టాంటెక్స్ ఆధ్వర్యంలో అష్టావధానం


ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం(టాంటెక్స్) సాహిత్య వేదిక ఆధ్వర్యంలో “నెల నెలా తెలుగు వెన్నెల” 137వ సాహిత్య సదస్సును ఆదివారం నాడు డల్లాస్‌లో వీర్నపు చినసత్యం ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. స్వాతి కృష్ణమూర్తి శిష్య బృందం లాస్య కండేపి , సహస్ర కాసం , సాన్విక కాసం, మనోజ్ఞ బొమ్మదేవర, ప్రితిక పలనిసేల్వం, దీప్తి గాలి, దర్శిత రాకం, శ్రీఆద్య ఊర, శ్రీనిధి తటవర్తి ప్రార్థనా గీతం ఆలపించారు. కార్యక్రమంలో భాగంగా ఈ సంవత్సరం జరిగిన కార్యక్రమాల సింహావలోకనం జరిగింది. అవధాన ప్రారంభసూచకంగా మంజు తెలిదేవర శిష్య బృందం అనిక మల్లెల, అరుణ గోపాలన్, ద్రువ్ చిట్టిప్రోలు, సుమిత్ చిట్టిమల్ల, భవాని, ఈషాని గీతాన్ని ఆలపించారు. సాహితి వేముల, సింధూర వేముల మరియు సమన్విత మాడ గరుడ గమన గీతాన్ని ఆలపించారు. అమెరికాలో స్థిరపడిన ప్రవాసులు డా.పుదూర్ జగదీశ్వరన్ అవధానిగా, జువ్వాడి రమణ సంధాతగా, డా. తోటకూర ప్రసాద్ వ్యస్తాక్షరి, కాజ సురేష్ నిషిధ్ధాక్షరి, భాస్కర్ రాయవరం సమస్య, డా. సుధ కలవగుంట న్యస్తాక్షరి, డా. ఊరిమిండి నరసింహారెడ్డి దత్తపది, వేముల లెనిన్ వర్ణన, వీర్నపు చినసత్యం ఘంటాగణనం, దయాకర్ మాడ అప్రస్తుత ప్రసంగం తదితర అంశాలకు పృచ్ఛకులుగా వ్యవహరించారు. లేఖకులుగా బాసబత్తిన, రమణ దొడ్ల, కృష్ణ కోడూరి బాధ్యతలు నిర్వహించారు. ‘వాజియు నెక్కెను పఠాని ప్రాకట ఫణితిన్’ అన్న సమస్యని శివాజీకి వర్తింపచేస్తూ అద్భుతంగా పూరించారు, పెరుగు, అరుగు, మరుగు, తరుగు పదాలను ఉపయోగిస్తూ మానవ సమతుల్య జీవనానికి సూత్రాలను దత్తపదిలో పూరించారు. వరూధినీ సౌందర్యాన్ని నిషిద్దాక్షరిలో లాఘవంగా పూరించారు. 20 అక్షరాల ఉత్పలమాల పాదాన్ని వ్యస్తాక్షరిలో చేధించారు. ఆద్యంతమూ అప్రస్తుత ప్రసంగం సభికులను నవ్వుల్లో ముంచెత్తింది. అవధాని కూడా చిలిపి ప్రశ్నలకు గడుసు సమాధానాలు ఇచ్చారు. ఉత్తర టెక్సస్ తెలుగుసంఘం (టాంటెక్స్) అధ్యక్షురాలు కృష్ణవేణి శీలం, ఉత్తరాధ్యక్షులు చినసత్యం వీర్నపు, ఉపాధ్యక్షుడు కోడూరు కృష్ణారెడ్డి, సతీష్ బండారు, కోశాధికారి పాలేటి లక్ష్మి, ఇతర కార్యవర్గ సభ్యులు, సాహిత్య వేదిక కమిటి సభ్యులు డా.పుదూర్ జగదీశ్వరన్‌ను జ్ఞాపిక, దుశ్శాలువాతో సన్మానించి “అవధాన విరించి” బిరుదుతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సుబ్బు జొన్నలగడ్డ, ఆనంద్ మూర్తి కూచిభోట్ల, జగదీశ్వర్ రావు, పులిగండ్ల విశ్వనాధ్, డా. ప్రసాద్ తోటకూర, సీ.ఆర్.రావు, రామకృష్ణ రోడ్ద తదితరులు పాల్గొన్నారు.Leave a Reply

Your email address will not be published.

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)