జగన్ కేసుల చిట్టా ఇదే

వైకాపా అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి కడప జిల్లా పులివెందులలో శుక్రవారం దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్‌లో తనపై నమోదైన కేసులు, వాటి దర్యాప్తు ఏ స్థాయిలో ఉందో ప్రకటించారు. 11 సీబీఐ, 7 ఈడీ కేసులు, పోలీసుస్టేషన్లు, కింది కోర్టుల్లో 13 కేసులు ఉన్నాయని వివరించారు. వీటిలో అత్యధిక కేసులను కోర్టులు ఇంకా విచారణ కోసం పరిగణనలోకి తీసుకోలేదని ఆయన వెల్లడించారు. తనపై అవినీతి నిరోధక చట్టం, మనీలాండరింగ్‌ నిరోధక చట్టాల కింద కేసులున్నట్లు అఫిడవిట్‌లో తెలిపారు. అలాగే పరువునష్టం దావా, వర్గాలను రెచ్చగొట్టడం, అనుచిత ప్రవర్తనలాంటి మరికొన్ని కేసులు ఉన్నాయని పేర్కొన్నారు.

సీబీఐ కేసులు
సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నెం.ఆర్‌సీ.19(ఎ)/2011 కింద కింది కేసుల నమోదు

1. సీసీ 26/2014 -సీబీఐ కోర్టు, హైదరాబాద్‌ (ఇందూ- గృహనిర్మాణమండలి సంయుక్త భాగస్వామ్య ప్రాజెక్టు వ్యవహారం)
* సెక్షన్లు: 120బి, 420, 409 ఐపీసీ, 11, 13(2) రెడ్‌విత్‌ 13(1)(సి)(డి) అవినీతి నిరోధక చట్టం
* స్థాయి: అభియోగాలు నమోదు కాలేదు.

2. సీసీ 28/2013 సీబీఐ కోర్టు, హైదరాబాద్‌ (లేపాక్షి నాలెడ్జ్‌ హబ్‌ వ్యవహారం)
* సెక్షన్లు: 120బి రెడ్‌విత్‌ 420, 468, 471, ఐపీసీ, సెక్షన్‌ 9- అవినీతి నిరోధక చట్టం
* స్థాయి: అభియోగాలు నమోదు కాలేదు

3. సీసీ 27/2013 సీబీఐ కోర్టు, హైదరాబాద్‌ (ఇందూటెక్‌ జోన్‌ వ్యవహారం)
* సెక్షన్లు: 120బి, 420, ఐపీసీ, సెక్షన్‌ 9 -అవినీతి నిరోధక చట్టం
* స్థాయి: అభియోగాలు నమోదు కాలేదు.

4. సీసీ 26/2013 సీబీఐ కోర్టు, హైదరాబాద్‌ (పెన్నా సిమెంట్స్‌ వ్యవహారం)
* సెక్షన్లు: 120బి రెడ్‌విత్‌ 420 ఐపీసీ, సెక్షన్‌ 9- అవినీతి నిరోధక చట్టం
* స్థాయి: అభియోగాలు నమోదు కాలేదు.

5. సీసీ 25/2013 సీబీఐ కోర్టు, హైదరాబాద్‌ (రఘురాం/భారతి సిమెంట్స్‌ వ్యవహారం)
* సెక్షన్లు: 120బి 420, 107 రెడ్‌విత్‌13(2) రెడ్‌విత్‌ 13(1)(డి) అవినీతి నిరోధక చట్టం
* స్థాయి: అభియోగాలు నమోదు కాలేదు.

6. సీసీ 24/2013 సీబీఐ కోర్టు, హైదరాబాద్‌ (ఇండియా సిమెంట్స్‌)
* సెక్షన్లు: 120బి రెడ్‌విత్‌ 420, 420 ఐపీసీ, సెక్షన్‌ 9, 12 -అవినీతి నిరోధక చట్టం
* స్థాయి: అభియోగాలు నమోదు కాలేదు.

7. సీసీ 12/2013 సీబీఐ కోర్టు, హైదరాబాద్‌ (దాల్మియా సిమెంట్స్‌ వ్యవహారం)
* సెక్షన్లు: 120బి, 420, ఐపీసీ, సెక్షన్‌ 9- అవినీతి నిరోధక చట్టం
* స్థాయి: అభియోగాలు నమోదు కాలేదు.

8. సీసీ 14/2012 సీబీఐ కోర్టు, హైదరాబాద్‌ (వాన్‌పిక్‌ ప్రాజెక్ట్‌ వ్యవహారం)
* సెక్షన్లు: 120బి, 420, 409 ఐపీసీ, సెక్షన్‌ 12- అవినీతి నిరోధక చట్టం
* స్థాయి: అభియోగాలు నమోదు కాలేదు.

9. సీసీ 10/2012 సీబీఐ కోర్టు, హైదరాబాద్‌ (రాంకీ ఫార్మా వ్యవహారం)
* సెక్షన్లు: 120బి, 420, 471 ఐపీసీ, సెక్షన్‌ 9, 12 అవినీతి నిరోధక చట్టం
* స్థాయి: అభియోగాలు నమోదు కాలేదు.

10. సీసీ 9/2012 సీబీఐ కోర్టు, హైదరాబాద్‌ (జగతి పెట్టుబడులు వ్యవహారం)
* సెక్షన్లు: 120బి రెడ్‌విత్‌ 420, 420, 471 ఐపీసీ
* స్థాయి: అభియోగాలు నమోదు కాలేదు.

11. సీసీ 8/2012 సీబీఐ కోర్టు, హైదరాబాద్‌ (హెటిరో, అరబిందో, ట్రైడెంట్‌ ఫార్మా కంపెనీల వ్యవహారం)
* సెక్షన్లు: 120బి రెడ్‌విత్‌ 420 ఐపీసీ, సెక్షన్‌ 12 రెడ్‌విత్‌ 11 – అవినీతి నిరోధక చట్టం
* స్థాయి: అభియోగాలు నమోదు కాలేదు.

ఈడీ కేసులు

1. ఎస్‌సీ 1/2018 – (పెన్నా గ్రూపు నుంచి పెట్టుబడులు)
* సెక్షన్లు: మనీలాండరింగ్‌ నిరోధక చట్టంలోని సెక్షన్‌ 4 రెడ్‌విత్‌ 3
* స్థాయి: అభియోగాలు నమోదు కాలేదు

2. ఎస్‌సీ 2/2018 – (ఇందూటెక్‌ జోన్‌ పెట్టుబడులు)
* సెక్షన్లు: మనీలాండరింగ్‌ నిరోధకచట్టంలోని సెక్షన్‌ 4 రెడ్‌విత్‌ 3
* స్థాయి: అభియోగాలు నమోదు కాలేదు

3. ఎస్‌సీ 2/2017 – (ఇండియా సిమెంట్స్‌ పెట్టుబడులు)
* సెక్షన్లు: మనీలాండరింగ్‌ నిరోధక చట్టంలోని సెక్షన్‌ 4 రెడ్‌విత్‌ 3
* స్థాయి: అభియోగాలు నమోదు కాలేదు.

4. ఎస్‌.సి.92/2016 – (హెటిరో, అరబిందో, ట్రైడెంట్‌ లైఫ్‌ సైన్సెస్‌ ఫార్మా కంపెనీల పెట్టుబడులు)
* సెక్షన్లు: మనీలాండరింగ్‌ నిరోధక చట్టంలోని సెక్షన్లు 3, 4, 8(5)
* స్థాయి: అభియోగాలు నమోదు కాలేదు.

5. ఎస్‌సీ 2/16 – (రాంకీ పెట్టుబడులు)
* సెక్షన్లు: మనీలాండరింగ్‌ నిరోధక చట్టంలోని సెక్షన్‌ 4 రెడ్‌విత్‌ 3
* స్థాయి: అభియోగాల నమోదు పూర్తి కాలేదు.

6. ఎస్‌సీ 106/2015 (జగతి పబ్లికేషన్స్‌లోకి పెట్టుబడులు)
* సెక్షన్లు: మనీలాండరింగ్‌ నిరోధక చట్టంలోని సెక్షన్లు 3, 4, 8(5)
* స్థాయి: అభియోగాలు నమోదు కాలేదు.

7. ఈసీఐఆర్‌ 9/211
* సెక్షన్లు: ఐపీసీ 120బి రెడ్‌విత్‌ 420, 409, 420, 477, సెక్షన్‌ 13(2) రెడ్‌విత్‌ 13(1)(సి)(డి) అవినీతి నిరోధక చట్టం

అభియోగ పత్రం దాఖలు కాలేదు.

జగన్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) 2011లో ఈసీఐఆర్‌ (ఎఫ్‌ఐఆర్‌) 9/హెచ్‌జడ్‌ఒ/2011 కింద కేసు నమోదు చేసింది. దీని ఆధారంగా పది ఫిర్యాదులు దాఖలు చేసింది. ఇందులో ఆరు ఫిర్యాదులను ఈడీ ప్రత్యేక హోదా కలిగిన సీబీఐ కోర్టు విచారణ నిమిత్తం పరిగణనలోకి తీసుకుంది. మరో నాలుగు కోర్టు పరిశీలనలో ఉన్నాయి.

వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి ఎన్నికల అఫిడవిట్‌లో తనపై 31 క్రిమినల్‌ కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు పేర్కొన్నారు. శుక్రవారం కడప జిల్లా పులివెందులలో నామినేషన్‌ దాఖలు సందర్భంగా ఈ వివరాలను ప్రకటించారు.

1 పరువు నష్టం దావా సీసీ 33/2018
విజయవాడ ఎంపీ, ఎమ్మెల్యే కేసుల ప్రత్యేక కోర్టు (8వ అదనపు జిల్లా, సెషన్స్‌ జడ్జి).
* సెక్షన్లు: ఐపీసీ 499, 500, 501, 502 రెడ్‌విత్‌ 34
* స్థాయి: అభియోగాలు ఇంకా నమోదు కాలేదు.

2 ఎఫ్‌ఐఆర్‌ 57/2017
అధికారులను అడ్డుకున్న వ్యవహారానికి సంబంధించి నందిగామ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు.
* సెక్షన్లు: ఐపీసీ 353, 506 రెడ్‌విత్‌ 34
* స్థాయి: కోర్టు ఇంకా విచారణ కోసం పరిగణనలోకి తీసుకోలేదు.

9 ఎఫ్‌ఐఆర్‌ 58/2016
గుంటూరు అర్బన్‌ మంగళగిరి పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు. అనుచిత ప్రవర్తన, వర్గాలను రెచ్చగొట్టడం, రూ.50 నోటును చించడంపై కేసు నమోదు.
* సెక్షన్లు: ఐపీసీ 425, 427, 505(2)రెడ్‌విత్‌ 24
* స్థాయి: కోర్టు ఇంకా విచారణ నిమిత్తం పరిగణనలోకి తీసుకోలేదు.

10 ఎఫ్‌ఐఆర్‌ 45/2016
గుంటూరు-పొన్నూరు పోలీసుస్టేషన్‌లో పరువు నష్టం దావా కేసు.
* సెక్షన్లు: ఐపీసీ 500, 501
* స్థాయి: కోర్టు ఇంకా విచారణ నిమిత్తం పరిగణనలోకి తీసుకోలేదు.
11 సీసీ 377/2014
నల్గొండ జిల్లా కోదాడ జ్యుడీషియల్‌ మొదటి తరగతి మేజిస్ట్రేట్‌ కోర్టు.
* సెక్షన్లు: సెక్షన్‌ 188, 341 ఐపీసీ, పోలీసుయాక్టు సెక్షన్‌ 30
* స్థాయి: అభియోగాల నమోదు ప్రక్రియ కాలేదు.

12 ఎఫ్‌ఐఆర్‌ 861/2013
హైదరాబాద్‌, సరూర్‌నగర్‌ పోలీసుస్టేషన్‌.
* సెక్షన్లు: 3: జాతీయగీతాన్ని ఆలపించడంలో అమర్యాద
* స్థాయి: విచారణ నిమిత్తం కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు
13 ఎఫ్‌ఐఆర్‌ 137/2011
కడప జిల్లా పులివెందుల పోలీసుస్టేషన్‌
* సెక్షన్లు: సెక్షన్‌ 147, 148, 114, 186, 188, 440, 286, 283, 355, 341, 290, 342, 427, 506 ఐపీసీ, ప్రజాఆస్తుల ధ్వంసం చట్టం సెక్షన్‌ 3.

Leave a Reply

Your email address will not be published.

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)