* మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో ఏపీ హైకోర్టు శుక్రవారం కీలక ఉత్తర్వులు ఇచ్చింది. ఈ హత్య ఘటనపై ఎవరు వ్యాఖ్యానించరాదని ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తరఫున అండర్ టేకింగ్ ఇవ్వాలని ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ (ఏజీ)ను హైకోర్టు ఆదేశించింది. మరోవైపు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తరపున.. న్యాయవాదులు అండర్ టేకింగ్ ఇచ్చారు. అలాగే ఈ కేసుకు సంబంధించి పోలీసులు, సిట్ సైతం మీడియాకు వివరాలు అందించడానికి వీలు లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. కేసు తదుపరి విచారణను ఏప్రిల్ 15వ తేదీకి వాయిదా వేసింది. కాగా ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తుపై నమ్మకం లేదని వివేకా హత్యకేసును సీబీఐకి అప్పగించాలని కోరుతూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్ సౌభాగ్యమ్మ ఏపీ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. సిట్ పేరుతో వైఎస్ కుటుంబ సభ్యులపై బురద జల్లేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని న్యాయవాదులు కోర్టుకు వివ్నవించారు. ఏపీ ప్రభుత్వం, పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై అనుమానాలున్నాయని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఏపీ ప్రభుత్వ అజమాయిషీలో లేని దర్యాప్తు సంస్థకు కేసు విచారణ అప్పగించాలని కోరిన విషయం తెలిసిందే.
* తాగి వాహనం నడిపితే మరణ శిక్షే
తప్పతాగి రోడ్డు మీద రయ్ రయ్ అని దూసుకెళ్ళే వారి గుండె గుభేలుమనే వార్త. ఎందుకంటే ఇక నుంచి డ్రంకెన్ డ్రైవ్ కు మరణ శిక్షే. అయితే ఇండియాలో కాదు.. తైవాన్లో ఈమేరకు ఆ దేశ ప్రభుత్వం గురువారం నిర్ణయం తీసుకుంది. తాగి వాహనం నడిపి మనుషుల ప్రాణాలు తీసే వారికి మరణ దండన విధిస్తూ క్రిమినల్ కోడ్ సవరణ ముసాయిదాకు అక్కడి కేబినేట్ ఆమోదం తెలిపింది. తాగి వాహనం నడిపి జైలుకేల్లోచ్చిన వారి ఐదేళ్ళలో మళ్ళీ అదే నేరం చేస్తే శిక్ష కాలం పెరుగుతోంది. యాక్సిడెంటులో వ్యక్తులు తీవ్రంగా గాయపడితే పన్నెండేళ్ళ శిక్ష విధించనున్నారు. ఈ ప్రతిపాదనను పార్లమెంటు ఆమోదించాల్సి ఉంది. తైవాన్లో తాగి నడిపిన ప్రాణాలు తీస్తే ప్రస్తుతం పదేళ్ళ వరకు శిక్ష విధిస్తున్నారు. తాగి నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతూ ప్రాణాలు తీస్తున్న సంఘటనలలు తైవాన్లో పెరిగిపోతున్నాయని, అనేక కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తైవాన్ సర్కారు చెప్పింది. ఈ ఏడాది జనవరిలో ఓ వ్యక్తీ తప్ప తాగి వాహనం నడిపి ముగ్గురి మృతికి కారణమయ్యాడు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
*సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో లక్ష్మి ఎన్టీఆర్ సినిమాను నిలిపి వేయాలని టీడీపీ కార్యకర్తలు నల్ల జెండాలతో ధియేటర్ ముందు నిరసన చేపట్టారు. సినిమా ఒక వర్గానికి ప్రోత్సహించే విధంగా ఉందని వారు అభ్యంతరం వ్యక్తం చేశారు.
*ఉత్తరప్రదేశ్ లోని గ్రేటర్ నోయిడాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వెళ్తున్న బస్సు, లారీ డీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 31 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో 12 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు యమునా ఎక్స్ ప్రెస్ హైవే ఈ ఘటన జరిగింది. క్షతగాత్రుల్ని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
*హైదరాబాద్ నగరంలో రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ఇంటి అద్దె అడిగిన యంజమనిని ఓ యువకుడు దారుణంగా కత్తితో పొడిచాడు. గురువారం అర్ధరాత్రి స్థానిక హసన్ నగర్ లో ఈ ఘటన జరిగింది. ఇంటి అద్దె అడిగిన క్రమంలో వారిద్దరి మద్య స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో కోపోద్రిక్తుడైన యువకుడు యజమాని కడుపులో రెండు పోతూ పొడిచాడు.
*ఆంధ్రప్రదేశ్ డీజీపీ వాహనంలో తెదేపా సొమ్ములు తరలిస్తోందని వైకాపా నేతలు ఆరోపించారు. ఈమేరకు గురువారం వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి మాజీ ఎంపీలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వైవీ సుబ్బారెడ్డి బొత్స సత్యనారాయణలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమీశానర్ సునీల్ ఆరోడా, కమిషనర్లు సుషీల్ చంద్ర సశోక్ లవసాలతో భేటీ అనంతరం విజయసాయి రెడ్డి మీడియాతో మాట్లాడారు. డీజీపీ ఆర్పీ టాకూర్, ప్రక్సాహం గుంటూరు రూరల్, చిత్తూరు ఎస్పీలు, అధికారులు దామోదర్ నాయుడు, యోగానంద్, ఘట్టమనేని శ్రీనివాస్ లను బదిలీ చేయాలనీ కోరినా ఈసీ వాహనాన్ని తనిఖీ చేసే అధికారం ఎన్నికల సంఘానికే ఉందని అందుకే అధరాలు చూపలేక పోతున్నమన్నారు.
*హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న ఓ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో కారు యజమాని ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డాడు. హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. విప్రోలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌గా పనిచేసే విజయ్ రాహుల్ తన కారులో (టీఎస్09ఈజడ్7989) శుక్రవారం ఉదయం ఔటర్ రింగురోడ్డు వైపు వెళ్తున్నాడు. ఉదయం 10:10గంటల సమయంలో కారు హయత్‌నగర్ ఆర్టీసీ కాలనీ సమీపంలోకి చేరుకోగానే ఇంజిన్ నుంచి అకస్మాత్తుగా మంటలు వచ్చాయి. వెంటనే కారును రోడ్డు పక్కగా నిలిపిన అతడు కారు లోంచి దిగి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ఈ ప్రమాదంతో ఆ మార్గంలో ట్రాఫిక్ స్తంభించింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.
*తూర్పుగోదావరి జిల్లా రాజోలు బీసీ వసతి గృహంలో ఉంటున్న పదోతరగతి విద్యార్థి ఉరికి వేలాడుతూ విగతజీవిగా కనిపించాడు. అతడి మృతికి ప్రేమ వ్యవహారమే కారణమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
*బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని విలాసవంతమైన బనానీ ప్రాంతంలో గల 22 అంతస్తుల భవంతిలో గురువారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.
* సీనియర్లు తీవ్రంగా కొట్టడంతో మృతి చెందిన ఏడో తరగతి బాలుడి మృతదేహాన్ని యాజమాన్యం, సిబ్బంది గుట్టుచప్పుడు కాకుండా స్కూలు ఆవరణలోనే పాతిపెట్టిన దిగ్భ్రాంతికర సంఘటన రిషికేశ్ సమీపంలోని ఓ రెసిడెన్షియల్ పాఠశాలలో జరిగింది.
*లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఇప్పటివరకు రూ.23.38 కోట్ల విలువైన మద్యం, మాదకద్రవ్యాలు, నగదు, ఇతర వస్తువులు సీజ్ చేసినట్లు రాష్ట్రఎన్నికల అధికారి కార్యాలయం నివేదికలో పేర్కొంది.
*జమ్ము-కశ్మీర్‌లోని షోపియాన్, కుప్వారా జిల్లాల్లో గురువారం జరిగిన రెండు వేరు వేరు ఎదురుకాల్పుల సంఘటనల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.
*నకిలీ వీసాలను సృష్టించి అమాయకులను మోసం చేస్తున్న ముఠాలోని ఇద్దరిని గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు.
*పదోతరగతి విద్యార్థినిపై అత్యాచారానికి ప్రయత్నించిన ఇన్విజిలేటర్ కటకం నర్సింహమూర్తిని డీఈవో మదన్‌మోహన్ గురువారం సస్పెండ్ చేశారు.
*గయలోని దుమారియాలో భాజపా నేత, మాజీ ఎమ్మెల్సీ అనుజ్‌కుమార్ సింగ్ ఇంటిని మావోయిస్టులు బాంబులతో పేల్చివేశారు. దాదాపు 20-30 మంది సాయుధులైన మావోయిస్టులు ఈ దాడిలో పాల్గొన్నట్లు పోలీసులు తెలిపారు. అప్పటికి ఇంటిలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పినట్లు గయ సీనియర్ ఎస్పీ చెప్పారు. ఎన్నికలను బహిష్కరించాలంటూ మావోయిస్టులు గోడపత్రికలను కూడా అతికించినట్లు పోలీసులు తెలిపారు
*కర్ణాటకలోని రాయచూరు జిల్లా సిందనూరు తాలుకా గాంధీనగర్‌కు చెందిన తెలుగు వైద్యుడు నందిగం మణిదీప్ (28) అమెరికాలోని న్యూజెర్సీ సమీపంలోని ఎడిషన్‌లో అనుమానాస్పదంగా మృతిచెందాడు. ఈ సమాచారం గురువారం సిందనూరులో ఉన్న అతని తల్లిదండ్రులు నందిగం శ్రీనివాస్, పద్మలకు అమెరికాలో ఉన్న వారి బంధువుల ద్వారా తెలిసింది. మృతికి గల కారణాలు తెలియరాలేదు. మణిదీప్ కర్ణాటకలోని మణిపాల్ లో ఎంబీబీఎస్ పూర్తిచేశాడు. ఆతర్వాత అమెరికా వెళ్లి అక్కడి ఎడిషన్‌లోని సెంట్‌పీటర్స్ టీచింగ్ హాస్పట ల్‌లో పీజీ తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. మణిదీప్ మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
*అనంతపురంజిల్లాలోని తాడిపత్రి ఫ్లై ఓవర్ దగ్గర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. అదుపుతప్పి బైక్‌ను బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రామాంజనేయులు (35) దుర్మరణం చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలను సేకరించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
*కామారెడ్డి పలు గ్రామాల్లో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.వేల నగదు తులాల వెండి గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు రిమాండ్‌కు తరలించారు.
*భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సరిహద్దు చత్తీస్ గఢ్ బీజాపూర్ జిల్లా బాసగుడా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆయుటపల్లి-కొరసాగుడా గ్రామాల అటవీ ప్రాంతంలో పోలీసులుమావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. కాల్పుల అనంతరం సీఆర్పీఎఫ్ బెటాలియన్ పోలీసులు సంఘటన స్థలంలో భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.
