నెమలిలో ముగిసిన బ్రహ్మోత్సవాలు

కృష్ణాజిల్లాలో ప్రసిద్ద పుణ్య క్షెత్రమైన గంపలగూడెం మండలం నేమలిలోని వేణుగోపాలస్వామీ ఆలయంలో ఆదివారం స్వామివారికి శ్రీ పుష్పయాగం వైభవంగా నిర్వహించారు.వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆరోరోజైన ఆదివారం ఉదయం స్వామివారి మూలవిరాట్ కు అభిషేకాలు పుష్పాభిషేకం విశేచార్షణలు చేశారు. పది గంటల నుంచి యాగశాలలో ప్రధానార్చకులు టీ.గోపాలాచార్యులు ఆద్వర్యంలో రుత్విక బృందం రుక్మిణీ సత్యభామ సామెత వేణుగోపాల స్వామీ ఉత్సవ విగ్రహాలకు అభిషేకం, శ్రీపుష్పయాగం నిర్వహించారు. దీనికి అవసరమైన పుశాపాలను గ్రామానికి చెందిన కావూరి నాగభూషణం, భారతమ్మ దంపతులు వితరంగా అందించారు. గులాబీ, తామర, కలువ, లిల్లీ, చామంతి, మల్లె, సంపంగీ, కనకాంబరం, మరువం, తులసీ దళాలతో యజ్ఞశాలలో ఉత్సవ విగ్రహాలకు సమర్పించారు. వేడుకలో ఉభయదాతలు, వివిధ గ్రామాలకు చెందిన భక్తులు పాల్గొన్నారు. శ్రీకృష్ణపరమాత్మను ఆరాధిస్తూ భక్తులు భక్తిగీతాలు ఆలపించారు. ప్రసాదాలను స్వామికి నివేదించి పంపిణీ చేశారు. ఆలయ కమిటీ అధ్యక్షులు మైలవరపు రామాంజనేయులు, ఈవో జె.వినోద్‌కుమార్‌, ఎంపీటీసీ సభ్యులు వడ్లవడి వెంకట్రావు, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.
1. బోనమో మల్లన్న
జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం పెద్దాపూర్‌ మల్లన్న జాతరను పురస్కరించుకొని ఆదివారం భక్తులు పోటెత్తారు. మల్లన్న స్వామికి సుమారు 30 వేలకు పైగా బోనాలను సమర్పించారు. ఉమ్మడి కరీంనగర్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, వరంగల్‌ జిల్లాలతో పాటు మహారాష్ట్ర నుంచి భక్తులు తరలివచ్చి బోనాలతో ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. స్వామి వారికి రథోత్సవం నిర్వహించగా, భక్తులు అధిక సంఖ్యలో స్వామిని దర్శించుకున్నారు.
2. శ్రీవారికి రూ.1.11 కోట్ల రిలయన్స్‌ విరాళం
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారికి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ కంపెనీ రూ.1,11,11,111 విరాళాన్ని సమర్పించింది. కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టరు పీఎంఎస్‌ ప్రసాద్‌ ఆదివారం శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మందిరంలోని రంగనాయకుల మండపంలో తిరుమల జేఈవో శ్రీనివాసరాజుకు విరాళానికి సంబంధించిన డీడీలను అందజేశారు. ఈ మొత్తాన్ని ప్రాణదానం ట్రస్టు కింద జమచేయాలని కోరారు.
3. విడాకుల ఆలయం
అవును… ఆ గుడి పేరే డైవర్స్‌ టెంపుల్‌. జపాన్‌లో ఉన్న ఈ ఆలయం అసలు పేరు ‘షోకోజాన్‌ టోకీజీ’… అందమైన తోటలో, ప్రశాంతమైన వాతావరణం మధ్య ఉండే ఈ ఆలయంలోకి అడుగు పెడితే చాలు మనసులోని ఒత్తిడి మటుమాయం అవుతుంది. ప్రకృతితో మమేకమైనట్లు అనిపిస్తుంది. అలాంటి ఈ ఆలయానికి ఈపేరు రవాడానికి ప్రాచీన కథ ఒకటి ఉందంటారు అక్కడివారంతా…
షోకోజాన్‌ టోకీజీ అంటే జపనీయులు పరిభాషలో ఎన్‌కిరి-డెరా… అంటే అనుబంధాలను తెంచడం అని అర్థం. 12వ శతాబ్దంలో జపాన్‌ దంపతుల్లో భర్త, భార్యతో విడిపోవాలనుకుంటే ‘నేను విడిపోతున్నా…’ అంటే చాలు. అతడికి భార్య నుంచి విడిపోయే అధికారం ఉండేదట. అదే భార్య విషయంలో అయితే విడాకుల తంతు పూర్తవడానికి మూడేళ్లు పట్టేది. ఆ మూడేళ్ల పాటు భర్త నుంచి విడిపోవాలనుకున్న భార్యలు, తమ భర్తలకు దూరంగా ఈ ఆలయంలో ఉండేవారట. అలా ఆలయం వారికి బసగా మారింది. అంతేకాదు… అప్పటి రాణులు లేదా రాజులు ఆ ఆలయంలో ఉండే మహిళలకు సదుపాయాలన్నీ ఉచితంగా అందించేవారు. విడిపోవాలంటే అక్కడ ఉండే ప్రాంతం కాబట్టి, ఆ ఆలయానికి విడాకుల ఆలయం అనే పేరు స్థిరపడింది. కొన్ని శతాబ్దాలుగా ఈ ఆలయానికి సందర్శకులు వస్తూనే ఉన్నారు. దీంతో అక్కడి ప్రభుత్వం దీన్ని పర్యటక ప్రాంతంగా తీర్చిదిద్దింది.
4. భద్రాద్రి రామయ్యకు వైభవంగా పూజలు
భద్రాచలం రామాలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుప్రభాత సేవ ఘనంగా నిలవగా అర్చకులు ఆరాధించి అభిషేక మహోత్సవాన్ని కొనసాగించారు. ఇందులో పాల్గొనేందుకు పరిమిత సంఖ్యలో భక్తులకు ప్రవేశం ఉండటంతో ఉదయమే కోవెల వద్దకు చేరుకుని తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అభిషేకంలో పాల్గొన్న వారు స్వామి వైభవాన్ని కళ్లార వీక్షించి జైశ్రీరామ్‌ అంటూ నీరాజనాలు అందించారు. మూల విరాట్‌కు బంగారు పుష్పాలతో అర్చన చేయడంతో వీక్షించి పులకించిపోయారు. వారానికి ఒక్కసారి ఉండే క్రతువు కావడంతో విశేష సంఖ్యలో తరలి వచ్చి దేవదేవుడ్ని దర్శించుకున్నారు. క్షేత్ర విశిష్టత పరమానందం కలిగించగా వైష్ణవ సంప్రదాయం ప్రకారం విష్వక్సేన పూజ చేసి పుణ్యాహ వాచనం కొనసాగించి కంకణాల ధారణను కడు రమణీయంగా నిర్వహించారు. వధూవరుల గోత్ర నామాలను చదివి ప్రవరను పఠించి సీతమ్మకు యోక్త్రాన్ని రామయ్యకు యజ్ఞోపవీతాన్ని ధరింపచేశారు. మంగళ వాయిద్యాలు మార్మోగుతుండగా మాంగళ్య ధారణ మంత్రముగ్ధమైంది. తలంబ్రాల వేడుక ఆనందడోలికల్లో ముంచెత్తింది. అర్చకులు నిత్య కల్యాణ క్రతువు గురించి వివరిస్తుండగా దీనికి అనుగుణంగా కల్యాణం కనులకు పండుగగా కనిపించింది. దర్బారు సేవ తన్మయత్వంలో ముంచెత్తింది.
5. శుభమస్తు
తేది : 25, మార్చి 2019
సంవత్సరం : విళంబినామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : ఫాల్గుణమాసం
ఋతువు : శిశిర ఋతువు
కాలము : శీతాకాలం
వారము : సోమవారం
పక్షం : కృష్ణ (బహుళ) పక్షం
తిథి : పంచమి
(నిన్న రాత్రి 8 గం॥ 58 ని॥ నుంచి
ఈరోజు రాత్రి 8 గం॥ 6 ని॥ వరకు)
నక్షత్రం : విశాఖ
(నిన్న ఉదయం 7 గం॥ 45 ని॥ నుంచి
ఈరోజు ఉదయం 7 గం॥ 5 ని॥ వరకు)
యోగము : వజ్రము
కరణం : కౌలవ
వర్జ్యం : (ఈరోజు ఉదయం 11 గం॥ 7 ని॥ నుంచి ఈరోజు ఉదయం 12 గం॥ 43 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (నిన్న రాత్రి 10 గం॥ 31 ని॥ నుంచి ఈరోజు తెల్లవారుజాము 0 గం॥ 4 ని॥ వరకు)(ఈరోజు రాత్రి 8 గం॥ 48 ని॥ నుంచి ఈరోజు రాత్రి 10 గం॥ 24 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 12 గం॥ 45 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 33 ని॥ వరకు)(ఈరోజు సాయంత్రం 3 గం॥ 12 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 4 గం॥ 0 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు ఉదయం 7 గం॥ 47 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 18 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 52 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 3 గం॥ 23 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు ఉదయం 10 గం॥ 50 ని॥ నుంచి ఈరోజు ఉదయం 12 గం॥ 21 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 6 గం॥ 16 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 27 ని॥ లకు
సూర్యరాశి : మీనము
చంద్రరాశి : వృచ్చికము
6. చరిత్రలో ఈ రోజు/మార్చి 25
శని గ్రహ ఉపగ్రహం టైటాన్
1655 : శని గ్రహం యొక్క అతిపెద్ద ఉపగ్రహం అయిన టైటాన్ ను క్రిస్టియాన్ హైగెన్స్ కనుగొన్నాడు.
1914 : అమెరికా వ్యవసాయ శాస్త్రవేత్త నార్మన్ బోర్లాగ్ జననం.
1927 : పాండిచ్చేరి రాష్ట్రానికి 13 వ ముఖ్యమంత్రి పి.షణ్ముగం జననం.(మరణం.2013)
1983 : తెలుగు పాత్రికేయుడు మణికొండ చలపతిరావు మరణం.
1992 : మిర్ అంతరిక్ష కేంద్రములో 10 నెలలు గడిపిన ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త సెర్జీ క్రికాలేవ్ భూమి పైకి చేరారు.
2008 : పాకిస్థాన్ కొత్త ప్రధానమంత్రిగా సయ్యద్ యూసఫ్ రజా గిలానీ ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలు చేపట్టాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)