లోక్‌సభలో అడుగుపెట్టాలన్న భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ కలలు కలలుగానే మిగిలిపోయాయి. 1952లో జరిగిన తొలి లోక్‌సభ ఎన్నికల్లో షెడ్యూల్డ్ కేస్ట్స్ ఫెడరేషన్ తరఫున అప్పటి ఉత్తర బొంబయి(రిజర్వ్డు) స్థానం నుంచి అంబేడ్కర్ పోటీకి దిగారు. గతంలో అంబేడ్కర్ సహాయకుడైన నారాయణ్ సడోబా కజ్రోల్కర్ కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబడ్డారు. నారాయణ్ చేతిలో అంబేడ్కర్ 4,561 ఓట్ల స్వల్పతేడాతో పరాజయం పాలయ్యారు. ఆ తరువాత 3 ఏప్రిల్ 1952లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికై 2 ఏప్రిల్ 1956 వరకూ కొనసాగారు. ఈ మధ్యలో 1954లో బాంద్రా లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లోనూ అంబేడ్కర్ పోటీచేసి ఓడిపోయారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి బోర్కర్ విజయం సాధించారు.
