అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో జులై 4 నుంచి 3 రోజుల పాటు తానా మహాసభలు నిర్వహించనున్నట్లు ఆ సంఘం అధ్యక్షుడు సతీష్ వేమన తెలిపారు. సోమవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన ఆలయం ఎదుట విలేకరులతో మాట్లాడారు. తానా వేడుకలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పాటు ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఆహ్వానించినట్లు చెప్పారు. తెదేపా ఘన విజయం సాధించి చంద్రబాబు తిరిగి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారనే నమ్మకంతో ఆహ్వాన ఏర్పాట్లు చేసినట్లు వివరించారు.
Category: తానా విశేషాలు
తానా 22వ సభల వెబ్ సైట్ ఆవిష్కరణ
జూలై 4 నుంచి 6వ తేదీ వరకు వాషింగ్టన్ డీసిలో నిర్వహించే తానా 22వ మహాసభల వెబ్‌సైట్‌ను మిల్‌పిటాస్‌లోని స్వాగత్ రెస్టారెంట్‌లో తానా మాజీ అధ్యక్షులు జయరామ్ కోమటి, గంగాధర్ నాదెళ్ళలు ఆవిష్కరించారు. తానా అధ్యక్షుడు వేమన సతీష్ సభల కన్వీనర్ కొడాలి నరేన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సతీష్ మాట్లాడుతూ డీసీలో తానా సభలు 2007 తర్వాత 12 సంవత్సరాలకు మరలా ఆతిథ్యం ఇస్తోందని అన్నారు. 22వ మహాసభలను ఘనంగా నిర్వహిస్తామని, మరిన్ని వివరాలకు www.TANA2019.orgను చూడవల్సిందిగా ఆయన కోరారు.
తానా లోగో విడుదల. నిధుల సేకరణకు సన్నద్ధం.
తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) జులై 4 నుంచి 6 వరకు నిర్వహించే 22వ మహాసభల లోగోను వాషింగ్టన్ డీసీలో సోమవారం ఆవిష్కరించారు. తానా అధ్యక్షుడు సతీష్ వేమన, మహాసభల కన్వీనర్ డాక్టర్ రావు మూల్పూరి, ఛైర్మన్ నరేన్ కొడాలి పాల్గొన్నారు. సభలకు ముందు వివిధ నగరాల్లో సాంస్కృతిక పోటీలు, విరాళాల సేకరణ నిర్వహించనున్నట్లు సతీష్ వేమన తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉన్న తెలుగు కవులు, కళాకారులు, మేధావులు మహాసభలకు హాజరవుతారని పేర్కొన్నారు.
తెలుగు సంఘాల్లో మహిళల ప్రాధాన్యత ఏది?–TNI మహిళా దినోత్సవ ప్రత్యేకం
ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి పురుషులతో సమానంగా మహిళలు కూడా అమెరికా లాంటి ఇతర దేశాలకు వెళ్లి వారితో పోటీగా విద్యా, ఉద్యోగాల్లో వారితో సమానంగా రాణిస్తున్నారు. కానీ పెద్ద పెద్ద తెలుగు సంఘాల్లో మాత్రం మహిళల క్రీయాశీలక పాత్ర నామమాత్రంగానే ఉంటుంది. తానా, నాట్స్, ఆటా, నాటా వంటి తెలుగు సంస్థల కార్యవర్గ పదవుల్లో మహిళల పాత్ర మొక్కుబడిగానే ఉంటోంది. ఇటీవల అమెరికాలో పెద్ద తెలుగు సంఘంగా గుర్తింపు పొందిన తానా కార్యవర్గానికి ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగాయి. నలభై స్థానాలకు ఎన్నికలు జరగ్గా ఒక్క దేవినేని లక్ష్మీ మాత్రమే కీలకమైన పదవికి ఎన్నికయ్యారు. మహిళా కన్వీనర్ పదవికి మహిళే ఉండాలి కనుక ఆ పదవిని అదృష్టవశాత్తు మహిళలకే దయతలిచి వదిలేశారు. మిగిలిన అన్ని పదవులకు మగ మహారాజులే ఎన్నికయ్యారు. కొద్ది సంవత్సరాల క్రితమే ఆవిర్భవించిన టాటా లాంటి తెలుగు సంస్థకు ఒక మహిళ అధ్యక్షురాలిగా ఎన్నికైనప్పటికి ఆవిడ ఆ పదవి నుండి అర్ధాంతరంగా తప్పుకోవాల్సి వచ్చింది. ఇప్పటికైనా తెలుగు సంఘాల వారు మహిళలకు కార్యవర్గ పదవుల్లో ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చి వారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది.
ఏకగ్రీవంగా ఎన్నికైన తానా కార్యవర్గం ఇదే.
చాలా కాలం తరువాత అమెరికాలో ప్రముఖ తెలుగు సంస్థ తానాకు నూతనంగా కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. తానా కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నిక కావడానికి సహకరించిన తానా సభ్యులకు, పోటీ నుండి తప్పుకున్న సభ్యులకు సంఘం అద్యక్షుడు వేమన సతీష్, తదుపరి అద్యక్షుడు తాళ్ళూరి జయశేఖర్ కృతజ్ఞతలు తెలిపారు. తానా నూతన కార్యవర్గం వీరే.
#######################################
Directors – Non-Donor 4 years yerm (3 Positions)
Hanumaiah Bandla
Murali Vennam
Srinivasa Lavu
Director – Donor
Chowdary Jampala
Executive Vice President Anjaiah Chowdary Lavu
Secretary Ravi Potluri
Treasurer Sateesh Vemuri
Joint Secretary Ashok Babu Kolla
Joint Treasurer Venkat Koganti
Cultural Service Coordinator Sunil Pantra
Women Services Coordinator Sirisha Tunuguntla
Councilor – At large Vinay Kumar Maddineni
International Coordinator Laxmi Devineni
Sports Coordinator Lokesh Konidala
Regional Coordinator – New England Koteswara Rao Kandukuri
Regional Coordinator – New York Sumanth Ramsetti
Regional Coordinator – New Jersey Venkata (Raja) Kasukurthi
Regional Coordinator – Mid Atlantic Satish Chundru
Regional Coordinator – Capital Anil C. Uppalapati
Regional Coordinator – Appalachian Suresh Babu Kakarkla
Regional Coordinator – Southeast Kiran Gogeneni
Regional Coordinator – North Kiran Duggirala
Regional Coordinator – Ohio Valley Srinivasa R. Yalavarthi
Regional Coordinator – Midwest Vijaya Krishna Mohan Chilmakur
Regional Coordinator – South Central Sridhar Talluri
Regional Coordinator – DFW Sambaiah Dodda
Regional Coordinator – Southwest Murali Talluri
Regional Coordinator – North Central Saivinodh Thotakura
Regional Coordinator – Southern California Suresh C. Kandepu
Regional Coordinator – Northern California Rajanikanth Kakarla
Regional Coordinator – North West Devendra Rao Lavu
Regional Coordinator – Rocky Mountains Naveen Kalagara
Foundation Trustee 4 years term (5 positions)
Bhakta Balla
Ravi Samineni
Srinivas Chand Gorrepati
Venkata R. Yarlagadda
Viswanatha Nayunipati
Foundation Trustee 2 years టర్మ్
Rao Yalamanchili
Foundation Donor Trustee 4 years term (2 positions)
Ramakanth Koya
Suresh Puttagunta
తానాకు లక్ష డాలర్లు మిగులు
* సూరపనేని రాజా ఆలోచనకు అభినందనలు
ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా)కు 2019 ఎన్నికలు బాగా కలిసొచ్చాయి. అన్నీ పదవులకు ఏకగ్రీవంగా ఎన్నిక జరగ్గా ఫౌండేషన్ ట్రస్టీ పదవికి పోటీ ఏర్పడే పరిస్థితి నెలకొంది. 5పదవులకు గానూ ఆరుగురు సభ్యులు పోటీలో నిలిచారు. ఆఖరి నిముషంలో తానా పెద్దల సలహా మేరకు బరిలో ఉన్న అభ్యర్థి సూరపనేని రాజా తాను తప్పుకుంటున్నట్లు ప్రకటించి ఈ సారి ఎన్నికల్లో బ్యాలెట్ల అవసరాన్ని ఎత్తిపారేశారు. 35వేల మంది జీవిత సభ్యులు ఉన్న తానాలో ఎన్నికలంటే అదో పెద్ద జాతర. ఒక్కొక్క బ్యాలెట్‌కు $2 ఖర్చు వేసుకుంటే సుమారు $70వేలు తానా నిధుల నుండి ఖర్చు చేయవల్సి ఉంటుంది. ఇతరత్రా ఖర్చులు కూడా కలుపుకుంటే అది లక్ష డాలర్లకు చేరువ అవుతుంది. ఆయన తీసుకున్న ఈ నిర్ణయం వలన తానాకు ఆ లక్ష డాలర్లు మిగిలినందున సూరపనేని ఆలోచనకు తానా అధ్యక్షుడు వేమన సతీష్, కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్ ఇతర కార్యవర్గ సభ్యులు అభినందనలు తెలిపారు.
ఒహాయోలో తానా బ్యాడ్మింటన్ పోటీలు
తానా నామినేషన్లు విడుదల – పందెం కోళ్లు వీరే!
తానా 2019 ఎన్నికల సందడి మొదలైంది. శనివారం నాడు ఈ ఏడాది జరిగే ఎన్నికల్లో బరిలో నిలిచిన అభ్యర్థులను విడుదల చేశారు. బరిలో ఉన్న అభ్యర్థుల వివరాలు ఈ దిగువ చూడవచ్చు. ఇప్పటికే పలువురు అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహించుకుంటూ సభ్యులను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.
తానా ఫౌండేషన్ ట్రస్టీ బరిలో సూరపనేని
అమెరికాలోని సెయింట్ లూయిస్‌లో నివసిస్తున్న కృష్ణా జిల్లా విజయవాడకు చెందిన ప్రవాసాంధ్రుడు సూరపనేని రాజా ఉత్తర అమెరికా తెలుగు సంఘంకు(తానా) గత 15ఏళ్లుగా వివిధ హోదాల్లో విశేషమైన సేవలందిస్తున్నారు. 2003 నుండి ఇప్పటి వరకు జరిగిన ప్రతి తానా మహాసభల్లో కీలకమైన ఎన్నో విభాగాలకు ఆయన ప్రాతినిధ్యం వహించారు. 2019-23 కాలానికి గానూ ఆయన తానా సేవా విభాగమైన ఫౌండేషన్‌లో ట్రస్టీ పదవికి పోటీపడుతున్నారు. 2015-17 కాలానికి సౌత్ సెంట్రల్ విభాగ ప్రాంతీయ ప్రతినిధిగా, 2009-11 మధ్య తానా పత్రికా ప్రకటనల విభాగ అధ్యక్షుడిగా, 2017-19 మధ్య తానా కార్యక్రమాల నిర్వహణ కమిటీ అధ్యక్షుడిగా ఆయన విజయవంతంగా సేవలందించారు. ప్రతి రెండేళ్లకొకసారి ఇరు తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించే చైతన్య స్రవంతి కార్యక్రమాల ద్వారా సేవా కార్యక్రమాల నిర్వహణకు సైతం రాజా తన దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. గత డిసెంబరులో నిర్వహించిన చైతన్య స్రవంతి కార్యక్రమంలో ఆయన కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులో “తానా రైతు కోసం” కార్యక్రమానికి దాతగా వ్యవహరించడమే గాక స్థానిక రైతులకు 500కు పైగా వ్యవసాయ పరికరాలను పంపిణీ చేశారు. గత 20ఏళ్లుగా తనకు తానాతో మంచి అనుబంధం ఉందని, కోమటి జయరాం, నాదెళ్ల గంగాధర్, వేమన సతీష్, తాళ్లూరి జయశేఖర్, డా.జంపాల చౌదరి వంటి పెద్దల సలహాలు, సూచనలతో తాను ఈ పదవికి పోటీ చేస్తున్నట్లు వివరించారు. తానా ఫౌండేషన్ ద్వారా ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంస్థ సేవా దృక్పథాన్ని సామాన్యులకు దగ్గర చేసేందుకు కృషి చేస్తానని ఆయన వెల్లడించారు. తానా సభ్యులు తమ విలువైన ఓటుతో తనను గెలిపించవల్సిందిగా సూరపనేని రాజా కోరారు
తానా ఫౌండేషన్ ట్రస్టీ బరిలో యార్లగడ్డ వెంకటరమణ
గుంటూరు జిల్లా రేపల్లె మండలం వెనిగళ్లవారిపాలెంకు చెందిన ప్రవాసాంధ్రుడు యార్లగడ్డ వెంకటరమణ 2019 తానా ఎన్నికల్లో ఫౌండేషన్ ట్రస్టీగా బరిలో ఉంటున్నారు. గత దశాబ్ద కాలంగా తానా జీవిత కాల సభ్యుడిగా ఉన్న ఆయన 2007-09 మధ్య మిడ్‌వెస్ట్ ప్రాంతీయ ప్రతినిధిగా, 2009-11 మధ్య ఫౌండేషన్ కార్యదర్శిగా, 2011-13 మధ్య ఫౌండేషన్ ట్రస్టీగా పలు పదవుల్లో తానాకు సేవలందించారు. ఈ ఏడాది జరిగే ఎన్నికల్లో తానా ఫౌండేషన్ ట్రస్టీగా తన అభ్యర్థిత్వాన్ని బలపరచవల్సిందిగా ఆయన ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.
తానా తదుపరి అధ్యక్షుడిగా లావు అంజయ్య చౌదరి?–TNI ప్రత్యేకం
అమెరికాలో అతిపెద్ద జాతీయ స్థాయి తెలుగు సంఘం “తానా” ఎన్నికల్లో మొదటి ఘట్టం పూర్తయింది. నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. తానా పెద్దలు కోరుకున్న విధంగా ప్రస్తుత కార్యదర్శి, అట్లాంటాకు చెందిన లావు అంజయ్య చౌదరి అధ్యక్ష పదవికి ఎన్నికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈసారి ఎన్నికలు ఏకగ్రీవంగా అయినట్లే కనిపిస్తున్నప్పటికీ పలు సంచలనాలతో ఎన్నికల ఘట్టం ముగిసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దాదాపు ప్రధాన పదవులకు ఏకగ్రీవంగా ఎన్నికలు జరుగుతున్నప్పటికీ తానా ఫౌండేషన్ సభ్యుల పదవులకు మాత్రం ఎన్నిక జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మొత్తం అయిదు పదవులకు 8మంది నామినేషన్లు దాఖలు చేసినట్లు సమాచారం. తానా కార్యదర్శిగా పొట్లూరి రవి కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
*** “తానా” ప్రముఖులు తప్పుకుంటున్నారు.
తానా అధ్యక్ష పదవికి పోటీ చేస్తామని తొలుత ప్రకటించిన తానా ఫౌండేషన్ మాజీ అధయ్కుడు, డెట్రాయిట్‌కు చెందిన గోగినేని శ్రీనివాస తానాలో నుంచి తాను పక్కకు తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ప్రస్తుత పరిస్థితుల్లో తాను తానాలో ఇమడలేకపోతున్నట్లు గోగినేని తెలిపారు. అధ్యక్ష పదవికి తాను పోటీలో ఉంటున్నట్లు సీనియర్ నాయకుడు, తానా ఫౌండేషన్ చైర్మన్ డా.నల్లూరి ప్రసాద్ ప్రస్తుత పరిణామాల పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తానా ఫౌండేషన్ చైర్మన్ పదవి నుండి తానూ తప్పుకుంటున్నట్లు తానా కార్యవర్గానికి నల్లూరి ప్రసాద్ లేఖ రాసినట్లు సమాచారం. అయితే తానా కార్యవర్గం ప్రసాద్ రాజీనామాను ఆమోదించలేదని సమాచారం. మొత్తం మీద తానా ఎన్నికల ఘట్టం ప్రశాంతంగానే ముగుస్తున్నప్పటికి సీనియర్లలో ఉన్న అసంతృప్తిని తొలగించడంలో ప్రస్తుత తానా కార్యవర్గం ఎలా వ్యవహరిస్తుందో వేచి చూడవలసి ఉంది. —కిలారు ముద్దుకృష్ణ, సీనియర్ జర్నలిస్టు.
తానా ఎన్నికల్లో పోటీ చేయను–డా.నల్లూరి
ప్రస్తుతం తానా కార్యవర్గానికి నిర్వహిస్తున్న ఎన్నికలను ఏకగ్రీవం చేయడానికి తానా అద్యక్షుడు వేమన సతీష్ తదుపరి అద్యక్షుడు తాళ్ళూరి జయశేఖర్ లు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నట్లే కనిపిస్తున్నాయి. గతంలో తానా అద్యక్ష పదవికి తాను పోటీలో ఉంటున్నట్లు ప్రముఖ వైద్యుడు, తానా పౌండేషన్ చైర్మన్ డా.నల్లూరి ప్రసాద్ ప్రకటించారు. అయితే స్వతంత్రంగా ఉంటూ, ముక్కుసూటిగా వ్యవహరించే డా.నల్లూరికి తానా నేతల నుండి మద్దతు లభించలేదని సమాచారం. దీంతో డా. నల్లూరి తానా ఎన్నికల రంగం నుండి తప్పుకుంటున్నానని, అద్యక్ష పదవికి తాను పోటీలో ఉండటంలేదని ఒక ప్రకటన విడుదల చేశారు.
తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సీపీఆర్ శిబిరాలు
ఉత్తర అమెరికా తెలుగు అసోసియేషన్ (తానా) అనుబంధంగా ఉన్న పౌండేషన్ ఆద్వర్యంలో ఆంధ్ర రాష్ట్రంలోని వివిధ ఉన్నత పాటశాలల్లో సీపీఆర్ శిభిరాలను నిర్వహిస్తున్నారు. పౌండేషన్ అద్యక్షుడు డా.నల్లూరి ప్రసాద్ సారద్యంలో గుండెపోటు వచ్చిన వెంటనే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, గుండెపోటు రాకుండా తీసుకోవాల్సిన చర్యల గురించి ఈ శిభిరాలలో విద్యార్ధులకు శిక్షణ ఇస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఎర్రగుంటపల్లి, మాచినవారిపాలెం, మర్రిగూడెం, ప్రగడవరం, ఎర్రంపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్లలో విద్యార్ధులకు గుండె జబ్బులపై అవగాహన కల్పించారు.
డీసీలో సమావేశమైన భారత దౌత్య అధికారులు
ప్రస్తుతం అమెరికాలో నెలకొని ఉన్న తెలుగు విద్యార్ధుల సమస్యల పై చర్చించడం కోసం భారత దేశానికి చెందిన ఉన్నత స్థాయి దౌత్య అధికారుల బృందం వాషింగ్టన్ డీసీలో సమావేశమయ్యారు. అమెరికాలో భారత రాయబారి హరీష్ సింగ్ల, న్యూయార్క్, హ్యుస్టన్, అట్లాంటా, శాన్ ఫ్రాన్సిస్కో, కాన్సులేట్ జనరల్ లు సందీప్ చక్రవర్తి, డా.అనుపమ రాయ్, నీతా భూషణ్, డా.స్వాతి కులకర్ణి, సంజయ్ పాండాలు ఈ సమావేశానికి హాజరయ్యారు. తెలుగు విద్యార్ధులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను, వారిని వివిధ కేసుల నుండి బయట పడేసే విధానాల పైనా ఈ సమావేశంలో చర్చించారు. తానా బృందం భారత దౌత్య అధికారులను కలుసుకుంది. తెలుగు విద్యార్ధులను తక్షణమే ఆదుకోవాలని వారికి తగిన సహాయ సహకారాలు అందించడానికి తాము సిద్దంగా ఉన్నామని తానా బృందం వారికి తెలిపింది. దౌత్య అధికారులను కలిసిన తానా బృందంలో జై తాళ్ళూరి, కొల్లా అశోక్, హరీష్ కోయ తదితరులు ఉన్నారు.
మన తెలుగు విద్యార్ధుల తప్పేమీ లేదు–తాళ్లూరి జయశేఖర్
‘అమెరికాలో ఇమిగ్రేషన్, భద్రతా విభాగాలు అరెస్టు చేసిన విద్యార్థులు నేరస్థులు కాదని అధికారులతో గట్టిగా చర్చిస్తున్నాం. సీపీటీ ఇచ్చారు కాబట్టే, వారు తాత్కాలిక ఉద్యోగాలు చేస్తున్నారని, ఇవ్వకుంటే చేయరు కదా.. అని వాదిస్తున్నాం’ అని ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా)కు కాబోయే అధ్యక్షుడు జయ్ తాళ్లూరి అన్నారు. తమ వద్ద ఉన్న జాబితా ప్రకారం 130 మంది పోలీసుల అదుపులో ఉన్నారన్నారు. అమెరికాలో 28 రాష్ట్రాల్లో విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారని, అన్నిచోట్లా న్యాయవాదులను నియమించాల్సి రావడం సమస్యగా పరిణమిస్తోందని జయ్ అన్నారు. అయినా, తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, దీనిపై అన్ని తెలుగు సంఘాలతో కలిసి సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నామని చెప్పారు.
*తల్లిదండ్రుల ఆర్థిక చేయూత అవసరం
అమెరికాలోని వర్సిటీల్లో రుసుములు ఎక్కువ ఉండటంతో తల్లిదండ్రులపై భారం పడకూడదని విద్యార్థులు వర్సిటీల్లో చేరిన నాటి నుంచే సంపాదన వైపు దృష్టి సారిస్తున్నారు. సంపాదించాలనే తపనతో నిబంధనలను ఉల్లంఘిస్తే అసలుకే ఎసరు వస్తుంది. అమెరికాలో స్థిరపడాలనే కలలు కల్లలవుతాయి. అమెరికాలో ప్రవేశం తర్వాత పిల్లలు ఫీజులకు డబ్బులు అడగకుంటే అక్కడ ఏం చేస్తున్నారనేదీ తల్లిదండ్రులే ఆరా తీయాలి. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించొద్దని చెప్పాలి. కొంతకాలమైనా వారికి ఆర్థికంగా అండగా నిలవాలి.
*వీసా మార్పు మనవాళ్లకు ప్రయోజనమే
వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2020 అక్టోబరు 1 నుంచి ప్రారంభం) హెచ్1బీ వీసాల జారీలో మార్పులు చేస్తుండటం మంచిదే. దానివల్ల అమెరికాలో చదివిన విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుంది. ఇప్పటివరకు 65 వేల సాధారణ హెచ్1బీ వీసాలను విదేశీ ఉద్యోగులకు, 20 వేల వీసాలను ప్రత్యేకంగా అమెరికాలో చదివిన విదేశీ విద్యార్థులకు కేటాయిస్తున్నారు. ఇక నుంచి 65 వేలలో కూడా విద్యార్థుల దరఖాస్తులకు ప్రాధాన్యం ఇవ్వనుండటం వల్ల అదనంగా 16% (5,340 మంది) విదేశీ విద్యార్థులకు దక్కుతాయి. హెచ్1బీ వీసాల్లో గరిష్ఠ వాటా భారతీయ విద్యార్థులకే అందుతుంది. రానున్న ఏప్రిల్ 1 నుంచి వీసాలకు దరఖాస్తులు స్వీకరిస్తారు. అందువల్ల అమెరికా చదువుకు వచ్చే విద్యార్థుల సంఖ్య తగ్గుతుందని అనుకోవడం లేదు.
ఫార్మింగ్టన్ విద్యార్థులను ఆదుకుంటాం-తానాకు వెంకయ్య భరోసా
అమెరికాలో డిట్రాయిట్ లో ఫార్మింగ్టన్ యూనివర్సిటీ కేసులో అరెస్టయిన విద్యార్థులకు భారత ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని తానా బృందానికి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హామీ ఇచ్చారు. అరెస్టయిన విద్యార్థులకు సాయం చేసేందుకు భారతప్రభుత్వం తరపున తీసుకోవాల్సిన చర్యల గురించి తానా అధ్యక్షుడు సతీష్ వేమన ఆధ్వర్యంలో తానా బృందం ఉపరాష్ట్రపతికి వినతిపత్రం సమర్పించారు. అమెరికా అధికారుల అదుపులో ఉన్న విద్యార్థులని మానవీయకోణంలో అలోచించి వెంటనే విడుదల చేయుంచి ఇతర యూనివర్సిటీలలో జాయిన్ చేసుకునేవిధంగా అమెరికా అధికారులతో చర్చించి భారతప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందిగా సతీష్ వేమన ఉపరాష్ట్రపతిని కోరారు.
ఫార్మింగ్టన్ విద్యార్థులను ఆదుకోవాలని కాంగ్రెస్ సభ్యులను కలిసిన తెలుగు సంఘాల ప్రతినిధులు
అమెరికాలోని డెట్రాయిట్ లో తెలుగు విద్యార్ధుల అరెస్టులపై అమెరికాలోని తెలుగు సంఘాలు న్యూయార్క్ లో సమావేశమయ్యాయి. నాట్స్, తానా, ఆటా, నాటా, టాటా, టీఎల్ సీఏ సంఘాలు తెలుగు విద్యార్ధులకు అన్ని విధాల సాయం అందించేందుకు చేపట్టాల్సిన కార్యచరణపై చర్చించాయి. తొలిసారిగా తెలుగు సంఘాలన్నీ ఏకతాటిపైకి వచ్చి విద్యార్థులను విడిపించేందుకు చేయాల్సిన ప్రయత్నాలపై చర్చలు జరిపాయి. ముందుగా అందరూ కాంగ్రెస్ మెన్ థామస్ సుజీ ని కలిసి తెలుగు విద్యార్ధులను మానవతా దృక్ఫధంతో విడుదల చేయాలని కోరాయి. అవగాహన లేకపోవడంతోనే విద్యార్ధులు ఫార్మింగ్ టన్ యూనివర్సీటీ వలలో చిక్కుకున్నారని తెలిపాయి. తక్షణమే వారిని విడిపించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతి పత్రం ఇచ్చాయి. దీనిపై అటు కాంగ్రెస్ మెన్ థామస్ కూడా సానుకూలంగా స్పందించారు. భారత రాయబార కార్యాలయం అధికారులతో కూడా ఆయన మాట్లాడారు. తెలుగు అటార్నీలు ప్రశాంతి రెడ్డి, జొన్నలగొడ్డలతో కూడా ఈ విషయంలో ఎలా ముందుకెళ్లాలనే దానిపై చర్చించారు. అన్ని సంఘాలు ఇప్పటికే అక్కడ తెలుగు విద్యార్ధులకు మేమున్నామని ధైర్యం చెబుతున్నాయి. రాయబార కార్యాలయంతో పాటు అటార్నీలతో చర్చలు జరిపి వీలైనంత తర్వగా వారిని విడిపించే ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. నాట్స్ నుంచి డాక్టర్ మధు కొర్రపాటి, తానా నుంచి జై తాళ్లూరి, నాటా నుంచి స్టాన్లీ రెడ్డి, టాటా నుంచి పైళ్ల మల్లారెడ్డి, ఆటా నుంచి రాజేందర్ జిన్నా, టీఎల్ సీఏ నుంచి పూర్ణ అట్లూరి, వెంకటేష్ ముత్యాల, లాంగ్ ఐస్ ల్యాండ్ డెమోక్రటిక్ పార్టీ నాయకులు శేఖర్ నేలనూతల తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
Voice raised unitedly by all Telugu associations and seek political help in releasing Telugu Students.
Leaders of NATS, TANA, ATA, NATA, TATA and TLCA went and met congressman Thomas Suozzi and presented a memorandum and requested to help in releasing the student victims of Farmington University that were arrested in the last few days. Congressman reacted very positively and assured to help in this situation. He spoke to Indian Consulate immediately and also attorneys Prashanthi Reddy and Srinivas Jonnalagadda. All the associations are closely working with the students, consulate and attorneys to help them get released as soon as possible.
Attended are
Dr Madhu Korrapati, NATS
Mr Jay Talluri, TANA
Dr Stanley Reddy, NATA
Dr Rajender Jinna, ATA
Dr Pailla Malla Reddy, NATA
Dr Purna Atluri, TLCA Chairman
Mr Venkatesh Mutyala, TLCA
And Shekar Nelanuthala, Long Island Democratic Party Leader
ఈసారి తానా అధ్యక్షుడు ఎవరబ్బా?–TNI ప్రత్యేకం
ప్రపంచంలోనే పెద్ద తెలుగు సంఘంగా గుర్తింపు పొందిన తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) లో ఎన్నికల సందడి మొదలైంది. గత రెండు పర్యాయాల ఎన్నికల్లో హోరాహోరిగా పోరు జరిగింది. ఈ పర్యాయం కూడా తానా ఎన్నికలపై అమెరికాలో నివసిస్తున్న తెలుగువారి దృష్టి కేంద్రీకృతమై ఉంది. గత ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ పర్యాయం పోటీ లేకుండా అధ్యక్షుడితో పాటు మిగిలిన పదవులను ఏకగ్రీవం చేయడానికి ప్రస్తుత అధ్యక్షుడు వేమన సతీష్‌తో పాటు కొంతమంది పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ కొంతమంది వ్యక్తులకు ఈ వ్యవహారం నచ్చడం లేదు. ఎన్నికలు జరిగితే తాము తెర వెనుక ఉండి కీలక పాత్ర పోషించవచ్చని భావిస్తున్న కొందరు ఎన్నికలు జరగాలనే కోరుకుంటున్నారు. రెండు నెలల క్రితమే తానా అధ్యక్ష పదవికి తాను పోటీలో ఉంటున్నట్లు డెట్రాయిట్‌కు చెందిన గోగినేని శ్రీనివాస బహిరంగంగానే ప్రకటించారు. గత ఎన్నికల్లోనూ గోగినేని అధ్యక్ష పదవికీ పోటీ చేశారు. ఈ పర్యాయం ఆయన్ను పోటీ నుండి తప్పించడానికి వేమన సతీష్ తదితరులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించినట్లే కనిపిస్తున్నాయి. ఆయనను ఈ ఎన్నికల్లో బోర్డులోకి తీసుకుంటామని….వచ్చే ఎన్నికల్లో అధ్యక్ష పదవిని ఇస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. దీంతో గోగినేని వెనక్కు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి.
***నల్లూరి ప్రసాద్‌ను రానిస్తారా?
ప్రస్తుతం తానా ఫౌండేషన్ చైర్మన్‌గా ఉన్న డా.నల్లూరి ప్రసాద్‌కు తానాతో సుదీర్ఘ కాలం నుండి అనుబంధం ఉంది. తాను అధ్యక్ష పదవికి రంగంలో ఉంటున్నట్లు డా. నల్లూరి ఇప్పటికే ప్రకటించారు. నల్లూరి ముక్కుసూటిగా ఉంటారు. స్వతంత్రంగా వ్యవహరించే వ్యక్తి. పెద్దమనిషిగా పేరుంది. డా.నల్లూరి ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో వేచి చూడాల్సి ఉంది. కొందరు వృద్ధ నేతలు తానాపై తమ పట్టుసాగాలని, తాము చెప్పినవారే కార్యవర్గంలో ఉండాలని పట్టుదలగా ఉన్నారు. గతంలో వీరి వ్యవహారశైలిపై నిరసనలు వ్యక్తమయ్యే సరికి వీరు మాత్రం తెరవెనుక ఉండి తానాను తమ గుప్పిట్లోనే పెట్టుకున్నారు. వీరు పక్కకు తప్పుకుని ఎన్నికలు ఏకగ్రీవం కావడానికి సహకరిస్తే మంచిది.
*** అంజయ్య చౌదరికే అవకాశాలు?
ప్రస్తుతం తానా కార్యదర్శిగా ఉన్న లావు అంజయ్య చౌదరి వివాదరహితుడిగా పేరుపొందారు. తానా అధ్యక్షుడిగా ఎన్నిక కావడానికి అంజయ్య చౌదరి గత రెండు సంవత్సరాల నుండి చాపకింద నీరులాగా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అంజయ్య చౌదరికి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి. తెరవెనుక ఉండే పెద్దలు కూడా అంజయ్య చౌదరి అయితే తమ మాట చెల్లుబాటు అవుతుందనే అభిప్రాయంతో ఉన్నట్లు సమాచారం.
*** వేమన సతీష్, జయశేఖర్ తాళ్ళూరి చేతుల్లోనే…
ప్రస్తుత తానా అధ్యక్షుడు వేమన సతీష్, తదుపరి అధ్యక్షుడు జయశేఖర్ తాళ్ళూరి ఎంపిక చేసిన వారే అధ్యక్ష పదవితో పాటు ఇతర కార్యవర్గ పదవులకు ఎంపిక అవుతారనేది బహిరంగ రహస్యం. ప్రస్తుతం తానాలో ఉన్న సభ్యుల్లో 60శాతానికి పైగా వీరిరువురు గతంలో ఓటర్లుగా చేర్పించినవారే. వీరిరువురు ఒకే మాటమీద నిలబడి తానా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సమర్థులైన వారిని ఎన్నుకుంటే, మంచి పేరు, ప్రఖ్యాతులు ఉన్న తానా సంస్థ మరో పదికాలాల పాటు సమర్థవంతమైన తెలుగు సంస్థగా నిలబడగలుగుతుంది. ఏకగ్రీవం దిశగా తానా కార్యవర్గం ఎన్నిక కావాలని తానా సభ్యులతో పాటు అమెరికాలో నివసిస్తున్న తెలుగు వారు కూడా గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని బలంగా కోరుకుంటున్నారు. —కిలారు ముద్దుకృష్ణ, సీనియర్ జర్నలిస్టు.
తానా 2019 ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది
వేమన సతీష్‌కు ఎమ్మెల్సీ హామీ ఇచ్చిన చంద్రబాబు
ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) అధ్యక్షుడు వేమన సతీష్‌కు ఈసారి కూడా నిరాశే కలిగింది. కడప జిల్లా రాజంపేట తెదేపా అసెంబ్లీ స్థానాన్ని ఆశించిన వేమన సతీష్‌ను చంద్రబాబు నిరాశపరిచారు. చెంగలరాయుడుకు తెదేపా అసెంబ్లీ సీటును దాదాపుగా ఖరారు చేశారు. భవిష్యత్తులో వేమన సతీష్‌కు మంచి పదవినిస్తామని ఆయన భవిష్యత్తుకు భరోసా తనదేనని చంద్రబాబు సతీష్ భుజం తట్టి తెలిపారు. సతీష్‌కు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని చంద్రబాబు హామీనిచ్చినట్లు సమాచారం. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక వేమన సతీష్‌కు పెద్ద పదవే వస్తుందని సతీష్‌తో పాటు ఆయన అభిమానులు, సన్నిహితులు, రాంచౌదరి, పొట్లూరి రవి వంటి ఆయన ముఖ్య అనుచరులు సంబరపడుతున్నారు. గత నెల రోజుల నుండి రాజంపేట తెదేపా రాజకీయాల్లో చురుగ్గా పనిచేసిన వేమన సతీష్ ఆంధ్రా నుండి అమెరికాకు తిరుగుముఖం పట్టారు. ఇక నుండి తానా రాజకీయాల్లో ఆయన చక్రం తిప్పనున్నారు.
Today we had a Meeting with Hon’ble CM Shri Nara Chandrababu Naidu garu along with Mr Changal Rayudu, Rajampeta constituency. We had an detailed discussion about the strategy and candidature of Rajampeta constituency. CM Garu thinks Changal Rayudu would be the nice fit in current political situations Considering all political calculations and assured me that he will take care of my future endeavors. As Always I honestly honor any of his decision and heart fully Congratulate Changal Rayudu mama As Rajampeta TDP Candidate.
I Made a promise to CM Garu that with the support of Rajampeta TDP leaders and cadre, We will make sure TDP will retain the seat.
#APCM #RajampetTDP
#iSupportChangalRayudu
#NCBN #Naralokesh
న్యూయార్క్ కాన్సుల్ జనరల్‌తో తానా కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు జయశేఖర్ భేటీ
అమెరికా అధికారులే ఓ నకిలీ విశ్వవిద్యాలయాన్ని సృష్టించి దానిలో జేరిన విద్యార్థులను అరెస్టు చేయడం దురదృష్టకరమని, దీనిపై భారత ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకుని విద్యార్థులకు తగిన న్యాయం చేసేందుకు కృషి చేయాలని న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్ కాన్సుల్ జనరల్ సందీప్ చక్రవర్తికి తానా కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్ విజ్ఞప్తి చేశారు. భారత రాయబారితో ఈ విషయంపై తక్షణమే మాట్లాడి ఇమ్మిగ్రేషన్ అధికారులతో తగు చర్చలు జరిపి సత్వర చర్యలు తీసుకుంటామని సందీప్ హామీనిచ్చినట్లు జయశేఖర్ TNIకు తెలిపారు. సందీప్‌ను కలిసిన వారిలో ప్రవాసులు సతీష్ పలుకూరి, రాజా కసుకుర్తి తదితరులు ఉన్నారు.
అమెరికాలో మరో ఫేక్ యూనివర్శిటీ కలకలం-600మంది తెలుగువారు అరెస్ట్
అమెరికాలో మరో ట్రైవ్యాలీ వంటి ఉదంతం తెలుగు కుటుంబాల్లో కలకలం రేపింది. అమెరికాలో అనధికారికంగా నివసించేందుకు ఇమ్మిగ్రేషన్ అక్రమాలకు పాల్పడుతున్న వారిని ఏరివేసేందుకు హోంల్యాండ్ సెక్యూరిటీ అధికారులు మారువేషంలో ఏర్పాటు చేసిన యూనివర్శిటీ ఆఫ్ ఫార్మింగ్టన్(https://universityoffarmington.edu) ద్వారా తమ పంజా విసిరారు. మిషిగన్ రాష్ట్రంలోని డెట్రాయిట్ పరిసరాల్లో ఉన్న ఫార్మింగ్టన్ హిల్స్‌లో యూనివర్శిటీ ఆఫ్ ఫార్మింగ్టన్‌ను ఏర్పాటు చేసి ఇమ్మిగ్రేషన్ అక్రమాలకు పాల్పడేవారి కోసం మారువేషాల్లో అధికారులు వలపన్నారు. 2015లో ఏర్పాటు చేసిన ఈ విశ్వవిద్యాలయంలో 2017 ఫిబ్రవరి నుండి అధికారులు స్వయంగా మారువేషాల్లో విశ్వవిద్యాలయ అధికారులు, ఉద్యోగులుగా నటిస్తూ ఇమ్మిగ్రేషన్ అక్రమాలకు పాల్పడేవారి కోసం వలపన్నారు. బుధవారం ఉదయం 200మంది తెలుగువారి అరెస్టుతో ఈ యూనివర్శిటీ అంశం సంచలనంగా మారింది. అమెరికాలో తాము పూర్తి స్థాయి విద్యార్థులుగా చెలామణి అయ్యేందుకు, తద్వారా అక్రమంగా పలు ఉద్యోగాల్లో స్థిరపడేందుకు ఈ విశ్వవిద్యాలయం నకిలీ పత్రాలను విద్యార్థులకు అందజేసిందని, వాటిని పెద్ద సంఖ్యలో కొనుగోలు చేసిన భారతీయ విద్యార్థులు నేడు అరెస్టు కావడం దురదృష్టకరమని ప్రవాసులు పేర్కొంటున్నారు. అసలు ఏ విధమైన బోధనా ప్రణాళిక, ఉపాధ్యాయులు లేని ఈ విశ్వవిద్యాలయంలో అమెరికా నలుమూలల నుండి పెద్దసంఖ్యలో తెలుగువారు విద్యార్థులుగా తమ పేర్లు నమోదు చేసుకున్నారు. వీరందరినీ బుధవారం ఉదయం హోంల్యాండ్ సెక్యూరిటీ అధికారులు జరిపిన దాడుల్లో ఖైదు చేసి ఉత్తర కరోలినా, డల్లాస్, న్యూయార్క్ తదితర కరెక్షన్ సెంటర్లలో ఉంచారు. డల్లాస్ కరెక్షన్ సెంటరు నిండిపోగా, ఒక్క ఉత్తర కరోలినా సెంటరులోనే 60మందికి పైగా తెలుగు విద్యార్థులు కారాగారాల్లో మగ్గుతున్నారని సమాచారం.
* న్యూయార్క్ కాన్సుల్ జనరల్‌తో తానా కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు జయశేఖర్ భేటీ
అమెరికా అధికారులే ఓ నకిలీ విశ్వవిద్యాలయాన్ని సృష్టించి దానిలో జేరిన విద్యార్థులను అరెస్టు చేయడం దురదృష్టకరమని, దీనిపై భారత ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకుని విద్యార్థులకు తగిన న్యాయం చేసేందుకు కృషి చేయాలని న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్ కాన్సుల్ జనరల్ సందీప్ చక్రవర్తికి తానా కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్ విజ్ఞప్తి చేశారు. భారత రాయబారితో ఈ విషయంపై తక్షణమే మాట్లాడి ఇమ్మిగ్రేషన్ అధికారులతో తగు చర్చలు జరిపి సత్వర చర్యలు తీసుకుంటామని సందీప్ హామీనిచ్చినట్లు జయశేఖర్ TNIకు తెలిపారు. సందీప్‌ను కలిసిన వారిలో ప్రవాసులు సతీష్ పలుకూరి, రాజా కసుకుర్తి తదితరులు ఉన్నారు.
Click to access us-v-kakireddy-court-indictment-obtained-by-immlaws.pdf
మరింత సమాచారం కొరకు:
https://www.wxyz.com/news/feds-used-fake-metro-detroit-university-to-identify-illegal-immigrants
https://www.detroitnews.com/story/news/local/oakland-county/2019/01/30/federal-agents-used-fake-michigan-university-to-find-undocumented-immigrants/2722791002/
University of Farmington Fake University Detroit Michigan DHS ICE TANA TNILIVE 1000 Indian Students Arrested Due To False Documentation From Fake University
తానా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేస్తొంది!
తానాలో ఎన్నికల వేడి తారాస్థాయికి చేరుకోబోతోంది. రేపు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడానికి తానా బోర్డు సమావేశం అవుతోంది. 1వ తేదీ నుండి తానా కార్యవర్గ పదవులకు నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 19 వరకు నామినేషన్లు వేయడానికి అవకాశం ఉంటుందని సమాచారం. ఫిబ్రవరి చివరినాటికి ఎన్నికల బరిలో ఉండేవారి పేర్లు వెల్లడయ్యే అవకాశం ఉంది. నోటీఫికేషన్ వచ్చిన అనంతరం ఏ పదవులకు ఎవరు పోటీ చేస్తారనే విషయంపై ఒక అవగాహన వస్తుందని భావిస్తున్నారు. తానా ఎన్నికల అధికారిగా హ్యూస్టన్‌కు చెందిన ఐ.కనకంబాబు నియమితులయ్యారు. ఎన్నికల నోటిఫికేషన్ కోసం కార్యవర్గానికి పోటీ చేయాలనుకునేవారు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
తానా వ్యవస్థాపకులు డా.కాకర్ల సుబ్బారావుపై ప్రత్యేక కథనం
డా|| కాకర్ల సుబ్బారావు (జ.జనవరి 25 1925) ఎమ్.బి.బి.యస్., యమ్.ఎస్., ఎఫ్.ఆర్.సి.ఆర్., ఎఫ్.ఆర్.సి.ఆర్., ఎఫ్.ఐ.సి.పి. ( FRCR, FACR, FICP, FSASMA, FCCP, FICR, FCGP) రేడియాలజిస్ట్ మరియు హైదరాబాదులో నున్న ప్రసిద్ధ ఆసుపత్రి నిమ్స్ పూర్వ డైరెక్టర్.
న సంపాదించాడు. 1951 సంవత్సరంలో హౌస్ సర్జన్సీ చేసిన తరువాత వైద్యంలో ఉన్నత విద్య కోసం ప్రత్యేక పారితోషికంతో అమెరికా వెళ్ళాడు.
అమెరికాలో సుబ్బారావు జీవితం
అమెరికాలో వైద్య పరీక్షలైన అమెరికా రేడియాలజి బోర్డు పరీక్షలలో 1955 సంవత్సరంలో ఉత్తీర్ణులై న్యూయార్క్ మరియు బాల్టిమోర్ నగరాలలోని ఆసుపత్రులలో 1954-1956 సంవత్సరం వరకు పనిచేశాడు. సుబ్బారావు 1956 సంవత్సరంలో ఇండియా తిరిగి వచ్చి హైదరాబాదు నగరంలో ఉన్న ఉస్మానియా వైద్య కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేరాడు. ఆ తరువాత ఉస్మానియా కళాశాలలోనే ప్రధాన రేడియాలజిస్టుగా కుడా పదోన్నతి పొందాడు. 1970 సంవత్సరంలో సుబ్బారావు మళ్ళీ అమెరికా ప్రయాణం కట్టాడు. యునైటెడ్ కింగ్‌డమ్ వారి ఫెల్లో ఆఫ్ రాయల్ కాలేజి ఆఫ్ రేడియాలజిస్టు (‘Fellow of Royal College of Radiologists (UK) అనే పట్టా సంపాదించుకొన్నాడు.అమెరికా లోని అనేక ఆసుపత్రులలో పనిచేశాడు.
సుబ్బారావు తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా మెట్టమెదటి అధ్యక్షుడు మరియు వ్యవస్థాపకుడు.
భారతదేశానికి తిరిగి రాక
1986 సంవత్సరంలో నందమూరి తారక రామారావు ప్రవాస ఆంధ్రులకు చేసిన విజ్ఞప్తి మేరపు సుబ్బారావు భారతదేశానికి తిరిగి వచ్చి హైదరాబాదులోని నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) లో చేరాడు. నిమ్స్ ఆసుపత్రి సుబ్బారావు చేరక మునుపు వరకు ఎముకల ఆసుపత్రిగా ప్రసిద్ధి చెందింది. సుబ్బారావు అక్కడ చేరాక అన్ని విభాగాలనూ అభివృద్ధి చేసి రాష్ట్రంలో ఉన్న ప్రైవేటు కార్పోరేటు ఆసుపత్రులకు దీటైన స్థాయికి తీసుకొని వచ్చాడు. ఇప్పుడు నిమ్స్ సంస్థ రాష్ట్ర మరియు దేశ వ్యాప్తంగా రోగుల చికిత్సా పరంగా, వైద్య వృత్తి శిక్షణా పరంగా, వైద్య పరిశోధన పరంగా, పేరెన్నిక కలిగిన వైద్య సంస్థ.
సుబ్బారావు రేడియాలజిలో అనేక పుస్తకాలు మరియు జర్నల్స్ లో పరిశోధనా వ్యాసాలు వ్రాశాడు. దేశ విదేశాలలో వైద్య ఉపన్యాసాలు ఇచ్చాడు. యాభై ఏళ్ల అనుభవంలో అనేక బహుమతులు, సన్మానాలు పొందాడు.
అవార్డులు
సుబ్బారావు వైద్యశాఖకు, మానవాళికి చేసిన సేవకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 2000 సంవత్సరంలో పద్మశ్రీ అవార్డు ప్రదానం చేసి సత్కరించింది. ఇండియా రేడియాలాజికల్ అండ్ ఇమేజింగ్ అసోసియేషన్ వారి అనుబంధ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర చార్టరు సుబ్బారావుకు మార్చి 17, 2001న జీవితకాలపు కృషి అవార్డు ప్రదానం చేశారు. ఆయన ఆంగ్లంలో పలికిన పలుకులు “I pass through this life only once, let me do the maximum good to the largest number of people.”
మేడా సస్పెన్షన్‌తో రాజంపేటలో వేమన సతీష్ ఛాన్స్ కొడతాడా?–TNI ప్రత్యేకం
రాజంపేట తెలుగుదేశం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ మేడా మల్లిఖార్జునరెడ్డి ఎన్నికలకు ముందు వైకాపాలోకి దూకేశారు. దీంతో తెలుగుదేశం పార్టీ నుండి మల్లిఖార్జున రెడ్డిని సస్పెండ్ చేస్తూ పార్టీ అద్యక్షుడు చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు. ప్రస్తుతం తానా అద్యక్షుడిగా ఉన్న రాజంపేట వాస్తవ్యుడు వేమన సతీష్ రాజంపేట నుండి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేయటానికి ఎప్పటి నుండో ప్రయత్నిస్తున్నారు. వేమన సతేష్ తెలుగుదేశం పార్టీకి విసృత స్థాయిలో సేవలు అందిస్తున్నారు. 2007లో చంద్రబాబునాయుడు ప్రతిపక్ష నాయకుడిగా అమెరికా పర్యటనకు వచ్చిన సందర్భంగా వేమన సతీష్ ఆద్వర్యంలో చంద్రబాబుకు అక్కడ ఘనస్వాగతం లభించింది. వాషింగ్టన్ డీసీలో జరిగిన తానా సమావేశంలో అమెరికా మాజీ అద్యక్షుడు బిల్ క్లింటన్ పక్కనే చంద్రబాబు స్టేజీపై ప్రసంగించే విధంగా వేమన సతీష్ ఏర్పాట్లు చేశారు. అనంతరం చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో అమెరికా వెళ్ళినప్పుడల్లా వేమన సతీష్ ఆద్వర్యంలో అతని మిత్ర బృందం చంద్రబాబుకు ఘన స్వాగతం పలికింది. కొద్దికాల క్రితం తానా అద్యక్షుడిగా వేమన సతీష్ భారీ మెజారిటీతో విజయం సాధించారు. వచ్చే జులై నెలలో వాషింగ్టన్ డీసీలో సతీష్ ఆద్వర్యంలో తానా మహాసభలు పెద్ద ఎత్తున నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఇటీవలే తెలుగు రాష్ట్రాల్లో తానా ఆద్వర్యంలో పెద్ద ఎత్తున ‘చైతన్య స్రవంతి’ కార్యక్రమాలు నిర్వహించారు. గత 5వ తేదీన రాజంపేటలో భారీ సభను నిర్వహించి వేమన సతీష్ బలనిరూపణ కూడా చేశారు. ప్రస్తుతం రాజంపేటలో సతీష్ కు ఉన్న ప్రధానమైన అడ్డంకి కూడా తొలగిపోయింది. అక్కడి తెలుగుదేశం ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున రెడ్డి వైకాపాలోకి జంప్ అవడంతో సతీష్ కు అవకాశాలు మెరుగుపడుతున్నాయి. రాజంపేట వైకాపాకు బలమైన స్థానం. అక్కడ వేమన సతీష్ అభ్యర్ధి అయితే ఎంత వరకు తెలుగుదేశం పార్టీకి విజయం చేకూరుతుంది? అనే విషయం పై పార్టీ అదిస్థానం దృష్టి పెట్టింది. సిట్టింగ్ ఎమ్మెల్యే మేడా మల్లిఖరునరెడ్డిని డీ కొట్టగలిగే సత్తా తనకే ఉందని అదిస్థానం ముందు సతీష్ నిరూపించుకోగలిగితే ఆయన ఆశలు నెరవేరినట్లే. ఇటీవల చంద్రబాబు అమెరికా వెళ్ళినపుడు ఒకరిద్దరు ప్రవాసాంధ్రులను ఈసారి ఎన్నికల్లో పోటీ చేయటానికి అవకాశం కల్పిస్తామని బహిరంగంగానే ప్రకటించారు. ఈ అవకాశం కూడా వేమనకు కలిసి వస్తుంది. ఏదీ ఎమైనప్పటికి రాజంపేట తెదేపా అభ్యర్ధి విషయంలో చంద్రబాబు సుదీర్ఘమైన కసరత్తులే చేస్తారు. ఈ కసరత్తులో వేమన సతీష్ కు మంచి మార్కులు లభిస్తే ఆయనకే రాజంపేట తెలుగుదేశం బెర్తు ఖరారు కావచ్చు. – కిలారు ముద్దుకృష్ణ, సీనియర్ జర్నలిస్టు.