తెదేపా అభ్యర్థి ఆస్పత్రిపై ఐటీ దాడులు–నేరవార్తలు–03/27

*ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి ఉగ్ర నరసింహారెడ్డికి చెందిన ఆస్పత్రులలో ఐటీ అధికారులు దాడులకు దిగారు. గుంటూరులో ఉగ్ర నరసింహారెడ్డికి చెందిన అమరావతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కళాశాలలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఐటీ దాడులపై సమాచారం అందుకున్న ఉగ్ర నరసింహారెడ్డి ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో టీడీపీ వారిపై ఐటీ దాడులు జరుగుతుండటం ఆ పార్టీని కలవరపాటుకు గురిచేస్తోంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రచారంలో ఉన్న ఉగ్రనరసింహారెడ్డిని తమ ముందు హాజరై వివరణ ఇవ్వమని ఐటీ అధికారులు కోరే అవకాశం ఉంది. అలా కానిచో ఆయనకు నోటీసులు పంపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నికల వేళ టీడీపీని నైతికంగా దెబ్బకొట్టేందుకు కేంద్రం ఐటీని పావుగా వాడుకుంటోందని టీడీపీ విమర్శిస్తోంది.
* సత్తుపల్లి మండలం బేతుపల్లి వీఆర్వో పద్దం వెంగళరావు రైతు దాసరి మాధవరెడ్డి నుంచి ₹ 18,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యండడ్ గా పట్టుకున్న ఏసీబీ
* నూజివీడు IIIT లో ఫుడ్ పాయిజన్50 మంది విద్యార్థులకు అస్వస్థతబయటకు తెలీయనీకూడదని విద్యార్థులకు భయపెడుతున్న IIIT అధికారులుఇష్టారాజ్యంగా నాణ్యత లేని భోజనం పెడుతున్న వార్డెన్.వార్డెనుకు అధికారుల అండక్యాంపస్ లో విద్యార్థుల ర్యాలీ.
* ప్రొద్దుటూరు బి ఎస్ ఎన్ ఎల్ కార్యాలయాన్ని సీజ్ చేసిన మునిసిపల్ అధికారులు…మునిసిపాలిటీ కి ఇప్పటి వరకు 90 లక్షల రూపాయల పన్ను బాకీ పడ్డ సంస్థ…పలుమార్లు పన్ను కట్టాలని కోరిన అధికారులు…స్పందన రాకపోవడంతో కార్యాలయానికి తాళాలు వేసి సీజ్ చేసిన మునిసిపాలిటీ అధికారులు….
* అనంతపురం జిల్లా రోద్దం మండలం బొక్సంపల్లి గ్రామంలో విషాదం.కరెంటు తీగ తెగి మీద పడడంతో బాలమ్మ (49) కు తీవ్ర గాయాలు.ఆసుపత్రికి తరలిస్తుండగ మార్గమధ్యంలో మృతి.
* గుజరాత్‌ తీర ప్రాంతంలో రూ. 500 కోట్ల విలువ చేసే 100 కేజీల హెరాయిన్‌ను ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌(ఐసీజీ), యాంటీ టెర్రరిస్ట్‌ స్కాడ్‌(ఏటీఎస్‌) బృందాలు కలిసి స్వాధీనం చేసుకున్నాయి.
పాకిస్థాన్‌లోని గ్వాదర్‌ పోర్టులో ఇరానీయన్‌ పడవలో డ్రగ్స్‌ను నింపి సముద్ర మార్గం ద్వారా తరలిస్తున్నట్లు ఐసీజీ, ఏటీఎస్‌ బృందాలకు నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. దీంతో ఈ బృందాలు గస్తీ నిర్వహించి ఇరానీయన్‌ పడవను అదుపులోకి తీసుకున్నాయి.9 మంది ఇరాన్‌ దేశస్థులను అదుపులోకి తీసుకొని విచారించగా.. పాకిస్థాన్‌కు చెందిన హమీద్‌ మాలేక్‌ నుంచి ఈ డ్రగ్స్‌ను తీసుకున్నట్లు తెలిపారు. ఎట్టకేలకు పడవలో ఉన్న 100 కేజీల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నామని ఐసీజీ, మెరైన్‌ టాస్క్‌ఫోర్స్‌ కమాండోస్‌ తెలిపారు. దీని విలువ రూ. 500 కోట్లు ఉంటుందన్నారు.
అయితే ఆధారాలు దొరకకుండా పడవకు నిప్పు కూడా పెట్టారు ఇరానీయులు. డ్రగ్స్‌ తో పట్టుబడ్డ 9 మంది ఇరానీయులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
* ప్రియాంకా ఫ్రాడ్ అంటూ పోస్టర్లు
ప్రచార నిమిత్తం ప్రియాంకా గాంధీ అమేధీ నియోజకవర్గంలో పర్యటిస్తున్న నేపధ్యంలో ఆమెకు వ్యతిరేకంగా నియోజకవర్గంలో వెలిసిన పోస్టర్లు కలకలం రేపాయి. ప్రియాంకను మోసకరిగా పేర్కొంటూ అమెదీలో వెలిసిన పోస్టర్ పై కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమంటున్నాయి. కాగా, అమేదీకి కేవలం ఐదేళ్ళు తరువాత మీరు మమంల్ని ఎందుకు పూల్స్ ను చేస్తున్నారని ఈ పోస్టర్లలో ప్రస్తావించారు. 2014 ఎన్నికల్లో ఎన్నో హామీలు గుప్పించిన మీరు మళ్ళీ ఐదేళ్ళ తరువాత మమ్మల్ని మోసగించేందుకు వస్తున్నారని మరో పోస్టర్ వెలిసింది. ఎన్నికల సందర్భంగా ప్రజల్ని బురిడీ కొట్టించేందుకు మీరు చీరలు ధరించి వస్తుంటారు. అయితే.. ఇలాంటి ఎత్తుగడలు ఇక ఫలించవని మరో పోస్టర్ దర్శనమిచ్చింది. ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రియాంకా ప్రస్తుతం అమేదీలో ఉన్నారు. పార్టీ చీఫ్ రాహూల్ తరపున ప్రచారం నిర్వహిస్తున్న ప్రియాంక గురువారం తన తల్లి సోనియా గాంధీ నియోజకవర్గంలో గురువారం ప్రచారం చేపట్టనున్నారు. దిల్లికి తిరుగుముఖం పట్టే ముందు ఆమె అయోధ్యను సందర్శించనున్నారు.
*మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద హత్య కేసులో నిజాలు సమాధి చేసే కుట్ర జరగుతోందన్నారు ఆయన కూతురు సునీతా రెడ్డి. సిట్‌ విచారణపై అనుమానాలున్నాయని తెలిపారు. ఎన్నో లేఖలిచ్చినా సిట్‌ పట్టించుకోలేదని చెప్పారు. నాన్నతో సన్నిహితంగా ఉండే వారందరినీ ప్రశ్నిస్తున్నారు కానీ, తాము అనుమానం వ్యక్తం చేసిన వారిని ఎందుకు ఉపక్షేస్తున్నారని నిలదీశారు సునీతా రెడ్డి. చట్టం ముందు అందరూ సమానమైనప్పుడు కొంత మందిని ఎందుకు విచారించడం లేదని ప్రశ్నించారు. బాధలో ఉన్న తమనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హత్యలో పరమేశ్వర్ రెడ్డి పాత్ర ఉందని ఆరోపించారు సునీతారెడ్డి.
*విజయవాడ పార్లమెంట్‌ వైకాపా అభ్యర్థి పొట్లూరి వీర ప్రసాద్‌ చిత్రంతో ఉన్న బిల్లులు లేని టీ షర్టులను మంగళవారం ఉదయం కృష్ణా జిల్లా మైలవరంలో అధికారులు పట్టుకున్నారు. విజయవాడ నుంచి ట్రాన్స్‌పోర్టు లారీద్వారా వచ్చిన 7 కట్టలను ప్రభుత్వ పశువుల ఆసుపత్రి ఎదుట గల ఒక దుకాణం ముందు రహదారి పక్కనే దింపారు.
*ఎన్నికల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అబ్కారీశాఖ రూ.17 కోట్ల విలువ చేసే అక్రమ మద్యంను స్వాధీనం చేసుకున్నట్లు ఆ శాఖ కమిషనర్‌ ముఖేష్‌కుమార్‌ మీనా తెలిపారు. రాష్ట్రంలో ఎన్నికల చరిత్రలో ఇది సరికొత్త రికార్డుగా నిలిచిందని పేర్కొన్నారు.
*చేతబడి చేస్తున్నాడన్న అనుమానంతో ఓ గుర్తు తెలియని వ్యక్తిపై కొందరు కర్రలు, రాళ్లతో దాడి చేయడంతో దుర్మరణం చెందాడు. కృష్ణా జిల్లా జి.కొండూరు మండలం గడ్డమణుగు గ్రామం సమీపంలోని సత్తెమ్మ తల్లి గుడి వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.
* సెప్టిక్‌ ట్యాంకు శుభ్రం చేయడానికి దిగిన ఓ వ్యక్తితోపాటు అతనిని బయటకు తీయడానికి యత్నించిన మరో ఐదుగురు మృతి చెందారు. ఈ విషాద ఘటన తమిళనాడులోని కాంచీపురం జిల్లా శ్రీపెరంబదూరులో మంగళవారం చోటుచేసుకుంది.
*ఒడిశా రాష్ట్రం కేంఝర్‌ జిల్లా ఘషిపుర శాసనసభ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయదలచిన వ్యక్తిని దుండగులు దారుణంగా నరికి చంపారు. సంఘటన మంగళవారం చోటుచేసుకుంది.
*ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఓ యువకుడి ప్యాంట్‌ జేబులోని సెల్‌ఫోన్‌ హఠాత్తుగా పేలింది. దాంతో వాహనం అదుపుతప్పి అతడు కింద పడ్డాడు. సెల్‌ఫోన్‌ పేలుడుతో తొడకు గాయాలయ్యాయి. ఈ సంఘటన మంగళవారం సికింద్రాబాద్‌ అల్వాల్‌లో జరిగింది.
*మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసును స్వతంత్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలని కోరుతూ మృతుడి భార్య వైఎస్‌ సౌభాగ్య, వైకాపా అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వేర్వేరుగా దాఖలు చేసిన వ్యాజ్యాలకు సంబంధించి మంగళవారం వాదనలు జరిగాయి.
* సెల్ఫీ దిగేందుకు పడవ ఎక్కి చెరువులోకి వెళ్లగా ప్రమాదవశాత్తు అది బోల్తా పడి ఒకరు గల్లంతు కాగా ఏడుగురు సురక్షితంగా బయట పడ్డ సంఘటన మంగళవారం కుమురం భీం జిల్లా వాంకిడి మండలంలో చోటు చేసుకుంది.
* ప్రకాశం జిల్లా కనిగిరి తెదేపా అభ్యర్థి ఉగ్రనరసింహారెడ్డికి చెందిన ఆస్పత్రిలో ఐటీ శాఖ అధికారులు దాడులు చేపట్టారు. గుంటూరు కొత్తపేటలోని అమరావతి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సిస్‌లో 10 మంది అధికారుల బృందం సోదాలు నిర్వహిస్తోంది. ఈ దాడుల వెనుక రాజకీయ కోణం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
*భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో మానసికంగా ఎదుగుదలలేని బాలిక (14)పై ముగ్గురు యువకులు అత్యాచారానికి తెగబడ్డారు.
*మణుగూరు పట్టణంలోని మతి స్థిమితం లేని బాలిక(14)పై సోమవారం రాత్రి లైంగిక దాడి చేసిన ముగ్గురు నిందితులలో ఇద్దరిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో మంగళవారం విలేకరుల సమావేశంలో మణుగూరు డీఎస్పీ ఆర్‌.సాయిబాబా తెలిపిన వివరాలు…బెలూన్లు కొనేందుకని పట్టణంలోని షాపు వద్దకు వెళ్లిన మతి స్థిమితం లేని బాలికను ముగ్గురు యువకులు ద్విచక్ర వాహనంపై ఎక్కించుకున్నారు. గాంధీనగర్‌ చర్చి ప్రాంతంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి లైంగిక దాడి చేశారు. ఆ బాలిక గట్టిగా అరవడంతో ఆ యువకులు పారిపోయారు. చుట్టుపక్కల వారు ఆ బాలికను తల్లిదండ్రులకు అప్పగించారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదుతో పోలీసులు గాలింపు చేపట్టారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com