకు అయ్యే ఖర్చుల నిమిత్తం మిలియన్ డాలర్లు (రూ.7కోట్లు) విరాళంగా అందించారు. ఈ మేరకు చెక్కును కూడా ఆయన సిలికానాంధ్ర ప్రతినిధులకు అందించారు.


*** లివర్‌మూర్ దేవాలయానికి 11లక్షల డాలర్లు
దానాలు చేయటంలో అగ్రగణ్యుడుగా పేరు పొందిన అమెరికాకు చెందిన ప్రముఖ ప్రవాసాంధ్ర వైద్యుడు డా.లక్కిరెడ్డి హనిమిరెడ్డి, అమెరికాలో ప్రముఖ దేవాలయంగా విరాజిల్లుతున్న లివర్ మూర్ శ్రీ వెంకటేశ్వర స్వామీ దేవాలయంలో ఆడిటోరియం నిర్మాణానికి గతంలో 6లక్షల డాలర్లు విరాళంగా ఇచ్చారు. ఆ దేవాలయం పాలకవర్గం విజ్ఞప్తి మేరకు పరిపాలనా భవనం నిర్మాణం కోసం మరొక 5 లక్షల డాలర్ల విరాళాన్ని డా.హనిమిరెడ్డి అందజేశారు. ఈ విరాళంతో నూతనంగా నిర్మించిన పాలక వర్గ భవనానికి డా.హనిమిరెడ్డి చేతులు మీదగా ప్రారంభోత్సవం జరిపించారు. డా.హనిమి రెడ్డి చేస్తున్న సమాజ సేవ అందరికి ఆదర్శంగా తెలవాలి. 76 ఏళ్ల వయసులో ప్రతిరోజూ ఏడు కి.మీ క్రమం తప్పకుండా పరుగులు పెడుతూ ఉత్సాహంగా వైద్య సేవలు అందిస్తోన్న డా.హనిమిరెడ్డి నిండు నూరేళ్ళు అలగానే ఉండాలని ఆయన చేస్తున్న దానధర్మాలు వంద కోట్లకు చేరుకోవాలని అందరం కోరుకుందాం. ఆయన సేవలకు అభినందనలు తెలుపుదాం. ––కిలారు ముద్దుకృష్ణ, సీనియర్ జర్నలిస్ట్.























సిలికానాంధ్ర సంజీవని వైద్యశాలకు రూ.కోటి విరాళం

కృష్ణా జిల్లా కూచిపూడిలోని సిలికానాంధ్ర సంజీవని ఆసుపత్రి నిర్మాణానికి కావూరి చలపతిరావు(చినముత్తేవి) కుటుంబీకులు శనివారం రూ.కోటి విరాళాన్ని అందించారు. ఆయన జ్ఞాపకార్థం కుమారుడు కావూరి సుబ్బరామయ్య, విజయ దంపతులు, మరో కుమారుడు సూర్యప్రకాశరావు, తల్లి హైమావతి చేతుల మీదుగా సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షులు కూచిభొట్ల ఆనంద్‌కు చెక్కును అందించారు.స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్‌ అధ్యక్షుడు సీఎల్‌ వెంకట్రావు, డా. వడ్లమాని రవి తదితరులు పాల్గొన్నారు.





బూర్గంపాడు పాఠశాలకు తాళ్లూరి విరాళం

బూర్గంపాడు మండలంలోని అన్ని పాఠశాలలను డిజిటలీకరించడానికి తానా కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు జయశేఖర్ తాళ్లూరి తోడ్పాటు అందించారు. తాళ్లూరి పంచాక్షరయ్య చారిటబుల్ ట్రస్ట్, ఎన్నారై ఫౌండేషన్ మరియు తానా ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పంచాక్షరయ్య, జయశేఖర్ తదితరులు ప్రసంగించారు. మండలవ్యాపితంగా అన్ని పాఠశాలల ఉపాధ్యాయులు హాజరయ్యారు. ఎన్నారై ఫౌండేషన్ సభ్యులు శివ, వంశీ వల్లూరివల్లి, అత్తులూరి ఉమామహేశ్వర్, మిట్టపల్లి పాండురంగారావు, రమేష్ లగడపాటి, రమేష్ రాథోడ్, బోనాల రామకృష్ణ, కొంగర పురుషోత్తం, బండి నాగేశ్వర్ రావు, బండి సుధీర్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తానా ఫౌండేషన్ అధ్యక్షుడు నిరంజన్,బత్తినేని రాకేష్, మండల విద్యాశాఖాధికారి, జడ్పీటీసీ, ఎంపీటీసీ, తదితరులు పాల్గొనున్నారు.

ఘనంగా సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ మొదటి వార్షికోత్సవం


*ముఖ్య అతిథిగా హాజరయిన లోకేష్
బుధవారం నాడు కాలిఫోర్నియా రాష్ట్రంలోని మిల్పిటాస్ నగరంలో సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ మొదటి వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏపీ ఐటీ, పంచాయతీరాజ్ శాఖామాత్యులు నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నృత్యం-సంగీతం-నాట్యకళలపై డా.పప్పు వేణుగోపాలరావు రచించిన పరిశోధనా విధానాలను లోకేష్ ఆవిష్కరించారు. విశ్వవిద్యాలయ నూతన వెబ్‌సైట్‌ను ఆయన ప్రారంభించారు. గరిమెళ్ల అనిలకుమార్, అనురాధ శ్రీధర్‌ల సంగీత విభావరి అలరించింది. కార్యక్రమంలో ప్రముఖ ప్రవాసాంధ్రుడు డా.లకిరెడ్డి హనిమిరెడ్డి, విశ్వవిద్యాలయ ప్రతినిధులు కూచిభొట్ల ఆనంద్, దీనబాబు కొండుభట్ల, దిలీప్ కొండిపర్తి, చామర్తి రాజు తదితరులు పాల్గొన్నారు.




తన జీవితం మొత్తం సంపాదన సిలికానాంధ్రకు దానం చేసిన ఉపాధ్యాయుడు

“Gorumuchhu Venkateswara Rao(75) donated Rs.6 Lakhs to SiliconAndhra Sanjivani Hospital to sponsor a patient room. He retired after working as a school teacher for 30 years in the year 2000. His last posting was in Pedasanagallu where his salary was Rs.10,000. He comes from a very simple lower middle class background. This donation amount is almost his life savings. He himself came forward to support (none of us approached him). He simply says that he wants to see many people get good health care through Sanjivani. He stands as a role model to the Season of Giving and the fraternity of SiliconAndhra Sanjivani thanks Mr.Gorumuchhu and family” said Anand Kuchibhotla, Convenor of Jayaho Kuchipudi program.

ప్రవాసాంధ్రుల సేవలకు చంద్రబాబు ప్రశంసలు. డా.నవనీతకృష్ణకు అభినందన.


నూతన రాష్ట్రం నిర్మాణంలో ప్రవాసాంధ్రులు అందిస్తున్న సేవలు, సహకారం మరువలేనిదని ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. ప్రముఖ ప్రవాసాంధ్రుడు, తానా మాజీ అధ్యక్షుడు డా.గొర్రెపాటి నవనీతకృష్ణ సారథ్యంలో విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం వద్ద నిర్మిస్తున్న అమరావతి అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(AAIMS) భవన నిర్మాణానికి చంద్రబాబు విజయవాడ ఏ1 కన్వెన్షన్ సెంటరు నుండి శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కోట్లాది రూపాయిల ఖర్చుతో పేదప్రజల కోసం AAIMS నిర్మాణాన్ని చేపడుతున్నందుకు డా.గొర్రెపాటి నవనీతకృష్ణను ఆయన బృందాన్ని చంద్రబాబు ప్రత్యేకంగా ప్రశంసించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే ప్రవాసాంధ్రులకు అన్ని సౌకర్యాలను సమకూరుస్తామని ప్రపంచంలోనే నెం.1 రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దుతున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. భవిష్యత్తులో మెరుగైన వైద్య సౌకర్యాల కోసం ప్రపంచ దేశాల నుండి ఏపీకి వచ్చే విధంగా ఆధునిక వైద్య సౌకర్యాలు ఇక్కడ ఏర్పాటు అవుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కామినేని శ్రీనివాస్, దేవినేని ఉమామహేశ్వరరావు, భూమా అఖిలప్రియ తదితరులతో పాటు డా.గొర్రెపాటి రంగనాథబాబు, చలసాని మల్లిఖార్జునరావు, మొక్కపాటి చంద్రశేఖర్, ఇబ్రహీంపట్నం మాజీ సర్పంచ్ మల్లెల అనంత పద్మనాభరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన చిత్రాలు, వీడియోలు ఇక్కడ తిలకించవచ్చు.
aaims amaravati ibrahimpatnam chandrababu dr navaneetha gorrepati amaravati hospital tnilive dallas doctors dallas indian doctors amaravati american hospital pics



అర్హులెవరికైనా మరో మిలియన్ డాలర్లు ఇస్తాను-లక్కిరెడ్డి

* సిలికానాంధ్ర అఖిల అమెరికా కూచిపూడి సమ్మేళనంలో ప్రవాస తెలుగు వైద్యులు డా.లకిరెడ్డి హనిమిరెడ్డి

తెలుగు సంస్కృతి, కళల ఔన్నత్యాన్ని నిలుపుతూ వాటి పరిరక్షణ, అభివృద్ధికి నిరంతరం తపిస్తూ శ్రమించే అర్హులెవరైనా సరే తనను సంప్రదిస్తే మరో మిలియన్ డాలర్లు విరాళంగా అందించేందుకు తాను తహతహలాడుతున్నానని ప్రవాసాంధ్ర వైద్యులు, ప్రముఖ దాత, కృష్ణా జిల్లా మైలవరానికి చెందిన డా.లకిరెడ్డి హనిమిరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం నాడు మిల్పిటాస్‌లోని సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ ప్రాంగణంలో అఖిల అమెరికా కూచిపూడి సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. భగవంతుడు తనకు లక్ష్మీదేవిని విరివిగా అనుగ్రహించాడని, సిలికానంధ్ర వంటి సంస్థను ఏర్పాటు చేసి తెలుగు భాషకు సేవ చేసుకునే శక్తిని, అర్హతను తనకు ఇవ్వలేదని అందుకే తెలుగువారి ఉనికిని ప్రపంచానికి సగర్వంగా చాటిచెప్పే అర్హులెవరికైనా తాను మరో మిలియన్ డాలర్లు విరాళంగా అందిస్తానని పేర్కొన్నారు. డా.లకిరెడ్డి కాలిఫోర్నియా రాష్ట్రంలోని మిల్పిటాస్ నగరంలో ఏర్పాటు చేసిన సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ భవనానికి ఇప్పటికే మిలియన్ డాలర్లు(రూ.6.6కోట్లు) విరాళంగా అందించారు. ఈ భవంతిని ఆయన గౌరవార్థం డా.లకిరెడ్డి హనిమిరెడ్డి భవనంగా సిలికానాంధ్ర ప్రతినిధులు నామకరణం చేశారు. ఓ పేద ముసలాయానకు తాను తన మనవడి విద్యాఖర్చులు భరిస్తానని మాటిచ్చానని, ఆ కుర్రాడు విద్యలో రాణించి కార్నిగీ మెల్లన్ విశ్వవిద్యాలయంలో 1500మందితో పోటీ పడి అర్హత సాధించాడని కానీ విదేశీ విద్యార్థులకు విశ్వవిద్యాలయ నిబంధన ప్రకారం ఉపకారవేతనం మంజూరు చేయడం కుదరని కారణాల రీత్య అతని అమెరికా విద్యకు అవసరమైన $1,45,000లను తానే అందించానని లకిరెడ్డి పేర్కొన్నారు. మట్టిలో మాణిక్యాలను ఏరి వారిని మహోన్నతులుగా తీర్చిదిద్దుతున్న సిలికానాంధ్ర వంటి సంస్థకు చేయూతనివ్వడం తన అదృష్టంగా ఆయన అభివర్ణించారు. సిలికానాంధ్ర వ్యవస్థాపకులు కూచిభొట్ల ఆనంద్ మాట్లాడుతూ కొండా నవ్య మైత్రి, కూచిభొట్ల అనూషా వంటి వారిని పరిచయం చేస్తూ స్టాన్‌ఫోర్డ్ వంటి ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల్లో విద్యనభ్యసిస్తున్నారని భావితరానికి చెందిన వీరు అమెరికా ప్రతినిధులుగానే గాక తెలుగువారి ప్రతిబింబాలుగా కూడా రాణిస్తారని పేర్కొన్నారు. అనంతరం సిలికానాంధ్ర సీఈఓ రాజు చామర్తి, సీఎఫ్ఓ దీనబాబు కొండుభట్ల, ప్రముఖ కూచిపూడి నాట్యాచారిణి బాలా కొండలరావు, ప్రముఖ సంస్కృతాంధ్ర పండితులు డా.పప్పు వేణుగోపాలరావు తదితరులు పాల్గొన్నారు.
lakireddi hanimireddy siliconandhra lakireddy tnilive 2017 kuchipudi milpitas telugu

రుద్రపాక జడ్పీ పాఠశాలలో డిజిటల్ తరగతులు ప్రారంభం


ఏపీ జన్మభూమి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో ఏర్పాటు చేస్తొన్న డిజిటల్ తరగతుల్లో భాగంగా శుక్రవారం నాడు కృష్ణా జిల్లా రుద్రపాకలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో డిజిటల్ తరగతిని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిజిటల్ తరగతి ఏర్పాటుకు నిధులందించిన దాతలు నిమ్మగడ్డ సురేంద్ర, నిమ్మగడ్డ శ్రీనివాస్, మాగంటి రామచంద్రరావు తదితరులను పాఠశాల బృందం ఘనంగా సన్మానించింది. ఈ కార్యక్రమంలో డిప్యుటీ డీఈఓ ఎం.కమలాకుమారి, ఎండీఓ కె.సువర్ణరాజు, ఎం.ఈ.ఓ సుభాష్ చంద్ర బోస్, ప్రధానోపధ్యాయురాలు ఎం.వాణి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రవాసుల చొరవతో మరిన్ని పాఠశాలల్లో డిజిటల్ తరగతులను ప్రారంభించేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని ఉత్తర అమెరికాలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరాం తెలిపారు. మరిన్ని వివరాలకు www.apjanmabhoomi.org వెబ్‌సైట్‌ను చూడవల్సిందిగా కోరారు.
tniliveapjanmabhoomikomatijayaram
tnilive rudrapaka digital classroom
ap janmabhoomi classrooms
tnilive digital classrooms nris for andhra pradesh pappu lokesh

సేవా రంగంలో తానా సముద్రం వంటిది-డల్లాస్‌లో జంపాల


ఆవిర్భావం నాడు తెలుగు సంస్కృతి, సాంప్రదాయలకు ఆలవాలంగా భాసిల్లిన ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) నేడు సేవా కార్యక్రమాలకు చిరునామాగా మారి సముద్రం అంత విశాలంగా విస్తరించిందని అధ్యక్షుడు డా.జంపాల చౌదరి పేర్కొన్నారు. సెయింట్ లూయిస్ నగరంలో మే28వ తేదీ నుండి జరగనున్న 21వ తానా మహాసభల నిర్వహణ నిధుల సేకరణ కార్యక్రమాన్ని శనివారం నాడు ఇర్వింగ్‌లోని అమరావతి సమావేశ మందిరంలో నిర్వహించారు. సుగన్ చాగర్లమూడి పరిచయ వాక్యాల అనంతరం కొండ్రుకుంట చలపతి సమన్వయంలో సాగిన ఈ కార్యక్రమంలో ప్రసంగించిన జంపాల తానా ఆవిర్భావ ఆశయాల పరిరక్షణ నేడు ద్వితీయ స్థానానికి జరగ్గా మొదటి స్థానాన్ని సేవా కార్యక్రమాలు ఆక్రమించాయని తెలిపారు. టీం స్క్వేర్ ఆధ్వర్యంలో గడిచిన రెండు రోజుల వ్యవధిలోనే నాలుగు దుర్ఘటనల బాధితులకు సాయపడినట్లు వెల్లడించారు. డెట్రాయిట్ మహాసభలకు నిధులు అధికంగా అందినందున వారు అధికంగా ఖర్చు చేశారని అయితే వాటి పారదర్శకతలో ఎక్కడా లోపాలు లేవని పేర్కొన్నారు. డెట్రాయిట్ సభల పద్దులను 15మంది సభ్యులతో కూడిన తానా డైరక్టర్ల బోర్డుకు సమర్పించగా అవి 12మంది సభ్యుల ఓటుతో ఆమోదముద్ర పొందాయని ఇప్పుడు వీటిపై రాద్ధాంతం చేయడం వెనుక అర్థం లేదని తెలిపారు. అక్టోబర్, నవంబర్ నెలల్లో మొత్తం 7100 నూతన సభ్యులు జేరగా వారిలో 5940 మంది తమ ధృవీకరణ పత్రాలు సమర్పించి తమ సభ్యత్వాలను నిర్థారించుకున్నారని మిగిలిన 1200 మంది తమ దరఖాస్తులు సమర్పిస్తే వాటిని కూడా ఆమోదిస్తామని పేర్కొన్నారు. సభ్యుల నిర్థారణ కమిటీలో అయిదుగురు సభ్యుల ఆమోదం ఉంటేనే సభ్యత్వాన్ని ఆమోదించడం జరుగుతుందని వెల్లడించారు. డెట్రాయిట్ మహాసభల నుండి పాఠాలు నేర్చుకుని సెయింట్ లూయిస్ మహాసభల ఖర్చును తానా కార్యవర్గానికి ముందస్తుగా సమర్పించి వారి అంగీకారం ఆమోదం అందిన మొత్తాన్నే ఖర్చు చేయాలని నిర్ణయించినట్లు జంపాల తెలిపారు. 21వ మహాసభలకు తానా కార్యవర్గం ఇప్పటి వరకు 1.7మిలియన్ డాలర్లను ఆమోదించిందని, ఒకవేళ నిధులు ఎక్కువగా అందిన పక్షంలో ప్రతి రెండు వారాలకు ఒకసారి కార్యవర్గ ఆమోదాన్ని తిరిగి అభ్యర్థిస్తామని ఆయన తెలిపారు. సెయింట్ లూయిస్ సభల సమన్వయకర్త చదలవాడ కూర్మనాథరావు ప్రసంగిస్తూ 501C స్థాయి కలిగిన సేవా రంగ సంస్థలకు అమెరికా ఆదాయపన్ను శాఖ నిర్దేశించిన సూత్రాలకు అనుగుణంగా సెయింట్ లూయిస్ సభల నిర్వహణా ఖర్చులు ఉంటాయని ఈ ఎడాది తొలిసారిగా సాంకేతిక లాకర్ సదుపాయంతో ప్రతి పైసా రాబడి-ఖర్చులను పారదర్శకంగా పాటిస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం డల్లాస్, హ్యూస్టన్ ప్రవాసులు 21వ తానా మహసభాలకు 203,000 డాలర్లు విరాళంగా అందించారు. దాతలకు జంపాల, చదలవాడలు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో పోలవరపు శ్రీకాంత్, డా.రాఘవేంద్ర ప్రసాద్, డా.తోటకూర ప్రసాద్, డా.అడుసుమిల్లి రాజేష్, తాళ్లూరి పూర్ణచంద్రరావు, దేవినేని పరమేష్, కన్నెగంటి మంజులత, జంపాల అరుణ, డా.నల్లూరి ప్రసాద్, కొడాలి నాగశ్రీనివాస్, కొర్సపాటి శ్రీధర్ రెడ్డి, కేసీ చేకూరి, బొర్రా విజయ్, కన్నెగంటి చంద్ర, కొణిదెల లోకేష్ నాయుడు, కోడూరి కృష్ణారెడ్డి, యు.నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.





మనుషులంటే వీరు

అమెరికాలోని జార్జియాకు చెందిన తండ్రి,కొడుకు కలిసి మూడు దశాబ్దాల పాటు శ్రమించారు. తాము సంపాదించిన డబ్బుతో ఏదో తమకు కావలసిన విలాసవంతమైన భవనమో, కారో లేక కావలసిన వసతిని సమకూర్చుకోలేదు. 32 ఏళ్లపాటు శ్రమించి కూడబెట్టిన డబ్బును నాలుగు లక్షల అమెరికన్ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు 2.6 కోట్ల రూపాయలు) ఒక్క సెకన్లో దానం చేసి తమది విశాల హృదయం అని నిరూపించుకున్నారు అమెరికా తండ్రీకొడుకులు. జానీ జెన్నింగ్స్(86), బ్రెంట్ జెన్నింగ్స్(49) జార్జియాకు చెందిన వారు. సరిగ్గా 32 ఏళ్ల కిందట(1985లో) ఓ రోజు వీరిద్దరూ అనాథపిల్లల వసతి గృహానికి వెళ్లారు. ఆ సమయంలో ముగ్గురు చిన్నారులు వీరి వద్దకు వచ్చి మాకు తండ్రిగా ఎవరైనా ఉంటారా, మా బాగోగులు చూస్తారని అని జానీ, బ్రెంట్‌ను అడిగారు. దీంతో తండ్రీకొడుకుల హృదయం కరిగిపోయింది. వీరికోసం ఏదైనా చేయాలని భావించారు. ఇక అది మొదలుకుని తాము చేసే వృత్తి రీసైక్లింగ్‌ ద్వారా రోజు డబ్బు పోగుచేసేవారు. తమ ఖర్చులకు పోనూ మిగిలని నగదును అనాథల కోసం దానం చేయడానికి ఇద్దరూ చెమటోడ్చారు. ఈ క్రమంలో 9 మిలియన్ పౌండ్ల పేపర్‌ను వీరు రీసైకిల్ చేసి తమ ఖర్చులు పోనూ రూ.2.6 కోట్లు కూడబెట్టారు. ఈ సంపదనంతా స్థానిక చారిటీ జార్జియా బాప్తిస్ట్ చిల్డ్రన్స్ హోమ్ కు చెక్ రూపంలో విరాళం ఇచ్చేశారు. కేవలం ఒక్క సెకన్ల వ్యవధిలో అందజేసిన చెక్ ఎంతో మంది చిన్నారులలో సంతోషాన్ని నింపుతుందని, భవిష్యత్తులోనూ ఇలాగే చేయూత అందిస్తామని జానీ, బ్రెంట్ తెలిపారు.

అపర కర్ణుడు రాకాఫెల్లర్ మరణం

భూరి విరాళాలు ప్రకటించే వితరణ శీలి, అమెరికా వ్యాపార దిగ్గజం డేవిడ్ రాక్ ఫెల్లర్ సోమవారం కన్ను మూశారు. న్యూయార్క్ లో పోకాంటికో హిల్స్ లోని తమ నివాసంలో నిద్ర లోనే గుండె వైఫల్యంతో తుది శ్వాస విడిచారు. ఆయనకు 101 సం.లు. పర్యావరణ పరిరక్షణ నుంచి కళల వరకు అనేక అంశాల్లో రాక్ ఫెల్లర్ కుటుంబం పెద్ద ఎత్తున విరాకాలు అందిస్తోంది. డేవిడ్ తన జీవిత కాలంలో సుమారు రూ.13 వేల కోట్ల విరాలాకు ఇచ్చారు. ఆయన చేజ్ మాన్ హటన్ కార్పోరేషన్ మాజీ అధిపతి. స్టాండర్డ్ ఆయిల్ సంస్థ సహ వ్యవస్థాపకుడు జాన్ డి రాక్ ఫెల్లర్ కు ఆయన మనవడు. అమెరికా లోని సంపన్న కుటుంబాల్లో రాక్ ఫెల్లర్ కుటుంబం ఒకటి. తన తరం వారిలో డేవిడే ఆఖరి వారు. ఆయన భార్య పెగి 1996లో చనిపోయారు. డేవిడ్ దంపతులకు ఆరుగురు సంతానం.

తండ్రికి తగ్గ తనయుడు–స్నేహసాయాల పోషకుడు-యార్లగడ్డ శివరాముడు–TNI ప్రత్యేకం


ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) పుట్టింది న్యూయార్క్‌లో అయినప్పటికీ దానిని పటిష్ఠవంతంగా ముందుకు తీసుకెళ్లడంలో డెట్రాయిట్ ప్రవాస తెలుగువారు బాపిన తెగువ, చూపిన చొరవ తానా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. డెట్రాయిట్ ప్రాంతం నుండి తానా అధ్యక్షులుగా పలువురు ప్రముఖులు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి తానా ఖ్యాతిని ప్రపంచం నలుమూలలకు విస్తరింపజేశారు. అదే విధంగా తానా ఫౌండేషన్‌లోనూ, బోర్డులోనూ పలువురు డెట్రాయిట్ ప్రముఖులు పదవులు అలంకరించి తమ బాధ్యతలను విజయవంతంగా నిర్వహించారు. అటువంటి ప్రాంతం నుండి తానాలోని ప్రతిష్ఠాత్మకమైన తానా ఫౌండేషన్ ట్రస్టీగా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం చాలా కష్టతరమైన పని. ప్రస్తుతం జరుగుతున్న తానా ఎన్నికల్లో 2017-2021 సంవత్సరాలకుగానూ ఫౌండేషన్ ట్రస్టీగా చిన్న వయస్సులోనే ఏకగ్రీవంగా ఎన్నికైన యార్లగడ్డ శివరామ్ అభినందనీయుడు. యువకుడైన శివరామ్ ఈ పదవికి ఎన్నిక కావటం పట్ల ఆయనకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

* తండ్రి బాటలోనే
శివరామ్ తండ్రి ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గురించి అమెరికాలో తెలియని ప్రవాస తెలుగువారు లేరు. లక్ష్మీప్రసాద్‌కు తానా పుట్టినప్పటి నుండి ఆ సంస్థతో విడదీయరాని అనుబంధం ఉంది. నందమూరి తారకరామారావు న్యూయార్క్‌లో జరిగిన తానా సమావేశానికి హాజరయినప్పుడు ఆయనకు సహాయకుడిగా లక్ష్మీప్రసాద్ ఆ పర్యటనలో ఉన్నారు. అంతటి దీర్ఘ కాలంగా ఆయనకు తానాతో సంబంధాలు ఉన్నాయి. రెండేళ్లకొకసారి జరిగే తానా మహాసభలకు ఆయన ప్రత్యేక అతిథిగా క్రమం తప్పకుండా హాజరవుతూ ఉంటారు. ఆయన ప్రసంగం ప్రవాసాంధ్రులకు స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. తండ్రి బాటలోనే ఆయన తనయుడు శివరామ్ కూడా తానా చరిత్రతో మమేకమవుతూ వర్తమానంలో దాని ఖ్యాతిని ఇనుమడింపజేస్తూ సమాంతరంగా పయనిస్తున్నారు.



* బాల్యం-విద్యాభ్యాసం
లక్ష్మీప్రసాద్, సౌజన్య దంపతుల కుమారుడైన శివరామ్ ప్రసాద్ బాల్యం విజయవాడలో గడిచింది. ప్రాథమిక విద్య వికాస్ విద్యావనంలో, ఉన్నత విద్య సిద్ధార్థ ఆదర్శ్ పబ్లిక్ స్కూల్లో చదివారు. కోనేరు లక్ష్మయ్య కళాశాల ఐటీ విభాగ తొలిబ్యాచ్‌లో శివరాం విద్యార్థి. సెయింట్ లూయిస్ విశ్వవిద్యాలయంలో ఏంబీఏ పూర్తి చేశారు.
* చురుగ్గా సేవా కార్యక్రమాలు
* 2001లో అమెరికాలో ప్రవేశించిన శివరామ్ అడెకో సంస్థలో ఐటీ విభాగ ప్రాంతీయ సంచాలకులుగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం హోటల్ వ్యాపారంలో స్థిరపడ్డారు.
* మాయి(Mai) ఫౌండేషన్ ద్వారా ఆయన చురుగ్గా సేవా కార్యక్రమాల్లో పాల్గోంటున్నారు. వృద్ధులు, నిరాదరణకు గురైనవారు, మత్తుకు బానిసైన వారిని ఆదుఖొవడం, పునరావాసం కల్పించటం ఈ ఫౌండేషన్ ప్రధాన ఉద్దేశాలు. ఈ సంస్థ ద్వారా 7దక్షిణాసియా దేశాలకు సేవా కార్యక్రమాలు అందుతున్నాయి.
* తానాతో అనుబంధం
* 2005 నుండి తానాతో శివరాంకు అనుబంధం ఏర్పడింది. ఆ ఏడాది అక్కడ జరిగిన తానా మహాసభలకు భద్రత విభాగం సమన్వయకర్తగా పనిచేశారు.
* 2013-15 సం.లలో తానా తెలుగు అభివృద్ధి కమిటీకి అధ్యక్షుడిగా వ్యవహరించారు.
* 2015లో డెట్రాఇట్‌లో జరిగిన తానా మహా భలకు వేదిక కమిటీ అధ్యక్షుడిగా సేవలందించారు.
* గత తానా ఎన్నికల్లో డెట్రాయిట్ నుండి ప్రాంతీయ ప్రతినిధిగా ఎన్నికయ్యారు.
* తానాతో పాటు డెట్రాయిట్ తెలుగు సంఘం తదితర సంస్థల్లో సభ్యుడిగా పలు సామాజిక సేవా కార్యక్రమాలను చేపట్టారు.
* తానా తరుపున అటు అమెరికాలోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోనూ ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు.
* నేపాల్ భూకంప బాధితులకు పెద్ద ఎత్తున అమెరికాలో విరాళాలు, ఇతర వస్తు సామాగ్రి సేకరించి స్వయంగా నేపాల్ వెళ్లి బాధితులకు అందజేశారు.
* చెన్నై వరద బాధితుల కోసం తన మిత్రుల సహాయంతో పెద్ద ఎత్తున వస్త్రాలను, వస్తు సామాగ్రిని అందజేశారు.
* తానా బ్యాక్‌ప్యాక్ పథకం కింద డెట్రాయిట్ పరిసర ప్రాంతాల్లో ఉన్న పేద విద్యార్దులకు విరివిగా బ్యాగులు పంపిణీ చేశారు.

* కుండ బద్దలు కొట్టినట్లుగా
శివరామ్ ప్రసాద్ మాంచి మాటకారి. ఎవరు ఏమి అనుకున్నా తాను నమ్మినదానిని, తనకు ఇష్టమైన విషయాన్ని కుండ బద్ధలు కొట్టినట్లు చెప్పడంలో వెనుకాడరు. కొన్ని సందర్భాల్లో తన మిత్రులు, సన్నిహితులు వ్యతిరేకించినా, వెక్కిరించినా, వెనక్కులాగినా రాజకీయంగా తాను నమ్మిన నాయకులకు బహిరంగంగా మద్దతు ప్రకటించడంలో శివరామ్ ఎప్పుడు వెనుకాడలేదు.




ప్రస్తుతం తానాలో కీలకమైన ఫౌండేషన్ విభాగానికి ట్రస్టీగా ఏకగ్రీవ ఎన్నిక కావడం ద్వారా తనపై బాధ్యతలు మరింతగా పెరిగాయని గతంలో కన్నా చురుగ్గా సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటానని శివరామ్ TNIకు తెలిపారు. తానా ఖ్యాతిని ఇనుమడింపజేయడానికి, తెలుగు భాషను పరిరక్షించడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. తన స్నేహితులే బలం, బలగం, బలహీనతగా ప్రచారం చేసుకునే శివరాం తాను ఏకగ్రీవంగా ఎన్నిక కావడానికి సహకరించిన తానా నేతలకు, స్థానిక సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.—కిలారు ముద్దుకృష్ణ.

అభినవ కర్ణుడు డా.లకిరెడ్డి హనిమిరెడ్డి జన్మదిన వేడుకలు


ఇప్పటి వరకు పలు సామాజిక సేవా కార్యక్రమాలకు రూ50 కోట్లు విరాళాలుగా అందజేసిన అమెరికాకు చెందిన ప్రముఖ కార్డియాలజిస్ట్, ‘అభినవ కర్ణుడు’గా పిలువబడే డా. లక్కిరెడ్డి హనిమిరెడ్డి జనవరి 12వ తేదీ నాటికి 75 సంవత్సరాలు పూర్తిచేసుకొని 76వ సంవత్సరంలోనికి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా TNILIVE.COM-కిలారు ఫౌండేషన్ ఆద్వర్యంలో కృష్ణాజిల్లా, తిరువూరులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డా.లక్కిరెడ్డి హనిమిరెడ్డి జన్మదిన వేడుకలు జరిగాయి. కేక్ కట్ చేసి ఆయన అభిమానుల నుండి అభినందనలు అందుకున్నారు. ఈ సందర్భంగా డా. లక్కిరెడ్డి హనిమిరెడ్డి మాట్లాడుతూ ఆకలితో అలమటించే పేద ప్రజల కడుపు నింపటమే నిజమైన సమాజ సేవ అని తెలిపారు. తాము సంపాదించిన సొమ్ముతో ఒక్కొక్కరు ఒక్కోవిధంగా ఆనంద పడుతూ ఉంటారని తనకు మాత్రం వివిధ సేవా కార్యక్రమాలకు బారీగా విరాళాలు ఇవ్వడం ద్వారా సంతృప్తి చెందుతానని పేర్కొన్నారు. 75 ఏళ్ల వయస్సులో ప్రతిరోజూ ఉదయం 6 కిలోమీటర్లు పరుగెత్తుతానని అదే తన ఆరోగ్య రహస్యమని తెలిపారు. తాను ప్రతినిత్యం TNILIVE అంతర్జాల పత్రికను చదువుతానని, దానిలో వార్తలు హుందాగా ఉంటాయని వెల్లడించారు. TNILIVE.COM డైరెక్టర్ కిలారు ముద్దుకృష్ణ, తానా మాజీ అధ్యక్షుడు తోటకూర ప్రసాద్, తానా కార్యదర్శి తాతా మధు, ప్రముఖ రంగస్థల నటుడు గుమ్మడి గోపాలకృష్ణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.



ఈ ప్రవాసుడు విద్యాదాన ప్రేమికుడు

విద్యతోనే చిన్నారులు అభివృద్ధి చెందుతారని, తద్వారా దేశం అభివృద్ధి చెందుతుందని అంటారు విదేశాల్లో ఇంజినీర్‌గా పని చేస్తున్న మునగాల సురేంద్రారెడ్డి. ఉద్యోగరీత్యా విదేశాల్లో ఉంటున్నా తన సొంత గ్రామమైన గోస్పాడు మండలంలోని యాళ్లూరుతోపాటు ఇతర గ్రామాల్లో విద్యా వ్యాప్తికి పలు సేవా కార్యక్రమాలను చేపడుతున్నారు. ఇందుకు ఆయన ఖబ్రిడ్జి టు ద స్టార్స్‌’ అనే ఛారిటబుల్‌ ట్రస్టును ప్రారంభించారు.
**ప్రకాశం జిల్లా గోస్పాడు మండలం మాజీ సర్పంచి మునగాల తిమ్మారెడ్డి, మాజీ సర్పంచి సావిత్రమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు. మునగాల తిమ్మారెడ్డి ఎంఏ వరకు చదివి 20 ఏళ్లు యాళ్లూరు సర్పంచిగా ఏకగ్రీవంగా ఎంపికై సేవలందించారు. పెద్ద కుమారుడు మునగాల సురేంద్రారెడ్డి (46). ఈయన ఐఐటీ (చెన్నై)లో ఇంజినీరింగ్‌ పూర్తి చేశారు. కోలకతాలోని ఐఐఎంలో ఎంబీఏ చదివారు. అనంతరం ఉద్యోగరీత్యా 2001లో అమెరికాలోని కాలిఫోర్నియా వెళ్లారు. అక్కడ ఇంజినీర్‌గా పని చేస్తున్నారు. తండ్రి సేవా స్ఫూర్తిని పొందిన సురేంద్రారెడ్డి కుటుంబ సభ్యులతో ఛారిటబుల్‌ ట్రస్టును ఏర్పాటు చేశారు. దీని ఆధ్వర్యంలో సొంతగడ్డకు సేవ చేయాలనే ఆలోచనతో స్వగ్రామం యాళ్లూరు, మేనత్త గ్రామమైన బనగానపల్లె మండలం వెంకటాపురం, చుట్టపక్కల గ్రామాల్లో సేవలందిస్తున్నారు. యాళ్లూరులో గ్రామ పెద్ద శివారెడ్డి, ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసులు, వెంకటాపురంలో సతీష్‌కుమార్‌ సహాయంతో కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. సురేంద్రారెడ్డి ఖఅరుణ్‌ అండ్‌ దివ్యఎ కలెక్షన్‌ ఆఫ్‌ షార్ట్‌ స్టోరీస్‌’ అనే ఆంగ్ల పుస్తకాన్ని కూడా రచించారు.
**చేసిన సేవా కార్యక్రమాలు
*2012లో యాళ్లూరులో ప్రధాన ప్రాథమిక పాఠశాలకు రూ.1.10 లక్షలతో 54 బెంచీలు ఏర్పాటు చేశారు.
*2013లో యాళ్లూరు ఎస్సీ ప్రత్యేక ప్రాథమిక పాఠశాలకు రూ.1.04 లక్షలతో బెంచీల ఏర్పాటు, భవనం మరమ్మతులు చేయించారు.
*యాళ్లూరు ఎస్సీ కాలనీలో చర్చి నిర్మాణానికి రూ.30 వేల విరాళం ఇచ్చారు.
*బనగానపల్లె మండలం వెంకటాపురం ప్రాథమికోన్నత పాఠశాలకు 24 బెంచీలు అందజేశారు.
*వెంకటాపురంలో రూ.20 వేలతో రీడింగ్‌ రూమ్‌ ఏర్పాటు చేసి పలు దినపత్రికలు, కథల పుస్తకాలు, పౌరాణిక గ్రంథాలు కొనుగోలు చేసి ఇచ్చారు.
*వెంకటాపురంలో రూ.20 వేలతో మహిళలకు కుట్టుమిషన్లు ఇప్పించి వారి ద్వారా పాఠశాల విద్యార్థులకు ఉచితంగా దుస్తులు కుట్టించారు.
*యాళ్లూరులో 2013, 2014లో ఇద్దరు వలంటీర్లను నెలకు రూ.5 వేలు చొప్పున వేతనాలు ఇచ్చి విద్యార్థులకు ట్యూషన్స్‌ చెప్పించారు.
*2015లో ఒక్కో పాఠశాలకు రూ.15 వేల చొప్పున శిరివెళ్ల మండలం వీరారెడ్డి పాలెం ప్రాథమిక పాఠశాలకు, గోస్పాడు మండలం యాళ్లూరు ప్రధాన, ప్రత్యేక ప్రాథమిక పాఠశాలకు గ్రంథాలయ పుస్తకాలు అందజేశారు. యాళ్లూరు ప్రధాన ప్రాథమిక పాఠశాలకు రూ.5 వేల విరాళంతో ఒక బీరువాను సమకూర్చారు.
*యాళ్లూరులో ప్రధాన ప్రాథమిక పాఠశాలకు, ఎస్సీ కాలనీలో చర్చికి రూ.5 వేల విలువ చేసే ఆట వస్తువులు ఇప్పించారు.
*విద్యార్థులకు అర్థమయ్యే కథల పుస్తకాలు ఆంగ్లంలో రచించి, రూ.15 వేలతో 14 వేలు పుస్తకాలు ముద్రించి, పాఠశాలలకు పంపిణీ చేశారు.
*యాళ్లూరు ప్రధాన ప్రాథమిక పాఠశాలలో ప్రొజెక్టర్‌ నిర్మాణానికి రూ.10 వేలు విరాళంగా ఇచ్చారు.
*2015లో యాళ్లూరు అరవిందాశ్రమంలో రూ.1.50 లక్షలతో ఉచిత కంప్యూటర్‌ శిక్షణకు నాలుగు కంప్యూటర్లు ఏర్పాటు చేసి శిక్షకునితో శిక్షణ ఇస్తున్నారు.
*2016 నవంబరులో రూ.10 వేలు విలువైన ఆట వస్తువులు గోస్పాడు ఉన్నత పాఠశాలకు ఇచ్చారు. డిసెంబరులో సిమెంట్‌ ఫ్లోరింగ్‌తో బాస్కెట్‌ బాల్‌ కోర్టును రూ.4.50 లక్షలతో నిర్మాణాన్ని ప్రారంభించారు. గ్రంథాలయానికి 40 ఆంగ్ల పుస్తకాలు ఇచ్చారు.
**నిరంతరం విద్యాభివృద్ధికి కృషి -సురేంద్రారెడ్డి, ఎన్‌ఆర్‌ఐ, యాళ్లూరు
నిరంతరం విద్యాభివృద్ధికి కృషి చేయాలని నిర్ణయించుకున్నాను. ఇప్పటి వరకు చేసిన కార్యక్రమాలే కాకుండా ఇకముందు నా వంతుగా సేవా కార్యక్రమాలు చేపడతాను. జనవరిలో యాళ్లూరు, గోస్పాడు, పాణ్యం, నందవరం ఉన్నత పాఠశాలల్లోని విద్యార్థులకు ఖటాలెంట్‌ టెస్ట్‌’ నిర్వహించి ప్రతిభ కనబరిచిన పాఠశాలకు ప్రోత్సాహకంగా రూ.10 వేలు విరాళంతో అభివృద్ధి పనులు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. యాళ్లూరు ఉన్నత పాఠశాలలో కంప్యూటర్‌ ల్యాబ్‌, కుట్టుమిషన్లు, గ్యాస్‌ కనెక్షన్‌ ఇస్తున్నాం.

గిరిజన గ్రామంలో కళాశాల నిర్మాణానికి తాళ్లూరి సోదరుల కోటి రూపాయిలు విరాళం


ప్రవాస తెలుగు ప్రముఖులు తాళ్లూరి జయశేఖర్(తానా ఫౌండేషన్ ట్రస్టీ), తాళ్లూరి రాజాశ్రీకృష్ణలు ఖమ్మం జిల్లాలోని సారపాక గిరిజన గ్రామంలో ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాలల నిర్మాణానికి ఆర్థిక సాయంగా కోటి రూపాయిల విరాళాన్ని ప్రకటించారు. లయన్స్ క్లబ్ సంస్థ స్థాపించి 100 ఏళ్లు పూర్తి, భద్రాచలం లయన్స్ క్లబ్ 26వ వార్షికొత్సవం సందర్భంగా తాళ్లూరి పంచాక్షరయ్య అధ్యక్షుడిగా సారపాక లయన్స్ క్లబ్ విభాగాన్ని ఇటీవల సారపాక అటవీ ప్రాంతంలోని పుష్కరవనంలో ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తాళ్లూరి సోదరులు ప్రసంగిస్తూ దట్టమైన అటవీ ప్రాంతం, గిరిజన ప్రజలు ఎక్కువగా నివసిస్తున్న సారపాక ప్రాంతంలో ప్రభుత్వం డిగ్రీ, జూనియర్ కళాశాలల ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేస్తే తమ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తాళ్లూరి ట్రస్ట్ ద్వారా కోటి రూపాయిల విరాళాన్ని ఆర్థిక సాయంగా ఆ కళాశాలల నిర్మాణానికి అందిస్తామని ప్రకటించారు.గిరిజనులు ఎక్కువగా నివసించే ఈ ప్రాంతంలో విద్యా, ఉపాధి అవకాశాలను పెంపొందించే దిశగా మరిన్ని కార్యక్రమాలు చేపడతామని ప్రకటించారు. తాళ్లూరి సోదరుల ప్రకటనకు సారపాక గ్రామ సర్పంచ్ చందూనాయక్ స్పందిస్తూ…ఇప్పటికే కళాశాలల ఏర్పాటుకు 5ఎకరాల స్థలాన్ని గుర్తించామని, జిల్లా కలెక్టరు, ప్రభుత్వాధికారులతో సంప్రదించి అనుమతులు త్వరితగతిన మంజూరు అయ్యేలా చూస్తామని తెలిపారు. తాళ్లూరి సోదరుల విరాళానికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం తాళ్లూరి పంచాక్షరయ్య అధ్యక్షతన ఇప్పటి వరకు లయన్స్ క్లబ్ చరిత్రలో లేని విధంగా మొట్టమొదటిసారి సారపాక లయన్స్ క్లబ్ విభాగంలో 140 మంది సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు.

చిత్తూరులో రైతుకోసం తానా కార్యక్రమం


పేదలకు వడ్డీలు లేని రుణాలు ఇస్తున్న ప్రవాస తెలంగాణీయుడు

ఆ వ్యక్తి వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. గ్రామీణ ప్రాంతంలో పెరిగి.. పట్టుదలతో చదివి ఉన్నతాశయం వైపు నడిచారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఉన్నత విద్యను అభ్యసించి అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఉద్యోగాన్ని సంపాదించారు. రూ.లక్షల్లో జీతం. అయినా ఎక్కడో వెలితి. సొంతూరికి ఏదో చేయాలన్న తపన. ఆ ఆలోచనలతో సత్కార్యాలకు శ్రీకారం చుట్టారు. ఏటా చేతనైనంత సాయం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఆవివరాలు తెలుసుకుందాం. దేవనకొండ మండలం తువ్వదొడ్డి గ్రామానికి చెందిన రేమట చిన్న తిమ్మారెడ్డి, లక్ష్మీదేవి దంపతుల చివరి కుమారుడు రేమట మధుకేశవరెడ్డి. ఈయన స్వగ్రామంలో ఐదు వరకు, లద్దగిరిలో పదోతరగతి వరకు చదివారు. బళ్లారిలో ఇంటర్‌, కర్నూలులోని విజయదుర్గ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ కంప్యూటర్‌ పూర్తి చేశారు. హైదరాబాద్‌లోని భరత్‌ పీజీ కళాశాలలో ఎంసీఏ చేశారు. అమెరికాలోని మిన్నసోటలోని ఇంజినీరింగ్‌ మేనేజ్‌మెంట్‌ విభాగంలో ఇంజినీరింగ్‌ పూర్తి చేశారు. మిన్నసోటలో కీమోజీ టెక్నాలజీ సాఫ్ట్‌వేర్‌ రంగంలో ప్రోగ్రామింగ్‌ డైరెక్టరుగా ఉద్యోగం సాధించారు. పదేళ్ల నుంచి ఆరంగంలో రాణిస్తూ జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుతం హోస్టన్‌ రాష్ట్రంలోని టెక్సాస్‌లో నివాసముంటున్నారు. తన సొంత వూరికి దూరమైనా.. మమకారం మాత్రం తగ్గలేదు. తన గ్రామానికి ఏదో ఒకటి చేయాలని తపించారు. గ్రామంలోని దేవాలయాల నిర్మాణాలకు తన వంతు బాధ్యతగా ఆర్థిక చేయూతనందించారు.

సేవా పరంపర
* మొదటి సారి వచ్చిన వేతనంతో తువ్వదొడ్డి గ్రామంలో సుంకులమ్మ దేవాలయాన్ని రూ.4లక్షలతో ఆధునీకీకరించారు.
* ఆ గ్రామం సమీపంలోనే కాశిరెడ్డి నాయన ఆశ్రమ నిర్మాణానికి తన వంతు బాధ్యతగా రూ. 2లక్షలు విరాళంగా ఇచ్చారు. ఏటా ఆరాధన మహోత్సవాలకు హాజరై పలు రకాల పోటీలను నిర్వహించి తన సొంతంగా రూ.80వేల వరకు బహుమతుల కింద నగదు ప్రోత్సాహకాలను అందిస్తున్నారు.
* గ్రామంలో అవసరార్థులకు వడ్డీ లేకుండా రుణం అందిస్తూ ఆర్థికంగా వారు నిలదొక్కుకునేలా చూస్తున్నారు.
* అంతేగాకుండా నునుసురాళ్ల గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న సోమలింగేశ్వరస్వామి దేవాలయ నిర్మాణానికి రూ.2లక్షలు తన వంతు సాయాన్ని అందించడంతో పాటు అమెరికాలో తన స్నేహితుల ద్వారా రూ. 10లక్షలు చందా వసూలు చేసి దేవాలయ నిర్వాహకులకు అందజేశారు.
* గ్రామంలో పెళ్లిల్లు, శుభకార్యాలు ఉన్నట్లు సమాచారం అందిస్తే అటువంటివారికి తనకు తోచినంత ఆర్థికంగా చేయూతనందిస్తూ ఆదుకుంటున్నారు.

గ్రామాన్ని ఆదుకుంటున్నారు- సుదర్శన్‌రెడ్డి, తువ్వదొడ్డి
మా గ్రామానికి చెందిన మధుకేశవరెడ్డి అమెరికాలో ఉద్యోగం చేస్తూ గ్రామంలో పలు విధాలుగా సహాయ సేవా కార్యక్రమాలు చేపడుతుండటం సంతోషంగా ఉంది. గ్రామాన్ని దత్తత తీసుకుని మరింత అభివృద్ధి చేస్తే మరింత ఆనందదాయకంగా ఉంటుంది.ఆయన సేవలను మరచిపోలేం.

సేవలందిస్తుండటం సంతోషం- ఇమాంవలి, తువ్వదొడ్డి
మధుకేశవరెడ్డి మా గ్రామంలో పుట్టి పెరిగి అమెరికాలో స్థిరపడటం సంతోషంగా ఉంది. కన్న వూరి మమకారాన్ని మరవకుండా గ్రామంలో దేవాలయాలను నిర్మించడం, పేదలకు సహాయ, సహకారాలు అందిస్తూ వారికి సంతోషాన్ని కలిగిస్తున్నారు.

తల్లిదండ్రుల ప్రోత్సాహం- మధుకేశవరెడ్డి, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌, అమెరికా
దేవనకొండ మండలం తువ్వదొడ్డి మా స్వగ్రామం. గ్రామంలో ప్రాథమిక స్థాయి వరకు చదివా. ఆపై తరగతులు పలు ప్రాంతాల్లో తల్లిదండ్రుల ప్రోత్సాహంతో అభ్యసించా. ఎక్కడున్నా కన్న వూరిని మరచిపోలేను. మా గ్రామానికి సేవ చేయాలనేది నా తపన. అమెరికాలో ఉన్నా.. గ్రామాన్ని, ప్రజలను మరచిపోలేదు. ఏటా ఏదో విధంగా గ్రామస్థులకు సాయం చేస్తున్నా. కాశిరెడ్డి నాయన ఆరాధనోత్సవాలకు హాజరవుతుంటా. త్వరలో గ్రామంలో ప్రజలకు శుద్ధజలం అందించడానికి చర్యలు తీసుకుంటాం. మరింత అభివృద్ధి చేయడానికి కృషి చేయడమే నా లక్ష్యం.

డిజిటల్ తరగతులకు 10వేల డాలర్లు అందించిన ఒహాయో దంపతులు

ఒహాయో రాష్ట్రంలో నివసిస్తున్న డేగ రాధికా, డేగ వినోద్ దంపతులు శుక్రవారం నాడు కొలంబస్ లో నిర్వహించిన ఒహాయో తెలుగు సంఘం(టాకో) విందు కార్యక్రమంలో ఏపీ విద్యా, మానవ వనరుల శాఖా మంత్రి గంటా శ్రీనివాసరావుకు 10 వేల డాలర్ల చెక్కును అందించారు. ఏపీ జన్మభూమి పథకం ద్వారా డిజిటల్ తరగతుల నిర్వహణకు ఈ నిధులను ఖర్చు చేయవలసిందిగా వారు ఆయన్ను కోరారు. ఈ మొత్తాన్ని అందించిన వీరిరువురికీ మంత్రి గంటా, అమెరికాలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరాం తదితరులు ధన్యవాదాలు తెలిపారు. డేగ దంపతులు ఈ విరాళం అందించేలా చొరవ తీసుకున్న కొల్లా అశోక్ బాబును గంటా ప్రత్యేకంగా అభినందించారు.
img_1193

సిలికానాంధ్ర ప్రతినిధులతో ఏపీ ఎన్ఆర్‌టీ సీఈఓ భేటీ

ఏపీ ఎన్ఆర్‌టీ సంస్థ సీఈఓ డాక్టర్ వేమూరు రవికుమార్ ఆదివారం నాడు మిల్పిటస్ నగరంలోని సిలికానాంధ్ర విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో సిలికానాంద్ర ప్రతినిధులు, స్థానిక ప్రవాసులతో భేతీ అయ్యారు. సిలికానాంధ వ్యవ్స్థాపక అధ్యక్షుడు కూచిభొట్ల ఆనంద్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో రవి మాట్లాడుతూ నూతన రాష్ట్రాభివృద్ధిలో ప్రవాసుల భాగస్వామ్యం చాలా అవసరమని అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రవాసుల కోసం ప్రత్యేకంగా ఎన్ఆర్‌టీ సంస్థను ఏర్పాటు చేశారని తెలిపారు. ఈ సంస్థలో ప్రవాసులు సభ్యులుగా జేరి గ్రామాలను దత్తత తీసుకుని రోడ్లు, ఇంకుడు గుంతలు, మరుగుదొడ్లు వంటి వాటి నిర్మాణం ద్వారా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనవల్సిందిగా కోరారు. రూ.10కోట్ల విలువైన ఆర్.ఐ.డీ.ఎఫ్. మ్యాచింగ్ గ్రాంట్ల ద్వారా 50శాతం నిధులను ఎన్ఆర్‌టీ సమకూరుస్తుందని, బ్యాంకులతో అనుసంధానమై ప్రవాసులు అందించే నిధులకు పూర్తి పారదర్శకత ఉంటుందని రవి వివరించారు. జనవరి నుండి సిలికానాంధ్ర విశ్వవిద్యాలయంలో కూచిపూడి, కర్ణాటక సంగీతంలో నిర్వహించనున్న పీజీ, డిప్లోమా కోర్సుల ప్రచార పత్రికలను రవి విడుదల చేశారు. నూతనంగా విద్యుదీకరణ చేసిన విశ్వవిద్యాలయ నామఫలకాలను దాత లకిరెడ్డి హనిమిరెడ్డి కుమారుడు లకిరెడ్డి సిద్ధార్థ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిలికానాంధ్ర కార్యవర్గ సభ్యులు కొండిపర్తి దిలీప్, చమర్తి రాజు, కొండుభట్ల దీనబాబు, మాలెంపాటి ప్రభ, ఏపీ ఎన్ఆర్‌టీ ప్రతినిధులు పువ్వల ప్రసాద్, కలపటపు బుచ్చిరాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.







మాటూరిపేట ప్రభుత్వ పాఠశాలకు ప్రవాసుల విరాళం

ప్రభుత్వ పాఠశాలల అభివృద్దికి మేమున్నామంటూ ప్రవాసాంధ్రులు ముందుకు వచ్చారు. విద్యార్ధులకు సాంకేతిక తరగతుల నిర్వహణకు అవసరమైన సామాగ్రిని సమకూర్చి చేయూత ఇచ్చారు. ఖమ్మం జిల్లా ఎన్నారై ఫౌండేషన్ ద్వారా చైర్మన్ గుర్రం కృష్ణారావు గ్రామానికి చెందిన ప్రవాసాంధ్రులు సామినేని రవి, నాగేశ్వరరావుల ఆర్ధ్గిక వితరణతో రూ. 50 వెల విలువ చేసే ఎల్.ఈ.డీ టీవీ, ప్రొజెక్టరు తో పాటు దివిజల్ తరగతులకు అవసరమైన ప్రోగ్రామ్స్ తో కూడిన టీచింగ్ సామాగ్రిని మాటూరుపేట ప్రాథమిక పాఠశాలకు అందజేశారు. డిజిటల్ తరగతులను బుధవారం పాఠశాల తరగతి గదిలో మదిరకు చెందిన వైద్యులు, తెదేపా నియోజకవర్గ సమన్వయ కర్త డా.వాసిరెడ్డి రామనాధం చేతుల మీదుగా ప్రారంభించారు.

మూల్పూరి వెంకట్రావుకు పితృవియోగం

వాషింగ్టన్ డీసీకు చెందిన ప్రముఖ విద్యావేత్త, ఆచార్యులు, ప్రవాసాంధ్ర ప్రముఖులు డాక్టర్.మూల్పూరి వెంకట్రావు తండి మూల్పూరు చెన్నారావు(83) గురువారం నాడు పరమపదించారు. ఏపీ ప్రభుత్వం నుండి చెన్నారావు ఉత్తమ ఉపాధ్యాయుడి పురస్కారాన్ని అందుకున్నారు. ఆయన అంత్యక్రియలను ఘంటశాల గ్రామంలో శనివారం నాడు ఘనంగా నిర్వహించారు. ఘంటశాల గ్రామ పరిసర ప్రాంతాల నుండి ప్రజలు పెద్దసంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏపీ శాసనసభ ఉప-సభాపతి మండలి బుద్ధప్రసాద్ వెంకటరావు కుటుంబాన్ని పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.