సరిగ్గా 18 నిముషాలు

భాగ్యనగర ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న అమీర్‌పేట – హైటెక్‌సిటీ మార్గంలో మెట్రో రైలు పరుగులకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 20 నుంచి ఈ మార్గంలో సేవలు ప్రారంభించనున్నట్టు అధికారులు వెల్లడించారు. ప్రముఖ కార్పోరేట్‌ సంస్థలు, ఐటీ సంస్థలు హైటెక్‌సిటీ ప్రాంతంలోనే ఉండటంతో ఈ మార్గంలో నిత్యం వాహనాల రద్దీతో ట్రాఫిక్‌ భారీగా స్తంభిస్తోంది. ఈ మార్గంలో మెట్రో రైలు మార్గం పూర్తికావడంతో ట్రాఫిక్‌ సమస్యకు తెరపడనుంది. ఇకపై అమీర్‌పేట నుంచి హైటెక్‌సిటీకి సుమారు 20 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. ఈ మార్గంలో మొత్తం ఎనిమిది స్టేషన్లు ఉన్నాయి. అమీర్‌పేట, మధురానగర్‌, యూసఫ్‌గూడ, జూబ్లీహిల్స్‌ రోడ్‌ నం -5, జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌, పెద్దమ్మగుడి, మాదాపూర్‌, దుర్గం చెరువు, హైటెక్‌సిటీ. హైదరాబాద్‌ మహా నగరంలోని మొత్తం మూడు మెట్రో రైలు కారిడార్లలో 56 కి.మీల వరకు మెట్రో సేవలు పూర్తయినట్టు అధికారులు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)