నల్లద్రాక్ష సలపరాన్ని దూరం చేస్తుంది

ఉన్నట్టుండి నీరసంగా, కళ్లు తిరుగుతున్నట్లు అనిపించడం… ఈ వేసవిలో చాలామందికి ఎదురయ్యే సమస్యే. శరీరం బలహీనంగా ఉండటం, రక్తలేమి, విటమిన్ల లోపం, ఎండలో ఎక్కువగా తిరగడం వంటివన్నీ ఇందుకు కారణాలు. ఈ సమస్యల నుంచి బయటపడాలంటే ఏం చేయాలో చూద్దామా…సమయానికి ఆహారం తీసుకోవాలి. అలాగే రోజులో కనీసం 10 గ్లాసుల నీళ్లు తాగాలి. శరీరంలో ఆహారంతోపాటు నీటి శాతం తగ్గకూడదు. అలా తగ్గితే, కళ్లు తిరిగినట్లు అనిపిస్తుంది. గంటకోసారి గ్లాసు నీటిని తాగుతూ ఉంటే ఈ సమస్యకు దూరంగా ఉండొచ్చు. అప్పుడప్పుడు శరీరానికి విశ్రాంతి ఇస్తూ ఉండాలి. లేదంటే శరీరం త్వరగా అలసిపోతుంది. కొన్నిసార్లు నిద్రలేమితోనూ అలసటగా, ఒత్తిడిగా అనిపిస్తుంది. అప్పుడు కూడా విపరీతమైన నీరసం, కళ్లు తిరిగుతున్నట్లు ఉండటం వంటి సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి వేళకు, సరిపడా గంటలు నిద్రపోయేలా చూసుకోవాలి. ఒత్తిడిని అదుపులో ఉంచుకోవడం కూడా ముఖ్యమే.ఉసిరి రసం, అల్లం రసం, చక్కెర కప్పు చొప్పున తీసుకుని కలిపి మరిగించి పానీయంలా చేసి భద్రపరుచుకోవాలి.ప్రతిరోజూ రెండు పూటలా 30 మి.లీ పరిమాణంలో ఈ పానీయాన్ని తాగితే, నీరసం దరిచేరదు. అలాగే అరకప్పు పానీయంలో అరకప్పు మంచి నీటిని కలిపి తాగొచ్చు. ఇది తక్షణ శక్తినిస్తుంది.గ్లాసు పల్చని మజ్జిగలో చెంచా గులాబీరేకల ముద్ద, చెంచా చక్కెర కలిపి తాగితే నీరసం నుంచి ఉపశమనం కలుగుతుంది.గ్లాసు గోరువెచ్చని నీటిలో పెద్ద చెంచా నిమ్మరసం, చెంచా అల్లం రసం, రెండు చెంచాల తేనె కలిపి తాగితే నీరసం నుంచి తేరుకోవచ్చు.గ్లాసు పల్చని మజ్జిగలో పుదీనా రసం, నిమ్మరసం చెంచా చొప్పున కలిపి అందులో చిటికెడు ఉప్పు వేసి తాగాలి. దీంతో కళ్లు తిరగడం తగ్గి, శక్తి వస్తుంది.గ్లాసు నల్లద్రాక్ష రసం తాగినా నీరసం నుంచి తేరుకోవచ్చు.మంచి కర్పూరం వాసన చూస్తే మెదడు ఉత్తేజమై, నీరసం తగ్గుతుంది.మంచి గంధం, కర్పూరం, కొంచెం కొబ్బరి నూనె కలిపి నుదిటిపై లేపనంలా వేస్తే, నిస్త్రాణం నుంచి బయటపడొచ్చు.

నల్లమచ్చల అరటిపండు తినవచ్చు

ఎంత మాత్రం అలా చేయకండీ ఎందుకంటే వాటిల్లో ఎక్కువ పోషకాలు ఉంటాయని, అవి శరీరానికి అత్యంత లబాదయకమని కార్నెల్ యూనివర్సిటీ కాలేజ్ ఆడ హ్యూమన్ ఎకాలజీ వారు చెబుతున్నారు. మార్కెట్ కి వెళ్లి పసుపు పచ్చగా ఉండి ఒక్క మచ్చ కూడా లేని అరటి పండులు కొనుక్కోను వస్తాము. ఒక రోజు బాగానే ఉంటాయి అవిమాత్రం తింటారు. మచ్చలేమైనా ఉన్నాయేమోనని చెక్ చేసి మరీ తింటారు. కనీ మచ్చలు వచ్చి బాగా పండిన అరటి పండులో బోల్డెన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు. ఇందులో పోటాషీయం , మాంగనీసు, ఫిబార్, రాగి, విటమిన్ –సి, విటమిన్ బీ6 మరియు బయోటిన్ సంవృద్దిగా ఉన్నాయి. అస్తమా, క్యాన్సర్, అధిక రక్తపోటు, మధుమేహం, అజీర్తి, అలాగే జీర్ణ సమస్యలను నిరోధించడానికి సహాయపడుతోంది. బాగా పండిన అరటి పండులోని పోషకాలు .. పండిన అరటి పండులోని పోషకాలు మామూలు పండులో ఉన్నంత పరిమాణంలో ఉండవు. అరటి పండులో ఉన్న పిండి పదార్ధాలు పక్వానికి వచ్చే కొలదీ ఎక్కువగా ఉంటాయి. బాగా పండిన అరటి పండు శరీరానికి సరైన జీవక్రీయలను నిర్వహించడానికి ఎంతగానో సహాయపడుతుంది. యాంటీ ఆక్సిడెంటు అధికంగా ఉన్న కారణాన కణనష్టాన్ని నిరోధిస్తుంది. అంతర్గత ద్యమేజీలు మరియు ప్రీ రాడికల్స్ వలన కలిగే కణాల నష్టాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. రక్తపోటును తగ్గించడంలో సహాయపడే పోటాషీయం నిల్వలు అధికంగా ఉంటాయి. ఇందులో సోడియం తక్కువగా ఉంటుంది. ధమనుల్లోని అడ్డంకులను సహాయపడుతుంది. రక్త ప్రసరణ వ్యవస్థ సమర్దవంతంగా పని చేయడానికి తోడ్పడుతుంది. స్తోక్ మరియు హార్ట్ అటాక్ వంటి సమస్యలు రాకుండా చూస్తుంది. గుండెలలో మంటగా అనిపించినప్పుడు పండిన అరటి పండు తీసుకుంటే ఉపశమనంగా అనిపిస్తుంది. పండిన అరటి పండులో ఐరన్ ఎక్కువగా ఉన్న కారణంగా అనీమీయ సమస్యను తగ్గిస్తుంది. కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉన్న కారణంగా నీరసంగా అనిపించినప్పుడు పండిన అరటిపండు తీసుకుంటే త్వరగా శక్తి వస్తుంది. రెండు పండిన అరటి పండ్లు తీసుకుంటే తొంభై నిమిషాల పాటు వ్యాయామం చేయడనికి తగిన శక్తిని ఇస్తుంది అని పోషకాహార నిపుణులు చెబుతారు. క్యాన్సర్ తో పోరాడే శక్తి పండిన అరటి పండులో ఉంటుంది. అరటిపండు పై భాగంలో కనిపించే మచ్చలు ట్యూమర నెక్రోసిస్ ఫాక్టర్ ఏర్పాటు చేస్తాయి. ఇవి క్యాన్సర్ కణాలను చంపే సంశ్ర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. బాగా పండిన అరటి పండ్లు అల్సర్ సమస్యతో బాధపడేవారికి ఉపశమనాన్ని ఇస్తుంది. అల్సర్ నుంచి యాసీడ్లు ఉత్పత్తి కాకుండా నిరోధిస్తుంది. మలబద్దకం నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. జీర్నక్రీయ సక్రమంగా జరిగేలా పండిన అరటి పండు తోడ్పడుతుంది. అయితే అరటిపండుని మధుమేహంతో బాధపడే వారు తీసుకోకూడదు. చక్కర స్థాయిలు అధిక మోతాదులో ఉండడం వలన వారికి అంట ఉపయుక్తం కాదు, మిగిలిన వారందరూ నిరభ్యంతరంగా తీసుకోవచ్చు.

బార్లీ నీరు చాలా మంచిది

పోషకాలు అందించే బార్లీ వేసవికి సహజసిద్ధమైన ఔషధం లాంటిది. శరీరంలోని వేడిని తగ్గించి, తక్షణ శక్తిని అందించే గుణాలు ఇందులో అధికం. అసలు ఇది ఎలా మేలు చేస్తుందంటే…
బార్లీలోని పీచు పదార్థం జీర్ణాశయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
కాల్షియం, ఇనుము, మాంగనీసు, మెగ్నీషియం, జింక్‌, రాగి వంటి ఖనిజ లవణాలు… విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లను అందిస్తుంది బార్లీ.
ఈ గింజలు హృద్రోగాలను దరి చేరనివ్వవు. అధిక బరువును తగ్గిస్తాయి. కొలెస్ట్రాల్‌ తగ్గడమే కాదు… వ్యాధి నిరోధకశక్తి కూడా పెరుగుతుంది.
బార్లీ శరీరంలో అధిక నీటిని కూడా తొలగిస్తుంది. మూత్ర సంబంధ సమస్యలను కూడా అదుపులో ఉంచుతుంది.
బార్లీ నీటికి మజ్జిగ, నిమ్మరసం, తేనె, నారింజ రసాన్ని కలిపి తాగితే… రుచిగా ఉండటమే కాదు, వేసవిలో శరీర ఉష్ణోగ్రతను సమతూకం చేస్తుంది. ఎవరైనా బార్లీ నీటిని తాగొచ్చు.
**మజ్జిగతో కలిపి… బార్లీని లేత గోధుమ వర్ణం వచ్చేవరకు వేయించుకుని, పొడి చేసుకోవాలి. మూడు కప్పుల నీటిని పొయ్యిపై పెట్టి మరిగించాలి. అలాగే రెండు చెంచాల బార్లీ పొడిని పావుకప్పు నీటిలో ముందుగా కలిపి ఉంచుకోవాలి. మరిగిన నీటిలో ఈ మిశ్రమాన్ని కలపాలి. పది నిమిషాలు ఉడికించి చల్లార్చి వడకట్టుకోవాలి. ఈ నీటికి పావు గ్లాసు పల్చని మజ్జిగ, చిటికెడు ఉప్పు వేసి ఈ వేసవిలో తరచూ తాగితే మంచిది.

మధుమేహ పుండ్లను నిర్లక్ష్యం చేయవద్దు

మధుమేహం ఒళ్లంతా కబళిస్తుంది. ఇది నియంత్రణలో లేకపోతే కళ్ల నుంచి కాళ్ల వరకూ అన్ని అవయవాలను దెబ్బతీస్తుంది. ముఖ్యంగా రక్తనాళాలు, నాడులను దెబ్బతీసి రకరకాల సమస్యలను తెచ్చిపెడుతుంది. వీటిల్లో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది పాదాల మీద ఏర్పడే పుండ్ల గురించి. ఇవి ముందు చిన్న మచ్చలా, గుల్లలా మొదలై.. చివరికి పుండుగా మారి ఎంతకీ మానకుండా దీర్ఘకాలం వేధిస్తుంటాయి. వీటి మూలంగా కాళ్లు పోగొట్టుకుంటున్నవారు ఎందరో. ఆసుపత్రుల్లో చేరుతున్న మధుమేహుల్లో సుమారు పావు వంతు మొండి పుండ్లతో సతమతమవుతున్నవారే! ఈ నేపథ్యంలో మధుమేహ పుండ్లపై సమగ్ర కథనం మీకోసం. మనల్ని కదిలించేవి, మున్ముందుకు నడిపించేవి పాదాలే. శరీర బరువునంతా తమ మీదేసుకొని మనల్ని మోస్తూ ఎక్కడికంటే అక్కడికి చేరవేస్తుంటాయి. అలాంటి పాదాలకు ఏ చిన్న సమస్య వచ్చినా ఇబ్బందే. అలాంటిది ఒకపట్టాన మానకుండా, దీర్ఘకాలం వేధిస్తూ వెంటాడే పుండు పడితే శరీరం మొత్తం కుదేలవుతుంది. ఇక అది ఇన్‌ఫెక్షన్‌కు దారితీసి.. కండరాలను తినేసి.. వేళ్లను, పాదాన్ని కుళ్లిపోయేలా చేస్తే? జీవితం నరకప్రాయంగా తయారవుతుంది. మధుమేహం సరిగ్గా ఇలాగే పాదాలను దెబ్బతీస్తోంది. రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలను, నాడీ సంకేతాలు అందించే నాడులను తీవ్రంగా దెబ్బతీసి పద్మాల్లాంటి పాదాలకు తీపి చెదను పట్టిస్తోంది. మానని పుండ్లకు దారితీసి తీవ్రంగా వేధిస్తోంది. మధుమేహంతో బాధపడుతున్నవారిలో 25 శాతానికి పైగా మంది మొండి పుండ్లతో సతమతమవుతున్నారని అంచనా. వీరిలో సుమారు 15-25% మందిలో సమస్య తీవ్రమై చివరికి వేళ్లు, పాదాలు తొలగించే స్థితికి చేరుకుంటున్నారు కూడా. కొందిరికి మోకాలి కింది వరకు కాలు తొలగించాల్సిన పరిస్థితి తలెత్తుతుండటం విషాదం. పాదాలకు, చీలమండలకు తగిలే చిన్న చిన్న దెబ్బలు కూడా మధుమేహం మూలంగా పెద్దవిగా తయారై వేధిస్తుంటాయి. కొన్నిసార్లు రాళ్లు, మట్టి గడ్డల మీద పాదం పడినా చాలు. అవే పెద్ద పుండుగా మారిపోవచ్చు. సరైన చెప్పులు వేసుకోకపోవటం, చెప్పులు లేకుండా నడవటం, చెప్పుల్లోని మేకుల వంటివి గుచ్చుకోవటం, వేళ్ల గోళ్లు వెనక్కి తిరగటం వంటివీ పుండ్లకు దారితీయొచ్చు. దీనికి ప్రధాన కారణం రక్తనాళాలు, నాడులు దెబ్బతినటమే. మధుమేహానికి పొగ తాగటం, మద్యం అలవాటు కూడా తోడైతే రక్తనాళాలు, నాడులు దెబ్బతినే ముప్పు మరింత పెరుగుతుంది కూడా. అంటే ఎప్పుడో పదేళ్ల తర్వాత రావాల్సిన పాదాల సమస్యలు ఇప్పుడే మొదలు కావొచ్చు. అవి మరింత తీవ్రంగానూ ఉండొచ్చు. కాబట్టి మధుమేహ పుండ్ల విషయంలో నిర్లక్ష్యం అసలే పనికిరాదు. వీటిని ఆదిలోనే గుర్తించి, జాగ్రత్త పడటం ఎంతైనా అవసరం.

రోజుకి ఒక అరగంట వ్యాయామం చేయండి. చాలు.

కేవలం బరువు తగ్గడానికో, ఆకృతిని తీర్చిదిద్దుకోవడానికో వ్యాయామం అనే ఆలోచన తప్పంటున్నారు వ్యాయామ నిపుణులు. ఆరోగ్యంగా ఉండటానికి వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికీ వ్యాయామ సాధన అవసరమని చెబుతున్నారు. మరి ఎలా మొదలు పెట్టాలి? ఎప్పుడు మొదలుపెట్టాలో చూద్దామా?మారిన జీవనశైలిలో ప్రతి ఒక్కరికీ శారీరక శ్రమ తగ్గింది. ఆ తీరే అనేక అనారోగ్యాలకు మూలం అవుతోంది. అందుకే ఆరోగ్యంగా, చురుగ్గా ఉండాలంటే…ప్రతి ఒక్కరికీ వ్యాయామం అవసరం. అది చిన్నప్పటి నుంచే అలవాటుగా మారాలి. వ్యాయామం చేయడానికి శక్తి అవసరం. అందుకు పోషకాహారం, తగినన్ని నీళ్లు తప్పనిసరిగా తీసుకోవాలి.ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక అలసట కాస్తా…క్రమంగా శారీరకంగానూ అలసిపోయేలా చేస్తోంది. అందుకే ఏ కొద్ది ఖాళీ సమయం దొరికినా పడుకోవడానికో, ఎక్కువ సేపు కూర్చుని టీవీలు చూడటానికో ఆసక్తి చూపుతున్నాం. దాన్నే రిలాక్సేషన్‌గా భావిస్తున్నా. ఈ పరిస్థితి తలెత్తకుండా ఉండాలంటే మీ రోజువారి ప్రణాళిక ఎంత తీరికలేకున్నా సరే…వ్యాయామానికి ఓ అరగంటైనా సమయం కేటాయించుకోండి. అది ఉదయం వేళ అయితే మరీ మంచిది. రోజంతా మీలో ఉత్సాహం నింపడానికి వ్యాయామం చక్కని మార్గం.వ్యాయామం ఇంటిపనితోనే మొదలుపెట్టొచ్చు. తోటపని, బట్టలు ఉతకడం వంటివన్నీ చేయొచ్చు. అయితే అది ఏదో చేయాలి అన్నట్లు హడావుడిగా చేస్తే మనసు ఒత్తిడికి గురవుతుంది. పెద్దగా ఫలితం ఉండదు. దానికి బదులు ఉదయాన్నే వాకింగ్‌తో మీ వ్యాయామం మొదలుపెట్టండి. కొన్నాళ్లయ్యాక క్రమంగా…స్క్వాట్స్‌, చిన్‌అప్స్‌, పుషప్స్‌, తాడాట, సైక్లింగ్‌, జుంబా, యోగా…అలా మరికొన్ని వర్కవుట్లను జత చేసుకుంటూ సాగండి. మీకు పట్టు వచ్చాక మిక్స్‌ డ్‌ వ్యాయామాలు మీ అంతట మీరే చేసుకోవచ్చు. ఇవన్నీ మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. చక్కని ఆకృతిని అందిస్తాయి.

చక్కర-గుడ్డు-పసుపుతో రోమాలు మాయం

పసుపును సంప్రదాయకంగా ముఖానికి రాసుకుంటారు. ఇది మన చర్మం పై ఉండే అవాంచిత రోమాలను తొలగించడంలో ఎంతో సహాయ పడుతుంది. శెనగపిండిని కొద్దిగా పసుపు, పెరుగుతో కలిపి ముఖానికి రాసుకుంటే ఎంతో ప్రభావవంతమైన ఫలితాన్ని ఇస్తుంది. సహజ నివారణలు వాడటం వలన ఎలాంటి దుష్పభ్రావాలు ఉండవు. ఇది కొంచం తక్కువ ఖర్చుతో ఇళ్లలో వ్యాక్సింగ్‌ చేసుకునే ఒక పద్దతి. కొద్దిగా చక్కెర లో కొంచెం తేనె మరియు నిమ్మ రసం కలిపి ఈ మిశ్రమం ముఖంపై రాసుకోవాలి. దీన్ని ఒక క్లాత్‌ తో తొలగించాలి. ఈ చిట్కా చాలా బాగా పని చేస్తుంది. గుడ్డులోని తెల్లసొనను ఒక గిన్నెలో వేసి అందులో చెంచాడు పంచదార, అర చెంచాడు మొక్కజొన్న పిండి కలిపి పేస్ట్‌ లా చేసుకోవాలి. దీన్ని ముఖం పై రాసుకుని కొద్దిసేపు ఆరనివ్వాలి. తర్వాత ఒక మాస్క్‌ లా మారిన దీన్ని మెల్లగా తీసివేస్తే దానితోపాటు ఈ అవాంఛిత రోమాలు కూడా తొలగిపోతాయి. ఈ పద్ధతి మంచి ఫలితాలనిస్తుంది కానీ కొద్దిగా నొప్పి ఉండచ్చు.

ములక్కాయ రుచికే కాదు ఆరోగ్యానికి కూడా అద్భుతః!

మునగ పేరు వినగానే గుర్తొచ్చేది సాంబారులో జుర్రుకునే మునక్కాడల రుచే. కానీ ఆఫ్రికన్‌ దేశాలకి మాత్రం మునగ అంటే పోషకాల్ని కురిపించే కల్పవృక్షం.
భూగోళం మీదున్న సమస్త పోషకాహార లోపాల్నీ సకల రోగాల్నీ నివారించడానికి మునగను మించినది లేదని రకరకాల అధ్యయనాల ద్వారా తెలుసుకున్న ఆఫ్రికా దేశాలు పోషకాహార లోపంతో బాధపడే తల్లులూ పిల్లలకు మందులతోబాటు మునగాకు పొడినీ బోనస్‌గా ఇస్తున్నాయి. అందుకే మునగాకు టీ తాగడం వల్ల మధుమేహం తగ్గిందనీ పొడి తినడం వల్ల పాలు బాగా పడ్డాయనీ చెప్పే ఆఫ్రికన్ల సంఖ్య కోకొల్లలు.
ఆనోటా ఈనోటా ఇది మనవరకూ వచ్చింది. ‘పెరటి చెట్టు వైద్యానికి పనికిరాద’న్నట్లు నిన్నమొన్నటివరకూ మనం మునగ చెట్టుని పెద్దగా పట్టించుకోలేదు. తలపైకెత్తి దానివైపే చూడలేదు- సాంబారులోకి నాలుగు కాయలు అవసరమైనప్పుడు తప్ప. కానీ అమెరికాకి చెందిన ‘ద ట్రీస్‌ ఫర్‌ లైఫ్‌’ స్వచ్ఛంద సంస్థ మునగ చెట్టులోని అణువణువూ ఉపయోగపడుతుందన్న విషయాన్ని ప్రపంచానికి తెలిసేలా చేసింది. దానికి పలు అంతర్జాతీయ సంస్థలూ శృతి కలిపాయి. ప్రపంచ దేశాలకు ఆ సంజీవని గురించి కథలుగా చెప్పడం ప్రారంభించాయి. ఐక్యరాజ్యసమితి కూడా మునగ ప్రాధాన్యతను గుర్తించి ఆ చెట్ల పెంపకాన్ని ప్రోత్సహిస్తోంది. దాంతో మన దృష్టీ అటు మళ్లింది. న్యూట్రిషన్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు డాక్టర్‌ సి.గోపాలన్‌, డాక్టర్‌ కమలా కృష్ణస్వామిలు మునగాకు లోగుట్టుని విప్పారు. వారికి ఆయుర్వేద వైద్యులూ తోడయ్యారు. అంతా కలిసి మరీ ‘మునగ’ మహత్యాన్ని కొనియాడుతున్నారు.

ఏముంది మునగాకులో..?
‘బతికుంటే బలుసాకు తినొచ్చు’… ఓ పాత నానుడి. ఆ బలుసాకు ఏమోగానీ, ‘రోజూ కాస్త మునగాకు తింటే చాలు, వందేళ్లు బతకొచ్చు అన్నది కొత్త సామెత. ఎందుకంటే…
వంద గ్రా. తాజా మునగాకుల్లో… నారింజల్లోకన్నా ఏడు రెట్లు సి-విటమిన్‌, క్యారెట్లలోకన్నా నాలుగింతల కాల్షియం, అరటిపండ్లలోకన్నా మూడు రెట్లు పొటాషియం, పాలకూరలోకన్నా మూడింతల ఐరన్‌, బాదంలోకన్నా మూడు రెట్లు విటమిన్‌- ఇ, పెరుగులోకన్నా రెండింతల ప్రొటీన్లూ ఉంటాయి.
అంటే ఇరవై గ్రా.మునగాకు నుంచి మనిషికి నిత్యం అవసరమయ్యే ఎ,సి-విటమిన్లూ, వంద గ్రా.ఆకు నుంచి కాల్షియం, మూడొంతుల ఐరన్‌, సగం ప్రొటీన్లూ దొరుకుతాయి.
అందుకే పోషకాహార లోపాన్ని నివారించడానికి దీన్ని మించినది లేదు. అంతెందుకు… ప్రపంచవ్యాప్తంగా ఏటా ఐదు లక్షల మంది విటమిన్‌-ఎ లోపం కారణంగానే అంధులవుతున్నారు. దీనికి మునగాకే మహత్తరమైన పరిష్కారం అంటున్నారు పోషక నిపుణులు.
ఆ కారణంతోనే క్యూబా అధ్యక్షుడు ఫిడేల్‌ క్యాస్ట్రో మునగ చెట్లను పెంచి, ఆ కాయల్ని రోజూ తినేవాడట. ‘ఒమేగా-3, 6, 9 ఫ్యాటీఆమ్లాలూ, సకల విటమిన్లూ, అన్ని రకాల అమైనో ఆమ్లాలు… మొత్తంగా 96 పోషకాలున్న ఒకే ఒక చెట్టు మునగ…పేదవాడి ఆహారం’ అంటూ దాని గొప్పతనం గురించి పత్రికల్లో వ్యాసాలూ రాశాడు క్యాస్ట్రో. ఇప్పుడు క్యూబా వాసులు మునగాకుని పండించి, పొడి చేసి విక్రయిస్తున్నారు. భారత్‌ కూడా మునగ ఆకుల పొడిని ఎగుమతి చేయడం ప్రారంభించింది. కానీ ఆకుని తినడం పట్ల ఇప్పటికీ మనదగ్గర అలసత్వమే.
నిజానికి ప్రాచీన కాలం నుంచీ ఆఫ్రికా దేశాల్లోనూ భారత్‌లోనూ తాజా మునగాకుల్ని తినే అలవాటు ఉంది. మధ్యలో మాయమై, మళ్లీ తెరమీదకొచ్చింది. టైమ్‌ మ్యాగజైన్‌ ‘ద నెక్స్ట్‌ క్వినోవా’గా అభివర్ణించింది. దాంతో పాశ్చాత్య దేశాల్లో ఎండిన ఆకుల పొడిని స్మూతీలూ సలాడ్ల మీద చల్లుకోవడం, టీ, సప్లిమెంట్ల రూపంలో తీసుకోవడం అలవాటు చేసుకున్నారు. ఎందుకంటే…
100 గ్రా. ఎండిన ఆకుల్లో… పాలల్లో కన్నా 17 రెట్లు కాల్షియం, అరటిపండ్లలోకన్నా 15 రెట్లు పొటాషియం, క్యారెట్లలోకన్నా 10 రెట్లు విటమిన్‌-ఎ, పాలకూరలోకన్నా 25 రెట్లు ఐరన్‌… ఇలా చాలా లభిస్తాయి.
మునగాకుని ఎండబెట్టి పొడి చేసుకునే తినాల్సిన అవసరం మనకి లేదు. తాజా మునగాకు పుష్కలం. ఒకప్పుడు శుభసూచకం కాదన్న కారణంతో పెరట్లో మునగ పెంచేవారు కాదు. కాలం మారింది. పట్టింపూ పోయింది. దాంతో కాయలకోసం చాలామందే పెంచుతున్నారు. కాబట్టి ఇతర ఆకుకూరల్లానే మునగాకుతో పప్పూ కూరలూ పచ్చళ్లూ పొడులూ రైస్‌ వెరైటీలూ కోఫ్తాలూ… అన్ని రకాలూ వండుకోవచ్చు. దోసెల్లో రొట్టెల్లో దట్టించినా రుచే. పొడిని టీ రూపంలో తాగొచ్చు, సూపుల్లో అన్నంలో కూరల్లో… ఎలా కావాలంటే అలా తినొచ్చు. అయితే ముదిరిన ఆకుల్లో పీచెక్కువ. కాబట్టి కుక్కర్‌లో ఉడికించాలన్నది నిపుణుల సలహా.

ఔషధగుణాలెన్నో…
మరే చెట్టు ఆకులకీ లేనంత మహత్తు మునగాకుకి ఉంది. ఇది 300 వ్యాధుల్ని నివారించగలదు. మునగాకులో రోగనిరోధకశక్తిని పెంచే 46 యాంటీఆక్సిడెంట్లూ అనేకానేక బయోయాక్టివ్‌ పదార్థాలూ ఉండటంతో శాస్త్రవేత్తలు దీనిమీద పరిశోధనలు ముమ్మరం చేశారు. ఇందులోని ఓషధుల ప్రభావానికి శరీరంలోని బ్యాక్టీరియా, ఫంగస్‌లన్నీ పలాయన మంత్రం పఠిస్తాయి. క్యాన్సర్లూ అల్సర్లూ కనుచూపుమేర కనిపించవు. ఆల్జీమర్స్‌ ఎగిరిపోతుంది. బీపీ, మధుమేహం, కొలెస్ట్రాల్‌ దరి చేరడానికి భయపడతాయి. గాయాలన్నీ మునగాకు పేస్టుతో గాయబ్‌.
అంతేనా… రక్తహీనతతో బాధపడుతుంటే కాస్త వండిన మునగాకునో లేదా టీస్పూను పొడినో రోజూ వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే ఐరన్‌ వృద్ధి, రక్తం సమృద్ధి. ఈరోజుల్లో పసివయసు దాటకుండానే కంటిజబ్బులనేకం. రేచీకటి బాధితులూ ఎక్కువే. వాటన్నింటినీ మునగాకులోని బీటాకెరోటిన్‌ నివారిస్తుందని ఇంటర్నేషనల్‌ ఐ ఫౌండేషన్‌ అంటోంది.
ఇంటాబయటా అంతటా ధూళిమేఘాలే… కాలుష్యకాసారాలే. మరి ఆస్తమా, బ్రాంకైటిస్‌, ట్యుబర్‌క్యులోసిస్‌ పిలవకుండానే పలుకుతున్నాయి. ఊపిరితిత్తుల్లో తిష్ట వేస్తున్నాయి. అందుకే ఆకుల్ని సూపులా చేసుకుని రోజుకి రెండుసార్లు తీసుకుంటే లంగ్సులోని టాక్సిన్లు తొలగి, ఆ వ్యాధులన్నీ పారిపోతాయి.
రజస్వలానంతరం అమ్మాయిలకి ఎన్ని కష్టాలో… కొందరిలో నెలసరి సమయంలో గడ్డలు పడుతుంటాయి. అప్పుడు ఆకులతో చేసిన సూపుని 21 రోజులపాటు క్రమం తప్పకుండా తీసుకుంటే సరి. మునగాకు రసం తాగితే గర్భసంచి సాగకుండా ప్రసవం సులభంగా అవుతుంది. పాలుపడని బాలింతలకి కాసిని నీళ్లలో ఉప్పు, మునగాకులు వేసి కాసేపాగి ఆ నీటిని వంపేసి ఆకుల్ని నేతితో తినిపిస్తే ఫలితం ఉంటుంది. పొడి రూపంలో ఇచ్చినా పాలు పుష్కలమే.
డయేరియా, కామెర్లూ, కలరా బాధితుల బాధ కాదు. ఒకటే దాహం. నీరసం. అప్పుడు రోజుకి రెండుమూడుసార్లు గ్లాసు కొబ్బరినీళ్లలో టీస్పూను మునగాకు రసం, కొద్దిగా తేనె కలిపి తాగితే సరి. మూత్ర సమస్యలకీ మునగ బెస్ట్‌ మెడిసినే. ఆకుల్ని ముద్దలా చేసి క్యారెట్‌ రసంలో కలిపి పదిగంటలకోసారి తీసుకుంటే హానికర బాక్టీరియా, వైరస్‌లన్నీ తొలగిపోతాయి.
ఆకుల్ని కణతలకి రుద్దితే తలనొప్పి తీవ్రత తగ్గుతుంది. ఈ ఆకుల రసాన్ని నిమ్మరసంతో కలిపి మొటిమలమచ్చలు, బ్లాక్‌హెడ్స్‌ మీద రాస్తే అవి మాయమై చర్మం మెరుస్తుంది. స్కర్వీ, చర్మవ్యాధులు, ఆందోళనలకి
మునగాకు టీ రుచికరమైన పరిష్కారం.

వహ్వా… మునక్కాడ!
సీజన్‌లో చిటారుకొమ్మ వరకూ చిగురు కనబడకుండా కాసిన కాయలు చూసేవాళ్లకి కన్నులపండగ అయితే, ఆ కాయల రుచి తెలిసినవాళ్లకి విందుభోజనమే. దక్షిణాదిన సాంబారు, పులుసు, అవియల్‌ వంటల్లో మునక్కాడ కనిపించాల్సిందే. ఇక, బియ్యప్పిండి, బెల్లం లేదా అల్లంవెల్లుల్లి వేసి వండే మునగగుజ్జు కూర ఎవరికైనా నోరూరాల్సిందే. మునక్కాడలతో పట్టే నిల్వ పచ్చడి మహారుచి. మటన్‌లో మునక్కాడ పడితే నాన్‌వెజ్‌ ప్రియులకి పండగే. ఆకులతో పోలిస్తే కాయల్లో పోషకాల శాతం తక్కువే. కానీ మిగిలిన కూరగాయలతో పోలిస్తే ఎక్కువే.
‘ఈ ఒక్క మునక్కాడ తినవూ బోలెడు బలం’ అంటూ బామ్మలు బతిమిలాడి తినిపించడం చాలామందికి అనుభవమే. తెలిసి చెప్పినా తెలియక చెప్పినా అది నిజమే. మునక్కాడల్లోని యాంటీబయోటిక్‌ గుణాలు రక్తాన్ని శుద్ధి చేస్తే; కాల్షియం, ఐరన్‌లు ఎముకబలాన్నీ బరువునీ పెంచుతాయి. రక్తంలో చక్కెర శాతాన్నీ తగ్గిస్తాయి. పిత్తాశయం యమా జోష్‌గా పనిచేస్తుంది.
శస్త్రచికిత్సానంతరం మునగాకునీ, మునక్కాడలనీ తింటే త్వరగా కోలుకుంటారని చెప్పడం తెలిసిందే. దానిక్కారణం మరేంటో కాదు, మునక్కాడల్లోని ఐరన్‌వల్ల హిమోగ్లోబిన్‌ శాతం పెరుగుతుందట. మునక్కాడల్ని మరిగించిన నీళ్లతో ఆవిరిపట్టడం వల్ల ఊపిరితిత్తుల సమస్యలూ తగ్గుతాయి. వీటిని ఉడికించిన నీరు తాగితే చర్మం మెరుస్తుందట.
‘తరచూ జలుబు చేస్తోందా… జ్వరమొస్తోందా… అయితే రోజూ మునక్కాడలు తినండొహో’ అంటూ చాటింపు వేస్తున్నారు ఆధునిక వైద్యులు. వాటిల్లోని విటమిన్‌-సి జలుబూ ఫ్లూ జ్వరాలకి ట్యాబ్లెట్‌లా పనిచేస్తుందట. వీటిని ఎక్కువగా తినేవాళ్లకి పొట్టలో నులిపురుగుల బాధ ఉండదు. ఈ ముక్కలను ఉడికించిన సూప్‌ డయేరియాకి చక్కని నివారణోపాయం. కీళ్లనొప్పులయితే పరారే. కాలేయం, ప్లీహ సంబంధిత వ్యాధులన్నీ హాయ్‌ చెప్పడానికే సందేహిస్తాయి.
‘ఏమోయ్‌… ఇంకా పిల్లల్లేరా… అమ్మాయిని మునక్కాయ కూర వండమనోయ్‌…’ అని ఏ పెద్దాయనో అంటే సరదాగా తీసుకోవద్దు. వీటిల్లోని జింక్‌ స్త్రీ, పురుషుల్లో వంధ్యత్వాన్ని తగ్గిస్తుంది. వీర్యం చిక్కబడుతుంది.
నియాసిన్‌, రిబోఫ్లేవిన్‌, ఫోలిక్‌ యాసిడ్‌, పైరిడాక్సిన్‌ వంటి బి-కాంప్లెక్స్‌ విటమిన్లు మునక్కాడల్లోనూ సమృద్ధిగా దొరుకుతాయి. ఇవి సంక్లిష్ట పిండిపదార్థాలూ ప్రొటీన్లూ
జీర్ణమయ్యేలా చేస్తాయి.
ఏదేమైనా మునక్కాడలు ఎక్కువగా తినేవాళ్లలో రోగనిరోధకశక్తి ఎక్కువ. శ్వాససంబంధ సమస్యలు తక్కువ. వీటిల్లోని ప్రొటీన్లూ పీచూ కారణంగా పోషకాహార లోపమూ ఉండదు. నాడీవ్యవస్థా భేషుగ్గా పనిచేస్తుంది.

పూలు… తేనెలూరు..!
పచ్చదనంతో కళకళలాడే దీని ఆకులూ కాయలే కాదు, సువాసనభరితమైన తెల్లని పూలూ ఔషధ నిల్వలే. ఆయుర్వేద వైద్యంలో వాడదగ్గవే. పూలతో కాచిన కషాయం లేదా టీ పిల్లతల్లుల్లో పాలు బాగా పడేలా చేస్తుంది. ఇది మూత్రవ్యాధుల నివారణకూ దోహదపడుతుంది. ఈ పూలను మరిగించిన తేనీరు జలుబుకి మంచి మందు. కొన్ని ప్రాంతాల్లో ఈ పూలను సెనగపిండిలో ముంచి పకోడీల్లా వేస్తారు, కూరలూ చేస్తారు. మునగ పూలలో తేనె ఎక్కువ. దాంతో ఇవి తేనెటీగల్ని ఆకర్షించి, తేనె ఉత్పత్తికీ తోడ్పడతాయి.

విత్తనంతో నీటిశుద్ధి..!
విరగ్గాసిన కాయలు ఎండిపోయాయా… ఫరవాలేదు, ఆ విత్తనాలు మొలకెత్తుతాయి. విటమిన్‌-సి పుష్కలంగా ఉండే వీటిని వేయించి పల్లీల్లా తినొచ్చు. నూనె తీయొచ్చు. దీన్ని వంటనూనెగానూ సౌందర్యసాధనంగానూ ల్యూబ్రికెంట్‌గానూ వాడుతుంటారు.
రక్షిత నీటి పథకాలు కరవైన ప్రాంతాలకు మునగ విత్తనాలే నీటిశుద్ధి పరికరాలు. కఠిన జలాల్ని సైతం ఈ గింజలు ఉప్పు లేకుండా తేటగా మారుస్తాయి. సూడాన్‌, ఇండొనేషియా వాసులు ఆ కారణంతోనే విత్తనాలను ప్రత్యేకంగా సేకరించి, ఆ గింజల్ని పొడిలా చేసి, కప్పు నీళ్లలో కలిపి, వడగడతారు. ఇప్పుడు ఈ నీళ్లను బిందెలోని నీళ్లలో కలిపి, ఓ ఐదు నిమిషాలు గరిటెతో కలుపుతారు. తరవాత ఓ గంటసేపు కదపకుండా ఉంచితే మలినాలన్నీ కింద పేరుకుని పైనున్న నీరంతా తేటగా అవుతుంది. వీటిని విడిగా పాత్రలో పోసుకుని తాగుతారు. శాస్త్రీయంగా చెప్పాలంటే ఈ పొడి కలిపిన ద్రవాన్ని నీటిలో కలపగానే అది పాలీ ఎలక్ట్రోలైట్‌గా పనిచేసి నీటిలోని మలినాలను అయాన్లుగా మార్చడం ద్వారా వాటిని ఆకర్షించి కింద పేరుకునేలా చేస్తుంది.ఇంకా… ఇంకా…!
మునగాకు మనుషులకే కాదు, పశువులకీ బలవర్థకమైనదే. పశువుల మేతగానూ పంటలకు ఎరువుగానూ వాడతారు. చెట్టు కాండం నుంచి వచ్చే గుజ్జుని కాగితం తయారీకి వాడతారు. ఆగ్రో ఫారెస్ట్రీకి మునగ చక్కగా సరిపోతుంది. పెద్దగా నీడ ఉండని ఈ చెట్ల మధ్యలో ఇతర పంటల్నీ వేసుకోవచ్చు. ఈ మొక్కల్ని కంచెలానూ పెంచవచ్చు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో దీన్ని పెంచుతున్నా మునగ పంటలో మనదేశమే ఫస్ట్‌. ఏటా 13 లక్షల టన్నుల కాయల్ని పండిస్తున్నాం. రాష్ట్రాలకొస్తే ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. మునగ ఉత్పత్తుల విలువ ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.27వేల కోట్లు. వాటిల్లో 80 శాతం మనవే. కాయలతోబాటు పొడినీ
ఎగుమతి చేస్తున్నాం. కాయల్ని శీతలీకరించి చక్కెరపాకంలో వేసి ఎగుమతి చేస్తారు.
మునగలో రకాలనేకం. కుండీల్లో కాసే హైబ్రిడ్‌ రకాలూ ఉన్నాయి. జాఫ్నా రకం కాయలు 60 నుంచి 120 సెం.మీ. వరకూ కాస్తే, ఆరునెలలకే పూతొచ్చి, కాయలు కాసే కెఎం-1, పీకేఎం-1, పీకెఎం-2, పీఏవీఎం రకాలూ వస్తున్నాయి. నేలతీరు, వాతావరణాన్ని బట్టి ఆయా రకాలని ఎంపికచేసుకుని ఈ చెట్లను పెంచి ఎకరాకి కనీసం లక్ష రూపాయల లాభాన్ని పొందుతున్నారు రైతులు. వ్యవసాయపరంగానే కాదు,
ఇంటి అవసరాలకోసం పెరట్లోనో లేదంటే కుండీల్లోనో మునగను పెంచితే, రోజూ ఓ గుప్పెడు తాజా ఆకుల్ని కూరల్లో వేస్తే మీ ఆహారంలో సూపర్‌ఫుడ్‌ చేరినట్లే, మీకు డాక్టరుతో పనిలేనట్లే..

చిన్న చిన్న పనులతో చాలా ఆరోగ్యం

మనిషి ఆరోగ్యానికి వ్యాయామం ఎంతో ముఖ్యం. అందుకోసం జిమ్‌ల్లో గంటల తరబడి చెమటోడ్చాల్సిన పనిలేదని.. తోటపని, నడక వంటి వాటితోనూ గుండె జబ్బులు, కేన్సర్‌ వంటి ప్రాణాంతక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చని శాస్త్రవేత్తలు తాజా అధ్యయనంలో గుర్తించారు. 1997 నుంచి 2008 మధ్యకాలంలో 40 నుంచి 85 ఏళ్ల వయసున్న సుమారు 88 వేల మంది శారీరక శ్రమను అంచనా వేశారు. ఇతరులతో పోలిస్తే వారంలో కనీసం 10-59 నిమిషాలపాటు తోటపని, వాకింగ్‌ వంటి పనులు చేసిన వారికి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం 18ు తక్కువగా ఉందని గుర్తించారు. వారి ఆరోగ్యం కూడా బాగుంటుందని పేర్కొన్నారు.

వేసవిలో సుగంధి పాలు తాగితే ఆ మజానే వేరు!

ఈ వేసవిలో రోజురోజుకీ పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో అధిక దాహం, నీరసపడటం జరుగుతుంది. దీన్నుంచి తప్పించుకోవాలంటే శరీరానికి చలవ చేసే పానీయాలు అందించాలి. అయితే అవి సహజసిద్ధమైనవిగా ఉండాలి. అప్పుడే అధిక ఉష్ణోగ్రతల బారిన పడకుండా ఉంటాం.ఎండాకాలంలో మనం తీసుకునే ఆహారంతోపాటు పానీయాలు కూడా చలవ చేసేలా ఉండాలి. అప్పుడే మన శరీరం డీహైడ్రేషన్‌కు గురి కాకుండా ఉంటుంది. సాధారణంగా ఈ సీజన్‌లో ఆకలి, జీర్ణశక్తి, బలం తగ్గుతాయి. వీటిని సరైన స్థాయిలో ఉంచేవి కేవలం మనం తీసుకునే ఆహారం, పానీయాలే. ఆహారంలో కారం, మసాలాలు తగ్గించాలి. చలవ చేసే పానీయాలను ఇంట్లోనే చేసుకుంటే ఆరోగ్యంతోపాటు ఈ వేసవిని ఆహ్లాదంగా గడపొచ్చు.
* సుగంధిపాలతో
సుగంధి పాల లేదా శారిబ అనే మూలిక మార్కెట్లో లభ్యమవుతుంది. దాన్ని చిన్నముక్కలుగా చేసి మంచి నీటితో శుభ్రపరచాలి. పావుకిలో సుగంధిపాలకి రెండు లీటర్ల నీటిని కలిపి ఎనిమిది గంటలపాటు నాననివ్వాలి. తరువాత నాలుగోవంతు నీరు మిగిలేలా సన్నటి మంటపై కాచి, వడకట్టాలి. దీనికి అరకిలో పంచదార కలిపి పాకం చిక్కబడే వరకు కాచి, చల్లార్చి సీసాలో పోసి భద్రపరచాలి. ఒక భాగం సిరప్‌కి మూడు నుంచి నాలుగు వంతుల చల్లటి నీరు కలిపి తాగాలి.
* మజ్జిగతో
ీర్ణశక్తిని పెంచి, శరీరానికి చలవ చేసే గుణాలు మజ్జిగలో ఉన్నాయి. పలచగా చేసిన మజ్జిగను కుండలో పోసి ఉంచాలి. దాహమైతే గ్లాసు మజ్జిగలో చెంచాడు నిమ్మరసం, చిటికెడు ఉప్పు, ఛాట్‌ మసాలా కలిపి తాగాలి. తక్షణ శక్తితోపాటు అతిసారానికి దూరంగా ఉంచుతుంది.
* పుచ్చకాయ ముక్కలతో
పుచ్చకాయ ముక్కలను రసం తీసి వడకట్టుకోవాలి.అందులో కొంచెం ఛాట్‌మసాలా, చిటికెడు నల్ల ఉప్పు కలిపి తాగితే చలవ చేస్తుంది. డీహైడ్రేషన్‌ బారిన పడకుండా రక్షిస్తుంది. మూత్ర పిండాల్లో రాళ్ల సమస్య ఉన్నవారికి ఇది ఔషధంలా పనిచేసి, సమస్యను అదుపులో ఉంచుతుంది.
* పెరుగుతో
కప్పు పెరుగుని బాగా చిలికి, మూడు కప్పుల నీటిని కలపాలి. దీన్ని కుండలో పోసి సహజంగా చల్లబడనివ్వాలి. ఒక గులాబీ పువ్వు రేకులని శుభ్రంగా కడిగి ముద్దలా చేసి, గ్లాసు మజ్జిగకు కలపాలి. ఇందులో పావు చెంచా యాలకుల పొడి, చెంచా పంచదార వేసి కలిపి తాగాలి. దీనిని అందరూ తాగొచ్చు. చలవ చేస్తుంది. జీర్ణశక్తి పెరిగి అతిసారం తగ్గుతుంది.
* పుదీనా లేదా కొత్తిమీరతో
కప్పు పెరుగుకి మూడు కప్పుల నీటిని కలిపి బాగా చిలికి కుండలో పోసి చల్లబడ నివ్వాలి. గ్లాసు మజ్జిగలో పావు చెంచా జీలకర్రపొడి, చెంచా పుదీనా లేదా కొత్తిమీర రసం, కొద్దిగా నల్ల ఉప్పు వేసి కలిపి తాగితే జీర్ణశక్తిని పెంచుతుంది.
* చింతపండు రసంతో
చెంచా చింతపండు రసానికి కుండలో చల్లబడిన గ్లాసు నీటిని కలపాలి. ఇందులో అరచెంచాడు జీలకర్ర పొడి, చెంచాడు పుదీనా రసం, కొద్దిగా నల్ల ఉప్పు కలిపి తాగితే తక్షణ శక్తినిస్తుంది.

కార్బైడ్ అంటుకుంటే కాళ్ళు విరగ్గొట్టండి-కోర్టు

వివిధ రకాల పళ్లను మగ్గబెట్టేందుకు కార్బైడ్‌ను విచ్చలవిడిగా ఉపయోగిస్తున్న నేపథ్యంలో దీనికి అడ్డుకట్ట వేసే దిశగా హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పారిశ్రామిక అవసరాలు, చట్టం నిర్దేశించిన అవసరాలకు మినహా మిగిలిన వాటికి కార్బైడ్‌ను ఉపయోగించడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది. చట్ట వ్యతిరేకంగా కార్బైడ్‌ కలిగి ఉన్న వ్యక్తులపై కఠినచర్యలు తీసు కోవాలని ప్రభుత్వానికి తేల్చి చెప్పింది. దీనిపై ఓ నివేదికను తమ ముందుంచాలని వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది. తదుపరి విచారణను ఏప్రిల్‌ 23కు వాయి దా వేసింది. ఈ మేరకు ప్రధానన్యాయమూర్తి (సీజే) తొట్టతిల్‌ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. పళ్లను మగ్గబెట్టేందుకు కొందరు వ్యాపారులు విచ్చలవిడిగా కార్బైడ్‌ను ఉపయోగిస్తుండటంపై పత్రికల్లో కథనాలు వచ్చాయి. వీటిని హైకోర్టు 2015లో సుమోటో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్‌) గా పరిగణించింది. దీనిపై ఇప్పటికే పలుమార్లు విచారించిన ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భం గా తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్‌సీ) తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఆహార భద్రత అధికారుల పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇం దుకు ప్రభుత్వం నుంచి ఆమోదం కూడా వచ్చిందని వివరించారు. కొత్తగా 36 ఆహార భద్రతా అధికారుల పోస్టులను సృష్టించామని తెలిపారు. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం స్థానిక అభ్యర్థులు, ఇతరులకు చెం దిన రిజర్వేషన్ల వ్యవహారంపై మరింత స్పష్టత అవసరం ఉందని చెప్పారు. ఈ సమయంలో ధర్మాస నం స్పందిస్తూ అటువంటిదేమీ అవసరం లేదని, రాష్ట్రపతి ఉత్తర్వులు చాలా స్పష్టంగా ఉన్నాయని, చట్ట నిబంధనల మేరకు ఆ ఉత్తర్వులను అమలు చేస్తే సరిపోతుందని తెలిపింది. వీలైనంత త్వరగా ఆహార భద్రతా అధికారుల నియామకానికి నోటిఫికేషన్‌ జారీ చేయాలని టీఎస్‌ïపీఎస్‌సీని ధర్మాసనం ఆదేశించింది. ఆహార భద్రతారంగం ఎదుర్కొం టున్న పెద్ద సవాళ్లలో కార్బైడ్‌ వినియోగం ఒకటని ధర్మాసనం అభిప్రాయపడింది.

నోటి ఆరోగ్యం…అన్నింటి కన్నా ఉత్తమం

నోటిని శుభ్రం చేసుకున్నారా… అన్ని అవయవాలనూ క్లీన్‌ చేసుకున్నట్టే! ‘‘తమ్ముడు మన్ను తిన్నాడం’’టూ చిన్నికృష్ణుడి మీద పెద్దాడి కంప్లెయింట్‌. ‘‘ఏదీ నోరు తెరువ్‌’’ అంది యశోద. చిన్నికన్న నోరు తెరిస్తే… సకల లోకాలూ… పదహారు భువనభాండాలూ కనిపించాయట ఆమెకు. అంటే యశోదమ్మ కూడా చిన్నారి కృష్ణుడి (నోటి) ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకున్నట్టేగా! రమణీయ భాగవత కథాస్ఫూర్తిని మన ఆరోగ్యానికీ అనువర్తించుకుందామా? మన నోటిలో సకల అవయవాల రక్షణా ఉంటుంది. కేవలం మన నోటిని మాత్రం పరిశుభ్రంగా ఉంచుకున్నామనుకోండి. ఒంట్లోని దాదాపు అన్ని అవయవాలనూ క్లీన్‌ చేసేసినట్టే. వాటన్నింటినీ బ్యాడ్‌ బ్యాక్టీరియాకు దూరం ఉంచినట్టే. నమ్మడం లేదా? మీ నోటి శుభ్రత వల్ల ఎన్నెన్ని కీలక భాగాలకు రక్షణ కలుగుతుందో తెలుసుకుంటే… మీరలా నోరు తెరచుకుని చూస్తుండిపోతారంతే. పళ్లను బ్రష్‌ చేసుకుంటే… దేహంలోని అవయవాలు ఎలా ఖుష్‌ అవుతాయో చూద్దాం.
**ఓరల్‌ హైజీన్‌తో గుండెకు రక్ష
మనం రోజూ చక్కగా బ్రష్‌చేసుకుంటూ, చిగుర్ల ఆరోగ్యాన్ని చక్కగా చూసుకుంటే గుండెజబ్బులను, గుండెపోటును నివారించినట్లే. నోటి శుభ్రత సరిగా పాటించకపోతే వచ్చేందుకు గుండెజబ్బులు రెడీగా ఉంటాయ్‌. ఇందుకు రెండు కారణాలు. మొదటిది… నోటిలో జబ్బులకు, చిగుర్ల వ్యాధులకు కారణమయ్యే బ్యాక్టీరియా కొన్నిరకాల విషాలను వెలువరిస్తుంటాయి. ఇవి రక్తప్రవాహంలోకి ప్రవేశించి రక్తం సాఫీగా ప్రవహించడానికి అడ్డుపడేలా కొన్ని రక్తపు గడ్డలు (క్లాట్స్‌), కొవ్వుముక్కల వంటి పదార్థాలను (ప్లాక్స్‌) తయారు చేస్తాయి. దాంతో గుండెపోటు అవకాశాలు పెరుగుతాయి. రెండో కారణం… నోట్లోని హానికరమైన బ్యాక్టీరియావల్ల కాలేయంలో కొన్ని ప్రోటీన్లు తయారవుతాయి. అవి రక్తనాళాల్లోకి ప్రవేశించి అడ్డుపడటం వల్ల గుండెపోటు రావచ్చు. అందువల్ల మీరు నోరు శుభ్రం చేసుకుంటున్నారంటే… గుండె పరిసరాల్లోనూ ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ఏర్పరుస్తున్నారని అర్థం. మీకో విషయం తెలుసా? గుండెకు బైపాస్‌సర్జరీ చేయించుకోదలచిన వారు ముందుగా దంతవైద్యుడిని కలిసి తమకు పళ్లు, చిగుళ్లకు సంబంధించిన ఇన్ఫెక్షన్స్‌ ఏవీలేవని నిర్ధారణ చేసుకుంటేనే శస్త్రచికిత్స జరిగేది. నోటికీ, గుండెకూ ఇంతటి దగ్గరి సంబంధముందన్నమాట.
**నోటి శుభ్రతతో లంగ్స్‌ కూడా హెల్దీగా
అందరి నోళ్లలోనూ, గొంతులోనూ బ్యాక్టీరియా ఉంటుంది. దీన్నే ఓరో–ఫ్యారింజియల్‌ బ్యాక్టీరియా అంటారు. ఇది గొంతులోకీ, అక్కడి నుంచి లంగ్స్‌లోకి ప్రవేశించవచ్చు. ఇది ఒక్కోసారి పల్మునరీ ఇన్ఫెక్షన్స్‌కు, నిమోనియాకు దారితీయవచ్చు. ఇది వయసు పైబడ్డవారిలో జరిగితే సీఓపీడీ (క్రానిక్‌ అబ్‌స్ట్రక్టివ్‌ పల్మునరీ డిసీజ్‌) వంటి ఊపిరితిత్తుల సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. అందుకే నోరు బాగుంటే బ్రెత్‌ బాగుంటుందని ఇంగ్లిష్‌లో అంటారు. ఇక్కడ బ్రెత్‌ అంటే ఊపిరికి సహాయం చేసే ఊపిరితిత్తులు అనుకోవచ్చు.
**మన నోరు క్లీన్‌గా ఉందంటే…
మనల్ని క్లీన్‌ చేసే కిడ్నీలూ క్లీన్‌
మన దేహంలోని వ్యర్థాలను క్లీన్‌ చేసే డ్యూటీ మూత్రపిండాల (కిడ్నీల)దన్న విషయం తెలిసిందే. కిడ్నీలకూ, నోటికీ ఉన్న సంబంధమేమిటో చూద్దాం. మూత్రపిండాల జబ్బులతో బాధపడేవారికి నోటి రుచి కూడా మారిపోతుంది. వాళ్ల నోటినుంచి దుర్వాసన కూడా వస్తుంది. ఇలా ఎందుకు జరుగుతుందో చూద్దాం. మనలోని మలినాలనూ, వ్యర్థాలనూ తొలగించేవి కిడ్నీలే కదా. అవి పనిచేయనందు వల్ల ఆ మలినాలన్నీ ఒకేచోట పోగుపడినట్టుగా అవుతాయి. దాంతో మన శరీరంలోని యూరియా అమోనియాగా మారి నోటి ద్వారా బయటకు వెళ్తుంది. అందుకే అలా దుర్వాసన వస్తుంటుందన్నమాట. కాబట్టే కిడ్నీలూ బాగుండాలంటే నోరు బాగుండాలి. నోరు బాగుంటే అవీ బాగుంటాయి. ఇక కిడ్నీ జబ్బు ఉండి డయాలసిస్‌ చికిత్స తీసుకునేవారు నోటిని క్లీన్‌ చేసుకోవాలనుకుంటే అది డయాలసిస్‌ అయిన మర్నాడు ప్లాన్‌ చేసుకోవడం మంచిది.
**నోరు క్లీన్‌గా ఉంటే మెదడుకూ ఆరోగ్యం
నోటి శుభ్రతకూ, మెదడుకు కూడా సంబంధం ఉందంటే నమ్మడం కష్టం. కానీ అది నిజం. మన నోటిలో చిగుళ్లపై ఒక గారలాంటిది ఏర్పడుతుంటుంది. దీన్నే సూప్రా జింజివల్‌ ప్లాక్‌ లేదా సబ్‌ జింజివల్‌ ప్లాక్‌ అంటారు. ఇది మన రక్తంలోని ప్లేట్‌లెట్‌లను గుంపులుగా చేరేలా చేస్తుంది. దాంతో రక్తం గడ్డకట్టే ప్రక్రియల్లో ఒకటైన ‘థ్రాంబస్‌ ఫార్మేషన్‌’ జరుగుతుంది. ఫలితంగా రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే ప్రమాదం ఉంది. దీన్నే ‘థ్రాంబో ఎంబాలిజమ్‌’ అంటారు. ఈ ప్రక్రియ మెదడుకు రక్తాన్ని చేరవేసే రక్తనాళాల్లో జరిగినప్పుడు అది బ్రెయిన్‌స్ట్రోక్‌కు దారి తీయవచ్చు. అంతేకాదు మన నోటిలోని, ముఖ్యంగా కోరపళ్ళ దగ్గరి ఇన్ఫెక్షన్‌ అక్కడి నుంచి మెదడుకు పాకి కేవర్నస్‌ సైనస్‌ థ్రాంబోసిస్‌ అనే కండీషన్‌కు దారితీసే ప్రమాదం ఉంది. ఇది ప్రాణాంతకం. అందుకే నోటిని శుభ్రంగా ఉంచుకోవాలి. అంటే… మనం ముఖం శుభ్రంగా కడుక్కోవడమంటే మెదడునూ సురక్షితంగా ఉంచుకోవడమన్నమాట.
**పన్ను – కన్ను
పన్ను పీకిస్తే అది కంటి నరాలను అదిరేలా చేసి చూపును తగ్గిస్తుందనీ మనలో చాలామందికి ఓ అపోహ. ఇది నిజం కాదు. అయితే నోటిలో వచ్చే ఇన్ఫెక్షన్లు మెదడుకు చేరే మార్గంలోనే కంటికి చేరితే అది ‘కార్నియల్‌ ఇన్ఫెక్షన్‌’గా మారవచ్చు. కొన్నిసార్లు పైవరస పంటికి పైభాగంలో ఉండే ఎముకల్లో చీము పడితే, అది కంటినీ ప్రభావితం చేయవచ్చు. కంటికి క్యాటరాక్ట్‌ ఆపరేషన్‌ చేయించుకోదలచిన వారు ముందుగా నోటిలో ఎలాంటి ఇన్ఫెక్షన్‌లూ లేకుండా చూసుకుని ఆ తర్వాతే ఆపరేషన్‌ చేయించుకోవాలని డాక్టర్లు సూచిస్తుంటారు.
**నోటి పరిశుభ్రత – డయాబెటిస్‌
డయాబెటిస్‌ ఉన్నవారు షుగర్‌ను అదుపులో పెట్టుకోకపోతే నోటికి సంబంధించిన అనేక సమస్యలు రావచ్చు. లాలాజలం ఉత్పత్తి దెబ్బతినవచ్చు. అందుకే చక్కెరవ్యాధి ఉన్న చాలామందిలో నోరు పొడిబారిపోతుంటుంది. అది క్రమంగా నోటిలో పుండ్లకు, దంతక్షయానికి దారితీయవచ్చు. చక్కెర నియంత్రణలో లేకపోతే జింజివైటిస్, పెరియోడాంటైటిస్‌ వంటి చిగుర్ల ఇన్‌ఫ్లమేషన్‌ సమస్యలు రావచ్చు. ఇక పళ్లు వదులై కదులుతున్నప్పుడు లేదా చిగుర్లనుంచి రక్తస్రావం అవుతున్నప్పుడు లేదా నోటిలో ఏదైనా పుండై అది మానకుండా ఉంటే ముందుగా దంతవైద్యుడిని కలిసి డయాబెటిస్‌ ఉందేమోనని నిర్ధారణ పరీక్ష చేయించుకోవడం తప్పనిసరి. ఇక్కడ చెప్పిన ఉదాహరణలతో తెలిసే విషయం ఒక్కటే… మనం ఒక్క మన నోటిని శుభ్రంగా ఉంచుకున్నామంటే… శరీరంలోని దాదాపు అన్ని అవయవాలనూ శుభ్రపరచుకున్నట్లే! అందుకే ఉదయం తప్పక నోరు శుభ్రంగా కడుక్కున్న తర్వాతే మరే పనైనా చెయ్యాలి. అలాగే ప్రతిరోజూ రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు నోరు తప్పక శుభ్రం చేసుకోవాలి.
**నోటి శుభ్రత ఇలా…
పుట్టిన పాపాయి మొదలుకొని (పళ్లు రాకముందు నుంచే) అందరూ పళ్ళు శుభ్రం చేసుకోవాలిపైన చిగుళ్లూ, పళ్లూ కలిసే చోటి నుంచి కింద మళ్లీ చిగుళ్లూ, పళ్లూ కలిసే చోటు వరకు నిలువుగా బ్రష్‌ చేసుకోవాలి. పైకీ, కిందికీ రౌండ్‌గా తిప్పుతున్నట్లుగా బ్రష్‌ చేసుకోవాలి. అంతే తప్ప పలువరసకు అడ్డంగా బ్రష్‌ చేసుకోవడం సరికాదుబ్రష్‌ చేసుకునే సమయంలో చాలా మృదువుగా బ్రష్‌ చేసుకోవాలి. చిగుర్లను బ్రష్‌తో గాయపరచుకోకుండా చూసుకోవాలి. మరీముఖ్యంగా డయాబెటిస్‌ ఉన్నవారిలో ఇది చాలా ప్రధానంపంటికి బయటా, లోపల కూడా బ్రష్‌ చేసుకోవాలిబ్రష్‌ను అదేపనిగా నములుతూ ఉండకూడదు. మరీ పలువరస అరిగిపోయేలా చాలాసేపు బ్రష్‌ చేసుకోవడమూ సరికాదు. బ్రష్‌ చేసుకునే ప్రక్రియ కనీసం రెండు లేదా మూడు నిమిషాలపాటు సాగాలి
పళ్లు తోముకున్న తర్వాత ముఖం కడుక్కునే సమయంలో, చిగుళ్లపై వేలితో మృదువుగా మాలిష్‌ చేస్తున్నట్లుగా మసాజ్‌ చేసుకోవాలినాలుకపైనున్న బాక్టీరియాను తొలగించుకునేలా టంగ్‌క్లీనింగ్‌ కూడా చేసుకోవాలిమూడునెలలకోసారి లేదా ఏదైనా జబ్బు చేసినప్పుడు కోలుకున్న వెంటనే పాత బ్రష్‌ మార్చేయాలిప్రతి ఆర్నెల్లకోమారు తప్పనిసరిగా డెంటిస్ట్‌ను కలిసి, పళ్లను పరీక్షించుకుంటూ ఉండాలి. గార (ప్లాక్‌) వంటివి తొలగించుకునేలా క్లీన్‌ చేయించుకోవాలి.కాబోయే తల్లి నోరు శుభ్రంగా ఉంటే… కడుపులో బిడ్డా క్షేమం గర్భవతుల్లో సాధారణంగా రెండోనెలలో ‘ప్రెగ్నెన్సీ జింజివైటిస్‌’ అనే చిగుర్ల వ్యాధి కనిపిస్తుంటుంది. ప్రెగ్నెన్సీలో నోటి శుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వకపోతే వాచిన చిగుర్లలో లేదా నోటిలో కణుతులు, మంటలేని–క్యాన్సర్‌ కానీ కొన్ని గడ్డలు పెరగవచ్చు. గర్భవతులు నోటి ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకోకపోతే నెలలు నిండకముందే ప్రసవం కావడం, పుట్టిన బిడ్డ బరువు తక్కువగా ఉండటం వంటి సమస్యలు రావచ్చు. గర్భవతులు నోటి ఆరోగ్యాన్ని చక్కగా ఉంచుకుంటే అది పుట్టబోయే బిడ్డకూ మేలు.

మరీ వేడిగా తాగితే క్యాన్సర్ ముప్పు

టీ, కాఫీలను వేడివేడిగా తాగితే అన్నవాహిక క్యాన్సర్‌ ముప్పు పెరిగే అవకాశం ఉందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. చాలామంది టీ, కాఫీ, ఇతర పానీయాల్ని వేడివేడిగా తాగేందుకు ఇష్టపడతారని, ఇలా తాగితే అన్నవాహిక క్యాన్సర్‌ ముప్పు పెరిగే అవకాశం ఉందని తమ అధ్యయనంలో తేలిందని అమెరికన్‌ క్యాన్సర్‌ సొసైటీకి చెందిన పరిశోధకులు పర్హాద్‌ ఇస్లామి పేర్కొన్నారు. వేడి పానీయాలు కొద్దిగా చల్లబడే వరకూ ఆగడం మంచిదని సూచించారు. పదేళ్లపాటు నిర్వహించిన అధ్యయనంలో 40 నుంచి 75 ఏళ్ల మధ్య వయసున్న 60,045 మందిని పరిశీలించారు. ఇందులో 317 అన్నవాహిక క్యాన్సర్‌కు సంబంధించిన కొత్త కేసులు నమోదయ్యాయి. ‘ఇంటర్నేషనల్‌ జర్నల్‌ ఆఫ్‌ క్యాన్సర్‌’లో పరిశోధన వివరాలు ప్రచురితమయ్యాయి.

అంజీర పండ్లతో శృంగారం సరిహద్దుల్లోకి వస్తుంది

అంజీర్‌ పండ్లు మ‌న‌కు మార్కెట్‌లో రెండు రూపాల్లో ల‌భిస్తాయి. ఒక సాధార‌ణ పండు రూపంలో, రెండోది డ్రై ఫ్రూట్ రూపంలో. అయితే ఏ రూపంలో వీటిని తిన్నా మ‌న‌కు అనేక లాభాలు క‌లుగుతాయి. అంజీర్‌ పండ్ల‌లో విట‌మిన్ ఎ, బి1, బి2, కాల్షియం, ఐర‌న్‌, పాస్ప‌ర‌స్‌, మెగ్నిషియం, సోడియం, పొటాషియం త‌దిత‌ర పోష‌కాలు పుష్క‌లంగా ఉంటాయి. అందువ‌ల్ల మ‌న‌కు ఎన్నో ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ఈ క్ర‌మంలోనే నిత్యం అంజీర్ పండ్ల‌ను ఆహారంలో భాగం చేసుకుంటే ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. అంజీర్ పండ్ల‌లో ఉండే ఐర‌న్ ర‌క్త‌హీన‌త స‌మ‌స్య‌ను పోగొడుతుంది. రక్తం బాగా త‌యార‌వుతుంది. అంజీర్ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల శృంగార స‌మ‌స్య‌లు పోతాయి. దంప‌తులు శృంగారంలో చురుగ్గా పాల్గొంటారు. హైబీపీతో బాధ‌ప‌డేవారు నిత్యం అంజీర్ పండ్ల‌ను తినాలి. వీటిలోఉండే పొటాషియం హైబీపీని త‌గ్గిస్తుంది. గుండె స‌మ‌స్య‌లు రాకుండా చూస్తుంది. వేస‌విలో స‌హ‌జంగానే చాలా మందికి వేడి చేస్తుంటుంది. అలాంటి వారు ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే అంజీర్ పండ్ల‌ను తింటే శ‌రీరానికి చ‌లువ చేస్తుంది. వేడి త‌గ్గుతుంది. అంజీర్ పండ్ల‌ను తింటే నిద్ర‌లేమి స‌మ‌స్య పోతుంది. నిద్ర చ‌క్క‌గా ప‌డుతుంది. అలాగే డ‌యాబెటిస్ అదుపులోకి వ‌స్తుంది. శ‌రీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ త‌గ్గుతుంది. ఎముక‌లు దృఢంగా మారుతాయి. అంజీర్ పండ్ల‌ను తినడం వ‌ల్ల ప‌లు ర‌కాల క్యాన్స‌ర్లు రాకుండా చూసుకోవ‌చ్చ‌ని ప‌రిశోధ‌న‌లు వెల్ల‌డిస్తున్నాయి.

అతి దాహానికి విరుగుడు మేడిపండు రసం

వేసవికాలంలో అధికంగా దాహం వేయడం సహజమే. ఎండ వేడిమికి నోరు చేదుగా ఉండడం, నోరెండిపోవడం, తలనొప్పి, తల తిరగడం, కళ్లు మసకబారడం, చల్లనినీరు పదే పదే తాగాలనిపించడం మొదలైన ప్రధాన లక్షణాలు దాహంతో బాధపడే వారిలో కనిపిస్తాయి. అలాంటివారు ఈ చిట్కాలు పాటిస్తే సరి…గ్లాసు చల్లని నీటిలో నాలుగు చెంచాల పంచదార, ఒక నిమ్మకాయను పిండి తీసిన రసం, చిటికెడు ఉప్పు కలిపి తాగితే దాహం తగ్గుతుంది. మేడి పండ్ల రసంలో చక్కెర కలిపి తాగితే అతిదాహం తగ్గుతుంది. వేసవి ఎండలో అతిగా తిరగడం వల్ల ఏర్పడిన దాహంతో బాధపడే వారికి అన్నం వండినప్పుడు వార్చిన గంజిలో కాస్త ఉప్పు వేసుకు తీసుకుంటే దాహం తీరుతుంది. దానిమ్మ పండ్ల రసానికి సమంగా చక్కెర కలిపి, తేనె పాకంగా వండాలి. దీన్ని రెండు టీ స్పూన్ల చొప్పున రోజుకి మూడుసార్లు తీసుకుంటే దాహం తగ్గుతుంది.ధనియాల కషాయంలో చక్కెర, తేనె కలిపి తాగితే మంచి ఫలితం కనిపిస్తుంది. పెరుగు అన్నంలో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొద్దిగా ఉప్పు కలిపి తింటే త్వరగా దాహం వెయ్యదు, వడదెబ్బ నుంచీ కోలుకుంటారు

కిళ్లీ+మధుమేహం చాలా డేంజర్

మధుమేహంతో బాధపడుతున్నారా? కిళ్లీ నమిలే (పాన్‌) అలవాటు కూడా ఉందా? అయితే వెంటనే మానెయ్యండి. ఇది జీవక్రియలపై విపరీత ప్రభావం చూపుతోందని, నడుం చుట్టుకొలత పెరగటానికి దారితీస్తోందని భారతీయ వైద్యుల సంఘం పత్రికలో ప్రచురితమైన కథనం హెచ్చరిస్తోంది. సాధారణంగా మధుమేహ నియంత్రణలో ఆహారం, వ్యాయామం మీద ప్రత్యేకంగా దృష్టి పెడుతుంటారు. అయితే మార్చుకోదగిన జీవనశైలి అంశాల్లో కిళ్లీ అలవాటును కూడా పరిగణనలోకి తీసుకోవాలని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కిళ్లీతో మధుమేహ ముప్పు పెరుగుతున్నట్టు తైవాన్‌ అధ్యయనంలో బయటపడటం.. కిళ్లీలో వాడుకునే వక్కలతో నడుం చుట్టుకొలత పెరుగుతున్నట్టు బ్రిటన్‌ అధ్యయనంలో తేలటం గమనార్హమని వివరిస్తున్నారు. ప్రత్యేకించి యువతరంలో మధుమేహానికీ కిళ్లీ నమలటానికీ సంబంధం ఉంటుండటం మరింత ఆందోళన కలిగిస్తోందనీ చెబుతున్నారు. అందువల్ల మధుమేహంతో బాధపడేవారికి కిళ్లీ అలవాటు కూడా ఉందేమో చూడటం తప్పనిసరని.. ఒకవేళ కిళ్లీ అలవాటు వదల్లేని స్థితిలో ఉంటే మానసిక నిపుణులకూ సిఫారసు చేయాలని సూచిస్తున్నారు. పాన్‌ అలవాటుతో కిడ్నీలో రాళ్లు ఏర్పడే ముప్పు సైతం పెరుగుతున్నట్టు మరో అధ్యయనం పేర్కొంటోంది. ఇందుకు తమలపాకుల మీద రాసే సున్నం కారణం కావొచ్చని భావిస్తున్నారు. వక్కలు తినేవారిలో దీర్ఘకాల కిడ్నీజబ్బు కూడా ఎక్కువగానే కనబడుతోంది. పొగ అలవాటు, మద్యపానం, మధుమేహం వంటి ఇతరత్రా ముప్పు కారకాలను మినహాయించినా వక్కలతో దీర్ఘకాల కిడ్నీ జబ్బు ముప్పు కనబడుతుండటం గమనార్హం. అంతేకాదు, వక్కలు ఎక్కువగా తినేవారిలో విటమిన్‌ డి స్థాయులు కూడా తక్కువగానే ఉంటున్నట్టు తేలటం విశేషం.

వారానికొకసారి హెర్బల్ నూనెతో మర్దన చేస్తే…

రోజూ అందం, ఆరోగ్యంపై శ్రద్ధపెట్టే సమయం మీకు ఉండకపోవచ్చు. కానీ వారానికి ఒక్కసారైనా కొంత సమయం కేటాయించుకోండి.
*వారానికి ఒక్కసారైనా హెర్బల్‌ నూనెలతో శరీరానికి మర్దన చేయండి. దీనివల్ల ఒత్తిడి తగ్గుతుంది. చర్మం కాంతిమంతంగా మారుతుంది.
*తీరిక ఉన్నప్పుడల్లా ముఖంలో పేరుకున్న మృతకణాలు తొలగించేందుకు స్క్రబ్‌ చేసుకుంటాం. అలానే వారానికోసారైనా శరీరం మొత్తానికి అంటే వీపు, మెడ, కాళ్లకు కూడా స్క్రబ్‌ అవసరం. డీప్‌క్లెన్సింగ్‌ మిల్క్‌ని ఇందుకోసం ఉపయోగించవచ్చు. పాలు, పంచదార వంటి సహజ పదార్థాలనూ వాడుకోవచ్చు.
*చర్మంపై మృతకణాలు తొలగి నిగారింపు రావాలంటే…కనీసం అప్పుడప్పుడూ ముఖానికి ఫేషియల్‌ అవసరం. అలాని పార్లర్‌కే వెళ్లాలని లేదు. ఇంట్లో పండ్ల గుజ్జుతో ప్యాక్‌లు వేసుకోవచ్చు. టాన్‌ పోయి ముఖం తాజాగా కనిపిస్తుంది.

సగటున ౩౦ లీటర్లు తాగేస్తున్నారు

మద్యంపై ఎన్నో అపోహలున్నాయి. మీ స్నేహితుడి వాదనలూ అలాంటివే. మద్యం కొద్దిగా తాగితే ఏమీ కాదనుకోవటం.. మద్యం తాగిన తర్వాత భోజనం చేస్తే ఎలాంటి హానీ ఉండదనుకోవటం పూర్తిగా అపోహ. భోజనం చేయటం వల్ల తాత్కాలికంగా జీర్ణాశయంలో మంట, చికాకు వంటి ఇబ్బందులు కనబడకపోవచ్చేమో గానీ తిని తాగినా, తాగి తిన్నా మద్యం మూలంగా తలెత్తే అనర్థాలను తప్పించుకోలేం. మద్యం ఎంత తీసుకుంటారనేదాన్ని బట్టి దాని దుష్ప్రభావాలు, అనర్థాల తీవ్రత పెరుగుతుంది. అందువల్ల వీలైనంతవరకు మద్యానికి దూరంగా ఉండటమే ఉత్తమం. ఒకవేళ మరీ తప్పదనుకుంటే మితం పాటించటం మంచిది. మన కాలేయం కొంతవరకే ఆల్కహాల్‌ను విడగొట్టగలదు. నిర్ణీత మద్యం మోతాదు (ఒక పెగ్గు) కొలమానం ఒకో దేశంలో ఒకోలా ఉంటుంది. మనదేశంలో సుమారు 60 మిల్లీలీటర్లను ఒక పెగ్గుగా భావిస్తుంటారు. కానీ వైద్యపరంగా ఒక పెగ్గు అంటే 25 మిల్లీలీటర్లే. మంచి ఆరోగ్యంతో ఉన్నా కూడా మన కాలేయం వారంలో గరిష్ఠంగా ఇలాంటి 21 పెగ్గుల కన్నా ఎక్కువ.. అంటే 525 మిల్లీలీటర్ల కన్నా ఎక్కువ (మహిళల్లోనైతే 350 ఎం.ఎల్‌.) మద్యాన్ని విడగొట్టలేదు. దీన్ని విడగొట్టే క్రమంలో రకరకాల విషతుల్యాలు పుట్టుకొస్తాయి కూడా. ఇవి కాలేయాన్ని బాగా దెబ్బతీస్తాయి. కాలేయానికి కొవ్వు పట్టటం, కాలేయవాపు (హెపటైటిస్‌) వంటి సమస్యలు మొదలవుతాయి. క్రమంగా కాలేయం గట్టిపడిపోయి తాళ్లుతాళ్లుగా (సిరోసిస్‌) అయిపోతుంది. కాలేయ క్యాన్సర్‌ కూడా రావొచ్చు. మద్యం మూలంగా జీర్ణాశయంలో ఆమ్లం స్థాయులు పెరిగిపోతాయి. దీంతో ఆకలి తగ్గిపోతుంది. జీర్ణాశయంలో, పేగుల్లో అల్సర్లు, క్యాన్సర్లు తలెత్తొచ్చు. అతిగా మద్యం తాగితేనే ఇలాంటి అనర్థాలు తలెత్తుతాయని అనుకోవటానికీ లేదు. ఎందుకంటే మద్యం కొద్దిగా తాగినా క్లోమగ్రంథి (పాంక్రియాస్‌) విపరీతంగా ప్రభావితమవుతుంది. ఇది పాంక్రియాస్‌ వాపునకు దారితీయొచ్చు. కాలేయం గట్టిపడటం, పాంక్రియాస్‌ వాపులతో కిడ్నీ జబ్బులూ తలెత్తొచ్చు. అతిగా మద్యం తాగేవారిలో మెదడు కుంచించుకుపోతున్నట్టూ అధ్యయనాలు పేర్కొంటున్నాయి. మద్యంతో పాటు చాలామంది కొవ్వులు, నూనెలతో కూడిన రకరకాల పదార్థాలు కూడా తింటుంటారు. అసలే మద్యంలో కేలరీలు దండిగా ఉంటాయి. ఇలాంటి పదార్థాలతో కేలరీలు మరింత పెరుగుతాయి. ఇవి అధిక బరువు, ఊబకాయానికి దారితీస్తాయి. వీటితో మధుమేహం, అధిక రక్తపోటు ముప్పులూ పెరుగుతాయి. ఇక మధుమేహం, అధిక రక్తపోటుతో గుండెజబ్బులు, పక్షవాతం వంటి తీవ్ర సమస్యలూ దాడిచేస్తాయి. నాడులు కూడా దెబ్బతింటాయి. కాబట్టి మద్యం జోలికి వెళ్లకపోవటం మంచిదని గుర్తించాలి. మన తెలుగు రాష్ట్రాల్లో ఒకో వ్యక్తి ఏటా సగటున 30 లీటర్లకు పైగా మద్యాన్ని తాగుతున్నారని అంచనా. ఇది జాతీయ సగటు (6 లీటర్లు) కన్నా 5 రెట్లు ఎక్కువ కావటం గమనార్హం. ఈ నేపథ్యంలో అపోహలను తొలగించుకొని.. మద్యానికి దూరంగా ఉండటం ఎంతైనా అవసరమని అంతా తెలుసుకోవాలి.

కొబ్బరినీళ్లు తాగితే వయసు తగ్గుతుంది

మొటిమలు, బ్లాక్‌హెడ్స్, చర్మం కందిపోవడం, రంగు తేలిపోవడం, వయసు పైబడడం, చర్మ సమస్య ఏదైనా సులువుగా పరిష్కరించే అద్భుత జలం కొబ్బరి నీళ్లు.. మీరు వినింది కరెక్టే. కొబ్బరి నీళ్లు దాహాన్ని ఆరోగ్యాన్నివ్వడమే కాదు.. అందాన్ని కూడా ఇస్తాయి. కొబ్బరి నీళ్ళలో ఉండే విటమిన్ బి, విటమిన్ సి, ఇతరత్రా అనేక ఔషధ గుణాలు చర్మ సమస్యలను పరిష్కరించడానికి దివ్యౌషధమే అనుకోండి. దీని లక్షణాలు, పరిష్కార మార్గాలను పరిశీలిద్దాం.
* దాదాపుగా అందరినీ బాధించే సమస్య మొటిమలు. ప్రతి ఒక్కరికీ ఏదో ఒకసారి ఈ సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది. యుక్త వయసులోని వారికి ఇది మరింత పెద్ద సమస్య. ఇలాంటి వారు కొబ్బరినీళ్ళలోని ఔషధ గుణాలతో వీటిని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. రోజూ క్రమం తప్పకుండా కొబ్బరి నీళ్ళను ముఖానికి రాసుకోవడం వల్ల ఈ మచ్చలు క్రమేనా తగ్గిపోతాయి. చర్మం కూడా తాజాగా, అందంగా మారుతుంది.
* కొబ్బరి నీళ్ళు చికెన్ పాక్స్‌కు సంబంధించిన మచ్చలను కూడా రూపుమాపగలవు.
* చర్మాన్ని శుభ్రపరచడంలో కొబ్బరినీళ్ళకు మించింది ఏదీ లేదు. ముఖ్యంగా డీప్ క్లీనింగ్‌కి కొబ్బరి నీళ్ళు చక్కగా ఉపయోగపడతాయి.
* కొద్దిపాటి కొబ్బరినీళ్ళను ముఖానికి పూయాలి. అవి ఆరేంత వరకు అలాగే ఉండాలి. తరువాత తడిపిన దూదితో ముఖాన్ని తుడిచేయాలి. ఇలా చేయడం వల్ల చర్మం లోతు నుంచి చక్కగా శుభ్రపడుతుంది.
* మేకప్‌ను తొలగించడానికి కూడా కొబ్బరినీళ్ళు చక్కగా ఉపయోగపడతాయి.
* ఓ అధ్యయనం ప్రకారం కొబ్బరినీళ్ళలో యాంటీ ఏజింగ్ కారకాలు ఉంటాయి. ఇవి వయసును తగ్గించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి.
* ప్రతిరోజూ ఒక గ్లాసు కొబ్బరినీళ్ళు తాగితే వయసు పైబడటం చాలా వరకు నెమ్మదిస్తుంది.
* రాత్రి పడుకునే ముందు క్రమం తప్పకుండా ముఖానికి కొబ్బరినీళ్ళను రాసుకోవడం వల్ల చర్మం తేమను సంతరించుకుని నిగారిస్తుంది.

విటమిన్-డీ అతిగా తీసుకుంటే తూలిపోతారు

విటమిన్‌-డి వలన అనేక ప్రయోజనాలుంటాయి. అయితే దాన్ని పరిమితంగా తీసుకుంటేనే! అతిగా తీసుకుంటే దానివలన అనర్థాలే ఎక్కువని శాస్త్రవేత్తలు తాజా అధ్యయనంలో గుర్తించారు. పరిశోధనల్లో భాగంగా ఊబకాయం ఉన్న వృద్ధ మహిళలు వైద్యులు సిఫారసు చేసిన మోతాదుకంటే మూడు రెట్లు ఎక్కువగా విటమిన్‌-డి తీసుకుంటే వారిలో జ్ఞాపకశక్తి, అభ్యాసనా శక్తి మెరుగైనట్టు కనిపించింది. కానీ.. ప్రతిస్పందన సమయం మాత్రం నెమ్మదిగా ఉందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. దానివలన వారు తూలి కిందపడే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని చెప్పారు.

పచ్చగా ఉన్నవి తింటే ఆరోగ్యం మంచిగా ఉంటుంది

పచ్చటి వాతారణం కంటికి ఆనందం కలిగిస్తుందన్నది తెలిసిందే. మరి పచ్చటి కూరలో? ఇవీ కంటికి మేలు చేసేవే. పాలకూర, తోటకూర, ఆకుపచ్చ గోబీ వంటి తాజా ఆకు కూరల్లోని ల్యూటీన్‌, జియాగ్జాంతీన్‌, విటమిన్‌ ఇ, బీటా కెరటిన్‌ వంటి యాంటీఆక్సిడెంట్లు, పోషకాలు కంటి ఆరోగ్యం దెబ్బతినకుండా కాపాడతాయి. వీలైతే ఆలివ్‌ నూనెలో కాస్త వేయిస్తే పోషకాల స్థాయులు మరింత పెరుగుతాయి కూడా. ఇక రంగురంగుల కాయగూరలు, పండ్లను కూడా తోడు చేసుకుంటే కంటికి మాత్రమే కాదు.. ఒంటికీ విందే!

రోగిష్టి వృద్ధులు భారతదేశంలోనే ఎక్కువ

జపాన్‌, స్విట్జర్లాండ్‌లలో నివసిస్తున్న వారితో పోలిస్తే భారతీయుల్లోనే ఎక్కువమంది వయసుతో పాటు వచ్చే అనారోగ్యాల బారిన పడుతున్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది. సాధారణంగా వయోధికుల్లో చాలామంది వివిధ వ్యాధుల బారిన పడటంతో పాటు, పలు సందర్భాల్లో గాయాల పాలవడం వంటివి కూడా సంభవిస్తుంటాయి. ఇలాంటి పరిస్థితులు ఏయే దేశాల్లో ఎలా ఉన్నాయన్న విషయమై అమెరికాకు చెందిన పరిశోధకులు తొలిసారిగా విస్తృత అధ్యయనం నిర్వహించారు. వాషింగ్టన్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులు, వారి సహచరులు 1990 – 2017 మధ్య 195 దేశాలు, ప్రాదేశికాల్లో ఈ పరిశోధనలు జరిపారు. సగటున 65 ఏళ్ల వయసున్న వారిని అధ్యయనానికి ఎంచుకున్నారు. అనారోగ్యాలతో వార్ధక్యం భారంగా మారిన ప్రజల సగటు వయసు స్విట్జర్లాండ్‌, జపాన్‌లలో 76 ఏళ్లు. ప్రపంచంలోనే ఈ దేశాల్లో పరిస్థితి మెరుగ్గా ఉండగా.. అత్యంత ప్రతికూలంగా ఉన్న పపువా న్యూగినియాలో ఇలాంటి సగటు వయసు కేవలం 46 ఏళ్లు. ఇది భారత్‌లో 60 ఏళ్లుగా తేలింది. వయోధికుల్లో శారీరక, మానసిక, అభిజ్ఞ సామర్థ్యాలను దెబ్బతీస్తున్న 92 రకాల అనారోగ్యాలపై ఈ అధ్యయనం సాగింది. ఇందులో 5 అంటు వ్యాధులు, 81 ఇతర రోగాలు కాగా మరో 6 గాయాలకు సంబంధించినవి. అనారోగ్యం కారణంగా చాలామంది వార్ధక్య జీవితాన్ని భయంగా గడుపుతున్నట్లు ప్రధాన అధ్యయనకర్త ఏంజెలా వై చాంగ్‌ తెలిపారు. వయసుతో వచ్చే సమస్యలు – త్వరగా పదవీ విరమణ చేయడం, తమ పనులు తాము చేసుకోలేని పరిస్థితికి చేరడం, ఆరోగ్యంపై ఎక్కువ ఖర్చు చేయడానికి దారితీస్తున్నట్లు తెలిపారు. ఈ విషయమై ప్రభుత్వాలు దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. ఇలాంటి అధ్యయనం జరపడం ఇదే తొలిసారిగా చాంగ్‌ తెలిపారు. 2017లో ప్రపంచంలోనే అత్యధికంగా పపువా న్యూగినియాలో ప్రజలు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతి వెయ్యిమంది వయోధికుల్లో 500కు పైగా అనారోగ్యానికి గురవుతున్నారు. అదే స్విట్జర్లాండ్‌లో దాదాపు 100 మందికి (వెయ్యి మందికి గాను) మాత్రమే ఇలాంటి సమస్యలున్నాయి.

వేసవిలో ఈ దుస్తులతో సౌకర్యం

వేసవి అనగానే ఎప్పుడూ వేసుకునే నూల వస్త్రాలని పక్కనబెట్టి సరికొత్త దుస్తులకు సై అంటోంది నేటి యువత. పలాజోలు, స్రైట్ ప్యాంట్స్, లేయర్డ్ టాప్‌స, అసమెట్రికల్ కట్.. ఇలా ఏది ఎంచుకున్నా వేసవిని చల్లగా, హాయిగా ఉండేలా చేస్తాయి. వేసవి వచ్చిందంటే చాలు భారీ పనితనం ఉన్న ఎంబ్రాయిడరీ, బరువైన వస్త్రాలకు దూరంగా ఉండాలనుకుంటారు. ఈ వాతావరణానికి తేలిగ్గా, హాయిగా, శరీరానికి చల్లదనాన్నిచ్చే వస్త్రాలకు ప్రాధాన్యతను ఇస్తాం. అలాగని ఎప్పుడూ నూలు రకాలే ఎంచుకోవాలని లేదు. చేనేత, లెనిన్, ఖాదీ, మట్కాసిల్క్, మల్‌మల్ వంటి రకాలకూ ప్రాధాన్యం ఇవ్వొచ్చు. అయితే ఏ రకం వ్రస్తమైనా బిగుతుగా కాకుండా జాలువారేలా, గాలాడేలా ఉండాలి. వేసవి ధోరణులుగా ప్రాచుర్యంలోకి వస్తోన్న ఈ నయా ట్రెండ్స్ యువత మతులు పోగొడుతున్నాయి. మరి ఎలాంటి దుస్తులకు ఎలాంటి వస్త్రాలను ఎంచుకుంటే బాగుంటుందో.. ఎలాంటి దుస్తులకు వేటిని జత చేస్తే బాగుంటుందో ఒకసారి చూద్దాం..
*కుర్తీలు
కాలమేదైనా.. సౌలభ్యంలో కుర్తీలకు మించినవి మరేవీ లేవు. కౌల్‌స్లీవ్స్, కోల్డ్‌షోల్డర్స్, బెల్ స్లీవ్స్.. ఇలాంటివన్నీ ఈ తరం అమ్మాయిలకు చక్కగా నప్పేస్తున్నాయి. అందాన్ని, హుందాతనాన్ని ఇస్తున్నాయి. కాలర్డ్‌పాన్చోలకు ఇప్పుడు విపరీతమైన ఆదరణ ఉంది.
*చీలికలు
సంప్రదాయంగా, గుండ్రంగా, సమానంగా ఉండే డ్రెస్‌లను ఇప్పుడు ఎవ్వరూ కోరుకోవడం లేదు. ఎత్తు, పల్లాల్లో అవకతవకలుంటేనే అది నేటి ఫ్యాషన్. ఇప్పుడు ఎగుడుదిగుడుగా, గజిబిజిగా కనిపించే చీలికల దుస్తుల ట్రెండ్ నడుస్తోంది.
*పలాజోలు
వస్త్రం ఏదైనా మంన ఎంచుకునే రకం మనకంటూ నిండుదనాన్ని, అందాన్ని తేవాలి. పలాజోలు అందరికీ నప్పుతాయి. క్రాప్‌టాప్స్, కుర్తీ, టీషర్ట్, అనార్కలీ.. ఇలా దేనిమీదకైనా సరే.. పలాజో చక్కగా అమరుతుంది. అలాగే గీతలు, ప్రకృతి సోయగాలతో కనువిందు చేసే అద్దకాల పలాజోలైతే మరింత అందాన్నిస్తాయి.
*పొరలుగా..
లేయర్డ్ ఫ్యాషన్ ఈనాటిది కాదు. ఎప్పటినుంచో ఉంది. పాతే కొత్తగా కనికట్టు చేస్తుందని చెప్పడానికి ఇదే ఓ ఉదాహరణ. ఎనభైవ దశకంలో సందడి చేసిన లేయర్డ్ తరహా ఇప్పుడు మరోసారి సరికొత్తగా మన ముందుకు వచ్చేసింది. నేలను తాకేలా లాంగ్ ఫ్రాక్‌లను ఎంచుకున్నా, టాప్‌ల కైనా, టాప్ సాదాగా ఉండి హాండ్స్ డిఫరెంట్‌గా కావాలనుకున్నా, మోకాళ్ల వరకు మాత్రమే దిగినా సరే.. పలుచటి పొరలు పొరలుగా వేసి కుట్టిన వస్తశ్రైలి వేసవిలో హాయిగా ఉంటుంది.
*వన్‌పీస్
నేటి యువత అంతా సింగిల్ పీస్ వస్త్రానే్న కోరుకుంటోంది. అలాంటి వాటిల్లో లాంగ్ ఫ్రాక్స్, జంప్ సూట్లు ముందున్నాయి. అలానే పారదర్శకంగా ఎలాంటి వస్తశ్రైలిపైకైనా అందంగా నప్పేస్తున్న కేప్‌లకే ఇప్పుడు అధిక ప్రాధాన్యం. వీలైతే క్రాప్‌టాప్, అనార్కలీ, లాంగ్‌గౌన్ ఏదైనా సరే.. దానిపైకి ఆర్గాంజా కేప్‌టాప్‌ను ఎంచుకుంటే.. ఆహార్యానికే కొత్తదనం వస్తుంది.
*చేనేత
ఆఫీసుకైనా, సమావేశానికైనా కాస్త ప్రొఫెషనల్ లుక్ కావాలంటే దానిపైకి బ్లేజర్ బాగుంటుంది. అయితే ఈ కాలంలలో లెదని వేసుకోవడం కష్టమే.. అందుకే కలంకారీ, ఇకత్ వంటి చేనేత రకాలతో తయారుచేసిన జాకెట్లు, బ్లేజర్లను వాడుకోవచ్చు. ఇవన్నీ చిన్న చిన్న వేడుకలకు కూడా బాగుంటాయి. మడమల పైకి వచ్చేలా ప్యాంట్‌లను కుట్టించుకోవడం నేటి శైలి. దానిపైకి ఓ చక్కని స్టోల్‌ను ఎంచుకుంటే అద్భుతం.. అనే ప్రశంసలను అందుకోకుండా ఉండలేరు.
*అద్దకాలు
కాలం మారింది. ఇప్పుడు జర్దోసి పనితనం కన్నా.. మెషీన్ ఎంబ్రాయిడరీ పనితనాన్ని అందరూ కోరుకుంటున్నారు. ఆబ్‌స్ట్రాక్ట్ ప్రింట్లు, హ్యాండ్‌పెయింటింగ్ వంటి డిజైన్లకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. సాధారణ రకాల్లోనే సరికొత్తగా కనిపించాలనుకుంటే ఫ్లోరల్ మోటిఫ్‌లను, ప్లెయిన్ కుర్తాలపై కుట్టించుకున్నా బాగుంటుంది.
* ఈ కాలంలో తరచుగా వాడే ముదురు రంగుల్ని పక్కన పెట్టేసి, దేశవాళీ లేత రంగులను ఎంచుకోవడం మంచిది. పాశ్చాత్య రంగుల్లోని ఆంబ్రే, ఆలివ్‌గ్రీన్‌లు చాలా బాగుంటాయి. తెలుపు ఎప్పటికీ వనె్న తగ్గని రంగు.. లేత గులాబీ, పసుపు, ఊదా, నీలం.. ఇలాంటివి వేసవికి భలేగా నప్పేస్తాయి. ఇలా వేసవిని పరిగెట్టించి అందంగా, హాయిగా ఉండొచ్చు.

అల్పాహారం మానేస్తే మెదడు చురుకుదనం తగ్గుతుంది

బ్రేక్‌ఫాస్ట్ అనేది మ‌నం నిత్యం తీసుకునే ఆహారంలో చాలా ముఖ్య‌మైంది. అందులో అనేక పోష‌కాలు ఉండేలా చూసుకోవాలి. అలాగే బ్రేక్‌ఫాస్ట్‌ను భారీగా చేయాలి. పెద్ద మొత్తంలో ఆహారం తీసుకోవాల‌ని వైద్యులు చెబుతుంటారు. కానీ మ‌న‌లో కొంద‌రు బ్రేక్‌ఫాస్ట్ మానేస్తారు. నేరుగా మ‌ధ్యాహ్న‌మే భోజ‌నం చేస్తారు. అయితే ఈ త‌ర‌హా జీవ‌న‌శైలి చాలా అనారోగ్యాల‌ను తెచ్చి పెడుతుంది. ఈ క్ర‌మంలోనే నిత్యం ఉద‌యాన్నే బ్రేక్‌ఫాస్ట్ తీసుకోక‌పోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్యలు వ‌స్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

1. నిత్యం బ్రేక్‌ఫాస్ట్ చేయ‌క‌పోతే గుండె జ‌బ్బులు వ‌చ్చేందుకు, స్ట్రోక్స్ బారిన ప‌డేందుకు అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయ‌ని సైంటిస్టులు చేసిన ప‌రిశోధ‌న‌ల్లో వెల్ల‌డైంది.

2. బ్రేక్‌ఫాస్ట్ మానేస్తే టైప్ 2 డ‌యాబెటిస్ వ‌స్తుంద‌ని సైంటిస్టులు చేప‌ట్టిన అధ్య‌యనాల్లో తెలిసింది.

3. బ్రేక్‌ఫాస్ట్ చేయ‌క‌పోతే అధికంగా బ‌రువు పెరుగుతార‌ని, శ‌రీరంలో కొవ్వు పేరుకుపోతుంద‌ని సైంటిస్టులు చెబుతున్నారు.

4. బ్రేక్‌ఫాస్ట్ మానేస్తే మెద‌డు యాక్టివ్‌గా ఉండ‌దు. ఫ‌లితంగా ఉత్సాహం లేక‌పోవ‌డం, చురుకుద‌నం త‌గ్గ‌డం, ఏకాగ్ర‌త లోపించ‌డం వంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయి. క‌నుక ఎవ‌రైనా స‌రే.. నిత్యం ఉద‌యాన్నే క‌చ్చితంగా బ్రేక్‌ఫాస్ట్ చేయాల్సిందే. ఇక అందులో పోష‌కాలు ఉండేలా చూసుకుంటే మ‌రీ మంచిది..!

ఎండలో తిరగండి. ఆస్తమా పోగొట్టుకోండి.

విటమిన్ డి…ఎముకల్లో కాల్షియంను పెంచి ఎముకులను గట్టి పరచడానికి మాత్రమే ఉపయోగపడుతుందని మనకు తెలుసు.. ఉదయం 11- మధ్యాహ్నం 1 గంటల మధ్య సూర్యరశ్మిలో మాత్రమే ఇది లభ్యమవుతుందని మనం చదువుకున్నాం… విటమిన్‌ డి లోపం ఉంటే కండరాల నొప్పులు, నీరసంగా ఉండడం లాంటి చిన్న చిన్న ఇబ్బందులుంటాయని అనుకున్నాం.. కానీ విటమిన్‌ డి లోపం వల్ల ఎన్ని అనర్థాలు ఉన్నాయో, విటమిన్‌ డి లోపం రాకుండా ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలో వైద్యులు చెప్తున్నారు. అవేంటో తెలుసుకుందాం! విటమిన్‌ డి అధికంగా ఉంటే ఆస్థమా నయమయ్యే అవకాశముందని వైద్య నిపుణులు అంటున్నారు. ఆస్థమాతో బాధపడుతున్న చిన్నారుల రక్తంలో విటమిన్‌ డి స్థాయులు తక్కువుగా ఉండడం వలన పిల్లలు శ్వాసకోస ఇబ్బందులు ఎదుర్కొంటారని వైద్యులు చెప్తున్నారు. విటమిన్‌ డి ఎముకులను గట్టి పరచడానికి మాత్రమే కాకుండా , హానికరమైన శ్వాసకోస కారకాల బారి నుంచి చిన్నారులను రక్షిస్తుందని భారతసంతతికి చెందిన నిపుణుల నేతృత్వంలోని బృందం వెల్లడించింది. ఆస్థమా రోగనిరోధక మధ్యవర్తిత్వ వ్యాధి అని మౌంట్‌ సినాయిలోని ఇస్కాన్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్ సోనాలి బోస్‌ అంటున్నారు. విటమిన్‌ డి రోగ నిరోధక సంబంధిత మార్గాల ద్వారా ఆస్థమాను నియంత్రింస్తుందని ఆమె తెలిపారు. తక్కువ విటమిన్‌ డి స్థాయిలను కలిగి ఉండడం వలన సిగరెట్‌ పొగ, కొవ్వొత్తులు కాల్చడం వల్ల వచ్చే పొగ, దుమ్ము, ధూళి తదితర హానికరాలు ఆస్థమా ఉన్న పిల్లలపై ప్రభావం చూపుంతుందని ఆమె హెచ్చరిస్తున్నారు. దీనికి విరుద్ధంగా, అధిక అంతర్గత వాయు కాలుష్యం ఉన్న ఇళ్లలో పిల్లలు పెరుగుతున్నప్పటికీ..విటమిన్‌ డి రక్తం అధికంగా ఉండటం వల్ల వారిలో ఆస్థమా లక్షణాలు తక్కువుగా కనిపిస్తున్నాయని బోస్‌ తెలిపారు. గృహాల్లో వాయు కాలుష్యం, రక్తంలో విటమిన్‌ డి స్థాయులు, ఆస్థమా లక్షణాలు గురించి అధ్యయనం చేయడానికి 120 మంది పాఠశాల విద్యార్థులను పరీక్షించగా, వారిలో 1/3వ వంతు పిల్లలు ఊబకాయంతో బాధ పడుతున్నట్లు తేలిందని ఒక పత్రిక వెల్లడించింది. సూర్యరశ్మిని ఎక్కువుగా తీసుకోవడం వలన రక్తంలో విటమిన్‌ డి స్థాయి పెరుగుతుందని, అయితే ఇది అందరికీ సాధ్యం కాకపోవచ్చని బోస్‌ అంటున్నారు. పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి, ముదురు చర్మం ఉన్న వారికి విటమిన్‌ డి స్థాయి లభ్యమయ్యే సమయంలో సూర్యరశ్మిని తీసుకోవడం వీలు కాకపోవచ్చు. పోషక పదార్థాలు ఎక్కువుగా తీసుకోవడంతో పాటు, చేప, పుట్టగొడుగు లాంటి విటమిన్‌ డి పుష్కలంగా లభించే పదార్థాలను తినాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వీటితో పాటు బ్రెడ్‌, ఆరెంజ్‌ జ్యూస్‌, పాలులో విటమిన్‌ డి ఎక్కువుగా లభిస్తుందని వైద్యులు అంటున్నారు.

ధనియాలు తిని తీరాల్సిందే

కూరలో కొత్తి మీర వేస్తున్నాం కదా ఇంక ధనియాలు ఎందుకు అని అనుకోకండి. ధనియాలతో పాటు మరికొన్ని మసాలా దినుసులు కలిపిచేసిన పొడిని వంటల్లో వేస్తే మరింత రుచి వస్తుంది. కొత్తిమీర నుంచి వచ్చిన ధనియాలు వంటల్లో ఎంత ప్రాధాన్యత వహిస్తుందో.. ఔషధంగా కూడా అద్భుతంగా పనిచేస్తుంది. శరీరాన్ని చల్లబరిచే శక్తి ధనియాలకు ఉంది. ఇటీవల జరిపిన అధ్యయనాల్లో ధనియాలు కార్మినేటివ్‌గా అంటే గ్యాస్ నుంచి ఉపశమనం కలిగించేదిగా పనిచేస్తుందని తేలింది. మూత్ర సంబధ సమస్యలతో బాధపడే వారికి ధనియాలు మంచి మందు. లైంగిక శక్తిని ప్రేరేపిస్తుంది. అంతర్గత అవయవాల్లో నొప్పిని నివారిస్తుంది. రక్తంలో గ్లూకోజ్ లెవల్స్‌ని తగ్గిస్తుంది. ధనియాల్లో అనేక పోషకాలు ఉన్నాయి. న్యూట్రీషియన్ చార్ట్ ప్రకారం ఇందులో ఫైబర్ 8శాతం ఉంటే, కాల్షియం 2.9 శాతం ఉండి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. యూరప్‌లో దీన్ని యాంటీ బయాటిక్ ప్లాంట్‌గా పిలుస్తారు. ముఖ్యంగా థైరాయిడ్‌తో బాధపడుతున్నవారు ధనియాలను తీసుకుంటే చాలా వరకు ఉపశమనం ఉంటుంది. డాక్టర్ సలహా మేరకు మందులు వాడుతున్నా ఇది కూడా ప్రయత్నించి చూడండి. ధనియాలను 5,6 స్పూన్లు తీసుకుని గ్లాస్ నీటిలో వేసి రాత్రి పూట నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం ఆ నీటిని వడగట్టి తాగాలి. ఇలా నెలరోజులు పాటు చేస్తుంటే థైరాయిడ్ సమస్య మిమ్మల్ని బాధించదు. దీంతో పాటు మెడకు సంబంధించిన ఎక్సర్‌సైజ్‌లు చేస్తూ కొన్ని యోగాసనాలను చేస్తుంటే థైరాయిడ్ సమస్య చాలా వరకు తగ్గుముఖం పడుతుంది. మెత్తగా చేసిన ధనియాల పౌడర్‌లో చిటికెడు పసుపు కలిపి మొటిమలున్న ప్రదేశంలో అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది. కొలెస్టరాల్‌తో బాధపడేవారు రెండు చెంచాల ధనియాలను తీసుకుని ఒక గ్లాసు నీటిలో కలిపి మరిగించి చల్లార్చి తాగాలి. ఇలా రెండు పూటలా చేస్తుంటే నెల రోజుల్లో ఫలితం కనబడుతుంది. పీరియడ్స్ నొప్పితో బాధపడే మహిళలకు ధనియాలు చక్కని ఔషధం. అధిక రుతుస్రావాన్నీ అరికడుతుంది. ఆరు స్పూన్ల ధనియాలు తీసుకుని అర లీటర్ నీటిలో కలిపి పావు లీటర్ అయ్యేవరకు మరిగించాలి. ఆ తరువాత దించి దానికి కొద్దిగా పటిక బెల్లం కలిపి గోరువెచ్చగా తాగుతుంటే నొప్పి, రక్తస్రావ్య తీవ్రత తగ్గుతుంది. పీరియడ్స్ కూడా రెగ్యులర్‌గా వస్తుంటాయి.

నూనె మానేసిన బేబక్కాయిలందరూ ఇది తప్పక చదవాలి

సర్వరోగ నివారిని పేరుతో ఎప్పుడో 25 ఏళ్ళ క్రితం ఆయిల్ పుల్లింగ్ అని వచ్చింది. పొద్దున్న ఎవరికి ఫోన్ చేసిన మా ఆయన ఆయిల్ పుల్లింగ్ చేస్తున్నాడనే వాళ్ళు. అదీ ఆగిపోయింది.

తరువాత నీళ్ళ రాజు వచ్చాడు. కుండలు కుండలు నీళ్ళు తాగితే రోగాలు మాయం అన్నాడు. అదీ పోయింది.

పశువుల మాదిరి పచ్చి కూర గాయలు తింటే బలమని ప్రచారం చేశాడు. అదీ పోయింది.

ఈ మధ్య ఒక ఆయన చికెన్ తింటె కొవ్వు తగ్గుద్దని ప్రచారం చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఇంకొకాయన వచ్చి రాగులు, సజ్జలు, జొన్నలు, కూరగాయలు అన్నీ కలిపి రసం చేసుకొని తాగండీ అంటున్నాడు. కేంద్ర ప్రభుత్వము వారేమో యోగా చెయ్యండి రొగాలు మటు మాయమంటుంది.

అసలింతకీ ప్రభుత్వాలు ఏమి చేస్తున్నాయి? ఇలాంటి వారిని అదుపు చెయ్యాల్సివ అవసరం ఎంతైనా వుంది. ప్రభుత్వ పోషకాహార సంస్థలు నిద్ర పోతున్నాయా? ప్రజలు వత్తిడి తేవాలి, మార్పు రావాలి.

ఆ మధ్య, అంటే చాన్నాళ్ళ క్రిందట గోదావరి జిల్లాల నుంచి ఒక రాజు గారు వచ్చి, ‘ఉప్పా..! మీరు ఉప్పు తింటున్నారా? అడవిలో జంతువులూ ఉప్పు తినట్లేదు, ఆకాశంలో పక్షులూ ఉప్పు తినట్లేదు. మరి మనుషులెందుకు ఉప్పు తింటున్నారు? ఛీ ఛీ’ అన్నాడు. జనమంతా ఉప్పుని విసిరికొట్టారు.

అంతటితో ఊరుకున్నాడా? ‘నూనా, నెయ్యా – మీరంతా నూనె తాగుతున్నారా? నెయ్యి తింటున్నారా?’ మళ్ళీ సేమ్ డైలాగ్ ‘అడవిలో జంతువులకి నూనె మిల్లులున్నాయా?, అవి డబ్బాలు డబ్బాలు నూనె తాగుతున్నాయా?’ అన్నాడు.

నూనె చుక్క లేకుండా బజ్జీలూ, గారెలూ, పకోడీలు అనబడే పిండి వంటల్ని ఎలా వండుకోవాలో జనాలందరికీ వొలిచి చేతిలో పెట్టి చెప్పాడు కూడా. సరే అని జనమంతా నూనె డబ్బాలకి సెలవిచ్చి చుక్కనూనెతో తాళింపులు మొదలు పెట్టారు…!

జనాలంతా ఒక పక్క ఎండు రొయ్యలై, బుద్ధిగా మాటవినే దశకొచ్చారన్న నమ్మకం కుదిరాక, ఒకానొక మంచిరోజు చూసుకుని కృష్ణానది పక్కన మాంచి స్థలంలో ‘ప్రకృతి ఆహార ఆశ్రమం’ అని ఒకటి మొదలైంది.

అసలే బాగా బలిసిన జనాలుండే కృష్ణాజిల్లా…! ఇంకేఁవుందీ?రోజుకింత, నెలకింతని ప్యాకేజ్ రూపంలో వసూళ్లు చేస్తూ ప్రజలకి ఉప్పూ, నూనె లేని విందులు చేస్తూ, మూడు పచ్చి కూర ముక్కలూ ఆరు ఆకుకూర రసాలతో నిత్యనూతనంగా విలసిల్లుతుంది…!

*సరే ఇది ఇలా ఉండగా, ఇంకొకాయన ఎవరో రాగి చెంబులంట.. రాగి చెంబుల్లో నీళ్ళు నింపి చంద్రుడి ఎదురుగా పెట్టి, తెల్లారి ఆ నీళ్ళు తాగితే అసలు చావే రాదని ఘంటాపథంగా చెప్పాడు. ఇంకేవుంది, కొట్లలో పడి రాగి చెంబుల వేట…! కాస్త గట్టి బుర్రోడు, గురువుగారు చెప్పిన దానికి ఇంకాస్త తోక తగిలించి, అతుకేయని రాగి చెంబు అన్నాడు..! షాపుల్లోకెళ్ళి లిప్ స్టిక్ వేసుకున్న పెదాలతో రాగి చెంబులున్నాయా అని నాజూగ్గా అడగటం మొదలైంది.

*అలా అలా వెన్నెల్లో పెట్టిన రాగి చెంబుల్లో నీళ్ళు తాగుతూ, ఉప్పు, నూనె, పులుపూ, తీపీ లేని రాజు గారి వంటలు తింటూ, రెండు వందలేళ్ళు గ్యారంటీ అనుకుంటున్న దశలో గబుక్కున మళ్ళీ కృష్ణాజిల్లా నుంచే మహారాజశ్రీ మాచినేని ఉద్బవించాడు!

“నూనె మానేసారా? పిచ్చోల్లారా! మిల్లులో ఆడించిన కొబ్బరి నూనె వంద గ్రాములు తాగండి, ఇక చూడండి!’ అన్నాడు. “నేను చెప్పింది తప్ప మీరు ఇంకేవీ తినకూడదు…! నో నో అంటే నో…!” అన్నాడు కూడా. ఇంకేఁవుంది, కొబ్బరి చిప్పలు సంచిలో యేసుకుని గానుగలంట బడ్డారు జనం…! మాచినేని ప్రొడక్ట్స్ మనకందుబాటులోకొచ్చే మంచిరోజు కోసం మనమంతా ఎదురు చూద్దాం…!

*సీమ నుంచో, కర్నాటక నుంచో స్వతంత్ర శాస్త్రవేత్తనంటూ (అనుకుంటూ) ఇంకొక సామొచ్చి, ‘పురుగుమందులు తింటున్నారా? ఇళ్ళల్లో రోగాల పంట పండిస్తున్నారా?‘ అంటూ జనాలను ఆహార జ్ఞాన దారుల్లో పరుగులు పెట్టించడం మొదలు పెట్టాడు. ‘పురుగు మందులు లేని చిరుధాన్యాలు తినండీ! మీ ఆరోగ్యాన్ని మీరే సంరక్షించుకోండి!’ అని ఆషాడ మాసం డిస్కౌంట్ లెక్క ప్రజలకి ఆరోగ్య విజ్ఞానాన్ని చవగ్గా పంచి పెడుతున్నాడు.

‘చిరు’ ధాన్యాలండోయ్, ‘చిరంజీవి’ ధాన్యాలు కాదు ‘చిరు ధాన్యాలు’, ‘సిరి ధాన్యాలు’ అంటూ, ‘పాలు తాగితే హార్మోన్స్ ఇన్ బాలన్స్ అయి చస్తారు, సిరి ధాన్యాలు తినండి – చావకుండా కలకాలం బ్రతకండి’ అంటున్నాడు. ఇంకేఁవుంది, తెల్లటి మొలకొలుకల అన్నం, కర్నూలు సోనా బియ్యపు అన్నం తినే బేబక్కాయిలంతా “సామలున్నాయా? అరికలున్నాయా? సొజ్జలున్నాయా?” అని షాపులాల్లని పరుగులు దీయిస్తున్నారు.

*వీళ్ళంతా ఇలా ఉన్నారు నేనేం తక్కువా అంటూ, ”మట్టి కుండల్లో వండుకుని తినడం మంచి ఆరోగ్యం” అని మూలనున్న మరో మట్టి శాస్త్రవేత్త గారు, పురావస్తు గృహంలో నిద్ర లేచి మట్టి కుండ యాష్ ట్యాగ్ అన్నాడు.

*విచిత్రం ఏంటంటే, వీళ్ళెవరూ డాక్టర్లు కాదు. ఆరోగ్య శాస్త్రం చదువుకున్న వైద్యులని మాత్రం ధాటీగా విమర్శిస్తారు.

ఆ ఉపన్యాసాలు చెప్పే వాళ్ళు కానీ, ఈ వినే జనాలు కానీ మిద్దె మీద మొక్కలు పెట్టుకుందాం అనుకుంటారే కానీ, ‘పురుగు మందులని బ్యాన్ చేయమ’ని ప్రభుత్వాలను అడగరు.

ఆరోగ్యానికి హానికదా ‘లిక్కర్ బ్యాన్ చెయ్యండీ’ అని అస్సలు అడగరు.

ధూమపానం చెరుపు చేస్తుంది కదా, ‘సిగరెట్లు బ్యాన్ చెయ్యండీ’ అని కూడా అడగరు.

చెయ్యాల్సింది చేయకుండా ఎంతకాలమని వాళ్ళు చెప్పారనీ, వీళ్ళు చెప్పారనీ ఆరోగ్యం కోసం చెంబులేసుకుని, సంచులేసుకుని పరుగెడతారు?

ఇకనయినా పరుగులాపి ప్రంశాతంగా జీవించండి.
మన పూర్వీకులు అన్నీ తిని చక్కగా పని చేసుకున్నారు.
మనం పని మాని ఇలాంటి వాటి వెనుక గంతులేస్తున్నాము!

నిజం గ్రహించరా నరుడా…!