బోస్టన్‌లో “ఆటా” దసరా వేడుకలు

విజయదశమి పండుగను బోస్టన్‌లోని ఎన్నారైలు ఘనంగా జరుపుకున్నారు. అమెరికా తెలుగు అసోసియేషన్‌ (ఆటా) ఆధ్వర్యంలో దసరా వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకకు దాదాపు 250 మంది ప్రవాసాంధ్రులు హాజరైనట్టు పేర్కొన్నారు. బోస్టన్‌ లో నివసిస్తున్న తెలుగు వారు ఈ వేడుకను జమ్మిపూజతో మొదలుపెట్టారు. ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాలతో వేడుకలు ఆహ్లాదభరితంగా జరిగాయి. పసందైన విందు భోజనాలతో కార్యక్రమాన్ని ముగించారు. ఆటా సభ్యులైన రమేష్‌ నలవోలు, మల్లా రెడ్డి యనల, క్రిష్ణా ద్యాపా, సోమ శేఖర్‌ నల్లా​, చంద్ర మంచికంటి, శశికాంత్‌, దామోదర్‌, రవి, మధు, అనిత ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.

Leave a Reply

Your email address will not be published.

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)