19వ శతాబ్దంలోనే ప్రపంచ దేశాల చూపు మన భాగ్యనగరం మీద పడింది. కారణం.. వేల కోట్ల రూపాయల సంపద. కళ్లు మిరుమిట్లు గొలిపే ఆభరణాలు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన వజ్ర వైఢూర్యాలకు భాగ్యనగరం కేరాఫ్ కాబట్టి. మన దగ్గర దొరికిన వజ్రాలు, బంగారం, ముత్యాలు.. నిజాం నవాబు వంశీయులు యుద్ధాల్లో గెలిచిన వారసత్వ సంపద అంతా హైదరాబాద్ సంస్థానంలో కోలువుదీరింది. అయితే.. నిజాం పాలన తర్వాత ఆ సంపద మొత్తం ఏమైంది? ఎక్కడుంది? అనేది ప్రశ్న. ఆ సంపదలో కొంత మన భారత ప్రభుత్వం వద్ద ఉంది. వాటిల్లో కొన్నింటిని అప్పుడప్పుడు ప్రదర్శిస్తుంటారు. ఈ విశేషాల సమాహారం ఈ వారం సింగిడి కథనం. నిజాం వంశీయులు అప్పట్లోనే వజ్రాల వ్యాపారం చేయడంతో.. కోట్ల రూపాయల సంపద నగల రూపంలో హైదరాబాద్ సంస్థానంలో ఉండేది. అయితే రాజుల సొమ్ము రాళ్లపాలు అన్న చందంగా నిజాం పాలన తర్వాత నగలు, ఆభరణాలు కనిపించలేదు. చాలా సంపద దేశం దాటి పోయింది. మరికొంత దొంగిలించబడింది. హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమయ్యాక ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ సంపద కోసం వారసులు కొట్లాడుకున్నారు. దీంతో మిగిలిన నగలను వారసులు వేలం వేశారు. ఆ వేలంలో కొన్ని నగలను భారత ప్రభుత్వం 1995లో రూ. 218 కోట్లకు కొనుగోలు చేసింది. దేశం దాటిపోయిన చాలా సంపద లండన్‌లో ఉందని.. దాన్ని తమకు ఇప్పించమని నేటికీ నిజాం వారసులు పోరాడుతున్నారు.
*నిజాం ఆభరణ సంపదను సుమారు 225 ఏళ్ల సేకరణగా చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. వీటిపై విజయనగర రాజల శైలి, గోల్కొండ, బీదర్, బీజాపూర్ వారి శైలి కనిపిస్తుంది. ఈ సేకరణలో ఆయా సంస్థానాలకు చెందిన ఆభరణాలతో పాటు మొఘలాయి, భారతీయ శైలుల కలయికతో రూపుదిద్దుకున్న నగలు కూడా ఉన్నాయి. మొఘల్ చక్రవర్తులు, టిప్పు సుల్తాన్ సహా.. దేశంలోని వివిధ సంస్థానాల పాలకులు బహుకరించినవి, నిజాం సంస్థాన జాగీర్దార్లు తయారుచేయించిన వాటితో ఈ ఆభరణాల సంపద కళకళ లాడుతుండేది. 1870 నుంచి 1910 వరకు అంతర్జాతీయ నగల వ్యాపారుల నుంచి మీర్ మహబూబ్ అలీఖాన్ అనేక ఆభరణాలు కొనుగోలు చేశారు. అలెగ్జాండర్ మాల్కం జాకబ్ అనే ఇటాలియన్ వ్యాపారి జాకబ్ డైమండ్‌ను భారత దేశానికి తీసుకువచ్చి 1891లో ఆరవ నిజాంకు విక్రయించారు. ఆయన ఈ డైమండ్‌ను తన పాదరక్షలో అలంకరించుకున్నాడు. ఇదే డైమండ్‌ను ఏడవ నిజాం పేపర్ వెయిట్‌గా వాడుకున్నారు. 18వ శతాబ్దంలో ఇండియాలో హైదరాబాద్ ఒక్కటే డైమండ్ సప్లయర్‌గా ఉండేది.
*విదేశాల నుంచి నిపుణులు!
నిజాం రాజులు హైదరాబాద్ నగరంలోని కార్వాన్ ప్రాంతాన్ని ఆభరణాల తయారీ కేంద్రంగా మలుచుకున్నారు. ఇక్కడ వెండి, బంగారు, వజ్రాలతో ఎంతో సుందరమైన ఆభరణాలు తయారు చేసేవారు. ఇందుకు కళా నిష్ణాతులను ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా దేశాలనుంచి రప్పించేవారు. వీరిలో కొందరు హైదరాబాద్ నగరంలో స్థిరపడ్డారు. బంగారు, వెండి ఆభరణాలపై లతలు, నగిషీలు చెక్కడం వీరి ప్రత్యేకత. వీరితోపాటు గుజరాతీలు, మరాఠీలు, కన్నడిగులు కూడా ఆభరణాల తయారీలో పనివారిగా ఉండేవారు. విదేశాల నుంచి వచ్చిన పనివారు.. ఉంగరాల లోపలి భాగాల్లో కూడా పేర్లు రాయడంలో నిపుణులు. ఇస్కిందిరియా ఉంగరం ఇందుకు ఉదాహరణ.
*అరుదైన వ్రజ్రవైఢూర్యాలు
నిజాం పాలనలో మన గోల్కొండ వజ్రాల గనిగా ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ వజ్రాలతో పాటు మరకతం కూడా లభ్యమయ్యేది. వీటితో పాటుగా.. బర్మానుంచి తెచ్చిన రూబీలు, బస్రా, మన్నార్, గల్ఫ్, మన దేశంలోని తూర్పుతీరం నుంచి సేకరించిన ముత్యాలు నిజాం సేకరణలో ఉన్నాయి. గోల్కొండ వజ్రాలు, పచ్చలు, నీలాలు, పగడాలతో మొఘల్ కళా నైపుణ్యంతో రూపుదిద్దుకున్న ఆభరణాలు, అరుదుగా సంస్థా నాధీశులు ధరించే శిరోభూషణం సర్‌పేచ్, రష్యా గనుల రత్నాలతో పొదిగిన ఉంగరాలు నిజాం అమూల్య సంపదలో భాగం. అన్నీపోగ మిగిలినవి 210కి పైగా ఆభరణాలున్నాయి. వీటిల్లో 173 ప్రదర్శనలో ఉంచారు. ఇలా వేల కోట్ల విలువైన నిజాం ఆభరణాలు తొలుత కింగ్‌కోఠి ప్యాలెస్‌కు అక్కడి నుంచి ముంబాయిలోని హాంకాంగ్ బ్యాంక్‌కు చేరాయి. అక్కడ 45 యేండ్లు తర్వాత 1995న జాతీయ సంపదగా మారాయి.
*173 ఆభరణాల ప్రదర్శన
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా పేరు సంపాదించుకున్న ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ నగలను.. 11 యేండ్ల విరామం తర్వాత ప్రభుత్వం ప్రదర్శనకు పెట్టింది.
*ఢిల్లీలోని నేషనల్ మ్యూజియంలో ఈ ప్రదర్శన మొదలైంది. మొత్తం 173 వస్తువులను ప్రస్తుతం ప్రదర్శిస్తున్నారు. వీటిలో కోహినూర్ వజ్రం కంటే రెండు రెట్లు పెద్దదైన జాకబ్ డైమండ్ అందర్నీ ఆకర్షిస్తున్నది.
*22 అన్‌సెట్ పచ్చల హారం, 28 షోకేసుల్లో వజ్రాలు, రత్నాలు, పచ్చలహారాలు, పటాకాలు, బ్రాస్ లెట్లు, చెవిదుద్దులు, కంకణాలు, మెట్టెలు, ఉంగరాలు, ప్యాకెట్ వాచీలు, తలపాగకు ధరించే వజ్రాలు, ధవళ వర్ణంలో మెరిసిపోయే ముత్యాల దండలు, కెంపులు, హారాలు, వడ్డాణాలు ఉన్నాయి.
*టిప్పుసుల్తాన్‌కు చెందినవిగా భావిస్తున్న భుజకీర్తులను కూడా చూడొచ్చు. ఫిబ్రవరి 19న ప్రారంభమైన ఈ ఆభరణాల ప్రదర్శన.. మే 5 వరకూ కొనసాగుతుంది. సోమవారాలు, జాతీయ సెలవుల్లో ప్రదర్శన ఉండదు. టికెట్ ధర రూ. 50.
**మరికొన్ని విశేషాలు!
నిజాం సేకరణలో మొత్తం 25వేలకు పైగా వజ్రాలు (2.5 కేజీలు), 2 వేల మరకత మణులు (2 కేజీలు), 40వేలకు పైగా ముత్యాలు ఉన్నాయి.కోహినూర్ వజ్రం కంటే రెండురెట్లు పెద్దది జాకబ్ డైమండ్. ఇది చాలా విలువైంది కూడా1947లో ఎలిజబెత్‌రాణికి బహుకరించడానికి గులాబిపువ్వు ఆకారంలో కిరీటం, వజ్రాల నెక్లెస్‌ను తయారుచేయించాడు. కొన్ని కారణాల వల్ల ఎలిజబెత్ రాణికి ఇవ్వలేకపోయాడు.1911లో మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఓ ఇరానీ వ్యాపారి నుంచి జమ్రుద్ ఆభరణాన్ని కొనుగోలు చేశాడు. మీర్ ఉస్మాన్ అలీఖాన్ సేకరణలో అత్యంత విలువైన వజ్రాలు పొదిగిన ఇస్కందరియా ఉంగరం, జాగర్ డైమండ్ ఉన్నాయి.మీర్ ఉస్మాన్ అలీఖాన్ ప్రపంచ వజ్రాల మార్కెట్‌లో 70 శాతం పైన వజ్రాలను సరఫరా చేసేవాడు. 1937 ఫిబ్రవరి 22న టైమ్ మ్యాగజైన్ ప్రచురించిన అత్యంత ధనికుల జాబితాలో మీర్ ఉస్మాన్ అలీఖాన్ అత్యంత ధనికుడిగా చోటు సంపాదించాడు. ఇతను అత్యంత విలాసవంతమైన జీవితాన్ని గడిపాడు. కోట్ల విలువ చేసే జాకబ్ డైమండ్‌ను పేపర్ వెయిట్‌గా ఉపయోగించాడు. ఉస్మాన్ అలీఖాన్ ఒకసారి వేసిన దుస్తులు మళ్లీ వెయ్యరు. ఒకసారి వాడిన చెప్పులు, బూట్లు కూడా.క్రీస్తు శకం 1700లో ఔరంగజేబు అరుదైన అలెగ్జాండ్రెట్ రత్నాలతో పొదిగిన ఉంగరాలు నిజాం పాలకులకు బహుకరించినట్లు తెలుస్తున్నది.ఈ ఆభరణాలను తిరిగి సొంతం చేసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
Category: అమెరికాలో హిందూ దేవాలయాలు
పిట్స్ బర్గ్ దేవాలయంలో వైభవంగా పవిత్రోత్సవాలు
న్యూజెర్సీ సాయి ఆలయానికి భూమిపూజ
అమెరికాలోని న్యూజెర్సీలో సాయి దత్త పీఠం ఆధ్వర్యంలో షిరిడీ సాయినాథుని ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేశారు. విజయదశమి, బాబావారి 100 సం. ల పుణ్య తిథి సందర్భంగా సాయిదత్త పీఠం నిర్వాహకులు రఘుశర్మ శంకరమంచి, వేద పండితుడు భైరవమూర్తి ఆధ్వర్యంలో భూమి పూజ నిర్వహించారు. ఈ ఆలయ నిర్మాణం ఎంతో కళాత్మకంగా, మహారాష్ట్రలోని షిరిడీ ఆలయాన్ని ప్రతిబింబించేలా నిర్మించనున్నట్లు సాయిదత్తపీఠం ప్రతినిధులు వెల్లడించారు. గురుస్థానం, లెండివనం, ద్వారకామయి, నిత్య ధుని, చావడి తదితర వాటిని కూడా ఈ ఆలయంలో నిర్మించనున్నారు. పలువురు వాలంటీర్లు, ఇంజినీర్లు, ఆర్కిటెక్ట్స్, సాయి దత్త పీఠం బోర్డు డైరెక్టర్స్ ఈ భూమి పూజలో పాల్గొన్నారు.
రేపు లాన్సింగ్‌లో శ్రీనివాస కళ్యాణం
డెట్రాయిట్ వెంకటేశ్వర స్వామీ దేవాలయంలో నవరాత్రి ఉత్సవాలు
డెట్రాయిట్ లోని ఎస్వీ టెంపుల్ (మిచిగాన్)లో అక్టోబరు తొమ్మిది నుండి దసరా నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మిగిలిన వివరాలకు ఈ క్రింది బ్రోచర్ ను పరిశీలించవచ్చు.
అమెరికా పూజారులకు టీటీడీ అర్చకుల శిక్షణ
అమెరికాలోని అర్చకులకు శిక్షణ ఇచ్చేందుకు టీటీడీ సన్నద్ధమవుతోంది. అమెరికాలోని శ్రీ వేంకటేశ్వర ఆలయాల్లోని పూజారులకు ‘వర్క్‌షాప్ ఆన్ ఆగమిక్ స్టాండర్డ్స్ ఎట్ ఎస్వీ టెంపుల్స్ ఇన్ యూఎ్‌సఏ’ పేరిట ఈ శిక్షణ ఇవ్వనుంది. పిట్స్‌బర్గ్‌లో ఆలయంలో ఈ నెల 29,30 తేదీలలో ఈ శిక్షణ శిబిరం నిర్వహించనున్నారు. అక్కడి ఆలయాల్లోనూ హిందూ ఆగమశాస్త్ర ప్రమాణాలు పాటించేలా ప్రధాన పూజారులు, ఆలయ నిర్వాహకులతో టీటీడీ ఆగమ పండితుల బృందం సమావేశమై సూచనలు చేయనుంది. ఆమెరికాలో దాదాపు 50 లక్షల మంది భారతీయులు ఉన్నారు. వారిలో 35 నుంచి 40 శాతం హిందువులే. ఉద్యోగరీత్యా అక్కడ స్థిరపడినప్పటికీ ఎంతోమంది పూజలు, ఆచారాలు కొనసాగిస్తూనే ఉన్నారు. పిట్స్‌బర్గ్‌లో 30 ఏళ్ల క్రితమే శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయాన్ని నిర్మించారు. దీనిని చిన తిరుపతి అని కూడా పిలుస్తుంటారు.ఇక కాలిఫోర్నియా, లివర్‌మోర్, న్యూజెర్సీ, డెట్రాయిట్ వంటి నగరాల్లోనూ 24 వెంకన్న ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయాల్లో నిత్యం వివిధ రకాల పూజలు జరుగుతున్నాయి. 2010లో టీటీడీ మొట్టమొదటిసారిగా శ్రీనివాస కల్యాణాలను అమెరికాలో నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ఎన్‌ఆర్‌ఐల నుంచి విశేష స్పందన లభించింది. ఆతర్వాత 2015లో నాలుగు ప్రధాన పట్టణాల్లో శ్రీనివాస కల్యాణాలు వైభవోపేతంగా జరిపించారు. ఈ నేపథ్యంలో తిరుమల తరహాలోనే అమెరికాలోని ఆలయాల్లోనూ ఆగమశాస్త్రం ప్రకారం పూజలు నిర్వహించేలా సూచనలు, సలహాలు ఇవ్వాలని అక్కడి అర్చకులు కోరారు. దీంతో ముఖ్యమంత్రి సూచన మేరకు టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్‌యాదవ్, ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ ఆమోదం కూడా లభించడంతో ఈ నెల 29, 30 తేదీల్లో పిట్స్‌బర్గ్‌లో వర్క్‌షాప్ నిర్వహించేలా ప్రణాళిక రూపొందించారు. ఈ వర్క్‌షా్‌పలో అమెరికాలో ఉన్న 24 ఆలయాలకు చెందిన ప్రధాన పూజారులు, నిర్వాహకులు పాల్గొంటారు. అలాగే కెనడాలోని రెండు ఆలయాల ప్రతినిధులు కూడా పాల్గొంటున్నట్టు తెలిసింది. టీటీడీ నుంచి నలుగురు ఆగమ పండితులు, జేఈవో భాస్కర్, డిప్యూటీ ఈవో గౌతమిలతో కూడిన బృందం ఈనెల 27న అమెరికా వెళ్లనుంది.
న్యూజెర్సీ సాయిదత్త పీఠంలో కర్ణాటక సంగీత కచేరీ
న్యూజెర్సీ సాయిదత్త పీఠం కర్నాటక సంగీత కచేరి ఏర్పాటు చేసింది. ఆధ్యాత్మిక సంగీతాన్ని పంచేందుకు ప్రముఖ కర్నాటక సంగీత ప్రావీణ్యులను సాయిదత్త పీఠానికి ఆహ్వానించింది. గాయనీ గుమ్మలూరి శారదా సుబ్రమణియన్, వయోలిన్ విద్వాంసులు శ్వేతా నరసింహాన్, మృదంగ విద్వాంసులు శబరినంద రామచంద్రన్ చేసిన సంగీత కచేరి ఆధ్యాత్మిక సంగీత ప్రియులను భక్తి పారవశ్యంలో ముంచెత్తింది. సిద్ధి వినాయకం, మోక్షం గలదా, శ్రీ వరలక్ష్మి సామజవరగమన, వందేశంభూం ఉమాపతి, భో.. శంభో, గోవింద బోలో, గోపాల బోలో వంటీ గీతాలు, శ్లోకాలతో పాటు సాయిభజనతో సాయి దత్త పీఠం మారుమ్రోగిపోయింది. కర్నాటక సంగీతంలో చక్కటి భక్తి సంగీత కచేరీని నిర్వహించిన శారదా సుబ్రమణియన్, శ్వేతానరసింహాన్, శబరినంద రామచంద్రన్‌లను సాయిదత్త పీఠం ప్రత్యేకంగా అభినందించింది. ఇదే సంగీత కార్యక్రమంలో స్వరరాగ సుధ కళా అకాడమీకి చెందిన ఉష, మణి ఆకెళ్లలకు స్వర సుధ కళా ప్రపూర్ణ పురస్కారాన్ని సాయిదత్తపీఠం ప్రదానం చేసింది.
డెలావేర్‌లో శోభారాజు అన్నమయ్య స్వరామృతం
టొరంటోలో భద్రాద్రి రామ కళ్యాణం
కెనడాలోని టొరంటోలో శ్రీ భద్రాచల సీతారామ కల్యాణం వైభవంగా నిర్వహించారు. తెలుగు కెనడా ఫౌండేషన్ ప్రెసిడెంట్, తానా ట్రస్టీ మెంబర్ అనిల్ లింగమనేని, తెలుగు అసోసియేషన్ ఆఫ్ కెనడా ట్రస్టీ మెంబర్ రాంబాబు కల్లూరి గారి ఆధ్వర్యంలోఈ కార్యక్రమాన్ని ఈ నెల 8 వ తేదీ ఆదివారం నిర్వహించారు. వేడుకలో వందల సంఖ్యలో భక్తులు హాజరై కళ్యాణాన్ని వీక్షించారు. భద్రాచలం నుంచి వచ్చిన విగ్రహాలు, పురోహితులు మరియు తలంబ్రాలతో టొరంటో నగరంలో శృంగేరి విద్యా భారతి ఫౌండేషన్ గుడి లో కళ్యాణం జరిగింది . కళ్యాణం అనంతరం ప్రముఖ నృత్య గురువు డా. పద్మజా రెడ్డి వారి బృందం ప్రదర్శించిన కూచిపూడి నృత్య ప్రదర్శన ప్రేక్షకులను అలరించింది. ఈ కార్యక్రమంలో తెలుగువారితో పాటు ఇతరులు పాల్గొన్నారు. వేడుకకు సహకరించిన వారికి అనిల్, రాంబాబులు కృతజ్ఞతలు తెలిపారు.
మిస్సిసాగాలో శ్రీనివాస కళ్యాణం
కెనడా తానా ఆధ్వర్యంలో టొరంటోలో భద్రాద్రి రామయ్య కళ్యాణం
అమెరికాలో సీతారామ కళ్యాణం
అమెరికాలోని హోస్టన్ నగరంలో భద్రాద్రి రాముడి కల్యాణోత్సవాన్ని నిర్వహించనున్నారు. అనంతరం కెనడా, సింగపూర్, మలేషియా, తదితర దేశాల్లో కూడా కల్యాణం జరగనుందని, ఆటా కో-ఆర్డినేటర్, ప్రముఖ నాట్య కళాకారిణి పద్మజారెడ్డి తెలిపారు. సోమవారం లక్డీకాపూల్ సెంట్రల్ కోర్టు హోటల్‌లో జరిగిన సమావేశంలో ఆమె భద్రాచలం ఆలయ అర్చకుడు మదన్‌మోహనాచార్యులు తో కలిసి మాట్లాడారు. అమెరికాలోని హోస్టన్ నగరంలో ఈ నెల 29, 30, జూలై 1వ తేదీలో తనతోపాటు శిష్య బృందం నృత్య ప్రదర్శనలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆటా ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో రసమయి బాలకృష్ణ బృందం కళాకారులు కూడా పాల్గొంటారని తెలిపారు. దాదాపు 10వేల మంది హాజరయ్యే ఈ కార్యక్రమంలో క్లాసికల్ నృత్యంతో పాటు నవదుర్గలు అనే అంశంపై ప్రదర్శనలు ఇవ్వనున్నట్లు తెలిపారు. జూలై 1న భద్రాచలం నుంచి సీతారాముల విగ్రహాలను తీసుకెళ్లి ఆ ఆలయ అర్చకులతో కల్యాణం జరిపించనున్నట్లు తెలిపారు. దీనికి దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకిరణ్‌రెడ్డితో పాటు పలువురు హాజరవుతారన్నారు. అనంతరం జూలై 8న కెనడాలో తదనంతరం సింగపూర్, మలేషియా, తదితర దేశాల్లో ఈ కల్యాణోత్సవం ఉంటుందన్నారు.మదన్‌మోహనాచార్యులు మాట్లాడుతూ భద్రాచలం రామయ్య కల్యాణం ఇతర దేశాల్లో నిర్వహించడం వల్ల లోకకల్యాణం జరుగుతుందన్నారు. పద్మజారెడ్డి శిష్య బృందం శాలిని, భూమిక, రేణుక, ఆశా, చందన, హర్షిణి పాల్గొన్నారు.
ఫోర్ట్‌వర్త్ హిందూ ఆలయంలో మహాలక్ష్మీ ప్రాణ ప్రతిష్ఠ
న్యూజెర్సీలో పర్యటించిన బుద్ధప్రసాద్. సాయిదత్తపీఠంలో ఘనంగా జన్మదిన వేడుకలు-TNI ప్రత్యేకం
అమెరికా పర్యటనలో ఉన్న ఏపీ శాసనసభ ఉప-సభాపతి మండలి బుద్ధప్రసాద్ సాయిదత్తపీఠం పిలుపు మేరకు న్యూజెర్సీలో పర్యటించారు. న్యూ జెర్సీ పబ్లిక్ యుటిలిటీస్ కమీషనర్ ఉపేంద్ర చివుకుల, బుద్ధప్రసాద్ ను సభకు పరిచయం చేశారు.బుద్ధప్రసాద్ జన్మదినం సందర్భంగా ఆయన కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలుగు భాషా, సంప్రదాయాల పరిరక్షణ కోసం మండలి చేస్తున్న కృషిని ఈ సందర్భంగా పీఠం నిర్వాహకులు రఘుశర్మ శంకరమంచి కొనియాడారు. వివాద రహితుడిగా, సౌమ్యుడిగా. అందరివాడిగా పేరు తెచ్చుకున్న మండలి బుద్ధ ప్రసాద్ మరిన్ని విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అమెరికాలో తెలుగువారు ఎన్నో విజయాలు సాధిస్తున్నారని, బాబా చెప్పిన శ్రద్ధ, సహనం కలిగి ఉండి మానవ సేవే మాధవ సేవ అంటూ సాయి దత్త పీఠం చేస్తున్న సేవా, సత్సంగ్, విద్య, ఛారిటీ వంటి పిల్లర్లతో నిర్విఘ్నంగా నడుస్తున్నందుకు పీఠం నిర్వాహకులను బుద్ధప్రసాద్ ప్రత్యేకంగా అభినందించారు. భారతీయ ఆధ్యాత్మిక వైభవాన్ని అమెరికాలో కొనసాగిస్తున్నందుకు సాయి దత్త పీఠంపై ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించడంలో సాయి దత్త పీఠం చేస్తున్న కృషి అభినందించదగినదన్నారు. పీఠం పూర్తి అయిన అనంతరం తాను తిరిగి అమెరికా పర్యటనకు ప్రత్యేకంగా వస్తానని మండలి పేర్కొన్నారు. ఉపేంద్ర మండల్తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో అన్నా మధు, మంత్రిప్రగడ వెంకట, గేదెల దాము, భమిడిపాటి శారద, మేడిచెర్ల మురళీ తదితరులు పాల్గొన్నారు.
సోమవారం న్యూజెర్సీలో పర్యటించనున్న బుద్ధప్రసాద్
ప్రపంచ దేశాల్లో రామయ్య కళ్యాణాలు
జగదానంద కారకుడు రాముడు, జగన్మాత సీతమ్మకు జరిగే కల్యాణం అంటే అది జగత్కల్యాణమే. ఇలాంటి కల్యాణ మహోత్సవానికి పెట్టింది పేరు భద్రాద్రి పుణ్యక్షేత్రం. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రపంచ వ్యాప్తంగా సీతారామ కల్యాణోత్సవాలు నిర్వహించాలనే సమాలోచనలు సాగుతున్నాయి. దేవాదాయ శాఖ తరఫున ఇటీవల హైదరాబాద్‌లో ఈ అంశంపై సుదీర్ఘ చర్చ సాగింది. ఊరూరా రామ మందిరాలు ఉన్నప్పటికీ భద్రాద్రిలోని సంప్రదాయాలు అంటే దేశ విదేశాల్లో ఉంటున్న భారతీయులకు ఎనలేని భక్తి. దీంతో పలు దేశాల్లో భద్రాద్రి సంప్రదాయంలో సీతారాముల కల్యాణం నిర్వహించి రామతత్వాన్ని ప్రపంచ వ్యాప్తంగా చాటాలని భావిస్తున్నారు. అమెరికా, ఇండోనేషియా, సింగపూర్, కెనడా, జర్మనీ, మలేసియా తదితర దేశాల్లో జూన్ 22 నుంచి నెల రోజులపాటు ఈ వేడుకలను జరపాలని ప్రతిపాదించారు. దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అర్చకులలో పాస్ పోర్టుతోపాటు వీసా ఉన్న వారిని గుర్తించే పనిలో పడ్డారు.
కెనడాలో సీతారామ కళ్యాణం
కాలిఫోర్నియాలో శతచండీ యజ్ఞం
వచ్చే నెల 1 నుంచి 11 వరకు అమెరికాలో శతచండీ యజ్ఞం నిర్వహించనున్నారు. కాలిఫోర్నియా రాష్ట్రంలోని లివర్‌మోర్‌లోని శివవిష్ణు ఆలయంలో మార్చి 1 నుంచి 11 వరకు అతిరుద్ర, అలాగే మార్చి 1 నుంచి 10 వరకు శతచండీ యజ్ఞాన్ని ఆలయ నిర్వాహకులు ఏర్పాటు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి ఈ మహత్తర యజ్ఞాల్లో భాగస్వామ్యులు కావాలని విజ్ఞప్తి చేశారు. భక్తుల కోసం ప్రత్యేక పూజా కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శతచండీ యాగం చివరి రోజున శివపార్వతుల కల్యాణం, అతిరుద్ర ముగింపు సందర్భంగా నంది వాహన సేవతో ఈ వేడుకలు ముగుస్తాయని నిర్వాహకులు పేర్కొన్నారు.
గలీజ్ “గజల్”తో సేవ్ టెంపుల్స్ సంస్థ తెగతెంపులు
యువతిపై లైంగిక వేధింపుల కేసులో అరెస్టయిన ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్‌ను సేవ్‌టెంపుల్స్ సంస్థ ప్రచారకర్త బాధ్యతల నుంచి తొలగించారు. ఈ మేరకు గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ అధ్యక్షుడు వెలగపూడి ప్రకాశ్‌రావు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘సనాతన హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఏర్పాటైన ఈ సంస్థ పలువురు ఎన్నారైల సహకారంతో 2006లో ఏర్పాటైంది. మా సిద్ధాంతాల ప్రకారం.. ఇల్లు, సమాజంలో మహిళలకు అత్యున్నత గౌరవం ఉంటుంది. భారత్‌లోని మా కార్యాలయంలో లైంగిక వేధింపులు జరిగాయనే సమాచారం దిగ్భ్రాంతికి గురిచేసింది. అధికార దుర్వినియోగం, నైతిక విలువలకు విఘాతం కలిగించడాన్ని గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్, సేవ్ టెంపుల్స్ సంస్థ ఎట్టి పరిస్థితుల్లో సహించవు. మా మహిళా ఉద్యోగుల్లో ఒకరిని లైంగికంగా వేధించారనే ఆరోపణలపై గజల్ శ్రీనివాస్‌పై కేసు నమోదు అయినందున.. ఆయన్ను తక్షణమే సంస్పెండ్ చేయాలని మా సంస్థ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించారు’’ అని తెలిపారు.
పిట్స్బర్గ్ ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు
వర్జీనియాలో అయ్యప్ప శరణు ఘోష
వర్జీనియా రాష్ట్రంలోని స్టెర్లింగ్ నగరంలో ప్రవాసుడు మారెళ్ల హనుమంతరావు నివాసంలో అయ్యప్ప పడిపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. వేడుకలో పలువురు ప్రవాస అయ్యప్ప దీక్షాదరులు భక్తిప్రపత్తులతో పాల్గొన్నారు.
వచ్చే శనివారం డీసీలో పర్యటించనున్న చినజీయర్
మిషిగన్ వెంకటేశ్వర ఆలయంలో కార్తీక దీపోత్సవం-చిత్రాలు
అనాథ పిల్లలకు 1400డలర్ల విరాళం అందించిన న్యూజెర్సీ సాయిభక్తులు
అనాథ పిల్లలకు చేయూత అందించేందుకు న్యూజెర్సీలోని సాయిదత్త పీఠం సాయి భక్తులకు పిలుపునిచ్చింది. ఓవర్సీస్ వాలంటీర్ ఫర్ బెటర్ ఇండియా(OVBI) సంస్థకు అనాథ పిలల విద్యావసర ఖర్చుల నిమిత్తం పీఠం అందించిన పిలుపుకు స్పందించి భక్తులు 2గంటల వ్యవధిలో 1400డాలర్లను అందించారు. ఈ విరాళ సేకరణ కార్యక్రమంలో స్థానిక ఆర్ట్ అఫ్ లివింగ్ సభ్యులు బబిత, రమలు కీలక పాత్ర పోషించారు. సాటి మనిషికి సాయం అందించడమే సాయి తత్వమని దానిని అనుసరించే మార్గంలో ఇటువంటి సేవా కార్యక్రమాలు మరిన్ని నిర్వహిస్తామని ఆలయ ప్రధాన అర్చకులు శంకరమంచి రఘుశర్మ తెలిపారు.
శాన్డీయాగోలో బతుకమ్మ వేడుకలు
అమెరికాలో మొట్టమొదటి 20అడుగుల గణపయ్య
వర్జీనియాలో లార్టన్ నగరంలో మొట్టమొదటిసారి 20అడుగుల భారీ గణపయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహానికి ప్రసాదంగా 500కేజీల లడ్డూను సైతం నిర్వాహకులు తయారు చేస్తున్నారు.