ముఖ్యమంత్రిని కలిసిన ప్రవాసాంధ్రులు

ప్రవాస భారతీయ దినోత్సవం సందర్భంగా ఏపీ ఎన్నాఆర్టీ ఆద్వర్యంలో బుధవారం నాడు ప్రవాసాంధ్ర పరిరక్షణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రూపొందించిన బ్రోచర్ ను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వివిధ దేశాలకు చెందిన తెలుగు సంఘాల ప్రతినిధులు ఏపీ ఎన్నార్టీ చైర్మన్ వేమూరి రవి, తానా సతీష్ వేమన సతీష్ తదితరులు పాల్గొన్నారు.

కళాసేవలో అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా- కరీంనగర్‌లో 5వ అవార్డుల ప్రదానోత్సవం


అమెరికాలో డా.తోటకూర ప్రసాద్ సారద్యంలో అక్కినేని అభిమానులు 2014లో ఏర్పాటు చేసిన అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా (ఏ.ఎఫ్.ఏ) కళా సేవా రంగంలో విశేషమైన కృషి చేస్తోంది.పలువురు ప్రముఖులకు అవార్డులను ఇచ్చి సత్కరిస్తుంది. ఇప్ప్పటి వరకు ఏ.ఎఫ్.ఏ ఆద్వర్యంలో నాలుగు అవార్డుల ప్రదానోత్సవాలను తెలుగు రాష్ట్రాలలో నిర్వహించారు. ఐదవ అవార్డుల ప్రదానోత్సవాన్ని వచ్చే 22వ తేదేన కరీంనగర్ లో నిర్వహిస్తున్నారు. ఈ సభకు సంబందించిన పూర్తీ వివరాలను ఈ దిగువ చదవండి.
ప్రముఖ విద్యావేత్త, దానశీలి ప్రొ.మూల్పూరి వెంకట్రావు జీవితం అందరికి ఆదర్శం.


విద్యావేత్తగా, దానశీలిగా, నిరుపేదలకు సహాయ సహకారాలు అందించే వ్యక్తిగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కీర్తి ప్రతిష్ఠలు సంతరించుకున్న ఆదర్శ వ్యక్తి డాక్టర్.మూల్పూరి వెంకట్రావు. సామాన్య కుటుంబం నుంచి అగ్రరాజ్యం అమెరికాలో అత్యున్నతమైన ఫ్రొఫెసర్ స్థాయికి ఎదిగిన వెంకట్రావు నిరాడంబర, నిస్వార్థ జీవనం అందరికీ ఆదర్శప్రాయం. తాను సంపాదించిన దాంట్లో గణనీయమైన శాతం డాక్టర్ వెంకట్రావు సేవా కార్యక్రమాలకే వినియోగిస్తూ ఉండటం విశేషం. ఆర్భాటాలకు, ప్రచారనికి దూరంగా ఉండే ప్రొఫెసర్ వెంకట్రావు జీవనశైలి అందరికీ, ముఖ్యంగా నేటి యువతరానికి ఆదర్శప్రాయంగా ఉంటుందనటంలో సందేహం లేదు.

*** తానా కన్వీనర్‌గా కీలక బాధ్యతలు
వాషింగ్టన్ డీసీలో జులై మొదటి వారంలో తానా మహాసభలను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. తానా అధ్యక్షుడు వేమన సతీష్ సారథ్యంలోని యువ కార్యవర్గం ఈ మహాసభలను ఘనంగా నిర్వహించడానికి పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు. ఈ మహాసభలకు ఒక ప్రముఖ వ్యక్తి, అనుభవం ఉన్న కార్యశీలిని కన్వీనర్‌గా ఉండాలని తానా యువ కార్యవర్గం భావించింది. అన్ని విధాలుగా అనుభవం గడించిన, వివాదాలకు దూరంగా ఉండే ప్రొఫెసర్ మూల్పూరి వెంకట్రావును తానా మహాసభల సమన్వయకర్తగా, యువ కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నుకుంది. మూల్పూరి వెంకట్రావు ఆధ్వర్యంలో ఈసారి జరిగే తానా మహాసభలు చరిత్రలో మరచిపోలేని విధంగా ఉంటాయని అందరూ భావిస్తున్నారు.

*** జీవన ప్రస్థానం ఇది
అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో ప్రఖ్యాతి చెందిన జార్జి మేసన్ విశ్వవిద్యాలయంలో గత 32 ఏళ్ళు నుండి ప్రొఫెసరుగా పనిచేస్తున్న డాక్టర్.మూల్పూరి వెంకట్రావు ప్రతి ఏడాది తన సంపాదనలో పెద్ద మొత్తం (రూ.30లక్షల రూపాయలకుపైగా) సేవా కార్యక్రమాలకు విరాళాలుగా అందజేస్తూ మిగిలిన వారికి ఆదర్శంగా నిలుస్తున్నారు. యూనివర్సిటీలో ఇంజినీరింగ్ విభాగంలో బ్యాచిలర్స్, మాస్టర్స్, పీ.హెచ్.డీ విద్యార్ధులకు బోధనతో పాటు డాక్టర్.వెంకట్రావు వర్జీనియా పరిసర ప్రాంతల్లో ఉన్న ప్రవాసాంధ్ర కుటుంబాలకు చెందిన మిడిల్ స్కూలు (6,7,8 తరగతులు), హైస్కూలు (9,10,11,12 తరగతులు) విద్యార్థులకు తన తీరిక సమయంలో పాఠాలు బోధిస్తుంటారు. అమెరికాలో ప్రసిద్ధి చెందిన థామస్ జఫర్సన్ హైస్కూల్లో సీటు రావాలంటే ప్రత్యేకమైన తర్ఫీదు అవసరం. ఈ స్కూలులో ప్రవేశం కోసం పొందే శిక్షణలకు సైతం అత్యధికంగా ఖర్చు చేయవలసి ఉంటుంది. ఇది గమనించిన వెంకట్రావు గత 10 సంవత్సరాల నుండి విద్యార్ధులకు శిక్షణ ఇవ్వటం ప్రారంభించారు. ఆయన తర్ఫీదు ఇచ్చిన వారిలో 300 మంది థామస్ జఫర్సన్ హైస్కూల్లో సీటు సంపాదించారు. వెంకట్రావు స్ధాపించిన క్యూరీ లెర్నింగ్ సంస్ధ అమెరికాలోని ఇతర నగరాలకు కూడా విస్తరిస్తున్నామని ఆయన వెల్లడించారు. ఇప్పటి వరకు పన్నెండు నగరాల్లో క్యూరీ లెర్నింగ్ శాఖలు ఏర్పాటు చేసినట్లు ప్రొఫెసర్ మూల్పురి TNIకు తెలిపారు.

*** బాల్యం-విద్యాభ్యాసం
కృష్ణా జిల్లా ఘంటసాలలో మూల్పూరి చెన్నారావు, లక్ష్మితులసమ్మ దంపతులకు వెంకట్రావు జన్మించారు. తండ్రి చెన్నారావు స్థానిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా ఉండేవారు, వెంకట్రావు 10వ తరగతి వరకు స్థానికంగా, ఇంటర్మీడియట్ విజయవాడ లయోలా కళాశాల (1970-72)లో పూర్తి చేసారు. అనంతరం కాకినాడ జె.ఎన్.టీ.యూలో బీటెక్ (ఈసీఈ) విద్యనభ్యసించారు. తదుపరి ప్రతిష్టాత్మక ముంబై ఐఐటిలో ఎంటెక్ పూర్తి చేశారు. అనంతరం 1979-81 మధ్య కాలంలో విజయవాడ సిద్దార్థ ఇంజినీరింగ్ కళాశాలలో అధ్యాపకులుగా పనిచేశారు. 1981వ సంవత్సరంలో అమెరికా వెళ్ళి ఆరెగాన్/మిషిగన్ విశ్వవిద్యాలయాల్లో ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ విభాగంలో పీ.హెచ్.డీ చేశారు. 2005లో తానా వారు అత్యుత్తమ ఇంజనీర్ అవార్డును ఇచ్చి సత్కరించారు. జార్జి మేసన్ యూనివర్సిటీ నుండి 2002లో ‘ఔట్ స్టాండింగ్ రీసర్చ్’ అవార్డుతో పాటు పలు జాతీయ, ప్రాంతీయ స్ధాయిల్లో 10కు పైగా కమ్యూనిటీ సర్వీసు అవార్డులు, అక్కినేని 89వ జన్మదిన పురస్కారాలు వెంకట్రావును వరించాయి.

*** ఆదాయంలో గణనీయ శాతం విరాళాలకు
ధామస్ జఫర్సన్ పాఠశాలలో ప్రవేశం కోసం ప్రవాసాంధ్ర విద్యార్ధులకు చెప్పే పాఠాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని మొదటి అయిదేళ్ల పాటు పూర్తిగా అందించిన వెంకట్రావు, ఆ తర్వాత పెరిగిన విద్యార్ధులు, అధ్యాపకుల సంఖ్య, ఇతరత్రా నిర్వహణా ఖర్చుల దృష్ట్యా వచ్చిన ఆదాయంలో గణనీయమైన శాతాన్ని విరాళాలుగా అందిస్తున్నారు. వాషింగ్టన్ లో విద్యార్ధులకు ప్రైవేట్ పాఠాలు చెపుతున్న డాక్టర్.వెంకట్రావుకు సంవత్సరానికి రూ.30లక్షలకు పైగా ఆదాయం వస్తోంది. ఈ ఆదాయాన్ని ఆయన సమాజ సేవా కార్యక్రమాలకు వెచ్చిస్తున్నారు. గిరిజన విద్యార్ధులకు ఏకల్ విద్యాలయ సంస్ధ ద్వారా నూతన పాఠశాలలను ప్రారంభించటానికి తోడ్పడ్డారు. హైదరాబాద్ లో అనాధ బాలలకోసం వేమూరి విజయలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంస్థకు ఇప్పటి వరకు రూ.15లక్షల విరాళాన్ని అందజేశారు. శ్రీకాకుళం, చల్లపల్లి ప్రాంతాల్లో పురాతన ఆలయాల పున:నిర్మాణానికి ఇప్పటివరకు రూ.10లక్షల వరకు అందజేశారు. ప్రస్తుతం నల్గొండ జిల్లా భక్తాళాపురంలో షిర్డీ సాయిబాబా మందిరాన్ని, కమ్యూనిటీ హాలును నిర్మిస్తున్నారు. దీనిలో పాటు ఘంటశాలలో ఏర్పాటు చేసిన గొర్రెపాటి ఫౌండేషన్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పేద విద్యార్ధులకు ఆర్ధిక సాయాన్ని అందజేస్తున్నారు. వాషింగ్టన్ సమీపంలో నిర్మిస్తున్న శ్రీవేంకటేశ్వర లోటస్ టెంపుల్ కు ఇప్పటి వరకు రూ.కోటి 25లక్షలకు పైగా విరాళాన్ని అందించారు. కనకదుర్గ ఆలయానికి ఇప్పటి వరకు రూ.25లక్షలు అందించారు.

* **అంతా మేధావులే
వెంకట్రవు తమ గ్రామానికి సమీపంలో ఉన్న రావివారిపాలేనికి చెందిన సావిత్రిని వివాహం చేసుకున్నారు. ఆమె వాషింగ్టన్ లో ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన అమెరికన్ పేటెంట్ అండ్ ట్రేడ్ మార్క్ సంస్థలో ప్రైమరీ ఎగ్జామినర్ గా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వారికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు కార్తిక్ భవాని శంకర్ ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైన కార్నెల్ మరియు స్టాన్‌ఫోర్డ్ యునివర్శటిల్లో చదివి ప్రస్తుతం న్యూయార్కులోని మీడియా మాత్ అనే కంపెనీలో ఆపరేషన్స్ అండ్ స్ట్రేటజీ విభాగానికి డైరక్టరుగా పనిచేస్తున్నారు. రెండో కుమారుడు కేధార్ నాథ్ ప్రముఖ యునివర్సటీ డార్ట్ మత్ కాలేజీలో బ్యాచిలర్స్ విద్యనభ్యసించి ప్రస్తుతం బోస్టన్ యూనివర్సిటీల్ మాస్టర్స్ డిగ్రీని చేస్తున్నారు.

*** ఎన్.టి.ఆర్ వీరాభిమాని మరియు నిర్మాత
ప్రొఫెసర్ వెంకట్రావు చదువుతో పాటు రంగస్థల నటుడిగానూ గుర్తింపు పొందారు. ఎన్.టి.రామరావుకు వీరాభిమాని అయిన వెంకట్రావు ఆయనతో సినిమాలు తీయాలనే బలమైన కోరికతో ఉండేవారు. అది సాధ్యం కాకపోవటంతో 1994, 97 సంవత్సరాల్లో ఎన్.టి.ఆర్ కుమారుడు బాలకృష్ణ కధానాయకుడిగా ‘టాప్ హీరో’, ‘దేవుడు ‘ చిత్ర్రాలు నిర్మించారు. కృష్ణా, గుంటూరు జిల్లాల సరిహద్దుల్లో కృష్ణా నది ఒడ్డున ఎన్.టి.ఆర్ పేరుమీదుగా మ్యూజియంను ఏర్పాటు చేయాలనేది ఆయన ఆకాంక్ష.

*** పరిశోధన రంగంలో వెంకట్రావు ప్రతిభ
* ఇప్పటి వరకు 17 మంది పీ.హెచ్.డీ విద్యార్ధులకు విజయవంతమైన పరిశోధన మార్గనిర్దేశకుడిగా వ్యవహరించారు. ఈయన దిశానిర్దేశంలో ప్రస్తుతం ముగ్గురు పీ.హెచ్.డీ విద్యార్ధులు పరిశోధనలు నిర్వహిస్తున్నారు.
* 140 జర్నల్ ఆర్టికల్స్ ప్రచురించారు. 100 కాన్ఫరెన్స్ ప్రొసీడింగ్స్ ప్రచురించారు.
* అమెరికా జాతీయ సైన్స ఫౌండేషన్ నుండి అప్రతిహితంగా 28 ఏళ్లు (1987-2015)పాటు నిధులు అందుకున్నారు.
ఇన్ని చేసినప్పటికీ తనకి సంతృప్తినిచ్చేది కేవలం ఒకే ఒక విషయం అంటారు డాక్టర్.మూల్పూరి వెంకట్రావు. ఒక వైపు తన సంస్ధ క్యూరీ లెర్నింగ్ లో కిండెర్ గార్టెన్ (ఎల్.కే.జీ) నుండి ఉన్నత పాఠశాల వరకు పలువురు విద్యార్ధులు. మరో వైపు జార్జి మేసన్ విశ్వవిద్యాలయంలో బ్యాచిలర్స్, మాస్టర్స్, పీ.హెచ్.డీ విద్యార్ధులు. వీరందరికీ (ఎల్.కె.జీ నుండి పీ.హెచ్.డీ వరకు) ప్రతిరోజు వివిధ సమయాల్లో విద్యను అందించటం తనకు చాలా ఉత్తేజాన్ని, ఆనాందాన్నిస్తుందని, తద్వారా వచ్చే ఆదాయం ద్వారా సమాజాభివృద్ధికి తోడ్పడం సంతృప్తినిస్తుందని ప్రొఫెసర్ మూల్పూరి పేర్కొనడం నేటితరం ఎందరో యువతీయువకులకు ఓ జీవితపాఠం. –కిలారు ముద్దుకృష్ణ , సీనియర్ జర్నలిస్ట్

“గీతం” మూర్తి తదితరులకు డాలస్‌లో ఘననివాళి


అమెరికాలోని అలస్కాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఏపీ ఎమ్మెల్సీ, ‘గీతం’ విశ్వవిద్యాలయ అధినేత డాక్టర్‌ ఎంవీవీఎస్‌ మూర్తి, వీపీఆర్‌ చౌదరి, వెలువోలు బసవపున్నయ్య, వీరమాచినేని శివప్రసాద్‌లకు ‘గీతం విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థుల సంఘం’ డాలస్‌లో ఘనంగా నివాళులర్పించింది. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ ప్రొఫెసర్ ఆనంద్ పుప్పాల మాట్లాడుతూ.. ‘గీతం’ తనలాంటి వారికి చక్కని మార్గాన్ని చూపిందన్నారు. ఈ సందర్భంగా ‘గీతం’ మూర్తితో ఉన్న అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. ‘గీతం’ పూర్వ విద్యార్థులు ప్రసాద్‌రెడ్డి గుజ్జు, చినసత్యం వీర్నపు మాట్లాడుతూ ‘గీతం’లో చదువుకున్న తెలుగువారు ప్రపంచ వ్యాప్తంగా వివిధ రంగాల్లో స్థిరపడ్డారని అన్నారు. ‘గీతం’ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్న తొలి ప్రవాస భారతీయుడు ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ పారిశ్రామికవేత్తగా, రాజకీయ నాయకుడిగా ఉన్నత శిఖరాలను అధిరోహిoచినప్పటికీ విద్యావేత్తగానే మూర్తికి ప్రజల్లో మంచి గుర్తింపు ఉందన్నారు. ఒక గొప్ప మానవతావాదిని, దార్శనికుడిని కోల్పోవడం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ తీరని లోటు అని ఆయన అన్నారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న శ్రీ కడియాల వెంకటరత్నం(గాంధీ) త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. సంతాప సభలో డాక్టర్ ఉరిమిండి నరసింహారెడ్డి, జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం, శేషారావు బొడ్డు, విజయమోహన్ కాకర్ల తదితరులు పాల్గొన్నారు.

వర్జీనియాలో రాయలసీమ ప్రవాసుల వనభోజనాలు

తిరువూరులో తానా ఉచిత నేత్ర వైద్యశిబిరం


ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా), శంకర కంటి ఆసుపత్రి, కిలారు ఫౌండేషన్‌ల సంయుక్త ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా తిరువూరులో ఆదివారం నాడు ఉచిత కంటివైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో వైద్యపరీక్షలు నిర్వహించి 40మందిని తదుపరి శస్త్రచికిత్సకు ఎంపిక చేశారు. వీరికి పెదకాకానిలోని శంకర కంటి ఆసుపత్రిలో ఉచితంగా శస్త్రచికిత్సలు నిర్వహిస్తారు. తిరువూరు మున్సిపల్ చైర్‌పర్సన్ మరకాల కృష్ణకుమారి, జడ్పీటీసీ సభ్యురాలు కిలారు విజయబిందులు ఈ శిబిరాన్ని ప్రారంభించారు. డెట్రాయిట్‌కు చెందిన బావినేని అరుణ ఈ శిబిరం నిర్వహణకు సహకారం అందించారు. తిరువూరు పూర్వ విద్యార్థుల సంఘం(తోసా) ప్రతినిధులు నాళ్లా కాశీ, హరికృష్ణ, గోపాలకృష్ణమూర్తి, జడ్పీ బాలికోన్నత పాఠశాల పీటీ జొన్నాడ రంగారావు తదితరులు శిబిరానికి వచ్చిన రోగులకు సాయపడ్డారు. శంకర కంటి ఆసుపత్రికి చెందిన వైద్యులు శ్రీనివాస్ ఆధ్వర్యంలో వైద్యపరీక్షలు నిర్వహించారు.


డల్లాస్‌లో కృష్ణా ప్రవాసులను కలుసుకున్న కృష్ణా జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం


అమెరికా పర్యటనలో ఉన్న కృష్ణా జిల్లా కలెక్టర్ బీ.లక్ష్మీకాంతం బుధవారం సాయంత్రం డల్లాస్‌లో కృష్ణా ఎన్నారై సంస్థ ప్రతినిధులను కలుసుకున్నారు. కృష్ణా ఎన్నారై సంస్థ ద్వారా డిజిటల్ తరగతుల ఏర్పాటు-నిర్వహణ, రక్తహీనత, పౌష్టికాహార లోపాల నిర్మూలనకు విరివిగా తోడ్పడతామని ప్రతినిధులు కలెక్టర్‌కు వివరించారు. అమెరికాలో అత్యధిక సంఖ్యలో పలు కీలక పదవుల్లో ఉన్న జిల్లాకు చెందిన ప్రవాసులు కృష్ణా జిల్లాలో సంక్షేమ, సేవా కార్యక్రమాలకు చొరవగా ముందుకురావడం అభినందనీయమని, వారు చేపట్టే ప్రతి కార్యక్రమానికి ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణా ఎన్నారై ప్రతినిధులు తాతినేని రామ్, చాగర్లమూడి సుగన్, దాసరి కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు.

తెలుగు సంఘాలు అందరినీ వాడేసుకున్న అమెరికా సినీ వ్యభిచార నిర్వాహకులు.FBI ఛార్జిషీట్ చూడండి-TNI ప్రత్యేకం.


తెలుగు సినీ నటులతో అమెరికాలో వ్యభిచారం నిర్వహిస్తూ అక్కడి పోలీసులకు చిక్కిన కిషన్‌ మోదుగుమూడి దంపతులు పూర్తి ఆధారాలతో అడ్డంగా దొరికిపోయారు. తెలుగుసినీ పరిశ్రమకు చెందిన నటీమణులను అమెరికా రప్పించడంతోపాటు.. విటులను ఆకట్టుకునేందుకు వారి ఫొటోలను చరవాణుల ద్వారా పంపిణీ చేసి మరీ వారితో వ్యభిచారం చేయించారన్న ఆరోపణలపై హోంలాండ్‌ సెక్యూరిటీ ఇన్విస్టిగేషన్‌ స్పెషల్‌ ఏజెంట్‌ బ్రియాన్‌ గిన్‌ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. వారిపై ఆరోపణలకు సంబంధించి బ్రియాన్‌ గిన్‌ దాఖలు చేసిన అభియోగపత్రాలను TNI సేకరించింది. ఇందులో అనేక ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి. తెలుగు సినీ పరిశ్రమతో ఉన్న అనుబంధం ద్వారా కొంత మంది నటీమణులతో పరిచయాలు పెంచుకున్న కిషన్‌.. వ్యభిచారం నిర్వహించేందుకు వారిని అమెరికా రప్పించేవాడు. వీసా ఇప్పించడానికి అమెరికాలోని రకరకాల తెలుగు సంఘాల పేర్లు వాడుకునేవాడు. తమ సంఘం నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొనేందుకు వారిని ఆహ్వానిస్తున్నట్లు పేర్కొనేవాడు. వీసా మంజూరయిన తర్వాత తన డబ్బుతోనే విమాన టిక్కెట్లు, హోటల్‌ గదులు బుక్‌ చేసేవాడు. priceline.com వెబ్‌సైట్‌ ద్వారా విమాన టిక్కెట్లు బుక్‌ చేసినట్లు హోంల్యాండ్‌ సెక్యూరిటీ ఏజెంటు దర్యాప్తులో తేలింది. 2016 నవంబరు 8వ తేదీ నుంచి 2017 నవంబరు 29వ తేదీ మధ్య 76 విమాన టిక్కెట్లు కొనుగోలు చేసినట్లు తేలిందని దర్యాప్తు అధికారి అభియోగపత్రంలో పేర్కొన్నారు. తన ఇంటి చిరునామాతో రిజిస్ట్రేషన్‌ చేసుకున్న ఖాతా ద్వారానే ఈ టిక్కెట్లు కొన్నట్లు, అందులోని చరవాణి నెంబరు కూడా కిషన్‌దే (చివరి నాలుగు సంఖ్యలు 6887)అని, మెయిల్‌ ఐడీ (mkishan3456@gmail.com) కూడా ఆయనదేనని గుర్తించారు. అలానే 2016 నవంబరు 9 నుంచి 2018 జనవరి 3వ తేదీ మధ్యలో అమెరికాలో 42 హోటళ్లలో గదులను కూడా ఇదే ఖాతా ద్వారా బుక్‌ చేసినట్లు వెల్లడయింది. వాటి కోసం మొత్తంగా ఏడాదిలో రూ.కోటి వరకు ఖర్చు చేసినట్టు తేలింది. ‘‘అమెరికాకు వస్తున్న నటీమణులతో సంప్రదింపులకు వాడిన చరవాణి నెంబర్లు, ఈమెయిల్‌ చిరునామాల్లోనూ ఇవే ఉన్నాయి. దీన్నిబట్టి కిషన్‌ మోదుగుమూడి అయన భార్య చంద్రకళ ఇద్దరూ తెలుగు సినీ పరిశ్రమ నుంచి నటులను అమెరికా రప్పించి, వారి ఫొటోలు పంపిణీ చేసి, వారితో వ్యభిచారం నిర్వహించినట్లు అర్థమవుతుందని’ దర్యాప్తు అధికారి అభియోగపత్రంలో వివరించారు. వాళ్లిద్దరూ వ్యభిచారం కోసం నటీమణులను రప్పించే క్రమంలో వీసాలు ఇప్పించేందుకు రకరకాల తెలుగు సంఘాల పేర్లు వాడుకున్నారు. ఇందుకోసం దొంగ పత్రాలను సృష్టించారు. ఉదాహరణకు అభియోగపత్రంలో పేర్కొనట్లుగా బాధితురాలు ‘ఎ’ కోసం.. ‘ఆమె ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్‌) 2017 నవంబరు 25వ తేదీన ఇల్లినాయిస్‌లో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతున్నట్టు’ లేఖ తయారు చేసి వీసా వచ్చేలా చూశారు. దర్యాపు అధికారి నాట్స్‌ ప్రతినిధులను సంప్రదించినప్పుడు ఆ తేదీలో తాము ఎలాంటి సమావేశం నిర్వహించలేదని, సదరు నటీమణి ఎవరో తమకు తెలియదని వారు వెల్లడించారు. అలానే అక్కడి అనేక తెలుగు సంఘాల పేర్లనూ, వాటి అధికారిక ఉత్తర్వు ప్రతి(లెటర్‌ హెడ్‌)లు కూడా ఫోర్జరీ చేసి కిషన్‌ వాడుకున్నట్లు దర్యాప్తులో తేలింది. దర్యాప్తులో భాగంగా కిషన్‌ ఇంట్లో తనిఖీలు నిర్వహించిన పోలీసు అధికారులు ఐదు డైరీలు స్వాధీనం చేసుకున్నారు. వాటిలో విటులు ఎప్పుడెప్పుడు? ఎంత మొత్తం చెల్లించారు? అన్న వివరాలు ఉన్నాయి. ‘అవన్నీ తెలుగులో ఉండటంతో వాటిని తెలుగు-ఆంగ్లంలో ప్రావీణ్యం ఉన్న అధికారులతో తర్జుమా చేయించినట్లు అభియోగపత్రంలో’ దర్యాప్తు సంస్థ స్పష్టం చేసింది. సంచలనం సృష్టిస్తున్న ఈ కేసు దర్యాప్తు అత్యంత పకడ్బందీగా నిర్వహించారు. ఉదాహరణకు అమెరికా వచ్చిన నటీమణులతో మాట్లాడిన చరవాణి నంబర్లు, వారితో సంప్రదింపులు జరిపేందుకు వాడిన ఈమెయిల్‌ చిరునామా కిషన్‌దేేనని ఆయా సంస్థల నుంచి (సర్వీస్‌ ప్రొవైడర్స్‌) అధికారిక లేఖ తెప్పించారు. విమాన టిక్కెట్లు, హోటల్‌ గదులు బుక్‌ చేయడానికి ఇచ్చిన చిరునామాలోనూ వీటినే వాడినట్లు గుర్తించారు. అలాగే బాధితులను(నటీమణులు) ఎ.బి.సి.డి.ఇ.లుగా పేర్కొన్న దర్యాప్తు అధికారి..వారు వాడిన చరవాణి నెంబర్లనూ సేకరించారు. సంకేతాల ఆధారంగా ఆ నంబరు వినియోగించే చరవాణి ఏరోజు? ఏ సమయంలో చికాగోలోని మోదుగుమూడి ఇంట్లో ఉందో కూడా గుర్తించారు. నటీమణులు, విటులతో సంప్రదింపులు జరిపేందుకు ఈ నెంబర్లు, మెయిల్‌ ఐడీలే వాడినట్లు నిర్ధారించడంతోపాటు.. ఇందుకోసం ఉపయోగించిన అంతర్జాల సదుపాయం కూడా కిషన్‌ పేరుతోనే ఉన్నట్లు తెలుసుకోగలిగారు. కిషన్‌, అతని భార్య చంద్రకళల చరవాణుల నుంచి నటీమణులు, విటులతో జరిపిన చాటింగ్‌ తాలూకూ పూర్తి వివరాలను కూడా సేకరించారు. ‘అందులో నటీమణుల ఫొటోలు విటులకు పంపడం, వారికి ఎంత చెల్లించాల్సి ఉంటుందో చెప్పడం వంటివి కూడా ఉన్నాయి. దీన్నిబట్టి వ్యభిచారంలో భాగంగానే ఈ సంభాషణ జరిగినట్లు నిర్ధారించడానికి అవకాశం ఉంటుందని’ దర్యాప్తు అధికారుల అభిప్రాయం. ఇదిలా ఉంటే అమెరికా అధికారి దాఖలు చేసిన అభియోగపత్రంలో వ్యభిచారం కోసం రప్పించిన నటీమణుల పేర్లు గోప్యంగా ఉంచారు. వారి పేర్లకు బదులుగా బాధితురాలు ఎ, బాధితురాలు బి ఇలా పేర్కొన్నారు. ఈ ఏబీసీడీఈలు ఎవరన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇందులో ఇద్దరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. తెలుగు, కన్నడ సినిమాల్లో నటించి ఒకప్పుడు కాస్త గుర్తింపు ఉన్న నటీమణితోపాటు.. తెలుగులో వరుస సినిమాలు చేసినప్పటికీ పెద్దగా విజయవంతం కాని నటీమణి ఉన్నట్లు భావిస్తున్నారు. అమెరికాలో తెలుగు సినిమా తారలతో వ్యభిచారం నిర్వహించారన్న అభియోగంపై మోదుగుమూడి దంపతులను అమెరికా పోలీసులు అరెస్టు చేయడం తెలుగు చిత్ర పరిశ్రమని ఉలికిపాటుకు గురిచేసింది. అక్కడ వ్యభిచార దందా నడిపించిన మోదుగుమూడి కిషన్‌కి చిత్ర పరిశ్రమతో సంబంధం లేదని, కిషన్‌ నిర్మాతే కాదని సినిమా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అతని వలలో పడి కొద్దిమంది కథానాయికలు ఇబ్బందులు పడ్డారన్న దిశగానూ ఇప్పుడు చర్చ నడుస్తోంది. ఈ విషయం వెలుగులోకి రాగానే మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) స్పందించింది. ఇకపైన పరిశ్రమకి చెందిన వ్యక్తులకు విదేశాల నుంచి ఆహ్వానం అందితే ఆ విషయాన్ని ‘మా’ దృష్టికి తీసుకురావాలని నటీనటులకి సందేశాలు పంపుతున్నట్టు ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా ‘ఈనాడు’తో తెలిపారు. తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు జెమినీ కిరణ్‌ మాట్లాడుతూ.. ‘ఇది తెలుగు చిత్ర పరిశ్రమతో సంబంధం లేని వ్యక్తులు చేసిన పని. పరిశ్రమ తరఫున వెళ్లేవాళ్లు మాత్రం ‘మా’కో, చలన చిత్ర వాణిజ్య మండలి దృష్టికో తీసుకువస్తే మేలు’ అని చెప్పారు. చలన చిత్ర వాణిజ్య మండలి ప్రధాన కార్యదర్శి ముత్యాల రాందాస్‌, పరిశ్రమ అధికార ప్రతినిధి తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. ‘‘విదేశాలకు వెళ్లే సినిమా వ్యక్తులందరిపైనా పరిశ్రమ నియంత్రణ కష్టతరమే. పరిశ్రమ తరఫున వెళ్లే వాళ్లకు మాత్రం తగిన రక్షణ కల్పించడానికి సాధ్యమవుతుంది. మధ్యవర్తుల ద్వారా వెళ్లడం మాత్రం శ్రేయస్కరం కాదు’ అని తెలిపారు. కిషన్‌ జిమెయిల్‌ వివరాలను దర్యాప్తు అధికారి విశ్లేషించినప్పుడు ఆసక్తికరమైన అంశం వెలుగులోకి వచ్చింది. కిషన్‌కు..ఒక విటుడికి మధ్య జరిగిన సంభాషణ ఆధారంగా సదరు విటుడి ఫోన్‌ వివరాలను దర్యాప్తు సంస్థ సేకరించింది. ‘జి’గా పేర్కొన్న ఆ విటుడు తన చరవాణిలో.. కిషన్‌ పేరును ‘చికాగో వెధవ’గా నమోదు చేసి ఉండటం గమనార్హం.

TNILIVE-FBI-CHARGESHEET-KISHANMODDUGUMUDI-TOLLYWOOD-PROSTITUTION-VEBHAJAYAM
tags: usa tollywood prostitution names, tana ata nats tasc tpad ata in tollywood prostitution case chicago atlanta kishan modugumudi vebha jayam vibha jayam chandra kala purnima modugumudi anchor in usa prostitution tollywood actress prostitution in telugu events indian events usa tnilive tni telugu news international fbi case tollywood prostitution usa federabl bureau of investigation tollywood sex scandal in usa nri pimps

ఇక జనరల్ మోటార్స్ ఆర్ధిక శాఖ ముఖ్య అధికారిగా దివ్య సూర్యదేవర

గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌ వంటి అగ్రగామి సంస్థల్లో ప్రవాస భారతీయులు అత్యున్నత పదవులను అలంకరించి భారత ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేశారు. ఈ కోవకు చెందిన వారే ప్రవాస భారతీయురాలు దివ్య సూర్యదేవర.. అమెరికా ఆటోమొబైల్‌ రంగంలోనే అతిపెద్ద కంపెనీ అయిన జనరల్‌ మోటార్స్‌(జీఎం)కు ఆమె చీఫ్‌ ఫైనాన్స్‌ ఆఫీసర్‌(సీఎఫ్‌వో)గా నియమితులయ్యారు. ఈ మేరకు జీఎం సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం దివ్య సంస్థ కార్పొరేట్‌ ఫైనాన్స్‌ విభాగం వైస్‌ ప్రెసిడెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుత సీఎఫ్‌వో చక్‌ స్టీవెన్స్‌ సెప్టెంబరు 1న పదవి నుంచి తప్పుకోనున్న నేపథ్యంలో దివ్య బాధ్యతలు స్వీకరించనున్నారు. 2019 మార్చిలో స్టీవెన్స్‌ ఉద్యోగ విరమణ చేస్తారు. అప్పటివరకు ఆయన సంస్థ సలహాదారునిగా సేవలందిస్తారని జీఎం పేర్కొంది. 1978లో జనరల్ మోటార్స్‌లో చేరిన ఆయన.. సంస్థ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు.చెన్నైలో జన్మించిన 39 ఏళ్ల దివ్య సూర్యదేవర 2017 జులై నుంచి జనరల్ మోటార్స్‌ కార్పొరేట్‌ ఫైనాన్స్‌కు వైస్‌ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్నారు. 2014 నుంచి జీఎం సీఈవోగా మేరీ బార్రా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆటో మొబైల్‌ రంగంలోని ఓ సంస్థ అత్యున్నత స్థానాల్లో ఇద్దరు మహిళలే ఉండటం ఇదే మొదటిసారి. ‘గత కొన్నేళ్లుగా సంస్థ ఆర్థిక పురోగతికి దివ్య అనుభవం, నాయకత్వ లక్షణాలు ఎంతో పనికొచ్చాయని’ జనరల్‌ మోటార్స్‌ సీఈవో మేరీ బార్రా అభిప్రాయపడ్డారు. దివ్యతో కలిసి సంస్థ అభివృద్ధికి కృషి చేస్తానని ఈ సందర్భంగా బార్రా తెలిపారు.దివ్య సూర్యదేవర యూనివర్శిటీ ఆఫ్‌ మద్రాస్‌ నుంచి కామర్స్‌ విభాగంలో డిగ్రీ, పీజీ పట్టాలను అందుకొన్నారు. 22 ఏళ్ల వయసులో హార్వర్డ్‌ వర్శిటీలో ఎంబీఏ చేయడానికి మొదటిసారిగా అమెరికా వెళ్లారు. 2005లో జీఎంలో చేరకముందు యూబీఎస్‌, ప్రైస్‌వాటర్‌ హౌస్‌కూపర్స్‌ సంస్థల్లో ఆర్థిక విశ్లేషకర్తగా సేవలందించారు.

డిజిటల్ తరగతులకు పశ్చిమ గోదావరి ప్రవాసుల విరాళం-₹10లక్షలు


ఆదివారం నాడు డల్లాస్‌లో నిర్వహించిన ఉభయ గోదావరి జిల్లాల ప్రవాసుల సమావేశంలో పశ్చిమ గోదావరి జడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, తణుకు శాసనసభ్యుడు ఆరిమిల్లి రాధాకృష్ణ, టి.నర్సాపురం జడ్పీ సభ్యుడు నల్లూరి చలపతిరావులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సమావేశంలో డాలస్, ఆస్టిన్, హ్యూస్టన్, డిట్రాయిట్, మినియాపోలిస్, శాన్‌ఫ్రాన్సిస్కో, బే-ఏరియా ప్రాంతాలకు చెందిన ప్రవాసులు పాల్గొన్నారు. బాపిరాజు మాట్లాడుతూ జిల్లాలో 250 ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ తరగతులను ఏర్పాటు చేస్తున్నామని, దీనికి ప్రవాసులు చేయూతనందిస్తే నూర శాతం డిజిటల్ తరగతులు కలిగిన జిల్లాగా పశ్చిమ గోదావరి నిలుస్తుందని పేర్కొన్నారు. దీనికి స్పందించిన ప్రవాసులు ₹10లక్షల చెక్కును గోదావరి ప్రవాసుల సంఘం తరఫున ఆయనకు అందజేశారు. ఈ కార్యక్రమంలో గోదావరి ప్రవాసుల సంఘం అధ్యక్షుడు డా.యంత్ర సుబ్బారావు, కార్యదర్శి పుసులూరి సుమంత్, కోశాధికారి చిలుకూరి రాంప్రసాద్, డా.ఆచంట చౌదరి, కుమార్ పిచికల, స్వామి కాకర్ల, నాగు ఉప్పులూరి, చంద్రశేఖర్, బాలనాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


tags: godavari nris donate 10lakh rupees to digital schools, bapiraju, chilukuri ramprasad, pusuluri sumanth, subba yantra, chowdary achanta, tnilive.com, tnilive, tni, telugu news international, dallas godavari nris meet 2018 nri news

అమెరికాలో భారతీయులు ఎవరైనా చనిపోతే…

tags: deaths of indains in usa, funeral services in usa, protocol to send deadbodies to india, indian death help, tnilive, tni, telugu news international, thotakura prasad, 2018 telugu usa news

డెట్రాయిట్ తానా ఆధ్వర్యంలో “ప్రేరణ”


Event “Prerana” – A ladies fun night organized by TANA occurred on Friday at Saint Thomas Church located in Farmington Hills. Since there cannot be just one day to celebrate the beautiful role “Mother”, TANA initiated the event “Prerana” for all the wonderful women from Detroit to rejoice womanhood and motherhood. The name Prerana was chosen because every woman is an inspiration and this event have exemplified that in many ways. An absolutely exciting agenda was laid out from start to end by the organizing team to take the audience on a fun roller coaster ride driven by the celebrity guest Shreemukhi – the actress and anchor from India. The respective guest of honor “Lakshmi Devineni” addressed the crowd and spoke about the importance of women coming forward and help each other or fellow ladies in need. She introduced the “Mahila Raksha” program in Detroit as well like many other states and proactively indulged in talks with the audience. The food by Kurry’s restaurant located in Farmington remained the highlight of the evening. They introduced variety of mouthwatering food which not only impressed the beautiful ladies appeal wise but also taste wise. The crowd irrespective of counting on calories enjoyed every bit of it on that lovely evening. The flawless and a wedding feel decoration was done by the local talent “Event For Less” team. This extra beauty added extra stars to the event and was appreciated by all of them as the ladies walked into the event venue. The well known DjVic kept the crowd on their foot and made the evening a memorable one for all the ladies in town. Not just that Sky Films and Productions by DjVic again captured the night in their lens and covered their red carpet event beautifully. The entertainment was emceed by the Shreemukhi who pulled crowd with her voice charm. The local talents, performances, fashion walk and games contributed the most fun for the ladies. On the other side sip and shop let brought them joy of happiness. All respective community and achievement awards were given away to recognize certain ladies upon categories that they qualified in by TANA. The backbone of the event – TANA Michigan Regional Coordinator Mr. Sunil Pantra was appreciated for all his efforts towards the event. Alongside Anu Karjela, Shirisha Reddy, Priya Pantra, Prathibha Bheemaneni, Swapna Ellendula and Swapna Shetty were awarded for organizing this successful event – PRERANA. Special vote of thanks was presented to Jogeshwar Rao, Kiran Duggirala, Ravi Dopplapudi, Subhkar Velaga, Vamsi Karumanchi. Super hit was the only words echoed that evening from the audience. Congratulations to event “Prerana” team.

ఆంధ్రుల ఇంద్రుడు రామచంద్రుడే-TNI ప్రత్యేకం

*** పునరుద్ఘాటించిన ప్రవాస పసుపు సేన
*** డల్లాస్‌లో చరిత్ర సృష్టించిన ప్రవాస తెదేపా

దేవతల అధినేత ఆ ఇంద్రుడు అయితే…అమరావతి నిర్మాణాన్ని, ఆంధ్రుల అభ్యున్నతిని ముందుండి మున్ముందుకు నడిపించే ఇంద్రుడు “రామచంద్రులే”నని ప్రవాస తెదేపా పునరుద్ఘాటించింది. ఆది-సోమవారాల్లో డల్లాస్‌లో సెయింట్ మార్‌తోమా చర్చిలో నిర్వహించిన మొట్టమొదటి అమెరికా మహానాడు ఎంతో ఉత్సాహోల్లాసల నడుమ ఎన్నో కొంగొత్త మైలురాళ్లను అందుకుంది. తెదేపా అంటే తెలుగుదేశం పార్టీ కాదు ట్రెండ్ డిజైనింగ్ పార్టీ అని మరోసారి డల్లాస్ ప్రవాస తెదేపా సేనలు నిరూపించాయి. 11నెలల్లో అధికారం కైవసం చేసుకున్నా, ఓ ప్రాంతీయ పార్టీకి ప్రపంచవ్యాపితమైన ప్రవాస విభాగాలు ఏర్పడినా, 70లక్షల సభ్యులు కలిగి ఉందనే భుజకీర్తులు తళుక్కుమన్నా, చెప్పులు వేసి అవమానించి తిరిగి అదే వ్యక్తిని దేవుడని దండలేసినా ఆ ట్రెండ్డు సౌండ్డు ఒక్క టీడీపీకే సొంతం. భాజపా, కాంగ్రెస్ వంటి జాతీయస్థాయి పార్టీలకు ప్రవాస విభాగాలు చాలా కాలంగా ఉన్నాయి. ఆయా సభ్యులు మహానాడు వంటి కార్యక్రమాలు సైతం ఈపాటికే ఎన్నోసార్లు నిర్వహించుకున్నారు. కానీ ఓ ప్రాంతీయ పార్టీ పెద్ద స్థాయిలో ప్రవాసంలో మహానాడు అనే అధికారిక కార్యక్రమాన్ని నిర్వహించడం నిత్యనూతనమైన ఆలోచనగానే చెప్పుకోవాలి. ఒక పోకడకు పురుడు పొసే విధానం తెదేపా సొంతమని మరోసారి రుజువైంది.

ఓ సాధారణ నటుడు అసాధారణ నిర్ణయాలతో విశేషాదరణ తోడు రాగా అనతికాలంలో అధికార సమారాధనకు ఉత్సవ విగ్రహంగా సమాదరణకు నోచుకోవడం అద్భుతం, అద్వితీయం. ఆ దేవుడి అంతర్థానం తర్వాత కూడా అనుమానం లేని అభిమానం కార్యకర్తలను పార్టీ బలోపేతానికి పురికొల్పడం నమ్మిన సిద్ధాంతాలకు తెలుగువారు ఇచ్చే గౌరవానికి నిలువుటద్దం. అటువంటి కార్యకర్తల ఆలోచన నుండి ఉద్భవించిన వినూత్న ఆలోచనే-డల్లాస్ మహానాడు. తెలుగు రాష్ట్రాల్లో మహానాడు అంటే నెలరోజులకు పైగా ప్రణాళిక, పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, వంటలు, రవాణా, వేదిక, తీర్మానాలు వంటి ఎన్నో సంక్లిష్టమైన అంశాల సమాహారం. వీటన్నింటినీ ఖచ్చితమైన సమన్వయంతో నిశ్చితమైన సంకల్పంతో ఎటువంటి లోటు లేకుండా నిర్వహించిన డల్లాస్ తెదేపా శ్రేణులు అభినందనీయులు.
2018 dallas mahanadu telugudesam

మహానాడు తొలిరోజున “తెలుగు NRI ప్రత్యేక హోదా పోరాట సమితి” పేరిట నిశీధి వేషధారులు మహానాడు వేదిక వెలుపల నిరసనకు దిగడం అనూహ్యం. ప్రత్యేక హోదా కోసం కేంద్రంతో తాము ఎలా పోరాడుతున్నామో, పోరుబాటలో ఎలా సంసిద్ధులు కావాలో సభ లోపల ప్రతినిధులు చర్చిస్తుంటే వెలుపల మాత్రం వైఫల్యాల పేరిట ప్లకార్డుల ప్రదర్శన కించిత్ మూర్ఖత్వమనే చెప్పాలి. ప్రపంచం ముందుకు కదులుతోందని సూర్యుడి గమనం ద్వారా ప్రజలు గుర్తిస్తుంటే, నా గదిలో దీపపు నీడ జరగట్లేదనే ఆక్షేపణ చందంగా – కేంద్రంతో పోరాడుతూ రాష్ట్రాన్ని తెదేపా ముందుకు తీసుకుపోతోందని ప్రజలు గుర్తిస్తుంటే, కలిసిరావడం మానేసి తమ పార్టీ “పంఖాల” కింద కూర్చుని పగ్గాల కోసం నిరసన తెలపడం హాస్యాస్పదం. ఓనాటి మిత్రుడైనా ఏ మాత్రం తటపటాయించకుండా న్యూజెర్సీలో ప్రవాస తెదేపా శ్రేణులు భాజపా సదస్సుకు వెళ్లి, ప్రత్యక్షంగా కేంద్ర స్థాయి ప్రతినిధులను ధైర్యంగా ఎదుర్కొని ప్రత్యేక హోదా, కేంద్ర నిధులు వంటి వాటిపై బహిరంగంగా నిలదీశారు. అదే ధైర్యం ఈ నిరసనకారులకు లేకపోవడం దురదృష్టకరం. ప్రవాసంలో నిబద్ధత కలిగిన పాత్రికేయులకు ఊస్టింగ్ ఉత్తర్వ్యూలు ఇచ్చి, ప్రేక్షకుడు పంపే ప్రతి పోరంబోకు వార్తను పతాక శీర్షికకు ఎక్కించే పత్రికలు ఈ మహానాడును కూడా నిరసనకారుల పత్రికా ప్రకటనల ఆధారంగా అపవిత్రం చేశాయి. “మహానాడు లోపల ఉన్నవారి సంఖ్య కన్నా వెలుపల నిరసన తెలిపిన వారి సంఖ్య అధికం“గా ఉందనే వాక్యానికి నిజానిజాలు తెలుసుకోకుండా సెన్సేషన్ కోసం గొడుగులు పట్టిన మూర్ఖ తెలుగు పత్రికా సంపాదకులది అమాయకత్వానికి పరాకాష్ఠ. ఆధారసహిత వివరాలు ఇవి…

1. మహానాడు సభాస్థలిలో వేసిన మొత్తం బల్లలు సంఖ్య – 110
2. బల్లకు 10కుర్చీల లెక్కన మొత్తం కుర్చీల సంఖ్య – 1100
3. ఆదివారం సాయంత్రం కిక్కిరిసిన సభా ప్రాంగణంలో కుర్చీలు ఖాళీ లేక గోడలకు ఆనుకుని అభిమానం చాటిన ప్రవాసుల సంఖ్య – 400
4. భోజనాలకు వినియోగించిన మొత్తం ప్లేట్ల సంఖ్య – 4500. మనిషికి మూడు ప్లేట్లు చొప్పున వేసుకున్నా మొత్తం అతిథుల సంఖ్య 1500.

అంటే ఈ మహానాడుకు సుమారుగా 1500-2000 మధ్యలో కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యారని గణాంకాలే చెప్తున్నాయి. పోనీ కుర్చీలు ఖాళీ, ప్లేట్లు చించి పారేశారనుకున్నా మార్‌తోమా చర్చి కారు పార్కింగ్ నిండినందుకు అయినా కనీసం 500మంది వచ్చారని అనుకోవచ్చు కదా! అమెరికాలో ఆలిని విడిచే మగాళ్లు ఉంటారేమో గానీ ఉత్త పుణ్యానికి వాహనాలు విడిచి వెళ్లే వెర్రి వెధవలు ఉండరని మనవి. ఏది ఏమైనా మహానాడును బద్నాం చేసేందుకు నిరసనకారులు మీడియాను చాలా తెలివిగా వాడుకున్నారన్నది ఒప్పుకోవల్సిన వాస్తవం. అది వారి విజయం. దాన్ని ధాటిగా సమయానుకూలంగా ఎదుర్కోకపోవడం నిర్వాహకుల వైఫల్యం.

అమెరికా నలుచెరుగుల నుండి కార్యకర్తలు భారీ స్థాయిలో ఈ మహానాడుకు రావడం మొదటి విజయం. స్థానికులు కూడా భారీసంఖ్యలో హాజరుకావడం డల్లాస్ విభాగ పట్టుకు నిదర్శనం. రెండో విజయం. రాయలసీమ-తెలంగాణా-కోస్తా మూడు ప్రాంతల నుండి అతిథులు రావడం మూడో విజయం. చంద్రబాబు ప్రత్యక్షంగా ఫోను చేసి మాట్లాడటం నాలుగో విజయం. డల్లాస్ శ్రేణుల శ్రమకు ప్రవాస తెదేపాను తెదేపా అధికారిక విభాగాల్లో ఒక్కటిగా జేర్చేందుకు తీర్మానం ప్రవేశపెట్టడం అయిదో విజయం. ఈ పంచవిజయాలు ఆ పంచభూతాలు తోడురాగా 2019 ఎన్నికల్లో అధికార పీఠంపై తెదేపా పాదం మోపుతుందో లేదో వేచి చూడాలి.

తెలుగు సంఘాల్లో ఆటపాటలు, భోజనాలు, సంస్కృతి, సాంప్రదాయలు వంటి వాటి కోసం ఇప్పటి వరకు ప్రవాసులు తమ సమయాన్ని ఎక్కువగా వెచ్చించేవారు. ఈ మహానాడుతో జన్మభూమి సేవకు, సామాజిక బాధ్యతకు కూడా తాము కంకణబద్ధులమని మరోసారి నిరూపించారు.

అన్నా అని ఎవరన్నా, ఎప్పుడన్నా, ఎక్కడన్నా పిలిచినా తలచినా రుధిరమనే ప్రవాహం ఉత్తుంగ తరంగమై ఉప్పొంగకుండునా….అంటూ ఎన్‌టీఆర్ 96వ జయంతి ఉత్సవాలను కూడా ఈ మహానాడులో నిర్వహించడం కాయం నశిస్తుంది గానీ అది నిర్వర్తించిన కర్తవ్యం మాత్రం కీర్తిమంతంగా నిలుస్తుందనే వాస్తవానికి సాక్షీభూతం.

తారకరాముడు చెప్పినట్టు – తెలుగుదేశం శ్రామికుల చెమటలో నుండి, కార్మికుల కరిగిన కండరాల్లో నుండి, రైతుకూలీల రక్తంలో నుండి, నిరుపేదల కన్నీటిలో నుండి, కష్టజీవుల కంటిమంటల్లో నుండి, అన్నార్తుల ఆక్రందనల్లో నుండే గాక ప్రవాసుల ప్రేమాభినాల నుండి మరోసారి పునరుజ్జీవం పోసుకుంటోంది.—సుందరసుందరి(sundarasundari@aol.com)tgas: 2018 mahanadu dallas grand success telugudesam dallas ganta cmramesh jayaram komati vemana satish telugudesamparty tdpdallas nrtdpusamahanadu

స్విట్జర్లాండ్ తెరాస అధికారిక కార్యవర్గం ఇదే

మంత్రి కే టి ఆర్, టి ఆర్ ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల జనవరి నెలలో స్విట్జర్లాండ్ లోని దావూస్ పర్యటనలో ఉన్నపుడు టి ఆర్ ఎస్ స్విట్జర్లాండ్ శాఖని ప్రారంభించి ఆడ్హాక్ కమిటీ ప్రకటించారు. మహేష్ బిగాల మాట్లాడుతూ గత మూడు నెలలుగా ఈ కమిటీ చేస్తున్న కార్యకలాపాలకు ఎంపీ కవిత ఆనందం వ్యక్తం చేశారని తెలిపారు.ఈ నెల 27న జరిగే పార్టీ ప్లీనరీకి స్విట్జర్లాండ్ నుండి పలువురు
హాజరు అవుతున్నారని తెలుపుతూ టి ఆర్ ఎస్ స్విట్జర్లాండ్ పూర్తి స్థాయి కమిటీ ప్రకటించారు.

కమిటి వివరాలు:
శ్రీధర్ గందె : ప్రెసిడెంట్
అల్లు కృష్ణ రెడ్డి:వైస్ ప్రెసిడెంట్
అనిల్ జాలా: జనరల్ సెక్రటరీ
తిరుపతి పత్తిపాక:ఆర్గనైజింగ్ సెక్రటరీ
* అడ్వైజరీ కమిటీ *:
కిషోర్ తాటికొండ,పద్మజ రెడ్డి, పవన్ దుద్దిల్లా,
* కమిటీ సభ్యులు: *
పాండు రంగా రెడ్డి, రాజేందర్ బాసెట్టి,ప్రవీణ్ గార్లపాటి, గీత పోతుల

అమెరికా దేశపు పౌరసత్వం పొందడం ఎలా?

అమెరికా దేశంలో ఉన్న వనరులు, అవకాశాలను దృష్టిలో పెట్టుకొని ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ఏదో విధంగా అమెరికా చేరుకొని అమెరికా దేశపు పౌరసత్వాన్ని పొంది స్థిర నివాసం ఏర్పరుచుకోవాలనే కలలు కంటూ ఉంటారు. అయితే కొద్ది మంది మాత్రమే ఈ కలలను సాకారం చేసుకోగల్గుతారు. 2016 సంవత్సరంలో దాదాపుగా పది లక్షల మంది అమెరికా పౌరసత్వానికై దరఖాస్తు చేసుకోగా ఏడు లక్షల యాభై రెండు వేల ఎనిమిది వందల మందికి అమెరికా దేశ పౌరసత్వం లభించింది. అమెరికా ప్రభుత్వపు నివేదిక ప్రకారం 2016 లో లక్షా మూడు వేల ఇదు వందల యాభై (1,03,550) మంది మెక్సికన్ దేశస్తులు, 46,100 మంది ప్రవాస భారతీయులు, 41, 285 మంది ఫిలిప్పీన్స్ దేశస్తులు అమెరికా పౌరసత్వాన్ని పొందగల్గారు. అమెరికా దేశపు పౌరసత్వాన్ని మూడు రకాలుగా పొందే అవకాశం ఉంది:

అమెరికా దేశంలో జన్మించడం ద్వారా
వారసత్వపు హక్కు ద్వారా
తగిన అర్హతలు సంపాదించడం ద్వారా

అమెరికా దేశంలో జన్మించడం ద్వారా:
అమెరికా దేశంలో ఉన్న ఏ 50 రాష్ట్రాల్లో జన్మించినా లేదా అమెరికా అధీనంలో ఉన్న పోర్టోరీకో, గ్వామ్, యూ.ఎస్. వర్జిన్ ఐలాండ్స్, మరియు నార్తర్న్ మరయానా ఐలాండ్స్ లో 1986 తరువాత జన్మిస్తే.

అమెరికా దేశం వెలుపల జన్మించిన పిల్లలకు వారసత్వపు హక్కు ద్వారా:
అమెరికా పౌరులైన దంపతులకు (కనీసం ఒకరు అమెరికాలో గతంలో గాని ప్రస్తుతం గాని నివాసం ఉండి ఉండాలి) జన్మించిన పిల్లలకు అమెరికా పౌరసత్వం లభిస్తుంది.
దంపతులలో ఒకరికి మాత్రమే అమెరికా దేశపు పౌరసత్వం ఉంటే – ఆ పౌరసత్వం ఉన్న వారు పిల్లలు పుట్టే సమయానికి కనీసం 5 సంవత్సరాలు అమెరికాలో నివసించి ఉండి ఉండాలి. అమెరికా దేశపు పౌరసత్వం ఉన్న వారు ఈ 5 సంవత్సరాల అమెరికా నివాసంలో, 14 సంవత్సరాల వయస్సు దాటిన తరువాత కనీసం 2 సంవత్సరాలు అమెరికాలో ఉండి ఉండాలి. అప్పుడు వారికి పుట్టిన పిల్లలకు కూడా పౌరసత్వం లభిస్తుంది.
ప్రత్యేక పరిస్థితులు: ఈ క్రింది పరిస్థితులలో పైన పేర్కొన్న 5 సంవత్సరాల కాల పరిమితి వర్తించదు:
ఇతర దేశాల్లో ఉండి అమెరికా సైనిక అధికారిగా పనిచేస్తున్నప్పుడు
ఇతర దేశాల్లో అమెరికా ప్రభుత్వపు అధికారిగా పనిచేస్తున్నప్పుడు
ఇతర దేశాల్లో కొన్ని అంతర్జాతీయ సంస్థల ద్వారా పనిచేస్తున్నప్పుడు

పెళ్లి కాకుండా సహజీవనం ద్వారా పిల్లలు కలిగినప్పుడు –
తల్లి అమెరికా దేశపు పౌరురాలై ఉండి తండ్రి కాకపోతే – తల్లి తనకు పిల్లలు పుట్టే సమయానికి ఒక సంవత్సరం ముందు అమెరికా దేశంలో నివసించి లేదా నివసిస్తూ ఉండి ఉండాలి
తండ్రి అమెరికా పౌరుడై ఉండి తల్లి కాకపోతే – తండ్రి రాతపూర్వకంగా ఆ పుట్టిన శిశువుకు
తానే తండ్రినని
ఆ శిశువు 18 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు అవసరమైన ఆర్ధిక సహాయం అందిస్తానని
ఆ శిశువు జననానికి ముందు తండ్రి కనీసం 5 సంవత్సరాలు అమెరికాలో నివసించి ఉండాలి. ఈ 5 సంవత్సరాల అమెరికా నివాసంలో, 14 సంవత్సరాల వయస్సు దాటిన తరువాత కనీసం 2 సంవత్సరాలు అమెరికాలో ఉండి ఉండాలి.

తగిన అర్హతలు సంపాదించడం ద్వారా: (N-600)
కనీసం 5 సంవత్సరాలు పాటు గ్రీన్ కార్డు కలిగి ఉండాలి మరియు
18 సంవత్సరాల వయస్సు నిండి ఉండాలి
పౌరసత్వానికై దరఖాస్తు చేసేనాటికీ కనీసం ౩ నెలలు ముందుకాలం అమెరికాలో ఉండి ఉండాలి.
పౌరసత్వానికై దరఖాస్తు చేసేనాటికీ ఈ 5 సంవత్సరాల కాలంలో కనీసం 30 నెలలు అమెరికాలో ఉండి ఉండాలి
దరఖాస్తు చేసిన నాటి నుండి పౌరసత్వం పొందే వరకు అమెరికా దేశంలో నివసిస్తూ ఉండాలి. ( కాని సెలవులపై విదేశీ ప్రయాణాలు చేయవచ్చు)
అమెరికా దేశపు చరిత్ర, ప్రభుత్వ పరిపాలనా విధానం తెలిసి ఉండి ఆంగ్ల భాష చదవడం, రాయడం, మాట్లాడటం కొంత వరకైనా వచ్చి ఉండాలి.
అమెరికా రాజ్యాంగాన్ని, చట్టాలను గౌరవిస్తూ, భాధ్యతాయుతమైన వ్యక్తిగా మెలిగి ఉండాలి.
అమెరికా పౌరసత్వం ఉన్న వారితో వివాహం జరిగితే –
కనీసం 3 సంవత్సరాలు పాటు గ్రీన్ కార్డు కలిగి ఉండాలి
18 సంవత్సరాల వయస్సు నిండి ఉండాలి
పౌరసత్వానికై దరఖాస్తు చేసేనాటికీ కనీసం ౩ నెలల ముందుకాలం అమెరికాలో ఉండి ఉండాలి.
ఆ ౩ సంవత్సరాల కాలం పూర్తయి పౌరసత్వం కోసం దరఖాస్తు చేసి పౌరసత్వం పొందే వరకు వైవాహిక బంధంలోనే ఉండి ఉండాలి.
పౌరసత్వానికై దరఖాస్తు చేసేనాటికీ ఈ 3 సంవత్సరాల కాలంలో కనీసం 18 నెలలు అమెరికాలో ఉండి ఉండాలి
దరఖాస్తు చేసిన నాటి నుండి పౌరసత్వం పొందే వరకు అమెరికా దేశంలో నివసిస్తూ ఉండాలి. ( కాని సెలవులపై విదేశీ ప్రయాణాలు చేయవచ్చు)
అమెరికా దేశపు చరిత్ర, ప్రభుత్వ పరిపాలనా విధానం తెలిసి ఉండి ఆంగ్ల భాష చదవడం, రాయడం, మాట్లాడటం కొంతవరకైనా వచ్చి ఉండాలి.
అమెరికా రాజ్యాంగాన్ని, చట్టాలను గౌరవిస్తూ, భాధ్యతాయుతమైన వ్యక్తిగా మెలిగి ఉండాలి.

గ్రీన్ కార్డు పొందడానికి కావలసిన అర్హతలు: ( I-485)
ఈ క్రింది పేర్కొన్న విధంగా గ్రీన్ కార్డు పొందవచ్చు –
కుటుంబ బంధం ద్వారా
ఉద్యోగం ద్వారా
పెట్టుబడి పెట్టడం ద్వారా
ప్రత్యేక పరిస్థితులలో
శరణార్ధులు లేదా కాందిశీకులు
లాటరీ సిస్టం ద్వారా
పేర్లు నమోదు చేసుకోవడం ద్వారా

కుటుంబ బంధం ద్వారా గ్రీన్ కార్డు :
అమెరికా పౌరసత్వం లేదా గ్రీన్ కార్డు ఉన్నవారితో వివాహం జరిగితే
మీ తల్లిదండ్రులు అమెరికా పౌరులు లేదా గ్రీన్ కార్డు ఉన్నవారు అయితే ( ఒకవేళ తల్లిదండ్రులు గ్రీన్ కార్డు ఉన్న వారు అయితే, వారి పిల్లలు అవివాహితులుగా ఉన్నప్పుడు మాత్రమే అర్హులు)
కనీసం 21 సంవత్సరాల వయస్సు ఉన్న మీ సోదరుడు లేదా సోదరి అమెరికా దేశపు పౌరులై ఉంటే
అమెరికా పౌరసత్వం ఉన్నవారితో పెళ్లి నిశ్చయమైతే
మీ తల్లి లేదా తండ్రికి అమెరికా పౌరసత్వం కలిగిన వారితో వివాహం నిశ్చయమైనప్పుడు, మీరు కూడా గ్రీన్ కార్డు కు అర్హులే.

ఉద్యోగం ద్వారా గ్రీన్ కార్డు
వివిధ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు వారి యాజమాన్యం ద్వారా గ్రీన్ కార్డు కై దరఖాస్తు చేసుకోవచ్చు.

అమెరికాలో పెట్టుబడులు పెట్టడం ద్వారా గ్రీన్ కార్డు
అమెరికాలో కనీసం 5 లక్షల డాలర్లు పెట్టుబడి పెట్టి కనీసం 5 ఉద్యోగాలను కల్పించడం ద్వారా లేదా 1 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టి కనీసం 10 ఉద్యోగాలను కల్పించడం ద్వారా
ప్రత్యేక పరిస్థితుల్లో గ్రీన్ కార్డు:
అమెరికా దేశంలోని లాభాపేక్ష రహిత, మతపరమైన సంస్థల్లో పని చేయడం ద్వారా
విదేశాల్లో వైద్య విద్య పూర్తి చేసిన వారు
గ్రీన్ కార్డు కల్గి ఉండి అమెరికా దేశానికి వెలుపల ఒక సంవత్సరం పైగా గడిపిన వారు
అంతర్జాతీయ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు
అమెరికా దేశపు అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఇతర దేశం నుంచి వచ్చి వైద్య సేవలు అందిస్తున్న వైద్యులు

శరణార్ధులు లేదా కాందిశీకులకు గ్రీన్ కార్డు
అమెరికా ప్రభుత్వం నుంచి శరణార్ధులు లేదా కాందిశీకులుగా గుర్తింపు పొందిన ఒక సంవత్సర కాలం తరువాత వారు గ్రీన్ కార్డు కై దరఖాస్తు చేసుకోవచ్చు.

లాటరీ పద్ధతి ద్వారా గ్రీన్ కార్డు
కనీసం హైస్కూల్ స్థాయి విద్యార్హత కల్గి ఉండాలి లేదా గడిచిన 5 సంవత్సరాల కాలంలో 2 సంవత్సరాలు ఏదైనా ఉద్యోగం చేసి ఉండాలి.
సాధారణంగా ప్రతి సంవత్సరం అక్టోబర్ నెలలో కంప్యూటర్ లాటరీ పధ్ధతి ద్వారా 55,000 వరకు గ్రీన్ కార్డులను జారీ చేస్తారు.

పేర్లు నమోదు చేసుకోవడం ద్వారా గ్రీన్ కార్డు
జనవరి 01, 1972 కి ముందు అమెరికాలో ప్రవేశించి, అమెరికా పౌరసత్వం పొందడానికి అర్హులైతే ప్రత్యేకంగా నమోదు చేసుకోవడం ద్వారా గ్రీన్ కార్డు పొందవచ్చు.

పూర్తి వివరాలకు www.prasadthotakura.com ను చూడండి

(ఈ వ్యాస రచయిత డాక్టర్. ప్రసాద్ తోటకూర గత మూడు దశాబ్దాలుగా అమెరికాలో స్థిరపడి పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్న ప్రముఖ ప్రవాస భారతీయులు.)

అమెరికాలోని తెలుగు సంఘాలకు ప్రత్యేక సమాచారం

తెలుగువారికి గత నలభై సంవత్సరాల నుండి చిరపరిచితుడైన ప్రముఖ మిమిక్రీ కళాకారుడు చిల్విస్టర్ ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ మిమిక్రీ కళాకారులుగా ఆయనకు మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. నేరెళ్ళ వేణుమాధవ్ సహచరుడిగా చిల్విస్టర్ కు గుర్తింపు ఉంది. ఆయన ఏప్రిల్ 14 వరకు అమెరికాలో ఉంటున్నారు. ఆయన ప్రదర్శన ఏర్పాటు చేయాలనుకునేవారు ఈ దిగువ వాట్స్ అప్ నంబరు +91 9848120006 లో సంప్రదించవచ్చు. ఏప్రిల్ 14 కు ఆయన అమెరికాలోని చికాగో నగరంలో అందుబాటులో ఉంటారు. కమర్షియల్ కళాకారుడిగా కాకుండా మంచి సేవాభావం ఉన్న కళాకారుడిగా చిల్విస్టర్ కు గుర్తింపు ఉంది.

టాటా నుండి ఝాన్సీ రెడ్డి ఔట్ ! – TNI ప్రత్యేకం

అమెరికాలో పుట్ట గొడుగుల్లా పుట్టుకువస్తున్న తెలుగు సంఘాల్లో విభేదాలు కూడా వెల్లువలా పుట్టుకు వస్తున్నాయి. జీవితంలో బాగా స్థిరపడిన చాలా మంది ప్రవాస తెలుగువారు వివిధ తెలుగు సంఘాలలో చురుగ్గా పాల్గొంటున్నారు. చాలామంది తమకు గుర్తింపు రావాలని కోరుకుంటున్నారు. కీలక పదవుల కోసం ఆరాట పడుతున్నారు. కీలక పదవులు నిర్వహించిన మరికొందరు శాశ్వతంగా, అదే పదవుల్లో కొనసాగాలని కోరుకుంటున్నారు. తెలుగు సంస్థలపై తమ పెత్తనం ఉండాలని తమ మాటే చెల్లుబాటు కావాలని చాలామంది కోరుకుంటున్నారు. తమ మాట చెల్లుబాటు కాకపొతే ఆ సంస్థల నుండి చాలా మంది తప్పుకుంటున్నారు. ఎంతో అట్టహాసంగా తమ ఆద్వర్యంలో స్థాపించిన తెలుగు సంఘాల నుండి అర్దాంతరంగా నిష్క్రమిస్తున్నారు. రెండు రాష్ట్రాలు విడిపోయిన అనంతరం తెలంగాణా పేరుతొ అమెరికాలో కొన్ని తెలుగు సంఘాలు వెలిశాయి. వాటిలో ప్రధానమైనది ‘తెలంగాణా అమెరికన్ తెలుగు అసోసియేషన్(టాటా)’. అమెరికన్ తెలుగు అసోసియేషన్లో (ఆటా)కీలక నేతలుగా ఎదిగిన న్యూయార్క్ కు చెందిన పైళ్ళ మల్లారెడ్డి, కాలిఫోర్నియాకు చెందిన ఝాన్సీరెడ్డి తదితరులు ‘టాటా’ను నెలకొల్పారు. ఈ సంఘం కొద్దికాలంలోనే అమెరికాలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించింది. మల్లారెడ్డి చైర్మన్ గాను, ఝాన్సిరెడ్డి అధ్యక్షురాలు గానూ ఈ సంస్థను సమర్ధవంతంగా నిర్వహించారు. ఇటీవల టాటా అద్యక్షుడిగా డెట్రాయిట్ కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త పోలిచర్ల హరినాద్ ఎన్నికయ్యారు. ఆయన చిత్తూరుజిల్లా నివాసి. తెలంగాణా తెలుగు సంఘానికి ఆంధ్రా వ్యక్తి అద్యక్షుడు ఏమిటనేది చాలా మందికి సందేహాలు ఉన్నాయి. అయితే తాను ఎప్పటి నుంచొ హైదరాబాద్ లో స్థిరపడ్డానని హరినాద్ వాదన. ఈ విషయంలో మొన్నటి వరకు అధ్యక్షురాలిగా ఉన్న ఝాన్సిరెడ్డి అసంతృప్తిగా ఉన్నారు. ఆటా, టాటా సంయుక్త ఆద్వర్యంలో వచ్చే మే 31వ తేదీ నుండి మూడు రోజుల పాటు డాలస్ లో వార్షిక వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాల నిర్వహణకు రెండు సంఘాల నుండి పది మందితో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఏర్పాటు పైన ఝాన్సీరెడ్డి అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. దీంతో ఝాన్సిరెడ్డి టాటా నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. దీనిని టాటా కార్యవర్గం కూడా ఆమోదించినట్లు సమాచారం. ఝాన్సిరెడ్డి తదుపరి నిర్ణయం ఏమిటో వేచి చూడవలసి ఉంది. ఆర్ధికంగా మంచి స్థానంలో ఉండి ఇటు స్వస్థలంలోనూ, అటు అమెరికాలోనూ వివిధ సాంఘీక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని లక్షలాది రూపాయలు విరాళాలుగా అందించిన ఝాన్సిరెడ్డి మరొక తెలుగు సంస్థను స్థాపిస్తారా? అనే విషయంపై ప్రవాస తెలుగువారిలో చర్చలు సాగుతున్నాయి.–కిలారు ముద్దుకృష్ణ

తెలుగు జాతి గర్వించే ప్రాజెక్టు మలేషియాలో సిద్ధమైంది–TNI ప్రత్యేకం


తెలుగు భాషకు తెలుగు రాష్ట్రాల్లో ప్రాచూర్యం లేనప్పటికీ పరాయి దేశంలో వందల సంవత్సరాల క్రితం వెళ్ళిన మన ప్రవాసాంధ్రులు తెలుగు జాతి గర్వించే విధంగా ఒక భారీ ప్రాజెక్టును నిర్మించారు. మలేషియాలోని కౌలాలంపూర్ లో ఈ భారీ ప్రాజెక్టు రూపుదిద్దుకుంది. మలేషియాలో నివసిస్తున్న ప్రవాస తెలుగువారు ఈ ప్రాజెక్టును నిర్మించి మన తెలుగు జాతి గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు. తెలుగు భాష గురించి పెద్దగా పట్టించుకోని మన రాష్ట్ర ప్రభుత్వాలకు మలేషియా ప్రవాసాంధ్రులు ఆదర్శంగా నిలుస్తున్నారు. మలేషియాలో ప్రవాసాంధ్రులు దేశం నలుమూలల విస్తరించారు. తెలుగు అసోసియేషన్ ఆఫ్ మలేషియా (TAM) పేరుతో 1955లోనే ఒక తెలుగు సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కౌలాలంపూర్ నడిబొడ్డున మూడు అంతస్తులతో ఒక తెలుగు భవనాన్ని నిర్మించుకున్నారు. విదేశాల్లో ఉన్న తెలుగువారు సొంతంగా విరాళాలు వేసుకుని నిర్మించిన తొలి విశాలమైన భవనం ఇదే.

*** భారీ ఖర్చుతో తెలుగు అకాడమీ భవనం
తెలుగుదనం గొప్పదనాన్ని తెలుగుజాతి అభిమానాన్ని మలేషియాలో ఉన్న ప్రవాసాంధ్రులు ప్రపంచానికే చాటి చెప్పారు. కౌలాలంపూర్ కు 30కిలోమీటర్ల దూరంలో తెలుగు అకాడమీ పేరుతో ఒక భారీ భవనాన్ని అక్కడి ప్రవాసాంధ్రులు నిర్మించారు. రెండున్నర ఎకరాల విస్తీర్ణంలో, మూడు బ్లాకుల్లో, ఐదంతస్తుల భారీ భవన సముదాయం తయారైంది. హైదరాబాద్ లో ఉన్న మన తెలుగు విశ్వవిద్యాలయం కన్నా ఇది రెండింతలు పెద్దది. ప్రస్తుతం 53వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ తెలుగు అకాడమీ భవనాన్ని నిర్మించారు. దాదాపు 25కోట్ల ఖర్చుతో ఈ భవనాన్ని రికార్డు సమయంలో నిర్మించారు. 2016 మర్చి నెలలో ఈ భవన నిర్మాణానికి భూమి పూజ జరిగింది. వచ్చే ఉగాది నాటికి ఈ తెలుగు అకాడమీ భవనాన్ని ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ భవన నిర్మాణానికి మలేషియా ప్రభుత్వం చాలా వరకు నిధులు మంజూరు చేసింది.


*** ఈ భవనం దేని కోసం?
కౌలాలంపూర్ లో నిర్మించిన తెలుగు అకాడమీ భవనం మలేషియాతో పాటు పరిసరాల్లో ఉన్న మిగిలిన దేశాల్లో నివశిస్తున్న ప్రవాస తెలుగు వారికి ఉపయోగపడేటట్లుగా ఈ అకాడమీనీ నిర్మించారు. దక్షిణ, తూర్పు ఆసియా దేశాలలో నివశిస్తున్న ప్రవాసాంధ్ర విద్యార్థులకు తెలుగులో ఉన్నత విద్యా అవకాశాలను కల్పిస్తారు. దీంతో పాటు నృత్యం, సంగీతం వంటి భారతీయ కళలను నేర్పించే విధంగా ఏర్పాట్లు చేసారు. ప్రస్తుతం మలేషియాలో ముప్పై ప్రదేశాల్లో దాదాపు ఐదు వేలమంది విద్యార్ధులకు తెలుగును ప్రాథమిక, మాధ్యమిక స్థాయిలో బోధిస్తున్నారు. వీరందరినీ తెలుగు అకాడమీకి తీసుకువచ్చి ఉన్నత విద్యలో శిక్షణ ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. కూచిపూడి నృత్యం, చిత్ర కళ , భజనలు వంటి వాటిలో కూడా నైపుణ్యం కలిగిన వారితో శిక్షణ ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు.

*** శెభాష్ డా.అచ్చయ్య
తెలుగు అసోసియేషన్ ఆఫ్ మలేషియా (టాం)కు గత పదిహేను సంవత్సరాల నుండి డా.అచ్చయ్య కుమారరావు అధ్యక్షుడిగా ఉంటున్నారు. ఆయన హయాంలోనే పలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మలేషియా ప్రవాస తెలుగు వారిని ఒక తాటిపైకి తీసుకువచ్చి వారి సహకారంతో తెలుగు అకాడమీ భవన నిర్మాణానికి డా.అచ్చయ్య ఎనలేని కృషి చేశారు. గత నెలలో హైదరాబాద్ లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలకు డా. అచ్చయ్య సారథ్యంలో 98మంది మలేషియా ప్రవాస తెలుగు బృందం పాల్గొని తెలుగు భాష పట్ల వారికున్న ఆదరాభిమానాలను చాటిచెప్పారు. —కిలారు ముద్దుకృష్ణ.
tags: malaysia telugu association sangham 2018 acchayya atchaiah achaiah kumar rao president telugu academy malaysia telugus malaysia tnilive telugu news international tnilive malaysia

స్విట్జర్‌ల్యాండ్ ప్రవాస తెలంగాణీయులతో కేటీఆర్ భేటీ-చిత్రాలు
ఆస్ట్రియా ఎన్నారై తెరాస నూతన కమిటీ ఇదే

ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఎన్నారై తెరాసలోకి ప్రవాసులు అధికసంఖ్యలో జేరుతున్నారని ఎన్నారై తెరాస సమన్వయకర్త బిగాల మహేష్ తెలిపారు. ఎంపీ కవిత ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా ఎన్నారై తెరాస శాఖలను ప్రారంభిస్తున్నామని ఆయన వెల్లడించారు. యూరప్‌లోని ఆస్ట్రియా దేశాన్ని సందర్శించిన మహేష్ అక్కడి ఎన్నారై తెరాస విభాగ కార్యవర్గాన్ని ప్రకటించారు. వారి వివరాలు కమిటి ని ప్రకటించారు.

అధ్యక్షులుగా మేడిపల్లి వివేక్ రెడ్డి,
గౌరవ చైర్మన్ గా ప్రవీణ్ రెడ్డి,
ఉపాధ్యక్షులుగా కంది వంశీ,యలగం సతీష్
ఆస్ట్రియా కమ్యూనిటీ ఆపైర్స్ చైర్మన్ గా కురకాల రాజు
ప్రధాన కార్యదర్శులు: అమరమఒ శ్రీకాంత్ రెడ్డి, దైవాల రవీతేజ, నరేష్ , రాజిరెడ్డి
కార్యదర్శులు గా అడెపు మనోజ్ కుమార్, భరత్, శశి.
గుర్రం అనిల్, భరత్,
కొశాదికారులు:మధు,సతిష్ కుమార్
ఐటిమిడియా:నవిన్ కుమార్, సన్ని.
కార్యనిర్వాహక సభ్యులు: సందిప్ రెడ్డి,ప్రమోద్,మనోజ్,సతీష్,దైవాదుల విజయ్,ఈర్ల మహేందర్,కృష్ణ మరియు వినోద్ లని నియమించారు.

అలనాటి నటి మాధవి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు


“మాతృదేవోభవ” చిత్రంతో పెద్దసంఖ్యలో అభిమానులను సొంతం చేసుకున్న అలనాటి నటి మాధవి 2018 నూతన సంవత్సరంలో సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. సామాజిక మాధ్యమాల వేదికగా పలు అంశాలపై “మాధవి ఛారిటబుల్ ఫౌండేషన్” ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలకు తన భర్త రాల్ఫ్‌తో కలిసి ప్రారంభిస్తున్నట్లు ఆమె ఓ వీడియోలో పేర్కొన్నారు. ఆ వీడియోను కింద చూడవచ్చు. మరిన్ని వివరాలకు ఈ వెబ్‌సైట్‌ను సందర్శించండి – http://maadhavi.com/charitable-foundation.html

tnilive.com tnilive maadhavi charitable foundation tnilive maadhavi actress matrudevobhava actress maadhavi charity ralph sharma charity 2018 new charity actress tollywood

Tags:tnilive.com tnilive maadhavi charitable foundation tnilive maadhavi actress matrudevobhava actress maadhavi charity ralph sharma charity 2018 new charity actress tollywood

సిలికానాంధ్ర ఆసుపత్రికి న్యూజెర్సీ కళాకారిణి స్వాతి గుండపనీడు భారీ విరాళం


బట్టలు ఉతకడం నుండి బుష్ వరకు…ఓ వరంగల్ ప్రవాసుడి గాథ!

‘‘ఏరా రాములు? అయిదు సదివినవు ఇక సాలు. ఇక బట్టలుతికి బతుకు’’
‘‘ లేదు దొరా! నేను ఇంకా సదివి కలెట్టర్‌ను అయితా!’’
‘నువ్వు సదువుకు పోతే వూళ్లొ బట్టలెవరు ఉతుకుతర్రా’’
‘‘బట్టలుతుకుతూ సదువుత దొరా!’’
‘‘ కాళ్లు ఇరగ్గొడత, సదువు లేదు.. గిదువు లేదు.. సెప్పింది సెయ్‌!’’
దాదాపు రెండున్నర దశాబ్దాల తర్వాత…
అమెరికాలోని శ్వేత సౌధం.‘వీ ఆర్‌ వెల్‌కమింగ్‌ రాములు.ఎం.. టు రిసీవ్‌ ప్రెసిడెన్షియల్‌ యంగ్‌ ఇన్వెస్టిగేటర్‌ అవార్డ్‌ ఫ్రమ్‌ ఆనరబుల్‌ ప్రెసిడెంట్‌’ అని మైక్‌లో ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్‌ ఆయనకు పురస్కారాన్ని అందజేయగా కరతాళ ధ్వనులు మిన్నుముట్టాయి.
పల్లెటూరి పిల్లగాడు…. పశువులు కాసిండు… బట్టలుతికిండు… అంతటితో అతని కథ ముగియలేదు. చదువుకోసం వూరి నుంచి పారిపోయాడు. పట్నం చేరాడు… హైదరాబాద్‌కు వెళ్లాడు. దిల్లీ దాకా వెళ్లాడు, చివరికి అమెరికా చేరుకున్నాడు.. అగ్రరాజ్యంలో అత్యుత్తమ ఇంజినీరుగా, బోధకునిగా, ఆచార్యునిగా మారాడు. ప్రపంచ ప్రఖ్యాత వైమానిక కంపెనీ బోయింగ్‌ సహా అనేక కంపెనీలలో డిజైన్లను, పరికరాలను రూపొందించారు. వాటికి ప్రధాన సలహాదారుగా ఉన్నారు. పాత వరంగల్‌ జిల్లాలోని జనగామ తాలూకా తరిగొప్పుల గ్రామానికి చెందిన మామిడాల రాములు విజయగాథ ఇది. సంకల్పం, కృషి, పట్టుదలతో అత్యున్నత స్థాయికి చేరుకోవచ్చని నిరూపించారు.
**తరిగొప్పులలోని సోమయ్య, వెంకమ్మల కుమారుడైన రాములు (1949) రజకవృత్తిలో భాగంగా వూళ్లొ బట్టలుతికేవారు. తమ ఒక్కగానొక్క కొడుకైన రాములును చిన్నప్పుడే కులవృత్తిలో దింపారు. చదువుపై ఇష్టం ఉన్న రాములు వూళ్లొ బడిలో చేరారు. ఇంట్లో పనులు చేస్తూనే అయిదో తరగతి పూర్తి చేశాక.. తండ్రి చదువు ఆపేయమన్నాడు. కులవృత్తి చేయమని ఒత్తిడి తెచ్చాడు. బడికి పోతానని అతను మొరాయించడంతో ఒప్పుకున్నాడు. వూరికి నాలుగు కిలోమీటర్ల దూరంలోని బచ్చన్నపేటకు వెళ్లి ఆరో తరగతి చదివాడా కుర్రాడు. ఏడో తరగతి నర్మెట్ట పాఠశాలలో పూర్తి చేశాడు. ఇక చదువు మాని దొరల ఇంట్లో పనిచేయాలని ఒత్తిడి తెచ్చారు తల్లిదండ్రులు. అతను ఒప్పుకోలేదు. దొరలు రాములును ఇంటికి పిలిపించి, చదువు మానేయాలన్నారు. వూళ్లొ ఉంటే చదువుకోవడం సాధ్యం కాదని అతను ఇంటి నుంచి పారిపోయాడు.
వూరు దాటిన రాములు జనగామలో ఒక హాస్టలులో చేరాడు. ఉన్నత పాఠశాలకు వెళ్లగా హెడ్మాస్టర్‌ అతన్ని పరీక్షించి అసాధారణ ప్రతిభ ఉందని గుర్తించి ఎనిమిదో తరగతిలో చేర్చుకున్నారు. హాస్టలులో ఉంటూ, పాఠశాలలో చదుకుంటూ 11వ తరగతి (హెచ్‌ఎస్‌సీ) పూర్తి చేశారు. 11వ తరగతిలో అప్పట్లో వరంగల్‌ జిల్లాలో మొదటి స్థానం సాధించారు. ఆ తర్వాత ఇంటికి వెళ్లే పరిస్థితి లేదు. చేతిలో చిల్లిగవ్వ లేదు. టికెట్‌ తీసుకోకుండానే హైదరాబాద్‌ వెళ్లే రైలెక్కారు. సికింద్రాబాద్‌లో పట్టుకుంటారనే భయంతో మౌలాలి స్టేషన్‌లో దిగారు. ఇద్దరు విద్యార్థులు అతన్ని మల్కాజ్‌గిరి సమీపంలోని హాస్టలుకు తీసుకెళ్లారు. అక్కడి వార్డెన్‌ వెంకటప్పయ్య రాములు పూర్వాపరాలు తెలుసుకొని హాస్టలులో చేర్చుకున్నారు. తర్వాత నిజాం కాలేజీలో చేరేందుకు దరఖాస్తు చేసుకోగా సీటు వచ్చింది. రూ. 60 రుసుము చెల్లించాల్సి వచ్చింది. డబ్బులు లేక వివేకవర్ధిని కళాశాలలో పీయూసీలో జాయన్‌ అయ్యారు.
**పీయూసీలో కళాశాలలో ప్రథమ స్థానంలో నిలిచారు. దాని తర్వాత ఉస్మానియా ఇంజినీరింగు కళాశాలలో మెకానికల్‌ ఇంజినీరింగు సీటు వచ్చింది. 110 రూపాయల రుసుము చెల్సించాల్సి ఉండగా డబ్బుల్లేక బీఎస్సీలో చేరారు. ఒక స్నేహితుడు డబ్బు ఇచ్చేందుకు ముందుకురావడంతో మళ్లీ ఇంజినీరింగులో చేరాలనుకున్నాడు. మొదటి లిస్టులో చేరనందున రెండో లిస్టులో ప్రవేశానికి కళాశాల అధికారులు నిరాకరించారు. రాములు పరిస్థితిని అర్థం చేసుకున్న కళాశాల ప్రిన్సిపాల్‌ అబీద్‌ అలీ ఇంజినీరింగులో ప్రవేశానికి అనుమతించారు. హాస్టలులో ప్రవేశం కల్పించారు. ఇంజినీరింగు చేస్తూనే రుసుముల కోసం కూలీ పని చేసేవారు. ఓయూ ఇంజినీరింగు కళాశాల భవన నిర్మాణ పనుల్లో ఉన్న రాములును చూసిన గణిత అధ్యాపకుడు అతనిని చూసి ఇకపై అలాంటి పనులు చేయవద్దని సూచించారు. 1968లో ఇంజినీరింగు పూర్తి చేశారు. 1969లో తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. ట్యుటోరియల్స్‌లో విద్యార్థులకు ట్యూషన్లు చెబుతూ ఆర్థిక వనరులు సమకూర్చుకునేవారు. 1973లో ఇంజినీరింగు పూర్తి చేశారు. మిత్ర అనే అధ్యాపకుడు రాములు ప్రతిభను చూసి దిల్లీలోని ఐఐటీలో పరీక్ష రాయాలని సూచించారు. 1974లో ఆయన దిల్లీలో ఐఐటీ ప్రొడక్షన్‌ ఇంజినీరింగులో చేరారు. అక్కడా ప్రథమునిగా నిలిచారు. 1976లో పీహెచ్‌డీలో చేరారు. ఇదే సమయంలో విదేశీ విద్య ఉపకార వేతనానికి దరఖాస్తు చేసుకోగా మంజూరయింది. ఉపకార వేతనం పూచీకత్తుకు డబ్బులు లేకపోవడంతో హైదరాబాద్‌కు వచ్చి ఐఏఎస్‌ అధికారి ఎస్‌.ఆర్‌. శంకరన్‌ను కలిశారు. ఆయన అప్పటి హైదరాబాద్‌ కలెక్టర్‌గా ఉన్న గిరికి చెప్పి పూచీకత్తు ఇప్పించారు. అలా రాములుకు 1977లో అమెరికా వెళ్లేందుకు అవకాశం వచ్చింది.
**వివిధ హోదాల్లో
అమెరికాలోని సియాటిల్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ వాషింగ్టన్‌లో చేరారు రాములు. విశ్వవిద్యాలయంలో మెకానికల్‌ ఇంజినీరింగులో పీహెచ్‌డీ పూర్తి చేశారు. యాజమాన్యం ఆయన ప్రతిభను చూసి 1982లో అక్కడే అధ్యాపకునిగా నియమించింది. అధ్యాపకునిగా ఆయన బోధనతోపాటు పరిశోధన రంగాలపై దృష్టి సారించారు. సొంతంగా రెండు గ్రాడ్యుయేట్‌ ఎడ్యుకేషనల్‌ ప్రోగ్రామ్స్‌ను కనిపెట్టారు. వైమానిక రంగంపై పట్టు సాధించారు. వైమానిక ఇంజినీర్ల కోసం కంపోజిట్‌ మెటీరియల్స్‌, మాన్యుఫాక్చరింగ్‌లో సర్టిఫికెట్‌ ప్రోగ్రామ్‌ను రూపొందించారు. 2013 నుంచి ఇప్పటి వరకు అదే విశ్వవిద్యాలయంలో బోయింగ్‌ పానెల్‌ ప్రొఫెసర్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.
**దాతృత్వం
అట్టడుగు వర్గం నుంచి ఉన్నతస్థానానికి ఎదిగాననే భావనతో ఆయన తన లాంటి వారికి చేయూతనిస్తు న్నారు. తెలంగాణలోని వసతిగృహాల్లో వాటర్‌ ట్రీట్‌మెంటü ప్లాంట్లు, విద్యార్థులకు అవసరమైన సామగ్రిని అందజేస్తున్నారు. విద్యార్థినుల కోసం మరుగుదొడ్లను నిర్మించారు. తాను చదివిన పాఠశాలలో విద్యార్థులకు సాయం అందిస్తున్నారు. వాషింగ్టన్‌ విశ్వవిద్యాలయంలో ప్రవాస భారతీయ విద్యార్థుల్లో ప్రతిభావంతులైన పేద కుటుంబాల వారికి ఉపకారవేతనాలు (ఫెలోషిప్‌) ఇస్తున్నారు. ప్రతీ మూడునెలలకు ఒకసారి ఇక్కడికి వచ్చి వసతి గృహాలను, ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి విద్యార్థులకు పాఠాలు చెబుతున్నారు.
**నా ఎదుగుదలకు వసతి గృహమే పునాదిగా నిలిచింది. మొదటి నుంచి వసతి గృహాల్లో చదువుకున్న వారి జాబితాను బయటికి తీస్తే ఎందరో ప్రతిభావంతులు వెలుగుచూస్తారు. పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులయ్యారు. విశ్వవిద్యాలయాలకు వీసీలుగా పనిచేస్తున్నారు. వసతిగృహాలను ప్రభుత్వం బలోపేతం చేయాలి. వాటి ద్వారా విద్యావ్యవస్థ మరింత పటిష్ఠమవుతుంది. నా జీతంలో అయిదు వేల డాలర్లను సేవా కార్యక్రమాలకు ఖర్చు చేస్తున్నాను. మాతృదేశానికి రావాలని నాకు ఎంతో తపన ఉంది. హాల్‌ తదితర సంస్థల్లో చేరేందుకు దరఖాస్తు చేసుకున్నా… చివరికి అమెరికానే సరైన గమ్యం అనిపించింది.
**ఎక్కడి నేను..ఎక్కడికి వచ్చాను!
ప్రపంచంలో మొదటి స్థానంలో ఉన్న వాషింగ్టన్‌ విశ్వవిద్యాలయంలో అధ్యాపకునిగా చేరిన మూడేళ్లకే 1985లో ఆయన అత్యంత ప్రతిభావంతుడైన ఉపాధ్యాయునిగా పురస్కారం పొందారు. 1986లో విశ్వవిద్యాలయంలోని టాప్‌ టెన్‌ ప్రొఫెసర్లలో ఒకరిగా గుర్తింపు పొందారు.1986లో ఏఎస్‌ఎం-ఐఐఎం అంతర్జాతీయ అధ్యాపక పురస్కారం 1987లో ఎస్‌ఏఈ రాల్ఫ్‌ విద్యాపురస్కారం ఆ తర్వాత దాదాపు వందకు పైగా పురస్కారాలు లభించాయి. అమెరికాలోని శ్వేత సౌధంలో జార్జి బుష్‌ నుంచి పురస్కారం అందుకుంటున్న తరుణంలో రాములు కనులు చెమ్మగిల్లాయి. ‘‘ఎక్కడి నేను ఎక్కడికి వచ్చాను’’ అంటూ ఆనందభాష్పాలను రాల్చారు.
**పరిశోధనల్లో మేటి
వైమానిక రంగంలో పరికరాలు, యంత్రాల రూపకల్పనలో రాములు కీలకపాత్ర పోషించారు. విమాన డిజైన్లు, విడిభాగాలను రూపొందించారు. ప్రసిద్ధ వైమానిక సంస్థ బోయింగ్‌ విమానాల డిజైన్లు, విడిభాగాలను తయారు చేశారు. దీంతో పాటు జీఈ సూపర్‌ అబ్రేసివ్స్‌, పక్కార్‌, టీఆర్‌డబ్ల్యూ, ఫ్లో ఇంటర్‌నేషనల్‌, క్వెస్ట్‌, ఎలక్ట్రో ఇంపాక్ట్‌, కియోసిరా, పసిఫిక్‌ నార్త్‌వెస్ట్‌ ల్యాబ్స్‌, మెక్‌డొనాల్డ్‌ డగ్లస్‌ కంపెనీల ఉత్పత్తుల రూపకల్పనలో పాల్గొన్నారు. దాదాపు 300కి పైగా పరిశోధన పత్రాలు ప్రచురితమయ్యాయి.
**కుటుంబం
భార్య వినతి గృహిణి. కుమారులు మనస్వి, మౌర్య ఇద్దరూ బోయింగ్‌ కంపెనీలో పనిచేస్తున్నారు. కూతురు సౌమ్య ప్రజారోగ్య రంగంలో పనిచేస్తున్నారు.

కేసీఆర్ ఇలాఖాలో ప్రవాసుల పర్యటన


ప్రపంచ తెలుగు మహాసభలకు హాజరైన వివిధ దేశాలకు చెందిన ప్రవాసులు ముఖ్యమంత్రి కేసీఆర్ కొరిక మేరకు బుధవారం నాడు ఆయన సొంత నియోజకవర్గమైన గజ్వేల్‌లో జరిగిన అభివృద్ధిని తిలకించారు. మిషన్ భగీరథ పథకం కింద గజ్వేల్ నుండి 14మండలాల్లోని 590 గ్రామాలకు వాటర్‌షెడ్ పథకం ద్వారా గోదావరి ద్వారా అందిస్తున్న మంచినీటి పథకాన్ని పరిశీలించారు. ఒకేచోట నుండి పెద్దేత్తున గ్రామాలకు నీటిని పైపులైన్ల ద్వారా పంపించడం విశేషమని అధికారులు వివరించారు. అనంతరం కేసీఆర్ దత్తత గ్రామమైన ఎర్రబెల్లి గ్రామానికి వెళ్లారు. అక్కడ విడివిడిగా నిర్మించిన 420 డబుల్ బెడ్ రూం ఇళ్లను, గ్రామం అంతటా నిర్మించిన సిమెంటు రహదారులను, భారీ కళ్యాణ మండపాన్ని ప్రవాసులు ఆసక్తిగా పర్యటించారు. దానికి సమీపంలోనే కేజీ నుండి పీజీ వరకు గ్రామీణ బాలికల కోసం ఏర్పాటు చేసిన ఎడ్యూకేషనల్ హబ్‌ను పరిశీలించారు. అనంతరం మంత్రి హరీష్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్ధిపేతను సందర్శించారు. హైదరాబాద్ హుస్సేన్‌సాగర్ తరహాలో తీర్చిదిద్దిన కోమటి చెరువును పరిశీలించారు. సిద్ధిపేట పరిసర ప్రాంతాల్లో నిర్మించిన డబుల్ బెడ్‌రూం గృహ సముదాయాన్ని మంత్రి హరీష్‌రావు దగ్గరుండి ప్రవాసులకు చూపించారు. సిద్ధిపేట జిల్లా కలెక్టర్ వెంకటరామిరెడ్డి, జాయింట్ కలెక్టరు పద్మాకర్ తదితర ఉన్నతాధికారుల బృందం ప్రవాసులకు ఆ ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధిని గురించి వివరించారు. తెలుగు మహాసభల ఎన్ఆర్ఐ కన్వీనర్ మహేష్ బిగాల తదితరుల ఆధ్వర్యంలో ఈ పర్యటన సాగింది. గురువారం ఉదయం ప్రవాసుల బృందం కాళేశ్వరంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను తిలకించడానికి బయల్దేరి వెళ్తోంది.


కెన్యా: పమిడిముక్కల ప్రవాసుడు-పాతికవేల ఉద్యోగాలు సృష్టించాడు

ప్రవాసాంధ్రుడు పమిడిముక్కల వెంకట సాంబశివరావుకు కెన్యాలో అరుదైన గౌరవం లభించింది. సాంబశివరావు అందిస్తున్న సేవలకు గానూ.. ఆ దేశ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక ‘ఎల్డర్‌ ఆఫ్‌ ది ఆర్డర్‌ ఆఫ్‌ ది గోల్డెన్‌ హార్ట్‌’ పురస్కారంతో సత్కరించింది. గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండలం వెల్లటూరుకు చెందిన సాంబశివరావు 1981లో ఎంబీఏ చదివేందుకు కెన్యా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. తోలు పరిశ్రమలు ఏర్పాటు చేసి 25 వేల మందికి ఉపాధి కల్పించారు. లయన్స్‌ క్లబ్‌ సారథిగా, కెన్యా లెదర్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ బోర్డు డైరెక్టర్‌గా, టానర్స్‌ అసోసియేషన్‌ ఛైర్మన్‌గా, కెన్యా విజన్‌-2030 ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ సభ్యునిగా.. విద్య, పరిశ్రమలు, ఇతర రంగాల్లో చేసిన కృషికి గుర్తింపుగా అక్కడి ప్రభుత్వం ఈ పురస్కారం అందజేసిందని సాంబశివరావు తెలిపారు.

దేశం దాటి వెళ్లిపోయే వారిలో భారత్ అగ్రస్థానం

విదేశాల్లో నివసిస్తున్న వలసదారుల జాబితాల్లో భారత్‌ అగ్రస్థానంలో ఉంది. దాదాపు 17 మిలియన్ల మంది భారతీయులు విదేశాల్లో నివసిస్తున్నారు. ఒక్క గల్ఫ్‌ దేశంలోనే 5 మిలియన్ల మంది భారతీయులు నివసిస్తున్నట్లు ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. 2017 ఇంటర్నేషనల్‌ మైగ్రేషన్‌ పేరిట ఓ నివేదికను యూఎన్‌ మంగళవారం విడుదల చేసింది. తర్వాతి స్థానాల్లో మెక్సికో, రష్యా, చైనా, బంగ్లాదేశ్‌, సిరియా, పాకిస్థాన్‌, ఉక్రెయిన్‌ దేశాలు ఉన్నాయి. ఒక్కో దేశం నుంచి సుమారు 6 నుంచి 11 మిలియన్ల మంది విదేశాల్లో ఉంటున్నారు.2017 నివేదిక ప్రకారం.. 17 మిలియన్ల మంది భారతీయ వలసదారులు విదేశాల్లో ఉంటున్నారు. మెక్సికో 13 మిలియన్ల మంది వలసదారులతో రెండో స్థానంలో నిలిచింది. రష్యా 11 మిలియన్లు, చైనా 10 మిలియన్లు, బంగ్లాదేశ్‌ 7 మిలియన్లు, సిరియా 7మిలియన్లు, పాకిస్థాన్‌, ఉక్రెయిన్‌ నుంచి 6 మిలియన్ల మంది విదేశాల్లోనే ఉంటున్నారు. భారతీయ వలసదారులు యూఏఈలో 3 మిలియన్ల మంది ఉండగా.. అమెరికా, సౌదీఅరేబియాలో 2 మిలియన్ల మంది ఉన్నారు.2000 సంవత్సరంతో పోల్చుకుంటే ఈ ఏడాది స్వదేశాల్లో కాకుండా విదేశాల్లో ఉంటున్న వారి సంఖ్య 49శాతం పెరిగింది. దాదాపు 258 మిలియన్ల మంది తమ దేశాల్లో కాకుండా ఇతర దేశాల్లో జీవనం సాగిస్తున్నారు. కొన్ని దేశాల్లో అంతర్జాతీయ వలసలు జనాభా వృద్ధి పెరుగుదలకు దోహదపడుతుంటే.. మరికొన్ని దేశాల్లో మాత్రం జనాభా తిరోగమనానికి కారణమవుతున్నారట.