ఉగాండాలో హొలీ

ఉగాండా రాజధాని కంపాలాలో ఇండియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో..రాజస్థాన్ అసోసియేషన్ నిర్వహించిన హోలీ సంబరాలు ఘనంగా జరిగాయి. బాలీవుడ్ ప్లేబ్యాక్ సింగర్ శివంగి భయన హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. శివంగి తన పాటలతో హోరెత్తించారు. కంపాలలోని భారతీయులంతా ఒక్కచోట చేరి..హోలీ వేడుకలు జరుపుకున్నారు. చిన్నా పెద్దా అంతా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ..సంప్రదాయ పాటలకు నృత్యాలు చేస్తూ.. ఖండాంతరాల్లో మన దేశ సంస్కృతి, సంప్రదాయాలను చాటి చెప్పారు.

టాంటెక్స్ సాహిత్య సదస్సులో “తెలుగుతో నా పోరాటం”పై చర్చ

ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం(టాంటెక్స్) సాహిత్య వేదిక ఆధ్వర్యంలో “నెల నెలా తెలుగు వెన్నెల” 140వ సాహిత్య సదస్సును ఆదివారం, మార్చి 17న డాలస్ లో సాహిత్య వేదిక సమన్వయ కర్త శ్రీ కృష్ణారెడ్డి కోడూరు గారి ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ప్రవాసంలో నిరాటంకంగా 140 నెలలుగా సాహితీ వేత్తల నడుమ ఈ సదస్సులు నిర్వహించటం ఈ సంస్థ ప్రత్యేకత. ప్రవాస భారత సాంస్కృతిక రాజధాని డాలస్ లోని భాషాభిమానులు, సాహితీ ప్రియులు పెద్ద సంఖ్యలో తరలి వఛ్చి ఈ సమావేశాన్ని జయప్రదం చేశారు..ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా డాక్టర్ వేమూరి వెంకటేశ్వరరావుగారు విచ్చేశారు. ఈ కార్యక్రమాన్ని సాహిత్య ,సింధూ దేశభక్తి గేయంతో మొదలై ,డాక్టర్ నరసింహారెడ్డి గారి మన తెలుగు సిరిసంపదలు ధారావాహిక కార్యక్రమం తో పాటుగా లెనిన్ గారు ప్రముఖ సాహితీ వేత్త డా.తుమ్మలపల్లి వాణికుమారి గారి రచనలు ఊరు కొత్తబడింది,సాహితీ సౌజన్యం,ప్రాచీన కావ్యాలలో సాంస్కృతిక మూలాల పరిచయం,శ్రీ గారు రాఘవయ్య తప్పిపోయాడు అన్న అంశం మీద మాట్లాడిన తర్వాత ముఖ్య అతిధి డాక్టర్ వేమూరి వెంకటేశ్వర రావుగారు తెలుగుతో నా పోరాటం కథ అనే అంశం మీద మాట్లాడారు. ప్రొఫెసర్ వేమూరి గారు సైన్సు ని తెలుగులో, తెలుగును ఆధునిక అవసరాలకి సరిపోయే విధంగా తేలిక పరిస్తే బాగుంటుందని నమ్మి, జనరంజక శైలిలో రాయాలనే కుతూహలంతో తను రాసే రాతలలో మానవీయ విలువలు ప్రతిబింబించవు. హృదయానికి హత్తుకునే సంఘటనలు లేకపోవడమే కాదు కళ్ళని చెమ్మగిల్లించే కథనాలు అసలే ఉండవు కాని, సైన్సులో తనకి కావాల్సిన పదజాలాన్ని ఎలా సేకరించారో వివరించడమే కాకుండా ఆ పదజాలంతో వేమూరి నిఘంటువుకి ఎలా రూపకల్పన చేసారో కూడా వివరించారు. వేమూరి గారు నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ తో పాటు డాక్టర్ అబ్దుల్ కలాం గారితో కలిసి DRDL లో పనిచేసిన అనుభవంతో పాటు తను ఎన్నో విద్యా సంస్థలలో విశ్వవిద్యాలయాలలో పని చేసి లారెన్స్ లివర్మోర్ నేషనల్ లాబొరేటరీ సంస్థలో 2012 లో పదవీ విరమణ చేసారు. ‘జీవరహశ్యం’, ‘రసగంధాయ రసాయనం’, ‘నిత్య జీవితంలో రసాయనశాస్త్రం’, అమెరికా అనుభవాలు’, ‘విశ్వస్వరూపం’, ‘ధర్మసంస్థాపనార్థం’, ‘రామానుజన్ నుండి ఇటూ, అటూ’, ‘ఫెర్మా చివరి సిద్దాంతం’, ‘చుక్కల్లో చంద్రుడు: సుబ్రహ్మణ్య చంద్రశేఖర్ జీవిత చరిత్ర’, ’ ‘గుళిక రసాయనం (క్వాంటం కెమిస్ట్రీ ) ‘ , ఇలా ఎన్నో పుస్తకాలని రచించడమే కాకుండా పబ్లిక్ సర్వీస్ అవార్డ్, వంశీ పురస్కారం: త్రిపురనేని గోపీచంద్ అవార్డ్, వంగూరి ఫౌండేషన్ అఫ్ అమెరికా వారి జీవిత సాఫల్య పురస్కారం, 11 వ రాధికా సాహితీ అవార్డులను పొందారు. మూడు గంటలు గడిచిన తర్వాత కూడా అప్పుడే కార్యక్రమం ముగిసిందా అనిపిస్తూ, ఆహుతుల కరతాళ ధ్వనులతో కార్యక్రమం దిగ్విజయంగా ముగిసింది. సభికుల హర్షద్వానాల మధ్య ఉత్తర టెక్సస్ తెలుగుసంఘం (టాంటెక్స్) అధ్యక్షుడు శ్రీ చినసత్యం వీర్నపు , ఉత్తరాధ్యక్షుడు కోడూరు కృష్ణారెడ్డి, సతీష్ బండారు, శ్రీకాంత్ జొన్నల, ఇతర కార్యవర్గ సభ్యులు మరియు పాలక మండలి సభ్యులు చంద్ర కన్నెగంటి , పవన్ నెల్లుట్ల , సాహిత్య వేదిక కమిటి సభ్యులు స్వర్ణ అట్లూరి, శ్రీ బసాబత్తిన ,డాక్టర్ ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు. సాహిత్య వేదిక కమిటీ సభ్యులు ,ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం కార్యవర్గ సభ్యులు,పాలక మండలి సభ్యులు డాక్టర్ వేమూరి వెంకటేశ్వర రావుగారిని ,పుష్పగుచ్చాలు , జ్ఞాపిక , దుశ్శాలువాతో సన్మానించి ఘనంగా సత్కరించారు. సాహిత్య వేదిక సమన్వయకర్త కృష్ణారెడ్డి కోడూరు సాహిత్యం మీద ప్రేమ, మాతృభాష మీద మమకారంతో విచ్చేసిన భాషాభిమానులకు, సాహితీప్రియులకు కృతజ్ఞతలు తెలిపారు.

అమెరికాలో మరో తెలుగు సంఘం పుట్టిందిగా…!

అమెరికాలో మరొక తెలుగు సంఘం ఆవిర్భవించింది. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ఒక మహిళా నాయకత్వంలో ఈ తెలుగు సంఘం ఏర్పాటు కావటం విశేషం. కాలిఫోర్నియాకు చెందిన ప్రముఖ మహిళా పారిశ్రామికవేత్త ఝాన్సీరెడ్డి ఈ తెలుగు సంఘానికి శ్రీకారం చుట్టారు. ఊమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ (WETA) పేరుతొ ఈ తెలుగు సంఘాన్ని నెలకొల్పారు. ఝాన్సీ రెడ్డి గతంలో టాటా వ్యవస్థాపక సభ్యుల్లో ప్రముఖులుగా ఉన్నారు. ఆ సంఘం అద్యక్ష పదవి కూడా నిర్వహించారు. టాటాలో ఇమడలేక ఆ తెలుగు సంఘం నుండి బయటకు వచ్చేశారు. ప్రస్తుతం WETA పేరుతొ ఏర్పాటు చేసిన ఈ తెలుగు సంఘంలో మహిళలకే అత్యధిక ప్రాధాన్యత ఉంటుందనటంలో సందేహం లేదు. ఇది కేవలం ప్రవాస తెలుగు మహిళల కోసం ఏర్పాటు చేసిన సంఘంగా లోగోలో పేర్కొనటం మరో విశేషం.


తామా చదరంగ పోటీలు

తామా చదరంగ పోటీలు
తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా (తామా.) ఆద్వర్యంలో మార్చి 16వ తేదీన చదరంగం పోటీలు నిర్వహిస్తున్నారు. దీనికి సంబందించిన పూర్తీ వివరాలు ఈ దిగువ బ్రోచర్ లో పరిశీలించవచ్చు.

ఘనంగా టాంటెక్స్ 139వ సాహిత్య సదస్సు


ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం(టాంటెక్స్) సాహిత్య వేదిక ఆధ్వర్యంలో “నెల నెలా తెలుగు వెన్నెల” 139వసాహిత్య సదస్సును ఆదివారం, ఫిబ్రవరి 17న డాలస్ లో శ్రీ కృష్ణారెడ్డి కోడూరు గారి ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది.ప్రవాసంలో నిరాటంకంగా 139 నెలలుగా సాహితీ వేత్తల నడుమ ఈ సదస్సులు నిర్వహించటం ఈ సంస్థ ప్రత్యేకత. ప్రవాస భారత సాంస్కృతిక రాజధాని డాలస్ లోని భాషాభిమానులు, సాహితీ ప్రియులు పెద్ద సంఖ్యలో తరలి వఛ్చి ఈ సమావేశాన్ని జయప్రదం చేశారు. ముందుగా పుల్వామా ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన వీర సైనికుల ఆత్మశాంతికి రెండు నిమిషాల మౌనం పాటించి ఘన నివాళులు అర్పించారు. తరువాత డా. పుదూర్ జగదీశ్వరన్ గారు తన ‘ఆముక్త మాల్యద ‘ పరిచయపు ధారావాహికను , ఎన్ ఆర్ యు గారు తెలుగు సామెతలు నుడికారాల పరిచయపు ప్రహేళికను కొనసాగించారు. డా. ఇస్మాయిల్ పెనుగొండ గారు ఇటీవలే స్వర్గస్తులైన డా . హేమలత పుట్ల గారి జీవనయానాన్ని, రచనలను మరొక్క సారి గుర్తు చేస్తూ నివాళులు అర్పించారు. గీతాంజలి పేరుతొ రాస్తున్న ప్రముఖ రచయిత్రి డా . భారతి గారు మరియు లలితానంద్ ప్రసాద్ గారు స్వీయ కవితా గానాన్ని చేసారు. తదుపరి ముఖ్య అతిధి శ్రీ నారాయణ స్వామి వెంకట యోగి గారిని సభకు దయాకర్ మాడ గారు పరిచయం చేసారు. ముఫై ఏళ్ల సుదీర్ఘ సాహితీ ప్రస్థానం లో నిబద్దతతో వ్యవరిస్తూ పీడితుల పక్షాన, బాధితుల గొంతుగా మారి, తన అనుభవాల్ని, జ్ఞాపకాల్ని ‘సందూక’ లో పొందుపరిచి, తాను కన్న ‘కల్లోల కలల మేఘం ‘ ఉరుములు మెరుపులు కురిపిస్తూ ‘వానొస్తదా ?’ అని ప్రశ్నించే భావుకుడిగా అభివర్ణించారు. ఖండాలు దాటినా తన కవిసంగమపు కవిత్వ కరచాలనాన్ని మర్చిపోకుండా అక్షరీకరించి ‘నడిసొఛ్చిన తొవ్వ ‘ గా పదిలపరుచుకున్నాడు. రొట్ట మాకు రేవు వారి అవార్డు పొందిన ‘వానొస్తదా ?’ లోని కొన్ని కవితలను నసీం గారు సభకు చదివి వినిపించారు. తరువాత ప్రధాన వక్త శ్రీ నారాయణ స్వామి వెంకట యోగి గారు ‘తెలుగులో వర్తమాన కవిత్వం – కవిత్వ విమర్శ ‘ అంశం పై ప్రసంగిస్తూ ప్రబంధాల నుండి నేటి దాకా సాహిత్యం లో వచ్చిన మార్పులను సోదాహరణంగా వివరిస్తూ కర్రీ పాయింట్ లో పనిచేస్తూ ఒక కవి రాసిన కవితను చదివి విన్పించి వివరించారు. స్థానికతకు నేటి కవితలలో ప్రాధాన్యతను, సామాజిక మాధ్యమాలలో విరివిగా వెళ్లి విరుస్తున్న నూతన గొంతుకలను, వారి వినూత్న కవితా వస్తువులను సభకు పరిచయం చేసారు. అలాగే సద్విమర్శను తట్టుకోగలిగే స్తైర్యాన్ని కవులు కలిగి ఉండాలని, విమర్శకులు కూడా ముఖస్తుతి కి కాక వస్తు విమర్శ నిర్మొహమాటంగా చేయడం వలన ఇటు రచయితకి అటు సాహిత్యానికి మేలు జరుగుతుందని వక్కాణించారు. అయితే ఇది చెప్పినంత సులభం కాదని కొన్ని సందర్భాలలో ఇది వ్యక్తిగతం అయి సంబంధాలు క్షీణించే ప్రమాదమూ ఉందని చెప్పి నవ్వులు పూయించారు. 90 నిమిషాలు గడిచిన తర్వాత కూడా అప్పుడే కార్యక్రమం ముగిసిందా అనిపిస్తూ, ఆహుతుల కరతాళ ధ్వనులతో కార్యక్రమం దిగ్విజయంగా ముగిసింది. సభికుల హర్షద్వానాల మధ్య ఉత్తర టెక్సస్ తెలుగుసంఘం (టాంటెక్స్) అధ్యక్షుడు శ్రీ చినసత్యం వీర్నపు , ఉత్తరాధ్యక్షుడు కోడూరు కృష్ణారెడ్డి, కార్యదర్శి ఉమామహేష్ పార్నపల్లి, కోశాధికారి శరత్ యర్రం, సతీష్ బండారు, ఇతర కార్యవర్గ సభ్యులు మరియు పాలక మండలి సభ్యులు చంద్ర కన్నెగంటి ,సాహిత్య వేదిక కమిటి సభ్యులు శ్రీ నారాయణ స్వామి ని జ్ఞాపిక , దుశ్శాలువాతో సన్మానించి ఘనంగా సత్కరించారు. సాహిత్య వేదిక సమన్వయకర్త కృష్ణారెడ్డి కోడూరు సాహిత్యం మీద ప్రేమ, మాతృభాష మీద మమకారంతో విచ్చేసిన భాషాభిమానులకు, సాహితీప్రియులకు కృతజ్ఞతలు తెలిపారు.


పుల్వామా అమరజవాన్లకు టాంటెక్స్ నివాళి


టెక్సాస్ లో ఉన్న డాలస్ మహా నగరంలో ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం సభ్యులు,తెలుగు NRI లు అర్వింగ్ లో ఉన్న గాంధీ విగ్రహం దగ్గర దేశం కోసం వీరమరణం పొందిన జవాన్లకి క్యాండిల్ లైట్ విజిల్ తో ఆశ్రు నివాళి అర్పించారు. భారత దేశంలోని జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో పుల్వామాలో జవాన్ల పై జరిగిన తీవ్రవాద దాడిని దేశం మీద జరిగిన దాడి గా వర్ణించారు. తీవ్ర వాదం వల్ల అనేక దేశాలు ఇబ్బందులు పడుతున్నాయని ముఖ్యంగా భారత దేశం గత కొన్ని దశాబ్దాలుగా తీవ్రవాదం తో ఇబ్బంది పడుతోందని ప్రపంచ దేశాలు అన్ని కలిసి తీవ్రవాదం మీద పోరాడి తీవ్రవాదాన్ని కూకటి వేళ్ళతో సహా పెకలించివేయాలని ప్రపంచదేశాలకి విజ్ఞప్తి చేసారు. తీవ్రవాదాన్ని పాకిస్తాన్ దేశం పెంచిపోషిస్తోందని,అనేక తీవ్రవాద సంస్థలకి పాకిస్తాన్ స్వర్గధామంగా వెలసిల్లుతోందని తెలుగు NRI లు అభిప్రాయపడ్డారు. పాకిస్తాన్ సైతం ఈ తీవ్రవాదంతో అనేక ఇబ్బందులు పడటమే కాకుండా తన దేశంలో ఉన్న అమాయక ప్రజలను పొట్టనబెట్టుకుంటోదని,మిగిలిన దేశాల్లో సైతం తీవ్రవాద భావజాల వ్యాప్తికి ఆ దేశం సహకరించడమే కాకుండా తీవ్రవాదులకి అన్ని రకాలుగా సహాయపడుతూ దాడులకి వారిని ప్రోత్సహించడం దారుణమని ప్రపంచ దేశాలన్నీ కలిసి అలాంటి దేశాల మీద చర్యలు తీసుకోవాలని కోరారు.ఇలాంటి కష్ట సమయంలో భారత దేశంలో ఉన్న ప్రజలంతా తమ దేశపు సైన్యానికి,వీరమరణం పొందిన కుటుంబ సభ్యులకి మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేసారు. ఈ కార్యక్రమంలో ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం అధ్యక్షులు చినసత్యం వీర్నపు, ఉత్తరాధ్యక్షులు కృష్ణారెడ్డి కోడూరు,కార్యదర్శి ఉమా మహేష్ పార్నపల్లి ,కోశాధికారి శరత్ యర్రం,సంయుక్త కార్యదర్శి ప్రబంద్ రెడ్డి తోపుదుర్తి,పూర్వాధ్యక్షులు సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ,కార్యనిర్వాహక సభ్యులు సతీష్ బండారు,కల్యాణి తాడిమేటి,మనోహర్ కసగాని,ప్రభాకర్ రెడ్డి మెట్ట ,సుమేద్ తాడిమేటి,పివి రావు,డాక్టర్ ఇస్మాయిల్,నారాయణ స్వామి వెంకట యోగి,దయాకర్ మాడ, గాలి శ్రీనివాస్ రెడ్డి ,వెంకట్ రెడ్డి ,కిషోర్ నీలకంటం,ఉదయ్ నిడగంటి,శ్రవణ్ నిడగంటి,చంద్ర,శ్రీనివాస్ ,ఆదిత్య తదితరులు పాల్గొన్నారు .

చికాగోలో అంతర్జాతీయ పద్మశాలీయుల సదస్సు

నార్త్‌ అమెరికా పద్మశాలి అసోసియేషన్‌(నాపా) ఆధ్వర్యంలో చికాగోలోని బాలాజీ ఆలయంలో మార్కండేయ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకలతో పాటు కొత్తగా నాపా చికాగో చాప్టర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా చికాగో చాప్టర్‌ డైరక్టర్‌గా నియమితులైన రాజ్‌ ఆడ్డగట్ల మాట్లాడుతూ.. మార్కండేయ జయంతి వేడుకల్లో పాల్గొన్న నాపా సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. జయంతి వేడుకలు ఇంత ఘనంగా జరగడానికి సహాయపడిన ప్రతి ఒక్కరికీ పేరుపేరున ధన్యవాదాలు తెలిపారు. చికాగో చాప్టర్‌ ఆధ్వర్యంలో తొలి సారి జరుగుతున్న ఈ కార్యక్రమం ఇంత ఘనంగా జరిగినందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. కార్యక్రమం అనంతరం పసందైన వంటకాలతో అతిథులకు భోజన ఏర్పాట్లు చేశారు. అనంతరం రామారావును సభ్యులు ఘనంగా సత్కరించారు.

తామా గణతంత్ర వేడుకలు


అట్లాంటాలో తామా ఆధ్వర్యంలో ఘనంగా భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు

జనవరి 26న అట్లాంటా తెలుగు సంఘం ‘తామా’ ఆధ్వర్యంలో భారత 70వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మనబడి తెలుగు తరగతులు నిర్వహించే స్థానిక దేశానా మిడిల్ స్కూల్లో నిర్వహించిన ఈ వేడుకలకు సుమారు 300 మంది బాలబాలికలు మరియు 200 మంది పెద్దలు, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ముందుగా తామా అధ్యక్షులు వెంకీ గద్దె స్వాగతోపన్యాసం చేస్తూ గణతంత్ర దినోత్సవ ప్రాశస్త్యం గురించి వివరించారు. సిలికానాంధ్ర మనబడి ప్రతినిధి విజయ్ రావిళ్ల గారు మరియు ఉపాధ్యాయులకు తామా చైర్మన్ వినయ్ మద్దినేని పుష్పగుచ్ఛాలు అందజేశారు. మా తెలుగు తల్లికి మల్లెపూదండ వంటి దేశభక్తి గీతాలను శ్రద్ధగా ఆలపించారు. తదనంతరం విజయ్ రావిళ్ల గారు జండా వందనం గావించగా అందరూ జాతీయగీతం ఆలపించి భారతావనిపై తమకున్న గౌరవాన్ని తెలియజెప్పారు.

వాతావరణం చాలా చల్లగా వున్నప్పటికీ ప్రతి సంవత్సరం కంటే అత్యధికంగా 500 మందికి పైగా పాల్గొనడం విశేషం అంటూ అక్కడికి విచ్చేసిన అందరూ తామా కార్యవర్గాన్ని కొనియాడారు. ఇంతమంది తెలుగు వారు ఇలా మన జాతీయ పండుగను చేసుకోవటం హర్షణీయం అని ప్రశంసించారు. ఈ కార్యక్రమం భారత దేశంలో చిన్నప్పుడు తమ బడులలో జరిగినట్లు ఉందని, ఆ రోజులను తామా వారు తమకు గుర్తుచేసినందుకు మరియు తమ పిల్లలు ఇందులో భాగం కావటం పట్ల చాలా మంది పెద్దలు హర్షం వ్యక్తం చేశారు.

గణతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా పిల్లలకు గుడీ బాగ్స్ మరియు పెద్దలకు స్నాక్స్ అందించారు. చివరిగా స్నాక్స్ స్పాన్సర్ చేసిన అట్లాంటా ఫుడ్ డిస్ట్రిబ్యూటర్స్, వేడుకల నిర్వహణలో సహకరించిన తోటి తామా కార్యవర్గ సభ్యులు, బోర్డు సభ్యులు, మనబడి సమన్వయకర్తలు, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు మరియు ఈ కార్యక్రమాన్నిఅట్లాంటా చరిత్రలో కనీ వినీ ఎరుగని రీతిలో పాల్గొని విజయవంతం చేసిన ఆహుతులందరికి తామా అధ్యక్షులు వెంకీ గద్దె కృతజ్ఞతాభినందనలు తెలియజేసి ముగించారు.

దివిసీమ విద్యాసంస్థల విరాళాలతో కేరళలో నిర్మించిన గృహాలు ప్రారంభించిన మండలి


కేరళ రాష్ట్రంలో ఇటీవల సంభవించిన వరదల్లో నష్టపోయిన వారికి దివిసీమ విద్యాసంస్థల అందించిన విరాళాలతో నిర్మించిన గృహాలను ఏపీ ఉప-సభాపతి మండలి బుద్ధప్రసాద్ శనివారం నాడు ప్రారంభించారు. పాతాళం ప్రాంతంలో కొచ్చిన్ ఆంధ్రా సంఘం సహకారంతో అతి పేదవారి కోసం నిర్మించిన 16 గృహాలను ఆయన సందర్శించి మాట్లాడారు. వరద ప్రమాదం సంభవించినప్పుడు గతేడాది సెప్టెంబరులో దివిసీమ విద్యాసంస్థల నిర్వాహకులు కొండవీటి ఈశ్వరరావు, ఉమామహేశ్వరరావు తదితరులతో కలిసి తాము ఈ ప్రాంతాన్ని సందర్శించి చలించిపోయాయమ్ని, అందుకే కొచ్చిన్ ఆంధ్రా సంఘం నిర్వాహకులతో సమన్వయం అయి 16గృహాలను నిర్మించాలని సంకల్పించి ఆ దిశగా నూతన గృహాలను నిర్మించామని బుద్ధప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమానికి దివిసీమ విద్యాసంస్థల తరఫున ₹15లక్షలను ఆయన కొచ్చిన్ ఆంధ్రా సంఘం నిర్వాహకులకు అందజేశారు. విద్యార్థినీ విద్యార్థుల విరాళ నిధులు సద్వినియోగం అయినందుకు ఈ కార్యక్రమం తమకు ఎంతో తృప్తిని ఇచ్చిందని బుద్ధప్రసాద్ సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్లు రహీమ, జొసెఫ్ షెర్రీ, ST గ్రూపు ఉపాధ్యక్షుడు అజిత్ తదితరులు దివిసీమ విద్యార్థినీ విద్యార్థులకు తమ ధన్యవాదాలు తెలిపారు.


కోలాహలంగా కొచ్చిన్ ఆంధ్రా సంఘం డైమండ్ జూబ్లీ వేడుకలు


కొచ్చిన్ ఆంధ్రా సంఘం ఏర్పడి 60ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా శనివారం రాత్రి డైమండ్ జూబ్లీ వేడుకలను కొచ్చిన సీతారామ కళ్యాణ మండపంలో కోలాహలంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరయిన ఏపీ ఉప-సభాపతి మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో కన్నా విదేశాల్లో, పొరుగు రాష్ట్రాల్లోన్నూ నివసిస్తున్న ప్రవాస తెలుగువారు మన భాషా సంస్కృతులకు జీవం పోస్తున్నారని తెలిపారు. కొచ్చిన్ ఆంధ్రా సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలుగు భాష, సేవా కార్యక్రమాలు మిగిలిన తెలుగు సంఘాలకు ఆదర్శంగా నిలుస్తాయని, కేరళకు తుఫాను వచ్చిన సమయంలో కొచ్చిన్ ఆంధ్రా సంఘం బాధితులకు అందించిన సహకారం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని బుద్ధప్రసాద్ కొనియాడారు. ప్రముఖ సినీ గేయరచయిత చంద్రబోస్ మాట్లాడుతూ తాను ఇప్పటివరకు 3300 సినీగీతాలు రాశానని, వాటిలో చాలావరకు ప్రజల హృదయాల్లో నిలిచిపోయాయని తెలిపారు. కేరళ అన్నా ఇక్కడి ప్రకృతి అన్నా తనకు చాలా ఇష్టమని భగవంతుడు అనుగ్రహిస్తే కేరళలో ఒక గృహాన్ని నిర్మించుకుంటానని చంద్రబోస్ పేర్కొన్నారు. ఆయన రచించిన ప్రాచుర్యం పొందిన చాలా గీతాలను ఆలపించి కొచ్చిన్ తెలుగువారిని అలరించారు. తెలుగువారైన కొచ్చిన్ డీసీపీ, ఐపీఎస్ అధికారి రవీంద్రనాథ్, స్థానిక హిందూస్థాన్ న్యూస్‌ప్రింట్ ఎండీ గోపాలరావు, TNI డైరక్టర్ కిలారు ముద్దుకృష్ణ తదితరులు ప్రసంగించారు. కొచ్చిన్ ఆంధ్రా సంఘం అధ్యక్ష కార్యదర్శులు హరిహరనాయుడు, సంజయ్ తదితరులు సంస్థ కార్యకలాపాల గురించి వెల్లడించారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
టెన్నిస్సీ తెలుగు సమితి సంక్రాంతి వేడుకలు

అమెరికాలోని టెన్నెస్సీ తెలుగు సమితి ఆధ్వర్యంలో సంక్రాంతి, భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక విఘ్నేశ్వరుని గుడిలో దీప్తి రెడ్డి దొడ్ల అధ్యక్షతన టెన్నెస్సీ తెలుగు సమితి కార్యవర్గం నిర్వహణలో జరిగిన ఈ వేడుకల్లో 600 మందికి పైగా ప్రవాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత, అమెరికా జాతీయ గీతాలను ఆలపించారు. జ్యోతి ప్రజ్వలనతో మొదలైన వేడుకల్లో ముగ్గుల పోటీలలో భాగంగా తెలుగు ఆడపడుచులు పోటాపోటీగా వేసిన ముగ్గులు పల్లెటూరి వాతావరణాన్ని గుర్తుచేశాయి. బొమ్మల కొలువు, చిత్రలేఖనం, చర్చా వేదిక తదితర పోటీలలో పిల్లలు పాల్గొన్నారు. పిల్లలకు భోగిపళ్లు శాస్త్రోక్తంగా నిర్వహించడంతో ముసి ముసి నవ్వులతో కేరింతలు కొట్టారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆటల పోటీల విజేతలకు ట్రోపీలు, ముగ్గుల పోటీలు, బొమ్మల కొలువు వంటి వివిధ పోటీల విజేతలకు బహుమతులు, ముగ్గుల పోటీలలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి గుడీ బ్యాగ్స్ అందజేశారు. అలాగే కళా రంగానికి చేస్తున్న సేవలకు గాను మోనికా కూలేని సత్కరించారు. పాత కొత్త పాటలతో గాయకులు సందీప్ కూరపాటి, గాయని శృతి నండూరిలు ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ఇక స్థానిక సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా జానపద గీతాలు, శాస్త్రీయ సంగీతం, సినీ పాటలు, నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇండియా నుంచి తెప్పించిన సంక్రాంతి స్పెషల్ అరిసెలతోపాటు అమరావతి రెస్టారెంట్ వారు అందించిన పసందైన విందు భోజనాన్ని అందరూ ఆస్వాదించారు. అధ్యక్షులు దీప్తి రెడ్డి దొడ్ల మాట్లాడుతూ.. ఈ వేడుకల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రత్యేకించి యూత్ కమిటీ సభ్యులను టెన్నెస్సీ తెలుగు సమితి సేవా కార్యక్రమాలవైపు ప్రోత్సహిస్తున్న వారి తల్లితండ్రులను కొనియాడారు. అలాగే ఈ వేడుకల నిర్వహణలో సహాయం చేసిన టెన్నెస్సీ తెలుగు సమితి కార్యవర్గ సభ్యులు, ఆడియో సహకారం అందించిన డీజే శ్రీమంత్ బృందావనం, వీడియో, ఫోటోగ్రఫీ సేవలందించిన సందీప్ జానర్ తదితరులను అభినందించారు.

వైభవంగా టాంటెక్స్ సంక్రాంతి సంబరాలు


ముత్యాల ముగ్గులు.. రత్నాల గొబ్బిళ్లు.. భోగిమంటలు.. పిండి వంటలు.. కొత్త అల్లుళ్లు.. కోడిపందేలు.. సంక్రాంతి వచ్చిందంటేనే సంబరం ఎక్కడ లేని ఉత్సాహం. ఊరికి, దేశానికి దూరంగా అమెరికా లో ఉన్న తెలుగు వారికి వారికి ఈ పండగ అంటే ఇంకా మమకారం. వారు కూడా సంక్రాంతి పండుగను అంతే ఘనంగా జరుపుకొనేలా , అతిపెద్ద తెలుగు సంస్థలలో ఒకటైన టాంటెక్స్ వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొంటారు. తెలుగు వారి సాంస్కృతిక వారధి, మూడు దశాబ్దాలకి పైబడి వారి మనసులు చూరగొంటున్న టాంటెక్స్ వారు ప్రత్యేక శ్రద్ధ తో ఈసారి కూడా చక్కని కార్యక్రమాల సమాహారాన్ని సమర్పించింది. ఈ సందర్భంగా స్థానిక ఫ్రిస్కో హైస్కూల్ లో ఏర్పాటు చేసిన “సంక్రాంతి సంబరాలు” అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణంలో, చూడ ముచ్చటైన సాంస్కృతిక కార్యక్రమాలతో ఎంతో ఘనంగా నిర్వహించ బడ్డాయి. సంస్థ 2019 అధ్యక్షులు చినసత్యం వీర్నపు మరియు కార్యక్రమ సమన్వయకర్త ప్రబంధ్ రెడ్డి తోపుడుర్థి ఆధ్వర్యంలో, సాంస్కృతిక సమన్వయకర్త సమీర ఇల్లెందుల ఈ కార్యక్రమాలను నిర్వహించారు. సంక్రాంతి పండుగ వాతావరణాన్ని కళ్లకు కట్టినట్టు టాంటెక్స్ మహిళా కార్యవర్గ సభ్యులు సభా ప్రాంగణం అలంకరించారు. స్థానిక బావార్చి ఇండియన్ రెస్టారెంట్ వారు పండుగ భోజనం వడ్డించారు. సుమారు 150 మంది బాలబాలికలు ఉత్సాహంగా పాల్గొన్న ఈ కార్యక్రమం, అచ్చమైన తెలుగు వాతావరణాన్ని అణువణువునా ప్రతిబింబించే పాటలకు, తెలుగింటి ఆచారాలను, వాటిలోని విశిష్టతను ఎంతో ఆదరంగా చూపించే సంగీత, నృత్య అంశాలకు పెద్ద పీట వేసిందనటంలో ఏ మాత్రం సందేహం లేదు. చిన్నారులు ఆలపించిన అమెరికా జాతీయ గీతంతో కార్యక్రమం మొదలైనది. ప్రధాన వ్యాఖ్యాత సమీర ఆద్యతం నవ్వుల జల్లులు కురిపించారు. చిన్నారులు సాహితి, సింధూర, సమన్విత ఆలపించిన ‘పాడరా ఓ తెలుగు వాడా’ ఆహుతులని మంత్ర ముగ్దులని చేసింది. డేశభక్తి గీతాలు, సినిమా పాటల ప్రదర్శన, వినరో భాగ్యము విష్ణు కథ అంటూ సాగే సంప్రదాయక కూచిపూడి నృత్యాలతో కార్యక్రమాలు ముందుకు కొనసాగాయి. ‘రామ సీత మధుర క్షణాలు’ నృత్య నాటిక, తిల్లాన, శివ తాండవ నృత్యాలు ప్రేక్షకులను ఆకట్టుకొన్నాయి. టాంటెక్స్ తక్షణ పూర్వాధ్యకులు క్రిష్ణవేణి శీలం మాట్లాడుతూ, గత సంవత్సరం తనకు సహకరించిన కార్యవర్గ సభ్యులు, స్వచ్చంద కార్యకర్తలు అందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు. టాంటెక్స్ వారిద్వారా తెలుగు వారి సేవ చేసే భాగ్యం తనకు దక్కడం ఆదృష్టంగా భావిస్తునాను అన్నారు. నూతన అధ్యక్షుడికి, మరియు కార్యవర్గానికి స్వాగతం చెబుతూ తనవంతు సహాయ సహకారాలు ఎప్పటికి అందుబాటులో ఉంటాయన్నారు. తదుపరి, 2019 వ సంవత్సరానికి టాంటెక్స్ అధ్యక్షులు చినసత్యం వీర్నపు మాట్లాడుతూ ఉత్తర అమెరికా ఖండంలో తెలుగు సంగీత, సాహిత్య, సంస్కృతీ సంప్రదాయాలకు కేంద్ర బిందువుగా వ్యవహరిస్తూ, అన్ని జాతీయ సంస్థలకు ధీటుగా, గత 33 సంవత్సరాలుగా తెలుగు భాషా సంస్కృతుల పరిరక్షణ ముఖ్యోద్దేశ్యంగా, సేవలందిస్తున్న ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం నూతన అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. 2019 లో అందరి సహాయ సహకారాలతో వినూత్న కార్యకలాపాలతో తెలుగు పల్లకిని మోసుకెళ్ళడానికి మంచి ప్రణాళికతో రంగం సిద్ధం చేస్తున్నాను . టాంటెక్స్ సంస్థ కార్యక్రమాలు జయప్రదం కావడానికి సభ్యులు కూడా భాగస్వామ్యులై, అవసరమైన ఆర్ధిక సహాయం, ప్రోత్సాహక సూచనలు , కార్యక్రమాల హాజరు తదితర అంశాలతో చేయూతనివ్వాలని ఆకాంక్షిస్తున్నాను అని చెప్పారు. తదనంతరం 2019 నూతన పాలక మండలి, కార్యనిర్వాహక బృందాన్ని, సభకు పరిచయం చేశారు. ఈ సంక్రాంతి సంబరాలకి ప్రత్యేకంగా విచ్చేసి అందరిని ఎంతో ఆనందపరచిన ముఖ్య అతిథులు శ్రీకాంత్ సండుగు, శిల్పా రావ్ ని జ్ఞాపిక, దుశ్శాలువ, సన్మాని పాత్రా పుష్పగుచ్చాలతో సన్మానం చేయడం జరిగింది.2019 పోషక దాతల నందరిని కృష్ణారెడ్డి కోడూరు పరిచయం చేయగా చినసత్యం మరియు మిగతా కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక జ్ఞాపికలతో సన్మానించారు. “సంక్రాంతి సంబరాలు” కార్యక్రమ సమన్వయకర్త ప్రబంధ్ రెడ్డి తోపుడుర్థి, ఎంతో ఓపికగా నాలుగు గంటల వినోదాన్ని ఆస్వాదించిన ప్రేక్షకులకు, అతిథులకు, రుచికరమైన విందు భోజనం వడ్డించిన బావార్చి ఇండియన్ రెస్టారెంట్ యాజమాన్యంకు, మరియు నేటి కార్యక్రమ పోషకులకు కృతఙ్ఞతలు తెలియజేశారు. అటు పిమ్మట ఈ కార్యక్రమ ప్రసెంటింగ్ స్పాన్సర్స్ నితిన్ రెడ్డి శీలం,నాట్స్,ఇందిర అజయ్ రెడ్డి అండ్ ఫ్యామిలి ఈవెంట్ స్పాన్సర్స్ డా. ఉరిమిండి నరసిం హారెడ్డి,సుబ్రమణ్యం జొన్నలగడ్డ అండ్ ఫ్యామిలీ, మనోహర్ కసగాని, ఉమామహేష్ పార్నపల్లి అండ్ ఫ్యామిలీ, శరత్ రెడ్డి యర్రం, ప్లాటినం పోషక దాతలైన బావార్చి ఇండియన్ రెస్టారెంట్, ప్రసూనాస్ కిచెన్,క్వాంట్ స్విస్ టంస్,ఆల్బెర్ట్ సంతయ్య ఆఫ్ యెడ్వార్డ్ జోన్స్, విక్రం జంగం,డా. పవన్ పమడుర్తి,ప్రతాప్ భీమిరెడ్డి,శ్రీకాంత్ పోలవరపు మరియు గోల్డ్ పోషక దాతలైన పసంద్ రెస్టారెంట్, విష్ పాలెపు సి.పి.ఏ, మైటాక్స్ ఫైలర్ , మైటాక్స్ ఫైలర్,రాం కొనార,మెహతా జూలెర్స్,అడయార్ ఆనంద్ భవన్,బసేర ఇండియన్ రెస్టారెంట్,కిషొర్ చుక్కాల మరియు సిల్వర్ పోషక దాతలైన సిం-పర్వతనేని-బ్రౌన్ లా ఆఫీసెస్, మురళి వెన్నం,డా. సుమన కేత,డా.భాస్కర్ రెడ్డి సానికొమ్ము,పెంటా బిల్డర్స్ లకు ప్రత్యేక కృతఙ్ఞతలు తెలియ జేసారు. “గాన సుధ – మన టాంటెక్స్ రేడియో” ప్రసారం చేయడానికి సహకారం అందిస్తున్న ఫన్ ఏసీయా, ప్రత్యేక ప్రసారమాధ్యమాలైన టీవీ9, టీవీ5, 6టీవీ, ఏక్ నజర్, TNILive లకు కృతఙ్ఞతలు తెలియచేసారు.
ఎలాంటి లాభాపేక్షా లేకుండా తెరవెనుక నుండి సేవలందించిన కార్యకర్తలందరికీ తమ హృదయపూర్వక కృతఙ్ఞతాభివందనాలు తెలియజేసిన పిదప భారతీయ జాతీయ గీతం ఆలాపనతో, అత్యంత వైభవంగా జరిగిన సంక్రాంతి సంబరాలు ముగిసాయి.TPAD 2019 నూతన కార్యవర్గం ఇదే


డాలస్ తెలంగాణ ప్రజాసమితి (టీపాడ్) ఏప్రిల్, 2014లో స్థాపించబడి “ఇన్స్పిరేషన్ , ఇంటరాక్షన్ & ఇంక్లూషన్” అనే నినాదాన్ని అక్షర సత్యంగా అమలు పరుస్తూ అన్ని జాతీయ, స్థానిక సంస్థలతో, విభిన్న సామజిక సేవలలో తనదైన శైలితో ఆర్థికంగా, కార్య క్రమాల పరంగా అండదండని యిస్తూ ముందుకు సాగుతుంది. ప్రతీ ఏటా వేలాది డాలస్ నగర వాసులతో అతి పెద్ద బతుకమ్మ వేడుకలు మరియు అంబరాన్నంటే దసరా సంబరాలను జరుపుతూ పండగ ప్రత్యేకతను ప్రపంచానికి చాటి చెప్పిన ఘనతని కైవసం చేసుకుంది.శాస్త్రీయ నృత్యాలకి, సంగీత మాధుర్యాలకి పెద్ద పీట వేస్తూ, ఎంతో మంది స్థానిక కళాకారులతో పాటు మాతృభూమి కళాకారుల కి ప్రోత్సాహం యివ్వడములో అగ్రస్థానాన్ని పుణికి పుచ్చుకుంది. జానపద పాటలకి. కోలాటం ఆటలకి కొత్త కోణాల ప్రదర్శనలను ప్రోత్సహించి పల్లె అందాలను పశ్చిమ దేశాలకు పట్టుకొచ్చి పలువురిచే కీర్తించబడిన సంస్థ టీపాడ్. 2017 లో తెలంగాణా సంస్కృతి సంప్రదాయాలతో అతి వైభవంగా బతుకమ్మ వేడుకలను జరిపామని తెలంగాణ ప్రభుత్వముచే గుర్తించబడి మెప్పుపొందిన ఘనత టీపాడ్ కి దక్కడం గర్వ కారణం వేసవి లో వెచ్చని వనభోజనాలు పచ్చని వనంలో ప్రతీ ఏటా జరుపుతూ వేల కుటుంబాల సంబంధ బాంధవ్యాలఅమరికకు పెద్దరికాన్ని ప్రేమతో నిలబెట్టుకుంటుంది. ప్రతీ ఏటా రక్త దాన శిబిరాలు నిర్వహిస్తూ ప్రాణాధాత గా వ్యవహరిస్తోంది. యువతకి స్పూర్తినిస్తూ మాతృభూమిపై మమకారాలను పెంపొందిస్తూ, సేవా దృక్పథం కలిగిన నాయకులకి స్ఫూర్తిని కలుగజేసే “లీడర్ షిప్ స్కిల్స్ వర్కుషాప్స్”లాంటి ప్రోగ్రామ్స్ నిర్వహిస్తూ ముందుకు కొనసాగుతుంది. టీపాడ్ 2019 ఎన్నుకొనబడిన కొత్త కార్యవర్గ బృందం ప్రమాణస్వీకారాల సభ మినర్వా బాన్క్వెట్ హాల్ , ప్లేనో నగరములో నిర్వహించారు. డాలస్ ప్రాంతీయులు, అన్ని స్థానిక మరియు తెలుగు జాతీయ సంస్థల నాయకులు అధిక సంఖ్యలో అత్యంత ఆసక్తితో ఈ సమావేశానికి విచ్చేసారు. ముందుగా డాలస్ చిన్నారులు అవని సుంకిరెడ్డి, సిందూరి కోడూరి, నిగమా రెడ్డి కొండ ప్రార్థన మరియు అమెరికా, భారత దేశం జాతీయ గీతాలు ఆలపించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అటు తరువాత రఘువీర్ రెడ్డి బండారు(2018 ఫౌండేషన్ కమిటీ చైర్), శారద సింగిరెడ్డి (2018 బోర్డు అఫ్ ట్రస్టీ చైర్ 2018), శ్రీనివాస్ గంగాధర (2018 ప్రసిడెంట్) , ఇంద్రాణి పంచార్పుల (2018 ఎగ్జిక్యూటివ్ కమిటీ కోఆర్డినేటర్) సంయుక్తంగా 2018లో నిర్వహించిన కార్యక్రమాల విజయాన్ని సభకి తెలుపుతూ పనిచేసిన కార్యవర్గాన్ని ప్రశంసిస్తూ అభినందనలు తెలిపారు. తదనంతరము రఘువీర్ రెడ్డి బండారు జానకిరామ్ రెడ్డి మందాడి 2019 ఫౌండేషన్ కమిటీ చైర్ గా , రాజ వర్ధన్ రెడ్డి గొంది 2019 ఫౌండేషన్ కమిటీ వైస్ చైర్ గా, రామ్ రెడ్డి అన్నా డి ఫాండషన్ కమిటీ మెంబెర్ గా , అశోక్ రెడ్డి కొండల ఫౌండేషన్ కమిటి మెంబెర్ గా వారిచే ప్రమాణ స్వీకారాలను చేయించారు. శారద సింగిరెడ్డి గోలి బుచ్చి రెడ్డి బోర్డు అఫ్ ట్రస్టీ చైర్ మెంబెర్ గా, పవన్ గంగాధర 2019 బోర్డు అఫ్ ట్రస్టీ చైర్ గా , మాధవి సుంకిరెడ్డి 2019 బోర్డు అఫ్ ట్రస్టీ వైస్ చైర్ గా, సుధాకర్ రెడ్డి కలసాని 2019 ఎగ్జిక్యూటివ్ కమిటీ కోఆర్డినేటర్ గా వారిచే ప్రమాణ స్వీకారాలను చేయించారు. శ్రీనివాస్ గంగాధర చంద్రా రెడ్డి పోలీస్ 2019 ప్రెసిడెంట్ గా, రవికాంత్ రెడ్డి మామిడి 2019 వైస్ ప్రెసిడెంట్ గా , మాధవి రెడ్డి లోకిరెడ్డి 2019 జనరల్ సెక్రటరీ గా , లక్ష్మి పోరెడ్డి 2019 జాయింట్ సెక్రటరీ గా , అనురాధ మేకల 2019 ట్రెసరర్ గా , శంకర్ పరిమళ్ 2019 జాయింట్ ట్రేసరర్ గా, రత్న ఉప్పల ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబెర్ గా వారిచే ప్రమాణ స్వీకారాలను చేయించారు. టీపాడ్ ఫౌండేషన్ కమిటీ చైర్ జానకిరామ్ రెడ్డి మందాడి 2019 సంవత్సరములో కొనసాగే కార్య వర్గబృందం ఫౌండేషన్ కమిటీగా వ్యవహరిస్తున్న రాజవర్ధన్ రెడ్డి గొంది , అజయ్ రెడ్డి, మహేందర్ కామిరెడ్డి,రఘువీర్ రెడ్డి బండారు ,రావు కలవల , ఉపేందర్ తెలుగు, రామ్ రెడ్డి అన్నాడి , అశోక్ రెడ్డి కొండల లను, బోర్డు అఫ్ ట్రస్టీ కమిటీగా వ్యవహరిస్తున్న పవన్ కుమార్ గంగాధర,మాధవి సుంకిరెడ్డి , సుధాకర్ కలసాని, బుచ్చిరెడ్డి గోలి, ఇంద్రాణి పంచార్పుల,శారద సింగిరెడ్డి లను, ఎగ్జిక్యూటివ్ కమిటీగా వ్యవహరిస్తున్న చంద్రా రెడ్డి పోలీస్,శ్రీనివాస్ గంగాధర,రవికాంత్ రెడ్డి మామిడి,మాధవి లోకిరెడ్డి, లక్ష్మి పోరెడ్డి, అనురాధ మేకల, శంకర్ పరిమళ్, దీప్తి సూర్యదేవర,లింగా రెడ్డి అల్వా, మధుమతి వ్యాసరాజు, రత్న ఉప్పల, రోజా అడెపు,రూప కన్నెయ్యగారి,శరత్ ఎర్రం, శ్రీనివాస్ వేముల లను అడ్వైసరి కమిటీగా వ్యవహరిస్తున్న అరవింద్ రెడ్డి ముప్పిడి, గంగా దేవర, జయ తెలకల పల్లి,కరణ్ పోరెడ్డి,నరేష్ సుంకిరెడ్డి,రమణ లష్కర్,సంతోష్ కోరె, సతీష్ నాగిళ్ల , సురేందర్ చింతల,వేణు భాగ్యనగర్,విక్రమ్ రెడ్డి జంగం,కళ్యాణి తాడిమేటి లను, కొలాబరేషన్ కమిటీగా వ్యవహరిస్తున్న అనూష వనం,అపర్ణ కొల్లూరి, అపర్ణ సింగిరెడ్డి,ధన లక్ష్మి రావుల,గాయత్రి గిరి,జయశ్రీ మురుకుట్ల,కవిత బ్రహ్మదేవర,మాధవి మెంట,మాధవి ఓంకార్, మంజుల తొడుపునూరి,నితిన్ చంద్ర, రవీంద్ర ధూళిపాళ, శశి రెడ్డి కర్రి,శరత్ పు న్ రెడ్డి, శ్రవణ్ నిధిగంటి , శ్రీధర్ కంచర్ల,శ్రీకాంత్ రౌతు,శ్రీనివాస్ అన్నమనేని,శ్రీనివాస్ కూటికంటి,శ్రీనివాస్ తుల,స్వప్న తుమ్మపాల, తిలక్ వన్నంపుల, వంశి కృష్ణ, వందన గౌరు లను వేదిక పైకి ఆహ్వానించి అభినందనలు తెలియచేసారు. కార్యక్రమములో చివరిగా ఫౌండేషన్ కమిటి బృందం అజయ్ రెడ్డి, రఘువీర్ రెడ్డి బండారు, రావు కలవల, జానకిరామ్ రెడ్డి మందాడి, రామ్ రెడ్డి అన్నాడి, అశోక్ రెడ్డి కొండల “తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్” సంస్థ ప్రెసిడెంట్ (2019-2020) గా ఎన్నికైన విక్రమ్ రెడ్డి జంగం మరియు “నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్” ప్రెసిడెంట్ (2021-2022) ) గా ఎన్నికైన శ్రీధర్ రెడ్డి కొరసపాటిని పుష్పగుచ్ఛాలతో సత్కరించి, శాలువాతో సన్మానించి తెలుగు సంస్థలకు వారిరువురు చేస్తున్నటువంటి సేవలను కొనియాడారు. బోర్డు అఫ్ ట్రస్టీ వైస్ చైర్ మాధవి సుంకిరెడ్డి, ఎగ్జిక్యూటివ్ కమిటీ కోఆర్డినేటర్ సుధాకర్ కలసాని కార్యక్రమానికి వొచ్చిన అతిథులందరికి, ప్రసార మాధ్యమాలు మీడియా టీవీ 9, వీ6 వారికి మరియు బసేరా ఇండియన్ రెస్టారెంట్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.
tpad 2019

కియా తొలికారు విడుదల పట్ల సింగపూర్ తెదేపా హర్షం

అనంతపురం జిల్లాలో కియా కార్ల పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిరంతర సహాయ సహకారాలతో 2016లో ప్లాంట్ మొదలుపెట్టి ఈరోజు మొదటి వాహనం ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడుచే ప్రారంభించబడిన సందర్భంగా ఎన్నారై తెదేపా సింగపూర్ ఆధ్వర్యంలో వేడుక నిర్వహించారు. కేక్ కట్ చేసి ఘనంగా సంబరాలు జరుపుకున్నారు.

“టాకో” ఆధ్వర్యంలో గణతంత్ర వేడుకలు


Telugu Association Of Central Ohio (TACO), a non-profit organization, organized Sankranthi Sambaralu and Republic day celebrations on January 26th 2019 at the Westerville North High School in Westerville Ohio. The event started at 1:00 PM local time and completed at 9:15 PM local time with approximately 300 participants who performed a variety of programs such as Classical dances, Mass Movie dances, Comedy skits, Dubsmash Contest, Republic day dance, Movie song Singing, Fashion show, Art gallery etc..
Ohio State House representative Mr. Niraj Antani attended the event as a chief guest and participated in the Republic day celebrations.
TACO 2019 Executive Committee President Phani Bhushan Potluri thanked all the volunteers, sponsors and participants for their hard work and support towards the organization and making the event a grand success. TACO 2019 cultural team lead by Veena Kamisetty worked very hard to design a variety of quality and entertaining programs with a lot of local talented participants and made sure the programs were started and completed on time. Sankranthi festival theme song presented by the TACO cultural team showed the values of “Ummadi Kutumbam” (Joint Family) and the prominence of the Sankranthi festival.
Butterfly Event Planners lead by Sandhya Kanaka, decorated the entire venue with traditional and contemporary decoration styles and was one of the many highlights of the event.
Food committee lead by Shyam Gadde worked with Haveli Bistro, a local restaurant, and served delicious food to the guests with a wide variety of authentic south Indian food items. Over 200 volunteers and committee members helped throughout the day and were part of this successful event.
tACO charity coordinators SriVarshini Mudhuluru and Subhashini Sadanala organized multiple charity drives at the event. A food drive in collaboration with North America Telugu Society (NATS) benefiting the Mid Ohio Food Bank, A Winter Coat drive benefiting Homeless shelter Needs Faith Mission. TACO also worked with a group of local volunteers who setup a food stall at the event benefiting Ekam Foundation.
President of the Organization Phani Bhushan Potluri and Vice President of Administration Srinivas Paruchuri introduced 2020 President Elect Jagannath Chalasani to the community. 2019 Executive committee recognized the 2018 Executive committee, 2018 outgoing trustees & working committees for their hard work and dedication towards the organization and also introduced the new trustees (2019 & 2020) and working committees (2019, 2020 & 2021).
2019 Executive committee:
President of the Executive Committee: Phani Bhushan Potluri
Admin Team: Jagannath Chalasani (President Elect), Srinivas Paruchuri (Vice President Administration), Swamy Kavali (Treasurer), Harsha Kamineni (Pubic Relations), Harika Kommuri (Executive Secretary), Sudhir Kanagala (Joint Secretary)
Cultural Team: Veena Kamisetty (Vice President Cultural), Saritha Nandimalla (Cultural Coordinator), Swetha Priyanka Addaganti (Cultural Coordinator), Rachana Bukka (Cultural Coordinator), Vijay Mallela (Cultural Coordinator), Siddartha Revur (Cultural Event Coordinator), Pradeep Kumar Chandanam (Cultural Event Coordinator), Supriya Thota (Cultural Event Coordinator), Sandhya Kanaka (Cultural Event Coordinator)
Communications Team: Vijay Kakarla (Vice President Communications), Venu Abburi (Web Coordinator)
Food Team: Shyam Gadde (Vice President Events), Raj Vantipalli (Food Coordinator), Pratap Kanteti (Food Coordinator)
Sports Team: Siva Chava (Vice President Sports), Pradeep Guntaka (Sports Coordinator)
Charity Event Coordinators: SriVarshini Mudhuluru, Subhashini Sadanala
uth Coordinators: Rithvik Potluri, Thulasi Vuligadla, Sahith Buddala, Ashika Kamisetty, Anvita Dandu, Sraavya Potluri
2019 Board Of Trustees
Srilatha Revur (Chairperson), Koteshwara Bodipudi, Prasad Kandru, Ramesh Kolli, Srikanth Munagala
సింగపూర్‌లో తాడేపల్లిగూడెం బుర్రకథ

సింగపూర్‌ తెలుగు సమాజం వారి ఆధ్వర్యంలో స్థానిక గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ స్మార్ట్‌ క్యాంపస్‌లో నిర్వహించిన సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. తెలుగువారి భాష, సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించడమే ధ్యేయంగా పనిచేస్తున్న సింగపూర్‌ తెలుగు సమాజం ఈ కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించింది. బొంగరాలు, గోలీలు, గాలిపటాలు, రంగవల్లుల పోటీలు, క్రీడా పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. హరిదాసు, సోది, పిట్టలదొర ప్రత్యేక ఆకర్షణగా నిలిచి తెలుగు వారందరినీ అలరించారు. అనంతరం ఆంధ్రప్రదేశ్‌ తాడేపల్లిగూడెం యడవల్లి శ్రీదేవి బుర్రకథా బృందం వారు చెప్పిన బుర్రకథ అత్యంత ఆదరణ పొందింది. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. సంబరాల్లో భాగంగా ఏర్పాటు చేసిన తెలుగు బుట్టబొమ్మల కొలువు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంతరం సింగపూర్‌ కాలమానంలో ప్రచురించిన సింగపూర్‌ తెలుగు 2019 క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. సింగపూర్‌లో తొలిసారిగా మన రేడియో వారి భాగస్వామ్యంతో తెలుగు వారికి ప్రత్యేకంగా ఎస్‌టీఎస్‌ మన రేడియోని ప్రారంభించారు. సంక్రాంతి తెలుగు పిండివంటలు, వంటకాలు సింగపూర్‌ వాసులను విశేషంగా ఆకట్టుకున్నాయి. భోగి పండగ సందర్భంగా సుమారు వెయ్యి మందికి రేగిపండ్ల ప్యాకెట్లను ఉచితంగా పంపిణీ చేసినట్లు నిర్వాకులు నాగేష్‌ టేకూరి తెలిపారు. కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన వారందరికీ సింగపూర్‌ తెలుగు సమాజం కార్యదర్శి సత్యచిర్ల కృతజ్ఞతలు తెలిపారు.

కొచ్చిన్ తెలుగు సంఘానికి 60 ఏళ్లు.2న ఉత్సవాలు.

కేరళ రాష్ట్రంలోని కొచ్చిన్ లో తెలుగు కల్చరల్ అసోసియేషన్ పేరుతొ మన తెలుగు వారు 1958లో ఒక సంస్థను ఏర్పాటు చేసుకున్నారు. ఈ సంస్థ కోసం 1992లో ఎనిమిది సెంట్లు స్థలాన్ని కొనుగోలు చేసి ఒక భవనాన్ని నిర్మించారు. మొదటి అంతస్తులో ఆంధ్ర కళా నిలయం పేరుతొ 2003లో ఒక ఆడిటోరియం ను కూడా నిర్మించారు. 2008లో కొచ్చిన్ తెలుగు సంఘం ఏర్పడి యాభై ఏళ్ళయిన సందర్భంగా పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహించారు. ఈ సంస్థ ఆద్వర్యంలో అన్ని తెలుగు పండగలకు పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం కొచ్చిన్ లోని ఆంధ్రా కల్చరల్ అసోసియేషన్ ఏర్పడి అరవై సంవత్సరాలు అయిన సందర్భంగా వచ్చే 2వ తేదీన పెద్ద ఎత్తున డైమాండ్ జుబ్లీ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ అద్యక్ష, కార్యదర్శులు ఎస్. సంజయ్, ఎం. హరిహరనాయుడు తెలిపారు. ఈ ఉత్సవాలను ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యుటీ స్పీకర్ మండలి బుద్దప్రసాద్ ప్రారంభిస్తారు. సినీ గేయ రచయిత చంద్రబోస్ ముఖ్య అతిధిగా హాజరవుతున్నారు. కేరళ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శేషాద్రినాయుడు, కొచ్చిన్ డీసీపీ హిమేంద్రనాద్, అలెప్పి సబ్ కలెక్టర్ కృష్ణతేజ, కోచ్చిన్ పోర్ట్ ట్రస్ట్ డిప్యుటీ చైర్మన్ వెంకటరమణ తదితరులను ఈ సందర్భంగా సన్మానిస్తున్నారు. అనంతరం సాంస్కృతిక ఉత్సవాలు ఏర్పాటు చేసారు.హాంకాంగ్ ప్రవాసుల సంక్రాంతి వేడుకలు

‘ది హాంకాంగ్‌ తెలుగు సమాఖ్య’ ఆధ్వర్యంలో సంక్రాతి పండుగ ఘనంగా జరిగింది. ‘బుజ్జాయిలతో భోగి’ ఉత్సవం కన్నుల పండువగా సాగింది. ఈ కార్యక్రమాన్ని సమాఖ్య వ్యవస్థాపకురాలు జయ పీసపాటి ప్రారంభించి, పిల్లలని ఆశీర్వదించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ..‘తెలుగు లోగిళ్లలోని పిల్లలకు ఇలా భోగి పళ్లు పోయడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం కోసం తెలుగు సమాఖ్య సభ్యులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. హాంగ్‌కాంగ్‌లో పుట్టి పెరిగిన పిల్లలు తెలుగు చక్కగా మాట్లాడుతున్నారు’ అని తెలిపారు. అనంతరం పిల్లలు నటించిన నాటికలు ‘తెనాలి రామలింగడు-వంకాయ కూర’, ‘భక్త ప్రహ్లాదుడు’ నాటికలు అలరించాయి. ఫిబ్రవరిలో సామూహిక సత్యనారాయణ వ్రతం నిర్వహించనున్నామని జయ ఈ సందర్భంగా తెలిపారు.

ఘనంగా లాటా సంక్రాంతి

శనివారం జనవరి 19, 2019, లాస్‌ ఏంజిల్స్‌ మహా నగరం లో లాటా వారు నిర్వహించిన సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుపబడివని. నగరం నలుమూలల నుండి విచ్చేసిన తెలుగు వారికి చిన్న నాటి సంక్రాంతి తీపి గురుతులు జ్ఞాపకం వచ్చే విధంగా, ఉత్సావ వాతావరణం లో జరుపుకోవటం జరిగింది. ఇండియా నుండి వచ్చిన పెద్దవారు ఇక్కడ మనం ఇంత చక్కగా తెలుగు సంస్కృతిని కాపాడుకోవటం చూసి అబ్బురపడ్డారు. దాదాపు 2800 మంది పాల్గొన్న ఈ వేడుకల్లో, 345 మంది పిల్లలు, పెద్ద వాళ్ళు ప్రదర్శనలు చేశారు. దాదాపు 160 మంది స్వచ్ఛంద సేవకులు పనిచేసి పెద్ద పండుగ వాతావరణం తీసుకువచ్చారు. సంబరాలు మధ్యాహన్నం పంక్తి భోజనం తో మొదలయ్యి, రాత్రి 10 గంటల వరకు జరిగినవి. ముందుగా శారద నందూరి బయట వేదికకు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. లాటా వాలంటీర్స్‌ చేసిన చెక్క భజనలు, కోలాటాలు బయటి ప్రాంగణాన్ని హోరెతించాయి. సతీష్‌ నందూరి సంప్రదాయ దుస్తుల పోటీలలో విశేషంగా 130 మంది పాల్గొని అతిధులను ఆట్టుకున్నారు. ఉచిత ఇమ్మిగ్రేషన్‌ కేంద్రం, ఆరోగ్య పరీక్షా కేంద్రం, వివిధ బట్టలు మరియు నగలు స్టాల్ల్స్‌, తిరునాళ్ళను గుర్తు తెచ్చే పిల్లల ఆటలు, గోరింటాకు, పేస్‌-పెయింటింగ్‌ మొదలగు కార్యక్రమాలు అందరిని విశేషంగా ఆకట్టుకున్నాయి. లాటా మహిళా వాలంటీర్స్‌ రంగురంగులతో అద్భుతముగా చక్కదిద్దిన మీడియా పాయింట్‌ ముందు వచ్చిన అతిథులు కుటుంబ సమేతముగా ఫోటోస్‌ తీసుకున్నారు. అమెరికాలో మొట్టమొదటి సారి పులి వేషం వేసి లాటా వారు ఔరా అనిపించారు. దానికి కోలాటం, డప్పు ప్రదర్శనలు తోడు అవ్వటంతో సాంక్రాంతి మేళ హోరందుకుంది. సాయంత్రం భజనల తర్వాత, శ్రీమతి రాధా శర్మ, శ్రీ విఎస్‌ఎన్‌ శర్మ దంపతులు జ్యోతి ప్రజ్వలనతో ఆడిటోరియం లోపలి ప్రదర్శనలని ప్రారంభించారు. శ్రీమతి శ్వేతా కాకరాల, చక్కటి విద్యార్థునిలతో కలసి వ్యాఖ్యాతలుగా వ్యవహరించటం అలరించింది. పిల్లలు, పెద్దలు అని లేకుండా నెలలు తరబడి కృషితో అధ్యయనం చేసిన నృత్యాలని, పాటలని, నాటకాలని అత్యద్భుతంగా ప్రదర్శించి అందరికి కనుల పండుగ చేసారు. సంక్రాంతి సందర్భముగా లాటా వారు ఆరు చోట్ల ముగ్గులు, వంటల పోటీలని నిర్వహించారు. వాటికి బహుమతులు ప్రఖ్యాత సినిమా హీరోయిన్‌ లయ గారు అందించారు. వచ్చిన అతిథులు ఇలా స్థానికులకు పెద్ద పీట వేసినందుకు లాటా వారికి కృతజ్ఞతలను తెలిపారు. గత ఐదు సంత్సరాలుగా వందలాది పిల్లలకు నృత్యం నేర్పించి, లాటా కార్యక్రమాలకి స్వచ్ఛంద సేవ చేసిన నవీన్‌ కాంత్‌ భాయి కి లాటా ఎగ్జిక్యూటివ్‌ కమిటీ జ్ఞాపిక ఇచ్చి సత్కరించారు. మధ్యాహ్నం భోజనాలు అందించిన ణశీఝ ూశ్రీaషవ, ుబర్‌ఱఅ వారికి, సాయంత్రం భోజనాలు అందించిన +శీసaఙaతీఱ =వర్‌aబతీaఅ్‌ వారికి, సంపూర్ణ సంక్రాంతి భోజనం అందించినందుకు లాటా మనసారా ధన్యవాదాలు తెలిపారు. నిరంతరము కృషిచేస్తున్న వాలంటీర్స్‌ లేకుండా ఇలాంటి కార్యక్రమాలు చెయ్యటం వీలుపడదు అని, వారికి కృతజ్ఞతలు తెలిపారు. వచ్చిన అతిధులకి, ప్రదర్శనలు ఇచ్చిన వారికి, వారి తల్లిదండ్రులకి, దాతలకు, అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. సంక్రాంతి సంబరాలు బారతదేశము మరియు అమెరికా జాతీయ గీతాలతో ముగిసినవి.

ఆస్ట్రేలియాలో నవ్యంధ్ర తెలుగు సంఘం సంక్రాంతి వేడుకలు


వైభవంగా శాక్రిమెంటో తెలుగు సంఘం 15వ వార్షికోత్సవం


శాక్రమెంటో తెలుగు సంఘం 15 వ వార్షికోత్సవం మరియు సంక్రాంతి 2019 సంబరాలు. కాలిఫోర్నియా రాష్ట్రం లో ఉన్న శాక్రమెంటో తెలుగు సంఘం (టాగ్స్) 15 వ వార్షికోత్సవం మరియు సంక్రాంతి సంబరాలసందర్భం గా “మనం” సంస్థ సహకారంతో రూపుదిద్దిన “రంగస్థలం” నాటకం ఆహుతులను విశేషం గా ఆకట్టుకొన్నది. రంగవల్లులు,సంక్రాంతి జట్కా బండి, పాలవెల్లి సెట్టింగ్, మరియు 450 కు పైగా ఉన్నకళాకారులు చేసిన సందడితో సంక్రాంతి వేడుకల ప్రాంగణం లోఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది. స్థానిక ఫోల్సోం నగరం లోఉన్న ఫాల్సం హై స్కూల్ ధియేటర్ లో శనివారం జనవరి 19 వతేది 2019 మధ్యాన్నం 12 గం కు మొదలైన సంక్రాంతి సంబరాలు రాత్రి 11 గం వరకు కొనసాగాయి.

శాక్రమెంటో తెలుగు సంఘం సంక్రాంతి సంబరాల లోప్రదర్శించిన ముఖ్యాంశాలు:

1.మనం సంస్థ సహకారంతో టాగ్స్ రూపుదిద్దిన “రంగస్థలం” నాటకం

2. వేదిక పై రాధా సమేత కృష్ణ, బృందావనం లో గోపాలుడు, అన్నమాచార్య గీతా మాధురి, సాంప్రదాయ తెలుగు జానపదాలు మరెన్నొ వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతోఆకట్టుకున్న450 మందికి పైగా స్థానిక కళాకారులు

3. ప్రతిభావంతులైన స్థానిక తెలుగు బాలలకు పురస్కారాలు

4. స్థానిక డేవిస్ నగరంలో ఉన్న ప్రీతి ఇండియన్ రెస్టారెంట్ వారిచే తెలుగు పండుగ భోజనం

సంక్రాంతి వేడుకల సందర్భం గా టాగ్స్ అధర్వంలో జరిగినసాంస్కృతిక కార్యక్రమాలు, స్థానిక డేవిస్ నగరం లో ఉన్న స్థానిక ప్రీతి ఇండియన్ రెస్టారెంట్ వారు వండిన నొరూరుంచే గోంగూర, అరిసె, బొబ్బట్టు, గారెలతో కూడిన పసందైన తెలుగు వంటకాలు, మరి ఇంకెన్నోవిశేషాలతో ఆహుతులను అలరించాయి. కదలి రండి, కలసి రండి, సంక్రాంతి సంబరాన్ని ఉమ్మడిగా జరుపుకొందాము అని టాగ్స్ఇచ్చిన పిలుపుకు స్పందించిన స్థానిక తెలుగు కుటుంబాలు 1500 మందికి పైగా వేదిక కు తరలి వచ్చారు. ఈ సందర్భంగా గృహహింస కు బలైన అతివలను ఆదరించే కాలిఫోర్నియా లో ఉన్న స్థానిక “మై సిస్టర్స్” స్వచ్చంద సంస్థ అధికారి “సిత్రా త్యాగరాజయ్య”, 100 కు పైగా తెలుగు పుస్థకాలు రచించిన స్థానిక తెలుగు రచయిత “శ్రీ వంశీ మోహన్ మాగంటి”, సిలికానాంధ్ర యువత సేవల ఉప అధ్యక్షురాలు శ్రీమతి స్నేహ వేదుల , సిలికానాంధ్ర వాగ్గేయకారుల సేవల విభాగం డైరక్టర్ శ్రీ వంశీ కృష్ణ నాదెళ్ళ, ప్రియమైన అతిధులు గా విచ్చేసి ఆహుతులకు వారి సంక్రాంతి సందేశం మరియూ శుభాకాంక్షలు అందజేశారు. వారందరూ స్థానిక తెలుగుకళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలకు అచ్చెరువొందారు. టాగ్స్ కార్యవర్గ సభ్యులు వారందరినీ వేదిక పై ఆహ్వానించి ఘనం గా సన్మానం గావించి జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా “శ్రీ వంశీ మోహన్ మాగంటి” మాట్లాడుతూ మనదైన తెలుగు కధ, కవిత్వం, సాహిత్యం, సంప్రదాయాలను తరువాతి తరం బాలబాలికలకు అందజేయాలని నొక్కి చెప్పారు. సిలికానాంధ్ర గ్లోబల్ టీం సభ్యులు శ్రీ వాసు కూడుపూడి మాట్లాడుతూ కూచిపూడి గ్రామం లో శరవేగంగా నిర్మాణమౌతున్న మల్టి స్పెషాలిటీ ఆసుపత్రి “సంజీవిని” రెండవ దశ నిర్మాణంలో పాలుపంచుకోవాలని ఆయన స్థానిక తెలుగు వారికి విజ్ఞప్తి చేశారు. కూచిపూడి గ్రామం చుట్టుపక్కల ఉన్న 150 గ్రామాలకు ఆరోగ్య సమస్యలు తీర్చే ఉద్దేశ్యంతో “సంజీవిని” ఆసుపత్రి బృహుత్ యజ్ఞానికి శ్రీకారం చుట్టామని ఆయన చెప్పారు. దాదాపు 500 కుటుంబాలకు పైగా ఉద్యోగ అవకాశాలనుకల్పించడమే కాకుండా చిన్న పిల్లలకు, మహిళలకు ఉపయోగపడే రీతిలో “సంజీవిని” ఆసుపత్రి ని తీర్చి దిద్దుతామని, ఇందుకు సహాయం చేయదలచినవారు నేరుగా సిలికానాంధ్ర ను సంప్రదించాలని శ్రీ వాసు కూడుపూడి విజ్ఞప్తి చేశారు. టాగ్స్ చైర్మన్ అనిల్ మండవ, వైస్ చైర్మన్ మల్లిక్ సజ్జనగాండ్ల, ప్రెసిడెంట్ నాగ్ దొండపాటి, సెక్రటరీ దుర్గా చింతల, కోశాధికారి మోహన్ కాట్రగడ్డ , సమాచార అధికారి రాఘవ చివుకుల నేతృత్వంలో టాగ్స్ కార్యవర్గం ఈ సందర్భంగా ప్రియమైన అతిధులందరికీ జ్ఞాపికలు అందజేసి ఘనసన్మానం గావించింది. శ్రీ శ్రీనివాస కళ్యాణోత్సవం సంధానకర్త శ్రీమతి ఉష మందడి ని టాగ్స్ కార్యవర్గం ఘనంగా సత్కరించింది. అనంతరం రంగస్థలం నాటికలో పల్లెటూరి రచ్చబండ సమావేశం సెట్టింగ్, పాత్రధారుల వేషధారణ, నటన, నృత్యాలతో 50 మందికి పైగా మనం సంస్థ, స్థానిక కళాకారులు చేసిన ప్రదర్శన అందరినీ ఆకట్టుకొంది. ఈ సందర్భం గాప్రతిభావంతులైన పిల్లలను పోత్సహించే గత సంప్రదాయాన్నిపాటిస్తూ, టాగ్స్ కార్యవర్గ సభ్యులు ఎంపిక చేసిన స్థానికప్రతిభావంతులైన హైస్కూల్ పిల్లలు “విశృత్ నాగం, తనూష తొల్లా, ఆష్మిత రెడ్డి, హర్షిత మదుగంటి, శ్రేయ నాగులపల్లి” లకు జ్ఞాపికలు అందజేశారు. టాగ్స్ సౌజన్యం తో జరుగుతున్న శాక్రమెంటో శివారు నగరాలైన స్థానిక ఫాల్సం, రోసివిల్లి, నాటోమాస్, ఎల్ డోరాడొ సెంటర్లలో చదువుతున్న సిలికానాంధ్ర మనబడి విద్యార్థులు చక్కని తెలుగు పద్యాలు, కధలు, పాటలు వేదికపై ప్రదర్శించారు. స్థానిక “వీఎంబ్రేస్”స్వచ్చంద సంస్థ వద్ద శిక్షణ పొందుతున్న ఆటిజం ఆరిన పడ్డ దివ్యాంగులైన చిన్నారులచే ప్రదర్శించబడ్డ నృత్యప్రదర్శన కు ఆహుతులు అందరూ చప్పట్లతో ప్రోత్సహించారు. అలేఖ్య పెన్మత్స, శృతి సేథి ఈ చిన్నారులకు నృత్య శిక్షణ ఇచ్చారు. టాగ్స్ సమాచార అధికారి రాఘవ చివుకుల సమర్పణ గావించారు. అంతకు మునుపు శనివారంజనవరి 12న శ్రీ శ్రీనివాస కల్యాణోత్సవాన్ని అదే వేదిక ప్రాంగణంలో ఉదయం 9 గం కు టాగ్స్ ఘనంగా నిర్వహించింది. . ఈ కార్యక్రమం కోసం స్టాక్ టన్ శివ విష్ణు దేవాలయం నుండి విచ్చేసిన పూజారులు శ్రీ శ్రీనివాస కళ్యాణోత్సవం పూజ ను నిర్వహించారు. పూజానంతరం ప్రత్యేకంగా తయారుచేసిన తీర్ధ ప్రసాదాలను భక్తులకు టాగ్స్ కార్యకర్తలు అందజేశారు. అనంతరం జరిగిన చిన్నారులకు భోగిపళ్లు కార్యక్రమం లో పెద్దలు ఉత్సాహంగా పాల్గొన్నారు. రేగిపళ్ళు, పూలు, అక్షంతలతో చిన్నారులను పూజకు విచ్చేసిన అందరూ ఆశీర్వదించారు. కాలిఫోర్నియా శాక్రమెంటోలో సంక్రాంతి సంబరాలు, శ్రీ శ్రీనివాస కల్యాణోత్సవ విజయవంతం కు అహర్నిశలు కృషి చేసిన వారిలో టీఏజిఎస్ కార్యవర్గ సభ్యులు, మరియు టాగ్స్ కార్యకర్తలు ఉన్నారు ఈ సందర్భం గా టాగ్స్ కార్యనిర్వాహక సభ్యులు అనాధ భారతీయ బాలబాలికలకు సహాయార్ధం హోప్ ఎబయ్డ్స్, ఆరతి స్వచ్ఛంద సంస్థ, హైదరాబాద్ లో ఉన్న వేగేశ్న ఫౌండేషన్, రెండు తెలుగు రాష్ట్రాల గ్రామాలలో పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్న సువిధా ఇంటర్నేష్నల్ ఫౌండేషన్, మరియు “వీఎంబ్రేస్” స్వచ్ఛంద సంస్థ కు టాగ్స్ ప్రత్యేకం గా విరాళాలుఅందజేస్తుంది అని, ఈ సంస్థలకు సహాయార్ధం విరాళం ఇవ్వదలచిన వారు మరింత సమాచారం కోసం sactags@gmail.com కు ఈమెయిలు లో సంప్రదించాలని టాగ్స్ కార్యనిర్వాహక సభ్యులు కోరారు.సంక్రాంతి సంబరాల ఫోటోలను ఫేస్ బుక్ https://www.facebook.com/SacTelugu/photos_stream లో చూడవచ్చునని వారు తెలిపారు. టాగ్స్ చేపట్టబోయే కార్యక్రమాలకు సంబంధించి మరిన్ని వివరాలనుతెలుసుకోవాలనుకునేవారు http://www.sactelugu.org, https://www.facebook.com/SacTelugu ను సందర్శించాలని లేదా sactags@gmail.com కు ఈమెయిలు లో సంప్రదించాలని టాగ్స్ కార్యనిర్వాహకసభ్యులు కోరారు.