అతిపెద్ద సోషల్ మీడియా నెట్ వర్క్ పేస్ బుక్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవసీ పాలసీలో విశ్రుత మార్పులకు సిద్దమవుతోంది. గోప్యతా ఉల్లంఘనులు న్యూజిలాండ్ నరమేధం సంఘతనాలు తరువాత పలు సంస్కరణల దిశగా అడుగులు వేస్తుంది. వివక్ష పూరిత అంశాలైన శ్వేతా జాతీయవాద వేర్పాటు వాదాలను నిషేదించిన ఆ సంస్థ ఇప్పుడు మరో దిద్దుబాటు చర్యలకు పూనుకుంటోంది. ఇక పై పేస్ బుక్ లైవ్ లను మానిటర్ చేయనుంది. లైవ్ ల పై ఆంక్షలు విధించాలని భావిస్తోంది. ఇకపై యుసర్స్ పేస్ బుక్ లో ఇచ్చే లైవ్ ల పై పలు నిబంధనలు అమలు చేయనుంది.
* వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో (ఏప్రిల్- సెప్టెంబరు) ప్రభుత్వం స్థూలంగా రూ.4.42 లక్షల కోట్ల రుణం తీసుకోనుంది.
*ఆదిత్యా బిర్లా గ్రూపునకు చెందిన రిటైల్ చెయిన్ ‘మోర్’, కార్యకలాపాల విస్తరణ కోసం వచ్చే అయిదేళ్లలో రూ.1,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంది.
*పీఎన్‌బీ హౌసింగ్‌లో కొంత మేర వాటాను పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) విక్రయించనుంది. జనరల్ అట్లాంటిక్ గ్రూపు, వర్డే పార్ట్‌నర్స్‌లు ఈ వాటా కొనుగోలు చేయనున్నాయి.
*రాజస్థాన్‌కు చెందిన మిరాజ్ గ్రూపు సంస్థ అయిన మిరాజ్ సినిమాస్ తెలంగాణాలో విస్తరణ యత్నాల్లో నిమగ్నమైంది.
*కేవలం దక్షిణాది రాష్ట్రాల కంపెనీలపై పెట్టుబడులు పెట్టడానికి ఉద్దేశించిన వినూత్న పోర్ట్‌ఫోలియో పథకాన్ని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఆవిష్కరించింది.
*జీఎంఆర్ గ్రూపునకు చెందిన కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలి (ఎస్‌ఈజడ్)ని కొనుగోలు చేసేందుకు అదానీ గ్రూపు ఆసక్తిగా ఉన్నట్లు ప్రచారం అవుతోంది.
*కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) దక్షిణ ప్రాంత ఛైర్మన్‌గా 2019-20 సంవత్సరానికి సంజయ్ జయవర్ధనవేలు ఎన్నికయ్యారు.
*దేశీయ ఎఫ్‌ఎమ్‌సీజీ రంగం 2019లో 11-12% వృద్ధి నమోదు చేసే అవకాశం ఉందని నీల్సన్ ఇండియా అంచనా వేసింది. 2018లో నమోదు చేసిన 13.8 శాతంతో పోలిస్తే ఇది తక్కువని ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సమీర్ శుక్లా పేర్కొన్నారు.
*నమోదు ఉపసంహరణకు గురైన 3 లక్షలకు పైగా కంపెనీలపై దర్యాప్తు చేపట్టాలని దేశవ్యాప్తంగా ఉన్న ఆదాయపు పన్ను కార్యాలయాలకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (సీబీడీటీ) ఆదేశాలు జారీ చేసింది.
