*టాటా ట్రస్టుల ధర్మకర్తగా ఉన్న ఎన్‌ఏ సూనావాలా (83) వైదొలిగారు. వయసు రీత్యా వచ్చిన అనారోగ్య కారణాలతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక ప్రకటనలో టాటా ట్రస్టులు తెలిపాయి.
* డిజిటల్ పేమెంట్ స్ కంపెనీ ఫోన్‌పే ఒక ప్రత్యేక సంస్థగా అవతరిం చబోతోం ది. ఫోన్‌పే కార్యకలాపాలను వేరుగా నిర్వహించేందుకు, కొత్త ఓనర్ షి ప్ కోసం ఫ్లిప్ కార్ట్ బోర్డు నుం చి సూత్రప్రాయంగా అనుమతి వచ్చినట్టు సంబంధిత వ్యక్తులు చెప్పా రు. దీంతో బెంగళూరుకు చెందిన ఫోన్‌పే స్వతంత్ర బోర్డును నియమించుకుంటుం ది. అంతేకాకుండా,బయట ఇన్వెస్టర్ల నుం చి తాజాగా నిధులు సేకరించాలనుకుంటోందని తెలిసింది. అయితే ఫోన్‌పేలో ఉన్న 100 శాతం షేర్ హోల్డింగ్‌లో ఎంత మొత్తాన్ని వాల్‌మార్ట్‌కు చెందిన ఫ్లిప్ కార్ట్ డిజ్‌ఇన్వెస్ట్‌మెంట్ చేస్తుందో తెలియలేదు. బయట ఇన్వెస్టర్ల నుంచి100 కోట్ల డాలర్ల వరకు సేకరించాలని ఈ పేమెంట్ స్ సంస్థ చూస్తోందని సంబంధిత వ్యక్తులు చెప్పారు.
*జెట్ ఎయిర్‌వేస్ పగ్గాలు ఒక సీనియర్ బ్యాంకర్ చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. జెట్ ఎయిర్‌వేస్ బోర్డు నుంచి ఛైర్మన్ నరేశ్ గోయల్, ఆయన భార్య అనితా గోయల్ వైదొలగడంతో, కంపెనీ రుణదాతల చేతిలోకి వెళ్లిన విషయం తెలిసిందే.
*మేధో సంపత్తి హక్కుల అపహరణ ఆరోపణలపై అమెరికా సాఫ్ట్‌వేర్ సేవల సంస్థ ఎపిక్ సిస్టమ్స్‌కు అనుకూలంగా వచ్చిన తీర్పును సవాలు చేస్తూ అమెరికా ఎగువ న్యాయస్థానాన్ని (ఫెడరల్ అప్పిల్స్ కోర్టు) టాటా కన్సల్టెంట్స్ సర్వీసెస్ (టీసీఎస్) ఆశ్రయించింది.
*మేధో సంపత్తి హక్కుల అపహరణ ఆరోపణలపై అమెరికా సాఫ్‌్ివేర్ సేవల సంస్థ ఎపిక్ సిస్టమ్స్‌కు అనుకూలంగా వచ్చిన తీర్పును సవాలు చేస్తూ అమెరికా ఎగువ న్యాయస్థానాన్ని (ఫెడరల్ అప్పిల్స్ కోర్టు) టాటా కన్సల్టెంట్స్ సర్వీసెస్ (టీసీఎస్) ఆశ్రయించింది.
*ఆర్సెలర్ మిత్తల్ ప్రతిపాదించిన రుణ పరిష్కార ప్రణాళిక ద్వారా ఎస్సార్ స్టీల్‌కు సమకూరే రూ.42,000 కోట్లను రుణదాతలకు ఏ నిష్పత్తిలో పంపిణీ చేయాలనే దానిపై రుణదాతల కమిటీ (సీఓసీ) శుక్రవారం సమావేశం కాబోతున్నట్లు జాతీయ కంపెనీ లా అప్పిలేట్ ట్రైబ్యునల్‌కు (ఎన్‌సీఎల్‌ఏటీ) రుణదాతలు సమాచారం ఇచ్చారు.
*బ్యాంకుల్లో ఎవరైనా పెట్టుబడుదారు లేదా ప్రమోటరు లేదా ఏ ఇతర వ్యక్తినైనా వాటా తగ్గించుకోవాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఏ అధికారంతో ఆదేశిస్తుందని కోటక్ మహీంద్రా బ్యాంక్ ప్రశ్నించింది.
*అమెరికాకు చెందిన ఫిట్‌బిట్ సంస్థ భారత్ విపణి కోసం అందుబాటు ధర ఉత్పత్తులను విడుదల చేస్తోంది. శారీరక వ్యాయామం, ఎంతసేపు నిద్రిస్తున్నారు, హృదయ స్పందన ఎంతమేర ఉంది.. వంటి అంశాలను నమోదు చేసే వేరియబుల్స్ (శరీరంపై ధరించే ఉపకరణాలు)ను భారత్‌కు అనువుగా విడుదల చేసింది.
*బ్రిటిష్ ఎలక్ట్రిక్ బైక్, లైఫ్ స్టైల్ బ్రాండ్ గోజీరో మొబిలిటీ భారత విపణిలోకి బుధవారం మైల్, వన్ పేర్లతో రెండు విద్యుత్ బైక్‌లను ప్రవేశపెట్టింది.
*యునైటెడ్ బ్రూవరీస్ హోల్డింగ్స్(యూబీహెచ్‌ఎల్)లో విజయ్ మాల్యాకు చెందిన 74 లక్షలకు పైగా షేర్లను విక్రయించడం ద్వారా రుణ రికవరీ ట్రైబ్యునల్ (డీఆర్‌టీ) రూ.1008 కోట్లు పొందిందని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) పేర్కొంది.
