అమెరికాలోని కొలంబస్కు చెందిన ప్రవాసుడు, “టాకో” మాజీ అధ్యక్షుడు సామినేని రవి విరాళంతో సమకూర్చిన డిజిటల్ తరగతి గదిని కృష్ణా జిల్లా తిరువూరు జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో సోమవారం నాడు ప్రారంభించారు. తానా కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్ ఈ తరగతి గదిని ప్రారంభించారు. ఏపీ జన్మభూమి పథకం కింద అమెరికాలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరాం నాయకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేస్తొన్న డిజిటల్ తరగతి గదుల ఏర్పాటుకు స్పందించి తిరువూరులో దీన్ని ఏర్పాటుకు విరాళమందించినట్లు రవి సామినేని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక జడ్పీటీసీ కిలారు విజయబిందు, ఎంపీపీ గద్దె వెంకన్న, మాజీ తహశీల్దార్ పొట్లూరి తిరుమలరావు, రవి కుటుంబ సభ్యులు, హైస్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
