పోలింగ్ పూర్తయిన శాసనమండలి స్థానాలకు మంగళవారం ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఈనెల 22న మూడు స్థానాలకు పోలింగ్ పూర్తయిన విషయం తెలిసిందే. మొత్తం 33 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గంలో 59.03 శాతం పోలింగ్ నమోదైంది. వరంగల్-ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయుల నియోజకవర్గంలో 89.25 శాతం, మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్- కరీంనగర్ ఉపాధ్యాయుల నియోజకవర్గంలో 83.54 శాతం పోలింగ్ నమోదైంది. పట్టభద్రుల స్థానం, ఒక ఉపాధ్యాయ మండలి స్థానానికి కరీంనగర్లో ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. మరో ఉపాధ్యాయ మండలి స్థానానికి లెక్కింపు నల్గొండలో చేపట్టనున్నారు. మంగళవారం ఓట్ల లెక్కింపు అనంతరం ఫలితాలను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపనున్నారు. లోక్సభ ఎన్నికల నిబంధనావళి అమలులో ఉన్నందున సీఈసీ అనుమతి ఇచ్చాకే ఫలితాలు విడుదలవుతాయి. ఈ నేపథ్యంలో మంగళవారం ఫలితాలను అధికారంగా ప్రకటించే అవకాశాలు లేనట్లు తెలుస్తోంది.
