నవగ్రహాల విశిష్టత ఇది-తదితర ఆద్యాత్మిక వార్తలు

1.సూర్యుడు :
శ్రీ కశ్యప మహర్షికి దక్షుని పుత్రికయగు అదితికిని “వివస్వంతుడు (సూర్యుడు)” జన్మెంచెను
(ప్రభవ నామ సంవత్సర మాఘ మాస శుద్ద సప్తమి)
కశ్యపుని కొడుకు కనుక “కాశ్యపుడు” అని
అదితి కొడుకు కనుక “ఆదిత్యుడు” అని
అండమున మృతము లేనివాడు కనుక “మార్తాండుడు” అని నామములు వచ్చెను
సూర్యునకు సంజ్ఞాదేవికిని “వైవస్వతుడు” “యముడు” “యమున” లు జన్మించెను
సూర్యుని తీక్షతను భరించలేక సంజ్ఞాదేవి తన నీడను (ఛాయను) తనకు బదులుగా వెల్లి పుట్టింటికి వెల్లిపోయెను
తరువాత ఛాయకు “శని” భగవానుడు జన్మించెను
యముడు ధర్మరాజు అను నామముతో పితృలోకపాలకుడయ్యెను శని గ్రహ పదవిని పొందెను
వైవస్వతుడు రాబోవు మన్వంతరాలలో మనువు కాగలడు
2. చంద్రుడు :
అత్రి మహర్షి అనసూయల సంతానం
అత్రి మహర్షి తపస్సు చేయుచుండగా అతని వీర్యము భూమిపై పడెను సోమరూపైన వీర్యమును బ్రహ్మ లోక హితార్థమై తన రథమెక్కించుకొని భూమి చుట్టు ఇరవైఒక్క మారలు ప్రదక్షిణలు గావించెను ఆయన తేజస్సుచే జగదాధారభూతములైన సర్వౌషదులు మొలకెత్తెను
(నందన నామ సంవత్సర కార్తీక శుద్ద చతుర్థశి)
సోముని బ్రహ్మ భూమికి రాజును చేసెను
చంద్రుని పుత్రుడు బుధుడు
౩) కుజుడు :
శివుని నిండి వెలువడిన తేజము పార్వతీ దేవి గ్రహించి గర్భవతి అవగా ఆమే అఆ తేజమును భరింపలేక భూదేవికి ఇచ్చెను ఆమే ఆ తేజమును ధరింపగా “కుజుడు”(అంగారకుడు) జన్మించెను
(అక్షయ నామ సంవత్సరం వైశాఖ బహుళ విదియ)
రుద్రుని తేజము విష్ణువు సంరక్షణ భూదేవి ఓర్పు లభించినవాడు కనుక గ్రహమండలమున స్థానమునొందెను
4. బుధుడు :
సోమునకును రోహిని తారకు బుదుడు జన్మించెను
(సౌమ్య నామ సంవత్సరం భాద్రపద శుద్ద ఏకాదశి)
బుదునికి వైరజకిని పురూరవుడు జన్మించెను
5. బృహస్పతి :
సురూప ఆంగీరసులకు “బృహస్పతి” జన్మించెను
(సౌమ్య నామ సంవత్సరం ఆశ్వీయుజ శుద్ద ద్వాదశి)
ఇతని భార్య “తారాదేవి”
ఇతడిని దేవతలకు గురువుని చేసెను కనుక ఇతడిని
“గురుడు” అనెదరు
6. శుక్రుడు :
భృగు ప్రజాపతికిని ఉషనలకు సంతానం
“ఉశనుడు” జన్మించెను
(మన్మథ నామ సంవత్సరం శ్రావణ శుద్ద దశమి)
కుచేలుని ధనమును హరించుటచే పరమేశ్వరుడు కోపించి అతడిని చంపుటకు రాగా ఉశనుడు తన యోగ శక్తితో శివుని ఉదరమున ప్రవేశించెనుపరమేశ్వరుడు అతడినొ శిశ్నము ద్వార బయటకు విడిచెను అతడు శుక్రము రూపమున విసర్జింపబడెను కనుక అతడిని “శుక్రుడు” అనెదరుఅత్యంత మహా మంత్ర శక్తిని పోందినవాడు కనుక రాక్షసులు శుక్రుడిని వారి గురువుగా పొందిరి
నాటి నుండి “శుక్రచార్యునిగా” పెరుపొందెను
గ్రహమండలమున స్థానంపొందెను
7. శని :
సూర్యునికి ఛాయ దేవికిని కలిగిన సంతానమే “శని” ఇతని వృత్తాంతంము సూర్యుని వృత్తాంతమునందు చెప్పబడెను
(వికారి నామ సంవత్సరం మార్గశిర కృష్ణ నవమి)
ఇతడు మానవ జీవితాలలో అత్యంత ప్రభావము చూపువాడు
త్రిమూర్తుల సైతం ముప్పుతిప్పలు పెట్టినటువంటివాడు
గ్రహమండలమున స్థానం పొందెను
8. రాహువు :
కశ్యప మహర్షికి సింహికకును “రాహువు” జన్మించెను
ఇతడు రాక్షల లక్షణములు కలవాడు కనుక రాక్షసునిగా పరిగణిస్తారు(రాక్షస నామ సంవత్సరం కృష్ణ చతుర్థశి)
క్షీర సాగర మథనంలొ లబించిన అమృతాన్ని మహావిష్ణువు “మోహిని”అను రూపముతో పంచుతున్నపుడు రాహువు దేవతల రూపం దాల్చి అమృతమును గ్రహించెను సూర్యచంద్రులు చూసి విష్ణువుకి చెప్పగా తన చక్రముతో రాహువు తల ఖండించెను అమృత ప్రభావంతో తల మొండెము జీవముతో ఉండుటచేత పాము శరీరం అతకబడింది
9.కేతువు :
విష్ణువుచే ఖండింపబడిన రాహువు శరీరముకు పాము తల తగిలించి కేతువు అని నామం పెట్టిరిఇతని భార్య పేరు చిత్రలేఖరాహు కేతువులు ఇరువురు గ్రహమండలమున ఛాయగ్రహములుగా గుర్తింపునొందిరి…నవ గ్రహ దేవతల జన్మ వృత్తాంతములు చదివిన ఆపదలు తొలిగి మహా యశస్సు పొందెదరుఆయుష్యు ఆరోగ్యం సంకల్ప సాఫల్యము కలుగును
నవ గ్రహముల అనుగ్రహము కలిగి సర్వత్రా శుభమగును (అని బ్రహ్మ పురాణమందు చెప్పబడెను)
2. పుష్పశోభితం.. సుగంధభరితం
సంపెంగల సువాసన, మల్లెల గుబాళింపు, గులాబీల సోయగం, కనకాంబరాల కాంతులు, బంతిపూల రమణీయత, మందారాల మకరందం, కాకడాల వన్నె, సన్నజాజుల లాలిత్యం, చామంతుల చమక్కులు లక్ష్మీనారసింహునికి వినూత్న శోభ తెచ్చాయి.దాదాపు పద్దెనిమిది పైగా రకాల పూల పరిమళాలతో దేవేరుల సహిత శ్రీవారిని అర్చించారు. శ్రీఖాద్రీలక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో చివరి ఉత్సవంగా శుక్రవారం పుష్పయాగోత్సవం భక్తులకు నేత్రపర్వంగా సాగింది.. ఉత్సవంలో శ్రీదేవి, భూదేవి సమేత వసంత వల్లభులను వివిధ సుగంధ పుష్పాలతో అలంకరించారు.
3. సత్యదేవుని హుండీ ఆదాయం రూ.1.57 కోట్లు
అన్నవరం సత్యదేవుని దేవస్థానంలో గత 40 రోజులకు హుండీ ఆదాయం రూ.1.57 కోట్లు సమకూరింది. ఛైర్మన్‌ ఐ.వి.రోహిత్, ఈవో వి.త్రినాధరావుల సమక్షంలో హుండీ సొమ్మును శుక్రవారం లెక్కించారు. 263 గ్రాముల బంగారం, 1.055 కేజీల వెండి సమకూరిందన్నారు. అంతేకాకుండా యుఎస్‌ఏ, యుఏఈ, ఖతార్, ఆస్ట్రేలియా, మలేషియా, హాంకాంగ్, సింగపూర్‌ తదితర అనేక దేశాల కరెన్సీ నోట్లు కూడా వచ్చాయన్నారు. రద్దయిన పాత రూ.500 నోట్లు 46, రూ.వెయ్యి నోట్లు 6 వచ్చాయని అధికారులు వెల్లడించారు. ధర్మకర్తల మండలి సభ్యుడు కొత్త వెంకటేశ్వరరావు, ఆలయ సహాయ కమిషనర్‌ ఈరంకి జగన్నాథరావు తదితరులు పాల్గొన్నారు.
4. చురుగ్గా సీతారాముల కల్యాణ పనులు
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయంలో వచ్చే నెల 6 నుంచి కల్యాణ బ్రహ్మోత్సవాలు ఆరంభం కానుండటంతో ఇంజినీరింగ్‌ పనులు కొనసాగుతున్నాయి. ఏప్రిల్‌ 14న కల్యాణం ఉండగా దీనికి వారం రోజుల ముందే అన్ని పనులు పూర్తి చేయాలని భావిస్తున్నారు. కరకట్టపై ఉన్న రామాయణ విగ్రహాలకు రంగులను తీర్చిదిద్దడంతో పాటు వాటి మరమ్మతులను దాదాపు పూర్తి చేశారు. సౌమిత్రి సదనం వద్ద పార్కును పది రోజుల్లోగానే సుందరంగా ముస్తాబు చేయడానికి అన్ని చర్యలు చేపట్టారు. స్వాగత ద్వారాలకు అవసరమైన సామగ్రిని సిద్ధం చేసి తుది మెరుగులు దిద్దుతున్నారు. ఆలయం పడమర మెట్ల వైపున వెదురు తడికల పందిరి నిర్మాణ పనులు చేపట్టగా మాడ వీధుల్లో పూర్తిస్థాయిలో ఈ తరహా నీడను అందించే చర్యలు తీసుకోనున్నారు. గోదావరి తీరంలో చలువ పందిరిని నిర్మించనున్నారు. స్టేడియంతో పాటు మండపం వద్ద బారీకేడ్లను పరిశీలించి భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాల్సి ఉంది.
5. తిరుమల శ్రీవారి ఆలయంలో మార్చి 15వ తేదీన శ్రీరామ పట్టాభిషేకం అత్యంత వైభవంగా టిటిడి నిర్వహించనుంది. ముందురోజు ఏప్రిల్ 14వ తేది శ్రీరామనవమి పండుగ నేపథ్యంలో రాత్రి 7.00 నుండి 9.00 గంటల నడుమ శ్రీమలయప్ప స్వామివారు హనుమద్వాహనంపై మాడవీధులలో ఊరేగుతూ భక్తులను కటాక్షించనున్నారు.శ్రీరామ పట్టాభిషేక ప్రత్యేక కార్యక్రమాలుఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, తోమాలసేవ మరియు అర్చనను ఏకాంతంగా నిర్వహిస్తారు.రంగనాయకుల మండపంలో ఉదయం 9.00 నుండి 11.00 గంటల వరకు శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారికి, శ్రీ సీతారామ లక్ష్మణ సమేత హనుమంతులవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహిస్తారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంలతో అభిషేకం చేస్తారు.
6. చరిత్రలో ఈ రోజు/మార్చి 30
182 : ఈథర్ ను మత్తుమందుగా అమెరికన్ శస్త్రవైద్యుడు డా. క్రాఫోర్డ్ లాంగ్ మొదటిసారిగా ఉపయోగించాడు.
1867 : అలాస్కా ను రష్యా నుండి అమెరికా కొనుగోలు చేసింది.
1908 : సుప్రసిద్ధ భారతీయ నటి మరియు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత దేవికారాణి జననం (మ.1994).
1935 : ప్రముఖ తెలుగు సాహితీకారుడు తంగిరాల వెంకట సుబ్బారావు జననం.
1953 : ప్రముఖ స్వాతంత్ర్య పోరాట యోధుడు జమలాపురం కేశవరావు మరణం (జ.1908).
1983 : ప్రముఖ భారతీయ నటుడు నితిన్ జననం.
2002 : ప్రముఖ హిందీ సినీ గీత రచయిత ఆనంద్ బక్షీ మరణం (జ. 1930)
2005 : భారత దేశ రచయిత, కార్టూనిస్ట్ ఓ.వి.విజయన్ మరణం (జననం.1930).
2011 : ప్రఖ్యాత తెలుగు సినిమా హాస్యనటుడు మరియు ప్రతినాయకుడు నూతన్ ప్రసాద్ మరణం (జ.1945)
7. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
02 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులుసర్వదర్శనం భక్తులకు 02 గంటల సమయం పడుతుంది300 రూ ప్రత్యేక ప్రవేశం కలిగినవారికి 2 నుండి 3 గంటల సమయం పడుతుంది.నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 59,216నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య నిన్న స్వామివారి హుండీ ఆదాయం 3.76 కోట్లు
8. శుభమస్తు – నేటి పంచాంగం”
తేది : 30, మార్చి 2019
సంవత్సరం : విళంబినామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : ఫాల్గుణమాసం
ఋతువు : శిశిర ఋతువు
కాలము : శీతాకాలం
వారము : శనివారం{స్తిరవాసరే}
పక్షం : కృష్ణ (బహుళ) పక్షం
తిథి : దశమి
(ఈరోజు తెల్లవారుజాము 0 గం॥ 50 ని॥ నుంచి
మర్నాడు తెల్లవారుజాము 3 గం॥ 23 ని॥ వరకు)
నక్షత్రం : ఉత్తరాషాఢ
(నిన్న ఉదయం 12 గం॥ 44 ని॥ నుంచి
ఈరోజు సాయంత్రం 3 గం॥ 39 ని॥ వరకు)
యోగము : శివము
కరణం : వణిజ
వర్జ్యం : (ఈరోజు రాత్రి 8 గం॥ 11 ని॥ నుంచి ఈరోజు రాత్రి 9 గం॥ 59 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఈరోజు ఉదయం 8 గం॥ 28 ని॥ నుంచి ఈరోజు ఉదయం 10 గం॥ 15 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 7 గం॥ 50 ని॥ నుంచి ఈరోజు ఉదయం 8 గం॥ 39 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు ఉదయం 9 గం॥ 16 ని॥ నుంచి ఈరోజు ఉదయం 10 గం॥ 48 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు ఉదయం 6 గం॥ 12 ని॥ నుంచి ఈరోజు ఉదయం 7 గం॥ 44 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 52 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 3 గం॥ 24 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 6 గం॥ 12 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 28 ని॥ లకు
సూర్యరాశి : మీనము

వృక్షాలు…..దేవతా స్వరూపాలు

హిందువులు అన్ని జీవుల్లోను దేవుణ్ని చూశారు. అందువల్లనే ఆవులు వంటివి పూజనీయ జంతవులయ్యాయి. అలాగే కొన్ని పర్వతాలు పుణ్య స్థలాలయ్యాయి. కొన్ని నదులు పుణ్య నదులయ్యాయి. వాటికి ఆ పవిత్రత ఏ విధంగా వచ్చిందో వివరించే కథలు కూడా ఉన్నాయి. అలాగే చెట్లలో కూడా దేవుణ్ని చూశారు. కొన్ని చెట్లను దేవతా వృక్షాలన్నారు.నిజానికి చెట్లు భూమి మీద సౌరశక్తిని గ్రహించుకునే కేంద్రాల్లో ఒకటి. అవి మనకు కాయలు, పండ్లు, పువ్వులు, ఔషధాలు ఇవ్వడంతో బాటు వంట చెరుకు వంటివి ఇచ్చి మానవాళి మనుగడకు ఎంతగానో తోడ్పడుతున్నాయి. కాగా చెట్లకు మనుషుల మాదిరి ఆనందం, బాధ వంటివి ఉంటాయని మనువు పేర్కొన్నారు. అది ఆధునిక విజ్ఞాన శాస్త్రరీత్యా కూడా నిరూపితమయింది. భారతీయ రుషులు సైతం కొన్ని వృక్షాలను పవిత్రమైనవిగా పేర్కొన్నారు. ఇక ఆర్యులు చెట్లతో సహా ప్రకృతి శక్తులను పూజించేవారు. హిందువులు పవిత్ర మైన వృక్ష జాతులుగా పేర్కొనే వాటిలో తులసి, రావి (అశ్వత్థం), వేప, మారేడు, మర్రి, అశోక, ఉసిరి మరి కొన్ని ఉన్నాయి. దేవతా వృక్షాలుగా పేర్కొనే వాటిలో కొన్నిటికి అద్భుతమైన ఔషధ శక్తులు ఉండడం విశేషం. కొన్ని దేవతా వృక్షాల విశేషాలు తెలుసుకుందాం.
**తులసి
తులసి పవిత్రమైనదని అందరికీ తెలుసు. ప్రతి ఇంటిలో తులసి ఉండాల్సిన అవసరముంది. తులసి కథ అందరికీ తెలిసిందే. విష్ణుమూర్తికి తులసి ప్రీతికరమని,దానితోఆయనకు పూజ పుణ్యప్రదమనేది అందరికీ తెలిసిందే. తులసిని పవి త్రంగా ఉన్నప్పుడే ముట్టుకోవచ్చని, అనవసరంగా తుంచరాదనే నియమాలు కూడా ఉన్నాయి. తులసి పవిత్రతని చెప్పే ఒక శ్లోకం ఉంది. అది
యన్మూలే సర్వ తీర్థాని, యన్మధ్యే సర్వ దేవతా:
యదగ్రే సర్వ వేదాశ్చ, తులసీం త్వాం నమామ్యహం
మూలంలో సర్వ తీర్థాలు, మధ్య భాగంలో సర్వ దేవతలు, అగ్రభాగంలో సర్వ వేదాలు గల తులసి కి నమస్కరిస్తున్నాను అని దీని అర్థం. తులసికి ఎన్నో ఔషధ గుణాలున్నాయన్నవిషయం తెలిసిందే. తులసికి మనస్సును ఉద్వేగాలను, శరీరాన్ని పరిశుద్ధం చేసే శక్తి ఉందని చెబుతారు. అందువల్లనే యోగులు, సాధువులు వంటి వారు తులసి మాలను మెడలో ధరిస్తుంటారు. ఇతరుల చెడు భావాలను ఎదుర్కొని దూరం చేసే శక్తి తులసికి ఉంది. అంత ఎందుకు తులసిని స్పృశించడమే మనలను శుద్ధి చేస్తుందని చెబుతారు.
*రావి
దేవతా వృక్షాల్లో రావి(అశ్వత్థం)ఒకటి. అశ్వత్థం సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపం. రావి చెట్టులో త్రిమూర్తులు ఉన్నారని చెప్పే శ్లోకం కూడా ఉంది. అది
మూలతో బ్రహ్మ రూపాయ, మధ్యతో విష్ణు రూపిణి
అగ్రత: శివ రూపాయ, వృక్ష రాజాయతే నమ:
ఈ వృక్షం మూలం వద్ద్ద బ్రహ్మ, మధ్యలో విష్ణువు, అగ్రంలో శివుడు ఉన్నారని దీని అర్థం. ఇక రావి చెట్టు విష్ణువు రూపమని చెబుతారు. అందువల్లనే అశ్వత్థ నారాయణుడు అనే పేరు కూడా ఆయనకు ఉంది. మొహంజొదారో లో దొరికిన ఒక ముద్రలో సింధులోయ నాగరికతకు చెందిన ప్రజలు అశ్వత్థ వృక్షాన్ని పూజిస్తున్న దృశ్యం బయటపడింది. దేవదానవ యుద్ధంలో దేవతలు ఓడిపోయిన ఒక సందర్భంలో విష్ణువు అశ్వత్థ వృక్షంగా మారాడని పురాణాలు చెబుతున్నాయి. ఆయన ఆ చెట్టు రూపం దాల్చినందున దానికి పవిత్రత వచ్చిందని చెబుతారు. కృష్ణ నిర్యాణం కూడా ఈ చెట్టు కిందే జరిగిందని కొందరు చెబుతారు. స్త్రీలు సంతానం కోసం ఈ చెట్టు మొదలుకు గాని దాని కొమ్మలకు గాని ఎర్ర వస్త్రం గాని, ఎర్ర దారం గాని కట్టే ఆచారం ఉంది. ఏ చెట్టును నరకడమైనా పాపమే కాగా అశ్వత్థ వృక్షాన్ని నరకడం మహాపాపమని ఒక పురాణ వచనం. బుద్ధునికి ఈ చెట్టు కిందే జ్ఞానోదయం అయిందని చెబుతారు. అందువల్ల వారు దానిని బోధి వృక్షమని, జ్ఞాన వృక్షమని వ్యవహరిస్తారు.
*వేప
వేపచెట్టు లక్ష్మీ దేవి స్వరూపమని చెబుతారు. అందువల్లనే విష్ణు రూపమైన రావి చెట్టుకు, లక్ష్మీ రూపమైన వేప చెట్టును ఒకే చోట పాతి వాటికి వివాహం చేసే ఆచారం కూడా ఉంది. ఉత్తర హిందూస్థానంలో వేప చెట్టును నీమారి దేవిగా వ్యవహరిస్తారు. కొన్ని శుద్ధి కార్యక్రమాల్లో వేప రెమ్మలను ఉపయోగిస్తారు. వేపలో ఉన్న ఔషధ గుణాలు తెలిసినవే. వేప‌ చెట్టు గాలే శరీరానికి మంచిదని అంటారు. దాని ఆకులు క్రిమి సంహారిణిగా ఉపయోగిస్తాయి. దాని బెరడు కొన్ని రకా ల చర్మ వ్యాధుల చికిత్సలో ఉపయోగపడుతుంది.
*మారేడు
మారేడు పత్రాలనే సంస్కృతంలో బిల్వ పత్రాలంటారు. మారేడు శివునికి ప్రీతికరం. అందుకే ఆయనకు లక్ష పత్రి పూజలో కూడా బిల్వాలనే వాడతారు. అది దేవతా వృక్షమై నందునే దానిని కొన్ని రోజులలో, తిథులలో కోయరాదనే నిబంధన కూడా ఉంది. కోసేటప్పుడు కూడా ఒక శ్లోకం చదివి నమస్కరించి కోయాలంటారు.
ఆ శ్లోకం
అమృతోద్భవ శీవృక్ష మహాదేవ ప్రియ: సదా
గృహ్ణామి తవ పత్రాణి శివపూజార్థమాదరాత్‌
మారేడుకు అమృతం నుంచి ఉద్భవించిందని, శ్రీ వృక్షమని పేర్లు. అలాగే ఎప్పుడూ శివునికి ఇష్టమైనది. అటువంటి నీ పత్రాలను శివ పూజ నిమిత్తం కోస్తున్నాను అని దీని అర్థం. మారేడు లక్ష్మీ దేవికి ప్రీతికరం. మూడుగా కలసి ఉన్న బిల్వ దళాలను శివుని పూజకు వాడుతారు. ఈ మూడు పత్రాల దళం శివుని మూడు కనులకు ప్రతీక అని భావిస్తారు. జైనులకు కూడా ఇది పవిత్ర వృక్ష
1. చార్‌ధామ్‌ యాత్రకు వేళాయె
మంచుకొండల్లోని మహాధామాల యాత్రకు సమయం ఆసన్నమైంది. మినీ చార్‌ధామ్‌ యాత్రగా పేరున్న గంగోత్రి, యమునోత్రి, బదరీనాథ్‌, కేదార్‌నాథ్‌ ధామాలు తెరుచుకునే వేళలు ప్రకటించారు. ఏడాదిలో సుమారు ఆరునెలలు మాత్రమే తెరిచి ఉంచే ఈ పుణ్యక్షేత్రాలకు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు వేలాదిగా తరలివెళ్తారు. ఏటా అక్షయ తృతీయ నుంచి దీపావళి తర్వాత వచ్చే యమద్వితీయ వరకు భక్తులను అనుమతిస్తారు. మే నెల రెండో వారంలో తెరుచుకోనున్న వీటిని అక్టోబరు చివరి వారం వరకు దర్శించుకోవచ్చు. హిమగిరుల మధ్య సాహసోపేతంగా సాగే చార్‌ధామ్‌ యాత్ర ఆధ్యాత్మిక ఆనందంతో పాటు పర్యాటక ప్రియులకు అద్భుతమైన జ్ఞాపకాలను పంచుతుంది. మే, జూన్‌ నెలల్లో ఎక్కువ మంది యాత్రకు వెళ్లడానికి ఆసక్తి కనబరుస్తారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో.. జులై, ఆగస్టు నెలల్లో ప్రయాణం అంత అనుకూలంగా ఉండదు.
యాత్రకు వెళ్లదలచిన వాళ్లు www.onlinechardhamyatra.com/ వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. హరిద్వార్‌ రైల్వేస్టేషన్‌, బస్‌స్టేషన్‌, గురుద్వారా తదితర ప్రాంతాలు, రుషీకేశ్‌, జానకిఛట్టీ, గంగోత్రి, యమునోత్రి వంటి ముఖ్య ప్రదేశాల్లోనూ పేర్లు నమోదు చేసుకోవచ్చు. ఆధార్‌కార్డు, ఓటర్‌ కార్డు వంటి వ్యక్తిగత ధ్రువీకరణ పత్రాలు చూపించాలి. రెండు ఫొటోలు కూడా వెంట ఉంచుకోవాలి. తెలుగు రాష్ట్రాల్లోని పలు పర్యాటక సంస్థలు చార్‌ధామ్‌ యాత్ర ప్యాకేజీలు అందిస్తున్నాయి. వీటి ధర రూ.20,000 నుంచి రూ.35,000 (ఒక్కొక్కరికి) వరకు పేర్కొంటున్నాయి.
**హెలికాప్టర్‌లో..
డెహ్రాడూన్‌ నుంచి యమునోత్రికి, మర్నాడు యమునోత్రి నుంచి గంగోత్రికి, ఆ మరుసటిరోజున కేదార్‌నాథ్‌కు, అక్కడి నుంచి బదరీనాథ్‌కు చేరవేయడానికి హెలికాప్టర్‌ సర్వీసును బుక్‌చేసుకోవచ్చు. నాలుగురోజుల యాత్ర, రెండ్రోజుల యాత్ర.. ఇలా రకరకాల ప్యాకేజీలు అందుబాటులో ఉంటాయి. ఉత్తరాఖండ్‌ టూరిజంశాఖ వెబ్‌సైట్‌ (suttarakhandtourism.gov.inz)లో వివరాలు లభిస్తాయి.
2. శ్రీవారికి రూ.1.25 కోట్ల విరాళం
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారికి గురువారం రూ.1.25 కోట్ల విరాళం వచ్చింది. హైదరాబాదుకు చెందిన చింతలపాటి హోల్డింగ్స్‌ కంపెనీ రూ.1.03 కోట్ల విరాళాన్ని బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని ట్రస్టు కింద డిపాజిట్‌ చేసింది. అలాగే అన్నప్రసాదం ట్రస్టు కింద రూ.22 లక్షల విరాళాన్ని పలువురు భక్తులు సమర్పించారు.
3. మహిమాన్విత అవధూత!
కేవలం 32 సంవత్సరాలు జీవించి, ఎక్కువ కాలం తపస్సులోనే గడిపి, కపాలమోక్షం ద్వారా దేహాన్ని చాలించిన అవధూత మొగిలిచర్ల శ్రీదత్తాత్రేయ స్వామి. సమాధి నుంచే భక్తుల మనోరథాలను నెరవేరుస్తాననీ, జ్ఞానబోధ చేస్తానని ఆయన ప్రకటించారు. ఏటా ఆయన భక్తులు మాలధారణతో మండల దీక్ష చేసి, స్వామి పట్ల తమ ప్రపత్తిని చాటుకుంటారు.
**అది ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా మొగిలిచర్ల గ్రామ శివారు ఫకీరుమాన్యం… 1976 సంవత్సరం మే 6వతేదీ రాత్రి. ఆ రోజు వైశాఖ మాసం శుద్ధ సప్తమి. సమయం రాత్రి 11 గంటలు అవుతోంది. శీదత్తాత్రేయ స్వామి ఆశ్రమం భక్తులతో కిక్కిరిసి ఉంది. ఇంతలో ఎవరూ ఊహించని సంఘటన జరిగింది. స్వామివారి శరీరంలోంచి ఒక పెద్ద శబ్దం వినబడసాగింది. ఆ ధ్వని దూరం నుంచి ఒక మోటార్‌ సైకిల్‌ వస్తున్న శబ్దంలా ఉంది. రెండు నిమిషాల కాలం గడిచేసరికి ఆ శబ్దనాదం ఉద్ధృతంగా మారింది. అందరూ స్వామివారి వైపు చూశారు. ఆయన నాభి ప్రాంతం నుంచి మొదలైన ఆ శబ్దం క్రమంగా ఊర్ధ్వంగా శిరస్సుపై భాగానికి పాకిపోయింది. ఇలా దాదాపు ఐదు నిమిషాల పాటు జరిగింది. అందరూ ఆశ్చర్యంగా స్థాణువుల్లా నిలబడిపోయారు.
*ఆ శబ్దం ఒక్కసారిగా ఆగిపోయింది. ఆ మరునిమిషంలోనే స్వామివారి శిరస్సుపై మధ్యభాగం నుంచి రక్తం ధారగా కారింది. అదే సమయానికి ఆశ్రమం బయట ఉన్న వ్యక్తులకు ఆశ్రమం పై భాగం నుంచి ఒక నీలి రంగు జ్యోతి పైకెగసి ఆకాశంలో కలిసిపోవడం కనిపించింది. ఆ జ్యోతిని మొగిలిచర్ల గ్రామంలో ఉన్న వ్యక్తులూ చూశారు. స్వామివారు కపాలమోక్షం పొందారని ఆశ్రమం లోపల ఉన్న భక్తులకు అర్థమైంది. అప్పటి దాకా స్వామివారు తమ ప్రాణాన్ని శరీరంలోని నిలిపి ఉంచారని వారు గ్రహించారు. 1950 ఏప్రిల్‌ 14న అరుణాచలంలో శ్రీరమణమహర్షి శివైక్యం చెందినప్పుడు సరిగ్గా ఇదే జరిగింది. వారి దేహం నుంచి ఒక మహాజ్యోతి అరుణాచల పర్వతంలోకి ప్రవేశించడాన్ని ఎందరెందరో తిలకించారు. ఆ తర్వాత మొగిలిచర్ల దత్తాత్రేయ స్వామి జీవితంలో అలాంటి మహత్తర ఘటన ఆవిష్కృతమైంది.
**ఆధ్యాత్మిక కేంద్రంగా మారిన పల్లె
మొగిలిచర్ల ఒక పల్లెటూరు. సుమారు 46 సంవత్సరాల కిందట ఒక యోగి ఇక్కడ ఆశ్రమ నిర్మాణం మొదలుపెట్టేదాకా ఈ ఊరి గురించి బాహ్య ప్రపంచానికి తెలిసింది బహు తక్కువ. ఆరు అడుగులకు పైగా పొడుగు, తెల్లని మేని ఛాయ, నెత్తిన ముడివేసుకున్న జటాఝూటం లాంటి జుట్టు, చిరునవ్వు మోముతో ఉన్న 26, 27 ఏళ్ల వయసున్న దిగంబర యువకుడు ఆ ఊరిలో అడుగుపెట్టారు. 32 ఏళ్ల వయసులోనే కపాలమోక్షం ద్వారా సిద్ధి పొందిన ఆయన మొగిలిచర్ల దత్తాత్రేయస్వామిగా ప్రసిద్ధి పొందారు.
**ఇంటి మీద చిలుకలు… ఇంటి చుట్టూ సర్పం
మొగిలిచర్ల గ్రామానికి చేరువలో ఉన్న వలేటివారిపాలెం మండలంలో శ్రీలక్ష్మీ నారసింహుడు స్వయంభువుగా వెలసిన మాలకొండ (మాల్యాద్రి) ఉంది. అక్కడి పార్వతీదేవి ఆలయం స్వామివారి తపోసాధనకు కేంద్రం. ఫకీరుమాన్యం వద్ద ఆశ్రమ నిర్మాణానికి ముందు కొద్దిరోజుల పాటు ఆయన తన భక్తులైన పవని శ్రీధరరావు, నిర్మల ప్రభావతి దంపతుల ఇంటిలో ఉన్నారు. ఆయన తపస్సు ఎంత తీవ్రమైనదంటే, దాని శక్తికి పశుపక్ష్యాదులు కూడా ప్రభావితమయ్యేవి. దత్తాత్రేయస్వామి ఆ ఇంటిలో ఉన్నప్పుడు రోజుల తరబడి సమాధి స్థితిలోకి వెళ్లిపోయేవారు. ఆయనకు కేటాయించిన గది తలుపులు మూసివేసుకొని ధ్యానంలో మునిగిపోయేవారు. చిత్రంగా ఆ రోజులలో ఆ ఇంటి మీద వందలాది రామచిలుకలు వచ్చి వాలుతుండేవి. అదే సమయంలో ఇంటి చుట్టూ ఒక పెద్ద సర్పం తిరుగుతుండేది. అత్యంత దివ్య సుగంధ పరిమళం ఆ పరిసరాల్లో వ్యాపించేది. రాత్రిపూట ఒకరకమైన నీలి రంగు కాంతి వలయం ఏర్పడేది. ఈ సంఘటనలన్నిటికీ మొగిలిచర్ల గ్రామస్తులు ప్రత్యక్ష సాక్షులు.
**సమాధి నుంచే భక్తులకు అభయం
శ్రీదత్తాత్రేయస్వామి దేహధారులై ఉన్న రోజుల్లో తనను దర్శించుకోవడానికి ఎందరెందరో భక్తులు సుదూరప్రాంతాల నుంచి వస్తుండేవారు. సత్ప్రవర్తన, నైతిక జీవన ప్రాధాన్యం, క్రమశిక్షణతో కూడిన ఆధ్యాత్మిక విలువల ఆచరణ, మానవత్వ విలువల గురించే బోధిస్తూ వారిలో పరివర్తన తెచ్చేవారు. ప్రజల్లో గూడుకట్టుకున్న మూఢవిశ్వాసాలను తొలగించేవారు. ఆయనకు ఇతోధికంగా సేవలందించినవారిలో శ్రీధరరావు దంపతులు, మీరాశెట్టి దంపతులు, చెక్కా కేశవులు ముఖ్యులు. తన తపస్సు ఫలించిందనీ, దేహాన్ని త్యజించాలని నిర్ణయించుకున్నాననీ శ్రీదత్తాత్రేయస్వామి వారికి వెల్లడించినప్పుడు… లోకానికి మంచిని బోధించేందుకు మరి కొంతకాలం తమ మధ్య ఉండాలని వారు కోరారు. అయితే, తనను ఆశ్రయించిన భక్తుల మనోరథాలను నెరవేర్చేందుకు, వారికి తగిన బోధ చేసేందుకు, వారిలో పరివర్తన తెచ్చేందుకు శరీరంతో ఉండాల్సిన పనిలేదని, తన సమాధి నుంచే ఆ పని జరుగుతుందని స్వామి చెప్పారు. ఆ ప్రకారమే ఎందరినో అనుగ్రహించినట్లు మొగిలిచర్లకు వచ్చే భక్తులు తమ అనుభవాలను చెబుతూ ఉంటారు.
**ఎలా వెళ్ళాలి?
మొగిలిచర్లకు సమీపంలో ఉన్న రైల్వే స్టేషన్‌ సింగరాయకొండ. అక్కడి నుంచి కందుకూరు మీదుగా రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు. దూరం 60 కి.మీ. బస్సులో నేరుగా కందుకూరు వెళ్ళి అక్కడి నుంచి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న మొగిలిచర్లకు వెళ్ళవచ్చు. ఒంగోలు నుంచి 90 కిలోమీటర్ల దూరంలో (కందుకూరు మీదుగా) ఈ క్షేత్రం ఉంది. వసతి సదుపాయం, పల్లకీసేవ తదితర పూజా కార్యక్రమాల వివరాల కోసం 94402 66380, 9441916557 నెంబర్లలో సంప్రతించవచ్చు. ప్రతి శనివారం సమాధి మందిరం తలుపులు మూసి ఉంటాయి.
** నేటి నుంచి మండల దీక్ష
ప్రతి ఏటా వైశాఖ మాసంలో మొగిలిచర్ల దత్తాత్రేయ స్వామివారు సిద్ధి పొందిన శుద్ధ సప్తమి మండల దీక్ష సమాప్తమయ్యేలా భక్తులు మాలధారణ చేస్తుంటారు. ఈ ఏడాది మార్చి 29, 30, 31 తేదీల్లో మండల దీక్ష ఇవ్వనున్నారు.
4. శుభమస్తు
తేది : 29, మార్చి 2019
సంవత్సరం : విళంబినామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : ఫాల్గుణమాసం
ఋతువు : శిశిర ఋతువు
కాలము : శీతాకాలం
వారము : శుక్రవారం
పక్షం : కృష్ణ (బహుళ) పక్షం
తిథి : నవమి
(నిన్న రాత్రి 10 గం॥ 38 ని॥ నుంచి
మర్నాడు తెల్లవారుజాము 0 గం॥ 49 ని॥ వరకు)
నక్షత్రం : పూర్వాషాడ
(నిన్న ఉదయం 10 గం॥ 14 ని॥ నుంచి
ఈరోఉదయం 12 గం॥ 43 ని॥ వరకు)
యోగము : పరిఘము
కరణం : తైతిల
వర్జ్యం : (ఈరోజు రాత్రి 9 గం॥ 42 ని॥ నుంచి ఈరోజు రాత్రి 11 గం॥ 29 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఈరోజు ఉదయం 7 గం॥ 25 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 10 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 8 గం॥ 39 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 28 ని॥ వరకు)(ఈరోజు ఉదయం 12 గం॥ 45 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 34 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు ఉదయం 10 గం॥ 48 ని॥ నుంచి ఈరోజు ఉదయం 12 గం॥ 19 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు ఉదయం 7 గం॥ 44 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 15 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు సాయంత్రం 3 గం॥ 24 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 4 గం॥ 55 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 6 గం॥ 13 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 28 ని॥ లకు
సూర్యరాశి : మీనము
చంద్రరాశి : ధనుస్సు
5. చరిత్రలో ఈ రోజు/మార్చి 29
1790: అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ టేలర్ జననం.
1857: మొదటి భారత స్వాతంత్ర్య పోరాటం -సిపాయిల తిరుగుబాటు.
1952 : ప్రముఖ రచయిత కె.ఎన్‌.వై.పతంజలి జననం.
1953 : హైదరాబాదు రాష్ట్రానికి చెందిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు జమలాపురం కేశవరావు జననం.
1982: తెలుగు సినిమా నటుడు నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారు.
1997 : భారతదేశ ప్రముఖ కళాకారిణి మరియు రచయిత్రి పుపుల్ జయకర్

ఆది దంపతులు అని ఎందుకు అంటారు?

శివపార్వతులు ఆది దంపతులు. ఒకరంటే ఒకరికి పంచప్రాణాలు. పార్వతీదేవి హిమవంతుని కూతురు. కలిగినవారింట పుట్టిన పిల్ల. బాల్యంలో భోగభాగ్యాలు అనుభవించింది. ఆకులయినా తినకుండా తపస్సు చేసి అపర్ణగా మారి ఆయనను తనవాడిగా చేసుకుంది. అయితే, ఆ జంగమయ్యను చేరాక ఆమె అంతకాలం అనుభవించిన భోగమంతా మటుమాయమైంది. కపాలం పట్టుకుని, భవతీ భిక్షాందేహీ.. అంటూ ఊరంతా తిరుగుతూ, వల్లకాడులో సంసారం నడపమంటాడాయన. అయినా పరమేశ్వరి భర్తను ఎన్నడూ తూలనాడదు. తొందరపాటుతనంతో చాలా సందర్భాల్లో పీకలమీదికి తెచ్చుకుంటాడు శివుడు. అయినా పల్లెత్తుమాటయినా అనదామె. గంగమ్మను తెచ్చి సిగలో తురుముకున్నా, లోకం కోసమే పతిదేవుడు ఈ పనిచేశాడని అర్థం చేసుకోగలిగింది.
*శంకరుడు కూడా ఏ సందర్భంలోనూ పత్నికి అడ్డుచెప్పిందే లేదు. ఆమె నిర్ణయాలను కాదన్నదీ లేదు. తనకు దేనిమీదా అనురక్తిగానీ, ఆశలు కానీ లేకపోయినా, తనలో సగపాలయిన పార్వతీదేవికి ఉండవచ్చనేది ఆయన మాట. బాట. అతగాడు జడలు కట్టిన కేశాలతో… తోలుదుస్తులతో, కాలసర్పమే కంఠాభరణంగా తిరుగాడినా అమ్మవారు మాత్రం ఏడువారాల నగలతో పట్టుపీతాంబరాలతో సర్వాలంకారశోభితమై అలరారుతుంది. ఆయన వాక్కు అయితే, ఆమె ఆ వాక్యానికి అర్థం. ఆయన ఆదిభిక్షువైతే, ఈమె ఆయనకు అన్నం పెట్టే అన్నపూర్ణ అవుతుంది. ఇంతటి ఒద్దికైన ఆలుమగలను మరెక్కడా చూడలేం. ఆదిదంపతులుగా ఈ ప్రపంచాన వీరు ప్రసిద్ధమైంది ఇందుకే.
*ఇన్ని నియమాలెందుకు?
సనాతన సంస్కృతిలో పండుగలంటే కేవలం విశ్రాంతి కోసమో, ఆహ్లాదం కోసమో మాత్రమే కావు. ప్రతి పండుగ వెనుకా వైజ్ఞానిక, ఆరోగ్య, శాస్త్రీయ కారణాలుంటాయి. అంతరిక్షం నుంచి ప్రసరించే కాస్మిక్‌ కిరణాలను, విద్యుత్‌ అయస్కాంత్‌ తరంగాలను దృష్టిలో ఉంచుకుని, ఏ రోజున ఏ పని చేయడం వలన మనిషి జీవనం వికసిస్తుందో, ఇంతకుముందు ఉన్న స్థితి నుంచి మరింత గొప్ప స్థితికి ఎదిగే అవకాశం లభిస్తుందో, గమనించి ఆయా రోజులలో ప్రత్యేక పర్వదినాలు ఏర్పరిచారు మన మహర్షులు.శివరాత్రే యోగరాత్రి. శివరాత్రి రోజు ప్రకృతిలో ఉండే తరంగాలు, అంతరిక్షం నుంచి వెలువడే కాస్మిక్‌ కిరణాలు విశ్వ మానవ వికాసానికి, మనిషి తన పరిపూర్ణమైన రూపాన్ని తెలుసుకోవడానికి, ఆత్మసాక్షాత్కారానికి తోడ్పడుతాయి. అందుకే శివరాత్రికి ఈ నియమాలు.
*అభిషేకం
శివుడు అభిషేక ప్రియుడు. శిరస్సున కాసిన్ని నీరు పోసినా సంతోషంతో పొంగిపోతాడు.శివరాత్రి నాడు అందరూ వర్ణ, లింగ, జాతి, కుల భేధం లేకుండా శివుడిని అర్చించడం వలన, అభిషేకించడం వలన సదాశివుని అనుగ్రహంతో జీవితానికి పట్టిన పీడ తొలగిపోతుంది.
*జాగరణ
శివరాత్రికి చేసే జాగరణ మనలో ఉన్న శివతత్వాన్ని జాగృతం చేస్తుంది. తమస్సును తొలగిస్తుంది. సినిమాలు చూస్తునో, పిచ్చి కబుర్లు చెప్పుకుంటూనో, కాలక్షేపం చేస్తూనో చేసే జాగరణ… జాగరణ అవదు, కాలక్షేపం మాత్రమే అవుతుంది. అప్పుడు పుణ్యం రాకపోగా, ఆ సమయంలో మాట్లాడిన చెడు మాటల వలన పాపం వస్తుంది.
*మంత్ర జపం
శివరాత్రి మొత్తం శివనామంతో, ‘ఓం నమః శివాయ’ అనే పంచాక్షరీ మహామంత్ర జపం/స్మరణతో మీలో నిక్షిప్తమై ఉన్న అనంతమైన శక్తిని జాగృతం చేస్తుంది. శివోహం అనే భావనను కలిగిస్తుంది. నమకం, చమకం చదువుకోవాలి. రుద్రాభిషేకం చేసుకోవాలి లేదా చేయించుకోవాలి. తెలిసి చేసినా, తెలియక చేసినా, శివనామస్మరణ అనేక పాపాలను ప్రక్షాళన చేస్తుంది.

1. వెయ్యి కళ్లూ చాలవులే..!
సనాతన ధర్మాలు విరాజిల్లిన కర్ణాటకలోని మూడబిద్రిలో వెయ్యి స్తంభాల జైనదేవాలయం అనేక విశేషాలకు ఆలవాలం.రేవు నగరిగా గుర్తింపుపొందిన మంగళూరుకు 36 కిలోమీటర్లదూరంలో ఉన్న మూడబిద్రి పట్టణానికి దేవాలయాల పట్టణంగా పేరు. ఇక్కడ అనేక జైన, హిందూ దేవాలయాలు ఉన్నాయి. వీటిలో అత్యంత విశాలమైన వేయి రాతి స్తంభాల చంద్రనాథ తీర్థంకరుడి బసది చాలా ప్రాచీనమైంది. కన్నడభాషలో జైన దేవాలయాలను బసదులు అంటారు.కన్నడంలో తూర్పు దిక్కును మూడ అని అంటారు. బిద్రి అంటే వెదురు అని అర్థం. ఈ ఊరికి తూర్పు వైపు వెదురు ఎక్కువగా ఉండేది అందుకే మూడబిద్రి అనే పేరు వచ్చింది. ఈపట్టణం 18 అంకెతో ముడిపడి ఉండడం మరో విశేషం. ఇక్కడినుంచి 18 ప్రాంతాలకు వెళ్లడానికి విశాలమైన రహదారులున్నాయి. అలాగే 18 హిందూ దేవాలయాలు, 18 జైన దేవాలయాలు, 18 చెరువులు ఉన్నాయి. వీటిలో ముఖ్యమైంది జైన ధర్మ వాస్తు కళాకౌశలంతో నిర్మించిన 1000 స్తంభాల జైన దేవాలయం దీన్ని 1443లో నిర్మించారని… 1662లో శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని దేవరాజవడయార్‌ పునురుద్ధరించారని చెబుతారు. అలాగే కార్కళ ప్రాంతానికి చెందిన భైరవరాణి నాగలాదేవి ఈ దేవస్థానం ముందు 60 అడుగుల సుందర ధ్వజస్తంభాన్ని నిర్మించారు. గర్భగుడిలో ఎనిమిది అడుగుల చంద్రనాథ తీర్థంకరుడి కాంస్యవిగ్రహం ఉంటుంది. ఈ బసది ఏడుభాగాలుగా ఉంటుంది. చతురశ్ర, గర్భగుడి, శుఖనాశి, తీర్ధంకరమంటపం, గడ్డిగే మంటపం, చిత్రాదేవి మంటపం, భైరవదేవి మంటపాలున్నాయి. మరో విశేషమేమిటంటే ఇక్కడున్న వెయ్యి స్తంభాలు ఒకదానికి మరొకటి పోలికలేకుండా భిన్న కళాకౌశలంతో కనిపిస్తాయి. వీటిలోని అనేక కుడ్య చిత్రాలు ప్రకృతికి, మనిషికి ఉన్న అనుబంధానికి ఉదాహరణలుగా ఉన్నాయి. ప్రథమ తీర్ధంకరుడైన ఆదినాథుడి నుంచి చివరి తీర్ధంకరుడైన వర్ధమానమహావీరుడి వరుకు 24మంది తీర్ధంకరుల విగ్రహాలు దర్శనమిస్తాయి. ఆలయం మూడు అంతస్తుల్లో ఉంటుంది. అందుకే దీన్ని త్రిభువన తిలక చూడామణి అనికూడా అంటారు.
2. ఆచితూచి ఉండాలి..-ఏప్రిల్‌ 3న షబే మేరాజ్‌
ముహమ్మద్‌ ప్రవక్త (స) సప్త ఆకాశాలను దాటి వెళ్లిన రాత్రి.. అల్లాహ్‌తో స్వయంగా మాట్లాడిన అద్వితీయ ఘడియలను షబే మేరాజ్‌ అని పిలుస్తారు. నమాజ్‌ కానుకగా లభించిన అద్భుతమైన రాత్రిగా దీనిని భావిస్తారు. పాపాలు చేసిన వారికి నరక శిక్షలు ఎలా ఉంటాయో తెలిసిన రోజు కూడా ఇదే అని అంటారు. ఖురాన్‌లో ప్రస్తావించిన పరలోక జీవితం, స్వర్గ నరకాల గురించి ప్రవక్త (స)కు ప్రత్యక్షంగా చూపాడు అల్లాహ్‌. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ రోజును ముస్లిం సోదరులు పర్వదినంగా భావిస్తారు. షబ్‌ అంటే రాత్రి అనీ, మేరాజ్‌ అంటే నిచ్చెన అని అర్థం. ఈ రోజున ముస్లింలు అదనపు నమాజులు నిర్వహిస్తారు. రాత్రంతా జాగారం చేస్తారు. షబే మేరాజ్‌ సందర్భంగా ముహమ్మద్‌ ప్రవక్తకు అల్లాహ్‌ అందించిన ఆదేశాలు సమస్త మానవాళికీ మార్గదర్శకాలు.
* తల్లిదండ్రులతో మంచితనంతో వ్యవహరించాలి.
* బంధువులు, పేదవారు, బాటసారుల అవసరాలు తీర్చాలి.
* వృథాగా ఖర్చు చేసేవారు షైతాను సోదరులు.
* పేదరికానికి భయపడి కట్టుకున్నవారినీ, సంతానాన్ని విస్మరించకండి. హత్యలకు పాల్పడటం అతి పెద్ద నేరం.
* వ్యభిచారం దుష్టకార్యం.. ఆ దరిదాపులకు కూడా వెళ్లొద్దు.
* అనాథల సొమ్ము జోలికి పోవద్దు.
* ఇచ్చిన మాట నెరవేర్చండి. వాగ్దానం విషయంలో సమాధానం చెప్పవలసి ఉంటుందని గుర్తించండి.
* వస్తువులను కొలపాత్రతో ఇస్తే.. పూర్తిగా నింపి ఇవ్వాలి. తూచి ఇస్తున్నట్లయితే.. సరైన తరాజు ఉపయోగించాలి.
* తెలియని విషయం వెంట పడకండి. అందని దానికి అర్రులు చాచడం వల్ల కళ్లు, చెవులు, మనసు అన్ని విషయాల్లోనూ విచారణ ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఈ విషయాలు గుర్తెరిగి నడుచుకున్న వాళ్లు అంతిమ తీర్పు రోజున విశ్వాసిగా గుర్తింపు పొందుతాడని ప్రభువు సెలవిచ్చాడు. ఇహంలో అహాన్ని ప్రదర్శించిన వాళ్లు.. పరంలో కష్టాల పాలవ్వడం ఖాయమని హెచ్చరించాడు.
3. కొలువుదీరిన త్రిశక్తి
నైమిశారణ్యం భారత భాగవతాది పురాణాల రచనకు వేదికైన పుణ్యభూమి శౌనకాది మహారుషులు తపమాచరించిన తపోభూమి అనేక పుణ్యతీర్దాల నెలవు. ఉత్తరప్రదేశ్ రాష్రం లోని కొలువై ఉన్న ఈ క్షెత్రంలో మహత్తర నిర్మాణాన్ని పూర్తీ చేశారు. ఓ తెలుగు వ్యక్తీ. 42 అడుగుల మహావిష్ణువు, 42 అడుగుల విశ్వజనీ అమ్మవారు ఇంకా 27 ఆలయాలున్న ఓ ఆలయ సముదాయాన్ని పశ్చిమగోదావరి జిల్లా వీరంపాలెంకి చెందిన గరిమెళ్ళ వెంకట రమణ శాస్త్రి ఆద్వర్యంలో నైమిశారణ్యం నిర్మించారు. ఇప్పటికే వీరంపలెంలో బాలత్రిపురసుందరీ పీటాన్ని నిర్మించారాయణ. పద్దెనిమిది శక్తిమాతలను ప్రతిష్టించి అత్యద్భుత త్రిశక్తి దామాన్ని ఏర్పాటు చేయాలన్నది వెంకటరమణ శాస్త్రి సంకల్పం. దీనికోసం ఎన్నో ప్రాంతాలు తిరిగిన తర్వాత లక్నోకు 110 కిమీ దూరంలో ఉన్న నైమిశారన్యాన్ని ఎంచుకున్నారు. అక్కడ నదీ తీరంలో ఎకరన్నరం స్థలంలో ఎంతో శ్రమతో అద్భుత ఆలయ ప్రమ్గానాన్ని సాకారం చేశారు. నిర్మాణం కోసం జైపూర్ నుంచి పాలరాతి విగ్రహాలు.. మహాబలిపురం నుంచి రాతి విగ్రహాలు తెప్పించారు. శిల్పులను తమిళనాడు నుంచి, కార్మికులను విశాఖపట్నం నుంచి, టైల్స్‌ వేసేవారిని బిహార్‌ నుంచి రప్పించారు. రెండున్నర సంవత్సరాలు అహోరాత్రాలు శ్రమించారు. త్రిశక్తిధామంలో గణపతిధామం, 42 అడుగుల విశ్వజనని అమ్మవారు, 42 అడుగుల శ్రీమన్నారాయణుడి విగ్రహాలు, దశమహావిద్య ఆలయాలు, సప్తమాతృకలు, మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి ఆలయాలు ఉంటాయి.
* మంచి భోజనం, చక్కని వసతి దొరికేలా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు.భక్తుల కోసం 50 గదులను నిర్మించారు. ఇక్కడకు వచ్చిన వారు ఏడు రోజులు ఇక్కడ ఉండడం ఆనవాయితీ. దానికి తగ్గట్లు ఇక్కడ ఏర్పాట్లు చేశారు. ప్రముఖుల ప్రవచనాల కోసం ఒక ప్రత్యేక సముదాయం నిర్మించారు. 500 మంది ఒకేసారి భోజనం చేసేందుకు భోజనశాల, రెండు పాకశాలలు.. శాశ్వత యజ్ఞశాల నిర్మిస్తున్నారు. మార్చి 17వ తేదీన ఆలయాల ప్రతిష్ఠ జరగనుంది.

ఆ స్వామి డోలోత్సవం ప్రత్యేకత అదే

మహావిష్ణువు దశావతారాల్లో రెండవ అవతారం కూర్మం. స్వామివారు కూర్మనాథుడిగా వెలసిన క్షేత్రం శ్రీకూర్మం. బ్రహ్మదేవుడు ప్రతిష్ఠించిన ఈ శ్రీకూర్మ క్షేత్రం హిందూదేశానికే తలమానికం. ప్రాచీన శిల్పకళా శోభితంగా, దేశ నలుమూలలు నుంచి వచ్చే భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాలను పంచిపెడుతూ అలరారుతోంది. వైష్ణవుల 108 దివ్యారామాల్లో ప్రముఖంగా ఉంది. అంతటి మహిమాన్విత గల ఈ క్షేత్రంలో ప్రముఖమైన ఉత్సవంగా ఫాల్గుణ మాసంలో జరిగే డోలోత్సవానికి రంగం సిద్ధమైంది. ప్రతి ఏటా ఫాల్గుణమాస త్రయోదశి నాడు మఖ నక్షత్రంలో ఈ ఉత్సవం ప్రారంభమవుతుంది.

**మన్మథుని దహించేందుకు గానూ తొలుత స్వామివారి ఉత్సవమూర్తులను శేషవాహనంపై ఉభయానాంచారులతో కలిపి గోవిందరాజస్వామి, చొప్పరంలో సీతారామ, అశ్వవాహనంపై లక్ష్మణ, పల్లకీలో చక్రనారాయణస్వామి హోమం అనంతరం ప్రత్యేక పూజలనంతరం కామదహనం చేస్తారు. గరుడవాహనం పై ఉంచి మేళతాళాలతో తిరువీధి నిర్వహిస్తారు. గ్రామ సమీపంలోని కామదహనం మంటపం వద్ద కామదహన కార్యక్రమాన్ని వేదపండితులు నిర్వహిస్తారు.పడియ… కామదహనంలో పాల్గొన్న భక్తులు వేకువజామున సమీపంలోని సముద్రస్నానాలు చేసి ఆలయంలోని శ్వేతపుష్కరిణిలో పవిత్ర స్నానాలు ఆచరిస్తారు. అనంతరం స్వామిని దర్శించుకోవడంతో పడియ ఉత్సవం పూర్తవుతుంది. శ్వేతపుష్కరిణిని విష్ణువు సుదర్శన చక్రంతో తవ్వడం జరిగింది. తవ్వుతున్న సమయంలో లక్ష్మీదేవి గరుడవాహనంపై కూర్చున్న విగ్రహం లభ్యమవ్వడంతో ఆలయంలో శ్రీకూర్మనాయకిగా పూజలందుకుంటోంది.
**డోలోత్సవం…
డోలాయమానం గోవిందం మధ్యస్ధ మధుసూదనం రథస్త వామనం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే…డోలోత్సవంలో ఉయ్యాల మంటపంలో ఉన్న స్వామిని దర్శనం చేసుకుంటే పునర్జన్మ ఉండదన్నది శ్లోక భావన. గ్రామదేవత మోహినీ భద్రాంబిక దర్శనార్ధమై శ్రీకూర్మనాథుడు రాజరాజ అలంకరణలో డోలామంటపం వద్దకు వెళ్తారని స్ధలపురాణం చెపుతుంది. ఈ సందర్భంగా స్వామిపాదాలను భక్తులు తాకే అవకాశం ఉంది. స్వామి అస్పృశ్య దోష నివారణకు బుక్కా, భర్గుండ (రంగులు కలిపిన పదార్ధం)తో అర్చకులు పూజలు చేస్తారు.పూజ చేసిన బుక్కా, భర్గుండను భక్తులపై చల్లుతారు. సనాతనంగా వచ్చిన ఈ ఉత్సవమే ప్రస్తుతం హోళీగా మారిందని చెబుతుంటారు. డోలోత్సవం రోజున ఆలయం నుంచి గజ వాహనంపై స్వామివారు, మరోవాహనంపై ఉభయ నాంచారులు తిరుగు ప్రయాణంలో గరుడవాహనంపై స్వామి వారు తిరిగి ఆలయానికి చేరుకుంటారు. ఉదయం మాడ వీధుల గుండా జరిగిన ఈ యాత్ర డోలా మంటపం చేరుకున్న తరువాత ఉత్తర నక్షత్ర లగ్నమందు ఉత్తరాభిముఖ దర్శనం ఇస్తారు. విజయనగరం రాజవంశీకుడు పూసపాటి అశోకగజపతిరాజు గోత్ర నామాలతో తొలిపూజలు చేస్తారు. శ్రీరంగం, వైకుంఠంలో స్వామిని చేరేందుకు గద్యత్రయం పఠనం చేస్తారు.
**కూర్మనాథుని ఆవిర్భావం….
ఆలయం తొలుత దేవతలు నిర్మించగా, 2వ శతాబ్దంలో అనంత చోళగంగుడు, అనంగ భీముడు హయాంలో పునఃనిర్మాణం జరిగింది. కూర్మనాథుడి పైనే భూమి అంతా ఆధారపడి ఉందని, క్షీరసాగర మధనంలో దేవతలు, రాక్షసులు వాసుకిని తాడుగా చేసుకొని మందర పర్వతాన్ని కవ్వంగా చేసి చిలుకుతున్నప్పుడు మందర పర్వతం సముద్రంలోకి కుంగిపోసాగింది. ఆ సమయంలో విష్ణువు కూర్మావతారం దాల్చి మందర పర్వతాన్ని తన మూపున మోస్తూ అమృతం పొందేందుకు సహకరించాడు. తాను స్వామిని కూర్మరూపునిగా సందర్శించాలని ఉందన్న శ్వేత చక్రవర్తి కోరిక మేరకు స్వామి కూర్మరూపంలో ఇక్కడ దర్శనమిచ్చారని స్ధలపురాణం చెబుతుంది.గోపురం అష్టదళపద్మాకారంలో ఉంటుంది. ఈ గోపురంపై గల గాంధర్వ, నారసింహా, కపీశ, హయగీవ్ర, ధదివక్త్ర దర్శనం పుణ్యభరితమని, సర్వరోగ, సకల పాప నివారణి అని చెబుతారు.ఈ క్షేత్రంపై మహమ్మదీయ చక్రవర్తులు దాడికి దిగుతున్నారని తెలిసి, స్థానికులు సున్నం, గుగ్గిలం రాశులుగా పోసారట. వాటిని సైనికుల కొండలుగా భావించి, వీరిని జయించలేమని మహమ్మదీయ సేనలు వెనుదిరిగారట. అప్పటి సున్నం, గుగ్గిలం ఆనవాళ్లు మనం చూడవచ్చు. క్షేత్ర పాలకునిగా ఆలయం చెంతనే శివుడు పాతాళ సిద్ధేశ్వరుడుగా దర్శనమిస్తాడు.
**త్రిమతాచార్యులు సందర్శించిన ఏకైక క్షేత్రం….
ఈ క్షేత్రాన్ని ఎనిమిదో శతాబ్దంలో ఆదిశంకరాచార్యులు సందర్శించి స్వామి వారికి సాలగ్రామాన్ని సమర్పించారు. 11వ శతాబ్దంలో స్వామిని సేవించిన రామానుజాచార్యులు కోరిక మేరకు తూర్పు ముఖం కలిగి ఉన్న కూర్మనాథుడు పశ్చిమానికి తిరిగి దర్శనం ఇచ్చాడని చెబుతారు. అందుకోసం రెండు ధ్వజస్తంభాలను ఇక్కడ చూడవచ్చు. 13వ శతాబ్దంలో మధ్వాచార్యులు శ్రీనరహరి తీర్థులు క్షేత్రాన్ని సందర్శించి సీత, రామలక్ష్మణ ఉత్సవమూర్తులను బహూకరించారని, ప్రస్తుత ఉత్సవమూర్తులైన గోవింద రాజస్వామి, శ్రీదేవి, భూదేవి విగ్రహాలను లవకుశులు సమర్పించారని పురాణాలు చెబుతున్నాయి. 1512వ సంవత్సరంలో చైతన్య మహాప్రభువులు క్షేత్రాన్ని సందర్శించారు. శైవ, విషు
**శిల్పకళా శోభితం …..
శ్రీకూర్మనాథుని సన్నిధి అపురూప శిల్పకళతో అలరారుతోంది. ఇక్కడి 108 రాతిస్తంభాలు ఒక దానికీ మరొకదానికీæ పోలికలు ఉండవు. ప్రదక్షిణ మంటపం చుట్టూ 24 నల్లరాతి స్తంభాలున్నాయి. ఇందులో ఏకశిలతో తయారు చేసినట్టుండే ఈ శిల్పాలు మూడు శిల్పాలతో నిర్మితమైనవే. ఆకుపసరు చిత్రాలు ఇక్కడ భక్తులను ఆకట్టుకుంటాయి.
**పితృమోక్ష క్షేత్రం…
ఈ క్షేత్రం ఆవరణలోని శ్వేతపుష్కరిణిలో చనిపోయిన పెద్దల అస్తికలను కలిపితే ముక్తి లభిస్తుందని, ఇందులో కలిపిన అస్తికలు వారం రోజుల్లో శిలలుగా మారుతాయనీ విశ్వాసం. కూర్మనాథుని దర్శిస్తే శని వల్ల కలిగే ఈతిబాధలను నివారించుకోవచ్చునని, శనిదోషనివారణకు తిరుమంజన సేవలో పాల్గొంటే మంచిదని స్థలపురాణం చెబుతుంది.
1. వైభవంగా కదిరి ఖాద్రీశుని రథోత్సవం
అనంతపురం జిల్లా కదిరిలోని శ్రీఖాద్రీలక్ష్మీ నరసింహుని బ్రహ్మరథోత్సవం మంగళవారం వైభవంగా జరిగింది. ఉదయం 8.25గంటలకు శుభ ఘడియల్లో అతిథులు మోకులు లాగి మడుగు తేరును కదిలించారు. ఆ తర్వాత 8.45 గంటలకు ముందుకు సాగిన ఖాద్రీనృసింహుడు తిరుమాడ వీధుల్లో అయిదున్నర గంటల పాటు విహరించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల భక్తులు లక్షమందికి పైగా కార్యక్రమానికి హాజరయ్యారు.
2. భక్తులారా… ఓటేయండి!
గుడికెళితే పుణ్యం దక్కుతుందనీ, పాపాలు పోతాయనీ భక్తుల విశ్వాసం. రోజూ ఠంచనుగా గుడికి వెళ్తున్నట్లు, ఐదేళ్లకు ఓ సారి జరిగే ఎన్నికల్లో ఓటు వేయడానికి అందరూ పోలింగ్‌ కేంద్రంలోకి అడుగుపెడుతున్నారా? అంటే చెప్పలేం. అందుకే తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లా యంత్రాంగం కాస్త వినూత్నంగా ఆలోచించింది. అక్కడి అరుణాచలేశ్వర ఆలయానికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. ప్రతి పౌర్ణమి నాడు భక్తులు ఆ ఆలయానికి పోటెత్తుతారు. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని దేవాలయ బోర్డుతో కలిసి జిల్లా యంత్రాంగం ఓటింగ్‌ అవగాహనా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది.ఆలయానికి వచ్చిన భక్తులందరికీ ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తూ కరపత్రాలు పంచిపెడుతోంది. అలాగే 100 శాతం ఓటింగ్‌ ఉండాలని సూచిస్తూ ప్రసాదం సంచుల్లో ఓ కాగితాన్ని కూడా అందిస్తున్నారు. వీటిని దర్శనం టిక్కెట్లతో పాటు ఇచ్చే ఏర్పాట్లూ చేశారు. అంతేకాదు, ఓటు హక్కు విలువను తెలియజేస్తూ వీధి నాటకాలు, విద్యార్థులతో బైక్‌ ర్యాలీలు… ఓటింగ్‌ శాతం పెంచడానికి వీలున్న ఏ అవకాశాన్నీ అధికారులు వదులుకోవడం లేదు.
3. 3నుంచి శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు
శ్రీశైల మహాక్షేత్రంలో ఏప్రిల్‌ 3 నుంచి 7వ తేదీ వరకు ఉగాది మహోత్సవాలు నిర్వహించనున్నట్లు దేవస్థానం ఈవో శ్రీరామచంద్రమూర్తి మంగళవారం తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు శ్రీస్వామి అమ్మవార్లకు వివిధ వాహనసేవలు, గ్రామోత్సవం నిర్వహిస్తామని చెప్పారు. ఆరో తేదీ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ స్వామి అమ్మవార్లకు రథోత్సవం జరగనుందని తెలిపారు.
4. శుభమస్తు
తేది : 27, మార్చి 2019
సంవత్సరం : విళంబినామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : ఫాల్గుణమాసం
ఋతువు : శిశిర ఋతువు
కాలము : శీతాకాలం
వారము : బుధవారం
పక్షం : కృష్ణ (బహుళ) పక్షం
తిథి : సప్తమి
(నిన్న రాత్రి 8 గం॥ 8 ని॥ నుంచి
ఈరోజు రాత్రి 9 గం॥ 0 ని॥ వరకు)
నక్షత్రం : జ్యేష్ట
(నిన్న ఉదయం 7 గం॥ 18 ని॥ నుంచి
ఈరోజు ఉదయం 8 గం॥ 21 ని॥ వరకు)
యోగము : వ్యతీపాతము
కరణం : భద్ర(విష్టి)
వర్జ్యం : (ఈరోజు సాయంత్రం 4 గం॥ 59 ని॥ నుంచి ఈరోజు రాత్రి 6 గం॥ 42 ని॥ వరకు)
మ్రుతఘడియలు : (నిన్న రాత్రి 11 గం॥ 9 ని॥ నుంచి ఈరోజు తెల్లవారుజాము 0 గం॥ 49 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 11 గం॥ 57 ని॥ నుంచి ఈరోజు ఉదయం 12 గం॥ 45 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు ఉదయం 12 గం॥ 21 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 52 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు ఉదయం 10 గం॥ 49 ని॥ నుంచి ఈరోజు ఉదయం 12 గం॥ 20 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు ఉదయం 7 గం॥ 46 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 17 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 6 గం॥ 15 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 28 ని॥ లకు
సూర్యరాశి : మీనము
చంద్రరాశి : వృచ్చికము
5. చరిత్రలో ఈ రోజు/మార్చి 27
ప్రపంచ రంగస్థల దినోత్సవం
1845 : ఎక్స్ కిరణాల ఆవిష్కర్త, నోబెల్ బహుమతి గ్రహీత, విల్హేల్మ్ కన్రాడ్ రాంట్జెన్ జననం.(మరణం.1923)
1903 : ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు హెచ్.వి.బాబు జననం.
1968 : అంతరిక్షంలోకి వెళ్ళిన మొట్టమొదటి మానవునిగా చరిత్రకెక్కిన యూరీ గగారిన్ మరణం.
1981 : భారత బాక్సింగ్ క్రీడకారుడు అఖిల్ కుమార్ జననం.
1998 : ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వారు వయాగ్రా మందును మగవారి నరాలబలహీనత కు ఔషధంగా ధ్రువీకరించారు.
1898 : భారత విద్యావేత్త, ముస్లిం తత్వవేత్త, సామాజిక వేత్త మరియు రాజకీయవేత్త సయ్యద్ అహ్మద్ ఖాన్ మరణం. (జననం.1817)
6. అమర్‌నాథ్‌కు ఆహ్వానం
హిమాలయాలంటేనే మహిమాన్విత పుణ్యక్షేత్రాలకు నెలవు. కశ్మీర్‌కు ఉత్తరాన హిమగిరుల్లో స్వయంభువుగా వెలిసే మంచు లింగ దర్శనం కోసం సాగించేదే అమర్‌నాథ్‌ యాత్ర. ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి ఎందరో భక్తులు ఈ యాత్రకు వెళ్తుంటారు. ఏటా పరిమితంగా 55 నుంచి 60 రోజుల పాటు సాగే అమర్‌నాథ్‌ యాత్ర ఈ ఏడాది జులై మొదటి వారం నుంచి ఆగస్టు 15 (రాఖీ పౌర్ణమి) వరకు సాగనుంది. అమర్‌నాథ్‌ యాత్ర పేర్ల నమోదు ప్రక్రియ మొదలైంది.
* యాత్రికులు తమ దరఖాస్తులను పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు, జమ్ము కశ్మీర్‌ బ్యాంకు, యెస్‌ బ్యాంకుల్లో నమోదు చేసుకోవాలి.
* తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో మొత్తం 11 శాఖలలో ఈ సదుపాయం ఉంటుంది.
* హైదరాబాద్‌లో రాష్ట్రపతి రోడ్‌, హిమాయత్‌నగర్‌లలో ఉండే పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు బ్రాంచీల్లో కానీ, చార్మినార్‌ దగ్గర పత్తర్‌ఘట్టిలో ఉన్న జమ్మూ కశ్మీర్‌ బ్యాంకులో కాని తమ పేర్లు నమోదు చేసుకోవచ్చు.
***హెల్త్‌ సర్టిఫికేట్‌ ఇలా..
* బ్యాంకులో పేర్ల నమోదుకు ముందుగా నిర్దేశిత ఆసుపత్రుల నుంచి ఆరోగ్య ధ్రువీకరణ పత్రం (హెల్త్‌ సర్టిఫికేట్‌) పొందాలి.
* శ్రీ అమర్‌నాథ్‌ జీ ష్రైన్‌ బోర్డు నిర్దేశించిన నమూనాలో వారు ఎంపిక చేసిన వైద్యులతో పరీక్షలు చేయించుకుని ఆరోగ్య ధ్రువీకరణ పత్రాన్ని పొందవలసి ఉంటుంది.
* దరఖాస్తులు శ్రీఅమర్‌నాథ్‌జీ ష్రైన్‌ డాట్‌ కామ్‌ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.
***యాత్ర నియమాలు
* ముందు వచ్చినవారికి ముందు అనే పద్ధతిలో యాత్ర సాగుతుంది. రోజుకు 7,500 మందిని అనుమతిస్తారు.
* యాత్ర చేయడానికి పహల్గామ్‌, బాల్తాల్‌ పట్టణాల మీదుగా రెండు మార్గాలు ఉంటాయి. ఏ మార్గంలో వెళ్లాలనుకుంటున్నామో, ఎప్పుడు వెళ్లాలనుకుంటున్నామో ముందుగా నిర్ణయించుకుని చెబితే ఆ మార్గాన్ని అనుసరించి అనుమతి ఇస్తారు.
* పూరించిన దరఖాస్తు, హెల్త్‌ సర్టిఫికేట్‌తోపాటు మూడు పాస్‌పోర్టు సైజ్‌ ఫొటోలు ఇవ్వాలి.
* హెల్త్‌ సర్టిఫికేట్‌ ఫిబ్రవరి 15 తర్వాత మాత్రమే తీసుకోవాలి.
* దరఖాస్తుతో పాటు ఆధార్‌ కార్డు, ఇతర చిరునామా ధ్రువీకరణ పత్రాలను అందజేయాల్సి ఉంటుంది.
* ఎంపిక చేసిన బ్యాంకులో మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు, శనివారం మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 4 వరకు మాత్రమే నమోదు చేసుకుంటారు.
****ప్రైవేటు ఏజెంట్లు.. స్పాట్‌ రిజిస్ట్రేషన్లు
* గుర్తింపు పొందిన ట్రావెల్‌ ఏజెంట్లు కూడా ఈ యాత్రకు ఏర్పాట్లు చేస్తారు. ఈ సందర్భంలో కూడా పర్మిట్‌, హెల్త్‌ సర్టిఫికేట్‌లు అవసరం.
* అప్పటికప్పుడు యాత్రకు వెళ్లేవారు జమ్మూలోని రైల్వే స్టేషన్‌ దగ్గరలో ఉండే వైష్ణవీధామ్‌, శ్రీనగర్‌ శివారులోని నవ్‌గావ్‌లో ఉన్న రాష్ట్ర పర్యాటక భవన్‌లో కాని స్పాట్‌ రిజిస్ట్రేషన్‌ చేయించుకోవచ్చు. హెల్త్‌ సర్టిఫికేట్‌ వెంట తీసుకువెళితే సమయం కలిసి వస్తుంది.13 ఏళ్లలోపు బాలలను, 75 ఏళ్లు పైబడిన వృద్ధులను, ఆరు వారాలు దాటిన గర్భిణులను యాత్రకు అనుమతించరు.రిజిస్ట్రేషన్‌ సమయంలో రూ.50 బ్యాంకులో చెల్లించాలి. రిజిస్ట్రేషన్‌తోపాటు రూ.లక్ష విలువైన బీమా సదుపాయం కల్పిస్తారు.మరిన్ని వివరాలకు www.shriamarnathjishrine.com వెబ్‌సైట్‌ని సందర్శించండి.

గృహంలో ఆఫీసు రూం ఏ దిక్కున ఉండాలి

ఇప్పటి కాలంలో ఎక్కడ చూసినా ఆఫీసు కట్టడాలు ఎక్కువైపోతున్నాయి. రోజూ ఇంట్లో నివాసం ఉండడం కంటే ఆఫీసులోనే ఎక్కువ సమయం గడిపేస్తున్నారు. అలాంటప్పుడు ఆఫీసు కట్టడం వాస్తుప్రకారం నిర్మించాలని పండితులు చెప్తున్నారు. కొందరిలో ఈశాన్యం గదిలో ఆఫీసు పెట్టుకొని వాడొచ్చా.. లేదా వాయవ్యం గదినే వాడాలా.. అని తెలియక సతమతమవుతున్నారు. అలాంటి వారి కోసం..
ఇంట్లో నివాసంతో పాటు ఆఫీసు ఏర్పాటు చేసుకుని జీవించే పద్ధతి చాలామందికి అవసరం పడుతుంది. ప్రధానంగా లాయర్లు ఉపాధ్యాయులు, రాజకీయ నాయకులకు. గృహం-జీవన వృత్తి ఒకేచోట సాగించాలని అనుకుంటే ఇంటి నిర్మాణం ప్లానులోనే అందుకు అనుగుణంగా ఆఫీసు గది, విజిటర్స్ గది విభజనం చేసుకోవాలి.వృత్తిని ఉత్తరం వైపు గృహ జీవనం దక్షిణం వైపు, వచ్చేలా గదుల విభజన చేసుకోవాలి. తూర్పు ద్వార నుండి గృహానికి ఉత్తరం ద్వారం వ్యాపార వ్యవహారానికి వాడుకోవాలి. ఏదీ మరో దానిని విభేదించకుండా మీరు ఈశాన్యం గది సాధారణ డ్రాయింగ్ రూముగా వాడుకుని ఉత్తరం మధ్యలో కానీ వాయవ్యం గదిని కానీ ఆఫీసుగా వాడుకోండి. అప్పుడు మీకు అనుకూలంగా ఉంటుంది. గృహం-వృత్తి పనులకు ఇబ్బందులు ఏర్పడవు.
1. తిరుమల శ్రీవారికి ఉదయమే మధ్యాహ్న నైవేద్యం
కలియుగ ఆరాధ్య దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి నైవేద్యం విషయంలో ఏపీ ప్రభుత్వం మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. ప్రతి సోమవారం మధ్యాహ్న వేళ సమర్పించే నైవేద్యాన్ని ఉదయం ఏడు గంటలకు మార్చింది. దీంతో అప్పటి నుంచి రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో జరిగే నైవేద్యం వరకూ స్వామివారిని 13 గంటలపాటు పస్తు ఉంచుతున్నారు. తిరుమల ఆలయంలో ఉదయం వీవీఐపీ బ్రేక్‌ దర్శనాలకు వచ్చే వారి సంఖ్య ఇటీవల కాలంలో ముఖ్యంగా సోమవారం బాగా పెరిగిపోతోంది. దీంతో ఎల్‌–2, ఎల్‌–3 దర్శనాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు శ్రీవారి నైవేద్యం వేళలో కీలక మార్పులు చేస్తూ ఆదివారం ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆదేశాలు సోమవారం నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. అలాగే ప్రతి సోమవారం స్వామి వారికి మధ్యాహ్న నేవైద్యాన్ని ఉదయం ఏడు గంటలకే పూర్తిచేయాలని అర్చకులను ఆదేశిస్తూ ఆ ఉత్తర్వులో తెలిపింది.
*ఈ నిర్ణయంపై హిందూ మత ప్రచారకులు మండిపడుతున్నారు. ఇది స్వామి వారికి మహా అపచారం చేయడమే అవుతుందని హెచ్చరిస్తున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో తెల్లవారుజామున సుప్రభాత సేవ మొదలు రాత్రి పవళింపు సేవ వరకు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో స్వామివారికి నైవేద్యం సమర్పణ ఉంటుంది. దీనిని త్రికాల నివేదనగా పిలుస్తుంటారు. ప్రస్తుతం శ్రీవారి ఆలయంలో తెల్లవారుజామున సుప్రభాత సేవ, అర్చన కార్యక్రమాల అనంతరం ఉదయం ఐదున్నర గంటలకు స్వామి వారికి తొలివిడత నైవేద్యం సమర్పిస్తారు. దీనిని ప్రాతఃకాల ఆరాధనగా పిలుస్తారు. తొలి విడత నైవేద్యం అనంతరం వీవీఐపీ బ్రేక్‌ దర్శనాలు కొనసాగుతాయి. రెండో విడతగా మధ్యాహ్నం మళ్లీ నైవేద్యం సమర్పిస్తారు. మూడో విడతగా రాత్రి 8 గంటలకు జరుగుతుంది. వీవీఐపీ కోటా కింద భారీ సంఖ్యలో ఎల్‌–2, ఎల్‌–3 దర్శనాలను మధ్యాహ్నం ఎంతసేపైనా కొనసాగించడానికే ప్రభుత్వం మధ్యాహ్నం నైవేద్యం వేళలలో మార్పులు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
**సోమవారమే ఎందుకంటే..
తిరుమలలో ప్రతి సోమవారం కల్యాణోత్సవ మండపంలో ‘విశేష పూజ’సేవ నిర్వహించాల్సి ఉండటం, అదే రోజు వీవీఐపీ బ్రేక్‌ దర్శనానికి బాగా డిమాండ్‌ ఉండటం వంటి కారణాలతో ప్రత్యేకించి సోమవారం స్వామి వారికి మధ్యాహ్న వేళ సమర్పించే నైవేద్య వేళలో మార్పులు తీసుకొచ్చారని చెబుతున్నారు. అలాగే, ఈ ఒక్కరోజు మాత్రం తెల్లవారుజామున తొలి విడత నైవేద్యం అనంతరం ఎల్‌–1 బ్రేక్‌ దర్శనాలు కొనసాగించి 7 గంటలకు మధ్యాహ్న నైవేద్యం పూర్తిచేసి ఆ తర్వాత ఎల్‌–2, ఎల్‌–3 దర్శనాలను ఎంతసేపైనా కొనసాగిస్తారు. మిగిలిన రోజుల్లో మధ్యాహ్న నైవేద్య కార్యక్రమాలు యథావిధిగానే కొనసాగుతాయి. ప్రభుత్వ తాజా ఆదేశాల కారణంగా ప్రతీ సోమవారం తిరుమలలో స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు ఎక్కువసేపు క్యూలలో వేచి ఉండాల్సి వస్తుందని చెబుతున్నారు.
2. వసంతోత్సవాలతో ఆర్జితసేవల రద్దు
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారికి ఏప్రిల్‌ 17 నుంచి 19 వరకు సాలకట్ల వసంతోత్సవాలు నిర్వహించనున్నట్లు తితిదే తెలిపింది. ఈ వేడుకల నేపథ్యంలో 17న సహస్ర కలశాభిషేకం, 18న తిరుప్పావడ సేవ, 19న నిజపాద దర్శనం సేవలతో పాటు 3 రోజులు కల్యాణోత్సవం, ఊంజలసేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలను రద్దు చేస్తున్నట్లు ఓ ప్రకటనలో వెల్లడించింది.
3. వేములవాడలో వైభవంగా రథోత్సవం
వేములవాడ రాజన్న ఆలయంలో శివకల్యాణోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా నాలుగో రోజు రథోత్సవం కన్నులపండువగా జరిగింది. శ్రీ రాజరాజేశ్వర స్వామి, పార్వతీదేవిని, శ్రీ లక్ష్మీసమేత అనంత పద్మనాభ స్వామివార్ల ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అందంగా అలంకరించి రథంపై కొలువుదీర్చారు. రథాన్ని వివిధ రకాలపుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. డప్పులు, మంగళవాయిద్యాలు, మహిళల కోలాటాల మధ్య, నృత్యాలుచేస్తున్న భక్తుల ఆనందపారవశ్యం మధ్య స్వామిని పురవీధుల గుండా ఊరేగించారు. రథాన్ని లాగేందుకు భక్తులు పోటీపడ్డారు.రథంవద్ద వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు ప్భక్తులు తదితరులు పాల్గొన్నారు.వివిధ పార్టీల రాజకీయ నాయకులుకౌన్సిలర్లువైస్‌చైర్మన్ ప్రతాప రామకృష్ణమున్సిపల్ చైర్ పర్సన్ నామాల ఉమరూరల్ సీఐ రఘుచందర్ గట్టిపోలీస్ బందోబస్తును ఏర్పాటుచేసారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో దూస రాజేశ్వర్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారికి ఆలయ స్థానాచార్యులు భీమాశంకర్ స్వామివారి కండువా కప్పి స్వాగతం పలికారు. వేములవాడ పురవీధులన్నీ శివ నామ స్మరణతో మార్మోగాయి. అవాంచనీయ సంఘటనలు జరుగకుండా డీఎస్పీ వెంకటరమణ ఆధ్వర్యంలో పట్టణ సీఐ శ్రీనివాస్
4. తిరుమల \|/ సమాచారం
ం నమో వేంకటేశాయ!!
ఈ రోజు మంగళవారం
26.03.2019
ఉదయం 5 గంటల
సమయానికి,
తిరుమల: 18C° – 34C°
నిన్న 72,907 మంది
భక్తుల కు కలియుగ దైవం
శ్రీ వేంకటేశ్వరస్వామి వారి
దర్శన భాగ్యం కల్గినది,
స్వామివారి సర్వదర్శనం
కోసం తిరుమల వైకుంఠం
క్యూ కాంప్లెక్స్ లోని 01
గదులలో భక్తులు
వేచియున్నారు,
ఈ సమయం శ్రీవారి
సర్వదర్శనాని కి సుమారు
06 గంటలు పట్టవచ్చును,
నిన్న 25,283 మంది
భక్తులు స్వామి వారికి
తలనీలాలు సమర్పించి
మ్రొక్కు చెల్లించుకున్నారు
నిన్న స్వామివారికి
హుండీలో భక్తులు
సమర్పించిన నగదు
₹: 4.39 కోట్లు,
శీఘ్రసర్వదర్శనం(SSD),
ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్
₹:300/-), దివ్యదర్శనం
(కాలినడక) వారికి శ్రీవారి
దర్శనానికి సుమారుగా
రెండు గంటల సమయం
పట్టవచ్చును,
వయోవృద్దులు మరియు దివ్యాంగుల
ప్రత్యేయకంగా ఏర్పాటు
చేసిన కౌంటర్ ద్వారా
ఉ: 10 గంటలకి (750)
మ: 2 గంటలకి (750)
ఇస్తారు,
చంటి పిల్లల తల్లిదండ్రులు మరియు ఎన్నారై ప్రత్యేక దర్శనాలు
సుపథం మార్గం గుండా శ్రీవారి
దర్శనానికి అనుమతిస్తారు
ఉ: 11 గంటల నుంచి
సాయంత్రం 5 గంటల వరకు
దర్శనానికి అనుమతిస్తారు,
శ్రీవేంకటేశ్వర సుప్రభాతం

నెమలిలో ముగిసిన బ్రహ్మోత్సవాలు

కృష్ణాజిల్లాలో ప్రసిద్ద పుణ్య క్షెత్రమైన గంపలగూడెం మండలం నేమలిలోని వేణుగోపాలస్వామీ ఆలయంలో ఆదివారం స్వామివారికి శ్రీ పుష్పయాగం వైభవంగా నిర్వహించారు.వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆరోరోజైన ఆదివారం ఉదయం స్వామివారి మూలవిరాట్ కు అభిషేకాలు పుష్పాభిషేకం విశేచార్షణలు చేశారు. పది గంటల నుంచి యాగశాలలో ప్రధానార్చకులు టీ.గోపాలాచార్యులు ఆద్వర్యంలో రుత్విక బృందం రుక్మిణీ సత్యభామ సామెత వేణుగోపాల స్వామీ ఉత్సవ విగ్రహాలకు అభిషేకం, శ్రీపుష్పయాగం నిర్వహించారు. దీనికి అవసరమైన పుశాపాలను గ్రామానికి చెందిన కావూరి నాగభూషణం, భారతమ్మ దంపతులు వితరంగా అందించారు. గులాబీ, తామర, కలువ, లిల్లీ, చామంతి, మల్లె, సంపంగీ, కనకాంబరం, మరువం, తులసీ దళాలతో యజ్ఞశాలలో ఉత్సవ విగ్రహాలకు సమర్పించారు. వేడుకలో ఉభయదాతలు, వివిధ గ్రామాలకు చెందిన భక్తులు పాల్గొన్నారు. శ్రీకృష్ణపరమాత్మను ఆరాధిస్తూ భక్తులు భక్తిగీతాలు ఆలపించారు. ప్రసాదాలను స్వామికి నివేదించి పంపిణీ చేశారు. ఆలయ కమిటీ అధ్యక్షులు మైలవరపు రామాంజనేయులు, ఈవో జె.వినోద్‌కుమార్‌, ఎంపీటీసీ సభ్యులు వడ్లవడి వెంకట్రావు, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.
1. బోనమో మల్లన్న
జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం పెద్దాపూర్‌ మల్లన్న జాతరను పురస్కరించుకొని ఆదివారం భక్తులు పోటెత్తారు. మల్లన్న స్వామికి సుమారు 30 వేలకు పైగా బోనాలను సమర్పించారు. ఉమ్మడి కరీంనగర్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, వరంగల్‌ జిల్లాలతో పాటు మహారాష్ట్ర నుంచి భక్తులు తరలివచ్చి బోనాలతో ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. స్వామి వారికి రథోత్సవం నిర్వహించగా, భక్తులు అధిక సంఖ్యలో స్వామిని దర్శించుకున్నారు.
2. శ్రీవారికి రూ.1.11 కోట్ల రిలయన్స్‌ విరాళం
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారికి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ కంపెనీ రూ.1,11,11,111 విరాళాన్ని సమర్పించింది. కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టరు పీఎంఎస్‌ ప్రసాద్‌ ఆదివారం శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మందిరంలోని రంగనాయకుల మండపంలో తిరుమల జేఈవో శ్రీనివాసరాజుకు విరాళానికి సంబంధించిన డీడీలను అందజేశారు. ఈ మొత్తాన్ని ప్రాణదానం ట్రస్టు కింద జమచేయాలని కోరారు.
3. విడాకుల ఆలయం
అవును… ఆ గుడి పేరే డైవర్స్‌ టెంపుల్‌. జపాన్‌లో ఉన్న ఈ ఆలయం అసలు పేరు ‘షోకోజాన్‌ టోకీజీ’… అందమైన తోటలో, ప్రశాంతమైన వాతావరణం మధ్య ఉండే ఈ ఆలయంలోకి అడుగు పెడితే చాలు మనసులోని ఒత్తిడి మటుమాయం అవుతుంది. ప్రకృతితో మమేకమైనట్లు అనిపిస్తుంది. అలాంటి ఈ ఆలయానికి ఈపేరు రవాడానికి ప్రాచీన కథ ఒకటి ఉందంటారు అక్కడివారంతా…
షోకోజాన్‌ టోకీజీ అంటే జపనీయులు పరిభాషలో ఎన్‌కిరి-డెరా… అంటే అనుబంధాలను తెంచడం అని అర్థం. 12వ శతాబ్దంలో జపాన్‌ దంపతుల్లో భర్త, భార్యతో విడిపోవాలనుకుంటే ‘నేను విడిపోతున్నా…’ అంటే చాలు. అతడికి భార్య నుంచి విడిపోయే అధికారం ఉండేదట. అదే భార్య విషయంలో అయితే విడాకుల తంతు పూర్తవడానికి మూడేళ్లు పట్టేది. ఆ మూడేళ్ల పాటు భర్త నుంచి విడిపోవాలనుకున్న భార్యలు, తమ భర్తలకు దూరంగా ఈ ఆలయంలో ఉండేవారట. అలా ఆలయం వారికి బసగా మారింది. అంతేకాదు… అప్పటి రాణులు లేదా రాజులు ఆ ఆలయంలో ఉండే మహిళలకు సదుపాయాలన్నీ ఉచితంగా అందించేవారు. విడిపోవాలంటే అక్కడ ఉండే ప్రాంతం కాబట్టి, ఆ ఆలయానికి విడాకుల ఆలయం అనే పేరు స్థిరపడింది. కొన్ని శతాబ్దాలుగా ఈ ఆలయానికి సందర్శకులు వస్తూనే ఉన్నారు. దీంతో అక్కడి ప్రభుత్వం దీన్ని పర్యటక ప్రాంతంగా తీర్చిదిద్దింది.
4. భద్రాద్రి రామయ్యకు వైభవంగా పూజలు
భద్రాచలం రామాలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుప్రభాత సేవ ఘనంగా నిలవగా అర్చకులు ఆరాధించి అభిషేక మహోత్సవాన్ని కొనసాగించారు. ఇందులో పాల్గొనేందుకు పరిమిత సంఖ్యలో భక్తులకు ప్రవేశం ఉండటంతో ఉదయమే కోవెల వద్దకు చేరుకుని తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అభిషేకంలో పాల్గొన్న వారు స్వామి వైభవాన్ని కళ్లార వీక్షించి జైశ్రీరామ్‌ అంటూ నీరాజనాలు అందించారు. మూల విరాట్‌కు బంగారు పుష్పాలతో అర్చన చేయడంతో వీక్షించి పులకించిపోయారు. వారానికి ఒక్కసారి ఉండే క్రతువు కావడంతో విశేష సంఖ్యలో తరలి వచ్చి దేవదేవుడ్ని దర్శించుకున్నారు. క్షేత్ర విశిష్టత పరమానందం కలిగించగా వైష్ణవ సంప్రదాయం ప్రకారం విష్వక్సేన పూజ చేసి పుణ్యాహ వాచనం కొనసాగించి కంకణాల ధారణను కడు రమణీయంగా నిర్వహించారు. వధూవరుల గోత్ర నామాలను చదివి ప్రవరను పఠించి సీతమ్మకు యోక్త్రాన్ని రామయ్యకు యజ్ఞోపవీతాన్ని ధరింపచేశారు. మంగళ వాయిద్యాలు మార్మోగుతుండగా మాంగళ్య ధారణ మంత్రముగ్ధమైంది. తలంబ్రాల వేడుక ఆనందడోలికల్లో ముంచెత్తింది. అర్చకులు నిత్య కల్యాణ క్రతువు గురించి వివరిస్తుండగా దీనికి అనుగుణంగా కల్యాణం కనులకు పండుగగా కనిపించింది. దర్బారు సేవ తన్మయత్వంలో ముంచెత్తింది.
5. శుభమస్తు
తేది : 25, మార్చి 2019
సంవత్సరం : విళంబినామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : ఫాల్గుణమాసం
ఋతువు : శిశిర ఋతువు
కాలము : శీతాకాలం
వారము : సోమవారం
పక్షం : కృష్ణ (బహుళ) పక్షం
తిథి : పంచమి
(నిన్న రాత్రి 8 గం॥ 58 ని॥ నుంచి
ఈరోజు రాత్రి 8 గం॥ 6 ని॥ వరకు)
నక్షత్రం : విశాఖ
(నిన్న ఉదయం 7 గం॥ 45 ని॥ నుంచి
ఈరోజు ఉదయం 7 గం॥ 5 ని॥ వరకు)
యోగము : వజ్రము
కరణం : కౌలవ
వర్జ్యం : (ఈరోజు ఉదయం 11 గం॥ 7 ని॥ నుంచి ఈరోజు ఉదయం 12 గం॥ 43 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (నిన్న రాత్రి 10 గం॥ 31 ని॥ నుంచి ఈరోజు తెల్లవారుజాము 0 గం॥ 4 ని॥ వరకు)(ఈరోజు రాత్రి 8 గం॥ 48 ని॥ నుంచి ఈరోజు రాత్రి 10 గం॥ 24 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 12 గం॥ 45 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 33 ని॥ వరకు)(ఈరోజు సాయంత్రం 3 గం॥ 12 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 4 గం॥ 0 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు ఉదయం 7 గం॥ 47 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 18 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 52 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 3 గం॥ 23 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు ఉదయం 10 గం॥ 50 ని॥ నుంచి ఈరోజు ఉదయం 12 గం॥ 21 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 6 గం॥ 16 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 27 ని॥ లకు
సూర్యరాశి : మీనము
చంద్రరాశి : వృచ్చికము
6. చరిత్రలో ఈ రోజు/మార్చి 25
శని గ్రహ ఉపగ్రహం టైటాన్
1655 : శని గ్రహం యొక్క అతిపెద్ద ఉపగ్రహం అయిన టైటాన్ ను క్రిస్టియాన్ హైగెన్స్ కనుగొన్నాడు.
1914 : అమెరికా వ్యవసాయ శాస్త్రవేత్త నార్మన్ బోర్లాగ్ జననం.
1927 : పాండిచ్చేరి రాష్ట్రానికి 13 వ ముఖ్యమంత్రి పి.షణ్ముగం జననం.(మరణం.2013)
1983 : తెలుగు పాత్రికేయుడు మణికొండ చలపతిరావు మరణం.
1992 : మిర్ అంతరిక్ష కేంద్రములో 10 నెలలు గడిపిన ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త సెర్జీ క్రికాలేవ్ భూమి పైకి చేరారు.
2008 : పాకిస్థాన్ కొత్త ప్రధానమంత్రిగా సయ్యద్ యూసఫ్ రజా గిలానీ ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలు చేపట్టాడు.

ఆ ఆలయాలకు ద్వారబంధాలు ఉండవు

అక్కడ ఉండేవి ఆలయాలే కాని నిత్యధూపదీప నైవేద్యాలు, పూజలు ఉండవు కానీ అమ్మవారి ప్రతిమలు ఉంటాయి. వైవిధ్యభరితంగా కనిపించే ఆ ఆలయాలే మత్స్యకారులు కొలిచే దేవతల ఆలయాలు. సాధారణంగా గ్రామ దేవతల ఆలయాలలో ఎక్కువ శాతం నిత్య ధూపదీపనైవేద్యాలు ఉండకపోయినా భద్రత ఉంటుంది. ఆలయాలకు తలుపులు, చుట్టూ ప్రహరీ గోడలు ఉంటాయి. వాటిలో విగ్రహాలకు ఖచ్చితమైన రూపురేఖలు ఉంటాయి కానీ ఇక్కడ అవేమి కనిపించవు. మత్స్యకారులు మనస్సులోనే అమ్మను తలచుకుంటూ ఆమెపై భారం వేసి జీవనోపాధికి వెళుతుంటారని చెబుతున్నారు. తీరప్రాంత గ్రామాలలో మాత్రమే కనిపించే ఈ ఆలయాలు ఎంతో విశిష్టతను కలిగి ఉంటాయి. నిత్యం ప్రాణాలను ఫణంగా పెట్టి సముద్రంపై చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు తమ తమ ఇష్టదైవాలైన అమ్మవార్లకు మొక్కుకుని వేటకు వెళుతుంటారు. దానికి అనువుగా నిర్మించుకున్న ఆలయాలు చూసేవారికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి.
*వైవిధ్యభరిత ఉత్సవాలు
ఈ ఆలయాలని విచిత్రంగా కనిపిస్తాయి చిన్నచిన్న ఆలయాలుగా ఉండి ఒకే చోట రెండు నుంచి ఐదేసి ఆలయాలు వరుసగా నిర్మించి ఉంటాయి. ఆలయాలపై ఎటువంటి కళాకృతులు ఉండవు ముఖమండపాలు అసలే కనిపించవు. వాటిలో దేవతామూర్తుల ప్రతి రూపాలు వైవిధ్యభరితంగా ఉంటాయి. కొన్ని విగ్రహాలు అమ్మవారి రూపాలతో ఉండగా కొన్ని విచిత్ర రూపాలలో ఉండి ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. వివిధ ఆకృతులలో ఉన్న చెక్కతో తయారు చేసిన విగ్రహాలు కనిపిస్తాయి.
*తలుపులు ఎందుకు ఉండవంటే..!
ఏ ఆలయానికి ద్వారబందాలు తప్ప తలుపులు కానరావు. సాగరంలో జీవనపోరాటం చేస్తున్న తమకు ఎప్పుడు ఎదురుగా కనిపించే విధంగా ప్రతి ఆలయం సముద్రతీరానికి అతి దగ్గరలో సముద్రం వైపుకు ముఖం ఉండేలా (సముద్రంలోంచి చూస్తే అమ్మవారు కనిపించేలా) నిర్మించి ఉంటాయి. అమ్మవారు ఎప్పుడు తమకు అండగా ఉండాలని ఆలయాలకు తలుపులు వేయడంవల్ల ఆమెను బంధించినట్లుగా భావించే మత్స్యకార పూర్వీకులు ఈవిధంగా ఆలయాలకు తలుపులు వేసేవారు కాదని మత్స్యకార పెద్దలు చెబుతున్నారు. అర్ధరాత్రి వేటకు వెళ్లే మత్స్యకారులు వలలు ఇతర సామగ్రితో చేతులు ఖాళీ లేకుండా వెళుతుండడం వల్ల తలుపులు తీయడం వీలు కుదరదు కాబట్టి అమ్మవార్లకు మొక్కుకునే విధంగా ఎప్పుడు అమ్మవార్లు ఎదురుగా కనిపించాలనే ఉద్ధేశ్యంతోనే తలుపులు ఏర్పాటు చేయరని, ఇది పూర్వం నుంచి వస్తున్న ఆచారమని మత్స్యకారులు చెబుతున్నారు.
*అమ్మవార్ల పేర్లు
సాధారణంగా మత్స్యకారులు భాగిర్తమ్మ, బంగారమ్మ, గంగమ్మ, కాశిమ్మ, పోలేరమ్మ, చినతల్లి, పెదతల్లి వంటి పేర్లతో పిలుచుకుంటారు. ఇవే పేర్లు మత్స్యకారులు తమ పిల్లలకు పెడుతుంటారు.
*ఉత్సవాలూ వైవిధ్యభరితమే
సాధారణంగా గ్రామదేవతల ఆలయాలలో ఎక్కువ శాతం వారానికి ఒకసారైనా సాధారణ పూజలు చేస్తుంటారు. కానీ ఈ ఆలయాలలో దేవతలకు మాత్రం ఏడాదికి ఒకసారి అత్యంత వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. కఠినమైన నియమనిష్టలతో ఉపవాసాలు ఉండి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి అగ్నిగుండాలు తొక్కడం వంటి కార్యక్రమాలు వైభవంగా నిర్వహిస్తారు. మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల సందర్భంగా ఆలయాలను సుందరంగా తీర్చిదిద్ది ధూపదీపనైవేద్యాలు సమర్పిస్తారు. సముద్ర తీరంలో ప్రత్యేక ఆచారాలతో పూజలు నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం ఉగాదికి ముందు రోజున వచ్చే ఫాల్గుణ బహుళ అమావాస్య అంటే కొత్త అమావాస్యరోజున ఈ అమ్మవార్లకు మత్స్యకారులు పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తారు.
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఏప్రిల్‌ 14న శ్రీరామ నవమి ఆస్థానం, 15న శ్రీరామ పట్టాభిషేకం మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించనున్నట్లు తితిదే తెలిపింది. ఆస్థానం సందర్భంగా 14వ తేదీ రాత్రి 7 నుంచి 9 గంటల వరకు శ్రీమలయప్పస్వామి హనుమంత వాహనంపై తిరువీధుల్లో విహరించనున్నారు. వేకువజామున ఆలయంలో సుప్రభాతం సేవ అనంతరం తోమాలసేవ, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహిస్తారు. రంగనాయకుల మండపంలో ఉదయం 9 నుంచి 11 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామివారికి, శ్రీసీతారామలక్ష్మణ హనుమంతుల ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం ఉంటుంది. రాత్రి 10 నుంచి 11 గంటల మధ్య బంగారువాకిలి ఎదుట శ్రీరామనవమి ఆస్థానం ఉంటుంది. 15న రాత్రి 8 గంటలకు బంగారువాకిలి చెంత ఆలయ అర్చకులు శ్రీరామ పట్టాభిషేక మహోత్సవాన్ని కళ్లకుకట్టేలా ప్రదర్శిస్తారు. ఈ వేడుకల కారణంగా 14న వసంతోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలను, 15న వసంతోత్సవ సేవలను రద్దు చేస్తున్నట్లు తితిదే వెల్లడించింది.
1. ఓం శ్రీ గురుభ్యోనమః
పంచాంగం 24-3-2019
ఆదివారం (భాను వాసరే)
శ్రీ విళంబి నామ సంవత్సరం
ఉత్తరాయనం
శిశిరఋతువు
ఫాల్గుణమాసం
బహుళపక్షం
తిధి. : చవితి రా1:04 తదుపరి పంచమి
నక్షత్రం:స్వాతి ఉ11:24తదుపరి విశాఖ
యోగం :హర్షణం
కరణం :బవ
సూర్యోదయం. :6:07
సూర్యాస్తమయం. :6:05
రాహుకాలం. :సా 4:30-6:00
యమగండం. : మ12:00-1:30
అమృత ఘడియలు. :పగలు లేదు
వర్జ్యం :సా4:56 – 6:38
దుర్ముహూర్తం:సా4:31 – 5:19
2. తిరుమల సమాచారం
ఓం నమో వేంకటేశాయ
ఈరోజు ఆదివారం *24-03-2019* ఉదయం *5* గంటల సమయానికి.
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ ……శ్రీ వారి దర్శనానికి *24* కంపార్ట్ మెంట్ ల లో వేచి ఉన్న భక్తులు…
శ్రీ వారి సర్వ దర్శనానికి *16* గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ (300/-) దర్శనానికి, కాలినడక భక్తులకు, టైమ్ స్లాట్ సర్వ దర్శనానికి *04* గంటల సమయం పడుతోంది.. నిన్న మార్చి *23* న *83,270* మంది భక్తులకు శ్రీవారి ధర్శనభాగ్యం కలిగినది. నిన్న స్వామి వారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు కానుకలు *₹:2.90* కోట్లు.
3. శుభమస్తు
తేది : 24, మార్చి 2019
సంవత్సరం : విళంబినామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : ఫాల్గుణమాసం
ఋతువు : శిశిర ఋతువు
కాలము : శీతాకాలం
వారము : ఆదివారం
పక్షం : కృష్ణ (బహుళ) పక్షం
తిథి : చవితి
(నిన్న రాత్రి 10 గం॥ 38 ని॥ నుంచి
ఈరోజు రాత్రి 8 గం॥ 57 ని॥ వరకు)
నక్షత్రం : స్వాతి
(నిన్న ఉదయం 9 గం॥ 9 ని॥ నుంచి
ఈరోజు ఉదయం 7 గం॥ 44 ని॥ వరకు)
యోగము : హర్షణము
కరణం : బవ
వర్జ్యం : (ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 11 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 2 గం॥ 44 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (నిన్న రాత్రి 11 గం॥ 27 ని॥ నుంచి ఈరోజు తెల్లవారుజాము 0 గం॥ 57 ని॥ వరకు)(ఈరోజు రాత్రి 10 గం॥ 31 ని॥ నుంచి మర్నాడు తెల్లవారుజాము 0 గం॥ 4 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు సాయంత్రం 4 గం॥ 49 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 5 గం॥ 37 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు సాయంత్రం 4 గం॥ 55 ని॥ నుంచి ఈరోజు రాత్రి 6 గం॥ 26 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు సాయంత్రం 3 గం॥ 24 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 4 గం॥ 55 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు ఉదయం 12 గం॥ 21 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 52 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 6 గం॥ 17 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 27 ని॥ లకు
సూర్యరాశి : మీనము
చంద్రరాశి : తుల
4. చరిలో ఈ రోజు/మార్చి 24
1603 : 44 సంవత్సరాలు పాలించిన బ్రిటిషు మహారాణి ఎలిజబెత్ మరణం.
1775 : భారత దేశానికి చెందిన ప్రముఖ కవి, రచయిత,వాగ్గేయకారుడు ముత్తుస్వామి దీక్షితులుజననం(మ.1835)
1882 : క్షయ వ్యాధికి కారణమైన మైకోబాక్టీరియా ట్యుబర్‌క్యులాసిస్ ని రాబర్ట్ కోచ్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు.
1977 : భారత ప్రధానమంత్రిగా మొరార్జీ దేశాయ్ నియమితుడైనాడు.
1984 : భారత హాకీ క్రీడాకారుడు ఆడ్రియన్ డీసౌజా జననం.
1896 : చరిత్రలో మొదటి రేడియో ప్రసార సంకేతాలను ఎ.ఎస్.పోపోవ్ సృష్టించాడు.
1998 : భారత లోక్‌సభ స్పీకర్‌గా జి.యమ్.సి.బాలయోగి పదవిని స్వీకరించాడు.
2008 : ఆరవ వేతన సంఘం (కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీత భత్యాల సవరణకోసం ఏర్పాటు చేసిన సంఘం), తన నివేదికను ఈ రోజున ఆర్ధిక శాఖామంత్రికి సమర్పించింది
5. బాహుబలి (గోమఠేశ్వరుడు)
జైన సంప్రదాయంలో ప్రధానమైన దేవతలను తీర్థంకరులు అంటారు. వారు ఇరవైనాలుగుమంది. వీరిలో మొదటి తీర్థంకరుడు ఋషభనాథుడు. ఇతడే జైనమత స్థాపకుడు. ఇతనికి ఇద్దరు కుమారులు. వారు భరతుడు, బాహుబలి. చక్రవర్తి అయిన ఋషభనాథుడు తన రాజ్యాన్ని పెద్ద కుమారుడైన భరతునికిచ్చి తాను తపస్సు చేసుకోవడానికి అడవులకు వెళ్లిపోయాడు. అప్పటికే బాహుబలి పోదనపురానికి రాజుగా ఉన్నాడు.భరతుని బహురాజ్యకాంక్షతో అన్ని రాజ్యాలనూ జయిస్తూ వచ్చాడు. కానీ బాహుబలి అతనికి లొంగకుండా యుద్ధం చేశాడు. యుద్ధంలో బాహుబలి విజయం సాధించాడు కానీ, విరక్తుడై భరతుడికి తన రాజ్యాన్ని ఇచ్చివేసి తాను నిలుచునేంత స్థలాన్ని దానంగా పొంది కాయోత్సర్గవిధిలో తపస్సు చేస్తూ నిలుచున్నాడు.(నిటారుగా నిలుచుని రెండు చేతులనూ రెండు వైపులా సమానంగా కిందకు చాపి కదలిక లేకుండా నిలుచోవడమే కాయోత్సర్గం.) ఆ తర్వాత ఈయనకు గోమఠేశ్వరుడు అనే పేరు వచ్చింది.కర్ణాటకలో హాసన్‌ జిల్లాలో ఉన్న శ్రావణబెళగొళలో గోమఠేశ్వరుడి అరవై అడుగుల అద్భుతమైన విగ్రహం చెక్కబడి ఉంది. ఈ విగ్రహాన్ని క్రీస్తుశకం 974 – 984 మధ్యలో గంగరాచమల్లుని దండనాయకుడైన చావుండరాయుడు చెక్కించాడు. ఈ విగ్రహాన్ని మలచిన విధానంలో ఒక విశేషం ఏమిటంటే ఇంద్రగిరి కొండనే విగ్రహంగా మలిచారు. కొండ పైనుంచి కిందికి చెక్కుకుంటూ వచ్చారు.మరో విశేషమేమిటంటే విగ్రహం పాదపీఠం దగ్గర ఒక కొలబద్దను చెక్కారు. అది మూడు అడుగుల నాలుగు అంగుళాల కొలతను చూపిస్తోంది. దీనికి పద్దెనిమిది రెట్లు అంటే అరవై అడుగుల విగ్రహం ఉంది. దిగంబరంగా ఉన్న విగ్రహంలో గోమఠుడి శరీరానికి తీగలు అల్లుకుని ఉంటాయి. ఈ మూర్తికి జరిగే మహామస్తకాభిషేకం జగద్విఖ్యాతి కలిగింది. ఏటా జైనులు ఈ గోమఠేశ్వరుడి దర్శనానికి పెద్ద సంఖ్యలో శ్రావణ బెళగొళను సందర్శిస్తారు.
6. తిరుపతి స్విమ్స్‌ కి రూ.6.22 కోట్ల విరాళాలు
తిరుపతి స్విమ్స్‌ ఆసుపత్రిలో తితిదే ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకానికి రూ.6,22,51,000ల విరాళాలను దాతలు అందించారు. శనివారం స్విమ్స్‌ సంచాలకులు డాక్టర్‌ టి.ఎస్‌.రవికుమార్‌ను కలిసిన ముంబయికి చెందిన వైఠల్‌ ల్యాబొరేటరీస్‌, వైఠల్‌ లైఫ్‌ కేర్‌ అధిపతి రాజీవ్‌బజాజ్‌ రూ.5 కోట్లను విరాళంగా అందించారు. అదే నగరానికి చెందిన లలిత్‌సేథీ కుటుంబం రూ.కోటిని విరాళంగా అందించింది. వీరితోపాటు తమిళనాడు రాష్ట్రం అరక్కోణం నగరానికి చెందిన ప్రజ్‌ సిమెంట్‌ క్యారీసన్‌ ఎల్‌ఎల్‌పీ కంపెనీ ప్రతినిధి ప్రభుప్రకాష్‌ రూ.20 లక్షలు, ముంబయి నగరానికి చెందిన ఫిన్‌మేర్‌ అడ్వైజరీ కంపెనీ డైరెక్టర్‌ యాశిష్‌ రూ.2.51 లక్షలు విరాళంగా అందజేశారు.

వైభవంగా వేములవాడ రాజన్న కళ్యాణం

ప్రముఖ దేవాలయం వేములవాడ రాజన్న ఆలయంలో రాజరాజేశ్వర స్వామివార్ల కళ్యాణం వైభవంగా జరిగింది. అయితే కళ్యాణనికి మున్సిపల్‌ కమిషనర్‌ గంగారాం స్వామివార్లకు పట్టువస్ర్తాలు సమర్పించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు కళ్యాణోత్సవానికి భారీగా తరలివచ్చారు. స్వామివార్ల కళ్యాణం దృష్ట్యా ఆలయంలో ఆర్జిత సేవలను రద్దు చేశారు. భక్తులకు శ్రీఘ్రదర్శనంను అమలు చేస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయంలో కోడె మొక్కులను సైతం నిలిపివేశారు. ఆలయంలో ఈ సాయంత్రం శివ పురాణ ప్రవచనాలు జరగనున్నాయి. సాయంత్రం 5 గంటల నుంచి హోమం, ఉపాసన, బలిహరణం కార్యక్రమాలను చేపట్టనున్నారు. పెద్ద సేవలో భాగంగా స్వామివారి ఊరేగింపు కొనసాగనుంది.

ఉగాది నాడు తిరుమలలో తిరుమంజనం

శ్రీ‌వారి ఆలయంలో ఏప్రిల్ 6వ తేదీ తెలుగు సంవత్సారాది శ్రీ వికారినామ సంవత్సరం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఆస్థానం నిర్వహించనుండడంతో ఏప్రిల్ 2న‌ మంగళవారంనాడు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం అత్యంత వైభవంగా టిటిడి నిర్వహించనుంది.

సాధారణంగా సంవత్సరంలో నాలుగుసార్లు ఈ కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనాన్ని నిర్వహించడం ఆనవాయితీ, ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మూెత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఈ ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.

ఇందులో భాగంగా  ఉదయం 6.00 గంటలకు ప్రారంభమయ్యే తిరుమంజనం కార్యక్రమం సుమారు 5 గంటలపాటు కొనసాగనుంది.

ఆలయంలోని ఆనందనిలయం మొదలుకొని బంగారు వాకిలి వరకు సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలంతో శుద్ధి కార్యక్రమాన్ని ఆలయ సిబ్బంది అత్యంత పవిత్ర కార్యక్రమంగా ఒక మహాయజ్ఞంలా నిర్వహిస్తారు. 

తిరుమంజనం కారణంగా మంగళవారంనాడు నిర్వహించే అష్టదళపాదపద్మారాధన సేవను టిటిడి రద్దు చేసింది.

తిరుమంజనం కార్యక్రమం అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు ఆలయ అర్చకులు ఆగమోక్తంగా పూజాది కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం మధ్యాహ్నం 12.00 గంటల నుండి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు. ఈ కార్యక్రమంలో టిటిడి ఉన్నతాధికారులు మరియు సిబ్బంది  పాల్గొంటారు.

తిరుపతి బరిలో ఇద్దరు మాజీ తితిదే చైర్మన్లు

ఆధ్యాత్మిక నగరంగా పేరుగాంచిన తిరుపతి నియోజకవర్గంలో ఈసారి ఎన్నికల్లో ఆసక్తికర పోటీ నెలకొంది. ఈ సెగ్మెంట్‌ నుంచి బరిలో ఉన్న రెండు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇంతకు ముందు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఛైర్మన్‌గా పనిచేసిన వారే కావడం గమనార్హం. జనసేన నుంచి బరిలో ఉన్న చదలవాడ కృష్ణమూర్తికి తెలుగుదేశం ప్రభుత్వం 2015లో టీటీడీ ఛైర్మన్‌గా అవకాశం ఇచ్చింది. ఆ తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో గత సంవత్సరం ఆయన తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి జనసేన తీర్థం పుచ్చుకున్నారు. ఈ ఎన్నికల్లో తిరుపతి నుంచి జనసేన తరఫున శాసనసభకు పోటీ చేస్తున్నారు. ఇదే నియోజకవర్గం నుంచి వైకాపా అభ్యర్థిగా పోటీలో ఉన్న భూమన కరుణాకరరెడ్డికి కూడా 2006లో కాంగ్రెస్‌ హయాంలో ఆ పదవి వరించింది. ఇంతకు ముందు టీటీడీ ఛైర్మన్లుగా పనిచేసిన ఇద్దరు వ్యక్తులతో పాటు, తెదేపాకు చెందిన సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఎం.సుగుణమ్మ కూడా ఈ సారి తిరుపతి నియోజకవర్గం బరిలో ఉన్నారు. అయితే విజయం ఎవరిని వరిస్తుందో తెలుసుకోవడానికి మాత్రం మే 23వరకు వేచి చూడాల్సిందే. మరోవైపు ప్రస్తుతం తితిదే ఛైర్మన్‌గా పదవిలో ఉన్న పుట్టా సుధాకర్‌యాదవ్ కడప జిల్లాలోని మైదుకూరు నియోజకవర్గం నుంచి తెదేపా అభ్యర్థిగా శాసనసభకు పోటీ చేస్తుండడం విశేషం.

ఫాల్గుణ పూర్ణిమ విశేషాలు

ఫాల్గుణ శుక్ల పూర్ణిమను హోలికా, హోళికాదాహో అనే నామాలతో పేర్కొంటున్నది స్మృతి కౌస్త్భుం. హుతాశనీ పూర్ణిమ, వహ్న్యుత్సవం అని అమాదేర్ జ్యోతిషీ; లక్ష్మీనారాయణ వ్రతం, అశోక పూర్ణిమా వ్రతం, శయన దాన వ్రతం చేయాలని పురుషార్థ చింతామణి; శశాంక పూజ చేయాలని నీలమత పురాణం వివరిసున్తన్నాయి. కొన్ని గ్రంథాలు డోలా పూర్ణిమ అని చెపుతున్నాయి. ఈ దినం మనువులలో 10వ వాడైన బ్రహ్మపుత్రుడైన బ్రహ్మసావర్ణి మన్వంతరాది దినంగా, దక్షిణాదిన ప్రధానంగా కాముని పున్నమగా భావిస్తారు. చలి తగ్గుముఖం పట్టి, ఉక్కపోత ప్రారంభమయ్యే కాలం. అన్ని పంటలు ఇళ్ళకు చేరి, కర్షకుడికి కడుపునిండా తిండి దండిగా దొరికే రోజులు. వస్తున్న వసంతానికి స్వాగతోపచారాలు చేసే సమయం. ఈ పర్వానికి మరోపేరైన హోళి శబ్దం కర్ణతాడితం కావడంతో నాటి కార్యక్రమాలలో ప్రముఖంగా జ్ఞాపకం వచ్చేది ‘‘మంటల ఊసు’’. వసంతాలాట మాట. తెలుగు వారు దీనిని కాముని పున్నమ అంటారు. కాముడు ఈ దినాన దహనమైనాడని పురాణ కథ. దాక్షిణాత్యులు కామదహన దినంగా, ఔత్తరాహికులు హోళిక దహన దినంగా భావిస్తారు. తారకుడను రాక్షసుడు దేవతలకు సవాలుగా నిలిచి, ఇంద్రుని ఆస్థానం నుండి దేవ వేశ్యలను ఎత్తుకు పోవడం చేస్తుంటాడు. ఎలాగైనా తారకుడిని మట్టుబెట్టాలని, దేవతలు భావిస్తుండగా, దేవతల పురోహితుడు బృహస్పతి, శివపార్వతులకు పుట్టబోయే కుమార స్వామియే తారక సంహార సమర్థునిగా చెపుతాడు. గాఢ యోగనిష్ఠలో ఉన్న శివుడికి యోగ భంగం కలిగించేందుకు ఇంద్రుడు సాయం కోరగా, మన్మథుడు అంగీకరిస్తాడు. శివుడు ఉన్న వనంలో పుష్పబాణుడు ప్రవేశించిన సమయం వసంతకాలం. అక్కడ పార్వతి పూలు సంగ్రహించే సమయంలో కామదేవుడు బాణం అందుకున్నాడు. అల్లెత్రాడు బిగించాడు. శివుడు కదిలాడు. కనురెప్పలు ఎత్తాడు. ఎదురుగా ఉమాదేవి కన్పించింది. ఆయన మనసు చలించింది. కాముడు బాణం వదిలాడు. శివునికి యోగ భ్రష్టత్వం గుర్తుకు వచ్చింది. కోపంతో మూడో కన్ను తెరిచి, మన్మథుడిని చూశాడు. అంతట పుష్పబాణుడు బూడిద అయినాడు. ప్రియుడు భస్మం కాగా, రతి విలాపానికి అవధులు లేకుండా పోయాయి. శివుడు కరిగి పోయాడు, కనికరించాడు. లోకానికి కాకున్నా, రతీదేవికి మన్మథుడు కనిపించేలా చేశాడు. అనంగుడైన భర్తకు రతీదేవి పూజలు ఒనరించింది. ఆ పూజలే క్రమంగా ఆచారాలైనాయి. ఆ నాటి పూజల వల్ల భార్యాభర్తలకు దాంపత్య సుఖం కలుగుతుందనే నమ్మకం ఏర్పడింది. ఇలా పండగా మారింది. కామన దహన దినం కామదహనోత్సవ దినంగా మారింది. దగ్ధుడైన మన్నథుడు ప్రద్యుమ్ముడును, ఇతని కుమారుడు అనిరుద్ధుడు రాక్షస సంహారంకు కారణమైనారు కనుక కామదహన ఉత్సవ కారణమైంది.
1. కనుల పండువగా జలదుర్గ కల్యాణం
కొల్లేరు పెద్దింటి అమ్మవారి దేవస్థానంలో శ్రీజలదుర్గ గోకర్ణేశ్వరస్వామి వార్ల కల్యాణం మంగళవారం తెల్లవారు జామున అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. అమ్మవారిని, స్వామివార్లకు పెండ్లి కుమారుడు, కుమార్తెలు అలంకరించి వేదపండితుల మంత్రోచ్చారణలు, మంగళవాయిధ్యాల నడుమ కల్యాణవేడుకలు జరిగాయి. జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివార్ల కల్యాణ వైభోగాన్ని దర్శించుకుని నేత్రపారవశ్యాన్ని పొందారు. ఉత్సవాల్లో ఎంతో విశిష్ట ఘట్టం కావడంతో కల్యాణ వేడుకలను తిలకించేందుకు భక్తులు పోటీపడ్డారు. కైకలూరు సీఐ రవికుమార్‌ దంపతులు, ఈవో కొండలరావు దంపతులు, ఛైర్మన్‌ జల్లూరి వెంకన్నలు కల్యాణోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం 5 గంటల నుంచి శ్రీజలదుర్గ పెద్దింటి అమ్మవార్లకు సుగంధ స్నానం, నూతన వస్త్రాలంకరణ, బలిహరణ, కోనేరులో త్రిశూల స్నానం, కలశార్చన, పుష్పాలంకరణ, ధూపసేవ, బాలభోగం, హారతి, ప్రసాదాన్ని సమర్పించారు. ఆకివీడు వాస్తవ్యులు మాటూరి మధుసూదనరావు అనూరాధ, ఏలూరు వాస్తవ్యులు తేతలి నాగరాజు మద్దిరావమ్మ దంపతులు పుష్పాలంకరణ చేయించారు. భుజబలపట్నం వాస్తవ్యులు కళ్లేపల్లి శివకుమార్‌రాజు విజయలక్ష్మి దంపతులు ప్రసాదాన్ని అందించారు. అనంతరం సాయంత్రం నిర్వహించిన కోలాట ప్రదర్శన చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. నేడు భారీ అన్నసమారాధనను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ అన్నసమారాధనలో పెద్దఎత్తున భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించాలని కోరారు. ఇందులో పెద్దఎత్తున నాయకులు, భక్తులు పాల్గొన్నారు.
2. చిన్న తిరునాళ్లకు వేళాయె-21 నుంచి ప్రారంభం
ఏడాదికి ఒకసారి ఐదు రోజుల పాటు పెనుగంచిప్రోలులో అత్యంత వైభవంగా నిర్వహించే తిరుపతమ్మ అమ్మవారి చిన్న తిరునాళ్లు ఈనెల 21 నుంచి ప్రారంభం కానున్నాయి. జాతరను వైభవంగా నిర్వహించేందుకు రూ.30 లక్షల వ్యయంతో దేవస్థానం అధికారులు పెద్దఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. భారీగా తరలివచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఐదు రోజుల్లో సుమారు నాలుగు లక్షల మంది అమ్మవారిని దర్శించుకుంటారని అధికారుల అంచనా.
**కార్యక్రమాలు ఇలా..
21న (గురువారం) ఉదయం ఆరు గంటలకు ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అఖండజ్యోతి స్థాపన చేయడం ద్వారా తిరునాళ్లు ప్రారంభమవుతాయి. 7:30 గంటలకు నిత్య కల్యాణమూర్తులకు అభిషేకం నిర్వహిస్తారు.22న (శుక్రవారం) ఆలయంలో మహిళలతో ప్రత్యేక కుంకుమార్చన నిర్వహిస్తారు. పూజలకు అవసరమైన సామగ్రిని దేవస్థానం ఉచితంగా అందజేస్తుంది.23న (శనివారం) తిరుపతమ్మ, గోపయ్య స్వాముల ఉత్సవమూర్తులను ప్రత్యేక రథంపై ఉంచి గ్రామంలో ఊరేగిస్తారు. సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభమయ్యే ఊరేగింపు అర్ధరాత్రి దాటేవరకు కొనసాగుతుంది.24న (ఆదివారం) రాత్రి ఎనిమిది గంటలకు దివ్యప్రభోత్సవం నిర్వహిస్తారు. ఆలయంలోని 90 అడుగుల ఇనుపప్రభను గ్రామానికి చెందిన రైతులు ఎద్దులతో ఆలయం చుట్టూ ప్రదక్షిణగా ముందుకు లాగిస్తారు. ప్రభను ముందుకు లాగించేందుకు రైతులు పోటీ పడతారు.25న (సోమవారం) అమ్మవారి తిరునాళ్లలో అత్యంత ప్రధానమైన ఘట్టం పుటింటి పసుపుకుంకుమ బండ్ల ఉత్సవం. అమ్మవారి పుట్టింటి వంశీయులు కొల్లా శ్రీనివాసరావు ఇంటి నుంచి ఏటా పసుపు కుంకుమను ఆలయానికి తీసుకురావడం ఆనవాయితీగా వస్తోంది. దేవస్థానం ఆధ్వర్యంలో విద్యుద్దీపాలతో రూపొందించిన బండిపై పసుపు కుంకుమలను తీసుకొస్తుండగా గ్రామానికి చెందిన వారు వందలాదిగా బండ్లతో అనుసరిస్తారు. ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు భారీగా భక్తులు తరలి వస్తారు.
3. వేడుకగా శ్రీవారి ఎదురుకోలు ఉత్సవం
శ్రీలక్ష్మినృసింహస్వామి దేవస్థానంలో మంగళవారం రాత్రి శ్రీవారి ఎదురుకోలు ఉత్సవం వేడుకగా జరిగింది. స్వామి కల్యాణానికి ముందుగా ఎదురుకోలు ఉత్సవం సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. పెండ్లికుమారుడైన శ్రీవారిని చంద్రప్రభవాహనంపై అధిష్ఠింపజేశారు. నవవధువులైన శ్రీదేవి భూదేవిలను ప్రత్యేక పల్లకిలో పురవీధుల్లో ఊరేగారు. శ్రీఆంజనేయస్వామి మిద్దె కూడలికి చేరుకున్న స్వామికి భక్తులు హారతులు పట్టారు.
నేడు రథోత్సవం.. మంగళగిరి శ్రీలక్ష్మీనృసింహస్వామి కల్యాణ రథోత్సవానికి విస్తృత ఏర్పాట్లు చేశారు. ఈనెల 20వ తేదీ మధ్యాహ్నం 2.30గంటలకు రథోత్సవం ప్రారంభమవుతుందని ఈవో పానకాలరావు తెలిపారు
4. కనువిందుగా కోనేటిరాయుడి తెప్పోత్సవాలు
తిరుమలేశుని వార్షిక తెప్పోత్సవాలు కనువిందుగా జరుగుతున్నాయి. విద్యుత్తు శోభను సంతరించుకున్న తెప్పను అధిరోహించిన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామి మంగళవారం రాత్రి ముచ్చటగా మూడుసార్లు విహరించారు. కోనేటి గట్టుపై నుంచి భక్తులు దేవదేవుని దర్శించుకున్నారు. ఉత్సవాల్లో భాగంగా ఆఖరి రోజు బుధవారం స్వామివారు ఉభయ దేవేరులతో కలిసి ఏడు చుట్లు కోనేటిలో విహరించనున్నారు.
5. అంతర్జాలంలో తితిదే కల్యాణ మండపాల నమోదు
తెలుగు రాష్ట్రాల్లోని తిరుమల తిరుపతి దేవస్థానం కల్యాణ మండపాలను అంతర్జాలం ద్వారా నమోదు చేసుకునే సదుపాయం కల్పిస్తున్నట్లు తితిదే తెలిపింది. ఈ అవకాశం ttdsevaonline.comవెబ్‌సైట్‌ ద్వారా కల్పించినట్లు వివరించింది. వివాహం, ఉపనయనం, నిశ్చితార్థం, నామకరణం, షష్టిపూర్తి, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, రిసెప్షన్‌ వంటి శుభకార్యాల కోసం కల్యాణ మండపాలను నమోదు చేసుకోవచ్చని సూచించింది.

నా వారసుడు ఇండియాలోనే

దలైలామా వారసుడు భారత్‌లోనే పుడతారని ఆధ్యాత్మిక గురువు దలైలామా(83) అన్నారు.

దలైలామా అస్తమించిన తర్వాత కూడా తిరిగి అవతారమెత్తుతారన్నది టిబెట్‌ బౌద్ధుల నమ్మకం… దానికి ఓ ఉదాహరణ కూడా వారు చెబుతారు.

ప్రస్తుత దలైలామా రెండేళ్ల బాలునిగా ఉన్నప్పుడు అంతకుముందున్న 13వ దలైలామా ఆత్మ ఆయనలో ప్రవేశించిందని టిబెట్‌ బౌద్ధులు విశ్వసిస్తారు.

ప్రస్తుతం ఉన్నది 14వ దలైలామా.. తదనంతరం 15వ దలైలామా ఎవరనేదానిపై ఆయన ఒ వార్తా సంస్థతో తన అభిప్రాయాన్ని తెలిపారు.

దలైలామా భారత్‌లోనే పుడతారనే ఆయన వ్యాఖ్యలను చైనా తప్పుబడుతోంది.

భారత సంతతికి చెందిన వారిని కాకుండా వేరే వారిని వలైలామాగా నియమించాలని చైనా భావిస్తోంది.

దలైలామాకు వారసునిగా వచ్చే వ్యక్తికి చైనా ప్రభుత్వ ఆమోదం తప్పనిసరి అని ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి గెంగ్‌ షువాంగ్‌ తెలిపారు. చక్రవర్తుల కాలం నుంచి ఇది సంప్రదాయంగా వస్తోందని ఆయన అన్నారు.

14వ దలైలామా నియామకం సమయంలో కూడా చైనా ప్రభుత్వం ఆమోదం తెలిపిందని గెంగ్‌ షువాంగ్‌ గుర్తుచేశారు.

పువ్వులతో హొలీ

**ఉత్తరప్రదేశ్‌లోని వ్రజ్‌…
పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు నడయాడిన భూమి…
చిన్ని కృష్ణుని లీలలకూ, రాధా గోపాలుని రాసక్రీడలకూ నిలయం…హోలీ పండుగ రాగానే అక్కడ కళ్లు చెదిరే వర్ణాల హేలతో,రంగురంగుల పూలతో ఉత్సవం అంబరాన్ని అంటుతుంది…అంతెందుకు, హోలీకి పర్యాయపదం ‘వ్రజ్‌’ అనిపిస్తుంది…చూపరుల నోట ‘అహో!’ అనిపిస్తుంది…
బృందావనం చెక్కేద్దాం! రా… రా… దా… గోపాలా అనేద్దాం!
***బృందావనిలో పువ్వుల కేళి!
మూడో రోజైన ఫాల్గుణ శుద్ధ ఏకాదశి నాడు (ఈ ఏడాది మార్చి 17న), బృందావనం లోని బన్‌కీ బిహారీ ఆలయంలో విశిష్టమైన రీతిలో హోలీ నిర్వహిస్తారు. ఈ ఉత్సవంలో ఉపయోగించేవి రంగులు కాదు, పువ్వులు! అందుకే దీనికి ‘ఫూలోం వాలీ హోలీ’ అని పేరు వచ్చింది. సాయంత్రం నాలుగు గంటలకు మొదలయ్యే ఈ వేడుక దాదాపు అరగంట సేపు సాగుతుంది. ఆ సమయంలో ఆలయ పూజారులు భక్తుల మీద పువ్వులు విసురుతారు. అవి తమ మీద పడడం అదృష్టంగా ప్రజలు భావిస్తారు. ఇక, బృందావనంలోని వివిధ ఆశ్రమాల్లో వితంతువులు నివసిస్తున్నారు. వారు ఎల్లప్పుడూ తెల్లటి దుస్తుల్లోనే ఉంటారు. కొద్ది సంవత్సరాల క్రితం పాగల్‌ బాబా వితంతు ఆశ్రమంలోని మహిళలు హోలీ ఉత్సవాలు చేసుకోవడం ప్రారంభించారు. బృందావనం ఆలయ పట్టణం. ఇక్క వందకు పైచిలుకు ఆలయాలు ఉన్నాయి. వాటిలో, ప్రధానంగా, గోపీనాథ్‌ ఆలయంలో వితంతువుల హోలీ వేడుకలు జరుగుతాయి. ఈ నెల 18న వీటిని నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక బృందావనంలో హోలీ ముందు రోజు (ఈ నెల 20న) బన్‌కీ బిహారీ ఆలయం జనసందోహంతో నిండిపోతుంది. రంగులనూ, పవిత్ర జలాలనూ భక్తుల మీద అర్చకులు చల్లుతారు. ఈ ఉత్సవం అంతా ఆ ఆలయ ప్రాంగణంలోనే జరుగుతుంది.
**ఫాల్గుణ మాసం రాగానే ఉత్తరప్రదేశ్‌లోని వ్రజ్‌ (బ్రజ్‌) ప్రాంతం హోలీ పండుగకు సిద్ధమైపోతుంది. పిల్లలూ, పెద్దలూ, పురుషులూ, మహిళలూ, యువకులూ, వయోధికులు… ఇలాంటి వ్యత్యాసాలేవీ లేకుండా అందరూ రంగుల సంబరాల కోసం ఏర్పాట్లో మునిగిపోతారు. అందుకంటే వ్రజ్‌ ప్రాంతానికి హోలీ పెద్ద పండుగ. ఈ వేడుకలు పదహారు రోజులు సాగుతాయి. అన్నిటికన్నా ప్రధానమైన ఉత్సవాలకు నాలుగు పట్టణాలు ఆతిథ్యం ఇస్తాయి. అవి బర్సానా, నందగ్రామ్‌, మధుర, బృందావనం. ఒక్కో చోటా ఒక్కొక్క రీతిలో సాగే ఈ వేడుకలను తిలకించడానికి విదేశాల నుంచి కూడా సందర్శకులు తరలివస్తారు.
***నల్లవాడి వాడలో…
లాత్‌మార్‌ హోలీ జరిగిన మరునాడు (ఈ ఏడాది మార్చి 16న) బర్సానాకు చెందిన పురుషులు నందగ్రామ్‌కు వస్తారు. వారిని నందగ్రామ్‌ మహిళలు లాఠీలతో తరిమికొడతారు. తలకు దెబ్బలు తగలకుండా పురుషులు పాగాలు చుట్టుకుంటారు. రబ్బరు కవచాలతో లాఠీ దెబ్బల్ని కాచుకుంటారు. తరువాత గ్రామంలోని శ్రీకృష్ణుడి ఆలయంలో ప్రార్థనలు చేస్తారు. అనంతరం ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటారు.
వినోదాలూ, ఆటపాటలూ ఉంటాయి. పోరాటంలో
ఓడిపోయిన పురుషులు సాయంత్రం మహిళల్లా దుస్తులు ధరించి, పాటలు పాడుతూ నృత్యాలు చేస్తారు.
***రాధమ్మ పుట్టింట్లో…
ఫాల్గుణ పౌర్ణమికి వారం రోజుల ముందు (ఈ ఏడాది మార్చి 15న) బర్సానాలో హోలీ నిర్వహిస్తారు. దీన్ని ‘లాత్‌మార్‌’ హోలీ అంటారు. బర్సానా శ్రీకృష్ణుని ప్రేయసి రాధ పుట్టిన ఊరు! ద్వాపర యుగంలో రాధా కృష్ణులు ఇక్కడ రంగులతో వసంతాలు అడుకున్నారట! శ్రీకృష్ణుడు పెరిగిన ఊరు నందగ్రామ్‌ నుంచి శ్రీకృష్ణుడికి ప్రతినిధులుగా యువకులు బర్సానాలోని రాధారాణి ఆలయానికి వస్తారు. అక్కడ తమ జెండా పాతుతారు. వారిని బర్సానా యువతులు కర్రలతో కొడుతూ వెంట తరుముతారు. ఇరు వర్గాల వారు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటారు. ఎంతో సరదాగా సాగే ఉత్సవం ఇది. వేలాది జనం ఈ ఉత్సవాన్ని తిలకించడానికి బర్సానా చేరుకుంటారు. వేడుకల తరువాత ఆలయంలోని రాధమ్మను దర్శించుకుంటారు.
***మథురానగరిలో…
శ్రీకృష్ణుడు జన్మించిన మథురానగరంలోని కృష్ణ జన్మభూమి ఆలయంలో ఫూలోంకా హోలీతో సహా ఈ రోజుల్లో అనేక వేడుకలు నిర్వహిస్తారు. హోలీ ముందురోజు బృందావనంలో వేడుకలు మధ్యాహ్నం పూర్తయిన తరువాత, మథురలో అదే రోజు హోలీ ఊరేగింపు జరుగుతుంది. విశ్రాం ఘాట్‌ నుంచి హోలీ ఘాట్‌ వరకూ సాగే ఈ ఊరేగింపుతో వీధులన్నీ కిటకిటలాడిపోతాయి. అనేక వాహనాలను పూలతో అలంకరించి, రాధాకృష్ణుల వేషధారులైన పిల్లలను వాటి మీద కూర్చోబెడతారు. ఊరేగింపులో ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటారు. సాయంత్రం హోళికా దహనం కార్యక్రమం మధుర లోని హోలీ గేట్‌ దగ్గర జరుగుతుంది. ఆ మరునాడు, అంటే హోలీ రోజున, (ఈ నెల 21న) మఽథురలోని కృష్ణ జన్మభూమి ఆలయం, ద్వారకేష్‌ ఆలయం, బృందావనంలోని అనేక కృష్ణ మందిరాలు, నందగ్రామ్‌, బర్సానాలతో సహా వ్రజ్‌ ప్రాంతంలోని వాడవాడలా హోలీ వేడుకలు ఆకాశమేహద్దుగా సాగుతాయి.
**ఎక్కడున్నాయి?
ఉత్తరప్రదేశ్‌లోని వ్రజ్‌ ప్రాంతంలో
ఎలా వెళ్లాలి?: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ప్రాంతాల నుంచి మథురకు నేరుగా రైళ్ళు ఉన్నాయి. మథురకు 14 కి.మీ. దూరంలో బృందావనం, 50 కి.మీ. దూరంలో బర్సానా ఉన్నాయి. బర్సానాకు 10 కి.మీ. దూరంలో నందగ్రామ్‌ ఉంది. మథురకు సమీప విమానాశ్రయం ఆగ్రాలో (సుమారు 65 కి.మీ.) ఉంది.
2.వారణాసి కాశీి వైభవం
కాశీ వైభవాన్ని పూర్తిగా తెలపడం దేవతలకు కూడా సాధ్యం కాదు. సముద్రం నుండి నీటి బిందువు లాంటి సంక్షిప్త సమాచారం:కాశీ పట్టణం గొడుగు లాంటి పంచ క్రోశాల పరిధి లో ఏర్పడ్డ భూభాగం. ఇది లింగం లాంటి పరమేశ్వర స్వరూపం కలిగి ధనుస్సాకారం లో ఉంటుంది. కాశీ బ్రహ్మ దేవుని సృష్టి లోనిది కాదు. విష్ణు మూర్తి హృదయం నుండి వెలువడి, సృష్టి ఆరంభంలో శివుడు నిర్మించుకున్న ప్రత్యేక స్థలం. ప్రపంచానికి ఆధ్యాత్మిక రాజధాని. ప్రపంచ సాంస్కృతిక నగరం.స్వయంగా శివుడు నివాసముండె నగరం. ప్రళయ కాలంలో మునుగని అతి ప్రాచీన పట్టణం. శివుడు ప్రళయ కాలంలో తన త్రిశూలంతో కాశీని పైకెత్తి కాపాడతాడు. కాశీ భువి పైన సప్త మోక్ష ద్వారాలలో ఒకటి, కాశీ పన్నెందు జోతిర్లింగాలలో కెల్లా శ్రేష్ఠమైనది. పద్నాలుగు భువన భాండాలలో విశేషమైన స్థలం.కాశీలో గంగా స్నానం,బిందు మాధవ దర్శనం, అనంతరం మొదట డిండి వినాయకుడు, విశ్వనాథుడు,విశాలాక్షి, కాలభైరవ దర్శనము అతి ముఖ్యం…. ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప క్షేత్ర పాలకుడు బైరవుడు జీవిని కాశీ లోనికి అనుమతించడు.కాశీలో మరణించిన వారికీ యమ బాధ పునర్ జన్మ ఉండదు. కాశీ ప్రవేశించిన జీవి యొక్క చిట్టా చిత్రాగుప్తుని నుండి మాయం అయి కాలభైరవుని వద్దకు చేరుతుంది….డిండి గణపతి, కాల భైరవుడు పరిశీలించి యమ యాతన కంటే 32 రేట్లు అధిక శిక్షలు విధించి మరు జన్మ లేకుండా చేస్తాడు … కాబట్టే కాశీలో కాల భైరవ దర్శనం తరవాత పూజారులు వీపు పై కర్రతో కొట్టి దర్శించిన వారు కాశీ దాటి వెళ్లి పోయినా పాపాలు అంటకుండా రక్ష నల్లని కాశి దారం కడతారు.కాశీ వాసం చేసే వారికి సమస్త యాగాలు, తపస్సులు చేసిన పుణ్యం తో పాటు అన్ని చక్రాలు ఉత్తేజితమైతాయి. కాశీలో మరణించిన ప్రతి జీవికి శివుడు దర్శనమిచ్చి వారి కుడి చెవిలో తారక మంత్రం పలికి మోక్షం ప్రసాదిస్తాడు.అందుకే కాశ్యాన్తు మరణాన్ ముక్తి అని శాస్త్ర వచనం కాబట్టే చివరి జీవితం చాలా మంది కాశీలో గడుపుతారు. మరణించిన వారి ఆస్తికలు కాశి గంగలో కలిపితే గతించిన వారు మళ్ళీ కాశీలో జన్మించి స్వయంగా విశ్వనాథునిచే ఉద్దరింప బడతారు. గోముఖం నుండి బయలుదేరే గంగమ్మ విచిత్రంగా దారి మళ్లి దక్షిణ దిశగా ప్రవహించి దన్నుసాకారపు కాశీి పట్టణాన్ని చుట్టి తిరిగి తన దారిలో ప్రవహిస్తుంది ఎంత కరువు వచ్చినా గంగమ్మ కాశీ ఘాట్లను వదిలి దూరం జరగలేదు.
*** శివుని కాశీలోని కొన్ని వింతలు…
కాశీలో గ్రద్దలు ఎగరవు, గోవులు పొడవవు, బల్లులు అరవవు, శవాలు వాసన పట్టవు, కాశీలో మరణించిన ప్రతి జీవి కుడి చెవి పైకి లేచి ఉంటుంది.
కాశీలో మందిరం చుట్టూ అనేక చిన్న తోవ సందులు కలిగి అట్టి సందులు అనేక వలయాకారాల్లో చుట్టినట్టు ఉండి ఒక పద్మవ్యూహం లాగా కొత్త వారికీ జాడ దొరకకుండా ఉంటుంది.కానీ పూర్వం ఇక్కడ అనేక సుందర వనాలు, పూలచెట్ల మధ్య ఉన్న మందిరాన్ని విదేశీ దండ యాత్రికుల దాడుల నుండి కాపాడుకోవడానికి ప్రజలంతా గుడి చుట్టూ పెద్ద పెద్ద బంగళాలు కట్టి శత్రు సైనికులకు దారి లేకుండా చేసినారు. అనేక దేశాల నుండి పెద్ద పెద్ద శాస్త్ర వేత్తలు వచ్చి కాశీి లో అనేక రీసెర్చ్ లు జరిపి ఆశ్చర్య పోయ్యారు. అస్సలు ఈ కాస్మోర్స్ ఎక్కడి నిండి వస్తున్నాయి?అప్పటి పూర్వికులు శక్తి చలనం వున్న చోటల్లా మందిరాలు నిర్మించారు అంత పరిజ్ఞానం ఆ రోజుల్లో వారికీ ఎక్కడిది అని ఆశ్చర్యానికి గురైనారు. కాశీి విశ్వేశ్వరునికి శవ భస్మ లేపనం తో పూజ ప్రారంభిస్తారు . కాశీలోని పరాన్న భుక్తేశ్వరుణ్ణి దర్శిస్తే జీవికి పరుల అన్నం తిన్న ఋణం నుండి ముక్తి లభిస్తుంది. కాశీ క్షేత్రంలో పుణ్యం చేస్తే కోటి రెట్ల ఫలితం ఉంటుంది; పాపం చేసినా కోటి రెట్ల పాపం అంటుతుంది.విశ్వనాథుణ్ణి అభిషేకించిన తరవాత చేతి రేఖలు మారిపోతాయి.ఇక్కడి శక్తి పీఠం విశాలాక్షి అమ్మవారు జగత్ అంతటికీ అన్నం పెట్టే అన్నపూర్ణ దేవి నివాస స్థలం కాశి.ప్రపంచంలోని అన్ని భాషలకు తల్లి అయిన అతి ప్రాచీన సంస్కృత పీఠం కాశీిలోనే వున్నది.
కాశీలో గంగమ్మ తీరాన 84 ఘాట్లు వున్నాయి..
***ఇందులో దేవతలు, ఋషులు, రాజుల తో పాటు ఎందరో తమ తపశ్శక్తితో నిర్మించినవి ఎన్నో వున్నాయి. అందులో కొన్ని :
1) దశాశ్వమేధ ఘాట్:
బ్రహ్మ దేవుడు 10 సార్లు అశ్వమేధ యాగం చేసినది ఇక్కడే. రోజూ సాయకాలం విశేషమైన గంగా హారతి జరుగుతున్నది.
2) ప్రయాగ్ ఘాట్:
ఇక్కడ భూగర్భంలో గంగతో యమునా,సరస్వతిలు కలుస్తాయి.
3) సోమేశ్వర్ ఘాట్:
చంద్రుని చేత నిర్మితమైనది.
4) మీర్ ఘాట్:
సతీదేవీ కన్ను పడిన స్థలం. విశాలాక్షి దేవి శక్తి పీఠం.
ఇక్కడే యముడు ప్రతిష్టించిన లింగం ఉంటుంది.
5) నేపాలీ ఘాట్:
పశుపతి నాథ్ మందిరం బంగారు కలశంతో నేపాల్ రాజు కట్టినాడు.
6) మణి కర్ణికా ఘాట్:
ఇది కాశీలో మొట్ట మొదటిది. దీనిని విష్ణు దేవుడు స్వయంగా సుదర్శన చక్రంతో తవ్వి నిర్మించాడు. ఇక్కడ సకల దేవతలు స్నానం చేస్తారు ఇక్కడ గంగ నిర్మలంగా పారుతుంది. ఇక్కడ మధ్యాహ్నం సమయంలో ఎవరైనా సుచేల స్నానం చేస్తే వారికి జన్మ జన్మల పాపాలు తొలిగి పోతాయి. జీవికి ఎంత పుణ్యం ప్రాప్తిస్తుందో చతుర్ ముఖ బ్రహ్మ దేవుడు కూడా వర్ణించలేడట.
7) విష్వేవర్ ఘాట్:
ఇప్పుడు సింధియా ఘాట్ అంటారు. ఇక్కడే అహల్యా బాయి తప్పసు చేసింది. ఇక్కడ స్నానం చేసే బిందు మాధవుణ్ణి దర్శిస్తారు.
8) పంచ గంగా ఘాట్:
ఇక్కడే భూగర్భం నుండి గంగలో 5 నదులు కలుస్తాయి.
9) గాయ్ ఘాట్:
గోపూజ జరుగుతున్నది.
10) తులసి ఘాట్:
తులసి దాస్ సాధన చేసి రామాచరిత మానస్ లిఖించమని శివుని ఆదేశం పొందినది.
11) హనుమాన్ ఘాట్:
ఇక్కడ జరిగే రామ కథ వినడానికి హనుమంతుడు వస్తుంటాడు. ఇక్కడే సూర్యుడు తపస్సు చేసి అనేక శక్తులు పొందిన లోలార్క్ కుండం వున్నది
ఇక్కడే శ్రీ వల్లభాచార్యులు జన్మించారు.
12) అస్సి ఘాట్:
పూర్వం దుర్గా దేవి శుంభ, నిశుంభ అను రాక్షసులను చంపి అట్టి ఖడ్గంను వెయ్యడం వల్ల ఇక్కడ ఒక తీర్థం ఉద్బవించింది.
13) హరిశ్చంద్ర ఘాట్:
సర్వం పోగొట్టుకొని హరిశ్చంద్రుడు ఇక్కడ శవ దహన కూలీగా పని చేసి దైవ పరీక్షలో నెగ్గి తన రాజ్యాన్ని పొందినాడు. నేటికి ఇక్కడ నిత్యం చితి కాలుతూ ఉంటుంది…
14) మానస సరోవర్ ఘాట్:
ఇక్కడ కైలాసపర్వతం నుండి భూగర్భ జలధార కలుస్తున్నది.
ఇక్కడ స్నానం చేస్తే కైలాస పర్వతం చుట్టిన పుణ్యం లభిస్తున్నది.
15) నారద ఘాట్:
నారదుడు లింగం స్థాపించాడు.
16)చౌతస్సి ఘాట్:
ఇక్కడే స్కంధపురాణం ప్రకారం ఇక్కడ 64 యోగినిలు తపస్సు చేసినారు.
ఇది దత్తాత్రేయునికి ప్రీతి గల స్థలం… ఇక్కడ స్నానం చేస్తే పాపాలు తొలిగి 64 యోగినుల శక్తులు ప్రాప్తిస్తాయి.
17) రానా మహల్ ఘాట్:
ఇక్కడే పూర్వం బ్రహ్మ దేవుడు సృష్టి కార్యంలో కలిగే విఘ్నాలను తొలగించమని వక్రతుండ వినాయకుణ్ణి తపస్సు చేసి ప్రసన్నుణ్ణి చేసుకున్నాడు.
18)అహిల్యా బాయి ఘాట్
ఈమె కారణంగానే మనం ఈరోజు కాశీ
విశ్వనాథుణ్ణి దర్శిస్తున్నాము.
కాశీలోని గంగా నది ప్రవాహంలో అనేక ఘాట్ల దగ్గర ఉద్భవించే తీర్థాలు కలిసి ఉంటాయి.పూర్వం కాశీలో దేవతలు ఋషులు రాజులూ నిర్మించిన అనేక మందిరాలు కట్టడాలు వనాల మధ్య విశ్వనాథుని మందిరం ఎంతో వైభవోపేతంగా వెలుగొందింది.కానీ మహమ్మదీయ దండ యాత్రికులు కాశీని లక్ష్యంగా చేసుకొని దాడులు చేసి ధ్వంసం చేసిన తరవాతి కాశిని మనం చూస్తున్నాము. విశ్వనాథ, బిందు మాధవ తో పాటు ఎన్నో అనేక మందిరాలను కూల్చి మసీదులు కట్టినారు. నేటికీ విశ్వనాథ మందిరంలో నంది, మసీదు వైపు గల కూల్చ బడ్డ మందిరం వైపు చూస్తోంది.అక్కడే శివుడు త్రిశూలం తో త్రవ్విన జ్ఞానవాపి తీర్థం బావి ఉంటుంది.ఈరోజు మనం దర్శించే విశ్వనాథ మందిర అసలు మందిరానికి పక్కన ఇండోర్ రాణి శ్రీ అహల్యా బాయి హోల్కర్ గారు కట్టించారు

కొబ్బరి బోండం విశిష్టత అదే

ఈ రోజుల్లో పెళ్లంటే… హీరోహీరోయిన్లను మరిపించే వధూవరులూ సినిమాసెట్టింగుల్ని తలపించే కళ్యాణమండపాలూ మొత్తంగా చూస్తే మూడు ఫొటోషూట్‌లూ ఏడు వీడియో రికార్డింగులూ అందుకే వధువు చేతిలోని కొబ్బరిబోండాం సైతం తళుకుబెళుకులతో అందంగా మెరిసిపోతూ పెళ్లికూతురి అలంకారంతో పోటీపడుతోంది.
*కొబ్బరిబోండాం పెళ్లికూతురి అలంకారంతో పోటీపడటం అనేది కాస్త అతిశయోక్తిగా అనిపించినప్పటికీ ఇది నూటికి నూరుపాళ్లూ నిజమే. పెళ్లిని ఓ సంప్రదాయ వేడుకలానే కాకుండా ఆడంబరంగా సాగే సంబురంగా జరుపుకుంటోంది నేటి తరం. పెళ్లిలో భాగంగా జరుపుకునే ప్రతి తంతునీ వీడియోల్లో ఫొటోల్లో బంధించి తీరాలనుకుంటోంది. ఇంకా చెప్పాలంటే తమ జీవితంలో అత్యంత ముఖ్యమైన వివాహ ఘట్టాన్ని ఎప్పటికీ గుర్తుండిపోయేలా కమనీయ కావ్యంలా చిత్రీకరించాలనుకుంటోంది. అందులో భాగంగానే ఆ పెళ్లితంతులో వాడే సామగ్రిని అద్భుతంగా అలంకరించేస్తున్నారు. దాంతో స్వాగత తోరణం నుంచి వధువు చేతిలోని కొబ్బరిబోండాం వరకూ అన్నీ చమ్కీల మెరుపులూ రాళ్ల అందాలూ అద్దుకుని తళుకులీనుతున్నాయి.
*వధువు చేతిలో…
పెళ్లిలో వాడే పీటలు, సన్నికల్లు, పెళ్లితెర, గరిగ ముంతలు… వీటన్నింటితో పోలిస్తే, పెళ్లికి పెళ్లికూతురికి అలంకరణ ఎంత ముఖ్యమో, కొబ్బరి బోండానికీ అంతే ప్రాధాన్యం. ‘కళ్యాణ మండపంలోకి వధువు అడుగుపెట్టే క్షణంలో అందరి కళ్లూ అమ్మాయిమీదే. అలాగే ఆమె చేతుల్లోని కొబ్బరిబోండాం మీదా అందరి దృష్టీ తప్పక పడుతుంది. అందుకే కొబ్బరిబోండాన్ని మరీ ప్రత్యేకంగా తయారుచేస్తున్నాం’ అంటున్నారు పెళ్లి వస్తువుల్ని తయారుచేసే డిజైనర్లు. దానిమీద వధూవరుల పేర్లతోబాటు వినాయకుడు, సీతారాములు, రాధాకృష్ణులు, శంఖుచక్రాలు, స్వస్తిక్‌, ఓం, తామరపువ్వు… ఇలా హిందూధర్మంలో శుభసంకేతాలుగా భావించే రకరకాల బొమ్మల్నీ పూసలూ చమ్కీలూ కుందన్లూ ముత్యాలతో అతికిస్తున్నారు. కొందరు రంగులతోనూ చిత్రీకరిస్తున్నారు. చివరికి బోండానికి ఉండే ముచ్చికను సైతం ముఖమల్‌, శాటిన్‌, పట్టు, జరీ వస్త్రాలతో చుట్టి అందంగా అలంకరిస్తున్నారు. మొత్తమ్మీద కొబ్బరిబోండాన్ని ఓ కళాత్మక వస్తువుగా రూపొందిస్తున్నారు. వీటిని ఎలా అలంకరించాలో తెలిపే వీడియోలు యూట్యూబ్‌లో లెక్కలేనన్ని. ఎవరికివారు స్వయంగా చేసుకోవడానికి సమయం లేనివాళ్లకోసం అన్నింటినీ సకాలంలో అందించే దుకాణాలూ, ఆన్‌లైన్‌ వెబ్‌సైట్లు కూడా చాలానే వచ్చాయి. పెళ్లికూతురి చీర రంగేమిటో చెబితే దానికి చక్కగా మ్యాచయ్యేలా నారీకేళాన్నీ రంగులతోనూ రాళ్లతోనూ అలంకరించి మరీ సమయానికి అందిస్తున్నారు.
*కొబ్బరిబోండామే ఎందుకు?
వివాహతంతు ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉంటుంది. కానీ అన్నిచోట్లా కొబ్బరిబోండాన్ని ఏదో ఒక రూపంలో వాడటం విశేషం. ప్రాంతం, ఆచారాల్ని బట్టి నిశ్చితార్థ వేడుకలోనూ కొబ్బరికాయల్నీ, బోండాలనీ, ఎండుకొబ్బరినీ ఇచ్చిపుచ్చుకుంటారు. ఎందుకంటే నారీకేళం లేదా శ్రీఫలాన్ని సంతానోత్పత్తికి చిహ్నంగానూ పార్వతీపరమేశ్వరుల స్వరూపంగానూ భావిస్తారు. పండ్లలో ఫలం, విత్తనం రెండూ కలిసి ఉండే ఏకైక ఫలం కొబ్బరిబోండాం. అందుకే దీన్ని పూర్ణ ఫలం అంటారు. మిగిలిన పండ్లలో పండులోపల విత్తనాలు వేరుగా ఉంటాయి. అందుకే హోమం చేసేటప్పుడు పూర్ణాహుతిలోనూ ఈ ఫలాన్నే వేస్తారు. దక్షిణాది పెళ్ళిళ్లలో పెళ్లికూతురి చేతిలో కొబ్బరిబోండాం తప్పనిసరి. అది ఎందుకూ అంటే- హిందూ సంప్రదాయం ప్రకారం వివాహ వేడుకలో సాలంకృత కన్యాదానం చేయాలి- అంటే కన్యని అలంకరించి ఆ అలంకారాలతో సహా దానం చేయాలన్నమాట. అందుకే చేతులకి గాజులు, చెవులకి కమ్మలు, ముక్కుకి ముక్కెర, నడుముకి వడ్డాణం, మెడలో కంఠహారాలు, భుజాలకు అరవంకీలు… ఇలా అన్నీ అలంకరించిన వధువుని పెళ్లికుమారుడికి కన్యాదాత దానంగా ఇస్తాడు. అలా ఇచ్చేటప్పుడు వధువుతోబాటు ఆమె ఒంటిమీద ఉన్న అలంకారాలన్నీ కూడా వరుడికి ఇచ్చినట్లే. వాటిని వెనక్కి తీసుకోకూడదనీ ఆ అలంకారాలన్నీ బంగారంతో చేసినవై ఉండాలనీ అంటారు. అయితే అవన్నీ చేయించే స్తోమత అందరికీ ఉండదు. అదీగాక కన్యాదానం చేసే ముందు దశ దానాలు చేయాలి అనీ చెబుతారు. అప్పుడే కన్యాదాన ఫలం కన్యాదాతకు దక్కుతుందట. మధ్య తరగతి కుటుంబీకులకి ఇవన్నీ కష్టం కాబట్టి ప్రత్యామ్నాయంగా కన్యాదాత కన్య చేతిలో మంచి గంధపుచెక్క, గుమ్మడిముక్క, కొబ్బరిబోండాం పెట్టి దానం ఇస్తే సాలంకృత కన్యాదానం చేసినట్లే అంటారు. అవన్నీ బంగారానికన్నా ఎంతో గొప్పవని పురాణాలూ పేర్కొంటున్నాయి.
*అలాగే వధువు చేతిలో కొబ్బరిబోండాం పెట్టడం వెనక మరో విశిష్టత కూడా ఉంది. కన్యాదాత దానం ఇస్తూ నీళ్లు ధారగా పోసే సమయంలో కొబ్బరిబోండాం కూడా తడుస్తుంది. అది తిరిగి ఉత్పన్నం కావడానికి అంటే మొలకెత్తడానికి సిద్ధంగా ఉండే స్వరూపం అని అర్థం. వాళ్ల దాంపత్య జీవితం వల్ల చక్కని సంతానం కలిగి వాళ్లు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ అమ్మాయి చేతిలో కొబ్బరిబోండాన్ని పెడతారు. పెళ్లిలో తాళిబొట్టుని సైతం ముందు కొబ్బరిబోండాం మీదే ఉంచుతారంటే దాని పవిత్రతని అర్థం చేసుకోవచ్చు.అంతేకాదు, భార్యాభర్తల దాంపత్యజీవితం ఎలా ఉండాలో తెలియజెప్పేదే కొబ్బరిబోండాం. బయటకి చూడ్డానికి బోండాం ఎంతో గట్టిగా ఉన్నా దాని లోపల అమృతం లాంటి తియ్యని నీళ్లు ఉంటాయి. దాని మాదిరిగానే ఆలూమగలు కూడా జీవితంలో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా వాటిని దృఢమైన వివాహబంధంతో తట్టుకుని, అన్యోన్యతతో జీవిస్తే అమృతంలాంటి సంసార జీవితాన్ని ఆస్వాదించగలరన్నది అంతరార్థం. అందుకే అంత పవిత్రమైన కొబ్బరిబోండాన్ని మరింత అందంగా కనిపించేలా చేయాలని తాపత్రయపడుతోంది ఈతరం. పైగా ఈ స్మార్ట్‌ యుగంలో వేడుక ఏదైనా అందంగా ఆడంబరంగా కలకాలం వీడియోల్లో ఫొటోల్లో నిక్షిప్తమైపోవాలి. అందుకే కొబ్బరిబోండాన్ని సైతం తమదైన ప్రత్యేకతతో అద్భుతంగా అలంకరించేస్తున్నారు. ఎవరి ఆనందం వాళ్లది. ఎవరి పెళ్లి కొబ్బరిబోండాం కూడా వాళ్లదే మరి!
2. యాదాద్రిలో రథోత్సవ శోభ
యాదాద్రి పుణ్యక్షేత్రంలో శనివారం రాత్రి లక్ష్మీనరసింహ రథోత్సవాలు వైభవంగా జరిగాయి. 11 రోజుల బ్రహ్మోత్సవాల్లో విశేషమైన ఈ వేడుకను రెండుచోట్ల నిర్వహించారు. కల్యాణమూర్తులైన స్వామి,అమ్మవార్లను ముస్తాబు చేసి దివ్య విమాన రథంపై అధిష్ఠింపజేశారు. పాంచరాత్ర ఆగమశాస్త్రరీత్యా హవనం, ఇతర పర్వాలను నిర్వర్తించాక; రథచక్రాలను ఆలయ ఆచార్యులతో పాటు నిర్వాహకులు, సిబ్బంది కదిలించారు. కొండపై బాలాలయంలో, తీర్థజనుల కోసం పట్టణంలోనూ రథయాత్ర జరిపారు. విశ్వశాంతి, లోక కల్యాణార్థం నిర్వహించే వేడుకలివి. ప్రధాన వీధుల్లోనే కాక గుండ్లపల్లి, యాదగిరిపల్లిలోనూ యాత్రల ద్వారా అందరికీ దర్శనభాగ్యం కల్పించారు. మధ్యాహ్నంవేళ అలంకార సేవోత్సవం ఏర్పాటైంది. మహావిష్ణువు అలంకరణలో స్వామి.. లక్ష్మీసమేతంగా గరుడ ఆళ్వారుపై ఊరేగడం నయనానందం కలిగించింది. ఈ కార్యక్రమాల్లో ఆలయ ఈవో గీతారెడ్డి, ధర్మకర్త నరసింహమూర్తి పాల్గొన్నారు. యాగశాలలో హోమాలు, మండపంలో పారాయణాలు కొనసాగాయి. పలు ప్రాంతాలకు చెందిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.
3. శ్రీవారి తెప్పోత్సవాలు ప్రారంభం
తిరుమలలో శనివారం సాయంత్రం శ్రీవారి తెప్పోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఏటా పాల్గుణమాసంలో పౌర్ణమినాడు ముగిసేలా ఐదు రోజుల పాటు ఈ ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా ఆలయంలో పూజాదికాలు పూర్తయిన తర్వాత సాయంత్రం సీత, లక్ష్మణ, అంజనేయ సమేత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవర్లను మాడవీధుల ప్రదక్షిణగా స్వామివారి పుష్కరిణికి తీసుకొచ్చారు. కోనేరులో అందంగా ముస్తాబైన తెప్పపై ఉత్సవర్లను అధిష్ఠింపచేశారు. మంగళవాయిద్యాలు, అన్నమయ్య సంకీర్తనలు, వేదమంత్రోచ్చారణలు, భక్తుల గోవిందనామ స్మరణ నడుమ మూడు ప్రదక్షిణల అనంతరం ఉత్సవర్లను ఆలయానికి వేంచేపు చేశారు. కాగా, రెండో రోజు ఆదివారం సాయంత్రం రుక్మిణి సమేత శ్రీకృష్ణస్వామి తెప్పపై పుష్కరణిలో విహరించనున్నారు.
4. తితిదే ఉగాది పంచాంగం ఆవిష్కరణ
తితిదే రూపొందించిన శ్రీవికారినామ సంవత్సర పంచాంగాన్ని శ్రీవారి పుష్కరిణిలో జరిగిన తెప్పోత్సవంలో ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తిరుమల జేఈవో శ్రీనివాసరాజుతో కలిసి శనివారం ఆవిష్కరించారు. పంచాంగాన్ని తితిదే ఆస్థాన సిద్ధాంతి తంగిరాల వేంకటకృష్ణ పూర్ణ ప్రసాద్‌ రచించినట్లు ఈవో వివరించారు. హిందూ ధర్మప్రచారంలో భాగంగా ఏటా ఉగాది నాటికి తెలుగు పంచాంగాలను ముద్రించి భక్తలోకానికి అందిస్తున్నట్లు గుర్తుచేశారు. కార్యక్రమంలో పెద్దజీయంగార్‌, చిన్నజీయంగార్‌, సీవీఎస్‌వో గోపీనాథ్‌ జెట్టీ, ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్‌, ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు తదితరులు పాల్గొన్నారు.

భద్రాద్రిలో పునర్వసు వేడుకలు

తిరుమల శ్రీవారిని ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబు దంపతులు దర్శించుకున్నారు. వారితో పాటు ఆయన తనయుడు, మంత్రి లోకేశ్‌ దంపతులు, మంత్రి యనమల, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి స్వామివారి సేవలో పాల్గొన్నారు. కుటుంబ సమేతంగా ఆలయానికి వచ్చిన సీఎంకు ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు.
శ్రీవారిని దర్శించుకున్న అనంతరం తిరుపతికి చేరుకుని తారకరామ స్టేడియంలో జరిగే బహిరంగసభలో పాల్గొంటారు. ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడతారు. అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం 5.30 గంటలకు శ్రీకాకుళం చేరుకుంటారు. అక్కడ జిల్లా నాయకులు, కార్యకర్తలతో సమావేశమవుతారు. రాత్రి అక్కడే బస చేస్తారు.
1. సీతారామచంద్రస్వామి ఆలయంలో పునర్వసు వేడుకలు
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో పునర్వసు వేడుకలు వైభవంగా నిర్వహిస్తున్నారు. తిరునక్షత్రం సందర్భంగా సీతారామచంద్రమూర్తి ఆలయంలో వేడుకలు నిర్వహిస్తారు. ప్రాకర మండపంలో ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం చేస్తారు. ప్రధాన ఆలయంలోని మూలవిరాట్‌లకు బంగారు తులసీ దళాలతో అర్చన చేశారు.
2. తిరుమలలో నేటి నుంచి సాలకట్ల తెప్పోత్సవాలు
తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.ఈరోజు రాత్రి 7 గంటలకు తెప్పోత్సవాలు ప్రారంభంకానున్నాయి. ఇందుకోసం తెప్పను సిద్ధం చేసి విద్యుద్దీపాలతో సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. స్వామి పుష్కరిణిని అందంగా అలంకరించారు. ప్రతిరోజూ రాత్రి 7 నుంచి 8 గంటల వరకు స్వామి, అమ్మవార్లు పుష్కరిణిలో ఆనందవిహారం చేస్తారు. ప్రతి ఏటా పాల్గుణ మాసంలో శుద్ధ ఏకాదశినాడు ప్రారంభమయ్యే తెప్పోత్సవాలు పౌర్ణమి వరకు ఘనంగా జరుగుతాయి.తెప్ప అనగా పడవ, ఓడ. ఓడలో సుఖాశీనులైన శ్రీవారిని కోనేటిలో విహారం చేయించడాన్నే తెప్పోత్సవం అంటారు. తెప్పోత్సవాలను తమిళంలో ‘తిరుపల్లి ఓడై తిరునాళ్‌’, తెలుగులో ‘తెప్ప తిరునాళ్లు అంటారు. తిరుమలలో తెప్పోత్సవాలు అత్యంత ప్రాచీనకాలం నుండి జరుగుతున్నాయని తెలుస్తోంది. అయితే సాళువ నరసింహరాయలు క్రీ.శ 1468లో పుష్కరిణి మధ్యలో ”నీరాళి మండపాన్ని” నిర్మించి తెప్పోత్సవాలకు అనువుగా తీర్చిదిద్దారు. క్రీ.శ.15వ శతాబ్దానికి చెందిన శ్రీ తాళ్లపాక అన్నమయ్య తిరుమల తెప్పోత్సవాలను గొప్పగా కీర్తించారు. వేసవి ప్రారంభంలో పున్నమి రోజుల నాటి వెన్నెల కాంతుల్లో చల్లని నీళ్లల్లో శ్రీ స్వామివారిని ఊరేగించే ఈ తెప్పోత్సవాలు భక్తులకు కనువిందు చేస్తాయి.తెప్పోత్సవాల్లో తొలిరోజు శ్రీ సీత లక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి అవతారంలో స్వామివారు తెప్పలపై పుష్కరిణిలో మూడు చుట్లు తిరిగి భక్తులకు కనువిందు చేస్తారు. రెండవ రోజు మార్చి 17న రుక్మిణీ సమేతంగా శ్రీక ష్ణస్వామి అవతారంలో మూడుమార్లు విహరిస్తారు.ఇక మూడవరోజు మార్చి 18న శ్రీదేవి, భూదేవి సమేతంగా మలయప్పస్వామివారు మూడుమార్లు పుష్కరిణిలో చుట్టి భక్తులను అనుగ్రహిస్తారు. ఇదేవిధంగా శ్రీమలయప్పస్వామివారు నాలుగో రోజు మార్చి 19న ఐదుసార్లు, చివరి రోజు మార్చి 20వ తేదీ ఏడుమార్లు తెప్పపై పుష్కరిణిలో విహరించి భక్తులను కటాక్షిస్తారు.
*ఆర్జిత సేవలు రద్దు
తెప్పోత్సవాల కారణంగా ఈరోజు,రేపు వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవ, మార్చి 18, 19, 20వ తేదీల్లో ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.
3. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 3 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. టైమ్ స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు 3 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 65,566 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న 25,765 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. నిన్న స్వామివారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు రూ. 3.75 కోట్లు.
4. శుభకార్యాలకు భద్రాద్రి కల్యాణ తలంబ్రాలు!
భద్రాచలం సీతారాముల కల్యాణానికి ఎంత ప్రాముఖ్యముందో అందరికీ తెలిసిందే. ఇక్కడ కల్యాణంలో ఉపయోగించే తలంబ్రాలకూ అంతే విశిష్టత ఉంది. ఇప్పటి వరకు వీటిని భక్తులకు అందిస్తుండగా.. శుభకార్యాలకు కూడా పంపిస్తే ఎలా ఉంటుందనే సమాలోచనలు చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున కొద్ది రోజుల తర్వాత దీన్ని ప్రారంభించాలని ఆలయ నిర్వాహకులు భావిస్తున్నట్లు సమాచారం. పెళ్లి కార్డులు లేదా ఇతర శుభకార్యాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికలను రామాలయ కార్యాలయంలో అందించిన వారికి తలంబ్రాలను పంపాలనే యోచనలో అధికారులు ఉన్నారు. శ్రీరామ నవమికి 150 క్వింటాళ్ల బియ్యంతో తలంబ్రాలను తయారు చేస్తుండగా ఇందులో 100 క్వింటాళ్లను చీరాలకు చెందిన భక్తులు సమర్పించేందుకు ముందుకు వచ్చారు. ఇందులో 25 క్వింటాళ్లను శుభకార్యాల కోసం కేటాయించే వీలుంది. దూర ప్రాంతాల్లోని వాళ్లకు కొరియర్‌ ద్వారా పంపాలని భావిస్తున్నారు. ప్రతి పొట్లంలో 50 గ్రాముల తలంబ్రాలు, రెండు ముత్యాలు, పసుపు, కుంకుమ, ఆలయ సమాచారం తెలిపే కరపత్రం, పటిక బెల్లం ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఎంత దూరంలో ఉన్నా కార్డు పంపి వివరాలు అందిస్తే స్వామివారి తలంబ్రాలను అందించాలన్నది ఆలయ నిర్వాహకుల ఉద్దేశం.
5. నేత్రపర్వంగా యాదాద్రీశుడి కల్యాణం
యాదాద్రి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో..అత్యంత విశేష పర్వమైన లక్ష్మీనారసింహుల కల్యాణ వేడుక శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. నిశ్చయించిన ముహూర్తంలో పుణ్య క్రతువును పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రథమ పౌరుడు- గవర్నర్‌ నరసింహన్‌ ప్రభుత్వ పక్షాన సతీసమేతంగా పాల్గొన్నారు. స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఉదయంవేళ 11 గంటలకు కొండపై బాలాలయంలో ఆస్థానపరంగా; రాత్రి 8 గంటలకు కొండకింద పాత జడ్పీ పాఠశాల ఆవరణలో భక్తజనుల మధ్య పరిణయాన్ని ఘనంగా నిర్వర్తించారు. చినజీయర్‌ స్వామి ప్రతినిధిగా హాజరైన దేవనాథ రామానుజ జీయర్‌స్వామి పర్యవేక్షణలో కొండ కింద కల్యాణం అంగరంగ వైభవంగా ఏర్పాటైంది.
6. కోరుకొండ తీర్థానికి సర్వం సిద్ధం
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పేరుగాంచిన కోరుకొండ దివ్యక్షేత్రంలో జరిగే నరసన్న కల్యాణోత్సవాలకు సర్వం సిద్ధమయ్యాయి. ఈ నెల 17వ తేదీ నుంచి 21వ తేదీ వరకు అయిదు రోజుల పాటు లక్ష్మీనరసింహస్వామి దివ్య కల్యాణోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి.
*ఒకే రోజు రథోత్సవం, కల్యాణం
స్వామివారి కల్యాణోత్సవాల్లో ప్రధాన ఘట్టాలు రథోత్సవం, కల్యాణోత్సవం. ఈ రెండు క్రతువులు ఒకేరోజు అందులోనూ తొలిరోజున జరగడం విశేషం. మధ్యాహ్నం 2.00 గంటల నుంచి సాయంత్రం వరకు రథోత్సవం, రాత్రి 9.00 గంటల నుంచి అర్ధరాత్రి వరకు స్వామివారి కల్యాణం నిర్వహిస్తారు.
*శ్రీకారం నేడు
స్వామివారి కల్యాణోత్సవాలు ఆదివారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో శనివారం రాత్రి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. సాయంత్రం 5.00 గంటలకు వైఖానస ఆగమ పండితుల ఆధ్వర్యంలో అర్చకస్వాములు స్వామివారి కోనేరు వద్దకు వెళ్లి అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం పుట్టమన్ను తీసుకొచ్చి అంకురార్పణ చేస్తారు. ధ్వజారోహణం, సేవాకాలం కార్యక్రమాలతో నాంది పలుకుతారు. ఉత్సవాల ముగింపును పురస్కరించుకుని 22న ద్వాదశ ప్రదక్షిణలు, పుష్పయాగం, పవళింపు సేవ జరుగుతాయి.
**సాంస్కృతిక ప్రదర్శనలు
* 18న రాత్రి 7.00 గంటలకు: కార్తికేయ నృత్యాలయం ఆధ్వర్యంలో భరతనాట్యం, కూచిపూడి నృత్య ప్రదర్శన. * 19న రాత్రి 7.00 గంటలకు: మడిపల్లి వెంకటేశ్వరరావు వారిచే బుర్రకథ. * 20న రాత్రి 7.00 గంటలకు: కార్తికేయ నృత్యాలయం ఆధ్వర్యంలో భరతనాట్యం, కూచిపూడి నృత్య ప్రదర్శన. * 21న రాత్రి 7.00 గంటలకు: శ్రీసత్యదేవ అన్నమాచార్య సంకీర్తన బృందం, కనకదుర్గ, పద్మజ బృందాల భక్తి సంగీత విభావరి.
** ప్రధాన వైదిక కార్యక్రమాలు
* 17న ఆదివారం మధ్యాహ్నం 12.00 గంటలకు: స్వామి, అమ్మవార్లను నూతన వధూవరులుగా అలంకరిస్తారు. * 18న సోమవారం రాత్రి 9.00 గంటలకు: గరుడ వాహనంపై స్వామివారి గ్రామోత్సవం. * 19న మంగళవారం రాత్రి 7.30 గంటలకు: ఆలయ ముఖ మండపంలో ఉభయ వేదాంత పండితుల సమక్షంలో సదస్యం. * రాత్రి 9.00 గంటలకు: ఆంజనేయస్వామి వాహనంపై స్వామివారి గ్రామోత్సవం. * 20న బుధవారం రాత్రి 8.00 గంటలకు: రంగరాజస్వామి కల్యాణోత్సవం. * రాత్రి 9.00 గంటలకు: గజ వాహనంపై గ్రామోత్సవం. * 21న గురువారం ఉదయం 9.00 గంటలకు: చక్రతీర్థం. * సాయంత్రం 6.30 గంటలకు: ఊంజల్‌ సేవ. * రాత్రి 9.00 గంటలకు: శేషవాహనంపై గ్రామోత్సవం.

కంచి కామాక్షీ అమ్మవారి విశేషాలు

కంచి అనగానే మనకు కామాక్షిదేవి పేరే గుర్తుకు వస్తుంది. ఆ నగరాన్ని స్మరిస్తేనే మోక్షం లభిస్తుంది. అందరూ దర్శించే కామాక్షీదేవి ఆలయానికి వెనుకవైపు ఒక ఆలయం ఉంది. అదే ఆదికామాక్షీదేవి ఆలయం. ఈ ఆలయాన్ని కాళీకొట్టమ్‌ (కాళీ కోష్టమ్‌) అనే పేరుతో కూడా పిలుస్తారు. ఒకానొక సమయంలో పార్వతీదేవి ఇక్కడ కాళీరూపంలో వెలసిందట. నాటినుండీ ఆమెకు ఆ పేరు ప్రసిద్ధమైంది.కంచి కామాక్షిదేవి ఆలయం కంటే ఇది ప్రాచీనమైనదని చెబుతారు. కామాక్షీదేవికి ముందు భాగంలో శక్తి లింగం ఒకటుంది. అమ్మవారి ముఖం లింగంపై ఉంటుంది. ఇది అర్ధనారీశ్వరలింగంగా పూజలందుకుంటోంది. కల్యాణం కాని వారు ఈ శక్తి లింగాన్ని పూజిస్తే తప్పక కల్యాణం జరుగుతుంది. ఈ ఆలయంలో ఆదిశంకరులు శ్రీచక్ర ప్రతిష్ఠ చేసి అమ్మవారి ఉగ్రత్వాన్ని శాంతింపచేశారట. గర్భగుడిలో ఆదికామాక్షీదేవి పద్మాసనంలో కూర్చుని అభయముద్రను, పానపాత్రను, పాశాంకుశాలనూ నాలుగు చేతులతో ధరించి దర్శనమిస్తుంది. అమ్మవారి పీఠానికి కిందిభాగంలో మూడు శిరస్సులు దర్శనమిస్తాయి. వాటి వెనుక ఒక పౌరాణిక గాథ ఉంది.శిల్పకుశలురైన ధర్మపాలుడు, ఇంద్రసేనుడు, భద్రసేనుడు అనే ముగ్గురు కాంచీపురంలో తమ శిల్పాలను ప్రదర్శించడానికి వస్తారు. వారి శిల్పకళకు అచ్చెరువొందిన కంచిరాజు వారికి ఒక మాట ఇచ్చి తప్పుతాడు. దాంతో రాజుకు శిల్ప సోదరులకు యుద్ధం జరుగుతుంది. భీకరమైన ఈ యుద్ధాన్ని నివారించేందుకు కామాక్షీదేవి ప్రత్యక్షమై రాజుకు, ఆ శిల్పులకు సంధి చేస్తుంది. శిల్పులకు తన పాదసన్నిధిలో స్థానం కల్పించి అనుగ్రహిస్తుంది. ఈ కథ ధర్మపాలవిజయం పేరిట ప్రసిద్ధి పొందింది.సకలశుభాలనూ, సకల సిద్ధులనూ అనుగ్రహించే ఆదికామాక్షీదేవిని దర్శించి అభీష్టసిద్ధిని పొందండి
2. కాటమరాయుడికి దవనార్చన-15 నుంచి కదిరి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు
పరిమళాలు వెదజల్లే పరిసరాలు భగవంతుడి నివాస స్థలాలు.పరమాత్మను రకరకాల పువ్వులతో పూజించడం ఆనవాయితీ.చాలాచోట్ల తులసిని కూడా సమర్పిస్తారు. అయితే ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామికి మాత్రం దవనం సమర్పించడం సంప్రదాయం. శ్రీమహావిష్ణువు అలంకార ప్రియుడు.ఆయనే అనంతపురం జిల్లా కదిరిలో లక్ష్మీనరసింహస్వామిగా కొలువయ్యారని భక్తుల విశ్వాసం. స్వామివారు బ్రహ్మోత్సవాల్లో రోజుకో అలంకారంతో తిరువీధుల్లో దర్శనమిస్తారు. ఈ సందర్భంగా ఖాద్రీసుని సువాసనలు వెదజల్లే దవనం, మల్లెలతో ప్రత్యేకంగా అలంకరిస్తారు. కాటమరాయుడికి, దవనానికి విశేషమైన సంబంధమే ఉంది. పాల్గుణ మాసంలో జరిగే బ్రహ్మోత్సవాల సమయంలోనే దవనం పండడం భగవంతుని కృపే అన్న విశ్వాసం భక్తుల్లో ఉంది. అలాగే చైత్రమాస పౌర్ణమిని దవన పున్నమిగా ఇక్కడ నిర్వహిస్తారు. దవనానికి సువాసనతో పాటు రుగ్మతలను మాపే దివ్య ఔషద గుణం కూడా ఉంది. వేసవిలో చర్మసంబంధిత రుగ్మతలు వస్తుంటాయి. వాటిని రూపుమాపే గుణం దవనానికి ఉంది.ఏడాదిలో 364 రోజుల పాటు పూజలందుకున్న స్వామివారు రథోత్సవంనాడు దివ్య చైతన్యంతో ఉంటారని భక్తుల నమ్మకం. అందుకే ఆరోజు భక్తుల గోవిందనామ ఘోషతో రథం ముందుకెళ్తుంటే నృసింహునిపై దవనం, మిరియాలు చల్లి కోర్కెలు నెరవేర్చమని వేడుకుంటారు. చాలాకాలంగా వేధిస్తున్న రుగ్మతుల విముక్తికి భక్తులు రథం వెనక పొర్లుదండాలు పెడతారు. అలా చేసే సమయంలో నేలపై పడిన దవనం, మిరియాలు శరీరానికి తగలడం ద్వారా ఆ వ్యాధులు తగ్గుతాయని భక్తుల నమ్మకం. కొందరు రథంపై నుంచి జారిపడిన దవనం, మిరియాలను ఇళ్లకు తీసుకెళ్లి ఏడాదంతా దాచుకుంటారు. రుగ్మతలకు ఔషదంగా వాడతారు.
3. నేడు యాదాద్రి నరసింహస్వామి ఎదుర్కోలు మహోత్సవం..
యాదాద్రి నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో విశేష ఉత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ రోజు రాత్రి శ్రీవారి ఎదుర్కోలు మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించనున్నారు. 15న శ్రీవారి తిరుకల్యాణం, 16న శ్రీస్వామివారి దివ్య విమానరథోత్సవంలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారని, 15న కల్యాణోత్సవానికి గవర్నర్ నరసింహన్ సతీసమేతంగా హాజరవుతారని ఈవో గీత తెలిపారు.
4. వైభవంగా మహా కుంభాభిషేకం
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ లో తితిదే నూతనంగా నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో బుధవారం మహా కుంభాభిషేకం వైభవోపేతంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ప్రత్యేకంగా వచ్చిన వేద పండితుల ఆధ్వర్యంలో ఉదయం 6గంటల నుంచి 7గంటల మధ్య మీన లగ్నంలో శాస్త్రోక్తంగా దీన్ని చేపట్టారు. వేడుక అనంతరం సామాన్య భక్తులకు స్వామివారిని దర్శించుకునే అవకాశం కల్పించారు.
5. సింహవాహనంపై మృగ నరహరి
యాదాద్రీశుడు సింహవాహనంపై విహరిస్తూ, బుధవారం తీర్థజనులకు నేత్రానందం కలిగించారు. యాదాద్రి లక్ష్మీ నరసింహ వార్షిక బ్రహ్మోత్సవాల ఆరో రోజు రాత్రి వాహన సేవోత్సవం అందరికీ కనువిందు చేసింది. లక్ష్మీసమేతుడై విహరించిన స్వామి..మధ్యాహ్నంవేళ పెళ్లికుమారుడి ముస్తాబుతో పాటు గోవర్ధన గిరిధారిగా దర్శనమిచ్చారు. అలంకార, వాహన సేవ సంబరాలతో క్షేత్రమంతా వైభవంగా అలరారింది. ప్రత్యేక పూజలు చేపట్టి, ఉత్సవ పర్వాలు నిర్వహించారు. విష్ణు సహస్రనామ పారాయణం, నిరంతర మంత్ర పఠనం, హవన పూజలు నిర్వర్తించారు. పర్వాల విశిష్టతను ఆలయ ప్రధాన పూజారి లక్ష్మీనరసింహాచార్య వివరించారు. ఐదురోజులు నిర్వహించే ధార్మిక సాహిత్య సాంస్కృతికోత్సవాలను యాడా ఉపాధ్యక్షులు జి.కిషన్‌రావు, ఆలయ ఈవో గీతారెడ్డి, ధర్మకర్త నరసింహమూర్తి జ్యోతి వెలిగించి ప్రారంభించారు. గురువారం జరిగే ఎదుర్కోలు ఉత్సవానికి ఏర్పాట్లు మొదలయ్యాయని పూజారులు తెలిపారు.
6. మరింత మందికి మహద్వార ప్రవేశం-తిరుమల జేఈవో శ్రీనివాసరాజు
శ్రీవారి ఆలయ మహద్వార ప్రవేశానికి సంబంధించి మఠాధిపతులు, పీఠాధిపతులతో పాటు దేశంలోని పలువురు అత్యంత ప్రముఖులకు ప్రత్యేక అవకాశం కల్పించినట్లు తిరుమల జేఈవో శ్రీనివాసరాజు తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసినట్లు వివరించారు. మఠాధిపతులు, పీఠాధిపతులకు శ్రీవారి ఆలయ మహద్వార ప్రవేశ నియమాలలో ఎలాంటి మార్పులు చేపట్టలేదని స్పష్టం చేశారు. ఆలయ మర్యాదలు పొందే మఠాధిపతులు, పీఠాధిపతులకు ఏడాదికి ఒకసారి ఐదుగురితో కలిసి మహద్వార ప్రవేశం ఉంటుందని తెలిపారు. ఆ తర్వాత అదే సంవత్సరంలో ఎప్పుడు వచ్చినా వారితోపాటు ఒక సహాయకుడికి మహద్వార ప్రవేశం కల్పిస్తున్నట్లు వివరించారు.
7. కలియుగదైవం శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువై ఉన్న తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి నాలుగు కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. అలాగే స్వామివారి సర్వ దర్శనానికి 6గంటల సమయం పడుతోంది. శ్రీవారి టైంస్లాట్, నడకదారిన వచ్చే భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు 2గంటల సమయం పడుతుండగా ప్రత్యేక ప్రవేశ దర్శనానికి కూడా 2గంటల సమయం పడుతోందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
8. తిరుమల \|/ సమాచారం
ఈ రోజు గురువారం
14.03.2019
ఉదయం 5 గంటల
సమయానికి,
తిరుమల: 15C° – 33C°
నిన్న 66,078 మంది
శ్రీవారి భక్తులకి కలియుగ
దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి
వారి దర్శన
భాగ్యం కలిగినది,
స్వామివారి సర్వదర్శనం
కోసం తిరుమల వైకుంఠం
క్యూ కాంప్లెక్స్ లోని 04
గదులలో భక్తులు
వేచియున్నారు,
ఈ సమయం శ్రీవారి
సర్వదర్శనాని కి సుమారు
08 గంటలు పట్టవచ్చును,
నిన్న స్వామివారికి
హుండీలో భక్తులు
సమర్పించిన నగదు
₹: 3.34 కోట్లు,
శీఘ్రసర్వదర్శనం(SSD),
ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్
₹:300/-), దివ్యదర్శనం
(కాలినడక) వారికి శ్రీవారి
దర్శనానికి సుమారుగా
రెండు గంటల సమయం
పట్టవచ్చును,
వయోవృద్దులు మరియు దివ్యాంగుల
ప్రత్యేయకంగా ఏర్పాటు
చేసిన కౌంటర్ ద్వారా
ఉ: 10 గంటలకి (750)
మ: 2 గంటలకి (750)
ఇస్తారు,
చంటి పిల్లల తల్లిదండ్రులు మరియు ఎన్నారై ప్రత్యేక దర్శనాలు
సుపథం మార్గం గుండా శ్రీవారి
దర్శనానికి అనుమతిస్తారు
ఉ: 11 గంటల నుంచి
సాయంత్రం 5 గంటల వరకు
దర్శనానికి అనుమతిస్తారు,
9. చరిత్రలో ఈరోజు
1888: అత్యధిక సర్క్యులేషన్ కల మలయాళ వార్తాపత్రిక మలయాళ మనోరమను కందత్తిల్ వర్ఘీస్ మాప్పిల్లై స్థాపించాడు.
1931: భారతదేశములో తొలి టాకీ చిత్రము, అర్దెషీర్ ఇరానీ దర్శకత్వము వహించిన ఆలం ఆరా ముంబైలోని గోరేగాఁవ్ లోని ఇంపీరియల్ సినిమా థియేటరులో విడుదలయ్యింది
2008: హైదరాబాదులోని శంషాబాదు అంతర్జాతీయ విమానాశ్రయానికి సోనియా గాంధీ చే ప్రారంభోత్సవం జరిగింది.
**జననాల
*1842: కొక్కొండ వేంకటరత్నం పంతులు. మహామహోపాధ్యాయ బిరుదు పొందిన ఆధునికాంధ్రులలో రెండవ వ్యక్తిగా ఘనత వహించిన సంగీతజ్ఞుడు, కవి, నాటక రచయిత. (మ.1915)
*1879: ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, ప్రఖ్యాత భౌతికశాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత. (మ.1955)
*1917: కె.వి.మహదేవన్, సుప్రసిద్ధ తెలుగు చలన చిత్ర సంగీత దర్శకుడు. (మ.2001)
*1930: నాయని కృష్ణకుమారి, ప్రముఖ తెలుగు రచయిత్రి. (మ.2016)
*1937: జొన్నలగడ్డ గురప్పశెట్టి, కలంకారీ కళాకారుడు, 2009 లో పద్మశ్రీ పురస్కారము తోనూ సత్కరించబడ్డారు.
**మరణాలు
*1664: సిక్కుల ఎనిమిదవ గురువు గురు హర్‌కిషన్ ఢిల్లీలో మరణించాడు.
*1883: ప్రఖ్యాత తత్వవేత్త, రాజకీయ-ఆర్థికవేత్త మరియు విప్లవ కారుడు కారల్ మార్క్స్ మరణించాడు.
*2013: అడబాల, రంగస్థల నటుడు, రూపశిల్పి. (జ.1936)
10. శుభమస్తు
తేది : 14, మార్చి 2019
సంవత్సరం : విళంబినామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : ఫాల్గుణమాసం
ఋతువు : శిశిర ఋతువు
కాలము : శీతాకాలం
వారము : గురువారం
పక్షం : శుక్లపక్షం
తిథి : అష్టమి
(ఈరోజు తెల్లవారుజాము 4 గం॥ 23 ని॥ నుంచి
మర్నాడు తెల్లవారుజాము 3 గం॥ 20 ని॥ వరకు)
నక్షత్రం : మృగశిర
(ఈరోజు తెల్లవారుజాము 5 గం॥ 6 ని॥ నుంచి
మర్నాడు తెల్లవారుజాము 4 గం॥ 41 ని॥ వరకు)
యోగము : ప్రీతి
కరణం : వణిజ
వర్జ్యం : (ఈరోజు ఉదయం 10 గం॥ 36 ని॥ నుంచి ఈరోజు ఉదయం 12 గం॥ 10 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఈరోజు తెల్లవారుజాము 1 గం॥ 51 ని॥ నుంచి ఈరోజు తెల్లవారుజాము 3 గం॥ 27 ని॥ వరకు)(ఈరోజు రాత్రి 8 గం॥ 2 ని॥ నుంచి ఈరోజు రాత్రి 9 గం॥ 36 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 10 గం॥ 25 ని॥ నుంచి ఈరోజు ఉదయం 11 గం॥ 13 ని॥ వరకు)(ఈరోజు సాయంత్రం 3 గం॥ 13 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 4 గం॥ 1 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 55 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 3 గం॥ 25 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు ఉదయం 9 గం॥ 25 ని॥ నుంచి ఈరోజు ఉదయం 10 గం॥ 55 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు ఉదయం 12 గం॥ 25 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 55 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 6 గం॥ 25 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 25 ని॥ లకు
సూర్యరాశి : కుంభము
చంద్రరాశి : వృషభము

తిరుమల శ్రీవారి ఎకరం అటవీ భూమి కాలిపోయింది

తిరుమల సమీపంలోని అడవిలో కార్చిచ్చు రేగడంతో ఎకరా అటవీ ప్రాంతం బూడిదైంది.

శ్రీవారి ఆలయానికి ఉత్తరం వైపున నిర్మిస్తున్న రింగురోడ్డుకు ఆనుకొని ఉన్న అడవిలో పొగలు వ్యాపించాయి.

ఇది గమనించిన కాకులకొండ, ఫ్యాన్లగుట్ట వాచ్‌టవర్ల సిబ్బంది అటవీశాఖ అధికారి శివకుమార్‌కు సమాచారం అందించారు.

అగ్నిమాపక దళంతో పాటు భద్రత, అటవీశాఖ సిబ్బంది వచ్చి మంటలు ఆర్పారు.

కొమురవెల్లి లడ్డూల్లో మోసాలు

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో లడ్డూ ప్రసాదం తయారీలో అవకతవకలు జరుగుతున్నట్టు తేలింది . మంగళవారం ఈవో వెంకటేశ్‌‌, పాలక మండలి చైర్మన్‌‌ సేవల్ల సంపత్‌‌ స్టాక్‌ రూమ్‌ ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఈవో వెంకటేశ్‌‌ మాట్లాడుతూ… లడ్డూ తయారీలో అవకతవకలు జరగుతున్న విషయం తమ దృష్టికి రావడంతో నిఘా వేసినట్టు చెప్పారు . అందు లో భాగంగానే ప్రసాదాల తయారీతో పాటు రికార్డులను కూడా పరిశీలించి నట్టు తెలిపారు. ప్రసాదం తయారీలో ఉపయోగించే రూ. ఐదు లక్షల విలువైన నెయ్యి , ఖాజు, బాదామ్‌ , పిస్తా లను భయటకు తరలించినట్టు గుర్తించామని చెప్పారు. రికార్డుల పరిశీలనలో భారీ ఎత్తున తేడాలు రావడంతో పూర్తి స్థాయిలో విచారించడంతో అసలు విషయం భయటపడిందని అన్నారు . ఆలయ ఏఈవో సుదర్శన్‌‌తోపాటు ఉద్యోగులు మాధవి, పోచయ్యలకు మెమోలు జారీ చేసినట్టు చెప్పారు. మూడు రోజుల్లో ఈ విషయంపై ఆ ముగ్గురు సమాధానం ఇవ్వకుంటే దేవాదాయ ధర్మధాయ శాఖ కమిషనర్‌‌ దృష్టికి తీసుకెళ్లి వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.
1. 16 నుంచి బాలాత్రిపురసుందరి కల్యాణ బ్రహ్మోత్సవాలు
కూచిపూడిలోని నాట్యాచార్యుల ఇలవేల్పు బాలాత్రిపురసుందరి సమేత శ్రీరామలింగేశ్వర స్వామివార్ల 256వ వార్షిక కల్యాణ బ్రహ్మోత్సవాలను ఈ నెల 16 నుంచి 22వ తేదీ వరకు నిర్వహించనున్నారు. బ్రహ్మశ్రీ శనగవరపు సత్యనారయణశర్మ పర్యవేక్షణలో ఆలయ ధర్మకర్త పసుమర్తి కేశవప్రసాద్‌ ఆధ్వర్యంలో ఉత్సవాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా శ్రీసిద్ధేంద్రయోగి నాట్య మహోత్సవాలను ఏర్పాటు చేయనున్నారు. ఉత్సవాల తొలిరోజైన శని, ఆదివారాల్లో స్వామివార్లను పెండ్లికుమారుడు, కుమార్తెలుగా అలంకరిస్తారు. 18న సాయంత్రం నరాలశెట్టి సాంబశివరావు భాగవతార్‌చే హరికథాగానం, సాయంత్రం యాగశాల ప్రవేశం, ధ్వజారోహణం వంటి పూజా కార్యక్రమాలు జరుగుతాయి.
2. వైభవంగా ప్రారంభమైన జాతర
కలిదిండి మండలం శివారు మూలలంకలో వేంచేసియున్న అమ్మలగన్నఅమ్మ శ్రీపెద్దింటి అమ్మవారి జాతర మంగళవారం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. తెల్లవారుజాము నుంచి భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవస్థానం కమిటీ చైర్మన్‌ కర్రి వెంకటసూర్య నారాయణ మాట్లాడుతూ ఈనెల 25వ తేదీ వరకు ఉత్సవాన్ని నిర్వహిస్తామని తెలిపారు. సాయంత్రం మేళతాళాలతో, విచిత్ర వేషధారణలతో కళాకారులు సందడి చేశారు. బాణాసంచా వెలుగులతో గ్రామంలో దీపావళి శోభ సంతరించుకుంది. స్త్రీ, పురుష బృందాలతో నిర్వహించిన కోలాటం, మురళీకోలాటం ఆద్యాంతం ఆకట్టుకున్నాయి. యువత తీన్‌మార్‌ నృత్యాలు, మహిళలతో బిందెలతో చేసిన నృత్యాలు, సినీ కోయడాన్సులు అలరించాయి. వివిధ పార్టీలకు చెందిన నాయకులు, ప్రజాప్రతినిధులు అమ్మవారిని దర్శించుకున్నారు.
3. చూచువారికి చూడముచ్చటగా..
సింగరాయపాలెం- చేవూరుపాలెం సెంటరులో వేంచేసిన శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కల్యాణం మంగళవారం వైభవోపేతంగా జరిగింది. స్వామివారి జన్మనక్షత్రమైన కృత్తిక నక్షత్రం సందర్భంగా కల్యాణం నిర్వహించారు. అందునా అరుదుగా వచ్చే కృత్తికా నక్షత్రం, షష్ఠి తిధి, మంగళవారం కావటంతో భక్తులు స్వామివారి దర్శనానికి పోటెత్తారు. స్వామివారికి 310 మంది పంచామృత అభిషేకాలు నిర్వహించగా, 51 మంది కల్యాణం జరిపించుకున్నారు. అనంతరం నిర్వహించిన నిత్యాన్నదానంలో సుమారు 350 మంది భక్తులు పాల్గొని స్వామివారి తీర్ధప్రసాదాలు స్వీకరించారు. ఇందులో ఆలయ సహాయ కమిషనర్‌ వీవీ.పల్లంరాజు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
4. వటపత్ర శయనుడిగా నృసింహుడు-యాదాద్రి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజు
లక్ష్మీనరసింహ పుణ్యక్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా.. మంగళవారం మధ్యాహ్నం అలంకార వేడుక, రాత్రి వాహన సేవ నిర్వహించారు. స్వామిని వటపత్ర శయనుడిగా అలంకరించి, తీర్థజనులకు దర్శన భాగ్యాన్ని కలిగించారు. కల్పవృక్షంపై స్వామిని, అమ్మవారిని ఉంచి బాలాలయ మండపంలో ఊరేగించారు. ఈ విశిష్ట పర్వాలతో పాటు హవనం, పారాయణం నిర్వర్తించారు. ధార్మిక, సాహిత్య, సంగీత మహాసభలను బుధవారం నుంచి ఐదు రోజులపాటు నిర్వహిస్తామని ఆలయ ఈవో గీతారెడ్డి తెలిపారు. గురువారం నుంచి విశేషోత్సవాలు మొదలవుతాయన్నారు.
5. 16 నుంచి రంగనాథుని బ్రహ్మోత్సవాలు
ఉత్తర శ్రీరంగంగా ఖ్యాతికెక్కిన నెల్లూరు రంగనాయకులపేటలోని తల్పగిరి శ్రీరంగనాథస్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాలు 16న అంకురార్పణతో ప్రారంభం కానున్నాయి. బ్రహ్మోత్సవ ఆహ్వాన పత్రికలను దేవస్థానంలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఈవో గోపి, ధర్మకర్తల మండలి ఛైర్మన్‌ కోట గురుబ్రహ్మం, ప్రధానార్చకులు కిడాంబి జగన్నాథాచార్యులు, ధర్మకర్తలతో కలిసి ఆవిష్కరించారు. 27వ తేదీ వరకు జరిగే బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని దేవస్థానంలో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నామని వారు తెలిపారు. ఈ బ్రహ్మోత్సవాల్లో స్వామి వారిని తిలకించేందుకు జిల్లా నలుమూలల నుంచి భక్తులు హాజరవుతారు. ఉత్సవాల్లో భాగంగా 17న ధ్వజావరోహణ, రాత్రి శేషవాహన ఉత్సవం, 18న ఉదయం సూర్యప్రభ వాహన ఉత్సవం, రాత్రి హంస వాహన ఉత్సవం, 19న ఉదయం సింహవాహనం, రాత్రి చంద్రప్రభ వాహన ఉత్సవం జరుగుతాయి. 20న ఉదయం పల్లకి ఉత్సవం, రాత్రి హనుమంతసేవలను నిర్వహిస్తారు. 21న ఉదయం మోహినీ అవతారం, రాత్రి 10 గంటలకు బంగారు గరుడసేవ జరుగుతుంది. 22న రాత్రి కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. 23న ఉదయం రథోత్సవం, 24న రాత్రి అశ్వవాహనం, 25న రాత్రి పుణ్యకోటి విమాన వాహన ఉత్సవం జరుగుతుంది. 26న సాయంత్రం పుష్పయాగం, రాత్రి దవనోత్సవం అనంతరం జరిగే ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. బ్రహ్మోత్సవాల ముగింపును పురస్కరించుకొని 27వ తేదీ రాత్రి పెన్నాతీరంలో స్వామివారికి విశేషంగా తెప్పోత్సవాన్ని నిర్వహిస్తారు.
6. కన్నుల పండువగా మంగళ షష్ఠి పూజలు
మంగళ షష్ఠి పర్వదినం సందర్భంగా రాయగడలో మంగళవారం సుబ్రహ్మణ్యస్వామి పూజలను కన్నుల పండువగా నిర్వహించారు. కస్తూరీనగర్‌ సత్యనారాయణస్వామి ఆలయ ప్రాంగణంలో సుబ్రహ్మణ్య స్వామివారికి క్షీరాభిషేకాలు, విశేషపూజలు, సామూహిక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అత్యంత అరుదుగా ఫాల్గుణమాసంలో మంగళవారం, షష్టి, కృతిక నక్షత్రం కలిసి రావడం జరుగుతుందని, 27 ఏళ్ల తర్వాత వచ్చిన ఈ షష్ఠ్టి రోజు విశేష పూజలు జరిపించడం ఆనవాయితీ అని ఆలయ ప్రధానార్చకులు పులఖండం రఘునాయక శర్మ, మావుడూరు కిషోర్‌శర్మలు తెలిపారు. పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.జేకే పూర్‌ కల్యాణ వేంకటేశ్వర ఆలయంలో బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. బుధవారం నుంచి ప్రారంభం కానున్న వార్షిక బ్రహ్మోత్సవాలు 18 వరకూ నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాలతో పాటు ఉత్సవ విగ్రహ స్థాపన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహించనున్నట్లు, భక్తులు హాజరు కావాలని ఆలయ ప్రధానార్చకులు పొందూరు వెంకటప్రదీప్‌, బి.జగన్నాథాచార్యులు కోరుతున్నారు.
7. 13.03.2019న తిరుమల శ్రీవారి ఆలయ మహాద్వార ప్రవేశానికి సంబంధించి ఒక దినపత్రికలో ప్రచురించిన వార్తలో వాస్తవం లేదు. మఠాధిపతులకు, పీఠాధిపతులకు శ్రీవారి ఆలయ మహాద్వార ప్రవేశ నియమాలలో ఎలాంటి మార్పు లేదు.ఆలయ మహాద్వార ప్రవేశానికి సంబంధించి మఠాధిపతులు, పీఠాధిపతులే కాకుండా ఇంకా ఎవరెవరు రావచ్చని తెలిపేదే సదరు ప్రభుత్వ ఉత్తర్వు.ఆలయ మర్యాదలు పొందే మఠాధిపతులకు, పీఠాధిపతులకు సంవత్సరానికి ఒకసారి వారితో పాటు ఐదుగురికి మహాద్వార ప్రవేశం ఉంటుంది. ఆ తర్వాత సంవత్సరంలో ఎప్పుడు వచ్చినా వారితో పాటు ఒక సహాయకునికి మహాద్వార ప్రవేశం ఉంటుంది.ఈ మేరకు టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు స్పష్టం చేశారు.
8. శుభమస్తు
తేది : 13, మార్చి 2019
సంవత్సరం : విళంబినామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : ఫాల్గుణమాసం
ఋతువు : శిశిర ఋతువు
కాలము : శీతాకాలం
వారము : బుధవారం
పక్షం : శుక్లపక్షం
తిథి : సప్తమి
(ఈరోజు తెల్లవారుజాము 4 గం॥ 50 ని॥ నుంచి
మర్నాడు తెల్లవారుజాము 4 గం॥ 22 ని॥ వరకు)
నక్షత్రం : రోహిణి
(ఈరోజు తెల్లవారుజాము 4 గం॥ 54 ని॥ నుంచి
మర్నాడు తెల్లవారుజాము 5 గం॥ 5 ని॥ వరకు)
యోగము : విష్కంభము
కరణం : తైతిల
వర్జ్యం : (ఈరోజు రాత్రి 9 గం॥ 1 ని॥ నుంచి ఈరోజు రాత్రి 10 గం॥ 37 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఈరోజు తెల్లవారుజాము 2 గం॥ 24 ని॥ నుంచి ఈరోజు తెల్లవారుజాము 4 గం॥ 2 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 12 గం॥ 1 ని॥ నుంచి ఈరోజు ఉదయం 12 గం॥ 48 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు ఉదయం 12 గం॥ 25 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 54 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు ఉదయం 10 గం॥ 55 ని॥ నుంచి ఈరోజు ఉదయం 12 గం॥ 24 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు ఉదయం 7 గం॥ 55 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 24 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 6 గం॥ 26 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 25 ని॥ లకు
సూర్యరాశి : కుంభము
చంద్రరాశి : వృషభము
9. చరిత్రలో ఈ రోజు/మార్చి 13
1733: ఆక్సిజన్‌ను కనుగొన్న జోసెఫ్ ప్రీస్ట్‌లీ జన్మించాడు.
1889: హైదరాబాదు రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు జన్మించాడు.
1940: జలియన్ వాలా బాగ్ దురంతానికి కారకుడైన మైఖెల్ డయ్యర్‌ను ఉద్దమ్ సింగ్ లండన్‌లో కాల్చిచంపాడు.
1963: అర్జున అవార్డును ప్రారంభించారు.
10. ఏప్రిల్‌ 3 నుండి 11వ తేదీ వరకు శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలు
తిరుమల తిరుపతి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీ కోదండరామ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఏప్రిల్‌ 3 నుండి 11వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయని టిటిడి తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం తెలిపారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల కార్యాలయంలో మంగళవారం జెఈవో బ్రహ్మోత్సవాల గోడపత్రికలను ఆవిష్కరించారు. వాహనసేవల వివరాలు ఇలా ఉన్నాయి.
తేదీ ఉదయం సాయంత్రం
03-04-19(బుధవారం) ధ్వజారోహణం పెద్దశేష వాహనం
04-04-19(గురువారం) చిన్నశేష వాహనం హంస వాహనం
05-04-19(శుక్రవారం) సింహ వాహనం ముత్యపుపందిరి వాహనం
06-04-19(శనివారం) కల్పవృక్ష వాహనం సర్వభూపాల వాహనం
07-04-19(ఆదివారం) పల్లకీ ఉత్సవం గరుడ వాహనం
08-04-19(సోమవారం) హనుమంత వాహనం వసంతోత్సవం/గజ వాహనం
09-04-19(మంగళవారం) సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం
10-04-19(బుధవారం) రథోత్సవం అశ్వవాహనం
11-04-19(గురువారం) పల్లకీ ఉత్సవం/చక్రస్నానం **ధ్వజావరోహణం
ఏప్రిల్‌ 14 నుండి 16వ తేదీ వరకు శ్రీరామనవమి ఉత్సవాలు :
తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఏప్రిల్‌ 14 నుండి 16వ తేదీ వరకు శ్రీరామనవమి ఉత్సవాలు జరుగనున్నాయి. ఏప్రిల్‌ 14న శ్రీరామనవమి, 15న శ్రీ సీతారామ కల్యాణం, 16న శ్రీరామ పట్టాభిషేకం నిర్వహిస్తారు.
**ఏప్రిల్‌ 17 నుండి 19వ తేదీ వరకు తెప్పోత్సవాలు
తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఏప్రిల్‌ 17 నుండి 19వ తేదీ వరకు తెప్పోత్సవాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా రామచంద్ర పుష్కరిణిలో 17వ తేదీన మొదటిరోజు 5 చుట్లు, 18న రెండవ రోజు ఏడు చుట్లు, 19న చివరిరోజు తొమ్మిది చుట్లు తిరిగి స్వామివారు భక్తులను అనుగ్రహిస్తారు. భక్తులు పెద్దఎత్తున పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరడమైనది. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆలయంలోని అన్ని ఆర్జిత సేవలను రద్దు చేశారు.ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, కోలాటాలు నిర్వహిస్తారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో శ్రీ ఈ.సీ.శ్రీధర్ , ఏఈవో శ్రీ తిరుమలయ్య , సూపరింటెండెంట్ శ్రీ అశోక్ కుమార్, శ్రీ జీ.రమేష్ ఇతర అధికారులు పాల్గొన్నారు.

శబరిమలైలో ఈసీ ఆంక్షలు

కేరళలో శబరిమల ఆలయ అంశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ పార్టీ కూడా ప్రచారానికి వాడరాదని ఎన్నికల సంఘం (ఈసీ) సోమవారం హెచ్చరించింది. ఇలా చేయడం కచ్చితంగా ఎన్నికల నియమావళి ఉల్లంఘన కిందకే వస్తుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి తీకా రామ్‌ మీనా స్పష్టం చేశారు. తిరువంతపురంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రచారంలో భాగంగా.. శబరిమల ఆలయం, దేవుడి పేరిట మత భావనలను రేకెత్తించడం; సుప్రీంకోర్టు తీర్పును ఏవిధంగానైనా ప్రస్తావించడం; మతం పేరుతో ఓట్లు అడగడం వంటివి చేయరాదని పేర్కొన్నారు. కేరళకు సంబంధించి శబరిమల వివాదాస్పద అంశమని, ఈ విషయమై రాజకీయ పార్టీలు కచ్చితమైన గిరి గీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
2. కృష్ణావతారంలో స్తంభోద్భవుడు
యాదాద్రి లక్ష్మీనరసింహ ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా.. అలంకార, వాహన సేవలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. పాంచరాత్ర ఆగమశాస్త్రరీత్యా ఉత్సవ పూజలతో పాటు అలంకార వేడుకలు నిర్వర్తించారు. వీటితో బాలాలయం అంగరంగ వైభవాన్ని సంతరించుకుంది. స్వామిని శ్రీకృష్ణుడి అలంకరణతో పెళ్లికొడుకుగా తీర్చిదిద్దారు. ఆలయ మండపంలో నేత్రపర్వంగా ఊరేగించారు. మేళతాళాలు మోగుతుంటే- పారాయణాల, ప్రబంధాల మధ్య సేవాపర్వాన్ని చేపట్టి ఆ విశిష్టతను అందరికీ వివరించారు. రాత్రివేళ స్వామి, అమ్మవార్లను హంస వాహనంపై ఉంచి విహారయాత్ర జరిపించారు.
3. శ్రీవారి దర్శనానికి సిఫార్సు లేఖల నిలిపివేత
ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో శ్రీవారి దర్శనానికి సిఫార్సు లేఖలను స్వీకరించబోమని తిరుమల జేఈవో శ్రీనివాసరాజు స్పష్టం చేశారు. తిరుమలలో సోమవారం జేఈవో పాత్రికేయులతో మాట్లాడుతూ తితిదేతో ఎన్నికలకు ప్రత్యక్ష ప్రమేయంలేకున్నా.. ఓటర్లను ప్రలోభపెట్టేలా సిఫార్సు లేఖలు జారీ చేసే అవకాశం ఉన్నందున గతంలో మాదిరిగానే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. వీఐపీ బ్రేక్‌ దర్శనానికి నెలకోసారి కంటే ఎక్కువసార్లు వచ్చే వారిపైనా నియంత్రణ విధించనున్నట్లు చెప్పారు.
4. కొల్లేటి దేవతకు చామంతుల అర్చన
కైకలూరు మండలంలోని కొల్లేటికోటలో కొలువైయున్న శ్రీపెద్దింటి అమ్మవారి జాతర ఉత్సవాలు సోమవారం అత్యంత వైభవంగా జరిగాయి. అమ్మవారికి ఉదయం 5 గంటల నుంచే చతుర్థావరణ పూజ, కలశార్చన, పుష్పాలంకరణ, ధూపసేవ, బాలభోగం, హారతి వంటి పూజలు ఆలయ ఉప ప్రధాన అర్చకులు పేటేటి పరమేశ్వరశర్మ ఆధ్వర్యంలో చేశారు. సోమవారం ప్రత్యేకంగా అమ్మవారికి పంచామృత అభిషేకాలు, లక్ష చామంతుల అర్చన, లక్షకుంకుమార్చన వంటి ప్రత్యేక పూజలు చేశారు. కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల నుంచే కాకుండా అనేక ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కుబడులు సమర్పించుకున్నారు. ఆకివీడుకు చెందిన కొటికలపూడి వెంకట సూర్యనారాయణ దంపతులు అమ్మవారికి వస్త్రాలంకరణ, కైకలూరుకు చెందిన ఫణివర్మ దంపతులు అమ్మవారికి పుష్పాలంకరణ, భక్తులకు ఉచిత ప్రసాద వితరణ చేశారు. దాతలను ఆలయ అర్చకులు, ఈవో ఆకుల కొండలరావులు అమ్మవారి శేషవస్త్రాలతో సత్కరించారు. దేవస్థానం ఆధ్వర్యంలో భక్తులు మంచినీరు, పిల్లలకు ఉచితంగా పాలు అందజేశారు. రాత్రికి అరుణకుమారి భాగవతారిణి ఆధ్వర్యంలో హరికథా కాలక్షేపం విశేషంగా అలరించింది. దాతలను, ప్రముఖులను ఆలయ ధర్మకర్తల మండలి ఛైర్మన్‌ జల్లురి వెంకన్న, సభ్యులు పన్నాస లక్ష్మీకుమారి, సైదు ఏడుకొండలు, హనుమంతు, రాజమోహన్‌లు సన్మానించారు. భక్తులకు అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లను పర్యవేక్షించారు.
5. శ్రీరామనవమికి సీఎం రాక అనుమానమే-ప్రొటోకాల్‌ సందడి తగ్గితే సామాన్య భక్తులకు మంచిదే..
పార్లమెంట్‌ ఎన్నికల నగారా మోగడంతో ఈ ప్రభావం భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో నిర్వహించే బ్రహ్మోత్సవాలపై ఎలాంటి ప్రభావం ఉంటుందనే కోణంలో సమాలోచనలు సాగుతున్నాయి. ఏప్రిల్‌ 6న ఉగాది నుంచి బ్రహ్మోత్సవాలు ఆరంభించి 10న ఉత్సవ అంకురార్పణ చేస్తారు. 11న గరుడ పట అధివాసం ఉంటుంది. 12న అగ్ని ప్రతిష్ఠ, 13న ఎదుర్కోలు, 14న శ్రీరామనవమి సందర్భంగా సీతారామచంద్రస్వామికి కల్యాణం ఉంటుంది. 15న పట్టాభిషేకం, 16న సదస్యం నిర్వహిస్తారు. 20తో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. శ్రీరామనవమికి తానీషా ప్రభువు కాలం నుంచి ముత్యాల తలంబ్రాలను తీసుకురావడం ఆనవాయితీ. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రులు ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తుండగా కొన్ని ప్రత్యేక కారణాలతో మాత్రమే ముఖ్యమంత్రులు ఇక్కడి రాలేకపోయారు. దేశవ్యాప్తంగా ఏడు విడతల్లో లోక్‌సభ ఎన్నికలు నిర్వహించేందుకు తేదీలు ఖరారు కావడంతో మే 23న ఫలితాలు వెలువడనున్నాయి. ఆదివారం ఈ షెడ్యూల్‌ విడుదల చేయడంతో ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ముత్యాల తలంబ్రాలను తీసుకువచ్చే సంప్రదాయాన్ని ముఖ్యమంత్రి కొనసాగిస్తారా? లేదా? అన్నదానిపై స్థానికంగా చర్చ సాగుతోంది. గతంలో ఇలాంటి కోడ్‌ అమల్లో ఉండగా ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, కిరణ్‌కుమార్‌రెడ్డి చెరో దఫా ఇక్కడకు రాలేకపోయినట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. ఆ సమయంలో దేవాదాయశాఖ అధికారులు ఈ సంప్రదాయాన్ని కొనసాగించారు. తెలంగాణాలో ఏప్రిల్‌ 11న ఎన్నికలు ఉండటంతో ముఖ్యమంత్రి కల్యాణోత్సవానికి రాకపోవచ్చని అనుకుంటున్నారు. వేర్వేరు కారణాలతో రెండు పర్యాయాలు ముఖ్యమంత్రి కేసీఆర్‌ శ్రీరామనవమికి రాలేదు. వచ్చే నెల 14న రాలేకపోతే వరుసగా మూడుసార్లు ముఖ్యమంత్రి లేకుండానే ఉత్సవాలను నిర్వహించినట్టవుతుంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడితే స్పష్టత వస్తుంది.
6. తిరుమల – సమాచారం
ఈ రోజు మంగళవారం
12.03.2019
ఉదయం 5 గంటల
సమయానికి,
నిన్న 71,210 మంది
శ్రీవారి భక్తులకి కలియుగ
దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి
వారి దర్శన
భాగ్యం కలిగినది,
స్వామివారి సర్వదర్శనం
కోసం తిరుమల వైకుంఠం
క్యూ కాంప్లెక్స్ లోని 01
గదులలో భక్తులు
వేచియున్నారు,
ఈ సమయం శ్రీవారి
సర్వదర్శనాని కి సుమారు
06 గంటలు పట్టవచ్చును,
నిన్న 21,947 మంది
భక్తులు స్వామి వారికి
తలనీలాలు సమర్పించి
మ్రొక్కు చెల్లించుకున్నారు
నిన్న స్వామివారికి
హుండీలో భక్తులు
సమర్పించిన నగదు
₹: 4.10 కోట్లు,
శీఘ్రసర్వదర్శనం(SSD),
ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్
₹:300/-), దివ్యదర్శనం
(కాలినడక) వారికి శ్రీవారి
దర్శనానికి సుమారుగా
రెండు గంటల సమయం
పట్టవచ్చును,
వయోవృద్దులు మరియు దివ్యాంగుల
ప్రత్యేయకంగా ఏర్పాటు
చేసిన కౌంటర్ ద్వారా
ఉ: 10 గంటలకి (750)
మ: 2 గంటలకి (750)
ఇస్తారు,
7. నేడు వృద్ధులు, దివ్యాంగులకు, శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం
మార్చి 13వ తేదీన‌ చంటిపిల్లల తల్లిదండ్రులకు శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం శ్రీవారి దర్శనం కోసం వచ్చే వయోవృద్ధులు, దివ్యాంగులకు, 5 సంవత్సరాలలోపు చంటిపిల్లల తల్లిదండ్రులకు టిటిడి సంతృప్తికరంగా ఏర్పాట్లు చేస్తోంది. ప్రతినెలా రెండు సామాన్య దినాల్లో వీరికి ప్రత్యేక దర్శనాలు కల్పిస్తోంది. ఇందులోభాగంగా మార్చి 12వ తేదీ మంగ‌ళ‌వారం వయోవృద్ధులు(65 సం|| పైబడినవారు), దివ్యాంగులకు 4 వేల టోకెన్లను టిటిడి జారీ చేయనుంది. ఉదయం 10 గంటల స్లాట్‌కు వెయ్యి, మధ్యాహ్నం 2 గంటలకు 2 వేల టోకెన్లు, 3 గంటల స్లాట్‌కు వెయ్యి టోకెన్లు జారీ చేస్తారు. వృద్ధులు, దివ్యాంగులు రద్దీ రోజుల్లో తిరుమలకు వచ్చి ఇబ్బందులు పడకుండా,
ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టిటిడి కోరుతోంది. ఎస్వీ మ్యూజియం ఎదురుగా గల కౌంటర్ల వద్ద వృద్ధులు, దివ్యాంగులకు ప్రతిరోజూ 1400 టోకెన్లు జారీ చేస్తున్నారు. ఇక్కడ ఉదయం 7 గంటల నుండి ప్రారంభించి రెండు స్లాట్లకు సంబంధించిన టికెట్లు కేటాయిస్తారు. కావున భక్తులు ముందుగా వచ్చి టికెట్ల కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఆ తరువాత ఉదయం 10 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేక క్యూలైన్‌ ద్వారా స్వామివారి దర్శనం కల్పిస్తారు.5 సంవత్సరాలలోపు చంటిపిల్లలను, వారి తల్లిదండ్రులను మార్చి 13వ తేదీ బుధ‌వారం ఉద‌యం 9 నుండి మధ్యాహ్నం 1.30 గంట‌ల వ‌ర‌కు సుపథం మార్గం ద్వారా దర్శనానికి అనుమతిస్తారు. సాధారణ రోజుల్లో ఒక సంవత్సరం లోపు చంటిపిల్లలకు, వారి తల్లిదండ్రులకు సుపథం మార్గం ద్వారా ప్రవేశం కల్పిస్తారు. భక్తుల కోరిక మేరకు ఐదేళ్లలోపు చంటిపిల్లలను, వారి తల్లిదండ్రులను ఈ రెండు రోజుల్లో సుపథం మార్గం ద్వారా అనుమతిస్తారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి సద్వినియోగం చేసుకోవాలని టిటిడి కోరుతోంది.
8. శుభమస్తు
తేది : 12, మార్చి 2019
సంవత్సరం : విళంబినామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : ఫాల్గుణమాసం
ఋతువు : శిశిర ఋతువు
కాలము : శీతాకాలం
వారము : మంగళవారం
పక్షం : శుక్లపక్షం
తిథి : షష్టి
(ఈరోజు తెల్లవారుజాము 4 గం॥ 44 ని॥ నుంచి
మర్నాడు తెల్లవారుజాము 4 గం॥ 49 ని॥ వరకు)
నక్షత్రం : కృత్తిక
(ఈరోజు తెల్లవారుజాము 4 గం॥ 10 ని॥ నుంచి
మర్నాడు తెల్లవారుజాము 4 గం॥ 53 ని॥ వరకు)
యోగము : వైదృతి
కరణం : బాలవ
వర్జ్యం : (ఈరోజు సాయంత్రం 4 గం॥ 31 ని॥ నుంచి ఈరోజు రాత్రి 6 గం॥ 9 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (నిన్న రాత్రి 11 గం॥ 6 ని॥ నుంచి ఈరోజు తెల్లవారుజాము 0 గం॥ 46 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 8 గం॥ 50 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 37 ని॥ వరకు)(ఈరోజు ఉదయం 11 గం॥ 15 ని॥ నుంచి ఈరోజు ఉదయం 12 గం॥ 2 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు సాయంత్రం 3 గం॥ 25 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 4 గం॥ 54 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు ఉదయం 12 గం॥ 26 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 55 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు ఉదయం 9 గం॥ 26 ని॥ నుంచి ఈరోజు ఉదయం 10 గం॥ 55 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 6 గం॥ 27 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 25 ని॥ లకు
సూర్యరాశి : కుంభము
చంద్రరాశి : మేషము
9 చరిత్రలో ఈ రోజు/మార్చి 12*
1930: భారత స్వాతంత్ర్య ఉద్యమములో ప్రముఖ ఘట్టమైన దండి యాత్ర (200 మైళ్ళ దూరం) ప్రారంభమైంది.
1993: ముంబైలో బాంబు పేలుళ్ళు
1912: జూలియట్ గార్డన్ లో గర్ల్ (బాలికల) స్కౌట్స్ ప్రారంభించారు.
1962: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండవ ముఖ్యమంత్రి గా దామోదరం సంజీవయ్య పదవీ విరమణ (11 జనవరి 1960 నుంచి 12 మార్చి 1962 వరకు).
1962: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మూడవ ముఖ్యమంత్రి గా నీలం సంజీవ రెడ్డి ప్రమాణ స్వీకారం (12 మార్చి 1962 నుంచి 29 ఫిబ్రవరి 1964 వరకు).
2011: యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం
1937: శ్రీ భాష్యం విజయసారథి సంస్కృత భాషా పండితుడు, అమర భాషలో ఆధునికుడు, తెలంగాణ సంస్కృత వాచస్పతి జననం

యాదాద్రిలో బ్రహ్మోత్సవ సందడి

1. వైభవంగా యదాద్రి నరసింహుని బ్రహ్మోత్సవాలు
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు ఆదివారం స్వామి వారు ఉదయం మత్స్యావతారంలో భక్తులకు దర్శనమిచ్చా రు. అర్చకులు, అధికారులు బాలాలయంలో ఊరేగించారు. ఈ నెల 8 నుంచి ప్రారంభమైన ఉత్సవాలు 18వ తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఉత్సవాలను వైభవంగా నిర్వహించి ఉత్సవ ప్రాధాన్యతను పెంచేందుకు కృషి చేస్తున్నట్లు యాదాద్రి ఆలయ అధికారులు తెలిపారు.బ్రహ్మోత్సవాల సందర్భంగా ఉదయం వేళల్లో అలంకారసేవలు, రాత్రి వేళల్లో శ్రీవారి వాహనసేవలు ప్రతీ రోజు జరుగుతాయన్నారు. రాష్ట్ర గవర్నర్ ఈఎల్‌ఎన్ నరసింహన్ విశిష్ట అతిధిగా 15న ఉదయం కళ్యాణోత్సవానికి హాజరుకానున్నట్లు తెలిపారు.
2. ధ్వజారోహణం.. దేవతాహ్వానం
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో రెండోరోజు శనివారం విశిష్ట పర్వాలను నిర్వహించారు. విశ్వమంతా సుభిక్షంగా ఉండాలన్న సంకల్పంతో ధ్వజారోహణం.. దేవతాహ్వాన క్రతువులను చేపట్టారు. పండితులు వేదాలను పఠిస్తుండగా ప్రధాన పూజారి గరుడ పూజలను నిర్వహించారు. గరుడ ఆళ్వారుడిని చిత్రించిన ధ్వజానికి యాగశాలలో ప్రత్యేక ఆరాధనలు నిర్వహించారు. బాలాలయ ధ్వజస్తంభం చెంత ఈ పర్వం రెండు గంటలపాటు కొనసాగింది. రాత్రి ప్రత్యేక హవనాలు చేశారు. భేరీ పూజ, దేవతాహ్వానం వేడుకలను అష్టరాగాల ఆలాపనల మధ్య చేపట్టారు.
3. శాస్త్రోక్తంగా ధ్వజావరోహణం
శ్రీకాళహస్తీశ్వరాలయ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం దేవరాత్రిని పురస్కరించుకుని స్వామి, అమ్మవార్ల ధ్వజావరోహణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉదయం శ్రీజ్ఞానప్రసూనాంబిక సమేత సోమస్కంధమూర్తి ఉత్సవమూర్తులను పట్టణ వీధుల్లో ఊరేగించారు. అనంతరం ఉత్సవమూర్తులకు వసంతోత్సవాన్ని నిర్వహించి, సాయంత్రం ధ్వజావరోహణ కార్యక్రమాన్ని వేదపండితులు వైభవంగా జరిపారు. దీంతో శ్రీకాళహస్తీశ్వరుని నవదిన బ్రహ్మోత్సవాలు శనివారంతో ముగిశాయి.
4. ఈసారి అమర్‌నాథ్ యాత్ర 46 రోజులు… ఏప్రిల్ 1నుంచి రిజిస్ట్రేషన్
అమర్‌నాథ్ యాత్ర ఈ సారి ఆషాడమాస శివచతుర్థి నాడు అంటే జూలై 1నుంచి ప్రారంభమై ఆగస్టు 15 వరకూ కొనసాగనుంది. ఈ యాత్ర మొత్తం 46 రోజుల పాటు జరగనుంది. గత ఏడాది అమర్‌నాథ్ యాత్ర 60 రోజులు జరిగింది. ఈ సారి ఈ యాత్రకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం కానుంది. ఆగస్టు మొదటివారం వరకూ రిజిస్ట్రేషన్ కొనసాగనుంది. దేశంలోని పంజాబ్ నేషనల్ బ్యాంకుకు చెందిన 400కు మించిన బ్రాంచీల ద్వారా ఎక్కడినుంచైనా రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. కాగా ఈసారి అమర్‌నాథ్ యాత్రకు మరింత కట్టుదిట్టమైన భద్రతను కల్పిస్తున్నారు. అలాగే ఈసారి కూడా 13 ఏళ్ల కన్నా తక్కువ, 75 ఏళ్ల కన్నా ఎక్కవ వయసుగల వారికి యాత్ర చేసేందుకు అవకాశం కల్పించడం లేదు. అలాగే ఆరు నెలలు దాటిన గర్భవతులు కూడా యాత్ర చేసేందుకు అవకాశం లేదు.
5. అరసవల్లి ఆదిత్యుడికి కిరణస్పర్శ
శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలోని సూర్యనారాయణస్వామి ఆలయంలో ఆదివారం సూర్యకిరణ స్పర్శ ఘట్టం ఆవిష్కృతమైంది. ఉదయం 6.20 గంటల నుంచి సుమారు పది నిమిషాలు స్వామివారిపై కిరణాలు ప్రసరించాయి.పలు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామిని దర్శించుకున్నారు.
*మత్స్యావతారంలో నారసింహుడు
6. యాదాద్రిలో మూడో రోజు బ్రహ్మోత్సవ వేడుకలు
లోక కల్యాణార్థమై ఏటా నిర్వహించే బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం మూడో రోజు యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో విశేష వేడుకలు జరిపారు. నిత్యారాధనలతోసహా ఉత్సవపూజలు, అలంకార, వాహనోత్సవ క్రతువులతో భక్తిభావం వెల్లివిరిసింది. మహావిష్ణువు అలంకార ప్రియుడు కావడంతో ఆలయ దేవుడిని పెళ్లికొడుకుగా తీర్చిదిద్దే పర్వంలో తొలిగా మత్స్యాలంకరణ చేపట్టారు. అలంకార సేవను బాలాలయ మండపంలో భక్తజనుల మధ్య ఊరేగించారు. సేవా విశిష్టతను ప్రధాన పూజారి వివరించారు. రాత్రివేళ శేషవాహనోత్సవాన్ని నిర్వహించారు. శేషుడిపై శ్రీస్వామి,అమ్మవారలు భక్తులకు దర్శనమిచ్చారు. సెలవురోజు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తుల రాక పెరిగింది
7. చినజీయర్‌ స్వామిని కలిసిన స్వరూపానందేంద్ర స్వామి
విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి ఆదివారం ఉదయం చినజీయర్‌ స్వామిని కలిశారు. శంషాబాద్‌ పరిధి శ్రీరామనగరంలోని జీవా ప్రాంగణంలో వేదపండితుల మంత్ర పఠనాల మధ్య స్వరూపానందేంద్ర స్వామికి శాస్త్రోక్తంగా స్వాగతం పలికారు. ఆయన తొలుత దివ్యసాకేతంలో కొలువుదీరిన కోదండ రంగనాథస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కుటీరంలో 20 నిమిషాలపాటు చినజీయర్‌ స్వామితో మాట్లాడిన స్వరూపానందేంద్ర స్వామి.. జూన్‌లో విశాఖ శారదా పీఠం ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఉత్సవాల్లో పాల్గొనాలని ఆహ్వాన పత్రికను అందజేశారు. అనంతరం శారదా పీఠాధిపతిని చినజీయర్‌ స్వామి సత్కరించారు.
8. చినజీయర్‌ను కలిసిన స్వరూపానందేంద్ర స్వామి
విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి ఆదివారం ఉదయం చినజీయర్‌ స్వామిని కలిశారు. శంషాబాద్‌ పరిధి శ్రీరామనగరంలోని జీవా ప్రాంగణంలో వేదపండితుల మంత్ర పఠనాల మధ్య స్వరూపానందేంద్ర స్వామికి శాస్త్రోక్తంగా స్వాగతం పలికారు. ఆయన తొలుత దివ్యసాకేతంలో కొలువుదీరిన కోదండ రంగనాథస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కుటీరంలో 20 నిమిషాలపాటు చినజీయర్‌ స్వామితో మాట్లాడిన స్వరూపానందేంద్ర స్వామి.. జూన్‌లో విశాఖ శారదా పీఠం ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఉత్సవాల్లో పాల్గొనాలని ఆహ్వాన పత్రికను అందజేశారు. అనంతరం శారదా పీఠాధిపతిని చినజీయర్‌ స్వామి సత్కరించారు.
9. కొండగట్టులో పవిత్రోత్సవాలు ప్రారంభం
జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానంలో గతేడాది పూజల్లో జరిగిన లోపాలకు పరిహారంగా, చాత్తాద శ్రీ వైష్ణవ ఆచార సంప్రదాయాలను అనుసరించి లోక కల్యాణార్థం త్రయహ్నిక దీక్షతో పవిత్రోత్సవాలు ఆదివారం రాత్రి ప్రారంభమయ్యాయి. రాత్రి విశ్వక్షేన ఆరాధన, పుణ్యహవచనం, అంకురారోహణ, అఖండ దీప స్థాపన తదితర ప్రత్యేక పూజాది కార్యక్రమాలను ఆలయ వ్యవస్థాపక వంశీయులు, అనువంశిక అర్చకులు నిర్వహించారు.సోమవారం తెల్లవారు జామున 3 గంటలకు తిరుమంజనం, ఆరాధన, 9:30 గంటలకు పవిత్ర ఆహ్వానం, పుణ్యహ వచనం, రక్షా బంధనం, రుత్విక్ వరుణం, యాగశాల ప్రవేశం, స్థాపిత దేవతార్చన, అగ్ని ప్రతిష్ట, హవనం, స్వామి వారికి అభిషేకం, అర్చన, మహా నివేదన, మంత్ర పుష్పం, తీర్థ ప్రసాద వితరణ, సాయంత్రం 5:30 గంటలకు విష్ణు సహస్రనామ పారాయణం, హనుమాన్ చాలీసా పారాయణం, స్థాపిత దేవతారాధన, హవనం, పవిత్రలకు జలాధివాసం, ధాన్యాధివాసం, బలిహరణం, వేద సదస్యం, మంత్ర పుష్పం, సాత్తుమోర, తీర్థ, ప్రసాద వితరణ తదితర కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆలయ ఈవో, డిప్యూటీ కలెక్టర్ పరాంకుశం అమరేందర్ తెలిపారు. ఉత్సవాలు బుధవారం దాకా కొనసాగుతాయని భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని కోరారు.
10.రాజన్న సన్నిధిలో భక్తుల రద్దీ..
వరుసగా రెండు రోజులు సెలవులు కావడంతో వేములవాడ పార్వతీ రాజరాజేశ్వరస్వామివారి సన్నిధికి భక్తులు పోటెత్తారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఆదివారం వేకువజాము నుంచే పవిత్ర ధర్మగుండంలో స్నానాలు ఆచరించి, తలనీలాలను సమర్పించిన భక్తులు కోడెమొక్కులను తీర్చుకున్నారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అర్చనలు చేశారు.గండదీపం, కల్యాణ మొక్కులు, సత్యనారాయణ వ్రతాలు, పల్లకీసేవలు, పెద్దసేవలు తదితర మొక్కులను చెల్లించుకున్నారు. కల్యాణ మొక్కులను తీర్చుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తుల రద్దీ దృష్ట్యా గర్భగుడిలో నిర్వహించుకునే పలు ఆర్జిత సేవలను అధికారులు రద్దు చేశారు. లఘు దర్శనం మాత్రమే కల్పించారు. రాజన్నను దాదాపు 12వేల మందికిపైగా భక్తులు దర్శించుకోగా వివిధ ఆర్జితసేవల ద్వారా సుమారు రూ.8లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. రాజన్న ఆలయ అనుబంధ దేవాలయాల వద్ద కూడా భక్తుల రద్తీ నెలకొంది. సోమవారం దర్శనం కోసం భక్తులు భారీగా తరలివస్తున్నారు.
11. తిరుమల- సమాచారం
ఈ రోజు సోమవారం
11.03.2019
ఉదయం 5 గంటల
సమయానికి,
తిరుమల: 18C° – 33C°
నిన్న 84,982 మంది
శ్రీవారి భక్తులకి కలియుగ
దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి
వారి దర్శన
భాగ్యం కలిగినది,
స్వామివారి సర్వదర్శనం
కోసం తిరుమల వైకుంఠం
క్యూ కాంప్లెక్స్ లోని 05
గదులలో భక్తులు
వేచియున్నారు,
ఈ సమయం శ్రీవారి
సర్వదర్శనాని కి సుమారు
12 గంటలు పట్టవచ్చును,
నిన్న 26,988 మంది భక్తులు
స్వామి వారికి
తలనీలాలు సమర్పించి
మ్రొక్కు చెల్లించుకున్నారు
నిన్న స్వామివారికి
హుండీలో భక్తులు
సమర్పించిన నగదు
₹: 3.24 కోట్లు,
శీఘ్రసర్వదర్శనం(SSD),
ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్
₹:300/-), దివ్యదర్శనం
(కాలినడక) వారికి శ్రీవారి
దర్శనానికి సుమారుగా
రెండు గంటల సమయం
పట్టవచ్చును,
వయోవృద్దులు మరియు దివ్యాంగుల
ప్రత్యేయకంగా ఏర్పాటు
చేసిన కౌంటర్ ద్వారా
ఉ: 10 గంటలకి (750)
మ: 2 గంటలకి (750)
ఇస్తారు,
చంటి పిల్లల తల్లిదండ్రులు మరియు ఎన్నారై ప్రత్యేక దర్శనాలు
సుపథం మార్గం గుండా శ్రీవారి
దర్శనానికి అనుమతిస్తారు
ఉ: 11 గంటల నుంచి
సాయంత్రం 5 గంటల వరకు
దర్శనానికి అనుమతిస్తారు,
తిరుపతి స్థానిక ఆలయ
సమాచారం(సా: 05 కి):
నిన్న 15,327 మంది
భక్తులకి తిరుచానూరు
శ్రీ పద్మావతి అమ్మవారి దర్శన
భాగ్యం కల్గినది,
నిన్న 7,149 మంది
భక్తులకి శ్రీనివాసమంగాపురం
శ్రీ కళ్యాణ వేంకటేశ్వర
స్వామి వారి దర్శన భాగ్యం
కల్గినది,
నిన్న 8,873 మంది
భక్తులకి తిరుపతి‌
శ్రీ గోవిందరాజ స్వామి
వారి దర్శన భాగ్యం కల్గినది,
నిన్న 8,873 మంది
భక్తులకు అప్పలాయగుంట
శ్రీ పసన్న వేంకటేశ్వర
స్వామివారి దర్శన
భాగ్యం కలిగినది,
12. చరిత్రలో ఈ రోజు/మార్చి 11
1915 : విజయ్ హజారే , భారత క్రికెటర్ జననం. (మ. 2004)
1689 : మరాఠా సామ్రాజ్య స్థాపకుడైన ఛత్రపతి శివాజీ పెద్ద కుమారుడు శంభాజీ మరణం (జ.1657).
1955 : పెన్సిలిన్ ‌ను కనిపెట్టిన శాస్త్రవేత్త అలెగ్జాండర్ ఫ్లెమింగ్ మరణించాడు (జ.1881).
1990 : సోవియట్ యూనియన్ నుంచి విడిపోయి లిథ్వేనియా స్వాతంత్ర్యం ప్రకటించుకుంది.
1999 : అమెరికా లో నాస్‌డాక్ స్టాక్‌ఎక్ఛేంజీలో లిస్టు అయిన తొలి భారతీయ కంపెనీగా ఇన్ఫోసిస్ అవతరించింది.
2013 : రోగాలను , రాగాలను సరిచేసిన సవ్యసాచి పద్మభూషణ్ డాక్టర్ శ్రీపాద పినాకపాణి మరణం
కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం వద్ద టాస్క్ ఫోర్స్ పోలీసులు వాహనాలు తనిఖీలు చేశారు.
కారులో తరలిస్తున్న 8కిలోల బంగారం, రూ.46లక్షలను స్వాధీనం చేసుకున్నారు.
బంగారం, డబ్బులను తరలిస్తున్న నలుగురు వ్యక్తులను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసి కారును స్వాధీనం చేసుకురు.
బంగారం, నగదుకు లెక్కలు చూపించలేదని పోలీసులు వెల్లడించారు.
నిందితులను విచారణ నిమిత్తం విజయవాడకు తరలించా
13. శుభమస్తు
తేది : 11, మార్చి 2019
సంవత్సరం : విళంబినామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : ఫాల్గుణమాసం
ఋతువు : శిశిర ఋతువు
కాలము : శీతాకాలం
వారము : సోమవారం
పక్షం : శుక్లపక్షం
తిథి : పంచమి
(ఈరోజు తెల్లవారుజాము 4 గం॥ 7 ని॥ నుంచి
మర్నాడు తెల్లవారుజాము 4 గం॥ 43 ని॥ వరకు)
నక్షత్రం : భరణి
(ఈరోజు తెల్లవారుజాము 2 గం॥ 57 ని॥ నుంచి
మర్నాడు తెల్లవారుజాము 4 గం॥ 9 ని॥ వరకు)
యోగము : ఐంద్రము
కరణం : భద్ర (విష్టి)
వర్జ్యం : (నిన్న రాత్రి 10 గం॥ 39 ని॥ నుంచి ఈరోజు తెల్లవారుజాము 0 గం॥ 21 ని॥ వరకు)(ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 1 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 2 గం॥ 41 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఈరోజు రాత్రి 11 గం॥ 6 ని॥ నుంచి మర్నాడు తెల్లవారుజాము 0 గం॥ 46 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 12 గం॥ 49 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 36 ని॥ వరకు)(ఈరోజు సాయంత్రం 3 గం॥ 12 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 3 గం॥ 59 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు ఉదయం 7 గం॥ 56 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 25 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 55 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 3 గం॥ 24 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు ఉదయం 10 గం॥ 55 ని॥ నుంచి ఈరోజు ఉదయం 12 గం॥ 24 ని॥ వరకు)
సూర్యోద : ఉదయం 6 గం॥ 27 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 24 ని॥ లకు
సూర్యరాశి : కుంభము
చంద్రరాశి : మేషము

అరసవల్లిలో భక్తులకు ఆశాభంగం–ఆధ్యాత్మికం

శ్రీకాకుళం జిల్లా అరసవల్లి శ్రీ సూర్యానారాయణస్వామి పాదాలను సూర్య కిరణాలు తాకే దృశ్యాన్ని చూసేందుకు వచ్చే భక్తులు నిరాశతో వెనుదిరిగారు. ఏటా మార్చి 9, 10 తేదీల్లో అదేవిధంగా అక్టోబర్‌ 1,2 తేదీల్లో సూర్య కిరణాలు స్వామివారి పాదాలను తాకుతుంటాయి. ఆలయ పంచద్వారాలను దాటి గాలిగోపురం మధ్య నుంచి స్వామివారి పాదాలను తాకుతుంటాయి. కేవలం 3-4 నిమిషాలు మాత్రమే ఈ అద్భుత దృశ్యం ఆవిష్కృతమవుతుంది. అయితే ఈ రోజు సూర్య కిరణాలు పడకుండా మేఘాలు అడ్డుపడ్డాయి. రేపు స్వామి వారి మూలవిరాట్‌ను సూర్య కిరణాలు తాకే అవకాశం ఉందని ఆలయ అర్చకులు చెబుతున్నారు.
1. యాదాద్రి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం
లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు శుక్రవారం యాదాద్రి పుణ్యక్షేత్రంలో ప్రారంభమయ్యాయి. ఆది పూజలో భాగంగా అగ్నిని కొలుస్తూ ప్రతిష్ఠాపన చేపట్టారు. జల పూజ, ఆలయ శుద్ధి పర్వాలతో మొదలైన ఈ వేడుకలు మరో 10 రోజులు భక్తజనులను అలరించనున్నాయి. ముందుగా నిర్దేశించిన ప్రకారమే ఉదయం 10 గంటలకు మొదలైన స్వస్తివాచనం 12 గంటలకు ముగిసింది. రాత్రివేళ మృత్తికా సంగ్రహణ క్రతువు నిర్వర్తించారు. పుట్ట మట్టిని తెచ్చి, మంత్ర పఠన సహితంగా నవధాన్యాలు నాటారు. విష్వక్సేన ఆరాధనతో మహోత్సవాలకు అంకురార్పణ జరిగినట్లు ఆలయ ప్రధాన పూజారులు ప్రకటించారు. తొలి పూజలో జిల్లా కలెక్టర్‌ అనితా రామచంద్రన్‌, ఆలయ ఈవో గీతారెడ్డి, ధర్మకర్త నరసింహమూర్తి, తదితరులు పాల్గొన్నారు.
2. తితిదే ఈవోగా సింఘాల్‌ మరో ఏడాది పొడిగింపు
తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా డిప్యుటేషన్‌పై ఉన్న ఐఏఎస్‌ అధికారి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ పదవీ కాలాన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఏడాది మే 9 నుంచి వచ్చే ఏడాది మే 8 వరకు మరో ఏడాది పాటు ఆయన అక్కడే సేవలు అందించేలా కాలపరిమితిని పొడిగించింది.
3. ఘనంగా కైలాసగిరి ప్రదక్షిణోత్సవం
శ్రీకాళహస్తీశ్వరాలయ మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం కైలాసగిరి ప్రదక్షిణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సోమస్కంధమూర్తి, జ్ఞానాంబిక ఉత్సవమూర్తులను విశేషంగా అలంకరించారు. కైలాసగిరి పర్వతశ్రేణులను ఆనుకుని దాదాపు 21 కిలోమీటర్ల పొడవునా సాగే ఈ ప్రదక్షిణోత్సవంలో పాల్గొనేందుకు ఎండను సైతం లెక్క చేయకుండా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. భక్తుల శివనామస్మరణలతో కైలాసగిరి మార్మ్లోగింది.
4. కీసరగుట్ట స్వామి ఆదాయం రూ.72,98,105
కీసరగుట్ట శ్రీ భవాని రామలింగేశ్వరస్వామి దేవస్థానంలో మహాశివరాత్రి సందర్భంగా మొత్తం రూ.72,98,105 ఆదాయం వచ్చిందని దేవస్థానం చైర్మన్ తటాకం నారాయణశర్మ తెలిపారు. శుక్రవారం దేవస్థానం ప్రాంగణ మందిరంలో దేవస్థానం సిబ్బంది అంతా కలిసి హుండీని లెక్కించారు. మహాశివరాత్రి పర్వదినంలో భాగంగా ఈనెల 2వ తేదీ నుంచి 5వ తేదీ వరకు మాత్రమే హుండీ ఆదాయాన్ని లెక్కించారు. మిగతా 6,7 తేదీలకు సంబంధించిన హుండీని తరువాత లెక్కిస్తామని తెలిపారు. హుండీ ద్వారా స్వామివారికి రూ.16,57,105, స్వామివారికి అభిషేకం టిక్కెట్ల, దర్శనం ద్వారా రూ.24,41,000 , లడ్డూ ప్రసాదం ద్వారా రూ. 32 లక్షలు, మొత్తం రూ.72,98,105లక్షల రూపాయల ఆదాయం వచ్చిందని చైర్మన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి లక్ష్మీనర్సింహమూర్తి, దేవస్థానం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
5. చరిత్రలో ఈ రోజు/మార్చి 9
1916 : పోలెండ్‌పై జర్మనీ యుద్ధం ప్రకటించింది.
1934 : అంతరిక్షంలోకి వెళ్ళిన మొట్టమొదటి మానవుడిగా చరిత్రపుటలకెక్కిన రష్యన్ వ్యోమగామి యూరీ గగారిన్ జననం (మ.1968).
193 : మహాత్మా గాంధీ మొదటిసారిగా హైదరాబాదులో పర్యటించాడు.
1943 : ప్రపంచ చదరంగ కిరీటాన్ని గెలిచి ఆ ఘనత సాధించిన తొలి అమెరికన్‌గా రికార్డు నెలకొల్పిన బాబీ ఫిషర్ జననం(మ.2008).
1952 : రష్యన్ కమ్యూనిస్ట్ నాయకురాలు మరియు దౌత్యవేత్త అలెక్సాండ్రా కొల్లొంటాయ్ మరణం (జ.1872).
1979 : గ్రంథాలయ ఉద్యమ పితామహుడు అయ్యంకి వెంకటరమణయ్య మరణం (జ.1890).
1981 : మాలిక్యులర్‌ బయాలజీకి మార్గదర్శకుడు మాక్స్‌ డెల్‌బ్రక్ మరణం (జ.1906).
1985 : భారతీయ క్రికెట్ ఆటగాడు పార్థివ్ పటేల్ జననం.
1994 : సుప్రసిద్ధ భారతీయ నటి మరియు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత దేవికారాణి మరణం (జ.1908).
1997 : ఆంధ్ర రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి బెజవాడ గోపాలరెడ్డి మరణం (జ.1907).
image.gif6. శుభమస్తు
తేది : 9, మార్చి 2019
సంవత్సరం : విళంబినామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : ఫాల్గుణమాసం
ఋతువు : శిశిర ఋతువు
కాలము : శీతాకాలం
వారము : శనివారం
పక్షం : శుక్లపక్షం
తిథి : తదియ
(ఈరోజు తెల్లవారుజాము 1 గం॥ 34 ని॥ నుంచి
మర్నాడు తెల్లవారుజాము 3 గం॥ 1 ని॥ వరకు)
నక్షత్రం : రేవతి
(నిన్న రాత్రి 11 గం॥ 16 ని॥ నుంచి
మర్నాడు తెల్లవారుజాము 1 గం॥ 17 ని॥ వరకు)
యోగము : శుక్లము
కరణం : తైతిల
వర్జ్యం : (ఈరోజు ఉదయం 12 గం॥ 16 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 2 గం॥ 0 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఈరోజు రాత్రి 10 గం॥ 40 ని॥ నుంచి మర్నాడు తెల్లవారుజాము 0 గం॥ 24 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 8 గం॥ 4 ని॥ నుంచి ఈరోజు ఉదయం 8 గం॥ 51 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు ఉదయం 9 గం॥ 27 ని॥ నుంచి ఈరోజు ఉదయం 10 గం॥ 56 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు ఉదయం 6 గం॥ 29 ని॥ నుంచి ఈరోజు ఉదయం 7 గం॥ 58 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 55 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 3 గం॥ 24 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 6 గం॥ 29 ని॥ లకు
సూస్తమయం : సాయంత్రం 6 గం॥ 24 ని॥ లకు
సూర్యరాశి : కుంభము
చంద్రరాశి : మీనము
7.సింహాచలం నారసింహ మహాయజ్ఞం
దేశం, రాష్ట్రంలోని ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని.. పంటలు బాగా పండి జనులంతా సిరిసంపదలతో సుఖించాలని దీర్ఘాయుషు మంచి ఆరోగ్యం కలగాలన్న సంకల్పంతో సింహాచలంలో శ్రీదసుర్శన నారసింహ మహాయజ్ఞాన్నికి శ్రీకారం చుడుతున్నారు. సింహాచలం కొండ దిగువన కృష్ణాపురం గోశాల ఆవరణలోని నృసింహవనంలో మార్చి పదకొండు నుంచి ప్రారంభమయ్యే ఈ మహాయజ్ఞం నవాహ్నిక యజ్ఞం సవాహ్నిక దీక్షతో మార్చి ఇరవై వరకు జరుగుతుందని దేవస్థానం కార్యనిర్వహణాధికారి కే.రామచంద్రమోహన్ తెలిపారు. 32హోమగుండాల యజ్ఞశాలలో 32భీజాక్షరాలతో కూడిన నృశింహ మూలమంత్రాన్ని జపిస్తూ పండితులు యాగం నిర్వహిస్తారని పేర్కొన్నారు. ఈయాగంలో 125మంది ఋత్వికులు పాల్గొంటారని వివరించారు. సుదర్శన నారసింహ మహాయజ్ఞంలో భాగంగా ఇష్టి యాగాలను కూడా నిర్వహించేందుకు దేవస్థానం నిర్ణయించింది. మార్చి 13 నుంచి 19 వరకు ఏడూ ఇష్టి యాగాలు నిర్వహిస్తారు. ఈ యాగాలలో భక్తులు పాల్గొనడానికి అవకాశం కల్పించారు. ఈ మహాయాగాన్ని పురస్కరించుకుని ఈనెల 10 నుంచి 21వ తేదీ వరకు సింహగిరి పై జరిగే పలు ఆర్జిత సేవలను దేవస్థానం రద్దు చేసింది.
8. పెద్దింటి అమ్మకు పంచామృతాభిషేకాలు
కైకలూరుమండలంలోని కొల్లేటికోటలో కొలువైయున్న శ్రీపెద్దింటి అమ్మవారి జాతర మహోత్సవాలు శుక్రవారం అత్యంత వైభవంగా జరిగాయి. అమ్మవారికి విశిష్టమైన రోజు కావడంతో పంచామృత అభిషేకాలు, లక్ష చామంతి అర్చన, లక్ష కుంకుమార్చన, సప్తావరణ కలశపూజ, పుష్పాలంకరణ, ధూపసేవ వంటి కార్యక్రమాలు చేశారు. ఆలయ ఉప ప్రధాన అర్చకులు పేటేటి పరమేశ్వరశర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి బాలభోగం, పంచహారతుల వంటి పూజలు చేశారు. మాజీ శాసన సభ్యుడు జయమంగళ వెంకటరమణ అమ్మవారికి వస్త్రాలంకరణ చేయించారు. మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్‌రావు పుష్పాలంకరణ, భీమవరానికి చెందిన కలిదిండి రామకృష్ణంరాజు దంపతులు భక్తులకు ఉచిత ప్రసాదం పంచిపెట్టారు. దేవస్థానం ఆధ్వర్యంలో భక్తులకు మంచినీరు, పిల్లలు, వృద్ధులకు ఉచితంగా పాలు అందజేశారు. భక్తులు పాల పొంగళ్లు, వంటలు చేసుకునేందుకు ఆలయం ఆధ్వర్యంలో ఉచిత పందిళ్లు ఏర్పాటు చేసినట్లు ఈవో ఆకుల కొండలరావు తెలిపారు. సర్కారు కాలువ నుంచి అమ్మవారి ఆలయం వరకు నీటి ట్యాంకర్లతో దుమ్ము లేవకుండా రోడ్లను తడిపించారు. పలు ప్రాంతాలకు చెందిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని, మొక్కుబడులు సమర్పించారు. ఆలయ కమిటీ ఛైర్మన్‌ జల్లురి వెంకన్న, కమిటీ సభ్యులు, దేవస్థాన సిబ్బంది ఆధ్వర్యంలో ఉత్సవాలను పర్యవేక్షించారు. కైకలూరుకు చెందిన శ్రీషిర్డీ సాయి మురళీ కోలాట బృందంవారిచే కోలాట ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. కోలాట బృందం మహిళలను ఆలయ కమిటీ సభ్యులు అమ్మవారి శేషవస్త్రాలతో సత్కరించారు.

ఘనంగా యాదాద్రి బ్రహ్మోత్సవాలు

యాదాద్రి పుణ్యక్షేత్రంలో శ్రీ లక్ష్మీనారసింహుల వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. 11 రోజుల పాటు కొనసాగనున్న ఉత్సవాల నిర్వహణ కోసం బాలాలయాన్ని సంప్రదాయంగా ముస్తాబు చేశారు. ఉదయం 10 గంటలకు నిర్వహించే తొలి పూజతో ఉత్సవ పర్వాలు ఆవిష్కృతమవుతాయని ప్రధాన పూజారులు తెలిపారు. రాత్రి సంప్రదాయ పర్వాల మధ్య అంకురార్పణ జరుగుతుంది. ఉత్సవాలకు వచ్చే యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాటు చేసినట్లు ఈవో చెప్పారు. ఉత్సవాల నేపథ్యంలో భక్తులు జరిపించే నిత్యహోమం, కల్యాణోత్సవ పర్వాలను రద్దు చేశామన్నారు.

ఆన్‌లైన్‌లో భద్రాచలం రామయ్య కళ్యాణ టికెట్లు–ఆధ్యాత్మికం

భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఏప్రిల్‌ 14న జరిగే స్వామి వారి తిరు కల్యాణం, 15న జరిగే శ్రీరామ మహాపట్టాభిషేకానికి సంబంధించిన టికెట్లను నేటి నుంచి ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్నట్లు దేవస్థానం ఈవో టి. రమేష్‌బాబు తెలిపారు. కల్యాణం రోజున వీక్షించే భక్తుల సౌకర్యార్దం రూ.5 వేలు, రూ.2 వేలు, రూ.1116, రూ.500, రూ.200, రూ.100 టికెట్లు భక్తులకు అందుబాటులో ఉంటాయి. అలాగే పట్టాభిషేకం రోజుకు సంబంధించి రూ.250, రూ.100 టికెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ఆసక్తి గల భక్తులు భద్రాచలం ఆన్‌లైన్‌ వెబ్‌సైట్‌లో టికెట్లు కొనుగోలు చేయవచ్చని తెలిపారు. ఇదిలా ఉండగా రూ.5 వేల శ్రీరామనవమి కల్యాణం ఉభయదాతల టికెట్లు దేవస్థానం కార్యాలయంలో విక్రయిస్తున్నారని ఆసక్తి గల భక్తులు దేవస్థానం పనివేళలల్లో సంప్రదించాలని కోరారు. వివరాలకు 08743- 232428లో సంప్రదించాలని కోరారు.
1.శివయ్య పెళ్లికి.. వెంకన్న వస్త్రాలు
మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం తెల్లవారుజామున శ్రీకాళహస్తిలో జరిగే శివయ్య పెళ్లికి తిరుమలేశుడైన వేంకటేశ్వరస్వామి ఆలయం తరఫున తితిదే ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ దంపతులు బుధవారం పట్టువస్త్రాలను సమర్పించారు. తల్లిదండ్రులకు జరుగుతున్న వివాహ మహోత్సవానికి కాణిపాకం స్వయంభు వరసిద్ధి వినాయకస్వామి దేవస్థానం తరఫున ఆ ఆలయ ఈవో పూర్ణచంద్రరావు కూడా పట్టువస్త్రాలను అందజేశారు.
2.వైభవంగా నూకతాత పండగ
విశాఖపట్నం జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో నూకతాత సంబరం బుధవారం అంగరంగ వైభవంగా జరిగింది. నూకతాత ప్రతిమలకు సముద్ర స్నానం చేయించిన భక్తులు అక్కడి నుంచి పూజారులతో కలిసి కాలినడకన ఊరేగింపుగా రాజయ్యపేటకు వచ్చారు. చిన్నా, పెద్దా తేడా లేకుండా జనాలు రోడ్డుపై వస్త్రాలు పరిచి వాటిపై పడుకుని ఉండగా పూజారులు ఆశీర్వాదం అందిస్తూ వారి మీదుగా నడిచి వెళ్లారు. ఈ వేడుకను తిలకించడానికి వివిధ గ్రామాల నుంచి జనం భారీగా తరలివచ్చారు.
3. అంతర్జాలంలో భద్రాచలం కల్యాణ టికెట్లు
భక్తులకు సీతారాముల కల్యాణోత్సవ టికెట్లను అంతర్జాలంలో విక్రయిస్తున్నారు. భద్రాచలం ఆలయంలో ఏప్రిల్‌ 6 నుంచి 20 వరకు శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఇప్పటికే రూ.5,000 వంతున విలువ గల ఉభయదాతల టికెట్ల విక్రయాలు దేవస్థాన కార్యాలయంలో జరుగుతున్నాయి. దూరప్రాంతాల్లో ఉన్న రామభక్తుల సౌకర్యార్థం అంతర్జాల సేవలను అందుబాటులోకి తెచ్చామని బుధవారం ఈవో రమేశ్‌బాబు తెలిపారు. కల్యాణానికి రూ.5 వేలు, రూ.2 వేలతో పాటు ఇతర టికెట్లనూ అంతర్జాలంలో ఉంచామని; వీటిని తీసుకున్నవారు వచ్చేనెల 14న సీతారామ కల్యాణాన్ని సెక్టార్‌లోకి వెళ్లి ప్రత్యక్షంగా దర్శించవచ్చని పేర్కొన్నారు. భక్తులు www.bhadrachalamonline.com ద్వారా టికెట్లు తీసుకోవచ్చన్నారు.
4. నేటితో కీసర బ్రహ్మోత్సవాలు ముగింపు
కీసర బ్రహ్మోత్సవాలు నేటితో ముగియనున్నాయి. ముగింపు వేడుకలను నేడు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డా.ఎంవీ రెడ్డి తెలిపారు. ముగింపు వేడుకలకు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి హాజరవుతారని తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన క్రీడా పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులను ప్రదానం చేయడంతో పాటు వివిధ సేవలందించిన అధికారులకు, సేవా సంస్థలకు ప్రశంస పత్రాలను అందించడం జరుగుతుందన్నారు.
5. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి దర్శనానికి భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీనివాసుడి సర్వదర్శనానికి భక్తులు 4 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటల సమయం, టైమ్‌స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు 2 గంటల సమయం పడుతుంది. స్వామివారిని నిన్న 55,009 మంది భక్తులు దర్శించుకున్నారు.
6. చరిత్రలో ఈ రోజు/మార్చి 7
1921 : తెలుగు చలనచిత్ర చరిత్రలో మొట్టమొదటి నేపథ్య గాయకుడు ఎమ్మెస్ రామారావు జననం (మ.1992).
1938 : అమెరికా దేశానికి చెందిన జీవశాస్త్రవేత్త మరియు నోబెల్ బహుమతి గ్రహీత డేవిడ్ బాల్టిమోర్ జననం.
1952 : వెస్ట్‌ఇండీస్ కు చెందిన ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు వివియన్ రిచర్డ్స్ జననం.
1952 : పరమహంస యోగానంద మరణం (జ.1893).
1961 : ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు గోవింద్ వల్లభ్ పంత్ మరణం (జ.1887).
1970 : ఆంగ్ల నటి మరియు రూపకర్త రాచెల్ వీజ్ జననం
8. శుభమస్తు
తేది : 7, మార్చి 2019
సంవత్సరం : విళంబినామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : ఫాల్గుణమాసం
ఋతువు : శిశిర ఋతువు
కాలము : శీతాకాలం
వారము : గురువారం
పక్షం : శుక్లపక్షం
తిథి : పాడ్యమి
(నిన్న రాత్రి 9 గం॥ 33 ని॥ నుంచి
ఈరోజు రాత్రి 11 గం॥ 42 ని॥ వరకు)
నక్షత్రం : పూర్వాభద్ర
(నిన్న రాత్రి 6 గం॥ 12 ని॥ నుంచి
ఈరోజు రాత్రి 8 గం॥ 52 ని॥ వరకు)
యోగము : సాధ్యము
కరణం : (కింస్తుఘ్న) కౌస్తుభ
వర్జ్యం : (ఈరోజు తెల్లవారుజాము 1 గం॥ 18 ని॥ నుంచి ఈరోజు తెల్లవారుజాము 3 గం॥ 4 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఈరోజు ఉదయం 11 గం॥ 58 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 44 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 10 గం॥ 27 ని॥ నుంచి ఈరోజు ఉదయం 11 గం॥ 14 ని॥ వరకు)(ఈరోజు సాయంత్రం 3 గం॥ 12 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 3 గం॥ 59 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 55 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 3 గం॥ 24 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు ఉదయం 9 గం॥ 28 ని॥ నుంచి ఈరోజు ఉదయం 10 గం॥ 57 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు ఉదయం 12 గం॥ 26 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 55 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 6 గం॥ 30 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 23 ని॥ లకు
సూర్యరాశి : కుంభము
చంద్రరాశి : కుంభము
7. భద్రాచల రాముడి కల్యాణానికి ముహూర్తం ఖరారు!
భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి కల్యాణానికి ఆలయ వేద పండితులు, అర్చకులు ముహూర్తం ఖరారు చేశారు. ఏప్రిల్‌ 6వ తేదీ నుంచి 20 వరకు శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఏప్రిల్‌ 14న సీతారాముల కల్యాణం, 15న మహా పట్టాభిషేకం నిర్వహించనున్నారు. సీతారాముల కల్యాణం భక్తులు తిలకించేందుకు మిథిలా ప్రాంగణంలో సెక్టార్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా రూ.5 వేలు, రూ.2 వేలతోపాటు ఇతర టికెట్లను ఆన్‌లైన్‌లో ఉంచారు. సీతారాముల కల్యాణాన్ని వీక్షించే భక్తులు ఈ రోజు నుంచి ఆన్‌లైన్‌లో టికెట్లను కొనుగోలు చేసుకోవచ్చని ఆలయ అధికారులు తెలిపారు.
8.యునెస్కో రేసులో రామప్ప
ఎట్టకేలకు ప్రపంచ వారసత్వ గుర్తింపు రేసులో రామప్ప నిలిచింది. రెండేళ్లుగా వచ్చినట్టే వచ్చి చేజారిన అవకాశం ఈసారి దక్కింది. మనదేశం తరఫున చారిత్రక వారసత్వ కట్టడంగా రుద్రేశ్వరాలయాన్ని(రామప్పగుడి) కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఎంపిక చేసింది. ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఉన్న యునైటెడ్‍ నేషన్స్ ఎడ్యుకేషన్‍, సైన్స్, కల్చరల్‍ ఆర్గనైజేషన్‍ (యూనెస్కో) ప్రపంచ వారసత్వ కట్టడాలను ఎంపిక చేస్తుంది. దీని కోసం ప్రతి దేశం రెండు ఎంట్రీలను పంపించాల్సి ఉంటుంది. ఒకటి నేచురల్‍ సైట్‍, రెండోది చారిత్రక కట్టడం. ఈ ఏడాది భారత్‍ తరఫున రామప్పగుడిని పంపేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. గతంలో సైతం రామప్ప గుడిని భారతదేశం తరఫున ఎంట్రీగా పంపేందుకు ప్రయత్నాలు జరిగాయి. 2017లో గుజరాత్‍, 2018లో రాజస్థాన్ లోని జైపూర్‍ నగరంలో ఉన్న కట్టడాలు భారత్‍ తరఫున‍ అధికారిక ఎంట్రీలుగా యూనెస్కోకు వెళ్లాయి. ఆ రెండు సందర్భాల్లో రామప్ప రాష్ట్ర సరిహద్దులు దాటినా దేశ సరిహద్దులు దాటలేకపోయింది. దాంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈ ఏడాది ఎంట్రీల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. దీంతో కేంద్ర స్థాయిలో రామప్ప ఎంట్రీకి మద్దతు లభించింది. ఫలితంగా భారత్‍ తరఫున అధికారిక ఎంట్రీగా యూనెస్కో తలుపులు తట్టనుంది.
*ఐకోమాస్‍ నివేదిక
భారత్‍ తరఫున అధికార ఎంట్రీగా రామప్ప యూనెస్కో పరిశీలనకు వెళ్లిన నేపథ్యంలో తర్వలో యూనెస్కో ఓ విభాగమైన ఐకోమాస్‍ (ఇంటర్నేషనల్‍ కౌన్సిల్‍ అన్‍ మాన్యుమెంట్స్ అండ్‍ సైట్స్ ) బృంద సభ్యులు ఇక్కడకు రానున్నారు. రామప్ప ఆలయ విశిష్టతలు, చారిత్రక నేపథ్యం , నిర్మాణ పరిరక్షణకు తీసుకున్న జాగ్రత్తలు వారు పరిశీలిస్తారు. వాటిని ప్రపంచంలో ఉన్న ఇతర నిర్మాణాలు, అక్కడి కాలమాన పరిస్థితులు తదితర అంశాలతో నివేదిక రూపొందిస్తారు. ఐకోమాస్‍ ప్రతినిధులు ఇచ్చే నివేదిక ఆధారంగా యూనెస్కో గుర్తింపు లభిస్తుంది. ఈ మొత్తం వ్యవహారం పూర్తయ్యేందుకు నాలుగైదేళ్లు పడుతుంది. నిర్మాణంలో సాంకేతిక నైపుణ్యం , శిల్పాల విశిష్టత వంటి అంశాల్లో రామప్పకు ఎదురులేదు. ఇక ఆలయ పరిరక్షణకు సంబంధించి ఆలయం నుంచి వంద మీటర్ల దూరం వరకు ప్రొహిబిటెడ్‍ జోన్‍, అక్కడి నుంచి మరో 200 మీటర్లు రిస్ట్రిక్టెడ్‍ జోన్ గా ఉండాలి. ప్రస్తుతం రామప్ప చుట్టూ వంద మీటర్ల దూరంలో ఉన్న ఉన్న వాణిజ్య సముదాయాలు తాత్కాలిక నిర్మాణాలు. ఆ తర్వాత రెండు వందల మీటర్ల పరిధిలో పదుల సంఖ్యలో ఇళ్లు ఉన్నాయి. వీటి విషయంలో ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాల్సి ఉంది.
*2012నుంచీ ..
కాకతీయ కట్టడాలకు యునెస్కో గుర్తింపు సాధించేందుకు 2012 నుంచి ప్రయత్నాలు సాగుతున్నాయి. తొలిసారిగా 2012 చెన్నైలో జరిగిన సదరన్‍ రీజియన్ కాన్ఫరెన్సు ఆన్‍ వరల్డ్ హెరిటేజ్‍ సదస్సులో కాకతీయుల కట్టడాలైన వేయిస్తంభాల గుడి, ఖిలావరంగల్‍, రామప్ప ఆలయాలను ప్రతిపాదించారు. ఆ తర్వాత 2015 ఏప్రిల్లోట న్యూ ఢిల్లీలో జరిగిన వరల్డ్ హెరిటేజ్‍ సైట్‍ వర్క్ షాప్ లో సానుకూల స్పందన వచ్చింది. ఆ తర్వాత ఏడు వరల్డ్ హెరిటేజ్‍ సైట్స్ టెంటే టీవ్‍ లిస్ట్ 2016లో కాకతీయ కట్టడాలకు చోటు లభించింది. యునెస్కో నిబంధనల ప్రకారం వరల్డ్ హెరిటే జ్‍ సైట్స్ చుట్టుపక్కల మూడు వందల మీటర్ల దూరం వరకు ఎటువంటి నిర్మాణాలు ఉండరాదనే కఠిన నిబంధన దృష్టిలో ఉంచుకుని ఫైనల్‍ లిస్ట్ నుంచి వేయి స్తంభాల దేవాలయం, ఖిలావరంగల్నుష తొలగించారు. ఆ తర్వాత 2017, 2018లో భారత్‍ తరఫున అధికార ఎంట్రీగా పంపేందుకు ప్రయత్నాలు జరిగాయి. ఈ రెండు సందర్భాల్లో కేంద్రం ఓసారి గుజరాత్‍, మరోసారి రాజస్థాన్ లకు అవకాశం కల్పించింది. తెలంగాణ తరఫున ఇప్పటి వరకు వరల్డ్ హెరిటే జ్‍ సైట్గాా గుర్తింపు ఉన్న ఒక్క చారిత్రక కట్టడం లేదు. ఈ నేపథ్యం లో తొలిసారి రామప్పకు ఆ అవకాశం వచ్చింది.

కొల్లేటి జలదుర్గ శ్రీపెద్దింటి అమ్మ విశేషాలు

*7 నుంచి 21 వరకు జాతర ఉత్సవాలు -18న శ్రీజలదుర్గ, గోకర్ణేశ్వరస్వామి కల్యాణం
ప్రకృతి అందాలు.. పక్షుల కిలకిలరావాలు.. కొల్లేరు సరస్సు.. నడిబొడ్డున కొలువైయున్న శ్రీపెద్దింటి అమ్మవారి జాతర ఉత్సవాలకు ముస్తాబయ్యారు. ఏటా ఫాల్గుణ శుద్ధ పాఢ్యమి నుంచి ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి వరకు దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది మార్చి 7 నుంచి 21 వరకు అమ్మవారి జాతర ఉత్సవాలు నిర్వహించేందుకు ఆలయ ధర్మకర్తల మండలి, దేవస్థానం ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. ఉత్సవాల ప్రత్యేక అధికారి గుడివాడ ఆర్డీవో ఆధ్వర్యంలో ఇప్పటికే రెండు దఫాలుగా జాతర నిర్వహణపై సమీక్ష సమావేశాలు నిర్వహించారు.
*పార్వతీదేవి ప్రతిరూపం
దక్షిణ కశ్మీరంగా పేరొందిన కొల్లేరు సరస్సు మధ్యలో ఉన్న కోటదిబ్బ కొల్లేటికోట గ్రామం శ్రీపెద్దింటి అమ్మవారు కొలువై ఉంది. తొమ్మిది అడుగుల ఎత్తు కలిగి, విశాల నేత్రాలతో, పద్మాసనంలో ఉన్న అమ్మవారు శ్రీపార్వతీదేవి ప్రతి రూపమే. ఎన్నో మహిమలున్న అమ్మగా, పెద్దమ్మగా కొల్లేరులో నివసించే వడ్డి కులస్థులే కాకుండా అసోం, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలకు చెందిన ప్రజలు వచ్చి అమ్మవారిని దర్శించుకుని వెళుతుంటారు. వేంగీ చాళుక్యరాజుల పాలన నాటికే కొల్లేరు ప్రాంతం ఒక మండలంగా ఉంది. కొలను విషయ, సాగరు విషయగా పేర్లు ఉన్నాయి. నేటి కొల్లేటికోట గ్రామాన్ని అప్పట్లో కొలనుపురం, కొనువీడుగా వ్యవహరించారని శాసనాల ద్వారా తెలుస్తోంది. క్రీస్తుశకం 10 – 11 మధ్యకాలంలో వేంగీ చాళుక్య రాజులు వైవాహిక బంధవ్యాలు ఉండేవని కమలాకరపుర వల్లభుని శాసనాల వల్ల తెలుస్తోంది. క్రీస్తుపూర్వం 1076లో విజయాదిత్య మరణంతో చాళుక్యరాజుల పాలన అంతరించింది. వేంగీ చాళుక్యరాజులపై మండలేశ్వరుడు అయిన తెలుగు భీముడు తిరుగుబాటు చేశాడు. తెలుగు భీముడు విజయాదిత్య చక్రవర్తిని వేంగీశ్వరునిగా చేశారు. వేంగీశ్వరుడే పార్వతీదేవిని పెద్దమ్మగా కొలిచిన చక్రవర్తి. పీఠాపురం శాసనాన్ని బట్టి కొల్లేరు నీటిని ఇంకించి, తోడించి, వంతెన వేయించి మధ్యలో అభేద్యమైన దుర్గాన్ని నిర్మించినట్లు చరిత్ర ఆధారం ఉంది. ఈ దుర్గం చుట్టూ 150 రాజహస్తాల వెడల్పు, 7 నిలువుల లోతు, 3 కోశాల చుట్టుకొలత ఉండేదని చరిత్రకారులు పేర్కొన్నారు. కాలక్రమంలో ఇక్కడి మేడలు, మిద్దెలు, దేవళాలు కనుమరుగయ్యాయి. అమ్మవారి గుడి మాత్రమే నేటికి నిలిచి ఉంది. చైనా బౌద్ధమత యాత్రికుడు హ్యుయాన్‌త్సాంగ్‌ ఈ సరస్సును మహత్తరమైన మంచినీటి సరస్సుగా అభివర్ణించాడు. దండి మహాకవి దశకుమార చరిత్రలో కొల్లేటికోట రాజు తెలుగుభీముని గురించి గొప్పగా రాశారు. ఇటీవల కాలంలో దేవాదాయ శాఖ, దాతల సాయంతో ఈ ఆలయాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు.
*ఉత్సవ కార్యక్రమాలు..
ఈ నెల 7నుంచి 21 వరకు అమ్మవారి ఆలయం వద్ద పలు ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. రోజూ అమ్మవారికి విశేష అలంకారంతో పాటు పూజా కార్యక్రమాలు చేస్తారు. 18న శ్రీజలదుర్గ గోకర్ణేశ్వరస్వామివారి కల్యాణం అత్యంత వైభవోపేతంగా లక్షలాది మంది భక్తుల సమక్షంలో జరుగుతుంది. రోజూ రాత్రి ఏడు గంటల నుంచి భక్తులను అలరించేందుకు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.
*ఎలా చేరుకోవాలంటే..
విజయవాడ నుంచి రైలు, రోడ్డు మార్గాలు ఉన్నాయి. కైకలూరు రైల్వే స్టేషన్లో దిగి ఆలపాడు మీదగా రోడ్డుమార్గంలో ప్రయాణించి అమ్మవారి ఆలయానికి చేరుకోవచ్చు. ఏలూరు, భీమవరం నుంచి కూడా రోడ్డు మార్గం ద్వారా అమ్మవారి సన్నిధికి చేరవచ్చు. ఆలపాడు నుంచి ఏడు కిలోమీటర్ల దూరం ప్రయాణించి అక్కడి నుంచి లాంచీల్లో అమ్మవారి దర్శించుకోవచ్చు.
1. ‘ప్రపంచ వారసత్వ ప్రాంతం’గా రామప్ప గుడి పేరు ప్రతిపాదన
ములుగు జిల్లాలో ఉన్న రామప్ప దేవాలయం ‘ప్రపంచ వారసత్వ ప్రాంతాల జాబితా’లో స్థానం పొందేలా కేంద్రం కృషిచేస్తోంది.ఈ మేరకు ఆ గుడి పేరును 2019 సంవత్సరానికి నామినేట్ చేసినట్లు వరంగల్‌కు చెందిన కాకతీయ హెరిటేజ్‌ ట్రస్ట్‌ పేర్కొంది. ట్రస్టీ, రిటైర్డ్‌ ఐఏఎస్‌ బీవీ పాపారావు మంగళవారం హన్మకొండలో విలేకరులతో మాట్లాడుతూ, దేశం నుంచి ఏటా ఒక వారసత్వ ప్రాంతాన్ని గుర్తించి యునెస్కోకు నామినేట్ చేస్తారన్నారు. ఆ ప్రాంతానికి ఆ అర్హత ఉందా అనే కోణంలో వారు పరిశోధించి ధ్రువీకరిస్తారని తెలిపారు. రామప్ప గుడికి వారసత్వ ఖ్యాతి గురించి అనేక పత్రాలను సిద్ధంచేసి ఇప్పటికే కేంద్రం, తెలంగాణ ప్రభుత్వాలకు అందజేశామన్నారు.మరో ట్రస్టీ పాండురంగారావు మాట్లాడుతూ..తేలియాడే ఇటుకలు, ఇసుక పునాదులు గల అసాధారణ ప్రాచీన కట్టడం రామప్ప దేవాలయమన్నారు.
2. మల్లన్న రథోత్సవం.. భక్తులకు ఆనందోత్సవం
శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల తొమ్మిదో రోజు మంగళవారం శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామివార్ల రథోత్సవం వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో శ్రీస్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను శోభాయమానంగా అలంకరించి మంగళవాయిద్యాలతో వెండి పల్లకీలో తీసుకువచ్చి రథంపై అధిష్ఠింపజేశారు. మంగళవాయిద్యాలు, వేదమంత్రోచ్ఛరణ, కళాకారుల నృత్య సందడి నడుమ ప్రధాన పురవీధిలో శ్రీస్వామిఅమ్మవార్లకు రమణీయంగా రథోత్సవం జరిగింది. వేలాది మంది భక్తులు రథోత్సవాన్ని తిలకించి ఆధ్యాత్మికానుభూతి పొందారు. రాత్రి 8 గంటలకు ఆలయ పుష్కరిణిలో ఆది దంపతులకు వైభవంగా తెప్పోత్సవం జరిగింది.
3. యాదాద్రి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు
లక్ష్మీనరసింహ ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు 8 నుంచి మొదలుకానున్నాయి. 11 రోజులు కొనసాగే ఈ వేడుకలకు సన్నాహాలు సాగుతున్నాయని ఈవో గీతారెడ్డి, వంశపారంపర్య ధర్మకర్త నరసింహమూర్తి తెలిపారు. వారిద్దరూ మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ, త్రిదండి చినజీయర్‌స్వామి సూచనలతో ఉత్సవాలను బాలాలయంలోనే నిర్వహిస్తున్నామన్నారు. శుక్రవారం స్వస్తివాచనంతో శ్రీకారం జరుగుతుందని, కార్యక్రమాల్లో భాగంగా 13 నుంచి 17 వరకు ఐదురోజులపాటు సాంస్కృతికోత్సవాలు ఉంటాయని చెప్పారు. ఎదుర్కోలు 14 రాత్రి ఉంటుంది. స్వామి, అమ్మవారి తిరుకల్యాణ మహోత్సవాన్ని 15 ఉదయం కొండపై బాలాలయంలో, రాత్రి కొండ కింద పట్టణంలో నిర్వహిస్తారు. రథోత్సవాన్ని కూడా 16న అదేవిధంగా చేపడతారు. 17న చక్రతీర్థం, 18న అష్టోత్తర శతఘటాభిషేకం జరుగుతాయి. ప్రత్యేక అభిషేకంతో ఉత్సవాలకు తెరపడుతుంది. బ్రహ్మోత్సవాల తరుణంలో.. 8 నుంచి 18 దాకా భక్తులు జరిపే నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, సుదర్శన, నారసింహ హోమ పర్వాలు రద్దవుతాయని ఈవో ప్రకటించారు.యాదాద్రిలో శివుడికి లక్ష బిల్వార్చనయాదాద్రి పుణ్యక్షేత్రంలోని పర్వతవర్ధిని రామలింగేశ్వరస్వామి చరమూర్తుల మందిరంలో మంగళవారం లక్ష బిల్వార్చన నిర్వహించారు. శివరాత్రి మహోత్సవాల సందర్భంగా, ఆ పత్రాలతో స్వామిని కొలిచి, రాత్రివేళ రథ పటోత్సవం నిర్వహించారు. హరిహరులతో విలసిల్లుతున్న ఈ క్షేత్రంలో, శైవాగమ ఆచారంగా శివాలయ వార్షికోత్సవాల నిర్వహణ చేపట్టారు.
4. భక్తిశ్రద్ధలతో ‘మల్లన్న’ పెద్దపట్నం
కొమురవెల్లి శ్రీ మల్లికార్జునస్వామి వారి క్షేత్రంలో పెద్దపట్నం కార్యక్రమాన్ని ఆలయవర్గాలు అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా ఆలయవర్గాలు ఒగ్గు పూజారులతో పెద్ద పట్నం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి కల్యాణోత్సవాన్ని, స్ధల పురణాన్ని ఒగ్గు పూజారులు పంచరంగులతో తయారు చేసిన పట్టం వద్ద జానపదరీతిన పాటలు పాడుతూ పెద్దపట్నం కార్యక్రమాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మహా శివరాత్రి సందర్బంగా లింగోద్భవ కాలం రాత్రి 12గంటలకు శ్రీ మల్లికార్జున స్వామి వారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించిన అనంతరం స్వామి వారి ఉత్సవ విగ్రహాలను ఆలయ అర్చకులు రాజగోపురం, రాతిగీరలు తదితర ప్రాంతాలలో ఊరేగించారు. ఒగ్గు పూజారులు అత్యంత భక్తిశ్రద్ధలతో పంచరంగులు కుంకుమ, పసుపు, బియ్యం పిండి, తంగెడు పిండి, గులాలు తదితర వాటి చూర్ణాలను కలిపి ముగ్గులుగా వేసి పట్నంగా తయారు చేశారు. అనంతరం అర్చకులు ఉత్సవ విగ్రహాలను తీసుకువచ్చి పెద్దపట్నం దాటగానే భక్తులు పట్నం దాటి స్వామి వారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ పాలక మండలి చైర్మన్ సెవెల్లి సంపత్, డిప్యూటీ కమిషనర్ టంకశాల వెంకటేష్, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు.
5. ఈ 8 నుంచి 18 వరకు యాదాద్రి బ్రహ్మోత్సవాలు
యాదాద్రిలో బ్రహ్మోత్సవాలు ఈ నెల 8 నుంచి 18వ తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఉత్సవాలను వైభవంగా నిర్వహించి ఉత్సవ ప్రాధాన్యతను పెంచేందుకు కృషి చేస్తున్నట్లు యాదాద్రి ఆలయ ఈవో ఎన్. గీత, అనువంశిక ధర్మకర్త బీ. నర్సింహమూర్తిలు తెలిపారు. మంగళవారం యాదాద్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతు మరో మూడు రోజుల్లో యాదాద్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న నేపధ్యంలో ఏర్పాట్లు ఊపందుకున్నాయని తెలిపారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఉదయం వేళల్లో అలంకారసేవలు, రాత్రి వేళల్లో శ్రీవారి వాహనసేవలు ప్రతీ రోజు జరుగుతాయన్నారు.రాష్ట్ర గవర్నర్ ఈఎల్‌ఎన్ నరసింహన్ విశిష్ట అతిధిగా 15న ఉదయం కళ్యాణోత్సవానికి హాజరుకానున్నట్లు ఆమె తెలిపారు.
6. త్రికోటేశ్వరుని ఆదాయం రూ.కోటి 32 లక్షలు
మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండ త్రికోటేశ్వరునికి కోటి 32 లక్షల 60 వేల 361రూపాయల ఆదాయం లభించినట్లు దేవస్థాన కార్యనిర్వహణ అధికారి యడ్లపల్లి బైరాగి తెలిపారు. మంగళవారం హుండీ ఆదాయాన్ని లెక్కించారు. పూజల టిక్కెట్లు, ప్రసాదాల అమ్మకాలు, సేవలు, వివిధ పథకాలు, అన్నదానం తదితర అంశాలకు సంబంధించి ఆదాయం వచ్చిందని చెప్పారు. గత సంవత్సరం కన్నా రూ.9లక్షల 60 వేల 916 అధికంగా లభించిందన్నారు. యూఎస్‌ డాలర్లు 152, నేపాల్‌ కరెన్సీ 5 లభించినట్లు తెలిపారు. లెక్కింపు కార్యక్రమంలో ఉత్సవ అధికారి ఎం.వి.సురేష్‌బాబు, ఈవో కె.శ్రీనివాస్‌, వంశపారంపర్య ధర్మకర్త ఎం.వి.రామకృష్ణ బహద్దూర్‌, పాలక మండలి సభ్యులు బి.కె.ప్రసాద్‌, అనుమోలు వెంకయ్యచౌదరి తదితరులు పాల్గొన్నారు.
7.శుభమస్తు
తేది : 6, మార్చి 2019
సంవత్సరం : విళంబినామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : మాఘమాసం
ఋతువు : శిశిర ఋతువు
కాలము : శీతాకాలం
వారము : బుధవారం
పక్షం : కృష్ణ (బహుళ) పక్షం
తిథి : అమావాస్య
(నిన్న రాత్రి 7 గం॥ 7 ని॥ నుంచి
ఈరోజు రాత్రి 9 గం॥ 32 ని॥ వరకు)
నక్షత్రం : శతభిష
(నిన్న సాయంత్రం 3 గం॥ 17 ని॥ నుంచి
ఈరోజు రాత్రి 6 గం॥ 11 ని॥ వరకు)
యోగము : సిద్ధము
కరణం : చతుష్పాద
వర్జ్యం : (నిన్న రాత్రి 11 గం॥ 21 ని॥ నుంచి ఈరోజు తెల్లవారుజాము 1 గం॥ 8 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఈరోజు ఉదయం 10 గం॥ 6 ని॥ నుంచి ఈరోజు ఉదయం 11 గం॥ 53 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 12 గం॥ 3 ని॥ నుంచి ఈరోజు ఉదయం 12 గం॥ 50 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు ఉదయం 12 గం॥ 27 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 56 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు ఉదయం 10 గం॥ 58 ని॥ నుంచి ఈరోజు ఉదయం 12 గం॥ 27 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు ఉదయం 8 గం॥ 0 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 29 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 6 గం॥ 31 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 23 ని॥ లకు
సూర్యరాశి : కుంభము
చంద్రరాశి : కుంభము
8.చరిత్రలో ఈ రోజు/మార్చి 6
1475 : ప్రముఖ చిత్రకారుడు మైఖేలాంజెలో జననం.(మ.1564).
1508 : మొఘల్ సామ్రాజ్యపు రెండవ చక్రవర్తి హుమాయూన్ జననం.
1899 : ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధురాలు మరియు తెలుగు రచయిత్రి తల్లాప్రగడ విశ్వసుందరమ్మ జననం.
1913 : హాస్యనటులకు ప్రాధాన్యత సంతరింపజేసిన ప్రముఖ హాస్యనటుడు కస్తూరి శివరావు జననం (మ.1966).
1919 : ప్రముఖ సాహితీవేత్త గడియారం రామకృష్ణ శర్మ జననం.
1936 : పాత తరం తెలుగు సినిమా కథానాయిక కృష్ణకుమారి జననం.
1937 : అంతరిక్షంలో కి వెళ్ళిన మొదటి మహిళ గా చరిత్రలో ప్రసిద్ధికెక్కిన వాలెంతినా తెరిష్కోవా జననం.
9.తిరుమల సమాచారం
ఈరోజు బుధవారం *06-03-2019* ఉదయం *5* గంటల సమయానికి.
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ……
శ్రీ వారి దర్శనానికి *1* కంపార్ట్ మెంట్ లలో వేచి ఉన్న భక్తులు….
శ్రీ వారి సర్వ దర్శనానికి *8* గంటల సమయం పడుతోంది.
ప్రత్యేక ప్రవేశ (300/-) దర్శనానికి, కాలినడక భక్తులకు, టైమ్ స్లాట్ సర్వ దర్శనానికి *03* గంటల సమయం పడుతోంది..
నిన్న మార్చి *5* న *55,837* మంది భక్తులకు శ్రీవారి ధర్శనభాగ్యం కలిగినది.
నిన్న స్వామి వారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు కానుకలు *:3.14* కోట్లు.

తిరుపతి కపిలేశ్వరుడు

తిరుపతిలోని శ్రీకపిలేశ్వరాలయం మహిమాన్విత క్షేత్రంగా వెలుగొందుతోంది. వైష్ణవ క్షేత్రంగా ప్రపంచ ప్రసిద్ధి చెందిన తిరుమల వేంకటేశ్వరుడు కొలువైన శేషాచలం చెంత శివుడు స్వయంభుగా వెలసిన క్షేత్రమిది. ఆలయం తితిదే నిర్వహణలో ఉంది.
*ఆలయ చరిత్ర
శ్రీ కపిల మహాముని పాతాళ లోకంలో భోగవతి నది ఒడ్డున శివలింగానికి పూజలు చేసేవాడని.. ఆయన పూజలు చేయడంతో కపిల లింగంగా నామకరణం పొందిందని పురాణాలు చెబుతున్నాయి. అప్పుడప్పుడు మహాముని భూలోకంలోని శేషాచల పరిసరాలకు వచ్చేవాడని.. ఆ సమయంలో పాతాళంలోని కపిల లింగం పుడమిని చీల్చుకుంటూ పెరిగేదని చెబుతున్నారు. గమనించిన బ్రహ్మదేవుడు కపిల గోవు రూపుడై శివలింగానికి క్షీరాభిషేకం చేస్తూ… తన కాలి గిట్ట లింగంపై పెట్టి ‘ఇక పెరగవద్ద’ని కోరాడు. మహా విష్ణువు గోవుల కాపరి బాలుడిగా ఆ సమయంలో అక్కడ నిలిచాడని.. అప్పుడు స్వామివారికి తోడుగా కామాక్షి అమ్మవారిని ప్రతిష్ఠించి మహాముని పూజలు నిర్వహించగా.. అప్పటి నుంచి ఆ ప్రాంతం కపిలేశ్వరాలయంగా మారిందని పురాణాలు చెబుతున్నాయి.
*స్వయంభు… త్రివర్ణం
పాతాళ లోకం నుంచి భువిని ఛేదించుకుంటూ స్వయంభుగా వెలసిన కపిలేశ్వరస్వామి లింగం త్రివర్ణ రూపం. పానవట్టం భాగంలో తెలుపు.. మధ్యలో పసుపు పచ్చ.. పైన తేనె రంగులో మూలమూర్తి ఉంటారు. మధ్య భాగంలో కళ్లు స్పష్టంగా కనబడతాయి. ఈశ్వరుడి లింగాకారం పైభాగంలో ఇప్పటికీ ఆవు గిట్ట గుర్తు ఉంటుంది. విష్ణుమూర్తిపై అలిగి భూమి మీదకు వచ్చిన శ్రీ మహాలక్ష్మి ఆలయంలోని బిల్వ చెట్టు వద్ద ధ్యానం చేసినట్లు.. కలియుగంలో వకుళామాత తిరుమల నుంచి ఆలయ ప్రాంగణంలోకి శేషాచల కొండల్లో ఉన్న సొరంగ మార్గంలో వచ్చి వేంకటేశ్వరస్వామి, పద్మావతి దేవికి వివాహం జరిపించాలని శివయ్యకు పూజలు చేసినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి.
*లెక్కకు మిక్కిలి దేవతా విగ్రహాలు
ప్రధాన ఆలయంలో మూలమూర్తికి సమీపంలో వల్లిదేవయాని సమేత సుబ్రహ్మణ్య స్వామి కొలువై ఉన్నారు. ధ్వజ స్తంభానికి కుడివైపున సిద్ధి వినాయక స్వామి విగ్రహం ఉంది. అమ్మవారి ఆలయానికి కుడి వైపున దక్షిణామూర్తి, కాలభైరవుడు, కాశీ విశ్వేశ్వరుడు, చాగంటి ఉమామహేశ్వరుడు, శివసూర్యుడు, శివగామి సమేత నటరాజ స్వామి కొలువై ఉన్నారు. ప్రధాన ఆలయానికి కుడి వైపున రాగి, వేప, మారేడు చెట్లతో కూడిన నాగుల పట్టి ఉంది. పలు లింగాకృతులతో కూడిన కోటి లింగేశ్వరాలయం ఉంది. పక్కనే అగస్తేశ్వర స్వామి ఆలయం కొలువైంది. పక్కన నవగ్రహాలు కొలువుదీరి ఉంటాయి. ఆలయ పుష్కరిణికి ఎదురుగా రుక్మిణి, సత్యభామ సమేత వేణుగోపాల స్వామి, ఎడమవైపు లక్ష్మీనారాయణ స్వామి ఆలయాలు ఉన్నాయి. ఆలయ ప్రాంగణంలో విజయనగర అచ్యుతరాయులు వారు భూమిపై ఉన్న వైష్ణవాలయాలన్నింటినీ దర్శించుకున్న నమ్మాళ్వార్‌కు కూడా ఆలయాన్ని నిర్మించారు. ఆలయ ప్రవేశంలోనే క్షేత్ర పాలకుడిగా అభయ హస్త ఆంజనేయస్వామి దక్షిణ ముఖంగా నిలిచి తూర్పునకు చూస్తూ భక్తులను కటాక్షిస్తుంటారు.
*కపిలేశ్వరాలయం- పుష్కరిణి ప్రత్యేకత
భూమిపై ఉన్న ఏ పుష్కరిణికి లేని ప్రత్యేకత కపిలేశ్వరాలయ సరోవరానికి ఉంది. వైష్ణవ ఆగమం ప్రకారం జరిగే చక్రస్నానం.. శివాగమ శాస్త్రాల ప్రకారం జరిగే త్రిశూల స్నానం ఇక్కడ చేస్తారు. తిరుపతిలోని శ్రీకోదండరామ స్వామి, గోవిందరాజ స్వామి బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా ఈ పుష్కరిణిలో చక్రస్నానం ఘట్టం జరుగుతుంది. ఏటా ఫిబ్రవరిలో జరిగే కపిలేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలల్లో త్రిశూల స్నానం ఇక్కడ నిర్వహిస్తారు. ఇప్పటికీ పుష్కరిణి వాయవ్య మూలన ఉన్న సొరంగం నుంచి నీటి ఆనవాళ్లు కనిపిస్తూనే ఉంటాయి. భక్తులు కార్తీక మాసంలోనే కాకుండా నిత్యం పెద్దసంఖ్యలో పుణ్యస్నానాలు ఆచరించి కపిలేశ్వరస్వామిని దర్శించుకుని తరువాత తిరుమలకు నడచి వెళుతుంటారు.
*25 నుంచి బ్రహ్మోత్సవాలు
ఏటా నిర్వహించే కపిలేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 25వ తేదీ నుంచి మార్చి 6వ తేదీ వరకు జరగనున్నాయి. ఆదివారం సాయంత్రం 4.30 గంటలకు మూషిక వాహనంపై శ్రీ వినాయకస్వామి వీధి ఉత్సవం నిర్వహిస్తారు. అనంతరం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరపనున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో మారుమోగుతున్న శివనామ స్మరణ

మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లో శివాలయాలు కిక్కిరిశాయి. శివ నామస్మరణలతో శైవక్షేత్రాలు మార్మోగుతున్నాయి. వేకువజాము నుంచే భక్తులు దేవాలయాలకు పోటెత్తారు. సోమవారం కూడా కలిసి రావడంతో ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మహా శివరాత్రిని పురస్కరించుకుని గవర్నర్‌ నరసింహన్‌, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్‌ ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాలోని శ్రీముఖలింగలోని శ్రీముఖలింగేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. భీమవరంలోని పంచారామక్షేత్రమైన సోమరామానికి భక్తులు పోటెత్తారు. మహాశివరాత్రి సందర్భంగా అర్ధరాత్రి 12:30 నిమిషాలకే ఆలయ తలుపులు తెరిచారు. పంచారామ క్షేత్రం పాలకొల్లు క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి పురస్కరించుకొని తెల్లవారుజాము నుంచే భక్తులు భారీగా తరలివచ్చారు. వేములవాడ రాజన్న ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు కొనసాగుతున్నాయి. స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు కోడె మొక్కులు తీర్చుకుంటున్నారు. శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి తితిదే నుంచి తితిదే అర్చకులు, అధికారులు పట్టువస్త్రాలు సమర్పించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో శివరాత్రి సందర్భంగా శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. జిల్లాలోని ప్రధాన శైవ క్షేత్రాలైన ఉమా మహేశ్వరం, జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి దేవస్థానం సహా శివాలయాలకు భక్తులు పోటెత్తారు. ప్రముఖ క్షేత్రాలైన వేములవాడ, కీసర, ధర్మపురి ఆలయాలు భక్తులతో పోటెత్తాయి.