అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని అమెరికా తెలుగు సంఘం (ఆటా) ఘనంగా నిర్వహించింది. డాలస్ లోని మినర్వా బంక్వేట్ లో జరిగిన మహిళా దినోత్సవ వేడుకలకు 300లకు పైగా మహిళలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. రీజనల్ కో ఆర్డినేటర్లు అశోక్ పొద్దుటూరి, మాధవి సుంకిరెడ్డి అతిధులను ఆహ్వానించగా.. మధుమతి వైష్యరాజు దీప ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం పుల్వామా ఉగ్రదాడి అమరాజవంలకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాల్లో దూసుకుపోతున్న వుమెన్ ప్రొఫెషనల్ డాక్టర్ సేజల్ మెహతా డా. శ్రీవిద్య శ్రీధర , సునీత చెరువు, శ్రీ తిన్ననూరులతో మాధవి సుంకిరెడ్డి ప్యానల్ డిస్కషన్ నిర్వహించారు. తమ విలువైన అనుభవాలు పంచుకున్నందుకు సలహాలు అందించినందుకు సుమన బీరం, శ్వేతా పొద్దుటూరి వీరికి ధన్యవాదాలు తెలిపారు.
