ఆ ఆలయాలకు ద్వారబంధాలు ఉండవు

అక్కడ ఉండేవి ఆలయాలే కాని నిత్యధూపదీప నైవేద్యాలు, పూజలు ఉండవు కానీ అమ్మవారి ప్రతిమలు ఉంటాయి. వైవిధ్యభరితంగా కనిపించే ఆ ఆలయాలే మత్స్యకారులు కొలిచే దేవతల ఆలయాలు. సాధారణంగా గ్రామ దేవతల ఆలయాలలో ఎక్కువ శాతం నిత్య ధూపదీపనైవేద్యాలు ఉండకపోయినా భద్రత ఉంటుంది. ఆలయాలకు తలుపులు, చుట్టూ ప్రహరీ గోడలు ఉంటాయి. వాటిలో విగ్రహాలకు ఖచ్చితమైన రూపురేఖలు ఉంటాయి కానీ ఇక్కడ అవేమి కనిపించవు. మత్స్యకారులు మనస్సులోనే అమ్మను తలచుకుంటూ ఆమెపై భారం వేసి జీవనోపాధికి వెళుతుంటారని చెబుతున్నారు. తీరప్రాంత గ్రామాలలో మాత్రమే కనిపించే ఈ ఆలయాలు ఎంతో విశిష్టతను కలిగి ఉంటాయి. నిత్యం ప్రాణాలను ఫణంగా పెట్టి సముద్రంపై చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు తమ తమ ఇష్టదైవాలైన అమ్మవార్లకు మొక్కుకుని వేటకు వెళుతుంటారు. దానికి అనువుగా నిర్మించుకున్న ఆలయాలు చూసేవారికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి.
*వైవిధ్యభరిత ఉత్సవాలు
ఈ ఆలయాలని విచిత్రంగా కనిపిస్తాయి చిన్నచిన్న ఆలయాలుగా ఉండి ఒకే చోట రెండు నుంచి ఐదేసి ఆలయాలు వరుసగా నిర్మించి ఉంటాయి. ఆలయాలపై ఎటువంటి కళాకృతులు ఉండవు ముఖమండపాలు అసలే కనిపించవు. వాటిలో దేవతామూర్తుల ప్రతి రూపాలు వైవిధ్యభరితంగా ఉంటాయి. కొన్ని విగ్రహాలు అమ్మవారి రూపాలతో ఉండగా కొన్ని విచిత్ర రూపాలలో ఉండి ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. వివిధ ఆకృతులలో ఉన్న చెక్కతో తయారు చేసిన విగ్రహాలు కనిపిస్తాయి.
*తలుపులు ఎందుకు ఉండవంటే..!
ఏ ఆలయానికి ద్వారబందాలు తప్ప తలుపులు కానరావు. సాగరంలో జీవనపోరాటం చేస్తున్న తమకు ఎప్పుడు ఎదురుగా కనిపించే విధంగా ప్రతి ఆలయం సముద్రతీరానికి అతి దగ్గరలో సముద్రం వైపుకు ముఖం ఉండేలా (సముద్రంలోంచి చూస్తే అమ్మవారు కనిపించేలా) నిర్మించి ఉంటాయి. అమ్మవారు ఎప్పుడు తమకు అండగా ఉండాలని ఆలయాలకు తలుపులు వేయడంవల్ల ఆమెను బంధించినట్లుగా భావించే మత్స్యకార పూర్వీకులు ఈవిధంగా ఆలయాలకు తలుపులు వేసేవారు కాదని మత్స్యకార పెద్దలు చెబుతున్నారు. అర్ధరాత్రి వేటకు వెళ్లే మత్స్యకారులు వలలు ఇతర సామగ్రితో చేతులు ఖాళీ లేకుండా వెళుతుండడం వల్ల తలుపులు తీయడం వీలు కుదరదు కాబట్టి అమ్మవార్లకు మొక్కుకునే విధంగా ఎప్పుడు అమ్మవార్లు ఎదురుగా కనిపించాలనే ఉద్ధేశ్యంతోనే తలుపులు ఏర్పాటు చేయరని, ఇది పూర్వం నుంచి వస్తున్న ఆచారమని మత్స్యకారులు చెబుతున్నారు.
*అమ్మవార్ల పేర్లు
సాధారణంగా మత్స్యకారులు భాగిర్తమ్మ, బంగారమ్మ, గంగమ్మ, కాశిమ్మ, పోలేరమ్మ, చినతల్లి, పెదతల్లి వంటి పేర్లతో పిలుచుకుంటారు. ఇవే పేర్లు మత్స్యకారులు తమ పిల్లలకు పెడుతుంటారు.
*ఉత్సవాలూ వైవిధ్యభరితమే
సాధారణంగా గ్రామదేవతల ఆలయాలలో ఎక్కువ శాతం వారానికి ఒకసారైనా సాధారణ పూజలు చేస్తుంటారు. కానీ ఈ ఆలయాలలో దేవతలకు మాత్రం ఏడాదికి ఒకసారి అత్యంత వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. కఠినమైన నియమనిష్టలతో ఉపవాసాలు ఉండి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి అగ్నిగుండాలు తొక్కడం వంటి కార్యక్రమాలు వైభవంగా నిర్వహిస్తారు. మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల సందర్భంగా ఆలయాలను సుందరంగా తీర్చిదిద్ది ధూపదీపనైవేద్యాలు సమర్పిస్తారు. సముద్ర తీరంలో ప్రత్యేక ఆచారాలతో పూజలు నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం ఉగాదికి ముందు రోజున వచ్చే ఫాల్గుణ బహుళ అమావాస్య అంటే కొత్త అమావాస్యరోజున ఈ అమ్మవార్లకు మత్స్యకారులు పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తారు.
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఏప్రిల్‌ 14న శ్రీరామ నవమి ఆస్థానం, 15న శ్రీరామ పట్టాభిషేకం మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించనున్నట్లు తితిదే తెలిపింది. ఆస్థానం సందర్భంగా 14వ తేదీ రాత్రి 7 నుంచి 9 గంటల వరకు శ్రీమలయప్పస్వామి హనుమంత వాహనంపై తిరువీధుల్లో విహరించనున్నారు. వేకువజామున ఆలయంలో సుప్రభాతం సేవ అనంతరం తోమాలసేవ, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహిస్తారు. రంగనాయకుల మండపంలో ఉదయం 9 నుంచి 11 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామివారికి, శ్రీసీతారామలక్ష్మణ హనుమంతుల ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం ఉంటుంది. రాత్రి 10 నుంచి 11 గంటల మధ్య బంగారువాకిలి ఎదుట శ్రీరామనవమి ఆస్థానం ఉంటుంది. 15న రాత్రి 8 గంటలకు బంగారువాకిలి చెంత ఆలయ అర్చకులు శ్రీరామ పట్టాభిషేక మహోత్సవాన్ని కళ్లకుకట్టేలా ప్రదర్శిస్తారు. ఈ వేడుకల కారణంగా 14న వసంతోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలను, 15న వసంతోత్సవ సేవలను రద్దు చేస్తున్నట్లు తితిదే వెల్లడించింది.
1. ఓం శ్రీ గురుభ్యోనమః
పంచాంగం 24-3-2019
ఆదివారం (భాను వాసరే)
శ్రీ విళంబి నామ సంవత్సరం
ఉత్తరాయనం
శిశిరఋతువు
ఫాల్గుణమాసం
బహుళపక్షం
తిధి. : చవితి రా1:04 తదుపరి పంచమి
నక్షత్రం:స్వాతి ఉ11:24తదుపరి విశాఖ
యోగం :హర్షణం
కరణం :బవ
సూర్యోదయం. :6:07
సూర్యాస్తమయం. :6:05
రాహుకాలం. :సా 4:30-6:00
యమగండం. : మ12:00-1:30
అమృత ఘడియలు. :పగలు లేదు
వర్జ్యం :సా4:56 – 6:38
దుర్ముహూర్తం:సా4:31 – 5:19
2. తిరుమల సమాచారం
ఓం నమో వేంకటేశాయ
ఈరోజు ఆదివారం *24-03-2019* ఉదయం *5* గంటల సమయానికి.
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ ……శ్రీ వారి దర్శనానికి *24* కంపార్ట్ మెంట్ ల లో వేచి ఉన్న భక్తులు…
శ్రీ వారి సర్వ దర్శనానికి *16* గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ (300/-) దర్శనానికి, కాలినడక భక్తులకు, టైమ్ స్లాట్ సర్వ దర్శనానికి *04* గంటల సమయం పడుతోంది.. నిన్న మార్చి *23* న *83,270* మంది భక్తులకు శ్రీవారి ధర్శనభాగ్యం కలిగినది. నిన్న స్వామి వారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు కానుకలు *₹:2.90* కోట్లు.
3. శుభమస్తు
తేది : 24, మార్చి 2019
సంవత్సరం : విళంబినామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : ఫాల్గుణమాసం
ఋతువు : శిశిర ఋతువు
కాలము : శీతాకాలం
వారము : ఆదివారం
పక్షం : కృష్ణ (బహుళ) పక్షం
తిథి : చవితి
(నిన్న రాత్రి 10 గం॥ 38 ని॥ నుంచి
ఈరోజు రాత్రి 8 గం॥ 57 ని॥ వరకు)
నక్షత్రం : స్వాతి
(నిన్న ఉదయం 9 గం॥ 9 ని॥ నుంచి
ఈరోజు ఉదయం 7 గం॥ 44 ని॥ వరకు)
యోగము : హర్షణము
కరణం : బవ
వర్జ్యం : (ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 11 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 2 గం॥ 44 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (నిన్న రాత్రి 11 గం॥ 27 ని॥ నుంచి ఈరోజు తెల్లవారుజాము 0 గం॥ 57 ని॥ వరకు)(ఈరోజు రాత్రి 10 గం॥ 31 ని॥ నుంచి మర్నాడు తెల్లవారుజాము 0 గం॥ 4 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు సాయంత్రం 4 గం॥ 49 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 5 గం॥ 37 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు సాయంత్రం 4 గం॥ 55 ని॥ నుంచి ఈరోజు రాత్రి 6 గం॥ 26 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు సాయంత్రం 3 గం॥ 24 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 4 గం॥ 55 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు ఉదయం 12 గం॥ 21 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 52 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 6 గం॥ 17 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 27 ని॥ లకు
సూర్యరాశి : మీనము
చంద్రరాశి : తుల
4. చరిలో ఈ రోజు/మార్చి 24
1603 : 44 సంవత్సరాలు పాలించిన బ్రిటిషు మహారాణి ఎలిజబెత్ మరణం.
1775 : భారత దేశానికి చెందిన ప్రముఖ కవి, రచయిత,వాగ్గేయకారుడు ముత్తుస్వామి దీక్షితులుజననం(మ.1835)
1882 : క్షయ వ్యాధికి కారణమైన మైకోబాక్టీరియా ట్యుబర్‌క్యులాసిస్ ని రాబర్ట్ కోచ్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు.
1977 : భారత ప్రధానమంత్రిగా మొరార్జీ దేశాయ్ నియమితుడైనాడు.
1984 : భారత హాకీ క్రీడాకారుడు ఆడ్రియన్ డీసౌజా జననం.
1896 : చరిత్రలో మొదటి రేడియో ప్రసార సంకేతాలను ఎ.ఎస్.పోపోవ్ సృష్టించాడు.
1998 : భారత లోక్‌సభ స్పీకర్‌గా జి.యమ్.సి.బాలయోగి పదవిని స్వీకరించాడు.
2008 : ఆరవ వేతన సంఘం (కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీత భత్యాల సవరణకోసం ఏర్పాటు చేసిన సంఘం), తన నివేదికను ఈ రోజున ఆర్ధిక శాఖామంత్రికి సమర్పించింది
5. బాహుబలి (గోమఠేశ్వరుడు)
జైన సంప్రదాయంలో ప్రధానమైన దేవతలను తీర్థంకరులు అంటారు. వారు ఇరవైనాలుగుమంది. వీరిలో మొదటి తీర్థంకరుడు ఋషభనాథుడు. ఇతడే జైనమత స్థాపకుడు. ఇతనికి ఇద్దరు కుమారులు. వారు భరతుడు, బాహుబలి. చక్రవర్తి అయిన ఋషభనాథుడు తన రాజ్యాన్ని పెద్ద కుమారుడైన భరతునికిచ్చి తాను తపస్సు చేసుకోవడానికి అడవులకు వెళ్లిపోయాడు. అప్పటికే బాహుబలి పోదనపురానికి రాజుగా ఉన్నాడు.భరతుని బహురాజ్యకాంక్షతో అన్ని రాజ్యాలనూ జయిస్తూ వచ్చాడు. కానీ బాహుబలి అతనికి లొంగకుండా యుద్ధం చేశాడు. యుద్ధంలో బాహుబలి విజయం సాధించాడు కానీ, విరక్తుడై భరతుడికి తన రాజ్యాన్ని ఇచ్చివేసి తాను నిలుచునేంత స్థలాన్ని దానంగా పొంది కాయోత్సర్గవిధిలో తపస్సు చేస్తూ నిలుచున్నాడు.(నిటారుగా నిలుచుని రెండు చేతులనూ రెండు వైపులా సమానంగా కిందకు చాపి కదలిక లేకుండా నిలుచోవడమే కాయోత్సర్గం.) ఆ తర్వాత ఈయనకు గోమఠేశ్వరుడు అనే పేరు వచ్చింది.కర్ణాటకలో హాసన్‌ జిల్లాలో ఉన్న శ్రావణబెళగొళలో గోమఠేశ్వరుడి అరవై అడుగుల అద్భుతమైన విగ్రహం చెక్కబడి ఉంది. ఈ విగ్రహాన్ని క్రీస్తుశకం 974 – 984 మధ్యలో గంగరాచమల్లుని దండనాయకుడైన చావుండరాయుడు చెక్కించాడు. ఈ విగ్రహాన్ని మలచిన విధానంలో ఒక విశేషం ఏమిటంటే ఇంద్రగిరి కొండనే విగ్రహంగా మలిచారు. కొండ పైనుంచి కిందికి చెక్కుకుంటూ వచ్చారు.మరో విశేషమేమిటంటే విగ్రహం పాదపీఠం దగ్గర ఒక కొలబద్దను చెక్కారు. అది మూడు అడుగుల నాలుగు అంగుళాల కొలతను చూపిస్తోంది. దీనికి పద్దెనిమిది రెట్లు అంటే అరవై అడుగుల విగ్రహం ఉంది. దిగంబరంగా ఉన్న విగ్రహంలో గోమఠుడి శరీరానికి తీగలు అల్లుకుని ఉంటాయి. ఈ మూర్తికి జరిగే మహామస్తకాభిషేకం జగద్విఖ్యాతి కలిగింది. ఏటా జైనులు ఈ గోమఠేశ్వరుడి దర్శనానికి పెద్ద సంఖ్యలో శ్రావణ బెళగొళను సందర్శిస్తారు.
6. తిరుపతి స్విమ్స్‌ కి రూ.6.22 కోట్ల విరాళాలు
తిరుపతి స్విమ్స్‌ ఆసుపత్రిలో తితిదే ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకానికి రూ.6,22,51,000ల విరాళాలను దాతలు అందించారు. శనివారం స్విమ్స్‌ సంచాలకులు డాక్టర్‌ టి.ఎస్‌.రవికుమార్‌ను కలిసిన ముంబయికి చెందిన వైఠల్‌ ల్యాబొరేటరీస్‌, వైఠల్‌ లైఫ్‌ కేర్‌ అధిపతి రాజీవ్‌బజాజ్‌ రూ.5 కోట్లను విరాళంగా అందించారు. అదే నగరానికి చెందిన లలిత్‌సేథీ కుటుంబం రూ.కోటిని విరాళంగా అందించింది. వీరితోపాటు తమిళనాడు రాష్ట్రం అరక్కోణం నగరానికి చెందిన ప్రజ్‌ సిమెంట్‌ క్యారీసన్‌ ఎల్‌ఎల్‌పీ కంపెనీ ప్రతినిధి ప్రభుప్రకాష్‌ రూ.20 లక్షలు, ముంబయి నగరానికి చెందిన ఫిన్‌మేర్‌ అడ్వైజరీ కంపెనీ డైరెక్టర్‌ యాశిష్‌ రూ.2.51 లక్షలు విరాళంగా అందజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)