కృష్ణా జిల్లా గుడివాడ అసెంబ్లీ స్థానం నుంచి తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాష్‌ను పోటీ చేయించే అంశాన్ని తెలుగుదేశం పార్టీ పరిశీలిస్తోంది. గత ఎన్నికల్లో వైకాపా అభ్యర్థి కొడాలి నాని తెదేపా అభ్యర్థి రావి వెంకటేశ్వరరావుపై స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. వచ్చే ఎన్నికల్లో గుడివాడ స్థానాన్ని సొంతం చేసుకోవాలనుకుంటున్న తెదేపా అవినాష్‌ను బరిలోకి దింపి వ్యూహాత్మక ప్రయోగం చేయాలని భావిస్తోంది. త్వరలో తెదేపా అధినేత చంద్రబాబు ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకుంటారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, దివంగత నేత ఎన్టీఆర్ 1983, 85 ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి సుమారు 50 వేల మెజారిటీతో గెలుపొందారు. లగడపాటి రాజగోపాల్ పేరు తెరపైకి వచ్చింది. నరసరావుపేటలో రాయపాటి సాంబశివరావుకు టికెట్ రాకుండా స్పీకర్ కోడెల చక్రం తిప్పుతున్నట్లు సమాచారం. దీనిలో భాగంగానే లగడపాటి రాజగోపాల్ పేరును తెరపైకి తెచ్చినట్లు తెదేపా అనుచరుల్లో చర్చ సాగుతోంది. దీంతో రాయపాటి సాంబశివరావు రగిలిపోతున్నట్లు సమాచారం.
