ఓ మహిళ బ్రా మాటున బంగారం బిస్కెట్లు పెట్టుకొని విమానంలో రావడంతో చెన్నై విమానాశ్రయ అధికారులు థాయ్ మహిళను అరెస్టు చేశారు. థాయ్‌లాండ్‌కు చెందిన క్రైసోర్న్ థాంప్రకోప్ (38) అనే మహిళ 47 లక్షల రూపాయల విలువైన 1.4 కిలోల బంగారం బిస్కెట్లను బ్రాల కింద పెట్టుకొని టీజీ 337 విమానంలో చెన్నై విమానాశ్రయంలో దిగింది. విమానాశ్రయ అధికారులు ఆమెను అరెస్టు చేసి బంగారం బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. పద్మావతి అనే మరో ప్రయాణికురాలు రూ.12 లక్షల విలువచేసే 365 గ్రాముల బంగారాన్ని కువైట్ నుంచి డ్రాయరు లోపల దాచుకొని తరలిస్తుండగా విమానాశ్రయ అధికారులు పట్టుకున్నారు
