కాంగ్రెస్ పార్టీని గెలిపించండి-లండన్ ఎన్నారై కాంగ్రెస్

తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి అండగా నిలవాలని టీపీసీసీ ఎన్నారై సెల్ కోరింది. తెలంగాణ ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని టీపీసీసీ ఎన్నారై సెల్ లండన్‌లో నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా టీపీసీసీ ఎన్నారై సెల్ కన్వీనర్ తిరుపతి రెడ్డి, ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్(ఐఓసీ) కార్యదర్శి వీరేంద్ర, ఐఓసీ నేతలు గురమిందర్, రష్పాల్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తిరుపతి రెడ్డి మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌కి ఓట్లు వేయడం వల్ల తెలంగాణకి ఒరిగేది ఏమీలేదని, ప్రస్తుతం టీఆర్‌ఎస్‌లో చేరిన వారందరిని కలిపితే 15 ఎంపీలున్నా ఏం సాధించారని ప్రశ్నించారు. ఒక్క విభజన హామీని టీఆర్‌ఎస్‌ నెరవేర్చలేదని మండిపడ్డారు. 17 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులనే గెలిపించి తెలంగాణ ఇచ్చిన, తెచ్చిన కాంగ్రెస్‌కి అండగా నిలవాలని కోరారు. ఐఓసీ అధికార ప్రతినిధి, టీపీసీసీ కో కన్వీనర్ సుధాకర్ గౌడ్ మాట్లాడుతూ సచివాలయం రాకుండా ఇంట్లోనే ఉంటూ, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. 17 సీట్లలో కాంగ్రెస్‌ని గెలిపించి కేసీఆర్‌ సచివాయం ఎలా రారో చూద్దామన్నారు.

బంగారం కోసం భారతీయుల ఇళ్లల్లో దొంగతనాలు

బ్రిటన్‌లో బంగారం దొంగలు అత్యధికంగా భారత సంతతి ప్రజల ఇళ్లనే లక్ష్యంగా చేసుకుంటున్నట్లు శనివారం ఓ నివేదిక ద్వారా వెల్లడైంది. గత ఐదేళ్లలో రూ. 1,280 కోట్ల విలువైన బంగారం బ్రిటన్‌లో చోరికి గురైందనీ, అందులో అత్యధికం భారత సంతతి ప్రజలదేనని బీబీసీ పరిశోధనలో తేలింది. 2013 నుంచి చూస్తే 28 వేల బంగారం దొంగతనాలు జరిగాయి. గత ఐదేళ్లలో గ్రేటర్‌ లండన్‌లో రూ. 1,050 కోట్ల విలువైన బంగారం దొంగతనానికి గురయ్యింది.ఎక్కువ, తక్కువ అనే తేడా లేకుండా బంగారం ఎంతున్నా దొంగలు కొట్టేస్తున్నారనీ, బంగారాన్ని చాలా తక్కువ సమయంలో, చాలా సులువుగా నగదుగా మార్చుకునే అవకాశం ఉండటం ఇందుకు ఓ కారణమని పోలీసులు భావిస్తున్నారు. చెషైర్‌ పోలీస్‌ దళంలో నేరాల విభాగానికి నేతృత్వం వహిస్తున్న ఆరోన్‌ దుగ్గన్‌ అనే అధికారి మాట్లాడుతూ ‘సెకండ్‌ హ్యాండ్‌ నగలు కొనే వ్యాపారులు అమ్ముతున్న వ్యక్తి ఎవరు? ఆ నగలు అతనికి ఎక్కడి నుంచి వచ్చాయి? అని తెలుసుకోవాలి. కానీ అలా జరగడం లేదు. ఈ దేశంలో బంగారం తునక ముక్కలు అమ్మడం కన్నా సెకండ్‌ హ్యాండ్‌ నగలు అమ్మడమే సులభం’ అని తెలిపారు. దీపావళి, దసరా తదితర భారత ప్రధాన పండుగల సమయంలో ప్రజలు బంగారం ఎక్కువగా ధరించి ఆలయాలు, బంధుమిత్రుల ఇళ్లకు వెళ్తారనీ, ఆ పండుగల సమయంలోనే దొంగతనాలు ఎక్కువగా జరుగుతాయని లండన్‌ పోలీసులు అంటున్నారు. ప్రతీ ఏడాది ఈ పండుగల సమయంలో తాము హెచ్చరికలు కూడా చేస్తామన్నారు. 2017–18లో లండన్‌లోనే 3,300 దొంగతనాలు జరిగాయి. రూ. 193 కోట్ల విలువైన బంగారం చోరీకి గురయ్యింది.పశ్చిమ లండన్‌లోని సౌథాల్‌లో ఆసియా స్టైల్‌ బంగారం నగలు అమ్మే సంజయ్‌ కుమార్‌ మాట్లాడుతూ బంగారం ఆభరణాలకు సంప్రదాయాల పరంగా ఎంతో ప్రాధాన్యం ఉందన్నారు. బంగారాన్ని జాగ్రత్తగా దాచుకోవాలనీ, బీమా కూడా చేయించుకోవాలని తానెప్పుడూ తన దగ్గర బంగారం కొనేవారికి చెబుతుంటానని ఆయన తెలిపారు. ‘బంగారం కొనడమంటే పెట్టుబడి పెట్టడమనీ, అది అదృష్టాన్ని కూడా తెస్తుందని పిల్లలకు వారి తల్లిదండ్రులు చెబుతారు. ఆసియా ప్రజలు ఇదే చేస్తారు.వాళ్లు ఇక్కడకొచ్చినా ఆ సంప్రదాయాన్ని పాటిస్తారు’ అని సంజయ్‌ కుమార్‌ వివరించారు. బంగారు ఆభరణాలు కేవలం విలువైనవేగాక, వాటి యజమానులకు వాటితో ప్రత్యేక అనుబంధం ఉంటుందనీ, అవి పోయినప్పుడు యజమానుల మానసిక స్థితిపై కూడా తీవ్ర ప్రభావం పడుతుందని లండన్‌ పోలీసు విభాగంలో డిటెక్టివ్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న లీసా కీలే చెప్పారు. తమ చర్యల కారణంగా ఈ దొంగతనాలు కొంచెం తగ్గాయనీ, అయినా చేయాల్సింది ఇంకెంతో ఉందని ఆమె తెలిపారు. బంగారం దొంగలను పట్టుకోడానికి, దొంగతనాల సంఖ్యను తగ్గించడానికి లండన్‌ పోలీసులు ప్రత్యేకంగా ‘ఆపరేషన్‌ నగ్గెట్‌’ పేరిట ఓ∙కార్యక్రమాన్ని సైతం ఆచరణలోకి తెచ్చారు.

భారత జైలు కంటే దారుణంగా…

భారత్‌లో జైళ్లు నరకప్రాయంగా ఉంటాయి.. ఇది పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడైన విజయ్‌మాల్యా లండన్‌ కోర్టులో చేసిన ఆరోపణలు.. ఇలానే భారత్‌ జైళ్లలో ఉన్న ఇబ్బందులను సాకుగా చూపి నేరస్థులు చక్కగా విదేశాల్లోనే గడిపేస్తుంటారు. ఒకానొక దశలో విజయ్‌ మాల్యా కోసం ముంబయి ఆర్థర్‌ రోడ్‌ జైల్లో ఒక గదిని ప్రత్యేకంగా తయారు చేశారు. పాఠశాలల గదులే సరిగా లేకుండా అవస్థలుపడుతున్న దేశంలో ఒక ఆర్థిక నేరగాడికి ఇంతగా సౌకర్యాలు ఏర్పాటు చేయడం అవసరమా అన్న విమర్శలు కూడా ఎదురయ్యాయి. ఇప్పుడు తాజాగా లండన్‌లో అరెస్టైన నీరవ్‌ మోదీని అక్కడే కస్టడీలో ఉండాలని విస్ట్‌మినిస్టర్‌ న్యాయస్థానం ఆదేశించింది. నీరవ్‌ను తరలించే జైలుకు ఒక ప్రత్యేకత ఉంది. బ్రిటన్‌లోనే అత్యంత రద్దీగా ఉండే హెచ్‌ఎంపీ వాండ్స్‌వర్త్‌ జైలు ఇది. ఇక్కడి ఖైదీల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది బి కేటగిరిలోకి వచ్చే జైలు. ఇక్కడ కరుడుగట్టిన నేరగాళ్లను ఎక్కవగా ఉంచుతారు. దావూద్‌ ఇబ్రహీం సన్నిహితుడు జబీర్‌ మోతీని కూడా ఇక్కడే ఉంచారు. ఇక్కడ మత్తుపదర్థాల కేసుల్లో అరెస్టైనవారు, మానసిక వైకల్యంతో నేరాలు చేసినవారు ఉంటారు. 1851లో నిర్మించిన ఈ జైల్లో దాదాపు 1,428 మంది ఖైదీలు ఉంటున్నారు. బ్రిటన్‌లో ఒక జైల్లో ఈ సంఖ్యలో ఖైదీలను ఉంచడం చాలా అరుదు. ఇది జైలు సామర్థ్యం కంటే చాలా ఎక్కువ. ఇక్కడ మరుగుదొడ్ల పరిస్థితులు ఘోరంగా ఉంటాయనే విమర్శలు ఉన్నాయి. ఇక్కడ ఖైదీలను కూడా అతితక్కువ సమయం మాత్రమే బయటకు అనుమతిస్తారు. అంతేకాదు ఇక్కడ ఎవరికీ ప్రత్యేకంగా ఒక గది కేటాయించరు. దీంతో నీరవ్‌కూడా మరో నేరగాడితో తన గదిని పంచుకోవాల్సి వచ్చే అవకాశం ఉంది. మార్చి 29 తర్వాత నీరవ్‌ భవిత ఏమిటనేది తేలుతుంది.

నీరవ్ మోదీకి లండన్ కోర్టు షాక్

ప్రముఖ వజ్రాల వ్యాపారి, పీఎన్‌బీ కుంభకోణంలో ప్రధాన సూత్రధారి అయిన నీరవ్ మోదీకి లండన్ కోర్టు గట్టి షాక్ ఇచ్చింది.

ఆయన అరెస్ట్‌కు వారెంట్ జారీ చేసింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి వేల కోట్లు రుణాలు తీసుకున్న నీరవ్ మోదీ..

వాటిని ఎగ్గొట్టి లండన్‌కు పారిపోయాడు. ఇంతకాలం ఎవరికంట పడకుండా తిరిగిన నీరవ్ మోదీ..

లండన్‌లోనే తల దాచుకున్నట్లు ఇటీవల తెలియడంతో అతన్ని భారత్‌కు రప్పించేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

నీరవ్‌ను అప్పగించాల్సిందిగా యూకే ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు యూకే ప్రభుత్వం కూడా చర్యలు చేపట్టింది.

బ్రిటన్‌లో భాజపా-కాంగ్రెస్ కార్ల ర్యాలీలు

భారత్‌లో రాజుకున్న సార్వత్రిక ఎన్నికల వేడి సాగరాలు దాటి బ్రిటన్‌ను కూడా తాకింది. భాజపా, కాంగ్రెస్‌లకు చెందిన ప్రవాస భారతీయ విభాగాలు శనివారం ఇక్కడ వేరువేరుగా కారు ర్యాలీలు నిర్వహించాయి. బ్రిటన్‌లో పెద్ద సంఖ్యలో ఉన్న ప్రవాస భారతీయుల మద్దతును కూడగట్టుకోవడానికి ఈ కార్యక్రమాలను చేపట్టాయి. భాజపా విదేశీ విభాగమైన ‘ద ఓవర్సీస్‌ ఫ్రెండ్స్‌ ఆఫ్‌ బీజేపీ’ కార్ల ర్యాలీలో ఐరోపా రేసింగ్‌ వీరుడు అద్వైత్‌ దేవ్‌ధర్‌ కూడా పాల్గొన్నారు. లండన్‌, బర్మింగ్‌హామ్‌, లీసెస్టర్‌, మాంచెస్టర్‌, ఎడిన్‌బరో, న్యూక్యాజిల్‌ నగరాల్లో ఈ ర్యాలీ సాగింది. భాజపా ప్రవాస భారతీయ విభాగం అధ్యక్షుడు కుల్దీప్‌ షెకావత్‌ ఈ కార్యక్రమంలో మాట్లాడారు. బ్రిటన్‌లోని దాదాపు 10 వేల మంది ప్రవాస భారతీయులు సార్వత్రిక ఎన్నికల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొంటున్నారని చెప్పారు. ఎన్నికల్లో ఘన విజయం కోసం ప్రధాని మోదీకి మద్దతు ఇవ్వాలని కోరారు. విపక్ష కాంగ్రెస్‌కు చెందిన ఇండియన్‌ ఓవర్‌సీస్‌ కాంగ్రెస్‌ (ఐవోసీ యూకే) పశ్చిమ లండన్‌ నుంచి ర్యాలీని చేపట్టింది. ఇది బర్మింగ్‌హామ్‌, కోవెంట్రీ, స్లోవ్‌ గుండా సాగింది. అంతిమంగా వాయవ్య లండన్‌కు చేరుకుంది. కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొస్తే భారత్‌కు తిరిగి వెలుగులీనుతుందని ఐవోసీ యూకే అధికార ప్రతినిధి సుధాకర్‌ గౌడ్‌ చెప్పారు.

పుల్వామా దాడికి లండన్ ప్రవాసుల నిరసన

పుల్వామా ఉగ్రదాడిని ఖండిస్తూ పలు దేశాల్లోని భారతీయులు పాకిస్థాన్‌ వైఖరిపై తీవ్ర నిరసన వ్యక్తంచేస్తున్నారు. లండన్‌లోని పాక్‌ హై కమిషన్‌ వద్ద పలువురు ప్రవాస భారతీయులు భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమని.. అక్కడ పాకిస్థాన్‌ దాష్టీకాలు ఎంతమాత్రం సాగబోవని పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచ దేశాలు పోరాటం చేయడం సహా పాకిస్థాన్‌ను ఉగ్రవాద దేశంగా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. ఆస్ట్రేలియా, మెల్‌బోర్న్‌ లోనూ భారతీయులు పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా ధర్నాలు చేశారు. ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడాన్ని ఇకనైనా ఆపివేయాలని పాకిస్థాన్‌ను హెచ్చరించారు.

లండన్ తెలుగు సంఘం వాలీబాల్ పోటీల విజేతలు వీరేlondonteluguassociation2019volleyballcompetitionstnilivetnisportstelugunewsinternationalయుక్త సంక్రాంతి వేడుకలు

యునైటెడ్ కింగ్‌డమ్ తెలుగు అసోసియేషన్ (యుక్త) ఆధ్వర్యం లో తొమ్మిదవ సంక్రాంతి వేడుకలు ఈస్ట్ లండన్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులు గా SBI బ్యాంకు ప్రతినిధి తులా శ్రీనివాస్ విచ్చేశారు. సంస్కృతి సంప్రదాయాల గురించి ముందు తరాలకి అవగాహన కల్పించే కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని కోరారు. స్త్రీలకు ముగ్గు పోటీలు, చిన్న పిల్లలకు భోగి పళ్ళు, ఫ్యాన్సీ డ్రెస్, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, కోలాటాలతో ఆద్యంతం అలరిస్తూ సాగింది. ‘చిన్న పిల్లకు సమృద్ధి, ఆయురారోగ్యాలు కలగుతాయని, అందుకే భోగి పళ్ళు పోస్తారని” పద్మ కిల్లి అన్నారు. అనంతరం యుక్త అధ్యక్షులు ప్రసాద్ మంత్రాల మాట్లాడుతూ.. తెలుగు పండుగ రోజు తెలుగు వారందరూ తెలుగు నేల కాని చోట కలుసుకోవడమే ఒక పెద్ద పండుగ అని, సాంస్కృతిక కార్యక్రమాలు ముఖ్యంగా బాలలు పాల్గొన్నవి చూస్తుంటే బ్రిటన్ లో తెలుగు ను మరువకుండా పిల్లలకు తెలుగు వారసత్వాన్ని ఇస్తున్న తల్లిదండ్రులకు ప్రత్యెక వందనాలను తెలియజేశారు. మన భాష సంప్రదాయాలనే కాక మన వంటలు, పిండి వంటలను కూడా ఈ నేలపై ఉన్న వారికి రుచి చూపిస్తూ తెలుగు రుచులను జగత్‌ వ్యాపితం చేద్దాము అని పిలుపునిచ్చారు. ఐదు గంటల పాటు సాగిన ఈ కార్యక్రమానికి సుమారు వెయ్యి మందికి పైగా విచ్చేశారు. ఈ కార్యక్రమానికి తోడ్పాటు నిచ్చిన వారందరికీ యుక్తా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసింది. ఈ కార్యక్రమంలో యుక్త కార్యవర్గ సభ్యులు సత్యప్రసాద్ మద్దసాని, నరేంద్ర మున్నలూరి, రుద్రవర్మ బట్ట, రాజ్ ఖుర్భా, అమర్ చింతపల్లి, కార్తీక్ గంట, కృష్ణ యలమంచిలి, ఆదిత్య అల్లాడి తదితరులు పాల్గొన్నారు .

౩౩ని 100చేస్తాం

ప్రస్తుతం 33 దేశాల్లో ఉన్న తెరాస శాఖలను.. వంద దేశాలకు విస్తరించనున్నామని ఎంపీ కల్వకుంట్ల కవిత తెలిపారు. వివిధ దేశాల్లో ఉంటున్న తెలంగాణ ప్రజలు గర్వపడేలా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. కేటీఆర్ నేతృత్వంలో ఎన్ఆర్ఐ పాలసీ రూపొందిస్తున్నారని కవిత చెప్పారు. గల్ఫ్ వంటి దేశాల్లోని వారికి సహాయ, సహకారాలు అందించేలా ఉంటామన్నారు. తెరాస ఎన్ఆర్ఐ కార్యకర్తలు ఆయా దేశాల్లో నివసిస్తున్న తెలంగాణ ప్రజలకు… ఇక్కడ ప్రభుత్వం, పార్టీకి వారధిగా పనిచేయాలని కోరారు. అందరూ కలిసి పనిచేస్తే తెలంగాణ ఆదర్శవంతంగా నిలుస్తుందన్నారు. ప్రవాస తెలంగాణ బిడ్డలు ఉద్యమ స్ఫూర్తిని విడిచిపెట్టకుండా పనిచేయాలని కవిత కోరారు. తెలంగాణ భవన్‌లో జరిగిన తెరాస లండన్ విభాగం ఎనిమిదో వార్షికోత్సవంలో కవిత పాల్గొన్నారు.

లండన్‌లో ఎన్నారై తెరాస విజయోత్సవాలు

NRI TRS Celebrates Victory Dec 2018
లండన్ లో ఎన్నారై టి.ఆర్.ఎస్.సెల్ యూకే అధ్వర్యంలో ‘టీ.ఆర్.యస్ విజయోత్సవ’ వేడుకలు ఘనంగా నిర్వహించారు. యూకే నలుమూలల నుండి భారీగా టీ.ఆర్.యస్ కార్యకర్తలు, కెసిఆర్ అభిమానులు మరియు ప్రవాస బిడ్డలు హాజరయ్యారు. ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ పెద్దిరాజు మరియు కార్యదర్శి సత్యమూర్తి చిలుముల ఆద్వర్యం లో జరిగిన ఈ వేడుకల్లో కార్యక్రమంలో ముందుగా తెలంగాణ సిద్ధాంత కర్త జయశంకర్ గారి చిత్ర పటానికి పూలతో నివాళుర్పించి, అమరవీరులని స్మరించుకొని రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం కేకును కట్ చేసి ఆనందోత్సాలతో విజయోత్సవ వేడుకలు జరుపుకున్నారు. ఈ సంధర్భంగా ఎన్నారై టి.ఆర్.ఎస్.సెల్ యూకే ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ పెద్దిరాజు మాట్లాడుతూ లండన్ లో’టీ.ఆర్.యస్ విజయోత్సవ’ వేడుకలు జరుపుకుంటున్నందుకు సంతోషంగా ఉందని, టీ.ఆర్.యస్ పార్టీని మళ్ళీ అధికారం లోకి తెచ్చిన తెలంగాణ ప్రజలకు, పార్టీ అభ్యర్ధులని ముందుండి గెలిపిచ్చిన కెసిఆర్ గారికి, టీ.ఆర్.యస్ కార్యకర్తలకు నాయకులకు కృతఙ్ఞతలు తెలిపారు. కెసిఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలన్న సంకల్పంతో లండన్ నుండి ప్రత్యేక బృందం నెలరోజులకు పైగా రాష్ట్రమంతటా పర్యటించి ప్రచారం నిర్వహించిన అనిల్ కూర్మాచలం మరియు అశోక్ గౌడ్ దుసారి బృందానికి ప్రత్యేక కృతజ్ఞతాభినందనాలు తెలిపారు. అలాగే కే.టీ.ఆర్ గారు నూతన కార్యనిర్వాహణ అధ్యక్షుడి గా నియమింపబడడం మాకందరికి చాలా సంతోషంగా – స్ఫూర్తిగా ఉందని శుభాకాంక్షలు తెలిపారు. కార్యదర్శి సృజన రెడ్డి మాట్లాడుతూ టీ.ఆర్.యస్ పార్టీ విజయం తెలంగాణ ప్రజల విజయమని, పార్టీ గెలుపుకి కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతఙ్ఞతలు తెలిపారు. అలాగే ముఖ్యమంత్రిగా రెండవసారి బాధ్యతలు చేపట్టిన కెసిఆర్ గారికి శుభాకాంక్షలు తెలిపారు. కార్యదర్శి సత్య చిలుముల మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కెసిఆర్ గారు చేసిన ఆభివృద్ధి పనులు,సంక్షేమ కార్యక్రమాలే టీ.ఆర్.యస్ పార్టీని విజయపథం లో నిలిపాయని, ప్రజలంతా విజ్ఞతతో వ్యవహరించి సరైన నాయకత్వాన్ని ఎన్నుకున్నారని, ప్రజలందరికి శుభాకాంక్షలు తెలిపారు. కెసిఆర్ గారిని రెండవ సారి ముఖ్యమంత్రిగా చూడడం సంతోషంగా ఉందని, తెలంగాణ ప్రజలంతా అదృష్టవంతులని ఇక రాష్ట్రం మరింత ప్రగతి తో ముందుకు వెళ్తుందని తెలిపారు. కే.టీ.ఆర్ గారిని నూతన కార్యనిర్వాహణ అధ్యక్షుడి గా నియమించిన కెసిఆర్ గారికి కృతఙ్ఞతలు తెలిపారు. ఈ వేడుకల్లో హాజరైన టాక్ అధ్యక్షురాలు పవిత్ర రెడ్డి కంది మాట్లాడుతూ ఎన్నారైలంతా టీ.ఆర్.యస్ పార్టీ అధికారంలోకి రావాలని కోరుకున్నారని, కెసిఆర్ గారి నాయకత్వాన్ని కేవలం రాష్ట్ర ప్రజలే కాదు నేడు దేశ ప్రజలు కూడా కోరుకుంటున్నారని, టీ.ఆర్.యస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. కెసిఆర్ గారు రెండవ సారి ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేసినందుకు శుభాకాంక్షలు తెలిపారు. ఇతర నాయకులు శ్రీకాంత్ జెల్లా, సురేష్ గోపతి, మధు, గణేష్ మరియు నవీన్ మాట్లాడుతూ టీ.ఆర్.యస్ పార్టీ ఘనవిజయం తెలంగాణ చారిత్రాత్మక అవసరమని, ప్రజలంతా కెసిఆర్ గారి వెంటే ఉన్నారని మరొక్కసారి రుజువైందని, ఇక కెసిఆర్ గారి సేవలు దేశానికి అవసరమని, రాబోయే ఎంపీ ఎన్నికల్లో సైతం రాష్ట్రానికి వచ్చి పరచారం నిర్వహించి పార్టీ గెలుపుకి కృషి చేస్తామని తెలిపారు. కే.టీ.ఆర్ గారు నూతన కార్యనిర్వాహణ అధ్యక్షుడి గా నియమింపబడ్డడం మాకెంతో సంతోషంగా ఉందని, వారికి శుభాకాంక్షలు తెలిపి, ఖండాంతరాల్లో మొట్టమొదటి ఎన్నారై శాఖ లండన్ లో స్థాపించిన సంగతి తెలిసిందే కాబట్టి అధ్యక్షగా హోదాలో లండన్ లో కే.టీ.ఆర్ గారు పర్యటించాలని కోరారు. చివరిగా అధికార ప్రతినిధి రవి రేతినేని వందన సమర్పణ చేస్తూ, ఈ వేడుకలకు హాజరైన ప్రతి ఒక్కరికి కృతఙ్ఞతలు తెలిపారు, అలాగే లండన్ నుండి తెలంగాణ వెళ్లి ఎన్నికల్లో ప్రచారం చేసిన లండన్ తెరాస బృందానికి కృతఙ్ఞతలు తెలిపారు. అలాగే హాజరైన టాక్ సంస్థ నాయకులకు ఇతర తెలంగాణ బిడ్డలకు కృతఙ్ఞతలు తెలిపారు. ఈ వేడుకల్లో ఎన్నారై టి.ఆర్.యస్ సెల్ యూకే ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ పెద్దిరాజు మరియు టాక్ అధ్యక్షురాలు పవిత్ర రెడ్డి కంది, ఎన్నారై టీ.ఆర్.యస్ యూకే కార్యదర్శి సృజన రెడ్డి మరియు సత్యమూర్తి చిలుముల, శ్రీకాంత్ జెల్లా, దొంతుల వెంకట్ రెడ్డి, సత్యం రెడ్డి కంది, ప్రవీణ్ వీర, మధుసూదన్ రెడ్డి, హరి నవపేట్, మల్లా రెడ్డి, సురేష్ గోపతి, నవీన్ మాదిరెడ్డి, రవి ప్రదీప్, గణేష్ పాస్తం,సురేష్ బుడగం,నవీన్ భువనగిరి, భాస్కర్ రావు, సత్యపాల్ రెడ్డి, రవి కుమార్ రేటినేని, అశోక్ అనంతగిరి, ప్రశాంత్, రామకృష్ణ, రాకేష్ పటేల్, వంశీ పొన్నం, శ్రీనివాస్ మేకల, మహేందర్, సతీష్, లత కూర్మాచలం, స్వాతి బుడగం, సుప్రజ పులుసు, మమత జక్కీ ,శ్వేతా మహేందర్, శైలజ జెల్ల, అపర్ణ, శ్రీ లక్ష్మి, దీపాక్షర తదితరులు హాజరైన వారిలో వున్నారు.

బ్రిటన్ వీసాలు భారతీయులవే!

బ్రిటన్‌ ఉద్యోగ వీసాల్లో సింహ భాగం భారతీయులకే దక్కుతున్నట్లు తాజా నివేదిక తెలిపింది. నిపుణులకు ఇచ్చే టైర్‌-2 ఉద్యోగ వీసాలు గత ఏడాదితో పోలిస్తే ఈసారి 2,266 ఎక్కువగా భారతీయులకు జారీ అయినట్లు వెల్లడించింది. బ్రెగ్జిట్‌తో ఐరోపా సమాఖ్య (ఈయూ) వలసదారుల సంఖ్య తగ్గుతుంటే.. భారత్‌ లాంటి ఈయూయేతర దేశాల నుంచి వచ్చేవారి సంఖ్య పెరుగుతోందని పేర్కొంది. బ్రిటన్‌లోని జాతీయ గణాంకాల కార్యాలయం (ఓఎన్‌ఎస్‌) గురువారం ఈ వివరాలను వెల్లడించింది.
* మొత్తం ఉద్యోగ వీసాల్లో టైర్‌-2 వీసాల వాటా సగం వరకూ ఉంది. గత ఏడాది సమాచారంతో పోల్చినప్పుడు వీటి సంఖ్య 15 శాతం వరకూ పెరిగింది. వీటిలో ఎక్కువ భారత ఐటీ నిపుణులకే దక్కాయి.
* గత ఏడాది బ్రిటన్‌ విద్యా సంస్థల్లో చదువుకొనేందుకు వచ్చిన భారత విద్యార్థుల సంఖ్యా 33 శాతం పెరిగింది. మొత్తంగా గత ఏడాది 18,735 మంది భారత విద్యార్థులు వీసాలు పొందారు.
* పర్యాటక వీసాల్లోనూ భారతీయుల సంఖ్య ఎక్కువగా ఉంది. గత ఏడాదితో పోల్చినప్పుడు 41,224 వీసాలు పెరిగి.. ప్రస్తుతం 4,68,923కు చేరుకున్నాయి.

కేసీఆర్‌పై డాక్యుమెంటరీ రూపొందించిన లండన్ ఎన్నారై తెరాస

ఎన్నారై టీఆర్ఎస్ లండన్ శాఖ రూపొందించిన టీఆర్ఎస్ పార్టీ-కేసీఆర్ ఉద్యమ, అభివృద్ధి చరిత్ర డాక్యుమెంటరీ సీడీని ‘నాడు-నేడు కేసీఆర్ బాటలో..’ ఎంపీ కవిత ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి లండన్ నుండి ఎన్నారై టీఆర్ఎస్ యూకే బృందం రాష్ట్రానికి చేరుకున్న విషయం తెలిసిందే. టీఆర్ఎస్ ఆవిర్భావం నుండి కేసీఆర్ నాయకత్వంలో జరిగిన ఉద్యమం, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణలో ప్రవేశపెట్టిన సంకేమ పథకాలు, చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన విషయాలను డాక్యుమెంటరీలో పొందుపరిచారు. ఈ సందర్బంగా ఎన్నారై యూకే సెల్ బృందం సభ్యులు రాష్ట్రంలో వివిధ నియోజకవర్గాల్లో నిర్వహించబోయే ఎన్నికల ప్రచార కార్యాచరణపై ఎంపీ కవితతో కలిసి చర్చించి..సలహాలు సూచనలు తీసుకోవడం జరిగింది.టీఆర్ఎస్ యూకే సెల్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం, యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి, ఉపాధ్యక్షుడు నవీన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రత్నాకర్ కడుదుల, అడ్వైజరీ బోర్డు వైస్ చైర్మన్ సీకా చంద్రశేఖర్ గౌడ్, నాయకులు మల్లేష్ పప్పుల తదితరులు పాల్గొన్నారు.

లండన్‌లో తెరాస ప్రచార కార్యాలయం ప్రారంభం

తెలంగాణ రాష్ట్రం లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నారై టీ. ఆర్. యస్ ఆధ్వర్యం లో వినూత్న ప్రాచార కార్యక్రమం ” టీ.ఆర్.యస్ మిషన్” ఇటీవల ఎంపీ కవిత మరియు ఎన్నారై కో-ఆర్డినేటర్ మహేష్ బిగాల చేతుల మీదుగా ప్రారంభించిన సంగతి అందరికీ తెలిసిందే. దీనికి సంబందించి ఈరోజు లండన్ లో ఎన్నారై టీ. ఆర్. యస్ యూకే ఆధ్వర్యం లో ప్రత్యేక ప్రచార కార్యాలయాన్ని ప్రారంభించారు. ఎన్నారై టీఆర్‌ఎస్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం మరియు ఎన్నారై టీఆర్‌ఎస్ -యూకే అధ్యక్షులు అశోక్ గౌడ్ దూసరి నాయకత్వంలో టీఆర్‌ఎస్-యూకే టీమ్ ఈ వార్ రూమ్ కార్యాలయాన్ని ప్రారంభించింది. టీఆర్‌ఎస్ ఎన్‌ఆర్‌ఐ సమన్వయకర్త మహేశ్ బిగాల స్కైప్ ద్వారా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. పలు సూచనలు, సలహాలు అందించారు. ఈ కార్యాలయం ద్వారా ఆసరా పించన్లు, నిరుద్యోగ భృతి, కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్, రైతుబంధు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ సహా టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కాల్ క్యాంపేయిన్ వాలంటీర్లు తెలంగాణలోని ఓటర్లకు ఫోన్ కాల్ ద్వారా వివరించనున్నారు. ఈ సంధర్భంగా అనీల్ కూర్మాచలం మాట్లాడుతూ ఏ విధంగా నైతే ఉద్యమ సమయంలోఎన్నారై టీఆర్‌ఎస్-యూకే తన వంతు పాత్ర పోషించిందో ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో కూడా క్రియాశీలకంగా ప్రచారం చేయబోతోందని అన్నారు. రాబోయే రోజుల్లో ప్రతీ కార్యకర్త తమ తమ శక్తి మేరకు ప్రచారం చేసి గత నాలుగు సంవత్సరాల మూడు నెలల్లో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి టీ.ఆర్.యస్ పార్టీ ని అధికారంలో తీసుకొచ్చే విధంగా పని చెయ్యాలని పిలుపునిచ్చారు. కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎన్నారై టీఆర్‌ఎస్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం,యూకే అధ్యక్షులు అశోక్ గౌడ్ దూసరి ఉపాధ్యక్షులు నవీన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రత్నాకర్ కడుదుల, అడ్వైసరీ బోర్డు వైస్ చైర్మన్ సీకా చంద్రశేఖర్ గౌడ్, అడ్వైసరీ బోర్డు సభ్యులు ప్రవీణ్ కుమార్ వీర, వైస్ చైర్మన్ మధుసూధన్ రెడ్డి, సెక్రటరీలు సృజన్ రెడ్డి చాడ, హరి గౌడ్ నవాబుపేట్, సత్య చిలుముల, శ్రీకాంత్ జెల్ల, సంయుక్త కార్యదర్శులు సేరు సంజయ్,మల్లా రెడ్డి బీరం, సతీష్ రెడ్డి బండ,రమేష్ యేసంపల్లి,సురేష్ గోపతి,
అధికార ప్రతినిధులు రవి కుమార్ రేటినేని,రవి ప్రదీప్ పులుసు, లండన్ ఇంచార్జ్ నవీన్ భువనగిరి, భాస్కర్ మొట్ట, మీడియా ఇంచార్జ్ సత్యపాల్ పింగిళి, ఐటీ సెక్రటరీ వినయ్ ఆకుల, మెంబెర్ షిప్ ఇంచార్జ్ అశోక్ కుమార్ అంతగిరి,ఈస్ట్ లండన్ ఇంఛార్జ్ ప్రశాంత్ కటికనేని.రీజినల్ కోఆర్డినేటర్ శివ కుమార్ (లీడ్స్),ఎగ్జిక్యూటివ్ సభ్యులు రామ్ కలకుంట్ల పాల్గొన్నారు. జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ గెలుపే లక్ష్యంగా వీరంతా పనిచేయనున్నారు.

తెలంగాణా ఎన్నారై ఫోరం ఆధ్వర్యంలో లండన్‌లో బతుకమ్మ వేడుకలు

తెలంగాణ ఎన్నారై ఫోరమ్ ఆధ్వర్యంలో లండన్‌లో ఘనంగా మెగా బతుకమ్మ నిర్వహించారు. యూరోప్‌లోనే అతిపెద్ద బతుకమ్మ పండగను లండన్‌లో నిర్వహించారు. దాదాపు 2500 మంది బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొన్నారు. మొదట అమ్మవారి పూజతో ప్రారంభమైంది. యువతులు, మహిళలు బతుకమ్మ ఆట, కట్టే కోలాటం ఆడారు. సాంప్రదాయక బతుకమ్మ ఆటనే ప్రోత్సహించడానికి నూతన పోకడలకు, డీజేల జోలికి వెళ్లకుండా పూర్తి స్థాయిలో సాంప్రదాయ బద్దంగా బతుకమ్మను నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన లండన్ ఎంపీ వీరేంద్ర శర్మ మాట్లాడుతూ భారతీయ సాంప్రదాయాలు కాపాడవలసిన బాధ్యత ఎన్నారైల పైన ఉందని, 6 ఏళ్లుగా బతుకమ్మ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేసినందుకు తెలంగాణకు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ఎన్నారై ఫోరమ్ అధ్యక్షుడు ప్రమోద్ గౌడ్ అంతటి మాట్లాడుతూ యూరోప్‌లోనే అతి పెద్ద బతుకమ్మ నిర్వహణ బాధ్యతకు సహకరించిన అందరికి ధన్యవాదాలు తెలిపారు. యూరోప్‌లోనే మొట్ట మొదటి బతుకమ్మకు పునాదులు వేసి నిర్వహించిన తెలంగాణ ఎన్నారై ఫోరమ్ వ్యవస్థాపకులు గంప వేణుగోపాల్ ను అభినందించారు. 2010లో నిర్వహణ ఎలా చేయాలో ఎక్కడ చేయాలో ఆర్ధిక వనరులు ఎలా సమకూర్చాలో తెలియని సమయంలో గంప వేణుగోపాల్‌ చేసిన కృషి మరచిపోలేనిదని పేర్కొన్నారు. 2012లో బ్రిటన్ లో వివిధ ప్రాంతాల్లో ఊరూరా బతుకమ్మ నిర్వహించి బతుకమ్మ భావజాలాన్ని చాటుతూ ప్రతి తెలంగాణ బిడ్డ బతుకమ్మ ఆటలో పాల్గొనే స్థాయికి చేరుకుందని అన్నారు.

లండన్ పర్యటనలో భట్టి విక్రమార్క

కాంగ్రెస్‌కు పెరుగుతున్న ఆదరణతో తెరాస అధినేత, సీఎం కేసీఆర్‌ విచక్షణ కోల్పోయి విమర్శలు చేస్తున్నారని టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్‌ భట్టి విక్రమార్క ఆరోపించారు. లండన్‌లో టీపీసీసీ ఎన్నారై సెల్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పలువురు ఎన్నారైలు కాంగ్రెస్‌లో చేరారు. ఎన్నారై సెల్‌ కన్వీనర్‌ గంప వేణుగోపాల్‌, కో కన్వీనర్‌ సుధాకర్‌గౌడ్‌ సమక్షంలో శ్రీధర్‌ నీలా, జయంత్‌ సహా 20 మంది పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ మేరకు టీపీసీసీ ఎన్నారై సెల్‌ ప్రకటన విడుదల చేసింది. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో ఎన్నారైలు కాంగ్రెస్‌కు మద్దతుగా నిలవాలని, తెరాస నిరంకుశ పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో ఎన్నారైలు అగ్రభాగాన నిలవాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ మాట్లాడుతూ.. ప్రవాస భారతీయుల చేరిక కాంగ్రెస్‌ పార్టీలో నూతనోత్సాహం నింపుతుందని అన్నారు. పూర్వ వరంగల్‌ జిల్లాలో కాంగ్రెస్‌ క్లీన్‌ స్వీప్‌ చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీలో చేరిన శ్రీధర్‌ నీలా మాట్లాడుతూ కొండా దంపతుల మార్గదర్శకంలో నడుస్తామని, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని చెప్పారు. పార్టీలో చేరిన వారిలో జయంత్‌ వద్దిరాజు, కొప్పుల శశిధర్‌, గుండు రజిత, మధు, దీక్షిత్‌ పోలిపాక, మేరీ, ప్రకాశ్‌, రూపేష్‌ భారతి కొప్పుల, గోవర్ధన్‌ రెడ్డి బొంత, కార్తీక్‌ తోట, మహేష్‌ ఎనపోతుల తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో బిక్కుమండ్ల రాకేశ్‌, శ్రీధర్‌ మంగళరపు, యువజన విభాగం నాయకులు బాలకృష్ణారెడ్డి మాడెల వీడు, సీనియర్‌ నాయకులు మెరెడ్డి రాజేశ్వర్‌రెడ్డి, మధు గట్టా, ఆస్ర అంజుమ్‌ తదితరులు పాల్గొన్నారు.

లండన్‌లో “టాక్” చేనేత దసరా గోడపత్రికను ఆవిష్కరించిన కవిత

తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆద్వర్యం లో అక్టోబర్ 20 వ తేదీనాడు నిర్వహిస్తున్న “లండన్ – చేనేత బతుకమ్మ – దసరా ” వేడుకల పోస్టర్ ని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు – ఎంపీ కవిత ఆవిష్కరించారు. నేడు హైదరాబాద్ లో టాక్ ప్రతినిధులు మధుసుధన్ రెడ్డి, శ్వేతా మరియు జాహ్నవి ఎంపీ కవిత ను కలిశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేనేతకు చేయూతనివ్వడానికి చేస్తున్న కార్యక్రమాలకు స్పూర్తితో, ఈ సంవత్సరం కూడా టాక్ జరిపే వేడుకలను “చేనేత బతుకమ్మ” గా నిర్వహిస్తున్నామని, వీలైనంత వరకు ప్రవాసులల్లో చేనేత పై అవగాహన కలిపించి, వీలైనన్ని సందర్భాల్లో చేనేత వస్త్రాలు ధరించి నేత కుటుంబాలకు అండగా నిలవాలని కోరుతున్నట్టు తెలిపారు.

లండన్‌లో ఘనంగా గణేష్ నిమజ్జన వేడుకలు


లండన్ నగరంలోని హౌంస్లో ప్రాంతంలో హైదరాబాద్ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో ఆరవ సారి ఘనంగా గణేష్ వేడుకలు జరిగాయి. యూత్ సభ్యులతో పాటు అక్కడున్న తెలంగాణవాసులు భక్తిశ్రద్ధలతో పూజలు చేసిన అనంతరం వినాయక నిమజ్జనం ఘనంగా నిర్వహించారు. లండన్ వీధుల్లో గణేష్ విగ్రహ ఊరేగింపు శోభాయమానంగా సాగింది. నిమజ్జనాన్ని చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఇందులో వివిధ రాష్ట్రాలకు చెందిన కుటుంబాలే కాకుండా స్థానిక బ్రిటిష్ వాసులు పాల్గొని, ఆట పాటలతో సంబరాలు చేశారు. ‘గణపతి బప్పా మోరియా’, ‘జై బోలో గణేష్ మహారాజ్ కి జై’ అంటూ లండన్ వీధులు దద్దరిల్లాయి. బ్రిటన్ వాసులు కూడా తరలి వచ్చి ఈ వేడుకల్లో పాల్గొనడం విశేషం.సహకారాలు అందించిన అందరికి కృతఙ్ఞతలు తెలిపారు. ఈ పూజ కోసం ప్రత్యేకంగా తయారు చేసిన లడ్డుని వేలం పాటలో ధనంజయ్ 802 పౌండ్స్ కి దక్కించుకోవడం జరిగింది. అనంతరం గణపయ్యకు ఘనమైన పూజలు చేసిన భక్తులు అద్భుత రీతిలో సాగనంపారు. థేమ్స్ నదిలో గణపయ్యలను నిమజ్జనం చేశారు.ఎన్నారై టిఆర్ఎస్ మరియు సంస్థ అధ్యక్షుడు అశోక్ దూసరి, ఎన్నారై టిఆర్ఎస్ మాజీ అధ్యక్షులు మరియు తెలంగాణా అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్( టాక్ ) వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం మరియు టాక్ అధ్యక్షురాలు శ్రీమతి పవిత్ర రెడ్డి కంది ఇతర సభ్యులు కుటుంబ సమేతంగా హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ముఖ్య నిర్వాహకులు రత్నాకర్ కడుదుల, నవీన్ రెడ్డి, మల్లా రెడ్డి, విక్రమ్ రెడ్డి రేకుల, సత్య చిలుముల, సత్యపాల్ పింగిళి, రామ రావు, శ్రీధర్ మెరుగు, శ్రీకాంత్ రెడ్డి, వంశీ రేక్నోర్, వెంకీ, రాజేష్ వాకా, నగేష్, రాకేష్, రవి కిరణ్ తో పాటు ఎన్నారై తెరాస యూకే ముఖ్య నాయకులు చంద్రశేఖర్ సిక్కా, రవి ప్రదీప్ పులుసు, రవి రత్తినేని, శ్రీకాంత్ జెల్లా, వెంకట్ రెడ్డి, సురేష్ బుడగం, ప్రశాంత్, సురేష్ గోపతి, గణేష్ పాస్తం మరియు టాక్ ముఖ్య నాయకులు స్వాతి బుడగం, రాకేష్ పటేల్, వంశీ పొన్నం, శుష్మున రెడ్డి, అపర్ణ, శైలజ, శ్రావ్య, స్వాతి, విజిత రెడ్డి, శ్రీ కాపు, స్థానిక ప్రవాసులు శ్రీకాంత్ జింకల, రమేష్, మధు గుల్యాగారి, సందీప్, నగేష్ రెడ్డి, నాగార్జున రెడ్డి, ధర్మ ముట్ట, చెర్రీ, కిషోర్, తదితరులు పాల్గొన్నారు.

లండన్ గణపతి నవరాత్రుల్లో ఎన్నారై తెరాస పూజలు

గణపతి నవరాత్రుల్లో భాగంగా హైదరాబాద్ ఫ్రెండ్స్ యూత్ లండన్ ఆద్వర్యంలో నిర్వహించిన లక్ష్మి గణపతి హోమంలో ఎన్నారై తెరాస యూకే కార్యవర్గ సభ్యులు కుటుంబ సమేతంగా హాజరై లక్ష్మి గణపతి హోమంలో లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఇటీవల కొండగట్టులో ప్రమాదం లో ప్రాణాలు కోల్పయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబసభ్యులకు భగవంతుడు మనోదైర్యాన్నివ్వాలని, ఇక ముందు అటువంటి బాధాకరమైన సంఘటనలు జరగకుండా ప్రజలందరినీ కాపాడాలని ప్రార్థించారు.
అలాగే ముఖ్యంగా రాబోయే ఎన్నికల్లో టి.ఆర్.యస్ పార్టీ వందకు పైగా సీట్లని గెలిచి కెసిఆర్ గారు మరొక్కసారి ముఖ్యమంత్రై తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్లాలని పూజలు నిర్వహించారు. కెసిఆర్ గారు ఆయురారోగ్యాలతో ఉండాలని వారికి భగవంతుండు అన్ని రకాల శక్తిని మనోధైర్యాన్నిచ్చి,ఎటువంటి ఆటంకాలు కలగకుండా రాష్ట్రాన్ని ప్రగతి వైపు తీసుకెళ్లేలా దీవించాలని ప్రార్థించారు. చివరిగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధి కేవలం కెసిఆర్ నాయత్వం తోనే సాదయమని, ప్రజలంతా ఎటువంటి సందేహం లేకుండా ఎన్నికలు ఎప్పుడొచ్చినా టి.ఆర్.యస్ కి ఓటేసి వంద సీట్లకు పైగా గెలిచేలా ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమం లో ఎన్నారై తెరాస యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి, మాజీ అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం , ఉపాధ్యక్షుడు నవీన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రత్నాకర్ కడుదుల, అడ్వైసరీ వైస్ చైర్మన్ సిక్కా చంద్రశేఖర్ గౌడ్ మరియు అడ్వైసరీ సభ్యుడు దొంతుల వెంకట రెడ్డి , కార్యదర్శులు సృజన్ రెడ్డి మరియు సత్యమూర్తి చిలుముల, సంయుక్త కార్యదర్శి మల్లా రెడ్డి, లండన్ ఇంచార్జ్ సురేష్ బుడగం , అధికార ప్రతినిధి రవి ప్రదీప్ పులుసు మరియు రవి రేతినేని, నాయకులు సత్యపాల్ రెడ్డి పింగళి, వంశీ పొన్నం మరియు టాక్ కార్యదర్శి రాకేష్ పటేల్, టాక్ మహిళా నాయకులు సుప్రజ పులుసు, శుషుమ్న రెడ్డి, క్రాంతి తో పాటు వీరి కుటుంబసభ్యులంతా పాల్గొన్నారు.

బ్రిటన్‌లో వారం రోజుల బతుకమ్మ

తెలంగాణ పూలపండుగకు ఖండాంతర ఖ్యాతి లభించేలా మరిన్ని దేశాల్లో బతుకమ్మ ఉత్సవాలను నిర్వహిస్తామని నిజామాబాద్ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. బ్రిటన్లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఏడువారాల బతుకమ్మ ఉత్సవాల వెబ్సైట్, గోడపత్రికలను శుక్రవారం హైదరాబాద్లోని తమ నివాసంలో కవిత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బతుకమ్మ ఉత్సవాలు ప్రపంచంలోని 60 దేశాల్లో జరుగుతున్నాయని, త్వరలో మరో 20 దేశాల్లో నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. అక్టోబరులో బ్రిటన్లోని ఏడు నగరాల్లో పెద్దఎత్తున ఉత్సవాలు జరుగుతాయని.. తాను హాజరవుతానని కవిత వివరించారు. ఈ సమావేశంలో జాగృతి ప్రధాన కార్యదర్శి రంగు నవీన్ఆచారి, జాగృతి బ్రిటన్ సలహాదారు గోలి తిరుపతి, సమన్వయకర్త రోహిత్రావు, రాష్ట్ర నేతలు రాజీవ్సాగర్, కుమారస్వామి, నితీష్, ప్రశాంత్, దినేశ్రెడ్డిలు పాల్గొన్నారు. ఉత్సవాలకు హాజరయ్యేందుకు అంగీకరించిన కవితకు బ్రిటన్ జాగృతి అధ్యక్షుడు బల్మూరి సుమన్రావు కృతజ్ఞతలు తెలిపారు.

యుక్తా ఆధ్వర్యంలో 72 గంటల నిర్విరామ సంగీత కచేరి.

హై కమిషన్ అఫ్ ఇండియా (హాయ్) ఆధ్వర్యంలో స్వాతంత్ర వేడుకలు లండన్ లో ఆదివారం రోజున ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో షుమారు 3000 ప్రవాస భారతీయులు పాల్గొన్నారు. యునైటెడ్ కింగ్డమ్ తెలుగు అసోసియేషన్ (యుక్త) ఆధ్వర్యంలో 72 గంటలపాటు అవిరామంగా జరగబోయే సంగీత విభావరిని భారతీయ హై కమిషనేర్ శ్రీనివాస్ గోత్రు గారు ఆవిష్కరించారు.ఇది గిన్నిస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డ్స్ నేతృత్వంలో 2019 లో జరుగబోతోంది. భారతీయ సంస్కృతి ప్రతిబింబించేల ఇటువంటి కారక్రమాలను నిర్వహిస్తునందుకు యుక్త సభ్యులను ప్రముఖులు ఎంపీ వీరేంద్ర శర్మ, మినిస్టర్ కోఆర్డినేషన్ ఏస్ రాజన్, ఐఏఎస్ నందకుమార కొనియాడారు. యుక్త సభ్యులు Dr వెంకట పద్మ కిల్లి, Dr అనిత రావు, నరేంద్ర మున్నలూరి, సత్య ప్రసాద్ మద్దసాని, ఉదయ్ ఆరేటి, బలరాం విష్ణుబొట్ల, కార్తీక్ గంట పాల్గొని ఈ వేడుకులను ఘనం నిర్వహించారు.

ఆమె ఏ హోదాలో హాజరు అయింది?

భారత క్రికెట్‌ జట్టు సారథి విరాట్‌ కోహ్లీ భార్య, బాలీవుడ్‌ నటి అనుష్క శర్మతో పాటు, బీసీసీఐపై నెటిజన్లు మండిపడుతున్నారు. అనుష్క ఏమైనా టీమిండియా వైస్‌ కెప్టెనా అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు. తాజాగా బీసీసీఐ ఓ ఫొటోను పంచుకోవడమే ఇందుకు కారణం. ఇంతకీ బీసీసీఐ పంచుకున్న ఆ ఫొటో ఏంటా? అని ఆలోచిస్తున్నారా. ప్రస్తుతం కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ కోసం ఇంగ్లాండ్‌లో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్‌ నటి అనుష్క కూడా కోహ్లీతో కలిసి అక్కడే ఉంది. లండన్‌లోని లార్డ్స్‌ మైదానంలో భారత్‌-ఇంగ్లాండ్‌ మధ్య గురువారం రెండో టెస్టు ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో లండన్‌ చేరుకున్న టీమిండియా ఆటగాళ్లు మంగళవారం ప్రాక్టీస్‌లో పాల్గొన్నారు. అనంతరం ఆటగాళ్లు ప్రత్యేక ఆహ్వానం మేరకు లండన్‌లోని భారత హైకమిషన్‌ కార్యాలయాన్ని సందర్శించారు. ఆటగాళ్లు, మేనేజ్‌మెంట్‌తో కలిసి అనుష్క కూడా వెళ్లింది. కార్యాలయం ఎదుట అందరూ కలిసి దిగిన ఫొటోను బీసీసీఐ ట్విటర్‌ ద్వారా పంచుకుంది. ఈ ఫొటోలు అనుష్కను చూసి అభిమానులు మండిపడ్డారు. ‘అనుష్క టీమిండియాలో సభ్యురాలా? అనుష్క శర్మ టీమిండియాతో కలిసి ఎందుకు ఉంది? ఇది క్రికెట్‌ టూరా? లేక హనీమూన్‌ టూరా? ఇదేమీ ఫ్యామిలీ ఫంక్షన్‌ కాదు! జట్టు వైస్‌ కెప్టెన్‌ ఏమో ఆఖరి వరుసలో నిల్చుంటే.. అనుష్క ముందు వరుసలో ఉంది. టీమిండియాకు అనుష్క శర్మ ఎప్పుడు ఎంపిక అయ్యింది? ఇంతకీ ఆమె టీమిండియాకు బౌలర్‌.. బ్యాటర్‌.. కోచ్‌.. ఏ విధంగా సేవలు అందిస్తోంది? ఆమె ఏమైనా టీమిండియా వైస్‌ కెప్టెనా’ అంటూ నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపించారు. సిరీస్‌లో భాగంగా భారత్‌-ఇంగ్లాండ్‌ మధ్య గురువారం రెండో టెస్టు ప్రారంభంకానుంది. ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన తొలి టెస్టులో భారత్‌ 31 పరుగుల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే.
Anushka Sharma in London along with team india angers fans-TNILIVE Sports

లండన్‌లో జయశంకర్ జయంతి

ఎన్నారై టి.ఆర్.యస్ సెల్ యూకే ఆద్వర్యం లో తెలంగాణ సిద్దాంత కర్త స్వర్గీయ ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి వేడుకలని లండన్ లో ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి యు.కే నలుమూలల నుండి తెలంగాణ వాదులు, టి.ఆర్.యస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

ఎన్నారై టి.ఆర్.యస్ యూకే ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ పెద్దిరాజు ఆధ్వర్యంలో, సంయుక్త కార్యదర్శి సురేష్ గోపతి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముందుగా జయశంకర్ గారి చిత్ర పటాన్ని పూల తో నివాలర్పించి, తెలంగాణ అమరవీరుల ను, జయశంకర్ గారిని స్మరిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు.

తరువాత సంస్థ ప్రతినిథులు మాట్లాడుతూ, తెలంగాణ బావజాల వ్యాప్తి లో జయశంకర్ గారి పాత్ర గొప్పదని, వారు చివరి వరకు తెలంగాణ రాష్ట్ర సాధన కోసమై పని చేసారని, అటువంటిది తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు అయిన సంతోష సందర్భం లో మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం అని పేర్కొన్నారు.

జయశంకర్ సర్ ఆశయ సాధనకై, రాష్ట్ర సాధనకై వారు చేసిన కృషి ని ప్రతి వ్యక్తి జీవితం లో ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు.

ప్రవాస తెలంగాణ సంఘాలు అన్ని ఆచార్య గారి మానస పుత్రికలని, వారి ఆశయాలకు అనుగుణంగా మనం తెలంగాణ సంక్షేమ కార్యక్రమాలలో పాల్గొనాలని తెలిపారు.

జయశంకర్ గారు కలలు కన్న తెలంగాణ కేవలం కెసిఆర్ గారి నాయకత్వంతోనే సాధ్యమని, అన్ని సందర్భాల్లో తెరాస పార్టీని, కెసిఆర్ నాయకత్వాన్ని బలపరచాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఎన్నారై టి.ఆర్. యస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి, మాజీ అద్యక్షుడు-టాక్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం, ఉపాధ్యక్షులు నవీన్ రెడ్డి, శ్రీకాంత్ పెద్దిరాజు, అడ్వైసరీ బోర్డు వైస్ చైర్మన్ సిక్కా చంద్రశేఖర్ గౌడ్ , కార్యదర్శులు హరి నవాపేట్ మరియు సత్య చిలుముల, సంయుక్త కార్యదర్శి సురేష్ గోపతి, లండన్ ఇంచార్జులు గణేష్ పాస్తం మరియు భాస్కర్ మొట్టా, ఈస్ట్ లండన్ ఇంచార్జ్ ప్రశాంత్ కటికనేని, ఎగ్జిక్యూటివ్ సభ్యులు రామ్ కలకుంట్ల తో పాటు తెలంగాణ జాగృతి యూకే అధ్యక్షుడు సుమన్ బలమూరి, జాగృతి యూరోప్ అధ్యక్షుడు సంపత్ ధన్నమనేని, టీ.డీ.ఎఫ్ అధ్యక్షుడు పింగళి శ్రీనివాస్ రెడ్డి తో పాటు వారి ప్రతినిధులు, స్థానిక తెలంగాణ వాదులు కిషోర్ మునగాల తదితరులు హాజరైన వారిలో ఉన్నారు.

కాగిత బ్యాలెట్ విధానానికి వెళ్ళాలి-లండన్ సభలో పద్మావతిరెడ్డి

తెలంగాణ ఎన్నారైల ఆహ్వానం మేరకు లండన్‌లో బోనాలకు విచ్చేసిన కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డితో టీపీసీసీ ఎన్నారై సెల్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్రాల్లో నియంతృత్వ పాలన నడుస్తోందన్నారు. వచ్చే ఎన్నికల్లో కేంద్ర, రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణలో 90 సీట్లు గెలిచేలా కార్యకర్తలు పనిచేస్తున్నారని తెలిపారు. అనేక సందర్భాల్లో ఈవీఎం యంత్రాల పని తీరుపై ప్రజల్లో సందేహాలు ఉన్నాయన్నారు. అభివృద్ధి చెందిన, టెక్నాలజీలో దూసుకుపోతున్న దేశాల్లో కూడా పేపర్ బ్యాలెట్ పద్దతిలో ఎన్నికలు జరుగుతున్నాయని పద్మావతి తెలిపారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజల సందేహాలను దృష్టిలో పెట్టుకొని పేపర్ బ్యాలెట్ పద్దతిలో ఎన్నికలు నిర్వహించేలా ఎన్నారైలు కూడా చొరవ చూపాలని కోరారు. బీజేపీ పాలనలో దేశం 100 ఏళ్లు వెనక్కి వెళ్లిందని ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ యూకే, యూరోప్ అధ్యక్షుడు కమల్ అన్నారు. సంపన్నులు సంపాదనలో 100 ఏళ్లు ముందుకు వెళ్లారన్నారు. ప్రధాని మోదీ సంపన్నులకు సేల్స్ మెన్‌గా పని చేస్తున్నారని మండిపడ్డారు. దళితులపై దాడులు అరికట్టడంలో మోదీ విఫలం అయ్యారని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నారైలను నిర్లక్ష్యం చేస్తుందని టీపీసీసీ ఎన్నారై సెల్ కన్వీనర్ గంప వేణుగోపాల్ అన్నారు. ఎన్నారై పాలసీ అమల్లోకి తీసుకువచ్చేలా మంత్రి కేఆటీర్ శ్రద్ద చూపడం లేదని అన్నారు. గల్ఫ్ కు వలస వెళ్లిన లక్షలాది రైతులు రైతు బంధు పథకం నిబంధనలతో నష్ట పోయారని పేర్కొన్నారు. 2019లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే యువత ఉపాధికి ప్రాధాన్యతనిచ్చి ప్రభుత్వ నియామకాలు చేపడుతుందని టీపీసీసీ కో కన్వీనర్ సుధాకర్ రంగుల అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు గురమిందర్ సింగ్, అస్రా అంజుమ్, రాకేష్ బిక్కుమండ్ల, మంగళారపు శ్రీధర్, బాలకృష్ణా రెడ్డి, అచ్యుత రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, శ్రీనివాస్, మధు గట్ట తదితరులు పాల్గొన్నారు.