వర్జీనియాలో నాటా మహిళా దినోత్సవం

ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాటా) ఆధ్వర్యంలో ఆష్బర్న్‌, వర్జీనియా నగరాల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు అంగరంగ వైభంగా జరిగాయి. నాటా బోర్డ్ అఫ్ డైరెక్టర్ సుధారాణి కొండపు ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో 500 మంది మహిళలకు పైగా పాల్గొన్నారు. ఈ వేడుకల్లో మహిళలకు ఉపయోగకరమైన విషయాలపై వక్తలు మాట్లాడి చర్చించారు. ప్రియ ప్రార్థనా గీతంతో ఈ వేడుకలు మొదలయ్యాయి. అనంతరం కూచిపూడి డాన్స్ అకాడమీ ట్రినిటీ పంత్ గణేష పంచరత్నాన్ని ప్రదర్శించారు. మాధవీ మైలవరపు బృందం అష్టలక్ష్మి స్తోత్రం ఆలపించారు. సుధ, శ్రీలత, లలిత మహిళా సంబంధిత పాటలు పాడి అలరించారు.శ్రావ్యమైన పాటలు వినడం ద్వారా మానసికోల్లాసము పెంపొందించుకోవడంపై లలితా రాంపల్లి వివరంగా తెలియజేసారు. ఇంద్రాణి దావలూరి ప్రదర్శించిన మహిషాసురమర్థని ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. డి సి మెట్రో విభాగంలోని వివిధ రంగాలకు చెందిన ర్తిదాయకమయిన మహిళలను గుర్తించి వారికి “నాటామహిళ “ పురస్కారాలను అందచేయటం జరిగింది. కూచిపూడి కళారంగంలో సేవలందిస్తున్న లక్ష్మిబాబుకి , ఆరోగ్యరంగం నుంచి శ్రీలేఖ పల్లెకి, తెలుగుమహిళల్లో అరుదుగా ఎంచుకునే రంగం నుంచి న్యాయవాది జనెత కంచర్లకి, ఐటీ రంగంలోనే కాక అనేక రంగాలలో ప్రత్యేక గుర్తింపు పొందిన పద్మిని నిడుమోలును ఈ సందర్భంగా సన్మానించారు . చైతన్యవంతుల సంబంధించిన ప్రశ్నలు, జయ తెలికుంట్ల, రాధిక జయంతిల వ్యాఖ్యానం, సరదా సరదా ఆటలతో ఈ కార్యక్రమం సాగింది. వసుధారారెడ్డి మహిళా సాధికారత, మహిళల గొప్పతనం గురించి ఈ సమావేశం లో కొనియాడారు. చివరగా సంధ్య బైరెడ్డి అక్కడికక్కడే ఉత్సాహవంతులయిన 30 మంది మహిళలతో చేసిన ఫ్యాషన్‌ వాక్ ప్రత్యేకత సంతరించుకుంది. నాటా కల్చరల్ కమిటీ ఛైర్ విజయ దొండేటి, సంధ్య బైరెడ్డిలు, చిత్ర దాసరి, ప్రత్యేక అతిథులను ఆహ్వానించగా చైతన్య, స్వరూప గిండి, అనిత ,లావణ్య, గౌరి, ఇతర సభ్యులు ఈ వేడుకలని విజయవంతం చేసారు. ఈ కార్యక్రమంలో సెనేటర్ జెన్నిఫర్ బయోస్కొ, కౌంటిఛైర్ ఫిలిస్ రేండల్, జాన్ బెల్ పాల్గొన్నారు. తానా, అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌, అమెరికన్‌ తెలంగాణ అసోసియేషన్‌, టీడీఎప్‌, జీడబ్యూటీసీఎస్‌(GWTCS), ఇతర నాయకులు పాల్గొని తమ అభినందనలు తెలియజేసారు. నాటా ప్రెసిడెంట్ రాఘవరెడ్డి గారు మాట్లాడుతూ నాటాలో మహిళలకు ప్రత్యేక స్థానం ఉంటుందనీ, ఇంటాబయటా అన్ని రంగాలలోనూ ముందంజ వేస్తున్న మహిళలు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తెలుగు ఆడపడుచులు వివిధ బ్యూటీ కాంటెస్ట్ లలో గెలుపొందిన ఇంద్రాణి, సురేఖ, హిమాన్విలను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో నాటా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు సతీష్ నరాల, మోహన్ కలాడి, బాబూరావు సామల, కిరణ్ గున్నం, నాటా వాషింగ్టన్ డిసి ప్రాంతీయ సభ్యులు మధు మోటాటి, ఆంజనేయరెడ్డి దొండేటి, నినాద్ అన్నవరం, ఉదయ ఇంటూరు, వెంకట్ కొండపోలు, సుజిత్ మారం, రమేష్ వల్లూరి తదితరులు పాల్గొన్నారు.

ATA Celebrates Womens Day On A Grand Scale In Chicago


American Telugu Association (ATA) celebrated International Women’s Day in Chicago on a grandeur scale at Play’N’Thrive Schaumburg with much fervor and gusto. This year Women’s day theme, #BetterforBalance, focused primarily on a call to action for gender balance. The event started with Ganesh Stotram followed by the Chief Guest, Indian Consular Officer Mrs. Rajeshwari Chadrasekharan, lighting the ceremonial lamp along with ATA Women’s Day organizers. A welcome address was given by ATA Board of Trustee Dr. Meher Medavaram focusing on gender equality and equal opportunities for women in leadership at all levels of decision making in political, business and economic arenas. Mrs. Chandrasekharan eloquently spoke to attendees about how Indian women have excelled in the US, their challenges in modern day society, women’s issues and women empowerment. Immigration Attorney Adaikala Mary Kennedy also gave insight about her services and how to strike a balance between work and life. Raffle Ticket Prize winners were awarded Gold Coins sponsored by Sri Krishna Jewelers. The fashion show was the highlight of the event with ladies from various age groups actively participating. Scores of women dressed in ethnic attire thoroughly enjoyed the festivities and had a great time visiting several vendor booths. A sumptuous lunch was served to attendees. Singers Madhuri, Sailaja and Shirley enthralled everyone with Bollywood and Tollywood songs. Gift cards were awarded to various game prize winners, and the program ended with plenty of dancing to the DJ’s music. ATA Board of Trustees Dr. Meher Medavaram and Sainath Reddy Boyapalli oversaw the day’s proceedings. Decoration and arrangements were taken care of by Ramana Abbaraju, Amar Nettem, Suchitra Reddy, Laxmi Boyapalli, Chalma Bandaru, Venkat Thudi, Mahipal Vancha, Hari Raini, Jagan Bukkaraju, Narsimha Chittaluri, Bheemi Reddy, Satish Yellamilli and Bhanu Swargam. ATA founder member & Past President Hanumanth Reddy garu motivated everyone with his presence and applauded the Sponsors, Volunteers and Local organizations for their continued, unwavering support.

బోస్టన్‌లో ఆటా మహిళా దినోత్సవం


అమెరికాలోని బోస్టన్ నగరంలో అమెరికన్‌ తెలుగు అసోషియేషన్‌(ఆటా) ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు అంగరంగ వైభంగా జరిగాయి. ఈ సంవత్సరం ‘బెటర్‌ ఫర్‌ బ్యాలెన్స్‌’ అనే థీమ్‌తో ఈ వేడుకలను ఆట నిర్వహించింది. న్యూ ఇంగ్లాండ్ లోని బోస్టన్ పరిసర ప్రాంతాలు కన్నీటికట్, న్యూ హంపశైర్ నుండి ఈ వేడుకలకు మహిళలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేశారు. ఈ వేడుకల్లో మహిళలకు ఉపయోగకరమైన విషయాలపై వక్తలు మాట్లాడి చర్చించారు. మహిళలు అన్ని రంగాలలో ముందుండి విజయం సాదించాలని రంజని సైగల్ అన్నారు. మసాచుసెట్స్ రాష్ట్ర సెనెటర్ ఎలిజబెత్ వారెన్ రాలేక పోయినందున వారి ప్రత్యేక సందేశాన్ని మహిళలకు చదివి వినిపించారు. మహిళా వాలంటీర్స్ అనిత రెడ్డి , సునీత నల్ల , మధు యానాల, శిల్ప శ్రీపురం, రజని తెన్నేటి , లక్ష్మి , సాహితి రొండ్ల లను మహిళా దినోత్సవ ప్రణాళిక, వక్తల ఏర్పాటు, కార్యక్రమ అమలు బ్రహ్మాండంగా జరిపారని మహిళలు కొనియాడారు ఈ కార్యక్రమాలలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదిక అలంకరణ ,సాంస్కృతిక కార్యక్రమాలు, విందు అందరినీ అలరించాయి. ఆటా రీజినల్ డైరెక్టర్ సోమ శేఖర్ రెడ్డి నల్ల, రీజినల్ కోఆర్డినేటర్స్ మల్లా రెడ్డి యానాల, లక్ష్మీనారాయణ రెడ్డి , మేఘనాథ్ రెడ్డి , చంద్రశేఖర్ రావు మంచికంటి కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ‘ఆటా’ మహిళలకు అండగా ఉంటూ ప్రోత్సహిస్తుందని, ‘ఆటా’ మహిళా దినోత్సవ కార్యక్రమం దిగ్విజయంగా జరగడానికి సహకరించిన, భాగస్వాములైన స్పాన్సర్స్‌, వాలంటీర్స్‌కు ఆటా బోర్డు మెంబర్లు రమేష్‌ నల్లవోలు, కృష్ణ ధ్యాప టీం సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

TATA Celebrates Womens Day in NJ


Telangana American Telugu Association (T.A.T.A) successfully organized Women’s day celebrations with families on Saturday March 16th, 2019 at Royal Albert’s Palace, NJ in a mini convention-like format. With only a short sprint to plan and execute, the event bustled with shopping booths, amazing music, and unique entertainment. More than 600 people participated, and by the end of the event, over 100 families became T.A.T.A.’s life members. T.A.T.A is also made big announcement on this occasion to partner with St. Peter’s team to do community services.

The event was planned and executed by NJ team under the guidance of Dr. Pailla Malla Reddy (AC-Chairman), Dr. Mohan Patalolla (AC-Member) and Vikram Jangam ( President).

The event was executed by Shiva Reddy Kolla (RVP), Kiran Duddagi (RVP), Deepthi Miryala (NJ Women Coordinator), Navya Reddy(NJ Women Coordinator) along with the other team members Srekanth Akkapalli ( BOD), Gangadhar Vuppala ( SC), Ram Mohan ( SC), Mahender Narala(SC), Naveen Kumar Yallamandla (RC),Narender Yarawa (RC),Gopi Vutkuri (RC),Vijay Bhasker (RC),Satish Jillela (RC) and Venu Sunkari (RC) under the leadership of Srinivas Ganagoni ( General Secretary). The event was sponsored by Mohan Patalolla (AC Member).

T.A.T.A leaders from New York Ranjeeth Kyatham (Treasurer), Sahodar Reddy (BOD), Pavan Ravva (Chair- Membership), Mallik Reddy( NY-RVP), Madhavi Soleti (Women’s Chair), and Rama Vanama(Cultural Co-Chair) and from PA, Suresh Venkannagari (Joint Treasurer), Prasad Kunnarapu (BOD), and Sudershan Chetukuri ( RC) participated in the event.

The event was started with the American, Indian national anthem and the Telangana anthem. Local talent came ready to showcase their voice through a medley of great songs and performed beautiful group dances. Special performances included ”Neti Mahila” dance medley and a skit on “Pulwama Attack” on our soldiers performed by kids. In addition, T.A.T.A was able to showcase the unique talent of Divya Chandrika Rayilla who enthralled the audience with her fusion medley on her Veena. A highlight of the event, was a beautifully executed fashion show, that was a great end to a great event with cake cutting celebrations.

Dr. Meena Murthy (Chief, Division of Endocrinology, Nutrition and Metabolism and Director, Saint Peter’s Thyroid and Diabetes Center), Srinivas Ganagoni (General Secretary), Dr. Mohan Pataolloa (AC Member), Gangadhar Vuppala (Chair, Community Services) jointly announced on this occasion that T.A.T.A is collaborating with Saint Peter’s Thyroid and Diabetes center & South Asian Institute (SAI) to do the following community services activities in the future.

Regular free risk assessment/screening at Saint Peter’s Department of Medicine
Free South Asian Open House for consistent support at Saint Peter’s Department of Medicine
Develop fast access for ambulatory medical care for adults at Saint Peter’s
Partner in marketing and supporting Saint Peter’s events at South Asian faith based and community events
Plan a comprehensive health fair for 2020

Another high-light is that many leaders from NATA, ATA,TANA, TFAS, TDF, VASAVI and Sai Dattapeetam are participated and supported the event.

The exotic event decoration is supported by Rainbow events LLC by Girija Madasi – 732 208 0401. The event is covered with both South and North Indian media.

Telangana American Telugu Association is formed to promote and perpetuate the culture and social conditions of Telangana and people of Telugu descent in general. “Telugu Kalala Thota Telangana Sevala Kota” being the first national organization for Telangana in North America, the organization will act as a beacon light to all Telangana organizations across the country for generations to come. For more details please visit www.telanganaus.org .

ATA Celebrates International Womens Day in DC


American Telugu Association (ATA) Washington DC chapter has conducted International Women’s Day event in Chinmaya Somnath facility, Chantilly, VA on Sunday March 10 with pomp and grandeur.

The event was organized by DC team, over 1000 people attended this event. ATA has been instrumental in community service and as part of IWD’s celebrations, in addition to having cultural programs, inspiring and motivating community leaders, exciting vendor and food stalls, this time the DC-team had come up with a panel discussion with elite panelists from legal, medical, social engagement and business areas to ignite a sense of awareness amongst women regarding Work-Life Balance, legal women rights and financial knowledge, Health & Family. As part of this Panel we also had head of ASHA for Women organization who explained about how they are helping women in our community who are going through domestic violence.

ATA Leadership have honored Kavita Challa, Indira Kumar and Avanthika Nakshtram who have significantly contributed to the community.

Congresswoman Jennifer Wexton was the chief guest of the evening and talked about women empowerment and thanked ATA for organizing such a great event.

ATA-DC chapter recognized all Sponsors. Organizers thanked all Raffle sponsors’ which made the evening very exciting. Leadership thanked all volunteers who all worked really hard for the past 6 weeks to put together this great event.


ATA-ICON Celebrates International Womens Day in Nashville


American Telugu Association (ATA) and Indian Community of Nashville (ICON) conducted International Women’s Day third time in Nashville, TN on March 9 th, 2019 at Vanderbilt University.

This wonderful event organized by Nashville Women’s by 15-member Women’s Committee lead by Radhika Reddy, Lavanya Reddy, Bindu Madhavi, Sirisha Kesa (ATA Women’s Coordinator) and many other women.

ATA Board of Trustees Jayanth Challa, Anil Bodireddy & Ramakrishna Reddy Ala and ATA Emergency services Chair Shiva Ramadugu attended this event. Also, ATA representatives from Nashville Susheel Chanda (Regional Coordinator), Srihan Nookala (Youth coordinator), Narender Reddy Nookala (Community Services Chair), Kishore Reddy Guduru (Education chair) attended this event.

Kavitha Challa, President, Telangana Development Forum (TDF) was the special guest for the event. More than 450 women from diversified Indian and Non-Indian communities from Nashville attended this event. Excellent inspirational speeches and performances by women.

Special speakers Radha Babu and Gabrielle Thompson from ‘Free for Life’ international organization shared about worldwide Human Trafficking and helping Women victims.

ATA recognized and felicitated Greeshma Binosh, Harika Kanagala Ma, Kiruthiga Vasudevan, Ms Shyamali Mukherjee, Rachana Kedia Agarwal and Dr. Arundati Ramesh (prominent women from Greater Nashville area) for their contributions towards Teaching Indian Regional languages and Community services.

It was a house full event with 100 performers and diversified cultural programs, lots of entertainment, DJ beats, shopping Mela and spicy Indian food from Bawarchi Biryani point, Nashville.

IWD women’s committee expressed their sincere thanks to ATA & ICON leadership, Guests, Sponsors, Exhibitors, Volunteers, and Vanderbilt University staff.


తెలుగు సంఘాల్లో మహిళల ప్రాధాన్యత ఏది?–TNI మహిళా దినోత్సవ ప్రత్యేకం

ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి పురుషులతో సమానంగా మహిళలు కూడా అమెరికా లాంటి ఇతర దేశాలకు వెళ్లి వారితో పోటీగా విద్యా, ఉద్యోగాల్లో వారితో సమానంగా రాణిస్తున్నారు. కానీ పెద్ద పెద్ద తెలుగు సంఘాల్లో మాత్రం మహిళల క్రీయాశీలక పాత్ర నామమాత్రంగానే ఉంటుంది. తానా, నాట్స్, ఆటా, నాటా వంటి తెలుగు సంస్థల కార్యవర్గ పదవుల్లో మహిళల పాత్ర మొక్కుబడిగానే ఉంటోంది. ఇటీవల అమెరికాలో పెద్ద తెలుగు సంఘంగా గుర్తింపు పొందిన తానా కార్యవర్గానికి ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగాయి. నలభై స్థానాలకు ఎన్నికలు జరగ్గా ఒక్క దేవినేని లక్ష్మీ మాత్రమే కీలకమైన పదవికి ఎన్నికయ్యారు. మహిళా కన్వీనర్ పదవికి మహిళే ఉండాలి కనుక ఆ పదవిని అదృష్టవశాత్తు మహిళలకే దయతలిచి వదిలేశారు. మిగిలిన అన్ని పదవులకు మగ మహారాజులే ఎన్నికయ్యారు. కొద్ది సంవత్సరాల క్రితమే ఆవిర్భవించిన టాటా లాంటి తెలుగు సంస్థకు ఒక మహిళ అధ్యక్షురాలిగా ఎన్నికైనప్పటికి ఆవిడ ఆ పదవి నుండి అర్ధాంతరంగా తప్పుకోవాల్సి వచ్చింది. ఇప్పటికైనా తెలుగు సంఘాల వారు మహిళలకు కార్యవర్గ పదవుల్లో ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చి వారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది.

డాలస్: “ఆటా” మహిళా దినోత్సవం

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని అమెరికా తెలుగు సంఘం (ఆటా) ఘనంగా నిర్వహించింది. డాలస్ లోని మినర్వా బంక్వేట్ లో జరిగిన మహిళా దినోత్సవ వేడుకలకు 300లకు పైగా మహిళలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. రీజనల్ కో ఆర్డినేటర్లు అశోక్ పొద్దుటూరి, మాధవి సుంకిరెడ్డి అతిధులను ఆహ్వానించగా.. మధుమతి వైష్యరాజు దీప ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం పుల్వామా ఉగ్రదాడి అమరాజవంలకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాల్లో దూసుకుపోతున్న వుమెన్ ప్రొఫెషనల్ డాక్టర్ సేజల్ మెహతా డా. శ్రీవిద్య శ్రీధర , సునీత చెరువు, శ్రీ తిన్ననూరులతో మాధవి సుంకిరెడ్డి ప్యానల్ డిస్కషన్ నిర్వహించారు. తమ విలువైన అనుభవాలు పంచుకున్నందుకు సలహాలు అందించినందుకు సుమన బీరం, శ్వేతా పొద్దుటూరి వీరికి ధన్యవాదాలు తెలిపారు.

రేపు నాటా మహిళా దినోత్సవం

ఉత్తర అమెరికా తెలుగు సమితి (నాటా) ఆద్వర్యంలో 8వ తేదీన న్యూజెర్సీ రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్ హాల్ లో మహిళా దినోత్సవం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

“ఆటా” ఆధ్వర్యంలో మహిళలకు స్వీయ రక్షణలో తర్ఫీదు

అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌(ఆటా-ATA), ఇండియన్‌ కమ్యూనిటీ నాష్విల్ (ICON) ఆధ్వర్యంలో ప్రతీ ఏటా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సారి ఈ వేడుకలో భాగంగా మహిళకు తైక్వాండోలో శిక్షణిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ శిక్షణలో 25మంది పాల్గొన్నారని, వారందరికి రచన అగర్వాల్‌ నేతృత్వంలో శిక్షణనిస్తున్నట్లు తెలిపారు. 2008 నుంచి తైక్వాండోలో నిపుణులైన రచన.. మహిళలు తమను తాము రక్షించుకునేందుకు వీలుగా ఉండేలా వారికి తర్ఫీదునిస్తున్నారు. ఈ ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మార్చి 9న జరుపనున్నట్లు కమిటీ హెడ్‌ రాధికా రెడ్డి తెలిపారు.

హింసిస్తున్నట్లుగా వస్తున్న వార్తల్లో వాస్తవం లేదు-ఆటా అధ్యక్షుడు పరమేష్

అమెరికాలో అరెస్టైన తెలుగు విద్యార్థులు అందరూ క్షేమంగా ఉన్నట్లు ‘అటా’ అధ్యక్షుడు పరమేశ్‌ భీంరెడ్డి తెలిపారు. భారతీయ ఎంబసీ అధికారులు, హోంల్యాండ్‌ సెక్రటరీ అధికారులను కలిసి విద్యార్థులకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నామని తెలిపారు. ఒకే సెల్‌లో పాతిక మందిని వరకు ఉంచిన మాట వాస్తవమైనప్పటికీ, వారిని హింసిస్తున్నట్లుగా వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. పోలీసు సిబ్బంది కూడా తమకు సహకరిస్తున్నారని ఆయన వెల్లడించారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఏదైనా అవసరం అయితే అటా హెల్ప్‌లైన్‌ నంబర్‌ 8442827382 ఫోన్‌ చేయాల్సిందిగా ఆయన కోరారు. అటా, ఇతర సంఘాల తరఫున వివిధ ప్రాంతాల్లోని డిటెన్షన్‌ కేంద్రాల్లో ఉన్న విద్యార్థులను కలిసినట్లు ఆయన వెల్లడించారు. అమెరికా ఇమ్మిగ్రేషన్‌ అధికారులు వల పన్ని, నకిలీ వర్సిటీని ఏర్పాటు చేసి విద్యార్థి వీసాలను దుర్వినియోగం చేస్తున్న 130 మంది విద్యార్థులతో పాటు ఎనిమిది మంది దళారులను బుధవారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అరెస్టయిన విద్యార్థుల్లో ఒక్కరు మినహా అందరూ భారతీయులే. అరెస్టు చేసిన వారిని విచారణ చేసిన అనంతరం స్వదేశానికి పంపిస్తారని, ఎవరూ ఆందోళన చెందకూడదని ‘అటా’ అధ్యక్షుడు తెలిపారు.

ఫార్మింగ్టన్ విద్యార్థులను ఆదుకోవాలని కాంగ్రెస్ సభ్యులను కలిసిన తెలుగు సంఘాల ప్రతినిధులు

అమెరికాలోని డెట్రాయిట్ లో తెలుగు విద్యార్ధుల అరెస్టులపై అమెరికాలోని తెలుగు సంఘాలు న్యూయార్క్ లో సమావేశమయ్యాయి. నాట్స్, తానా, ఆటా, నాటా, టాటా, టీఎల్ సీఏ సంఘాలు తెలుగు విద్యార్ధులకు అన్ని విధాల సాయం అందించేందుకు చేపట్టాల్సిన కార్యచరణపై చర్చించాయి. తొలిసారిగా తెలుగు సంఘాలన్నీ ఏకతాటిపైకి వచ్చి విద్యార్థులను విడిపించేందుకు చేయాల్సిన ప్రయత్నాలపై చర్చలు జరిపాయి. ముందుగా అందరూ కాంగ్రెస్ మెన్ థామస్ సుజీ ని కలిసి తెలుగు విద్యార్ధులను మానవతా దృక్ఫధంతో విడుదల చేయాలని కోరాయి. అవగాహన లేకపోవడంతోనే విద్యార్ధులు ఫార్మింగ్ టన్ యూనివర్సీటీ వలలో చిక్కుకున్నారని తెలిపాయి. తక్షణమే వారిని విడిపించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతి పత్రం ఇచ్చాయి. దీనిపై అటు కాంగ్రెస్ మెన్ థామస్ కూడా సానుకూలంగా స్పందించారు. భారత రాయబార కార్యాలయం అధికారులతో కూడా ఆయన మాట్లాడారు. తెలుగు అటార్నీలు ప్రశాంతి రెడ్డి, జొన్నలగొడ్డలతో కూడా ఈ విషయంలో ఎలా ముందుకెళ్లాలనే దానిపై చర్చించారు. అన్ని సంఘాలు ఇప్పటికే అక్కడ తెలుగు విద్యార్ధులకు మేమున్నామని ధైర్యం చెబుతున్నాయి. రాయబార కార్యాలయంతో పాటు అటార్నీలతో చర్చలు జరిపి వీలైనంత తర్వగా వారిని విడిపించే ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. నాట్స్ నుంచి డాక్టర్ మధు కొర్రపాటి, తానా నుంచి జై తాళ్లూరి, నాటా నుంచి స్టాన్లీ రెడ్డి, టాటా నుంచి పైళ్ల మల్లారెడ్డి, ఆటా నుంచి రాజేందర్ జిన్నా, టీఎల్ సీఏ నుంచి పూర్ణ అట్లూరి, వెంకటేష్ ముత్యాల, లాంగ్ ఐస్ ల్యాండ్ డెమోక్రటిక్ పార్టీ నాయకులు శేఖర్ నేలనూతల తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Voice raised unitedly by all Telugu associations and seek political help in releasing Telugu Students.

Leaders of NATS, TANA, ATA, NATA, TATA and TLCA went and met congressman Thomas Suozzi and presented a memorandum and requested to help in releasing the student victims of Farmington University that were arrested in the last few days. Congressman reacted very positively and assured to help in this situation. He spoke to Indian Consulate immediately and also attorneys Prashanthi Reddy and Srinivas Jonnalagadda. All the associations are closely working with the students, consulate and attorneys to help them get released as soon as possible.

Attended are
Dr Madhu Korrapati, NATS
Mr Jay Talluri, TANA
Dr Stanley Reddy, NATA
Dr Rajender Jinna, ATA
Dr Pailla Malla Reddy, NATA
Dr Purna Atluri, TLCA Chairman
Mr Venkatesh Mutyala, TLCA
And Shekar Nelanuthala, Long Island Democratic Party Leader

టాటా అధ్యక్షుడిగా జనగామ విక్రమ్

తెలంగాణ అమెరికా తెలుగు సంఘం(టాటా) నూతన అధ్యక్షునిగా విక్రమ్ రెడ్డి జనగామ నియమితులయ్యారు. లాస్‌వెగాస్‌లోని ఆరియా కన్వెన్షన్ సెంటర్‌లో డాక్టర్ పైళ్ల మల్లారెడ్డి అధ్యక్షతన జరిగిన బోర్డు మీటింగ్‌లో సుమారు 150 మంది సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. టాటా ప్రెసిడెంట్‌గా విక్రమ్ జనగామను అడ్వైజరీ కౌన్సిల్ ఎంపిక చేసింది. టాటా మాజీ అధ్యక్షులు డా. హరనాత్‌ పొలిచర్ల తన హయాంలో టాటా సాధించిన లక్ష్యాలను వివరించారు. టాటాకు హరనాథ్‌ అందించిన సేవలను టాటా సభ్యులు కొనియాడారు.

నాటా నూతన అధ్యక్షుడిగా గోశాల రాఘవరెడ్డి

న్యూజెర్సీలోని అట్లాంటిక్‌లో నార్త్‌ అమెరికా తెలుగు అసోసియేషన్‌(నాటా) బోర్డు సమావేశం జరిగింది. 2019-20 ఏడాదికిగానూ నూతన కార్యనిర్వాహక కమిటీని నియమించినట్టు నాటా ఓ ప్రకటనలో పేర్కొంది. గంగసాని రాజేశ్వర్ రెడ్డి అధ్యక్ష బాధ్యతలని కొత్తగా ఎంపికైన డా. రాఘవరెడ్డి గోసలకి అప్పగించారు. రెండేళ్లకోసారి జరిగే నాటా కన్వెన్షన్‌ని 2020లో అట్లాంటిక్‌ నగరంలో నిర్వహించాలని నిర్ణయించారు.

కార్యనిర్వాహక కమిటీ :
డాక్టర్ గోసల రాఘవ రెడ్డి(అధ్యక్షులు), కొర్సపాటి శ్రీధర్ రెడ్డి(కాబోయే అధ్యక్షులు), బాలా ఇందుర్తి(కార్యనిర్వహణ ఉపాధ్యక్షుడు), ఆళ్ళ రామిరెడ్డి(ప్రధాన కార్య నిర్వహణ అధికారి), గండ్ర నారాయణ రెడ్డి(కోశాధికారి), సోమవరపు శ్రీనివాసులు రెడ్డి (జాయింట్ సెక్రటరీ), శివ మేక (జాయింట్ ట్రెజరర్), గంగసాని రాజేశ్వర్ రెడ్డి (మాజీ అధ్యక్షులు), శ్రీనివాస రెడ్డి కొట్లూరు(కార్యనిర్వహణాధికారి), రమణ రెడ్డి క్రిస్టపాటి(అంతర్జాతీయ ఉపాధ్యక్షుడు), కోటి రెడ్డి బుర్ల (అంతర్జాతీయ ఉపాధ్యక్షుడు), శ్రీనివాస్ రెడ్డి కానుగంటి(అంతర్జాతీయ ఉపాధ్యక్షుడు), రమణ రెడ్డి క్రిస్టపాటి(అంతర్జాతీయ ఉపాధ్యక్షుడు) పెనుమాడ శ్రీకాంత్ రెడ్డి(కన్వెన్షన్ సలహాదారు)

అడ్వైజరీ కౌన్సిల్‌ :
డాక్టర్ ప్రేమ్ రెడ్డి (అడ్వైజరీ కౌన్సిల్ గౌరవ చైర్మన్), డాక్టర్ మోహన్ మల్లం (అడ్వైజరీ కౌన్సిల్ చైర్మన్), ఏ వీ ఎన్ రెడ్డి(అడ్వైజరీ కౌన్సిల్ సభ్యులు), డాక్టర్ స్టాన్లీ రెడ్డి(అడ్వైజరీ కౌన్సిల్ సభ్యులు), డాక్టర్ సంజీవ రెడ్డి(అడ్వైజరీ కౌన్సిల్ సభ్యులు), డాక్టర్ ఆదిశేషా రెడ్డి (అడ్వైజరీ కౌన్సిల్ సభ్యులు)

నాటా కన్వెన్షన్‌ 2020:
హరి వేల్కూర్(కన్వీనర్), మందపాటి శరత్ రెడ్డి(సమన్వయకర్త), అన్నా రెడ్డి(కన్వెన్షన్‌ జాతీయ కో ఆర్డినేటర్‌)

ఇండియా కో ఆర్డినేటర్లు :
డా. ద్వారకానాత రెడ్డి(ఇండియా కో ఆర్డినేటర్‌), రమా దేవి(తెలంగాణ), రఘునాథ రెడ్డి గజ్జల(ఆంధ్రప్రదేశ్‌), ఎమ్‌. దయాసాగర్‌ రెడ్డి(కర్నాటక), డీవీ కోటి రెడ్డి(మీడియా, పీఆర్‌)

ఆటా 2021-2023 అధ్యక్షుడిగా భువనేశ్ బుజాల

అట్టహాసంగా జరిగిన అమెరికన్ తెలుగుఅసోసియేషన్ నూతన అధ్యక్ష్య ఎన్నిక. అమెరికన్ తెలుగు అసోసియేషన్ బోర్డు మీటింగ్లాస్ వేగాస్ లోని వెనీషియా కాన్ఫరెన్స్ సెంటర్ లోఈ రోజు జరిగింది, మొదటగా ప్రస్తుత అట బోర్డుకరుణాకర్ ఆసిరెడ్డి కి కృతజ్ఞతలు తెలుపుతూ,నూతన అధ్యక్షుడు పరమేష్ రెడ్డి భీమిరెడ్డి స్వాగతం పలికారు, ప్రస్తుత ఆట అధ్యక్షులు కరుణాకర్ ఆసిరెడ్డి, పరమేష్ రెడ్డి భీమిరెడ్డి కి నూతన అధ్యక్షుడి 2021 – 2023 సంవత్సరానికి బాధ్యతలు అప్పచెప్పుతూప్రమాణ స్వీకారం చేయించారు. నూతన అధ్యక్షుడి బాధ్యతలు చేప్పట్టిన వెంటనేసాంప్రదాయపరంగా అట ప్రెసిడెంట్ ఎలెక్ట్ ఎన్నికకునామినేషన్స్ ఆహ్వానించారు, తద్వారా బోర్డుభువనేశ్ రెడ్డి బుజాల ను ఏకగ్రీవంగా 2021 – 2023సంవత్సరానికి ప్రెసిడెంట్ గ ఎన్నుకొన్నారు. పిదప నూత అధ్యక్షులు కొత్త ఎగ్జిక్యూటివ్ కమిటీ నిఎన్నుకోవడం జరిగింది, వారి పేర్లు వరుసగ
 
Secrectery –  Venu Sankineni
Joint Secretary – Sharath Vemula
Treasurer   – Ravi Patlolla
Jt Treasurer –  Aravind Mupplidi
+++++++++++++++++++
Executive Director – Kiran Pasham
 

“ఆటా” అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన పరమేష్ భీంరెడ్డి

అమెరికా తెలుగు సంఘం(ఆటా) అధ్యక్షుడిగా మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ప్రవాసుడు పరమేష్ భీంరెడ్డి పగ్గాలు చేపట్టారు. లాస్‌వేగాస్‌లో జరిగిన ఆటా కార్యవర్గ సమావేశంలో ఆయన బాధ్యతలు తీసుకున్నారు.

ATA conducted Income Tax Information Session at Atlanta


American Telugu Association (ATA) conducted Income Tax Information Session at Atlanta, Georgia, on Sunday, 13th January, 2019 because of the recent changes in Tax laws. The Income Tax Session elicited a good response with an attendance of over 60 participants. The Income Tax Session presented by Prabhakar Reddy CPA who is providing Tax Consulting Services in Atlanta since 2009. The session as covered changes in Tax Laws 2018, NRI Taxation, deductions and benefits you can claim and other topics related Tax filing. People of diverse immigrants from all over Atlanta participated in this session and got clarified with all the questions related to Tax filing. Participants had expressed their gratitude to ATA for organizing such a valuable session. As this is a Tax Returns file season it had helped all the participants What Income do they have to report? What deductions and benefits can claim and expect? What documents they need to file their Income Tax?. American Telugu Association (ATA) President Karunakar Asireddy along with Kiran Pasham, Anil Boddireddy and Venu Pisike thanked Prabhakar Reddy CPA. ATA regional Coordinators, Prashanth, P, Sriram S, Ganesh kasam,ATA Regional Director Tirumal Reddy, ATA Standing committee Chair’s and co chairs Ramana Reddy, Siva Kumar Ramadugu, Sridhar T,Umesh Muthyala,Udaya etooru, Subbarao maddali ,Suresh Volam and other ATA members volunteered this session. ATA team will be conducting many more of these information sessions which will be benefited by diverse communities. Snacks and Hot beverages were provided to all the participants by American Telugu association during the session.

ATA DC Chapter Feeds 2500 Homeless People

Today, the Washington D.C. chapter served in D.C.’s central kitchen by preparing meals for over 2,500 homeless families. It was a great gesture for the volunteers to show up on a rainy Saturday. We had a good turnout of 30+people, of which half were from the younger generation. Kudos to them for their great work! ATA is grateful to have the opportunity to give back to the community during the holiday season. This event was coordinated by our regional coordinators – Sudheer Bandaru, Rammohan Surineni, and Amar Bojja. Special shoutout to Sudheer Bandaru for pulling this together.

బోస్టన్‌లో “ఆటా” దసరా వేడుకలు

విజయదశమి పండుగను బోస్టన్‌లోని ఎన్నారైలు ఘనంగా జరుపుకున్నారు. అమెరికా తెలుగు అసోసియేషన్‌ (ఆటా) ఆధ్వర్యంలో దసరా వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకకు దాదాపు 250 మంది ప్రవాసాంధ్రులు హాజరైనట్టు పేర్కొన్నారు. బోస్టన్‌ లో నివసిస్తున్న తెలుగు వారు ఈ వేడుకను జమ్మిపూజతో మొదలుపెట్టారు. ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాలతో వేడుకలు ఆహ్లాదభరితంగా జరిగాయి. పసందైన విందు భోజనాలతో కార్యక్రమాన్ని ముగించారు. ఆటా సభ్యులైన రమేష్‌ నలవోలు, మల్లా రెడ్డి యనల, క్రిష్ణా ద్యాపా, సోమ శేఖర్‌ నల్లా​, చంద్ర మంచికంటి, శశికాంత్‌, దామోదర్‌, రవి, మధు, అనిత ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.