గృహంలో ఆఫీసు రూం ఏ దిక్కున ఉండాలి

ఇప్పటి కాలంలో ఎక్కడ చూసినా ఆఫీసు కట్టడాలు ఎక్కువైపోతున్నాయి. రోజూ ఇంట్లో నివాసం ఉండడం కంటే ఆఫీసులోనే ఎక్కువ సమయం గడిపేస్తున్నారు. అలాంటప్పుడు ఆఫీసు కట్టడం వాస్తుప్రకారం నిర్మించాలని పండితులు చెప్తున్నారు. కొందరిలో ఈశాన్యం గదిలో ఆఫీసు పెట్టుకొని వాడొచ్చా.. లేదా వాయవ్యం గదినే వాడాలా.. అని తెలియక సతమతమవుతున్నారు. అలాంటి వారి కోసం..
ఇంట్లో నివాసంతో పాటు ఆఫీసు ఏర్పాటు చేసుకుని జీవించే పద్ధతి చాలామందికి అవసరం పడుతుంది. ప్రధానంగా లాయర్లు ఉపాధ్యాయులు, రాజకీయ నాయకులకు. గృహం-జీవన వృత్తి ఒకేచోట సాగించాలని అనుకుంటే ఇంటి నిర్మాణం ప్లానులోనే అందుకు అనుగుణంగా ఆఫీసు గది, విజిటర్స్ గది విభజనం చేసుకోవాలి.వృత్తిని ఉత్తరం వైపు గృహ జీవనం దక్షిణం వైపు, వచ్చేలా గదుల విభజన చేసుకోవాలి. తూర్పు ద్వార నుండి గృహానికి ఉత్తరం ద్వారం వ్యాపార వ్యవహారానికి వాడుకోవాలి. ఏదీ మరో దానిని విభేదించకుండా మీరు ఈశాన్యం గది సాధారణ డ్రాయింగ్ రూముగా వాడుకుని ఉత్తరం మధ్యలో కానీ వాయవ్యం గదిని కానీ ఆఫీసుగా వాడుకోండి. అప్పుడు మీకు అనుకూలంగా ఉంటుంది. గృహం-వృత్తి పనులకు ఇబ్బందులు ఏర్పడవు.
1. తిరుమల శ్రీవారికి ఉదయమే మధ్యాహ్న నైవేద్యం
కలియుగ ఆరాధ్య దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి నైవేద్యం విషయంలో ఏపీ ప్రభుత్వం మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. ప్రతి సోమవారం మధ్యాహ్న వేళ సమర్పించే నైవేద్యాన్ని ఉదయం ఏడు గంటలకు మార్చింది. దీంతో అప్పటి నుంచి రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో జరిగే నైవేద్యం వరకూ స్వామివారిని 13 గంటలపాటు పస్తు ఉంచుతున్నారు. తిరుమల ఆలయంలో ఉదయం వీవీఐపీ బ్రేక్‌ దర్శనాలకు వచ్చే వారి సంఖ్య ఇటీవల కాలంలో ముఖ్యంగా సోమవారం బాగా పెరిగిపోతోంది. దీంతో ఎల్‌–2, ఎల్‌–3 దర్శనాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు శ్రీవారి నైవేద్యం వేళలో కీలక మార్పులు చేస్తూ ఆదివారం ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆదేశాలు సోమవారం నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. అలాగే ప్రతి సోమవారం స్వామి వారికి మధ్యాహ్న నేవైద్యాన్ని ఉదయం ఏడు గంటలకే పూర్తిచేయాలని అర్చకులను ఆదేశిస్తూ ఆ ఉత్తర్వులో తెలిపింది.
*ఈ నిర్ణయంపై హిందూ మత ప్రచారకులు మండిపడుతున్నారు. ఇది స్వామి వారికి మహా అపచారం చేయడమే అవుతుందని హెచ్చరిస్తున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో తెల్లవారుజామున సుప్రభాత సేవ మొదలు రాత్రి పవళింపు సేవ వరకు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో స్వామివారికి నైవేద్యం సమర్పణ ఉంటుంది. దీనిని త్రికాల నివేదనగా పిలుస్తుంటారు. ప్రస్తుతం శ్రీవారి ఆలయంలో తెల్లవారుజామున సుప్రభాత సేవ, అర్చన కార్యక్రమాల అనంతరం ఉదయం ఐదున్నర గంటలకు స్వామి వారికి తొలివిడత నైవేద్యం సమర్పిస్తారు. దీనిని ప్రాతఃకాల ఆరాధనగా పిలుస్తారు. తొలి విడత నైవేద్యం అనంతరం వీవీఐపీ బ్రేక్‌ దర్శనాలు కొనసాగుతాయి. రెండో విడతగా మధ్యాహ్నం మళ్లీ నైవేద్యం సమర్పిస్తారు. మూడో విడతగా రాత్రి 8 గంటలకు జరుగుతుంది. వీవీఐపీ కోటా కింద భారీ సంఖ్యలో ఎల్‌–2, ఎల్‌–3 దర్శనాలను మధ్యాహ్నం ఎంతసేపైనా కొనసాగించడానికే ప్రభుత్వం మధ్యాహ్నం నైవేద్యం వేళలలో మార్పులు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
**సోమవారమే ఎందుకంటే..
తిరుమలలో ప్రతి సోమవారం కల్యాణోత్సవ మండపంలో ‘విశేష పూజ’సేవ నిర్వహించాల్సి ఉండటం, అదే రోజు వీవీఐపీ బ్రేక్‌ దర్శనానికి బాగా డిమాండ్‌ ఉండటం వంటి కారణాలతో ప్రత్యేకించి సోమవారం స్వామి వారికి మధ్యాహ్న వేళ సమర్పించే నైవేద్య వేళలో మార్పులు తీసుకొచ్చారని చెబుతున్నారు. అలాగే, ఈ ఒక్కరోజు మాత్రం తెల్లవారుజామున తొలి విడత నైవేద్యం అనంతరం ఎల్‌–1 బ్రేక్‌ దర్శనాలు కొనసాగించి 7 గంటలకు మధ్యాహ్న నైవేద్యం పూర్తిచేసి ఆ తర్వాత ఎల్‌–2, ఎల్‌–3 దర్శనాలను ఎంతసేపైనా కొనసాగిస్తారు. మిగిలిన రోజుల్లో మధ్యాహ్న నైవేద్య కార్యక్రమాలు యథావిధిగానే కొనసాగుతాయి. ప్రభుత్వ తాజా ఆదేశాల కారణంగా ప్రతీ సోమవారం తిరుమలలో స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు ఎక్కువసేపు క్యూలలో వేచి ఉండాల్సి వస్తుందని చెబుతున్నారు.
2. వసంతోత్సవాలతో ఆర్జితసేవల రద్దు
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారికి ఏప్రిల్‌ 17 నుంచి 19 వరకు సాలకట్ల వసంతోత్సవాలు నిర్వహించనున్నట్లు తితిదే తెలిపింది. ఈ వేడుకల నేపథ్యంలో 17న సహస్ర కలశాభిషేకం, 18న తిరుప్పావడ సేవ, 19న నిజపాద దర్శనం సేవలతో పాటు 3 రోజులు కల్యాణోత్సవం, ఊంజలసేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలను రద్దు చేస్తున్నట్లు ఓ ప్రకటనలో వెల్లడించింది.
3. వేములవాడలో వైభవంగా రథోత్సవం
వేములవాడ రాజన్న ఆలయంలో శివకల్యాణోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా నాలుగో రోజు రథోత్సవం కన్నులపండువగా జరిగింది. శ్రీ రాజరాజేశ్వర స్వామి, పార్వతీదేవిని, శ్రీ లక్ష్మీసమేత అనంత పద్మనాభ స్వామివార్ల ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అందంగా అలంకరించి రథంపై కొలువుదీర్చారు. రథాన్ని వివిధ రకాలపుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. డప్పులు, మంగళవాయిద్యాలు, మహిళల కోలాటాల మధ్య, నృత్యాలుచేస్తున్న భక్తుల ఆనందపారవశ్యం మధ్య స్వామిని పురవీధుల గుండా ఊరేగించారు. రథాన్ని లాగేందుకు భక్తులు పోటీపడ్డారు.రథంవద్ద వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు ప్భక్తులు తదితరులు పాల్గొన్నారు.వివిధ పార్టీల రాజకీయ నాయకులుకౌన్సిలర్లువైస్‌చైర్మన్ ప్రతాప రామకృష్ణమున్సిపల్ చైర్ పర్సన్ నామాల ఉమరూరల్ సీఐ రఘుచందర్ గట్టిపోలీస్ బందోబస్తును ఏర్పాటుచేసారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో దూస రాజేశ్వర్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారికి ఆలయ స్థానాచార్యులు భీమాశంకర్ స్వామివారి కండువా కప్పి స్వాగతం పలికారు. వేములవాడ పురవీధులన్నీ శివ నామ స్మరణతో మార్మోగాయి. అవాంచనీయ సంఘటనలు జరుగకుండా డీఎస్పీ వెంకటరమణ ఆధ్వర్యంలో పట్టణ సీఐ శ్రీనివాస్
4. తిరుమల \|/ సమాచారం
ం నమో వేంకటేశాయ!!
ఈ రోజు మంగళవారం
26.03.2019
ఉదయం 5 గంటల
సమయానికి,
తిరుమల: 18C° – 34C°
నిన్న 72,907 మంది
భక్తుల కు కలియుగ దైవం
శ్రీ వేంకటేశ్వరస్వామి వారి
దర్శన భాగ్యం కల్గినది,
స్వామివారి సర్వదర్శనం
కోసం తిరుమల వైకుంఠం
క్యూ కాంప్లెక్స్ లోని 01
గదులలో భక్తులు
వేచియున్నారు,
ఈ సమయం శ్రీవారి
సర్వదర్శనాని కి సుమారు
06 గంటలు పట్టవచ్చును,
నిన్న 25,283 మంది
భక్తులు స్వామి వారికి
తలనీలాలు సమర్పించి
మ్రొక్కు చెల్లించుకున్నారు
నిన్న స్వామివారికి
హుండీలో భక్తులు
సమర్పించిన నగదు
₹: 4.39 కోట్లు,
శీఘ్రసర్వదర్శనం(SSD),
ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్
₹:300/-), దివ్యదర్శనం
(కాలినడక) వారికి శ్రీవారి
దర్శనానికి సుమారుగా
రెండు గంటల సమయం
పట్టవచ్చును,
వయోవృద్దులు మరియు దివ్యాంగుల
ప్రత్యేయకంగా ఏర్పాటు
చేసిన కౌంటర్ ద్వారా
ఉ: 10 గంటలకి (750)
మ: 2 గంటలకి (750)
ఇస్తారు,
చంటి పిల్లల తల్లిదండ్రులు మరియు ఎన్నారై ప్రత్యేక దర్శనాలు
సుపథం మార్గం గుండా శ్రీవారి
దర్శనానికి అనుమతిస్తారు
ఉ: 11 గంటల నుంచి
సాయంత్రం 5 గంటల వరకు
దర్శనానికి అనుమతిస్తారు,
శ్రీవేంకటేశ్వర సుప్రభాతం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)