బోస్టన్‌లో ఆటా మహిళా దినోత్సవం


అమెరికాలోని బోస్టన్ నగరంలో అమెరికన్‌ తెలుగు అసోషియేషన్‌(ఆటా) ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు అంగరంగ వైభంగా జరిగాయి. ఈ సంవత్సరం ‘బెటర్‌ ఫర్‌ బ్యాలెన్స్‌’ అనే థీమ్‌తో ఈ వేడుకలను ఆట నిర్వహించింది. న్యూ ఇంగ్లాండ్ లోని బోస్టన్ పరిసర ప్రాంతాలు కన్నీటికట్, న్యూ హంపశైర్ నుండి ఈ వేడుకలకు మహిళలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేశారు. ఈ వేడుకల్లో మహిళలకు ఉపయోగకరమైన విషయాలపై వక్తలు మాట్లాడి చర్చించారు. మహిళలు అన్ని రంగాలలో ముందుండి విజయం సాదించాలని రంజని సైగల్ అన్నారు. మసాచుసెట్స్ రాష్ట్ర సెనెటర్ ఎలిజబెత్ వారెన్ రాలేక పోయినందున వారి ప్రత్యేక సందేశాన్ని మహిళలకు చదివి వినిపించారు. మహిళా వాలంటీర్స్ అనిత రెడ్డి , సునీత నల్ల , మధు యానాల, శిల్ప శ్రీపురం, రజని తెన్నేటి , లక్ష్మి , సాహితి రొండ్ల లను మహిళా దినోత్సవ ప్రణాళిక, వక్తల ఏర్పాటు, కార్యక్రమ అమలు బ్రహ్మాండంగా జరిపారని మహిళలు కొనియాడారు ఈ కార్యక్రమాలలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదిక అలంకరణ ,సాంస్కృతిక కార్యక్రమాలు, విందు అందరినీ అలరించాయి. ఆటా రీజినల్ డైరెక్టర్ సోమ శేఖర్ రెడ్డి నల్ల, రీజినల్ కోఆర్డినేటర్స్ మల్లా రెడ్డి యానాల, లక్ష్మీనారాయణ రెడ్డి , మేఘనాథ్ రెడ్డి , చంద్రశేఖర్ రావు మంచికంటి కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ‘ఆటా’ మహిళలకు అండగా ఉంటూ ప్రోత్సహిస్తుందని, ‘ఆటా’ మహిళా దినోత్సవ కార్యక్రమం దిగ్విజయంగా జరగడానికి సహకరించిన, భాగస్వాములైన స్పాన్సర్స్‌, వాలంటీర్స్‌కు ఆటా బోర్డు మెంబర్లు రమేష్‌ నల్లవోలు, కృష్ణ ధ్యాప టీం సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published.

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)