ఆయనకు 350. ఈయనకు 80.

విజయవాడ వైకాపా ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన పొట్లూరి వర ప్రసాద్‌(పీవీపీ) కుటుంబ ఆస్తుల మొత్తం విలువ రూ.347.75కోట్లుగా ప్రకటించారు. వీటిలో చరాస్తులు రూ.236.29కోట్లు, స్థిరాస్తులు రూ.111.46కోట్లు ఉన్నాయి. ఎంపీ అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్‌ వేసిన పీవీపీ.. ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి సమర్పించిన అఫిడవిట్‌లో తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. కుటుంబానికి ఉన్న అప్పులు రూ.20.95 కోట్లుగా చూపించారు. మరో రూ.7.36 కోట్ల వివాదాస్పద బకాయిలు ఉన్నట్టు పొందుపరిచారు. పీవీపీ పేరుతో రూ.39.36 కోట్లు, భార్యకు 196.60కోట్లు, ఇద్దరు పిల్లలకు రూ.32.95లక్షల విలువైన చరాస్తులు ఉన్నాయి. పీవీపీకి రూ.45.95 కోట్లు, భార్యకు రూ.65.51 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. అప్పులు సైతం పీవీపీ పేరుతో రూ.2.91 కోట్లు, భార్యకు రూ.18.03 కోట్లు ఉన్నట్టు చూపించారు. 2017-18లో పన్ను చెల్లించిన కుటుంబ ఆదాయం రూ.1.49కోట్లుగా పొందుపరిచారు. రూ.18.90లక్షల విలువైన 630గ్రాముల బంగారు ఆభరణాలు, ఒక ఇన్నోవా వాహనం ఉన్నట్టు చూపించారు. తెదేపా ఎంపీ అభ్యర్థి కేశినేని శ్రీనివాస్‌(నాని) దాఖలు చేసిన తన అఫిడవిట్‌లో కుటుంబ ఆస్తుల మొత్తం విలువ రూ.80.82 కోట్లుగా చూపించారు. నాని పేరుతో అప్పులు రూ.51.23 కోట్లున్నాయి. మరో రూ.23.29 కోట్ల వివాదాస్పద బకాయిలు సైతం ఉన్నట్టు పొందుపరిచారు. చరాస్తులు నాని పేరుతో రూ.10.62కోట్లు, భార్యకు రూ.1.61కోట్లు, కుమార్తెలకు రూ.1.13కోట్ల విలువైనవి ఉన్నాయి. స్థిరాస్తులు నాని పేరు మీద రూ.66.07కోట్లు, భార్యకు రూ.1.36కోట్ల విలువైనవి ఉన్నట్టు పొందుపరిచారు. 2017-18లో పన్ను చెల్లించిన కుటుంబ ఆదాయం రూ.26.87లక్షలుగా చూపించారు. ఐదు వోల్వో, ఆరు మినీ బస్సులు, రెండు బెంజ్‌ కార్లు, ఆడి ఎస్‌యూవీ, బీఎండబ్ల్యూ, ఇన్నోవాలు 4, స్కార్పియో, బొలేరో వాహనాలు ఉన్నాయి. రూ.3.41 కోట్ల విలువైన 3.85కిలోల బంగారం, రూ.10లక్షల విలువైన 25కిలోల వెండి వస్తువులు ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published.

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)