మా వాలంటీర్లను కొనేస్తున్నారు

ప్రజాస్వామ్య బద్దంగా తమ పార్టీని ఎదుర్కోలేక ప్రధాన రాజకీయ పార్టీలు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నాయని “ఆప్” అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. తమ పార్టీ నేతలు, కార్యాకర్తలను భాజపా, కాంగ్రెస్ నేతలు కలిసి డబ్బులు ఎర చూపుతున్నారని, ఇతర ప్రలోభాలకు గురి చేస్తున్నారని డిల్లీ ఎనికల్లో భాజపాకు ఓటమి భయం పట్టుకుందని ఆరోపించారు.

వెల్ డన్ రాజేంద్రన్

rajendran

ఆంధ్రాబ్యాంకు సీ.ఎం.డీ రాజేంద్రన్ కుండ బద్దలు కొట్టారు. రాజకీయ నాయకులు, సినిమా తారల మూలంగానే ఆంధ్రాబ్యాంకు లో నిరర్ధక ఆస్తులు పెరిగిపోయాయని వారి వద్ద నుండి కోట్లాది రూపాయిలు బాకీలు వసూలు కావలిసి ఉందని వెల్లడించారు.  శుక్రవారం నాడు ఆయన విలేఖరులతో మాట్లాడుతూ బంగారం తాకట్టు పెట్టి ఋణాలు తీసుకుని చెల్లించని వారి ఆభరణాలను వేలం వేస్తామని ఆయన ప్రకటించారు.

దిల్లీ తదుపరి ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్

kiran-kejriwal-sl-25-08-201

ఫిబ్రవరి 7వ తేదీన జరగనున్న దిల్లీ ఎన్నికల్లో ఆప్ అధినేత కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యేందుకు వాతావరణం అనుకూలంగా ఉందని వీక్-ఐబీఎన్ సర్వే వెల్లడించింది. కేజ్రీవాల్‌కు 40 శాతం, కిరణ్ బేడీకి 39 శాతం ఓట్లు రావచ్చునని సర్వేలో వెల్లడి అయింది.

హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో ఘనంగా గణతంత్ర వేడుకలు

3హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో 66వ గణతంత్ర దినోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. ఉప-కులపతి రామకృష్ణ రామస్వామి జెండా ఎగురవేసి, గౌరవ వందనం స్వీకరించిన అనంతరం సభికులను ఉద్దేశించి ప్రసంగించారు. మంచి పౌరులు కావాలంటే మంచి విద్యార్ధిగా తొలిమెట్టులోనే అది సాధ్యపడుతుందని అన్నారు. పదవీ విరమణ చేస్తున్న కులపతి సీ.హెచ్.హనుమంతరావుకు తన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం విద్యార్ధుల ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

2 4 5 6

తెలంగాణా భాషా సాంస్కృతిక శాఖ గణతంత్ర వేడుకలు

rsz_dsc0613766వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణా భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ కళాభవన్ ప్రాంగణంలో మువ్వన్నెల జాతీయ పతాకాన్ని ఎగురవేసారు. ఈ సందర్భంగా సంచాలకులు మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నందుకు సంతోషంగా ఉందని, అలాగే కార్యాలయ సిబ్బంది అందరూ సమిష్ఠిగా కష్టపడి మరింత సేవలందించాలని  తెలిపారు.  ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బందితో పాటు రవీంద్రభారతి సిబ్బంది కుడా పాల్గొన్నారు.

తెలంగాణా రాష్ట్ర జానపద కళాకారుల సంఘం ఆధ్వర్యంలో గణతంత్ర వేడుకలు

rsz_dsc06220గణతంత్ర దినోత్సవం సందర్భంగా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో తెలంగాణా రాష్ట్ర జానపద కళాకారుల సంఘం ఆధ్వర్యంలో రవీంద్ర భారతి-ఘంటసాల వేదికలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. దేశభక్తి గీతాలు , డప్పులు, భోనాలు, బతుకమ్మ నృత్యం, చిరుతల భజన, శారద కథ , పులివేషాలు , మొదలగు జానపద కళారూపాల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి .

rsz_1samskruthika_samburaalu

తెలుగు ‘పద్మా’లకు నాట్స్ అభినందనలు

తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురుకి కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలు ప్రకటించటం పట్ల ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) హర్షం వ్యక్తం చేసింది.  కృష్ణా జిల్లాలో పుట్టి, కర్నూలులో వైద్య విద్యనభ్యసించి, ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ వైద్య రంగంలో విశేష అనుభవాన్ని, పేరు ప్రఖ్యాతలను గడించి, పేదవారికి తోడ్పాటును అందించటంలో ముందుండే డాక్టర్ నోరి దత్తాత్రేయుడుకి పురస్కారం రావటం చాలా ఆనందంగా ఉందని నాట్స్ బోర్డు చైర్మన్ డాక్టర్ కొర్రపాటి మధు అన్నారు. కోట శ్రీనివాసరావును నాట్స్ సభల్లో ముఖ్య అతిధిగా సత్కరించుకోవటం, ఆయనకి పద్మశ్రీ పురస్కారం రావటం గర్వంగా ఉందని నాట్స్ ఓ ప్రకటనలో పేర్కొంది. వీరితో పాటు పద్మ పురస్కారాలు అందుకుంటున్న తెలుగు వారందరికీ నాట్స్ అభినందనలు తెలిపింది.

ప్రముఖ చిత్రకారుడు ఆర్.కె.లక్ష్మణ్ మృతి

r-k-laxman

ప్రముఖ వ్యంగ్య చిత్రకారుడు రాశిపురం కృష్ణస్వామి లక్ష్మణ్ (ఆర్.కె.లక్ష్మణ్) పూనే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆయన వయస్సు 93 సంవత్సరాలు.  “కామన్ మ్యాన్” అనే పాత్రకు జీవం కల్పించటం ద్వారా ఆయన్ సుప్రసిద్ధులయ్యారు. కేంద్ర ప్రభుత్వం ఆయన్ను 2005లో పద్మవిభూషణ్ పురస్కారంతో సన్మానించింది. ఆయన 1984లో రామన్ మెగసెసె అవార్డును అందుకున్నారు.

Veteran cartoonist R.K. Laxman being felicitated with Bharat Bhushan award by former President Dr APJ Abdul Kalam in Pune on Sept. 22, 2013. (Photo: IANS) rk-laxman1

ఘనంగా 66వ భారత గణతంత్ర వేడుకలు

rd1 rd2 rd3 rd4 INDIA-US-DIPLOMACY INDIA-US-DIPLOMACY rd7 rd8 rd9 rd10 rd11 rd12 rd13 rd14rd0

66వ గణతంత్ర వేడుకలు దేశంలో అట్టహాసంగా నిర్వహించారు. విశిష్ట అతిథి ఒబామా సాక్షిగా దిల్లీ రాజ్‌పథ్‌లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి అన్సారీ, మాజీ ప్రధాని మన్మోహన్, పలువురు కేంద్ర మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వివిధ శకటాలు, పలు బృందాల కవాతులు ఈ వేడుకల్లో కన్నులకు పండుగ చేశాయి.

విజయవాడలో తొలిసారిగా మున్సిపల్ స్టేడియంలో గణతంత్ర వేడుకలు నిర్వహించారు. గవర్నర్ రంగరాజన్ జాతీయ జండాను ఎగురవేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పలువురు మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.rd15 rd16 rd17 rd18 rd19 rd20 rd21 rd22

 

కృష్ణాజిల్లాలో ఏడాది పాటు సాగిన గానుగపాడు రిపబ్లిక్ ఉజ్వల గాధ

ganugapaduపోరాట సమయంలో తీసిన చిత్రం. మధ్య వరుసలో ఎడమ నుండి కుడికి మొదటి వ్యక్తి జలగం వెంగళరావు.

“బయట నుండి వచ్చే కష్ట నష్టాలను మతాల బేధభావం లేకుండా కలిసికట్టుగా ఎదుర్కొందాం” – ఇదే భారతదేశం రిపబ్లిక్‌గా అవతరించకముందు గానుగపాడులో ఏర్పడిన తిరుగుబాటు ప్రభుత్వం తమ పాలనలోని సభ్యులనుండి స్వీకరించిన ప్రమాణ పత్రంలోని ఓ కట్టుబాటు. భారతదేశానికి స్వాతంత్ర్యం లభించిన అనంతరం ప్రస్తుతం కృష్ణాజిల్లా తిరువూరు మండలంలోని గానుగపాడు దాని శివారు ఆరు గ్రామాలు నిజాం ప్రభుత్వ పాలనలో ఉండేవి. నిజాం నవాబు తన ప్రభుత్వాన్ని ఇండియన్ యూనియన్‌లో విలీనం చేయడానికి నిరాకరించడంలో ఈ ఆరు గ్రామాల ప్రజల్లో చైతన్యం పెల్లుబికి నిజాం నిరంకుశ పాలనకు స్వస్తి చెప్పాలని స్వంత విధానాలు, ఆదాయ వనరులతో స్వతంత్ర రిపబ్లిక్‌గా ప్రకటించుకున్నారు. తమ ప్రాంతాన్ని తామే పరిపాలించుకోవటం కోసం ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. గానుగపాడు కేంద్రంగా ఆరు గ్రామాలు రిపబ్లిక్‌గా ఏర్పడటానికి దారి తీసిన పరిస్ధితులు, ఆ తర్వాత అది భారత దేశంలో విలీనం అయ్యే వరకు జరిగిన సంఘటనలు ఈ విధంగా ఉన్నాయి. గానుగపాడు, పల్లెర్లమూడి, చౌటపల్లి, టేకులపల్లి, కొత్తూరు, చిక్కుళ్లగూడెం గ్రామాలు నిజాం ప్రభుత్వ పాలనలో ఉండేవి. గానుగపాడు గ్రామంలో ఒక జమేదారు, ఐదుగురు పోలీసులతో ఒక నాకా (పోలీస్ స్టేషన్)ను నిజాం ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనితో ప్రజలు జాతీయ జెండా ఎగురవేసి “నిజాం గో బ్యాక్”, “ఇండియన్ యూనియన్ జిందాబాద్” అనే నినాదాలతో ఊరేగింపు జరిపారు. ఇదంతా చూసిన నిజాం ప్రభుత్వ ఉద్యోగులకు మింగుడుపడక ఈ ఆరు గ్రామాల ప్రజలను నిర్దాక్షిణ్యంగా అణిచివేయటానికి ప్రయత్నించారు. వీరి దౌర్జన్యాలను సహించలేని ప్రజలు దెబ్బకు దెబ్బ తీయాలనే నిర్ణయానికి వచ్చారు. ఆయుధ శిక్షణా శిబిరాలు రహస్యంగా పని చేయటం ఆరంభించాయి. ఆయుధాలు తయారు చేయడంలో నిష్ణాతులైన తిరువూరుకి చెందిన గుండిమెడ లక్ష్మీనారాయణ (బుల్లోడు), పసుపులేటి వీరయ్యల ఆధ్వర్యంలో పల్లెర్లమూడి గ్రామంలో పోరాటానికి కావల్సిన ఆయుధ సామాగ్రి తయారు చేయడం ప్రారంభించారు. వీరికి సహకరించటానికి సికింద్రాబాద్ నుండి నరసింహసింగ్ అనే అనుభవం కలిగిన ఆయుధాల తయారీదారుడిని పిలిపించారు. పల్లెర్లమూడి గ్రామంలో బ్రహ్మం అనే వ్యక్తి ఇంట్లో ఆయుధ సామాగ్రి తయారీ కర్మాగారాన్ని నెలకొల్పారు. అనంతరం గానుగపాడు గ్రామంలో ఉన్న నాకాపై తిరుగుబాటు జరపడంతో దానిలోని జమేదారు, ఇతర పోలీసులు పలాయనం చిత్తగించారు. నాకాలో ఉన్న ఆయుధ సామాగ్రి, రైతుల భూములకు సంబంధించిన పత్రాలు, ఇతర రికార్డులు, కొంత నగదు పోరాట కమిటీ సభ్యులు స్వాధీనపరుచుకున్నారు. ఈ ప్రభుత్వం రూపొందటానికి సహకరించిన ప్రముఖుల్లో గానుగపాడుకు చెందిన కర్నాట వెంకటరెడ్డి, పాట్రేడు సుబ్బారెడ్డి, గ్రామాధికారుల్ కుటుంబానికి చెందిన కవుటూరు సత్యనారాయణ, సెట్టిపల్లి వెంకటప్పారెడ్డి, శీలం వెంకటరెడ్డి, చిక్కుళ్లగూడెం గ్రామానికి చెందిన టంటు బాలయ్య, పల్నాటి వీరయ్య, కొత్తూరుకు చెందిన గురాల అనిమిరెడ్డి, తోకచిచ్చు పుల్లంరాజు, పల్లెర్లమూడికి చెందిన చీరెడ్డి పెదబసవరెడ్డి, పొట్లిరెడ్డి, చారుగుళ్ల అప్పయ్య, చౌటపల్లి గ్రామానికి చెందిన ఎరుము నాగిరెడ్డి, గుర్రాల చిన కోటిరెడ్డి, కామిరెడ్డి వెంకటరెడ్డి, గొల్లమందల అప్పయ్య, టేకులపల్లి గ్రామానికి చెందిన కామిరెడ్డి రామిరెడ్డి, శీలం అచ్చిరెడ్డి, మంగినపూడి బిచ్చం, పోలిశెట్టిపాడు గ్రామానికి చెందిన కోటేరు రామచంద్రరెడ్డి తదితరులు ఉన్నారు. ప్రముఖ కాంగ్రెస్ నాయకులు టి.హయగ్రీవాచారి, జలగం వెంగళరావు, బొమ్మకంటి సత్యనారాయణరావులు గానుగపాడు రిపబ్లిక్ ప్రభుత్వానికి ప్రధాన సలహాదారులుగా ఉండేవారు. ఈ ప్రభుత్వం 1947 నవంబరు నెల నుండి ప్రజాస్వామిక రాజ్యంగా పాలించడం మొదలుపెట్టింది. రేడియోలోనూ విశేషంగా ప్రచారం లభించింది. గానుగపాడు తిరుగుబాటును విన్న అప్పటి కేంద్ర హోం శాఖా మంత్రి సర్దార్ వల్లభాయి పటేల్ ఆ ప్రాంత ప్రజల జాతీయ భావాలను ప్రశంసించి నిజాం నవాబు నుండి ఏ ఆపద రాకుండా గానుగపాడు ప్రాంతాన్ని కాపాడతామని హామీ ఇచ్చి భారత దేశంలో విలీనం చేయటానికి చర్యలు తీసుకుంటామని స్ధానిక కాంగ్రెస్ నాయకులకు వాగ్ధానం చేశారు. గానుగపాడు రిపబ్లిక్‌లో ముఖ్యమంత్రి, మంత్రులు దాదాపు సంవత్సరం పాటు చక్కని పరిపాలన అనుభవించినట్లు ప్రజలు చెప్తూ ఉంటారు. వెట్టి చాకిరి నిర్మూలించారు. అప్పట్లో కిరోసిన్ దొరక్క ప్రజలు ఇబ్బంది పడుతుండగా, కిరోసిన్, ఇతర నిత్యావసర వస్తువులను సక్రమంగా పంపిణీ చేయించారు. శాంతి భద్రతలు చక్కగా కాపాడారు. మధ్యనిషేధాన్ని కఠినంగా అమలుపరిచారు. పాఠశాలలు నడిపి జాతీయ భావాలు పెంపొందించారు. రైతుల సంక్షేమానికి చెరువులు, కాలువలు తవ్వకం పనులను ప్రజల సాయంతో స్వచ్ఛందంగా చేపట్టారు. జాతీయ నాయకులు జయప్రకాష్ నారాయణ్, టంగుటూరి ప్రకాశం, ఆచార్య రంగా తదితరులు ఈ ఉద్యమ కాలంలో వచ్చి వీరిని ప్రోత్సహించారు. కులమత బేధాలు లేకుండా పరిపాలన చక్కగా సాగింది. హైదరాబాద్ సంస్ధానంలో పరిస్ధితులు తారుమారు కావడం, ఆ సంస్ధానంపై 1948 సెప్టెంబరు 13వ తేదీన సైనిక చర్య జరిగి 17వ తేదీన అది ఇండియన్ యూనియన్‌లో విలీనం కావడం అందరికీ తెలిసిందే. అనంతరం గానుగపాడు రిపబ్లిక్ ప్రత్యేక ప్రభుత్వం రద్దయింది. అందరితో పాటు 1950 జనవరి 26వ తేదీన ఆ ప్రాంత ప్రజలు రిపబ్లిక్ దినోత్సవం జరుపుకున్నారు. ఆనాడు గానుగపాడు రిపబ్లిక్ కమిటీలో పాలుపంచుకున్న యోధులు నేటికీ ఈ ప్రాంతంలో ఉన్నారు.republic-day-2015

కోట శ్రీనివాసరావుకు పద్మశ్రీ అవార్డు

kotaవిలక్షణ నటుడు కోట శ్రీనివాసరావును పద్మశ్రీ పురస్కారం వరించింది. గణతంత్ర వేడుకల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కార గ్రహీతల వివరాలను వెల్లడించింది. తెలుగు రాష్ట్రాల నుండి పద్మశ్రీ లభించిన వారిలో క్రికెటర్ మిధాలీరాజ్, డాక్టర్ నోరి దత్తాత్రేయుడు, డాక్టర్ రఘురాముడు, డాక్టర్ అనగాని మంజుల, పీవీ సింధులు ఉన్నారు. అమితాబ్, అద్వానీ, దిలీప్‌కుమార్‌లకు పద్మవిభూషణ్, బిల్ గేట్స్, ఆయన సతీమణి మెలిండా గేట్స్‌లకు పద్మభూషణ్‌లను కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

రేపు విశాఖలో లోక్‌నాయక్ పురస్కారాల ప్రధానం

Screenshot from 2015-01-16 09:08:50

 

 

 

 

 

 

 

2005 నుండి స్వర్గీయ ఎన్.టి.రామారావు, హరివంశరాయ్ బచ్చన్‌ల స్మృత్యర్ధం నిర్వహిస్తున్న లోక్‌నాయక్ ఫౌండేషన్ పురస్కారాల ప్రధానోత్సవాన్ని ఈ ఏడాది 11వ సారి విశాఖపట్నంలోని కళాభారతి ఆడిటోరియంలో నిర్వహిస్తున్నట్లు అధ్యక్షులు డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తెలిపారు.  ఈ ఏడాది గొల్లపూడి మారుతీరావుకి సాహిత్య, ఫ్రాన్స్ దేశంలో తెలుగు ఆచార్యులు డేనియల్ నైజర్స్, కెనడాకు చెందిన ప్రవాసాంధ్ర ప్రముఖుడు వీరెళ్ల రాజేశ్వరరావులకు నగదు పురస్కారాలను అందిస్తున్నామని ఆయన వివరించారు.  శనివారం నాడు జరిగే కార్యక్రమానికి తమిళనాడు రాజ్యపాలకులు కొణిజేటి రోశయ్య,  సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్,  గీతం విశ్వవిద్యాలయ అధ్యక్షులు డాక్టర్ ఎం.వి.వి.ఎస్.మూర్తి,  జస్టిస్ జి.రఘురాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్,  ఉన్నత విద్యాశాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు,  పార్లమెంటు సభ్యులు కంభంపాటి హరిబాబు,  ముత్తంశెట్టి శ్రీనివాసరావు,  మాజీ పార్లమెంట్ సభ్యుడు సబ్బం హరి,  పైడా విద్యాసంస్ధల అధ్యక్షుడు పైడా కృష్ణప్రసాద్, లావు కృష్ణదేవరాయలు తదితరులు హాజరు అవుతున్నారని లక్ష్మీప్రసాద్ తెలిపారు.  గుమ్మడి గోపాలకృష్ణ పద్యగానం, గణపతిరావు జానపద గీతాలపన వంటి సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఈ సందర్భంగా ఏర్పాటు చేశారు.

మోదీకి పుస్తకాన్ని అందజేసిన యార్లగడ్డ లక్ష్మీప్రసాద్

YLP-Modiమాజీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ప్రధాని మోదీపై రచించిన పుస్తకాన్ని మంగళవారం నాడు ఢిల్లీలో ఆయనకు అందించారు. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు నివాసంలో జరిగిన సంక్రాంతి వేడుకల్లో  లక్ష్మీప్రసాద్ ఈ పుస్తకాన్ని మోదీకి అందజేశారు. పుస్తక రచనపై లక్ష్మీప్రసాద్‌కు ఈ సందర్భంగా ప్రధాని మోదీ ధన్యవాదాలు, అభినందనలు అందజేశారు.

వెంకయ్య ఇంట సంక్రాంతి వేడుక

డిల్లీలో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు గృహంలో మంగళవారం నాడు సంక్రాంతి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. సంక్రాంతి వైభవం ఉట్టిపడే విధంగా పలు కళా ప్రదర్శనలు నిర్వహించారు. షడ్రసోపేతమైన పిండి వంటలను వేడుకలకు హాజరైన వారికి వడ్డించారు.

త్రినేత్రుడు చిరంజీవి – వెంకయ్య నాయుడు

venkaiah-nayudu-pawanసినిమా రంగానికి ఎ.ఎన్.ఆర్, ఎన్.టీ.ఆర్ రెండు కళ్ళు లాంటి వారని చిరంజీవి మూడవ కన్ను లాంటి వ్యక్తి అని కెంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ప్రశంశల వర్షం కురిపించారు. నెల్లురు జిల్లా వెంకటాచలం గ్రామంలో వెంకయ్య నాయుడు నెలకొల్పిన స్వర్ణ భారత్ ట్రస్ట్ ఆధ్వర్యం లో నిర్వహించిన సంక్రాంతి సంబరాలలో వెంకయ్య మాట్లాడుతూ ఈ మటలు అన్నారు. ఈ సందర్భం గా హాజరైన సినీ నటుడు పవన్ కళ్యాణ్ ను, మంత్రి వెంకయ్య పొగ్డ్తలతో ముంచెత్తారు . దేశ భవిష్యత్తు అంధకారం లో ఉన్నప్పుడు ప్రధాని నరెంద్రమోడీ కి పవన్ కళ్యాణ్ బాగా సహకరించారని కొనియాడారు.

ప్రవాస భారతీయులకు శుభవార్త

ప్రవాస భారతీయులకు స్వదేశం లో ఓటు హక్కు కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం తో పాటు ఎన్నికల కమీషన్ ప్రయత్నాలు తీవ్రతరం చేస్తున్నారు. వచ్చే నెలలో డిల్లీ లో జరిగే అసెంబ్లీ ఎన్నికల నాటికి యన్.ఆర్.ఐ లకు ఓటు హక్కు కల్పించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి

చంద్రన్న సంక్రాంతి కానుక

chandrababu-pongal-giftచంద్రబాబు ప్రభుత్వం ప్రతిష్టాత్మకం గా చేపట్టిన చంద్రన్న సంక్రాంతి కానుక పధకం సోమవారం నుండి రాష్ట్ర వ్యాప్తం గా ప్రారంభమయ్యింది. ఆరు నిత్యావసర వస్తువులతో కూడిన గిఫ్ట్ ప్యాక్ ను పేద ప్రజలకు అందిస్తున్నారు . ఈ పధకాన్ని సూళ్ళూరు పేట లో మంత్రి ఘంటా శ్రీనివాసరావు, సినీ నటి శ్రయ చేతుల మీదగా ప్రారంభించారు.

గీతకు ఊరట

Geetha-8694అరకు ఎం.పీ గా వై.కా.పా తరపున ఎంపికైన కొత్తపల్లి గీతకు ఊరట కలిగింది. ఎన్నికలలో తప్పుడు సంతకాలతో నామినేషన్ వేశారంటూ ఆమెపై వచ్చిన ఫిర్యాదును తిరస్కరిస్తున్నట్లు ఎన్నికల కమీషన్ తిరస్కరించింది.

అగ్రీగోల్డ్ పాపం పండింది.

agri-goldఇప్పటి వరకు నిరాటంకం గా కోట్లాది రూపాయలను ప్రజల నుండి డిపాజిట్ల రూపంలో వసూలు చేసిన అగ్రీగోల్డ్ పై ఖాతా దారుల నుండి పలు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దీనితో ఆ సంస్థ నిర్వహించే పలు వ్యాపారాల పై పోలీసులు దృష్టి సారించారు. సీ.ఐ.డీ కి ఈ కేసును బదలాయించి రాష్ట్రం లో ఉన్న అన్ని అగ్రీగోల్డ్ కార్యాలయాలలో సోదాలు నిర్వహిస్తున్నారు .

నగల పత్రాలు చూపాల్సిందే

goldఇక నుండి విదేశాలకు వెళ్ళే వారు తాము తీసుకు వెళుతున్న నగలకు సంబంధించి కొనుగోలు చేసిన పత్రాలను విమానశ్రయం లో చూపించాల్సి ఉంటుంది. ఈ మేరకు కస్టంస్ శాఖ కొత్తగా ఆదేశాలు విడుదల చేసింది . ఒకవేళ నగలకు సంబంధించిన కొనుగోలు పత్రాలు చూపలేని పక్షంలో ఈ నగలు తమవేనంటూ ఒక అఫిడవిట్ ను సమర్పించాల్సి ఉంటుంది .