నార్త్ అమెరికా పద్మశాలి అసోసియేషన్(నాపా) ఆధ్వర్యంలో చికాగోలోని బాలాజీ ఆలయంలో మార్కండేయ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకలతో పాటు కొత్తగా నాపా చికాగో చాప్టర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా చికాగో చాప్టర్ డైరక్టర్‌గా నియమితులైన రాజ్ ఆడ్డగట్ల మాట్లాడుతూ.. మార్కండేయ జయంతి వేడుకల్లో పాల్గొన్న నాపా సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. జయంతి వేడుకలు ఇంత ఘనంగా జరగడానికి సహాయపడిన ప్రతి ఒక్కరికీ పేరుపేరున ధన్యవాదాలు తెలిపారు. చికాగో చాప్టర్ ఆధ్వర్యంలో తొలి సారి జరుగుతున్న ఈ కార్యక్రమం ఇంత ఘనంగా జరిగినందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. కార్యక్రమం అనంతరం పసందైన వంటకాలతో అతిథులకు భోజన ఏర్పాట్లు చేశారు. అనంతరం రామారావును సభ్యులు ఘనంగా సత్కరించారు.
