చిక్కుల్లో త్రిష

ఒకరికి మంచి చేయాలని ప్రయత్నించి తాను చిక్కుల్లో పడ్డారు త్రిష. ఆమెను కిడ్నాప్‌ చేసి ఓ అజ్ఞాత ప్రదేశంలోని ఓ భవంతిలో దాచారు. అక్కడి నుంచి త్రిష ఎలా బయటపడ్డారు? అందుకు ఎలాంటి సాహసాలు చేశారు అనే అంశాలను ‘పరమపదమ్‌ విలైయాట్టు’ అనే సినిమాలో చూడొచ్చు. త్రిష ప్రధాన పాత్రలో నటిస్తున్న లేడీ ఒరియంటెడ్‌ సినిమా ఇది. తిరుజ్ఞానం దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో డాక్టర్‌ పాత్రలో కనిపిస్తారు త్రిష. మరి.. డాక్టర్‌గా ఆమె చేయబోయిన హెల్ప్‌ ఏంటి? అనే విషయాలు ప్రస్తుతానికి సస్పెన్స్‌. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది.ఆల్మోస్ట్‌ టాకీ పార్ట్‌ పూర్తయింది. ఇక పాటల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉందని తెలిసింది. లేడీ ఓరియంటెడ్‌ సినిమా కాబట్టి తక్కువ పాటలే ఉంటాయని ఊహించవచ్చు. ఈ సినిమాలో త్రిష చేసే యాక్షన్‌ సన్నివేశాలు హైలైట్‌గా ఉండబోతున్నాయని తెలిసింది. అలాగే సిమ్రాన్, త్రిష ముఖ్య తారలుగా సుమంత్‌ రాధాకృష్ణన్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా ఏప్రిల్‌లో ప్రారంభం కానుంది. ఈ సంగతి ఇలా ఉంచితే… హిందీలో అమితాబ్‌ బచ్చన్, తాప్సీ నటించిన హిట్‌ మూవీ ‘బద్లా’ తమిళ రీమేక్‌లో త్రిష నటించబోతున్నారనే ప్రచారం కోలీవుడ్‌లో జోరుగా జరుగుతోంది. రాధామోహన్‌ దర్శకత్వం వహిస్తారట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)