నాట్స్ అమెరికా తెలుగు సంబరాల సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు
నాట్స్ చికాగో ఆధ్వర్యంలో భోజన విరాళం


నాట్స్ చికాగో మహిళా బృందం చికాగోలో 62 వేలమందికి ఆహారాన్ని సిద్ధం చేసి ఉచితంగా అందించింది. చికాగో నాట్స్ మహిళా నాయకులు రామ్ కొప్పాక, శైలజ ముమ్మనగండి, రాధ పిడికిటి, సుమతి నెప్పల్లి, లక్ష్మి కలగర, రోజా శీలంశెట్టి, కల్పన సుంకర, రాజీవ్ మన్నె, కల్యాణి కోగంటి తదితురులు ఈ ఆహారాన్ని తయారు చేయడంలో కీలక పాత్ర పోషించారు. పేద పిల్లల ఆకలి తీర్చేందుకు వీరు ఈ ముందడుగు వేశారు. ఇలా తయారైన 62 వేల మీల్స్ ను స్కాంబర్గ్ లోని మై స్టార్వింగ్ చైల్డ్ కు నాట్స్ విరాళంగా అందించింది.

డల్లాస్‌లో ఉల్లాసంగా నాట్స్ వాలీబాల్ పోటీలు


అమెరికా తెలుగు సంబరాల్లో భాగంగా నిర్వహించిన నాట్స్ వాలీబాల్ టోర్నమెంట్ కు చక్కటి స్పందన లభించింది. ప్రతి రెండేళ్లకు ఒక్కసారి అమెరికాలో అంగరంగ వైభవంగా జరిపే నాట్స్ తెలుగు సంబరాలకు టాంటెక్స్ సిద్ధమవుతోంది. దీని కోసం తెలుగువారందరిని ఒక్కటి చేసే క్రమంలో ముందస్తుగా అనేక ఈవెంట్స్, ఆటల పోటీలను నాట్స్ నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది.. ఈ పరంపరను కొనసాగిస్తూ టాంటెక్స్ తో కలిసి నాట్స్ టెక్సాస్ లో వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించింది. 26 టీమ్ లు,,250 మంది ఆటగాళ్లతో ఈ టోర్నమెంట్ ఎంతో ఉత్సాహభరితంగా సాగింది. ఆస్టిన్, హ్యూస్టన్ నుంచి కూడా ఈ టోర్నమెంట్ కు విచ్చేశారు. నాట్స్ ప్రొఫెషనల్ కప్, నాట్స్ వాలంటీర్ కప్, నాట్స్ ఫన్ కప్, అనే మూడు రకాలు కప్స్ తో ఈ టోర్నమెంట్ ప్లాన్ చేసింది. నాట్స్ ప్రొఫెషనల్ కప్ కోసం హోరా హోరీగా సాగిన ఈ టోర్నమెంట్ లో థండర్స్ టీం విజేతగా నిలిచింది. రన్నరప్ గా రేంజర్స్ టీం నిలిచింది. నాట్స్ వాలంటీర్స్ ను కప్ ను స్పైకర్స్ 1 సొంతం చేసుకుంది. వీవీఎస్ 1 టీం రన్నరప్ గా నిలిచింది. నాట్స్ ఫన్ కప్ ను స్పైకర్స్2 టీం కైవసం చేసుకుంది. రన్నరప్ గా రెడ్ బుల్స్ టీం నిలిచింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఎంతో ఉత్సాహంగా వాలీబాల్ ప్లేయర్స్ ఈ టోర్నమెంట్ పాల్గొనడంపై నాట్స్ హర్షం వ్యక్తం చేసింది. నాట్స్ సంబరాల స్పోర్ట్స్ డైరక్టర్ ఎన్.ఎమ్.ఎస్ రెడ్డి, నాట్స్ స్పోర్ట్స్ ఛైర్ శ్రీనివాస్ కాసర్ల ఈ టోర్నమెంటు విజయవంతానికి ఎంతో కృషి చేశారు. నాట్స్ చాలా సంవత్సరాల నుంచి టోర్నమెంట్ నిర్వహిస్తూ వస్తుంది. అయితే ఇప్పుడు నిర్వహించిన టోర్నమెంట్ కు విశేష స్పందన వచ్చింది. ఎంతో క్రీడోత్సాహంతో వాలీబాల్ టోర్నమెంట్ పాల్గొన్నవారందరికి నాట్స్ ప్రత్యేక అభినందనలు తెలిపింది. నాట్స్ వైస్ ప్రెసిడెంట్ బాపునూతి, నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరక్టర్ ,కాన్ఫరెన్స్ సెక్రటరీ రాజేంద్ర మాదల,టాంటెక్స్ ప్రెసిడెంట్ చినసత్యం వెర్నపు నాట్స్ స్పోర్ట్స్ టీం పై ప్రశంసల వర్షం కురిపించారు. నాట్స్ సంబరాల కాన్పరెన్స్ ఛైర్మన్ కిషోర్ కంచర్ల ఈ టోర్నమెంట్ కు హజరయ్యారు. విన్నర్స్, రన్నర్స్ ను ప్రత్యేకంగా అభినందించారు. మే 24 నుంచి 26 వరకు డాలస్ లో జరిగే అమెరికా తెలుగు సంబరాలకు రావాలని వారిని ఆహ్వనించారు. విజయ్ శేఖర్ అన్నే,కిషోర్ వీరగంధం, సంబరాల జాయింట్ సెక్రటరీ మహేశ్ ఆదిబొట్ల, నాట్స్ టీమ్ మెంబర్స్ రాజేంద్ర గొండి, హర్ష పిండి, వెంకట్ దండ, మురళీ పల్లబత్తుల, రఘు గుత్తికొండ, అభిరామ్ సన్నపురెడ్డి, వంశీ నాగళ్ల, పవన్ నెలుట్ల, సుబ్బు జొన్నలగొడ్డ, సురేష్ మండువ, మహేశ్ చొప్ప, రమేష్ రెడ్డి, మధు మల్లు, టాంటెక్స్ ప్రెసిడెంట్ చిన్న సత్యం వీరనపు, స్పోర్ట్స్ ఛైర్ వెంకట్ బొమ్మ తదితరుల మద్దతు ఈ టోర్నమెంట్ ను నాట్స్ దిగ్విజయంగా నిర్వహించింది.

 

టాంటెక్స్-నాట్స్ ఆధ్వర్యంలో పన్నులపై అవగాహన సదస్సు

ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) మరియు నాట్స్ సంయుక్తంగా మార్చ్ 02న వీర్నపు చినసత్యం అధ్యక్షతన ఘనంగా నిర్వహించబడింది. ప్రవాస భారతీయులు అధిక సంఖ్యలో ఆసక్తితో ఈ సమావేశానికి విచ్చేసి, ఉత్సాహంగా పాల్గొని సభని జయప్రదం చేసారు. ముందుగా బిజినెస్ మరియు మెంబర్ సర్వీసెస్ సమన్వయకర్త చంద్రారెడ్డి పోలిస్ సభను ప్రారంబించి అందరికి స్వాగతం పలికి, టాంటెక్స్ నిర్వహిస్తున్న కార్యక్రమాలను వివరించారు. కార్యక్రమంలో ముందుగా tax planning కు ముఖ్య అతిధిగా విచ్హేసిన మురళి (myTaxFiler) గారు 2018 సంవత్సరం నుండి వచ్చిన టాక్స్ చట్టం లో వచ్చిన మార్పులను, ఈ సంవత్సరపు గడువు మరియు FBAR, FATCA చట్టాలు, న్యాయబద్దంగా టాక్సు ఢబ్బులు ఆదా చేసే పద్దతులు వివరించారు. అలాగే వాణిజ్య సంస్తలు టాక్సు ఢబ్బులు ఆదా చేసే మరి కొన్ని పద్దతులు సోదాహరణంగా వివరించారు. ప్రేక్షకుల పలు ప్రశ్నలకు చాలా ఓపికగా సమాధానాలు ఇచ్చారు. తరువాత Estate planning & Financial Services కు ముఖ్య అతిధిగా విచ్హేసిన శ్రీ తిరుమల్ రెడ్డి గారు మాట్లాడుతూ భారత దేశం మరియు అమెరికా దేశాల చట్టాలలో ముఖ్యంగా మరణానంతర ఆస్తుల సంక్రమణం లో తేడాలు వివరిస్తూ Estate Planning ప్రాముఖ్యతను, అవసరాన్ని గట్టిగా నొక్కి చెప్పారు. ఒకవేళ చెయ్యని పరిస్తితులలో ఆస్తులు ఎలా, ఎలా చేతులు మారతాయో అది ఎంత క్లిష్టం గా ఉంటుందో వివరించారు. అలాగే డబ్బులు ఆదా చెయ్యల్సిన అవసరం మరియు పిల్లల కాలేజి ఖర్చులు, ఉద్యోగ విరమణానంతర జీవితానికి సంబందించి ఖర్చులు వాటిని సమర్దంగా ఎదుర్కొనడానికి అవలంభించాల్సిన స్ట్రాటెజీలు వాటికి తన సంస్ట చేయగలిగిన సహాయాన్ని వివరించారు. ప్రేక్షకుల పలు ప్రశ్నలకు తను కూడా చాలా ఓపికగా సమాధానాలు ఇచ్చారు. మురళి మరియు తిరుమల్ రెడ్డిని టాంటెక్స్ అధ్యక్షులు వీర్నపు చినసత్యం, ఉత్తరాధ్యక్షులు కృష్ణారెడ్డి కోడూరు, కార్యదర్శి ఉమామహెష్ పార్నపల్లి, సంయుక్త కార్యదర్శి , ప్రబంధ్ రెడ్డి తోపుడుర్తి, కోశాధికారి శరత్ రెడ్డి యర్రం, సతీష్ బండారు . సమన్వయకర్త చంద్రారెడ్డి పోలిస్ పాలకమండలి సభ్యులు శాలువా, జ్ఞాపిక ఇచ్చి ఘనంగా సత్కరించారు. టాంటెక్స్ అధ్యక్షులు శ్రీ వీర్నపు చినసత్యం మాట్లాడుతూ మురళి మరియు తిరుమల్ రెడ్డి కమ్యూనిటీ సేవలను ఎంతో కొనియాడారు మరియు వారు పోషక ధాతలుగా ఉన్న విషయాన్నిగుర్తు చేసుకున్నారు . కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహకరించిన మరియు విచ్చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

దీక్షితులు మరణంపై నాట్స్ సంతాపం

తెలుగు రంగస్థల, సినీ నటుడు, దర్శకుడు దీక్షితులు మరణంపై ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసింది. సంస్కృత, తెలుగు భాషల్లో రంగస్థల కళల్లో ఎం.ఏ. డిగ్రీలు పొందిన దీక్షితులు.. రంగస్థలంతో పాటు సినిమాలలో కూడా తన సత్తా చాటారు. దీక్షితులు అకాలమరణంపై నాట్స్ దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా, 2013 లో దీక్షితులు డల్లాస్ లో జరిగిన నాట్స్ అమెరికా తెలుగు సంబరాల లోనూ, 2011 న్యూ జెర్సీ లో జరిగిన నాట్స్ అమెరికా తెలుగు సంబరాలలో పాల్గొన్న సందర్భాలను గుర్తుచేసుకొంది. దీక్షితులు కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపింది..

ఫార్మింగ్టన్ విద్యార్థులను ఆదుకోవాలని కాంగ్రెస్ సభ్యులను కలిసిన తెలుగు సంఘాల ప్రతినిధులు

అమెరికాలోని డెట్రాయిట్ లో తెలుగు విద్యార్ధుల అరెస్టులపై అమెరికాలోని తెలుగు సంఘాలు న్యూయార్క్ లో సమావేశమయ్యాయి. నాట్స్, తానా, ఆటా, నాటా, టాటా, టీఎల్ సీఏ సంఘాలు తెలుగు విద్యార్ధులకు అన్ని విధాల సాయం అందించేందుకు చేపట్టాల్సిన కార్యచరణపై చర్చించాయి. తొలిసారిగా తెలుగు సంఘాలన్నీ ఏకతాటిపైకి వచ్చి విద్యార్థులను విడిపించేందుకు చేయాల్సిన ప్రయత్నాలపై చర్చలు జరిపాయి. ముందుగా అందరూ కాంగ్రెస్ మెన్ థామస్ సుజీ ని కలిసి తెలుగు విద్యార్ధులను మానవతా దృక్ఫధంతో విడుదల చేయాలని కోరాయి. అవగాహన లేకపోవడంతోనే విద్యార్ధులు ఫార్మింగ్ టన్ యూనివర్సీటీ వలలో చిక్కుకున్నారని తెలిపాయి. తక్షణమే వారిని విడిపించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతి పత్రం ఇచ్చాయి. దీనిపై అటు కాంగ్రెస్ మెన్ థామస్ కూడా సానుకూలంగా స్పందించారు. భారత రాయబార కార్యాలయం అధికారులతో కూడా ఆయన మాట్లాడారు. తెలుగు అటార్నీలు ప్రశాంతి రెడ్డి, జొన్నలగొడ్డలతో కూడా ఈ విషయంలో ఎలా ముందుకెళ్లాలనే దానిపై చర్చించారు. అన్ని సంఘాలు ఇప్పటికే అక్కడ తెలుగు విద్యార్ధులకు మేమున్నామని ధైర్యం చెబుతున్నాయి. రాయబార కార్యాలయంతో పాటు అటార్నీలతో చర్చలు జరిపి వీలైనంత తర్వగా వారిని విడిపించే ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. నాట్స్ నుంచి డాక్టర్ మధు కొర్రపాటి, తానా నుంచి జై తాళ్లూరి, నాటా నుంచి స్టాన్లీ రెడ్డి, టాటా నుంచి పైళ్ల మల్లారెడ్డి, ఆటా నుంచి రాజేందర్ జిన్నా, టీఎల్ సీఏ నుంచి పూర్ణ అట్లూరి, వెంకటేష్ ముత్యాల, లాంగ్ ఐస్ ల్యాండ్ డెమోక్రటిక్ పార్టీ నాయకులు శేఖర్ నేలనూతల తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Voice raised unitedly by all Telugu associations and seek political help in releasing Telugu Students.

Leaders of NATS, TANA, ATA, NATA, TATA and TLCA went and met congressman Thomas Suozzi and presented a memorandum and requested to help in releasing the student victims of Farmington University that were arrested in the last few days. Congressman reacted very positively and assured to help in this situation. He spoke to Indian Consulate immediately and also attorneys Prashanthi Reddy and Srinivas Jonnalagadda. All the associations are closely working with the students, consulate and attorneys to help them get released as soon as possible.

Attended are
Dr Madhu Korrapati, NATS
Mr Jay Talluri, TANA
Dr Stanley Reddy, NATA
Dr Rajender Jinna, ATA
Dr Pailla Malla Reddy, NATA
Dr Purna Atluri, TLCA Chairman
Mr Venkatesh Mutyala, TLCA
And Shekar Nelanuthala, Long Island Democratic Party Leader

ఫార్మింగ్టన్ విద్యార్థులకు నాట్స్ బాసట

నకిలీ ధ్రువపత్రాలతో అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారనే కారణంతో డెట్రాయిట్‌ పోలీసులు అరెస్ట్‌ చేసిన తెలుగు విద్యార్థులకు న్యాయ సహాయం అందించేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాట్స్‌) ముందుకొచ్చింది. ఈ అరెస్ట్‌లు ప్రారంభం కాగానే చాలా మంది విద్యార్థులు నాట్స్‌ హెల్ప్‌ లైన్‌ను ఆశ్రయించటంతో నాట్స్‌ ఛైర్మన్‌ శ్రీనివాస్ గుత్తికొండ రంగంలోకి దిగారు. నాట్స్‌ అధ్యక్షుడు శ్రీనివాస్‌ మంచికలపూడితో కలిసి ఆయన ఈ అరెస్ట్‌లకు సంబంధించి న్యాయనిపుణులతో చర్చలను జరుపుతున్నారు. విద్యార్థులను పోలీసుల నుంచి విడిపించేందుకు న్యూజెర్సీలో ఉంటున్న తెలుగువారైన న్యాయనిపుణులు శ్రీనివాస్‌ జొన్నలగడ్డతో వారు సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. అమెరికాలో అక్రమ వలసదారుల్ని గుర్తించటంలో భాగంగా హోం ల్యాండ్‌ సెక్యూరిటీ అధికారులు ఇమ్మిగ్రేషన్‌ అక్రమాలు చేస్తున్న వాళ్లపై స్టింగ్‌ ఆపరేషన్‌ నిర్వహించారు. ఈ ఆపరేషన్‌లో వందలాది మంది నకిలీ ధ్రువపత్రాలతో అమెరికాలో ఉంటున్నట్లు వారు గుర్తించారు. దాదాపు 600 మంది విదేశీ విద్యార్థులకు నకిలీ పత్రాలు ఇచ్చేందుకు సహకరించిన ఎనిమిది మంది తెలుగువారిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీసా కాలపరిమితి ముగిసినప్పటికీ అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న వారిని అధికారులు పట్టుకున్నారు. ఇందులో ఎక్కువగా తెలుగు వారుండటం గమనార్హం.

NATS లాస్ఏంజిల్స్ విభాగం ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు


నార్త్ అమెరికా తెలుగు సొసైటీ (ణాట్శ్) అమెరికా వ్యాప్తముగా చేస్తున్న మిలియన్ కాన్ ఫుడ్ డ్రైవ్ లో భాగంగా, నాట్స్ లాస్ ఏంజెల్స్ చాప్టర్ ణ్టృ వర్ధంతి సందర్భముగా ఫుడ్ డ్రైవ్ జరిపి 2000 డాలర్స్ పైగా ఫుడ్ సప్లైస్ ని మూరుపార్క్ ఫుడ్ పాంట్రీ కి డొనేట్ చేయటం జరిగింది. ఫుడ్ పాంట్రీ నిర్వాహకులు మాట్లాడుతూ వారు చేస్తున్న ప్రోగ్రామ్స్ కొన్ని వందల కుటుంబములకు ఫుడ్ మరియు ఆర్ధిక సహాయం అందిస్తున్నాయని చెప్పారు. నాట్స్ చేసిన ఈ సహాయం కొన్ని వందల కుటుంబాలకు ఫుడ్ అందచేస్తుందని ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న నాట్స్ సేవలు అభినందనీయం అని అన్నారు. నాట్స్ వైస్ ప్రెసిడెంట్ చందు నంగినేని మాట్లాడుతూ ఈ విన్నూత ప్రోగ్రాం ని నాట్స్ అమెరికా వ్యాప్తముగా 11 సిటీస్లో చేపట్టినట్లు చెప్పారు. ణృఈస్ స్వతహాగా స్వదేశమయిన ఇండియా లో అనేక సేవ కార్యక్రమాలు చేస్తున్నారని, అలాగే తమకి ఎన్నో అవకాశాలు కలిపించిన అమెరికా లో కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయవలసిన ఆవశ్యకతని వివరిస్తూ, ణృఈస్ ని ఆ విధముగా ప్రోత్సహించటానికి నాట్స్ ఈ కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు. అన్ని సిటీస్ లో ణృఈస్ ఎంతో ఉత్సాహంగా ముందుకు వచ్చి నాట్స్ చేపట్టిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినట్లు చెప్పారు. రీజినల్ వైస్ ప్రెసిడెంట్ రామ్ కోడితాలా మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలు ణృఈస్ ని అమెరికా లో సాఫ్ట్వేర్ రంగంలోనే కాక సేవ రంగం లో కూడా ముందు వుంచుతాయని మరియు ఇక్కడే పుట్టి పెరుగుతున్న పిల్లలకు సేవా భావాన్ని అలవాటు చేస్తున్నదని అన్నారు. నాట్స్ లాస్ ఏంజెలెస్ చాఫ్టర్ సెక్రటరీ శ్రీనివాస్ చిలుకూరి మాట్లాడుతూ ఇటువంటి మంచి ప్రోగ్రాం చెయ్యటానికి సహాయ సహకారాలు అందించిన దాతలకు మరియు ణాట్శ్ ళా చాప్టర్ మెంబెర్స్ కు మరియు వాలంటీర్స్ కి కృతజ్ఞతలు తెలుపుతూ, ఇటువంటి మరిన్ని విన్నూత కార్యక్రమాలు చేపట్టనున్నట్లు, వాటికి కూడా ఇలానే సహాయ సహకారములు అందించవలనని కోరారు. ఈ కార్యక్రమములో ఇంకా నాట్స్ బోర్డు అఫ్
డైరెక్టర్ మధు బోడపాటి, మనోహర్ మద్దినేని, సునీల్ పాతకమూరు, కిషొర్ గరికపాటి ,ఉదయ్ బొంతు, శ్రీనివాస్ సూరె, గౌరీ శంకర్, శరత్ పోపూరి , సాయిరాం బండారు, రామకృష్ణ జిల్లెళ్లమూడి ,కిషొర్ రామదేను, గిరిధర్ నక్కల, సాయి మగదల, శ్రీనివాస్ సంపంగి , కృష్ణ మద్దిలేటి తదితరులు పాల్గున్నారు.

డాలస్‌లో నాట్స్ విరాళ సేకరణ-$6లక్షలకు హామీలు

అమెరికా తెలుగు సంబరాలకు నాట్స్ విసృత్తంగా ఏర్పాట్లు చేస్తోంది. ప్రతి రెండేళ్లకు ఒక్కసారి అమెరికాలో పెద్ద ఎత్తున నిర్వహించిన అమెరికా తెలుగు సంబరాల కోసం నాట్స్ డాలస్ నగరంలో ఫండ్ రైజింగ్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇర్వింగ్ వేదికగా వచ్చేమే 24,25,26 తేదీల్లో నాట్స్ అమెరికా తెలుగు సంబరాలు నిర్వహిస్తున్నారు. ఈ ఫండ్ రైజింగ్ కు విశేష స్పందన లభించింది. దాదాపు 6,00,000 డాలర్ల విరాళాలను ఇచ్చేందుకు నాట్స్ సభ్యులు, తెలుగు ప్రజలు తమ సంసిద్ధత వ్యక్తం చేశారు. నాట్స్ డాలస్ చాప్టర్2019-20 నాయకత్వాన్ని కూడా నాట్స్ ప్రకటించింది.డాలస్ చాప్టర్ కో ఆర్డినేటర్ గా అశోక్ గుత్తా, సెక్రటరీగా డీవీ ప్రసాద్, హెల్ఫ్ లైన్ కమిటీ చైర్మన్ గా సత్య శ్రీరామనేని, కో ఛైర్మన్ గా రవి తాండ్ర, రాజీవ్ కంభంను నియమించింది. స్పోర్ట్స్ ఛైర్మన్ గా శ్రీనివాస్ కాసర్ల, సత్య శ్రీరామనేని, మహిళా సాధికారిత ఛైర్మన్ గా కవితాదొడ్డా, వెబ్ కమిటీ ఛైర్మన్ గా శ్రీథర్ నేలమడుగుల, సోషల్ మీడియా అండ్ మార్కెటింగ్ ఛైర్మన్ గా విజయ్ కొండ, కల్చరల్ కమిటీ ఛైర్మన్ ఆర్య బొమ్మినేని, కమ్యూనిటీ సర్వీసెస్ ఛైర్మన్ గా రాజేంద్ర యనమదల కు బాధ్యతలు అప్పగించింది. ఇంకా ఈ ఈ కార్యక్రమంలో నాట్స్ తెలుగు సంబరాల కన్వీనర్ కిషోర్ కంచర్ల, నాట్స్ బోర్డు డైరక్టర్స్ .. ఆది గెల్లి, రాజేంద్ర మాదాల, అమర్ అన్నే,రాజ్ అల్లాడ, నాట్స్ ఈ.సి. నుండి బాపు నూతి, శేఖర్ అన్నే, అజయ్ గోవాడ, జ్యోతి వనం తదితరులు పాల్గొన్నారు.

న్యూజెర్సీలో నాట్స్ ఫుడ్ డ్రైవ్

ఆకలితో ఉన్న వారికి ఆ ఆకలి తీర్చడమే అత్యుత్తమ సేవగా భావించే ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ అమెరికా వ్యాప్తంగా ఒన్ మిలియన్ ఫుడ్ డ్రైవ్ అంటూ 2016 లో ప్రారంభించి అమెరికా వ్యాప్తంగా నాట్స్ ఇచ్చిన పిలుపుకు అమెరికాలో నాట్స్ విభాగాలన్నీ స్పందిస్తున్నాయి. తాజాగా న్యూజెర్సీ లో నాట్స్ ఒన్ మిలియన్ ఫుడ్ డ్రైవ్ కు విశేష స్పందన లభించింది. నాట్స్ సభ్యులతో పాటు స్థానికంగా ఉండే తెలుగువారంతా పేదలకు అందించే ఫుడ్ క్యాన్స్ సేకరించడంలో మేముసైతం అంటూ పోటీపడ్డారు. నాట్స్ మాజీ అధ్యక్షుడు మోహనకృష్ణ మన్నవ నాయకత్వంలో ,జరిగిన ఈ కార్యక్రమానికి నాట్స్ నాయకగణం శ్రీహరి మందాడి, రమేష్ నూతలపాటి, వంశీ కృష్ణ వెనిగళ్ల, అరుణ గంటి, శ్యాం నాళం, రంజిత్ చాగంటి, మురళీ కృష్ణ మేడిచెర్ల, విష్ణు ఆలూరు, చంద్రశేఖర్ కొణిదెల, మోహన్ కుమార్ వెనిగళ్ళ, సురేష్ బొల్లు, శ్రీనివాస్ వెంకట, శేషగిరి కంభంమెట్టు, సుధాకర్ తురగ, శ్రీనివాస్ గోగినేని ఒన్ మిలియన్ క్యాన్ ఫుడ్ డ్రైవ్ లో ఉత్సాహంగా పాల్గొన్నారు. భాషే రమ్యం.. సేవే గమ్యం అన్న నినాదాన్ని చేతల్లో రుజువు చేస్తూ నాట్స్ ప్రతి యేటా భారీ ఎత్తున ఈ ఫుడ్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. న్యూజెర్సీతో పాటు అమెరికాలోని పలు నగరాల్లో ఈ ఫుడ్ డ్రైవ్ జరగనుంది. ఫుడ్ డ్రైవ్ ద్వారా సేకరించిన ఫుడ్ క్యాన్స్ ను స్థానిక ఓజామన్ కేథలిక్ ఛారిటీకి నాట్స్ డోనేట్ చేసింది. పేదపిల్లల కడుపులు నింపేందుకు ఈ ఛారిటీ సంస్థ పనిచేస్తుంది. నాట్స్ ప్రతి చాప్టర్ లోనూ ఈ ఫుడ్ డ్రైవ్ నిర్వహించి పేదపిల్లల ఆకలి తీర్చే ప్రయత్నం చేస్తోంది. నాట్స్ పిలుపుకు స్పందించి తమ వంతుగా ఫుడ్ క్యాన్స్ అందించిన ప్రతి ఒక్కరిని నాట్స్ ధన్యవాదాలు తెలుపుతోంది. ఈ సందర్భంగా నాట్స్ ప్రవేశ పెట్టిన మరో కార్యక్రమం నాట్స్ వెల్నెస్ డ్రైవ్ ఫర్ హోంలెస్ గురించి మోహన్ మన్నవ, వంశీ వెనిగళ్ల, శ్రీహరి మందాడి, రమేష్ నూతలపాటి తదితరులు వివరించారు. ఈ కార్యక్రమం ద్వారా, దైనందిక జీవనానికి ఉపయోగపడే టూత్ బ్రష్లు, పేస్ట్లు, నాప్కిన్స్, ఫస్ట్ ఎయిడ్ కిట్స్ తదితర నిత్యావసర వస్తువులు కూడా పిల్లలు ఈ ఓజోమన్ కాథలిక్ ఛారిటీ సంస్థకు అందించారు. మోహన్ కుమార్ వెనిగళ్ళ మాట్లాడుతూ.. నాట్స్ ఫామిలీ లో ఒకరైన సౌమిక గూడూరు ఆలోచన ను నాట్స్ సేవా కార్యక్రమాలలో ఒకటిగా చేసి చిన్న పిల్లల ద్వారా ఈ కార్యక్రమాన్ని యువతలో చైతన్యం తెచ్చి వారిని కూడా సేవా కార్యక్రమాల వైపు నడిపించేందుకు నాట్స్ నాయకత్వం నడుం బిగించి ముందుకు నడిపిస్తోంది.


గుంటూరులో తెలుగు పద్యంపై నాట్స్ సదస్సు


ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ(నాట్స్) ఆధ్వర్యంలో గుంటూరులో “ప్రతి నోట తెలుగు పద్యం” పేరిట సాహితీ సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు చిన్నారులు, యువతీయువకులు, రచయితలు పాల్గొన్నారు. తెలుగు భాష వ్యాప్తికి, తెలుగు పద్యం పరిరక్షణకు ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని నాట్స్ ఆధ్వర్యంలో చేపడతామని చైర్మన్ గుత్తికొండ శ్రీనివాస్ తెలిపారు. కార్యక్రమంలో నాట్స్ ప్రతినిధులు డా.కొర్రపాటి మధు, మన్నవ మోహనకృష్ణ, ఏపీ శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్, మాజీ మంత్రి డొక్క మాణిక్యవరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.నాట్స్ బోస్టన్ విభాగ సమన్వయకర్తగా గొంది శ్రీనివాస

ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) బోస్టన్ విభాగ కమిటీని ప్రకటించింది. ఈ విభాగ సమన్వయకర్తగా శ్రీనివాస గొంది వ్యవహరిస్తారు. హెల్ఫ్ లైన్ కమిటీ ప్రతినిధిగా శ్రీనివాస్ గొంది, ఇతర సభ్యులుగా ప్రకాశ్ లక్కాల, సునీల్ కొల్లిలను ప్రకటించింది. ఈవెంట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ప్రతినిధిగా శ్రీథర్ గోరంట్ల, సహ సభ్యులుగా కల్యాణ్ కాకి, రాఘవ నన్నూరిలకు బాధ్యతలను అప్పగించినట్లు అధ్యక్షుడు మంచికలపూడి శ్రీనివాసబాబు ఓ ప్రకటనలో తెలిపారు. స్పోర్ట్స్ కమిటీ ప్రతినిధిగా సునీల్ కంభంపాటి, సహ సభ్యుల గా కల్యాణ్ కాకి, రాఘవ నన్నూరిలకు బాధ్యతలు అప్పగించింది. కమ్యూనిటీ సర్వీసెస్ కమిటీ ప్రతినిధిగా సునీల్ కొల్లి, సహ సభ్యులుగా సునీల్ కంభంపాటి, రాజేష్ పాటిబండ్లను నియమించింది. మెంబర్ షిప్ కమిటీకి రాఘవ నన్నూరికి ప్రతినిధి గా బాధ్యతలు అప్పగించింది. సహ సభ్యులుగా గౌతమ్, కల్యాణ్ కాకి వ్యవహరిస్తారు. ఫండ్ రైజింగ్ కమిటీకి కల్యాణ్ కాకి ప్రతినిధి గా వ్యవహరించనున్నారు. సహ సభ్యులు గా ప్రసాద్ లక్కాల, శ్రీథర్ గోరంట్ల బాధ్యతలు తీసుకున్నారు. యూత్ కమిటీ ప్రతినిధి గా రాజేశ్ పాటిబండ్ల, సహ సభ్యులుగా రాఘవ నన్నూరి, గౌతం చుండూరి వ్యవహరించనున్నారు. వెబ్ అండ్ మీడియా కమిటీ ప్రతినిధి గా శ్రీనివాస గొంది, సహ సభ్యులుగా సునీల్ కంభంపాటి, శ్రీథర్ గోరంట్ల వ్యవహారిస్తారు. నాట్స్ జాతీయ నాయకత్వం ప్రతిష్టాకత్మంగా చేపట్టిన మిలియన్ క్యాన్ ఫుడ్ డ్రైవ్ నాట్స్ బోస్టన్ చాప్టర్ ఉత్సాహంగా పాల్గొనడంపై నాట్స్ అధ్యక్షుడు శ్రీనివాస మంచికలపూడి అభినందనలు తెలిపారు.

చికాగోలో నాట్స్ సంబరాల సన్నాహక సదస్సు


NATS Chicago Chapter unveiled new leadership team at the 2018 Diwali Celebrations & 2019 America Telugu Sambaralu Kick-off event held at Royal Palace Banquets. Local team thanked NATS President Srinivas Manchikalapudi, 2019-ATS Chairman Kishore Kancharla & 2019-ATS Secretary Rajendra Madala for gracing the occasion. It was a colorful & houseful gathering attended by volunteers & families of Chicago chapter about 400 people along with many community leaders from Chicago area. Everyone appreciated the donation of about $33,000 funds raised through NATS helpline that was presented to Swarna Vudatha family who met with an accident recently in Chicago. EC and BOD from Chicago Mahesh Kakarala, Murthy Koppaka, Srinivas Pidikiti, Rajesh Veedulamudi guided Chicago chapter. NATS EC thanked Chicago Chapter team containing Sridhar Mumgandi, RK Balineni, Srinivas Boppana, Vijay Venigalla, Venkat Yalamanchili, Vasu Babu Addagada, Ravi Srikakulam, Lokesh Kosaraju, Krishna Nimmagadda, Krishna Nunna, Murali Kalagara, Ram Tunuguntla, Laxmi Bojja, Rama Koppaka, Bindu Veedulamudi, Karishma Pilla, Prasudha Sunkara, Anu Kakarala, Radha Pidikiti, Roja Seelamsetty, Sailaja Pulivarthi, Venu Krishnardula, Srinivas Pilla, Venkat Thota , Karthik Modukuri, Harish Jammula, Narendra Kadiyala, Kiran Ambati, Venkat Damuluri, Nishanth Bonda and Sandeep Yallampalli.న్యూయార్క్ నాట్స్ ఆధ్వర్యంలో ఉచిత వైద్యశిబిరం


“నాట్స్” న్యూయార్క్-TLCA సంయుక్తంగా స్థానిక షిరిడి సాయి దేవస్థానంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. 100మందికి పైగా ప్రవాసులు ఈ ఉచిత వైద్య శిబిరంలో వైద్య సేవలు పొందారు. ఉచితంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించి మందులను అందించారు. నాట్స్ మాజీ ఛైర్మన్ డా.మధు కొర్రపాటి, డా.అల్లూరి జగ్గారావు, డా.సౌమ్య ముతికి, డా.జానకి కనుమిల్లి, డా. శిఖా జైన్, డా.ప్రణీత్ కొర్రపాటి, డా.శైలజ కాల్వ, డా.ప్రత్యూష బండి, నాట్స్ వైస్ ప్రెసిడెంట్ శ్యాం నాళం, నాట్స్ ప్రతినిధి అరుణ్ శ్రీరామినేని, టీఎల్ సీఏ ప్రెసిడెంట్ తాపీ ధర్మారావు, ప్రెసిడెంట్ ఎలక్ట్ అశోక్ చింతకుంట, సెక్రటరీ బాబు కుదరవల్లి, ఈసీ మెంబర్స్ ప్రసాద్ కోయి, సురేష్ తమ్మినేని, సంజన ఎర్నకి, హర్షిణి, తారణి సురేష్, బిందు కోయి, వేదాంత్ జైన్, సత్యం గులివెందుల, డా.సుజనీ వర్మ ఈ శిబిరంలో పాల్గొని తమవంతు సహకారాన్ని అందించారు.

LAలో వైభవంగా నాట్స్ బాలల సంబరాలు


NATS ఆవిర్భవించినప్పటి నుండి “భాషే రమ్యం, సేవే గమ్యం” దిశగా పయనిస్తూ… భారతీయ సాంస్కృతిక సంప్రదాయాలకు పెద్ద పీట వేస్తూ, ప్రతి యేటా ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. “ ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని” అంటూ ఖండాంతరాలు దాటినను అమెరికాలో వున్న తెలుగు వారందరిని ఏకం చేస్తూ.. మన భారతీయ సంస్కృతిని గుర్తు చేసుకుంటూ ప్రతి యేటా చేసే వేడుకలు భావి తరాలు గుర్తుంచుకునేలా చేస్తోంది నాట్స్. ఈ క్రమములోనే భారత తొలి ప్రధాని చాచా నెహ్రు జన్మదినాన్ని పురస్కరించుకొని లాస్ ఏంజెల్స్ లో నిర్వహించిన బాలల సంబరాలలో “నేటి బాలలే రేపటి భావి పౌరులు” అంటూ చిన్నారులను ప్రోత్సహించే దిశగా ఆయా రంగాలలో అమెరికా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన నేషనల్ స్పెల్లింగ్ బీ 2018 ఛాంపియన్ కార్తిక్ నేమాని, పిన్న వయసులోనే నేషనల్ స్పెల్లింగ్ బీ మేధావిగా గుర్తింపు పొందిన ఆకాష్ వుకోటి, బ్లైండ్ ఫోల్డ్ చెస్ లో నిష్ణాతుడైన ఆర్యన్ గుట్ల, మరియు ప్రస్తుతం తెలుగు సినిమాలో నటించిన బాలనటులు శ్లోక గొర్తి, చంద్రహాస్ మెరిసేర్లను ఈ కార్యక్రమమంలో వేద మంత్రాల మధ్య వేదిక మీదికి ఆహ్వానించి వారిని ఆశీర్వదించారు. నాట్స్ నిర్వహించిన చదరంగం పోటీలలో 40 మంది చిన్నారులు ఉత్సాహాముగా పాల్గొన్నారు.ఐవీ లీగ్ స్కూల్ నుండి వచ్చిన విద్యార్థి శ్రీనివాస్ పంగులూరి యూనివర్సిటీలలో ప్రవేశించడానికి గల మెళుకువలను వారు పాటించిన క్రమశిక్షణను అక్కడికి వచ్చిన బాలలకు మరియు తల్లిదండ్రులకు తెలియపరిచారు. అదే విధముగా కెరీర్ గైడెన్స్ కౌన్సిలర్ ‘ఆండీ హొంగ్ ‘ హై స్కూల్ స్టూడెంట్స్ కి పాటించ వలసిన జాగ్రత్తలు, SAT , ACT కి ప్రిపరేషన్ కి సలహాలు, ప్రముఖ విశ్వ విద్యాలయాలలో ఎలా దరఖాస్తు చేసుకోవాలి అని చక్కగా వివరించి, స్టూడెంట్స్ అందరి సందేహాలను తీర్చారు. గోదా క్షేత్ర సురభి అభినయించిన రుద్రమా దేవి ఏకపాత్రాభినయం , Cerritos మనబడి విద్యార్థులు ప్రదర్శించిన తెలుగు స్కిట్ అందరిని అలరించింది. తొమ్మిది సంవత్సరాల ఆర్యన్ గుట్ల స్టేజి మీద చేసిన బ్లైండ్ చెస్ ఆడి ప్రేక్షకులను అబ్బుర పరిచారు. స్పెల్లింగ్ బీ ఛాంపియన్ కార్తిక్ నేమాని, బాల మేథావి ఆకాష్ వుకోటి మధ్య నిర్వహించిన స్పెల్లింగ్ బీ పోటీ ఎంతో ఉత్సాహంగా సాగింది. చివరిలో హాలీవుడ్ మెజీషియన్ స్టీవ్ మ్యాజిక్ షో అత్యంత కుతూహలంగా వినోద భరితముగా పిల్లలని, పెద్దలని మంత్రం ముగ్ధుల్ని చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన NATS ప్రెసిడెంట్ మంచికలపూడి శ్రీనివాస్ మాట్లాడుతూ ఇటువంటి విన్నూత కార్యక్రమం నిర్వహించిన LA చాప్టర్ ని, వారికి మార్గ దర్శనం చేసిన డాక్టర్ రవి ఆలపాటి గారిని అభినందిస్తూ ఇటువంటి కార్యక్రమాన్ని అన్ని చాఫ్టర్లు లో నిర్వహిస్తామని ప్రకటించారు. అలానే చెస్ విజేతలను మరియు కార్యక్రమానికి వచ్చిన జీనియస్ కిడ్స్ ని సన్మానించారు. ఆపదలో వున్నతెలుగు వారికి NATS హెల్ప్ లైన్ ద్వారా ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందిస్తూ ఉంటున్నదని తెలియచేసారు. ఇంకా ఈ కార్యక్రమానికి NATS బోర్డు అఫ్ డైరెక్టర్స్ డాక్టర్ రవి ఆలపాటి, మధు బోడపాటి, నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటి నుంచి చందు నంగినేని, వంశీ గరికపాటి, రామ్ కొడితల, వెంకట్ ఆలపాటి, కృష్ణ మల్లిన హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి చిన్నారులు శ్రేష్ఠ కోడె, శ్రీయ చింతమనేని, సాహితి బోడపాటి వ్యాఖ్యాతలుగా వ్యవహరించి బాలల సంబరాలకు ప్రత్యేక శోభను చేకూర్చారు. విష్ణు కేటరింగ్ అతిధులకు పసందైన విందు భోజనాన్ని అందజేశారు. తెలుగు భాషా ప్రియులకు ….రమ్యమైన కార్యక్రమాలు అందిస్తూ…స్థానిక కళాకారులను, చిన్నారుల్లో సృజనాత్మకతను, ప్రతిభను ప్రోత్సహించడమే నాట్స్ యొక్క ప్రధాన ఉద్దేశ్యం. గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న NATS ప్రవాసాంధ్రుల కొరకు ఏర్పరచిన స్వచ్చంధ సంస్థ. ఈ స్వచ్చంధ సంస్థ ద్వారా మన తెలుగు భాష, సంస్కృతి ఔన్నత్యముతో పాటు సామాజిక హితమైన ఎన్నో కార్యక్రమాలకు రూపకల్పన చేసి ఆ దిశగా అమెరికాతో పాటు మన తెలుగు రాష్ట్రాలలో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న విషయం మీ అందరికి విదితమే. ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేయడానికి కృషి చేసిన వాలంటీర్స్ కార్యదర్శి శ్రీనివాస్ చిలుకూరి, ఉమ్మడి కార్యదర్శి మనోహర్ మద్దినేని, కోశాధికారి గురు కొంక, రాజలక్ష్మి చిలుకూరి, సువర్ష కామరసు, సుధీర్ కోట, శంకర్ సింగంశెట్టి, మురళి ముద్దెన, వినయ్ కమతం, నాగరాజకుమార్ పెనుమత్స, నరసింహాచారి, నరేష్, శ్రీకాంత్ అట్టోటి, కిరణ్ తాడిపత్రి, దిలిప్, ఆనంద్, నరసింహ రావు, మాస్టర్ శివ పిడికిటి, మాస్టర్ నితిన్, మాస్టర్ సాత్విక్, మాస్టర్ నిఖిల్ లింగమనేని మరియు మాస్టర్ అశ్విత్ నండూరిలకు నాట్స్ లాస్ ఏంజెల్స్ కో-ఆర్డినేటర్ కిషోర్ బూదరాజు ధన్యవాదములు తెలిపారు.
ఉల్లాసంగా “నాట్స్” సంబరాల సన్నాహక సమావేశం


ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ(నాట్స్) ఆధ్వర్యంలో అమెరికా తెలుగు సంబరాలు పేరిట 2019 మే 24,25,26 తేదీల్లో డల్లాస్‌లో నిర్వహించనున్న 6వ ద్వైవార్షిక మహాసభల సన్నాహక సమావేశాన్ని శనివారం నాడు ఇర్వింగ్‌లోని మారియట్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అమెరికా నలుమూలల నుండి నాట్స్ కార్యవర్గ సభ్యులు భరీగా తరలివచ్చారు. డల్లాస్ పరిసర ప్రాంత ప్రవాసులు ఈ వేడుకలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్థానిక చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరింఛాయి. నాట్స్ ఉపాధ్యక్షుడు అప్పసాని శ్రీధర్ కార్యక్రమానికి హాజరయిన నాట్స్ కార్యవర్గాన్ని సభకు పరిచయం చేశారు. అనంతరం నాట్స్ చైర్మన్ గుత్తికొండ శ్రీనివాస్ మాట్లాడుతూ తెలుగువారు అత్యధికంగా నివసించే డల్లాస్‌లో అమెరికా తెలుగు సంబరాలు జరుపుకోవడం ఆనందంగా ఉందని, సంబరాల సమన్వయకర్త కంచర్ల కిషోర్ నేతృత్వంలో ఈ సభలు స్థానికుల తోడ్పాటుతో విజయవంతంగా జరుగుతాయని ఆశాభావాన్ని వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో నాట్స్ అధ్యక్షుడు మంచికలపూడి శ్రీనివాస్‌బాబు, మాజీ అధ్యక్షుడు మన్నవ మోహనకృష్ణ, నాట్స్ ప్రతినిధులు డా.మధు కొర్రపాటి, పిన్నమనేని ప్రశాంత్, అజయ్ గోవాడ, అమర్ అన్నే, వెంకట్ సానా, ఆది గెల్లి, శ్యాం మద్దాలి, నూతలపాటి రమేష్, సురేష్ మందాడి, దేశు గంగాధర్, స్థానిక ప్రవాసులు శీలం కృష్ణవేణి, సుబ్బు జొన్నలగడ్డ తదితరులు పాల్గొన్నారు.

నేడు డాలస్ లో నాట్స్ సదస్సు

నార్త్ అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) ఆద్వర్యంలో డాలస్ లో సదస్సులు నిర్వహిస్తున్నారు. వచ్చే మే 24 నుండి మూడు రోజుల పాటు ‘అమెరిక తెలుగు సంబరాలు’ పేరుతొ నిర్వహిస్తున్న సదస్సుకు సంబందించిన ఏర్పాట్లను, నిధుల సేకరణ, వివిధ కమిటీల ఏర్పాటు తదితర వాటిపై ఈ సదస్సులో నిర్ణయాలు తీసుకుంటారు. నాట్స్ బోర్డు చైర్మన్ గుత్తికొండ శ్రీనివాస్ , అద్యక్షుడు మంచికలపూడి శ్రీనివాస్, సంబరాల కమిటీ కన్వినర్ కంచర్ల కిషోర్, మాజీ అద్యక్షుడు మన్నవ మోహన కృష్ణ తదితరులు ఈ సమావేశంలో పాల్గొంటారు.

డాలస్‌లో ఘనంగా బాలల సంబరాలు


నాట్స్ డాలస్ చాప్టర్ ఆధ్వర్యంలో 8వ బాలల సంబరాలను ఫార్మర్స్ బ్రాంచ్ సెయింట్ మేరీస్ చర్చ్ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. భారతదేశ సంస్కృతిని, పిల్లలలోని మేధస్సును ప్రోత్సహించే దిశగా పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 300 మంది బాల బాలికలు గణితం, చదరంగం, శాస్త్రీయ సంగీత, నృత్యం మరియు తెలుగు పదకేళి పోటీలలోఉత్సాహంగా పాల్గొన్నారు. గూడవల్లి మణిధర్ గణిత పోటీలు నిర్వహించారు. విద్యార్థుల్లో సృజనాత్మకత ప్రోత్సహించేందుకు ఈ సంబరాలను నిర్వహిస్తున్నట్లు నాట్స్ ఉపాధ్యక్షుడు నూతి బాపు పేర్కొన్నారు. కార్యక్రమ విజయ్వంతానికి డాలస్ చాప్టర్ కార్యవర్గ సభ్యులు సురేంద్ర ధూళిపాళ్ల, ప్రసాద్ దాస్తి, నాగిరెడ్డి మండల, భాను లంక, అశోక్ గుత్తా, కృష్ణ వల్లపరెడ్డి, అను అడుసుమల్లి, తేజ వాసంగి, శ్రీధర్ న్యాలమడుగుల, కిరణ్ జాలాది, శ్రీధర్ వింజమూరి, శ్రీని కాసర్ల, దేవీప్రసాద్, మోహన్ మల్లిపెద్ది, వంశీ వడ్లమూడి, విజయ్ కొండా, వెంకట్ పోలినీడు, జీవన్ గోగినేని, నాట్స్ బోర్డు అఫ్ డైరెక్టర్స్ కిషోర్ కంచర్ల, రాజేంద్ర మాదాల, ఆది గెల్లి, జాతీయ కార్యవర్గ సభ్యులు బాపు నూతి, శేఖర్ అన్నే, కిషోర్ వీరగంధం, జ్యోతి వనం, శ్రీనివాస్ కొమ్మినేని, బావర్చి బిర్యానీ, టాంటెక్స్, టీ పాడ్, సిలికానాంధ్ర మనబడి సంస్థలు తోడ్పడ్డాయి.
సంజీవనికి సిఎం ద్వారా విరాళాలు అందించిన ప్రవాసులు

కృష్ణాజిల్లా కూచిపూడిలో సిలికానాంద్ర ఆద్వర్యంలో దాదాపు రూ.50కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన రెండు వందల పడకల మల్టీ స్పెషాలిటీ సంజీవని ఆస్పత్రికి ప్రవాసుల నుండి విరాళాలు భారీగా వస్తున్నాయి. 18వ తేదీన ఆసుపత్రి ప్రారంభించడానికి వచ్చిన చంద్రబాబు చేతుల మీదుగా పలువురు ప్రవాసులు సంజీవని ఆస్పత్రికి విరాళాలు అందజేశారు. ప్లోరిడాకు చెందిన నాట్స్ చైర్మన్ గుత్తికొండ శ్రీనివాస్ పది లక్షల రూపాయలు, డాలస్ కు చెందిన ప్రముఖ ప్రవాసాంధ్రుడు కోనేరు శ్రీనివాస్ ఆరు లక్షల రూపాయలు సిఎం చంద్రబాబు ద్వారా విరాళాలను అందజేశారు. వీరిరువురిని ముఖ్యమంత్రి చంద్రబాబు, సిలికానాంద్ర చైర్మన్ కూచిభొట్ల చైర్మన్ ప్రత్యేకంగా అభినందించారు. అమెరికాకు చెందిన ఇద్దరు చిన్నారుల వయసు పెద్దది. కూచిపూడిలో సిలికానాంద్ర కుటుంబ సభ్యుల ఆద్వర్యంలో నిర్మించిన మల్టీ స్పెషాలిటీ వైద్యశాలకు విరాళం అందించారు. అమెరికాలో తాము విక్రయించి, నృత్యాలు ప్రదర్శించి, స్నేహితుల కుటుంబ సభ్యులను ఇంటికి విందుకు పిలిచి ఆస్పత్రి నిర్మాణం గురించి వివరించి విరాళాలు సేకరించారు. ఇలా ఒక్కొక్కరు రూ.పది లక్షల చొప్పున ఆసుపత్రి నిర్మాణానికి విరాళం అందించారు. వీరిని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా సన్మానించారు.

గుత్తికొండ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో అమరావతిలో ఆరోగ్య బీమా ప్రాజెక్టు

ఆరోగ్య సంరక్షణ నిమిత్తం బీమా వ్యయం తగ్గింపు కోసం అమెరికాలో ఏర్పాటు చేసిన ‘ఆర్‌ఎక్స్‌-అడ్వాన్స్‌ ప్రాజెక్ట్‌’ను నవ్యాంధ్రలో అమలు చేసే ఆలోచన చేస్తున్నట్లు నాట్స్‌(ఉత్తర అమెరికా తెలుగు సంఘం) ఛైర్మన్‌ గుత్తికొండ శ్రీనివాస్‌ తెలిపారు. ప్రఖ్యాత ఆపిల్‌ సంస్థ మాజీ సీఈఓ జాన్స్‌ కల్లీతో కలసి ఆరోగ్య బీమా ప్రాజెక్ట్‌ను ఆర్‌ఎక్స్‌-అడ్వాన్స్‌ పేరిట చేపట్టినట్లు వెల్లడించారు. వైద్యులు మందుల చీటీపై రాసే ఆర్‌ఎక్స్‌ నే తమ ప్రాజెక్ట్‌ పేరుగా నిర్ణయించామన్నారు. రూ.14 వేల కోట్ల విలువైన ఈ ఉమ్మడి భాగస్వామ్య ప్రాజెక్ట్‌ ద్వారా అమెరికాలోని దాదాపు కోటి మంది లబ్ధిదారులుగా చేరారన్నారు. ఈ పథకం వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అమెరికాలో అమల్లోకి వస్తుందన్నారు. అమెరికాలోని బోస్టన్‌ ప్రధాన కార్యాలయం కాగా, భారత్‌లో నోయిడా, దిల్లీలలో కార్యాలయాలు ఏర్పాటు చేశామన్నారు. 300 మంది ఉద్యోగులు పని చేస్తున్నారని వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు కొద్ది నెలల కిందట ఈ ప్రాజెక్టు గురించి సూచనప్రాయంగా వివరించామని, త్వరలో పూర్తి ప్రాజెక్ట్‌ గురించి కంపెనీ ఉన్నతాధికారులు వివరిస్తారన్నారు. తిత్లీ తుపాను బాధితులను ఆదుకునేందుకు నాట్స్‌ ఆధ్వర్యంలో 50 మంది వలంటీర్లను పంపామన్నారు. రూ.5 లక్షల నిధులతో అన్నదానం, దుప్పట్లు, టవల్స్‌ పంపిణీ చేస్తున్నట్లు వివరించారు.

తిత్లీ బాధితులకి నాట్స్ సేవలు. అభినందించిన చంద్రబాబు.


శ్రీకాకుళం జిల్లా తిత్లీ బాధితులను ఆదుకునేందుకు ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ(నాట్స్) సంస్థ పలాస, సోంపేట ప్రాంతాలకు 50 మంది స్వచ్ఛంద కార్యకర్తలతో సహాయక కార్యక్రమాలను నిర్వహించింది. గ్లో పౌండేషన్ సహకారంతో బాధితులకు అవసరమైన చీరలు, దుప్పట్లు, బియ్యం తదితర నిత్యావసర సామాగ్రిని “నాట్స్ కిట్స్” రూపంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా అందించారు. నాట్స్ సంస్థ మందస మండలం కొండలోగం పంచాయతీని దత్తతకు తీసుకుంది. ఈ పంచాయతీకి అనుబంధంగా ఉన్న కొండలోగం, పట్టులోగం, తంగారపుట్టి, దాలకాయి, తెంతులగాం, లింబుగం, రాయికొల, కుసుమాల, తుబ్బిగాం, బాంసుగామ్, రామరాయి తదితర గ్రామాల్లో 10వేల మంది బాధితులకు సామాగ్రిని అందించారు. తుఫాను సహాయక చర్యల్లో చురుగ్గా పాల్గొంటున్న నాట్స్ సంస్థను ముఖ్యమంత్రి అభినందించారు.
అగ్ని ప్రమాద బాధితులకు నాట్స్ సాయం

రెండు నెలల కిందట సెయింట్‌ లూయిస్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బాధితుల్లో తెలుగువారు కూడా ఉన్నారు. అగ్ని ప్రమాద బాధితులను ఆదుకోవాలంటూ నాట్స్ సభ్యులు ఇచ్చిన పిలుపుకు స్పందించి తమ వంతు చేయూత అందించారు. ఇలా సేకరించిన $7500ల డాలర్ల మొత్తాన్ని బాధితులకు చెక్ రూపంలో అందించారు. నాట్స్ టీం వైఎస్ఆర్ కే ప్రసాద్, రమేశ్ బెల్లం, నాగశ్రీనివాస శిష్ట్ల ,రాజ్ ఓలేటి, రంగా సురేష్, వెంకట్ చింతాల ఈ చెక్కుల పంపిణి కార్యక్రమంలో పాల్గొన్నారు.