ఆ లోన్ తీసుకోండి.. ఈ లోన్ తీసుకోండి అంటూ పొద్దున్న లేస్తే ఫోన్లో వాయించేస్తుంటారు. దీంట్లో మనకి పనికి వచ్చేవి కొన్నే ఉంటాయి. మిగతా వాటి పట్ల పొరపాటున అట్రాక్ట్ అయినా రేపొద్దున వడ్డీ కట్టాలంటే ఇబ్బంది పడేది కూడా మనమే. దానికంటే ముందే అది నిజంగా మనకి అవసరమా కాదా అని ఆలోచించి తీసుకుంటే మంచిది. హోమ్‌లోన్, ఎడ్యుకేషన్ లోన్, వెహికల్ లోన్ అంటే చాలా అవసరం కాబట్టి తప్పదు.అర్జంటుగా నగదు అవసరమైనప్పుడు పనికి వచ్చేది మాత్రం గోల్డ్ లోన్ చాలా ఉపయోగపడుతుంది. అలాగే ఈ గోల్డ్ లోన్‌కి క్రెడిట్ స్కోర్ బాధలు కూడా ఉండవు.గోల్డ్ లోన్ ప్రాసెస్ కూడా సులభంగా ఉంటుంది. బంగారం తనఖా పెట్టిన వెంటనే నగదు ఇస్తుంటారు. కొన్ని నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ చెప్పే మాటలు విని మోసపోకండి.రీపేమెంట్ కూడా ఈజీగానే వుంటుంది. వడ్డీ చెల్లింపు విషయంలో ఇబ్బంది ఉండదు. అసలు కడుతూ వడ్డీ నెమ్మదిగా కట్టుకోవచ్చు.ఇతర లోన్ల వడ్డీ రేట్లతో పోల్చితే గోల్డ్ లోన్స్ మీద వడ్డీ రేట్లు తక్కువగా ఉంటాయి.ఇక గోల్డ్ లోన్ తీసుకుంటున్నవారు గుర్తుంచుకోవలసిన ముఖ్య విషయాలు కూడా కొన్ని ఉన్నాయి. అవి..బ్యాంకులు సాధారణంగా బంగారం మొత్తం వాల్యూ మీద 75 శాతం మాత్రమే నగదును రుణంగా ఇస్తాయి.మీరు రుణం చెల్లించలేని పరిస్థితుల్లో తనఖా పెట్టిన బంగారం మొత్తం శాశ్వతంగా బ్యాంకు లేదా ఎన్‌బీఎఫ్‌సీ ఆధీనంలోకి వెళ్లిపోతుంది.సాధారణంగా బంగారు నగల తనఖా గరిష్టంగా 3 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది.ఇక పర్సనల్ లోన్స్ విషయానికి వస్తే..డాక్యుమెంటేషన్ సులభంగా పూర్తవుతుంది.పర్సనల్ లోన్ పొందేందుకు ఎలాంటి సెక్యూరిటీ అవసరం లేదు. గోల్డ్ లోన్‌తో పోల్చితే ఇది చాలా సులభం అని చెప్పవచ్చు.అవసరానికి పర్సనల్ లోన్ పొందొచ్చు.పర్సనల్ లోన్స్ తీసుకునే ముందు వాటిలో ఉన్న ఇబ్బందులను ఓ సారి పరిశీలించాలి.పర్సనల్ లోన్స్ సాధారణంగా అధిక వడ్డీ రేట్లను కలిగి ఉంటాయి. ఇదే పర్సనల్ లోన్స్ పొందేందుకు ప్రధాన అడ్డంకిగా మారతాయి.ముఖ్యంగా పర్సనల్ లోన్ పొందాలంటే కచ్చితంగా క్రెడిట్ కార్డ్ స్కోర్‌ని పరిగణనలోకి తీసుకుంటారు. క్రెడిట్ స్కోర్ అంటే ట్రాన్సాక్షన్లు, వడ్డీ సమయానికి కడుతున్నారా లేదా ఇంకా మరికొన్ని విషయలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఇస్తారు.లోన్ ముందు చెల్లిస్తే కూడా పెనాల్టీ కట్టాల్సి ఉంటుంది. అందుకు బ్యాంకులు ఎలాంటి మొహమాటం లేకుండా లోన్ క్యాన్సిలేషన్ ఛార్జీలను మీ దగ్గర నుంచి వసూలు చేస్తారు. పర్సనల్ లోన్స్ విషయంలో ఇది కూడా ఒక ప్రధాన అడ్డంకిగా మారుతుంటుంది.దీన్ని బట్టి లోన్ ఇస్తాం తీసుకోండి బాబు అని మీ వెంట పడే బ్యాంకులు.. అందులోని సాధక బాధలన్నీ తెలుసుకున్నాకే తీసుకోండి. కాస్త ఆలస్యమైనా అన్ని వివరాలు అడిగి తెలుసుకున్నాకే ముందడుగేయండి.
