శ్రీశ్రీ సాహిత్యంలో హాస్యంపై టాంటెక్స్ సదస్సు


ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదిక సమర్పించు “నెల నెలా తెలుగు వెన్నెల” సాహిత్య సదస్సు ఆదివారం, నవంబరు 18 న సాహిత్య వేదిక సమన్వయకర్త వీర్నపు చినసత్యం అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. మంజుల తెలిదేవర శిష్య బృందం వృంద, సంజన , హమ్సిక ,అంటోనియో ప్రార్ధనా గీతంతో కార్యక్రమం ప్రారంభం అయ్యింది. సింధూర, సాహితి వేముల అన్నమాచార్య కృతి ఆలపించారు. డా. ఊరిమిండి నరసింహ రెడ్డి – మన తెలుగు సిరి సంపదలు శీర్షికన, నానుడి , జాతీయాలు , పొడువు కథలు గురించి ప్రశ్నలు అడిగి సభికులలో ఆసక్తి రేకెత్తించారు. చంద్రహాస్ మద్దుకూరి ‘రగిలింది విప్లవాగ్ని ఈ రోజు’ పాట పూర్వాపరాలు వివరించారు. దానిలో ఉపయోగించిన చరిత్ర, అల్లూరికి కలిగించిన ప్రేరణ వివరించారు. లెనిన్ వేముల తెలుగు శాసనాల చరిత్రని, పరిణామక్రమాన్ని వివరించారు.డా. పుదూర్ జగదీశ్వరన్ఆ ముక్తమాల్యదలోని కొన్ని పద్యాలను రాగయుక్తంగా చదివి వాటి అర్ధం వివరించారు. డా. ఆళ్ళ శ్రీనివాస్ రెడ్డి రాగయుక్తంగా ఎంకి పాటలు పాడి అలరించారు. ముఖ్య అతిధి మల్లవరపు అనంత్ ని చంద్రహాస్ సభకు పరిచయం చేయగా టాంటెక్స్ పూర్వాధ్యక్షులు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం పుష్పగుచ్చంతో సత్కరించారు. మల్లవరపు అనంత్ మాట్లాడుతూ “శ్రీ శ్రీ ప్రముఖంగా అభ్యుదయ కవి, విప్లవ కవి…. ఆయన రచనలలోనుండి హాస్యం వెతకడం సాహసమే అవుతుంది” అన్నారు. శ్రీ శ్రీ వ్రాసిన సిప్రాలి (సిరి సిరి మువ్వలు, ప్రాసక్రీడలు, లిమఋక్కులు ) పుస్తకాన్ని కూలంకషంగా పరిశీలించి దానిలోని హాస్యాన్ని సభికులకు పంచి సభలో నవ్వులు పూయించారు. అనంతరం అనంత్‌ను టాంటెక్స్ సాహిత్య వేదిక సభ్యులు, అధ్యక్షురాలు శీలం కృష్ణవేణి, ఉత్తరాధ్యక్షుడు వీర్నపు చినసత్యం, ఉపాధ్యక్షుడు కృష్ణారెడ్డి కోడూరు, కోశాధికారి పాలేటి లక్ష్మి పాలకమండలి సభ్యులు శాలువా, జ్ఞాపిక ఇచ్చి ఘనంగా సత్కరించారు. అనంత్ మల్లవరపు తనను ఎంతో ఆదరించి, చక్కటి ఆతిథ్యం అందించిన టాంటెక్స్ కార్యవర్గానికి కృతజ్ఞతలు తెలియజేశారు. టాంటెక్స్ అధ్యక్షురాలు కృష్ణవేణి శీలం మాట్లాడుతూ అనంత్ మల్లవరపు సాహిత్య సేవలను ఎంతో కొనియాడారు మరియు తను నిర్వహించిన పూర్వ సాహిత్య సదస్సులను గుర్తుచేసుకున్నారు . సమన్వయకర్త వీర్నపు చినసత్యం సాహిత్యం మీద ప్రేమ, మాతృభాష మీద మమకారంతో విచ్చేసిన భాషాభిమానులకు, సాహితీప్రియులకు కృతజ్ఞతలు తెలిపారు.


డీసీ సర్క్యూట్ కోర్టు న్యాయమూర్తిగా రావ్

ప్రముఖ భారతీయ అమెరికన్‌ న్యాయవాది నియోమీ రావ్‌కు అమెరికాలో కీలక పదవి లభించనుంది. శక్తిమంతమైన ‘డి.సి(డిస్ట్రిక్ట్‌ ఆఫ్‌ కొలంబియా) సర్క్యూట్‌ అప్పీళ్ల న్యాయస్థానం’ న్యాయమూర్తిగా ఆమెను దేశాధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నామినేట్‌ చేశారు. శ్వేతసౌధంలోని చరిత్రాత్మక ‘రూజ్‌వెల్ట్‌ రూమ్‌’లో మంగళవారం నిర్వహించిన దీపావళి వేడుకల్లో పాల్గొన్న ట్రంప్‌ ఈ మేరకు తన నిర్ణయాన్ని ప్రకటించారు. అమెరికాలో సుప్రీంకోర్టు తర్వాత శక్తిమంతమైన న్యాయస్థానంగా ‘డి.సి.సర్క్యూట్‌’ను పరిగణిస్తారు. 45 ఏళ్ల నియోమీ రావ్‌ ప్రస్తుతం ట్రంప్‌ ప్రభుత్వంలో ‘సమాచార, క్రమబద్ధీకరణ వ్యవహారాల కార్యాలయం(ఓఐఆర్‌ఏ)’ పాలనాధికారిగా ఉన్నారు. ‘డి.సి.సర్క్యూట్‌’కు నియోమీ నామినేషన్‌ను సెనేట్‌ ఆమోదిస్తే.. శ్రీనివాసన్‌ తర్వాత ఆ కోర్టులో నియమితులైన రెండో భారతీయ అమెరికన్‌ న్యాయమూర్తిగా ఆమె చరిత్ర పుటల్లోకెక్కుతారు.

వంగూరికి ఆస్ట్రేలియా ప్రవాసుల సత్కారం


ప్రముఖ హాస్య రచయిత వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ద్వారా కొన్ని దశాబ్దాలుగా అందిస్తున్న తెలుగు సాహిత్య సేవలని గుర్తిస్తూ అభినందన పూర్వకంగా ఆస్ట్రేలియా లోని మూడు నగరాల తెలుగు సంఘాలు గత వారం ఆయనని తమ దసరా దీపావళి కార్యక్రమాలకి ఆత్మీయ అతిధిగా ఆహ్వానించి సముచిత రీతిలో సత్కరించారు. నవంబర్ 3, 2018 నాడు శ్రేణి కట్టా నాయకకత్వంలో ఆస్ట్రేలియా తెలుగు సంఘం మెల్ బోర్న్ లో జరిగిన ‘జనరంజని” భారీ సాంస్కృతిక కార్యక్రమంలో సుమారు 1000 మంది ఆహుతుల సమక్షంలో వంగూరి చిట్టెన్ రాజు గారి సేవలని ప్రశంసిస్తూ చిరు సత్కారం జరిగింది నవంబర్ 9, 2018 నాడు కృష్ణ నడింపల్లి నాయకత్వంలో ఆస్ట్రేలియా రాజధాని కేన్ బెర్రా తెల్గుగ్ సంఘం వారు స్థానిక ఇండియన్ కమిషన్ వారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వంగూరి గారి కి ఆత్మీయ సత్కారం జరిగింది. మర్నాడు నవంబర్ 10. 2019 నాడు సతీష్ వరదరరాజు, సారధి మోటుమర్రి తదితరుల సారధ్యంలో జరిగిన దసరా -దీపావళి భారీ కార్యకమంలో వంగూరి చిట్టెన్ రాజు హాస్య రచనా చతురతనీ, సాహిత్య, సమాజ సేవలనీ గుర్తిస్తూ ఆత్మీయ సత్కారం జరిగింది. ఆయా సందర్భాలలో మాట్లాదుతూ ఆస్ట్రేలియా లో తెలుగు వారి సామాజిక వాతావారణం ఆహ్లాదంగా ఉంది అనీ ప్రతీ నగరాలలోనూ నెల బెలా తెలుగు వెన్నెల తరహాలో నెలవారీ సాహిత్య సమావేశాలు, మెల్ బోర్న్ లో విజవంతంగా జరిగిన 6వ ప్రపంచ తెల్గు సాహితీ సదస్సు స్పూర్తిగా ఆస్ట్రేలియా తెలుగు సాహితీ సదస్సులు నిర్వహించుకోవాలనీ, జీతం కోసం ఆంగ్లభాష. జీవితం కోసం తెలుగు బాష అనే సిద్దాంతాన్ని విదేశాలలో ఉన్న తెలుగు వారు సరియిన స్ఫూర్తిలో ఆచరిస్తూ తెలుగు భాషా, సాహిత్య, సాంస్కృతిక రంగాలలో సాధిస్తున్న ప్రగతి ప్రశంసనీయం అనీ వంగూరి చిట్టెన్ రాజు స్పందించారు. తదుపరి 7వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు దుబాయ్ నగరంలో వచ్చే ఏడు జరుగుతుంది అని వంగూరి చిట్టెన్ రాజు ఈ సందర్భంలో ప్రకటించారు.

మన “తులసి” మొక్క శ్వేతసౌధంలో నాటుకుంటుందా!?-TNI ప్రత్యేకం


మన తులసి మొక్క అగ్రరాజ్యం అమెరికాలోని శ్వేతసౌధంలోకి అడుగు పెడుతుందా? అక్కడ నాటుకుంటుందా.? అనే విషయం పై అటు అమెరికాలోనూ, ఇటు భారతదేశం లోనూ చర్చలు మొదలయ్యాయి. శ్రీ కృష్ణుడుకి ప్రతిరూపంగా భావించే చైతన్య మహాప్రభు భక్తురాలిగా మారిన తులసీ గబార్డ్ ఇప్పుడు అంతర్జాతీయంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తన వెంట ఎల్లప్పుడూ భగవద్గీతను ఉంచుకుని హిందువుల దృష్టిని అమితంగా ఆకర్షిస్తున్న తులసీ గబార్డ్ అమెరికా అద్యక్ష పదవి రేసులో దూసుకు వస్తోంది. ఆమె మాంసాహారం తినదు. పూర్తి శాఖాహారి.

***భారతీయ నేపథ్యం.. భగవద్గీత అంటే ప్రాణం..
ఓ అమెరికన్ సమోవా కేధలిక్ తండ్రికి, ఓ హిందు తల్లికి పుట్ట్టిన బిడ్డ ఆమె… చిన్నప్పటి నుంచే హిందువుగా పెరిగింది. హిందూ పురాణాలు, గ్రంధాలూ, కర్మలు, ఆచారాలకు సంబందించి పూర్తీ అవగాహనా ఉంది. తులసి అనే పేరు పెట్టింది అందుకే. ఆమెతో పాటు పుట్టిన వాళ్ళ పేర్లు కూడా అంతే.. భక్తీ జై.. నారాయణ్.. బృందావన్.. అయిదుగురు పిల్లల్లో ఈమె నంబర్ నాలుగు. అమెరికన్ కాంగ్రెస్ కు తోలి భారతీయ ప్రతినిధిగా ఎన్నికైన తులసి భగవద్గీత మీదనే ప్రమాణం చేసింది. కర్మ యోగిగా చెప్పుకునే తులసి తరచుగా ఇండియాను సందర్శిస్తూ ఉంటుంది. మంచి కృష్ణ భక్తురాలిగా ఆమె పేరు సంపాదించింది. కృష్ణుడు జన్మించిన మధుర, బృందావనం అంటే ఆమెకు విపరీతమైన అభిమానం. 2002 లో ఎడ్వర్డో టమయోను పెళ్లి చేసుకుంది. 2006లో విడిపాయింది. కారణాలు ఏమయితేనేం? అప్పటి నుంచి విడిగానే ఉన్న ఆమె 2015 ఏప్రిల్ లో అబ్రహం విలియమ్స్ ను పెళ్లి చేసుకుంది. పక్కా వైదిక సంప్రదాయంలో ఎవరిని పెళ్లి చేసుకున్నా తన హిందూ మత విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. హిందువు అనే కారణంగా ఆమెను అమెరికాలో పని చేసే స్థిరపడిన భారతీయులు అధికంగా అభిమానిస్తారు. మన ప్రధాని మోడీ అంటే ఆమెకు వల్లమాలిన అభిమానం. 2014లో ప్రధాని అయిన అనంతరం తొలిసారిగా అమెరికా వచ్చిన మోడికి తులసి అల్లం పూల దండను, భగవద్గీత కాపీని బహుమతిగా ఇచ్చింది. అంతకు ముందు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న మోడీకి అమెరికా ప్రభుత్వం వీసాను తిరస్కరించిన సమయంలో ఆమె ఆ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. ఇండియన్ కాన్సులేట్ అధికారిణి దేవయాని కొబ్రగడ పై అమెరికా ప్రభుత్వం పెట్టిన కేసును కూడా తులసి తీవ్రంగా వ్యతిరేకించింది. అదీ ఆమెకు ఇండియా అంటే అభిమానం.. తను ఆచరించే హిందూ మత విశ్వాసానికి భారత్ కేంద్రం కాబట్టి ఆమె ఇండియా అంటే అమితమైన ప్రేమ. భారతీయులకు నష్టం వాటిల్లే విధంగా ట్రంపు తీసుకు వస్తున్న H1B వీసాల అంక్షలను ఆమె వ్యతిరేకిస్తోంది. 2020 ఎన్నికల్లో అమెరికా అద్యక్ష పదవికి పోటీ పడాలని తులసి ఇప్పటి నుండే ప్రయత్నాలు ప్రారంభించింది.

** తెలుగువారితో సన్నిహిత సంబంధం.
తులసి గబార్డ్ కు మన తెలుగువారితో మంచి సంబందాలు ఉన్నాయి. తానా మాజీ అద్యక్షుడు తోటకూర ప్రసాద్ కు తులసీ గబార్డ్ మంచి పరిచయస్తురాలు. ఆమె ఎన్నికల్లో నిలబడినప్పుడు నిధుల సేకరణలో తోటకూర ప్రసాద్ కీలక పాత్ర పోషిస్తున్నారు. డాలస్ లోనూ ఇతర ప్రధాన నగరాల్లోనూ మన తెలుగువారు తులసి గబార్డ్ కు భారీగా నిధులు సమకూరుస్తూ ఉంటారు. డాలస్ లో తోటకూర ప్రసాద్ ఆద్వర్యంలో మహాత్మా గాంధీ విగ్రహం నెలకొల్పినపుడు తులసి గబార్డ్ ఆ కార్యక్రమానికి హాజరయింది. తులసి అమెరికా అధ్యక్షురాలు అయితే మన తెలుగు వెలుగు కూడా శ్వేత సౌధంలో ఓ మెరుపు మెరుస్తుంది. తులసి ప్రయత్నాలు ఫలించాలని… ఆమె అమితంగా ప్రేమించే శ్రీకృష్ణ భగవానుడి ఆశీస్సులు ఆమెకు పూర్తిగా లభిస్తాయని మనం ఆశిద్దాం. –కిలారు ముద్దుకృష్ణ, సీనియర్ జర్నలిస్ట్.

“భద్రాద్రి బాలోత్సవ్” రెండో రోజు దృశ్యాలు-పత్రికా కథనాలు

తానా తదుపరి అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్ సారథ్యంలోని తాళ్లూరి పంచాక్షరయ్య ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “భద్రాద్రి బాలోత్సవ్” కార్యక్రమం రెండో రోజు ఘనంగా జరిగింది. ఈ వేడుకల్లో పలు ప్రదర్శనలు అలరించాయి. ఆ కార్యక్రమ చిత్రాలు పత్రికా కథనాలు ఈ దిగువ చూడవచ్చు….
ప్రముఖ విద్యావేత్త, దానశీలి ప్రొ.మూల్పూరి వెంకట్రావు జీవితం అందరికి ఆదర్శం.


విద్యావేత్తగా, దానశీలిగా, నిరుపేదలకు సహాయ సహకారాలు అందించే వ్యక్తిగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కీర్తి ప్రతిష్ఠలు సంతరించుకున్న ఆదర్శ వ్యక్తి డాక్టర్.మూల్పూరి వెంకట్రావు. సామాన్య కుటుంబం నుంచి అగ్రరాజ్యం అమెరికాలో అత్యున్నతమైన ఫ్రొఫెసర్ స్థాయికి ఎదిగిన వెంకట్రావు నిరాడంబర, నిస్వార్థ జీవనం అందరికీ ఆదర్శప్రాయం. తాను సంపాదించిన దాంట్లో గణనీయమైన శాతం డాక్టర్ వెంకట్రావు సేవా కార్యక్రమాలకే వినియోగిస్తూ ఉండటం విశేషం. ఆర్భాటాలకు, ప్రచారనికి దూరంగా ఉండే ప్రొఫెసర్ వెంకట్రావు జీవనశైలి అందరికీ, ముఖ్యంగా నేటి యువతరానికి ఆదర్శప్రాయంగా ఉంటుందనటంలో సందేహం లేదు.

*** తానా కన్వీనర్‌గా కీలక బాధ్యతలు
వాషింగ్టన్ డీసీలో జులై మొదటి వారంలో తానా మహాసభలను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. తానా అధ్యక్షుడు వేమన సతీష్ సారథ్యంలోని యువ కార్యవర్గం ఈ మహాసభలను ఘనంగా నిర్వహించడానికి పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు. ఈ మహాసభలకు ఒక ప్రముఖ వ్యక్తి, అనుభవం ఉన్న కార్యశీలిని కన్వీనర్‌గా ఉండాలని తానా యువ కార్యవర్గం భావించింది. అన్ని విధాలుగా అనుభవం గడించిన, వివాదాలకు దూరంగా ఉండే ప్రొఫెసర్ మూల్పూరి వెంకట్రావును తానా మహాసభల సమన్వయకర్తగా, యువ కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నుకుంది. మూల్పూరి వెంకట్రావు ఆధ్వర్యంలో ఈసారి జరిగే తానా మహాసభలు చరిత్రలో మరచిపోలేని విధంగా ఉంటాయని అందరూ భావిస్తున్నారు.

*** జీవన ప్రస్థానం ఇది
అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో ప్రఖ్యాతి చెందిన జార్జి మేసన్ విశ్వవిద్యాలయంలో గత 32 ఏళ్ళు నుండి ప్రొఫెసరుగా పనిచేస్తున్న డాక్టర్.మూల్పూరి వెంకట్రావు ప్రతి ఏడాది తన సంపాదనలో పెద్ద మొత్తం (రూ.30లక్షల రూపాయలకుపైగా) సేవా కార్యక్రమాలకు విరాళాలుగా అందజేస్తూ మిగిలిన వారికి ఆదర్శంగా నిలుస్తున్నారు. యూనివర్సిటీలో ఇంజినీరింగ్ విభాగంలో బ్యాచిలర్స్, మాస్టర్స్, పీ.హెచ్.డీ విద్యార్ధులకు బోధనతో పాటు డాక్టర్.వెంకట్రావు వర్జీనియా పరిసర ప్రాంతల్లో ఉన్న ప్రవాసాంధ్ర కుటుంబాలకు చెందిన మిడిల్ స్కూలు (6,7,8 తరగతులు), హైస్కూలు (9,10,11,12 తరగతులు) విద్యార్థులకు తన తీరిక సమయంలో పాఠాలు బోధిస్తుంటారు. అమెరికాలో ప్రసిద్ధి చెందిన థామస్ జఫర్సన్ హైస్కూల్లో సీటు రావాలంటే ప్రత్యేకమైన తర్ఫీదు అవసరం. ఈ స్కూలులో ప్రవేశం కోసం పొందే శిక్షణలకు సైతం అత్యధికంగా ఖర్చు చేయవలసి ఉంటుంది. ఇది గమనించిన వెంకట్రావు గత 10 సంవత్సరాల నుండి విద్యార్ధులకు శిక్షణ ఇవ్వటం ప్రారంభించారు. ఆయన తర్ఫీదు ఇచ్చిన వారిలో 300 మంది థామస్ జఫర్సన్ హైస్కూల్లో సీటు సంపాదించారు. వెంకట్రావు స్ధాపించిన క్యూరీ లెర్నింగ్ సంస్ధ అమెరికాలోని ఇతర నగరాలకు కూడా విస్తరిస్తున్నామని ఆయన వెల్లడించారు. ఇప్పటి వరకు పన్నెండు నగరాల్లో క్యూరీ లెర్నింగ్ శాఖలు ఏర్పాటు చేసినట్లు ప్రొఫెసర్ మూల్పురి TNIకు తెలిపారు.

*** బాల్యం-విద్యాభ్యాసం
కృష్ణా జిల్లా ఘంటసాలలో మూల్పూరి చెన్నారావు, లక్ష్మితులసమ్మ దంపతులకు వెంకట్రావు జన్మించారు. తండ్రి చెన్నారావు స్థానిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా ఉండేవారు, వెంకట్రావు 10వ తరగతి వరకు స్థానికంగా, ఇంటర్మీడియట్ విజయవాడ లయోలా కళాశాల (1970-72)లో పూర్తి చేసారు. అనంతరం కాకినాడ జె.ఎన్.టీ.యూలో బీటెక్ (ఈసీఈ) విద్యనభ్యసించారు. తదుపరి ప్రతిష్టాత్మక ముంబై ఐఐటిలో ఎంటెక్ పూర్తి చేశారు. అనంతరం 1979-81 మధ్య కాలంలో విజయవాడ సిద్దార్థ ఇంజినీరింగ్ కళాశాలలో అధ్యాపకులుగా పనిచేశారు. 1981వ సంవత్సరంలో అమెరికా వెళ్ళి ఆరెగాన్/మిషిగన్ విశ్వవిద్యాలయాల్లో ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ విభాగంలో పీ.హెచ్.డీ చేశారు. 2005లో తానా వారు అత్యుత్తమ ఇంజనీర్ అవార్డును ఇచ్చి సత్కరించారు. జార్జి మేసన్ యూనివర్సిటీ నుండి 2002లో ‘ఔట్ స్టాండింగ్ రీసర్చ్’ అవార్డుతో పాటు పలు జాతీయ, ప్రాంతీయ స్ధాయిల్లో 10కు పైగా కమ్యూనిటీ సర్వీసు అవార్డులు, అక్కినేని 89వ జన్మదిన పురస్కారాలు వెంకట్రావును వరించాయి.

*** ఆదాయంలో గణనీయ శాతం విరాళాలకు
ధామస్ జఫర్సన్ పాఠశాలలో ప్రవేశం కోసం ప్రవాసాంధ్ర విద్యార్ధులకు చెప్పే పాఠాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని మొదటి అయిదేళ్ల పాటు పూర్తిగా అందించిన వెంకట్రావు, ఆ తర్వాత పెరిగిన విద్యార్ధులు, అధ్యాపకుల సంఖ్య, ఇతరత్రా నిర్వహణా ఖర్చుల దృష్ట్యా వచ్చిన ఆదాయంలో గణనీయమైన శాతాన్ని విరాళాలుగా అందిస్తున్నారు. వాషింగ్టన్ లో విద్యార్ధులకు ప్రైవేట్ పాఠాలు చెపుతున్న డాక్టర్.వెంకట్రావుకు సంవత్సరానికి రూ.30లక్షలకు పైగా ఆదాయం వస్తోంది. ఈ ఆదాయాన్ని ఆయన సమాజ సేవా కార్యక్రమాలకు వెచ్చిస్తున్నారు. గిరిజన విద్యార్ధులకు ఏకల్ విద్యాలయ సంస్ధ ద్వారా నూతన పాఠశాలలను ప్రారంభించటానికి తోడ్పడ్డారు. హైదరాబాద్ లో అనాధ బాలలకోసం వేమూరి విజయలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంస్థకు ఇప్పటి వరకు రూ.15లక్షల విరాళాన్ని అందజేశారు. శ్రీకాకుళం, చల్లపల్లి ప్రాంతాల్లో పురాతన ఆలయాల పున:నిర్మాణానికి ఇప్పటివరకు రూ.10లక్షల వరకు అందజేశారు. ప్రస్తుతం నల్గొండ జిల్లా భక్తాళాపురంలో షిర్డీ సాయిబాబా మందిరాన్ని, కమ్యూనిటీ హాలును నిర్మిస్తున్నారు. దీనిలో పాటు ఘంటశాలలో ఏర్పాటు చేసిన గొర్రెపాటి ఫౌండేషన్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పేద విద్యార్ధులకు ఆర్ధిక సాయాన్ని అందజేస్తున్నారు. వాషింగ్టన్ సమీపంలో నిర్మిస్తున్న శ్రీవేంకటేశ్వర లోటస్ టెంపుల్ కు ఇప్పటి వరకు రూ.కోటి 25లక్షలకు పైగా విరాళాన్ని అందించారు. కనకదుర్గ ఆలయానికి ఇప్పటి వరకు రూ.25లక్షలు అందించారు.

* **అంతా మేధావులే
వెంకట్రవు తమ గ్రామానికి సమీపంలో ఉన్న రావివారిపాలేనికి చెందిన సావిత్రిని వివాహం చేసుకున్నారు. ఆమె వాషింగ్టన్ లో ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన అమెరికన్ పేటెంట్ అండ్ ట్రేడ్ మార్క్ సంస్థలో ప్రైమరీ ఎగ్జామినర్ గా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వారికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు కార్తిక్ భవాని శంకర్ ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైన కార్నెల్ మరియు స్టాన్‌ఫోర్డ్ యునివర్శటిల్లో చదివి ప్రస్తుతం న్యూయార్కులోని మీడియా మాత్ అనే కంపెనీలో ఆపరేషన్స్ అండ్ స్ట్రేటజీ విభాగానికి డైరక్టరుగా పనిచేస్తున్నారు. రెండో కుమారుడు కేధార్ నాథ్ ప్రముఖ యునివర్సటీ డార్ట్ మత్ కాలేజీలో బ్యాచిలర్స్ విద్యనభ్యసించి ప్రస్తుతం బోస్టన్ యూనివర్సిటీల్ మాస్టర్స్ డిగ్రీని చేస్తున్నారు.

*** ఎన్.టి.ఆర్ వీరాభిమాని మరియు నిర్మాత
ప్రొఫెసర్ వెంకట్రావు చదువుతో పాటు రంగస్థల నటుడిగానూ గుర్తింపు పొందారు. ఎన్.టి.రామరావుకు వీరాభిమాని అయిన వెంకట్రావు ఆయనతో సినిమాలు తీయాలనే బలమైన కోరికతో ఉండేవారు. అది సాధ్యం కాకపోవటంతో 1994, 97 సంవత్సరాల్లో ఎన్.టి.ఆర్ కుమారుడు బాలకృష్ణ కధానాయకుడిగా ‘టాప్ హీరో’, ‘దేవుడు ‘ చిత్ర్రాలు నిర్మించారు. కృష్ణా, గుంటూరు జిల్లాల సరిహద్దుల్లో కృష్ణా నది ఒడ్డున ఎన్.టి.ఆర్ పేరుమీదుగా మ్యూజియంను ఏర్పాటు చేయాలనేది ఆయన ఆకాంక్ష.

*** పరిశోధన రంగంలో వెంకట్రావు ప్రతిభ
* ఇప్పటి వరకు 17 మంది పీ.హెచ్.డీ విద్యార్ధులకు విజయవంతమైన పరిశోధన మార్గనిర్దేశకుడిగా వ్యవహరించారు. ఈయన దిశానిర్దేశంలో ప్రస్తుతం ముగ్గురు పీ.హెచ్.డీ విద్యార్ధులు పరిశోధనలు నిర్వహిస్తున్నారు.
* 140 జర్నల్ ఆర్టికల్స్ ప్రచురించారు. 100 కాన్ఫరెన్స్ ప్రొసీడింగ్స్ ప్రచురించారు.
* అమెరికా జాతీయ సైన్స ఫౌండేషన్ నుండి అప్రతిహితంగా 28 ఏళ్లు (1987-2015)పాటు నిధులు అందుకున్నారు.
ఇన్ని చేసినప్పటికీ తనకి సంతృప్తినిచ్చేది కేవలం ఒకే ఒక విషయం అంటారు డాక్టర్.మూల్పూరి వెంకట్రావు. ఒక వైపు తన సంస్ధ క్యూరీ లెర్నింగ్ లో కిండెర్ గార్టెన్ (ఎల్.కే.జీ) నుండి ఉన్నత పాఠశాల వరకు పలువురు విద్యార్ధులు. మరో వైపు జార్జి మేసన్ విశ్వవిద్యాలయంలో బ్యాచిలర్స్, మాస్టర్స్, పీ.హెచ్.డీ విద్యార్ధులు. వీరందరికీ (ఎల్.కె.జీ నుండి పీ.హెచ్.డీ వరకు) ప్రతిరోజు వివిధ సమయాల్లో విద్యను అందించటం తనకు చాలా ఉత్తేజాన్ని, ఆనాందాన్నిస్తుందని, తద్వారా వచ్చే ఆదాయం ద్వారా సమాజాభివృద్ధికి తోడ్పడం సంతృప్తినిస్తుందని ప్రొఫెసర్ మూల్పూరి పేర్కొనడం నేటితరం ఎందరో యువతీయువకులకు ఓ జీవితపాఠం. –కిలారు ముద్దుకృష్ణ , సీనియర్ జర్నలిస్ట్

ఘనంగా “భద్రాద్రి బాలోత్సవం” ప్రారంభం


తానా తదుపరి అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్ సారథ్యంలో తాళ్లూరి పంచాక్షరయ్య ట్రస్ట్ ఆధ్వర్యంలో భద్రాచలంలో “భద్రాద్రి బాలోత్సవ్” కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. గత ఆరేళ్లుగా నిర్వహిస్తున్న ఈ ఉత్సవానికి ఈ ఏడాది భారతదేశం నలుమూలల నుండి 5వేలకు పైగా విద్యార్థినీ విద్యార్థులు హాజరయ్యారు. ఈ వేడుకల ప్రారంభోత్సవ చిత్రమాలిక….

#Bhadradribalotsavamtnitana2018

కూచిపూడిలో భూగర్భ డ్రైనేజీ పనులకు శ్రీకారం

కూచిపూడి గ్రామంలో NREGS-RWS నిధులతో ఏర్పాటు చేస్తున్న భూగర్భ డ్రైనేజీ పనులను పామర్రు శాసనసభ్యురాలు ఉప్పులేటి కల్పన ప్రారంభించారు. కార్యక్రమంలో సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కూచిభొట్ల ఆనంద్, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ₹.7కోట్లతో రూపొందుతున్న ఈ పనులకు 70శాతం NREGS నుండి మిగిలిన 30శాతం RWS నుండి లభిస్తున్నాయి.

చంద్రబాబుకు ప్లోరిడా ప్రవాసాంధ్రులు విరాళం

రాజకీయాలకు ఆర్ధిక విధానాలను మేళవించి పరిపాలనా నిర్ణయాలు తీసుకోవడం మూలంగానే అభివృద్ధికి ఆస్కారమేర్పడిందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఉండవల్లి నివాసంలో విజయవాడకు చెందిన గూడపాటి నాగేశ్వరరావు, రామమోహనరావు సోదరులు, ఇతర కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి చంద్రబాబును కలుసుకున్నారు. ముఖ్యమంత్రి సహాయనిధి, తిత్లీ తుపాను బాధితులకు, అన్న క్యాంటీన్ల నిర్వహణకు గూడపాటి కుటుంబ సభ్యులు ఉదారంగా విరాళాలిచ్చారు. తిత్లీ తుపాను బాధితులను ఆదుకునేందుకు దాతృత్వం చూపుతూ గూడపాటి కుటుంబ సభ్యులు, ప్రవాసాంధ్రుల తరఫునా ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా విరాళాలను అందించారు. ఈ సందర్భంగా రాజకీయ, ఆర్ధిక వేత్త రెండు కోణాలున్న అరుదైన వ్యక్తీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అని ఫ్లోరిడాలో స్థిరపడ్డ ప్రవాసాంధ్రుడు, ఫ్లోరిడా తెలుగు అసోషియేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ గూడపాటి రామ్మోహన రావు ఇచ్చిన కితాబుకు ముఖ్యమంత్రి స్పందించారు. గతంలో సాంకేతిక విద్యనూ ముఖ్యంగా ఇంజనీరింగ్ కాలేజీల స్థాపనతో వేలాది మంది ఆంధ్ర విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకుని అమెరికాలో స్థిరపడ్డారని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. విద్యకు, పరిపాలనకు సాంకేతికతను జోడించడంతో మెరుగైన ఫలితాలు వస్తున్నాయన్నారు. ఫలితంగానే అమెరికాలో లక్షల్లో వేతనాలు తీసుకుంటూ తమ కుటుంబాలకు ఆసరాగా నిలిచారని ఈ సందర్భంగా రామ్మోహన రావు మాట్లాడుతూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. అంతేకాకుండా జన్మభూమి రుణం తీర్చుకోవడం, సాటి శ్రీకాకుళం జిల్లా తెలుగు ప్రజలకు ఎదురైనా నష్టాన్ని పూడ్చడంలో భాగంగా ఫ్లోరిడాలో స్థిరపడ్డ ప్రవాసాంధ్రులు సమకూర్చిన విరాళాలను రామ్మోహన రావు ముఖ్యమంత్రికి అందజేశారు. దేశంలోనే కాదు ప్రపంచంలోనే అరుదైన రాజకీయవేత్త అని ముఖ్యమంత్రి చంద్రబాబును రామ్మోహన రావు ప్రశంసించారు. ఎక్కడైనా రాజకీయ వేత్త , ఆర్థికవేత్త వేర్వేరుగా ఉంటారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక్క రాజకీయవేత్త మాత్రమే కాకుండా ఆర్ధిక వేత్త కూడానని అభినందించారు. తిత్లీ తుపాను బాధితుల సహాయార్థం వ్యక్తిగతంగా 3400 డాలర్ల(2.5లక్షలు) విరాళాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుకు డా. గూడపాటి రామ్మోహన రావు, లక్ష్మీభారతి దంపతులు అందజేశారు. సీఎం చంద్రబాబుకు స్వయంగా కలిసి 3500 డాలర్ల చెక్కును డా. గూడపాటి రామ్మోహన రావు అందజేశారు. తిత్లీ తుపాను బాధితుల సహాయార్థం ఫ్లోరిడా తెలుగు అసోషియేషన్ సభ్యుల నుంచి సేకరించిన 1500 డాలర్లు (సుమారు లక్షా తొమ్మిది వేలు)విరాళాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యదక్షత, అంకితభావంతో తిత్లీ తుపాను బాధితులను ఆదుకుంటున్న తీరును స్పూర్తిగా తీసుకుని, తమ కుటుంబం, ఫ్లోరిడా తెలుగు అసోషియేషన్ సభ్యులు స్వచ్ఛందంగా విరాళాలిచ్చారని రామ్మోహన రావు తెలిపారు. ముఖ్యమంత్రి సహాయనిధికి భార్య భారతీదేవి, కుమారుడు రామకోటయ్యల జ్ఞాపకార్థం రూ.5 లక్షల విరాళాన్ని గూడవల్లి నాగేశ్వరరావు ఇచ్చారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి మాజీ శాసనసభ్యులు, అత్తామామలు చెన్నుపాటి ఇంద్రావతి, రామకోటయ్యల జ్ఞాపకార్థం రూ. 3 లక్షల విరాళాన్ని గూడపాటి నాగేశ్వరరావు అందజేశారు. అన్న క్యాంటీన్ల నిర్వహణ నిమిత్తం అత్తామామలు చెన్నుపాటి ఇంద్రావతి, రామకోటయ్యల జ్ఞాపకార్థం రూ. 2 లక్షల విరాళాన్ని గూడపాటి నాగేశ్వరరావు అందజేశారు. తిత్లీ తుపాను బాధితుల సహాయార్థం రూ. 2.5 లక్షల వ్యక్తిగతంగా విరాళాన్ని తాత, తండ్రులు గూడపాటి శేషయ్య, సుభ్రహ్మణ్యంల జ్ఞాపకార్థం ముఖ్యమంత్రి చంద్రబాబుకు డా. గూడపాటి నాగేశ్వరరావు, డా. రామమోహన రావు సోదరులు అందజేశారు.

డా.అక్కినేని మృతికి తానా నేతల నివాళి

ప్రముఖ ప్రవాసాంధ్ర వైద్యుడు తానా ఫౌండేషన్ మాజీ చైర్మన్ డా. అక్కినేని సుదర్శనరావు మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రగడ సంతాపాన్ని వ్యక్తపరిచారు. తానా వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన డా.అక్కినేని మృతి ప్రవాసాంధ్రులుకు తీరని లోటని తానా నేతలు సంతాపాన్ని ప్రకటించారు. తానా అద్యక్షుడు వేమన సతీష్ తదుపరి అద్యక్షుడు తాళ్లూరి జయశేఖర్ ఇతర తానా నేతలు పోట్లురి రవి, డా. నల్లూరి ప్రసాద్, అంజయ్య చౌదరి, కొండ్రగుంత చలపతి, తదితరులు నివాళి అర్పించారు. ఆయన సహచరుడు చికాగోకు చెందిన ప్రముఖ ప్రవాసాంధ్రుడు యడ్లపాటి యుగంధర్ వివిధ తెలుగు సంఘాల నేతలు కూడా అక్కినేని మృతికి సంతాపం ప్రకటించారు. విజయవాడ సమీపంలోని ఎన్నారై మెడికల్ కళాశాల వ్యవస్థాపకుల్లో ఒకరైన డా.సుదర్శనరావు మృతి పట్ల ఆ విద్యా సంస్థల చైర్మన్ డా ముక్కాముల అప్పారావు, ఇతర అధ్యాపక సిబ్బంది, విద్యార్ధులు ఆయనకు నివాళులు అర్పించారు. విజయవాడలో ఆయన మృతదేహాన్ని సందర్శించి శ్రద్దాంజలి ఘటించారు.

అగస్త్య ఫౌండేషన్‌కు రూ.75లక్షలు విరాళమిచ్చిన డా.హనిమిరెడ్డి–TNI ప్రత్యేకం


తాను సంపాదించిన దాంట్లో ఇప్పటి వరకు వివిధ సామాజిక సేవా కార్యక్రమాలకు రూ.60కోట్లకు పైగా విరాళం అందించిన కాలిఫోర్నియాకు చెందిన ప్రముఖ ప్రవాసాంధ్రుడు డా. లకిరెడ్డి హనిమిరెడ్డి మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. భారీగా విరాళాన్ని ప్రకటించారు. విద్యార్ధులను సైన్స్ పట్ల అవగాహనా కల్పిస్తున్న అగస్త్య ఫౌండేషన్ కు డా. హనిమిరెడ్డి 75లక్షల రూపాయలు విరాళాన్ని ప్రకటించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నియోజకవర్గం కుప్పంలో 175 ఎకరాల్లో నెలకొల్పిన అగస్త్య ఫౌండేషన్ తన శాఖను డా.హనిమిరెడ్డి జన్మస్థలమైన మైలవరంలో ఏర్పాటు చేయటానికి ఈ విరాళాన్ని అందజేశారు. డిసెంబరు 26వ తేదీన మైలవరంలో అగస్త్య ఫౌండేషన్ శాఖను ముఖ్యమంత్రి చంద్రబాబు చేతులు మీదుగా ప్రారంభించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. లేనిపక్షంలో అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి దేవినేని ఉమా దీనిని ప్రారంభిస్తారు. ఈశాఖ ద్వారా మైలవరం, తిరువూరు నియోజకవర్గంలో ఉన్న అన్ని తరగతులకు చెందిన విద్యార్ధులకు అగస్త్య ఫౌండేషన్ ద్వారా ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తారు. దేశ వ్యాప్తంగా సేవలందిస్తోన్న అగస్త్య ఫౌండేషన్ కు సంబందించిన పూర్తీ సమాచారాన్ని దిగువ చదవండి.
**ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక సరిహదుల్లో చిత్తూరు జిల్లా గుండుపల్లె మండలంలో ఉంది. అగస్త్య ఫౌండేషన్. తెలుగు విద్యార్ధులతో పాటు తమిళ, కన్నడ విద్యార్ధులకు విజ్ఞానం పంచుతోంది. సైన్స్ ఆఫ్ హాండ్స్ పేరుతొ గ్రామాల్లో ఉన్న విద్యార్ధులకు ఉచితంగా సైన్స్ పాటాలు భోదిస్తోంది. వారి ఆలోచనా శక్తిని పెంచుతూ ఆవిష్కరణలకు ప్రేరణనిస్తోంది. విద్యా వ్యవస్థకు కొత్త దశదిశలను చూపుతోంది. దీనంతటికి కారణం ఓ వ్యక్తీ సంకల్పం.. పేద విద్యార్ధులు వీధుల్లో తిరుగుతూ కనిపించడంతో చలించిన రాంజీ రాఘవన్ 1994లో ఈ పౌండేషన్ కు పునాది వేశారు. విదేశాల్లో బ్యాంకు ఉద్యోగంలో స్థిరపడిన రాంజీ రాఘవన్ స్వగ్రామం తమిళనాడులోని తంజావూరు. ఏదైనా సేవ చేయాలనే తపనతో రాఘవన్ తండ్రి సలహా తీసుకున్నారు. మారుమూల గ్రామాల్లో ఉన్న పిల్లల సృజనాత్మకను పెంపొందించేందుకు ఏదైనా చేయాలనే ఆలోచన నుంచి పుట్టిందే ఈ అగస్త్య పౌండేషన్. దీనికోసం రాంజీ రాఘవన్ ఆయన స్నేహితుడు మహావీర్ లు వాళ్ళ ఉద్యోగాలను వదిలేసి విదేశాల నుంచి స్వదేశానికి వచ్చారు. ఝున్ ఝున్ వాలా పౌండేషన్ సహకారంతో బెంగళూరులో మొదట ఒక శాఖను ప్రారంభించారు. ఈ సంస్థ సేవలను గుర్తించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుప్పం నియోజకవర్గంలో గుడుపల్లె మండలం సాలచింతపల్లె వద్ద అగస్త్య విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటుకు అవసరమైన కార్యకలాపాల్ని ఇక్కడి నుంచే జరుగుతున్నాయి. యావత్ భారతదేశం లో జరుగుతున్నా కార్యకలాపాల్ని ఇకాడి నుంచే పర్యవేక్షిస్తారు.
**అంతా సైన్సె ..
అగస్త్య పౌండేషన్ కార్యాలయం లోపలి ప్రవేశిస్తుండగానే పై ఆకారంలో ఉన్న తోరణం స్వాగతం పలుకుతుంది. అక్కడి నుంచి అడుగడుగునా సైన్సు మనకు కళ్ళకు కడుతుంది. పచ్చని చెట్లు, పరిశుబ్రమైన వాతావరణం కనిపిస్తుంది. పౌండేషన్ లో ఒక్క ప్లాస్టిక్ కవర్ కూడా మనకు కనిపించదంటే వాళ్ళు పర్యావరణం పై ఎంత జాగ్రత్త తీసుకుంటున్నారో అర్ధం చేసుకోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతిదీ సైన్సు అని వీళ్ళు నమ్ముతారు. ప్రస్తుతం భారతదేశంలోని పద్దెనిమిది రాష్ట్రాల్లో అగస్త్య సేవలను అందిస్తున్నారు.
**ఉపాద్యాయులకు శిక్షణ
ప్రతి ఉపాద్యాయుడు నిత్య విద్యర్దే అందుకే విద్యార్ధుల్లో ఆసక్తిని పెంచే బోధనా పద్దతులను, విద్యార్ధులకు సులభంగా అర్ధమయ్యే రీతిలో పటాలు చెప్పడం ఎలా అనేది వివిధ కార్యక్రమాల్లో వివరిస్తారు. సంవత్సరానికి ఇప్పటికే దాదాపు రెండు లక్షల మంది ఉపద్యాయులకు విద్యా బోధనలో మెళకువలు నేర్పించారు. ఉపద్యయుల్లో శాస్త్రీయత దృక్పదాన్ని పెంపొందించేందుకు ఈ తరగతులు నిర్వహిస్తున్నారు.
**ల్యాబ్ ఇన్ ఎ బాక్స్
ఒకే పాటశాలలకు మళ్ళీమళ్ళీ వెళ్ళడం కష్టంతో కూడుకున్న పని. అందుకే అన్నిరకాల సైన్సు పరికరాలు ఉన్న ఒక బాక్సును ఒక పాటశాలకు ఇచ్చి దాంతో రోజువారి తరగతుల్లో భాగంగా పాటాలు భోదిమ్చాలని నిర్ణయించుకున్నారు. ఆ పాటశాలలో ఉన్న సైన్స్ ఉపాధ్యాయులకు ఆ బాక్స్ గురించి వివరిస్తారు. ఆ తరువాత ఉపాద్యాయులు స్వయంగా విద్యార్ధులకు బోధిస్తారు.
**ల్యాబ్ ఆన్ ఎ బైక్
ఈ కార్యక్రమం 2013లో ప్రారంభించారు. బైకుల మీద ల్యాబ్ బాక్సును అమరుస్తారు. వీటిపై అగస్త్య సిబ్బంది గ్రామాల్లో తిరిగి అక్కడున్న పాటశాల విద్యార్ధులకు సైన్స్ పై అవగాహన కలిగిస్తారు. మొబైల్ వ్యాన్ వెళ్ళలేని ప్రాంతాలకు ల్యాబ్ ఆన్ ఏ బైక్ వెళుతుంది. గుంతల రోడ్ల పైన వాహనంతో పాటు వందల కిమీ ప్రయాణించి అక్కడ పాటశాలల్లోని విద్యార్ధులకు ఆసక్తిని సైన్స్ పై అవగాహన కల్పిస్తారు. ఇలాంటి బైక్ లాబ్స్ మొత్తం 144 ఉన్నాయి.
**ఐ మొబైల్
పేద విద్యార్థులకు డిజిటల్‌ విద్యను చేరువ చేసేందుకు ఈ ప్రోగ్రాం ప్రారంభించారు. మాటిమాటికీ విద్యుత్తు సరఫరా పోయే ప్రాంతాలు, ఇంగ్లిష్‌ అంతగా రాని విద్యార్థులు లక్ష్యంగా ఈ కార్యక్రమం నడుస్తుంది. పాఠశాలల్లో డిజిటల్‌ విధానంలో పాఠాలు బోధిస్తారు.
**ఇన్నోవేషన్‌ ఫెయిర్స్‌..
విద్యార్థుల్లో ఆసక్తిని రేకెత్తించేందుకు, వారి నాలెడ్జ్‌ను వ్యక్తపరిచేందుకు ఒక వేదిక. ఇందులో ఎక్కువగా సైన్స్‌ ఫెయిర్‌లు ఉంటాయి. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రోత్సాహకాలు ఇస్తుంటారు. ఆడిటోరియంలో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా క్రీడామైదానాల వసతి కల్పిస్తోంది. ఆసక్తి ఉన్నవారికి బస్సు సౌకర్యం కల్పించి మరీ ప్రోత్సహిస్తోంది.
**సైన్స్‌ సెంటర్స్‌
అన్ని సైన్స్‌ సెంటర్లు పట్టణ ప్రాంతల్లోనే ఉంటాయి. ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చేందుకు వీలుగా పట్టణాల్లో ఏర్పాటు చేశారు. మొత్తం 55 సైన్సు సెంటర్లు ఉన్నాయి. పాఠశాల విధులకు ఎలాంటి ఆటంకాలు కలిగించకుండా శిక్షణ తరగతులు నిర్వహిస్తారు. సెంటర్లలో ఉపాధ్యాయులు ప్రయోగాలు చేసి సందర్శకులకు చూపిస్తారు.

ఘనంగా రామినేని పురస్కారాల ప్రదానోత్సవం

ఉన్నతంగా ఎదిగేందుకు ప్రతి మనిషికీ సమాజం దోహదపడుతుందని, అలాంటి సమాజానికి ఎంతో కొంత తిరిగి ఇవ్వడాన్ని వ్యక్తులు తమ విధిగా భావించాలని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు పేర్కొన్నారు. మంగళగిరి మండలం ఆత్మకూరులో శనివారం ఉపాధ్యాయులు, విద్యార్థులకు రామినేని ఫౌండేషన్ పురస్కారాల ప్రదానం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. జీవితంలో సంపద అంటే డబ్బు ఒక్కటే కాదని అన్నారు. సంతోషంగా జీవించడం అన్నిటికంటే ముఖ్యమని చెప్పారు. ఉపాధ్యాయులు తాము చెప్పే పాఠాల్లోనే కాకుండా మిగిలిన విషయాల్లోనూ విద్యార్థులకు ప్రశ్నించే లక్షణాన్ని నేర్పించాలన్నారు. అప్పుడే వారు ఆయా విషయాలపై ఆలోచించడం మొదలుపెడతారని చెప్పారు. మనుషులను తీర్చిదిద్దే ఘనత ఉపాధ్యాయులకే దక్కుతుందన్నారు. న్యాయవాది వృత్తి చేపట్టకపోయుంటే తాను కూడా ఉపాధ్యాయుణ్ని అయ్యేవాడినని ఈ సందర్భంగా తెలిపారు. రామినేని ఫౌండేషన్ గత 20 ఏళ్లుగా పురస్కారాలివ్వడం అభినందనీయమన్నారు. కేంద్ర విజిలెన్స్ కమిషనర్ కె.వి.చౌదరి మాట్లాడుతూ ఎవరి నుంచి మంచి విషయాల్ని నేర్చుకున్నా వారూ గురువులే అవుతారని అన్నారు. విద్యార్థులు తప్పనిసరిగా సమాజానికి తిరిగి ఏం ఇస్తున్నామనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. మెరుగైన సమాజాన్ని నిర్మించడంలో తమదైన పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. రామినేని ఫౌండేషన్ కన్వీనరు నాగభూషణం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జస్టిస్ లావు నాగేశ్వరరావు దంపతులు… జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి ఫలితాల్లో ప్రతిభ చాటిన విద్యార్థులకు, గురువులకు పురస్కారాలు ప్రదానం చేశారు. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ జానీమూన్, రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్పర్సన్ రాజకుమారి, ఫౌండేషన్ ఛైర్మన్ ధర్మ ప్రచారక్, మాజీ డీజీపీ మాలకొండయ్య, అమెరికాలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి కోమటి జయరామ్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంజీవనికి సిఎం ద్వారా విరాళాలు అందించిన ప్రవాసులు

కృష్ణాజిల్లా కూచిపూడిలో సిలికానాంద్ర ఆద్వర్యంలో దాదాపు రూ.50కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన రెండు వందల పడకల మల్టీ స్పెషాలిటీ సంజీవని ఆస్పత్రికి ప్రవాసుల నుండి విరాళాలు భారీగా వస్తున్నాయి. 18వ తేదీన ఆసుపత్రి ప్రారంభించడానికి వచ్చిన చంద్రబాబు చేతుల మీదుగా పలువురు ప్రవాసులు సంజీవని ఆస్పత్రికి విరాళాలు అందజేశారు. ప్లోరిడాకు చెందిన నాట్స్ చైర్మన్ గుత్తికొండ శ్రీనివాస్ పది లక్షల రూపాయలు, డాలస్ కు చెందిన ప్రముఖ ప్రవాసాంధ్రుడు కోనేరు శ్రీనివాస్ ఆరు లక్షల రూపాయలు సిఎం చంద్రబాబు ద్వారా విరాళాలను అందజేశారు. వీరిరువురిని ముఖ్యమంత్రి చంద్రబాబు, సిలికానాంద్ర చైర్మన్ కూచిభొట్ల చైర్మన్ ప్రత్యేకంగా అభినందించారు. అమెరికాకు చెందిన ఇద్దరు చిన్నారుల వయసు పెద్దది. కూచిపూడిలో సిలికానాంద్ర కుటుంబ సభ్యుల ఆద్వర్యంలో నిర్మించిన మల్టీ స్పెషాలిటీ వైద్యశాలకు విరాళం అందించారు. అమెరికాలో తాము విక్రయించి, నృత్యాలు ప్రదర్శించి, స్నేహితుల కుటుంబ సభ్యులను ఇంటికి విందుకు పిలిచి ఆస్పత్రి నిర్మాణం గురించి వివరించి విరాళాలు సేకరించారు. ఇలా ఒక్కొక్కరు రూ.పది లక్షల చొప్పున ఆసుపత్రి నిర్మాణానికి విరాళం అందించారు. వీరిని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా సన్మానించారు.

గుత్తికొండ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో అమరావతిలో ఆరోగ్య బీమా ప్రాజెక్టు

ఆరోగ్య సంరక్షణ నిమిత్తం బీమా వ్యయం తగ్గింపు కోసం అమెరికాలో ఏర్పాటు చేసిన ‘ఆర్‌ఎక్స్‌-అడ్వాన్స్‌ ప్రాజెక్ట్‌’ను నవ్యాంధ్రలో అమలు చేసే ఆలోచన చేస్తున్నట్లు నాట్స్‌(ఉత్తర అమెరికా తెలుగు సంఘం) ఛైర్మన్‌ గుత్తికొండ శ్రీనివాస్‌ తెలిపారు. ప్రఖ్యాత ఆపిల్‌ సంస్థ మాజీ సీఈఓ జాన్స్‌ కల్లీతో కలసి ఆరోగ్య బీమా ప్రాజెక్ట్‌ను ఆర్‌ఎక్స్‌-అడ్వాన్స్‌ పేరిట చేపట్టినట్లు వెల్లడించారు. వైద్యులు మందుల చీటీపై రాసే ఆర్‌ఎక్స్‌ నే తమ ప్రాజెక్ట్‌ పేరుగా నిర్ణయించామన్నారు. రూ.14 వేల కోట్ల విలువైన ఈ ఉమ్మడి భాగస్వామ్య ప్రాజెక్ట్‌ ద్వారా అమెరికాలోని దాదాపు కోటి మంది లబ్ధిదారులుగా చేరారన్నారు. ఈ పథకం వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అమెరికాలో అమల్లోకి వస్తుందన్నారు. అమెరికాలోని బోస్టన్‌ ప్రధాన కార్యాలయం కాగా, భారత్‌లో నోయిడా, దిల్లీలలో కార్యాలయాలు ఏర్పాటు చేశామన్నారు. 300 మంది ఉద్యోగులు పని చేస్తున్నారని వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు కొద్ది నెలల కిందట ఈ ప్రాజెక్టు గురించి సూచనప్రాయంగా వివరించామని, త్వరలో పూర్తి ప్రాజెక్ట్‌ గురించి కంపెనీ ఉన్నతాధికారులు వివరిస్తారన్నారు. తిత్లీ తుపాను బాధితులను ఆదుకునేందుకు నాట్స్‌ ఆధ్వర్యంలో 50 మంది వలంటీర్లను పంపామన్నారు. రూ.5 లక్షల నిధులతో అన్నదానం, దుప్పట్లు, టవల్స్‌ పంపిణీ చేస్తున్నట్లు వివరించారు.

సిలికానాంధ్ర సంజీవని ఆసుపత్రికి రూ.10కోట్లు ప్రకటించిన చంద్రబాబు

రూ.40కోట్ల వ్యయంతో కృష్ణా జిల్లా కూచిపూడి గ్రామంలో సిలికానాంధ్ర సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన “రవిప్రకాష్ సిలికానాంధ్ర సంజీవని” వైద్యాలయాన్ని గురువారం నాడు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రారంభించారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ మారుమూల గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్న సిలికానాంధ్ర వంటి సంస్థలను ఆదర్శంగా తీసుకుని మరిన్ని గ్రామాల్లో ప్రవాసులు చొరవగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. సిలికానాంధ్ర సంస్థ సేవలను ఆయన అభినందించారు. ఈ ఆసుపత్రి నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం తరఫున రూ.10కోట్లను ఆయన ప్రకటించారు. చంద్రబాబు ప్రకటన పట్ల సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కూచిభొట్ల ఆనంద్ హర్షం వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో కాలిఫోర్నియా నుండి పెద్ద సంఖ్యలో సిలికానంధ్ర సభ్యులు హాజరయ్యారు.


ఘనంగా రామినేని ఫౌండేషన్ పురస్కారాల ప్రదానం


గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని సీకే కన్వెన్షన్‌లో డాక్ట‌ర్ రామినేని ఫౌండేష‌న్ పురస్కారాల ప్రదానోత్సవం ఆదివారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు.

వివిధ రంగాల్లో రాణిస్తూ స‌మాజానికి విశేషంగా సేవ‌లందిస్తున్న ప‌లువురికి ఈ ఏడాది కూడా డాక్ట‌ర్ రామినేని ఫౌండేష‌న్ (యుఎస్ఎ) త‌ర‌పున విశిష్ట‌, విశేష పుర‌స్కారాల‌ను ప్ర‌ధానం

స్వ‌ర్గీయ డాక్ట‌ర్ రామినేని అయ్య‌న్న చౌద‌రి 1995లో అమెరికాలోని ఓహాయో రాష్ట్రంలో సిన్సినాటిలో డాక్ట‌ర్ రామినేని ఫౌండేష‌న్‌ను స్థాపన

భార‌తీయ సంస్క్ర‌తి, సంప్ర‌దాయాల‌ను, హిందూ ధ‌ర్మాన్ని విశ్వ‌వ్యాపితం చేయ‌డం కోసం ఫౌండేష‌న్ ప‌నిచేస్తోంది అని రామినేని ధర్మప్రచారఖ్ పేర్కొన్నారు.

విశిష్ట, విశేష పురస్కారం అవార్డ్స్ లకు ఎంపిక చేసేందుకు ముగ్గురు సభ్యుల కమిటీ పద్మశ్రీ డా.జీఎన్ రావు, డా. కె.రామచంద్ర మూర్తి, డా.బివి పట్టాభిరాం ఆధ్వర్యంలో ఎంపిక

క‌ళ‌లు, విజ్ఞాన‌, మాన‌వీయ‌త వంటి వివిధ రంగాల్లో రాణిస్తూఈ ప్ర‌జాహితం కోరుతూ ఉదార‌త‌ను చాటే ప్ర‌ముఖుల‌ను స‌త్క‌రించ‌డం సంస్థ తమ ప్రాధ‌మిక ల‌క్ష్యం

రామినేని ఫౌండేషన్ విశిష్ట పురస్కారం అందుకున్న ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, ద్రోణాచార్య అవార్డు గ్రహీత, డాక్ట‌ర్ పుల్లెల గోపీచంద్‌

విశేష పురస్కారం అందుకున్న ప్రముఖ ప్రవచనకారుడు డాక్టర్ గరికపాటి నరసింహారావు,

విశేష పురస్కారం అందుకున్న ప్రముఖ సినీ దర్శకుడు నాగ్‌ అశ్విన్ రెడ్డి (మహానటి ఫేం),

విశేష పురస్కారం అందుకున్న ప్రముఖ తెలుగు రచయిత చొక్కాపు వెంకటరమణ

భారత్ క్రికెట్ మాజీ కెప్టెన్ కపిలదేవ్ ప్రసంగిస్తూ మీడియా మాధ్యమం లేకుండా ఏది సాధ్యం కాదు..ఒక ఫౌండేషన్ ప్రారంభించడం ఒక ఎత్తయితే వాటిని 19 సంవత్సరాలు గా కోనసాగించడం మంచి పరిణామం. రామినేని కుటుంబం అమెరికాలో నివాసం ఉన్నా, వారి నాన్న గారి పేరుతో ఒక ఫౌండేషన్ స్థాపించి కొనసాగించడం మంచి పరిణామం. వాటిని మరింతగా ముందుకు తీసుకుని వెళ్లే బాధ్యత మనపై ఉంది. వారిని మరోసారి ప్రత్యేకంగా అభినందిస్తున్నాని అన్నారు.తెలుగువారందరికీ గర్వకారణం…రామినేని ఫౌండేషన్


అమెరికాలో స్థాపించబడిన రామినేని ఫౌండేషన్ గత 19సంవత్సరాల నుండి క్రమం తప్పకుండా తెలుగు ప్రముఖులకు అవార్డులను ఇస్తూ వారి ప్రతిభను ప్రపంచానికి చాటిచెపుతోంది. దీనిలో భాగంగా 19వ అవార్డుల ప్రదానోత్సవాన్ని అమరావతి సమీపంలోని సీకె కన్వెన్షన్ సెంటరులో ఆదివారం మధ్యాహ్నం 3గంటల నుండి నిర్వహిస్తున్నారు. ఈ అవార్డుల ప్రదానోత్సవానికి భారత ఉప-రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు కపిల్‌దేవ్ ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు. ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు డా.పుల్లెల గోపీచంద్, ప్రముఖ పండితులు డా.గరికపాటి నరసింహారావు, యువ సినీదర్శకుడు నాగ ఆశ్విన్‌రెడ్డి, ప్రముఖ మాయాజాలికుడు చొక్కాపు వెంకటరమణలకు పురస్కారాలు అందిస్తున్నారు. గత రెండు సంవత్సరాల నుండి డా.రామినేని ఫౌండేషన్ చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి పురస్కారాల గురించి ఈ దిగువ బ్రోచరులో వివరాలు చూడవచ్చు….

సిలికానాంధ్ర సంజీవనికి మరో నాలుగు కోట్లు విరాళాలు.

విరాళాల సేకరణ కోసం కూచిపూడిలో ఆదివారం నిర్వహించిన సంజీవనిధామ్‌- 2 కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన దాతలు 35లక్షలు అందించారు. కూచిపూడి చుట్టుపక్కల గల 150 గ్రామాల ప్రజల కోసం నిర్మిస్తున్న సిలికానాంధ్ర సంజీవని మల్టీస్పెషాల్టీ ఆసుపత్రిని అక్టోబర్‌ 18న ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా విరాళాల సేకరణ కోసం నిర్వహించిన సంజీవనిధామ్‌-2 కార్యక్రమాన్ని హైదరాబాద్‌, అమెరికా, కూచిపూడి ప్రాంతాల్లో నిర్వహించగా రూ. 4.10 కోట్లు విరాళాలుగా వచ్చినట్లుగా నిర్వాహకులు తెలిపారు. కూచిపూడిలో ముందుగా గ్రామానికే చెందిన పామర్తి శివకుమార్‌ రూ. 56 వేలు సాయం చేశారు. తెదేపా మండల మాజీ అధ్యక్షుడు గొట్టిపాటి వెంకట్రావు, మొవ్వకు చెందిన మండవ సుగుణావతిలు రూ. 6 లక్షలు అందించగా గుత్తా హనుమంతరాలు(గూడపాడు) రూ. 5లక్షలు, లింగమనేని రామస్వామి (పెదపూడి) రూ. 3.03లక్షలు, ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన(పామర్రు), సూరపనేని రామకృష్ణ(పెడసనగల్లు), దండమూడి బలరామకృష్ణ(కూచిపూడి), సూరపనేని కృష్ణమోహన్‌లు రూ. 3 లక్షలు చొప్పున, కాశీభొట్ల నారాయణమూర్తి రూ. 1.50 లక్షలు, డాక్టర్‌ జి.సుదర్శనరావు(వీరంకిలాకు) రూ. లక్ష అందించారు. కార్యక్రమంలో జయహో కూచిపూడి సభ్యులు, సిలికానాంధ్ర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

తెలుగుజాతికే గర్వకారణం! రూ.60కోట్లకు పైగా దానధర్మాలు చేసిన మొనగాడు-TNI ప్రత్యేకం


సంపద కలిగిన వాళ్ళలో మిగిలిపోయిన దానిని దానం చేసే వాళ్ళని చూశాం, చందాలు వసూలు చేసి కార్యక్రమాలు చేపట్టే వాళ్ళని చూశాం. కానీ -తనకున్న దానిలో సింహభాగం దానధర్మాలకు వినియోగించే వాళ్ళను, దానం చేయడం కోసమే సంపాదించేవాళ్ళను చాలా అరుదుగా చూస్తుంటాం. అలాంటి అరుదైన వ్యక్తి డా.లకిరెడ్డి హనిమిరెడ్డి. పుట్టిపెరిగిన సొంత ఊరును, సొంత రాష్ట్రాన్ని, సొంత దేశాన్ని మరిచిపోలేదు. అలాగని తనను అక్కున చేర్చుకొని ఆదరించిన అమెరికా దేశాన్ని నిర్లక్ష్యం చేయలేదు. తనకు జన్మనిచ్చిన ప్రాంతానికి తాను సంపాదించుకోవడానికి అవకాశం కల్పించిన అమెరికాకు సమాన స్థాయిలో విరాళాలను అందజేస్తున్నారు. డా.లకిరెడ్డి చేస్తున్న దానధర్మాలు తెలుగుజాతికే గర్వకారణంగా ఉన్నాయి. బహుశా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇంత భారీ ఎత్తున విరాళాలు అందించిన ఏకైక వ్యక్తీ డా.హనిమిరెడ్డి అనడంలో ఏమాత్రం సందేహం లేదు. దాదాపు 20 సంవత్సరాల నుండి ఆయన వైద్యుడిగా సంపాదించిన దాంట్లో అధికంగా దానధర్మాలకే ఖర్చు చేస్తున్నారు. ఇప్పటి వరకు 8 మిలియన్ లకు పైగా (దాదాపు 60 కోట్ల రూపాయిలు) వివిధ సంస్థలకు విరాళాలుగా అందజేశారు. తన స్వగ్రామం కృష్ణా జిల్లా వెల్వడంలో రూ.50 లక్షలతో తాను చదువుకున్న స్కూలుకు భవనాలు నిర్మించారు. పొరుగునే ఉన్న మైలవరంలో కోటి రూపాయిలతో హైస్కూలు భవనాలు నిర్మించారు. మైలవరంలో జాతీయ రహదారి పక్కనే ఆరు ఎకరాల స్థలాన్ని కొని సొంతంగా ఆధునిక సౌకర్యాలతో భవనాలను కట్టించి ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేశారు. దీని కోసం 10 కోట్ల రూపాయిలు వెచ్చించారు. తాను మెడిసన్ చదువుకున్న వరంగల్ మెడికల్ కాలేజీలో విద్యార్ధినుల కోసం 4 కోట్లతో లేడీస్ హాస్టలు, ఆడిటోరియంను నిర్మించారు. ఇది కాకుండా కాకతీయ యూనివర్సిటీ అభివృద్ది కోసం కోటి రూపాయిలు విరాళాన్ని ఇచ్చారు. తాను పుట్టి పెరిగిన వెల్వడం గ్రామానికి ప్రతి ఏడాది సంక్రాంతి పండుగకు వచ్చి అక్కడున్న పేదలకు అన్నదానంతో పాటు వందలాది మందికి నూతన వస్త్రాలు, కళ్ళజోళ్ళు బహుకరిస్తున్నారు. దీనితో పాటు చాలా మంది వృద్ధులకు, పేద విద్యార్ధులకు ఉపకారవేతనాలు అందజేస్తున్నారు. అమెరికాలో తనకు జీవనాధారం కల్పించిన వివిధ సంస్థలకు భూరి విరాళాలను అందజేశారు. తాను నివాసం ఉంటున్న కాలిఫోర్నియా రాష్ట్రంలోని మర్సడ్ నగరంలో యూనివర్సిటీ, ఆడిటోరియం నిర్మాణానికి రూ.5 కోట్లు విరాళంగా ఇచ్చారు. అక్కడ సైన్స్ సెంటర్ అభివృద్దికి మరో 4 కోట్లు విరాళాన్ని ఇచ్చారు. స్థానికంగా ఉన్న హైస్కూల్ నిర్మాణానికి దఫాల వారీగా విరాళాలను అందజేశారు. అమెరికాలో ఉన్న దాదాపు అన్ని తెలుగు సంస్థలకు, సాహితీ కార్యక్రమలకు సాంస్కృతిక ప్రదర్శనలకు ప్రతి ఏడాది మొత్తంగా మిలియన్ డాలర్లు విరాళంగా ఇస్తున్నారు. అమెరికాలో అతిపెద్ద హిందూ దేవాలయంగా బాసిల్లుతున్న ‘లివర్ మోర్’ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అడితోరియంతో పాటు పరిపాలనా భవన నిర్మాణానికి ఇటీవలే డా. హనిమిరెడ్డి రూ. ఏడు కోట్లు విరాళంగా అందజేశారు.


*** చిన్నతనంలో గేదెలు కాశారు
డా.హనిమిరెడ్డి జీవితంలో పలు ఆసక్తి కరమైన సంఘటనలు ఉన్నాయి,. 1942లో వెల్వడంలో ఓ మధ్య తరగతి కుటుంబంలో ఆరుగురు సంతానంలో ఒకరిగా హనిమిరెడ్డి పుట్టారు. మైలవరంలో 8వ తరగతి వరకు చదువుకున్నారు. 8వ తరగతి చదువుతున్న సమయంలో హనిమిరెడ్డి తల్లి చనిపోయారు. తర్వాత హనిమిరెడ్డి తండ్రి ఆయనకు పొలం పనులతో పాటు గేదెలను మేపే బాధ్యతలను అప్పగించారు. హనిమిరెడ్డికి చదువుపై ఆసక్తి పెరగడంతో హైస్కూల్ విద్యకు విజయవాడ తరలివెళ్ళారు. హైదరాబాద్ న్యూ సైన్స్ కాలేజీలో పీ.యూ.సీ చదివారు. అప్పట్లో మంచి మార్కులు రావడంతో కాకతీయ మెడికల్ కళాశాలలో చేరి మెడికల్ సైన్స్ పూర్తిచేశారు. 1968 నుంచి 10 సంవత్సరాల పాటు మైలవరంలో ప్రైవేట్ ప్రాక్టీస్ పెట్టారు. అనంతరం అమెరికా వెళ్ళి కార్డియాలజిస్ట్ గా స్థిరపడి బాగా సంపాదించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలోనూ ఆయనకు కలిసి వచ్చింది. డా.హనిమిరెడ్డి మంచి రైతు కూడా. అమెరికాలో దాదాపు 1500 ఎకరాల్లో జీడిపప్పు, బాదం, పిస్తా, ద్రాక్ష తదితర పంటలను పండిస్తూ మిలియన్ల డాలర్లను పంటల రూపంలో ఆర్జిస్తున్నారు. 76 ఏళ్ళ వయసులో ఇప్పటికీ చలాకీగానే ఉంటారు. పొట్టిలాగు వేసుకొని క్రమం తప్పకుండా రోజుకు 7కిలోమీటర్లు పరుగులు పెడతారు. అయన కుమారులు ఇరువురూ తండ్రి బాటలోనే నడుస్తున్నారు. పెద్ద కుమారుడు డా. విక్రమ్ కార్డియాలజిస్ట్ గా డా.హనిమిరెడ్డి వద్దనే పని చేస్తున్నారు. చిన్న కుమారుడు సిద్దార్ధ రియల్ ఎస్టేట్, వ్యవసాయ పనులు చూస్తున్నారు. హనిమిరెడ్డి భార్య విజయలక్ష్మి భర్త అడుగుజాడల్లోనే నడుస్తున్నారు. హనిమిరెడ్డి జీవితం నేటి యువతరానికి ఆదర్శం.


*** సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం ఏర్పాటుకు మిలియన్ డాలర్లు
ప్రవాసాంధ్ర ప్రముఖుడు, తెలుగు భాష ప్రేమికుడు, కాలిఫోర్నియాలో స్థిరపడిన కృష్ణా జిల్లా వెల్వడంకు చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి దాతృత్వంతో నిండిన తన మనోఅక్షయపాత్ర వైభవాన్ని మరోసారి చాటుకున్నారు. సిలికానాంధ్ర సంస్థ ప్రతిష్ఠాత్మకంగా అమెరికాలో ఏర్పాటు చేస్తున్న సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ ఏర్పాటుకు అయ్యే ఖర్చుల నిమిత్తం మిలియన్ డాలర్లు (రూ.7కోట్లు) విరాళంగా అందించారు. ఈ మేరకు చెక్కును కూడా ఆయన సిలికానాంధ్ర ప్రతినిధులకు అందించారు.


*** లివర్‌మూర్ దేవాలయానికి 11లక్షల డాలర్లు
దానాలు చేయటంలో అగ్రగణ్యుడుగా పేరు పొందిన అమెరికాకు చెందిన ప్రముఖ ప్రవాసాంధ్ర వైద్యుడు డా.లక్కిరెడ్డి హనిమిరెడ్డి, అమెరికాలో ప్రముఖ దేవాలయంగా విరాజిల్లుతున్న లివర్ మూర్ శ్రీ వెంకటేశ్వర స్వామీ దేవాలయంలో ఆడిటోరియం నిర్మాణానికి గతంలో 6లక్షల డాలర్లు విరాళంగా ఇచ్చారు. ఆ దేవాలయం పాలకవర్గం విజ్ఞప్తి మేరకు పరిపాలనా భవనం నిర్మాణం కోసం మరొక 5 లక్షల డాలర్ల విరాళాన్ని డా.హనిమిరెడ్డి అందజేశారు. ఈ విరాళంతో నూతనంగా నిర్మించిన పాలక వర్గ భవనానికి డా.హనిమిరెడ్డి చేతులు మీదగా ప్రారంభోత్సవం జరిపించారు. డా.హనిమి రెడ్డి చేస్తున్న సమాజ సేవ అందరికి ఆదర్శంగా తెలవాలి. 76 ఏళ్ల వయసులో ప్రతిరోజూ ఏడు కి.మీ క్రమం తప్పకుండా పరుగులు పెడుతూ ఉత్సాహంగా వైద్య సేవలు అందిస్తోన్న డా.హనిమిరెడ్డి నిండు నూరేళ్ళు అలగానే ఉండాలని ఆయన చేస్తున్న దానధర్మాలు వంద కోట్లకు చేరుకోవాలని అందరం కోరుకుందాం. ఆయన సేవలకు అభినందనలు తెలుపుదాం. ––కిలారు ముద్దుకృష్ణ, సీనియర్ జర్నలిస్ట్.ఈ వారాంతం డెట్రాయిట్ సాహితీ సమితి 20వ వార్షికోత్సవం

ముఖ్యమంత్రి చంద్రబాబుకు 40వేల డాలర్ల విరాళం


ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనకు ప్రవాసాంధ్రులు నుండి మంచి మద్దతు లభిస్తోంది. ఏపీ జన్మభూమి పధకం కింద రాష్ట్రంలో చేపడుతున్న డిజిటల్ తరగతి గదుల ఏర్పాటుకు ప్రవాసాంధ్రులు భారీగా విరాళాలు ఇస్తున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాలలో 250 పాఠశాలల్లో డిజిటల్ తరగతి గదుల ఏర్పాటుకు అల్బానీ ఆంధ్రా అసోసియేషన్ సభ్యులు ఏపీ జన్మభూమి సమన్వయకర్త కోమటి జయరాం ఆధ్వర్యంలో 40 వేల డాలర్ల విరాళాన్ని చంద్రబాబుకు అందజేశారు. భారీగా విరాళం ఇచ్చిన అల్బానీ ఆంధ్రా అసోసియేషన్ సభ్యులను ముఖ్యమంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో తానా అద్యక్షుడు వేమన సతీష్, అల్బానీ ఆంధ్రా అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు నిడమానూరు వెంకట శ్రీనివాస్(అధ్యక్షుడు) మహేష్ నల్లమోతు, కిరణ్ చలివేంద్ర, రమణ కోట, ఓలేటి వెంకటేశ్వరరావు, ఎం.సుదర్శన్ రెడ్డి, పామిడి ప్రేమ చాంద్ తదితరులు పాల్గొన్నారు.

న్యూజెర్సీలో ఘనంగా మన్నవ మోహనకృష్ణ జన్మదిన వేడుకలు

This is a sponsored article. For more info, reach us at – editortnilive@gmail.com.

ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ(నాట్స్) మాజీ అధ్యక్షుడు మన్నవ మోహనకృష్ణ జన్మదిన వేడుకలు న్యూజెర్సీలోని బావర్చిలో ఆయన స్నేహితులు ఘనంగా నిర్వహించారు. పలువురు ప్రవాసులు పెద్దసంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. మోహనకృష్ణ స్వస్థలం గుంటూరులో కూడా వేడుకలు నిర్వహించి వృద్ధులు, వికలాంగులకు పండ్లు, వస్త్రాలు ప్రదానం చేశారు.నందివాడలో డిజిటల్ తరగతి ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌లో 5వేల డిజిటల్ తరగతి గదులు ఏర్పాటు చేయడమే లక్ష్యంగా తానా సభ్యులు కృషి చేస్తామని ఉత్తర అమెరికా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరాం తెలిపారు. కృష్ణాజిల్లా నందివాడ మండలం వెన్ననపూడి జిల్లా పరిషత్ పాఠశాలలో డిజిటల్ తరగతి గదుల ప్రారంభోత్సవానికి కోమటి జయరాం ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఉపకార వేతనాలు, పుస్తకాలు పంపిణీ చేశారు. చంద్రబాబు స్ఫూర్తితో రాష్ట్రంలో విద్య అభివృద్ధికి తమ వంతు సహాయం చేస్తామని తెలిపారు.

కృష్ణా జిల్లాలో 100% డిజిటల్ తరగతులు-కలెక్టర్‌తో జయరాం


Today, Jayaram Komati, Special Representative for North America, and his team met with Krishna District Collector B.Laxmi Kantham at his office. The Collector discussed about digitization of all remaining high schools with Jayaram. Jayaram thanked the Collector for his support and mentioned that all necessary support from NRIs will be done for making Krishna District 100 percent digitized. The Collector thanked NRIs support and mentioned that by October all high schools will be digitized.

కర్నూలులోని 5పాఠశాలలకు డిజిటల్ తరగతుల సామాగ్రి అందించిన పొట్లూరి రవి

నెమలిలో డిజిటల్ తరగతి గది ప్రారంభం


ఏపీ జన్మభూమి పథకం కింద ప్రవాసాంధ్రుల సహకారంతో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నత పాఠశాలలో చేపడుతున్న డిజిటల్ తరగతి గదుల ఏర్పాటు శరవేగంగా సాగుతోంది. అమెరికాలో ఆంధ్ర రాష్ట్ర ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరాం ప్రస్తుతం రాష్ట్రంలోనే మకాం చేసి పాఠశాలల్లో డిజిటల్ తరగతి గదుల ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. బుధవారం నాడు గంపలగూడెం మండలం నెమలి హైస్కూలో నూతనంగా ఏర్పాటు చేసిన డిజిటల్ తరగతి గదిని స్థానిక ప్రజా ప్రతినిధులు ప్రారంభించారు. ఈ పాఠశాల పూర్వ విద్యార్ధి కొణిజెర్ల గ్రామానికి చెందిన అమెరికాలో ఉంటున్న ప్రవాసాంధ్రుడు బొల్లా శ్రీనివాసరావు ఈ డిజిటల్ తరగతి గది ఏర్పాటుకు ఆర్ధిక సహాయాన్ని అందించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపద్యయుడు ఎన్.శేషసాయికుమార్ దాత శ్రీనివాసరావు, తల్లి బొల్లారాణి ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.