తెలంగాణ అమెరికా తెలుగు సంఘం(టాటా) నూతన అధ్యక్షునిగా విక్రమ్ రెడ్డి జనగామ నియమితులయ్యారు. లాస్‌వెగాస్‌లోని ఆరియా కన్వెన్షన్ సెంటర్లో డాక్టర్ పైళ్ల మల్లారెడ్డి అధ్యక్షతన జరిగిన బోర్డు మీటింగ్‌లో సుమారు 150 మంది సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. టాటా ప్రెసిడెంట్‌గా విక్రమ్ జనగామను అడ్వైజరీ కౌన్సిల్ ఎంపిక చేసింది. టాటా మాజీ అధ్యక్షులు డా. హరనాత్ పొలిచర్ల తన హయాంలో టాటా సాధించిన లక్ష్యాలను వివరించారు. టాటాకు హరనాథ్ అందించిన సేవలను టాటా సభ్యులు కొనియాడారు.
