*బ్యాంకు పనులేమైనా ఉంటె ఆరోజు చేసేసుకోండి ఆర్ధిక సంవత్సరం చివరి రోజుకావడంతో ఆదివారం కూడా బ్యాంకులు తెరిచే ఉంటాయట. రిజర్వ్యు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాల ప్రకారం బ్యాంకులు ఈ ఆదివారం పని చేస్తున్నాయి. 2018-19 ఆర్ధిక సంవత్సరానికి చెందిన అన్ని ప్రభుత్వ లావాదేవీలను అదే ఆర్ధిక సంవత్సరంలో లేక్కించాలని ఆర్బీఐ బ్యాంకులకు ఆదేశాలు జరీ చేసింది. ఆర్దిక్ సంవత్సరం చివర కాబట్టి ప్రభుత్వ లావాదేవీల కోసం బ్యాంకులు మర్చి 30 రాత్రి ఎనిమిది గంటల వరకు మార్చి 31 సాయంత్రం ఆరు గంటల వరకు పని చేస్తాయి. లావాదేవీల విశాయంలో కస్టమర్లకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యెక కౌంటర్లు ఏర్పాటు చేయాలనీ అన్ని బ్యాంకులకు రిజర్వు బాంక్ ఆఫ్ ఇండియా ఆదేశించింది. ఆర్టీజీఎస్, నెఫ్ట్ ఇతర ఎలక్ట్రానిక్ లావాదేవీల సమయాన్ని కూడా పొడిగించాలని సూచించింది.
*ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ రేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారులుజాబితాను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి..నళినీ ప్రభాత్(1992బ్యాచ్), కుమార్‌విశ్వజిత్(1994బ్యాచ్)మహేష్ చంద్ర లడ్డా(1998బ్యాచ్)ఈ రాత్రికి ఒక అధికారిని నిఘా విభాగం అధిపతిగా నియమించే అవకాశం..
* ఎలక్ట్రానిక్స్ తయారీదారు శాంసంగ్ తన నూతన ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ గెలాక్సీ ట్యాబ్ ఎ 8.0 2019ను త్వరలో విడుదల చేయనుంది. దీని ధర వివరాలను ఇంకా వెల్లడించలేదు. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు.
* ఉత్తర్‌ప్రదేశ్‌లో భూవివాదం కాల్పులకు దారితీసింది. ఘజియాబాద్‌లో నడిరోడ్డుపైనే రెండు వర్గాలకు చెందిన వారు తుపాకులతో కాల్పులకు దిగారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాల్పుల ఘటనలో పలువురు గాయపడగా పోలీసులు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే వాహబ్‌చౌదరి అనుచరులు మరో వర్గంపై దాడి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వాహబ్ సోదరుడిని నుంచి పిస్తోల్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. త్వరలోనే మరో నిందితుడ్ని పట్టుకుంటామని తెలిపారు.
*రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 55శాతానికి తగ్గకుండా ఫిట్ మెంట్ ఇవ్వాలని ఏపీ ఉద్యోగ, ఉపాద్యాయ, కార్మిక, పెన్షనర్ల ఇకాస డిమాండ్ చేసింది. అర్హత , పరీక్ష విధానం ఒకటే అయినప్పటికీ సచివాలయం సాఖాదిపతుల కర్యాలయల్లోని ఉద్యోగుల వేతనాల్లో వ్యత్యాసం ఉందని దీన్ని తగ్గించాలని కోరారు. పాత ఫించను విధానాన్ని పునరుద్దరించాలని పదకొండవ వేతన సవరణ సంఘం కమీషనర్ అశుతోష్ మిశ్రాకు గురువారం తమ ప్రతిపదల్ని సమర్పించినట్లు ఇకాస చైర్మన్ ఓ ప్రకటనలో తెలిపారు.
* జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. నిన్న షోపియాన్, కుప్వారా జిల్లాలో భద్రతాసిబ్బంది ఎన్‌కౌంటర్ జరిపి నలుగురు ఉగ్రవాదులను హతమార్చగా.. తాజాగా మరో ఇద్దరు ముష్కరులను మట్టుబెట్టారు.
* ప్రముఖ సినీనటి జయప్రదను ఉద్దేశించి అసభ్యకరంగా మాట్లాడినట్లు ఆరోపణలు వచ్చిన సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) నాయకుడు ఫిరోజ్‌ఖాన్‌కు జాతీయ మహిళా కమిషన్(ఎన్‌సీడబ్ల్యూ) నోటీసులు జారీ చేసింది. మీడియాలో వస్తున్న వార్తలపై సంతృప్తికరమైన జవాబు ఇవ్వాలని ఆదేశించింది. ఎస్పీ మాజీ ఎంపీ అయిన జయప్రద మంగళవారం భాజపాలో చేరిన సంగతి తెలిసిందే. ఆయన వ్యాఖ్యలు ‘అసభ్యకరం, అసహ్యకరం, అనైతికం’ అని ఎన్‌సీడబ్ల్యూ కార్యదర్శి బర్నాలిషోమి అభ్యంతరం వ్యక్తం చేశారు.
*కేంద్ర ఎన్నికల కమిషన్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కోర్టు ధిక్కరణ కింద సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. అభ్యర్థుల పెండింగ్ క్రిమినల్ కేసుల ప్రకటనలపై సీఈసీని కోర్టు ప్రశ్నించింది. ఇంకా అభ్యర్థుల కేసుల గురించి ప్రకటించకపోవడాన్ని తప్పుబట్టింది. టీవీలుపత్రికల్లో ప్రచురించాలని గతంలో ఈసీకి సూచించింది. వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని ఈసీకి సుప్రీంకోర్టు ఆదేశించింది.
*ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావును రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయనను పోలీసు ప్రధాన కార్యాలయానికి రిపోర్టు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు సీఎస్ అనిల్ చంద్ర పునేఠా శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఐపీఎస్ బదిలీల విషయంలో ఎన్నికల సంఘం జారీచేసిన ఉత్తర్వుల్లో తాము జోక్యం చేసుకోలేమని ఏపీ హైకోర్టు స్పష్టంచేసిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
*రాష్ట్రంలో శుక్రవారం ఎండ తీవ్రత మరింత పెరుగుతుందని, శనివారం రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. గురువారం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ 38నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదుకావడం గమనార్హం.
*దేశంలో కొత్త జనాభా లెక్కల సేకరణ కార్యక్రమం 2021 మార్చి 1వ తేదీ అర్ధరాత్రి నుంచి ప్రారంభం అవుతుందని కేంద్ర హోంశాఖ వెల్లడించింది. మార్చి 1ని ప్రతిపాదిత తేదీగా ప్రకటిస్తూ గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. ‘జమ్మూ కశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లోని కొండ ప్రాంతాల్లో మాత్రం 2020 అక్టోబర్ 1వ తేదీని ప్రతిపాదిత తేదీగా నిర్ణయించింది. ఆయా రాష్ట్రాల భౌగోళిక, వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ముందుగానే అక్కడ జనగణన మొదలుపెట్టనున్నట్లు…’ కేంద్ర హోంశాఖ వివరించింది. గతంలో 2011లో జరిగిన జనగణనలో మన దేశ జనాభా 121 కోట్లుగా లెక్కతేలింది.
* రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న 119 బీసీ గురుకులాల్లో తొలిఏడాదికి 5, 6 తరగతులు నిర్వహించాలని బీసీ గురుకుల సొసైటీ నిర్ణయించింది. ప్రతి తరగతిలో రెండు సెక్షన్ల కింద 40 మంది విద్యార్థుల చొప్పున ప్రవేశం కల్పించనుంది.
*మహిళలు పారిశ్రామిక రంగంలో ప్రగతి సాధించినప్పుడే దేశ ఆర్థిక రంగంలో వృద్ధి సాధ్యమవుతుందని బయోకాన్ ఛైర్‌పర్సన్, ఎండీ కిరణ్ మజుందార్ షా అన్నారు. హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన డబ్ల్యుఈ (వియ్ – ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్) హబ్‌ను గురువారం హైదరాబాద్‌లోని అమెరికన్ కాన్సుల్ జనరల్ కేథరిన్ హడ్డా, ఐటీ ముఖ్య కార్యదర్శి జయేష్‌రంజన్, విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య కె.సీతారామారావు, వియ్ హబ్ సీఈఓ దీప్తి రావుతో కలిసి ఆమె ప్రారంభించారు.
* ప్రతిభా సామర్థ్యాలున్నవారికి పేదరికం ఏ దశలోనూ అడ్డుకాదని పర్వతారోహకురాలు మలావత్ పూర్ణ అన్నారు. పిల్లలకు ఏ రంగంలో ఆసక్తి ఉందో గుర్తించి, తల్లిదండ్రులు అన్నివిధాలా ప్రోత్సహించాలని కోరారు. దామోదరం సంజీవయ్య సంక్షేమ భవన్‌లో ఆమె గురువారం గురుకులాల కార్యదర్శి ప్రవీణ్ కుమార్‌తో పాటు విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు.
*ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా సామాన్యుడు సైతం ముందస్తు అనుమతి లేకుండా తన వద్ద ఉన్న గుర్తింపు కార్డుతో రాకెట్ ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) కల్పించనుంది.
*వరంగల్ జాతీయ సాంకేతిక సంస్థ(ఎన్‌ఐటీ) క్యాంపస్‌లో బీటెక్ చదువుతున్న ఐదుగురు విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడుతున్నట్లు జూనియర్ విద్యార్థులు చేసిన ఫిర్యాదు మేరకు విచారించి అందుకు బాధ్యులుగా భావిస్తున్న వారిపై సస్పెన్షన్ వేటు వేశారు.
*రాష్ట్రంలో డాక్టర్ బాబూ జగ్జీవన్‌రామ్ (ఏప్రిల్ 5), డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ (ఏప్రిల్ 14) జయంతి ఉత్సవాల నిర్వహణకు సంబంధిత శాఖలు గడువులోగా పనులు పూర్తిచేయాలని ఎస్సీ సంక్షేమశాఖ డైరెక్టర్ కరుణాకర్ తెలిపారు. హైదరాబాద్‌లో గురువారం సంక్షేమభవన్‌లో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఉత్సవాల నిర్వహణ కార్యాచరణ అందిస్తామని, ఆ మేరకు పనులు వేగం చేయాలని కోరారు.
*జెట్ ఎయిర్‌వేస్‌లో సంక్షోభం విశాఖ ప్రయాణికులపై ప్రభావం చూపిస్తోంది. గతంలో విశాఖ నుంచి ముంబయి వరకు జెట్ ఎయిర్‌వేస్, ఎయిరిండియా విమానాలు నడిచేవి. ఫిబ్రవరి 9 నుంచి జెట్ సర్వీసు నిలిచిపోయింది. దీంతో ఎయిరిండియాపై భారం పెరిగింది.
*తెలంగాణను ఇకముందు ప్రపంచస్థాయి క్రీడా కేంద్రంగా మార్చేలా ఓ ప్రత్యేక విధానం రూపొందాల్సి ఉందని రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి అన్నారు. క్రీడల అభివృద్ధిపై ఆయన గురువారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు.
*ఉపాధ్యాయ నియామకాల కోసం నిర్వహించిన తొలి టీఆర్టీ ద్వారా ఎంపికైన 8,792 మందిని వెంటనే నియమించాలని టీఎస్‌యూటీఎఫ్ డిమాండ్ చేసింది. 2018 ఫిబ్రవరిలో పరీక్షలు జరిగి, ఎంపిక ప్రక్రియ పూర్తయినా, నియామకాలు జరపకపోవడంతో అభ్యర్థులు ఎదురుచూస్తున్నారని తెలిపింది. ఈ మేరకు టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీహెచ్.రాములు, చావ రవి ఒక ప్రకటన విడుదల చేశారు. 15 వేలకు పైగా ఉపాధ్యాయ ఖాళీలున్నాయని, వాటిని నూతన విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే భర్తీ చేయాలని కోరారు.
*రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు వైద్యకళాశాలల్లో కన్వీనర్ కోటాలో భర్తీ చేయనున్న పీజీ వైద్య విద్య సీట్ల ప్రవేశాలకు ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియను ఈ నెల 30 నుంచి ఏప్రిల్ 2 వరకూ నిర్వహించనున్నట్లు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ కరుణాకరరెడ్డి తెలిపారు.
*అంతరిక్ష రక్షణ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఏశాట్ క్షిపణి ప్రయోగం దోహదపడుతుందని రాష్ట్ర గవర్నర్ నరసింహన్ అన్నారు. ‘మిషన్ శక్తి’ ప్రాజెక్టులో భాగంగా జరిపిన ప్రయోగం విజయవంతం కావడంపై డీఆర్‌డీవో అధిపతి జి.సతీశ్‌రెడ్డిని ఆయన అభినందించారు.
*ఎన్నికల సంఘం అధికారులు అభ్యంతరకర సందేశాలను (ఎస్‌ఎంఎస్‌లను) ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనల జాబితాలో చేర్చారు. ఈ మేరకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కార్యాలయం గురువారం ప్రకటన విడుదల చేసింది
*గుంటూరులోని తెదేపా కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ 38వ ఆవిర్భావ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి మంత్రి నక్కా ఆనంద్ బాబు, ఎంపీ గల్లా జయదేవ్, పలువురు నేతలు నివాళులర్పించారు. తెలుగు ప్రజల ఖ్యాతిని ప్రపంచ నలుమూలల చాటి చెప్పిన మహానాయకుడు నందమూరి తారకరామారావు అని మంత్రి నక్కా ఆనంద్ బాబు కొనియాడారు. తెలుగుదేశం పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చిన ఏకైక పార్టీ ఇదేనని అన్నారు. ఎన్టీఆర్ అడుగుజాడల్లో నడుస్తూ ఆయన ఆశయ సాధనకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎనలేని కృషి చేస్తున్నారని తెలిపారు. తెలుగు వారి ఆత్మగౌరవం కాపాడడానికి ఏర్పాటు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని గల్లా జయదేవ్ అన్నారు. రాష్ట్ర అభివృద్ధి జరగాలన్నా, తెలుగు ప్రజలు సుభిక్షంగా ఉండాలన్నా మరోసారి చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వాల్సిన ఆవశ్యకత ఉందని అభిప్రాయపడ్డారు.
* వైకాపా రాజ్యసభ్య సభ్యుడు విజయసాయిరెడ్డిపై… ఇటీవల బదిలీ అయిన శ్రీకాకుళం ఎస్పీ అడ్డాల వెంకటరత్నం ఇచ్చిన ఫిర్యాదును న్యాయసలహా నిమిత్తం శ్రీకాకుళం జిల్లా కోర్టుకు పంపినట్టు శ్రీకాకుళం రెండో పట్టణ సీఐ మహేష్ గురువారం తెలిపారు.
* ఏపీఈసెట్-2019కు అపరాధ రుసుం లేకుండా దరఖాస్తు చేసుకోవడానికి గడువు ముగిసింది. ఈ సంవత్సరం ఇప్పటివరకు 39,231 దరఖాస్తులు అందాయి.అనంతపురం జేఎన్‌టీయూ ఆధ్వర్యంలో ఐదోసారి ఈసెట్ నిర్వహిస్తున్నారు. మొత్తం 13 కోర్సులకు ఏప్రిల్ 19న ప్రవేశ పరీక్ష జరగనుంది. రూ.1000 అపరాధ రుసుంతో దరఖాస్తు చేసుకోవడానికి ఏప్రిల్ 2 వరకు అవకాశం కల్పించామని ఈసెట్ కన్వీనరు భానుమూర్తి తెలిపారు.
* ఒక్కొక్క పోస్టుకు 200 చొప్పున దరఖాస్తులు వచ్చినా స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తామని ఏపీపీఎస్సీ ప్రకటించింది. ఏయే ఉద్యోగాలకు ఈ కొత్త నిర్ణయాన్ని వర్తింపచేసేది త్వరలో తెలియచేస్తామని వెల్లడించింది. జారీచేసిన ఉద్యోగ ప్రకటనను అనుసరించి అభ్యర్థుల నుంచి వచ్చిన దరఖాస్తులు 25వేలు దాటితే ప్రస్తుతం స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తున్నారు. దీనికి అదనంగా ప్రకటించిన పోస్టుల్లో ఒక్కొక్క దానికి 200 వంతున దరఖాస్తులు వచ్చినా స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించేందుకు ప్రభుత్వం తాజాగా అనుమతి ఇచ్చింది.
* విజయవాడ సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో ఈ నెల 30న అమరావతి ఉత్సవం(ఫెస్ట్) జరగనుంది. ఐటీ విద్యార్థులకు రాష్ట్రంలో ఉన్న అవకాశాలు తెలియజెప్పడంతో పాటు ఐటీ సంస్థలను ప్రోత్సహించడంలో భాగంగా ఈ వేడుకను ఆంధ్రప్రదేశ్ ప్రవాసాంధ్ర సంస్థ(ఏపీఎన్‌ఆర్‌టీ) అట్టహాసంగా నిర్వహించనుంది.
* విశాఖపట్నంలో రూ.463 కోట్లతో తలపెట్టిన ఐఐఎం శాశ్వత క్యాంపస్ నిర్మాణ టెండర్‌ను నవరత్న సంస్థ ఎన్‌బీసీసీ (నేషనల్ బిల్డింగ్స్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్) దక్కించుకొంది. ప్రాజెక్టు తొలి దశలో భాగంగా ఇక్కడ తరగతి గదులు, నివాస సముదాయం, పరిపాలన భవనం, గ్రంథాలయం, ప్రయోగశాలలు, క్రీడలు, ఇతర ఉమ్మడి సౌకర్యాలను ఎన్‌బీసీసీ నిర్మిస్తుంది. టెండర్ దక్కించుకున్న సందర్భంగా ఎన్‌బీసీసీ సీఎండీ అనూప్‌కుమార్ మిత్తల్ మాట్లాడుతూ.. ఐఐఎం క్యాంపస్ నిర్మాణాన్ని పూర్తి నాణ్యతతో గడువులోగా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.
* జెట్ ఎయిర్‌వేస్‌లో సంక్షోభం విశాఖ ప్రయాణికులపై ప్రభావం చూపిస్తోంది. గతంలో విశాఖ నుంచి ముంబయి వరకు జెట్ ఎయిర్‌వేస్, ఎయిరిండియా విమానాలు నడిచేవి. ఫిబ్రవరి 9 నుంచి జెట్ సర్వీసు నిలిచిపోయింది. ఎయిరిండియాపై భారం పెరిగింది. ఇక్కడి ప్రయాణికుల అవసరాలకు ఇది సరిపోవడం లేదు. చాలామంది హైదరాబాద్ మీదుగా ముంబయికి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఎయిరిండియా నుంచి మరో సర్వీసును ముంబయికి నడపాలని విశాఖ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి వినతులు వెళ్లాయి. మరో 2 నెలల్లో దీనిపై నిర్ణయం తీసుకుంటామని ఆ సంస్థ సమాధానం ఇచ్చింది.
* పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వ శాఖల నుంచి 21 రోజుల్లో అనుమతులిచ్చే ‘ఆన్‌లైన్ సింగిల్‌విండో పోర్టల్’లో మరో 16 సేవలను చేర్చుతూ ఉత్తర్వులు వెలువడ్డాయి. పారిశ్రామికవేత్తల సూచనలమేరకు మరికొన్నిసేవలను చేర్చారు.
* ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా రూ.19 కోట్ల విలువైన ఐదు లక్షల లీటర్ల మద్యం నిల్వలను స్వాధీనం చేసుకున్నట్లు ఆబ్కారీ కమిషనర్ ముఖేష్‌కుమార్ మీనా చెప్పారు. విశాఖ మన్యంలో గురువారం పర్యటించిన ఆయన చింతపల్లిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చెక్‌పోస్టును తనిఖీ చేశారు.
* శ్రీకాకుళం, కడప జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీకాకుళం జిల్లాకు నవదీప్‌సింగ్ గ్రేవల్, కడప జిల్లాకు అభిషేక్ మహంతిలను నియమించాలని సూచిస్తూ బుధవారం రాత్రి ఎన్నికల సంఘం ఆదేశించిన సంగతి తెలిసిందే. సంబంధిత ఆదేశాల మేరకు వారిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
