వెయ్యి గుర్రాలతో “బాహుబలి” షూటింగ్..

bhahubaliఎస్.ఎస్. రాజమౌళి క్రేజీ ప్రాజెక్ట్ ”బాహుబలి” కోసం వెయ్యి గుర్రాలు సిద్ధమవుతున్నాయి. రాజమౌళి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బాహుబలి కోసం ప్రేక్షకులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తుంటే.. ఓ అద్భుత యుద్ధ సన్నివేశం కోసం రాజమౌళి వెయ్యి గుర్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. బాహుబలిని అద్భుతంగా తెరకెక్కించేందుకు ఎక్కడా రాజీ పడని రాజమౌళి ప్రతి సన్నివేశాన్ని చిత్రీకరించడంలో చాలా శ్రద్ధ తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో యుద్ధ సన్నివేశం చిత్రీకరణ కోసం రాజమౌళి రాజస్థాన్ నుంచి వెయ్యి గుర్రాలను తీసుకోస్తున్నారట. ప్రస్తుతం బాహుబలి సినిమా షూటింగ్ రామోజీ ఫిలిమ్ సిటీలో జరుగుతోంది. ఈ నేపథ్యంలో వెయ్యి గుర్రాలతో కూడిన యుద్ధ సన్నివేశాన్ని సోమవారం నుంచి షూట్ చేస్తారని సమాచారం. ప్రభాస్, రానా , అనుష్క, తమన్నా నటిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

జీవితకాలం పెరిగేందుకు…

suryanamskarప్రస్తుతం మన సమాజంలో భయపెడుతున్న, బాధపెడుతున్న వ్యాధుల్లో ఎయిడ్స్ ఒకటి. హెచ్‌ఐవీ పాజిటివ్ ఉన్న వాళ్లు యోగా చేస్తే… నిరాశా నిస్పృహలనుంచి బయటపడవచ్చు. సాధారణ వ్యాయామం, మంచి ఆహార నియమాలతో జీవిత కాలాన్ని పొడిగించుకోవచ్చు. డిప్రెషన్ నుంచి కూడా బయటపడొచ్చు. సరళమైన వ్యాయామం, ప్రాణాయామం, మెడి చేయడం వల్ల శరీరమే కాకుండా మనసూ ఆరోగ్యంగా ఉంటుంది.
మెడి బ్రీతింగ్
ఆలోచనల నుంచి మనసును క్లియర్ చేయడమనే ప్రక్రియే మెడి మనం పీల్చే గాలి మీద దృష్టిసారించడం వల్ల అది శరీరాన్ని, మనసునూ ఉత్తేజితం చేస్తుంది. బాగా నిద్రపోయి లేచినప్పుడు అలసట తొలగి మనకు ఎలాంటి ఉత్సాహం కలుగుతుందో, ఈ ధ్యానం ద్వారా అలాంటి ఉత్సాహం, ఉత్తేజం, ప్రశాంతత కలుగుతాయి.
పద్ధతి :
పద్మాసనంలో కానీ, వజ్రాసనంలో కానీ, సుఖాసనంలో కానీ కూర్చుని రెండు నాసికల నుంచి గాలిని పూర్తిగా వదలాలి. తరువాత కుడి చేతి బొటన వేలితో కుడి నాసికా రంధ్రాన్ని మూసివేసి ఎడమ నాసికారంధ్రం ద్వారా గాలి పీల్చాలి. ఇలా పీలుస్తున్నప్పుడు నెమ్మదిగా తల పైకెత్తాలి. దీనివల్ల గాలి ఎక్కువగా లోపలికి తీసుకోవడానికి వీలవుతుంది. కొన్ని సెకన్లపాటు అదేస్థితిలో ఉండి మళ్లీ ఎడమ నాసికా రంధ్రం ద్వారానే గాలి పూర్తిగా వదులుతూ తలను నెమ్మదిగా కిందికి వంచాలి. ఇలా ఒకసారి చేస్తే ఒక ఆవర్తనం పూర్తయినట్టు. కనీసం పది నుంచి పదిహేను ఆవర్తనాలు చేయాలి. ఇదేవిధంగా కుడినాసికారంధ్రం ద్వారా గాలి పీల్చి, కుడి నాసికా రంధ్రం ద్వారా వదలాలి.
ఉపయోగాలు :
– మానసిక ప్రశాంతత, రక్తం, రక్తనాళాల శుద్ధి జరుగుతుంది.
-శక్తి వృద్ధి అవుతుంది. చర్మం కాంతివంతమవుతుంది.
– ఊపిరితిత్తుల పనిసామర్థ్యం పెరిగి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుంది.
– అధికంగా ఉన్న కొవ్వు కరగడంతోపాటు ఉత్సాహం వస్తుంది.
– కుండలినీశక్తి జాగృతం అవుతుంది.
జాగ్రత్తలు
– ప్రాణాయామం చేసిన తర్వాత అరగంట వరకు చన్నీటి స్నానం చేయకూడదు. వెంటనే చేయాల్సి వస్తే గోరు నీటిని వాడాలి.
– సాత్వికాహారాన్ని తీసుకోవాలి.
– కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత మాత్రమే సాధన చేయాలి.
– స్వచ్ఛమైన గాలి, వెలుతురు ఉన్న ప్రదేశంలోనే సాధన చేయాలి.
గమనిక
– యోగాకి ముందు వార్మప్ ఎక్సర్‌సైజెస్ (సూక్ష్మ వ్యాయామాలు) తప్పనిసరిగా చేయాలి.

యోగా..మంచుదేగా

Actress-Manchu-Lakshmi-Yoga-Photos-10-620x330అందమైన మేని కోసం కుందేలులా పరుగెత్తాల్సిన అవసరం లేదు.దృఢమైన దేహం కోసం జిమ్‌లో చెమటోడ్చాల్సిన పని అంతకన్నా లేదు.ఆరడుగుల నేల చాలు.. ఆయుష్షున్నంత కాలం మిమ్మల్ని ఆరోగ్యంగాఉంచడానికి. పతంజలి ఆసనాల శాసనాలు అక్షరాలా అనుసరిస్తే చాలు ఈడు ముడతలు మీ దరి చేరవు.

పరగడుపునే కాసేపు విల్లులా ఒళ్లు వంచి చూడండి.. వయసు పైబడినా మీ నడుం వాలితే ఒట్టు. మయూరాసనం వేయగలిగితే.. జాతక చక్రంలో మాలవ్య యోగం పట్టిన వారిలా మీ మేను నిగనిగలాడుతుంది. అదీ యోగా పవర్. యోగాసనాలు వాటి వల్ల కలిగే యోగాల గురించి సాక్షి సిటీప్లస్ తరఫున నటి, నిర్మాత మంచు లక్ష్మియోగాభ్యాసకులను పలకరించారు.

మంచు లక్ష్మి: యోగా.. ఈ దేశం మనకిచ్చిన గిఫ్ట్. నేను అమెరికాలో ఉండగా నేర్చుకున్నాను. అమెరికన్స్‌ని చూసి నేర్చుకున్నందుకు చాలా బాధగా ఉంది. యోగాను ప్రపంచానికి పరిచయం చేసింది మన దేశమే. చిత్రం ఏంటంటే.. పొరుగు దేశాల్లో యోగాకు ఉన్నంత క్రేజ్ మన దగ్గర లేకపోవడమే. అందుకే యోగా అందరి జీవితంలో తప్పనిసరి అవ్వాలనే ఉద్దేశంతో స్టార్ రిపోర్టర్‌గా ఈ రోజు ఇక్కడికి వచ్చి కాసేపు ముచ్చటిస్తున్నాను. చెప్పండి సార్.. అసలు యోగా అంటే ఏమిటి? అది ఎప్పుడు పుట్టింది?

చంద్రారెడ్డి: కీస్త్రు పూర్వం ఐదువేల సంవత్సరాల క్రితమే మన దేశంలో యోగా అనే పదం ఉందంటారు. యోగాకు సంబంధించి పూర్తి హక్కులు మన దేశానికే ఉన్నాయి. రుషులు అందించిన విద్య యోగ. మనస్సుని, దేహాన్ని కలిపి చూడటమే యోగా అంటే.

మంచు లక్ష్మి: అవును.. కానీ మహర్షుల జీవితాల్లో యోగా ముఖ్యమైన భాగం. ఈ హైటెక్ కాలంలో యోగా చేసే తీరిక, ఓపిక చాలా తక్కువ మందికి ఉంటుంది. వారి సంఖ్య పెంచడానికి మార్గం ఏంటి?

చంద్రారెడ్డి: ఏం లేదు.. యోగా ప్రయోజనాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే.

మంచు లక్ష్మి: ఇక్కడ మీ సెంటర్‌లో వారం రోజుల కిందట యోగాక్లాస్‌లోని చేరినవారైనా ఉన్నారా?

కైవల్య: నేనున్నానండి.

మంచు లక్ష్మి: వావ్. నువ్వు చూస్తే స్కూల్ స్టూడెంట్ వి. ఎందుకు యోగాలో చేరావు?

కైవల్య: నాకు ఏదో ప్రాబ్లమ్ వల్ల మోకాళ్ల నొప్పి వచ్చింది. ఎన్ని రకాల మందులు వాడినా తగ్గడంలేదు. యోగావల్ల రిజల్ట్ ఉంటుంది అంటే వన్ వీక్ బ్యాక్ ఇక్కడ చేరాను. కొంచెం చేంజ్ కనిపించింది.

మంచు లక్ష్మి: గుడ్.. కానీ మన దగ్గర చాలామంది ఏదో ఒక ఆరోగ్య సమస్య ఉంటే కానీ యోగా దగ్గరికి రారు. దటీజ్ గుడ్ అండ్ బ్యాడ్.

భార్గవి: కనీసం అలాగైనా రావడం మంచిదేకదా మేడమ్.

మంచు లక్ష్మి: అవును.. కానీ యోగా శారీరక, మానసిక సమస్యలు తీర్చేది మాత్రమే కాదు. మనని రోజంతా యాక్టివ్‌గా ఉంచుతుంది. అనారోగ్య సమసల్ని దరి చేరనీయదు. అమ్మా.. మీరు ఎన్నాళ్ల నుంచి యోగా చేస్తున్నారు.

సరస్వతి: ఆరేళ్లుగా చేస్తున్నాను. నాకు 59 ఏళ్లు. ఈ వయసులో సాధారణంగా ఉండే ఏ సమస్యలూ నాకు లేవు.

మంచు లక్ష్మి: వావ్.. మీరు అంత వయసున్నట్టు లేరు. మీ ముఖం కూడా చాలా తేజస్సుగా ఉంది. సార్.. యోగాతో ఆర్యోగంతో పాటు ముఖంలో ప్రశాంతత, గ్లో వస్తుంది కదా!

చంద్రారెడ్డి: కచ్చితంగా.. ముందుగా డల్‌నెస్ పోతుంది. ముఖంలో తేజస్సు, చురుకుదనం, బాగా ప్రాక్టీస్ చేసిన వారిలో పాజిటివ్ థింకింగ్ కూడా పెరుగుతుంది.

మంచు లక్ష్మి: మరో ముఖ్యమైన ప్రశ్న. బరువు తగ్గడానికి యోగానే సరైన మార్గం. వారంలో, రోజులోనూ బరువు తగ్గించే వైద్య సదుపాయాలు వచ్చాయనుకోండి. కానీ యోగాతో బరువు తగ్గడం వల్ల కలిగే ప్రయోజనాలేంటి?

చంద్రారెడ్డి: ఓ 20 ఏళ్ల పాటు పెంచిన కాయాన్ని.. 20 రోజుల్లో తగ్గించాలనుకోవడం చాలా తప్పు. దాని వల్ల దుష్పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. యోగాతో బరువు మెల్లిగా తగ్గినా, ఎనర్జీ లెవల్స్‌లో ఏ మార్పూ ఉండదు. 20 కిలోల అదనపు బరువుంటే నెలకు నాలుగైదు కిలోలు తగ్గడం మంచిది. అది యోగా వల్ల మాత్రమే సాధ్యం. డైట్ కంట్రోల్ కూడా ఉండాలి.

మంచు లక్ష్మి: దాని గురించీ నాలుగు ముక్కలు చెప్పండి. నాకు తెలిసి హెల్దీబాడీకి ఫైవ్ వైట్ ఫుడ్స్ ఎనిమీస్ అంటారు.

చంద్రారెడ్డి: అవును.. రైస్, సాల్ట్, మైదా, షుగర్, పాలు.

మంచు లక్ష్మి: పాలుకూడానా?

చంద్రారెడ్డి: మనిషి ఆరేళ్ల వయసులోపు మాత్రమే పాలు తాగాలి. ఆ తర్వాత అవసరం లేదు. కచ్చితంగా చెప్పాలంటే అమ్మపాలు చాలు. మీరు చూడండి.. ఈ భూమ్మీద 84 లక్షల జీవరాశులున్నాయి. అవన్నీ వాటి తల్లి పాలు తాగుతాయి కానీ మరో జంతువు పాలు తాగాలని అనుకోవు. మనం మాత్రమే గేదె, ఆవు, మేకపాలు తాగడానికి ఇష్టపడతాం.

మంచు లక్ష్మి: మరి పెరుగు?

చంద్రారెడ్డి: పెరుగు కాదు.. మజ్జిగ మంచిది. దానివల్ల ప్రయోజనాలుంటాయి.

మంచు లక్ష్మి: మహిళలకు యోగా తప్పనిసరి అని నా అభిప్రాయం. ఎందుకంటే వారు నేర్చుకుంటే ఇంట్లో పిల్లలకి కూడా అలవాటవుతుంది. అదొక్కటే కాదు మహిళ ఆరోగ్యంగా ఉంటే ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఉంటుంది. దీనికి ఎవరైనా ఎగ్జాంపుల్ చెప్పండి?

భార్గవి: నేను ఏడేళ్ల నుంచి యోగా చేస్తున్నానండి. నేను ప్రెగె ్నంట్‌గా ఉన్నప్పుడు కొన్ని యోగాసనాలు వేశాను. దానివల్ల ఆ సమయంలో వచ్చే బీపీ, ఒంట్లో నీరు చేరడం వంటి సమస్యలేమీ రాలేదు. కవలలైనప్పటికీ నార్మల్ డెలవరీ అయింది. పాపలు పుట్టిన రెండు వారాల తర్వాత నా పనులు నేను చేసుకున్నాను. ఇది కేవలం యోగా వల్లే సాధ్యమైంది.

మంచు లక్ష్మి: మరి మీ పిల్లలకు యోగా నేర్పుతున్నారా?

భార్గవి: ప్రత్యేకంగా నేర్పడమంటూ ఏం లేదండి. నేను చేస్తుంటే చూసి వాళ్లే చేసేస్తున్నారు.

మంచు లక్ష్మి: గ్రేట్.. చాలామంది యోగా చేయొచ్చు కదా అంటే.. టైం లేదంటారు. ఇది నిజమైన సమాధానం అంటారా ?

రంజన: టైం మన చేతిలో ఉంటుంది. యోగా విలువ తెలిస్తే దానికి ఎంత టైమైనా కేటాయించగలరు.

మంచు లక్ష్మి: యా.. రోజూ ఇన్ని గంటలని చేయక్కర్లేదు. ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు ఒళ్లు వంచితే చాలు.

శ్వేత: మేడమ్.. మిమ్మల్ని రెండు ప్రశ్నలడగాలి.

మంచు లక్ష్మి: డెఫినెట్లీ…

శ్వేత: మీరు ఎప్పుడు యోగా నేర్చుకున్నారు?

మంచు లక్ష్మి: నేను అమెరికాలో డిగ్రీ చదువుతున్న రోజుల్లో మొదలుపెట్టాను. చాలా సాధన చేశాను. తెల్లవారుజామున 4:30 గంటలకు మొదలుపెడితే ఉదయం 10 గంటల వరకూ చేసేదాన్ని. అలా రెండు నెలలు చేసిన తర్వాత నాకు కుదిరిన టైంలో చేయడం మొదలుపెట్టాను. చాలామంది గురువుల దగ్గర యోగా గురించి ముఖ్యమైన విషయాలు తెలుసుకున్నాను.

శ్వేత: మీ ప్రొఫెషన్‌లో ఒత్తిడి ఉంటుందంటారు కదా! దానికిది ఉపయోగపడిందంటారా?

మంచు లక్ష్మి: ఒత్తిడిని అధిగమించడం ఒక్కటే కాదు…నేను ఐరేంద్రీ క్యారెక్టర్ అంత ఫర్‌ఫెక్ట్‌గా చేయగలిగానంటే.. దానికి కారణం యోగానే. షూటింగ్ గ్యాప్‌లో యాక్టివ్‌గా ఉండడం కోసం ఆసనాలు ప్రాక్టీస్ చేసేదాన్ని.

సరస్వతి: బిజీగా ఉంటారు కదా! యోగా టైమింగ్స్ ఎలా ఎడ్జెస్ట్ చేసుకుంటున్నారు?

మంచు లక్ష్మి: నాకు ఏదైనా యోగా తర్వాతే. దీని రుచి తెలిసినవారెవరూ దీన్ని వదులుకోరు. థ్యాంక్యూ సో మచ్. ఈ కథనం చూసి మరికొంతమంది యోగా చేయడానికి సిద ్ధపడతారని ఆశిస్తున్నాను. సాక్షి తరఫున రిపోర్టర్‌గా మిమ్మల్ని కలసినందుకు సంతోషంగా ఉంది.

పార్శ్వతలనొప్పి నివారణకు సహాయపడే 8 యోగాసనాలు

marjariasanaయోగా, ఆసనాలు, శ్వాస ప్రక్రియల సమ్మేళనం వల్ల ప్రశాంత జీవితాన్ని ఏర్పరిచే ఒక పురాతన పద్ధతి. ఇది పార్శ్వపు నేప్పిపై పోరాడే దుష్ప్రభావాలు లేని పద్ధతులలో ఒక మంచి భాగం. ప్రతిరోజూ కొన్ని నిమిషాలు ఈ చిన్ని చిన్ని ఆసనాలు వేయడం వల్ల మరోసారి పార్శ్వపు నొప్పిని కూడా మీ శరీరం తట్టుకోనడానికి సహాయపడుతుంది.

హస్తపాదాసన (నిలవబడి ముందుకు వంగడం)
నిలబడి ముందుకు వంగే ఆసనం రక్త ప్రసరణను పెంచడం ద్వారా నరాల పనితీరుని మెరుగుపరుస్తుంది, మెదడును ప్రశాంతంగా కూడా ఉంచుతుంది.

సేతుబంధాసన (వంతెన భంగిమ)
ఈ ఆసనం మీ రక్తపోటు ను నియంత్రించి, మెదడుకు విశ్రాంతిని, ప్రసంతతను ఇచ్చి ఆతృతను తగ్గిస్తుంది. అంతేకాకుండా ఈ ఆసనం చేసేటపుడు రక్తం మెదడుకు సరఫరా అయి నొప్పి నివారణకు సహాయపడుతుంది.

బాలాసన (బాలల ఆసనం)
పిల్లల భంగిమ అని సముచితంగా పిలవబడే ఈ ఆసనం ఒత్తిడిని దూరం చేస్తుంది. ఇది నడుము, తొడలు, చీలమండలం లను కొద్దిగా సాగదీసి, మెదడును శాంతపరచి, ఒత్తిడిని, అలసటను దూరం చేయడానికి సహాయపడుతుంది. ఈ బాల భంగిమ బాధను నివారించి, నరాల పని తీరును కూడా మెరుగుపరుస్తుంది.

మార్జారి ఆసనం (పిల్లిలాగా సాగడం)
పిల్లిలాగా సాగడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడి, మెదడు ప్రశాంతంగా ఉంది, ఒత్తిడిని నివారించి, మంచి శ్వాస తీసుకోవడానికి సహాయపడుతుంది. ఈ ఆసనానికి మంచి భాగం కండరాలు, ఇది నొప్పిని పోగొట్టుకోవడానికి ప్రభావిత మార్గమైన కండరాల ఒత్తిడిని పోగొట్టడానికి సహాయపడుతుంది. మార్జారి ఆసన లేదా పిల్లిలా సాగడం భంగిమ ఎలా చేయాలో ఇక్కడ ఉంది.

పశ్చిమోత్తాసనం (రెండు కాళ్ళూ ముందుకు వంచడం)
రెండు కాళ్ళూ ముందుకు వంచే ఆసనం మెదడును ప్రశాంతంగా ఉంచి, ఒత్తిడిని తగ్గించి, తలనొప్పిని నుండి ఉపశమనం కలిగిస్తుంది. పశ్చిమోత్తాసనం లేదా రెండు కాళ్ళూ ముందుకు వంచే భంగిమ ఎలా చేయాలో ఇక్కడ ఉంది.

అధోముఖ స్వానాసన (కిందకు చూస్తున్న కుక్క భంగిమ)
కిందకు చూస్తున్న కుక్క భంగిమ మెదడుకు రక్త ప్రసరణను అభివృద్ది చేసి దానివల్ల తలనొప్పి తగ్గెట్లు చేస్తుంది. కిందకు చూస్తున్న కుక్క భంగిమ లేదా అధోముఖ శ్వాసన ఆసనం ఎలా చేయాలో ఇక్కడ ఉంది.

పద్మాసనం (పద్మం భంగిమ)
పద్మాసనం మనసుకి ప్రశాంతతను కలిగించి, పార్శ్వపు నొప్పిని ఉపశమనం కలిగిస్తుంది. మీరు పద్మం భంగిమ లేదా పద్మాసనం ఎలా చేయాలో ఇక్కడ ఉంది.

 శవాసనం (శవం భంగిమ)
శవాసనం ధ్యాన ముద్రలో లోతుగా తీసుకువెళ్ళి శరీరానికి ఉత్తేజాన్ని కలిగిస్తుంది. కొన్ని నిమిషాలు ఈ భంగిమలో ఉండి రోజువారీ యోగా ముగుస్తుంది. మీరు శవాసన లేదా శవ భంగిమను సరైన విధంగా ఎలా చేయాలో ఇక్కడ ఉంది. ఈ చిన్న చిన్న యోగాసనాలను అభ్యసించడం వల్ల పార్శ్వపు నొప్పి ప్రభావాన్ని తగ్గించి, దాదాపు శాస్వతంగా తలనొప్పి రాకుండా ఆపుతుంది. అందువల్ల, యోగా చాపను మడిచి, రోజులో కొంతసేపు విశ్రాంతి తీసుకోండి, మీ మంచికోసం పార్శ్వపు నెప్పి మీ జీవితం నుండి దూరమౌతుంది. జాగ్రత్త అనే పదం: మీ డాక్టర్ ఇలా చెయ్యి అని సలహా ఇచ్చేవరకు మందులు వాడడ౦ ఆపొద్దు. యోగా మీ మైగ్రేన్ కి వ్యతిరేకంగా వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది, అంతేకాని మందులకు బదులుగా ఉపయోగించేది కాదు.

కారు కోసం 8 కోట్లు ఖర్చు పెట్టనున్న చెర్రి

Ram-Charanమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక కారు మీద మోజుపడి ఏకంగా 8 కోట్లు ఖర్చు పెట్టి దానికి దక్కించుకున్నాడట. ఆ కారులో అంత స్పెషన్ ఏముంది అంటారా? అది కార్ కాదు.. కార్ వ్యాన్. ఇంట్లో ఉండే అన్ని హంగులు అందులో ఉంటాయనమాట. ఇందులో బెడ్ రూం, డైనింగ్, రెస్ట్ రూం ఇలా అన్నీ ఉంటాయి. మొత్తంగా చూస్తే మన హీరోలు అవుట్ డోర్ షూటింగ్ లో ఉంటే కనుక అచ్చం ఇంట్లో ఉన్నట్లే ఉండేలా చేస్తుంది. ఇప్పటికే ఇలాంటి కార్లు టాలీవుడ్ లో ఇద్దరికీ ఉన్నాయి. ఒకటి మహేష్ బాబు, రెండు ఎన్టీఆర్ లు ఈ కార్లను వాడుతున్నారు. ఇప్పుడు రామ్ చరణ్ కూడా ఆ జాబితాలో చేరిపోయాడు. మహేష్ అప్పట్లో 8 కోట్లు, ఎన్టీఆర్ 7 కోట్లు ఖర్చు పెట్టి ఈ కార్లను తయారుచేయించుకోగా చెర్రీ కూడా ఇప్పుడు 8 కోట్లు ఖర్చు పెట్టి ఈ కార్ ను డిజైన్ చేయించుకుంటున్నాడు.

యమ ధర్మరాజు చెప్పిన మరణ రహస్యాలు

yamarajaమనమందరం అమరులం కాదని తెలుసు. అలాగే మనం ఏదో ఒక రోజు మరణిస్తామని కూడా తెలుసు. మరణం యొక్క గడియారం అనేది ఒక గొప్ప రాజు లేదా ఒక బిచ్చగాడు ఇద్దరికి సమానంగా ఉంటుంది. మరణం అనే విషయానికి వచ్చినప్పుడు అందరూ దాని గురించి మరింత తెలుసుకోవలసిన అవసరం ఉంది. ఈ చర్చ చాలా ఆసక్తికరమైన మలుపు తీసుకుంటుంది. మరణం యొక్క దేవుడు యముడు మరణం గురించి కొన్ని లోతైన విషయాలను తెలుసుకోవటం కొరకు BOLDSKY హైలైట్ చేస్తుంది. పురాతన గ్రంధముల ప్రకారం,మరణం మరియు ఆత్మ గురించి రహస్యాలను యముడు బిడ్డ నచ్కేట మరియు యముడు మధ్య చర్చలు చేయబడ్డాయి. ఇక్కడ నచ్కేట మరణం గురించి యముడు మరణం యొక్క కొన్ని రహస్యాలను బహిర్గతం చేసారు.
నచ్కేట యొక్క మూడు కోరికలు: నచ్కేట యముడిని కలిసినప్పుడు అతను మూడు కోరికలను అడిగాడు. అతని మొదటి కోరిక అగ్ని విద్య, రెండవది తండ్రి ప్రేమ పొందడానికి మరియు మూడవ కోరిక మరణం మరియు ఆత్మ జ్ఞానం గురించి తెలుసుకోవాలి. యముడు ఆఖరి కోరికను తీర్చలేకపోయాడు. కానీ పిల్లలకు తక్షణం ఉంటుంది. కాబట్టి, యముడు రహస్యాలు మరియు మరణం తరువాత జరిగే విషయాలను గురించి బహిర్గతం చేసాడు.
బహిర్గతమవడం గ్రంధముల ప్రకారం,యముడు ఓంకార పరమాత్మ స్వరూపం అని వెల్లడించింది.అతను కూడా ఒక మానవ హృదయంలో బ్రహ్మ ఉన్న ప్రదేశం అని చెప్పారు.
ఆత్మ యముడు ఒక వ్యక్తి యొక్క ఆత్మకు మరణం తర్వాత మరణం లేదని చెప్పారు. సంక్షిప్తంగా,శరీరం ఆత్మను నాశనం చేయవలసిన అవసరం లేదు.ఆత్మ మళ్లీ పుడుతుంది. ఆత్మకు మరణం లేదు.
బ్రహ్మరూప మరణం తరువాత, ఒక వ్యక్తి పుట్టుక మరియు మరణ చక్రం అంతమవుతుంది. అతను/ఆమె పుట్టుక మరియు మరణం నుండి బయట పడిన తర్వాత బ్రహ్మ రూప్ గా పిలుస్తారు.
దేవుని శక్తి కొంత మందికి దేవుని మీద నమ్మకం ఉండదు. కానీ మరణం తర్వాత శాంతి కోసం నాస్తికులు శోధన జరుపుతారు. స్పష్టంగా, వారి ఆత్మలు శాంతిగా ఉండటానికి చేస్తారు. నచ్కేట మరణం గురించి యమ దేవుడు కొన్ని రహస్యాలను తెలియజేసెను.

అరటి తొక్కలోని అద్భుత లాభాలు మీకు తెలుసా?

bananapeelఅసహజంగా అనిపిస్తుంది కదూ! కాని, అసహజమేమి కాదు. ఇది భారతదేశంలో దొరికే సాధారణ పండ్లలో ఒకటి మరియు దీనిని ఎందుకు మనం రుచిగా, ఇష్టంగా వాడమో తెలీదు. మీరు అరటి తొక్కను చెత్తబుట్టలో పడవేసే ముందు, అరటితొక్కవలన కలిగే లాభాలను తెలియచేసే ఈ వ్యాసాన్ని చదవండి. దీనివలన అద్భుతమైన ఫలితాలను అందుకుంటారు. అరటి పండులో అనేక పోషకాలు మరియు కార్బోహైడ్రేట్లు సమృద్ధిగా ఉంటాయి. అరటిపండులో విటమిన్లు B-6, B-12, మెగ్నీషియం మరియు పొటాషియం సమృద్ధిగా ఉంటాయి. అరటి తొక్క నల్లరంగులోకి ఉన్నప్పుడు చక్కెర కంటెంట్ అత్యధికంగా ఉన్నదన్నమాట. ప్రకృతి ఇచ్చిన ఈ అద్భుతమైన బహుమతి యొక్క గొప్ప ప్రయోజనాలు చూద్దాం: అరటితొక్క వలన ఉపయోగాలు:
దంతాలు: అరటితొక్కతో ఒక నిముషంపాటు దంతాలపైన ఒక వారం రోజులపాటు ప్రతిరోజూ రుద్దండి. ఇలా చేయటంవలన మీ దంతాలు తెల్లగా మెరుస్తాయి. ఏంటో డబ్బు ఆదా అవుతుంది.

పులిపిర్లు: అరటి తొక్క పులిపిర్లను తొలగించడంలో సహాయపడుతుంది మరియు క్రొత్తవి రాకుండా చేస్తుంది. దీనికోసం, పులిపిర్లు ఉన్న ప్రాంతాన్ని అరటితొక్కతో రుద్దండి లేదా ఆ ప్రాంతం మీద రాత్రంతా అరటితొక్కను కట్టండి. చర్మం కొరకు అరటితొక్కతో చేసే చికిత్సలలో ఇది సులభమైన మార్గం.

అరటి తొక్కలను కూడా ఆహారంగా తీసుకోవొచ్చు. అద్భుతమైన ఇండియన్ వంటకాలలో వీటిని వాడుతుంటారు. లేత చికెన్ ను దీనిమీద ఉంచి ఉపయోగిస్తారు.

మొటిమలు: మొటిమలు తగ్గటానికి అరటితొక్కతో మీ ముఖాన్ని మరియు శరీరాన్ని ఐదు నిముషాలపాటు మర్దన చేయండి. మీకు వారంలోపల మంచి ఫలితం కనపడుతుంది. ఇలా మొటిమలు మాయమయ్యేవరకు చేయండి.

ముడతలు: మీ శరీరం హైడ్రేట్ అవటానికి అరటితొక్క సహాయపడుతుంది. మెత్తగా చేసిన అరటితొక్కతో గ్రుడ్డు సొనను కలపండి. ఈ మిశ్రమాన్ని మీ ముఖం మీద రాసి, ఐదు నిముషాలు అలానే వదిలేయండి. ఐదు నిముషాల తరువాత కడగండి.
నొప్పి నివారిణి: నొప్పిగా ఉన్న ప్రాంతంలో అరటితొక్కతో రాయండి. నొప్పినుండి ఉపశమనం వోచ్చేవరకు ముప్ఫై నిముషాల వరకు అలానే వదిలేయండి. అరటి తొక్కతో కూరగాయల నూనె మిశ్రమం కలిపి రాస్తే, నొప్పినుండి ఉపశమనం కలుగుతుంది.

సోరియాసిస్: సోరియాసిస్ తో ఉన్న ప్రాంతం అంతటా అరటితొక్కతో రాయండి. అరటి తొక్క మాయిశ్చరైజేషన్ గుణాలను కలిగి ఉన్నది మరియు దురదను కూడా తగ్గిస్తుంది. ఇది త్వరగా సోరియాసిస్ ను నయం చేస్తుంది మరియు మీరు తక్కువ సమయంలోనే మంచి ఫలితాలు చూడవొచ్చు.

దోమల కాట్లు: దురద మరియు నొప్పి నుండి తక్షణ ఉపశమనం పొందేందుకు దోమలకాటు ఉన్న చర్మము మీద అరటితొక్క తో మసాజ్ చేయండి.

షూస్, లెదర్, సిల్వర్ పాలిష్: ఏవైనా బూట్లు, తోలు, మరియు రజతం; వీటిని వెంటనే ప్రకాశింప చేయడానికి అరటితొక్కతో రుద్దండి.

UV రక్షణ: అరటి తొక్క హానికరమైన UV కిరణాలు నుండి కళ్ళను రక్షించడంలో సహాయపడుతుంది. మీరు మీ కళ్ళను అరటి తొక్కతో రుద్దే ముందు, అరటితొక్కను సూర్యుని ముందు ఉంచండి. ఇలా చేయటం వలన మీ కళ్ళకు శుక్లాలు ప్రమాదం కూడా తగ్గుతుందని నిరూపించబడింది.

ఔలి – స్కయింగ్ క్రీడల స్పెషల్

ouli-sportsఔలి ఒక అందమైన పర్యాటక ప్రదేశం. స్కయింగ్ క్రీడకు ప్రసిద్ధి. సుందర దృశ్యాలు కల ఈ ప్రదేశం సముద్ర మట్టానికి సుమారు మూడు వేల మీటర్ల ఎత్తున కలదు. ఏటవాలు ప్రాంతాలలో ఓక్ మరియు ఇతర వృక్షాలు కల అటవీ ప్రదేశాలు కలిగి వుంటుంది. ఈ ప్రదేశాన్ని స్థానిక భాషలో ‘బుగ్యాల్’ అంటే పచ్చిక మైదాన ప్రాంతం అని కూడా అంటారు. ఇతర ఆకర్షణలతో పాటు ఇక్కడ శైల దార్ తపోవన్ ఒక చిన్న గ్రామం. ఔలి నుండి 15 కి. మీ. ల దూరంలో కలదు. ఈ ప్రదేశంలో సహజ వేడి నీటి బుగ్గ మరియు ఒక దేవాలయం లు కలవు. దీని నుండి మూడు కి. మీ. ల దూరంలో మరొక వేడి నీటి బుగ్గ కూడా కలదు. ఇది ప్రధానంగా చూడ దగిన ప్రదేశం. ఔలి ఎలా చేరాలి ? విమాన ప్రయాణం ఔలి నుండి 279 కి. మీ. ల దూరంలో కల డేహ్రా డూన్ లోని జాలీ గ్రాంట్ ఎయిర్ పోర్ట్ ద్వారా ఇతర ప్రదేశాలకు విమానంలో చేరవచ్చు. విదేశీయులు, న్యూ ఢిల్లీ లోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ నుండి డెహ్రాడూన్ చేరవచ్చు. రైలు మార్గం ఔలి కి 28 7 కి. మీ. ల దూరంలో కల హరిద్వార్ రైల్వే స్టేషన్ సమీప రైలు స్టేషన్. ఇక్కడ నుండి దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు రైళ్ళు కలవు. రోడ్డు మార్గం జోషి మట్ నుండి టాక్సీ లేదా బస్సు లలో ఔలి కి రోడ్డు మార్గంలో చేరవచ్చు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సమీప నగరాలైన జోషి మట్, రిషి కేష్, హరిద్వార్, డెహ్రాడున్ ల నుండి ఔలి కి బస్సు లు నడుపుతుంది.

కేదార్ నాద్ …మంచు కొండల్లో మహా రహస్యాలు !

kedarnathకేదార్ నాద్ ఉత్తరాఖండ్ రాష్ట్రం లోని రుద్రప్రయాగ్ జిల్లాలో ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. సముద్ర మట్టానికి సుమారు 3,584 మీ. ల ఎత్తున కల ఈ ప్రదేశం హిమాలయాల ఒడి లో హిందువులకు ఒక ప్రసిద్ధ, పవిత్ర యాత్రా స్థలంగా కూడా పేరు గాంచినది. వేసవి కాలంలో అనేక మంది హిందూ యాత్రికులు కేదార్ నాద్ సందర్శించి శివ భగవానుడి ఆశీస్సులు పొందుతారు. ఇక్కడ కల కేదార్ నాద్ టెంపుల్ సుమారు వేయి సంవత్సరాల కిందట నిర్మించిన ఒక రాతి నిర్మాణం. సముద్ర మట్టానికి సుమారు 3,584 మీ. ల ఎత్తున కల ఈ ప్రదేశం చేరటం, అక్కడ కల అన్ని చార్ ధాం లు సందర్శించటం అతి కష్టంగా వుంటుంది. కేదార్ నాద్ లో మీరు ఇంకనూ చూడవలసిన ఆకర్షణలు, అగస్త్య ముని, భైరవ్ నాథ్ టెంపుల్, చోరా భారి తాల్, గౌరీ కుండ్, కేదార్ మాసిఫ్, మందాకినీ నది, శంకరాచార్య సమాధి, వాసుకి సరస్సు వంటివి ఎన్నో కలవు.

కేదార్ నాద్ ఎలా చేరాలి ?

విమాన ప్రయాణం కేదార్ నాద్ కు 239 కి. మీ. ల దూరంలో కల డెహ్రాడూన్ లో జాలీ గ్రాంట్ ఎయిర్ పోర్ట్ దీనికి సమీప ఎయిర్ పోర్ట్. ఇక్కడ నుండి దేశంలోని వివిధ ప్రాంతాలకు విమానాలు కలవు. ట్రైన్ ప్రయాణం కేదార్ నాద్ కు 221 కి. మీ. ల దూరంలో సమీప రైలు స్టేషన్ రిషి కేష్ లో కలదు. ఇక్కడ నుండి దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు రైళ్ళు కలవు. రోడ్డు ప్రయాణం కేదార్ నాద్ కు రోడు మార్గం కూడా కలదు. బస్సు లేదా జీప్ లలో ప్రయాణించవచ్చు. అయితే, రోడ్డు మార్గం సరిగా ఉండక ప్రయాణం కష్టతరం అవుతుంది. కాలి నడకన సుమారు 14 కి. మీ. లు నడక సాగించాలి.

చిక్కుల్లో పడ్డా దౌత్యవేత్త దేవయాని కోబ్రాగాడే

న్యూఢిల్లీ: దౌత్యవేత్త దేవయాని కోబ్రాగాడే చిక్కుల్లో పడ్డారు. ఆమెకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. విదేశాంగ మంత్రిత్వ శాఖలో ఆమెను విధుల నుంచి తప్పించి, తప్పనిసరి నిరీక్షణలో పెట్టారు. అనుమతి తీసుకోకుండా మీడియాతో మాట్లాడినందుకు ఆమెకు ఈ షాక్ తగిలింది. డెవలప్‌మెంట్ పార్ట్నర్‌‌షిప్ డివిజన్‌లో డైరెక్టర్‌గా ఉన్న ఆమెను విధుల నుంచి విదేశాంగ మంత్రిత్వ శాఖ తప్పించినట్లు సమాచారం. ఆమెను తప్పనిసరి నిరీక్షణలో పెట్టారు. విజిలెన్స్ కేసులో జరుగుతున్న విచారణకు సంబంధించి ఆమెపై పాలనాపరమైన చర్యలు తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి చెప్పారు.
devyani-khobragade
అంటే, ఆమె సర్వీసులో ఉంటారు గానీ పని ఉండదు. ఆమె మరింతగా పాలనాపరమైన చర్యలకు గురి కావాల్సి వస్తోందని అంటున్నారు. ఐఎఫ్ఎస్ అధికారిగా కూడా కోబ్రాగాడే ప్రభుత్వాన్ని అసంతృప్తికి గురి చేసినట్లు చెబుతున్నారు. దౌత్యపరమైన వివాదంలో చిక్కుకున్న ఆమె తన ఇద్దరు పిల్లలకు అమెరికా పాస్‌పోర్టులున్నాయనే విషయాన్ని దాచిపెట్టినట్లు ఆరోపణలున్నాయి. తన భర్త అమెరికా పౌరుడనే విషయాన్ని కూడా ఆమె తెలియజేయనట్లు చెబుతున్నారు. తన పనిమనిషికి సంబంధించిన వీసా దరఖాస్తులో తప్పుడు వివరాలు ఇచ్చారనే ఆరోపణపై 1999 బ్యాచ్ ఐఎఫ్ఎస్ అధికారి అయిన దేవయాని కోబ్రాగాడే గతంలో అరెస్టు కూడా అయ్యారు. 250,000 డాలర్ల బాండ్‌పై ఆమె విడుదలయ్యారు. ఆ గొడవ తర్వాత ఆమె భారత్‌కు బదిలీ అయ్యారు.