American Telugu Association (ATA) celebrated International Women’s Day in Chicago on a grandeur scale at Play’N’Thrive Schaumburg with much fervor and gusto. This year Women’s day theme, #BetterforBalance, focused primarily on a call to action for gender balance. The event started with Ganesh Stotram followed by the Chief Guest, Indian Consular Officer Mrs. Rajeshwari Chadrasekharan, lighting the ceremonial lamp along with ATA Women’s Day organizers. A welcome address was given by ATA Board of Trustee Dr. Meher Medavaram focusing on gender equality and equal opportunities for women in leadership at all levels of decision making in political, business and economic arenas. Mrs. Chandrasekharan eloquently spoke to attendees about how Indian women have excelled in the US, their challenges in modern day society, women’s issues and women empowerment. Immigration Attorney Adaikala Mary Kennedy also gave insight about her services and how to strike a balance between work and life. Raffle Ticket Prize winners were awarded Gold Coins sponsored by Sri Krishna Jewelers. The fashion show was the highlight of the event with ladies from various age groups actively participating. Scores of women dressed in ethnic attire thoroughly enjoyed the festivities and had a great time visiting several vendor booths. A sumptuous lunch was served to attendees. Singers Madhuri, Sailaja and Shirley enthralled everyone with Bollywood and Tollywood songs. Gift cards were awarded to various game prize winners, and the program ended with plenty of dancing to the DJ’s music. ATA Board of Trustees Dr. Meher Medavaram and Sainath Reddy Boyapalli oversaw the day’s proceedings. Decoration and arrangements were taken care of by Ramana Abbaraju, Amar Nettem, Suchitra Reddy, Laxmi Boyapalli, Chalma Bandaru, Venkat Thudi, Mahipal Vancha, Hari Raini, Jagan Bukkaraju, Narsimha Chittaluri, Bheemi Reddy, Satish Yellamilli and Bhanu Swargam. ATA founder member & Past President Hanumanth Reddy garu motivated everyone with his presence and applauded the Sponsors, Volunteers and Local organizations for their continued, unwavering support.
Category: ఫోటో గ్యాలరీ
డల్లాస్‌లో ఉల్లాసంగా నాట్స్ వాలీబాల్ పోటీలు
అమెరికా తెలుగు సంబరాల్లో భాగంగా నిర్వహించిన నాట్స్ వాలీబాల్ టోర్నమెంట్ కు చక్కటి స్పందన లభించింది. ప్రతి రెండేళ్లకు ఒక్కసారి అమెరికాలో అంగరంగ వైభవంగా జరిపే నాట్స్ తెలుగు సంబరాలకు టాంటెక్స్ సిద్ధమవుతోంది. దీని కోసం తెలుగువారందరిని ఒక్కటి చేసే క్రమంలో ముందస్తుగా అనేక ఈవెంట్స్, ఆటల పోటీలను నాట్స్ నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది.. ఈ పరంపరను కొనసాగిస్తూ టాంటెక్స్ తో కలిసి నాట్స్ టెక్సాస్ లో వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించింది. 26 టీమ్ లు,,250 మంది ఆటగాళ్లతో ఈ టోర్నమెంట్ ఎంతో ఉత్సాహభరితంగా సాగింది. ఆస్టిన్, హ్యూస్టన్ నుంచి కూడా ఈ టోర్నమెంట్ కు విచ్చేశారు. నాట్స్ ప్రొఫెషనల్ కప్, నాట్స్ వాలంటీర్ కప్, నాట్స్ ఫన్ కప్, అనే మూడు రకాలు కప్స్ తో ఈ టోర్నమెంట్ ప్లాన్ చేసింది. నాట్స్ ప్రొఫెషనల్ కప్ కోసం హోరా హోరీగా సాగిన ఈ టోర్నమెంట్ లో థండర్స్ టీం విజేతగా నిలిచింది. రన్నరప్ గా రేంజర్స్ టీం నిలిచింది. నాట్స్ వాలంటీర్స్ ను కప్ ను స్పైకర్స్ 1 సొంతం చేసుకుంది. వీవీఎస్ 1 టీం రన్నరప్ గా నిలిచింది. నాట్స్ ఫన్ కప్ ను స్పైకర్స్2 టీం కైవసం చేసుకుంది. రన్నరప్ గా రెడ్ బుల్స్ టీం నిలిచింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఎంతో ఉత్సాహంగా వాలీబాల్ ప్లేయర్స్ ఈ టోర్నమెంట్ పాల్గొనడంపై నాట్స్ హర్షం వ్యక్తం చేసింది. నాట్స్ సంబరాల స్పోర్ట్స్ డైరక్టర్ ఎన్.ఎమ్.ఎస్ రెడ్డి, నాట్స్ స్పోర్ట్స్ ఛైర్ శ్రీనివాస్ కాసర్ల ఈ టోర్నమెంటు విజయవంతానికి ఎంతో కృషి చేశారు. నాట్స్ చాలా సంవత్సరాల నుంచి టోర్నమెంట్ నిర్వహిస్తూ వస్తుంది. అయితే ఇప్పుడు నిర్వహించిన టోర్నమెంట్ కు విశేష స్పందన వచ్చింది. ఎంతో క్రీడోత్సాహంతో వాలీబాల్ టోర్నమెంట్ పాల్గొన్నవారందరికి నాట్స్ ప్రత్యేక అభినందనలు తెలిపింది. నాట్స్ వైస్ ప్రెసిడెంట్ బాపునూతి, నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరక్టర్ ,కాన్ఫరెన్స్ సెక్రటరీ రాజేంద్ర మాదల,టాంటెక్స్ ప్రెసిడెంట్ చినసత్యం వెర్నపు నాట్స్ స్పోర్ట్స్ టీం పై ప్రశంసల వర్షం కురిపించారు. నాట్స్ సంబరాల కాన్పరెన్స్ ఛైర్మన్ కిషోర్ కంచర్ల ఈ టోర్నమెంట్ కు హజరయ్యారు. విన్నర్స్, రన్నర్స్ ను ప్రత్యేకంగా అభినందించారు. మే 24 నుంచి 26 వరకు డాలస్ లో జరిగే అమెరికా తెలుగు సంబరాలకు రావాలని వారిని ఆహ్వనించారు. విజయ్ శేఖర్ అన్నే,కిషోర్ వీరగంధం, సంబరాల జాయింట్ సెక్రటరీ మహేశ్ ఆదిబొట్ల, నాట్స్ టీమ్ మెంబర్స్ రాజేంద్ర గొండి, హర్ష పిండి, వెంకట్ దండ, మురళీ పల్లబత్తుల, రఘు గుత్తికొండ, అభిరామ్ సన్నపురెడ్డి, వంశీ నాగళ్ల, పవన్ నెలుట్ల, సుబ్బు జొన్నలగొడ్డ, సురేష్ మండువ, మహేశ్ చొప్ప, రమేష్ రెడ్డి, మధు మల్లు, టాంటెక్స్ ప్రెసిడెంట్ చిన్న సత్యం వీరనపు, స్పోర్ట్స్ ఛైర్ వెంకట్ బొమ్మ తదితరుల మద్దతు ఈ టోర్నమెంట్ ను నాట్స్ దిగ్విజయంగా నిర్వహించింది.
ఢిల్లీలో ముగిసిన ధర్మపోరాట దీక్ష-చిత్రాలు
“టాకో” ఆధ్వర్యంలో గణతంత్ర వేడుకలు
Telugu Association Of Central Ohio (TACO), a non-profit organization, organized Sankranthi Sambaralu and Republic day celebrations on January 26th 2019 at the Westerville North High School in Westerville Ohio. The event started at 1:00 PM local time and completed at 9:15 PM local time with approximately 300 participants who performed a variety of programs such as Classical dances, Mass Movie dances, Comedy skits, Dubsmash Contest, Republic day dance, Movie song Singing, Fashion show, Art gallery etc..
Ohio State House representative Mr. Niraj Antani attended the event as a chief guest and participated in the Republic day celebrations.
TACO 2019 Executive Committee President Phani Bhushan Potluri thanked all the volunteers, sponsors and participants for their hard work and support towards the organization and making the event a grand success. TACO 2019 cultural team lead by Veena Kamisetty worked very hard to design a variety of quality and entertaining programs with a lot of local talented participants and made sure the programs were started and completed on time. Sankranthi festival theme song presented by the TACO cultural team showed the values of “Ummadi Kutumbam” (Joint Family) and the prominence of the Sankranthi festival.
Butterfly Event Planners lead by Sandhya Kanaka, decorated the entire venue with traditional and contemporary decoration styles and was one of the many highlights of the event.
Food committee lead by Shyam Gadde worked with Haveli Bistro, a local restaurant, and served delicious food to the guests with a wide variety of authentic south Indian food items. Over 200 volunteers and committee members helped throughout the day and were part of this successful event.
tACO charity coordinators SriVarshini Mudhuluru and Subhashini Sadanala organized multiple charity drives at the event. A food drive in collaboration with North America Telugu Society (NATS) benefiting the Mid Ohio Food Bank, A Winter Coat drive benefiting Homeless shelter Needs Faith Mission. TACO also worked with a group of local volunteers who setup a food stall at the event benefiting Ekam Foundation.
President of the Organization Phani Bhushan Potluri and Vice President of Administration Srinivas Paruchuri introduced 2020 President Elect Jagannath Chalasani to the community. 2019 Executive committee recognized the 2018 Executive committee, 2018 outgoing trustees & working committees for their hard work and dedication towards the organization and also introduced the new trustees (2019 & 2020) and working committees (2019, 2020 & 2021).
2019 Executive committee:
President of the Executive Committee: Phani Bhushan Potluri
Admin Team: Jagannath Chalasani (President Elect), Srinivas Paruchuri (Vice President Administration), Swamy Kavali (Treasurer), Harsha Kamineni (Pubic Relations), Harika Kommuri (Executive Secretary), Sudhir Kanagala (Joint Secretary)
Cultural Team: Veena Kamisetty (Vice President Cultural), Saritha Nandimalla (Cultural Coordinator), Swetha Priyanka Addaganti (Cultural Coordinator), Rachana Bukka (Cultural Coordinator), Vijay Mallela (Cultural Coordinator), Siddartha Revur (Cultural Event Coordinator), Pradeep Kumar Chandanam (Cultural Event Coordinator), Supriya Thota (Cultural Event Coordinator), Sandhya Kanaka (Cultural Event Coordinator)
Communications Team: Vijay Kakarla (Vice President Communications), Venu Abburi (Web Coordinator)
Food Team: Shyam Gadde (Vice President Events), Raj Vantipalli (Food Coordinator), Pratap Kanteti (Food Coordinator)
Sports Team: Siva Chava (Vice President Sports), Pradeep Guntaka (Sports Coordinator)
Charity Event Coordinators: SriVarshini Mudhuluru, Subhashini Sadanala
uth Coordinators: Rithvik Potluri, Thulasi Vuligadla, Sahith Buddala, Ashika Kamisetty, Anvita Dandu, Sraavya Potluri
2019 Board Of Trustees
Srilatha Revur (Chairperson), Koteshwara Bodipudi, Prasad Kandru, Ramesh Kolli, Srikanth Munagala
లండన్ తెలుగు సంఘం వాలీబాల్ పోటీల విజేతలు వీరే
వైభవంగా తాల్ సంక్రాంతి వేడుకలు
ప్లేనోలో ఘనంగా NTR వర్థంతి
ఆకలిగొన్న బాధితుడికి పట్టెడన్నం, బడుగు బలహీనుల అభ్యున్నతి, ఏ దిశకేగినా తలవంచని తెలుగువారి ఆత్మగౌరవాలే “అన్న” నందమూరి తారకరామారావు అజరామర ఆశయాలుగా వెలుగొందుతున్నాయని డాలస్ ప్రవాసులు కొనియాడారు. శుక్రవారం నాడు ప్లేనోలోని “హైదరాబాద్ హౌస్” సమావేశ మందిరంలో NRI TDP Dallas ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్‌టీఆర్ 23వ వర్ధంతి కార్యక్రమంలో ప్రవాసులు పెద్దసంఖ్యలో పాల్గొని నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ తెలుగుతోటలో వెలుగుపూలు పూయించిన ఆ కర్షక కుమారుడి యశస్సు ముంజేతికంకణంగా భాసిల్లుతోందని పేర్కొన్నారు. రాజకీయ పరమపదసోపానపటములో అధికార కైవసమనే నిచ్చెనను అతిస్వల్ప సమయంలో అధిరోహించి సరికొత్త చరిత్రకు తెరచాపలెత్తిన ఎన్‌టీఆర్ నిరంతర విద్యార్థిగా సదా స్మరణీయుడిగా చిరంతన సోదహరణీయుడిగా మిగిలిపోయారన్నారు. క్రమశిక్షణతో సినీరంగాన్ని, సంక్షేమంతో రాజకీయ రంగాన్ని ఆవాహన చేసుకున్న ఎన్‌టీఆర్ నేటితరం యువతకు ఎన్నో విలువైన పాఠాలు నేర్పారని వక్తలు ప్రశంసించారు. సంచలనాత్మక పథకాలకు సంకోచం లేకుండా పచ్చజెండా ఊపిన ఎన్‌టీఆర్ దేశవ్యాప్తంగా ఎన్నో రాష్ట్ర ప్రభుత్వాలకు ద్వితీయ రాజ్యంగాన్ని అనధికారికంగా అందించారని కొనియాడారు. ఈ కార్యక్రమం విజయవంతానికి తెదేపా అభిమానులు, కార్యకర్తలు, ప్రవాసులు తదితరులు సహకరించారు.
అట్లాంటాలో తామా సంక్రాంతి వేడుకలు
జనవరి 12 న అట్లాంటా తెలుగు సంఘం ‘తామా’ సంక్రాంతి సంబరాలు కోలాహలంగా జరిగాయి. స్థానిక నార్క్రాస్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఈ సంబరాలను శూరా ఈబి 5 ఫండ్, మై టాక్స్ ఫైలర్ మరియు సంక్రాంతి రెస్టారెంట్ వారు సమర్పించగా, సుమారు 1200 మందికి పైగా హాజరై అట్లాంటా చరిత్రలో కనీ వినీ ఎరుగని రీతిలో విజయవంతం చేసారు. ముందుగా పిల్లలకు ప్రత్యేకంగా నిర్వహించిన గ్లోబల్ ఆర్ట్ కళ మరియు ది యంగ్ లీడర్స్ అకాడమీ ఉపన్యాసం పోటీలలో సుమారు 250 మంది పిల్లలు పాల్గొని తమ ప్రావీణ్యాన్ని ప్రదర్శించారు. ముగ్గుల పోటీలు మరియు మెహందీ లో మహిళలు విరివిగా పాల్గొన్నారు. తదనంతరం సాంస్కృతిక కార్యదర్శి సుబ్బారావు మద్దాళి స్వాగతోపన్యాసం చేయగా, తామా కార్యవర్గం మరియు బోర్డు సభ్యులు జ్యోతి ప్రజ్వలనతో సాంస్కృతిక కార్యక్రమాలను ప్రారంభించారు. ఇందులో భాగంగా ప్రదర్శించిన జానపద గీతాలు, శాస్త్రీయ సంగీతం, సినీ పాటలు, నృత్యాలు, శ్లోకాలు అందరిని ఆకట్టుకున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్న అందరికీ ప్రశంసా పత్రాలు అందజేసారు. అధ్యక్షులు వెంకీ గద్దె ప్రసంగిస్తూ తామా నిర్వహించే ఉచిత క్లినిక్, స్కాలర్షిప్స్, మనబడి, స్పోర్ట్స్, సాహిత్యం, తదితర విద్య, వైద్యం మరియు వినోద కార్యక్రమాలను వివరించారు. తామా కార్యవర్గం మరియు చైర్మన్ వినయ్ మద్దినేని సారధ్యంలో బోర్డు సభ్యుల చేతులమీదుగా స్పాన్సర్స్ శ్రీనివాస్ నిమ్మగడ్డ, హరిప్రసాద్ సాలియాన్, జాన్స్ క్రీక్ డిస్ట్రిక్ట్ 50 హౌస్ రిప్రజంటేటివ్ ఏంజెలికా కౌషె, హిందూ టెంపుల్ ప్రెసిడెంట్ షీలా లింగం, అట్లాంటా ఐటీ సర్వ్ ప్రెసిడెంట్ క్రిస్ గద్దె, స్కాలర్షిప్స్ సమన్వయకర్త సీత వల్లూరుపల్లి, మనబడి సమన్వయకర్త విజయ్ రావిళ్ల మరియు ఉపాధ్యాయని ఉపాధ్యాయులను సగౌరవంగా సత్కరించారు. మధ్య మధ్యలో గోదావరి రెస్టారెంట్, విజయ కలెక్షన్స్, నేటివ్ ట్రెండ్స్, ఏబీసీ పార్టీ హాల్ మరియు కేబీ జవేరీ వారు సమర్పించిన గ్రాండ్ రాఫుల్ విజేతలకు బహుమతులు అందజేశారు. గాయని శిల్ప మరియు గాయకులు ప్రసాద్ సింహాద్రి తమ పాటలతో ప్రేక్షకులను మైమరపించారు. వారి పాటలకు పిల్లలు, యువతీయువకులు వేదిక మీదకు వెళ్లి మరీ డాన్స్ చెయ్యడం విశేషం. గాయని శిల్ప నిర్వహించిన సంప్రదాయ దుస్తుల పోటీలలో మహిళలు, పిల్లలు పాల్గొనగా విజేతలకు బహుమతులు అందజేశారు. నగరంలోని ప్రముఖ వ్యాపారస్తులు ఏర్పాటు చేసిన స్టాల్స్ లో ప్రత్యేక ఆహార పదార్దాలు, ఆభరణాలు, వస్త్రాలు మొదలగునవి విశేషంగా ఆకట్టుకున్నాయి. పిల్లలు ఎక్కువగా ఫేస్ పెయింటింగ్ స్టాల్ దగ్గర తిరుగుతూ కనిపించారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన వాలంటీర్స్ శ్రీనివాస్ లావు, అంజయ్య చౌదరి లావు, అనిల్ యలమంచిలి, ఉపేంద్ర నర్రా, వెంకట్ అడుసుమిల్లి, విజయ్ రావిళ్ల, శ్రీని బలుసు, వెంకట్ గోగినేని, విజయ్ కొత్తపల్లి, మురళి బొడ్డు, విజయ్ బాబు కొత్త, యశ్వంత్ జొన్నలగడ్డ, రమణ, చైతన్య, అరుణ మద్దాళి, సునీత పొట్నూరు, అబ్దు, రీమ, సాన్వి, అక్షు, వేదికను అందంగా అలంకరించిన మేరీగోల్డ్ ఈవెంట్స్ సుజాత పొన్నాడ, ఆడియో లైటింగ్ ఫోటోగ్రఫీ అందించిన బైట్ గ్రాఫ్ ప్రశాంత్ కొల్లిపర, రుచికరమైన భోజనాలందించిన సంక్రాంతి రెస్టారంట్ శ్రీనివాస్ నిమ్మగడ్డ, సమర్పకులు శూరా ఈబి 5 ఫండ్ ప్రసాద్ గద్దె, మై టాక్స్ ఫైలర్ హరిప్రసాద్ సాలియాన్, నార్క్రాస్ ఉన్నత పాఠశాల యాజమాన్యం, వ్యాఖ్యాత శ్రీధర్, ది యంగ్ లీడర్స్ అకాడమీ కమల వడ్లమూడి, గ్లోబల్ ఆర్ట్ సుధ గోపాలకృష్ణన్, తామా కార్యవర్గ మరియు బోర్డు సభ్యులకు వెంకీ గద్దె ధన్యవాదాలు తెలియజేసి విజయవంతంగా ముగించారు.
తానా చరిత్రలో ఓ మధుర ఘట్టం కప్పట్రాళ్ళ
అమెరికాలోని ప్రముఖ తెలుగు సంస్థ తానా ఆద్వర్యంలో గత నలభై సంవత్సరాల నుండి మిలియన్ల డాలర్ల వెచ్చించి పలు సామాజిక సేవా కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ సేవా కార్యక్రమాలు అన్ని తాత్కాలికమైనవే. ఈ ఖర్చు తాలూకు ఆనవాళ్ళు ఎక్కడా కనిపించవు. ఇటీవలే తానా నిధులతో ఒక శాశ్వత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కర్నూలు జిల్లాలో ‘కప్పట్రాళ్ళ’ ప్యాక్షన్ గొడవలకు ఒకప్పుడు పెట్టింది పేరు. ప్రతినిత్యం గ్రామంలోని ఇరువర్గాల మధ్య కక్షలు పరి విప్పి గొడవలు, ఘర్షణలు జరుగుతూ ఉండేవి. గ్రామానికి చెందిన ప్రముఖ ప్యాక్షన్ లీడర్ కప్పట్రాళ్ళ వెంకటప్పనాయుడు ఆయన సమీప బంధువుల మధ్య తరచూ ఘర్షణలు చెలరేగి హత్యలు జరిగేవి. వీరితో రెండు కుటుంబాలు చాలా వరకు చిన్నాభిన్నమయ్యాయి. ఇదంతా ఒకప్పటి మాట. కర్నూలు జిల్లాకు ఎస్పీగా వచ్చిన ఆకే రవికృష్ణ కప్పట్రాళ్ళ గ్రామాన్ని దత్తత తీసుకుని ఆ గ్రామంలో ముందుగా ఘర్షణలు లేకుండా ఇరువర్గాల మధ్య సఖ్యత చేకూర్చారు. అభివృద్ధి కార్యక్రమాల పై దృష్టి పెట్టారు.
**’తానా’ తోడూ… నీడగా ..
కర్నూలుకు చెందిన ‘తానా’ కోశాధికారి పొట్లూరి రవి చూపు కప్పట్రాళ్ళ గ్రామం పై నిలచింది. తానా సహకారంతో ఆ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. ఆ గ్రామంలో ఉన్న ఉన్నత పాటశాలలను అభివృద్ధి చేయటంలో పొట్లూరి రవి కీలక పాత్ర పోషించారు. అనంతరం విద్యార్ధులతో పాటు మహిళలకు కూడా ఉపాధి చూపించాలని భావించారు. గ్రామంలో విశాలమైన స్థలంలో ప్రధాన రహదారి పక్కనే మహిళల కోసం 45 లక్షల వ్యయంతో స్త్రీ శక్తి భవనాన్ని నిర్మించారు. ఈ భవనంలో కప్పట్రాళ్ళ గ్రామంలో ఉన్న మహిళలకు ఉపాధి అవకాశాల కోసం శిక్షణ ఇస్తారు.
**అట్టహాసంగా ప్రారంభోత్సవం
తానా చైతన్య స్రవంతిలో భాగంగా ఆఖరి కార్యక్రమంలో, కప్పట్రాళ్ళ గ్రామంలో ఈ భవనం ప్రారంభోత్సవం ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి చేతుల మీదుగా జరిపించారు. అనంతరం నిర్వహించిన సంక్రాంతి సంబరాలకు ఆ గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తానా ఆద్వర్యంలో కప్పట్రాళ్ళ గ్రామంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆ గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. కర్నూలు ఎస్పీగా పని చేసి కప్పట్రాళ్ళ గ్రామ అభివృద్ధి పై దృష్టి పెట్టిన ఆకే రవికృష్ణ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా కుటుంబంతో సహా తరలివచ్చారు. తానా అద్యక్షుడు వేమన సతీష్ తదితర బృందాన్ని ఆయన మనస్పూర్తిగా అభినందించారు. సినిమా గాయని సునీత ఈ కార్యక్రమానికి ప్రధాన ఆకర్షణగా నిలిచారు. తానా ప్రతినిధులు పొట్లూరి రవి, దేవినేని లక్ష్మి, కొడాలి నరేన్ , బత్తిన రాకేశ్ సోదరులు, TNI డైరెక్టర్ కిలారు ముద్దుకృష్ణ, తానా స్థానిక కోఆర్డినేటర్లు పుట్టా రాజశేఖర్, గారపాటి ప్రసాద్, స్థానిక ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మిమిక్రీ రమేష్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. అనంతరం తానా బృందానికి పార్లమెంట్ సభ్యులు, ప్రముఖ పారిశ్రామిక వేత్త, టీ.జీ.వెంకటేష్ విందు ఇచ్చారు.
**తానా తోలి భవనం ఇదే.
తానా చరిత్రలో స్వంతంగా, భారీగా నిధులు ఖర్చు చేసి కప్పట్రాళ్ళలో నిర్మించిన శాశ్వత భవనం ఇదే. ఈ భవనాన్ని నిర్మించడానికి కప్పట్రాళ్ళ గ్రామ అభివృద్దికి నడుం బిగించిన తానా కోశాధికారి పొట్లూరి రవి అభినందనీయుడు. ఇక నుండి తానా ఆద్వర్యంలో చేపట్టే కార్యక్రమం ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచేదిగా ఉండాలని ఈ భవన నిర్మాణం నిరూపిస్తుంది. ఈ దిశగా తానా కార్యవర్గం అడుగులు వేయాలి. కప్పట్రాళ్ళ గ్రామంలో జరిగిన అభివృద్దిని ప్రతి తానా సభ్యుడు స్వస్థలానికి వచ్చినప్పుడు ఆ గ్రామానికి వెళ్లి తిలకిస్తే మంచి అనుభూతి కలుగుతుంది అనటంలో సందేహం లేదు. తానా సీనియర్ నాయకురాలు దేవినేని లక్ష్మి మాట్లాడుతూ ఇక నుండి తాను ఇండియా వచ్చినప్పుడల్లా కప్పట్రాళ్ళ వస్తానని, ఈగ్రామ అభివృద్దికి తనతో పాటు తానా సభ్యులను భాగస్వామ్యం చేస్తానని ప్రకటించడం గమనార్హం.
“రాం” దర్శకత్వంలో ఆడి పాడిన “వేమన”
అమెరికాలోనే కాదు.. ఆంధ్రాలో కూడా రాంచౌదరి… వేమన సతీష్ ను నడిపిస్తూ ఉంటాడని అందరూ అనుకుంటూ ఉంటారు. రాముడికి హనుమంతుడి లాగా వేమన సతీష్ కు వెన్నంటే ఉంటాడు. వీరిద్దరిని విడదీయరాని బంధం. రాంచౌదరి స్వస్థలం పుల్లడిగుంటలో వీరి అనుబంధం మరోసారి రుజువైంది. రాం చౌదరి వర్జీనియాలో ఉండి వేమన సతీష్ చేత పుల్లడిగుంటలో చిందులు వేయించాడు. రైతుగా మార్చి సతీష్ చేత అరక పట్టించాడు. తలగుడ్డ చుట్టించి ఎడ్లబండి పై ఉరేగించాడు. ఇది స్నేహం అంటే! తానా చైతన్య స్రవంతిలో భాగంగా గురువారం నాడు రాంచౌదరి స్వగ్రామం పుల్లడిగుంటలో సందడి ఏర్పడింది. రైతుకోసం కార్యక్రమంలో భాగంగా రైతులకు కిట్లను పంపిణీ చేశారు. ఆగ్రామంలో ఉన్న పేదప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసారు. రాంచౌదరి తల్లి, జడ్పీటీసీ సభ్యురాలు సీతామహాలక్ష్మి ఏర్పాటు చేసిన కోలాటంలో వేమన సతీష్ చురుగ్గా పాల్గొని కోలాటం ఆడారు. మహిళా కమీషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి కూడా కోలాటంలో సతీష్ తో కలిసి ఆడిపాడారు. అనంతరం అదే గ్రామంలో ఉన్న ప్రముఖ రైతు బాంధవుడు, ప్రకృతి వ్యవసాయదారుడు వై. వెంకటేశ్వరరావురైతు శిక్షణ కేంద్రానికి వెళ్లిన తానా బృందం అక్కడి ప్రకృతి వ్యవసాయ పద్దతులను తిలకించారు.ప్రకృతి వ్యవసాయానికి తానా తరపున సహకారాన్ని అందిస్తామని వేమన సతీష్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తానా నేతలు పొట్లూరి రవి, సూరపనేని రాజా, నరేష్ కొడాలి, భాను తదితరులు పాల్గొన్నారు. మొత్తం మీద పుల్లడిగుంటలో తానా చైతన్య స్రవంతి ఆహ్లాదకరమైన వాతావరణంలో సందడిగా జరిగింది.
వీరవల్లిలో ఘనంగా ‘తానా చైతన్య స్రవంతి’
తానా ఆద్వర్యంలో చేపడుతున్న సామజిక సేవా కార్యక్రమాలు ప్రయోజనకరంగా ఉన్నాయని జడ్పీ చైర్ పర్సన్ గద్దె అనురాధ , ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ పేర్కొన్నారు. రైతు కోసం, మహిళా కోసం, చదువు కోసం, ఆరోగ్యం కోసం కార్యక్రమంలో భాగంగా మంగళవారం వీరవల్లిలో తానా ఆద్వర్యంలో రైతులకు రక్షణ కిట్లు, మహిళలలకు కుట్టు యంత్రాలు పంపిణీ చేశారు. గ్రామానికి చెందిన ప్రవాస భారతీయుడు కసుకుర్తి రాజా చొరవతో ఈ కార్యక్రమం నిర్వహించారు. వంశీ, అనురాధా ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. తానా అద్యక్షుడు వేమన సతీష్ అద్యక్షతన జడ్పీ ఉన్నత పాటశాల ఆవరణలో జరిగిన ఈ కర్యక్రమమ్లొఅ వంద మంది రైతులకు పొలాల్లో రసాయనాలు పిచికారి చేసే సమయంలో రక్షణగా ఉపయోగపడే వస్తువులు, ముప్పై మంది మహిళలకు కుట్టు యంత్రాలు అందజేశారు. సతీష్ మాట్లాడుతూ తానా ఆద్వర్యంలో ఇప్పటి వరకు దాదాపు రూ.1500 కోట్లతో సేవా కార్యక్రమాలు నిర్వహించామన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు ముప్పై వేలు రైతు రక్షణ కిట్లు పంపిణీ చేశామన్నారు. అంతకుముందు తానా ప్రతినిధులు ఎడ్లబండి పై సహకార సంఘం అద్యక్షుడు లంక సురేంద్ర నివాసం నుంచి ఊరేగింపుగా వచ్చారు. జడ్పీ పాటశాలలో ప్రవాస భారతీయురాలు నవీన సహకారంతో ఏర్పాటు చేసిన డిజిటల్ తరగతి గదిని ప్రారంభించారు. ఎంపీపీ తుమ్మల కోమలి, తానా ప్రధాన కార్యదర్శి లావు అంజయ్య చౌదరి , సభ్యులు పొట్లూరి రవి, కోట జానయ్య, జలవనరుల శాఖ అపెక్స్ కమిటీ సభ్యుడు ఆళ్ళ గోపాలకృష్ణ, న్యాయవాది దాత లింగమనేని రాజారావు, కలాపాల శ్రీధర్, గుండపనేని ఉమాప్రసాద్, పిల్లా రామారావు, అమృతవల్లి సూర్యనారాయణ, లింగమనేని చిన్ని తదితరులు పాల్గొన్నారు.వీరవల్లిలో ఘనంగా ‘తానా చైతన్య స్రవంతి’
అంజయ్యచౌదరి తానా ‘షో’ అదిరింది
ప్రపంచంలోనే పెద్ద తెలుగు సంఘంగా రూపుదిద్దుకున్న తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా(తానా) లో ఎన్నికల సందడి కొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ప్రస్తుతం తానా నేతలంతా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చైతన్య స్రవంతి పేరుతొ పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తానాలో ప్రధానమైన పదవులు నిర్వహిస్తున్న నేతలు చైతన్య స్రవంతి ద్వారా వారి స్వస్థలాల్లో తమ సత్తాను చాటుకుంటున్నారు. తానా అద్యక్షుడు వేమన సతీష్ రాజంపేటలో గత 5వ తేదీన తానా చైతన్య స్రవంతి పేరుతొ నిర్వహిచిన సభ ఒక మహానాడును తలపింపజేసింది. ఒకరకంగా తాను పుట్టిన రాజంపేట గడ్డపై తన సత్తా ఏమిటో సతీష్ చూపించాడు. తానా ద్వారా చేపట్టిన సేవా కార్యక్రమాల కన్నా రాజంపేట సదస్సులో ఏర్పాటు చేసిన ఆడంబరాలకు లక్షలాది రూపాయలు ఖర్చు చేశారు. రాజంపేట రాజకీయాల్లో వేమన సతీష్ ఇక నుండి చురుకైన పాత్ర పోషించడం కోసమే ఈ సదస్సు ద్వారా బల ప్రదర్శన చేశారని అందరూ భావిస్తున్నారు. తానా అద్యక్షుడిగా మరికొద్ది నెలల్లో బాద్యతలు చేపట్టబోతున్న తాళ్ళూరి జయశేఖర్ తన స్వంత జిల్లా ఖమ్మంతో పాటు కొత్తగూడెం, భద్రాచలంలోనూ భారీ ఎత్తున తానా చైతన్య స్రవంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. కొత్తగూడెంలో పెద్ద ఎత్తున 5కే రన్ నిర్వహించి రికార్డు నెలకొల్పారు. ఆ ప్రాంతాల్లో తనకున్న పలుకుబడిని తమ కుటుంబానికి ఉన్న ఆదరణను జయశేఖర్ నిరూపించారు. వచ్చే తానా ఎన్నికల్లో లావు అంజయ్య చౌదరి తానా అద్యక్ష పదవికి పోటీ పడుతున్నారు. కాలం కలసి వస్తే తానా అద్యక్ష పదవికి ఏకగ్రీవంగా ఎన్నిక కావాలని అంజయ్య పావులు కదుపుతున్నారు. దీని కోసం విజయవాడలో నిర్వహించిన తానా చైతన్య స్రవంతిని దిగ్విజయం చేసి తన స్వంత జిల్లాలో తనకున్న సత్తాను అంజయ్య చౌదరి చాటుకున్నారు. చాలా మంది ప్రజాప్రతినిధులను, పుర ప్రముఖులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించి ఈ సభను జయప్రదం చేశారు. తానా కార్యదర్శిగా అనంతరం అద్యక్షుడిగా ఎన్నిక కావడం కోసం ప్రస్తుతం ఆ సంస్థ కోశాధికారిగా ఉన్న పొట్లూరి రవి బల ప్రదర్శనకు సిద్దమవుతున్నారు. వచ్చే 12వ తేదీన పొట్లూరి రవి ‘కప్పట్రాల’ గ్రామంలో ఏర్పాటు చేసే బలప్రదర్శన ఎలా ఉంటుందో వేచి చూద్దాం.
సిలికానాంద్ర సంజీవని ఆస్పత్రిలో సేవలు ప్రారంభించిన స్పీకర్
నృత్యం పేరుతొ ప్రపంచ వ్యాప్తమైన సిలికానాంద్ర సంజీవని వైద్యశాల ప్రజలకు ఉపయోగపడుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభపతి డా.కోడెల శివప్రసాదరావు పేర్కొన్నారు. మొవ్వ మండలం కూచిపూడిలోని రవిప్రకాష్ సిలికానాంద్ర సంజీవని వైద్యాలయంలో ఏర్పాటు చేసిన ఉచిత మహా వైద్య శిభిరాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రూ.42 లక్షలతో ఏర్పాటు చేసిన అధునాతన ఎక్స్ రే ల్యాబ్ ను సభాపతి ప్రారంభించారు. సిలికానాంద్ర వ్యవస్థాపక అద్యక్షుడు కూచిభొట్ల ఆనంద్ అద్యక్షతన జరిగిన కార్యక్రమంలో డా.కోడెల మాట్లాడుతూ ఆసుపత్రి అభివృద్ధి కోసం ప్రభుత్వ పరంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రకటించిన రూ. పది కోట్లు వీలైనంత త్వరలో వచ్చేలా కృషి చేస్తానని పేర్కొన్నారు. అంతకు ముందు బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మెడికల్ డైరెక్టర్ డా.సుబ్రహ్మనేస్వరరావు ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ల్యాబ్ ను ప్రారంభించారు. ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన, విజయవాడ సిద్దార్ధ ఇన్స్టిట్యూట్ పూర్వ విద్యార్ధుల సంఘం అద్యక్ష, కార్యదర్శులు డాక్టర్ సూరపనేని శ్రీనివాస్, డా. అమ్మన్న , ప్రముఖ వైద్యులు, ఎంపీపీ కిలారపు మంగమ్మ, వైస్ ఎంపీపీ నన్నపనేని వీరేంద్ర, తెదేపా మండల అద్యక్షుడు తాతా వీరదుర్గాప్రసాద్, జిల్లా కార్యదర్శి తాతా నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. మొవ్వ, పామర్రు, మచిలీపట్నం కలిదిండి, తొట్లవల్లూరు, పమిడిముక్కల, ఘంటసాల, చల్లపల్లి, అవనిగడ్డ తదితర ప్రాంతాల నుంచి రోగులు తరలివచ్చారు. డా.సుబ్రమణ్యశ్వర అమెరికాకు చెందిన యూరాలజిస్తూ డా.వేములపల్లి జగన్మోహనరావు, క్యాపిటల్ ఆసుపత్రి గుండె వ్యాధి నిపుణులు డా.భూపాల్ లతో పాటు నలభై మంది వైద్యులు సేవలందించారు. లింగమనేని రామస్వామి, కాజ చిన వెంకటేశ్వరరావు, బెల్లంకొండ వెంకటేశ్వరరావు పామర్తి శివకుమార్, పోతుల అనన్య , కిషన్, మద్దాల కామేశ్వరరావు, నాగభూషణం తదితరులు సహకరించారు.
“తానా” నినాదాలతో దద్దరిల్లిన రాజంపేట
తానా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చైతన్య స్రవంతిలో భాగంగా అధ్యక్షుడు వేమన సతీష్ స్వస్థలమైన రాజంపేటలో శనివారం నాడు ఓ భారీ కార్యక్రమన్ని ఏర్పాటు చేశారు. “ఎప్పటికీ అన్నమయ్య”, “రైతుకోసం తానా” అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. తితిదే సహకారంతో దాదాపు 500మంది కళాకారులు రాజంపేట నుండి 5కిమీ దూరంలో ఉన్న అన్నమయ్య జన్మస్థలం తాళ్లపాకకు భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కళారూపాలను ప్రదర్శించారు. అనంతరం తాళ్లపాకలో ఉన్న 108 అడుగుల అన్నమయ్య విగ్రహం ఎదుట భారీ బహిరంగ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి, ఎమ్మెల్సీలు పయ్యావుల కేశవ్, కత్తి నరసింహారెడ్డి, తెలంగాణా ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి, సినీనటుడు సునీల్, నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ, తానా సభల కన్వీనర్ డా.మూల్పూరి వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ గాయనీమణులు కొండవీటి జ్యోతిర్మయి, ఉష, శోభారాజు, తితిదే-అన్నమాచార్య ప్రాజెక్టుకు చెందిన కళాకారులు పలు భక్తిగీతాలను ఆలపించారు. ఈ సందర్భంగా తానా అధ్యక్షుడు వేమన సతీష్ మాట్లాడుతూ తానా చరిత్రలో తొలిసారిగా రాయలసీమ ప్రాంతం నుండి అధ్యక్షుడిగా ఎన్నికయ్యే అవకాశం తనకు లభించిందని, తనకు లభించిన పదవి ద్వారా ఈ ప్రాంతంలో పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. పలువురు రైతులకు వ్యవసాయ కిట్లను అందజేశారు. తానా ప్రతినిధులు లావు అంజయ్య చౌదరి, నరేన్ కొడాలి, పొట్లూరి రవి, మందడపు రవి, బత్తిన రాకేష్-ప్రకాష్, సూరపనేని రాజా తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
దుర్గి మండలంలో విజయవంతంగా తానా రైతుకోసం
గుంటూరు జిల్లా దుర్గి మండలం ఒబులేసునిపల్లెలో తానా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతుకోసం కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. 1500మందికి పైగా రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తానా రైతుకోసం సమన్వయకర్త కోట జానయ్య సోదరుడు కోట హనుమంతరావు విరాళంగా అందించిన డిజిటల్ క్లాస్‌రూం తరగతిని ప్రారంభించారు. డా.గోరంట్ల వాసుబాబు ఒబులేసునిపల్లె, ముటుకూరు జడ్పీ ఉన్నత పాఠశాలలకు సైన్స్ పరికరాలను అందించారు.
సత్తెనపల్లిలో ‘తానా’ సత్తా చాటిన చలపతి
తానా ఆద్వర్యంలో నిర్వహిస్తున్న చైతన్య స్రవంతుల భాగంగా గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ‘రైతుకోసం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. తానా ట్రస్టు బోర్డ్ అద్యక్షుడు కొండ్రగుంట చలపతి ఆద్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక శాసన సభ్యుడు, అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. 400మంది రైతులకు రైతు రక్షణ కిట్లను అందజేశారు. తానా కార్యదర్శి లావు అంజయ్య చౌదరి, తానా కో-ఆర్డినేటర్ (కెనడా)సూరపనేని లక్ష్మి నారాయణ, రైతుకోసం కమిటీ చైర్మన్ కోట జానయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కొత్తగూడెం-భద్రాచలంలో ఉరకలెత్తిన “తానా” పరుగు
తెలుగు రాష్ట్రాల్లో తానా ఆధ్వర్యంలో చేపడుతున్న చైతన్య స్రవంతి కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నాడు కొత్తగూడెం, భద్రాచలంలో 5కే రన్, రైతు కోసం కార్యక్రమం తో పాటు క్రీడా పోటీలు, సాంస్కృతిక ఉత్సవం పెద్ద ఎత్తున నిర్వహించారు. తానా తదుపరి అధ్యక్షుడు జయశేఖర్ తాళ్ళూరి సారద్యంలో జరిగిన ఈ కార్యక్రమాలకు తానా అద్యక్షుడు వేమన సతీష్ తో పాటు ఇతర ముఖ్య కార్యవర్గ సభ్యులందరూ హాజరయ్యారు. కొత్తగూడెంలో ఉదయం 7.30 గంటల నుండి జరిగిన 5కే రన్ కార్యక్రమంలో స్థానిక ప్రజలతో పాటు యువతీ, యువకులు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు. అందరూ సెంట్రల్ పార్కులో జరిగిన సభకు కొత్తగూడెం, ఇల్లెందు శాసన సభ్యుడు వనమా వెంకటేశ్వరరావు, హరిప్రియ తదితరులు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. స్థానికంగా ఉన్న వివిధ ట్రస్టులు, సేవా సంస్థలు సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రైతుకోసం పధకం కింద పలువురు రైతులకు వ్యవసాయ సంబందిత పరికరాలను అందజేశారు. పది స్థానిక పాటశాలలో డిజిటల్ తరగతి గదులకు అవసరమైన పరికరాలను అందజేశారు. వివిద్ క్రీడల్లో గెలుపొందిన యువతీ యువకులకు బహుమతులు ప్రదానం చేశారు.
*** భద్రాచలంలో ఎడ్ల ప్రదర్శన
భద్రాచలంలో కార్యక్రమాలు తాళ్లూరి జయశేఖర్ ఇంట్లో విందుతో ప్రారంభమయ్యాయి. ప్రముఖ సీతారామచంద్రుల దేవాలయాన్ని తానా బృందం సందర్శించారు. ఆలయ లాంచనాలతో స్వాగతం లభించింది. అనంతరం రైతుకోసం కార్యక్రమంలో భాగంగా ఎడ్లతో ప్రదర్శన జరిగింది. తానా బృందాన్ని ఎడ్ల బండిపై ఊరేగించారు. అనంతరం రైతులకి పరికరాలను పంపిణీ చేశారు. తానా ఆధ్వర్యంలో నిర్వహించిన వివిధ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఐకేడీఏ పీవో పమేలా సత్ఫది తదితరులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. సినీ నటులు శివబాలాజీ తదితరులు ప్రధాన ఆకర్షణగా పాల్గొన్నారు. సినీ గాయకులచే సంగీత విభావరి నిర్వహించారు. తానా అధ్యక్షుడు వేమన సతీష్ మాట్లాడుతూ తానా ఆధ్వర్యంలో ఇరవై రోజుల పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చైతన్య స్రవంతులు నిర్వహించి వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అటు అమెరికాలోనూ ఇటు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ తానా ఆధ్వర్యంలో మిలియన్ డాలర్ల ఖర్చుతో వివిధ ప్రాజెక్టులను చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో తానా నిర్వాహకులు తాళ్లూరి జయశేఖర్, లావు అంజయ్య చౌదరి, పొట్లూరి రవి, గోగినేని శ్రీనివాస్, కొండ్రగుంట చలపతి, మందడపు రవి, బత్తిన రాకేశ్, కోట జానయ్య, తాళ్లూరి రాజా, స్థానిక ప్రముఖులు చావా లక్ష్మీనారాయణ, తాళ్లూరి పంచాక్షరయ్య తదితరులు పాల్గొన్నారు. – కొత్తగూడెం, భద్రాచలం నుండి కిలారు ముద్దుకృష్ణ.
ప్రపంచవ్యాప్తంగా ఘనంగా క్రిస్మస్ వేడుకలు–చిత్రాలు
తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వాటికన్ సిటీతో పాటు యూరప్ దేశాల్లో అంగరంగ వైభవంగా ఈ పండుగను నిర్వహిస్తున్నారు. చర్చిలన్నీ విద్యుద్దీపాల వెలుగులో కాంతులీనుతున్నాయి. భక్తిభావాన్ని ప్రతిబింబించేలా అనేక చోట్ల క్రిస్మస్ ట్రీలు ఏర్పాటు చేశారు. వాటికన్‌లోని సెయింట్ పీటర్స్ బసాలిక చర్చిలో సంప్రదాయ వేడుకలను పోప్ ఫ్రాన్సిస్ ప్రారంభించి సందేశాన్ని వినిపించారు. దురాశను విడనాడాలని.. దాతృత్వం, ప్రేమను ప్రపంచానికి అందించాలని ఆయన కోరారు. క్రిస్మస్‌ను నిరాడంబరంగా జరుపుకోవాలని ఆయన సూచించారు. నేటి నుంచి వారం రోజులపాటు వాటికన్ సిటీలో ప్రత్యేక ప్రార్థనలు, కార్యక్రమాలు నిర్వహించనున్నారు.తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, మెదక్, విజయవాడ, ఒంగోలు తదితర ప్రాంతాల్లో క్రైస్తవులు పెద్దసంఖ్యలో చర్చిలకు తరలివచ్చి ఏసును స్మరించుకుంటున్నారు. గవర్నర్ నరసింహన్, తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబు క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు. పిల్లలు, పెద్దలు సంతోషకరమైన వాతావరణంలో పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు. ప్రేమ, త్యాగాన్ని చాటే క్రీస్తు బోధనలు సదా ఆచరణీయమని పేర్కొన్నారు.
*** తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు
రెండు తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే క్రైస్తవ సోదరులు చర్చిల్లో ప్రత్యేక పార్థనలు నిర్వహిస్తున్నారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా చర్చిలను నిర్వాహకులు సర్వాంగ సుందరంగా అలంకరించారు. ప్రార్థన మందిరాలు విద్యుత్ దీపాలతో వెలిగిపోతున్నాయి.
*మెదక్ సీఎస్‌ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. బిషప్ సాల్మన్ రాజ్ ఆధ్వర్యంలో తెల్లవారుజామున శిలువ ఊరేగింపు నిర్వహించారు.
*కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో జరుగుతున్న క్రిస్మస్ వేడుకల్లో వైఎస్సార్ సీపీ సమన్వయకర్త జోగి రమేశ్ పాల్గొన్నారు. క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.
*కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గ వ్యాప్తంగా సీఎస్‌ఐ, ఆర్‌సీఎం చర్చిల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. గన్నవరం, నిడమానూరులోని పలు చర్చిలో జరుగుతున్న క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనల్లో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు.
*విశాఖపట్నం పెదబయలు మండలంలో జరుగుతున్న ఐక్య క్రిస్మస్ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే కుంభా రవిబాబు పాల్గొన్నారు.
వైఎస్సార్ జిల్లా రాజంపేటలోని పలు చర్చిలలో క్రిస్మస్ పర్వదినం సందర్భంగా జరుగుతున్న ప్రత్యేక ప్రార్థనల్లో వైఎస్సార్ సీపీ పార్లమెంట్ అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి పాల్గొన్నారు.
*వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలంటూ ప్రార్థనలు చేశారు. పలు చర్చిల్లో కేక్ కట్ చేసి ఆడపడుచులకు చీరల పంపిణీ చేశారు.
*విశాఖపట్నం అరకు మండలం పనిరంగిలో జరుగుతున్న క్రిస్మస్ వేడుకల్లో వైఎస్సార్ సీపీ సమన్వయకర్త చెట్టి ఫాల్గుణ పాల్గొన్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం రూపాంతర దేవాలయం చర్చిలో జరుగుతున్న క్రిస్మస్ వేడుకల్లో భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ కన్వీనర్ గ్రంధి శ్రీనివాస్, వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి కొయ్యే మోసేనురాజు పాల్గొన్నారు.
*నెల్లూరు నగరంలోని సెయింట్ జోసెఫ్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.
*మంచిర్యాల జిల్లా కేంద్రంలోని హమాలివాడ సీఎస్‌ఐ చర్చిలో జరుగుతున్న క్రిస్మస్ వేడుకలకు ఎమ్మెల్యే దివాకర్ రావు హాజరయ్యారు. కేక్ కట్ చేసి క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.
*అనంతపురం జిల్లా వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రశాంతి నిలయంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో విదేశీ భక్తులు పాల్గొన్నారు. సత్యసాయి మహా సమాధి వద్ద విదేశీ భక్తులు ప్రార్థనలు నిర్వహించారు.
*సూర్యాపేటలోని మేరిమాత చర్చిలో జరుగుతున్న క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే జీ జగదీశ్‌రెడ్డి పాల్గొన్నారు.
*భద్రాద్రి జిల్లాలోని చర్ల సీఎస్‌ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి.
*ఖమ్మంలోని సెయింట్ మేరీస్ చర్చిలో క్రిస్మస్ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు పాల్గొన్నారు. క్రైస్తవ సోదర, సోదరీమణులందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.
*విజయవాడలో క్రిస్మస్ పర్వదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. చర్చిల్లో క్రైస్తవ సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. నగరంలోని చర్చిలు సర్వాంగ సుందరంగా అలకరించారు. గుణదల మేరిమాత చర్చిలో క్రీస్తు ఆరాధన కొనసాగుతుంది.
*కాకినాడలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.
*విశాఖపట్నం అల్లిపురం కల్వారి బాప్టిస్ట్, పాతనగరం లండన్ మిషన్ మెమోరియల్ చర్చిల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.
టాంటెక్స్ ఆధ్వర్యంలో అష్టావధానం
ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం(టాంటెక్స్) సాహిత్య వేదిక ఆధ్వర్యంలో “నెల నెలా తెలుగు వెన్నెల” 137వ సాహిత్య సదస్సును ఆదివారం నాడు డల్లాస్‌లో వీర్నపు చినసత్యం ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. స్వాతి కృష్ణమూర్తి శిష్య బృందం లాస్య కండేపి , సహస్ర కాసం , సాన్విక కాసం, మనోజ్ఞ బొమ్మదేవర, ప్రితిక పలనిసేల్వం, దీప్తి గాలి, దర్శిత రాకం, శ్రీఆద్య ఊర, శ్రీనిధి తటవర్తి ప్రార్థనా గీతం ఆలపించారు. కార్యక్రమంలో భాగంగా ఈ సంవత్సరం జరిగిన కార్యక్రమాల సింహావలోకనం జరిగింది. అవధాన ప్రారంభసూచకంగా మంజు తెలిదేవర శిష్య బృందం అనిక మల్లెల, అరుణ గోపాలన్, ద్రువ్ చిట్టిప్రోలు, సుమిత్ చిట్టిమల్ల, భవాని, ఈషాని గీతాన్ని ఆలపించారు. సాహితి వేముల, సింధూర వేముల మరియు సమన్విత మాడ గరుడ గమన గీతాన్ని ఆలపించారు. అమెరికాలో స్థిరపడిన ప్రవాసులు డా.పుదూర్ జగదీశ్వరన్ అవధానిగా, జువ్వాడి రమణ సంధాతగా, డా. తోటకూర ప్రసాద్ వ్యస్తాక్షరి, కాజ సురేష్ నిషిధ్ధాక్షరి, భాస్కర్ రాయవరం సమస్య, డా. సుధ కలవగుంట న్యస్తాక్షరి, డా. ఊరిమిండి నరసింహారెడ్డి దత్తపది, వేముల లెనిన్ వర్ణన, వీర్నపు చినసత్యం ఘంటాగణనం, దయాకర్ మాడ అప్రస్తుత ప్రసంగం తదితర అంశాలకు పృచ్ఛకులుగా వ్యవహరించారు. లేఖకులుగా బాసబత్తిన, రమణ దొడ్ల, కృష్ణ కోడూరి బాధ్యతలు నిర్వహించారు. ‘వాజియు నెక్కెను పఠాని ప్రాకట ఫణితిన్’ అన్న సమస్యని శివాజీకి వర్తింపచేస్తూ అద్భుతంగా పూరించారు, పెరుగు, అరుగు, మరుగు, తరుగు పదాలను ఉపయోగిస్తూ మానవ సమతుల్య జీవనానికి సూత్రాలను దత్తపదిలో పూరించారు. వరూధినీ సౌందర్యాన్ని నిషిద్దాక్షరిలో లాఘవంగా పూరించారు. 20 అక్షరాల ఉత్పలమాల పాదాన్ని వ్యస్తాక్షరిలో చేధించారు. ఆద్యంతమూ అప్రస్తుత ప్రసంగం సభికులను నవ్వుల్లో ముంచెత్తింది. అవధాని కూడా చిలిపి ప్రశ్నలకు గడుసు సమాధానాలు ఇచ్చారు. ఉత్తర టెక్సస్ తెలుగుసంఘం (టాంటెక్స్) అధ్యక్షురాలు కృష్ణవేణి శీలం, ఉత్తరాధ్యక్షులు చినసత్యం వీర్నపు, ఉపాధ్యక్షుడు కోడూరు కృష్ణారెడ్డి, సతీష్ బండారు, కోశాధికారి పాలేటి లక్ష్మి, ఇతర కార్యవర్గ సభ్యులు, సాహిత్య వేదిక కమిటి సభ్యులు డా.పుదూర్ జగదీశ్వరన్‌ను జ్ఞాపిక, దుశ్శాలువాతో సన్మానించి “అవధాన విరించి” బిరుదుతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సుబ్బు జొన్నలగడ్డ, ఆనంద్ మూర్తి కూచిభోట్ల, జగదీశ్వర్ రావు, పులిగండ్ల విశ్వనాధ్, డా. ప్రసాద్ తోటకూర, సీ.ఆర్.రావు, రామకృష్ణ రోడ్ద తదితరులు పాల్గొన్నారు.
పిట్స్ బర్గ్ దేవాలయంలో వైభవంగా పవిత్రోత్సవాలు
ఘనంగా TCAGT దీపావళి వేడుకలు
The Telugu community of Greater Toronto Area have celebrated “Diwali’ with great enthusiasm at Bishop Allen Academy auditorium in Etobicoke, GTA, Canada. Hundreds of Telugu families from surrounding cities Toronto, Markham, Brampton, Mississauga, Oakville, Waterdown, Kitchener, Waterloo, Cambridge, Hamilton, Milton and other areas have joined the six hour long program that is packed with music, drama, dance, comedy and many more. Event started with Socialization. Received remarkable responses from the participants with a glow of happiness and sparkles of joy in participating this event successfully with full of family entertainment. Everyone enjoyed great varieties of South Indian food delights. The venue and stage was decorated by Rekha and Niranjan Ghanta with the help of several volunteers. Colourful floral designs welcoming the Telugu Cultural Association of Greater Toronto (TCAGT) Guests, Sponsors, Members, Families and Friends. The festival has begun with Canadian National Anthem followed by “Deeparadhana”. Executive committee members, Trustees, and the event Sponsors lit the traditional Indian lamp. TCAGT Secretary Koteswara Rao Polavaru delivered the welcome address and highlighted the Diwali event activities, unique programs that were presented to the community this year. He also informed the Telugu Community for the outstanding services that have been provided through this twenty Nine years old Telugu Cultural Association of Greater Toronto (TCAGT).
He spoke about the TCAGT platform that provides the opportunity for the new immigrants to network, make new friends and to preserve the Telugu Cultural heritage in Canada. Telugu families in GTA were able to introduce Telugu Language, Culture and Festive experiences to the kids to embrace. Founders of this association envisioned to pass this for generations to come through this Great Telugu Association. Audience acknowledged and applauded the founders for their vision, hard work, and awesome service to the Telugu Community in Canada. He then introduced the Master of Ceremonies Nandan and Arun Reddy for the evening program to conduct. Treasurer Devi Chowdhary and Chairman Board of Trustees Srinivas Gadepalli delivered festive greetings. President Rajesh Vissa appreciated Executive Committee, Trustees, Advisors, Sponsors and Friends for being part of event and their collaborated efforts as a team for making the event successful. He encouraged participants to join the TCAGT family and support the association for taking up more initiatives for the community. He also highlighted that TCAGT is a Platform for all Telugu families to expose their kids talent, youth and parents to improve connections and explore opportunities of interest across various fields and emerging technologies. President Rajesh & his spouse Sreevani Vissa was felicitated with a Shawl and a Momento by the Founder Bose Vemuri, Trustee Surya Bezawada and the former president Rao Vajha. Event Sponsors Venkat Perugu, Kamakshi Perugu and Murarilal Thapliyal were felicitated with shawls and Momentos by President Rajesh, Sreevani Vissa, Secretary Koteswara Rao and Priya Polavarpu. Guest speaker Dave Bhatia, Lions Zone chair provided greetings. Johnny Bobbili from Toronto Police Dept. informed the importance of joining police department and the hiring process to become Police Officers in Canada. He encouraged the Telugu youth to apply for various positions that are available with the department. SpiceInn served the traditional delicious festive food items to the attendees. Spectacular dance performances choreographed by professionals enthralled all the ages of the community members. Mega musical night was performed by singers Sandeep Kurapati and Ramya Nada. Many attendees acknowledged the executive committee for the preserving, promoting Telugu language and culture for the past twenty nine years. Secretary Koteswara Rao Polavarapu provided vote of thanks and TCAGT event ended with chanting of Indian National Anthem. Indeed, the event has brought fun, excitement and high performance with a great fun.
ఘనంగా “భద్రాద్రి బాలోత్సవం” ప్రారంభం
తానా తదుపరి అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్ సారథ్యంలో తాళ్లూరి పంచాక్షరయ్య ట్రస్ట్ ఆధ్వర్యంలో భద్రాచలంలో “భద్రాద్రి బాలోత్సవ్” కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. గత ఆరేళ్లుగా నిర్వహిస్తున్న ఈ ఉత్సవానికి ఈ ఏడాది భారతదేశం నలుమూలల నుండి 5వేలకు పైగా విద్యార్థినీ విద్యార్థులు హాజరయ్యారు. ఈ వేడుకల ప్రారంభోత్సవ చిత్రమాలిక….
#Bhadradribalotsavamtnitana2018
తిత్లీ బాధితులకి నాట్స్ సేవలు. అభినందించిన చంద్రబాబు.
శ్రీకాకుళం జిల్లా తిత్లీ బాధితులను ఆదుకునేందుకు ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ(నాట్స్) సంస్థ పలాస, సోంపేట ప్రాంతాలకు 50 మంది స్వచ్ఛంద కార్యకర్తలతో సహాయక కార్యక్రమాలను నిర్వహించింది. గ్లో పౌండేషన్ సహకారంతో బాధితులకు అవసరమైన చీరలు, దుప్పట్లు, బియ్యం తదితర నిత్యావసర సామాగ్రిని “నాట్స్ కిట్స్” రూపంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా అందించారు. నాట్స్ సంస్థ మందస మండలం కొండలోగం పంచాయతీని దత్తతకు తీసుకుంది. ఈ పంచాయతీకి అనుబంధంగా ఉన్న కొండలోగం, పట్టులోగం, తంగారపుట్టి, దాలకాయి, తెంతులగాం, లింబుగం, రాయికొల, కుసుమాల, తుబ్బిగాం, బాంసుగామ్, రామరాయి తదితర గ్రామాల్లో 10వేల మంది బాధితులకు సామాగ్రిని అందించారు. తుఫాను సహాయక చర్యల్లో చురుగ్గా పాల్గొంటున్న నాట్స్ సంస్థను ముఖ్యమంత్రి అభినందించారు.
ఘనంగా ATAI బతుకమ్మ వేడుకలు
ఆస్ట్రేలియా మెల్బోర్న్ లో బతుకమ్మ ఉత్సవాలు ATAI ( ఆస్ట్రేలియా తెలంగాణ అసోసియేషన్) ఆధ్వర్యములో, కమ్మని తెలంగా విందు తో కనుల పండుగగా జరిగాయి. సుమారు మూడు వేల మంది అథితులు హాజరైన ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ సంగీత దర్శకుడు,బతుకమ్మ పాటలకు పెట్టింది పేరు అయిన భోలే షావలి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తను సంగీత దర్శకత్వంలో సమకూర్చిన కోలో కోలో కోల్, ఆకుపచ్చ పండగొచ్చెనే చెల్లెలా బతుకమ్మ పాటలతో ఎంతో ఉత్సాహంగా ఆడ పడచులతో ఆడి పాడారు. ఈ ఉత్సవాలకు హాజరైన పలు భారతీయ అసోసియేషన్ ప్రతినిధులను అధ్యక్షుడు అమరేందర్ రెడ్డి అత్తాపురం, ఉపాధ్యక్షులు అనిల్ బైరెడ్డి సన్మానించారు. ఎల్లప్పుడూ ఒకరికొకరు పరస్పర సహాయ సహకారాలతొ మన సంస్క్రుతి సాంప్రదాయాలను కాపాడటానికి క్రుషి చేద్దామన్నారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా బతుకమ్మలు తెచ్చిన ప్రతి ఒక్కరికి వెండి నాణెములు, ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన బతుకమ్మలకు బంగారు నాణెములు మరియు మరెన్నో ఇతర బహుమతులు ఇచ్చారు. ATAI ఈ సంవత్సరం కూడా తెలంగాణ వంటకాలు డబల్కా మీట, గవ్వలు, సకినాలు సర్వపిండి, పచ్చి పులుసులతో వడ్డించిన విందు భోజనం వచ్చిన ఆహుతలందరికీ స్వదేశాన్ని గుర్తు చేసిందన్నారు. కార్యక్రమానికి సెక్రెటరి రఘు కోట్ల వందన సమర్పణ చేస్తూ, ఈ కార్యక్రమం ఇంత విజయ వంతం కావటానికి స్పాన్సర్స్, కమూనిటీ పార్ట్నర్స్, మీడియా పార్ట్నర్స్, వాలెంటీర్స్, అడ్వయిజరీ బోర్డు సభ్యులు, రాజవర్దన్ వుల్పాల, పుల్లారెడ్డి బద్దం, ప్రవీణ్ దేశం, క్రిష్న వడియాల, శ్యాం లింగంపల్లి మరియు సంస్త సభ్యులు కిషోర్ యన్నం, దీపక్ హరి, రవి దామెర, కిరణ్ పాల్వాయి, ఫణి రంగరాజు, వంశీ కొట్టాల, మహేశ్ బద్దం, సతీష్ పాటిలు చేసిన క్రుషి కారణమన్నారు. శ్రీ మురళి బుడిగె గారికి, యాంకర్ మధులికకు, మరియు ఈ సంసవత్సరం వేదికను ఎంతో ఆకర్షణీయంగా మలిచిన శిరీష, సుష్మిత, నిశిత, అక్షితలను అభినందించారు.
నాగ్ పూర్ ఆంధ్రా సంఘం సాంస్కృతికోత్సవం
మహారాష్ట్రలోని నాగ్ పూర్ ఆంధ్రా అసోసియేషన్ సాంస్కృతిక వేడుకలు ఆదివారం నాడు నిర్వహించారు. ఆంధ్ర రాష్ట్ర డిప్యుటీ స్పీకర్ మండలి బుద్దప్రసాద్ ఈ వేడుకలకు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. జ్యోతి వెలిగించి ఉత్సవాలు ప్రారంభించారు. హైకోర్టు న్యాయవాదులు ఆకుల రమ్యకుమారి, ఎం.వెంకటేశ్వరి అతిధులుగా హాజరయ్యారు. *ఈ సందర్భంగా ప్రదర్శించిన బాలనాగమ్మ బుర్రకధ ఆహుతలను అలరించింది. నాగ్ పూర్ ఆంధ్రా అసోసియేషన్ కార్యదర్శి పీ.ఎస్.ఎన్.మూర్తి ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు సత్కరించారు. అసోసియేషన్ అద్యక్షుడు ఆర్.మురళీధర్ పాలకవర్గ సభ్యుడు ఎం.నాగేశ్వరరావు తదితరులు ప్రసంగించారు. మండలి బుద్దప్రసాద్ మాట్లాడుతూ నాగ్ పూర్ తదితర ప్రాంతాలకు తెలుగువారు వందల సంవత్సరాల క్రితమే వచ్చి స్థిరపడ్డారని తెలిపారు. ఇక్కడ నివసిస్తున్న తెలుగువారి కోసం నాగ్ పూర్ ఆంధ్రా అసోసియేషన్ చేపడుతున్న కార్యక్రమంలో అభినందించారు. మరొక పాలకవర్గ సభ్యురాలు ఎ.జగదాంబ వందన సమర్పణ చేశారు. భవిష్యత్తులో నాగ్ పూర్ ఆంధ్రా అసోసియేషన్ ఆద్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించారు.
ఘనంగా రామినేని ఫౌండేషన్ పురస్కారాల ప్రదానం
గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని సీకే కన్వెన్షన్‌లో డాక్టర్ రామినేని ఫౌండేషన్ పురస్కారాల ప్రదానోత్సవం ఆదివారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు.
వివిధ రంగాల్లో రాణిస్తూ సమాజానికి విశేషంగా సేవలందిస్తున్న పలువురికి ఈ ఏడాది కూడా డాక్టర్ రామినేని ఫౌండేషన్ (యుఎస్ఎ) తరపున విశిష్ట, విశేష పురస్కారాలను ప్రధానం
స్వర్గీయ డాక్టర్ రామినేని అయ్యన్న చౌదరి 1995లో అమెరికాలోని ఓహాయో రాష్ట్రంలో సిన్సినాటిలో డాక్టర్ రామినేని ఫౌండేషన్‌ను స్థాపన
భారతీయ సంస్క్రతి, సంప్రదాయాలను, హిందూ ధర్మాన్ని విశ్వవ్యాపితం చేయడం కోసం ఫౌండేషన్ పనిచేస్తోంది అని రామినేని ధర్మప్రచారఖ్ పేర్కొన్నారు.
విశిష్ట, విశేష పురస్కారం అవార్డ్స్ లకు ఎంపిక చేసేందుకు ముగ్గురు సభ్యుల కమిటీ పద్మశ్రీ డా.జీఎన్ రావు, డా. కె.రామచంద్ర మూర్తి, డా.బివి పట్టాభిరాం ఆధ్వర్యంలో ఎంపిక
కళలు, విజ్ఞాన, మానవీయత వంటి వివిధ రంగాల్లో రాణిస్తూఈ ప్రజాహితం కోరుతూ ఉదారతను చాటే ప్రముఖులను సత్కరించడం సంస్థ తమ ప్రాధమిక లక్ష్యం
రామినేని ఫౌండేషన్ విశిష్ట పురస్కారం అందుకున్న ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, ద్రోణాచార్య అవార్డు గ్రహీత, డాక్టర్ పుల్లెల గోపీచంద్
విశేష పురస్కారం అందుకున్న ప్రముఖ ప్రవచనకారుడు డాక్టర్ గరికపాటి నరసింహారావు,
విశేష పురస్కారం అందుకున్న ప్రముఖ సినీ దర్శకుడు నాగ్ అశ్విన్ రెడ్డి (మహానటి ఫేం),
విశేష పురస్కారం అందుకున్న ప్రముఖ తెలుగు రచయిత చొక్కాపు వెంకటరమణ
భారత్ క్రికెట్ మాజీ కెప్టెన్ కపిలదేవ్ ప్రసంగిస్తూ మీడియా మాధ్యమం లేకుండా ఏది సాధ్యం కాదు..ఒక ఫౌండేషన్ ప్రారంభించడం ఒక ఎత్తయితే వాటిని 19 సంవత్సరాలు గా కోనసాగించడం మంచి పరిణామం. రామినేని కుటుంబం అమెరికాలో నివాసం ఉన్నా, వారి నాన్న గారి పేరుతో ఒక ఫౌండేషన్ స్థాపించి కొనసాగించడం మంచి పరిణామం. వాటిని మరింతగా ముందుకు తీసుకుని వెళ్లే బాధ్యత మనపై ఉంది. వారిని మరోసారి ప్రత్యేకంగా అభినందిస్తున్నాని అన్నారు.