* తెలంగాణ పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో(3 నియోజకవర్గాల్లో) అధికార TRS ఓటమి దాదాపు ఖరారు?మద్దతు ఇచ్చిన పూల రవీందర్ (నల్గొండ టీచర్స్)ఓటమి. పాతూరు సుధాకర్ రెడ్డి(కరీంనగర్ టీచర్స్)వెనుకంజ. పట్టభద్రుల (కరీంనగర్) నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి ముందంజ -TRS అభ్యర్థి వెనుకంజ
*రాహుల్ పై పోటీగా కాంగ్రెస్ నేత కుమారుడు
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ నేత కుమారుడు బరిలోకి దిగనున్నారు. యుపీకి చెందిన హాజీ సుల్తాన్ ఖాన్ గత డెబ్బై ఎల్లా నుంచి కాంగ్రెస్ పార్టీకి ఏంటో విధేయుడిగా పోటీ చేసినప్పుడు వీరిద్దరిని బలపరుస్తూ నామినేషన్ పత్రాలపై సంతకాలు చేసాడు. కనీ ఆయన కుమారుడు హాజీ హరూన్ రషీద్ ప్రకటించారు. ఎ పార్టీ నుంచి పోటీ చేస్తారన్న విషయం చెప్పలేదు.
*రంగీలా భామ రాజకీయాల్లోకి
సినిమా గ్లామర్ రాజకీయాల్లో కలిసి వస్తుందని ఇప్పటికే చాలా మంది నటీనటులు రుజువు చేసారు. ఇప్పుడు మరో తార పాలిటిక్స్ వైపు చూస్తోంది. వర్మ డైరెక్షన్ లో వచ్చిన రంగీలా మూవీతో పాపులర్ అయిన నటి ఊర్మిలా మతోంద్కర్ కాంగ్రెస్ కండువా కప్పుకోనుంది. ముంబై నార్త్ లోక్ సభ అభ్యర్ధిగా ఊర్మిళను బరిలోకి దింపాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే భాజపాకి కంచుకోట లాంటి ముంబై నార్త్ లో బలమైన అభ్యర్ధిని భావిస్తోంది. ఎన్నికల్లో నిలబడే అధికార ప్రతినిధులు కూడా ఈ విషయం పై ఇంతవరకు స్పందించలేదు. ఊర్మిళ పేరును కాంగ్రెస్ ఆదిస్థానం పరిశీలిస్తోందని ఎ క్షనంలోనైనా ఆమె అభ్యర్దిత్వం ఖరారయ్యే అవకాశముందన్న ప్రచారం జరుగుతోంది. అంతా అనుకున్నట్లు జరిగితే భాజపా సిట్టింగ్ ఎంపీ గోపాల్ శేట్టితో ఊర్మిళ తలపడుతున్నారు. 2004లో నటుడు గోవింద కాంగ్రెస్ టిక్కెట్ పావు పోటీ చేసి.. భాజపా సీనియర్ నేత రాం నాయక్ పై విజయం సాధించారు,. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి సంజయ్ నిరుపమ్ చేతిలో మరోసారి రాం నాయక్ ఓడిపోయారు.
*బోర్డింగ్ పాస్ లపై మోడీ
ఇదెంతో తెలుసా? ఎయిరిండియా విమానం బోర్డింగ్ పాస్. ప్రధాని నరేంద్ర మోడీ, గుజరాత్ సిఎం విజయ్ రూపానీల ఫోటోలున్నాయి. చూశారా? ఏం లేదూ? ఇప్పుడు ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కదా.. అయినా కూడా బోర్డింగ్ పాస్ లపై ఎయిరిండియా ఇలావారి ఫోటోలను వేయడమే ఇప్పుడు విమర్శలకు దారి తీసింది. పంజాబ్ మాజీ డీజీపీ శాసికాంత్ ఈ ఫోటోను త్విట్ చేశారు. మర్చి 25న డిల్లి ఎయిర్ పోర్టులో నా బోర్డింగ్ పాస్ ఇది. ..దాని పై నరేంద్ర మోడీ, వైబ్రాంట్ గుజరాత్ విజయ్ రూపానీల ఫోటోలున్నాయి. వాటి కింద బోర్డింగ్ కు సంబందించిన వివరాలున్నాయి. ఏం చూడనీ, విననీ మాట్లాడాని ఇలాంటి ఎన్నికల సంఘం కోసం మనం ఎందుకో ఇన్ని డబ్బులను వెస్ట్ చేస్తున్నాం. అని ఆయన ట్విట్ చేశారు. అది కాస్తా వైరల్ కావడంతో ఆ బోర్డింగ్ పాసులను వెనక్కు తీసుకుంటున్నట్టు ఎయిర్ ఇండియా ప్రకటించింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించడమే అయితే మోడీ, రూపానీ ఫోటోలను వెంటనే తొలగిస్తామని సంస్థ ప్రతినిధి ధనుంజయ్ తెలిపారు.
*కోవూరు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పవన్ కల్యాణ్…
రాజకీయాలు మార్చడానికే వచ్చానన్నారు. ఒక్కసారి ఆలోచించి మార్పు కోరుకుంటున్న వారికి ఓటు వేయాలని కోరారు.అన్ని కులాలు, మతాలు, ప్రాంతాలకు సమన్యాయం చేయటానికి రాజకీయాల్లోకి వచ్చినట్లు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లా కోవూరులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పవన్.. రాజకీయాలు కొన్ని కుటుంబాలకే పరిమితం కావటం సరికాదన్నారు. నెల్లూరు జిల్లా రాజకీయాలు మార్చాలని వచ్చానన్న పవన్‌కల్యాణ్..ఒక్కసారి ఆలోచించి మార్పు కోరుకుంటున్నవారికి ఓటు వేయాలన్నారు. వైకాపా నేతలు స్వార్థ రాజకీయాలు మానుకోవాలని సూచించిన పవన్‌కల్యాణ్… బీసీలకు అన్యాయం చేసిన తెరాసతో కలిసి జగన్ రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తున్నారని మండిపడ్డారు. అధికారంలోకి వస్తే ఏడాదికి 6 నుంచి 10 సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్న జనసేనానిరాష్ట్రంలోని యువత మార్పు కోరుకుంటోందన్నారు.
*అందుకే వైకాపాలో చేరా?
ఏ పదవీ ఆశించి తానూ వైకాపాలో చేరడం లేదని నటుడు మోహన్ బాబు స్పష్టం చేశారు. జగన్ ముఖ్యమంత్రి అయితే ఏపీ ప్రజలకి మంచి జరుగుతుందని మాత్రమే పార్టీలో చేరాను అని వైకాపాలో చేరిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నిజంగా పదవుల పై మొహం ఉండుంటే పదిహేనేళ్ళ క్రితం రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడే ఎదో ఒక పదవిలో ఉండేవాడినని అన్నారు,.
* కృష్ణా జిల్లా వైసీపీకి షాక్.
పార్టీ సీనియర్ నేత కృష్ణ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు కాజా రాజ్ కుమార్ పార్టీకి రాజీనామా.తన రాజీనామా లేఖను పార్టీ అధినాయకత్వానికి పంపిన రాజ్ కుమార్మైలవరం వైసీపీ అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ చేసే అవమానాలు భరించలేక పార్టీని వీడినట్లు పేర్కొన్న రాజ్ కుమార్..నా లాగ మొదటి నుంచి పార్టీ కి పని చేసిన ఎంతో మంది కార్యకర్తలు నాయకులు అవమానాలు భరిస్తున్నారు .మాకు అవమానాలు తప్ప విలువ లేదు. గత పది నెలలుగా పార్టీ కి దూరంగా ఉన్న పట్టించుకోని అధిష్టానం. లేఖలో పేర్కొన్న రాజ్ కుమార్.రేపు అనుచరులతో సమావేశం కానున్న రాజ్ కుమార్,భవిష్యత్ కార్యాచరణ , పై నిర్ణయం తీసుకునే అవకాశం
* ఏపీపై కేసీఆర్ ఉద్దేశం ఏంటంటే..- లోకేష్
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ రూ.1000 కోట్లు పంపించిందని ఏపీ మంత్రి నారా లోకేష్ ఆరోపించారు. ఏపీలో బలహీన ప్రభుత్వం ఉండాలన్నది కేసీఆర్ ఉద్దేశమని, అందుకే జగన్‌ను అధికారంలోకి తెచ్చి పెత్తనం చేయాలనుకుంటున్నారని మంత్రి విమర్శించారు. మంగళవారం శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో లోకేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రులను రాక్షసులన్న కేసీఆర్ మాటలను ప్రజలు మరువరని అన్నారు.
* కేటీఆర్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ విడుదల
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామరావు లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని రేపట్నుంచి ఉద్ధృతం చేయనున్నారు. ఈ నెల 27 నుంచి ఏప్రిల్ 9వ తేదీ వరకు కేటీఆర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ప్రచారంలో భాగంగా, రోడ్‌షోలు, బహిరంగ సభలు నిర్వహిస్తారు. ఖమ్మం, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, కరీంనగర్, నల్లగొండ, చేవెళ్ల, మల్కాజ్గిరి, సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గాల్లో కేటీఆర్ విస్తృతంగా పర్యటించనున్నారు. 27న రాజన్న సిరిసిల్లలోని ముస్తాబాద్ మండలంలో, 29న ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండలాలతో పాటు కరీంనగర్ పట్టణంలో రోడ్‌షో నిర్వహించనున్నారు. 30న నర్సంపేట, ములుగులో బహిరంగ సభలు, అదే రోజు తాండూరు, వికారాబాద్‌లో కూడా కేటీఆర్ పర్యటించనున్నారు. 31న రాజన్న సిరిసిల్లలోని గంభీరావుపేట మండలం, వికారాబాద్ జిల్లాలోని పరిగి, చేవెళ్లలో పర్యటించనున్నారు కేటీఆర్.
* జగన్ రాజకీయ ముసుగు తొలగిపోయింది- రాజేంద్రప్రసాద్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏపీకి ప్రత్యేక హోదాకు మద్దతు పలకలేదని, వైసీపీ అధ్యక్షుడు జగన్ మాత్రమే కేసీఆర్‌కు మద్దతు పలికారని టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ ఆరోపించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ రాజకీయ ముసుగు తొలగిపోయిందన్నారు. కేసీఆర్‌కు బానిసలా… పెయిడ్ వర్కర్లా జగన్ పనిచేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే… ఏపీకి హోదా ఇస్తామన్న సోనియాను కేసీఆర్ తిట్టిన విషయానని ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ గుర్తుచేశారు. ఏపీకి ప్రత్యేక హోదాను టీఆర్ఎస్ నేతలు వ్యతిరేకించారని, కేసీఆర్ ఆంధ్రా ప్రజలను తిట్టారని రాజేంద్రప్రసాద్ విమర్శించారు.
* జలీల్‌ఖాన్ కూతురి నామినేషన్ ఆమోదం..!
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి. ఆ పార్టీ అభ్యర్థి షబానా ఖాతూన్ నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారి ఆమోదించారు. షబానాకు అమెరికా పౌరసత్వం ఉన్న కారణంగా ఆమె నామినేషన్ తిరస్కరణకు గురయ్యే అవకాశముందని వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. షబానాకు ఎలాంటి విదేశీ పౌరసత్వం లేదని రిటర్నింగ్ అధికారి రాజేశ్వరి నామపత్రాలు చూసి ఖరారు చేశారు. అమెరికా పౌరసత్వం ఉండడంతో తన నామినేషన్ రద్దు చేస్తారని వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజం లేదని అన్నారు షబానా. కాగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో గెలిచి టీడీపీలోకి ఫిరాయించిన జలీల్‌ఖాన్‌పై స్థానికంగా తీవ్ర వ్యతిరేకత ఉంది. ఆ కారణంగానే షబానాను చంద్రబాబు ఎన్నికల బరిలో నిలిపారు.
*కర్నూలు తెదేపాలో మరో షాక్
కర్నూలు జిల్లాలో టీడీపీకి మరో షాక్ నందికొట్కూరు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ బెస్త సాయిజ్యోతి టీడీపీకీ రాజీనామా చేసేందుకు సిద్ధ రేపు అధికారికంగా ప్రకటించనున్న సగణం సాయి జ్యోతి బైరెడ్డిని పార్టీలోకి చేర్చుకునే అంశాన్ని తమతో చర్చించకుండా నిర్ణయం తీసుకున్నారని సాయిజ్యోతి మండిపాటుఈ మేరకు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించున్న బెస్త సగణం సాయి జ్యోతి.
* బీజేపీలో చేరిన అలనాటి స్టార్ హీరోయిన్
ఒకప్పటి అందాల తార జయప్రద బీజేపీ తీర్ధం పుచ్చుకుంది. గతంలో పలు పార్టీలకి పని చేసిన జయప్రద ఎంపీగా కూడా పని చేశారు. తాజాగా ఆమె బీజేపీ కండువా కప్పుకుంది. ఉత్తర ప్రదేశ్‌లోని రామ్‌పుర్ నియోజక వర్గం నుంచి తాను పోటీ చేయనున్నట్టు తెలుస్తుంది. ఎస్పీ నాయకుడు ఆజంఖాన్‌పై జయప్రద పోటీ చేసే చాన్సుంది. ఈ రాంపూర్ నుంచి 2014లో బీజేపీ అభ్యర్థి డాక్టర్ నేపాల్ సింగ్ విజయం సాధించారు. 2004 నుంచి 2014 వరకు ఇదే నియోజకవర్గం నుంచి ఎస్పీ తరఫున జయప్రద ఎంపీగా కొనసాగారు. ఇప్పుడీ స్థానం నుంచి పోటీ చేస్తున్న ఆజంఖాన్‌పై గతంలో ఆమె ఘాటైన వ్యాఖ్యలు కూడా చేశారు. ఆయనను చూస్తుంటే అల్లావుద్దీన్ ఖిల్జీ గుర్తొస్తున్నాడని ఆమె అన్నారు.
*అండమాన్ కమల్ హసన్ పార్టీతో తృణముల్ పొత్తు.
లోక్ సభ ఎన్నికల్లో తృణముల్ కాంగ్రెస్ ప్రముఖ నటుడు కమల్ హసన్ కు చెందిన మక్కల్ నీది మయ్యం పార్టీతో పొత్తు పెట్టుకున్నట్లు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోల్ కతాకు చేరుకున్న కమల్ మమతా బెనర్జీతో దాదాపు గంటపాటు భేటీ అయ్యారు. ఈమేరకు అండమాన్, నికోబార్, దీవుల్లో టీఎంసి అభ్యర్ధిని నిలబెట్టనుండగా తన పార్టీ మద్దతునిస్తుందని కమల్ తెలిపారు. ఈపొత్తు భవిష్యత్తులోనూ కొనసాగుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసారు.
*వైకాపాలో చేరిన మోహన్‌బాబు
సినీ నటుడు, శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల అధినేత మోహన్‌బాబు వైకాపాలో చేరారు. లోటస్‌పాండ్‌లో ఆ పార్టీ అధినేత జగన్‌ను ఆయన మంగళవారం ఉదయం కలిశారు. జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకొన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ వ్యవహారంలో ఇటీవలే అధికార తెదేపా ప్రభుత్వంపై ఆయన విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన వైకాపాలో చేరినట్లు తెలుస్తోంది. గతంలో తెదేపా తరఫున రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన మోహన్‌బాబు కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు.
*అసెంబ్లీకి 3,279 లోక్‌సభకు 472
లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల దాఖలు ఘట్టం సోమవారం సాయంత్రం ముగిసింది. రాష్ట్రంలో 175 అసెంబ్లీ స్థానాలకు 3,279 మంది నామినేషన్లు వేశారు. గుంటూరు జిల్లాలో 17 అసెంబ్లీ స్థానాలకు 370 మంది నామినేషన్లు సమర్పించారు. రాష్ట్రవ్యాప్తంగా సగటున నియోజకవర్గానికి 19 మంది పోటీ చేయడానికి ఆసక్తి చూపారు. కర్నూలు జిల్లాలో నంద్యాల అసెంబ్లీ స్థానానికి 42 మంది నామినేషన్ వేశారు. కడప జిల్లా జమ్మలమడుగులో 39, పులివెందులలో 23 మంది చొప్పున వేశారు. మంగళగిరిలో 37 మంది నామినేషన్ వేశారు. రాత్రి 11.30వరకు దాఖలు కొనసాగుతూనే ఉంది. రంపచోడవరం, తుని, కాకినాడ నగరం, పాతపట్నం నియోజకవర్గాల్లోనూ ఒక్కోచోట 20 మందికి పైగా నామినేషన్ వేశారు.
*పసుపు బోర్డు ఏర్పాటుచేస్తాం
కేంద్రంలో భాజపా ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రాగానే పసుపు బోర్డును ఏర్పాటుచేస్తామని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎన్నికల ప్రణాళిక కమిటీ సభ్యుడు రాంమాధవ్ వెల్లడించారు. పసుపు, ఎర్రజొన్న, చెరకు పంటలకు గిట్టుబాటు ధరలు కల్పిస్తామన్నారు. నిజామాబాద్ ఎంపీ కవిత పసుపు, ఎర్రజొన్న రైతుల సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తెచ్చి ఉంటే సమస్యలు ఎపుడో పరిష్కారమయ్యేవన్నారు.
*రాష్ట్ర కాంగ్రెస్‌కు కొత్త నాయకత్వం
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ లేకుండా చూడాలని కేసీఆర్ కంకణం కట్టుకున్నారని… అది జరిగేపని కాదని కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ ఛైర్పర్సన్ విజయశాంతి అన్నారు. సోమవారం మెదక్‌లో మెదక్ లోక్‌సభ స్థానం కాంగ్రెస్ అభ్యర్థి గాలి అనిల్‌కుమార్ నామినేషన్ కార్యక్రమానికి హాజరైన ఆమె అనంతరం పిల్లల ఉద్యానంలో జరిగిన బహిరంగసభలో మాట్లాడారు. ‘సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకపోతే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేవారా? నేను సిరిసిల్లలో ప్రచారం చేసి గెలిపించకపోతే కేటీఆర్ మంత్రి అయ్యేవారా? తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు అయ్యే వారా’ అని ఆమె ప్రశ్నించారు.
*నాడు నా ఓటమికి అరుణే కారణం
ఇన్నాళ్లు కాంగ్రెస్‌లో ఉంటూ పలువురి ఓటమికి కారణమైన వాళ్లు పార్టీని వీడి కూడా తమ గురించి చెప్పుకోకుండా ఇతరులపై ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందని కేంద్రమాజీ మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి అన్నారు. భాజపాలో చేరడమంటే కళ్లుమూసుకుని గుంతలో పడ్డట్టేనని, మహబూబ్‌నగర్‌లోనే కాదు తెలంగాణలో ఎక్కడా భాజపా ఖాతా తెరవదని మాజీ మంత్రి డీకే అరుణను ప్రస్తావిస్తూ పేర్కొన్నారు. 2014లో కొడంగల్‌లో గుర్నాథ్రెడ్డి ఓటమికి, మహబూబ్‌నగర్ పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా పోటీచేసిన తన ఓటమికి ఆమే కారణమని ఆరోపించారు. సోమవారం మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
*3లోక్‌సభ స్థానాల్లో తెజస పోటీ
రాష్ట్రంలో మూడు లోక్‌సభ స్థానాల్లో తమ పార్టీ తరఫున అభ్యర్థులు బరిలోకి దిగుతున్నట్లు తెజస రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం ప్రకటించారు. హైదరాబాద్ లోక్‌సభ స్థానం నుంచి కవి అబ్బాసీ, మహబూబాబాద్‌లో మహిపతి అరుణ్‌కుమార్, ఖమ్మం నుంచి గోపగాని శంకర్రావు పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు. మిగిలినచోట్ల కాంగ్రెస్ అభ్యర్థులకే మద్దతిస్తున్నట్లు స్పష్టం చేశారు. సోమవారం విలేకరులతో మాట్లాడుతూ ‘‘నా ఇన్నేళ్ల జీవితంలో ఇంతలా కుళ్లిపోయిన రాజకీయాలను ఎన్నడూ చూడలేదు.
*హిమాచల్‌లో భాజపాకు కుదుపు!
లోక్‌సభ ఎన్నికల ముందు హిమాచల్‌ప్రదేశ్‌లో అధికార భాజపాకు గట్టిదెబ్బ తగిలింది. కేంద్ర టెలికాం శాఖ మాజీ మంత్రి సుఖ్రామ్ (93) తన మనుమడు ఆశ్రయ్ శర్మతో సహా సోమవారం తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అంతకుముందు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో దిల్లీలో భేటీ అయ్యారు. సుఖ్రామ్ కాంగ్రెస్‌లో చేరడం ఇది రెండోసారి. టెలికాం కుంభకోణంలో దోషిగా తేలడంతో ఆయనపై 1997లో కాంగ్రెస్ వేటు వేసింది. అయితే 2004లో ఆయన మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరారు.
*ఏపీలోనూ ప్రచారం చేస్తా: దేవేగౌడ
భాజపాను దేశవ్యాప్తంగా నిలువరించేందుకు ఈ ముదిమి వయస్సులోనూ శక్తివంచన లేకుండా శ్రమిస్తానని జనతాదళ్(ఎస్) జాతీయ అధ్యక్షుడు హెచ్.డి.దేవేగౌడ ప్రకటించారు. ఆయన సోమవారం తుమకూరు లోక్‌సభ నియోజకవర్గంలో పోటీ కోసం నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా మాట్లాడారు. ‘భాజపాను ఎదుర్కోవడమే లౌకికశక్తుల ముందున్న ప్రధాన సవాల్. ఈ ప్రయత్నంలో భాగంగా ఏపీలో తెదేపా అధినేత చంద్రబాబు పిలుపుతో అక్కడికీ వెళ్లి ప్రచారం చేస్తా’నని చెప్పారు.
*కాంగ్రెస్ ప్రచార తారలు 40 మంది
రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి 40 మంది ప్రచార తారలను కాంగ్రెస్ పార్టీ సోమవారం ప్రకటించింది. ఏఐసీసీ నేతలతో పాటు తెలంగాణలోని ముఖ్యనేతలు, పొరుగు రాష్ట్రాల నాయకులను ఈ జాబితాలో చేర్చింది. యూపీఏ ఛైర్పర్సన్ సోనియాగాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్సింగ్, కర్ణాటక, మహారాష్ట్ర, పుదుచ్చేరి, పంజాబ్, యూపీకి చెందిన నేతలు ప్రచార తారల జాబితాలో ఉన్నారు.
*పర్చూరు బరిలో ఇద్దరు ‘దగ్గుబాటి’లు
ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గంలో దగ్గుబాటి ఇంటి పేరు ఉన్న ఇద్దరు బరిలో నిలిచారు. వారి పార్టీ గుర్తులు కూడా సామీప్యంగా ఉండటంతో స్థానికంగా చర్చనీయాంశమైంది. పర్చూరు నుంచి వైకాపా అభ్యర్థిగా మాజీ మంత్రి, డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు సోమవారం నామపత్రం దాఖలు చేశారు. ఇదే క్రమంలో ఒంగోలు సమీపంలోని పెళ్లూరుకు చెందిన దగ్గుబాటి వెంకటేశ్వర్లు అనే మరో వ్యక్తి కూడా… ప్రజాశాంతి పార్టీ అభ్యర్థిగా పర్చూరు అసెంబ్లీకి నామినేషన్ వేశారు. పేర్లు దాదాపు ఒకేలా ఉండడం, పార్టీ ఎన్నికల గుర్తులు (ఫ్యాన్, హెలికాప్టర్) కూడా దగ్గరి పోలికలతో ఉండడంతో… తమ ఓట్లు ఎక్కడ చీలుతాయోనని వైకాపా నాయకులు ఆందోళన చెందుతున్నారు.
*600 హామీల్లో ఒక్కటీ నెరవేర్చలేదు
ముఖ్యమంత్రిగా తొమ్మిదేళ్లలో హైదరాబాద్‌ను అభివృద్ధి చేశానంటున్న చంద్రబాబు ఐదేళ్లలో అమరావతిలో ఒక్క శాశ్వత భవనమైనా ఎందుకు కట్టలేకపోయారని వైకాపా అధ్యక్షుడు జగన్ సోదరి షర్మిల ప్రశ్నించారు. సోమవారం ఆమె విజయవాడలోని వైకాపా రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడారు.‘‘మీ భవిష్యత్తు నా బాధ్యత అని ఇప్పుడంటున్నారు. గడచిన ఐదేళ్లలో మీ బాధ్యత అనిపించలేదా?’’ అని ప్రశ్నించారు. ‘‘2014లో 600హామీలనిచ్చి ఒక్కటీ పూర్తి చేయకపోగా ఇప్పుడు మళ్లీ హామీలివ్వడానికి సిద్ధపడ్డారు.
* కేఏ పాల్ నామినేషన్లు ఆమోదం
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ నరసాపురం పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థిగా దాఖలు చేసిన నామినేషన్లను ఎన్నికల అధికారులు ఆమోదించారు. భీమవరం అసెంబ్లీ స్థానానికి నామినేషన్ వేసేందుకు నిన్న ఆయన ఆలస్యంగా వెళ్లడంతో రిటర్నింగ్ అధికారి నిరాకరించిన విషయం తెలిసిందే. మంగళవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ల పరిశీలన (స్క్రూట్నీ) చేపట్టారు. పత్రాలు అన్నీ సరిగా ఉన్నందున నర్సాపురం లోక్‌సభతో పాటు అసెంబ్లీ స్థానానికి పాల్ వేసిన నామినేషన్‌కు అధికారులు ఆమోదం తెలిపారు. దీనిపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది.
*భాజపాలో చేరిన పారాలింపియన్ దీపా మలిక్
పారాలింపిక్లో మన దేశానికి పతకాన్ని సాధించిన తొలి మహిళా క్రీడాకారిణి దీపా మలిక్ (48)భారతీయ జనతా పార్టీలో చేరారు. సోమవారం దిల్లీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో హరియాణా రాష్ట్ర భాజపా అధ్యక్షుడు సుభాష్ బరాలా, ప్రధాన కార్యదర్శి అనిల్ జైన్ సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. 2016 రియో క్రీడల్లో మహిళల షాట్‌పుట్ విభాగంలో రజత పతకాన్ని దీపా మలిక్ గెలుచుకున్నారు. దేశానికి గర్వకారణమైన ఈ క్రీడాకారిణి అందరికీ స్ఫూర్తిదాయకమని, ఆమెను పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నామని అనిల్ జైన్ తెలిపారు. హరియాణాలోని ఏదైనా ఒక లోక్‌సభ స్థానం నుంచి ఆమెను పోటీ చేయించే యోచనలో భాజపా నేతలున్నారు
*17 స్థానాలు.. 795 నామినేషన్లు
రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు 795 నామినేషన్లు వచ్చాయని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి రజత్‌కుమార్ తెలిపారు. అత్యధికంగా నిజామాబాద్ నుంచి 245 దాఖలయ్యాయని పేర్కొన్నారు. మంగళవారం నుంచి నామినేషన్లను రిటర్నింగు అధికారులు పరిశీస్తారని సీఈవో వెల్లడించారు. సోమవారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజకీయ అవసరాలకు ప్రభుత్వ భవనాలను వినియోగిస్తే చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ప్రగతిభవన్‌లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తోందని తమకు అందిన ఫిర్యాదుపై భారత ఎన్నికల సంఘానికి (ఈసీఐ) లేఖ రాశామన్నారు. ఈసీఐ ఆదేశాల మేరకు తెరాస ప్రధాన కార్యదర్శికి లేఖ రాశామని, మరోసారి ప్రభుత్వ భవనాలను పార్టీ కోసం వాడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించామన్నారు. తెలంగాణ పాకిస్థాన్ అవుతోందని ఓ పార్టీ నేత చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ప్రభుత్వ పాలనపై చేసిన విమర్శ కనుక ఎన్నికల నియమావళి ఉల్లంఘన కిందకు రాదని స్పష్టం చేశారు. నిజామాబాద్ లోక్‌సభ స్థానానికి నామినేషన్లు వేసేందుకు ఓ వీఐపీ వస్తే రైతులను బయటకు పంపించారనే ఆరోపణలు రావడంతో వీడియో ఫుటేజీని పరిశీలించామని, అక్కడ అలాంటిదేమీ జరగలేదన్నారు.
*ఎన్నికల రణ క్షేత్రంలో రైతన్న
ప్రజాస్వామ్య రణ క్షేత్రమైన ఎన్నికలనే తమ డిమాండ్ల సాధనకు కార్య స్థలంగా మలుచుకుంటున్న నిజామాబాద్ జిల్లా రైతులు ఒక్కసారిగా భారతావని దృష్టిని ఆకర్షించారు. పండించిన పంటలకు ప్రభుత్వం గిట్టుబాటు ధర అందించాలనే డిమాండ్‌తో పెద్దఎత్తున ఆందోళన చేసినా ఫలితం లేకపోవడంతో రైతులు ఎన్నికల బాట పడుతున్నట్టు ప్రకటించిన విషయం విదితమే. సోమవారం నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగిసే సమయానికి అందిన సమాచారం ప్రకారం ఇక్కడ మొత్తం 245 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో సింహభాగం రైతులవే ఉన్నాయి.
*ప్రచార తారల జాబితాలో హరీశ్‌రావు
తెరాస ప్రచార తారల (స్టార్ క్యాంపెయినర్ల) జాబితాలో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే టి.హరీశ్‌రావు పేరు చేరింది. 20 మంది నాయకుల పేర్లతో స్టార్ క్యాంపెయినర్ల జాబితాను ఆ పార్టీ శనివారం ఎన్నికల సంఘానికి అందజేసింది. ఆ జాబితాలో హరీశ్‌రావు పేరు లేకపోవడం పార్టీలో చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో గతంలో ఇచ్చిన జాబితాలో పేర్కొన్న పార్టీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్ స్థానంలో హరీశ్‌రావు పేరును చేరుస్తూ తెరాస సోమవారం ఎన్నికల సంఘానికి లేఖ పంపింది.
*తాండూరు నుంచి కేటీఆర్ సభలు
తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఈ నెల 30న తాండూరు నుంచి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. 30వ తేదీ సాయంత్రం అయిదు గంటలకు తాండూరులో, ఏడు గంటలకు వికారాబాద్‌లో ఆయన రోడ్‌షో, సభలు సాగుతాయి. 31న సాయంత్రం 5 గంటలకు పరిగి, ఏడు గంటలకు చేవెళ్లలో ప్రచారం చేస్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్.. చేవెళ్ల, సికింద్రాబాద్, మల్కాజిగిరి నియోజకవర్గాల్లో పూర్తిస్థాయి ప్రచార బాధ్యతలను కేటీఆర్‌కు అప్పగించారు. సోమవారం ఈ సభల షెడ్యూలును కేటీఆర్ ఖరారు చేశారు. హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డిలు సభల ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు. వచ్చే నెల 1 నుంచి 3వ తేదీ వరకు మల్కాజిగిరి నియోజకవర్గ సభలు జరుగుతాయి. ఎల్బీనగర్ నుంచి ఇవి ప్రారంభమవుతాయి. 4 నుంచి 7 వరకు సికింద్రాబాద్, 8, 9 తేదీల్లో చేవెళ్లలో సభలు సాగుతాయి.
*నేడు మండలి ఓట్ల లెక్కింపు
పోలింగ్ పూర్తయిన శాసనమండలి స్థానాలకు మంగళవారం ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఈనెల 22న మూడు స్థానాలకు పోలింగ్ పూర్తయిన విషయం తెలిసిందే. మొత్తం 33 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గంలో 59.03 శాతం పోలింగ్ నమోదైంది. వరంగల్-ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయుల నియోజకవర్గంలో 89.25 శాతం, మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్- కరీంనగర్ ఉపాధ్యాయుల నియోజకవర్గంలో 83.54 శాతం పోలింగ్ నమోదైంది. పట్టభద్రుల స్థానం, ఒక ఉపాధ్యాయ మండలి స్థానానికి కరీంనగర్లో ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. మరో ఉపాధ్యాయ మండలి స్థానానికి లెక్కింపు నల్గొండలో చేపట్టనున్నారు. మంగళవారం ఓట్ల లెక్కింపు అనంతరం ఫలితాలను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపనున్నారు. లోక్‌సభ ఎన్నికల నిబంధనావళి అమలులో ఉన్నందున సీఈసీ అనుమతి ఇచ్చాకే ఫలితాలు విడుదలవుతాయి. ఈ నేపథ్యంలో మంగళవారం ఫలితాలను అధికారంగా ప్రకటించే అవకాశాలు లేనట్లు తెలుస్తోంది.
*తెరాస ఎంపీలతోనే రాష్ట్రానికి లాభం
‘లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిస్తే రాహుల్‌గాంధీకి.. భాజపా అభ్యర్థులు నెగ్గితే నరేంద్రమోదీకి మాత్రమే లాభం.. కానీ, తెరాస అభ్యర్థులు ఎంపీలైతే రాష్ట్రం మొత్తానికి లాభం జరుగుతుంది..’ అని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. సోమవారం సాయంత్రం సిరిసిల్లలో కరీంనగర్ తెరాస పార్లమెంటు అభ్యర్థి బి.వినోద్‌కుమార్‌తో కలిసి బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. ‘ఎట్టికైనా మట్టికైనా మనోడంటూ ఒకరుండాలంటారు పెద్దలు. అలాంటిది మన రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధికోసం కేంద్రంతో పోరాటం చేసేందుకు మనకు బలం ఉండాలి’ అన్నారు. భాజపా, కాంగ్రెస్ నాయకులకు టికెట్లు, బీ ఫారం కావాలంటే దిల్లీకి వెళ్లాల్సిందేనని చెప్పారు.
*వారికి ఒక్క సీటు రాకుండా చేయండి
‘‘వైకాపాకు సంపద సృష్టించటం తెలియదు. వారికి ఓటు వేస్తే పింఛన్లు ఇవ్వలేరు. ప్రస్తుతం ఇచ్చే నిరంతరం విద్యుత్తు కూడా ఉండదు.రానున్న ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తుకు ఎంతో కీలకమైనవని. అందుకే ‘మీ భవిష్యత్తు నా బాధ్యత’ అని చెబుతున్నా. ఏమరుపాటు వహిస్తే అభివృద్ధికి దెబ్బ తగులుతుంది. వైకాపాకు ఒక్క సీటు రాకుండా చేయాలి.’’ అని చంద్రబాబు పిలుపునిచ్చారు. నెల్లూరు జిల్లా వెంకటగిరి, సూళ్లూరుపేట, గూడూరు నియోజకవర్గాల పరిధిలో నిర్వహించిన సభల్లో ఆయన మాట్లాడుతూ..‘‘ ఈ గడ్డమీద పుట్టిన వాళ్లే మనకు ద్రోహం చేస్తున్నారు. జగన్ మన ఓట్లు తొలగించిన దొంగ. ఆయనకు సలహాదారు కేసీఆర్. వీరి విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఆడపడుచుల సౌభాగ్యం కోసం భవిష్యత్తులో పసుపు కుంకుమ ఇస్తూనే ఉంటా. అన్నదాత సుఖీభవ కింద ఎకరాకు రూ.15 వేలు మొత్తాన్ని ఇచ్చే విధంగా పథకాన్ని తీసుకొచ్చాం.
*భావోద్వేగాలు రెచ్చగొడుతున్నారు
‘ఎన్నికల ప్రకటన విడుదలైనప్పటినుంచి ఏం జరుగుతుందో అంతా గమనిస్తున్నారు. భావోద్వేగాలు రెచ్చగొట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. తెలంగాణలోనూ మనవాళ్లు ఉన్నారనే కనీస జ్ఞానం లేకుండా విమర్శలు చేస్తున్నారు. బాబు ఏం చెబితే యాక్టర్ అదే పలుకుతున్నారు. తెలంగాణలో పారిశ్రామికవేత్తలను తెరాస ప్రభుత్వం బెదిరిస్తోందని ఆరోపిస్తున్నారు. ఎవరిని బెదిరించారు? ఎవరి ఆస్తులు లాక్కున్నారో చెప్పగలరా? ఇలాంటి వ్యాఖ్యలతో అక్కడ మనవాళ్లకు అపకారం తలపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. కేసీఆర్ నాకు రూ.వెయ్యి కోట్లు ఇచ్చారంటున్నారు. మీడియాలో అదే ప్రచారం చేయిస్తున్నారు. రూ.వెయ్యి కోట్లు ఇస్తుండగా చంద్రబాబు చూశారా? లేదా కేసీఆర్ ఏమైనా ఫోన్ చేసి చంద్రబాబుకు చెప్పారా?’ అని వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం కర్నూలు జిల్లా ఆదోని, అనంతపురం జిల్లా తాడిపత్రి, చిత్తూరు జిల్లా మదనపల్లెలోఎన్నికల సభలలో మాట్లాడారు. ‘పండ్లున్న చెట్టు మీదే రాళ్లు పడతాయి. గెలిచే పార్టీపైనే విమర్శలు వస్తుంటాయి. వైకాపాకు ప్రజల అండ ఉన్నందునే వీళ్లంతా కుట్రలు చేస్తున్నారు’ అని పేర్కొన్నారు.
*తొలగింపు దరఖాస్తుల్లో వైకాపావే 80%
రాష్ట్రంలో ఓట్ల తొలగింపు కోసం ఎన్నికల సంఘానికి వచ్చిన దరఖాస్తుల్లో 80 శాతం వైకాపా సానుభూతిపరులు పెట్టినవేనని సిట్ దర్యాప్తులో తేలింది. ఓట్లను తొలగించాలని కోరుతూ ఇతరుల పేరిట, వారి పేరిట దురుద్దేశపూరితంగా దరఖాస్తు చేసిన ఘటనలపై ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎక్కడికక్కడ స్థానిక అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. వీటిపై దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి..దరఖాస్తుదారులెవరో తేల్చారు. మొత్తం 376 కేసుల్లో 2,288 మందిని గుర్తించగా..వారిలో 80 శాతం మంది వైకాపా సానుభూతిపరులు, కార్యకర్తలు కాగా, 20 శాతం మంది తెదేపా సానుభూతిపరులు, ఇతరులు ఉన్నారని వెల్లడైంది.
*స్వతంత్ర దర్యాప్తు సంస్థకు అప్పగించండి
తన భర్త వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును ఏపీ హోంశాఖ ముఖ్యకార్యదర్శి, డీజీపీ నియంత్రణ పరిధిలో లేని స్వతంత్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలని కోరుతూ మృతుడి భార్య వైఎస్ సౌభాగ్య హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) తక్షణం దర్యాప్తు చేపట్టేలా ఆదేశించాలని కోరారు. ఏపీ హోంశాఖ ముఖ్యకార్యదర్శి, డీజీపీ, కడప ఎస్పీ, సిట్ అదనపు డీజీ, పులివెందుల ఎస్‌హెచ్‌వో, కేంద్ర హోంశాఖను వ్యాజ్యంలో ప్రతివాదులుగా చేర్చారు.
*నందిగామ పెదకూరపాడులోనూ ఇదే తంటా..
కృష్ణా జిల్లా నందిగామ, గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గాల ప్రధాన పార్టీల అభ్యర్థులకు పోటీగా వారి పేరు స్ఫురింపజేసేలా ఉన్న స్వతంత్ర, ఇతర పార్టీల అభ్యర్థులు నామినేషన్ వేయడం చర్చనీయాంశమైంది. ఇది ప్రధాన పార్టీలకు తలనొప్పిగా మారింది. నందిగామ సిట్టింగ్ ఎమ్మెల్యే, తెదేపా అభ్యర్థి తంగిరాల సౌమ్య పేరు గుర్తుకు తెచ్చేలా విజయవాడ వాసి, డిగ్రీ పూర్తయిన విద్యార్థిని తంగిరాల శైలజ నామినేషన్ వేశారు. వైకాపా అభ్యర్థి మొండితోక జగన్మోహనరావుకు కూడా ఈ బెడద తప్పలేదు. ప్రజాశాంతి పార్టీ తరఫున కంచికచర్ల వాసి మోగులూరి జగన్మోహనరావు నామినేషన్ వేశారు. పెదకూరపాడులో వైకాపా అభ్యర్థి నంబూరి శంకరరావు పేరున్న మరో వ్యక్తి.. ప్రత్తిపాడు మండలం ఇంజనంపాడు వాసి నంబూరి శంకరరావు నామినేషన్ వేశారు.
*తెదేపా ప్రచారానికి జాతీయ నేతలు
తెదేపా ఎన్నికల ప్రచారానికి జాతీయ పార్టీల నేతలు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. మాజీ ప్రధాని దేవేగౌడ, పశ్చిమబెంగాల్, దిల్లీ ముఖ్యమంత్రులు మమతాబెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, ఎన్సీపీ అధినేత శరద్‌పవార్, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్, ఆర్జేడీ తరఫున తేజస్వీయాదవ్, కేంద్ర మాజీ మంత్రులు యశ్వంత్‌సిన్హా, అరుణ్‌శౌరీ రాష్ట్రంలో ప్రచారానికి రానున్నట్లు సమాచారం. వీరంతా ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి వివిధ జిల్లాల్లో నిర్వహించే ప్రచార సభల్లో పాల్గొననున్నారు. మంగళవారం కడప, ఆళ్లగడ్డ, నంద్యాల, కర్నూలు నియోజకవర్గాల్లో తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుతో కలిసి ఫరూక్ అబ్దుల్లా ప్రచారంలో పాల్గొంటారు. 28న విజయవాడలో ఎన్నికల ప్రచారంలో అరవింద్ కేజ్రీవాల్ పాల్గొననున్నారు. 31న విశాఖ బహిరంగ సభలో మమతాబెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ పాల్గొంటారు. ఏప్రిల్ 2న నెల్లూరులో ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్ పాల్గొంటారు. అనంతపురం, కర్నూలు జిల్లాల్లో మాజీ ప్రధాని దేవెగౌడ పాల్గొనే అవకాశం ఉంది.చిత్తూరు జిల్లాలో స్టాలిన్ ప్రచారంలో పాల్గొననున్నారు. శరద్‌పవార్, యశ్వంత్‌సిన్హా, అరుణ్‌శౌరీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి వివిధ ప్రచార సభల్లో పాల్గొననున్నారు.
*అర్హులైన ప్రతి ఒక్కరికి పసుపు కుంకుమ -తెదేపా
రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతి డ్వాక్రా సభ్యురాలికి పసుపు- కుంకుమ కింద రూ.పది వేల ఆర్ధిక సాయం అందించినట్లు తెదేపా స్పష్తం చేసింది. కడప జిల్లా రాయచోటి క్లస్టర్ , సంబేపల్లి మండలాల్లోని సభ్యురాళ్ళకు ఈ సాయం అందలేదని మాజీ ఎమ్మెల్యే పాలకొండల్రాయుడు చేసిన ఆరోపణల పై తెదేపా సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. రాయచోటి క్లస్టర్ పరిధిలోని గురిగింజ కుంట పంచాయతీలో పదమూడు మంది సభ్యులతో 2003లో సుబ్రమణ్య స్వామీ పేరుతొ సంఘం ఏర్పడిందని వెల్లడించింది. ఇందులోని ఎల్ సుబ్బమ్మ, ఎల్, జయమ్మ, సి, రత్నమ్మ గతేడాది జనవరి 2న సంఘం నుంచి వైదోలిగారని వివరించింది. అయినా వీరికి పసుపు-కుంకుమ కొండ ఆర్ధిక సాయం మంజూరైందని తెలిపింది.
*సైకిల్ గుర్తుకే ఓటెయ్యండి..తడబడిన వైకాపా అభ్యర్ధి
ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని వైకాపా ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అద్యక్షుడు గౌతమ్ రెడ్డి అనటంతో వేదిక పై ఉన్న వారందరూ ఖంగుతిన్నారు. విశాఖ మద్దిలపాలెం నాగర పార్టీ కార్యాలయంలో ఎన్నికల సందర్భంగా ఆయన సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైకిల్ గుర్తుకు ఓటేయాలని పేర్కొన్నారు. వేదిక మీద ఉన్న వారు అప్రమత్తం చేయటంతో ఆయన వెంటనే సర్దుకుని ప్యాన్ గుర్తుకు ఓటు వేయాలని సరిదిద్దుకున్నారు.
*నన్నేమీ చేయలేక మహేష్ బాబు పై ఐటీ దాడులు – గల్లా జయదేవ్
ప్రధాని మోడీ కుట్రలకు భయపడేది లేదని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. గుంటూరులో సోమవారం విలేకరులతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ కు చేసిన ద్రోహాన్ని పార్లమెంటులో ఎండగాట్టానని కక్షతో నన్ను లక్ష్యంగా పెట్టుకుని ఈడీ, ఐటీ దాడులతో ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నిస్తోందని అన్నారు. బడ్జెట్ ప్రసంగం తరువాత ఈడీ, నోటీసులు ఇచ్చి ఎనిమిది గంటలకు పైగా ప్రశ్నించారు. వారడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానమిచ్చాను. రాజకీయ ఒత్తిళ్ళ వల్లే ఇదంతా చేస్తున్నామని చెప్పి మొదటిసారి కంటే రెండోసారి బాగా మాట్లాడి పంపించారు. అని ఎంపీ జయదేవ్ వివరించారు. తెలుగు రాష్ట్రాల్లో పక్కగా పన్ను చెల్లిస్తున్న నాబార్ వాన్ టాక్స్ పేయర్నీ ఐటీ సమస్తః అవార్డులు కూడా ఎచ్చిందన్నారు. నావద్ద ఏమీ దొరకలేదని నా బంధువులు స్నేహితులును వేధిస్తున్నారని సినీ నటుడు మహేష్ బాబుకు చెందిన సంస్థలపై రెండు సార్లు ఐటీ దాడులు చేయడం ఇందులో భాగమేనన్నారు. కుటుంబాన్ని వ్యాపారాన్ని రిస్క్ లో పెట్టిపని చేస్తున్నానని తెలిపారు. బ్రిటీష్ వాళ్లతో పోరాడి తన తాత రాజగోపాల నాయుడు ఆచార్య ఎన్జీ రంగాతో పాటు జైలుకు వెళ్ళారని ఇప్పుడు మోడీతో పోట్లాడి జైలుకు వెళ్లేందుకు తానూ సిద్దంగా ఉన్నానని పేర్కొన్నారు.
*పర్చూరు బరిలో ఇద్దరు దగ్గుబాటీలు
ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గంలో దగ్గుబాటి ఇంటి పేరు ఉన్న ఇద్దరు బరిలో నిలిచారు. పర్చూరు నుంచి వైకాపా అభ్యర్ధిగా మాజీ మంత్రి డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు సోమవారం నమపత్రం దాఖలు చేశారు. ఇదే క్రమంలో ఒంగోలు సమీపంలో పెళ్లూరుకు చెందిన దగ్గుబాటి వెంకటేశ్వర్లు అనే మరో వ్యక్తీ కూడా… ప్రజాశాంతి పార్టీ అభ్యర్ధిగా పర్చూరు అసెంబ్లీకి నామినేషన్ వేశారు. పేర్లు దాదాపు ఒకేలా ఉండడం, పార్టీ ఎన్నికా గుర్తులు (ప్యాన్, హెలికాప్టర్) కూడా దగ్గరి పోలికాలతో ఉండడంతో తమ ఓట్లు ఎక్కడ చీలుతాయోనని వైకాపా నాయకులు ఆందోళన చెందుతున్నారు.
* బరి నుంచి వైదొలగిన భాజపా అభ్యర్థి
కర్నూలు జిల్లాలో భాజపా పరంగా అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఆ పార్టీ ఆలూరు నియోజకవర్గ భాజపా ఎమ్మెల్యే అభ్యర్థి కోట్ల హరిచక్రపాణిరెడ్డి ఎన్నికల బరి నుంచి తప్పుకొన్నారు. ఆయన ఈనెల 22న భారీ జనసమీకరణతో వెళ్లి నామపత్రం దాఖలు చేశారు. పార్టీ అధిష్ఠానం తీసుకున్న నిర్ణయాలు నచ్చక తానీ మలుపు తీసుకున్నట్లు హరిచక్రపాణిరెడ్డి కార్యకర్తలు, నాయకుల సమావేశంలో వెల్లడించారు. భావి కార్యాచరణలో భాగంగా తన వదిన, ఆలూరు తెదేపా అభ్యర్థి కోట్ల సుజాతమ్మ వెంట నడవాలని నిర్ణయించుకున్నారు. ఆమె గెలుపునకు కృషిచేస్తానని చెబుతున్నారు.
