* పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను వేల కోట్లకు మోసగించిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ బెయిల్ పిటిషన్‌ను లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ న్యాయస్థానం కొట్టివేసింది. కాగా.. శుక్రవారం జరిగిన విచారణ సందర్భంగా వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్స్ కోర్టు చీఫ్ మేజిస్ట్రేట్ ఎమ్మా ఆర్బుత్‌నాట్ సరదా వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ నీరవ్ మోదీని, విజయ్ మాల్యాను భారత్‌కు అప్పగిస్తే వీరిద్దరినీ జైల్లో ఒకే గదిలో ఉంచుతారా.. ఎలాగూ గది పెద్దగానే ఉంది కదా అని న్యాయమూర్తి అన్నారు.నీరవ్ బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా..‘నీరవ్‌ను అప్పగిస్తే భారత్‌లో ఏ జైల్లో ఉంచుతారు..?’ అని న్యాయమూర్తి ఎమ్మా అడిగారు. దీనికి భారత ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ న్యాయవాది స్పందిస్తూ.. ‘బహుశా విజయ్ మాల్యా కోసం సిద్ధం చేసిన ముంబయిలోని ఆర్థర్ రోడ్ జైల్లోనే నీరవ్‌ను కూడా ఉంచే అవకాశం ఉంది’ అని చెప్పారు. దీంతో వెంటనే న్యాయమూర్తి స్పందిస్తూ.. ‘ఒకే గదిలో కూడా ఉంచొచ్చేమో. మీరు ఇచ్చిన వీడియోలో చూస్తే గదిలో స్థలం కూడా చాలానే ఉందనిపించింది’ అని నవ్వుతూ అన్నారు.
* పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఖమ్మం నగరపాలక కార్యాలయం వద్ద రామయ్య ప్రయాణిస్తున్న వాహనాన్ని గుర్తుతెలియని వాహనం ఢీకొన్నట్లుగా సమాచారం. బైక్ బోల్తాపడటంతో వనజీవి చేతికి గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం 108 వాహనంలో ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
* భార్య ప్రవర్తన పై అనుమానంతో భర్త హత్య చేసిన సంఘటన ఏ కొండూరు మండలం చీమలపాడు పెద్ద తండా వద్ద శుక్రవారం రాత్రి జరిగింది. ఖమ్మం జిల్లా గార్ల కు చెందిన పీర్ల సంజీవ జీవనోపాధి నిమిత్తం గంపలగూడెం మండలం తోటమూల లో కొద్దీ కాలంగా నివసిస్తున్నాడు. మందులు తెచ్చుకోడానికి బైక్ పై హనుమాన్ జంక్షన్ వెళ్లి తిరిగి వస్తూ భార్య లక్ష్మిని పెద్ద తండా వద్ద గొంతు నులిమి చంపివేసాడు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు.
* విస్సన్నపేట మండలం కలగర క్రాస్ రోడ్డులో సత్తుపల్లి విస్సన్నపేట రహదారిలో శనివారం లారీ బైక్ ఢీకొని వ్యక్తి మృతి. పశ్చిమ గోదావరి జిల్లా కామవరపు కోట మండలం కె ఎస్ రామవరం గ్రామానికి చెందిన మలిశెట్టి సత్యనారాయణ బైక్ పై వెళుతుండగా లారీ ఢీ కొట్టింది.
*మసాజ్ సెంటర్ పేరుతో వ్యభిచారం నడుపుతున్న దంపతులను పోలీసులు గురువారం రాత్రి అరెస్టు చేశారు. వారి నుంచి ఇద్దరు యువతులను విడపించారు. చెన్నై తేనాంపేట వాసన్‌వీధిలో ఉన్న ఓ ప్రైవేటు అపార్టుమెంటులో మసాజ్ సెంటర్ నిర్వహిస్తున్నారు. మసాజ్ సెంటర్‌కు రాత్రి సమయంలో ఎక్కువ సంఖ్యలో యువకులు వచ్చి వెళుతున్నట్టు స్థానికులు పాండీబజార్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
*శ్రీకాకుళం జిల్లా పొందూరు ‘బి’ పరీక్ష కేంద్రంలోని 33వ గదిలో ఏర్పాటుచేసిన రెండు సీసీ కెమెరాలను గురువారం రాత్రి దొంగలు అపహరించారు. ఇది ఇంటి దొంగల పనేనని ఆరోపణలున్నాయి. ప్రతి రోజు ఇక్కడ ఎ, బి కేంద్రాల్లో కొందరు ఉపాధ్యాయులు విద్యార్థులకు బిట్ పేపరు జవాబులు చెబుతున్నారన్న విమర్శలున్నాయి.
* అనంతపురం జిల్లా రాయదుర్గంలో గురువారం అర్ధరాత్రి 21 మంది అనుమానిత యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
*శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గంలోని కంచరాం గ్రామంలో శుక్రవారం చేపట్టిన తనిఖీల్లో భాగంగా రూ.8,44,250 నగదు పట్టుబడినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. పలాస మండలంలోని రెంటికోట సమీపంలో తనిఖీల సందర్భంగా 3 కిలోల వెండిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
*చిత్తూరు జిల్లా వి.కోట మండల పరిధి కుంభార్లపల్లె వద్ద మామిడితోటలో శుక్రవారం రాత్రి పోలీసులు 170 మద్యం కేసులను పట్టుకున్నారు. ఈ తోట యజమాని శ్రీరాములురెడ్డికి వైకాపా నాయకుడిగా గుర్తింపు ఉంది. మామిడితోటలో మద్యం నిల్వలు ఉన్నట్లు పోలీసులకు శుక్రవారం రాత్రి సమాచారం అందింది. దీంతో అక్కడికి వచ్చి గాలించగా 170 మద్యం కేసుల్లో దాదాపు 8,160 మద్యం సీసాలు లభ్యమయ్యాయి. ఎన్నికల ప్రచారంలో పంపిణీకి వీటిని ఇక్కడ నిల్వ చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. వీటి విలువ రూ.6 లక్షలు ఉంటుందని సీఐ పేర్కొన్నారు. మద్యం సీసాలు స్వాధీనం చేసుకొని తోట యజమాని శ్రీరాములురెడ్డిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
*తగిన పత్రాలు లేకుండా తరలిస్తున్న 108 కిలోల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడులోని తూత్తుకుడిలో శుక్రవారం ఫ్లయింగ్ స్క్వాడ్ వాహనాల తనిఖీ చేపట్టింది. తగిన పత్రాలు లేకుండా తీసుకొచ్చిన 108 కిలోల బంగారు నగలను స్వాధీనం చేసుకుని డ్రైవర్ హరిహరన్‌ను విచారిస్తున్నారు. నగల దుకాణాల కోసం వీటిని కర్ణాటక నుంచి తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు. పత్రాలు చూపించి వాటిని తీసుకెళ్లాల్సిందిగా సూచించారు. అనంతం బంగారాన్ని స్థానిక కలెక్టరు కార్యాలయానికి తరలించారు.
*పులి దాడిలో మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లాలో ఓ మహిళ మృతి చెందింది. బద్రావతి తాలూకా రాన్‌తడోది గ్రామంలో శుక్రవారం ఈ ఘటన జరిగింది.
*లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఓటర్లను ప్రలోభపెట్టేందుకు తీసుకెళ్తోన్న నగదు, మద్యం భారీగా పట్టుబడుతోంది. ఎన్నికల నియమావళి (కోడ్) అమల్లో ఉండటంతో ఆయా శాఖలు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు రూ. 24.17 కోట్ల విలువైన నగదు, బంగారం, వెండి, ఇతరాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
* ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా బాసగూడ అటవీ ప్రాంతంలో శుక్రవారం సీఆర్పీఎఫ్ బలగాలు-మావోయిస్టుల మధ్య కొద్దిసేపు ఎదురుకాల్పులు జరిగినట్లు సమాచారం. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సీఆర్పీఎఫ్ బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి.
* కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలో శుక్రవారం జరిగిన పవన్ కల్యాణ్ బహిరంగ సభలో ఏర్పాటు చేసిన స్పీకర్లపై నుంచి కిందపడి తన భర్త షీరాజు (30) మృతి చెందినట్లు ఆయన భార్య కరిష్మా ఆరోపించారు.
* ప్రధాని మోదీని సమర్థిస్తున్న ఇస్రో మాజీ ఛైర్మన్ జి.మాధవన్ నాయర్‌ను చంపేస్తామంటూ ఉగ్రవాద ముఠా జైష్ ఎ మహ్మద్ హెచ్చరిచింది.
*కర్నూలు జిల్లా మంత్రాలయం తెదేపా అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్ధి తిక్కరెడ్డి ప్రత్యెక వాహనంలో చక్రాల కుర్చీలో ఉండే శుక్రవారం ప్రచారం నిర్వహించారు. ఖగ్గల్లులో జరిగిన ఘర్షణలో తుపాకీ గుండు తగిలి గాయాలపాలైన ఆయన గాయం తగ్గకుండానే వీల్ చైర్లో కూర్చుని ఆయన గాయం తగ్గకుండానే వీల్ చైర్ లో కూర్చొని రామచంద్రనగర్ ఎస్సీ కాలనీలో పర్యటించారు. ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. బులెట్ గాయంతో తానూ ఆస్పత్రిలో ఉంటె ప్రత్యర్ధులు తెదేపా కార్యకర్తలను బెదిరిస్తూ దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు.
*హైదరాబాద్ పాతబస్తీకి చెందిన ఓ మహిళ.. ఆర్థిక ఇబ్బందులను తొలగించుకునేందుకు ఒమన్ దేశానికి వెళ్లాలనుకుంది.. ఆమె అమాయకత్వాన్ని గల్ఫ్ ఏజెంట్లు సొమ్ము చేసుకున్నారు.
*ఉపాధి కోసం గంపెడాశతో ఇరాక్ వెళ్లిన వలస కార్మికులను ఆయుధాలతో బెదిరించి, వేతనాలివ్వకుండా వెట్టిచాకిరీ చేయించారు అక్కడి యజమానులు.. తాము పడుతున్న ఇబ్బందులను కార్మికులు ఫేస్‌బుక్ ద్వారా గల్ఫ్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బసంత్‌రెడ్డికి వివరించారు.
*షాచల అటవీ ప్రాంతంలో కొంత కాలంగా తరచూ అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం ధర్మగిరి వేదపాఠశాలకు సమీపంలోని అటవీ ప్రాంతంలో మంటలు చెలరేగాయి. ఎండ తీవ్రతకు తోడు గాలులు వీస్తుండడంతో అగ్నికీలలు త్వరగా వ్యాపించాయి. తితిదే అటవీ, భద్రతా సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు కృషిచేశారు. అప్పటికే తితిదే పరిధిలోని ఐదు హెక్టార్ల అటవీ ప్రాంతం అగ్నికి ఆహుతైంది. తిరుమల వైపునకు మంటలు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
*ముంబయిలో పెద్ద ఎత్తున బంగారం పట్టుబడింది. రెండు ద్విచక్రవాహనాల్లో 70కిలోల బంగారం తరలిస్తుండగా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్కూటర్‌లో రెండు డిస్క్‌ల రూపంలో 30 కిలోలో, మరో ద్విచక్రవాహనంలో మూడు డిస్క్‌ల రూపంలో తరలిస్తున్న 45కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పుత్తడి తరలింపునకు సంబంధించి ఏడుగురిని డీఆర్‌ఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
*ఉత్తర్‌ప్రదేశ్‌లో భూవివాదం కాల్పులకు దారితీసింది. ఘజియాబాద్‌లో నడిరోడ్డుపైనే రెండు వర్గాలకు చెందిన వారు తుపాకులతో కాల్పులకు దిగారు.
*ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 8 మంది అక్కడికక్కడే మృతిచెందగా.. మరో 31 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో 12 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. యమునా ఎక్స్‌ప్రెస్ వేపై రబూపుర వద్ద శుక్రవారం ఉదయం ఈ ఘటన జరిగింది. ఎదురెదురుగా వస్తున్న ఓ బస్సు, లారీ ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది. క్షతగాత్రుల్ని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
*అనంతపురం జిల్లా రాయదుర్గంలో గురువారం అర్ధరాత్రి 21 మంది అనుమానిత యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సిఐ అజయ్ కుమార్ వివరాల మేరకు గురువారం అర్ధరాత్రి రాయదుర్గం నుంచి బళ్ళారి వైపు రెండు కార్లలో 21మంది యువకులు వెళ్తున్నట్లు తనిఖీలో బయటపడింది. వారిని విచారించగా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పరిసర ప్రాంత వాసులుగా తేలింది. రాయదుర్గం వైకాపా అభ్యర్ధి కాపు రామచంద్రారెడ్డి వియ్యంకుడు శ్రీరామిరేడ్డి తమను రాయడుర్గానికి పిలిపించారని చెప్పారు.
*వైకాపా అభ్యర్ధి కాపు.. భీమవరం నుంచి 300 మంది గూండాలు, రౌడీలను రప్పించి రాయదుర్గం బల్లారీ సోమలాపురం ఉద్దేహాల్ లో ఉంచి తెదేపా నాయకులూ కార్యకర్తలను ఆరోపించారు. రాయదుర్గంలో ఎన్నికలు ప్రసంటంగా స్వేచ్చగా జరిగేలా ఎన్నికల కమీశం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సహాయ రిటర్నింగ్ అధికారి వెంకట రమేష్ బాబును కోరుతూ వినతిపత్రం అందజేశారు. తనను లక్ష్యంగా చేసుకుని రెక్కీకి ఆరుగురుని నియమించారని తన పత్రి కదలికను రికార్డు చేస్తున్నారని అందులో పేర్కొన్నారు.
*నిఘా విభాగాధిపతి ఏబీ వెంకటేశ్వరావును ప్రభుత్వం శుక్రవారం బదిలీ చేసింది. నిఘా విభాగంలో తన తర్వాత సీనియర్ గా ఉన్న అధికారికి బాద్యతలు అప్పగించి రిలీవ్ కావాలని ఆదేశించింది. అనంతరం డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని పేర్కొంది. ఈ ఎన్నికలు పూర్తయ్యేంత వరకు ఆయనకు ఎలాంటి ఎన్నికల విధులు, బాద్యతలు అప్పగించరాదని డీజీపీని ఆదేశించింది.
* జమ్మూకశ్మీర్‌లోని రాంబన్ జిల్లాలోని బనీహల్‌లో ఇవాళ మధ్యాహ్నం పేలుళ్లు సంభవించాయి. శ్రీనగర్ – జమ్మూ ప్రధాన రహదారిపై కారులో పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఈ పేలుళ్ల ధాటికి కారు తూనతునకలైంది. పేలుళ్లు జరిగే కంటే ముందే.. ఈ రహదారిపై భద్రతా బలగాల కాన్వాయ్ వెళ్లింది. కారులో పేలుళ్లు జరగడంతో సైన్యం అప్రమత్తమైంది. కారులోని సిలిండర్ పేలడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మొత్తానికి ఆ ప్రాంతంలో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. పుల్వామాలో ఫిబ్రవరి 14వ తేదీన సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు కారు బాంబుతో ఆత్మాహుతి దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు వీరమరణం పొందారు.
* జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. ఇవాళ ఉదయం భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. అనంత్‌నాగ్‌లోని కోకర్‌నాగ్ ఏరియాలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారని బలగాలకు సమాచారం అందింది. దీంతో అక్కడికి చేరుకున్న బలగాలపైకి ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఉగ్రవాదుల కోసం బలగాలు కూంబింగ్ కొనసాగిస్తున్నాయి.
* అదనపు కట్నం కోసం వేధించి మహిళపై కిరోసిన్ పోసి హత్య చేసిన ముగ్గురికి జీవిత ఖైదును విధిస్తూ ప్రిన్సిపల్ డిస్ట్రిక్టు సెషన్స్ జడ్జి శశిధర్‌రెడ్డి తీర్పునిచ్చారు. వివరాలను పరిశీలిస్తే నకిరేకల్ మండలంలోని ఓగోడు గ్రామానికి చెందిన శాతరాజు రేణుక అదే గ్రామానికి చెందిన జానకిరాములుతో ఫిబ్రవరి 16, 2009న వివాహం జరిగింది.
