రాంగోపాల్ వర్మకు హైకోర్టు షాక్–తాజావార్తలు–03/28

*లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం విడుదల చేయవద్దని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. పోలిన్ అయ్యేంత వరకు ఈ చిత్రం విడుదలను నిలిపివేయమని చిత్ర దర్శకుడు రామ్ గోపాల్ వర్మను, నిర్మాత రాకేశ్ రెడ్డిని ఆదేశిస్తూ హైకోర్టు ఆదేశాలిచ్చింది.
* తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల సమరం దగ్గర పడింది. నామినేషన్ల ఉపసంహరణ గడువు కూడా ఈ రోజుతో(గురువారం) ముగిసింది. ఎవరు పోటీలో ఉంటారు, ఎవరు ఉండరు అనేది ఈరోజుతో తేలిపోతుంది. తొలి విడతలో భాగంగా 20 రాష్ట్రాల్లో 91 స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. ఈ నెల 10న ఎన్నికల షెడ్యూల్‌ విడులైన సంగతి తెల్సిందే. ఎన్నికల నోటిఫికేషన్‌ 18న విడుదల అయిన నాటి నుంచి 25వ తారీఖు వరకు నామినేషన్లు స్వీకరించారు.నామినేషన్లను ఈ నెల 26న ఎన్నికల అధికారులు పరిశీలించారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ రోజుతో గడువు ముగిసింది. ఏప్రిల్‌ 11న రెండు తెలుగు రాష్ట్రాలతో మరికొన్ని రాష్ట్రాల్లో పోలింగ్‌ జరగనుంది. మే 23న లోక్‌సభతోపాటు, శాసనసభ ఎన్నికల ఫలితాలను వెల్లడిస్తారు.
* సాగర్ నగర్, ఎంవిపి కాలనీ ధీటుగా తయారు చేస్తానని భీమిలి వైకాపా అభ్యర్థి మొత్తం శెట్టి శ్రీనివాస్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన గ్రేటర్ ఆరో వార్డు సాగర్ నగర్, గుడ్ల వాని పాలెం, మల్లయ్య పాలెం, సుభాష్ నగర్ పరిసర ప్రాంతాల్లో తన కుమార్తె ప్రియాంక తో కలసి పాదయాత్ర చేపట్టారు. ఈ కార్యక్రమంలో గుడ్ల వాని పాలెం మాజీ సర్పంచ్ బేరీ భువనేశ్వరి తమ అనుచరులతో వైకాపాలో చేరారు. వీరికి పార్టీ కండువాలు వేసి అవంతి శ్రీనివాస్ వారిని ఆహ్వానించారు. ఈ సందర్భంగా అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ సాగర్ నగర్ లో చిల్లర వర్తకుల దుకాణాలు నిలపడానికి రాష్ట్రస్థాయిలో లో పోరాడి సాధించిన ఘనత తనదేనని అన్నారు. అవినీతి రహిత పాలన కోసం తనకు ఇక్కడ సేవ చేసుకునే అవకాశం మరో సారీ ఇవ్వాలని కోరారు. ఈ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు పై ఓటు వేసి తనను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పిసిసి మాజీ కార్యదర్శి చెన్న దాసు, గుడ్ల పోల్ రెడ్డి, ఉప్పులూరి గోపి, రామ్మోహన్రావు , ఈ ఎం ఎస్ చందర్రావు తదితరులు పాల్గొన్నారు.
* బీజేపీ రెబల్ శత్రుజ్ఞు సిన్హా గురువారం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిశారు. మూడు దశాబ్దాల పాటు బీజేపీతోనే ఉన్న సిన్హా.. 2014లో మోదీ ప్రధాని అయినప్పటి నుంచీ పబ్లిగ్గానే విమర్శలు చేస్తున్నారు. దీంతో ఈసారి ఆయనకు బీజేపీ టికెట్ ఇవ్వలేదు.
* గద్వాల నియోజకవర్గం లో నాగర్ కర్నూల్ పార్లమెంట్ నుండి పోటీ చేస్తున్న రాములు కి మద్దతు గా స్థానిక శాసనసభ్యులు క్రిష్ణ మోహన్ రెడ్డిఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.ముందుగా పాగుంట దేవాలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచారాన్ని చేపట్టారు.గ్రామాలలో ప్రజలు ,కార్యకర్తలు డప్పు శబ్దాలతో, బాణసంచా కాల్చి స్వాగతం పలికారు.నియోజకవర్గం లోని కెటి దొడ్డి మండలం లోని పాగుంట, వెంకటాపురం, ఈర్లభండా గ్రామాలలో ప్రచారం నిర్వహించారు.
* జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం ఇందువాసి గ్రామంలో మద్యపాన నిషేధ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కర్ణాటక రాష్ట్రం రాయచూరు పీఠాధిపతి శ్రీశ్రీ నిజా నంద స్వామి, గద్వాల్ జిల్లా ఎక్సైజ్ సీఐ గోపాల్, గట్టు ఎస్సై శ్రీనివాస్, ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. గ్రామంలో మద్యపాన నిషేధాన్ని కలసికట్టుగా నిషేధించాలని కోరారు. పక్క గ్రామాలు ఇందు వాసిని ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. వేదిక మీదున్న ముఖ్య అతిథులను పూలమాలలతో సత్కరించారు. గద్వాల శృతిలయ ఆర్ట్స్ కళాకారులు మద్యపాన నిషేధ గీతాలతో అలరించారు. ఈ కార్యక్రమాన్ని గ్రామ వీరేష్ గౌడ్ దీనిని చేపట్టడం అభినందించదగ్గ విషయమని సీఐ ఎస్ఐ అన్నారు. ఈ కార్యక్రమాన్ని గ్రామ ప్రజలు ముఖ్యంగా మహిళలు సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు.
* సూర్యాపేట జిల్లా కేంద్రంలో బి.ఎస్.ఎన్.ఎల్ ఆఫీసులో బి.ఎస్.ఎన్.ఎల్ ఫోర్ జి సేవలు జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బి.ఎస్.ఎన్.ఎల్ జనరల్ మ్యానేజర్,జిల్లా సంయుక్త కలెక్టర్ సంజీవరెడ్డి మరియు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
* సంగారెడ్డి జిల్లా పఠాన్ చేరు పట్టణంలోని HP Gas సిలెండర్ స్టాక్ గోదాం లో చోరీ జరిగింది. గోదాంలో సప్లై చేసే ఆటోలకు ఉన్న 15 టైర్లు, 2 బ్యాటరీలు, అద్దాలను గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. . గోదాంలో సెక్యురిటి గార్డ్, CC కెమెరాలు లేకపోవడం గమనార్హం.
* సంగారెడ్డి జిల్లా పఠాన్ చేరు మండలం చిట్కుల్ గ్రామం లో ఏ ర్పాటు చేసిన 40 సిసి కెమెరాలను జిల్లా ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి ప్రారంభించారు. సిసి కెమెరాల ఏర్పాటు చాలా అవసరం, ప్రతి గ్రామంలో సిసి కెమెరాలు ఏర్పాటు చేయడం వలన క్రైమ్ ను అరికట్టవచ్చు అని sp చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ సిసి ఏర్పాటు చేసినందుకు గ్రామ సర్పంచు నీలం మధును అభినందించారు. , సిసి కెమెరాల ద్వారా నేరస్తులను త్వరగా గుర్తించే వీలుంటుందని తెలిపారు. చిట్కు ల్ గ్రామం ను ఇతర గ్రామాల వారు ఆదర్శంగా తీసుకోవాలని కోరారు.
* కర్నూలు జిల్లా ఆలూరు తాలూకా ఆలూరు లో కాంగ్రెస్ కార్యాలయన్నీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆశ బేగం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తాగునీరు సాగునీరు అందిస్తామని తెలిపారు. పక్క గృహాలు ప్రతి నిరుపేదకు మరుగుదొడ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అంబేద్కర్ భవనము వాల్మీకి భవనము అల్లి సాబ్ మందిరం షాదీ కాను నిర్మిస్తామన్నారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే ప్రత్యేక హోదా కచ్చితంగా ఇస్తానని హామీ ఇచ్చారు.
* విశాఖ పెందుర్తి నియోజకవర్గం నరవ గ్రామంలో అనకాపల్లి టీడీపీ ఎంపీ అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్, పెందుర్తి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యనారాయణ మూర్తి ఇద్దరూ ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్డు షో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం చేసిన అనేక అభివృద్ధిని చూసి ప్రజలు నేడు బ్రహ్మరధం పడుతున్నారని అన్నారు.
* విశాఖ జిల్లా నర్సీపట్నం లో వైసిపికి ఎదురుదెబ్బ తగిలింది. మాజీ శాసన సభ్యురాలు ముత్యాలపాప ఇంటికి వెళ్లి మంత్రి అయ్యన్న పాత్రుడు తెలుగు దేశం పార్టీ లోకి ఆహ్వానించారు. ..మాజీ శాసన సభ్యురాలు దీనిపై సానుకూలంగా స్పందించారు. .. ఈనెల 29వ తారీఖున అమరావతిలో చంద్రబాబు సమక్షంలో పార్టీ లో చేరుతానని తెలిపారు.
* చంద్రబాబు నాయుడు శవ రాజకీయాలు చేస్తున్నారని దాడి వీరభద్రరావు విమర్శలు చేయడం దారుణం అని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత జహీర్ అహ్మద్ చెప్పారు. తెలుగుదేశం ఆవిర్భావం నుంచి వివిధ హోదాల్లో పని చేసిన వీరభద్రరావు ఇటువంటి విమర్శలు చేయడం విచారకమన్నారు. పార్టీ ప్రతిపక్షంలో వున్న శాసన మండలి చైర్మన్ గా చేసిన విషయాన్ని మర్చిపోయారన్నారు. ఎమ్మెల్సీ పదవి అయిపోగానే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారన్నారు. శవ రాజకీయాలు చేసింది జగన్ మోహన్ రెడ్డి కాదా అని ప్రశ్నించారు. చంద్రబాబు చేసిన అభివృద్ధి , సంక్షేమ కార్యక్రమాలే పార్టీని తిరిగి అధికారంలోనికి తీసుకు వస్తాయన్నారు.
* విశాఖపట్నం టీడీపి అర్బన్ అధ్యక్షులుగా, వుడా మాజీ చైర్మన్ , మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రెహ్మాన్ ప్రమాణం స్వీకారం చేశారు . పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి గంటా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు . ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి గంటా శ్రీనివాసరావు, రెహమాన్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ ప్రధాన కార్యదర్శి పట్టాభి రెహమాన్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు.
* విశాఖ ఉత్తర నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేకే రాజు తన ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసారు . సీతమ్మధార లోని లిల్లీ పార్క్ లో తన ప్రచారాన్ని నిర్వహించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కి ఓటు వేయాల్సిందిగా అభ్యర్ధించారు . ఈ సందర్బముగా కేకే రాజు మాట్లాడుతూ పార్టీకి మహిళల నుంచి మంచి స్పందన లభిస్తుందన్నారు .
* తూర్పు గోదావరి జిల్లా, రాజమహేంద్రవరం తెలుగుదేశం పార్టీ తోమహిళా సాధికారత ఏర్పడుతుందని శాసనమండలి సభ్యులు ఆదిరెడ్డి అప్పారావు పేర్కొన్నారు. 50వ డివిజన్ లో 50 డివిజన్ అధ్యక్షులు మరుకుర్తి రవి యాదవ్ ఆధ్వర్యంలో 57 డివిజన్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆకుల విజయ భారతి సుమారు 100 మందితో కలసి తెలుగుదేశం పార్టీ లో చేరారు. ఈ కార్యక్రమంలో ఎం ఎల్ సి ఆదిరెడ్డి అప్పారావు, షాప్ డైరెక్టర్ వేణుగోపాల్ రాయుడు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆదిరెడ్డి భవాని, యువ నాయకులు ఆదిరెడ్డి శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ వాసిరెడ్డి రాంబాబు, తదితరులు పాల్గొని పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడరు.
* గత అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ ని ఎలా ఆదరించారో ఇప్పుడు అలాంటి ఆదరణని ప్రజల ప్రజల వద్ద నుండి లభిస్తుందని . టిఆర్ఎస్ పార్టీ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి తలసాని సాయి కిరణ్ యాదవ్ సంతోషం వ్యక్తం చేశారు. ప్రచారంలో భాగంగా సాయి కిరణ్ యాదవ్ అంబర్పేట్ నియోజకవర్గంలోని పటేల్ నగర్, ప్రేమ్ నగర్ లో ఇంటింటికి తిరిగి ఓటు వేయాలని ప్రజలను కోరారు.
* అప్రజాస్వామిక నియంతృత్వ పోకడలకు ఏకపక్ష ఆలోచనలకు విరుద్దంగా ప్రజా లోకం దీటైన జవాబిచ్చింది అని కాంగ్రెస్ మాజీ మంత్రి టి జీవన్ రెడ్డి అన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రం డి సిసి భవన్ లో కరీంనగర్ ,నిజామాబాదు,ఆదిలాబాద్ ,మెదక్ ఉమ్మడి జిల్లాల శాసన మండలి పట్టభద్రుల అభ్యర్థి ఘన విజయం సాదించిన సందర్బంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ కరీంనగర్ ,నిజామాబాదు,ఆదిలాబాద్ ,మెదక్ ఉమ్మడి జిల్లాల శాసన మండలి పట్టభద్రుల అభ్యర్థి ఘన విజయం సాదించడం పట్ల ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. తన విజయానికి తోడ్పడిన అన్ని వర్గాల పట్టభద్రులకు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ఉద్యమం లో విద్యార్థి లోకం ప్రధాన పాత్ర పోషించిందని అదే విద్యార్ధి లోకం ఘనమైన తీర్పు నిచ్చారు అని అన్నారు. ప్రశ్నిచే గొంతుక ప్రతిపక్షం లేకపోతే ప్రభుత్వ౦ అలసత్వం తో ఏకపక్ష నిర్ణయ ధోరణి వెళుతుందన్నారు. సమస్యల పై మండలిలో తన గొంతు వినిపిస్తానని తెలిపారు.
* పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లి గ్రామంలో సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పరిమి రమేష్ ఆధ్వర్యంలో ముమ్మర తనిఖీలు చేపట్టారు. పోలీసు సిబ్బంది మరియు ఎలక్షన్ స్పెషల్ టీం తనిఖీలు నిర్వహిస్తున్నారు . ఈ తనిఖీలకు సంబంధించి ఎస్సై రమేష్ మీడియాతో మాట్లాడుతూ ఎటువంటి ఆధారాలు లేకుండా ఎవరైనా కారులో గాని టూ వీలర్స్ గాని డబ్బు తరలిస్తే వాటిని సీజ్ చేస్తామని అన్నారు.
* గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గంలోని పిడుగురాళ్ల మండలం తుమ్మలచేరువు గ్రామంలో YSR కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాసు మహేష్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. .ఈ సందర్భంగా కాసు మహేష్ ప్రజలతో మమేకమై రాబోయే రోజుల్లో రాజన్న పాలన రావాలని తెలిపారు. జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి గా చేయాలని, ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు.
* కేసీఆర్ ఆంధ్రులపై కక్ష కట్టారని, ఈ ఎన్నికల్లో వైకాపాను ఓడించి కక్ష తీర్చుకోవాలని చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు. ఆయన రెండో రోజు పర్యటన ఎమ్మిగనూరు, పత్తికొండలో మండే ఎండను సైతం లెక్కచేయకుండా ఉత్సాహభరితంగా సాగింది. ముఖ్యమంత్రి మాట్లాడుతూ జిల్లాలో తెదేపా అసెంబ్లీ అభ్యర్థులను గెలిపించి అమరావతికి, ఎంపీ అభ్యర్థులను గెలిపించి దిల్లీకి పంపాలన్నారు.
* వచ్చే నెల 11 వతేదీన జరగనున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గంలో ఆపార్టీ నుంచి ఈ పార్టీ లోకి, ఈ పార్టీ నుండి ఆపార్టీ లోకి వలసలు కొనసాగుతోంది. దీనిలో భాగంగా రామవరం గ్రామానికి చెందిన పలువురు, జగ్గంపేట నిలాజలంపేటకు చెందిన వారు టీడీపీ పార్టీలోకి చేరడంతో వారికి జిల్లా పరిషత్ చైర్మన్ జ్యోతుల నవీన్ కుమార్, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ పేదలకు ఎప్పుడు అండదండగా ఉంటుందన్నారు. మరొక్కసారి తెలుగుదేశం పార్టీకి అవకాశం కల్పించాలని కోరారు.
* తెలంగాణ ఉపాద్యాయ, పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో అదికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టికి భారీ షాక్ తలిగింది.ఎమ్మెల్సీ గా గేలుపొందిన జీవన్ రెడ్డి కారుకి బ్రేకులు వేశారు. కామారెడ్డి పట్టణంలో జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మదన్ మోహన్ ఆద్వర్యంలో ఉపాద్యాయ, పట్టుభద్రుల ఎమ్మెల్సీగ జీవన రేడ్డి గేలుపొందిన సందర్భంగా సంభరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మదన్ మోహన్ మాట్లాడుతూ.. ప్రశ్నించే గోంతు లేకపొతే సమాజం భాగుపడదని తెలిపారు. అందుకని ప్రజ సమస్యాలపై శాసమ మండలిలో ప్రశ్నించేందుకు జీవన్ రెడ్డి ని గేలిపించిన ప్రతిఒక్క మేధావులకి కృతజ్ఞతలు తెలిపారు.ప్రజలలో ప్రతి పక్షం ఉండేందుకు మేధావులంత ఎకమై భారీ మెజారిటీతో గేలిపించడం సంతోషమని అన్నారు. ప్రతిపక్షం లేకుండా కేసిఆర్ చుడడం సిగ్గు చేటాని ప్రతి పక్షం ఉంటెనే ప్రజ సమస్యాలపై గోంతు వేలువడుతుందని పేర్కొన్నారు.
* దేశ, రాష్ట్ర అభివృద్ధి బీజేపీ తోనే సాధ్యం అని నాగర్ కర్నూల్ బీజేపీ ఎంపీ ఎంపీ అభ్యర్థి బంగారు శృతి అన్నారు. ఈ సందర్భంగా ఆమె మెట్రో టీవీ తో ముచ్చటించారు.
* సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికల కార్యాలయని తెలంగాణ ఎన్నికల ఇంచార్జ్ అరవింద్ లింబ వల బర్కత్ పురాలో ప్రారంభించారు పాల్గొన్న మాజీ కెంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి కిషన్ రెడ్డి
* విజయనగరం జిల్లాలో చీపురుపల్లిఅసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో మేరకముడిదాం మండలంబైరిపురం గ్రామంలో. ఈరోజు ప్రముఖ సని నటి కవిత ఎన్నికల ప్రచారంలోపాల్గో న్నారు. గత ఎన్నికల్లమోసపూరిత వాగ్దానాలు చేసిఅదిఖరం లోకి వచ్చి. ఇచ్చినహామీలు మరచి ఏ మోహమ్ పెట్టుకుని తిరిగి
ఓటును అడగడాని కి వస్తారని కవిత ప్రశ్నించారు. నీతివంతమైన పాలన బీజేపీకే సాధ్యం అని తెలిపారు.
* విజయనగరం జిల్లా వేపాడ మండలం… రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో టిడిపి పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వేపాడ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు..ఈ సందర్భంగా శృంగవరపుకోట ఎమ్మెల్యే అభ్యర్థి కోళ్ల లలితకుమారి , విశాఖ పార్లమెంట్ అభ్యర్థి శ్రీ భరత్.. పార్టీ నాయకులు కార్యకర్తలు అధి సంఖ్యలో పాల్గొన్నారు..ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ…28 రాష్ట్రాలలో ఎక్కడ కూడా 2000 పెన్షన్ లేదని ముఖ్యమంత్రి కొడుకు గానే లక్ష కోట్లు దోచిన వ్యక్తి…ముఖ్యమంత్రి ఐతే పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించాలి సభలో నారా లోకేష్ అన్నారు..జగన్ మోహన్ రెడ్డి పేరు మార్చుకోవాల్సిన అవసరం ఉంది అని..కల్వకుంట్ల జగన్ మోడీ రెడ్డిగా మార్చు కోవాలని ఎద్దేవా చేశారు..టిడిపి తిరిగి అదికారం లోకి వస్టే 3000 ఫెన్షన్ ఇస్తాం అని అన్నారు..
* జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లి గ్రామంలో సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పరిమి రమేష్ ఆధ్వర్యంలో ముమ్మర తనిఖీలు పోలీసు సిబ్బంది మరియు ఎలక్షన్ స్పెషల్ టీం తనిఖీలు నిర్వహిస్తున్నారు ఈ తనిఖీలకు సంబంధించి ఎస్సై రమేష్ మీడియాతో మాట్లాడుతూ ఎటువంటి ఆధారాలు లేకుండా ఎవరైనా కారులో గాని టూ వీలర్స్ గాని ఆధారాలు లేకుండా డబ్బు తరలిస్తే వాటిని సీజ్ చేస్తామని అన్నారు.
* గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గంలోని పిడుగురాళ్ల మండలం తుమ్మలచేరువు గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న YSR కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాసు మహేష్ రెడ్డి.ఈ సందర్భంగా కాసు మహేష్ ప్రజలతో మమేకమై రాబోయే రోజుల్లో రాజన్న పాలన రావాలని జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి గా చేయాలని, ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు.
* కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం లోహాలహర్వి మండలం లో.జె. హోసహళ్లి గ్రామంలో జనసేన పార్టీకి బ్రహ్మరథం పట్టిన మహిళలు ముఖ్యంగా గ్రామంలోని జనసేన పార్టీ నాయకుడు వెంకప్ప మహిళలు సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా ,విద్య, వైద్యంలో ఎదుర్కొంటున్న సమస్యలను , అవకతవకలును సరైన మార్గంలో నడిపించే బాధ్యతలను ఆ ఊరి యువకులు చేత చేసి చూపిస్తా అన్ని ప్రసంగించారు , మహిళలు మరుగుదొడ్లు, నీటి సమస్య పరిష్కారానికి ఎక్కువ బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు
* గుంటూరు జిల్లా దాచేపల్లి టౌన్ లో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం లో YSR కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి కాసు మహేష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవరత్నాలను ప్రజలకు వివరించారు. ఒక్క అవకాశం జగన్మోహన రెడ్డికు ఇవ్వాలని కాసు మహేష్ రెడ్డి కోరారు. తనకు ఓటు వేసి గెలిపించాలని ఆయన స్థానిక ప్రజలను అభ్యర్ధించారు.
* కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండల కేంద్రంలో తెరాస ఎంపీ అభ్యర్థి బిబి పాటిల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దీనిలో భాగంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి రోడ్ షో ప్రారంభించారు. అక్కడి నుండి నాగిరెడ్డిపేట్, ఎల్లారెడ్డి లో కూడా ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా బీబీ పాటిల్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలందరు ఎంతో ఆనందంగా ఉన్నారని తెలిపారు. నాల్గునర్ర సంవత్సరాల పాలనలో ప్రజలకు అందుబాటులో ఉండి వారి సంక్షేమం కోసం పని చేశామని తెలిపారు. అందుకు ఇప్పుడు కూడా ఓటు వేసి భారీ ఎత్తున గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్రెడ్డి, మాజీమంత్రి నేరెళ్ళ ఆంజనేయులు, ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్, కామారెడ్డి జిల్లా గ్రంథాలయ చైర్మన్ సంపత్ గౌడ్, మరియు నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
* మిర్యాలగూడలో జరగబోయే కెసిఆర్ బహిరంగ సభకు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనవలసిందిగా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు గుత్తా సుఖేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడు నియోజకవర్గాల మధ్యలో ఉండటం వలన మిర్యాలగూడలో సభ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ సభకు రెండు లక్షల పైన జనాభా వచ్చి కెసిఆర్ సందేశం వినాలని అని పిలుపునిచ్చారు.ఈ సభ మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ నియోజకవర్గం నుంచి సుమారుగా 60 వేల పై చిలుకు జనాభా స్వతహాగా రావటానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
* విజయనగరం పట్టణం లో టీడీపీ విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థి అతిథి గజపతి , పార్లమెంట్ అభ్యర్థి పూసపాటి అశోకగజపతి రాజులు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రచారంలో దూకుడు పెంచారు. తమ అభివృద్ధి కార్యక్రమాలు తమావిజయాన్ని చేకూరుస్తుందని అశోకగజపతి రాజు ధీమా వ్యక్తం చేశారు.
* విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థి కోలగట్ల వీరభద్ర స్వామి తరపున ఆయన అల్లుడు కౌసిక్ ప్రచారం నిర్వహించారు. యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు గా కౌసిక్ ప్రచారబాధ్యత తీసుకున్నారు. విజయనగరం ఎం.ఎల్.ఏ గా వీరభద్ర స్వామి ని గెలిపించాలని ఆయన స్థానిక ప్రజలను కోరారు.
* లంగాణ రాష్ట్రంలో జరిగే పార్లమెంట్ ఎన్నికలలో 16 స్థానలు గెలిపించుకోవాలని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పిలుపునిచ్చారు. నాగర్ కర్నూలు జిల్లా బిజినాపల్లి మండల కేంద్రంలో నియోజకవర్గ పోలింగ్ బూత్ కమిటీ సభ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి నిరంజన్ రెడ్డి ముఖ్య అథితిగా హాజరై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఎం.ఎల్.ఏ మర్రి జనార్దన్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి రాములు, టిఆర్ఎస్ నాయకులూ, కార్యకర్తలు పాల్గొన్నారు.
* బీజేపీ తోనే దేశ, రాష్ట్ర అభివృద్ధి సాధ్యం అని ఆ పార్టీ నాయకురాలు, సినీ నటి కవిత అన్నారు. విజయనగరంలో ఆమె మీడియా తో మట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం ఈ నాలుగేళ్ళ పరిపాలన లో ప్రజలకు చేసింది ఏమి లేదన్నారు. గత ఎన్నికలలో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలదని ఆమె విమర్శించరు. కేంద్రం ఏపీకి సహాయం చేస్తున్న టీడీపీ ప్రభుత్వం ఏమి చేయలేదని అనడం విడ్డురంగా ఉందని తెలిపారు. బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో విజయనగరం పార్లమెంట్ అభ్యర్థి పాకలపాటి సన్యాసిరాజు పాల్గొన్నారు.
* విశాఖ పార్లమెంట్ జనసేన అభ్యర్థి వివి లక్ష్మి నారాయణ , విశాఖ ఉత్తర నియోజకవర్గం అభ్యర్థి పసుపులేటి ఉషా కిరణ్ ఇండస్ట్రియల్ పార్క్ లో వున్న త్రి స్టార్స్ వాకర్స్ క్లబ్ లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. వాకర్స్ ను కల్సి జనసేన కు ఓటు వేయాల్సిందిగా అభ్యర్ధించారు . ఈ సందర్భంగా వివి లక్ష్మి నారాయణ మాట్లాడుతూ సమాజంలో మార్పు కోసం జనసేన వచ్చిందన్నారు. యువతరానికి మంచి ప్రభుత్వాన్ని అందించే బాధ్యత అందరిపై ఉందన్నారు. ఒత్తిడితో బ్రతుకుతున్నామని ఆనందంగా గడపాలని పిలుపునిచ్చారు . పసుపులేటి ఉషా కిరణ్ మాట్లాడుతూ నీతి , నిజాయితీ వున్న వ్యక్తుల ద్వారానే రాష్ట్రంలో మార్పు తీసుకురాగలమన్నారు. త్రి స్టార్స్ వాకర్స్ క్లబ్ సభ్యులు జనసేన కు మద్దతు ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు.
* ఆంధ్ర రాష్ట్ర బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో-2019 రైల్వే మంత్రి పీయూష్ గోయల్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ 5 సంవత్సరాలలో ఏపీ లో అభివృద్ధి అంటే ఏమిటో చూపించామని తెలిపారు. ప్రభుత్వ పధకాలను చంద్రబాబు పధకాలుగా మార్చుకున్నారని ఆరోపించారుస్పెషల్ స్టేటస్ కంటే ఎక్కువ నిధులు ఇచ్చామన్నారు. స్పెషల్ స్టేటస్ విషయంలో చంద్రబాబు యుటర్న్ తీసుకున్నారని తెలిపారు. స్టేటస్ కంటే ప్యాకేజీ ఏ ముద్దు అని చంద్రబాబు అన్నారుని గోయల్ గుర్తు చేశారు.
* జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్ధి మదన్ మోహన్ రావు నారాయణ ఖేడ్ నియోజకవర్గ కాంగ్రెస్ ముఖ్య నాయకుల, కార్యకర్తలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.
* జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మదన్ మోహన్ రావు ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ జహీరాబాద్ నియోజకవర్గ ఇంచార్జీ షబ్బీర్ అలీ అన్నారు. జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో కాంగ్రెస్ నాయకులు మాట్లాడఋ. దేశంలో రాహుల్ గాంధీని ప్రధానిగా చెయ్యాలని దానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బాగా కష్ట పడి పని చేయాలని తెలిపారు. అదే విధముగా అభివృద్ధికి నోచుకోని జహీరాబాద్ పార్లమెంటు అభ్యర్థి మదన్ మోహన్ రావు ని గెల్పించినట్లయితే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. సమస్యలు పరిష్కారం లో ముందు ఉంటారాని తెలిపారు. కావున ప్రజలు అందరు ఆలోచించి ఓట్లు వేయాలి అని కోరారు.
* తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా జగిత్యాల వారి సాంస్కృతిక అకాడమీ ఆధ్వర్యంలో ఆలయంలోని శేషప్ప కళ వేదికపై ఏర్పరచిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఎంతో అలరించాయి. తదనంతరం విద్యార్థులు నృత్య కళా ప్రదర్శించారు. అకాడమీ ఆర్గనైజర్l, ఆలయ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి , eo అమరేందర్ లు వారిని ఘనంగా సత్కరించారు.
* ఖమ్మం జిల్లా సత్తుపల్లి లో కాంగ్రెస్,తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశం లో పాల్గొన్న ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రేణుక చౌదరి,అశ్వారావుపేట ఎమ్మెల్యే మచ్చా నాగేశ్వరావు,మాజీ మంత్రి సంభాని చంద్ర శకర్.సత్తుపల్లి నియోజక వర్గ స్థాయి కార్యకర్తలు.
* ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ను విధుల నుంచి తొలగించాలని కోరుతూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి విఙ్ఞప్తి చేశారు. ఈ మేరకు వైఎస్సార్‌ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, పార్టీ సీనియర్‌ నేతలు వైవీ సుబ్బారెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, బొత్స సత్యనారాయణ తదితరులు కేంద్ర ఎన్నికల సంఘం ఫుల్‌ కమిషన్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా.. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేసేలా పోలీసు యంత్రాగాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆర్పీ ఠాకూర్‌పై ఫిర్యాదు చేశారు. ఎన్నికల నేపథ్యంలో పోలీసు వాహనాల్లోనే డబ్బును నియోజకవర్గాలకు చేరుస్తున్నారని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఘట్టమనేని శ్రీనివాస్, యోగానంద్, విక్రాంత్ పాటిల్, కోయా ప్రవీణ్‌తో పాటు మరికొంత మంది ఐపీఎస్ అధికారులు ఏపీ ముఖ్యమంత్రి కనుసన్నల్లో అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదు చేశారు.
*మూడో దశ ఎన్నికలకు ఈసీ గురవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఏప్రిల్‌ 23న పోలింగ్‌ జరగనుంది. ఇందుకు ఏప్రిల్‌ 4 వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. 5న నామినేషన్ల పరిశీలిస్తారు. 8వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. మొత్తం 14 రాష్ట్రాల్లో 115 నియోజకవర్గాల్లో 23న పోలింగ్‌ జరగనుంది. మే 23న ఫలితాలు వెలువడనున్నాయి.మూడో దశలో గుజరాత్‌లో 26, కేరళలో 20, కర్ణాటక 14, మహారాష్ట్రలో 14, యూపీలో 10, ఛత్తీస్‌గఢ్‌లో 7, ఒడిశాలో 6, బిహార్‌లో 5, పశ్చిమబెంగాల్‌లో 5, అసోంలో 4, గోవాలో 2, జమ్ముకశ్మీర్‌, డామన్‌ డయ్యూ, దాద్రానగర్‌ హవేలీలోని ఒక్కో స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. వీటితో పాటే ఒడిశా అసెంబ్లీకి కూడా పోలింగ్‌ జరగనుంది.
* జమ్ము కశ్మీర్ లో ఉగ్రవాదులు, భద్రత బలగాలకు నడుమ ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. సోఫియాన్ జిల్లా కెల్లర్ ప్రాంతంలో సైన్యం జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. కెల్లర్ ప్రాంతంలో ఉగ్రవాదులు దాగి ఉన్నారనే సమాచారంతో సీఆర్పీఎఫ్, స్థానిక పోలీసులతో కలసి సైన్యం ఈ ఆపరేషన్ చేపట్టింది. మరింత మంది ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో సైన్యం గాలింపు కొనసాగిస్తోంది.
*పుల్వామా ఉగ్రదాడి సూత్రధారిపాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్‌ అధినేత మౌలానా మసూద్‌ అజార్‌ను బ్లాక్‌ లిస్ట్‌లో చేర్చేందుకు అమెరికా చర్యలు ప్రారంభించింది. మసూద్‌ను బ్లాక్‌ లిస్ట్‌లో చేర్చేందుకు ఆమెరికా సరికొత్త తీర్మానాన్ని తయారీ చేసి బ్రిటన్‌ఫ్రాన్స్‌తో పాటు 15 సభ్యదేశాలకు కాపీలను అందజేసింది. ఐసిస్‌,అల్‌ఖైదాతో జైషేనేతకు సంబంధాలు ఉన్నాయని ఆమెరికా తెలుపుతోంది. దీంతో మసూద్‌పై ఆంక్షలు విధించింది. మసూద్ అజార్ ప్రయాణాలను నిషేధించడంతో పాటు అతని ఆస్తులను కూడా స్తంభింపజేయాలని అమెరికా నిర్ణయం తీసుకుంది. ఐసిస్‌, అల్‌ఖైదా వంటి ఉగ్ర సంస్థలకు మసూద్ ఆర్థిక సాయం అందించడంప్రణాళికలు రూపొందించడంమద్దతు తెలపడం వంటివి చేశారని పేర్కొన్నారు. మసూద్ విషయంలో ఇప్పటికే తీసుకొచ్చిన ఒక తీర్మానాన్ని చైనా నిలిపి ఉంచిన సంగతి తెలిసిందే. అలాంటి సమయంలో అమెరికా మరో తీర్మానంతో ముందుకు రావడం విశేషం.
*తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ రాఘవేంద్ర సింగ్‌ చౌహాన్‌ను నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ టీబీఎన్‌ రాధాకృష్ణన్‌ కోల్‌కతాకు బదిలీ అయిన నేపథ్యంలో సీనియర్‌ న్యాయమూర్తి అయిన ఆర్‌ఎస్‌ చౌహాన్‌కు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి బాధ్యతలను అప్పగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు
*సీఆర్పీఎఫ్‌ జవాన్లు 40 మంది ప్రాణాలను బలిగొన్న పుల్వామా దాడి వెనుక జైష్‌ ఎ మహమ్మద్‌ ఉగ్రముఠా కుట్ర నిరూపణకు పాకిస్థాన్‌ మరిన్ని ఆధారాలను కోరింది. ఇస్లామాబాద్‌లో ఉన్న భారత హైకమిషనర్‌ అజయ్‌ బిసారియాను బుధవారం పాకిస్థాన్‌ విదేశాంగ కార్యదర్శి తెహ్మినా జాన్జువా తన కార్యాలయానికి పిలిపించుకుని మరింత సమాచారం, సాక్ష్యాలు కావాలని అడిగారు.
*విశ్రాంత న్యాయమూర్తులను ట్రైబ్యునళ్లలో నియమించడం న్యాయవ్యవస్థ స్వతంత్రతకు మచ్చేనన్న అభిప్రాయం సరైనదేనని బుధవారం సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అయితే నియామకాల్లో విపరీతమైన జాప్యం కారణంగా చాలామంది హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తులు వీటిల్లో పనిచేయడానికి సుముఖత చూపడం లేదని తెలిపింది.
*కశ్మీర్‌ను ప్రత్యేక దేశంగా పేర్కొన్న ఫేస్‌బుక్‌.. తర్వాత పొరపాటును గుర్తించి క్షమాపణలు ప్రకటించింది. ఇరాన్‌ నెట్‌వర్క్‌లకు లక్ష్యంగా మారిన దేశాలను ప్రస్తావిస్తూ ఓ బ్లాగ్‌ పోస్టులో పెట్టిన జాబితాలో ఈ పొరపాటు తలెత్తింది. ఇరాన్‌కు సంబంధించిన బహుళ నెట్‌వర్క్‌లు అనధీకృత చర్యలకు పాల్పడిన కారణంగా 513 పుటలు, బృందాలు, ఖాతాలను తొలగించినట్లు ఫేస్‌బుక్‌ పేర్కొంది. ఈజిప్టు, ఇండియా, ఇండోనేసియాలతోపాటు కశ్మీర్‌ను సదరు దేశాల జాబితాలో చేర్చింది. తప్పును గుర్తించడంతో ఓ ప్రకటన చేసింది.
*ప్రధాని మోదీ ఈనెల 29న మహబూబ్‌నగర్‌లో జరిగే బహిరంగ సభతోపాటు ఏప్రిల్‌ 1న హైదరాబాద్‌లో ఎల్బీ స్టేడియంలో జరిగే బహిరంగ సభలోనూ పాల్గొంటారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ తెలిపారు. భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా తెలంగాణ ప్రచార షెడ్యూల్‌ సైతం ఖరారైందని చెప్పారు. హైదరాబాద్‌లో బుధవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ..‘‘అమిత్‌షా ఏప్రిల్‌ 4న.. కరీంనగర్‌, వరంగల్‌ నగరాల్లో జరిగే బహిరంగ సభల్లో పాల్గొంటారు. 6న నల్గొండతోపాటు హైదరాబాద్‌లో రోడ్‌షోల్లో పాల్గొని పార్టీ అభ్యర్థులకు ప్రచారం చేస్తారు’’ అని వివరించారు.
*‘వివేకానందరెడ్డి హత్య కేసులో నా పాత్ర ఉంటే నా గొంతుకోయండి…రాళ్లతో కొట్టండి. ఉరి తీయండి. నాకు కూడా భార్య, పిల్లలు ఉన్నారు. ఎందుకలా ఆరోపిస్తారు..ధర్మం తెలుసుకోండి’ అంటూ కడప పార్లమెంట్‌ తెదేపా అభ్యర్థి ఆదినారాయణరెడ్డి పేర్కొనగా.. మీ అన్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాయ నుంచి బయటపడి వాస్తవాలను గ్రహించాలని వివేకా కుమార్తె సునీతకు కడప జిల్లా తెదేపా పులివెందుల శాసనసభ అభ్యర్థి సతీష్‌రెడ్డి సూచించారు.
*ఆదిలాబాద్‌ జిల్లా బేల మండలం కరొణి(కె)లోని ప్రాథమిక పాఠశాల భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరింది. గతేడాది జులైలో మూలభాగంలో గోడ కూలిపోగా తాజాగా బుధవారం వెనుక భాగంలో బీటలు వారిన సగభాగం గోడ కుప్పకూలింది.
* రాష్ట్రవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీల పరిధిలో పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఉమ్మడి ప్రవేశపరీక్ష (సెట్‌) కన్వీనర్‌గా ఆచార్య కిషన్‌ నియమితులయ్యారు. ఓయూ గణిత శాఖకు చెందిన ఆయన అడ్మిషన్‌ విభాగానికి సంచాలకులుగా పనిచేస్తున్నారు.
*దక్షిణ రైల్వే పరిధిలోని అరక్కోణం-టక్కోలం మార్గంలో చేపట్టనున్న అభివృద్ధి పనుల నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సహా ఇతర రాష్ట్రాల నుంచి చెన్నై వైపు రాకపోకలు సాగించే 18 రైళ్లు పూర్తిగా రద్దు కానున్నాయి.
* ఓటర్లకు సంబంధించిన కీలక సమాచారం చోరీ వ్యవహారంలో దాఖలైన ఇంప్లీడ్‌ పిటిషన్‌ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి, ఆ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి, విశిష్ట గుర్తింపు ప్రాధికార (ఆధార్‌) సంస్థకు, ఏపీ ఆధార్‌ ఎన్‌రోల్‌ ఏజెన్సీకి బుధవారం హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
*శ్రీకాకుళం, కడప జిల్లాలకు కేంద్ర ఎన్నికల సంఘం కొత్త ఎస్పీలను నియమించింది. శ్రీకాకుళం జిల్లాకు నవదీప్‌సింగ్‌ గ్రేవల్‌ను, కడప జిల్లాకు అభిషేక్‌ మహంతిని నియమిస్తూ బుధవారం రాత్రి ఆదేశాలు జారీ చేసింది.
*లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్థులు వేసిన నామినేషన్లలో 503 ఎన్నికల సంఘం ఆమోదం పొందాయి. తెలంగాణ రాష్ట్రంలోని 17 స్థానాలకు 648 నామినేషన్లు దాఖలైన విషయం తెలిసిందే. వీటిని పరిశీలించిన అధికారులు నిబంధనలకు అనుగుణంగా లేని 145 నామినేషన్లను తిరస్కరించారు. నిజామాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి 203 నామినేషన్లు రాగా మంగళవారం 12 తిరస్కరణకు గురయ్యాయి. ఎన్నికల సంఘం బుధవారం వెలువరించిన జాబితాలో ఈ సంఖ్య 14కు పెరిగింది. పరిశీలన ప్రక్రియ పూర్తయ్యాక అధికారులు సరైనవిగా గుర్తించిన నామినేషన్లు అత్యధికంగా నిజామాబాద్‌ నుంచి 189 ఉన్నాయి. తదుపరి నల్గొండ (31), సికింద్రాబాద్‌ (30), ఖమ్మం (29), చేవెళ్ల (24) ఉన్నాయి. అత్యల్పంగా మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌ నుంచి 12 చొప్పున ఉన్నాయి. జహీరాబాద్‌ స్థానంలో ఒక్క నామినేషనూ తిరస్కరణకు గురికాకపోవడం విశేషం. ఈ నియోజకవర్గంలో దాఖలైన 18 నామినేషన్లూ ఆమోదం పొందాయి.
*మహిళా పారిశ్రామికవేత్తల కోసం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వీ-హబ్‌ ప్రధాన కార్యాలయ భవనాన్ని గురువారం ప్రముఖ పారిశ్రామికవేత్త, బయోకాన్‌ సీఎండీ కిరణ్‌ మజుందార్‌ షా ప్రారంభించనున్నారు. జూబ్లిహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 45లోని బీఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం వద్ద కొత్త కార్యాలయాన్ని సిద్ధం చేశారు. కార్యక్రమంలో పరిశ్రమల ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌, పారిశ్రామికవేత్తలు పాల్గొంటారని వీ-హబ్‌ సీఈవో దీప్తి రావుల తెలిపారు. రెండేళ్ల క్రితం వీహబ్‌ను ప్రభుత్వం ప్రారంభించింది. అప్పటి నుంచి అది తాత్కాలిక కార్యాలయంలో కొనసాగుతోంది. దానికి అన్ని వసతులతో కూడిన కొత్త కార్యాలయాన్ని తాజాగా ఏర్పాటు చేశారు.
*ఏపీ ఎంసెట్‌-2019కు అపరాధ రుసుము లేకుండా దరఖాస్తుల గడువు బుధవారంతో ముగిసింది. రాత్రివరకు మొత్తం 2,73,905 దరఖాస్తులువచ్చాయి. ఇంజినీరింగ్‌విభాగానికి 1,88,779 మంది, వ్యవసాయ, వైద్య విభాగానికి 82,782 మంది దరఖాస్తులు సమర్పించారు. రెండు విభాగాలకు కలిపి 1,344 మంది దరఖాస్తు చేశారు. అపరాధ రుసుము రూ.500తో ఏప్రిల్‌ 4, రూ.వెయ్యితో ఏప్రిల్‌ 9, రూ5 వేలతో ఏప్రిల్‌ 14, రూ.10వేలతో ఏప్రిల్‌19 వరకు దరఖాస్తుచేసుకోవచ్చని ఎంసెట్‌ కన్వీనర్‌ ప్రొ।।సాయిబాబు తెలిపారు.
*ఉత్తరాంధ్ర జిల్లాల్లో కొన్నిచోట్ల ఈ నెల 30, 31వ తేదీల్లో వడగండ్ల వాన కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో ఈదరుగాలులు వీస్తాయని, పిడుగులు పడతాయని హెచ్చరించారు. మరోవైపు రాయలసీమలో అధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి.
*రాష్ట్రంలో 2017-18 విద్యాసంవత్సరానికి సంబంధించి బోధనా రుసుములు, ఉపకార వేతనాలకు రూ. 2,050 కోట్లు చెల్లించామని ఎస్సీ సంక్షేమశాఖ డైరెక్టర్‌ కరుణాకర్‌ తెలిపారు. ధ్రువీకరించిన దరఖాస్తుల డిమాండ్‌ రూ.2,237 కోట్లు ఉంటే, ఇందులో రూ. 2,050 కోట్లు విద్యార్థులు, కళాశాలల ఖాతాలకు పంపించామని చెప్పారు.
*అగ్రిగోల్డ్‌ వ్యవహారంలో ప్రధాన ఆస్తిగా పేర్కొంటున్న హాయ్‌ల్యాండ్‌ను కొనుగోలు చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. ఎస్‌బీఐ మొదట రూ.700 కోట్ల కనీస ధరగా పేర్కొంటూ ప్రకటన జారీ చేసింది. స్పందన లేక పోవడంతో హైకోర్టు అనుమతితో రూ.500 కోట్లు కనీస ధరగా ప్రకటన జారీ చేసింది.
*రాష్ట్రంలో 2017-18 విద్యాసంవత్సరానికి సంబంధించి బోధనా రుసుములు, ఉపకార వేతనాలకు రూ. 2,050 కోట్లు చెల్లించామని ఎస్సీ సంక్షేమశాఖ డైరెక్టర్‌ కరుణాకర్‌ తెలిపారు. ధ్రువీకరించిన దరఖాస్తుల డిమాండ్‌ రూ.2,237 కోట్లు ఉంటే, ఇందులో రూ. 2,050 కోట్లు విద్యార్థులు, కళాశాలల ఖాతాలకు పంపించామని చెప్పారు.
* అగ్రిగోల్డ్‌ వ్యవహారంలో ప్రధాన ఆస్తిగా పేర్కొంటున్న హాయ్‌ల్యాండ్‌ను కొనుగోలు చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు.
*వేగంగా వెళుతున్న ఓ రైలు చివరి బోగీ చక్రాల నుంచి మంటలు రావడంతో నిలిపివేసిన ఘటన వికారాబాద్‌ జిల్లా బషీరాబాద్‌ మండలం నవాంద్గీ స్టేషన్లో చోటుచేసుకుంది. నిజామాబాద్‌ నుంచి తిరుపతి వెళ్తున్న రాయలసీమ ఎక్స్‌ ప్రెస్‌ బుధవారం రాత్రి 8.26 గంటలకు నవాంద్గీ స్టేషన్‌ సమీపంలోకి వచ్చింది.
*ఓటర్లకు సంబంధించిన కీలక సమాచారం చోరీ వ్యవహారంలో దాఖలైన ఇంప్లీడ్‌ పిటిషన్‌ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి, ఆ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి, విశిష్ట గుర్తింపు ప్రాధికార (ఆధార్‌) సంస్థకు, ఏపీ ఆధార్‌ ఎన్‌రోల్‌ ఏజెన్సీకి బుధవారం హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
*ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గం ఎన్నికల ఫలితాలు గురువారం రాత్రికి వెలువడే అవకాశం ఉంది. మంగళవారం ఉదయం తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో మొదలైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిరాటంకంగా కొనసాగుతోంది. మొదటి రౌండ్‌ నుంచీ పీడీఎఫ్‌ బలపరిచిన అభ్యర్థి ఇళ్ల వెంకటేశ్వరరావు (ఐ.వి.) ఆధిక్యంలో ఉన్నారు. మంగళవారం రాత్రి 12వ రౌండ్‌ పూర్తయ్యేసరికీ అదే పరిస్థితి కొనసాగింది. ఐవీకి 42,886 మొదటి ప్రాధాన్యత ఓట్లు సాధించి ముందంజలో ఉండగా 18,580 ఓట్లతో ఆదిత్య విద్యా సంస్థల ఛైర్మన్‌, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి శేషారెడ్డి రెండో స్థానంలో నిలిచారు. దిద్దే అంబేడ్కర్‌, టి.కె.విశ్వేశ్వరెడ్డి తర్వాతి స్థానాల్లో ఉన్నారు. 12 రౌండ్లలో లెక్కించిన మొత్తం 83,977 ఓట్లలో 6,097 చెల్లని ఓట్లుగా ఎన్నికల అధికారులు గుర్తించారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com