వివేకా హత్య కేసులో ముగ్గురు అరెస్టు–నేరవార్తలు–03/28

*రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఆయన ప్రధాన అనచరుడైన ఎర్ర గంగిరెడ్డి, వ్యక్తిగత కార్యదర్శి కృష్ణారెడ్డి, ఇంట్లో పనిచేసే లక్ష్మి కుమారుడు ప్రకాశ్‌ను అరెస్టు చేసినట్టు పోలీసులు ఓ ప్రకటన విడుదల చేశారు. హత్య అనంతరం సాక్ష్యాలు తారుమారు చేసిన వ్యవహారంలో ఈ ముగ్గురిని అరెస్టు చేసినట్టు పోలీసులు వివరించారు. ఈ నెల 15న ఉదయం స్నానాల గదిలో హత్యకు గురైన వివేకా మృతదేహాన్ని పడక గదికి తరలించినట్టు గుర్తించిన పోలీసులు.. ఆ సమయంలో ఎర్ర గంగిరెడ్డి అక్కడే ఉన్నట్టు భావిస్తున్నారు. ఉదయం లేఖ దొరికినా సాయంత్రం వరకు పోలీసులకు ఎందుకు ఇవ్వలేదనే కారణంతో కృష్ణారెడ్డిని అరెస్టు చేసినట్టు ప్రకటనలో పేర్కొన్నారు. 15న ఉదయం 5.30 గంటలకు తొలిసారి వెళ్లిన కృష్ణారెడ్డి వివేకా మృతదేహాన్ని చూసినట్టు వెల్లడించిన నేపథ్యంలో అప్పటి నుంచి ఆయన ఇంట్లో ఏం చేశాడనే కోణంలో విచారించారు. స్నానాల గది నుంచి పడక గదికి తరలించడం, రక్తపు మరకలు కడగడం, నుదుటిపై కట్లు కట్టి మృతదేహానికి బట్టలు మార్చడం తదితర వ్యవహారంలో ఎర్ర గంగిరెడ్డి పాత్ర ప్రధానంగా ఉన్నట్టు గుర్తించిన పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అలాగే, పనిమనిషి లక్ష్మి కుమారుడు ప్రకాశ్‌ రక్తపు మరకలు కడిగాడని పేర్కొన్నారు. సుమారు 12 రోజుల పాటు 50మందికి పైగా సాక్షులను పోలీసులు విచారించి మరికొందరిని అదుపులోకి తీసుకున్నారు.
* కేఏ పాల్ గోల్డ్ చైన్ కొట్టేశారా..?
ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ గోల్డ్ చైన్ ఎవరో కొట్టేసినట్టు తెలుస్తోంది. పూల దండలు తీసే ముసుగులో ఆయన చైన్ కూడా లాగేసినట్టు తెలుస్తోంది. అయితే పాల్ దీనిపై ఫిర్యాదు చేయలేదు. పొరపాటున దండల తోపాటు చైన్ తీశారా..? లేక ఉద్దేశ్యపూర్వకంగానే తీశారా అనేది తెలియాల్సి ఉంది. కాగా రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తూ ప్రజాశాంతి పార్టీ అభ్యర్థుల కోసం ప్రచారం నిర్వహిస్తున్నారాయన. తానే ఏపీకి కాబోయే మ్నుఖ్యమంత్రిని అంటూ ప్రచారం చేసుకుంటున్నారు.
* డెహ్రాడూన్‌లోని ఓ బోర్డింగ్‌ స్కూల్‌లో దారుణ ఘటన జరిగింది. ఇద్దరు సీనియర్‌ విద్యార్థులు దాడి చేసిన ఘటనలో 12 ఏళ్ల విద్యార్థి ప్రాణాలు విడిచాడు. ఇద్దరు సీనియర్‌ విద్యార్థులు జూనియర్‌ విద్యార్థిపై దాడి చేశారు. సదరు విద్యార్థి తీవ్రగాయాలతో షాక్‌ కు గురై ప్రాణాలు విడిచినట్లు విచారణలో తేలిందని డెహ్రాడూన్‌ ఎస్‌ఎస్‌పీ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు విద్యార్థులతోపాటు మరో ముగ్గురిని అరెస్ట్‌ చేశామని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామన్నారు.
* కర్ణాటకలో ఐటీ శాఖ దాడులు కొనసాగుతున్నాయి. బెంగళూరులోని వేర్వేరు ప్రాంతాలు, హసన్, మాండ్యా, మైసూరులో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. కర్ణాటక చిన్న నీటి పారుదల శాఖ మంత్రి పుట్టరాజు నివాసం మాండ్యాలో ఉదయం నుంచి తనిఖీలు కొనసాగుతున్నాయి. మరోవైపు హసన్ లోని 17 మంది కాంట్రాక్టర్లు, ఏడుగురు అధికారుల నివాసాల్లో సోదాలు జరుగుతున్నాయి. సాగునీటిపారుదల శాఖ, PWD శాఖలకు చెందిన కాంట్రాక్టర్లు, అధికారుల ఇళ్లలో ఐటీ తనిఖీలు చేస్తోంది. కర్ణాటక సీఎం కుమార స్వామి ఐటీ దాడులు జరుగుతాయని చెప్పిన మరుసటి రోజే ఈ సోదాలు కొనసాగుతున్నాయి. 2 వందల నుంచి 3 వందల మంది సీఆర్పీఎఫ్ సిబ్బందిని బెంగళూరు తరలించారని, జేడీఎస్ నేతలపై ఐటీ దాడులు జరుగుతాయని పక్కా సమాచారం ఉందని కుమార స్వామి నిన్న మాండ్యాలో చెప్పారు. అన్నట్లుగానే ఇవాళ(గురువారం) సోదాలు కొనసాగుతున్నాయి.
* 2015లో కేసు నమోదైంది. విచారణ అనంతరం ప్రముఖ కొరియోగ్రాఫర్, స్టార్ హీరోలచేత అదిరిపోయే స్టెప్పులు వేయించగల డాన్స్ మాస్టర్ జానీ ఓ కేసులో ఇరుక్కున్నారు. అందుకుగాను కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది మేడ్చల్ కోర్టు. ఆయనతో పాటు మరో అయిదుగురిని దోషులుగా నిర్ధారిస్తూ వారినీ జైలుకి తరలించారు.
* అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. సియాటెల్‌ పట్టణంలో గుర్తుతెలియని దుండగుడు తుపాకీతో కాల్పులకు తెగబడ్డాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. అక్కడి పోలీసుల వివరాల ప్రకారం.. ఈశాన్య సియాటెల్ ప్రాంతంలో నివసించే ఓ దుండగుడు బుధవారం తుపాకీతో వీధుల్లోకి ప్రవేశించాడు.
*రాజోలులో విషాదం చోటుచేసుకుంది. ప్రేమకు విద్యార్థి బలయ్యాడు. బీసీ హాస్టల్‌లో పదో తరగతి విద్యార్థి శ్రీను ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
*పెద్దపంజాణి మండలం లింగాపురంలో రోడ్డుప్రమాదం జరిగింది. ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
*గ్వాటెమాలలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంగా వచ్చిన ట్రక్కు జనసమూహాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 32 మంది మృతిచెందారు. నౌహులా మున్సిపాలిటీలోని సొలోలాలో రాత్రి సమయంలో ఓ కారు, పాదాచారున్ని ఢీకొట్టడంతో అతను రోడ్డుపై పడిపోయాడు. అయితే రోడ్డుపై పడిపోయిన అతన్ని చూసేందుకు చుట్టుపక్కల వారందరూ గుంపుగా అక్కడికి వెళ్లారు.
*భార్య, కుమారుడిపై కత్తితో ఇంటిపెద్ద విచక్షణా రహితంగా జరిపిన దాడిలో కుమారుడు మృత్యువాత పడ్డాడు. ఈ దారుణం పశ్చిమగోదావరిజిల్లా పాలకోడేరు మండలం మోగల్లులో చోటుచేసుకుంది.
*అతివేగం..లారీ డ్రైవర్‌ నిర్లక్ష్యం ముగ్గురు ప్రాణాలను బలితీసుకుంది. మరో ఘటనలో ఇదే లారీ ఢీకొని ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. కర్నూలు జిల్లాలో బుధవారం తెల్లవారుజామున అరగంట వ్యవధి తేడాతో ఈ ప్రమాదాలు చోటుచేసుకున్నాయి.
*చిత్తూరు జిల్లా ములకలచెరువులోని చెక్‌పోస్టులో జాతీయ రహదారిపై వాహనాలు తనిఖీ చేస్తుండగా రూ.1,86,24,390 నగదు పట్టుబడింది.
*మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా బ్రహ్మపురి తాలూకాలో పెద్ద పులి బుధవారం ఓ కూలీని చంపి సగం మేరకు తినేసింది.
* శ్రీకాకుళం జిల్లాలో బుధవారం చేపట్టిన తనిఖీల్లో సుమారు రూ. 10 లక్షల నగదు పట్టుకున్నారు. శ్రీకాకుళం గ్రామీణ మండలంలో రూ.లక్షన్నర స్వాధీనం చేసుకున్నారు. భామిని మండలంలో రూ.2.87లక్షలు, కొత్తూరు మండలంలో రూ. 1.83 లక్షలు, పాతపట్నం చెక్‌పోస్టు వద్ద రూ. 71,200, రేగిడి మండలం బోరాడ వద్ద రూ. 75,500, కోటబొమ్మాళి మండలం కొత్తపేట కూడలి వద్ద రూ. లక్ష, ఇచ్ఛాపురం మండలం ముచ్చీంద్ర వద్ద రూ. 58 వేలు, కవిటి మండలం రూ. 76,510 పట్టుకున్నారు.
*విశాఖ జిల్లా రోలుగుంట జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో పదో తరగతి భౌతిక శాస్త్రం ప్రశ్నపత్రం పరీక్ష సమయం ముగియక ముందే బయటకు వచ్చింది. ఇందుకు బాధ్యులుగా గుర్తించిన అయిదుగురు ఉపాధ్యాయులను విద్యాశాఖ సస్పెండ్‌ చేస్తూ వెంటనే ఉత్తర్వులు జారీ చేసింది.
*స్వైన్‌ ఫ్లూతో ఖమ్మం జిల్లా వైరా మండలానికి చెందిన ఓ వ్యక్తి (46) మృతిచెందాడు. వైరా మండలంలోని విప్పలమడకకు చెందిన రైతు రెండు వారాల క్రితం జలుబు, జ్వరంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే ఆయన్ను ఖమ్మంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించగా స్వైన్‌ఫ్లూ లక్షణాలున్నట్లు వైద్యులు నిర్ధరించారు. వారి సూచన మేరకు హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ్నుంచి గాంధీ ఆసుపత్రిలో చేర్చి వైద్యం చేయించినా ఫలితం లేకపోయింది. బుధవారం తెల్లవారుజామున బాధిత రైతు మృతిచెందినట్లు కుటుంబీకులు తెలిపారు.
* చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో పాటు పెళ్లీడుకొచ్చిన ముగ్గురు కుమార్తెలకు వివాహాలు ఎలా చేయాలా అని మనస్తాపం చెందిన ఓ తండ్రి చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటనిది. పోలీసులు తెలిపిన ప్రకారం… కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా సిర్పూర్‌(యు) మండలంలోని నేట్నూర్‌ గ్రామ పంచాయతీ పరిధి అల్లిగూడ గ్రామానికి చెందిన మడావి కట్టి(55) ఈ ఏడాది అయిదెకరాల్లో పత్తి, కంది పండించాడు.
*తెదేపా అధినేత చంద్రబాబు అనంతపురంలోని సప్తగిరి కూడలికి వచ్చినప్పుడు అక్కడే ఉన్న ఈద్గా మసీదు కాంప్లెక్స్‌లోని దుకాణాల మొదటి అంతస్తు ముందున్న బాల్కనీపై ఎక్కువ మంది నిల్చోవడంతో అది ఒక్కసారిగా కూలింది. దానిపై ఉన్నవారితోపాటు కింద ఉన్న 22 మందికి గాయాలయ్యాయి. వీరిలో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఘటనాస్థలి వద్దే ఉన్న ఎస్పీ అశోక్‌కుమార్‌ తక్షణమే స్పందించి అంబులెన్సులు రాక ముందే పోలీసు వాహనాల్లో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
* మహారాష్ట్రలోని చంద్రపూర్‌ జిల్లా బ్రహ్మపురి తాలూకాలో పెద్ద పులి బుధవారం ఓ కూలీని చంపి సగం మేరకు తినేసింది. రాంపురి మెడికి గ్రామానికి చెందిన జానకీరాం, భార్య అనుషాబాయి ఇద్దరూ కలిసి పక్కనేగల అడవిలోకి వెళ్లి వంట చెరకు సేకరిస్తున్నారు. పొదలలో ఉన్న పులి జానకీరాంపై దాడి చేసింది. అర కిలోమీటరు దూరం ఈడ్చుకెళ్లింది.
* కాళేశ్వరం ప్రాజెక్టు 9వ ప్యాకేజీ సొరంగం పనుల్లో బుధవారం తెల్లవారుజామున అపశ్రుతి చోటుచేసుకుంది. ఇద్దరు కార్మికుల పైనుంచి టిప్పర్‌ వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందారు.
*వివిధ సందర్భాల్లో స్వాధీనం చేసుకున్న గంజాయిని కస్టమ్స్‌ అధికారులు బుధవారం దహనం చేశారు. మొత్తం రూ.1.39 కోట్ల విలువైన 1121.543 కిలోల గంజాయిని జవహర్‌నగర్‌లోని రామ్కీ ఎన్విరో ఇంజినీర్స్‌ డంపింగ్‌యార్డులో శాస్త్రీయ పద్ధతిలో తగులబెట్టారు.
*బెదిరింపులకు పాల్పడుతూ ఇతరుల భూములను తమ పేరున మార్చుకున్న గ్యాంగ్‌స్టర్‌ నయీం బావమరిది సలీంను, మరో వ్యక్తి శామ్యూల్‌ను నాగర్‌కర్నూలు జిల్లా కల్వకుర్తి పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.
*పదో తరగతి పరీక్ష రాస్తున్న విద్యార్థినికి మాయమాటలు చెప్పి యాభై ఏళ్లకు పైబడిన ఓ ఇన్విజిలేటర్‌ అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన సూర్యాపేటలో చోటుచేసుకుంది. సూర్యాపేటలోని ఓ పాఠశాలలో టెన్త్‌ చదువుతున్న బాలిక అరవై అడుగుల రోడ్డులోని ప్రైవేటు పాఠశాలలో మంగళవారం పరీక్ష రాసింది.
*ఎన్నికల నేపథ్యంలో వాణిజ్య పన్నుల శాఖ అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. హైదరాబాద్‌ నుంచి విజయనగరం వర్తకులకు బుధవారం ఓ కొరియర్‌ సంస్థ ద్వారా వచ్చిన 24 కిలోల ముత్యాలను అధికారులు పట్టుకున్నారు. సరైన బిల్లులు, పత్రాలు లేకపోవడంతో వాటిని స్వాధీనం చేసుకున్నట్లు ఆ శాఖ డిప్యూటీ సహాయ కమిషనర్‌ పంతులు నారాయణశాస్త్రి తెలిపారు. పట్టుబడ్డ ముత్యాలు కిలో రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు ఉంటాయని చెప్పారు.
*పదో తరగతి పరీక్ష రాస్తున్న విద్యార్థినికి మాయమాటలు చెప్పి యాభై ఏళ్లకు పైబడిన ఓ ఇన్విజిలేటర్‌ అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన సూర్యాపేటలో చోటుచేసుకుంది. పదో తరగతి పరీక్ష రాస్తున్న విద్యార్థినికి మాయమాటలు చెప్పి యాభై ఏళ్లకు పైబడిన ఓ ఇన్విజిలేటర్‌ అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన సూర్యాపేటలో చోటుచేసుకుంది.
*సిరిసిల్ల పట్టణ శివారులోని రగుడు గ్రామ సమీపంలో జరుగుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు 9వ ప్యాకేజీ పనుల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. మంగళవార అర్ధరాత్రి దాటిన తర్వాత టిప్పర్‌ కింద పడి ఇద్దరు కార్మికులు మృతిచెందారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com