హాంకాంగ్ ప్రవాసుల సంక్రాంతి వేడుకలు

‘ది హాంకాంగ్‌ తెలుగు సమాఖ్య’ ఆధ్వర్యంలో సంక్రాతి పండుగ ఘనంగా జరిగింది. ‘బుజ్జాయిలతో భోగి’ ఉత్సవం కన్నుల పండువగా సాగింది. ఈ కార్యక్రమాన్ని సమాఖ్య వ్యవస్థాపకురాలు జయ పీసపాటి ప్రారంభించి, పిల్లలని ఆశీర్వదించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ..‘తెలుగు లోగిళ్లలోని పిల్లలకు ఇలా భోగి పళ్లు పోయడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం కోసం తెలుగు సమాఖ్య సభ్యులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. హాంగ్‌కాంగ్‌లో పుట్టి పెరిగిన పిల్లలు తెలుగు చక్కగా మాట్లాడుతున్నారు’ అని తెలిపారు. అనంతరం పిల్లలు నటించిన నాటికలు ‘తెనాలి రామలింగడు-వంకాయ కూర’, ‘భక్త ప్రహ్లాదుడు’ నాటికలు అలరించాయి. ఫిబ్రవరిలో సామూహిక సత్యనారాయణ వ్రతం నిర్వహించనున్నామని జయ ఈ సందర్భంగా తెలిపారు.

Leave a Reply

Your email address will not be published.

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)