అమెరికన్ ‘ఫోర్బ్స్’ మ్యాగజైన్లో తెలుగు తేజం మెరిసింది. పశ్చిమగోదావరి జిల్లా అత్తిలి మండలం ఉనికిలి గ్రామానికి చెందిన బొల్లింపల్లి మేఘన ఈ నెలలో ప్రచురించిన మ్యాగజైన్లో అండర్-30 శాస్త్రవేత్తల విభాగంలో చోటు దక్కించుకుంది. అమెరికన్ ‘ఫోర్బ్స్’ మ్యాగజైన్లో తెలుగు తేజం మెరిసింది. పశ్చిమగోదావరి జిల్లా అత్తిలి మండలం ఉనికిలి గ్రామానికి చెందిన బొల్లింపల్లి మేఘన ఈ నెలలో ప్రచురించిన మ్యాగజైన్లో అండర్-30 శాస్త్రవేత్త విభాగంలో చోటు దక్కించుకుంది. ఐసెఫ్ (ఇంటెల్ ఫౌండేషన్ యంగ్ సైంటిస్టు) 2018 మేలో నిర్వహించిన సైన్స్ ఫేర్ పోటీల్లో ఇంటర్నేషనల్ అవార్డు సాధించినందుకు మేఘనను అత్యంత ప్రతిభాశాలిగా గుర్తించారు. ఈ మేరకు ఆమె తల్లిదండ్రులు వెంకటేశ్వరరావు, మాధవి అమెరికా నుంచి చరవాణి ద్వారా తెలిపారు. తల్లిదండ్రులతో కలిసి మేఘన అమెరికాలోని ఆర్క్‌నెస్ స్టేట్ లిటిల్ రాక్‌లో ఉంటోంది. సెంట్రల్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న ఈమెకు సైన్సు అంటే ఆసక్తి ఎక్కువ. స్థానికంగా నిర్వహించే సెమినార్లలో ప్రతిభ చూపేది. ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలకు పదును పెడుతూ ప్రయోగాలు చేస్తూ వచ్చింది. 2018 మేలో ప్రపంచస్థాయిలో ఐసెఫ్ సంస్థ నిర్వహించిన సైన్స్‌ఫేర్ పోటీల్లో 75 దేశాలతో పోటీపడి ‘ఎలక్ట్రోడ్ మేడ్ విత్ ప్లాటినమ్’ అనే సైన్స్ సూపర్ కెపాసిటర్ ప్రయోగం ప్రదర్శన ద్వారా ఐసెఫ్ అవార్డు సాధించింది. ఆ సందర్భంగా మేఘన అవార్డుతో పాటు 50వేల డాలర్ల బహుమతి పొందినట్లు తల్లిదండ్రులు చెప్పారు.
